1 00:00:07,341 --> 00:00:09,841 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,676 జీవితంలో చిన్న చిన్నవాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,636 కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి... 4 00:00:18,143 --> 00:00:20,563 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,038 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:55,347 --> 00:00:56,887 జీవితం వేగంగా నడుస్తుంది. 10 00:00:56,974 --> 00:00:58,104 వ్యాఖ్యాత పాల్ రడ్ 11 00:00:58,183 --> 00:00:59,813 ప్రత్యేకించి పరిమాణం చిన్నదైనప్పుడు. 12 00:01:03,105 --> 00:01:05,515 ఈ బుజ్జి ఉడత వయసు కేవలం నెల రోజులు మాత్రమే. 13 00:01:06,775 --> 00:01:09,065 కానీ ఒక ఏడాది కంటే ఎక్కువ రోజులు బతికితే, అదృష్టం ఉన్నట్లే లెక్క. 14 00:01:12,865 --> 00:01:14,905 అన్వేషించాల్సింది ఎంతో ఉంది. 15 00:01:16,869 --> 00:01:18,289 సమయమేమో అతి తక్కువ. 16 00:01:23,292 --> 00:01:26,922 అది నివసించే ఉత్తర అమెరికా అడవి కొత్త జంతుజాలంతో ఒక్కసారిగా వృద్ధి చెందబోతోంది. 17 00:01:31,258 --> 00:01:32,888 చిట్టి జీవులు... 18 00:01:33,635 --> 00:01:35,465 బోలెడన్ని అవకాశాలు. 19 00:01:45,731 --> 00:01:49,941 కానీ చిట్టి జీవుల ప్రాణాలు రెప్పపాటులో ముగిసిపోగలవు. 20 00:02:05,751 --> 00:02:06,961 కదలకుండా ఉండడానికిది సమయం కాదు. 21 00:02:18,639 --> 00:02:19,719 వేగంగా కదలాలి. 22 00:02:27,064 --> 00:02:28,074 త్వరగా నేర్చుకోవాలి. 23 00:02:32,402 --> 00:02:34,912 బహుశా విజయవంతంగా ఏడాది పూర్తి చేయొచ్చేమో. 24 00:02:42,371 --> 00:02:46,581 వృక్షాల ప్రపంచం 25 00:02:55,092 --> 00:02:56,302 వసంత కాలం ప్రారంభం. 26 00:02:58,262 --> 00:03:00,352 అప్పలాచియన్ పర్వతాల్లోని అడవులు 27 00:03:00,430 --> 00:03:02,060 ఇప్పుడే వికసించడం మొదలుపెట్టాయి. 28 00:03:11,567 --> 00:03:13,607 అక్కడ బోలెడంత ఆహారం ఉంది, 29 00:03:13,694 --> 00:03:17,414 అరచేతి పరిమాణంలో ఉండే ఉడతకు అర ఎకరం భూభాగం చాలు. 30 00:03:28,584 --> 00:03:30,254 నట్స్ పుష్కలంగా దొరుకుతాయి. 31 00:03:34,298 --> 00:03:36,928 ఈ చిట్టి ప్రపంచాన్ని నడిపించేది ఇవే. 32 00:03:39,928 --> 00:03:44,138 ఆకురాలు కాలంలో, అవి పండినప్పుడు భారీగా నేల రాలతాయి. 33 00:03:48,478 --> 00:03:50,898 కానీ ఆలోగా, అది ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. 34 00:03:59,740 --> 00:04:02,410 ఒక ముసలి, బలమైన మగ ఉడత ఇప్పటికే ఇక్కడ నివసిస్తోంది. 35 00:04:06,955 --> 00:04:08,785 ఈ బుల్లి ఉడత బతికి బట్టకట్టాలంటే, 36 00:04:09,249 --> 00:04:12,249 త్వరలోనే ఏదో ఒకరోజు తన కాళ్ళమీద నిలబడాలి. 37 00:04:15,088 --> 00:04:16,628 కానీ పోరాటం ప్రమాదకరం. 38 00:04:18,841 --> 00:04:21,851 సీజన్ ప్రారంభంలోనే గాయాలపాలైతే ఎలా. 39 00:04:49,790 --> 00:04:51,500 ప్రస్తుతానికి అది జాగ్రత్తపడడం మంచిది... 40 00:04:52,292 --> 00:04:54,092 తన భూభాగాన్ని నిర్దేశించుకునేంత 41 00:04:58,131 --> 00:05:00,181 పెద్దగా అయ్యేవరకూ తిండి తిని బజ్జోవడం మంచిది. 42 00:05:06,849 --> 00:05:10,059 ఎక్కువ భాగం జంతువులకు, వసంతకాలం అంటే గూళ్ళ నుండి బయటికి వచ్చి, తిండి తినడమే. 43 00:05:14,147 --> 00:05:17,857 చిట్టి జంతువుల జీవక్రియ వేగంగా ఉంటుంది, కాబట్టి అవి తరచుగా ఆహారం తినాల్సి ఉంటుంది. 44 00:05:20,988 --> 00:05:22,818 గొంగళి పురుగులకు మా చెడ్డ ఆకలి... 45 00:05:23,949 --> 00:05:25,909 అలాగే పక్షులకు కూడా. 46 00:05:32,583 --> 00:05:36,003 బెరడులో ఊరే రసాల కోసం శాప్ సక్కర్స్ వందలాది గుంతలు చేస్తాయి. 47 00:05:39,423 --> 00:05:42,633 నిమ్మకాయ పరిమాణంలో ఉండే హమ్మింగ్ బర్డ్స్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాయి. 48 00:05:48,473 --> 00:05:52,273 ఇక్కడికి చేరేందుకు అవి 5,000ల కి.మీ. ప్రయాణిస్తాయి. 49 00:05:54,438 --> 00:05:57,648 తేనె జుర్రుకోవడానికి సరైన సమయంలో ఇక్కడికి చేరతాయి. 50 00:06:08,702 --> 00:06:10,912 అడవి మొత్తం హడావిడి పడుతూ ఉంటే... 51 00:06:12,539 --> 00:06:15,169 ఒక జీవి మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది. 52 00:06:22,966 --> 00:06:25,586 గుడ్డు పెంకులో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే, 53 00:06:26,053 --> 00:06:29,683 జంపింగ్ ఎలుక గత ఎనిమిది నెలలుగా శీతాకాలపు నిద్రలో ఉంది. 54 00:06:35,354 --> 00:06:37,564 ఇప్పుడది ఎప్పటికీ నిద్రలేవని ప్రమాదంలో పడింది. 55 00:06:44,530 --> 00:06:46,990 మరీ ఎక్కువ కాలం నిద్రపోతే, అది శుష్కించి పోతుంది. 56 00:06:49,535 --> 00:06:51,655 మూడులో రెండింతల ఎలుకలు ఇలాగే చనిపోతాయి. 57 00:06:58,001 --> 00:07:01,171 మరోవైపు దాని పొరుగున ఉన్నవారు విశ్రాంతే తీసుకోరు. 58 00:07:04,383 --> 00:07:06,843 వందలాది కడుపులకు అవి తిండి పెట్టాల్సి ఉంది. 59 00:07:15,102 --> 00:07:17,522 అన్ని చీమలలాగే, అవి కూడా కష్టజీవులు. 60 00:07:18,105 --> 00:07:20,935 కానీ వాటిని ప్రత్యేకంగా నిలిపేది అవి నివసించే చోటు. 61 00:07:26,780 --> 00:07:29,990 ఇసుకరేణువు పరిమాణంలో ఉండే ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే, 62 00:07:30,075 --> 00:07:34,495 వాటి కాలనీ మొత్తం ఒక ఎండు సింధూరం కాయలో సరిపోతుంది. 63 00:07:46,633 --> 00:07:48,473 అదొక సురక్షితమైన చోటులాగా అనిపిస్తోంది. 64 00:07:51,054 --> 00:07:55,274 కానీ మరొకరి ఆహారంలో తమ ఇంటిని నిర్మించుకోవడం మంచి ఆలోచన కాదేమో! 65 00:08:01,315 --> 00:08:03,145 భారీ రాకాసులు అడవిపై దాడి చేశాయి. 66 00:08:23,128 --> 00:08:24,338 అడవి టర్కీలు. 67 00:08:25,923 --> 00:08:28,593 గట్టిగా దేన్నైనా పట్టుకుని, దెబ్బని కాచుకోవాల్సిన సమయం వచ్చింది. 68 00:08:33,931 --> 00:08:35,721 ఇదొక దారుణమైన ప్రయాణం కాబోతోంది. 69 00:08:44,358 --> 00:08:46,608 ఎకోర్న్ కాయలు ధృడమైన ఇళ్ళ కిందే లెక్క. 70 00:08:47,402 --> 00:08:49,702 అవి దొర్లే విధంగానే తయారయ్యాయి. 71 00:09:06,713 --> 00:09:08,923 అడవిలో వేసవి ముందే వస్తుంది. 72 00:09:11,051 --> 00:09:12,681 పచ్చదనం పుష్కలంగా విస్తరించి ఉంటుంది. 73 00:09:18,225 --> 00:09:21,645 ఇప్పటికీ, ఈ చిన్ని ఉడత తినడానికి పెద్దగా ఏమీ దొరకడం లేదు. 74 00:09:25,399 --> 00:09:27,029 సింధూరం కాయలు ఇంకా పండనే లేదు. 75 00:09:34,032 --> 00:09:36,162 ఇప్పటికీ సొంత భూభాగం లేకపోవడంతో, 76 00:09:36,660 --> 00:09:39,290 ముసలి మగ ఉడత భూభాగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 77 00:09:44,459 --> 00:09:46,089 పోరాటానికి ఇంకా సిద్ధం కాలేదు. 78 00:09:51,383 --> 00:09:52,633 అది కొంచెం కండలు పెంచాల్సి ఉంది. 79 00:10:02,394 --> 00:10:06,234 ఆకలికి తట్టుకోలేకపోతే, ఉడతలు దేన్నైనా తినేయగలవు. 80 00:10:09,443 --> 00:10:11,033 నత్తను కూడా తినేయొచ్చు. 81 00:10:20,329 --> 00:10:21,539 తినకపోవచ్చు కూడా. 82 00:10:23,540 --> 00:10:24,710 షికారు కొట్టే అవకాశం లేదు. 83 00:10:28,420 --> 00:10:30,630 ఎందుకంటే పైనే ప్రమాదం పొంచి ఉంది. 84 00:10:35,344 --> 00:10:37,184 త్వరలో మరో ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది. 85 00:10:49,274 --> 00:10:52,494 ప్రస్తుతానికి, ఈ డేగ పిల్ల ఇంకా నిలబడలేదు, 86 00:10:53,529 --> 00:10:54,739 ఎగరడం తరువాతి సంగతి. 87 00:10:59,576 --> 00:11:02,076 అది ఉడతల్ని వేటాడడానికి ఇంకా సమయం ఉంది. 88 00:11:09,127 --> 00:11:12,207 కింద వింతైనది ఏదో బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. 89 00:11:24,893 --> 00:11:26,733 రెండేళ్లుగా పిల్లగా ఉండి, 90 00:11:27,396 --> 00:11:31,396 గోల్ఫ్ బాల్ పరిమాణంలో ఉన్న హెర్క్యులస్ పేడపురుగు బయటికి వస్తోంది. 91 00:11:43,579 --> 00:11:44,789 అది చాలా హడావిడిగా ఉంది... 92 00:11:46,707 --> 00:11:49,707 ఎత్తుగా ఉన్న భూభాగం మీదికి చేరుకుని, జతను సంపాదించే పని ఉంది. 93 00:11:56,383 --> 00:11:57,473 కానీ నడవడం ఎందుకు... 94 00:11:59,761 --> 00:12:00,971 రెక్కలు ఉండగా? 95 00:12:31,210 --> 00:12:33,340 ప్రపంచంలోనే బరువైన పురుగులు, 96 00:12:33,962 --> 00:12:36,382 గాలిలోకి ఎగిరే ముందు తన రెక్కల కండరాల్ని 97 00:12:36,465 --> 00:12:38,045 కొంచెం వార్మప్ చేయాల్సి ఉంది. 98 00:12:41,762 --> 00:12:43,392 ప్రస్తుతానికి నడవడమే మంచిది. 99 00:12:46,308 --> 00:12:50,728 కానీ ఎకోర్న్ వీవిల్ లక్ష్యం ముందు కఠినమైన దీని పని సులభంగా కనిపిస్తుంది. 100 00:12:51,897 --> 00:12:53,817 దానిలో కేవలం వందో వంతు మాత్రమే ఉంటుందిది. 101 00:12:54,733 --> 00:12:57,693 కానీ అది ప్రయాణించాల్సిన దూరం వెయ్యి రెట్లు ఎక్కువ. 102 00:13:09,039 --> 00:13:10,419 అది ఒక మహత్తర ప్రయాణం చేపట్టి, 103 00:13:14,294 --> 00:13:16,134 అడవి పైభాగానికి చేరుకోవాలి. 104 00:13:32,354 --> 00:13:34,864 విలువైన సింధూరం కాయలను చేరుకోవడమే దాని లక్ష్యం. 105 00:13:36,316 --> 00:13:37,726 అవి ఇంకా తయారవలేదు. 106 00:13:40,612 --> 00:13:42,242 కానీ అది వాటిని తినబోవడంలేదు. 107 00:13:45,659 --> 00:13:46,869 అవి తన పిల్లల కోసం. 108 00:13:56,336 --> 00:13:58,666 అవి ఆకుపచ్చగా ఉన్నంతవరకే, అది వాటిలో రంధ్రాలు చేయగలదు. 109 00:14:06,138 --> 00:14:08,138 ఒకే ఒక గుడ్డు కోసం బోలెడంత కష్టం. 110 00:14:13,187 --> 00:14:15,687 అది ఇంకా చాలా ఎకోర్న్ కాయల్లో ఇలా నింపాల్సి ఉంది. 111 00:14:29,578 --> 00:14:32,998 అడవి నేలపై, జంపింగ్ ఎలుక ఇప్పుడే కదలడం ప్రారంభించింది. 112 00:14:36,126 --> 00:14:37,836 అది త్వరలోనే నిద్ర మేలుకోవాలి. 113 00:14:40,631 --> 00:14:43,931 ప్రస్తుతానికి, మారుతున్న ఋతువుల గురించి గానీ... 114 00:14:44,635 --> 00:14:47,965 తన తలపై జరగబోయే యుద్ధం గురించి గానీ దానికి ఎంత మాత్రం తెలీదు. 115 00:14:54,811 --> 00:14:57,651 మొత్తానికి హెర్క్యులస్ పేడ పురుగు దుంగ పైభాగానికి చేరుకుంది. 116 00:15:04,321 --> 00:15:05,951 కానీ విశ్రాంతి తీసుకునే సమయం లేదు. 117 00:15:08,742 --> 00:15:11,162 పోటీ ఎదురుగానే ఉంది. 118 00:15:22,047 --> 00:15:24,377 ఇవి భూమిమీదే అత్యంత బలమైన పేడ పురుగులు. 119 00:15:26,844 --> 00:15:29,854 ఒక్కొక్కటి దాని బరువుకు 100 రెట్ల బరువును ఎత్తగలవు. 120 00:15:35,602 --> 00:15:38,862 ఆ దుంగ మీది నుండి ప్రత్యర్థిని కింద పడేయడమే దాని లక్ష్యం. 121 00:15:41,149 --> 00:15:43,529 పురుగుల ప్రపంచంలోని మల్ల యోధులివి. 122 00:16:41,210 --> 00:16:42,840 దుంగ ఇక దానికే సొంతం. 123 00:16:45,297 --> 00:16:48,007 దాంతో పాటే జతకట్టే అవకాశం కూడా. 124 00:17:00,020 --> 00:17:03,270 డేగ పిల్ల చూపు, మనిషి చూపు కంటే రెండు రెట్లు మెరుగ్గా ఉంటుంది. 125 00:17:05,901 --> 00:17:08,531 నాలుగు వారాలకల్లా, అది పూర్తిగా పెరిగినట్లే. 126 00:17:17,037 --> 00:17:18,867 దాని రెక్కలు దాదాపుగా సిద్ధమవుతున్నట్లే. 127 00:17:24,377 --> 00:17:25,837 త్వరలోనే అది ఎగరగలుగుతుంది. 128 00:17:30,425 --> 00:17:33,045 అప్పటివరకూ, బుల్లి ఉడత ప్రశాంతంగా బతకొచ్చు. 129 00:17:39,893 --> 00:17:41,103 మరీ అంత ప్రశాంతంగా కాదనుకోండి. 130 00:17:43,105 --> 00:17:47,105 ఆకురాలు కాలం వచ్చి, ఆ ఎకోర్న్ కాయలు పండిపోయి నేల రాలడానికి ఇంకా సమయముంది. 131 00:17:57,327 --> 00:17:59,157 నడివేసవి రాత్రులు కాగానే, 132 00:18:00,080 --> 00:18:01,500 గాలిలో మ్యాజిక్ జరుగుతుంది. 133 00:18:14,052 --> 00:18:18,642 వేలాది బుల్లి మిణుగురు పురుగులు చీకటిలో నాట్యం చేస్తున్నాయి. 134 00:18:29,526 --> 00:18:32,776 దుంగ లోపల ఉన్న జంపింగ్ ఎలుక ఎట్టకేలకి నిద్ర లేచింది. 135 00:18:37,868 --> 00:18:40,698 కానీ ఇప్పుడది ఆకలితో చనిపోయే స్థితిలో ఉంది. 136 00:18:41,830 --> 00:18:44,000 వెంటనే ఆహారం వెతుక్కోవాలి. 137 00:18:47,920 --> 00:18:49,920 అంటే చీకటిలో ధైర్యంగా అడుగేయాల్సిందే. 138 00:18:59,556 --> 00:19:02,766 అడవి నేలపై వింత విషయాలు జరగడానికి సిద్ధమవుతున్నాయి. 139 00:19:07,147 --> 00:19:11,237 ప్రకృతి చేసే ఒక వింత వేడుక సిద్ధమవుతోంది. 140 00:19:15,197 --> 00:19:18,407 17 ఏళ్ళ పాటు పురుగులుగా భూమి అడుగున బతికిన 141 00:19:18,992 --> 00:19:21,202 సికాడోస్ చివరికి భూమిపైకి వస్తున్నాయి. 142 00:19:24,206 --> 00:19:27,576 ఇప్పుడవి బతికేది కొద్ది రోజులే. 143 00:19:30,462 --> 00:19:31,842 పోటీ మొదలయింది. 144 00:19:38,679 --> 00:19:40,679 జీవితకాలం పాటు భూమి అడుగున ఒంటరిగా ఉండి, 145 00:19:41,265 --> 00:19:46,725 బొటనవేలి పరిమాణంలో ఉండే లక్షల కొద్దీ సికాడోస్ ఈ క్షణం తమ రాకకోసమే ఎదురుచూశాయి. 146 00:19:51,859 --> 00:19:54,489 భూమిపై ఇదొక అతిపెద్ద వలస. 147 00:19:57,239 --> 00:20:00,529 ఈరాత్రి, అవి అపరిపక్వమైన పురుగుల నుండి పరిణితి పొందిన జీవులయ్యాయి. 148 00:20:10,711 --> 00:20:14,461 రేపు అవి జతకట్టి, ఆ తర్వాత చనిపోతాయి. 149 00:20:24,141 --> 00:20:25,891 వాటిలో కొన్ని ఉదయాన్ని చూడలేవు కూడా. 150 00:20:32,357 --> 00:20:36,567 భారీ సంఖ్యలో ఉన్న కారణంగా, పునరుత్పత్తి జరపడానికి అధికభాగం బతికి బట్టకడతాయి. 151 00:20:37,863 --> 00:20:39,913 అడవిలో జీవులకు నేడు విందు భోజనమే. 152 00:20:46,163 --> 00:20:48,753 కానీ జంపింగ్ ఎలుక శాకాహారి. 153 00:20:52,377 --> 00:20:55,377 చిన్న గింజలు, ఫంగస్ కోసం అది వెతుకుతోంది. 154 00:21:06,892 --> 00:21:09,652 టింబర్ ర్యాటిల్ పాములు నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగలవు. 155 00:21:18,403 --> 00:21:22,373 ప్రస్తుతానికి, ఎలుక పరిమాణంలో ఉన్న భోజనం చక్కగా సరిపోతుంది. 156 00:21:29,039 --> 00:21:31,249 చీకటిలో వెతుకులాట ప్రమాదంతో కూడిన వ్యవహారం... 157 00:21:35,504 --> 00:21:36,594 ప్రత్యేకమైన రహస్య... 158 00:21:39,842 --> 00:21:41,182 సూపర్ పవర్ ఉంటే తప్ప. 159 00:21:49,726 --> 00:21:53,556 గురుత్వాకర్షణ శక్తిని తలదన్నుతూ, అది రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. 160 00:22:03,365 --> 00:22:07,825 కాళ్ళలో పెద్దగా ఉండే కండరాలను కలిపే నరాలు, చిన్ని పరిమాణం కలిసి... 161 00:22:08,912 --> 00:22:11,922 అడవిలో దాగి ఉన్న ప్రమాదాల నుండి దాన్ని రక్షిస్తాయి. 162 00:22:29,183 --> 00:22:32,313 ఆహారం వెతకడానికి సురక్షితమైన చోటుకు వెళ్లి ఉంటుందనుకుందాం. 163 00:22:46,950 --> 00:22:48,740 వేసవి ఆకురాలు కాలంగా మారేసరికి, 164 00:22:50,495 --> 00:22:53,365 అడవి మనోహరమైన ఒక బంగారు కాలంలోకి ప్రవేశిస్తుంది. 165 00:22:59,004 --> 00:23:01,804 కానీ దాంతోపాటే ఒక కొత్త చిక్కు వచ్చిపడింది. 166 00:23:11,225 --> 00:23:13,265 పిల్లగా ఉన్న డేగ రెక్కలు విప్పి... 167 00:23:19,858 --> 00:23:21,688 ఇప్పుడు ఆకాశంలో ఎగిరే... 168 00:23:28,450 --> 00:23:29,870 వేటాడే పక్షిగా మారింది. 169 00:23:34,957 --> 00:23:36,577 రెక్కలు విప్పితే అవి ఒక మీటర్ పొడవు ఉంటాయి. 170 00:23:38,126 --> 00:23:42,046 గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. 171 00:23:57,479 --> 00:23:59,939 చిన్ని జంతువులు ఆకాశం వంక ఒక కన్నేసి ఉంచడం మంచిది. 172 00:24:07,364 --> 00:24:08,874 కేవలం డేగల కోసం మాత్రమే కాదు. 173 00:24:17,624 --> 00:24:20,044 ఉడత ఇన్ని రోజులూ ఎదురుచూస్తున్న మధుర క్షణం కోసం. 174 00:24:26,550 --> 00:24:28,050 పండిన సింధూరం కాయలు. 175 00:24:31,555 --> 00:24:35,635 గాలి కేవలం ఒకటి, రెండు వారాలపాటు మాత్రమే ఉంటుంది, పోగేయాల్సిన సమయం వచ్చింది. 176 00:24:40,814 --> 00:24:44,324 భారీ బుగ్గల్లో అది కొన్ని కాయల్ని కుక్కేసుకుంటుంది. 177 00:24:49,740 --> 00:24:53,370 చలికాలం బతకడానికి వందలకొద్దీ కావాలంటే, ఇలాంటి నైపుణ్యం ఉండాల్సిందే. 178 00:24:59,416 --> 00:25:02,416 కానీ తను ఎంత దాచినా, నిల్వలు వేగంగా పెరగడం లేదు. 179 00:25:09,092 --> 00:25:11,512 ఎవరో తన నిల్వల్ని దొంగిలిస్తున్నారు. 180 00:25:14,389 --> 00:25:15,599 ముసలి మగ ఉడత. 181 00:25:23,106 --> 00:25:24,936 ఈ బుల్లి ఉడత ఎంతగా నిల్వ చేసేకొద్దీ... 182 00:25:29,571 --> 00:25:31,621 అంత ఎక్కువగా పొరుగువాడు దోచేస్తున్నాడు. 183 00:25:38,705 --> 00:25:39,915 అది చాలదన్నట్లుగా... 184 00:25:43,252 --> 00:25:46,172 దగ్గరలో ఉన్న కాయలన్నీ పనికిరానివి. 185 00:25:52,344 --> 00:25:55,104 ఎకోర్న్ వీవిల్ లార్వా అందులో పెరుగుతోంది. 186 00:25:58,892 --> 00:26:03,112 చిక్కుడు గింజంత పరిమాణంలో ఉన్న అది, నర్సరీలోంచి బయటపడే సమయమైంది. 187 00:26:07,818 --> 00:26:09,648 చెప్పడం కంటే చేయడం కష్టమే మరి. 188 00:26:19,913 --> 00:26:22,003 ఖాళీ అయిన కాయలు వృధాగా పోవు. 189 00:26:26,295 --> 00:26:30,125 కొత్త తరం ఎకోర్న్ చీమలకు అది ఇల్లుగా మారుతుంది. 190 00:26:41,810 --> 00:26:43,480 వెచ్చని దుంగ లోపల, 191 00:26:45,689 --> 00:26:48,689 జంపింగ్ ఎలుక ఇప్పటికే తన పడక సిద్ధం చేసుకుంటోంది. 192 00:26:51,987 --> 00:26:54,237 అది కేవలం కొద్ది నెలలు మాత్రమే మేల్కొని ఉంది. 193 00:26:55,032 --> 00:26:57,662 మరోసారి దీర్ఘకాల నిద్రలోకి జారుకునే సమయం వచ్చింది. 194 00:27:03,123 --> 00:27:04,963 బుల్లి ఉడతకి ఏ మాత్రం విరామం దొరకడం లేదు. 195 00:27:06,835 --> 00:27:08,295 ఆకురాలు కాలం దాదాపుగా అయిపోయింది, 196 00:27:08,378 --> 00:27:11,218 శీతాకాలంలో బతకగలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 197 00:27:16,345 --> 00:27:17,675 దానికి మరిన్ని కాయలు కావాలి. 198 00:27:19,389 --> 00:27:20,889 అందుకు ఒకే ఒక పరిష్కారం ఉంది. 199 00:27:27,606 --> 00:27:29,816 శత్రువు భూభాగంలోకి ప్రవేశించాల్సిన సమయం వచ్చింది. 200 00:27:39,993 --> 00:27:42,043 ముసలి మగ ఉడత దొంగిలించడానికి సిద్ధంగా ఉంది కానీ... 201 00:27:47,584 --> 00:27:49,804 ఖచ్చితంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండదు. 202 00:28:06,478 --> 00:28:09,108 యువ ఉడత నేరం చేస్తూ దొరికిపోయింది. 203 00:28:14,319 --> 00:28:17,199 అడవిలో ఈ భాగం రెండింటికీ సరిపోయేంత పెద్దది కాదు. 204 00:28:30,127 --> 00:28:31,797 అది నిరంతరం పారిపోతూ ఉండలేదు. 205 00:28:34,256 --> 00:28:35,876 పోరాడాల్సిన సమయం వచ్చింది. 206 00:29:06,997 --> 00:29:09,917 భయపడి, దెబ్బలు తిన్న ముసలి మగ ఉడత తోక ముడిచింది. 207 00:29:18,842 --> 00:29:21,802 అది తిరిగి ఇటుగా రాకపోవచ్చేమో అనిపిస్తోంది. 208 00:29:32,606 --> 00:29:35,226 పరిమాణం చిన్నగా ఉంటే, జీవితం కూడా చాలా చిన్నగా ఉండే అవకాశం ఉంది. 209 00:29:40,113 --> 00:29:42,533 కానీ ఈ బుల్లి ఉడత మాత్రం పూర్తిగా జీవించే ప్రయత్నం చేస్తోంది. 210 00:29:45,077 --> 00:29:46,907 తన భూభాగాన్ని నిర్దేశించుకుంది, 211 00:29:47,746 --> 00:29:49,456 బోలెడన్ని కాయలు సేకరించింది... 212 00:29:51,250 --> 00:29:54,380 ఈ పెద్ద అడవిలో చిన్నగా ఉంటే ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ... 213 00:29:55,295 --> 00:29:57,255 తేలిగ్గా అధిగమించింది. 214 00:29:59,466 --> 00:30:01,836 శీతాకాలం గడపడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాక... 215 00:30:04,429 --> 00:30:06,519 మరో వసంతకాలం గురించి కలలు కంటూ... 216 00:30:08,392 --> 00:30:10,812 చివరికి విశ్రాంతి పొందే అవకాశం దక్కించుకుంది. 217 00:31:07,659 --> 00:31:09,659 సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ