1 00:00:07,257 --> 00:00:09,837 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,676 జీవితంలో చిన్న చిన్నవాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,636 కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి... 4 00:00:18,143 --> 00:00:20,563 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,038 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:52,135 --> 00:00:53,755 కరీబియన్ ప్రాంతం. 10 00:00:54,304 --> 00:00:56,934 పాల్ రడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 11 00:00:57,015 --> 00:00:58,975 ఇది స్వర్గాన్ని తలపిస్తుంది. 12 00:01:03,438 --> 00:01:06,858 ఇది క్యూబన్ బీ హమింగ్ బర్డ్ పక్షికి ఒక చక్కని అనువైన నివాసంలా అనిపిస్తుంది. 13 00:01:10,696 --> 00:01:13,696 ఇది తుమ్మెద కన్నా అంత పెద్దగా ఏమీ ఉండదు. 14 00:01:14,533 --> 00:01:16,793 ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. 15 00:01:23,625 --> 00:01:25,995 ఈ దీవులలో మనకి ఏ మాత్రం 16 00:01:26,086 --> 00:01:28,336 పరిచయం లేని వింత జీవులు చాలా రకాలు ఉన్నాయి. 17 00:01:30,090 --> 00:01:35,600 చాలా వరకు జీవులు తమ జాతిలోనే అతి చిన్నవి, ఇవి భూమ్మీద ఇక్కడ తప్ప ఇంకెక్కడా కనబడవు. 18 00:01:45,939 --> 00:01:48,479 ఆహారం, చోటు, ఈ దీవులలో చాలా పరిమితంగా ఉంటుంది. 19 00:01:49,359 --> 00:01:52,029 ఇక్కడ ఎంత చిన్నగా ఉంటే అంత సాఫీగా జీవనం సాగించవచ్చు అన్నమాట. 20 00:01:54,781 --> 00:01:57,411 కానీ ఈ స్వర్గానికి ఒక చీకటి కోణం కూడా ఉంది. 21 00:02:04,333 --> 00:02:06,633 తుఫానుల సమయం వచ్చినప్పుడు, 22 00:02:07,794 --> 00:02:12,134 ఇక్కడి జంతువులు, ఈ గ్రహంలోని అత్యంత బలమైన గాలుల తాకిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. 23 00:02:12,591 --> 00:02:16,931 దీవి 24 00:02:20,766 --> 00:02:26,056 ఎండ కాచే రోజులలో, కరీబీయన్ దీవిలో జీవనం ఎంతో హడావిడిగా, రకరకాలుగా ఉంటుంది. 25 00:02:29,107 --> 00:02:30,937 ఒక మగ బీ హమింగ్ బర్డ్. 26 00:02:32,194 --> 00:02:33,744 ఓ ఆడ తోడు కోసం వెతుకుతోంది... 27 00:02:35,239 --> 00:02:37,239 ఆకట్టుకోవడానికి బాగా ముస్తాబయింది కూడా. 28 00:02:39,952 --> 00:02:41,582 కానీ ఆడ పక్షి బిజీగా ఉంది. 29 00:02:45,749 --> 00:02:47,579 తన రెండు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది, 30 00:02:48,293 --> 00:02:51,593 అవి ఇప్పుడే కాఫీ గింజలంత పరిమాణం ఉన్న గుడ్ల నుండి ఈ లోకంలోకి అడుగుపెట్టాయి. 31 00:02:53,298 --> 00:02:55,928 వాటి గూడు ఒక కాఫీ కప్పు అంత పరిమాణం ఉంటుంది. 32 00:03:07,062 --> 00:03:13,072 పురుగులను, తేనెను సేవించడం వలన ఆ పిల్లల పరిమాణం నాలుగు రోజులలో రెండింతలు అవుతుంది. 33 00:03:24,663 --> 00:03:27,883 ఈ ఆహారాన్నంతా వాటికి అందించడం అనేది చిన్న పని కాదు. 34 00:03:29,001 --> 00:03:32,921 హమ్మింగ్ బర్డ్ లు, అన్ని జంతువుల కన్నా చాలా వెగంగా తమ శక్తిని వాడుకుంటాయి. 35 00:03:34,756 --> 00:03:37,506 కాబట్టి ఆ పక్షి ఒక రోజుకి కొన్ని వందల పూలను సందర్శించాల్సి ఉంటుంది. 36 00:03:41,346 --> 00:03:45,426 అది చాలా చిన్నగా ఉంటుంది, కనుక ఇతర చిన్న పురుగుల నుండి పోటీ ఎక్కువగా ఉంటుంది. 37 00:03:48,770 --> 00:03:52,440 మరి అది ఆహార వేటలో ఉన్నప్పుడు, గూడుకు రక్షణగా ఏమీ ఉండదు. 38 00:03:56,069 --> 00:03:58,489 ఒక్క చీమ అయినా ప్రమాదకరమైనదే. 39 00:04:17,798 --> 00:04:22,138 ఇంకా ఎక్కువ చీమలు వస్తున్నాయి, ఇప్పుడు పిల్లల ప్రాణానికి ప్రమాదం ఉంది. 40 00:04:35,150 --> 00:04:36,530 సరిగ్గా సమయానికి వచ్చేసింది. 41 00:04:59,967 --> 00:05:01,507 వచ్చి ప్రమాదం నుండి గట్టెక్కించింది. 42 00:05:09,601 --> 00:05:12,651 కాలక్రమేణా, కరీబియన్ జీవులు పరిసరాలకు తగ్గట్టుగా పరిణమించాయి, 43 00:05:13,313 --> 00:05:17,283 తమకు దక్కే అతి తక్కువ ఆహారాన్ని అందిపుచ్చుకోవడానికి, చిన్నగా అయిపోయాయి. 44 00:05:22,322 --> 00:05:23,702 ఒక త్రెడ్ పాము, 45 00:05:25,450 --> 00:05:28,000 ఒక దారపుపోగు అంత సన్నగా ఉంటుంది... 46 00:05:29,121 --> 00:05:30,541 మన చూపుడు వేలంత పొడవు ఉంటుంది. 47 00:05:38,672 --> 00:05:39,802 ఇది చీమలను తింటుంది... 48 00:05:42,885 --> 00:05:43,965 ఒక పాము విషయంలో ఇది వింతే. 49 00:05:46,180 --> 00:05:49,680 పెద్ద చీమలు దాని దవడల్లో పట్టలేనంత పెద్దగా ఉంటాయి. 50 00:05:51,435 --> 00:05:53,645 కానీ చీమల పిల్లలను చాలా సులువుగా గుటుక్కుమనేయగలదు. 51 00:06:15,209 --> 00:06:19,089 ఈ చిట్టిపొట్టి అద్భుతమైన జీవులలో చాలా వరకు ఈ దీవిలో మాత్రమే కనబడతాయి. 52 00:06:21,215 --> 00:06:23,465 అగ్గిపుల్లకి సగం ఉండే 53 00:06:23,550 --> 00:06:27,890 ఈ మరుగుజ్జు బల్లి, ప్రప్రంచంలోని అతిచిన్న బల్లులలో ఒకటి. 54 00:06:29,973 --> 00:06:34,443 రాలిన ఆకుల మీద ఉన్న చిన్నిచిన్ని పురుగులను తినడానికి ఈ పరిమాణం చక్కగా సరిపోతుంది. 55 00:06:39,983 --> 00:06:45,283 కానీ తుఫాను సమయాలలో ఈ పరిమాణం అంతగా ప్రయోజనకరం కాకపోవచ్చు. 56 00:06:59,002 --> 00:07:01,962 చినుకులు బాంబుల్లాగా తాకుతాయి. 57 00:07:07,553 --> 00:07:10,933 తన పిల్లలు తడవకుండా ఉండటానికి తల్లి హమ్మింగ్ బర్డ్ తనకు చేతనైనంత చేస్తుంది. 58 00:07:15,185 --> 00:07:17,685 ఇతర పక్షులు తలదాచుకోవడానికని ఎగిరిపోతాయి. 59 00:07:24,236 --> 00:07:26,486 కానీ తుఫాను చాలా తీవ్రంగా ఉంది... 60 00:07:28,282 --> 00:07:30,952 దాని గూడును వదిలి వెళ్లిపోవడం తప్ప దానికి మరో దారి లేదు. 61 00:07:42,004 --> 00:07:46,134 ఇక అడవి నేల మీద, నీళ్ల ప్రవాహం పోటు అలలను తలపిస్తుంది. 62 00:08:01,815 --> 00:08:06,445 కానీ మరుగుజ్జు బల్లికి తన పరిమాణమే ఒక బలమైన ఆయుధం. 63 00:08:11,366 --> 00:08:16,246 ఎంత చిన్నదీ, ఎంత బరువులేనిదీ అంటే నీటి మీద అది నడిచివెళ్లిపోతుంది. 64 00:08:25,047 --> 00:08:28,047 వరద తగ్గుముఖం పట్టే వరకూ నీటి మీదనే తేలుతూ ఉంటుంది. 65 00:08:37,476 --> 00:08:41,686 ఏడాడికి 15కు పైగా తుఫానులు కరీబీయన్ ను అతలాకుతలం చేస్తుండటంతో, 66 00:08:42,438 --> 00:08:46,358 ఈ స్వర్గం ఒక్క క్షణంలో నరకంలా మారిపోగలదు. 67 00:08:55,035 --> 00:08:59,205 హమ్మింగ్ బర్డ్ పిల్లలు వరద బారిన పడ్డాయి. 68 00:09:09,591 --> 00:09:11,681 ఇక ఇది మళ్లీ మొదటి నుండి ఆరంభించాలి... 69 00:09:13,011 --> 00:09:14,851 తదుపరి తుఫాను తాకిడికి గురయ్యే లోపు. 70 00:09:27,442 --> 00:09:32,162 తుఫాను ప్రభావానికి, చెట్లుచేమలు సముద్రంలోకి కొట్టుకుపోతాయి. 71 00:09:33,448 --> 00:09:36,618 కొన్ని జీవులు కూడా వాటితో పాటు తేలుతూ ప్రయాణిస్తుంటాయి. 72 00:09:38,787 --> 00:09:42,997 అప్పుడప్పుడూ, ఆ ప్రయాణించే జీవులు అదృష్టంకొద్దీ కొత్త తీరాలకు చేరుకుంటాయి. 73 00:09:44,751 --> 00:09:48,211 చాలా వరకు జీవులు, కొత్త దీవులను ఈ విధంగానే తమ ఆవాసంగా మలుచుకుంటాయి. 74 00:09:51,550 --> 00:09:56,470 చిన్నవి, అలాగే గట్టివైన అనోలిస్ బల్లులు, బాగా విజయవంతంగా తప్పించుకోగలవు. 75 00:09:59,183 --> 00:10:01,393 కానీ దాని కన్నా ముందు ఈ దీవికి ఎన్నో జీవులు ఎంతో ముందుగా వచ్చాయి. 76 00:10:06,356 --> 00:10:12,276 హూటియాలు, ఉడుములు, తీరానికి కొట్టుకువచ్చిన వాటిని తింటూ జీవనం సాగిస్తాయి. 77 00:10:29,755 --> 00:10:31,755 ఈ బల్లి, బీచ్ నుండి వేరే చోటికి వెంటనే వెళ్లిపోవాలి. 78 00:10:37,346 --> 00:10:42,016 దానికీ, సురక్షితమైన చోటుకీ మధ్య దూరం కొన్ని మీటర్లే ఉంది. 79 00:11:04,122 --> 00:11:09,502 తమ జాతి జనాభాను పెంచుకోవడానికి, సాహసవంతమైన పథనిర్దేశకులు కొన్ని సరిపోతాయి. 80 00:11:14,466 --> 00:11:18,426 హూటియాల నుండి ఇసుక ఎండ్రకాయల దాకా అన్ని పరిమాణంలోని తీరం వెంబడి... 81 00:11:20,138 --> 00:11:22,558 ఆహారం కోసం వెతికే జీవులకు, ఈ తుఫాను చాలా ఆహారాన్నే తెచ్చిపెట్టింది. 82 00:11:31,275 --> 00:11:33,685 కానీ ఇక్కడున్నవన్నీ ఆహారం కోసమే చూస్తున్నాయి అనుకుంటే పొరపాటే. 83 00:11:34,987 --> 00:11:38,527 ఈ హర్మిట్ పీత, ఒక కొత్త నివాసం కోసం వెతుకుతోంది. 84 00:11:39,324 --> 00:11:41,994 తన నివాసం బాగా పాడయిపోయింది. 85 00:11:48,458 --> 00:11:51,958 తుఫాను వల్ల కొన్ని కొత్త గవ్వలు తీరానికి కొట్టుకొచ్చాయి. 86 00:11:54,047 --> 00:11:56,257 కానీ సరిగ్గా సరిపోయేదాన్ని వెతకడం అంత తేలిక కాదు. 87 00:11:57,801 --> 00:11:59,801 దాని పరిమాణం గోల్ఫ్ బంతి అంత ఉంటుంది, అంతే. 88 00:12:00,345 --> 00:12:03,595 కానీ హర్మిట్ పీతలు, కొబ్బరి కాయ అంత పరిమాణం దాకా పెరగగలవు, 89 00:12:04,266 --> 00:12:07,346 కాబట్టి అవి పెరిగేకొద్దీ, అందుకు అనుగుణంగా వాటి పెంకులను కూడా మారుస్తూ ఉండాలి. 90 00:12:13,150 --> 00:12:15,740 పెద్దపెద్ద నివాసాలకు గిరాకీ ఎప్పటికీ తగ్గేది కాదు కనుక, 91 00:12:15,819 --> 00:12:19,869 ఈ హర్మిట్ పీతలు, సొంతంగా ఒక పరిష్కారాన్ని కనిపెట్టాయి. 92 00:12:32,294 --> 00:12:34,714 ఏదైనా పీతకు దానికి సరిపోని గవ్వ కనుక కనబడితే... 93 00:12:35,672 --> 00:12:38,092 అది ఇతర పీతలను వచ్చి ఆ గవ్వను చూసుకోమని పిలుస్తుంది. 94 00:12:40,052 --> 00:12:42,512 ఇక ఆ గవ్వకి సరైన పరిమాణం గల పీత అక్కడికి చేరుకున్నప్పుడు... 95 00:12:44,264 --> 00:12:46,434 అవి ఒక నివాసాల గొలుసుకట్టును ఏర్పరుస్తాయి. 96 00:12:47,559 --> 00:12:49,349 చిన్నవాటి నుండి పెద్దవాటి దాకా. 97 00:12:52,481 --> 00:12:54,111 ముందుగా అన్నింటికన్నా పెద్దది వెళ్తుంది. 98 00:12:58,403 --> 00:13:02,783 ఇక పరిమాణానికి తగ్గట్టు ఒక్కొక్కటిగా ఖాళీ అయిన గవ్వలోకి వెళ్తూ ఉంటాయి. 99 00:13:10,082 --> 00:13:11,382 ఈ పీత ఈ వేడుకకు ఆలస్యంగా వచ్చింది. 100 00:13:18,006 --> 00:13:20,506 కానీ ఎప్పుడూ ఏదోక గవ్వ మిగిలిపోతూనే ఉంటుంది. 101 00:13:27,391 --> 00:13:28,601 అతి చిన్న గవ్వ. 102 00:13:30,769 --> 00:13:34,979 ఎలాగో తెలీదు గానీ, పీతకి తన సరైన ఆవాసాన్ని ఎప్పుడు కనుగొనాలో బాగా తెలిసిపోతుంది. 103 00:13:51,498 --> 00:13:53,788 ఎట్టకేలకు, సరిపోయే ఆవాసం దొరికింది. 104 00:13:55,419 --> 00:13:56,919 దాని అవసరం ఆ పీతకి ఉంటుంది. 105 00:13:57,004 --> 00:14:00,974 ఏడాదిలోని ఈ సమయంలో, వాతావరణం ఊరికే ఉగ్రరూపం దాలుస్తూ ఉంటుంది. 106 00:14:04,386 --> 00:14:08,846 ఇంకాస్త లోపల, మునుపటి తుఫాను ప్రభావం వలన నదులు ఉదృతి ఇంకా తగ్గలేదు... 107 00:14:10,184 --> 00:14:12,234 అవి వర్షపునీటిని సముద్రంలోకి తెచ్చి వదిలేస్తున్నాయి. 108 00:14:15,189 --> 00:14:17,979 కానీ కొన్ని వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి. 109 00:14:20,819 --> 00:14:26,579 ట్రై-ట్రై గోబీ చేపలు సంభోగం చేయడానికి అనువైన చోటు కోసం ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. 110 00:14:29,453 --> 00:14:34,543 పోటీని తప్పించుకోవడానికి, కొన్ని మగ చేపలు మరీ ఎక్కువ దూరం వెళ్లిపోతాయి. 111 00:14:43,509 --> 00:14:45,509 ఈ మగ చేప ఒక చెంచా కన్నా చిన్నగా ఉంటుంది, 112 00:14:46,094 --> 00:14:49,774 కానీ మొప్పలను సక్షన్ కప్పులుగా, అలాగే తన నోటిని పట్టు కోసం ఉపయోగిస్తూ, 113 00:14:50,390 --> 00:14:52,310 అది ప్రవహానికి ఎదురు ఈదగలదు. 114 00:15:07,449 --> 00:15:09,119 కానీ ఇది మాత్రం... 115 00:15:14,373 --> 00:15:15,873 మరింత సవాలుతో కూడిన పనే అవుతుంది. 116 00:15:25,676 --> 00:15:30,006 గోబీ చేపలు, 350 మీటర్ల ఎత్తు ఉండే జలపాతాలని సైతం అధిరోహించగలవు. 117 00:15:31,932 --> 00:15:34,562 అంటే ఎంపైర్ స్టేట్ భవనం అంత ఎత్తు అన్నమాట. 118 00:15:38,480 --> 00:15:41,190 ఈ అధిరోహణకి కొన్ని రోజుల వరకు సమయం పడుతుంది. 119 00:15:53,203 --> 00:15:54,873 ఎక్కే ప్రయత్నం చాలా చేపలు చేస్తాయి... 120 00:16:02,754 --> 00:16:05,384 కానీ నూటిలో ఒకటి మాత్రమే బతికి బట్టకట్ట గలుగుతుంది. 121 00:16:27,571 --> 00:16:29,281 స్థిర వేగంతో వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 122 00:16:51,595 --> 00:16:52,845 విజయం. 123 00:16:54,431 --> 00:16:56,061 దానితో పాటే సంభోగంలో పాల్గొనే అవకాశం. 124 00:16:59,144 --> 00:17:02,064 ఒక కొత్త తరాన్ని ప్రవాహపు దిగువ భాగానికి పంపుతుంది అన్నమాట. 125 00:17:11,156 --> 00:17:15,076 తుఫాను కాలం తాలూకు తేమ, భారీ స్థాయిలో జీవం పురుడు పోసుకొనేలా చేస్తుంది. 126 00:17:20,624 --> 00:17:24,294 జమైకన్ మోంటేన్ పీత ఒక షుగర్ క్యూబ్ అంత పరిమాణంలోనే ఉంటుంది. 127 00:17:27,631 --> 00:17:30,221 బతకడానికి అది నీటిలోనే ఉండాల్సిన అవసరం లేదు. 128 00:17:30,884 --> 00:17:33,224 కానీ పిల్లలు పెట్టడానికి తల్లి పీతకు నీళ్ళు కావాల్సి ఉంటుంది. 129 00:17:37,099 --> 00:17:39,979 బండ రాళ్ళ మధ్య వర్షపు నీరు అక్కడక్కడా ఉంటుంది, 130 00:17:43,772 --> 00:17:46,402 కానీ అక్కడ పిల్లలను పెట్టడం అనేది కాస్త ప్రమాదంతో కూడిన వ్యవహారమే. 131 00:17:50,779 --> 00:17:52,989 ఆ సమస్యను అధిగమించడానికి సరైన పరిష్కారమార్గం దానికి తెలుసు. 132 00:17:55,659 --> 00:18:01,119 దానికి ఉన్న ప్రత్యేక రోమాల సాయంతో, ఒక నీటి పొరను అది తన పెంకు మీదికి చేర్చగలుగుతుంది. 133 00:18:10,674 --> 00:18:12,934 ఇప్పుడు ఆ నీటి పొరను పెట్టడానికి దానికి ఒక అనువైన చోటు కావాలి. 134 00:18:24,563 --> 00:18:27,483 అగ్గిపెట్టె అంత పరిమాణంలో ఉన్న ఒక ఖాళీ గవ్వ. 135 00:18:35,199 --> 00:18:37,239 కొన్ని నీటి బిందువులను పట్టి ఉంచడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. 136 00:18:40,287 --> 00:18:42,917 అంతేగాక, ఒక కొత్త కుటుంబానికి సురక్షితదాయకంగా కూడా ఉంటుంది. 137 00:18:49,087 --> 00:18:50,627 ఇరవై చిన్నచిన్న పీత పిల్లలు, 138 00:18:50,714 --> 00:18:53,554 ఒక్కొక్కదాని పరిమాణం ఒక ఇసుక పొలుకు అంత కూడా ఉండదు. 139 00:18:58,764 --> 00:19:00,394 తర్వాతి మూడు నెలల వరకు, 140 00:19:00,474 --> 00:19:03,774 వారి చిన్ని నత్త యొక్క గవ్వ ఇంట్లో దాని పిల్లలకి అది ఆహారాన్ని అందిస్తూ, 141 00:19:03,852 --> 00:19:05,902 నీటిలో సురక్షితంగా ఉంచుతుంది. 142 00:19:14,279 --> 00:19:19,029 తుఫాను కాలం ముందుకు సాగే కొద్దీ గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా అవుతుందంటే, 143 00:19:19,117 --> 00:19:22,697 కొకీ కప్పలకు గుడ్లను పెట్టడానికి నీటి అవసరమే ఉండదు. 144 00:19:26,124 --> 00:19:29,384 ప్రాణం అనే అద్భుతం ఏకైక కణంతో మొదలవుతుంది. 145 00:19:50,524 --> 00:19:53,154 కార్యబద్ధ తండ్రి కప్ప వాటి పరిరక్షణా బాధ్యతను తీసుకుంటుంది. 146 00:19:54,736 --> 00:19:56,856 అది కేవలం ఒక స్ట్రాబెర్రీ అంత పరిమాణంలోనే ఉంటుంది, 147 00:19:56,947 --> 00:20:00,077 కానీ ప్రమాదం ఏ స్థాయిలో ఉన్నా తన గుడ్లను కాపాడటానికి అది ఏ మాత్రం శంకించదు. 148 00:20:06,748 --> 00:20:08,078 ఒక ఆకలితో ఉన్న నత్త... 149 00:20:09,042 --> 00:20:10,422 అది కప్పకి రెండింతల పరిమాణంలో ఉంది. 150 00:20:26,101 --> 00:20:27,641 కప్ప దాని గుడ్లను కదపలేదు. 151 00:20:30,355 --> 00:20:32,185 తప్పించుకొనే మార్గమే లేదు. 152 00:20:56,381 --> 00:20:57,421 ఎదురు తిరిగి పోరాడుతుంది... 153 00:20:59,259 --> 00:21:01,299 కానీ నత్త పట్టు విడవడం లేదు. 154 00:21:28,830 --> 00:21:32,460 ఈ ధీర తండ్రి కప్ప, ఇంకా రెండు వారాలు తన గుడ్లకు కాపలాగా ఉండాలి, 155 00:21:32,543 --> 00:21:35,093 ఆలోపు దాని గుడ్లు పొదుగుతాయి. 156 00:21:46,265 --> 00:21:49,225 ఆడ హమ్మింగ్ బర్డ్ ఒక కొత్త తోడు కోసం వెతుకుతోంది. 157 00:21:50,894 --> 00:21:54,024 అంతటి చిన్న మగ పక్షి దొరకడమంటే కష్టమే. 158 00:21:58,110 --> 00:22:00,740 ఆ మగ పక్షికి అది కనబడాలని ఎంతో కోరికగా ఉంటే తప్ప. 159 00:22:09,997 --> 00:22:12,247 ఆడ పక్షిని మెప్పించాలంటే మగ పక్షి బాగా కష్టపడాల్సి ఉంటుంది. 160 00:22:24,011 --> 00:22:25,641 చిన్నారి డాన్సర్. 161 00:22:40,235 --> 00:22:42,855 ఎట్టకేలకు, సహనం విజయాన్ని అందిస్తుంది. 162 00:22:53,874 --> 00:22:58,344 త్వరలోనే అది తల్లి కాబోతుంది కనుక, అదొక కొత్త గూడును కట్టాల్సిన అవసరముంది. 163 00:23:06,595 --> 00:23:10,215 ఆ గూడును అట్టిపెట్టి ఉంచడానికి సాలెగూళ్లు బంకగా చక్కగా ఉపయోగబడతాయి. 164 00:23:30,244 --> 00:23:32,704 పునాదులను అల్లుతూ అది గూడును నిర్మించే పనిని ప్రారంభిస్తుంది. 165 00:23:36,792 --> 00:23:38,632 ఇక కొద్ది రోజులలోనే, 166 00:23:38,710 --> 00:23:42,050 తన విలువైన గుడ్లను సంరక్షించడానికి గూడు సిద్ధమైపోతుంది. 167 00:23:53,100 --> 00:23:57,600 కానీ సముద్రంలో... ఏదో పెద్దదే ప్రాణం పోసుకుంటోంది. 168 00:24:05,779 --> 00:24:08,529 ఎడాది పొడుగునా సముద్రపు ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, 169 00:24:09,616 --> 00:24:12,786 అవి అతి భయంకరమైన తుఫానులు పుట్టడానికి ఆజ్యం పోస్తాయి. 170 00:24:23,547 --> 00:24:26,377 అంతటి తీవ్రమైన వాతావరణానికి కూడా తట్టుకొని నిలబడి ఉండేలా 171 00:24:26,466 --> 00:24:28,546 కరీబియన్ ఆనోల్ బల్లులు రూపాంతరం చెందటం అబ్బురపరిచే విషయం. 172 00:24:36,560 --> 00:24:39,440 గాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచినా కూడా 173 00:24:39,938 --> 00:24:42,688 వాటి పొడవైన పాదాల సాయంతో అవి గట్టిగా పట్టుకొని ఉండగలవు. 174 00:24:46,153 --> 00:24:48,163 కానీ ఈ తుఫాను తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 175 00:24:53,994 --> 00:24:56,414 ఇది డోరియన్ తుఫాను. 176 00:24:58,665 --> 00:25:00,455 ఈ తుఫాను కాన్సాస్ నగరమంత పెద్దది. 177 00:25:07,591 --> 00:25:10,591 ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన వాతావరణ ఘటనలు చోటుచేసుకున్నప్పుడు... 178 00:25:14,431 --> 00:25:16,851 చిన్ని జీవులు వాటికి ఎదురొడ్డి నిలవలేవు. 179 00:25:34,701 --> 00:25:37,621 గాలుల వేగం గంటకు 300 కిలోమీటర్లకు చేరుకుంది. 180 00:25:44,419 --> 00:25:47,379 ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తాకితే, విధ్వంసం తప్ప ఏమీ మిగలదు. 181 00:26:11,029 --> 00:26:14,579 ప్రతీ సంవత్సరం, తుఫానులు కరీబియన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తాయి. 182 00:26:18,662 --> 00:26:24,132 కానీ వేల సంఖ్యలో ఉన్న దీవులలో, కొన్ని మాత్రమే నష్టాన్ని చవి చూస్తాయి. 183 00:26:29,256 --> 00:26:31,676 ఎవరు బతికి బయటపడతారనేది అదృష్టం మీద... 184 00:26:34,344 --> 00:26:35,474 పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. 185 00:26:39,099 --> 00:26:43,689 తుఫాను నుండి తలదాచుకోవడంలో, అలాగే త్వరగా కోలుకోవడంలో ఎక్కువగా 186 00:26:44,897 --> 00:26:46,647 చిన్ని ప్రాణులకే మంచి అవకాశం ఉంటుంది. 187 00:26:54,239 --> 00:26:57,909 తుఫాను ఋతువు మధ్యలో, ఏది ఏమైనా కానీ, 188 00:26:57,993 --> 00:27:00,453 హర్మిట్ పీతలు సముద్ర తీరానికి వెళ్తాయి. 189 00:27:16,220 --> 00:27:19,260 అమావాస్య రాగానే వారి మూకుమ్మడి ప్రయాణం ఆరంభమవుతుంది. 190 00:27:24,228 --> 00:27:27,808 మూడు రోజుల లోపల వేల సంఖ్యలో అవి చేరుకుంటాయి. 191 00:27:35,781 --> 00:27:39,491 అన్నీ ఆడవే, వాటి వద్ద గుడ్లు ఉన్నాయి. 192 00:27:51,964 --> 00:27:53,974 అవి నీటిని తాకిన మరుక్షణం... 193 00:27:55,467 --> 00:27:56,757 గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చేస్తాయి. 194 00:27:59,179 --> 00:28:02,469 కొన్ని లక్షల సూక్ష్మ లార్వాలు సముద్రంలో కలిసిపోతాయి. 195 00:28:12,067 --> 00:28:14,237 అవి పెరిగే కొద్దీ నీటి ప్రవాహంతో పాటు ప్రయాణిస్తాయి... 196 00:28:16,613 --> 00:28:18,623 తగిన సమయం వచ్చినప్పుడు తీరానికి వచ్చి 197 00:28:19,783 --> 00:28:21,993 కొత్త ప్రాంతాలను తమ ఆవాసంగా మలుచుకుంటాయి. 198 00:28:27,833 --> 00:28:30,213 కరీబియన్ దీవులలో పరిమితంగా అందుబాటులో ఉండే అవకాశాలను 199 00:28:30,294 --> 00:28:33,514 చక్కగా సద్వినియోగపరుచుకునేది చిన్నిచిన్ని ప్రాణులే. 200 00:28:42,681 --> 00:28:45,141 కొకీ కప్ప పిల్లలు ఇప్పుడు సంపూర్ణ ఆకారాన్ని సంతరించుకున్నాయి... 201 00:28:48,854 --> 00:28:50,444 బయటపడటానికి సిద్ధంగా ఉన్నాయి. 202 00:29:01,366 --> 00:29:03,446 తమ తండ్రి కార్యబద్ధత 203 00:29:03,535 --> 00:29:06,325 ఇంతటి భారీ ప్రపంచంలోకి అవి వచ్చి, తమ సొంతంగా తాము జీవించగలిగేలా 204 00:29:06,413 --> 00:29:09,003 అవకాశం ఇచ్చింది. 205 00:29:17,341 --> 00:29:21,681 ఈ తల్లి పక్షి సహనం తనకు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఇచ్చింది. 206 00:29:33,315 --> 00:29:36,605 ఒక కొత్త తరానికి చెందిన చిట్టి చిటి అద్భుత జీవులు... 207 00:29:37,736 --> 00:29:39,146 ఈ జీవులు ఈ అద్భుతమైన దీవులలో తప్ప... 208 00:29:40,447 --> 00:29:42,987 ఇంకెక్కడా కనబడవు. 209 00:30:46,722 --> 00:30:48,722 ఉపశీర్షికలు అనువదించినది: అలేఖ్య