1 00:00:13,557 --> 00:00:14,975 అబ్బ! 2 00:00:16,310 --> 00:00:17,978 -ఇవి స్పేస్ సూట్లా? -అవును. 3 00:00:18,771 --> 00:00:21,231 సుమారు పది ఏళ్ళక్రితం తయారు చేశాను. 4 00:00:24,818 --> 00:00:26,570 వీటి వెనక ఉన్న పనితనం... 5 00:00:26,653 --> 00:00:29,281 నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నేను చెత్తవి తయారుచేయను. 6 00:00:29,364 --> 00:00:31,366 మీరు చాలా పరిశోధన చేసినట్లున్నారు. 7 00:00:31,450 --> 00:00:36,663 అవును, ఇలాంటివి తయారుచేసే వెర్రివాళ్ళతో ఆన్లైన్లో పెద్దగ్రూపే ఉంది. 8 00:00:36,747 --> 00:00:39,958 ఈ సూట్లో ఇక్కడ కావలసినంత ఒత్తిడి రావటం లేదు, 9 00:00:40,042 --> 00:00:42,836 ఆక్సిజన్, గాలి ప్రవాహం. 10 00:00:43,796 --> 00:00:46,924 హేయ్, చూడండి. ఈ విషయాలన్నీ నాకు వదిలేయండి. 11 00:00:47,716 --> 00:00:51,011 అంటే, దీని వలన జరిగే గరిష్ఠ నష్టం ఏమిటి? 12 00:00:52,221 --> 00:00:53,764 నీకు ఊపిరాడకపోవచ్చు. 13 00:00:54,932 --> 00:00:57,142 వీటికీ డబ్బు కడతానని అనుకోవటం లేదుగా. 14 00:00:57,226 --> 00:01:00,562 -కంగారుపడకు, నేను చెల్లిస్తాను. -అవునా? 15 00:01:00,646 --> 00:01:02,981 ఉద్యోగం లేకపోయినా నీ దగ్గర డబ్బు బానే ఉందే. 16 00:01:03,065 --> 00:01:06,318 -నా గత ఉద్యోగం సెటిల్మెంట్ డబ్బు ఉంది. -"గాయమా"? 17 00:01:06,401 --> 00:01:10,447 కాదు. షాంపెయిన్లలో ఒక పెద్ద విటమిన్ పరిశ్రమలో నేను ఇంజనీర్గా చేశాను. 18 00:01:10,531 --> 00:01:14,660 విటమిన్ మాత్రలలో రైబోఫ్లావిన్ గురించి తప్పుసమాచారం ఇస్తుంటే ఫిర్యాదు చేశా. 19 00:01:14,743 --> 00:01:15,702 ఇటు చూడండి! 20 00:01:17,579 --> 00:01:20,874 ఆరు ట్యాంకులు అద్దెకు కావాలి. ఒక్కొక్కటి ఎనభై ఘనపుటడుగులవి. 21 00:01:20,958 --> 00:01:21,917 4 రెగ్యులేటర్లు. 22 00:01:22,000 --> 00:01:24,419 -తప్పకుండా. సరస్సులో డైవింగ్ కోసమా? -కాదు. 23 00:01:24,503 --> 00:01:26,046 అవునా? గుహ కోసమా? 24 00:01:26,129 --> 00:01:28,298 అద్భుతమైన కొత్త డైవ్ లైట్లున్నాయి... 25 00:01:28,382 --> 00:01:30,092 ట్యాంక్లులు చాలు, సరేనా? 26 00:01:32,803 --> 00:01:33,804 అది ఒక సరస్సు. 27 00:01:38,725 --> 00:01:41,854 నైట్ స్కై 28 00:01:45,107 --> 00:01:48,235 సరే, మేము దాదాపు అక్కడికి చేరుకున్నాం. ఎట్టకేలకు. 29 00:01:55,075 --> 00:01:57,327 ఇది బాగుంది. 30 00:01:58,620 --> 00:02:03,041 మీ నాన్నను వెతకటం తేలికే. దీనితో పోలిస్తే ఫార్న్స్వర్త్ను వేగాస్ అనుకోవచ్చు. 31 00:02:05,127 --> 00:02:06,795 అద్భుతమైన పాత భవనాలు. 32 00:02:08,422 --> 00:02:10,757 ఫ్రాంక్లిన్ ఉంటే ఆనందించేవాడు. 33 00:02:12,384 --> 00:02:16,221 హేయ్, ఆ చిరునామా ఇంకా ముందుంది. అది పట్టణానికి చివరన ఉన్నట్లుంది. 34 00:02:16,763 --> 00:02:17,764 అవును. 35 00:02:25,230 --> 00:02:28,233 మి. డన్లాప్ అతనిని దింపింది ఇక్కడేనేమో. 36 00:02:30,819 --> 00:02:33,030 -అతనింకా ఇక్కడే ఉన్నాడంటావా? -తెలియదు. 37 00:02:34,740 --> 00:02:37,200 నెటిల్ హౌస్ ఇన్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ 38 00:02:37,284 --> 00:02:39,703 గదులు ఉన్నాయి 39 00:02:47,628 --> 00:02:49,087 ఎక్కువగా ఆలోచించకు. 40 00:02:49,171 --> 00:02:50,297 మంచే జరుగుతుంది. 41 00:03:01,391 --> 00:03:05,187 హాయ్. నెటిల్ హౌస్కు స్వాగతం. మీకు గదులు ఏమైనా కావాలా? 42 00:03:06,438 --> 00:03:07,356 మీరు ఎవరు? 43 00:03:08,482 --> 00:03:11,026 నేను ఎవరినా? నా పేరు హేనా. ఈ చోటు నాదే. 44 00:03:11,109 --> 00:03:15,238 కాదు... నిజానికి నేను ఒకరికోసం చూస్తున్నాను. 45 00:03:22,704 --> 00:03:23,956 అయితే మీకు గేబ్ తెలుసా? 46 00:03:30,545 --> 00:03:31,672 ఆయన నా తండ్రి. 47 00:03:40,430 --> 00:03:42,975 రోజు మధ్యలో రమ్, కోక్ మిశ్రమం తీసుకోవటం నాకు ఇష్టం. 48 00:03:43,725 --> 00:03:46,478 ఇది తాగితే ఒక దీవిలో ఉన్నట్లు అనిపిస్తుంది. 49 00:03:48,230 --> 00:03:50,232 నీ పేరు ఏమని చెప్పావు? 50 00:03:50,315 --> 00:03:52,985 -నేను చెప్పలేదు. -సరే. చెబుతావా? 51 00:03:54,069 --> 00:03:55,779 -జూడ్. -జూడ్. 52 00:03:57,322 --> 00:03:59,366 నువ్వు అతనిలాగానే ఉన్నావు. 53 00:03:59,449 --> 00:04:01,535 అతనిలాగా అందంగా ఉన్నావు! అదృష్టవంతురాలు. 54 00:04:01,618 --> 00:04:03,286 లేదు, మేం కేవలం స్నేహితులం. 55 00:04:03,370 --> 00:04:04,997 అతనికి కొడుకు ఉన్నట్లు తెలియదు. 56 00:04:05,539 --> 00:04:07,749 అతని గురించి నాకు ఎక్కువ తెలియదు. 57 00:04:07,833 --> 00:04:09,376 గేబ్రియల్ ఇంకా ఇక్కడే ఉన్నాడా? 58 00:04:10,002 --> 00:04:11,545 నీది చాలా ఏళ్ళ ఆలస్యం మిత్రమా. 59 00:04:12,379 --> 00:04:14,673 సారీ. నేను అంతగా వాగకూడదు. 60 00:04:14,756 --> 00:04:15,924 ఆయన ఎక్కడికెళ్ళాడు? 61 00:04:16,008 --> 00:04:17,718 ఏమీ తెలియదు. 62 00:04:17,801 --> 00:04:21,013 అతని పిల్లలు అతనికోసం వెతుకుతుండటాన్నిబట్టి చూస్తే, 63 00:04:21,096 --> 00:04:24,016 అతనికి తన వివరాలు జనానికి చెప్పే అలవాటు లేనట్లుంది. 64 00:04:24,975 --> 00:04:30,397 హేనా, నాకు ఆయనను పట్టుకోవటం చాలా ముఖ్యం. మీ దగ్గర ఇంకేమైనా సమాచారం... 65 00:04:32,858 --> 00:04:35,277 నాకు మళ్ళీ ఆ దుఃఖం, ఒంటరితనం గుర్తుచేస్తున్నావు. 66 00:04:37,612 --> 00:04:39,281 అది ఏమైనా సాయపడుతుందేమో. 67 00:04:39,948 --> 00:04:41,616 నేను చెప్పినట్లు, అది పది... 68 00:04:42,909 --> 00:04:44,911 కాదు, 15 సంవత్సరాల క్రితం. 69 00:04:46,121 --> 00:04:49,332 చనిపోయిన లిండా ఆంటీ నా దగ్గర ఉండేది. 70 00:04:49,416 --> 00:04:50,417 శాంతి కలుగుగాక. 71 00:04:50,500 --> 00:04:52,544 ఆమె నాకు ఈ ఇల్లు వదిలివెళ్ళింది. 72 00:04:52,627 --> 00:04:56,339 దీనిని ఒక హోటల్లాగా మార్చాలని అనుకున్నాను. అప్పటి ఆలోచన. 73 00:04:56,423 --> 00:04:58,508 ఇది అప్పుడు దారుణంగా ఉండేది. 74 00:04:58,592 --> 00:05:01,887 ఒకరోజు, ఎవరో తలుపు తట్టారు. ఒక బక్కటి మనిషి గడ్డంతో కనిపించాడు. 75 00:05:01,970 --> 00:05:04,806 పట్టణానికి కొత్త అని, ఉండటానికి చోటు కావాలని చెప్పాడు. 76 00:05:04,890 --> 00:05:08,185 అతనే గేబ్, మీకు అర్థమయి ఉండొచ్చు. 77 00:05:08,268 --> 00:05:11,396 చేయటానికి పని చాలా ఉంది, అందుకే అతను ఉండొచ్చని నేను చెప్పాను. 78 00:05:13,940 --> 00:05:15,901 నా మాటలను వేరేగా చూడొద్దు, 79 00:05:15,984 --> 00:05:18,695 నేను, గేబ్ మామూలు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. 80 00:05:20,072 --> 00:05:23,825 ప్రేమ నవలల్లో పనిమనుషులు కనబడటానికి ఓ కారణం ఉంది. 81 00:05:25,786 --> 00:05:27,204 దీనిని గమనిస్తూ ఉండండి. 82 00:05:28,789 --> 00:05:32,834 అయితే, కొంతకాలానికి, గేబ్ వెళ్ళిపోతాడని నాకు అనిపించింది. 83 00:05:33,752 --> 00:05:35,837 నేను అనుకున్నట్లే, ఒక రోజు, హుష్. 84 00:05:39,007 --> 00:05:41,218 అతను ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? 85 00:05:41,301 --> 00:05:42,636 ఒకటి చెబుతాను మిత్రమా. 86 00:05:42,719 --> 00:05:45,305 అతను తన దిండుపై ఒక వెంట్రుకనుకూడా వదిలివెళ్ళలేదు. 87 00:05:50,811 --> 00:05:53,188 అవునూ, మీరందరూ ఎక్కడినుంచి వచ్చారో నేను అడగలేదు. 88 00:05:53,271 --> 00:05:56,650 -ఇలినాయిస్. మేము ఒక పట్టణం నుంచి-- -అది చాలా చాలా దూరం. 89 00:05:56,733 --> 00:06:00,612 జూడ్, మీ నాన్న ఇక్కడ లేకపోతే, మనం ఇక బయలుదేరొచ్చేమో. 90 00:06:00,695 --> 00:06:02,739 ఇలినాయిస్? సరే, అది చాలా దూరం? 91 00:06:02,823 --> 00:06:06,451 మీరు ఈ రాత్రి ఇక్కడ ఉంటారు, కదూ? ఇక్కడ ఒంటరిగా ఉన్నట్లుంటుంది. 92 00:06:06,535 --> 00:06:09,913 ఉందామా? అంటే మనం చాలాసేపు డ్రైవ్ చేశాము. 93 00:06:09,996 --> 00:06:12,499 ఇంకా! గేబ్ గురించి మరిన్ని కథలు చెబుతాను. 94 00:06:15,585 --> 00:06:16,795 కేవలం ఒక్క రాత్రి. 95 00:06:19,297 --> 00:06:20,298 సరే, అలాగే. 96 00:06:25,887 --> 00:06:29,766 హేయ్. మనకు ఇవాళ రోండా, జెర్రీల ఇంట్లో పార్టీ ఉంది గుర్తుందా? 97 00:06:29,850 --> 00:06:32,394 గుర్తుంది. బంగారం, నేను రాలేను, సారీ. 98 00:06:32,477 --> 00:06:35,105 నేను ఫ్రాంక్లిన్కు సాయం చేయాలి. నువ్వు వెళ్ళిరా. 99 00:06:35,188 --> 00:06:38,483 ఫ్రాంక్లిన్తో అంత ముఖ్యమైన పని ఏమిటి ఇవాళ? 100 00:06:40,402 --> 00:06:41,403 నేను చెప్పలేను. 101 00:06:42,737 --> 00:06:45,574 సరే. ఇది చాలా వింతగా అనిపించటంలేదా? 102 00:06:45,657 --> 00:06:48,577 మీరు కలిసి తిరుగుతున్నారు, పూల్ ఆడుతున్నారని భావించాను. 103 00:06:48,660 --> 00:06:50,745 అదే మేము చేసేది. అంతే చేస్తున్నాము. 104 00:06:50,829 --> 00:06:52,497 ఇప్పుడు వేరే ఒకటి చేస్తున్నాము. 105 00:06:53,832 --> 00:06:54,916 పెద్దపని, జెనీన్. 106 00:06:56,501 --> 00:06:58,920 ఈ ప్రపంచానికి అతీతమైనంత పెద్దపని. 107 00:07:04,843 --> 00:07:05,677 సరే. 108 00:07:06,761 --> 00:07:07,971 ఏమిటి? 109 00:07:08,054 --> 00:07:11,558 నువ్వు ఎప్పుడూ స్నేహం చేయలేదు. నువ్వు స్నేహం చేయటంలేదు. 110 00:07:11,641 --> 00:07:14,895 ఆ ఎన్నిక అయిపోయింది ఇప్పుడు కొత్త పథకం ఏదో వేస్తున్నావు. 111 00:07:14,978 --> 00:07:18,481 కాదు. ఇది అలాంటిది కాదు. అదీకాక, అది కేవలం బార్బెక్యూ పార్టీ. 112 00:07:18,565 --> 00:07:20,192 నేను లేకపోతే సరదాగా గడపొచ్చు. 113 00:07:20,275 --> 00:07:22,611 -రోండా, లారీలకు హాయ్ చెప్పానని చెప్పు. -జెర్రీ. 114 00:07:23,695 --> 00:07:25,322 వాళ్ళు రోండా, జెర్రీ. 115 00:07:25,405 --> 00:07:27,741 అవును. జెర్రీ. 116 00:07:27,824 --> 00:07:28,700 నా తప్పే. 117 00:07:30,493 --> 00:07:32,829 నీకు తెలుసు షాంపేన్లో అందరినీ వదిలివచ్చేశాను. 118 00:07:34,581 --> 00:07:37,959 నా కుటుంబం. నా స్నేహితులు. నాకు అక్కడ అంతా చక్కగా ఉండేది. 119 00:07:38,043 --> 00:07:39,211 కానీ అది సులభం కాదు. 120 00:07:39,294 --> 00:07:41,671 జరిగినదంతా నా తప్పే అన్నట్లు అంటున్నావు. 121 00:07:41,755 --> 00:07:45,800 చాలామంది ఉద్యోగాలు పోయాయి. సూపర్ మార్కెట్లో ఒకావిడ నాపై ఉమ్మింది. 122 00:07:45,884 --> 00:07:48,511 ఒక మంచిపని కోసం నిలబడినందుకు భరించక తప్పదు. 123 00:07:48,595 --> 00:07:53,058 ఇక మందులషాపు బయట నిలుచుని టౌన్ కౌన్సిల్ అవినీతితో నిండిపోయిందని చెప్పటం. 124 00:07:53,141 --> 00:07:54,893 అది పూర్తిగా అవమానకరం! 125 00:07:59,814 --> 00:08:00,857 ఓహ్, భగవాన్. 126 00:08:01,900 --> 00:08:02,859 ఏమిటి? 127 00:08:04,611 --> 00:08:06,780 అయితే అది చేసింది నువ్వే, నువ్వే కదూ? 128 00:08:09,407 --> 00:08:10,659 కౌంటీకి నీవే ఫోన్ చేశావు. 129 00:08:13,328 --> 00:08:16,748 ఫ్రాంక్లిన్ సంతకం ఫోర్జరీ చేశానని నువ్వు వాళ్ళకు చెప్పావు. 130 00:08:21,294 --> 00:08:23,171 నేను మళ్ళీ వేరే చోటకు మారలేను. 131 00:08:24,256 --> 00:08:26,049 మళ్ళీ అవమానాలు పడలేను. 132 00:08:27,842 --> 00:08:30,428 అంటే, వాళ్ళు చెప్పారు నువ్వు ఉపసంహరించుకుంటే... 133 00:08:33,598 --> 00:08:35,183 నాకు గుర్తున్నప్పటి నుంచి, 134 00:08:36,393 --> 00:08:38,728 జనం అందరూ నన్ను అనేవాళ్ళు... 135 00:08:40,146 --> 00:08:42,774 పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానని... 136 00:08:44,025 --> 00:08:45,235 బొక్కబోర్లా పడతానని. 137 00:08:47,445 --> 00:08:49,781 ఆఖరికి నువ్వు, నా సొంత భార్యవు కూడా. 138 00:08:49,864 --> 00:08:52,826 -నేను నీగురించి అలా అనుకోను. -నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. 139 00:08:56,955 --> 00:08:59,082 నువ్వు మొదట ఇష్టపడింది నన్నుకాదని తెలుసు. 140 00:09:03,962 --> 00:09:05,380 కానీ నాకు అవునని చెప్పావు. 141 00:09:07,882 --> 00:09:09,509 నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను. 142 00:09:13,555 --> 00:09:14,764 ప్రత్యేకమైనవాడిని అవుతా. 143 00:09:18,810 --> 00:09:19,853 నువ్వే చూస్తావు. 144 00:09:21,563 --> 00:09:23,565 నువ్వు ప్రత్యేకం ఎందుకు కావాలి? 145 00:09:26,568 --> 00:09:28,194 నువ్వు నువ్వుగానే ఉండొచ్చుకదా? 146 00:09:41,041 --> 00:09:43,168 కనిపించుటలేదు 147 00:09:46,588 --> 00:09:50,508 ఫార్న్స్వర్త్ టౌన్ స్క్వేర్ 148 00:09:50,592 --> 00:09:52,552 నేను ఇక్కడ ఎందుకు వేచిచూడాలి? 149 00:09:53,345 --> 00:09:55,180 ఈ వ్యాన్ను ఎవరో ఒకరు గమనిస్తూ ఉండాలి. 150 00:09:55,930 --> 00:09:57,682 మనం నిక్ను పిలుద్దాం. 151 00:09:57,766 --> 00:09:59,726 అతను ఇక్కడ ఉంటే, మనకు ఈ సమస్య ఉండేది కాదు. 152 00:09:59,809 --> 00:10:01,853 వద్దు, మనకు సమస్య ఎక్కువయ్యేది. 153 00:10:05,607 --> 00:10:07,859 అతను ప్రమాదకరంగా అనిపించటంలేదు. 154 00:10:08,485 --> 00:10:09,611 నిజానికి, అతను చక్కగా ఉన్నాడు. 155 00:10:09,694 --> 00:10:11,446 కనిపించేదంతా నిజంకాదు. 156 00:10:11,529 --> 00:10:12,947 కానీ అతను చెడ్డవాడని నీకు ఎలా తెలుసు? 157 00:10:13,698 --> 00:10:14,657 ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు. 158 00:10:15,992 --> 00:10:17,994 నువ్వు వాళ్ళను నమ్ముతావా? 159 00:10:19,537 --> 00:10:20,747 నమ్ముతాను. 160 00:10:21,164 --> 00:10:22,624 నీకు దాని అర్థం తెలుసా? 161 00:10:23,124 --> 00:10:24,292 అది నమ్మకం. 162 00:10:25,001 --> 00:10:27,003 అది లేకపోతే, ఏదయినా వృథా కదా? 163 00:10:29,381 --> 00:10:30,799 -నమస్తే మిస్. -హలో. 164 00:10:31,257 --> 00:10:32,801 -ఇది మీ వ్యానా? -అవును. 165 00:10:32,884 --> 00:10:36,221 -ఇది ఏమైనా తప్పా? -సరే, మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు. చూశారా? 166 00:10:36,304 --> 00:10:38,139 పార్కింగ్ రిజర్వ్ చేయబడింది 167 00:10:38,223 --> 00:10:39,849 ఈ ఊళ్ళో చెత్త పార్కింగ్... 168 00:10:39,933 --> 00:10:41,601 వేరే ఊరు వాళ్ళు కదా? 169 00:10:41,684 --> 00:10:43,228 -అవును. -నెవార్క్. 170 00:10:43,311 --> 00:10:47,565 -నేనే ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. -నేను నా కూతురితో ప్రయాణిస్తున్నాను. 171 00:10:47,649 --> 00:10:49,109 నిజంగానా? 172 00:10:49,192 --> 00:10:50,318 ఫార్న్స్వర్త్కా? 173 00:10:52,445 --> 00:10:53,738 అమ్మా. 174 00:10:53,822 --> 00:10:55,198 నావైపు చూడు. మాట్లాడుతూ ఉండు. 175 00:10:55,281 --> 00:10:56,324 ఏమిటి? 176 00:10:56,408 --> 00:10:59,661 ఊరికే మాట్లాడు! ఏదో ఒకటి చెప్పు! అతనికి అర్థంకాదు! 177 00:11:00,370 --> 00:11:01,788 ఒహాయోలో ఆ పచ్చిమిరపకాయ అసహ్యంగా ఉంది. 178 00:11:01,871 --> 00:11:03,164 అది బాగుంది! 179 00:11:03,248 --> 00:11:04,124 సారీ. 180 00:11:04,207 --> 00:11:05,834 నువ్వు అందుకే నన్ను భయపెడతావు! 181 00:11:05,917 --> 00:11:07,252 ఈ అమ్మాయే ఒక అబ్బాయిని దాచిపెట్టింది! 182 00:11:07,335 --> 00:11:08,461 ఆ పోలీసును చూడు, అతనికి పిచ్చెక్కుతోంది. 183 00:11:08,545 --> 00:11:10,380 -క్షమించు, నాకు... -ఒక్క నిమిషం. 184 00:11:10,463 --> 00:11:12,757 నువ్వు నమ్మకూడనిదానివి... 185 00:11:12,841 --> 00:11:14,217 నీ అబద్ధాలతో నేను విసిగిపోయాను! 186 00:11:14,300 --> 00:11:16,344 నువ్వు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది ఒక పోర్టల్ ద్వారా... 187 00:11:16,428 --> 00:11:17,929 సారీ. టీనేజర్లు, తెలిసిందేగా? 188 00:11:18,012 --> 00:11:19,180 -సారీ. -ఫరవాలేదు. 189 00:11:19,264 --> 00:11:22,767 మీరు ఏదో గొడవలో ఉన్నట్లున్నారు. వ్యాన్ను ఇక్కడ నుంచి తీయండి. 190 00:11:22,851 --> 00:11:25,019 సరే. ధన్యవాదాలు. నన్ను క్షమించండి. 191 00:11:29,023 --> 00:11:30,316 ధన్యవాదాలు. 192 00:11:30,942 --> 00:11:32,026 ఫరవాలేదు. 193 00:11:33,653 --> 00:11:34,946 ఇది ఎలా ఉంది? 194 00:11:42,704 --> 00:11:45,290 నేను ఫ్రాంక్లిన్ను. ఇప్పుడు అందుబాటులోలేను, 195 00:11:45,373 --> 00:11:50,003 మీరు నాకు మీ సందేశాన్ని, ఫోన్ నంబర్ను ఇస్తే, తిరిగి ఫోన్ చేస్తాను. 196 00:11:50,086 --> 00:11:53,631 హలో, ఫ్రాంక్లిన్. మళ్ళీ నేనే. ఐరీన్ను. 197 00:11:54,257 --> 00:11:56,468 ఇక్కడే ఉన్నాము. రాత్రి, ఉదయం. 198 00:11:58,136 --> 00:12:01,473 ఈ రాత్రి ఇక్కడే ఉంటాము. రేపు తిరిగి వచ్చేస్తాము. 199 00:12:03,016 --> 00:12:05,185 మీరు వేళకు తింటున్నారని అనుకుంటున్నాను. 200 00:12:05,268 --> 00:12:09,189 ఫ్రీజర్లో పదార్థాలు అన్నీ ఉన్నాయి. వాటిని వేడిచేసుకుని తినండి. 201 00:12:09,272 --> 00:12:13,193 కానీ ఆ వెండిపాత్రలను బయటకు తీయటం మర్చిపోవద్దు ఈసారి. 202 00:12:14,903 --> 00:12:20,617 ఇక్కడ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేదు, ఇది అందితే, ఫోన్ చేసి వివరాలు తెలుసుకో. 203 00:12:23,203 --> 00:12:24,204 గుర్తొస్తున్నావు. 204 00:12:25,997 --> 00:12:26,956 బై-బై. 205 00:12:37,425 --> 00:12:38,551 హేయ్. 206 00:12:39,177 --> 00:12:40,303 ఫోన్ మాట్లాడారా? 207 00:12:40,386 --> 00:12:42,347 ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా? 208 00:12:42,430 --> 00:12:44,224 లేరు. మనమే ఉన్నాం. 209 00:12:45,350 --> 00:12:47,936 వెనక ఏదో వినబడినట్లు అనిపించింది. 210 00:12:48,895 --> 00:12:51,606 పాత ఇల్లు. అవి దయ్యాలు అయి ఉండొచ్చు. 211 00:12:51,689 --> 00:12:53,024 కానీ అవి కాదు. 212 00:12:53,107 --> 00:12:54,317 ఒకవేళ అవేనేమో? 213 00:12:55,944 --> 00:12:59,364 హేనా చేపల పడవలో పనిచేసిన తన అనుభవం గురించి మాకు చెప్పింది. 214 00:12:59,447 --> 00:13:01,324 నేను మాత్రం అలా చేయలేను. 215 00:13:01,407 --> 00:13:04,077 డబ్బులు బాగా వచ్చాయి. ఇంకో రౌండ్ డ్రింక్స్ చేయి. 216 00:13:04,160 --> 00:13:06,746 -కింద ఉన్న బార్లో రమ్ ఉంది. -సరే. 217 00:13:10,416 --> 00:13:11,417 జూడ్. 218 00:13:15,380 --> 00:13:20,510 హేనా గురించి ఏమనుకుంటున్నావు? ఆమె కొద్దిగా వింతగా ఉంది, నీకెలా ఉంది? 219 00:13:21,135 --> 00:13:22,428 నాకు తెలియదు. 220 00:13:22,512 --> 00:13:24,222 ఆమెను నమ్మాలని అనుకుంటున్నాను. 221 00:13:24,305 --> 00:13:27,141 అనుకుంటున్నావా, నమ్ముతున్నావా? 222 00:13:28,351 --> 00:13:29,978 ఆమె ప్రమాదకరమని అనిపించటంలేదు. 223 00:13:31,020 --> 00:13:33,314 ఆమె చెప్పింది నిజమైతే, నాన్నకు ఆమె నచ్చేది. 224 00:13:33,398 --> 00:13:37,360 -అది మనకు ఉపయోగపడుతుంది. -నీకు అసలు మీ నాన్న గురించే తెలియదు. 225 00:13:39,696 --> 00:13:40,613 నన్ను మన్నించండి. 226 00:13:40,697 --> 00:13:42,824 -నా వలన బాధపడుతున్నారా? -లేదు. 227 00:13:42,907 --> 00:13:43,908 ఇది కేవలం... 228 00:13:44,492 --> 00:13:48,621 ఫ్రాంక్లిన్ ఒక్కరే ఇంట్లో ఉండటంపై నేను కంగారుపడుతున్నాను. 229 00:13:49,581 --> 00:13:50,540 నన్ను మన్నించండి. 230 00:13:53,793 --> 00:13:54,711 హేయ్. 231 00:13:54,794 --> 00:13:55,962 అంతా బాగానే ఉందా? 232 00:13:56,879 --> 00:13:58,464 అవును. బాగుంది. 233 00:13:58,548 --> 00:14:03,511 నేను పైకి వెళ్ళి కాసేపు పడుకుంటాను. 234 00:14:03,595 --> 00:14:06,598 -సరే, అలాగే. నేను నీకు సాయం చేస్తాను. -వద్దు, ఫరవాలేదు. 235 00:14:12,437 --> 00:14:16,190 -ఆమె ఆందోళనలో ఉన్నారు. -కాదు, ఆమె నాతో ఎప్పుడూ అలాగే ఉంటుంది. 236 00:14:28,244 --> 00:14:30,246 హేయ్. ఆమె ఫోన్ సంభాషణ విన్నావా? 237 00:14:30,330 --> 00:14:34,626 విన్నాను. కేవలం ఒక మామూలు వాయిస్ మెసేజ్. ఇదిగో విను. 238 00:14:35,585 --> 00:14:38,212 హాయ్, నేను ఫ్రాంక్లిన్. నేను ఇప్పుడు అందుబాటులో లేను, 239 00:14:38,296 --> 00:14:42,675 మీరు నాకు మీ సందేశాన్ని, ఫోన్ నంబర్ ఇస్తే, తిరిగి ఫోన్ చేస్తాను. 240 00:14:43,843 --> 00:14:47,263 నాణాలు ఉన్న వ్యక్తి ఇతనే. వాళ్ళంతా ఒకటే. 241 00:14:48,056 --> 00:14:49,223 నన్నిప్పుడు నమ్ముతావు. 242 00:14:49,307 --> 00:14:52,310 ఎప్పుడూ నమ్ముతాను. ఇలా జరుగుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. 243 00:14:52,393 --> 00:14:54,562 -అవును. -ఇంకా వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు. 244 00:14:54,646 --> 00:14:58,399 -ఇది అనుమానంగా ఉందా? -ఎవరో ఆడిస్తున్నట్లుగా ఉందా? 245 00:14:59,942 --> 00:15:01,569 నాకు ఏమిటో తెలియటంలేదు. 246 00:15:02,403 --> 00:15:04,405 ఏదిఏమైనా, మనం కలుసుకున్నాం. 247 00:15:04,489 --> 00:15:05,531 అవును. 248 00:15:06,658 --> 00:15:07,909 నేను వెళ్ళాలి. 249 00:15:07,992 --> 00:15:09,035 సరే. 250 00:15:09,118 --> 00:15:10,536 -ఇది విచిత్రంగా ఉంది. -అవును. 251 00:15:28,846 --> 00:15:30,139 కొద్దిగా బిగుతుగా ఉంది. 252 00:15:30,723 --> 00:15:33,142 అవును, సరే, నీకోసం తయారుచేసింది కాదు. 253 00:15:35,353 --> 00:15:37,939 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని మీ ఆవిడ అనుకుంటోంది? 254 00:15:38,022 --> 00:15:39,691 ఆమెకు ఏమీ తెలియదు. 255 00:15:39,774 --> 00:15:41,901 ఆమె ఆలోచించినా, ఏమీ పట్టించుకోదు. 256 00:15:42,819 --> 00:15:44,654 నాకు అంత స్పష్టంగా తెలియదు. 257 00:15:48,700 --> 00:15:51,077 వద్దు. మనం దీన్ని అలాగే ఉంచుదాం. 258 00:15:51,703 --> 00:15:55,498 ఎవరికీ చెప్పను. ఇది మన విషయం. మన భార్యలను దీనిలోకి తీసుకురావద్దు. 259 00:15:57,041 --> 00:15:59,001 -సరే. మొదలుపెడదాం. -అవును. 260 00:16:04,006 --> 00:16:05,508 ఉండు ఇది సరిచేస్తాను. 261 00:16:05,591 --> 00:16:06,551 సరిపోయిందా? 262 00:16:08,094 --> 00:16:09,762 -సరిపోయింది. నేను సిద్ధం. -సరే. 263 00:16:12,306 --> 00:16:15,101 అవును. ఇది పనిచేస్తోంది, ఒత్తిడి వస్తోంది. 264 00:16:18,730 --> 00:16:19,772 బైరన్? 265 00:16:20,648 --> 00:16:21,733 హేయ్, బైరన్? 266 00:16:25,737 --> 00:16:27,321 -బైరన్! -మోసపోయారు! 267 00:16:30,908 --> 00:16:32,660 మీ ముఖం ఎలా మారిందో చూడండి. 268 00:16:32,744 --> 00:16:35,580 హేయ్, ఇది పనిచేస్తోంది. నేను చెప్పానుకదా. 269 00:16:36,456 --> 00:16:37,540 మనమది చేస్తున్నాం. 270 00:16:38,541 --> 00:16:39,959 మనం అక్కడికి వెళుతున్నాం. 271 00:16:47,383 --> 00:16:48,551 నీ సంగతి ఏమిటి? 272 00:16:50,136 --> 00:16:51,137 నువ్వు ఏం చేస్తావు? 273 00:16:54,515 --> 00:16:55,725 నేను ఏమీ చేయను. 274 00:16:57,894 --> 00:16:58,978 ఏదో చేస్తూ ఉండాలి. 275 00:16:59,979 --> 00:17:02,857 ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడ నుండి వచ్చావు? 276 00:17:07,487 --> 00:17:08,488 ఇక్కడ, అక్కడ. 277 00:17:11,616 --> 00:17:13,993 ఇలాంటి మంచి మనుషులు నీకు ఎలా కలిశారు? 278 00:17:18,414 --> 00:17:19,832 కేవలం అదృష్టం, బహుశా. 279 00:17:21,542 --> 00:17:24,921 నువ్వు మీ నాన్నకోసం వెతుకుతున్నట్లు మీ కుటుంబసభ్యులకు తెలుసా? 280 00:17:30,134 --> 00:17:32,136 తెలుసు. తెలిసి ఉండొచ్చు. 281 00:17:35,306 --> 00:17:37,558 రహస్యం. నువ్వు అతనిలాగే ఉన్నావు. 282 00:17:42,063 --> 00:17:44,941 ఇది వింతగా అనిపించొచ్చు, కానీ... 283 00:17:47,360 --> 00:17:51,906 గేబ్కు దేనితోనో సంబంధం ఉన్నట్లు నాకు ఒక భావన కలిగేది... 284 00:17:54,325 --> 00:17:55,284 వింత భావన. 285 00:18:00,414 --> 00:18:02,041 మీరు చెబుతున్నది ఏమిటి? 286 00:18:03,918 --> 00:18:05,837 అతను ఏదో దాస్తున్నాడని. 287 00:18:08,089 --> 00:18:09,465 ఏదో ప్రమాదకరమైనది. 288 00:18:18,182 --> 00:18:20,893 లేకపోతే నన్ను ఏడిపించాలని కాబోలు. ఎవరికి తెలుసు. 289 00:18:28,651 --> 00:18:30,361 ఇది అతనికి ఇష్టమైన గది. 290 00:18:31,320 --> 00:18:34,323 అతను ఇక్కడే గంటలు గంటలు చదువుతూ ఉండిపోయేవాడు. 291 00:18:36,409 --> 00:18:38,911 బహుశా అతని పుస్తకాలు ఇంకా ఆ అరలలో ఉన్నాయేమో. 292 00:18:41,706 --> 00:18:43,124 ఇది మీకు వింతగా ఉండొచ్చు. 293 00:18:44,625 --> 00:18:46,043 ఇది భరించలేనిది. 294 00:18:46,711 --> 00:18:48,880 ఇది చిన్న ప్రపంచంలా ఉంది, కదా? 295 00:18:50,339 --> 00:18:51,215 గుడ్ నైట్! 296 00:19:09,025 --> 00:19:13,946 ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో డ్యూమస్ 297 00:20:17,885 --> 00:20:20,554 నానమ్మా? నువ్వు బాగానే ఉన్నావా? కింద పడ్డావా? 298 00:20:22,473 --> 00:20:24,100 మన్నించు, నిన్ను లేపేశాను. 299 00:20:24,183 --> 00:20:27,061 నాకు నిద్ర పట్టలేదు, పుస్తకం తీసుకోబోయాను. 300 00:20:27,144 --> 00:20:29,105 మొత్తం కిందపడిపోయింది. 301 00:20:29,188 --> 00:20:32,775 -సరే, నేను సాయంచేస్తాను. -వద్దు. నేను తీసుకున్నాను. నేను ఊరికే... 302 00:20:32,858 --> 00:20:34,151 వెళ్ళి పడుకో. 303 00:20:34,235 --> 00:20:39,073 -కనీసం నన్ను ఒక్కనిమిషం ఉండనివ్వు. -లేదు. నేను బాగున్నాను. ఫరవాలేదు. 304 00:20:39,156 --> 00:20:40,366 వెళ్ళిపో. 305 00:20:42,326 --> 00:20:43,995 నానమ్మా, నేనంటే నీకు అయిష్టం? 306 00:20:48,332 --> 00:20:49,709 డెనీస్! 307 00:20:49,792 --> 00:20:52,336 పిచ్చిగా మాట్లాడకు, నువ్వు నా మనవరాలివి. 308 00:20:52,420 --> 00:20:53,671 నిన్ను ప్రేమిస్తున్నాను. 309 00:20:55,131 --> 00:20:57,466 ప్రేమించటం వేరు, ఇష్టపడటం వేరు. 310 00:20:57,550 --> 00:20:59,760 సరే, నువ్వంటే నాకు ఇష్టంకూడా. 311 00:21:02,388 --> 00:21:03,639 నేను అలా అనుకోవటంలేదు. 312 00:21:06,559 --> 00:21:07,518 అనుకోవటంలేదా? 313 00:21:08,144 --> 00:21:11,313 లేదు. నువ్వు నన్ను ఎందుకో పక్కకు నెట్టేస్తుంటావు. 314 00:21:13,107 --> 00:21:14,442 ఇది ఇప్పుడు మాత్రమే కాదు. 315 00:21:15,484 --> 00:21:16,902 నేను చిన్నగా ఉన్నప్పటినుంచి. 316 00:21:20,781 --> 00:21:21,824 అవునా? 317 00:21:26,704 --> 00:21:29,081 నాకు తెలియటంలేదు. మా అమ్మ కారణంగానా? 318 00:21:30,666 --> 00:21:32,084 నేను నల్లదానిని అవటంవల్లనా? 319 00:21:32,168 --> 00:21:35,588 బొత్తిగా కాదు! నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు? 320 00:21:35,671 --> 00:21:37,798 నీకు నా ప్రేమ అవసరం లేదనిపిస్తోంది. 321 00:21:37,882 --> 00:21:38,966 నాకు కావాలి! 322 00:21:41,052 --> 00:21:42,887 నాకు నీ ప్రేమ కావాలి. 323 00:21:43,429 --> 00:21:45,014 అయితే ఇది ఏమిటి? 324 00:21:58,736 --> 00:22:01,655 నువ్వు తండ్రి లేకుండా పెరిగావు. 325 00:22:02,990 --> 00:22:04,241 నా వలనే. 326 00:22:05,367 --> 00:22:06,911 అతనిని సురక్షితంగా ఉంచటం... 327 00:22:08,662 --> 00:22:10,539 నా బాధ్యత. 328 00:22:10,623 --> 00:22:11,957 నేను సరిగ్గా చేయలేకపోయాను. 329 00:22:16,087 --> 00:22:17,755 నీ ప్రేమకు అర్హురాలిని కాదు. 330 00:22:21,884 --> 00:22:23,260 నానమ్మా... 331 00:22:23,344 --> 00:22:25,012 లేదు, ఆయన ఆరోగ్యం బాగోలేదు. 332 00:22:26,806 --> 00:22:30,226 ఆయనకు అనారోగ్యం ఉంది. నువ్వు, తాత చేయగలిగినదంతా చేశారు. 333 00:22:33,229 --> 00:22:34,855 నేను ఇంకా చేయవచ్చు. 334 00:22:39,151 --> 00:22:40,820 నేను ఇంకా చేసి ఉండాల్సింది. 335 00:22:45,908 --> 00:22:46,951 నన్ను మన్నించు. 336 00:23:01,799 --> 00:23:03,217 నన్ను మన్నించు. 337 00:23:08,389 --> 00:23:10,599 -నేను నిన్ను ప్రేమిస్తున్నాను. -నేను కూడా. 338 00:23:26,198 --> 00:23:27,783 నువ్వు ఏమి చేస్తున్నావు ఇక్కడ? 339 00:23:31,620 --> 00:23:32,997 ఉద్యోగానికి వెళ్ళలేదా? 340 00:23:34,999 --> 00:23:36,500 ఇది విరగలేదని ఆశ్చర్యంగా ఉంది. 341 00:23:38,419 --> 00:23:39,712 అంతా బాగానే ఉందా? 342 00:23:43,549 --> 00:23:44,967 ఉద్యోగం బాగోలేదు. 343 00:23:47,011 --> 00:23:48,095 మైకెల్. 344 00:23:48,179 --> 00:23:49,555 ఒట్టు, నేను ప్రతి ఉదయమూ 345 00:23:49,638 --> 00:23:54,268 నేను కారెక్కి కూర్చుంటే, రోజంతా తీరిక లేకుండా తిరగుతూనే ఉంటాను. 346 00:23:54,351 --> 00:23:55,269 రోజు మొత్తం. 347 00:23:57,104 --> 00:23:58,981 వాళ్ళకు నా పని నచ్చటంలేదని తెలిసింది. 348 00:24:02,568 --> 00:24:03,777 లెస్లీకి ఇది తెలుసా? 349 00:24:08,949 --> 00:24:12,119 మీ స్కూల్లో ఎవరితోనైనా మాట్లాడి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావా? 350 00:24:12,203 --> 00:24:16,081 -నేను హోటల్లో క్లీనర్ పని అయినా చేస్తాను. -నేను ఆ పని చేయలేను. 351 00:24:17,666 --> 00:24:19,460 ఎందుకు? నువ్వు నన్ను నమ్మవా? 352 00:24:20,544 --> 00:24:22,213 అది వీలవదు మైకెల్. 353 00:24:23,297 --> 00:24:26,634 కొన్ని ఏళ్ళక్రితం వీలవ్వొచ్చేమో, కానీ ఇప్పుడు వీలవదు. 354 00:24:31,388 --> 00:24:35,726 నువ్వు నాలోని శక్తినంతా పీల్చేశావు అనిపిస్తుంది. 355 00:24:38,187 --> 00:24:39,647 అవును, అది నిజమే అయిఉండొచ్చు. 356 00:24:41,941 --> 00:24:44,360 మైకెల్, నువ్వు ఇప్పుడు ఒక తండ్రివి. 357 00:24:45,069 --> 00:24:47,321 నీకు ఇంటిదగ్గర ఒక చక్కటి పాపాయి ఉంది. 358 00:24:48,572 --> 00:24:50,658 ఆమెకు నువ్వే ఆధారం. 359 00:24:50,741 --> 00:24:52,117 అమ్మా, నీకు తెలుసు నేను... 360 00:24:53,661 --> 00:24:54,703 ప్రయత్నిస్తున్నాను. 361 00:24:54,787 --> 00:24:56,622 సరే, ఇంకా గట్టిగా ప్రయత్నించాలి. 362 00:24:57,748 --> 00:25:02,419 ఫలితం వచ్చేదాకా ప్రయత్నించాలి. 363 00:25:03,879 --> 00:25:07,424 మేము నీకు ఎంతో ఇచ్చాము. 364 00:25:08,092 --> 00:25:09,260 చాలా అవకాశాలు ఇచ్చాము. 365 00:25:09,343 --> 00:25:12,805 లెస్లీ కూడా ఇచ్చింది. కానీ నువ్వు... 366 00:25:13,931 --> 00:25:15,140 వాటన్నింటినీ తోసేశావు. 367 00:25:17,101 --> 00:25:18,102 నాకు తెలుసు. 368 00:25:18,852 --> 00:25:20,187 నాకు నీ సంఘర్షణ తెలుసు. 369 00:25:21,897 --> 00:25:23,148 అది కష్టంగా ఉందని తెలుసు. 370 00:25:24,650 --> 00:25:26,568 కానీ ఎక్కడో ఒకచోట, నువ్వు... 371 00:25:27,653 --> 00:25:31,156 నీ జీవితం యొక్క బాధ్యత నీ చేతుల్లోకి తీసుకోవాలి. 372 00:25:39,498 --> 00:25:40,416 అవును. 373 00:25:42,167 --> 00:25:43,252 నువ్వు నిజమే. 374 00:25:52,219 --> 00:25:53,220 నువ్వన్నది కరక్టే. 375 00:26:02,479 --> 00:26:04,064 -హేయ్ నాన్నా. -హేయ్ బాబూ. 376 00:26:08,193 --> 00:26:10,988 ఇవాళ పొద్దున్నే ఒక చక్కటి ఆశ్చర్యం ఎదురయింది. 377 00:26:12,906 --> 00:26:14,241 నీకు ఒక కప్పు కాఫీ ఇవ్వనా? 378 00:26:14,325 --> 00:26:17,703 వద్దు, అవసరంలేదు. నేను ఇటుగా వెళుతూ పాత ఊయల చూశాను, 379 00:26:17,786 --> 00:26:19,121 ఒకసారి ఊగుదామని వచ్చాను. 380 00:26:19,204 --> 00:26:22,541 ఈ ఊయల కట్టినప్పుడు, ఈ చెట్టు దీనిలో సగం ఉండేది. 381 00:26:23,417 --> 00:26:25,544 కాలం పరిగెత్తుతుంది, కదా? 382 00:26:25,627 --> 00:26:29,340 అవును. నేను కూడా పరిగెత్తాలి ఇప్పుడు, ఆలస్యం అయింది. 383 00:26:33,177 --> 00:26:34,178 ఐ లవ్ యూ నాన్నా. 384 00:26:39,475 --> 00:26:40,392 అమ్మా. 385 00:26:43,354 --> 00:26:45,356 శుక్రవారం రాత్రి భోజనానికి వస్తావుకదూ? 386 00:26:47,566 --> 00:26:48,484 తప్పకుండా. 387 00:26:53,072 --> 00:26:54,073 అప్పుడు కలుద్దాం. 388 00:27:53,674 --> 00:27:56,343 మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజుకు సిద్ధమేనా? 389 00:27:57,845 --> 00:27:59,805 నేను నీకు ఒక సలహా ఇవ్వనా? 390 00:27:59,888 --> 00:28:01,515 తప్పకుండా. ఈ సూట్ల గురించా? 391 00:28:02,391 --> 00:28:03,725 కాదు. ఈ వ్యవహారానికి... 392 00:28:04,935 --> 00:28:06,186 సంబంధించినది కాదు. 393 00:28:08,063 --> 00:28:13,026 మనం నిన్నరాత్రి మాట్లాడుకున్న విషయం గురించి. నువ్వు, జెనీన్. 394 00:28:13,402 --> 00:28:16,613 అబ్బా, ఫ్రాంక్. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ లాాంటిది ఇస్తారా? 395 00:28:16,697 --> 00:28:18,657 హేయ్, ప్రతిదీ జోక్ కాదు, తెలుసా? 396 00:28:18,740 --> 00:28:23,245 నువ్వు ఒకరితో జీవితం గడపాలని ఎంచుకున్నావు, దానిని సరిగ్గా చేయాలి. 397 00:28:25,414 --> 00:28:27,416 సరే. అయితే ఏమిటి? 398 00:28:29,668 --> 00:28:33,630 సరే... మీరిద్దరూ చిన్నవాళ్ళే. 399 00:28:35,632 --> 00:28:38,677 అంతా సరిగ్గాలేదు, నాకు తెలుసు. ఎప్పుడు సరిగ్గా ఉన్నాయి? 400 00:28:38,760 --> 00:28:41,680 నువ్వు మనిషివే కదా? మనం అన్నీ సరిగ్గా చేయలేము. 401 00:28:44,308 --> 00:28:46,810 కానీ ఒక పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నించాలి. 402 00:28:49,104 --> 00:28:50,939 నిన్ను ప్రేమించేవారిని ప్రేమించాలి. 403 00:28:53,567 --> 00:28:58,655 అక్కడే... అక్కడే జీవితం ఉంది. అదే ముఖ్యమైనది. 404 00:29:00,324 --> 00:29:01,325 కుటుంబం. 405 00:29:04,369 --> 00:29:05,329 సరే ఫ్రాంక్. 406 00:29:07,206 --> 00:29:08,081 తప్పకుండా. 407 00:29:12,294 --> 00:29:13,170 అది, తర్వాత. 408 00:29:27,434 --> 00:29:28,519 పదండి ఫ్రాంక్. 409 00:29:29,394 --> 00:29:30,395 నేను వస్తున్నా. 410 00:29:33,315 --> 00:29:35,234 అయితే నువ్వు రావటంలేదా? 411 00:29:35,984 --> 00:29:37,945 రోజంతా తిరుగుతూ ఆ పోస్టర్లు అతికించటానికా? 412 00:29:38,028 --> 00:29:39,905 వద్దు, ధన్యవాదాలు. నేను ఇక్కడే ఉంటాను. 413 00:29:39,988 --> 00:29:42,699 అదీకాక, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉంది, ఒక పూల్ ఉంది. అంతా ఉంది. 414 00:29:42,783 --> 00:29:44,743 అంటే ఊరికే ఆ ఫోన్ పట్టుకని వేళ్ళాడుతూ ఉంటావా. 415 00:29:45,661 --> 00:29:47,788 ఈ పట్టణంలో జనం ఏమి పోస్ట్ చేస్తున్నారో చూస్తున్నాను. 416 00:29:48,872 --> 00:29:51,458 వీళ్ళకు హైస్కూల్ బేస్ బాల్ జట్టు అంటే చాలా ఇష్టం. 417 00:29:54,253 --> 00:29:55,837 ఆశ్చర్యం. ఇది అతనే. 418 00:29:57,214 --> 00:29:59,466 ఇప్పుడు జూడ్ ఒక పాట పాడబోతున్నాడు. 419 00:29:59,550 --> 00:30:02,344 జూడ్ ఏం పాడబోతున్నాడో మనం విందాం! తీసుకో జూడ్! పద! 420 00:30:03,637 --> 00:30:04,846 చూడు. 421 00:30:06,098 --> 00:30:07,182 అతను మతభ్రష్టుడు. కదా? 422 00:30:08,308 --> 00:30:09,518 ఇది ఎక్కడ? 423 00:30:09,601 --> 00:30:12,729 ఏదో బార్. జె... స్ప్రాట్స్? 424 00:30:13,397 --> 00:30:14,398 వెళదామా? 425 00:30:14,481 --> 00:30:16,650 వద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కదానినే వెళతాను. 426 00:30:16,733 --> 00:30:19,236 నాకు అర్థం కాలేదు. నన్ను రమ్మంటావని అనుకున్నాను? 427 00:30:19,820 --> 00:30:21,488 నన్ను ఇలా ఉంచితే నేను ఎలా నేర్చుకుంటాను? 428 00:30:21,572 --> 00:30:24,992 మనం ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం. ఇది ప్రమాదం. 429 00:30:26,201 --> 00:30:27,661 నాకు నీతో రావాలని ఉంది. 430 00:30:27,744 --> 00:30:29,830 నువ్వు దీనిలో భాగమవుతావా? 431 00:30:29,913 --> 00:30:30,831 అవును. 432 00:30:30,914 --> 00:30:32,958 -నువ్వు ఒక బాధ్యత తీసుకుంటావా? -సరే! 433 00:30:33,041 --> 00:30:36,003 సరే! అయితే నా ఆదేశాలను అనుసరించాలి. 434 00:30:53,604 --> 00:30:55,022 -హలో? -నిక్? 435 00:30:56,690 --> 00:30:57,941 నేను. 436 00:30:58,025 --> 00:30:58,900 టోనీ? 437 00:30:58,984 --> 00:31:01,987 జే స్ప్రాట్స్ బార్ అండ్ ట్యాప్ 438 00:31:12,956 --> 00:31:14,249 3:00 గంటలకు తెరుస్తాం. 439 00:31:14,333 --> 00:31:15,334 సరే. 440 00:31:16,168 --> 00:31:17,502 ఇతనికోసం వెతుకుతున్నాను. 441 00:31:21,757 --> 00:31:24,468 అతనికి సహాయం అవసరం, అతను ఇక్కడ ఉన్నట్లు తెలిసింది. 442 00:31:25,052 --> 00:31:28,221 -అవును. ఒక రాత్రి వచ్చాడు. వింతమనిషి. -సరే. 443 00:31:29,514 --> 00:31:32,017 -అతను ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? -నాకు తెలియదు. 444 00:31:33,518 --> 00:31:35,020 ఏదైనా గానీ? 445 00:31:35,103 --> 00:31:36,021 ప్లీజ్? 446 00:31:37,522 --> 00:31:40,525 ఆగు. అతను ఏదో వదిలిపెట్టినట్లున్నాడు. నా దగ్గరది ఉండాలి. 447 00:31:40,609 --> 00:31:41,443 ధన్యవాదాలు. 448 00:31:50,577 --> 00:31:52,454 అతను ఈ చిరునామాకోసం వెతుకుతున్నాడు. 449 00:31:54,706 --> 00:31:55,582 ధన్యవాదాలు. 450 00:32:26,071 --> 00:32:28,448 -సరే, న్యాయవాదులు అవసరంలేదు. -సరే. సారీ మిస్. 451 00:32:29,241 --> 00:32:32,411 నేను ఇతనికోసం వెతుకుతున్నాను. అతను అనారోగ్యంగా ఉన్నాడు. 452 00:32:32,494 --> 00:32:34,913 అతను మీకోసం వెతుకుతున్నట్లు నాకు తెలిసింది. 453 00:32:38,458 --> 00:32:40,752 అవును. అతనిని ఇక్కడ చూశాను. 454 00:32:41,461 --> 00:32:42,546 ఎక్కడ? 455 00:32:44,840 --> 00:32:46,299 ఏమైనా బహుమతి ఉందా? 456 00:32:47,300 --> 00:32:48,343 బహమతా? 457 00:32:49,052 --> 00:32:51,179 అతనికి సహాయం అవసరమని నేను చెబుతున్నాను. 458 00:32:51,263 --> 00:32:52,305 నేనూ అదే అంటున్నాను. 459 00:32:54,683 --> 00:32:55,642 ఎంత? 460 00:32:56,518 --> 00:32:58,353 మూడువేలు అయితే బాగుంటుంది. 461 00:33:01,314 --> 00:33:04,276 -హలో మిస్ న్యూబెరీ! -హేయ్, జెరెమీ. తొక్కుతూ ఉండు. 462 00:33:07,237 --> 00:33:11,366 చూడు, జీవితంలో నాకు అదృష్టం బొత్తిగా లేదు, సరేనా? 463 00:33:12,367 --> 00:33:15,871 నాకు ఇప్పుడు ఉద్యోగంలేదు. పన్నులుకట్టాలి. నా ఇల్లుకూడా పోవచ్చు. 464 00:33:15,954 --> 00:33:17,831 నాకు ఈ నాటకాలు అంతా తెలుసు, 465 00:33:17,914 --> 00:33:21,168 ఏవో కాకమ్మ కబుర్లు చెప్పొద్దు అతనికి సాయం చేయాలి అంటూ. 466 00:33:21,251 --> 00:33:24,171 అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే 3,000 డాలర్లు ఇవ్వు. 467 00:33:24,838 --> 00:33:26,047 నీ దగ్గర నా నంబర్ ఉంది. 468 00:33:30,761 --> 00:33:32,554 మీరు మిస్ న్యూబెరీకి స్నేహితులా? 469 00:33:32,637 --> 00:33:34,639 -కాదు. -అదే అనుకున్నాను. 470 00:33:34,723 --> 00:33:36,600 ఆమెకు ఫ్రెండ్స్ లేరు. 471 00:33:36,683 --> 00:33:38,101 అందుకే నేను హాయ్ చెప్పాను. 472 00:33:39,561 --> 00:33:40,520 బై. 473 00:33:46,276 --> 00:33:47,986 ఇంట్లో తయారుచేసిన గ్రనోలా. 474 00:33:48,069 --> 00:33:50,030 మేము మా అతిథులు అందరికీ ఇది ఇస్తాము. 475 00:33:50,864 --> 00:33:51,865 ధన్యవాదాలు హేనా. 476 00:33:51,948 --> 00:33:53,450 -ఫరవాలేదు. -ధన్యవాదాలు. 477 00:33:55,619 --> 00:33:56,620 ధన్యవాదాలు. 478 00:33:57,662 --> 00:34:00,290 గేబ్ విషయంలో ఎక్కువ సాయం చేయలేకపోయినందుకు సారీ. 479 00:34:03,210 --> 00:34:06,213 అయితే ఒకటి చెబుతాను, వదలకుండా ప్రయత్నిస్తూ ఉండు. 480 00:34:08,423 --> 00:34:11,384 అతను దొరికితే నేను హాయ్ చెప్పానని చెప్పు. 481 00:34:14,221 --> 00:34:15,138 తప్పకుండా చెబుతా. 482 00:34:43,542 --> 00:34:44,793 ఇప్పుడే బయలుదేరారు. 483 00:34:45,836 --> 00:34:47,128 ఔను, చూశా వాళ్లని. 484 00:35:12,487 --> 00:35:14,906 మనం మళ్ళీ సూట్స్ చెక్ చేద్దామా? 485 00:35:14,990 --> 00:35:16,658 ఊరికే జాగ్రత్తకోసమా? 486 00:35:17,868 --> 00:35:20,078 మీరు ఇంత కంగారు వ్యక్తి అని అనుకోలేదు. 487 00:35:20,161 --> 00:35:24,666 సరే, మూర్ఖపు పనులు చేస్తే ఇప్పటిదాకా ఉండేవాడిని కాను. 488 00:35:25,375 --> 00:35:29,379 వెయ్యిసార్లకు పైగా అంతరిక్షంలోకి టెలీపోర్ట్ అయిన వ్యక్తి ఇది అంటున్నాడు. 489 00:35:31,548 --> 00:35:33,341 వినండి బాబూ, మనం వెళుతున్నాము. 490 00:35:33,425 --> 00:35:35,385 మానవాళికి ఇది అవసరం. 491 00:35:35,468 --> 00:35:36,344 మానవాళికా? 492 00:35:37,470 --> 00:35:39,389 మానవాళి అంతా బాగానే ఉంది. 493 00:35:39,472 --> 00:35:41,308 మీరు ఏ గ్రహంపైన ఉంటున్నారు? 494 00:35:46,771 --> 00:35:47,814 సరే. 495 00:35:49,983 --> 00:35:51,151 హేయ్ బైరన్. 496 00:35:54,321 --> 00:35:55,196 చెప్పండి? 497 00:35:56,448 --> 00:35:57,490 నేను రావటంలేదు. 498 00:36:03,622 --> 00:36:04,539 సారీ. 499 00:36:06,249 --> 00:36:07,876 సరే. నాకు అర్థమయింది. 500 00:36:09,419 --> 00:36:12,213 -ఇది భయస్తులకు కాదు. -కాదు, నాకు భయం ఏమీ లేదు. 501 00:36:16,551 --> 00:36:18,303 ఐరీన్ లేకుండా రావటం ఇష్టంలేదు. 502 00:36:20,055 --> 00:36:20,972 నేను రాలేను. 503 00:36:24,559 --> 00:36:25,560 నేను వెళ్ళగలను. 504 00:36:44,412 --> 00:36:48,625 ఒకవేళ ఏమయినా జరిగితే, ఏమీ జరగదని తెలుసు, 505 00:36:49,542 --> 00:36:52,462 నేను ఏదో ఒకటి సాధించానని ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి. 506 00:36:54,756 --> 00:36:57,300 చాల్లే, అసలు నువ్వుకూడా వెళ్ళకపోతే బాగుంటుంది. 507 00:36:57,384 --> 00:37:00,220 ఈ వ్యవహారమంతా నాకు పిచ్చిపని అని అనిపిస్తోంది. 508 00:37:00,303 --> 00:37:03,014 ఇది ఏ మాత్రం పిచ్చిపని కాదు. 509 00:37:42,721 --> 00:37:43,930 అది పని చేస్తుంది. 510 00:38:08,163 --> 00:38:09,664 బైరన్, నా మాట వినబడుతోందా? 511 00:38:29,017 --> 00:38:30,393 అక్కడ ఎలా ఉంది? 512 00:38:34,731 --> 00:38:36,066 ఇది అద్భుతంగా ఉంది. 513 00:38:37,734 --> 00:38:39,235 ఫ్రాంక్, ఇది అద్భుతంగా ఉంది! 514 00:38:40,779 --> 00:38:42,697 మీరుకూడా ఇది చూస్తే బాగుండేది ఫ్రాంక్. 515 00:38:44,032 --> 00:38:46,576 ఇది దాదాపు స్వర్గంలాగా అనిపిస్తోంది. 516 00:38:47,911 --> 00:38:49,245 సరే, మనం అలా అనుకోవద్దు. 517 00:38:51,331 --> 00:38:52,874 నేను లోపలికి వెళతాను. 518 00:38:52,957 --> 00:38:54,542 సరే, వెళ్ళొద్దు... 519 00:38:55,418 --> 00:38:57,295 ఎక్కువ దూరం వెళ్ళొద్దు. 520 00:39:00,423 --> 00:39:01,508 కాదు, నేను... 521 00:39:02,592 --> 00:39:03,760 కొద్దిగా మాత్రమే 522 00:39:05,011 --> 00:39:06,679 దిగుతాను 523 00:39:06,763 --> 00:39:08,139 ఇంకా కొద్దిగా మాత్రమే. 524 00:39:12,393 --> 00:39:13,436 భగవాన్! 525 00:39:14,187 --> 00:39:15,772 -ఏమటిది చెత్త-- -ఏమిటి? 526 00:39:15,855 --> 00:39:17,524 బైరన్, నువ్వు బాగానే ఉన్నావా? 527 00:39:18,149 --> 00:39:18,983 ఇది చాలా... 528 00:39:20,026 --> 00:39:21,611 చాలా వింతగా ఉంది, ఫ్రాంక్. 529 00:39:22,445 --> 00:39:24,989 ఏమిటి? నువ్వు ఏమి చూశావు? 530 00:39:27,700 --> 00:39:30,120 నాకు ఇక్కడ ఒక ఫర్నిచర్ ముక్క కనిపించింది. 531 00:39:31,079 --> 00:39:32,664 బైరన్ వెనక్కు రా. 532 00:39:33,289 --> 00:39:34,332 వెనక్కు వచ్చెయ్. 533 00:39:36,626 --> 00:39:40,255 దాదాపుగా చేరుకున్నాను. అక్కడకు వెళుతున్నాను. నాకు కనిపిస్తుంది... 534 00:39:41,172 --> 00:39:42,048 అబ్బా. 535 00:39:43,049 --> 00:39:47,345 బైరన్, నీ గొంతు సరిగ్గా వినబడటంలేదు. నాకు వినబడటంలేదు. వచ్చెయ్. 536 00:39:49,139 --> 00:39:50,098 ఓహ్, దేముడా. 537 00:39:51,099 --> 00:39:53,101 ఫ్రాంక్, మీరు ఇది నమ్మరు! 538 00:39:54,269 --> 00:39:55,311 ఫ్రాంక్! 539 00:39:56,271 --> 00:39:57,230 అబ్బా. 540 00:39:58,064 --> 00:39:59,065 బైరన్? 541 00:40:01,818 --> 00:40:04,696 బైరన్, నీ మాట వినబడటంలేదు, నువ్వు కనబడటంలేదు. 542 00:40:04,779 --> 00:40:06,698 బైరన్, వెనక్కు వచ్చెయ్. 543 00:40:11,119 --> 00:40:12,162 బైరన్? 544 00:40:13,371 --> 00:40:14,372 బైరన్? 545 00:40:16,833 --> 00:40:18,293 బైరన్, నా మాట వినబడుతోందా? 546 00:40:24,632 --> 00:40:26,759 బైరన్? వెనక్కు వచ్చెయ్ మిత్రమా. ప్లీజ్. 547 00:40:28,344 --> 00:40:29,596 అబ్బా ఛ. 548 00:40:49,657 --> 00:40:52,035 రోజెన్ఫించ్ హోటల్ 549 00:40:52,118 --> 00:40:53,870 సెలెస్టియల్ డ్రేపరీ 550 00:41:06,424 --> 00:41:08,468 నిక్ ముక్కు మెరుగుపడుతోంది. 551 00:41:11,137 --> 00:41:13,306 నువ్వు ఇలా చేస్తావనుకోలేదు స్టెల్లా. 552 00:41:15,016 --> 00:41:16,851 మీ నాన్న చాలా దిగులుపడిఉండేవాడు. 553 00:41:18,436 --> 00:41:22,106 ఆ మతభ్రష్టుడు ఇక్కడ ఉన్నాడు. అతని ఆచూకీ నాకు తెలిసినట్లే. 554 00:41:22,190 --> 00:41:23,983 తెలిసినట్లే అంటే ఏమిటి? 555 00:41:24,067 --> 00:41:27,695 అతను ఎక్కడ ఉన్నదీ ఒక ఆవిడకు తెలుసు. కానీ ఆమె డబ్బు అడుగుతోంది. 556 00:41:29,656 --> 00:41:31,074 ఆమెకు ఏమి కావాలో మనకెందుకు? 557 00:41:31,908 --> 00:41:33,868 ఆమెకు ఏమీ సంబంధంలేదు, అది నాకు తెలుసు. 558 00:41:34,619 --> 00:41:36,079 ఆమెకు డబ్బు ఇవ్వటమే సులభం. 559 00:41:37,163 --> 00:41:38,122 డబ్బు ఇవ్వటమా? 560 00:41:40,333 --> 00:41:41,584 నిజంగానా? 561 00:41:45,505 --> 00:41:48,258 సరే, సరే. ప్రపంచం ఎలా అయిపోయింది. 562 00:41:54,764 --> 00:41:58,059 సరే, మన ఈ చిన్న సాహసయాత్రకు ఇది ముగింపు అనుకుంటున్నాను. 563 00:41:58,142 --> 00:42:00,270 ఒకరకంగా నీరసమైన ముగింపు. 564 00:42:04,440 --> 00:42:07,151 జూడ్, నువ్వు లోపలికి వెళ్ళు. 565 00:42:07,235 --> 00:42:09,070 నేను డెనీస్తో విడిగా మాట్లాడాలి. 566 00:42:11,990 --> 00:42:13,157 -ధన్యవాదాలు. -సరే. 567 00:42:18,371 --> 00:42:20,581 నాతో పెరట్లోకి రా. 568 00:42:20,665 --> 00:42:22,417 నేను నీకు ఒకటి చూపిస్తాను. 569 00:42:38,349 --> 00:42:39,309 ఫ్రాంక్లిన్? 570 00:42:44,772 --> 00:42:46,024 నీకు ఏమైనా దొరికిందా? 571 00:42:50,862 --> 00:42:51,821 లేదు. 572 00:42:55,867 --> 00:42:57,327 ఇక్కడ అంతా ఎలా ఉంది? 573 00:43:01,497 --> 00:43:02,749 చెప్పటానికి ఏమీ లేదు. 574 00:44:18,324 --> 00:44:20,118 దీనిని తాత కట్టారా? 575 00:44:20,201 --> 00:44:21,702 ఈ భూ గృహాన్ని, అవును. 576 00:44:23,204 --> 00:44:24,414 మిగతాది మాత్రం కాదు. 577 00:44:25,581 --> 00:44:26,999 "చుక్కలలోకి." 578 00:44:28,334 --> 00:44:31,170 మొదట, ఇది ఒక బాంబ్ షెల్టర్ అనుకున్నాము, 579 00:44:31,254 --> 00:44:32,338 కానీ అది కాదు. 580 00:44:33,131 --> 00:44:34,173 ఇది ఏమిటి? 581 00:44:35,091 --> 00:44:37,427 దీనిని ఏమని పిలవాలో నాకు ఇంకా తెలియదు. 582 00:44:51,524 --> 00:44:55,111 -నానమ్మా, నాకు భయం వేస్తోంది. ఇది ఏమిటి? -నా పక్కన కూర్చో. 583 00:45:00,741 --> 00:45:04,745 మీ నాన్న చనిపోయిన తర్వాత మాకు ఇది కనబడింది. 584 00:45:06,122 --> 00:45:08,666 అంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. 585 00:45:09,834 --> 00:45:12,044 మైకెల్ను కోల్పోవటం, ఇంకా నేను... 586 00:45:13,880 --> 00:45:15,047 నేను అనుకున్నాను... 587 00:45:16,215 --> 00:45:18,092 ఇదంతా ఒకదానికొకటి ముడిపడిఉంది అని. 588 00:45:19,385 --> 00:45:21,804 కానీ దీనికీ, నాన్నకూ సంబంధం ఏమిటి? 589 00:45:23,264 --> 00:45:27,185 బహుశా లేదేమోనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. 590 00:45:34,025 --> 00:45:36,027 డెనీస్, నేను నీకు చెప్పబోయేది 591 00:45:37,695 --> 00:45:39,030 నమ్మటానికి కష్టం. 592 00:45:40,573 --> 00:45:41,991 కానీ ఇది నిజం. 593 00:45:45,995 --> 00:45:48,331 నువ్వు ఈ వలయంలోకి ప్రవేశిస్తే, 594 00:45:49,749 --> 00:45:51,250 ఆ తలుపులు మూసుకుంటాయి. 595 00:45:52,460 --> 00:45:53,794 ఆ దీపాలు వెలుగుతాయి. 596 00:45:55,671 --> 00:45:56,547 ఇంకా నువ్వు... 597 00:45:58,341 --> 00:46:03,596 నీకు కొత్తగా అనిపిస్తుంది నీ జీవితంలో ఎప్పుడూ కలగని భావన కలుగుతుంది. 598 00:46:07,099 --> 00:46:08,601 ఈ తలుపులు తెరుచుకుంటాయి. 599 00:46:11,020 --> 00:46:12,855 అప్పుడు నువ్వు వేరే గ్రహంపైన ఉంటావు. 600 00:46:14,690 --> 00:46:16,817 నీకు ఏదో అయింది. 601 00:46:16,901 --> 00:46:18,319 నీవు చెప్పేదానికి అర్థంలేదు. 602 00:46:20,655 --> 00:46:21,572 ఫరవాలేదు. 603 00:46:33,584 --> 00:46:34,669 మైకెల్ పోయిన తర్వాత 604 00:46:37,088 --> 00:46:38,172 చాలా కష్టంగా ఉండేది. 605 00:46:40,132 --> 00:46:41,050 రోజు గడపటమే... 606 00:46:42,385 --> 00:46:43,719 కష్టంగా ఉండేది. 607 00:46:47,181 --> 00:46:48,933 అప్పుడు నాకు ఇది కనబడింది, నేను... 608 00:46:49,684 --> 00:46:51,394 ఇది నాకు సాయపడుతుందని అనుకున్నాను. 609 00:46:52,562 --> 00:46:53,729 ఇప్పుడు, నేను 610 00:46:55,982 --> 00:46:57,984 నీకు సాయపడుతున్నానని అనుకున్నాను... 611 00:46:58,067 --> 00:47:00,945 -నేను తాతను తీసుకొస్తాను. -... ఇప్పటిదాకా. లేదు. 612 00:47:01,028 --> 00:47:02,363 ఆయనకు తెలుసు, బంగారం. 613 00:47:04,532 --> 00:47:07,076 మేము నిన్ను దీనికి దూరంగా ఉంచాలని అనుకున్నాం. 614 00:47:11,998 --> 00:47:14,417 -అప్పుడు జూడ్ వచ్చాడు-- -జూడ్? 615 00:47:16,836 --> 00:47:17,753 అవును. 616 00:47:19,213 --> 00:47:20,840 అతను అలా వచ్చాడు ఇక్కడకు. 617 00:47:22,550 --> 00:47:23,593 కాదు, అతను రాలేదు. 618 00:47:25,761 --> 00:47:27,054 అలా అని నీకు చెప్పాడా? 619 00:47:27,888 --> 00:47:31,309 డెనీస్, నాకు అతను దొరికాడు. 620 00:47:33,019 --> 00:47:33,936 ఇక్కడ. 621 00:47:35,563 --> 00:47:36,439 కాదు. 622 00:47:39,400 --> 00:47:40,818 చాలు, వద్దు, నువ్వు కాదు. 623 00:47:42,737 --> 00:47:44,238 అది నిజం కాదు. 624 00:47:44,322 --> 00:47:45,448 అదే. 625 00:47:45,531 --> 00:47:46,699 అది నిజం. 626 00:47:52,913 --> 00:47:54,123 నాకు అబద్ధం చెప్పావు. 627 00:47:57,168 --> 00:47:58,169 మీ అందరూ. 628 00:48:34,997 --> 00:48:36,832 వీళ్ళు ఎవరు? 629 00:48:36,916 --> 00:48:38,125 నీకు సంబంధం లేదు. 630 00:48:45,716 --> 00:48:46,717 కానీయ్. అది తెరువు. 631 00:48:51,138 --> 00:48:52,390 ఇది ఏమిటి? 632 00:48:53,933 --> 00:48:55,059 డబ్బు అని చెప్పాను. 633 00:48:56,227 --> 00:48:58,521 నేను స్పష్టంగా చెప్పాను, నాకు... కరెన్సీ. 634 00:48:59,355 --> 00:49:00,815 ఈ పిచ్చి నాణాలు కాదు. 635 00:49:00,898 --> 00:49:04,068 -నన్ను నమ్మండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. -అది బంగారం. 636 00:49:04,902 --> 00:49:07,071 3,000 డాలర్ల కంటే చాలా ఎక్కువ విలువకలవి. 637 00:49:07,655 --> 00:49:11,075 సరే, అయితే వీటిని అమ్మి డబ్బు తీసుకురండి. 638 00:49:11,575 --> 00:49:14,370 నేను స్పష్టంగా చెప్పాను. ఇది మన ఒప్పందం కాదు. 639 00:49:15,955 --> 00:49:17,415 ఆ మతభ్రష్టుడు ఎక్కడ? 640 00:49:17,915 --> 00:49:19,083 ఎవరు? 641 00:49:25,339 --> 00:49:26,257 అమ్మా... అతనిని ఆపు! 642 00:49:28,092 --> 00:49:29,844 -అతను ఎక్కడ? -నేను... అతను... 643 00:49:31,095 --> 00:49:32,722 యార్క్స్ ఇంటిలో ఉన్నాడు. తను... 644 00:49:34,557 --> 00:49:38,269 అతను ఒక సంరక్షకుడు. అది పోస్ట్ రోడ్ పక్కన ఉంటుంది. 645 00:49:38,894 --> 00:49:41,397 నాకు అంతవరకే తెలుసు, ఒట్టు. 646 00:49:43,065 --> 00:49:44,150 చూశావా? 647 00:49:46,902 --> 00:49:48,446 అది కష్టమేమీ కాదు. 648 00:49:58,164 --> 00:49:59,498 ఎందుకలా చేశావు? 649 00:50:00,791 --> 00:50:01,917 ఆమె మనకు చెప్పింది! 650 00:50:08,132 --> 00:50:09,383 నువ్వు మెత్తగా అయ్యావు. 651 00:50:16,807 --> 00:50:18,225 మనం దీనిని సరిచేయాలి. 652 00:50:20,227 --> 00:50:21,479 నీ క్షేమం కోసమే. 653 00:50:43,167 --> 00:50:44,418 ఫరవాలేదు. 654 00:50:47,755 --> 00:50:49,089 నేను మాట ఇస్తున్నాను. 655 00:52:46,206 --> 00:52:48,208 ఉపశీర్షికలు అనువదించినది కర్త శ్రవణ్ 656 00:52:48,292 --> 00:52:50,294 క్రియేటివ్ సూపర్వైజర్ సమత