1 00:00:09,762 --> 00:00:12,723 నేను సాయం చేస్తానని చెప్పాను కదా, అయినా నువ్వు పారిపోయావు. 2 00:00:13,849 --> 00:00:15,434 ఇప్పుడు చూడు, ఎక్కడ ఉన్నావో. 3 00:00:16,643 --> 00:00:18,270 నేను ఏ తప్పూ చేయలేదు. 4 00:00:19,229 --> 00:00:21,648 నీతో మాట్లాడటానికికూడా అనుమతించలేదు తెలుసా. 5 00:00:24,443 --> 00:00:26,153 నన్ను ఇక్కడనుంచి తీసుకెళ్ళండి. 6 00:00:27,279 --> 00:00:31,366 ప్లీజ్. నేను గేబ్రియెల్కు కనబడని ప్రతి క్షణమూ... 7 00:00:31,450 --> 00:00:34,036 అతను ఇంకా కొంతసేపు వేచి చూస్తాడు. 8 00:00:37,915 --> 00:00:39,416 మీకు నానుంచి ఏమి కావాలి? 9 00:00:41,084 --> 00:00:42,252 నిజం. 10 00:00:43,337 --> 00:00:46,507 నాకు కేవలం నిజం చెప్పు. 11 00:00:55,307 --> 00:00:58,310 ఇక్కడకు రావటంతో ఎట్టకేలకు స్వేఛ్ఛ వచ్చిందని అనుకున్నాను. 12 00:00:59,061 --> 00:01:01,480 కొద్ది రోజులు మీ అతిథులగదిలో ఉండిపోయాను, 13 00:01:01,563 --> 00:01:03,232 ఇప్పుడు మళ్ళీ బందీగా ఉన్నాను. 14 00:01:04,650 --> 00:01:07,277 -నిన్ను ఎవరు ఖైదులో పెట్టారు? -మీకు అర్థం కాదు. 15 00:01:07,361 --> 00:01:10,948 సరే, నన్ను ప్రయత్నించనివ్వొచ్చు కదా? 16 00:01:14,535 --> 00:01:16,203 వాళ్ళు అంతా నియంత్రిస్తారు. 17 00:01:20,707 --> 00:01:22,000 మేము తినేదానిని. 18 00:01:23,293 --> 00:01:24,670 మేము నిద్రపోయేదానిని. 19 00:01:26,255 --> 00:01:27,464 మేము ఆలోచించేదానిని. 20 00:01:30,843 --> 00:01:34,888 ఎక్కడో దూరంగా ఒక చోట మమ్మల్ని అందరికీ దూరంగా ఉంచారు. 21 00:01:36,014 --> 00:01:38,517 ఇది, ఆ రహస్యాన్ని కాపాడటానికి వారి పద్ధతి. 22 00:01:39,434 --> 00:01:40,727 ఏ రహస్యం? 23 00:01:43,564 --> 00:01:46,483 మీ దగ్గర మీ షెడ్డులో ఉన్నదే. 24 00:01:48,151 --> 00:01:50,487 అన్నట్లు, అవి చాలా ఉన్నాయి. 25 00:01:50,571 --> 00:01:51,697 చాలా ఉన్నాయి. 26 00:01:55,242 --> 00:01:56,451 వాటిని ఎవరు కట్టారు? 27 00:01:57,786 --> 00:01:58,912 నాకు సరిగ్గా తెలియదు. 28 00:02:01,331 --> 00:02:02,916 కానీ అవి చాలా పాతవి. 29 00:02:03,625 --> 00:02:05,002 మరి ఆ గ్రహం? 30 00:02:10,507 --> 00:02:12,301 మీరు దానిని చూశారు. 31 00:02:12,384 --> 00:02:13,886 అది కేవలం ఒక పాడుబడ్డ నేల. 32 00:02:15,220 --> 00:02:16,847 అక్కడ అన్నీ చచ్చిపోతాయి. 33 00:02:21,059 --> 00:02:25,564 సరే, అది అంతే అయిఉండదు. దాని వెనక ఇంకా ఏదో ఉండి ఉంటుంది. 34 00:02:29,192 --> 00:02:30,777 చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు. 35 00:02:34,364 --> 00:02:37,159 ఆ వస్తువులు, అవి కేవలం ఆ గ్రహానికి వెళ్ళవు. 36 00:02:38,327 --> 00:02:41,872 అవన్నీ ద్వారాల నెట్వర్క్లో లాగా ఒకదానికొకటి కలిసిపోతాయి. 37 00:02:42,873 --> 00:02:45,876 నేను అలాగే ఇక్కడకు వచ్చాను. గేబ్రియెల్ అలాగే వచ్చాడు. 38 00:02:47,961 --> 00:02:49,880 ద్వారాల గుండానా? 39 00:02:50,923 --> 00:02:52,466 నేను అతనిని వెతకాలి. 40 00:02:52,549 --> 00:02:54,760 నాకు అతను కనబడితే, నాకు ఓ అవకాశం ఉంటుంది. 41 00:02:56,386 --> 00:02:57,763 కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. 42 00:02:58,430 --> 00:02:59,514 లేకపోతే, 43 00:03:00,891 --> 00:03:02,768 వాళ్ళు మనుషులను పంపుతారు. 44 00:03:02,851 --> 00:03:04,686 ప్రమాదకర మనుషులను. 45 00:03:06,480 --> 00:03:08,398 ఆ రక్తం ఎక్కడనుంచి వచ్చింది? 46 00:03:12,653 --> 00:03:14,863 నేను పారిపోతున్నపుడు, ఎవరో నన్ను చూశారు. 47 00:03:18,825 --> 00:03:20,243 అతను నన్ను ఆపాలని చూశాడు. 48 00:03:24,122 --> 00:03:25,582 నాకు వేరే అవకాశం లేదు. 49 00:03:26,917 --> 00:03:28,210 అతను నన్ను... 50 00:03:31,755 --> 00:03:33,799 వాళ్ళకు నేను కనబడితే, నన్ను చంపేస్తారు. 51 00:03:46,853 --> 00:03:50,732 నైట్ స్కై 52 00:03:55,862 --> 00:03:57,698 మీరు రేపు రావాలి. 53 00:03:57,781 --> 00:04:01,076 మీ వయస్సువాళ్ళు ఇంత రాత్రిపూట రావటం మంచిదికాదు. 54 00:04:01,159 --> 00:04:02,369 సరే... 55 00:04:02,452 --> 00:04:06,123 సరే, ఇప్పుడు ఈ విషయంలో నన్ను ఆలోచించుకోనివ్వు, ప్లీజ్. 56 00:04:06,206 --> 00:04:08,125 ఇది కాస్త అత్యవసరం. 57 00:04:09,209 --> 00:04:13,255 చూడు, అతను కుర్రాడు, బాగా ఎక్కువగా తాగాడు. 58 00:04:13,338 --> 00:04:15,257 ఈసారికి అతనిని వదిలేయొచ్చు కదా? 59 00:04:15,340 --> 00:04:17,676 తాగి బహిరంగంగా తిరుగుతున్నందుకు ఆపాము. 60 00:04:17,759 --> 00:04:20,012 పారిపోవాలని చూసినందుకు అరెస్ట్ చేశాము. 61 00:04:20,095 --> 00:04:23,807 -అతను ఈ పట్టణానికి కొత్త, భయపడ్డాడు. -అతని వద్ద గుర్తింపుకార్డ్ లేదు. 62 00:04:23,890 --> 00:04:27,102 అతను తన పూర్తిపేరు, పుట్టినతేదీ చెప్పటానికి నిరాకరించాడు. 63 00:04:29,354 --> 00:04:30,856 నొవాట్నీ. 64 00:04:31,523 --> 00:04:33,442 నువ్వు ఎరిక్కు ఏమైనా బంధువా? 65 00:04:34,401 --> 00:04:36,069 అవును, ఆయన మా నాన్న. 66 00:04:36,153 --> 00:04:37,195 అవునా? 67 00:04:37,279 --> 00:04:40,824 ఫార్న్స్వర్త్ హైస్కూల్లో నేను అతనికి టీచర్ను. 68 00:04:41,616 --> 00:04:46,079 అతనూ శాంతిభద్రతల విభాగంలోనే పనిచేశాడు కదా? 69 00:04:46,163 --> 00:04:48,331 30 ఏళ్ళ తర్వాత ఆయన ఈమధ్యే రిటైర్ అయ్యారు. 70 00:04:49,041 --> 00:04:49,916 సరే... 71 00:04:50,000 --> 00:04:54,504 అతను అకాడమీకి దరఖాస్తు చేసినప్పుడు అతని వ్యాసం రాయటానికి నేను సాయంచేశాను. 72 00:04:54,588 --> 00:04:58,133 ఇప్పుడు నువ్వు చూడు, అతని బాటలోనే వెళుతున్నావు. 73 00:04:58,216 --> 00:05:00,802 అతను నిన్నుచూసి గర్వపడుతుండొచ్చు. 74 00:05:00,886 --> 00:05:02,471 అతనికి గొప్పలు చెప్పటం ఇష్టం. 75 00:05:03,805 --> 00:05:07,142 నాకు తెలుసు, మీ నాన్న వ్యక్తిత్వం మంచిది, 76 00:05:07,934 --> 00:05:09,436 చివరికి హైస్కూల్లో కూడా. 77 00:05:10,604 --> 00:05:14,024 నువ్వు లాకప్లో పెట్టిన ఆ కుర్రాడిలాగానే. 78 00:05:15,150 --> 00:05:17,069 అతను మంచివాడు. 79 00:05:18,111 --> 00:05:22,783 అదే కాకుండా, ఒక ముసలి జంటకు వాళ్ళ సంరక్షకుడిని దూరంచేస్తావా? 80 00:05:23,950 --> 00:05:26,745 అతని జరిమానాను ఇప్పుడే కట్టేస్తాను. 81 00:05:29,998 --> 00:05:31,875 మీరు ఒక గట్టి టీచర్ అయిఉంటారు. 82 00:05:36,254 --> 00:05:37,881 నేను ఏమి చేయాలో చెప్పు. 83 00:05:38,381 --> 00:05:44,346 పోలిస్ 84 00:05:50,560 --> 00:05:52,479 ఎప్పుడైనా ఎమర్సన్ పుస్తకాలు చదివావా? 85 00:05:53,271 --> 00:05:54,773 లేదు. ఆయన ఎవరు? 86 00:05:54,856 --> 00:05:56,566 రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. 87 00:05:57,275 --> 00:06:01,113 అతని వ్యాసం "నష్టపరిహారం"ను నేను బోధించేదానిని. 88 00:06:01,947 --> 00:06:05,450 అది ఈ విశ్వంలోని సమతుల్యం చేసే శక్తుల గురించి. 89 00:06:06,326 --> 00:06:09,746 భౌతికశాస్త్రంలోనిదికాదు, కానీ... 90 00:06:11,706 --> 00:06:13,250 ఆత్మలోనిది. 91 00:06:16,128 --> 00:06:21,091 "సమతుల్యం చేసే ఒక పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది," అని అతను అంటాడు. 92 00:06:25,512 --> 00:06:31,184 మైకెల్ చనిపోయినప్పుడు, నేను తీవ్రమైన బాధను అనుభవించాను. 93 00:06:34,771 --> 00:06:37,440 పెరట్లో మాకు కనబడినది... 94 00:06:39,401 --> 00:06:43,363 మాకు "సమతుల్యంచేసే పరిస్థితి" అని అనుకున్నాము. 95 00:06:50,287 --> 00:06:54,291 కానీ అది ఒకేఒక్కటి ఏమీ కాదు. 96 00:06:55,625 --> 00:06:57,377 కానీ మీది ఒకే ఒక్కటి. 97 00:06:58,962 --> 00:07:00,797 నువ్వు చెప్పాల్సిన అవసరంలేదు. 98 00:07:00,881 --> 00:07:02,174 కాదు, నిజంగానే అంటున్నాను. 99 00:07:05,719 --> 00:07:09,389 మా నాన్నను మీ పెరట్లోకి ఏదో తీసుకొచ్చింది. 100 00:07:12,058 --> 00:07:13,643 అదే నన్ను మీదగ్గరకు చేర్చింది. 101 00:07:19,191 --> 00:07:20,817 అది అలా జరగాల్సిఉంది. 102 00:07:24,112 --> 00:07:27,282 సరే, అలా అయితే, 103 00:07:28,241 --> 00:07:30,577 నువ్వు మళ్ళీ పారిపోకుండా ఉంటావా? 104 00:07:37,042 --> 00:07:38,627 నేను పారిపోలేదు. 105 00:07:45,508 --> 00:07:46,801 షాండ్ర దానిని తీసుకుంది. 106 00:07:47,636 --> 00:07:48,929 ఆమె తీసుకుందని తెలుసు. 107 00:07:49,554 --> 00:07:51,348 ఏం చేద్దామని అనుకున్నావు? 108 00:07:53,099 --> 00:07:56,519 అర్థరాత్రి ఆమె తలుపుకొట్టి దానిని తిరిగి ఇవ్వమని అడుగుదామనా? 109 00:08:00,774 --> 00:08:04,986 హమ్మయ్య. ఆయన తన సోడియమ్ను గమనిస్తూ ఉండాలి. 110 00:08:07,030 --> 00:08:10,283 పోన్లే, మనం ఎక్కడికి వెళ్ళామో చెప్పనక్కరలేకుండా పోయింది. 111 00:08:12,994 --> 00:08:14,704 నేను ఆయనను పైకి తీసుకెళ్ళనా? 112 00:08:14,788 --> 00:08:18,583 వద్దు, నిద్రపోనివ్వు. ఆయన విపరీతంగా తాగేశాడు. పద. 113 00:08:38,728 --> 00:08:40,563 నాకు రేపు ఉదయం ధన్యవాదాలు చెప్పు. 114 00:08:44,526 --> 00:08:46,069 నేను దానిని వెనక్కు తేవాలి. 115 00:08:48,196 --> 00:08:49,364 రేపు. 116 00:08:49,447 --> 00:08:52,075 మనం రేపు తెద్దాం. ఒట్టు. 117 00:09:25,608 --> 00:09:27,569 -గుడ్ నైట్. -గుడ నైట్. 118 00:09:39,748 --> 00:09:41,583 ఇది ఒక పెద్ద బాధ్యత. 119 00:09:41,666 --> 00:09:44,127 -ఈమె కాదని అంటుంది. కానీ అది పెద్దదే. -మైకెల్. 120 00:09:44,210 --> 00:09:46,629 నువ్వు దానికి అర్హురాలవి, లెస్లీ. 121 00:09:46,713 --> 00:09:48,089 ధన్యవాదాలు. 122 00:09:48,173 --> 00:09:52,177 ప్రయాణాలకు అలవాటు పడాలి, అయితే ఈ కంపెనీ మంచిది. 123 00:09:52,260 --> 00:09:55,472 క్యాన్సర్ మందును అందరు రిప్రజంటేటివ్లకు మొదట్లోనే ఇవ్వరు. 124 00:09:55,555 --> 00:09:57,015 అది గొప్ప విషయమేకదా. 125 00:09:57,098 --> 00:10:00,518 ఈమధ్య చాలామంది కంపెనీని వదిలి వెళ్ళిపోతున్నారు కాబట్టే. 126 00:10:00,602 --> 00:10:03,146 -నాకు కలిసొచ్చింది, అంతే. -సరేలే. 127 00:10:03,229 --> 00:10:04,105 ఇది ఎంజాయ్ చేయి. 128 00:10:04,189 --> 00:10:08,234 నీ శ్రమ, లైబ్రరీలో అర్థరాత్రిదాకా ఉండటం. వాటి అన్నింటి ఫలితం ఇది. 129 00:10:08,318 --> 00:10:10,904 అర్థరాత్రుళ్ళు ఉండకపోతే మనం కలిసేవాళ్ళం కాదు. 130 00:10:10,987 --> 00:10:14,491 అదే నేను చెబుతోంది. నువ్వు చాలా కష్టాలు పడ్డావు. 131 00:10:14,574 --> 00:10:15,992 అలా జోకులు వేయకు. 132 00:10:17,535 --> 00:10:18,995 నాకు నీపట్ల గర్వంగా ఉంది. 133 00:10:20,205 --> 00:10:23,083 ఫొటోగ్రఫీ క్లాస్ గురించి మైకెల్ మీకు చెప్పాడు? 134 00:10:23,166 --> 00:10:26,961 ఒక ప్రొఫెసర్ ఈయన ఫొటోలు చూసి ఒక క్లాస్ను ఆడిట్ చేయటానికి పిలిచాడు. 135 00:10:27,045 --> 00:10:30,507 కేవలం పక్షులు. అవి అంత బాగోలేవు. నేను తీరిక ఉన్నప్పుడు తీశాను. 136 00:10:30,590 --> 00:10:31,966 నాకు బాగా నచ్చాయి. 137 00:10:32,884 --> 00:10:34,302 అవి అందరికీ నచ్చుతాయి. 138 00:10:34,928 --> 00:10:36,429 పక్షులు అందరికీ నచ్చుతాయి. 139 00:10:37,847 --> 00:10:38,973 అయినా ధన్యవాదాలు. 140 00:10:40,517 --> 00:10:42,102 వాళ్ళు మనలాగా ఉన్నారుకదూ? 141 00:10:42,894 --> 00:10:44,145 కొద్దిగా. 142 00:10:46,064 --> 00:10:47,482 మనం వాళ్ళకు చెబుదామా? 143 00:10:51,903 --> 00:10:54,239 అమ్మా, నాన్నా... 144 00:10:56,199 --> 00:10:57,492 మా నిశ్చితార్థం అయింది. 145 00:10:58,952 --> 00:11:01,037 ఇది అద్భుతమైన వార్త! 146 00:11:01,121 --> 00:11:02,455 ఇదిగో, అభినందనలు! 147 00:11:03,248 --> 00:11:04,124 ధన్యవాదాలు. 148 00:11:05,125 --> 00:11:07,168 మీ ఇద్దరినీ చూస్తే నాకు సంతోషంగా ఉంది. 149 00:11:07,252 --> 00:11:08,753 ధన్యవాదాలు. 150 00:11:08,837 --> 00:11:11,464 మీకు ఇంకో మంచి వార్త ఉంది. 151 00:11:13,716 --> 00:11:15,260 మేం విడిగా ఉండబోతున్నాం. 152 00:11:15,343 --> 00:11:19,347 మీకు బరువు తగ్గిస్తున్నాము. మీరు మీ అతిథుల గదిని మళ్ళీ వాడుకోవచ్చు. 153 00:11:20,181 --> 00:11:21,808 షికాగోకు వెళుతున్నారా? 154 00:11:22,517 --> 00:11:23,518 అవును. 155 00:11:24,936 --> 00:11:27,063 కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నాము. 156 00:11:28,064 --> 00:11:29,107 కలిసి. 157 00:11:55,300 --> 00:12:01,306 మేపుల్ సరస్సు నేచర్ ట్రయల్ అండ్ పార్క్ 158 00:12:52,982 --> 00:12:54,901 ఇది క్వాంటమ్ సమస్య. 159 00:12:54,984 --> 00:12:56,486 ఇది నేను ఊహిస్తున్న సిద్ధాంతం. 160 00:12:56,569 --> 00:12:59,739 ఏది ఏమైనా, నన్ను నమ్మండి, నేను దీనిపై చాలా చదివాను. 161 00:13:01,449 --> 00:13:06,788 దీనిని "దూరాన జరిగే దీనిని "దూరాన జరిగేని ఐన్స్టీన్ అన్నాడు. 162 00:13:07,830 --> 00:13:11,918 టెలీపోర్టేషన్ సాధ్యమని అతను నమ్మలేదు, కానీ... 163 00:13:13,044 --> 00:13:14,796 "మానవాతీత పరిణామం"? ఇతను ఏమంటున్నాడు? 164 00:13:14,879 --> 00:13:16,339 అది కేవలం సిద్ధాంతాలు. 165 00:13:17,131 --> 00:13:18,967 అది నిజానికి ఒక సిద్ధాంతం కాదు. 166 00:13:19,050 --> 00:13:23,054 నేను ఆన్లైన్లో స్పానిష్ నేర్చుకుంటున్నాను. నా వెనక మాట్లాడవద్దు. 167 00:13:23,137 --> 00:13:24,681 -సరే. -సరే? 168 00:13:26,975 --> 00:13:29,227 కానీ అది ఎలా పనిచేస్తుంది? 169 00:13:29,310 --> 00:13:30,562 రేణువులు. 170 00:13:30,645 --> 00:13:33,815 సుదూర ప్రాంతాల నుంచి అదృశ్యంగా కలిసి ఉంటాయి. 171 00:13:33,898 --> 00:13:37,110 అవి కలిసి ఉండవు, కానీ వాటి మధ్య బంధం ఉంటుంది. 172 00:13:37,193 --> 00:13:38,069 మనలాగా. 173 00:13:38,152 --> 00:13:42,740 నాకు తెలుసు, ఇది అసాధ్యం అనిపిస్తుందని, కానీ ఇది కొంతకాలానికి జరుగుతుంది. 174 00:13:42,824 --> 00:13:43,741 ఇది ఆలోచించు. 175 00:13:43,825 --> 00:13:48,830 ఉదాహరణకు, ఇకనుంచి రికార్డులు, టేపులు, సీడీలు ఉండవనుకో. 176 00:13:48,913 --> 00:13:54,586 రికార్డ్ అయిన ప్రతిపాటా గాలిలో తేలుతూ ఉంటుంది. 177 00:13:55,169 --> 00:13:59,591 చిన్న రేణువులతో కూడిన ఒక అదృశ్య మేఘం 178 00:13:59,674 --> 00:14:03,011 మనం ఎక్కడకు వెళ్ళినా వెంబడిస్తోంది. 179 00:14:03,094 --> 00:14:05,013 నేను 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, 180 00:14:05,096 --> 00:14:08,516 వాక్మ్యాన్ నాటీ బై నేచర్ పాట వింటుండగా నువ్వు ఇది చెప్పి ఉంటే, 181 00:14:08,600 --> 00:14:13,021 మత్తు నుంచి బయటకు రమ్మని నేను చెప్పి ఉండే వాడిని. కానీ ఇది పురోగతి. 182 00:14:14,272 --> 00:14:16,608 పురోగతి అంటే ఇదే. అది... 183 00:14:16,691 --> 00:14:18,443 అదే ఇక్కడ సూత్రం, ఏది ఏమైనా. 184 00:14:20,028 --> 00:14:22,363 దీనిని ఎవరు రూపొందించారు? ఈ పురోగతిని? 185 00:14:22,447 --> 00:14:24,282 ఎవరు? లేదా ఏమిటి? 186 00:14:25,450 --> 00:14:27,577 అదే వేల-కోట్ల ప్రశ్న. 187 00:14:27,660 --> 00:14:28,828 దానికి అర్థం ఏమిటి? 188 00:14:28,911 --> 00:14:31,664 కొత్త అన్వేషణలు అన్నీ ఎక్కడ జరుగుతాయో నీకు తెలుసా? 189 00:14:31,748 --> 00:14:33,541 ఖచ్చితంగా ఈ భూమిపైన కాదు. 190 00:14:34,500 --> 00:14:37,337 సరే. విషయం ఏమిటంటే, ఇది పనిచేస్తుంది. 191 00:14:38,212 --> 00:14:39,839 ఇంకా ఇది భగవంతుడి ప్రసాదం. 192 00:14:40,465 --> 00:14:41,799 ఇక చాలు. 193 00:14:44,886 --> 00:14:46,220 ఇదిగో సెల్ టవర్. 194 00:14:47,055 --> 00:14:49,515 అబ్బా. అది చాలా ఎత్తుగాఉంది. 195 00:14:50,808 --> 00:14:52,894 నిజంగా ఇది పనిచేస్తుందని అనుకున్నావా? 196 00:14:52,977 --> 00:14:54,395 ఇది గ్రిడ్పైన కనబడుతుంది. 197 00:14:54,479 --> 00:14:55,563 ఏది కనబడుతుంది? 198 00:14:57,106 --> 00:14:58,358 మీరు ఏమి చేస్తున్నారు? 199 00:14:59,192 --> 00:15:02,278 ప్యాకేజ్ ఎక్కడుందో తెలుసుకోవటంకోసం... 200 00:15:03,029 --> 00:15:03,988 పరీక్షలు చేయాలి. 201 00:15:04,489 --> 00:15:05,698 ప్యాకేజ్ ఏంటి? 202 00:15:06,407 --> 00:15:09,160 ఎపి తాతయ్య స్నేహితుడి కోసం మనం తీసుకెళ్ళవలసినది. 203 00:15:16,959 --> 00:15:19,587 నువ్వు ఇది ఇంతకుముందు చేశావని అనుకుంటున్నాను. 204 00:15:19,671 --> 00:15:22,507 చేశాను, చాలాసార్లు... నా తలలో. 205 00:15:24,467 --> 00:15:25,843 అంతా బాగా జరగాలని అనుకుంటావా? 206 00:15:27,095 --> 00:15:28,179 గుడ్ లక్. 207 00:15:36,270 --> 00:15:37,563 నీకు అతనంటే ద్వేషమా? 208 00:15:37,647 --> 00:15:38,940 నిక్ అంటేనా? లేదే. 209 00:15:39,023 --> 00:15:40,566 వ్యక్తిగత ఆస్తి అతిక్రమించరాదు 210 00:15:40,650 --> 00:15:41,818 అబద్ధం చెప్పొద్దు. 211 00:15:41,901 --> 00:15:43,861 నాకు అతనిపై ద్వేషం లేదు. అది కేవలం... 212 00:15:43,945 --> 00:15:45,988 నిక్ ఒక తింగరోడు, సరేనా? 213 00:15:47,365 --> 00:15:49,492 అతను పనులు సరిగ్గా చేయడు. 214 00:15:50,702 --> 00:15:52,036 ఏదో ఒక గందరగోళం చేస్తాడు. 215 00:15:52,120 --> 00:15:54,789 దానిని వేరేవాళ్ళు 216 00:15:54,872 --> 00:15:57,917 సరిచేయాల్సి వస్తుంది. 217 00:15:58,000 --> 00:15:59,377 నువ్వు చెప్పేది దేనిగురించి? 218 00:15:59,460 --> 00:16:01,045 ఏమీలేదు, బంగారం. 219 00:16:02,130 --> 00:16:04,882 ఈ ప్రయాణం సరదాగా ఉంటుందని అనుకున్నాను. నాదే తప్పు. 220 00:16:05,800 --> 00:16:07,885 అమెరికా చూడాలని ఎప్పుడూ అనుకునేదానివి కదా. 221 00:16:07,969 --> 00:16:08,803 ఇదిగో మనం ఇక్కడ ఉన్నాం... 222 00:16:09,429 --> 00:16:11,681 ఏ అమెరికా? 223 00:16:11,764 --> 00:16:14,809 నాకు కనిపించనదల్లా నిక్ ట్రైలర్ ఒక్కటే 224 00:16:14,892 --> 00:16:16,352 ఇంకా కొన్ని హైవే రోడ్లు. 225 00:16:17,103 --> 00:16:18,646 నువ్వు ఆ హాట్ డాగ్ మర్చిపోయావు. 226 00:16:18,730 --> 00:16:21,691 అది చెత్తలాగా ఉంది. 227 00:16:22,442 --> 00:16:24,068 అసహ్యంగా ఉంది. 228 00:16:25,945 --> 00:16:26,988 బాగుంది. 229 00:16:27,071 --> 00:16:28,823 నువ్వు ఏమి చేస్తున్నావు? వద్దు! 230 00:16:28,906 --> 00:16:30,825 ఆ ఆలోచనకూడా మంచిది కాదు టోనీ! 231 00:16:30,908 --> 00:16:32,201 ఇన్స్టాగ్రామ్ కోసం. 232 00:16:32,285 --> 00:16:33,578 దానిని పోస్ట్ చేయొద్దు. 233 00:16:34,537 --> 00:16:37,331 మీరు ఏమి చేయబోతున్నారు? నన్ను నా గదికి టెలీపోర్ట్ ద్వారా పంపిస్తారా? 234 00:16:40,585 --> 00:16:41,919 అబ్బా. 235 00:16:42,003 --> 00:16:43,463 ఏమిటి? 236 00:17:02,565 --> 00:17:04,442 ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు. 237 00:17:04,942 --> 00:17:06,402 నీ పాటలు వింటూ ఉండు. 238 00:17:10,198 --> 00:17:11,365 హేయ్, ఇక్కడ. 239 00:17:12,408 --> 00:17:13,910 కెవిన్, కదా? 240 00:17:14,619 --> 00:17:16,496 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేడమ్? 241 00:17:16,579 --> 00:17:19,207 మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు. ఇది ఒక నిషేధిత స్థలం. 242 00:17:19,290 --> 00:17:21,751 అవునా? నాకు తెలియదు. 243 00:17:21,834 --> 00:17:24,796 సారీ. ఇక్కడ ఎటువంటి బోర్డూ లేదు. 244 00:17:24,879 --> 00:17:27,298 మీరు ఫోన్ కంపెనీలో పనిచేస్తారా? 245 00:17:27,381 --> 00:17:29,884 నేను ఫోన్ కంపెనీలో పనిచేస్తాను. మీరు ఎవరు? 246 00:17:35,807 --> 00:17:36,849 అతను ఏమి... 247 00:17:56,577 --> 00:17:59,455 -అబ్బా! నువ్వు బాగానే ఉన్నావా? -బాగున్నాను. త్వరగా! 248 00:18:18,140 --> 00:18:19,559 అది పని చేసిందా? 249 00:18:20,768 --> 00:18:23,479 తర్వాత ఇలినాయిస్లో ఆగుదాం. 250 00:18:42,498 --> 00:18:44,584 రెడీయేనా? నాకు ఆలస్యం ఇష్టంలేదు. 251 00:18:46,002 --> 00:18:48,045 రెడీ. నాకు ఒక సెకను టైమ్ ఇవ్వు. 252 00:18:49,213 --> 00:18:50,923 ఏంటి, ఆ కాఫీ పనిచేయటంలేదా? 253 00:18:52,592 --> 00:18:54,385 సరే, నువ్వు ఏది అనాలనుకుంటే అది అను. 254 00:18:55,344 --> 00:18:57,805 "పూల్ హాలుకు వెళ్ళాను. కొన్ని బీర్లు తాగాను." 255 00:18:58,431 --> 00:19:00,182 మొత్తం పీపా తాగలేదు. 256 00:19:00,892 --> 00:19:03,060 ర్యాండీ నీ కారును తెచ్చిఇస్తూ చెప్పాడు, 257 00:19:03,144 --> 00:19:06,480 నిన్నరాత్రి నువ్వు బైరన్తో బాతాఖానీ వేశావని. 258 00:19:06,564 --> 00:19:08,065 మీరు ఇద్దరూ బాగా తాగి ఉంటారు. 259 00:19:10,318 --> 00:19:11,819 నేను కారులో ఉంటాను. 260 00:19:20,077 --> 00:19:21,329 సరే, 261 00:19:21,412 --> 00:19:23,497 -నేను ఇది ఊహించలేదు. -ఏమిటి? 262 00:19:24,123 --> 00:19:26,250 ఐరీన్, మీరు మూడు పౌండ్లు బరువు పెరిగారు. 263 00:19:28,878 --> 00:19:30,796 ఇంకా అది మంచి బరువు. 264 00:19:30,880 --> 00:19:32,632 నేను కాళ్ళ వ్యాయామం చేస్తున్నాను. 265 00:19:32,715 --> 00:19:34,967 మీ రక్తపోటుకూడా తగ్గింది. 266 00:19:35,051 --> 00:19:37,386 మీ ముఖంలో మళ్ళీ రంగు వస్తోంది. 267 00:19:37,929 --> 00:19:39,305 మీకు మెరుగ్గా అనిపిస్తోందా? 268 00:19:39,847 --> 00:19:40,848 అవును. 269 00:19:42,183 --> 00:19:44,852 ఇంకా... మీరు చెప్పింది నిజమే, శాండ్రా. 270 00:19:44,936 --> 00:19:47,939 ఇక మీరు వీల్ ఛైర్ వాడటం ఆపేయొచ్చు. 271 00:19:49,815 --> 00:19:52,568 ఈమె ఎక్కువగా చేస్తుందేమోనని నేను కంగారుపడ్డాను. 272 00:19:52,652 --> 00:19:56,656 మన సమస్య తీరిపోయిందని నేను చెప్పటంలేదు, కానీ మెరుగ్గా ఉంది. 273 00:19:56,739 --> 00:20:00,576 మీరు చేస్తున్న దానిని కొనసాగించండి మళ్ళీ రెండువారాల తర్వాత చూద్దాం. 274 00:20:09,502 --> 00:20:11,963 డాక్టర్ మరీస్ చెప్పినది సరిగ్గా విన్నావా? 275 00:20:13,339 --> 00:20:15,591 నువ్వు లేకుండా ఇది చేయగలిగేదానిని కాదు. 276 00:20:15,675 --> 00:20:20,012 నీకు వచ్చిన కొత్త ఉత్సాహం వలనే ఇదంతా, నాదేమీ లేదు. 277 00:20:20,096 --> 00:20:24,183 అయితే, జూడ్ నాకు సాయం చేస్తున్నాడని నీకు కోపంగా ఉందా? 278 00:20:24,266 --> 00:20:28,229 కోపంగా లేదు. నీ భద్రత గురించే నా ఆలోచన. 279 00:20:29,063 --> 00:20:31,649 నిన్ను అతను చిటికెన వేలుతో ఆడిస్తున్నాడు. 280 00:20:45,454 --> 00:20:46,622 హలో? 281 00:20:48,040 --> 00:20:50,001 ఎవరైనా ఉన్నారా? ఇది నేను. 282 00:20:59,844 --> 00:21:00,970 హేయ్, డెనీస్. 283 00:21:01,053 --> 00:21:03,848 సారీ, ఇంట్లో ఎవరూ లేరని అనుకున్నాను. 284 00:21:05,433 --> 00:21:07,268 నువ్వు ఈ జాకెట్ బార్లో మర్చిపోయావు. 285 00:21:10,354 --> 00:21:12,064 మా తాతవాళ్ళు ఎక్కడ? 286 00:21:12,982 --> 00:21:14,483 డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. 287 00:21:17,153 --> 00:21:19,321 నువ్వు అలాంటి పనులకు వెళ్ళాలి కదా? 288 00:21:19,405 --> 00:21:20,489 అవును. 289 00:21:21,907 --> 00:21:25,077 నేను నిన్నరాత్రి బాగా అలిసిపోయాను. 290 00:21:25,161 --> 00:21:26,787 మామూలుగా నేను తాగను. 291 00:21:28,873 --> 00:21:31,542 సరే, ఫార్న్స్వర్త్ ఇలాంటి కరావోకేను 292 00:21:31,625 --> 00:21:34,462 ఇంతకుముందు ఎవరూ విని ఉండకపోవచ్చు. 293 00:21:34,962 --> 00:21:37,173 నువ్వు దీనిని వృత్తిగా చేసుకోవచ్చుకదా? 294 00:21:37,256 --> 00:21:39,091 జనానికి అది నచ్చుతుందని అనుకోను. 295 00:21:44,180 --> 00:21:45,723 హేయ్, ఇది నీ పుస్తకమా? 296 00:21:49,393 --> 00:21:51,353 ఇది మీ నాన్న. కదా? 297 00:21:51,437 --> 00:21:53,898 నీకు ఒక విచిత్రమైన విషయం తెలుసా? 298 00:21:53,981 --> 00:21:57,193 ఈ పుస్తకాన్ని తను కొన్నట్లు మా నానమ్మ నాకు చెప్పింది. 299 00:21:59,153 --> 00:22:01,238 ఇది వింతగా ఉంది. కదా? 300 00:22:02,156 --> 00:22:04,325 ఆమె తికమక పడిఉండొచ్చు. 301 00:22:04,408 --> 00:22:08,120 మీ నాన్న ఏమైనా సాక్షులను కాపాడటంలాంటి పనులు చేసేవారా? 302 00:22:10,664 --> 00:22:12,792 లేదు, మేము ఒక మఠంనుంచి తప్పించుకున్నాము. 303 00:22:15,294 --> 00:22:16,712 తమాషాగా ఉంది. 304 00:22:23,677 --> 00:22:27,139 నువ్వు పెద్దగా పాడుతున్నావు. డ్రమ్మర్ కంగారుపడుతున్నాడు. 305 00:22:27,223 --> 00:22:29,266 ఇది చూడు. కేటీ పోస్ట్ చేసింది. 306 00:22:32,144 --> 00:22:33,646 ఇది నేనేనా అనిపిస్తోంది. 307 00:22:34,647 --> 00:22:36,732 నువ్వు ఇక్కడ భావోద్వేగంతో పాడుతున్నావు. 308 00:22:36,816 --> 00:22:39,735 ఓ భగవాన్. ఆ డ్రమ్మర్ కూడా కంగారుపడ్డాడు. 309 00:22:40,277 --> 00:22:43,072 అయితే, వేరేవాళ్ళుకూడా దీనిని చూడొచ్చా? ఇది... 310 00:22:43,155 --> 00:22:44,990 -అవును. -మీ ఇద్దరూ ఇక్కడున్నారా? 311 00:22:46,117 --> 00:22:50,121 హాయ్. నేను... డాక్టర్ అపాయింట్మెంట్ ఎలా జరిగింది? 312 00:22:50,204 --> 00:22:51,622 బాగా జరిగింది. 313 00:22:51,705 --> 00:22:53,499 నేను బాగా మెరుగయ్యాను. 314 00:22:53,582 --> 00:22:54,583 అది మంచి విషయం. 315 00:22:55,835 --> 00:22:57,461 నేను మధ్యలో రాను. 316 00:22:57,545 --> 00:23:01,298 నువ్వు ఇవాళ ఇక్కడకు వస్తావని నేను ఊహించలేదు డెనీస్. 317 00:23:01,382 --> 00:23:04,802 అవును. ఫార్న్స్వర్త్లో మరికొన్నిరోజులు ఉందామని అనుకున్నాను. 318 00:23:04,885 --> 00:23:06,303 ఉన్నట్లుండి అనిపించింది. 319 00:23:06,804 --> 00:23:08,139 హేయ్, తాత ఎక్కడ? 320 00:23:34,957 --> 00:23:37,793 సరే. నన్ను ఏడిపించాలని వచ్చావా, అంతరిక్షవాసీ? 321 00:23:37,877 --> 00:23:39,879 నువ్వు ఒకటి చూస్తావా? నిజమైనది? 322 00:23:41,881 --> 00:23:44,258 ఇదిగో. ఈ ఫిల్మ్ డెవలప్ చేయించు. 323 00:23:45,968 --> 00:23:49,346 సరే. ఇవి అంతరిక్షం ఫోటోలా? 324 00:23:50,389 --> 00:23:54,059 గ్రహాంతరవాసితో సెల్ఫీలా? చూడండి, జోక్స్ చాలు. వదిలేయండి. 325 00:23:54,143 --> 00:23:58,772 ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాన్ని నీకు చెప్పినందుకు బహుశా నేను మూర్ఖుడినేనేమో, 326 00:23:58,856 --> 00:24:00,399 కానీ ఇది జోక్ కాదు. 327 00:24:04,862 --> 00:24:09,700 -వీటిని నువ్వు ఎందుకు డెవలప్ చేయించలేదు? -ఎందుకంటే ఐరీన్ వలన. 328 00:24:09,783 --> 00:24:14,038 నేను ఈ ఫోటోలు తీయటం ఆమె చూసింది, ఈ ఫిల్మ్ చెరిపేయాలని మాట తీసుకుంది. 329 00:24:14,121 --> 00:24:17,583 కానీ ఏదో ఒకరోజు పనికొస్తాయని అనుకున్నాను. ఆఖరి ప్రయత్నంగా. 330 00:24:25,049 --> 00:24:28,302 -మీరు మళ్ళీ నన్ను ఏడిపించాలని... -దానిని డెవలప్ చేయించు. 331 00:24:37,686 --> 00:24:38,646 హేయ్! 332 00:24:39,230 --> 00:24:42,441 నాకు మంచి సహాయకురాలు దొరికింది. 333 00:24:42,524 --> 00:24:45,194 టేబుల్ ఎలా తయారవుతుందో కూడా నీకు తెలియకపోయినా. 334 00:24:45,277 --> 00:24:47,571 నేను తప్పు వృత్తిని ఎంచుకున్నానేమో. 335 00:24:47,655 --> 00:24:49,782 నువ్వు ఇక్కడున్నావని నానమ్మ చెప్పింది... 336 00:24:49,865 --> 00:24:52,952 బైరన్లకు కొన్ని పనిముట్లు తిరిగి ఇవ్వటానికి వెళ్ళాను. 337 00:24:53,035 --> 00:24:54,912 -మీ పక్కింటతనా? -అవును. 338 00:24:54,995 --> 00:24:57,665 అవును, మేము ఈమధ్యే రాజీపడ్డాము. 339 00:24:59,667 --> 00:25:01,919 నీకు ఇవాళ క్లాసులు లేవా? 340 00:25:03,879 --> 00:25:08,717 కాలేజిలో ఏవో సమావేశాలు జరుగుతున్నాయి, అందుకనే క్లాసులు లేవు. 341 00:25:10,552 --> 00:25:13,222 సరే, మంచిదే అయింది. నాకయితే. 342 00:25:13,931 --> 00:25:16,725 నేను నీ సహాయం తీసుకోవచ్చు. 343 00:25:16,809 --> 00:25:18,269 మనం డ్రైవ్కు వెళదామా? 344 00:25:21,939 --> 00:25:24,066 వాళ్ళు వెళుతున్నారు. తాళాలు తీసుకొస్తాను. 345 00:25:29,196 --> 00:25:30,614 మిసెస్ యార్క్? 346 00:25:31,240 --> 00:25:33,158 షాండ్ర, నీకు సమయం ఉందా? 347 00:25:35,661 --> 00:25:38,914 లేదు, నేను... నిజానికి ఒక పనిలో ఉన్నాను మధ్యలో. 348 00:25:38,998 --> 00:25:40,749 ఇప్పుడు వీలవదు, కాబట్టి... 349 00:25:41,458 --> 00:25:45,921 జూడ్, నువ్వు కారులో కూర్చుంటావా? నేను షాండ్రతో విడిగా మాట్లాడాలి. 350 00:25:46,547 --> 00:25:47,548 సరే. 351 00:25:52,553 --> 00:25:55,014 నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 352 00:25:55,597 --> 00:25:57,141 జూడ్ విషయంలో, నిజానికి. 353 00:25:59,601 --> 00:26:03,772 సరే, మనం ఇలాంటి మాటలను ఇక్కడ మాట్లాడుకుంటే బాగుండదు, కదా? 354 00:26:03,856 --> 00:26:05,107 లోపలికి రండి. 355 00:26:24,918 --> 00:26:28,422 నీ ఇల్లు చాలా విలక్షణంగా ఉంది. 356 00:26:28,505 --> 00:26:29,381 అవును. 357 00:26:30,174 --> 00:26:33,886 చాలాకాలం వరకు నేను, అమ్మ మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళం. 358 00:26:34,511 --> 00:26:36,347 ఆమెకు సేకరణ అంటే ఇష్టం. 359 00:26:37,848 --> 00:26:39,141 ఇపుడు నేను మాత్రమే. 360 00:27:08,128 --> 00:27:10,172 -నాకు ఈ చిన్నబొమ్మ నచ్చింది. -అవును. 361 00:27:10,964 --> 00:27:12,049 దీని పేరు ఏమిటి? 362 00:27:12,132 --> 00:27:13,384 విన్స్టన్. 363 00:27:13,467 --> 00:27:15,594 అవును, అది మా అమ్మ కుక్క. 364 00:27:15,677 --> 00:27:19,640 ఆమె చివరలో నా దగ్గర మాట తీసుకుంది, దీనిని ఇంట్లోనే ఉంచాలని. 365 00:27:21,100 --> 00:27:23,060 నిజానికి అది ఆమె వీలునామాలో ఉంది. 366 00:27:25,521 --> 00:27:27,439 -మీకు అది వినబడిందా? -ఏమిటి? 367 00:27:29,400 --> 00:27:31,360 లేదు, నాకు ఏమీ వినబడలేదు. 368 00:27:36,615 --> 00:27:38,784 అయితే నువ్వు ఏమి చెబుతున్నావు 369 00:27:38,867 --> 00:27:43,122 మనం జాగ్రత్తగా ఉండాలనో, ఏదో? 370 00:27:43,205 --> 00:27:45,791 ఈ సంరక్షణ వ్యాపారంలో దొంగలు బాగా ఉన్నారు 371 00:27:45,874 --> 00:27:48,252 ముసలివాళ్ళను వాడుకోవాలని చూస్తారు. 372 00:27:48,335 --> 00:27:49,795 సిఫార్సులు పనికిరావు. 373 00:27:49,878 --> 00:27:53,882 సగం సమయం వాళ్ళ అమ్మతోనో, ఫ్రెండ్తోనే మాట్లాడుతుంటారు. 374 00:27:55,551 --> 00:27:57,302 బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంటే... 375 00:27:58,804 --> 00:28:00,013 విన్స్టన్. 376 00:28:00,097 --> 00:28:03,225 -నువ్వు ఎంత బాగున్నావో. -మీరు దానిని తాకకుండా ఉంటే మంచిది. 377 00:28:03,308 --> 00:28:04,560 నువ్వు చాలా... 378 00:28:04,643 --> 00:28:05,853 లేదు! 379 00:28:06,395 --> 00:28:09,440 -నన్ను మన్నించు. బంగారం. -లేదు. ఫరవాలేదు. 380 00:28:09,523 --> 00:28:10,649 ఫరవాలేదు. 381 00:28:11,942 --> 00:28:14,486 నేను పట్టుకుంటాను. దయచేసి తాకకండి. 382 00:28:14,570 --> 00:28:16,947 లేదు, తాకను. నన్ను మన్నించు. 383 00:28:17,030 --> 00:28:19,616 -ఫరవాలేదు. -విన్స్టన్, నన్ను మన్నించు. 384 00:28:23,495 --> 00:28:25,289 -దయచేసి దానిని తాకొద్దు. -సరే. 385 00:29:47,162 --> 00:29:50,374 ఆమెకు సహాయకుడిగా ఉండేవాడు. అలాంటివాళ్ళను ఇంటికి రానీయకూడదు. 386 00:29:50,457 --> 00:29:51,750 అతను వేలు దొంగిలించాడు. 387 00:30:25,117 --> 00:30:26,577 -జూడ్! -లోపలికి ఎలా వచ్చావు? 388 00:30:26,660 --> 00:30:29,538 -ఇది ఎక్కడ దొరికింది? -నిన్ను కారులో కూర్చోమన్నాను. 389 00:30:29,621 --> 00:30:32,124 -నిన్ను ఎవరు పంపారు? -ఏం మాట్లాడుతున్నావు? 390 00:30:32,207 --> 00:30:34,543 -నా ఇంట్లోనుంచి పో! -నువ్వు వారిలో ఒకరివి. 391 00:30:34,626 --> 00:30:36,962 -ఎవరిలో ఒకరిని? -ఆమె గదిలో ఇది ఉంది. 392 00:30:37,045 --> 00:30:38,964 -అది నాది. -ఇది ట్రాకింగ్ చేసే పరికరం. 393 00:30:39,047 --> 00:30:42,092 ఒక రోగి బహమతిగా ఇచ్చారు. దీనిని ఇప్పుడు నాకు ఇచ్చెయ్! 394 00:30:42,175 --> 00:30:44,094 -అబద్ధాలు చెప్పకు! -ఇక చాలు! 395 00:30:45,554 --> 00:30:48,015 ఆమె ఇంట్లో అన్నీ దొంగిలించిన వస్తువులే. 396 00:30:48,098 --> 00:30:49,016 కాదు. 397 00:30:50,434 --> 00:30:52,311 ఇవి రోగులు నాకు ఇచ్చిన బహుమతులు. 398 00:30:52,394 --> 00:30:55,480 షాండ్ర, నీకు ఏమయింది? 399 00:30:59,860 --> 00:31:01,528 వాళ్ళకు ఇది తెలుసనుకుంటున్నారా? 400 00:31:02,988 --> 00:31:05,824 వాళ్ళకు రాత్రింబవళ్ళూ నేను సేవలు చేశాను. 401 00:31:05,907 --> 00:31:09,202 వాళ్ళకు స్నానం చేయించాను, తినిపించాను, డైపర్స్ కూడా మార్చాను. 402 00:31:10,120 --> 00:31:12,539 వాళ్ళకు నా పేరుకూడా తెలియదు, అందుకే... 403 00:31:15,500 --> 00:31:16,752 వాళ్ళు నాకు బాకీ ఉన్నారు. 404 00:31:16,835 --> 00:31:19,463 -ఆమె వారిలో ఒకరు. -కాదు, ఆమె వారిలోనిది కాదు. 405 00:31:19,546 --> 00:31:20,756 కాదు. 406 00:31:20,839 --> 00:31:24,384 ఆమె అబద్ధాలకోరు, దొంగ అయిఉండొచ్చు, కానీ ఆమె... 407 00:31:24,468 --> 00:31:25,927 ఆమె నిన్ను వెంబడించటంలేదు. 408 00:31:31,767 --> 00:31:35,020 నేను నిన్ను తప్పుదోవ పట్టించినందుకు సారీ షాండ్ర. 409 00:31:35,103 --> 00:31:38,607 నువ్వు ఇలా మారినందుకు నేను బాధపడుతున్నాను కూడా. 410 00:31:38,690 --> 00:31:40,984 నువ్వు ఒక విద్యార్థిగా ఉండేదానివి. 411 00:31:41,068 --> 00:31:43,487 -నాకు నువ్వంటే ఇష్టం ఉండేది. -మీ దయ అక్కరలేదు. 412 00:31:43,570 --> 00:31:45,572 సరే, అయితే నిన్నుచూసి జాలిపడను. 413 00:31:46,531 --> 00:31:49,534 నాకు నువ్వంటే ఇష్టం పోయింది. 414 00:31:49,618 --> 00:31:52,329 నేను ఈ సంఘటన మొత్తం మర్చిపోతాను 415 00:31:53,538 --> 00:31:57,584 నీకు ఆ గొలుసు ఎక్కడ నుంచి వచ్చిందో నువ్వు మాకు చెప్పినట్లయితే. 416 00:32:06,176 --> 00:32:07,135 సరే... 417 00:32:10,430 --> 00:32:13,475 నీ ఫోటోలలో ఏముంది ముసలాడా? 418 00:32:16,853 --> 00:32:19,147 సరే. ఏమీలేదు. 419 00:32:20,482 --> 00:32:21,733 ఏమీలేదు. 420 00:32:34,830 --> 00:32:36,248 ఏంటిది... 421 00:33:00,355 --> 00:33:02,733 ఇది మా నాన్నది. నాకు ఖచ్చితంగా తెలుసు. 422 00:33:03,817 --> 00:33:05,277 మరి నీ దగ్గరకూడా ఉందా? 423 00:33:07,279 --> 00:33:08,238 ఉంది. 424 00:33:10,198 --> 00:33:12,409 ఇవి మేము తప్పించుకోకుండా ఉండటానికి. 425 00:33:13,118 --> 00:33:16,747 ట్రాకింగ్ చేయటానికి ఒక గొలుసును వాడటం సరైనపని అనిపించటంలేదు. 426 00:33:16,830 --> 00:33:18,915 ఎవరైనా దానిని తీసి విసిరేయవచ్చు. 427 00:33:21,334 --> 00:33:23,545 అవును, అది నిజమే. 428 00:33:25,464 --> 00:33:26,548 అది ఏమిటి? 429 00:33:28,508 --> 00:33:31,511 ఇది ఏమిటంటే... ఒక తాళం లాంటిది. 430 00:33:31,595 --> 00:33:33,889 ఇది నా కాఫీ టేబుల్ను వెనక్కు తీసుకురాగలదా? 431 00:33:33,972 --> 00:33:36,141 మీ కాఫీ టేబుల్కు ఏమయింది? 432 00:33:36,224 --> 00:33:37,350 దాన్ని వదిలెయ్. 433 00:33:42,397 --> 00:33:44,858 నాకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. 434 00:33:56,077 --> 00:33:57,412 నాకు నేర్పుతారా? 435 00:33:59,956 --> 00:34:00,957 ఇప్పుడు పోనీయ్. 436 00:34:01,583 --> 00:34:02,667 ఇక్కడే. 437 00:34:02,751 --> 00:34:04,252 -ఊరికే వెనక్కు లాగనా? -అంతే. 438 00:34:06,463 --> 00:34:07,881 -దీనినేనా? -అవును. 439 00:34:07,964 --> 00:34:12,010 ఇప్పుడు బ్రేక్పై నుంచి కాలు తీసి దానిని మెల్లగా నొక్కు... 440 00:34:13,178 --> 00:34:14,513 సరే. అలాగే. 441 00:34:18,225 --> 00:34:20,352 అలా భయపడకు. వేగంగా వెళ్ళొచ్చు. 442 00:34:20,435 --> 00:34:22,687 -వేగంగానా? -అవును, వేగంగా. 443 00:34:26,274 --> 00:34:27,526 సరే! 444 00:34:29,236 --> 00:34:30,362 బాగా చేశావు. 445 00:34:43,583 --> 00:34:45,418 నువ్వు పెడతావా దీనిని? 446 00:34:52,843 --> 00:34:58,223 మైకెల్ ఆరన్ యార్క్ 447 00:34:58,306 --> 00:35:03,645 ప్రియమైన కొడుకు, భర్త మరియు తండ్రి 448 00:35:08,441 --> 00:35:10,151 నేను ఆయనలాగా ఉంటానా? 449 00:35:11,236 --> 00:35:12,445 అవును ఉంటావు. 450 00:35:15,115 --> 00:35:16,324 సరే, ఏ విధంగా? 451 00:35:18,869 --> 00:35:21,621 సరే, నీ సొట్టబుగ్గలు. నీ నవ్వు. 452 00:35:23,164 --> 00:35:24,958 నీకు కూడా స్వీట్లు ఇష్టం. 453 00:35:27,794 --> 00:35:29,671 మీరు ఇద్దరూ మొండివాళ్ళే. 454 00:35:32,048 --> 00:35:33,341 కానీ దయగలవాళ్ళు. 455 00:35:42,642 --> 00:35:44,853 తాతా, నాకు సంతోషంగా లేదు. 456 00:35:48,523 --> 00:35:49,691 ఏమయింది? 457 00:35:53,945 --> 00:35:55,196 చాలా విషయాలు. 458 00:35:57,866 --> 00:35:59,117 ప్రతిదీ. 459 00:36:03,914 --> 00:36:05,874 నాకు ఒక్కొక్కటిగా... 460 00:36:05,957 --> 00:36:08,084 చెప్పొచ్చు కదా. 461 00:36:14,758 --> 00:36:16,927 నాకు లోలోపల బరువుగా ఉంది. 462 00:36:18,345 --> 00:36:21,473 అది... పనికి సంబంధించినది. 463 00:36:23,058 --> 00:36:24,434 అది స్కూల్ విషయం. 464 00:36:26,436 --> 00:36:28,146 షికాగో... నేను... 465 00:36:30,023 --> 00:36:31,900 నాకు అది అసలు ఇష్టంలేదు. 466 00:36:33,401 --> 00:36:37,697 ప్రతి ఉదయమూ, నేను లేవగానే నాకు అనిపిస్తుంది... 467 00:36:40,951 --> 00:36:42,577 ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. 468 00:36:44,120 --> 00:36:45,789 నా జీవితంలోనే. 469 00:36:47,040 --> 00:36:48,333 ఇంకా... 470 00:36:52,879 --> 00:36:55,840 నేను స్కూల్ మానేయాలని అనుకుంటున్నాను. 471 00:36:59,594 --> 00:37:01,346 అది చాలా పెద్ద నిర్ణయం. 472 00:37:02,764 --> 00:37:04,516 నేను అలా చేయకూడదని అంటున్నావా? 473 00:37:05,433 --> 00:37:06,810 నేను అలా అనటంలేదు. 474 00:37:10,146 --> 00:37:13,274 నా సలహా అడిగితే... 475 00:37:15,986 --> 00:37:17,779 నేను ఏం చెబుతానంటే 476 00:37:17,862 --> 00:37:20,824 నువ్వు నీపై నమ్మకం పెట్టుకోవాలి. 477 00:37:24,244 --> 00:37:25,578 నేనూ అదే అనుకుంటాను. 478 00:37:26,579 --> 00:37:28,081 పెట్టుకుంటాను. 479 00:37:28,164 --> 00:37:29,040 నేను కేవలం... 480 00:37:30,709 --> 00:37:31,584 నేను భయపడ్డాను. 481 00:37:32,419 --> 00:37:33,878 ఒకవేళ నేను వెళ్ళినా 482 00:37:35,922 --> 00:37:39,134 నాలో ఇంకా ఆ ఆలోచన ఉంటే ఎలా? 483 00:37:41,094 --> 00:37:43,388 నేను ఆయనలా ఉండటంవలనే ఇదంతానా? 484 00:37:44,264 --> 00:37:46,850 -ఇంకా నేను... -హేయ్. వద్దు, వద్దు, వద్దు. 485 00:37:48,560 --> 00:37:49,853 నువ్వు అలా కాదు... 486 00:37:51,104 --> 00:37:53,565 నువ్వు దేనినీ రిపీట్ చేయవు. 487 00:37:54,941 --> 00:37:56,776 -నీకు అర్థమయిందా? -సరే. 488 00:37:57,902 --> 00:38:00,030 నీ జీవితానికి నువ్వే బాట వేసుకుంటావు. 489 00:38:03,992 --> 00:38:05,326 సరే. 490 00:38:05,410 --> 00:38:06,369 సరే. 491 00:38:23,803 --> 00:38:27,807 ప్రతిఒక్కరూ నిర్వాణ గురించి మాట్లాడతారు చక్రాన్ని తామే కనుక్కున్నట్లు, 492 00:38:27,891 --> 00:38:30,310 కానీ మెల్విన్స్కు కూడా అంతే పేరు ఉంది. 493 00:38:31,978 --> 00:38:34,355 గ్రంజ్ సంగీతం గురించి దక్షిణ అమెరికాలో తెలుసా? 494 00:38:34,439 --> 00:38:36,983 -హేయ్, అటువైపు వెళ్ళు. -ఏమిటి? ఎందుకు? 495 00:38:37,067 --> 00:38:39,903 -ఇటు వెళితే ఒక గంట ఆలస్యం అవుతుంది. -చెప్పింది చెయ్యి! 496 00:38:40,779 --> 00:38:42,322 సరే, నువ్వు ఏది చెబితే అది. 497 00:39:01,132 --> 00:39:02,926 ఇక్కడ. పక్కకు తీయి. 498 00:39:09,933 --> 00:39:11,559 మళ్ళీ ఎవరినైనా కట్టేస్తావా? 499 00:39:11,643 --> 00:39:12,477 ఏమిటీ? 500 00:39:13,061 --> 00:39:15,647 మీ అమ్మ పక్కకు తీయమని చెబితే పక్కకు తీయాలి. 501 00:39:15,730 --> 00:39:16,773 నేను ఇప్పుడే వస్తాను. 502 00:39:16,856 --> 00:39:18,274 సరే, వెళ్ళు. 503 00:39:39,963 --> 00:39:40,797 రెడీయా? 504 00:39:41,464 --> 00:39:43,842 అంతా బాగానే జరుగుతుంది. ఒట్టు. 505 00:40:13,913 --> 00:40:14,914 నాన్నా! 506 00:40:17,917 --> 00:40:19,127 నాన్నా! 507 00:40:30,013 --> 00:40:31,055 నాన్నా! 508 00:40:34,100 --> 00:40:36,269 వద్దు! ఎపి, నేను వెనక్కు వెళ్ళను! 509 00:40:36,352 --> 00:40:38,688 ప్లీజ్! ప్లీజ్, ఆగు! 510 00:40:38,771 --> 00:40:40,523 నేను వెనక్కు వెళ్ళను. వద్దు! 511 00:41:34,369 --> 00:41:35,703 మనకు దీనిలో సరదా ఏమీ లేదు. 512 00:41:35,787 --> 00:41:37,664 కానీ ఇది మన కర్తవ్యం. 513 00:41:38,248 --> 00:41:39,499 మనం దీనిని చేయాలి. 514 00:41:45,046 --> 00:41:48,258 ఆమె ఒక మతభ్రష్టురాలు. 515 00:42:01,688 --> 00:42:04,190 నిక్. అన్ని తుపాకులు ఎందుకు ఉన్నాయి? 516 00:42:04,274 --> 00:42:06,442 ఈ రోజుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. 517 00:42:06,526 --> 00:42:09,529 తుపాకులు ఉండటంవలన జాగ్రత్తగా ఉంటావా? 518 00:42:15,576 --> 00:42:16,703 నువ్వు చూస్తావా? 519 00:42:27,380 --> 00:42:28,381 అలాగే చెయ్యి. 520 00:42:38,683 --> 00:42:41,269 -నువ్వు ఎవరినైనా కాల్చావా ఇంతకుముందు? -లేదు. 521 00:42:42,437 --> 00:42:46,024 నువ్వు అసలు ఏమీ చేయనట్లుంది. 522 00:42:46,107 --> 00:42:47,275 అవును. 523 00:42:49,235 --> 00:42:51,070 మీ నాన్న గురితప్పకుండా కాలుస్తాడు. 524 00:42:52,864 --> 00:42:54,115 నీకు మా నాన్న తెలుసా? 525 00:42:55,199 --> 00:42:57,118 మీ అమ్మ అతని గురించి చెప్పలేదా? 526 00:42:58,661 --> 00:42:59,996 లేదు. 527 00:43:00,079 --> 00:43:03,791 వాళ్ళకు ఒకరి గురించి ఒకరికి తెలియదని చెప్పింది. 528 00:43:07,670 --> 00:43:08,838 అలా ఎలా... 529 00:43:13,926 --> 00:43:17,221 లక్ష్యం ఎలా పెట్టాలంటే... 530 00:43:18,806 --> 00:43:22,727 నీ కళ్ళలో బాగా చూసే కన్ను ఏదో తెలుసుకోవాలి, ఎడమదా, కుడిదా అనేది. 531 00:43:29,317 --> 00:43:31,736 ఇంకా... ఆయన ఎలా ఉంటాడు? 532 00:43:33,946 --> 00:43:36,866 -తెలుసుకోవాలని ఉంది. -వద్దు, నన్ను... మన్నించు, పాపా. 533 00:43:38,201 --> 00:43:40,036 నిజంగా సారీ. 534 00:43:42,580 --> 00:43:44,832 మరి ఆయన గురించి ఏదైనా చెప్పు. 535 00:43:54,425 --> 00:43:56,427 అలాంటి చెత్త పనులు చేయకు. 536 00:43:56,511 --> 00:43:58,137 దానిలో బుల్లెట్లే లేవు. 537 00:44:02,392 --> 00:44:03,976 నీకు ఏమయింది? 538 00:44:04,060 --> 00:44:05,937 పదండి వెళదాం. ఆలస్యాన్ని భర్తీ చేయాలి. 539 00:44:07,188 --> 00:44:08,106 పదండి. 540 00:44:26,958 --> 00:44:28,334 తలుపు నేలకింద పూడ్చబడింది 541 00:44:28,418 --> 00:44:30,086 పాకే మనుషుల రాజు భూమిపైకి టెలిపోర్ట్ అవుతున్నాడు!!! 542 00:44:30,795 --> 00:44:32,588 అబ్బా. "పాకే మనిషా"? 543 00:44:36,926 --> 00:44:38,928 ఒక అసాధ్యమైన తలుపు 544 00:44:41,013 --> 00:44:42,807 "అసాధ్యమైన..." 545 00:44:45,476 --> 00:44:46,394 ఏమిటీ... 546 00:44:47,478 --> 00:44:48,938 "ఇది ఏమైనా ఆధ్యాత్మికమా?" 547 00:45:06,205 --> 00:45:09,333 అతనికి ఆ తలుపు పిచ్చి పట్టినట్లుంది!!! 548 00:45:09,417 --> 00:45:12,670 నువ్వు ఏది నిర్ణయించుకున్నా, నా మద్దతు నీకు ఉంటుంది, సరేనా? 549 00:45:12,753 --> 00:45:13,713 సరే. 550 00:45:13,796 --> 00:45:15,006 ఐ లవ్ యూ. 551 00:45:15,089 --> 00:45:16,507 నేనుకూడా. 552 00:45:16,591 --> 00:45:17,842 -సరే. -జాగ్రత్తగా నడుపు. 553 00:46:16,776 --> 00:46:17,902 బైరన్? 554 00:46:19,403 --> 00:46:21,656 తలుపు మూసి ఉన్నా లోపలికి వచ్చేస్తావా? 555 00:46:21,739 --> 00:46:23,199 నేను ఆగలేకపోయాను. 556 00:46:24,951 --> 00:46:26,744 నువ్వు దానిని ఆఫ్ చేస్తావా? 557 00:46:27,245 --> 00:46:28,746 సరే. 558 00:46:28,829 --> 00:46:30,790 నేను మీకు ఒకటి చూపిస్తాను. 559 00:46:30,873 --> 00:46:32,458 మీరు ఆశ్చర్యపోతారు. 560 00:46:35,044 --> 00:46:37,088 ఇది ఎక్కడైనా చూసినట్లుందా? 561 00:46:37,171 --> 00:46:39,799 ఇది ఒక పత్రికలో వచ్చింది. 562 00:46:39,882 --> 00:46:42,301 అర్జెంటీనాలోని ఒక మిషనరీ నుంచి. 563 00:46:42,385 --> 00:46:44,136 ఏ సంవత్సరమో తెలుసా. 564 00:46:44,220 --> 00:46:46,138 1723. 565 00:46:46,889 --> 00:46:48,558 నువ్వు ఏమీ చెప్పొద్దు. 566 00:46:48,641 --> 00:46:50,518 ఇది ఖచ్చితంగా అదే. 567 00:46:50,601 --> 00:46:54,397 దీనిని మళ్ళీ పనిచేయించటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. 568 00:46:55,314 --> 00:46:56,691 సరే, 569 00:46:56,774 --> 00:47:01,153 20 ఏళ్ళు అవటంతో అది పనిచేయటం మానేసినట్లుంది. 570 00:47:01,237 --> 00:47:03,322 ఇది మీ దగ్గర 20 ఏళ్ళనుంచి ఉందా? 571 00:47:10,329 --> 00:47:12,373 హేయ్, ఆ లైట్ ఇక్కడ చూపించు. 572 00:47:15,001 --> 00:47:16,544 ఇది రక్తమా? 573 00:47:23,634 --> 00:47:24,719 ఓహ్, భగవాన్. 574 00:47:25,803 --> 00:47:26,929 ఇది ఏమిటి? 575 00:47:29,015 --> 00:47:30,975 జూడ్, నువ్వు ఏమి చేశావు? 576 00:47:34,395 --> 00:47:37,857 ఆగండి. జూడ్? ఆ సంరక్షకుడా? 577 00:47:37,940 --> 00:47:40,568 మీరు అతనికికూడా దీనిగురించి చెప్పారా? 578 00:47:40,651 --> 00:47:43,696 అవును, అతనిని అడవిలో చూసినప్పుడు, నాకు వింతగా కనిపించాడు. 579 00:47:43,779 --> 00:47:45,615 ఊరికే వింత భావన కలిగింది. 580 00:47:45,698 --> 00:47:48,034 అతనిని అడవిలో చూశావా? అతను ఏమి చేస్తున్నాడు? 581 00:47:48,117 --> 00:47:51,078 -అతను వాకింగ్ చేస్తున్నాడు. -ఆగిపో. 582 00:47:51,954 --> 00:47:53,289 ఎవరో వస్తున్నారు. 583 00:47:54,332 --> 00:47:55,708 -ఇక్కడ నుంచి వెళ్ళిపో. -సరే. 584 00:48:13,351 --> 00:48:16,562 హేయ్, బంగారం. మేము అలా తిరిగివచ్చాము. 585 00:48:17,188 --> 00:48:18,522 ఇవాళ వాతావరణం బాగుంది. 586 00:48:33,371 --> 00:48:34,205 పద. 587 00:48:37,750 --> 00:48:39,502 పద, లూసీ, రా. 588 00:48:42,380 --> 00:48:43,714 అతను ఎక్కడ కనిపించాడు లూసీ? 589 00:48:57,770 --> 00:48:58,729 లూసీ, ఇక్కడకు రా. 590 00:49:17,415 --> 00:49:18,332 లూసీ. 591 00:49:25,047 --> 00:49:26,090 ఓహ్, భగవాన్. 592 00:51:20,496 --> 00:51:22,498 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 593 00:51:22,581 --> 00:51:24,583 క్రియేటివ్ సూపర్‌వైజర్ సమత