1 00:00:07,341 --> 00:00:09,841 భూగ్రహం బ్రహ్మాండమైనది, 2 00:00:10,677 --> 00:00:13,677 చిన్న పరిమాణంలో ఉండే జీవులు కంట్లో పడకపోవడం సహజం. 3 00:00:15,766 --> 00:00:17,636 కానీ జాగ్రత్తగా తరచి చూస్తే... 4 00:00:18,101 --> 00:00:20,561 అన్వేషించబడని మరో ప్రపంచం దాగి ఉంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ ప్రపంచంలో బుల్లి హీరోలు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిట్టి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 అమోఘమైన శక్తిసామర్థ్యాలు కావాలి... 8 00:00:34,618 --> 00:00:40,038 భారీ అడ్డంకుల్ని ఎదురొడ్డి నిలిచేందుకు అవి తోడ్పడతాయి. 9 00:00:57,057 --> 00:00:58,677 ఆఫ్రికన్ సవానా. 10 00:01:01,520 --> 00:01:03,360 ప్రఖ్యాత జీవరాసులకు నిలయం. 11 00:01:08,986 --> 00:01:11,316 మన గ్రహం మీది అత్యంత భారీ మరియు... 12 00:01:11,405 --> 00:01:12,905 వ్యాఖ్యాత పాల్ రడ్ 13 00:01:12,990 --> 00:01:14,620 ...మహత్తరమైన ప్రాణులకు ఆవాసం. 14 00:01:21,248 --> 00:01:25,998 కానీ ఈ ఏనుగు కాళ్ళ కింద అన్వేషించబడని మరో ప్రపంచం దాగి ఉంది. 15 00:01:28,714 --> 00:01:31,344 అదే ఎలిఫంట్ ష్రూ ప్రపంచం. 16 00:01:39,683 --> 00:01:45,403 అది గడ్డితిని, వేటాడి బతికే చిట్టి జీవులతో కలిసి సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతోంది. 17 00:01:53,363 --> 00:01:57,373 కానీ భారీ ప్రాణుల ప్రపంచంలో బతకడం తేలికైన విషయం కాదు. 18 00:01:59,786 --> 00:02:05,036 అవి గుంపులు గుంపులుగా అటువైపు వస్తూ ఉండగా, రోజువారీ జీవితం కష్టంగా మారబోతోంది. 19 00:02:05,459 --> 00:02:09,839 సవానా 20 00:02:14,468 --> 00:02:17,678 ఎలిఫంట్ ష్రూ సుమారుగా భారీ పందికొక్కు పరిమాణంలో ఉంటుంది. 21 00:02:19,848 --> 00:02:22,138 కానీ వేగం చాలా ఎక్కువ. 22 00:02:28,440 --> 00:02:32,400 దాని పరిమాణంతో పోల్చితే, అది చిరుతపులి కంటే మూడురెట్లు వేగంగా పరిగెడుతుంది. 23 00:02:34,655 --> 00:02:39,865 ఆహారం కోసం వెతుకుతూ గంటకు 30కి.మీ. వేగంతో పరిగెత్తగలదు. 24 00:02:45,040 --> 00:02:48,460 ప్రతిరోజూ తన శరీరబరువులో మూడువంతుల ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. 25 00:02:49,795 --> 00:02:51,955 అప్పుడే వేగంగా జరిగే జీవక్రియలకు సరిపోతుంది. 26 00:02:56,051 --> 00:03:00,351 కాబట్టి వేలాది చదరపు మీటర్ల మేరా దారుల్ని నిర్మించుకుంటుంది. 27 00:03:01,431 --> 00:03:05,351 తద్వారా ఆహారం దొరకని కాలంలో కూడా తగినంత ఆహారాన్ని సంపాదించుకోగలదు. 28 00:03:15,279 --> 00:03:17,869 త్రాచుపాము రెప్పపాటు కంటే ఎక్కువ వేగంతో దాడి చేస్తుంది. 29 00:03:24,955 --> 00:03:27,825 కానీ ష్రూ వదిలిన జాడలు తప్పించుకునేందుకు దానికి సాయం చేస్తాయి. 30 00:03:32,629 --> 00:03:36,969 ఎలిఫంట్ ష్రూ ది వేగవంతమైన ఒంటరి జీవితం. 31 00:03:39,511 --> 00:03:42,511 ఈ భారీ ఎర్రకోటలో ఉండే రాజుల పరిస్థితి ఇందుకు భిన్నం. 32 00:03:58,864 --> 00:04:02,494 సాధారణంగా మరగుజ్జు ముంగిసలు చీమల పుట్టలను తమ నివాసాలుగా చేసుకుంటాయి. 33 00:04:13,712 --> 00:04:15,552 అవి మన పిడికిలి పరిమాణంలో ఉంటాయి, 34 00:04:17,882 --> 00:04:23,472 కలిసికట్టుగా శక్తివంతంగా ఉంటాయి, వెచ్చదనాన్ని పొందుతాయి. 35 00:04:27,851 --> 00:04:30,691 సవానాలో ఉదయాలు ఆశ్చర్యకరంగా చాలా చల్లగా ఉంటాయి. 36 00:04:34,983 --> 00:04:36,993 లోపలే ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. 37 00:04:42,991 --> 00:04:44,201 కానీ ఈ రోజు మాత్రం కాదు. 38 00:04:50,249 --> 00:04:52,249 ఈ చిట్టి హార్న్బిల్ ఆకలిగా ఉంది. 39 00:04:56,880 --> 00:04:58,720 ఉదయం ఫలహారం కోసం ఎదురుచూస్తోంది. 40 00:05:09,268 --> 00:05:13,688 ఇరవై ముంగిసలు, ఒక హార్న్ బిల్ కలిసి ఏం చేస్తాయా అని ఆశ్చర్యపోకండి. 41 00:05:15,774 --> 00:05:18,994 చిన్నగా ఉన్నప్పుడు, కలిసికట్టుగా ఉంటే తప్పక ఫలితం ఉంటుంది. 42 00:05:24,116 --> 00:05:25,736 ముంగిసలు తమ ఆహారాన్ని తరుముతాయి. 43 00:05:30,247 --> 00:05:32,667 హార్న్ బిల్ ఏ ప్రమాదం రాకుండా కాపలా కాస్తుంది. 44 00:05:36,628 --> 00:05:39,548 మరగుజ్జు ముంగిసలు చాలా ఎక్కువ ప్రాంతాన్ని గాలిస్తాయి. 45 00:05:39,631 --> 00:05:41,971 సుమారు 50 ఫుట్బాల్ మైదానాలకు అది సమానం. 46 00:05:42,050 --> 00:05:44,600 ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. 47 00:05:46,263 --> 00:05:49,893 వాటి వాసన ఎంత ఎక్కువగా ఉంటే, అవి అంత శక్తివంతమైన వాటి కింద లెక్క. 48 00:05:58,066 --> 00:06:03,066 ఆహారం దొరకని కాలంలో కూడా, వాటి తిండికి లోటు ఉండదు. 49 00:06:07,075 --> 00:06:09,575 ఇవి ఆఫ్రికాలోని అతి చిన్న మాంసాహారులే కావచ్చు. 50 00:06:10,245 --> 00:06:12,865 కానీ అవి ఎంతమాత్రం భయపడవు. 51 00:06:37,064 --> 00:06:38,904 విషపూరితమైన బబున్ సాలెపురుగు. 52 00:06:48,283 --> 00:06:50,123 ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, 53 00:06:50,827 --> 00:06:54,497 దృఢమైన ఈ జట్టు కష్టకాలంలో కూడా మనుగడ సాగించగలదు. 54 00:07:16,728 --> 00:07:19,858 కానీ వర్షాలు మొదలైతే, పరిస్థితి మొత్తం మారిపోతుంది. 55 00:07:42,629 --> 00:07:45,419 బయట ఉన్న జీవులకు గూడు దొరకడం కష్టం. 56 00:07:47,718 --> 00:07:50,258 కానీ ముంగిసలు మాత్రం సురక్షితంగా, వెచ్చగా ఉంటాయి. 57 00:08:05,152 --> 00:08:06,782 అవి చక్కని గూటిని ఎంచుకున్నాయి. 58 00:08:16,580 --> 00:08:19,830 చీమల పుట్టలు వాటికి అన్నింటినుండి రక్షణ కల్పిస్తాయి. 59 00:08:32,221 --> 00:08:33,971 ఉమ్ము మరియు మట్టి మిశ్రమంతో, 60 00:08:35,599 --> 00:08:39,139 ఈ కార్మిక చీమలు కాంక్రీట్ కంటే బలమైన కోటల్ని నిర్మిస్తాయి... 61 00:08:42,940 --> 00:08:44,690 అవి ఏనుగు పరిమాణంలో కూడా ఉంటాయి. 62 00:08:56,870 --> 00:09:01,170 వర్షాలను అనుసరిస్తూ, భారీ జంతువులు తరలిరావడం మొదలవుతాయి. 63 00:09:07,714 --> 00:09:10,844 ఆ ప్రాంతంపై ముందుగా ప్రభావం చూపించేది ఏనుగులే. 64 00:09:20,853 --> 00:09:22,693 ఐదు టన్నుల పాదముద్ర... 65 00:09:24,064 --> 00:09:28,864 అన్ని రకాల చిన్ని జీవులతో కూడిన ఒక నీటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. 66 00:09:34,741 --> 00:09:37,161 వాటిలో ఈ గ్రహం మీది పురాతన జీవుల్లో ఒకటి. 67 00:09:40,414 --> 00:09:43,384 డైనోసార్ పాదాల నుండి సృష్టించబడిన నాటినుండీ, 68 00:09:44,418 --> 00:09:47,668 టాడ్పోల్ రొయ్యలు ఇలాంటి చిన్న చెరువుల్లోనే నివసిస్తున్నాయి. 69 00:09:57,222 --> 00:10:01,442 వర్షాలు మొదలైన కొద్ది రోజుల్లోనే, సవానా మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంది. 70 00:10:04,855 --> 00:10:06,855 జంతువులు సుష్టుగా భోంచేయడం మొదలవగానే... 71 00:10:08,275 --> 00:10:10,485 భారీ స్థాయిలో పరిణామాలు చోటుచేసుకుంటాయి. 72 00:10:27,503 --> 00:10:30,633 ఎలిఫంట్ ష్రూ ఈ భారీ కొండని ఎంత మాత్రం కదిలించలేదు. 73 00:10:33,300 --> 00:10:34,550 కానీ ఇదిగో సాయం వచ్చేసింది. 74 00:10:36,178 --> 00:10:39,008 పేడ నేలపై పడీ పడగానే, పేడ పురుగులు క్షణాల్లో వచ్చి చేరతాయి. 75 00:10:39,640 --> 00:10:41,560 పోటీదారులు వచ్చేలోగా కొంత భాగాన్ని 76 00:10:41,642 --> 00:10:43,852 తీసుకొని పోవాలన్నది వాటి ఆలోచన. 77 00:10:50,609 --> 00:10:52,439 ఈ బాల్ అత్యంత విలువైనది. 78 00:10:56,156 --> 00:11:00,616 దాని ఆహారం, జతని గెలిచే అవకాశం ఇప్పుడు దాంతో ముడుపడి ఉన్నాయి. 79 00:11:11,380 --> 00:11:15,680 ఈ బుల్లి ప్రపంచంలో ఒక తప్పటడుగు కూడా చేటు తేవొచ్చు. 80 00:11:18,512 --> 00:11:21,602 తొక్కిసలాట జరిగితే ఇక విధ్వంసమే. 81 00:11:24,852 --> 00:11:30,362 ఈ భూమ్మీదే అతి పెద్ద వలసగా పిలిచే, పది లక్షలకు పైగా విల్డబీస్ట్ మరియు జీబ్రాలు. 82 00:11:33,819 --> 00:11:38,949 కొరత లేని పచ్చని పచ్చిక వాటిని ఇటుగా ఆకర్షిస్తుంది. 83 00:11:43,328 --> 00:11:45,958 క్రౌన్డ్ ప్లోవెర్ పిట్టలు సవానాలో బహిరంగంగా గూళ్ళు కట్టుకుంటాయి. 84 00:11:49,001 --> 00:11:52,171 ఈ ఆడపిట్ట కొత్తగా పెట్టిన గుడ్లు ఇప్పుడు తొక్కివేయబడే ప్రమాదంలో ఉన్నాయి. 85 00:11:57,676 --> 00:11:59,136 కేవలం చీలమండ ఎత్తులో ఉన్నప్పటికీ, 86 00:12:00,095 --> 00:12:02,555 దుప్పికి ఎదురొడ్డి నిలబడడానికి ఎంతమాత్రం భయపడదు. 87 00:12:14,860 --> 00:12:18,490 కానీ విల్డబీస్ట్ ల గుంపుని నిలువరించడం సాధ్యం కాని పని. 88 00:12:39,551 --> 00:12:43,101 ఆశ్చర్యకరంగా, దాని గుడ్లన్నీ సురక్షితంగా ఉన్నాయి, 89 00:12:45,098 --> 00:12:47,308 కానీ అవి పొదిగి పిల్లలవడానికి ఇంకో నెల పడుతుంది. 90 00:12:55,234 --> 00:12:57,954 ఎలిఫంట్ ష్రూ జాడలు బాగా దెబ్బతిన్నాయి. 91 00:13:09,957 --> 00:13:12,287 రహదారి మెయింటైన్ చేయాల్సిన సమయం వచ్చింది. 92 00:13:47,953 --> 00:13:49,163 వేగవంతమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించొచ్చు. 93 00:14:07,181 --> 00:14:11,441 గుంపులు గడ్డి తినడంలో నిమగ్నమైతే, జిరాఫీలు చెట్ల కోసం వెతుకుతాయి. 94 00:14:23,447 --> 00:14:25,987 తుమ్మ చెట్లు కొత్తగా చిగురించిన ఆకులతో నిండిపోయాయి. 95 00:14:26,617 --> 00:14:28,487 వాటికి పొడవాటి ముళ్ళు రక్షణగా ఉన్నాయి. 96 00:14:31,872 --> 00:14:34,792 అర మీటరు పొడవైన నాలుక ముందు అవి దిగదుడుపే. 97 00:14:44,134 --> 00:14:46,764 కానీ చెట్టుకి మరో రక్షణ వలయం కూడా ఉంది. 98 00:15:01,860 --> 00:15:04,950 అకేషియా చీమల సైన్యం రక్షణ నిమిత్తం బయటికి వచ్చింది. 99 00:15:10,369 --> 00:15:14,329 జిరాఫీని ఎక్కడపడితే అక్కడ కుట్టడానికి సిద్ధమయ్యాయి. 100 00:15:25,217 --> 00:15:27,217 చివరికి అది అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. 101 00:15:30,013 --> 00:15:34,523 తన సైన్యం నివాసం కోసం, తుమ్మ చెట్టు ప్రత్యేకమైన ఉబ్బిన ముళ్ళను పెంచుతుంది. 102 00:15:40,482 --> 00:15:44,362 చీమల సైజులో ఉన్న కప్పుల్లో తేనె నింపి వాటికి ఆహారాన్ని అందిస్తుంది. 103 00:15:47,573 --> 00:15:52,083 కలిసికట్టుగా పనిచేస్తే, చిట్టి జీవులు కూడా భారీ జంతువులకు ఎదురొడ్డి నిలబడగలవు. 104 00:16:00,335 --> 00:16:03,205 కానీ ఒక్కోసారి పరిగెత్తడమే శ్రేయస్కరం. 105 00:16:07,259 --> 00:16:09,299 పదునైన, చీల్చగలిగే కోరలు, 106 00:16:10,095 --> 00:16:12,555 150 కిలోల మాంసం... 107 00:16:16,185 --> 00:16:17,685 వార్తోగ్ పంది ఆధారపడి బతుకుతుంది. 108 00:16:21,690 --> 00:16:24,990 అది దేనికోసం వచ్చిందో ముంగిసలకు బాగా తెలుసు. 109 00:16:29,865 --> 00:16:31,275 కొంచెం గారాలు పోవడానికి. 110 00:16:40,792 --> 00:16:44,212 ధైర్యం ఉన్న ముంగిసలు రుచికరమైన పురుగుల్ని తినే అవకాశాన్ని దక్కించుకుంటాయి. 111 00:16:49,301 --> 00:16:53,561 బృందం మొత్తం ఒకచోటికి చేరాక, వార్తోగ్ పందికి కావాల్సిన మసాజ్ దొరుకుతుంది. 112 00:17:07,611 --> 00:17:11,241 కాసేపటిలోనే, ముంగిసల స్పాలోకి ఇతర పందులు కూడా మసాజ్ కోసం వచ్చి చేరతాయి. 113 00:17:31,051 --> 00:17:34,891 తమ దగ్గరికి తిరిగి వచ్చే కస్టమర్లను ముంగిసలు తమ భూభాగంగా గుర్తుపెడతాయి. 114 00:17:39,351 --> 00:17:41,101 చిన్నవైన, చురుకైన ఈ చిట్టి జంతువులు 115 00:17:41,895 --> 00:17:45,475 భయంగొలిపే భారీ జంతువులను కూడా మచ్చిక చేసుకుంటాయి. 116 00:17:58,537 --> 00:18:01,537 ఆక్స్ పెకర్ పిట్టలు ఎత్తైన బహుమతుల్ని గెల్చుకుంటాయి. 117 00:18:04,418 --> 00:18:08,168 తమ పదునైన ముక్కులతో పురుగుల్ని చంపి తింటాయి. 118 00:18:10,465 --> 00:18:14,965 వీటి దెబ్బకి ఒక జంతువు విసిగిపోతే, మరోదాని దగ్గరికి పోతాయి. 119 00:18:23,395 --> 00:18:26,435 గిట్టలున్న జంతువుల నుండే దాదాపుగా ఆక్స్ పెకర్స్ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. 120 00:18:42,247 --> 00:18:47,037 కాస్తంత చాతుర్యం, సిగ్గూ సెరంలేనితనంతో, 121 00:18:50,923 --> 00:18:53,433 ఈ బుల్లి జంతువులు వలస కాలాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటాయి. 122 00:19:03,477 --> 00:19:06,767 కానీ వాటిని అనుసరించే క్రూర మృగాలనుండి తప్పించుకోవడం తేలికైన విషయం కాదు. 123 00:19:10,192 --> 00:19:12,402 ప్లోవెర్ గుడ్లు ఇప్పుడే పిల్లలయ్యాయి. 124 00:19:14,279 --> 00:19:16,529 పిల్ల ఇప్పుడిప్పుడే ప్రమాదాలు పొంచివున్న... 125 00:19:17,741 --> 00:19:19,241 ...ప్రపంచంలో నడక నేర్చుకుంటోంది. 126 00:19:36,218 --> 00:19:38,718 నక్కలు అవకాశం చూసి దాడి చేస్తాయి. 127 00:19:45,435 --> 00:19:46,765 జంతువు ఎంత చిన్నదైతే, 128 00:19:49,106 --> 00:19:50,686 పట్టుకోవడం అంత సులువు. 129 00:19:59,658 --> 00:20:00,868 తప్పని పరిస్థితిలో వేసే అడుగు. 130 00:20:02,744 --> 00:20:06,584 తన పిల్ల నుండి నక్క దృష్టిని మరల్చడానికి తల్లి ధైర్యంగా 131 00:20:07,374 --> 00:20:08,714 శతవిధాలా ప్రయత్నిస్తోంది. 132 00:20:19,887 --> 00:20:23,767 కదలకుండా ఉన్నంతసేపూ అది దాదాపు కంటికి కనిపించదు. 133 00:20:32,107 --> 00:20:34,397 కానీ కుట్టే చీమల్ని తప్పించుకోవడం తేలిక కాదు. 134 00:20:56,215 --> 00:20:58,215 తల్లి పిట్ట దృష్టి మరల్చింది. 135 00:21:11,271 --> 00:21:14,651 నక్కను తేలిగ్గా బోల్తా కొట్టించింది. 136 00:21:21,490 --> 00:21:24,200 కానీ వలస వచ్చిన జంతువులన్నీ వెళ్ళిపోయేవరకూ 137 00:21:24,284 --> 00:21:26,204 అది దాని పిల్లల్ని రక్షిస్తూనే ఉండాలి. 138 00:21:32,709 --> 00:21:35,669 గుంపులన్నింటినీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడి పీడించే 139 00:21:35,754 --> 00:21:37,594 బుల్లి వలస బృందాలు ఉంటాయి. 140 00:21:39,591 --> 00:21:42,721 ఈగల గుంపులు భారీ స్థాయిలో పెద్ద జంతువులపై ముసురుతాయి. 141 00:21:47,516 --> 00:21:50,436 కానీ చిట్టి ప్రపంచంలో, అది కదిలే విందు భోజనం. 142 00:21:53,897 --> 00:21:58,107 ఈ గుంపులన్నింటికీ దూరంగా, రాళ్ల గుట్టలమీద ఒంటరిగా, 143 00:21:58,443 --> 00:22:01,613 అగామా బల్లులు తమ దగ్గరికి వచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. 144 00:22:25,679 --> 00:22:28,219 దొరికే అవకాశాలు దాదాపు తక్కువే ఉంటాయి. 145 00:22:41,612 --> 00:22:44,202 కాబట్టి, ఏదైనా పెద్ద అవకాశం దొరకగానే... 146 00:22:46,241 --> 00:22:47,701 దాన్ని ఒడిసి పట్టుకోవాలి. 147 00:22:55,125 --> 00:22:57,785 ఎండ ఎక్కువగా ఉండే సమయంలో సింహాలు సేద తీరడానికి అక్కడికి వస్తాయి. 148 00:23:04,885 --> 00:23:07,345 వాటితో పాటే ఈగలు కూడా. 149 00:23:08,388 --> 00:23:09,388 బోలెడన్ని. 150 00:23:22,528 --> 00:23:24,658 ధైర్యవంతుల్నే అదృష్టం వరిస్తుంది. 151 00:23:27,407 --> 00:23:29,487 కానీ నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంత మంచిది కాదు. 152 00:23:35,499 --> 00:23:38,249 కాబట్టి డొంకదారి ఉండే ఉంటుంది. 153 00:24:00,440 --> 00:24:03,490 చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు తప్పించుకోగలిగే విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. 154 00:24:39,771 --> 00:24:42,071 కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు... 155 00:24:48,488 --> 00:24:49,698 అదృష్టాన్ని మరీ అంతగా పరీక్షించకూడదు. 156 00:25:05,005 --> 00:25:08,625 నేల ఎండిపోవడం మొదలయ్యేకొద్దీ, గుంపులు తరలిపోతూ ఉంటాయి. 157 00:25:28,654 --> 00:25:30,784 అవి వెళ్ళిపోవడం కొందరికి విచారం కలిగించదు. 158 00:25:35,077 --> 00:25:36,287 ప్రశాంతత మళ్ళీ నెలకొంటోంది. 159 00:25:42,251 --> 00:25:44,631 ఎలిఫంట్ ష్రూ స్వేచ్ఛగా తిరగడానికి మళ్ళీ అవకాశం దక్కింది. 160 00:25:48,674 --> 00:25:50,974 మెరుపు వేగంతో కీటకాలపై దాడి చేస్తే 161 00:25:52,511 --> 00:25:54,181 ఆపేవారు ఎవ్వరూ ఉండరు. 162 00:25:59,726 --> 00:26:01,306 ఋతువులు మారేకొద్దీ... 163 00:26:02,563 --> 00:26:04,233 కొత్త సవాళ్లు ముందుకొస్తూ ఉంటాయి. 164 00:26:23,250 --> 00:26:27,380 ఏనుగుల ఎండిపోయిన పాదముద్రలు అడ్డుకట్టలుగా మారవచ్చు. 165 00:26:34,303 --> 00:26:36,223 కానీ ఈ బుల్లి బీటిల్ పురుగు చాలా గట్టిది. 166 00:26:37,931 --> 00:26:40,561 తన బరువుకంటే పదిరెట్లు ఎక్కువ బరువును అది ఎత్తగలదు. 167 00:26:54,156 --> 00:26:57,866 గుంపులు వెళ్ళిపోయే సరికి, ఇప్పుడది ఆ బాల్ ని ఎంత మాత్రం పోగొట్టుకోలేదు. 168 00:27:15,052 --> 00:27:17,642 అది చేసిన సాహసం ఫలించింది. 169 00:27:22,059 --> 00:27:26,609 ఒక ఆడ పురుగు, దాని అపురూపమైన ఆస్థిని పంచుకుని 170 00:27:28,899 --> 00:27:30,149 తనతో జత కట్టబోతోంది. 171 00:27:38,283 --> 00:27:40,493 ముంగిసల జీవితం కూడా సంతోషంగా గడుస్తోంది. 172 00:27:44,414 --> 00:27:46,464 దాదాపుగా, అధికభాగం. 173 00:27:57,761 --> 00:28:01,391 ఒంటరిగా ఉన్న ముంగిస, త్రాచుపాము చేతికి తేలిగ్గా చిక్కుతుంది. 174 00:28:03,183 --> 00:28:04,603 కానీ అవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు... 175 00:28:06,854 --> 00:28:09,194 ఈ చిన్నారి బృందాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. 176 00:28:22,244 --> 00:28:24,454 ప్రస్తుతం వారి బృందంలో కొత్త సభ్యులు చేరారు. 177 00:28:27,624 --> 00:28:28,884 ఇప్పుడు వాటి వయసు నెల రోజులే, 178 00:28:30,544 --> 00:28:32,254 కానీ మూడు నెలలు గడిచే సరికి, 179 00:28:32,880 --> 00:28:35,220 అవి ఆ బృందంలో పూర్తి సామర్థ్యాలు కలిగిన సభ్యులుగా మారతాయి. 180 00:28:40,888 --> 00:28:43,848 భూమిపై అతిపెద్ద వలసకి వ్యతిరేకంగా, 181 00:28:44,266 --> 00:28:49,306 చిట్టి హీరోలు కేవలం మనుగడ సాగించడం మాత్రమే కాదు, అవి వృద్ధి చెందుతాయి. 182 00:28:52,983 --> 00:28:55,823 సవానా చారిత్రిక భూభాగం. 183 00:28:58,488 --> 00:28:59,988 పరికించి చూస్తే, 184 00:29:00,782 --> 00:29:05,662 అందులో కొన్ని గొప్ప కథలన్నీ... బుల్లివే. 185 00:29:58,173 --> 00:30:00,183 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ