1 00:00:07,341 --> 00:00:09,841 ఈ భూగ్రహం ఎంతో సుందరమైనది, 2 00:00:10,636 --> 00:00:13,676 జీవితంలో చిన్న చిన్నవాటిని గమనించకుండా ఉండటం అనేది చాలా తేలిక. 3 00:00:15,766 --> 00:00:17,636 కానీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి... 4 00:00:18,143 --> 00:00:20,563 ఇంకా ఆవిష్కృతం కాని ఒక కొత్త లోకం కనుల ముందు కనబడుతుంది. 5 00:00:22,648 --> 00:00:24,978 ఈ లోకంలో చిట్టిచిట్టి వీరులకు... 6 00:00:26,485 --> 00:00:27,815 చిన్నారి రాకాసులకు... 7 00:00:29,029 --> 00:00:31,409 తమకు ఎదురయ్యే భారీ సవాళ్లను... 8 00:00:34,618 --> 00:00:40,038 అధిగమించడానికి ఎనలేని శక్తులు అవసరమవుతాయి. 9 00:00:51,969 --> 00:00:53,799 ఇంటిని మించిన ప్రదేశం మరొకటి ఉండదు. 10 00:01:01,687 --> 00:01:04,857 మరి ఒక బ్లాక్-బెల్లీడ్ ఫీల్డ్ హ్యాంస్టర్ కి ఆ ఇల్లు ఇక్కడే... 11 00:01:07,276 --> 00:01:09,776 యూరోప్ లోని శివారు ప్రాంతాల నడి మధ్యలో అన్నమాట. 12 00:01:14,491 --> 00:01:16,161 విషయం ఏమిటంటే... 13 00:01:18,579 --> 00:01:20,579 ఆ శివారు ప్రాంతాలు మారిపోతున్నాయి. 14 00:01:20,664 --> 00:01:22,674 పాల్ రడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు 15 00:01:43,979 --> 00:01:45,649 యంత్రాలు తమ పని సాగించే కొద్దీ... 16 00:01:48,567 --> 00:01:50,437 జంతువులు బయటకు వెళ్లిపోతాయి. 17 00:02:03,790 --> 00:02:06,380 అవి చాలా వరకు అతి చిన్నగా ఉండటం వలన మనం గమనించలేము. 18 00:02:16,220 --> 00:02:18,560 అదృష్టవంత జీవులు ఇక్కడికి చేరుకుంటాయి. 19 00:02:22,809 --> 00:02:24,229 మన తోటలలోకి. 20 00:02:30,150 --> 00:02:31,440 మనకి తెలిసిన ప్రదేశమే. 21 00:02:35,030 --> 00:02:36,990 కానీ సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు, 22 00:02:37,658 --> 00:02:40,078 అది చిట్టి జీవులు ఏలే... 23 00:02:43,455 --> 00:02:45,325 అబ్బురపరిచే ప్రపంచం అని చెప్పవచ్చు. 24 00:02:50,254 --> 00:02:54,474 ఈ చిన్ని చిన్ని ప్రాణులకు కావలసినవన్నీ తోటలో దొరుకుతాయి. 25 00:02:56,134 --> 00:02:57,144 సుతిమెత్తని పడకలు. 26 00:03:03,976 --> 00:03:05,306 వ్యక్తిగత అంతఃపురాలు. 27 00:03:09,022 --> 00:03:10,022 ఈత కొలను కూడా. 28 00:03:12,276 --> 00:03:14,146 అది చూడటానికి స్వర్గంలా అనిపించవచ్చు. 29 00:03:16,864 --> 00:03:19,704 కానీ ఎటు చూసినా ప్రమాదాలు పొంచి ఉంటాయి. 30 00:03:23,245 --> 00:03:27,455 అతి దారుణమైనది ఏంటంటే, ఈ లోకాన్ని భారీ జీవులు రాజ్యమేలుతున్నాయి. 31 00:03:33,463 --> 00:03:37,263 మరి, ఈ ప్రాంతాన్ని ఇల్లు చేసుకోవడానికి ఏమేం చేయాలి? 32 00:03:41,513 --> 00:03:47,313 తోట 33 00:03:53,066 --> 00:03:54,606 వసంతం వచ్చేసింది. 34 00:03:59,364 --> 00:04:01,874 వస్తూ వస్తూ, తాజా ఆహారాన్ని కూడా తీసుకు వచ్చింది. 35 00:04:16,380 --> 00:04:20,550 కానీ ఆహారం ఎక్కడ ఉంటే, అక్కడ సమస్యలు కూడా పొంచి ఉంటాయి. 36 00:04:34,441 --> 00:04:38,031 ప్రిడేటర్ జీవులలో, పిల్లి చంపినన్ని చిన్ని క్షీరదాలను ఏ జంతువూ చంపదు. 37 00:04:45,285 --> 00:04:49,915 అదృష్టవశాత్తూ, ఉడుతలు శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటాయి. 38 00:04:53,252 --> 00:04:58,672 మనస్సు ఉంటే... గింజలు ఉంటే కూడా అనుకోండి... మార్గం ఉంటుంది. 39 00:05:17,234 --> 00:05:21,664 కానీ ఆ దండెం మీద ప్రయాణించడం అంటే, అది అంత తేలికగా అబ్బే విద్య కాదు. 40 00:05:34,042 --> 00:05:35,042 అది మళ్లీ వస్తుంది. 41 00:05:38,172 --> 00:05:40,132 ఉడుతలు పట్టు విడిచే రకం కాదు. 42 00:05:45,470 --> 00:05:48,720 ఎగరడం ద్వారా, పక్షులకు ఆహారం పెట్టే చోటుకు చాలా తేలిగ్గా చేరుకోవచ్చు అనుకోండి. 43 00:05:58,192 --> 00:06:00,942 వసంతం తొలినాళ్లలోనే రాబిన్ పక్షులు తమ కుటుంబాన్ని ప్రారంభిస్తాయి. 44 00:06:02,696 --> 00:06:06,776 కనుక, తండ్రి పక్షి, తన ఎదుగుతున్న కుటుంబం కోసం వీలైనంత ఆహరాన్ని సేకరిస్తుంది. 45 00:06:13,165 --> 00:06:17,745 తల్లి పక్షి పిల్లలని చూసుకుంటూ ఉంటుంది, పిల్లలకి ప్రతీ 5 నిమిషాలకి ఆహారం 46 00:06:17,836 --> 00:06:21,086 అందించడానికి, తండ్రి పక్షి నిరంతరం ఆహార వేటలోనే ఉంటుంది. 47 00:06:24,218 --> 00:06:26,928 ఇతర పక్షుల నుండి తప్పించుకోవడం అనేది చాలా మెళకువతో కూడిన విషయం. 48 00:06:32,100 --> 00:06:34,560 తోటలోని పక్షులలో రాబిన్ పక్షులు చాలా దూకుడుగా ఉంటాయి. 49 00:06:40,108 --> 00:06:42,528 కానీ ఈ పక్షి అత్యంత భయంకరమైన పక్షుల్లో ఒకటి. 50 00:06:52,037 --> 00:06:54,407 గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎగిరే 51 00:06:55,165 --> 00:06:58,165 స్పారో హాక్, చిన్న పక్షులను వేటాడంలో ఆరితేరిన పక్షి. 52 00:07:15,644 --> 00:07:20,524 ఒకరికి విఫలమైన వేట, మరొకరికి ఆహారాన్ని అందించవచ్చు. 53 00:07:34,079 --> 00:07:38,459 నల్ల చీమలకి, ఆహారాన్ని వెతకడమే ఒక మహా యాత్ర లాంటిది. 54 00:07:46,383 --> 00:07:48,593 అవి దట్టమైన అడువులను దాటుకుంటూ... 55 00:07:50,929 --> 00:07:52,929 పెద్ద పెద్ద ఏడారులను దాటుకుంటూ వెళ్ళాలి. 56 00:08:00,439 --> 00:08:03,359 ఇంటి వద్ద, 5,000 చీమల కాలనీ ఉంది. 57 00:08:05,611 --> 00:08:09,321 ఇక వాటికి ఆహారం అందించడం అనేది ఒక అద్భుతమనే చెప్పవచ్చు. 58 00:08:16,246 --> 00:08:19,076 వాటిని పచ్చ చీమల రైతులు అని పిలవవచ్చు. 59 00:08:20,667 --> 00:08:22,087 వాటిని అవి తినవులెండి. 60 00:08:24,296 --> 00:08:25,876 వాటికి గిలిగింతలు పెడతాయి... 61 00:08:27,716 --> 00:08:29,836 దానితో అవి హనీ డ్యూ బొట్టులను విడుదల చేస్తాయి... 62 00:08:34,264 --> 00:08:37,484 పచ్చ చీమలు మొక్క పసరును తినేటప్పుడు విడుదల చేసే తీపి ద్రవమే ఈ హనీ డ్యూ. 63 00:08:47,361 --> 00:08:51,241 కానీ ఈ మంద మద్య... ఒక తోడేలు కూడా ఉంది. 64 00:08:56,245 --> 00:08:58,495 లేడీబగ్ లు పచ్చ చీమలను తింటాయి. 65 00:09:06,630 --> 00:09:09,970 పదునైన దవడలతో చీమలు ఎదురుదాడికి దిగతాయి. 66 00:09:14,304 --> 00:09:16,474 ఫార్మిక్ యాసిడ్ ని విరజిమ్ముతాయి. 67 00:09:34,241 --> 00:09:38,871 కానీ కొన్ని పచ్చ చీమల హంతకులను చీమల దండు కూడా ఏమీ చేయలేదు. 68 00:09:47,713 --> 00:09:49,803 అవి తమ ఆహారాన్ని వేరే చోట వెతుక్కోవలసి ఉంటుంది. 69 00:09:57,264 --> 00:10:00,144 అడవులలో, హ్యాంస్టర్లు తమ పరిసరాల్లోకి ఇతర హ్యాంస్టర్లను అస్సలు రానియవ్వు. 70 00:10:02,519 --> 00:10:06,359 కానీ పచ్చదనంతో వెల్లివిరిసిన పెరడు వాటిని దగ్గరికి వచ్చేలా చేస్తుంది. 71 00:10:16,033 --> 00:10:17,243 ఒక మగ హ్యాంస్టర్. 72 00:10:23,373 --> 00:10:25,253 ఆడ హ్యాంస్టర్ కు వేరే తోడు ఇష్టం లేదు. 73 00:10:30,380 --> 00:10:34,380 అవి చూడటానికి అమాయక జంతువుల్లా ఉంటాయి. కానీ అవి భయంకరంగా పోరాడతాయి. 74 00:10:39,223 --> 00:10:41,813 మగ హ్యాంస్టర్ పెద్దది, శక్తివంతమైనది... 75 00:10:47,523 --> 00:10:50,363 కానీ అది ఇప్పుడు శృంగార భావాలతో నిండిపోయుంది. 76 00:10:54,655 --> 00:10:57,365 కానీ ఆ భావాలే ఆడ హ్యాంస్టర్ కు కలగడం లేదు. 77 00:11:03,539 --> 00:11:04,959 ఆ తరుణం ఇప్పుడు కాదేమో. 78 00:11:16,510 --> 00:11:20,760 వేసవి కాలం సాగే కొద్దీ, దృష్టి ఆహారం వైపు నుండి సంభోగం వైపు మళ్లుతుంది. 79 00:11:29,022 --> 00:11:31,112 ఒక ఆడ జీబ్రా ఎగిరే సాలీడు. 80 00:11:36,196 --> 00:11:38,816 అది చూడటానికి బియ్యపు గింజ అంతే ఉంటుంది... 81 00:11:41,368 --> 00:11:42,698 కానీ దాని ఆకలికి అడ్డే ఉండదు. 82 00:11:53,839 --> 00:11:57,679 మగ సాలీడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆడ సాలీడు మగ సాలీడును తేలిగ్గా చంపేయగలదు. 83 00:12:07,394 --> 00:12:09,444 ఆడ సాలీడుకు తాను సరైన జోడే అని మగ సాలీడు నిరూపించుకోవాలి. 84 00:12:14,902 --> 00:12:16,402 నాట్యమాడటం ద్వారా. 85 00:12:32,294 --> 00:12:33,384 భరతనాట్యం. 86 00:12:37,633 --> 00:12:38,633 కూచిపూడి. 87 00:12:41,720 --> 00:12:42,760 బ్రేక్ డ్యాన్స్. 88 00:12:44,681 --> 00:12:46,891 ఆ నాట్యాలన్నీ సరిగ్గా వేయాలి. 89 00:12:57,152 --> 00:12:58,782 మగ సాలీడుకు నాట్యంలో ప్రావీణ్యం ఉన్నట్టు లేదు. 90 00:13:00,322 --> 00:13:03,532 కానీ ఏదేమైనా అది బతికి బట్ట కడుతోంది. 91 00:13:09,831 --> 00:13:13,461 నడి వేసవి కాలం. వాతావరణంలో వేడి రాజుకుంటోంది. 92 00:13:19,716 --> 00:13:21,546 మగ హ్యాంస్టర్ మళ్లీ వచ్చింది. 93 00:13:23,303 --> 00:13:25,513 దాని ఓపికకు మంచి ఫలితమే దక్కుతోంది. 94 00:13:38,777 --> 00:13:40,987 ఆడ హ్యాంస్టర్ వేర్లతో పరుస్తోంది, 95 00:13:41,822 --> 00:13:46,162 దాని కలుగును ఇంటిలాగా మలుచుకుంటోంది. 96 00:13:52,875 --> 00:13:56,665 ఏడాదిలోని ఈ సమయంలో, తోట అంతా ఇలా ఇంటిని నిర్మించుకొనేవారితో నిండిపోతుంది. 97 00:14:18,317 --> 00:14:21,947 మేసన్ తుమ్మెదలకు, వాటి పిల్లలను పెంచడానికి ఒక సురక్షితమైన చోటు కావాల్సి ఉంటుంది. 98 00:14:26,742 --> 00:14:27,912 తోడు లేని ఒక తల్లి తుమ్మెదకి, 99 00:14:27,993 --> 00:14:32,003 ఒక ఇంటిని పునాదుల నుండి కట్టడం కంటే, అంతా సిద్ధంగా ఉన్న గవ్వ బాగా సరిపోతుంది. 100 00:14:40,964 --> 00:14:43,264 బాగా పరిశీలించి చూశాక... 101 00:14:44,593 --> 00:14:47,223 ఆ గవ్వలో అది ఒక్క గుడ్డును పెడుతుంది. 102 00:14:57,523 --> 00:14:59,153 కానీ ఒకే ఒక సమస్య ఉంది. 103 00:15:05,822 --> 00:15:08,242 స్టార్లింగ్ పక్షులకు నత్తలంటే భలే ఇష్టం. 104 00:15:12,579 --> 00:15:15,789 దురదృష్టవశాత్తూ, అది తుమ్మెదని నత్త అనుకొనే ప్రమాదం ఉంది. 105 00:15:36,562 --> 00:15:37,902 కొద్దిలో ప్రమాదం తప్పింది. 106 00:15:40,107 --> 00:15:42,727 తన పిల్ల ఈ తోటలో మనుగడ సాగించాలంటే, 107 00:15:42,818 --> 00:15:45,238 ఆ ఆడ తుమ్మెద తన ఇంటి భద్రత గురించి ఆలోచించాల్సి ఉంటుంది. 108 00:15:48,407 --> 00:15:50,367 పిల్ల, ఒక సంవత్సరం తర్వాత కానీ బయటకు రాదు. 109 00:15:52,536 --> 00:15:55,076 దాన్ని కాపాడేంత ఎక్కువ కాలం తల్లి తుమ్మెద జీవించి ఉండదు. 110 00:15:57,207 --> 00:15:59,747 కాబట్టి నిర్మాణానికి కావల్సిన వాటిని అది వెతుకుతోంది. 111 00:16:18,770 --> 00:16:23,190 తన నర్సరీని కప్పి పుచ్చడానికి, విచిత్రంగా, ఆ తల్లి తుమ్మెద దాని కన్నా 20 రెట్లు 112 00:16:23,275 --> 00:16:25,025 అధిక బరువు ఉన్న పుల్లలను మోస్తుంది. 113 00:16:40,292 --> 00:16:43,382 ఒక్కో పుల్లను పేర్చడం ద్వారా, ఆ గవ్వ... 114 00:16:51,929 --> 00:16:53,389 ఒక కోటలాగా మారిపోతుంది. 115 00:17:01,688 --> 00:17:04,528 దాని పిల్లని కాపాడటానికి అది అక్కడ ఉండకపోయినా, 116 00:17:04,608 --> 00:17:07,238 ఒక మంచి ఆరంభం ఇవ్వడానికి, అది, దానికి చేతనైనంత చేసింది. 117 00:17:14,660 --> 00:17:16,490 మానవులు పడుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, 118 00:17:16,954 --> 00:17:20,254 తోటలోకి కొత్త రకమైన జీవులు రంగప్రవేశం చేస్తాయి. 119 00:17:26,128 --> 00:17:29,548 కొన్ని అయితే, అక్కడికి చేరుకోవడానికే ఎన్నో ప్రమాదాలతో కూడిన ప్రయాణాన్ని చేస్తుంటాయి. 120 00:17:32,219 --> 00:17:35,719 ఒక బోదురు కప్ప, ఒక ప్రాణాంతకమైన మిషన్ ని చేపట్టింది. 121 00:17:36,890 --> 00:17:40,890 దాని భాగస్వామి, వారిద్దరి గుడ్లను సంరక్షించే బాధ్యత ఈ కప్ప మీద పెట్టింది. 122 00:17:47,067 --> 00:17:50,447 గుడ్లు కింద పడిపోకుండా ఉండటానికి, మగ కప్ప కాళ్ళ చుట్టూ ఆడ కప్ప వాటిని కట్టింది. 123 00:18:02,457 --> 00:18:06,127 అవి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కనుక అది అతి త్వరగా వాటిని నీట్లోకి చేర్చాలి. 124 00:18:09,882 --> 00:18:11,722 అలా చేయడానికి అది దాని ప్రాణాన్ని సైతం ఫణంగా పెడుతుంది. 125 00:18:27,316 --> 00:18:31,066 తోటలోని ఒక కొలను యొక్క చిన్ని వాసన ఆ కప్ప పసిగట్టేయగలిగింది. 126 00:18:34,239 --> 00:18:35,659 కానీ అది ఇంకా అక్కడికి చేరుకోలేదు. 127 00:18:44,166 --> 00:18:46,166 ముళ్లపందులు, కప్పలని తింటాయి. 128 00:18:55,511 --> 00:18:57,721 కానీ దీని దృష్టి అంతా వేరేదాని మీద ఉంది. 129 00:19:02,059 --> 00:19:04,019 రాత్రి సమయంలో జరిగే ఒకానొక అద్భుతమైన విషయం. 130 00:19:11,360 --> 00:19:12,780 ఒక లెపర్డ్ నత్తగుల్ల. 131 00:19:16,240 --> 00:19:17,780 వేడిగా, తడిగా ఉన్న సాయంత్ర సమయాలలో, 132 00:19:17,866 --> 00:19:21,866 ప్రకృతిలో జరిగే ఒకానొక మనోహరమైన దృశ్యాన్ని మనకి అందించడానికి అవి బయటకు వస్తాయి. 133 00:19:38,178 --> 00:19:41,808 మరో నత్తగుల్ల యొక్క జాడ వెంట వస్తూ, అది చెట్టు ఎక్కుతుంది. 134 00:19:57,489 --> 00:19:58,949 ఇక అవి రెండూ కలిసినప్పుడు... 135 00:20:03,537 --> 00:20:04,657 అవి నాట్యమాడతాయి. 136 00:20:17,134 --> 00:20:20,264 ఆ తర్వాత, కొమ్మ మీద తమ పట్టును జారవిడుస్తూ, 137 00:20:20,345 --> 00:20:23,175 బంక లాంటి దారపుపోగు ద్వారా కిందికి దిగుతాయి. 138 00:20:27,436 --> 00:20:29,266 ఆపదకి తగినంత దూరంలో... 139 00:20:33,859 --> 00:20:35,489 అవి సంభోగంలో పాల్గొనడం ప్రారంభిస్తాయి. 140 00:21:02,221 --> 00:21:05,061 తోట అంతటా, పసి ప్రాణాలు పురుడు పోసుకుంటున్నాయి. 141 00:21:09,603 --> 00:21:12,943 ఎట్టకేలకు, బొదురు కప్ప కొలను దరికి చేరుకోగలిగింది. 142 00:21:15,317 --> 00:21:17,487 అది కూడా ఆ కొలనులోనే జన్మించింది. 143 00:21:30,832 --> 00:21:33,462 సహజసిద్ధమైన కొలనులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి కనుక, 144 00:21:34,086 --> 00:21:37,206 ఈ చిన్ని జీవులకు తోటలోని కొలనులే ప్రాణాధారం. 145 00:21:49,601 --> 00:21:52,811 హ్యాంస్టర్ జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. 146 00:21:55,482 --> 00:21:58,532 తమ మకాం తోటకి మార్చడం అనేది సత్ఫలితాలనే ఇస్తోంది. 147 00:22:06,869 --> 00:22:09,329 ఇప్పుడు ఆడ హ్యాంస్టర్ ఏడు పిల్లలకి తల్లి అయింది. 148 00:22:14,543 --> 00:22:17,383 పుట్టిన తర్వాత మొదటి రెండు వారాల వరకు వాటి కళ్లు మూసుకొనే ఉంటాయి. 149 00:22:19,965 --> 00:22:22,795 ఆ సమయంలో, పిల్లల పరిమాణం రెండింతలు అవుతుంది. 150 00:22:25,596 --> 00:22:28,596 దానికి తగ్గట్టుగా ఉండాలంటే, తల్లి హ్యాంస్టర్ బాగా తినాల్సిన అవసరముంది. 151 00:22:30,684 --> 00:22:33,104 అన్ని పిల్లలను చూసుకోవడం వలన, తల్లి హ్యాంస్టర్ బలహీనమైపోతుంది. 152 00:22:40,110 --> 00:22:43,320 అదృష్టవశాత్తూ, ఆ గార్డెనర్ కృషి ఫలితమివ్వసాగింది. 153 00:22:54,166 --> 00:22:59,126 కానీ అది బయటకొచ్చిన ప్రతిసారీ, దాని ప్రాణానికి ముప్పు ఉంటుంది. 154 00:23:14,228 --> 00:23:16,648 ఎన్ని తక్కువ సార్లు వీలయితే అన్ని తక్కువ సార్లు బయటకు రావడం మేలు. 155 00:23:18,315 --> 00:23:20,525 ఇక హ్యాంస్టర్లు దేనిలో అయితే నేర్పరులో అది కూడా చేయాలి. 156 00:23:23,570 --> 00:23:26,200 వాటి బుగ్గల్లో, అవి మూడు భోజనాలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోగలవు. 157 00:23:44,091 --> 00:23:46,721 కానీ దాని నోరు తెరుచుకోగల పరిమాణానికి కూడా పరిమితి ఉంటుంది కదా. 158 00:24:05,654 --> 00:24:08,284 నడి వేసవి సమయానికి, తోట వేగంగా పెరుగుతూ ఉంటుంది. 159 00:24:20,836 --> 00:24:23,046 ఇక దాన్ని తింటూ జీవించే చిన్ని జంతువులు కూడా పెరుగుతూ ఉంటాయి. 160 00:24:30,804 --> 00:24:31,854 అప్పుడే పుట్టిన 161 00:24:31,930 --> 00:24:35,890 పుస్ మౌత్ లార్వా, సూది రంధ్రంలో కూడా దూరగలిగేంత చిన్నగా ఉంటుంది. 162 00:24:41,023 --> 00:24:43,233 కానీ దీనిది బాకాసుర ఆకలి. 163 00:24:46,737 --> 00:24:49,277 కేవలం మూడు వారాలలోనే, అది పెరుగుతూ... 164 00:24:51,825 --> 00:24:52,865 పెరుగుతూ... 165 00:24:55,495 --> 00:24:58,325 దాని అసలు పరిమాణానికి వెయ్యి రెట్లు పెరిగిపోతుంది. 166 00:25:03,712 --> 00:25:06,922 మరి తోట శరవేగంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో 167 00:25:08,008 --> 00:25:10,178 మనుషులు దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. 168 00:25:16,558 --> 00:25:18,768 కానీ ప్రకృతి దానికి ధీటుగా జవాబు ఇవ్వగలదు. 169 00:25:25,234 --> 00:25:27,954 కాస్తంత ఫార్మిక్ యాసిడ్ విరజిమ్మితే చాలు, అది సరిపోతుంది. 170 00:25:32,282 --> 00:25:35,702 అనేక చిన్ని జీవులు, తమ రక్షణలో భాగంగా రసాయన ఆయుధాలను ఉపయోగిస్తుంటాయి. 171 00:25:39,289 --> 00:25:42,289 కానీ మానవుల వద్ద ఏకబిగిన అనేక జీవులను మట్టుపెట్టగల ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. 172 00:25:52,427 --> 00:25:55,807 ఇంకా ఆహార వేటలో ఉన్న చీమలకు... 173 00:26:03,522 --> 00:26:04,732 ...అది మారణహోమమే అవుతుంది. 174 00:26:37,264 --> 00:26:38,974 నష్టం భారిగా జరిగనప్పటికీ, 175 00:26:40,267 --> 00:26:42,767 ఈ చీమలు గాయపడిన చీమలను అలాగే వదిలేయవు. 176 00:26:46,106 --> 00:26:49,776 ఆ గాయపడిన వాటిని అవి తమ వీపుల మీద మోసుకుంటూ కాలనీ దాకా తీసుకెళ్తాయి. 177 00:26:54,865 --> 00:26:57,195 ఇంటికి చేరుకోవడం వాటికి అంత తేలికైన పని కాదు. 178 00:26:59,953 --> 00:27:03,923 ఇప్పుడు గడ్డి చిన్నగా అయిపోయింది కనుక, వాటికి రక్షణ కూడా తక్కువయింది. 179 00:27:19,223 --> 00:27:23,443 స్టార్లింగ్ పక్షులకు, నత్తలకన్నా చీమలంటేనే ఎక్కువ ఇష్టం. 180 00:27:29,107 --> 00:27:32,107 ఈ సమయాల్లో, ఫార్మిక్ యాసిడ్ దాడి వలన వాటికే ప్రమాదం. 181 00:27:35,072 --> 00:27:37,242 స్టార్లింగ్ కూడా దాన్నే ప్రోత్సహిస్తుంది. 182 00:27:37,824 --> 00:27:41,624 అవి వాటి ఈకలను శుభ్రం చేసి, పరాన్నజీవుల నుండి వాటికి రక్షణని అందిస్తాయి. 183 00:27:47,376 --> 00:27:50,046 కానీ అలా ఆరుబయట మైదానంలో ఈకలను సరిచేసుకోవడం ప్రమాదంతో కూడుకున్నది. 184 00:28:24,037 --> 00:28:25,867 చీమలకు అది కలిసొచ్చింది. 185 00:28:28,083 --> 00:28:32,633 తమ ఇంటికి చేరుకొనే మార్గంలో, వాటికి మరొక ఆఖరి అడ్డంకి ఉంది. 186 00:28:40,387 --> 00:28:42,007 మండే ఎండ ఒక వైపు. 187 00:28:45,058 --> 00:28:46,478 జారిపోయే ఇసుక మరో వైపు. 188 00:28:51,440 --> 00:28:53,280 ఇక భయంకరమైన యాంట్ లయన్స్ ఇంకో వైపు. 189 00:28:56,111 --> 00:29:01,121 అవి ఉచ్చులను పన్ని, చీమలను తప్పించుకోకుండా చేయడానికి ఇసుకను చిమ్ముతాయి. 190 00:29:12,044 --> 00:29:15,674 ఉచ్చులో చిక్కుకున్న తన సహచర చీమ కోసం ఓ ధీర చీమ దాని ప్రాణాన్నే ఫణంగా పెడుతుంది. 191 00:29:24,556 --> 00:29:26,636 ఈ సారికి, దాన్ని కాపాడే అవకాశం లేదు. 192 00:29:39,613 --> 00:29:44,243 కానీ చీమల స్వార్థరహిత స్వభావం పుణ్యమా అని, వాటిలో చాలావరకు ఇంటికి చేరుకుంటాయి. 193 00:30:00,425 --> 00:30:04,845 నాలుగు వారాల వయస్సుకు చేరుకొన్న హ్యాంస్టర్ పిల్లలు, ఇప్పుడు నిమ్మళంగా ఉండలేకున్నాయి. 194 00:30:09,685 --> 00:30:11,595 తోటని అన్వేషించాల్సిన సమయం వచ్చింది. 195 00:30:25,033 --> 00:30:28,453 ఆ పని ఒక మంచి చోటు నుండే ఆరంభమయ్యేలా వాటి తల్లి జాగ్రత్తలు తీసుకుంది. 196 00:30:35,043 --> 00:30:36,713 నిత్యం మారే ఈ ప్రపంచంలో... 197 00:30:38,046 --> 00:30:39,756 కాస్తంత పచ్చిక బీడు ఉన్న చోటు. 198 00:30:46,013 --> 00:30:47,603 ఇది పరిపూర్ణమైనది కాకపోవచ్చు. 199 00:30:49,975 --> 00:30:51,095 కానీ ఇది ఇల్లు. 200 00:30:56,190 --> 00:31:00,820 మనం మన తోటల్లో తిరిగే జంతువులను తెగులు అని ఎక్కువగా భావిస్తుంటాము. 201 00:31:02,654 --> 00:31:05,874 కానీ ఒక్క నిమిషం ఆగి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. 202 00:31:06,909 --> 00:31:10,909 మన ప్రపంచంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న 203 00:31:10,996 --> 00:31:14,166 చిట్టి చిట్టి అద్భుత జీవులు మీకు కనబడతాయి. 204 00:31:23,717 --> 00:31:26,427 చిన్నగా ఉండటం అంటే ఎలా ఉంటుందో మర్చిపోవడం చాలా తేలిక. 205 00:31:32,976 --> 00:31:34,436 కానీ ఆపన్న హస్తం అందిస్తే... 206 00:31:39,441 --> 00:31:40,821 చిన్నచిన్నవి కూడా... 207 00:31:46,406 --> 00:31:48,526 ఎన్నో అద్భుతాలని సాధించగలవు. 208 00:32:50,470 --> 00:32:52,470 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య