1 00:00:06,048 --> 00:00:07,758 ఈ ప్రోగ్రామ్‌లో మైనర్‌లకు సంబంధించి హింస, మాదక ద్రవ్యాల వినియోగ దృశ్యాలు ఉన్నాయి. 2 00:00:07,758 --> 00:00:09,301 మీరు మాదకద్రవ్య వ్యసనంతో బాధపడితే, మరియు సహాయం అవసరమైతే, 3 00:00:09,301 --> 00:00:10,845 నార్కోటిక్స్ అనానిమస్ వంటి స్థానిక సహాయ సంస్థను సంప్రదించండి. 4 00:00:12,012 --> 00:00:13,097 ఈ సిరీస్ యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందినది. 5 00:00:13,097 --> 00:00:14,306 కొన్ని పాత్రలు, సంఘటనలు, సంభాషణలు మరియు ఇతర కథన అంశాలు 6 00:00:14,306 --> 00:00:15,474 నాటకీకరణ కోసం సృష్టించబడ్డాయి. 7 00:00:15,474 --> 00:00:16,726 కల్పిత పాత్రలకు, నిజమైన వ్యక్తులకు మధ్య 8 00:00:16,726 --> 00:00:17,935 ఏదైనా పోలిక ఉంటే అది కేవలం యాదృచ్ఛికం. 9 00:00:23,524 --> 00:00:27,403 దయచేసి అందరూ నేను చెప్పేది ఒక్క క్షణం వింటారా? 10 00:00:27,403 --> 00:00:31,198 అందరికీ, గుడ్ ఈవినింగ్. 11 00:00:31,198 --> 00:00:36,328 సరే, నేను, గవర్నర్ అయిన నా భర్త. 12 00:00:36,328 --> 00:00:37,830 ఇలా రండి, బంగారం. 13 00:00:39,749 --> 00:00:40,750 ప్రియా. 14 00:00:40,750 --> 00:00:45,588 ఇవాళ రాత్రి మీరందరూ వచ్చినందుకు మాకు చాలాా సంతోషంగా ఉంది. 15 00:00:46,464 --> 00:00:50,760 కానీ మేము ప్రత్యేకించి ఒకరికి ధన్యవాదాలు చెప్పాలని అనుకున్నాం. 16 00:00:50,760 --> 00:00:54,513 ఈ అందమైన అమ్మాయి, వివియన్. 17 00:00:54,513 --> 00:00:59,643 - హలో! ధన్యవాదాలు. - వివి, ఇలా రా. అందరూ చప్పట్లు కొట్టండి. 18 00:00:59,643 --> 00:01:00,853 ధన్యవాదాలు. 19 00:01:01,937 --> 00:01:04,648 వివియన్ చాలా ప్రత్యేకం! 20 00:01:04,648 --> 00:01:07,985 ఈ అమ్మాయి తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. 21 00:01:07,985 --> 00:01:11,447 ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమె మంచి ఉదాహరణ. 22 00:01:11,447 --> 00:01:12,990 - నేను చెప్తాను. - చెప్పండి. 23 00:01:12,990 --> 00:01:18,245 మేము వివిని యువ ఓటర్లకు 24 00:01:18,245 --> 00:01:20,915 మా స్వరంగా, మా ముఖంగా ఎంచుకున్నాము. 25 00:01:20,915 --> 00:01:23,834 దయచేసి అందరూ ఆమెకి చప్పట్లు కొట్టండి. 26 00:01:25,377 --> 00:01:30,925 - ఇక్కడికి వచ్చినందుకు, ధన్యవాదాలు. - అందరికీ, ధన్యవాదాలు. 27 00:01:31,884 --> 00:01:33,969 నేనెవరో తెలియని వారి కోసం, 28 00:01:33,969 --> 00:01:37,431 నా కథ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 29 00:01:37,431 --> 00:01:41,352 నా బ్లాగ్‌లో ప్రతి రోజూ చాలా మంది యువతీ యువకులు, 30 00:01:41,352 --> 00:01:46,190 వారు ఎంత స్ఫూర్తి పొందారో, ఎంత మారాలనుకుంటున్నారో నాకు చెప్తున్నారు. 31 00:01:46,941 --> 00:01:48,692 నాకు ఒక పుస్తకం రాయాలని ఉంది. 32 00:01:48,692 --> 00:01:50,069 - అద్భుతం! - అది బాగుంది! 33 00:01:50,069 --> 00:01:53,781 మీ అందరికీ తెలియడం కోసం నా కథలోని ప్రతి వివరాన్ని 34 00:01:53,781 --> 00:01:56,033 మీకు చెప్పాలని ఉంది. 35 00:01:56,033 --> 00:02:00,955 ఇక్కడ ఉన్న అందరి సహాయాన్ని ఆశిస్తున్నాను. 36 00:02:01,497 --> 00:02:03,666 - తప్పకుండా. - మీ నమ్మకానికి ధన్యవాదాలు. 37 00:02:03,666 --> 00:02:09,338 నీ సందేశాన్ని నువ్వు యువతకు అందిస్తావని మేము ఆశిస్తున్నట్టు. 38 00:02:09,338 --> 00:02:11,507 గవర్నర్‌కి టోస్ట్ చేయండి! 39 00:02:11,507 --> 00:02:12,800 చీర్స్! 40 00:02:12,800 --> 00:02:15,219 రియో డి జనీరోకి టోస్ట్! 41 00:02:15,219 --> 00:02:17,721 రియో డి జనీరో! 42 00:02:17,721 --> 00:02:19,974 అల్దో, ఏమవుతోంది? 43 00:02:20,850 --> 00:02:22,476 - ఏమవుతోంది? - శాంతించు. 44 00:02:22,476 --> 00:02:26,355 అంతా బాగవుతోంది, గవర్నర్. మేము అంతా సరి చేస్తాం. 45 00:02:26,355 --> 00:02:27,565 ఏం చేస్తాం! 46 00:02:28,315 --> 00:02:29,733 నేను చెప్పేది విను, అల్దో. 47 00:02:30,526 --> 00:02:34,530 ఒక దొంగ పోలీసులను మోసం చేయడానికి నీకు ఈ హోదా ఇవ్వలేదు. 48 00:02:34,530 --> 00:02:36,073 కొలిబ్రి చచ్చిపోయాడు. 49 00:02:36,073 --> 00:02:37,700 గ్యాంగ్ శక్తి తగ్గిపోతుంది. 50 00:02:37,700 --> 00:02:41,912 ప్రతి మూలలో ఒక పోలీసుని ఉంచుదాము. మన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందాం. 51 00:02:43,914 --> 00:02:48,210 నువ్వు నాకు పెడ్రో డామ్ తల తీసుకురా, 52 00:02:49,670 --> 00:02:51,589 లేదా నేను నీ తల తీస్తాను. 53 00:02:55,718 --> 00:03:01,557 వాస్తవ సంఘటనల స్వేచ్ఛానువాదం 54 00:03:51,315 --> 00:03:53,275 లికో! మాట్లాడు! 55 00:04:02,076 --> 00:04:05,621 నువ్వు రోసీనా బాస్‌గా ఎలా చేస్తావో చూద్దాం. 56 00:04:32,815 --> 00:04:36,860 డామ్ 57 00:04:41,281 --> 00:04:45,369 మేర్ కాంప్లెక్స్ 58 00:04:52,710 --> 00:04:54,503 ప్రపంచంలో ఇలాంటివి పది దాకా ఉంటాయి. 59 00:04:54,503 --> 00:04:55,713 ఇది నిన్ననే వచ్చింది. 60 00:04:58,173 --> 00:05:00,509 రోసీనా కొత్త బాస్‌కి చిన్న బహుమతి. 61 00:05:34,626 --> 00:05:36,754 నేను నీ ఆఫర్ గురించి ఆలోచిస్తున్నాను. 62 00:05:39,423 --> 00:05:41,008 అది ఒప్పుకునే అవకాశమే లేదు. 63 00:05:41,008 --> 00:05:43,302 నువ్వు రోసీనా కోల్పోవచ్చని నాకు తెలుసు. 64 00:05:43,969 --> 00:05:47,097 నేనిందుకు తగిన వాడిని కాదు. 65 00:05:48,182 --> 00:05:49,349 ఏమంటున్నావు? 66 00:05:50,350 --> 00:05:52,019 - అయితే నువ్వెవరు? - ఒక దొంగ. 67 00:05:53,145 --> 00:05:54,188 మత్తుపదార్ధాల బానిస. 68 00:05:55,272 --> 00:05:58,400 నేను దేనికీ బాస్ కాలేను. నేను మంచి కన్నా చెడే చేస్తాను. 69 00:05:59,151 --> 00:06:00,736 నువ్వు టీచర్‌వి కూడానా? 70 00:06:02,154 --> 00:06:04,198 ఇక్కడికొచ్చి, పాఠాలు నేర్పుతున్నావా? 71 00:06:04,198 --> 00:06:07,201 కాదు! దీని గురించి నాకేమీ తెలియదని అంటున్నాను. 72 00:06:08,619 --> 00:06:10,037 నేను ఒక మాట చెప్తాను. 73 00:06:11,205 --> 00:06:13,248 నిన్ను నేను అనవసరంగా పిలవలేదు. 74 00:06:14,708 --> 00:06:17,211 ఇదొక పెద్ద గొడవ. నీకన్నా పెద్దది. 75 00:06:19,088 --> 00:06:20,798 నువ్వేం కావాలంటే అది చేస్తాను. 76 00:06:22,341 --> 00:06:25,928 నేను రియోలో పేరు పొందిన దొంగని. నీకేం కావాలంటే దాన్ని దొంగిలిస్తాను. 77 00:06:25,928 --> 00:06:28,388 కావాల్సిన దానికోసం నేను దొంగతనం చేయనవసరం లేదు. 78 00:06:29,139 --> 00:06:30,390 నా ఇల్లు చూడు. 79 00:06:31,058 --> 00:06:32,351 నా లాభాలు చూడు. 80 00:06:33,310 --> 00:06:35,813 ఈ నగరంలో నాకు మరో దొంగ అవసరం లేదు. 81 00:06:37,189 --> 00:06:39,900 మీకు కావాల్సింది అమ్మకానికి లేనిది ఏదో ఉంటుంది కదా. 82 00:06:50,327 --> 00:06:51,453 అవును, ఉంది. 83 00:06:55,624 --> 00:06:57,126 నువ్వది చేయగలవని నేననుకోను. 84 00:07:02,005 --> 00:07:03,173 నువ్వు చెప్పు. 85 00:07:04,842 --> 00:07:06,176 నేను ఏదైనా చేయగలను. 86 00:07:08,428 --> 00:07:09,888 నేను మాట ఇస్తున్నాను. 87 00:07:11,849 --> 00:07:13,851 కానీ నువ్వు నీ మాట ఇవ్వాలి. 88 00:07:15,435 --> 00:07:17,604 అదయిన తరువాత, నువ్వు నన్ను వెళ్ళనివ్వాలి. 89 00:07:22,943 --> 00:07:24,695 నీకు ఎగరాలనుందా, బాబు? 90 00:07:27,447 --> 00:07:28,907 మన మధ్య ఒక డీల్ ఉంది. 91 00:07:30,659 --> 00:07:33,954 రియో ఎవరి చేతిలో ఉందో ఆ వెధవలకి చూపిస్తాను. 92 00:07:36,123 --> 00:07:40,294 నాకేం చేయాలో తెలియడం లేదు, అర్కాన్జో. వాళ్లు పెడ్రోని చంపేస్తారు. 93 00:07:46,175 --> 00:07:47,217 అవును. 94 00:07:52,681 --> 00:07:55,017 మాటో గ్రోస్సోలో రిసరేసియో ఒక చిన్న ఊరు. 95 00:07:55,851 --> 00:07:57,186 సరిహద్దు దగ్గర ఉంటుంది. 96 00:07:57,853 --> 00:08:00,189 అక్కడ నాకొక ఇల్లు ఉంది. ఎవరూ ఉండడం లేదు. 97 00:08:01,815 --> 00:08:03,692 అదే పెడ్రోకి చివరి అవకాశమేమో. 98 00:08:04,902 --> 00:08:07,613 అవును, ఇప్పుడు అంతా మారిపోయింది. 99 00:08:07,613 --> 00:08:11,533 పోలీసులు మర్చిపోవచ్చు కానీ, ఈ గ్యాంగ్, సిడిసి, 100 00:08:11,533 --> 00:08:14,286 రోసీనాని గవర్నర్ చేతికి వెళ్లనివ్వదు. 101 00:08:18,081 --> 00:08:19,208 వాళ్లు వాడిని వదలరు. 102 00:08:22,586 --> 00:08:24,504 పెడ్రోని పట్టుకోవడం అసంభవం అయిపోయింది. 103 00:08:26,465 --> 00:08:29,593 నువ్వు తొందరపడాలి. సమయం ఎక్కువ లేదు. 104 00:08:39,603 --> 00:08:40,854 - పద, సోదరా. - పద వెళదాం. 105 00:09:34,366 --> 00:09:35,534 హే, అమ్మా. 106 00:09:40,998 --> 00:09:42,124 చాలా కాలమైంది. 107 00:09:50,966 --> 00:09:51,967 నువ్వు సన్నబడ్డావు. 108 00:09:53,051 --> 00:09:54,303 నేను బాగానే ఉన్నాను. 109 00:09:57,806 --> 00:09:58,849 అది అందంగా ఉంది. 110 00:10:00,434 --> 00:10:01,810 నిజంగానా? 111 00:10:05,314 --> 00:10:07,107 నువ్విది ఎలా చేయగలిగావు? 112 00:10:08,525 --> 00:10:10,861 ప్రతి తల్లి సగం దేవత, సగం రాక్షసి. 113 00:10:13,530 --> 00:10:14,573 వెళ్లు. 114 00:10:15,574 --> 00:10:16,658 తొందరగా. 115 00:10:20,412 --> 00:10:21,496 ధన్యవాదాలు. 116 00:11:12,714 --> 00:11:13,882 నేను ఎత్తుకోవచ్చా? 117 00:11:28,021 --> 00:11:29,523 హే, చిట్టితల్లి. 118 00:11:31,691 --> 00:11:33,151 నేను మీ నాన్నని. 119 00:11:34,945 --> 00:11:36,530 అవును, మీ నాన్నని. 120 00:11:37,406 --> 00:11:39,324 నిన్ను కలవడం కోసం చాలా ఎదురు చూసాను. 121 00:11:44,204 --> 00:11:46,331 మీ నాన్న చాలా చెత్త పనులు చేస్తాడు. 122 00:11:47,290 --> 00:11:48,792 మీ నాన్నకి పిచ్చి. 123 00:11:50,585 --> 00:11:51,586 అవునా? 124 00:11:52,170 --> 00:11:53,213 అవును. 125 00:11:55,757 --> 00:11:56,800 కానీ... 126 00:11:57,676 --> 00:12:00,804 నీ నుంచి మళ్లీ ఎన్నడూ దూరం అవనని నీకు మాట ఇస్తున్నాను. 127 00:12:05,559 --> 00:12:06,685 మీ ఇద్దరి నుంచి. 128 00:12:13,650 --> 00:12:15,902 అన్నిటికీ నన్ను క్షమించు. 129 00:12:20,407 --> 00:12:22,075 నేను వెళ్ళాల్సి వచ్చింది. 130 00:12:24,244 --> 00:12:26,538 - లేదంటే సమస్యలో పడేదాన్ని. - నాకు తెలుసు. 131 00:12:27,789 --> 00:12:28,999 ఏ సమయంలో అయినా... 132 00:12:30,667 --> 00:12:32,836 అరెస్ట్ చేస్తారేమోనని, దీన్ని నా నుంచి 133 00:12:34,754 --> 00:12:36,465 వేరు చేస్తారేమోనని భయం వేసింది. 134 00:12:40,343 --> 00:12:41,470 నేనున్నాను. 135 00:12:44,306 --> 00:12:45,849 మీ ఇద్దరినీ చూసుకుంటాను. 136 00:12:46,808 --> 00:12:49,060 నీ పేరు లేకుండా రిజిస్టర్ చేయించాను. 137 00:12:50,103 --> 00:12:51,438 అది చాలా ప్రమాదకరం. 138 00:12:55,150 --> 00:12:56,359 పట్టుకో. 139 00:13:02,532 --> 00:13:03,533 ఏం చేస్తున్నావు? 140 00:13:04,743 --> 00:13:06,328 లే, పెడ్రో. 141 00:13:06,328 --> 00:13:08,079 - ఆపు! - జాస్మిన్. 142 00:13:09,581 --> 00:13:12,250 నా జీవితంలో నేను కలిసిన అత్యద్భుతమైన మహిళవి నువ్వు. 143 00:13:15,712 --> 00:13:16,796 నిజంగా. 144 00:13:17,672 --> 00:13:19,299 నువ్వు అద్భుతం! 145 00:13:20,550 --> 00:13:21,635 అద్భుతం! 146 00:13:22,802 --> 00:13:28,225 నేరజీవితం నుంచి బయటపడి, డ్రగ్స్ ఆపేసి, నీ బిడ్డని నువ్వే పెంచుతున్నావు. 147 00:13:29,100 --> 00:13:30,393 నేను నిన్ను ఆరాధిస్తాను. 148 00:13:33,730 --> 00:13:36,566 నీకు ఇక నా అవసరం లేదు. 149 00:13:41,613 --> 00:13:43,490 కానీ నువ్వు లేకుండా నేను బతకలేను. 150 00:13:45,033 --> 00:13:46,618 నేను బతకలేను. నిజంగా. 151 00:13:51,081 --> 00:13:52,624 మీ ఇద్దరి గురించి 152 00:13:53,500 --> 00:13:55,377 ఆలోచించని రోజు అంటూ లేదు. 153 00:14:17,691 --> 00:14:19,359 మీరు నా ప్రాణం. 154 00:14:30,579 --> 00:14:34,291 - నిజంగా? - నిజంగా. 155 00:14:48,221 --> 00:14:51,433 నిన్ను ఇంతకుముందు చాలా సార్లు అడిగాను, కానీ... 156 00:14:53,101 --> 00:14:55,937 - ఒట్టు, ఇదే చివరి సారి. - ఏంటి? 157 00:14:56,813 --> 00:14:58,106 నాకు కొంత సమయం కావాలి, 158 00:14:59,149 --> 00:15:00,775 నా జీవితాన్ని సరి చేసుకోవడానికి. 159 00:15:01,651 --> 00:15:04,529 ఒక వారంలో, 160 00:15:05,780 --> 00:15:07,032 నేను తిరిగి రాకపోతే, 161 00:15:07,949 --> 00:15:09,576 నీ దగ్గరకి మళ్లీ ఎప్పుడూ రాను. 162 00:15:24,090 --> 00:15:26,593 అది చూడు. రమాలో! 163 00:15:26,593 --> 00:15:28,178 రియోకి భద్రత కావాలి అల్దోకి వోటు వేయండి 164 00:15:28,178 --> 00:15:30,388 - సెక్రెటరీ? - ప్లీజ్. 165 00:15:32,682 --> 00:15:35,769 నాకు మంచి సమాచారం ఇస్తావా? మనం అందుకుంటున్నామా? 166 00:15:37,562 --> 00:15:40,899 కొలిబ్రి రక్షణ లేకపోతే, డామ్ పని అయిపోయినట్టే. 167 00:15:43,318 --> 00:15:44,986 కానీ మనకి సమయం తక్కువగా ఉంది. 168 00:15:44,986 --> 00:15:48,073 ఒక్క క్షణం. ప్లీజ్, ఎలనీ, ఒక్క నిమిషం. 169 00:15:53,745 --> 00:15:56,706 వాడిని మేర్ నుంచి తప్పించడానికి మనం మార్గం ఆలోచిస్తున్నాము. 170 00:15:57,957 --> 00:15:59,125 "మనం" ఎవరు? 171 00:16:01,795 --> 00:16:04,631 ఈ కథకి హీరో ఎవరో ఇంకా అర్థం కాలేదా? 172 00:16:06,466 --> 00:16:07,592 నువ్వే! 173 00:16:08,635 --> 00:16:11,137 రియోలో ప్రమాదకరమైన నేరస్తుడిని అరెస్ట్ చేస్తావు. 174 00:16:11,846 --> 00:16:13,723 అంత ధైర్యం ఎవరికుంది, రమాలో? 175 00:16:13,723 --> 00:16:15,183 విను... 176 00:16:15,892 --> 00:16:18,103 మేర్, రోసీనాని నాకు వదిలేయ్. 177 00:16:19,979 --> 00:16:21,106 నేను ఎన్నికయితే, 178 00:16:22,649 --> 00:16:24,567 సెక్రెటరీ స్థానం ఖాళీ అవుతుంది. 179 00:16:25,402 --> 00:16:27,362 నేను గెలిస్తే, నువ్వూ గెలుస్తావు. 180 00:16:37,956 --> 00:16:39,499 నాకు పిచ్చెక్కేలా ఉంది. 181 00:16:40,834 --> 00:16:42,544 నేనిలా ఎదురు చూడలేను. 182 00:16:45,380 --> 00:16:46,965 నేను అక్కడికి వెళ్లక తప్పదు. 183 00:16:48,007 --> 00:16:49,426 ఏం చేయాలనుకుంటున్నావు? 184 00:16:50,760 --> 00:16:53,596 ఇది, నీకన్నా, పెడ్రో కన్నా చాలా పెద్దది, విక్టర్. 185 00:16:53,596 --> 00:16:55,932 ఇది ప్రజల భద్రతకు సంబంధించిన విషయం. 186 00:16:55,932 --> 00:16:59,018 ఈ ఆధిపత్య పోరులో నీ కొడుకు మరో బంటు. 187 00:17:00,353 --> 00:17:04,274 నేను వాడిని రియో నుండి బయటకు తీసుకురావాలి. నేను పెడ్రోతో మాట్లాడాలి, అంతే. 188 00:17:07,152 --> 00:17:08,236 నాకు భయంగా ఉంది. 189 00:17:09,612 --> 00:17:12,991 ఇది మనం నమ్మకం ఉంచాల్సిన సమయం. 190 00:17:14,242 --> 00:17:17,662 నీ కొడుకుతో నీకున్న అనుబంధం గురించి ఆలోచించు. అది బలమైనది. 191 00:17:26,087 --> 00:17:28,298 - హలో. - ఇది పిజ్జేరియా. 192 00:17:28,298 --> 00:17:31,801 - పిజ్జానా? నేను పిజ్జా ఆర్దర్ చేయలేదు. - డామ్స్ పిజ్జేరియా. 193 00:17:53,573 --> 00:17:55,784 {\an8}నాన్నా, నేను మిమ్మల్ని కలవాలి! రెడీగా ఉండండి, ఎవరినైనా పంపుతాను 194 00:17:55,784 --> 00:17:57,869 {\an8}రేపు ఉదయం స్టేషన్ 6 వద్ద నుండి మిమ్మల్ని తీసుకువస్తారు. 195 00:17:57,869 --> 00:17:59,537 {\an8}మీకు ఇంకా 4 చీజ్ పిజ్జా ఇష్టమేనా? 196 00:18:09,672 --> 00:18:10,715 విక్టర్? 197 00:18:39,494 --> 00:18:42,997 ఎక్కడికి వెళ్తున్నావు, ప్లేబాయ్? 198 00:18:43,623 --> 00:18:46,167 ఎలా ఉన్నావు? ఈయన పెడ్రో డామ్ తండ్రి. 199 00:18:46,751 --> 00:18:47,919 హెల్మెట్ తియ్యి. 200 00:18:54,384 --> 00:18:55,510 మీ అబ్బాయి ఒక లెజెండ్. 201 00:18:57,220 --> 00:18:58,429 వెళ్లనివ్వు, పారా. 202 00:20:15,423 --> 00:20:16,591 హే, నాన్నా. 203 00:20:28,144 --> 00:20:30,521 పెడ్రో. నేను చెప్పేది విను, బాబు. 204 00:20:31,773 --> 00:20:34,025 - నీ కోసం ఒక చోటు చూశాను... - శాంతించండి. 205 00:20:35,234 --> 00:20:36,486 శాంతించండి. 206 00:20:38,154 --> 00:20:39,197 ఎలా ఉన్నారు? 207 00:20:42,408 --> 00:20:43,451 బాగున్నాను. 208 00:20:46,120 --> 00:20:48,289 లాలా నాకు దాని గురించి చెప్పింది. 209 00:20:49,582 --> 00:20:50,667 కాన్సర్. 210 00:20:51,709 --> 00:20:52,752 అది అన్యాయం. 211 00:20:54,295 --> 00:20:55,546 బాగానే ఉన్నాను, పెడ్రో. 212 00:20:56,214 --> 00:20:59,509 - చికిత్స మొదలుపెట్టా. బానే ఉన్నాను. - నిజంగా? సిగరెట్లు ఆపేసారా? 213 00:21:07,934 --> 00:21:10,311 నువ్వు ఎందులో ఇరుక్కున్నావు, బాబు? ఛ! 214 00:21:16,526 --> 00:21:17,694 నా కూతురిని కలిసాను. 215 00:21:20,405 --> 00:21:22,073 మీ మనవరాలు చాలా అందంగా ఉంది. 216 00:21:23,574 --> 00:21:26,536 ఏంటో తెలుసా? తన తండ్రిలా ఉంది. 217 00:21:28,955 --> 00:21:29,998 నేను చెప్తున్నాను. 218 00:21:32,000 --> 00:21:34,669 మీరు చేసిన వాటిని నేను అర్థం చేసుకుంటున్నాను. 219 00:21:38,172 --> 00:21:39,382 నాన్న బాధ్యత చాలా కష్టం. 220 00:21:46,014 --> 00:21:47,056 అవును. 221 00:21:49,559 --> 00:21:52,979 నీకు 23 ఏళ్ళు అంతే, ఇంకా జీవితమంతా ఉంది. 222 00:21:55,356 --> 00:21:59,444 నేను చూసిన ఇల్లు సరిహద్దుకి దగ్గరలో ఉంది, చుట్టూ ఏమీ లేదు. 223 00:21:59,444 --> 00:22:03,448 నువ్వు అక్కడికి వెళ్లు. దాక్కో. ఎవరూ నిన్ను వెతకలేరు. 224 00:22:03,448 --> 00:22:04,907 నీ బతుకు నువ్వు బతుకు. 225 00:22:05,950 --> 00:22:07,618 కానీ నువ్వు కొకెయిన్, అడ్రినలిన్, 226 00:22:09,162 --> 00:22:13,041 మనుషులు, అన్నిటితో తెగతెంపులు చేసుకోవాలి. 227 00:22:14,542 --> 00:22:15,793 నాతో సహా. 228 00:22:17,462 --> 00:22:19,172 ఈ జీవితాన్ని నువ్వు వదిలేయాలి. 229 00:22:21,090 --> 00:22:22,759 ఈ ప్రపంచం నుంచి వేరు చేసుకోవాలి. 230 00:22:27,263 --> 00:22:28,431 అవును, నాన్నా. 231 00:22:30,725 --> 00:22:33,853 నాకు కావాల్సింది కూడా అదే, అంతా వదిలేయడం. 232 00:22:33,853 --> 00:22:35,021 అవును. 233 00:22:38,232 --> 00:22:41,069 నేను, జాస్మిన్, మా కూతురు అంతే. 234 00:22:41,069 --> 00:22:42,779 తప్పకుండా! తప్పకుండా! 235 00:22:42,779 --> 00:22:45,114 - అది వెంటనే చెయ్యాలి! - నేనిప్పుడు చెయ్యలేను. 236 00:22:45,114 --> 00:22:48,159 - నాతో రా. - నేనొక చివరి పని చేయాలి. 237 00:22:50,620 --> 00:22:51,913 ఇప్పుడు చేయలేను, నాన్నా. 238 00:23:00,421 --> 00:23:01,714 నేనిక్కడ నీతోనే ఉంటాను. 239 00:23:02,507 --> 00:23:05,051 - లేదు, మీరు ఉండరు. - నేను ఉంటాను. 240 00:23:05,051 --> 00:23:06,344 లేదు, మీరు ఉండరు. 241 00:23:11,099 --> 00:23:13,226 నేనిది పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. 242 00:23:15,103 --> 00:23:17,605 కొన్ని రోజుల్లో మీకు చెప్తాను. 243 00:23:18,898 --> 00:23:20,691 మీ ఇంటికి వస్తాను. 244 00:23:22,610 --> 00:23:23,694 వెళ్ళడానికి రెడీగా. 245 00:23:28,741 --> 00:23:29,826 నేను ఎదురు చూస్తాను. 246 00:23:33,663 --> 00:23:34,747 ఇదుగోండి. 247 00:23:35,957 --> 00:23:37,375 నిజంగా అంటున్నాను. 248 00:23:40,378 --> 00:23:42,630 - ఇదేంటి? - నా లక్కీ కాయిన్. 249 00:23:43,297 --> 00:23:45,508 - ఇదేంటి? - ఉంచుకోండి. 250 00:23:45,508 --> 00:23:48,761 - వద్దు. నువ్వే ఉంచుకో. - ఉంచుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను. 251 00:23:50,138 --> 00:23:51,347 మొండిగా ఉండకండి. 252 00:23:51,931 --> 00:23:53,850 సరే, ఒక షరతు మీద. 253 00:23:53,850 --> 00:23:56,394 ఇక్కడి నుంచి వచ్చిన వెంటనే అది నీకు ఇచ్చేస్తాను. 254 00:23:56,394 --> 00:23:59,689 స్వేచ్ఛగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు. అది నా షరతు. 255 00:24:00,857 --> 00:24:01,983 సరే. 256 00:24:19,709 --> 00:24:20,835 ఐ లవ్ యు, నాన్నా. 257 00:24:22,753 --> 00:24:25,089 - ఐ లవ్ యు, బాబు. - జాగ్రత్తగా ఉండు. 258 00:24:26,132 --> 00:24:27,842 - నేను వెళ్ళాలి. - ఎదురు చూస్తాను. 259 00:25:35,493 --> 00:25:39,413 రేపు రా. ఇది పని చేస్తుంది, నాన్నా! 260 00:25:44,919 --> 00:25:46,045 అబ్బా! 261 00:25:47,588 --> 00:25:49,090 గవర్నర్ దర్జాగా ఉంటాడు. 262 00:25:52,843 --> 00:25:54,303 భయపడడం లేదుగా? 263 00:25:56,138 --> 00:25:57,723 నీకు నా గురించి తెలియదు, కదా? 264 00:25:58,724 --> 00:26:00,810 నువ్వు నీది చెయ్యి, నేను నాది చేస్తాను. 265 00:26:12,488 --> 00:26:15,324 అయ్యో! బాగానే ఉన్నావా? 266 00:26:17,868 --> 00:26:20,663 హే, నువ్వు! బాగానే ఉన్నావా? 267 00:26:20,663 --> 00:26:22,915 అంబులెన్స్ కావాలా? 268 00:26:22,915 --> 00:26:25,001 గాయపడ్డావా? 269 00:26:25,001 --> 00:26:27,628 - బాగానే ఉన్నావా? - లేవడానికి సహాయం చెయ్యండి. 270 00:26:28,296 --> 00:26:30,006 మెల్లగా! 271 00:26:30,006 --> 00:26:33,217 - నువ్వు ఆసుపత్రికి వెళ్ళాలి. - వద్దు, వద్దు! 272 00:26:34,010 --> 00:26:36,012 - వద్దు, ధన్యవాదాలు. - అవసరం లేదా? 273 00:26:36,012 --> 00:26:37,930 ధన్యవాదాలు, సర్. 274 00:26:39,181 --> 00:26:40,808 పదండి. తొందరగా! 275 00:29:33,105 --> 00:29:34,190 బెలీనా. 276 00:29:35,524 --> 00:29:36,609 బెలీనా. 277 00:29:43,282 --> 00:29:44,325 బెలీనా! 278 00:29:46,285 --> 00:29:47,411 బెలీనా! 279 00:29:49,997 --> 00:29:51,165 బెలీనా! 280 00:30:06,013 --> 00:30:08,474 మీరు నిజంగా మా... 281 00:30:09,016 --> 00:30:10,809 ఆగండి. 282 00:30:12,645 --> 00:30:13,646 - ఛ! - ఇదేంటి? 283 00:30:13,646 --> 00:30:14,605 సిడిసి అంటే టెర్రర్ 284 00:30:14,605 --> 00:30:16,023 ఇదేంటి? 285 00:30:16,023 --> 00:30:17,775 ఇదేంటండి? 286 00:30:19,068 --> 00:30:20,486 తాజాగా ఉంది. 287 00:30:20,486 --> 00:30:23,030 - మీరేం చేశారు? - శాంతించు. 288 00:30:23,030 --> 00:30:25,032 - మీరేం చేశారు? - శాంతించు! 289 00:30:25,032 --> 00:30:27,326 - మీరేం చేశారు? - నేనేమీ చేయలేదు! 290 00:30:27,326 --> 00:30:29,787 - ఎవరితో పనిచేస్తున్నారు? చెప్పా... - నోరుమూసుకో! 291 00:30:29,787 --> 00:30:31,622 - నేను చెప్పాను... - నోరుమూసుకో. ఆపు! 292 00:30:34,833 --> 00:30:36,919 ఎక్కడున్నారు, వెధవల్లారా? 293 00:30:36,919 --> 00:30:38,462 ఏమవుతోంది? 294 00:30:54,353 --> 00:30:55,688 మాట్లాడకు. 295 00:31:07,825 --> 00:31:10,369 ఆఫీసర్! అక్కడున్నాడు. 296 00:31:12,955 --> 00:31:14,331 వెధవ! 297 00:31:20,963 --> 00:31:24,049 ఇదేంటి, అల్దో? నీకేమవుతోంది? 298 00:31:24,049 --> 00:31:26,176 వాడు నా ఇంట్లోకి వచ్చాడు. 299 00:31:27,344 --> 00:31:29,972 ఏంటి? అది నిరూపించేందుకు 300 00:31:29,972 --> 00:31:33,767 వాడు నా ఇంటి గోడ మీద గీసిన పురుషాంగం ఫోటో కావాలా? 301 00:31:34,351 --> 00:31:36,854 విను, అల్దో. ఇది అయిపోయింది, అయిపోయింది. 302 00:31:36,854 --> 00:31:40,733 గ్యాంగ్‌తో మాట్లాడదాం! 303 00:32:03,505 --> 00:32:06,258 ఇప్పుడే. అదుగో. 304 00:32:07,009 --> 00:32:08,260 చూసారా? 305 00:32:09,261 --> 00:32:12,306 ఇప్పుడు గవర్నర్ నా గుప్పిట్లో ఉంటాడు. 306 00:32:13,515 --> 00:32:15,309 విధేయతకు బహుమతి లభిస్తుంది, బాబు. 307 00:32:17,645 --> 00:32:19,730 నువ్వు నాకు తెలిసినవారిలో తెలివైనవాడివి. 308 00:32:22,024 --> 00:32:23,817 ఇంకా అతి పెద్ద మూర్ఖుడివి. 309 00:32:25,569 --> 00:32:26,945 డీల్ చేసుకున్నాము. 310 00:32:28,530 --> 00:32:30,074 నీకు కావలసింది అదేనా? 311 00:32:35,371 --> 00:32:36,455 నేను వెళ్ళవచ్చా? 312 00:32:56,266 --> 00:32:59,019 నాన్నా, నేను విడుదలయ్యాను. 313 00:35:06,730 --> 00:35:08,023 ఛ! కిందకి ఒంగు! 314 00:35:08,023 --> 00:35:09,608 చూసుకోండి, ఛ! 315 00:35:26,208 --> 00:35:27,334 వాడిని షూట్ చేయండి! 316 00:35:28,961 --> 00:35:29,962 వెళ్ళండి, వెళ్ళండి! 317 00:35:38,762 --> 00:35:40,180 పదండి! 318 00:35:41,849 --> 00:35:43,183 పదండి! 319 00:35:43,725 --> 00:35:44,852 పదండి, పదండి! 320 00:36:34,401 --> 00:36:37,154 వాడు పారిపోతున్నాడు! ఇక్కడికి రండి! 321 00:40:12,828 --> 00:40:16,289 ...లాగావ్‌లో ఒక పెద్ద భవనంలో నేటి ఉదయం పెడ్రో డామ్ పట్టుబడ్డాడు. 322 00:40:16,289 --> 00:40:18,708 నేరస్తుడు పెడ్రో డామ్ మరణించాడు. 323 00:40:18,708 --> 00:40:21,711 ఇంటలిజెన్స్ ఆపరేషన్ పుణ్యమా అని అతను పట్టుబడ్డాడు... 324 00:40:21,711 --> 00:40:24,923 అల్దో, జరిగిన దాని గురించి ఇంకేమైనా చెప్తారా? 325 00:40:24,923 --> 00:40:29,636 మేము ప్రజా భద్రత కోసం ఈ పని చేయాల్సి వచ్చింది. 326 00:40:30,303 --> 00:40:35,934 గట్టి పట్టుదలతో శాంతి పునఃస్థాపించబడింది. 327 00:40:36,768 --> 00:40:39,062 ఇది చాలా కష్టమైన పని... 328 00:40:39,062 --> 00:40:41,064 పెడ్రో! పెడ్రో డామ్! 329 00:42:23,625 --> 00:42:27,671 పోలీసులతో కాల్పులలో పెడ్రో డామ్ మరణించాడు 330 00:42:52,737 --> 00:42:55,073 రోడ్రిగో డి ఫ్రీటాస్ లగూన్‌లో విలాసవంతమైన భవనం 331 00:42:55,198 --> 00:42:57,951 పెడ్రో డోమ్ అని కూడా పిలువబడే పెడ్రో లోంబా నెటో కోసం 332 00:42:57,951 --> 00:42:59,911 అన్వేషణ ముగింపును సూచిస్తుంది. 333 00:42:59,911 --> 00:43:01,788 అరెస్టును ప్రతిఘటించి, 334 00:43:01,788 --> 00:43:04,916 దాక్కోవడానికి ప్రయత్నిస్తూ చెత్తకుప్ప దగ్గర చంపబడ్డాడు. 335 00:43:04,916 --> 00:43:08,628 తెల్లవారుజామున పెడ్రో డామ్ ఆ ప్రాంతంలో ఉంటాడని ఫోన్ ట్యాప్ ద్వారా 336 00:43:08,628 --> 00:43:11,131 గుర్తించి పోలీసులు హద్దులు ఏర్పాటు చేశారు. 337 00:43:11,131 --> 00:43:15,885 పెడ్రో డామ్ విసిరిన గ్రెనేడ్ నుండి ముగ్గురు అధికారులు గాయపడ్డారు... 338 00:45:07,414 --> 00:45:10,708 నా కొడుకు ఛాతీలో ఒక రంధ్రం. 339 00:45:11,835 --> 00:45:15,130 {\an8}అతన్ని చంపిన బులెట్ ఇక్కడ షూట్ చేయబడింది. 340 00:45:15,380 --> 00:45:16,714 {\an8}విక్టర్ లోంబా పెడ్రో డామ్ తండ్రి 341 00:45:16,714 --> 00:45:18,550 {\an8}నా దగ్గర నివేదిక ఉంది. 342 00:45:19,509 --> 00:45:21,761 {\an8}ఇక్కడ లోపలికి వెళ్లి అక్కడ బయటకి వచ్చింది. 343 00:45:21,761 --> 00:45:24,055 {\an8}అంటే అతను తన మోకాళ్ళ మీద ఉన్నాడు. 344 00:45:24,055 --> 00:45:27,100 {\an8}బులెట్ పై నుంచి కిందకి షూట్ చేయబడింది, 345 00:45:27,100 --> 00:45:28,268 అతని వీపులోకి. 346 00:45:31,646 --> 00:45:34,232 విక్టర్ లోంబా ఏళ్ల తరబడి పోరాడాడు 347 00:45:34,232 --> 00:45:39,362 ఈ కథ చెప్పబడడానికి. 348 00:45:49,247 --> 00:45:51,124 కొడుకుని పోగొట్టుకోవడం కన్నా 349 00:45:52,625 --> 00:45:54,586 పెద్ద బాధ మరొకటి ఉండదు. 350 00:46:06,431 --> 00:46:09,142 ఆయన 2018లో ఈ సీరీస్ రాస్తున్నప్పుడు 351 00:46:09,142 --> 00:46:15,190 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించాడు. 352 00:46:16,566 --> 00:46:22,238 డ్రగ్స్ తీసుకోకుండా ఉండటానికి ఇది ప్రజలకు సహాయపడుతుందో, 353 00:46:22,238 --> 00:46:27,035 లేదా ప్రభుత్వాలు తమ హాస్యాస్పద విధానాలను మార్చుకోవాలేమో నాకు తెలియదు. 354 00:46:27,035 --> 00:46:29,579 లేదు, ఇది పని చేస్తుందని నేను అనుకోను. 355 00:46:29,579 --> 00:46:32,832 కానీ డ్రగ్స్ వల్ల తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల 356 00:46:32,832 --> 00:46:34,834 హృదయాలను తేలికపరుస్తుంది. 357 00:46:36,503 --> 00:46:37,545 నాలాంటి వాళ్లు. 358 00:47:53,746 --> 00:47:56,291 పెడ్రో డామ్ 2005లో మరణించాడు 359 00:47:56,291 --> 00:48:00,086 23 ఏళ్ళ వయసులో. 360 00:49:49,612 --> 00:49:51,614 సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి 361 00:49:51,614 --> 00:49:53,700 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ