1 00:00:22,858 --> 00:00:26,028 "చెడు అతీంద్రియ శక్తులపై నమ్మకం అవసరం లేదు; 2 00:00:26,111 --> 00:00:28,530 మనుషులు అన్నిరకాల దుర్మార్గాలు చెయ్యగలిగే సమర్థులు." 3 00:00:28,614 --> 00:00:29,531 -జోసెఫ్ కాన్రాడ్ 4 00:01:15,994 --> 00:01:18,539 పర్లేదు. పర్లేదు. 5 00:01:52,197 --> 00:01:53,407 బెటో? 6 00:02:02,958 --> 00:02:04,418 అది విన్నావా? 7 00:02:14,344 --> 00:02:16,763 లేదు! లేదు! లేదు, లేదు, లేదు, లేదు! 8 00:02:16,847 --> 00:02:20,893 లేదు! లేదు! లేదు! లేదు! 9 00:02:45,959 --> 00:02:48,754 గోల్డెన్ వ్యాలీకి స్వాగతం - స్థా. 1877 1977 - మా 100వ సంవత్సరం! 10 00:02:48,837 --> 00:02:50,797 -వెరోనికా చెప్పింది నిజమే. -ఏమిటి? 11 00:02:51,632 --> 00:02:53,926 ఇక్కడ మెక్‌డొనాల్డ్స్ కూడా లేదు. 12 00:02:54,968 --> 00:02:58,680 -దేవుడా, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. -అవును! 13 00:02:59,181 --> 00:03:03,143 ఇప్పుడు బయలుదేరితే, రాత్రి భోజన సమయానికి లాస్ ఏంజెలెస్‌లో ఉంటాము. 14 00:03:04,227 --> 00:03:08,023 నీ సోదరికి ఇక్కడ నచ్చదని తెలుసు, నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. 15 00:03:09,191 --> 00:03:10,400 మీ ఇద్దరికీ. 16 00:03:12,653 --> 00:03:14,863 ఇది నీకెంత ముఖ్యమో నాకు తెలుసు. 17 00:03:15,739 --> 00:03:19,534 నువ్వు యుఎస్‌లో ఉన్నది ఐదేళ్లే అయినా, అప్పుడే మేనేజర్ అయిపోయావు. 18 00:03:22,454 --> 00:03:24,623 -నేనంతే. -అది పెద్ద విషయం. 19 00:03:27,376 --> 00:03:29,211 అది మనకు ముఖ్యం. 20 00:03:30,712 --> 00:03:32,923 బెటో. మనం బాగానే ఉన్నాము. 21 00:03:34,007 --> 00:03:34,841 నిజంగా. 22 00:03:44,810 --> 00:03:47,938 జీవితంకంటే సమయం ఎక్కువ ఉంది. 23 00:03:49,856 --> 00:03:51,274 అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. 24 00:03:53,068 --> 00:03:54,486 జీవితం చాలా చిన్నది. 25 00:03:55,737 --> 00:03:57,364 ఇక్కడ అలా అంటాము. 26 00:03:58,532 --> 00:04:00,158 నేను అన్నది మరింత బాగుంది. 27 00:04:41,658 --> 00:04:46,413 నికోస్ ఫార్మసీ 28 00:04:46,496 --> 00:04:50,542 మునికా ప్రెసియోస బ్యూటీ 29 00:04:50,625 --> 00:04:54,588 డ్రెస్ షాప్ 30 00:04:54,671 --> 00:04:56,548 పనడేరియా మెక్సికానా 31 00:04:56,631 --> 00:04:58,717 తాజా ఉత్పత్తులు 32 00:04:58,800 --> 00:05:02,804 లోకల్ స్టేషన్ బార్బర్ 33 00:05:02,888 --> 00:05:07,017 రూట్ 190 డైనర్ 34 00:05:09,144 --> 00:05:11,104 ఆంగ్లం మాత్రమే 35 00:05:42,761 --> 00:05:43,887 ఇంటికి వచ్చేసాం. 36 00:05:51,812 --> 00:05:53,021 వస్తున్నావా? 37 00:05:58,318 --> 00:06:02,572 మాద్రేస్ 38 00:06:16,211 --> 00:06:19,798 నిజమైన సంఘటనల ఆధారంగా... 39 00:07:31,494 --> 00:07:32,412 అంటే, 40 00:07:34,581 --> 00:07:38,501 చిత్రాలలో కాస్త వేరుగా కనిపించింది. 41 00:07:42,505 --> 00:07:44,090 అవి పాతవి అయ్యుంటాయి. 42 00:07:47,219 --> 00:07:50,347 ఇది ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు, కానీ... 43 00:07:51,389 --> 00:07:52,891 ఏమంటారు? 44 00:07:53,475 --> 00:07:56,978 ఇప్పుడే వచ్చిన ఆస్తిలో లోపం కనుగొనండి? 45 00:07:57,646 --> 00:07:59,314 ఇవ్వబడినదానిలో లోపం వెతక్కండి? 46 00:07:59,397 --> 00:08:02,984 అవును! అదే. ఉచితంగా వచ్చిన ఇంట్లో లోపం వెతక్కండి. 47 00:08:03,735 --> 00:08:06,571 అవి చిన్న మరమత్తులు. ఎక్కువ సమయం పట్టదు. 48 00:08:08,448 --> 00:08:09,783 ఇద్దరం కలిసి చేద్దాం. 49 00:08:15,997 --> 00:08:17,374 పెయింట్ కొనాలి. 50 00:08:18,959 --> 00:08:21,086 కొంత ఫర్నిచర్. కొత్తది. 51 00:08:22,045 --> 00:08:22,921 సరే. 52 00:08:24,839 --> 00:08:26,132 మన కుటుంబ చిత్రాలు. 53 00:08:34,099 --> 00:08:35,767 వారికి భక్తి ఎక్కువంటావా? 54 00:08:37,894 --> 00:08:40,522 ప్రతీ తలుపు మీద ఒకటి ఉంటే దెయ్యాలు రావు. 55 00:08:43,900 --> 00:08:46,236 ఈ చోటు రాయటానికి చక్కగా సరిపోతుంది. 56 00:08:46,778 --> 00:08:49,823 న్యూస్‌పేపర్‌లో పనిచేస్తున్నప్పటి క్యూబికల్ కంటే బాగుంది. 57 00:08:50,699 --> 00:08:53,576 స్టోరేజ్ ఎక్కువ ఉండదని ఆందోళన పడ్డావు. 58 00:08:57,747 --> 00:09:00,417 ఇప్పుడు తగినన్ని ఇంజెక్షన్లు లేవని ఆందోళన. 59 00:09:03,628 --> 00:09:07,090 పద, భోజనానికి వెళదాము. ఊరు చూసినట్టు ఉంటుంది. 60 00:09:12,137 --> 00:09:14,597 బొటానికా 61 00:09:19,936 --> 00:09:21,396 -హలో. -ఎలా ఉన్నారు? 62 00:09:21,479 --> 00:09:23,940 -శుభ మధ్యాహ్నం, స్వాగతం. -ధన్యవాదాలు. 63 00:09:30,697 --> 00:09:32,615 మీరు ఇక్కడి వారు కాదు కదా? 64 00:09:35,368 --> 00:09:36,244 కాదు. 65 00:09:37,954 --> 00:09:40,206 క్షమించండి, నాకు స్పానిష్ బాగా రాదు. 66 00:09:41,791 --> 00:09:43,251 కానీ మీరు చూడడానికి... 67 00:09:44,044 --> 00:09:46,880 పర్వాలేదు. నా పేరు అనీటా. 68 00:09:46,963 --> 00:09:50,008 డయానా, ఇది చూడు. పాపాయి గది కోసం. 69 00:09:50,091 --> 00:09:52,761 -ఇంకొక శిలువ అవసరమా? -అబ్బా. 70 00:09:52,844 --> 00:09:55,138 నా చిన్నతనంలో ఇలాంటిదే ఉండేది. 71 00:09:57,182 --> 00:09:59,976 -హాయ్! కలవటం సంతోషం. -నాక్కూడా. 72 00:10:01,311 --> 00:10:03,730 -మీ దుకాణం అందంగా ఉంది. -ధన్యవాదాలు. 73 00:10:03,855 --> 00:10:06,274 తగినంత చిల్లర ఉందేమో చూస్తాను... 74 00:10:08,943 --> 00:10:10,236 ఉంది, ఇదుగోండి. 75 00:10:11,237 --> 00:10:12,322 ధన్యవాదాలు. 76 00:10:15,075 --> 00:10:15,909 ఇదుగోండి. 77 00:10:17,202 --> 00:10:18,787 -ధన్యవాదాలు. -పర్వాలేదు. 78 00:10:21,456 --> 00:10:22,499 మీరు వెళ్లేముందు... 79 00:10:25,043 --> 00:10:27,087 మిమ్మల్ని దీవించవచ్చా? 80 00:10:27,587 --> 00:10:30,799 మీకు, మీ పుట్టబోయే పాపాయికి? 81 00:10:30,882 --> 00:10:32,175 అలాగే, తప్పకుండా. 82 00:10:41,351 --> 00:10:44,354 దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. 83 00:10:44,437 --> 00:10:46,231 స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే. 84 00:10:46,314 --> 00:10:48,817 మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే. 85 00:10:48,900 --> 00:10:51,986 పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా! పాపాత్ములమై యుండెడు మా కొరకు 86 00:10:52,070 --> 00:10:54,447 ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. 87 00:10:54,864 --> 00:10:55,782 ఆమెన్. 88 00:10:56,950 --> 00:10:57,867 ఆమెన్. 89 00:11:00,120 --> 00:11:02,163 మిమ్మలిద్దరినీ కలవటం బాగుంది. 90 00:11:05,166 --> 00:11:08,837 ఉండటానికి ఈ ఊరు చాలా బాగుండవచ్చు. 91 00:11:10,463 --> 00:11:13,299 -ఎప్పుడైనా రండి. -అలాగే, తప్పకుండా. 92 00:11:24,102 --> 00:11:27,021 మనకిది అద్భుతమైన కొత్త ప్రారంభం కాబోతుందనుకుంటాను. 93 00:11:27,981 --> 00:11:30,108 -అవునా? -అవును. 94 00:11:31,443 --> 00:11:32,944 ఎందుకో తెలియదు కానీ, 95 00:11:33,486 --> 00:11:36,030 ఈ ఊరు నా చిన్ననాటి ఊరుని తలపిస్తుంది. 96 00:11:41,578 --> 00:11:43,580 మన కుటుంబం మొదలుపెట్టటానికి సరైన చోటు. 97 00:11:50,211 --> 00:11:52,672 "ఉండటానికి ఈ ఊరు చాలా బాగుండవచ్చు" 98 00:11:52,755 --> 00:11:55,425 అనడంలో ఆ అనీటా ఉద్దేశం ఏమిటంటావు? 99 00:11:56,384 --> 00:11:59,512 -ఆమె అలా అందా? -లేదు. 100 00:12:00,263 --> 00:12:01,931 "ఉండవచ్చు" అనడం దేనికి? 101 00:12:02,307 --> 00:12:04,934 ఇలా కూడా అనచ్చుగా "ఇది అద్భుతమైన..." 102 00:12:06,644 --> 00:12:09,898 -ఏమిటది? -నక్క అయ్యుండచ్చు. 103 00:12:11,441 --> 00:12:13,401 పల్లెలో ఉండటం అలవాటు అయిపోతుంది. 104 00:12:20,492 --> 00:12:22,660 బెటో. బయట ఎవరో ఉన్నారు. 105 00:12:22,744 --> 00:12:27,165 ప్రియతమా, కొత్త ఇంట్లో ఇది మన తొలి రాత్రి. 106 00:12:27,248 --> 00:12:29,042 కొత్త శబ్దాలు వినబడతాయి. 107 00:13:20,218 --> 00:13:21,052 పదండి! 108 00:13:22,262 --> 00:13:23,179 బయటకు వెళ్ళండి! 109 00:14:32,624 --> 00:14:34,876 -ఎలా ఉన్నారు? శుభ మధ్యాహ్నం. -బాగున్నాను. 110 00:14:36,085 --> 00:14:38,296 -నా పేరు రోబర్టో. -ఎర్నెస్టో. కలవటం సంతోషం. 111 00:14:38,379 --> 00:14:40,381 కలవటం సంతోషం, ఎర్నెస్టో. కలవటం సంతోషం. 112 00:14:42,008 --> 00:14:43,009 కాఫీ? 113 00:14:44,093 --> 00:14:45,219 తప్పకుండా. 114 00:14:45,928 --> 00:14:46,846 ధన్యవాదాలు. 115 00:14:49,098 --> 00:14:50,058 బాగుంది. 116 00:14:57,774 --> 00:14:58,733 టొమాస్? 117 00:14:59,150 --> 00:15:00,777 నిజానికి, "థామస్" అంటారు. 118 00:15:02,362 --> 00:15:06,449 -క్షమించాలి, స్పెల్లింగ్ చూసి... -పర్వాలేదు. ఇది మామూలే. 119 00:15:06,532 --> 00:15:07,617 చాలా బాగుంది. 120 00:15:08,117 --> 00:15:09,952 మీరు జాగ్రత్తగా రావడం సంతోషం. 121 00:15:10,036 --> 00:15:10,995 -అవునవును. -ఆ? 122 00:15:11,079 --> 00:15:13,623 ఇల్లెలా ఉంది? కాస్త మరమత్తులు ఉన్నాయని... 123 00:15:13,706 --> 00:15:15,083 లేదు, చక్కగా ఉంది. 124 00:15:15,166 --> 00:15:16,084 -నిజంగా. -అవునా? 125 00:15:16,167 --> 00:15:19,337 మమ్మల్ని ఉండనిచ్చినందుకు క్విల్ గారికి ధన్యవాదాలు చెప్పండి. 126 00:15:19,420 --> 00:15:20,922 నిజానికి అన్నిటికీ. 127 00:15:23,508 --> 00:15:24,550 నాతో రండి. 128 00:15:26,803 --> 00:15:28,596 బాగుంది, కదా? 129 00:15:29,013 --> 00:15:29,847 అవును. 130 00:15:29,931 --> 00:15:34,936 ప్రతీ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది. ఆ కొత్త వ్యవసాయ రసాయనాలు దేవుడిచ్చిన వరం. 131 00:15:35,895 --> 00:15:40,608 ఎర్నెస్టోని కలిసావు. ఈమె అతని భార్య మరిసోల్, హెక్టర్. వీళ్ళతో పనిచేస్తావు. 132 00:15:40,692 --> 00:15:41,943 -ఎలా ఉన్నారు? -శుభ మధ్యాహ్నం. 133 00:15:42,026 --> 00:15:43,861 -కలవటం బాగుంది. -నాక్కూడా. 134 00:15:45,154 --> 00:15:47,532 కొత్త పంపిణీదారులతో నేను వ్యవహరిస్తాను 135 00:15:47,615 --> 00:15:49,992 -నువ్వు పనివాళ్లను చూసుకుంటావు. -సరే. 136 00:15:50,451 --> 00:15:54,455 -పల్లెలో చాన్నాళ్లు జీవించావా? -25 ఏళ్ల వయసులో వచ్చాను. 137 00:15:56,290 --> 00:15:57,291 న్యాయబద్ధంగా? 138 00:16:00,420 --> 00:16:02,922 క్షమించు, అది నాకు అనవసరం. 139 00:16:04,465 --> 00:16:07,593 -నీ సంగతేంటి? -నేను లాస్ ఏంజెలెస్‌లో పుట్టాను. 140 00:16:08,761 --> 00:16:10,930 -నా భార్య కూడా. -అవునా? నా... 141 00:16:11,472 --> 00:16:15,518 నా తల్లితండ్రులు 40లలో ఇక్కడకు వచ్చారు. వారు వ్యవసాయ కూలీలు. 142 00:16:16,519 --> 00:16:18,479 -ఇప్పుడు అర్ధమయ్యింది. -ఏమిటి? 143 00:16:18,563 --> 00:16:20,398 నీ ఇంగ్లీష్ ఎందుకింత బాగుందని! 144 00:16:20,940 --> 00:16:23,735 నేను ఎస్-హెచ్-ఐ-పి అనలేను. 145 00:16:23,818 --> 00:16:25,611 ఎప్పుడూ "షీప్" అనే వస్తుంది. 146 00:16:26,571 --> 00:16:28,781 -లేదా ఇంకా ఘోరంగా. -లేదా ఇంకా ఘోరంగా. 147 00:16:31,242 --> 00:16:33,536 నువ్వు ఇక్కడ ఉండటం బాగుంది. అవును. 148 00:16:35,121 --> 00:16:37,874 పని వారు పని చెయ్యటానికి ఇష్టపడతారనుకుంటాను... 149 00:16:38,416 --> 00:16:40,126 నిజమైన మెక్సికన్‌తో. 150 00:16:45,381 --> 00:16:47,216 ఘోరంగా ఉంది, కదా? 151 00:16:47,300 --> 00:16:48,259 పర్వాలేదు. 152 00:16:48,342 --> 00:16:51,179 పట్నం వదిలేసి పల్లెకు వెళ్ళావంటే నమ్మలేకపోతున్నా. 153 00:16:51,262 --> 00:16:55,600 నన్ను ఉద్యోగంలోనుండి తీసేసారు, కడుపుతో ఉన్నాను. వేరే మార్గాలు లేవు. 154 00:16:55,683 --> 00:16:58,770 కడుపుతో ఉన్నందుకు ఉద్యోగంలోనుండి తీసేసారు. 155 00:16:58,853 --> 00:17:00,730 ఉండి పోరాడాల్సింది! 156 00:17:01,397 --> 00:17:03,107 నిజానికి, మంచికే జరిగింది. 157 00:17:03,608 --> 00:17:07,153 రెండు నెలల్లో బిడ్డ పుడుతుంది తరువాత నేను నా పుస్తకం రాయచ్చు. 158 00:17:07,236 --> 00:17:09,781 దేని గురించి రాయాలో ఆలోచించావా? 159 00:17:09,864 --> 00:17:10,990 లేదు. 160 00:17:11,073 --> 00:17:14,118 కానీ ఆలోచిస్తాను. ఏదైనా పనికి వచ్చేది. 161 00:17:14,619 --> 00:17:18,748 -అమ్మ ఎలా ఉంది? -అమ్మ అమ్మే నీకు తెలుసు. 162 00:17:19,123 --> 00:17:21,459 -మీరింకా మాట్లాడుకోవటం లేదా? -లేదు. 163 00:17:21,542 --> 00:17:23,961 నువ్వు గర్భం దాల్చాక అదే చేసింది. 164 00:17:24,045 --> 00:17:26,881 కొన్ని వారాలు మాట్లాడదు, తరువాత మామూలే. 165 00:17:26,964 --> 00:17:29,717 బెటో గురించి ఇంకోసారి ఆమెతో పోట్లాడలేను, 166 00:17:29,801 --> 00:17:32,428 ఎలా నన్ను తన డబ్బుతో జర్నలిజం చదివిస్తే 167 00:17:32,512 --> 00:17:35,431 పేద రైతుని పెళ్లిచేసుకున్నానో అని. 168 00:17:35,515 --> 00:17:38,976 నీకు సాయం చెయ్యాలని చూస్తుంది. నీ జీవితం బాగుండాలని. 169 00:17:39,060 --> 00:17:40,728 -వెరోనికా! -నేననేది నీకు తెలుసు. 170 00:17:40,812 --> 00:17:44,816 ఆమెకు బాగుండటమంటే తెల్లని పిల్లలు, సూట్ వేసుకుని పనికి వెళ్లే మొగుడు. 171 00:17:44,899 --> 00:17:47,902 సాయం చెయ్యాలనుకుంటే, మాకు స్పానిష్ నేర్పించాల్సింది. 172 00:17:47,985 --> 00:17:51,155 "అమ్మాయిలూ, మీ బామ్మా యాస మీకు వద్దు, కదా?" 173 00:17:51,239 --> 00:17:52,907 అంటే ఇప్పటికే నాకు... 174 00:17:54,659 --> 00:17:55,701 నీకు, ఏమిటి? 175 00:17:59,539 --> 00:18:02,792 -మళ్ళీ ఫోన్ చేస్తాను. -తప్పకుండా. ఇక్కడే ఉంటాను. 176 00:19:13,070 --> 00:19:15,406 తెరెసా 177 00:19:34,675 --> 00:19:36,302 వలస వ్యవసాయ కూలీల యూనియన్ 178 00:19:36,385 --> 00:19:38,971 "మెల్లని చావు" వలస వ్యవసాయ కూలీల యూనియన్ 179 00:19:39,430 --> 00:19:41,933 పురుగుమందుల గురించిన నిజం 180 00:20:01,661 --> 00:20:02,578 హే. 181 00:20:03,245 --> 00:20:05,581 హలో? హే! 182 00:20:09,126 --> 00:20:11,671 హలో? హలో! 183 00:20:11,754 --> 00:20:12,880 హే! 184 00:20:54,547 --> 00:20:57,049 ఇలా ఎవరు చేస్తారు? 185 00:20:58,426 --> 00:21:00,928 ఇది ఇక్కడ ఎంతకాలంగా ఉందో మనకు తెలియదు. 186 00:21:02,471 --> 00:21:04,515 కనుగుడ్డు మన చెట్టు మీద 187 00:21:04,598 --> 00:21:07,101 ఎక్కువ కాలం వేలాడి ఉంటే తక్కువ భయపడాలా? 188 00:21:07,184 --> 00:21:11,355 పిల్లలు ఆకతాయితనంతో పెట్టారేమో లేదా ఇంతకుముందున్న వారు పెట్టారేమో. 189 00:21:14,692 --> 00:21:16,944 ఇంతకుముందున్న వారి గురించి ఏమైనా తెలుసా? 190 00:21:17,028 --> 00:21:17,903 లేదు. 191 00:21:19,280 --> 00:21:21,866 ఈ వారాంతం బార్బెక్యూ సమయంలో అడగొచ్చు. 192 00:21:22,366 --> 00:21:25,077 -మనం వెళ్ళాలా? -అవును, వెళ్ళాలి. 193 00:21:25,578 --> 00:21:28,831 ఇక్కడున్న ఇతర కుటుంబాలను పరిచయం చేసుకోవచ్చు. 194 00:21:28,914 --> 00:21:29,999 మంచిది. 195 00:21:30,416 --> 00:21:33,044 పలకరింపులు. స్పానిష్‌లో. 196 00:21:34,545 --> 00:21:35,796 నాకు చాలా ఇష్టం. 197 00:21:40,718 --> 00:21:43,804 మహిళలూ, మీకు నచ్చిన ఆగ్వా ఫ్రెస్కా అక్కడ ఉంది. 198 00:21:43,888 --> 00:21:45,765 ఎంజాయ్. తాజాగా చెయ్యబడింది. 199 00:22:00,905 --> 00:22:04,575 అది ఆ ప్రదేశాన్ని రసాభాసగా చెయ్యటమే కాదు, బ్యారెల్స్‌లో కూడా దూరింది! 200 00:22:04,658 --> 00:22:06,786 తాగిన నక్కను ఎప్పుడైనా చూసారా? 201 00:22:12,583 --> 00:22:13,667 మరిసోల్ ఎలా ఉంది? 202 00:22:14,001 --> 00:22:15,127 బాగుంది... 203 00:22:15,419 --> 00:22:21,092 పాపాయి పుట్టేవరకూ ఆసుపత్రిలో ఉండమన్నారు డాక్టర్. 204 00:22:21,884 --> 00:22:23,135 ఆత్రుతగా ఉన్నావని తెలుసు. 205 00:22:25,096 --> 00:22:26,639 నీ నెక్లెస్ బాగుంది. 206 00:22:27,014 --> 00:22:28,974 ధన్యవాదాలు. బహుమతిగా వచ్చింది. 207 00:22:29,767 --> 00:22:32,061 -బహుమతా? -అనీటా ఇచ్చింది. రక్షణ కోసం. 208 00:22:32,978 --> 00:22:34,355 డ్రెస్ బాగుంది. 209 00:22:34,814 --> 00:22:36,857 నా డ్రెస్సా? ధన్యవాదాలు! 210 00:22:36,941 --> 00:22:40,569 కొత్తది. ఇక్కడికి వచ్చేముందు కొన్నాను. 211 00:22:40,653 --> 00:22:43,072 కాస్త తేలికపాటి బట్టలు అవసరమనిపించింది. 212 00:22:43,155 --> 00:22:44,865 చూడండి, జేబులు కూడా ఉన్నాయి. 213 00:22:44,949 --> 00:22:46,450 ఖరీదైనదిలా ఉంది. 214 00:22:46,534 --> 00:22:47,618 రోసా! 215 00:22:48,285 --> 00:22:50,037 క్షమించాలి. అర్ధం కాలేదు. 216 00:22:52,289 --> 00:22:56,293 నా తల్లితండ్రులు స్కూల్‌లో స్పానిష్ మాట్లాడినందుకు శిక్షించబడ్డారు. 217 00:22:56,377 --> 00:22:57,878 అందుకే మాకు నేర్పలేదు. 218 00:22:57,962 --> 00:22:59,505 పాపం తెల్ల పిల్ల. 219 00:22:59,588 --> 00:23:01,423 -రోసా, చాలు. -సరదాగా అన్నాను. 220 00:23:03,008 --> 00:23:05,719 నీ డ్రెస్ బాగుంది. 221 00:23:06,804 --> 00:23:07,805 ధన్యవాదాలు. 222 00:23:09,390 --> 00:23:10,474 మొదటి బిడ్డా? 223 00:23:11,392 --> 00:23:12,309 అవును. 224 00:23:14,395 --> 00:23:16,564 నీకు పిల్లలు ఉన్నారా? 225 00:23:16,647 --> 00:23:20,109 ఇంకా లేరు, భవిష్యత్తులో ఉంటారని ఆశిస్తున్నాను. 226 00:23:22,528 --> 00:23:25,781 -బెటో, నేనూ కనీసం ఇద్దరు అనుకుంటున్నాం. -ఎక్కువైతే మరీ మంచిది. 227 00:23:28,450 --> 00:23:30,119 మీ కుటుంబ ఆరోగ్యం కోసం. 228 00:23:32,329 --> 00:23:35,708 నీ సంగతేంటి, రోసా? ఇంకా పిల్లలు కావాలా? 229 00:23:36,417 --> 00:23:37,668 కావాలి, కానీ... 230 00:23:38,627 --> 00:23:39,795 కుదరలేదు. 231 00:23:40,171 --> 00:23:41,297 క్షమించు. 232 00:23:42,464 --> 00:23:43,674 కానీ, దేవుని దయవల్ల... 233 00:23:43,757 --> 00:23:44,925 హేమిటో ఉన్నాడు. 234 00:23:46,343 --> 00:23:48,053 మేము అదృష్టవంతులం. 235 00:23:49,930 --> 00:23:51,140 అక్కడికి వెళ్ళు. 236 00:24:00,065 --> 00:24:02,193 నీ కజిన్లు ఎక్కడ? స్నేహితులు? 237 00:24:03,736 --> 00:24:05,029 ఎవరూ లేరా? 238 00:24:07,698 --> 00:24:08,908 విన్నావా... 239 00:24:08,991 --> 00:24:10,409 హువానా ఎక్కడ? 240 00:24:10,951 --> 00:24:14,330 -నేను పుకార్లు చెప్పను గానీ... -పుకార్లు చెప్పవా? 241 00:24:14,705 --> 00:24:17,875 హే! నేనెప్పుడు పుకార్లు చెప్పాను? 242 00:24:17,958 --> 00:24:19,668 అంటే... 243 00:24:29,511 --> 00:24:31,597 ఆగ్వా ఫ్రెస్కా? ఇంట్లో చేసింది. 244 00:24:31,680 --> 00:24:33,682 -తాగి చూడు. -సరే. 245 00:24:36,393 --> 00:24:38,354 -బాగుందా? -చాలా బాగుంది. 246 00:24:38,437 --> 00:24:40,898 ధన్యవాదాలు. మీ కోసం వెల్కమ్ బాస్కెట్ చేసాను. 247 00:24:40,981 --> 00:24:43,484 -ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తాను. -ధన్యవాదాలు. 248 00:24:43,567 --> 00:24:44,818 మరేమీ పర్లేదు. 249 00:24:48,197 --> 00:24:52,368 విను, కష్టమని తెలుసు. భాష తెలియకపోవడం, కానీ... 250 00:24:53,077 --> 00:24:55,871 పర్లేదు. త్వరగా నేర్చుకుంటావు. 251 00:24:55,955 --> 00:24:57,039 -నిజంగా. -థాంక్స్. 252 00:24:57,122 --> 00:24:58,165 పర్లేదు. 253 00:25:14,723 --> 00:25:16,725 రోజు బాగా గడిచింది. 254 00:25:17,810 --> 00:25:19,645 వారు నీ స్నేహితులు కావటం వలన. 255 00:25:21,981 --> 00:25:23,190 మన స్నేహితులు. 256 00:25:29,363 --> 00:25:31,156 ఇంకాస్త ప్రయత్నించాల్సింది. 257 00:25:31,824 --> 00:25:32,783 బెటో! 258 00:25:36,996 --> 00:25:39,164 నన్ను గేలి చేసి, తెల్లపిల్ల అన్నారు. 259 00:25:40,332 --> 00:25:41,333 ఏమిటి? 260 00:25:42,668 --> 00:25:44,169 -ఎప్పుడు? -నేను... 261 00:25:48,674 --> 00:25:51,051 బయటదాన్ని అని ఇంతలా ఎప్పుడూ అనిపించలేదు. 262 00:25:53,053 --> 00:25:55,639 అవును. అలవాటు అవుతుంది. 263 00:26:45,481 --> 00:26:48,650 -అనీటా? -శుభోదయం, డయానా. 264 00:26:48,734 --> 00:26:50,319 ఇక్కడేమి చేస్తున్నావు? 265 00:26:50,402 --> 00:26:52,071 ఎలా ఉన్నావు? 266 00:26:55,282 --> 00:26:56,450 నీకోసం తెచ్చాను. 267 00:26:58,535 --> 00:27:01,497 చాలా బాగుంది కానీ తీసుకోలేను. 268 00:27:01,580 --> 00:27:02,456 డయానా. 269 00:27:03,791 --> 00:27:07,086 కాబోయే తల్లులు రక్షించబడటం చాలా ముఖ్యం. 270 00:27:07,795 --> 00:27:10,089 కడుపుతో ఉన్నవారందరికీ ఇస్తుంటాను. 271 00:27:13,300 --> 00:27:15,886 మాకంటే ముందు ఇక్కడ నివసించిన మహిళ తెలుసా? 272 00:27:17,513 --> 00:27:20,682 తెరెసా. ఎందుకు అడుగుతున్నావు? 273 00:27:20,766 --> 00:27:24,520 వాళ్ళ వస్తువులు చాలా వదిలేసింది. ఫోటోలు, డైరీలు, పిల్లల బొమ్మలు. 274 00:27:24,603 --> 00:27:27,815 -ఆమె అడ్రస్ ఇస్తే పంపిస్తాను. -వదిలెయ్యి. 275 00:27:30,567 --> 00:27:33,779 సరే. నువ్వు వెళ్ళాలి. నాకు పని ఉంది. 276 00:27:34,196 --> 00:27:37,324 నువ్వు నెక్లెస్ తీసుకోవాలి. నీకు రక్షణ అవసరం. 277 00:27:37,408 --> 00:27:38,575 దయచేసి, వెళ్ళిపో. 278 00:28:11,024 --> 00:28:12,192 రక్షణ. 279 00:28:35,841 --> 00:28:39,678 వ్యాలీ ఫీవర్ 280 00:29:15,756 --> 00:29:18,425 నార్త్ ‌వెస్ట్ మెటర్నిటీ క్లినిక్ 281 00:29:21,595 --> 00:29:25,098 నాకు భ్రాంతి కలుగుతుంది. 282 00:29:25,599 --> 00:29:26,850 మసకగా ఉంది. 283 00:29:29,353 --> 00:29:31,605 -ఇంకా నొప్పి ఉంది. -దద్దుర్లు ఉన్నాయా? 284 00:29:32,606 --> 00:29:33,732 లేదు. 285 00:29:34,316 --> 00:29:37,444 సరే, శుభవార్త ఏమిటంటే బిడ్డ బాగుంది. 286 00:29:37,528 --> 00:29:40,781 కిందపడటం వలన కలిగిన ఒత్తిడి నొప్పికి కారణం కావచ్చు. 287 00:29:40,864 --> 00:29:43,825 రాత్రికి ఇక్కడ ఉంటే మంచిది. ముందు జాగ్రత్త కోసం. 288 00:29:44,660 --> 00:29:46,203 మనం కలవటం సంతోషం. 289 00:29:46,286 --> 00:29:49,331 వచ్చేవారం అపాయింట్మెంట్ సమయంలో కలిసుంటే బాగుండేది. 290 00:29:49,414 --> 00:29:50,499 ధన్యవాదాలు. 291 00:29:52,376 --> 00:29:55,879 -హాయ్, డయానా. -ఈమె నర్స్ కారోల్, రాత్రి డ్యూటీ నర్స్. 292 00:29:55,963 --> 00:29:59,258 రేపు ఉదయం ఉదయపు డ్యూటీ నర్స్ మోలీని కలుస్తావు, 293 00:29:59,341 --> 00:30:00,801 అదే మొత్తం బృందం. 294 00:30:00,884 --> 00:30:02,302 మీరు ముగ్గురేనా? 295 00:30:03,011 --> 00:30:05,722 నగరాల్లో లాగా లేదని నాకు తెలుసు, 296 00:30:05,806 --> 00:30:07,975 కానీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము. 297 00:30:08,058 --> 00:30:10,477 ఇప్పుడు నీకు బాగున్నట్టు అనిపించకపోతే, 298 00:30:10,561 --> 00:30:13,188 నువ్వు వెంటనే నర్స్ కారోల్‌కు చెప్పాలి. 299 00:30:13,272 --> 00:30:15,482 మధ్య మధ్యలో వచ్చి నిన్ను చూస్తుంది, 300 00:30:15,566 --> 00:30:17,818 కానీ ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోవచ్చు. 301 00:30:17,901 --> 00:30:20,112 విశ్రాంతి తీసుకో. వచ్చేవారం కలుస్తా. 302 00:30:20,612 --> 00:30:22,990 ఏమైనా కావాలంటే నాతో చెప్పు. 303 00:30:23,073 --> 00:30:23,949 సరే. 304 00:30:24,032 --> 00:30:26,159 మడత మంచాలు ఏమైనా ఉన్నాయా? 305 00:30:26,243 --> 00:30:29,371 దురదృష్టవశాత్తూ, లేవు. రాత్రివేళ అటెండర్లను ఉండనివ్వం. 306 00:30:29,454 --> 00:30:32,874 -నిజమా? -ఆసుపత్రి పాలసీ, క్షమించాలి. 307 00:30:32,958 --> 00:30:35,502 కానీ ఉదయాన్నే సందర్శన వేళలు మొదలవుతాయి. 308 00:30:44,177 --> 00:30:47,639 -నేను ఉంటున్నాను. -రాత్రంతా కుర్చీలో పడుకుంటావా? 309 00:30:49,891 --> 00:30:52,978 ఏమీ పర్వాలేదు, ప్రియతమా. నేను ఎలాగో పడుకుంటాను. 310 00:30:54,146 --> 00:30:55,981 విశ్రాంతి తీసుకో, పనుంది నీకు. 311 00:30:56,398 --> 00:30:59,318 వెళ్ళు! బయటకు వెళ్ళు. 312 00:31:00,694 --> 00:31:01,737 సరే. 313 00:31:02,738 --> 00:31:05,240 నేను ఉదయాన్నే వస్తాను. 314 00:31:09,995 --> 00:31:10,996 విశ్రాంతి తీసుకో. 315 00:31:11,079 --> 00:31:13,123 -లవ్ యు. -లవ్ యు. 316 00:31:57,959 --> 00:32:00,295 బిడ్డ బాగానే ఉందని చెప్పాలనుకున్నాను. 317 00:32:00,379 --> 00:32:05,425 -నేను బాగానే ఉన్నాను. అంతా బాగానే ఉంది. -బాగానే ఉన్నట్టుందిలే. 318 00:32:06,927 --> 00:32:10,514 -రేపు మాట్లాడతాను. లవ్ యు. -లవ్ యు, టూ. బాయ్. 319 00:32:34,329 --> 00:32:35,539 నర్స్ కారోల్? 320 00:33:08,196 --> 00:33:09,990 -బాగానే ఉన్నావా? -లేదు. 321 00:33:14,619 --> 00:33:16,830 మరిసోల్, డాక్టర్‌ను పిలవనా? 322 00:33:20,542 --> 00:33:22,377 క్షమించు, నాకు అర్ధం కాలేదు. 323 00:33:27,299 --> 00:33:28,133 ఏమిటి? 324 00:33:32,763 --> 00:33:35,974 -డయానా, ఏ... -ఆమెకి అసలు బాగున్నట్టు లేదు. 325 00:33:36,057 --> 00:33:38,977 శ్రీమతి. హెర్ణాండెజ్‌ను నేను చూసుకుంటాను. నువ్వు పడుకో. 326 00:33:39,060 --> 00:33:41,813 నీకు విశ్రాంతి అవసరం. పడుకో. నేను చూసుకుంటాను. 327 00:33:45,525 --> 00:33:50,363 శ్రీమతి. హెర్ణాండెజ్‌. శ్రీమతి. హెర్ణాండెజ్‌, మీరు శాంతించాలి. 328 00:33:51,239 --> 00:33:52,157 ఏమీ పర్వాలేదు. 329 00:34:44,417 --> 00:34:45,502 సిద్ధమా, బంగారం? 330 00:34:53,593 --> 00:34:56,012 హాయ్, ఎలా ఉన్నావు? 331 00:34:56,471 --> 00:34:57,681 హాయ్ మరిసోల్. 332 00:34:57,931 --> 00:34:58,849 హాయ్. 333 00:34:59,891 --> 00:35:01,142 డయానా, నా భార్య. 334 00:35:01,226 --> 00:35:02,435 కలవటం సంతోషం. 335 00:35:03,645 --> 00:35:06,982 నీకు గుర్తుందో లేదో నిన్న రాత్రి నీ గదికి వచ్చాను. 336 00:35:07,065 --> 00:35:09,401 నొప్పితో బాధపడుతున్నట్టు అనిపించావు. 337 00:35:10,277 --> 00:35:12,195 క్షమించాలి, నాకు అర్ధం కావట్లేదు. 338 00:35:12,279 --> 00:35:15,740 బాగానే ఉన్నావా? రాత్రి ఏమైనా జరిగిందా? అంది. 339 00:35:16,324 --> 00:35:19,870 లేదు, బాగానే ఉన్నాను. రాత్రి ఏమయ్యిందో గుర్తులేదు. 340 00:35:20,537 --> 00:35:22,205 మందులు ఎక్కువగా ఇవ్వబడ్డాయి. 341 00:35:24,749 --> 00:35:26,001 మొదటి బిడ్డా? 342 00:35:27,586 --> 00:35:28,545 అవును. 343 00:35:31,172 --> 00:35:32,340 నా రెండవది. 344 00:35:33,425 --> 00:35:35,176 ఇంకొకళ్ళు కావాలి. 345 00:35:36,553 --> 00:35:38,638 శ్రీమతి. హెర్ణాండెజ్‌, సమయం అయ్యిం... 346 00:35:38,722 --> 00:35:39,890 ధన్యవాదాలు మోలి. 347 00:35:39,973 --> 00:35:40,891 సరే అయితే... 348 00:35:41,433 --> 00:35:43,518 -ఆరోగ్యం జాగ్రత్త. -నువ్వు కూడా. 349 00:35:43,602 --> 00:35:44,519 వీడ్కోలు. 350 00:35:47,314 --> 00:35:50,817 కలవటం... సంతోషం. 351 00:35:52,611 --> 00:35:53,945 నిన్ను కూడా. 352 00:36:06,541 --> 00:36:09,502 రాత్రి "ల మాల్దీషియోన్" అని అరిచింది. 353 00:36:10,837 --> 00:36:12,130 అంటే ఏమిటి? 354 00:36:14,925 --> 00:36:15,926 శాపం. 355 00:36:22,057 --> 00:36:25,185 నాకు ఇప్పుడు స్నానం, పిజ్జా అవసరం. 356 00:36:28,688 --> 00:36:29,898 ఏమైనా గమనించావా? 357 00:36:30,774 --> 00:36:32,484 ఇల్లు శుభ్రంగా ఉంది? 358 00:36:40,283 --> 00:36:43,119 -భలే చేసావే. -సదా మీ సేవలో. 359 00:36:44,162 --> 00:36:45,372 ఇంకా ఇది. 360 00:36:48,667 --> 00:36:50,210 షెడ్‌లో దొరికింది. 361 00:36:50,293 --> 00:36:53,129 ఇంటిముందు ఇక్కడ నివసించిన మహిళదనుకుంటాను. 362 00:36:53,213 --> 00:36:57,676 ఆ, నేను అక్కడక్కడా చదివాను. ఈ ఊరి మీద బాగా ఆసక్తి ఉన్నట్టుంది ఆమెకి. 363 00:36:58,551 --> 00:36:59,844 చాలా పరిశోధించింది. 364 00:37:01,012 --> 00:37:03,431 ఆమె రచయిత్రి కూడా అయ్యుండచ్చు. 365 00:37:05,600 --> 00:37:06,518 ఇంకా... 366 00:37:07,060 --> 00:37:10,146 ఆల్ మాల్ టిఎంపో బ్యూన కారా 367 00:37:19,364 --> 00:37:22,283 "కష్టకాలంలో, ధైర్యంగా ఉండండి." 368 00:37:22,784 --> 00:37:24,077 కవిత్వంలా ఉంది, కదా? 369 00:37:27,664 --> 00:37:29,374 ఇంకొకటి చూపించాలి. 370 00:37:29,457 --> 00:37:31,292 -ఏమిటి? -రా. రా. 371 00:37:32,419 --> 00:37:33,712 జాగ్రత్త. 372 00:37:35,005 --> 00:37:36,214 సరిగ్గా. 373 00:37:36,297 --> 00:37:39,884 -సరే. సరే. -సరేనా? సరే. 374 00:37:40,760 --> 00:37:43,805 నేను నిద్రే పోలేదు, కానీ ఇది చెయ్యటం బాగుంది. 375 00:37:45,932 --> 00:37:47,600 సరే, ఇదుగో. 376 00:37:48,518 --> 00:37:49,769 కళ్ళు తెరువు. 377 00:37:56,151 --> 00:37:56,985 బెటో... 378 00:37:57,652 --> 00:38:00,530 ఇంటికొచ్చాక నీకు బాగుండేలా ఏదోకటి చేయాలనుకున్నాను. 379 00:38:07,662 --> 00:38:08,997 చాలా బాగుంది. 380 00:38:18,798 --> 00:38:21,217 ఇది చూడు. 381 00:38:22,052 --> 00:38:24,304 శుభ్రం చేస్తే కొత్తదానిలా పనిచేస్తుంది. 382 00:38:28,141 --> 00:38:29,350 విచిత్రంగా ఉందా? 383 00:38:29,768 --> 00:38:32,353 వేరేవారి పిల్లల మ్యూజిక్ బాక్స్ తీసుకోవడం? 384 00:38:32,437 --> 00:38:35,565 వంటగదిలో తెచ్చావు, నీకు నచ్చింది అనుకున్నాను. 385 00:38:35,982 --> 00:38:39,986 బాగుంది, కానీ బిడ్డకి కొత్తది కొనాలని ఆశించాను. 386 00:38:41,696 --> 00:38:42,655 సరే. 387 00:38:43,448 --> 00:38:44,741 నీ ఇష్టం. 388 00:38:48,119 --> 00:38:50,997 మిగతావాటితో పాటు దీనిని కూడా ఇచ్చేయాలి. 389 00:38:51,498 --> 00:38:52,624 దానం 390 00:38:58,546 --> 00:39:00,173 ఇంకా అదే చదువుతున్నావా? 391 00:39:04,010 --> 00:39:07,347 -ఇవాళ శుభ్రం చెయ్యాల్సిన రోజనుకున్నానే. -తెలుసు, తెలుసు. 392 00:39:07,806 --> 00:39:11,059 కానీ తెరెసా చాలా ఆసక్తికరమైన వ్యాసాలు సేకరించింది. 393 00:39:12,977 --> 00:39:15,230 చాలావరకు జబ్బుపడ్డ కూలీల గురించే. 394 00:39:15,897 --> 00:39:17,857 ఏదో "వ్యాలీ ఫీవర్" అంట. 395 00:39:18,274 --> 00:39:21,236 పొలంలో దేనివలనైనా ఎలర్జీ వచ్చిందేమో. 396 00:39:21,861 --> 00:39:23,488 మనందరికీ లేదా? 397 00:39:28,576 --> 00:39:31,788 -ఇది బట్టబయలు చెయ్యవచ్చు. -తెరెసా గురించా? 398 00:39:33,373 --> 00:39:34,874 వ్యవసాయ కూలీల గురించి. 399 00:39:38,503 --> 00:39:39,587 సరే, 400 00:39:40,880 --> 00:39:43,716 ఎక్కువసేపు బయట కూర్చోకు, వేడిగా ఉంది. 401 00:39:49,097 --> 00:39:49,931 బాగానే ఉన్నావా? 402 00:39:56,855 --> 00:39:58,106 బాగానే ఉన్నావా, బేబీ? 403 00:40:01,401 --> 00:40:02,360 ఆ. 404 00:40:36,436 --> 00:40:40,398 దద్దుర్లు 405 00:41:04,172 --> 00:41:05,215 బెటో? 406 00:42:45,023 --> 00:42:46,899 -నాకు నీ సాయం కావాలి. -రా. 407 00:42:51,487 --> 00:42:52,447 నీకోసం. 408 00:42:55,033 --> 00:42:56,284 బాగుంది. 409 00:42:57,368 --> 00:42:59,454 కానీ అది కాదు నాకు కావలిసింది. 410 00:43:00,288 --> 00:43:02,248 పురుగుమందులు అంటే ఏమిటో తెలుసా? 411 00:43:02,707 --> 00:43:06,044 కొత్తగా వచ్చాయి. రైతులు పంటల పైన వాడుతున్నారు. 412 00:43:06,127 --> 00:43:09,213 కానీ అవి మనుషులకు హాని చేయవని సాక్ష్యాలు లేవు. 413 00:43:09,297 --> 00:43:12,258 వ్యవసాయ కూలీలు రోజూ వీటిని వాడుతున్నారు. 414 00:43:12,550 --> 00:43:14,802 -ఇవన్నీ ఎక్కడ దొరికాయి? -తెరెసా! 415 00:43:14,886 --> 00:43:19,766 అందుకే అన్నీ ఇక్కడే వదిలేసింది. ఇది కనిపెట్టి మాయమయిపోయింది. 416 00:43:21,184 --> 00:43:24,729 ఇక్కడ అందరూ నిన్ను నమ్ముతారు. నీ మాట వింటారు. 417 00:43:25,480 --> 00:43:28,691 ఊరి జనాలను హెచ్చరించడానికి నాకు నీ సాయం అవసరం. 418 00:43:31,027 --> 00:43:34,113 -ఎన్నాళ్ల నుండి ఉంది? -ఏమిటి? 419 00:43:35,198 --> 00:43:38,576 లేదు, ఆగు. ఇది శాపం. ఇది నిజం. 420 00:43:38,659 --> 00:43:41,037 శాపం నిజం, డయానా. 421 00:43:41,120 --> 00:43:43,122 మంత్రాలు తంత్రాల చెత్త చాలు. 422 00:43:43,915 --> 00:43:46,417 ఇక్కడేమి జరుగుతుందో చూపిస్తున్నాను. 423 00:43:46,501 --> 00:43:48,628 పురుగుమందులు కారణమైతే, 424 00:43:49,337 --> 00:43:51,297 నీకు దద్దుర్లు ఎలా వచ్చాయి? 425 00:43:51,714 --> 00:43:54,050 నువ్వు పొలాల్లో పనిచెయ్యటం లేదు. 426 00:43:54,133 --> 00:43:56,677 పురుగుమందులను ఎప్పుడు ముట్టుకున్నావు? 427 00:43:56,761 --> 00:43:59,806 ఇంట్లో హాయిగా కూర్చున్నావు. తెరెసా వస్తువులు చూస్తూ? 428 00:44:12,777 --> 00:44:15,822 దయచేసి కూర్చుంటావా? నేను మనకోసం వండాను. 429 00:44:15,905 --> 00:44:18,825 లేదు. బెటో, నువ్వు నా మాట వినటం లేదు. 430 00:44:18,908 --> 00:44:22,912 నాకు అర్ధమవుతుంది. కానీ నన్ను ఏమి చెయ్యమంటున్నావో తెలియట్లేదు. 431 00:44:23,454 --> 00:44:25,873 నువ్వు క్విల్ గారికి, టొమాస్‌కు చెప్పాలి. 432 00:44:25,957 --> 00:44:28,876 వారు ఈ పురుగుమందులు వాడటం ఆపాలి. 433 00:44:29,585 --> 00:44:32,505 డయానా, మనం కొత్తగా వచ్చాము. 434 00:44:33,214 --> 00:44:36,217 ఈ పాత పాంప్లెట్లు పట్టుకుని మా బాస్ దగ్గరకు వెళ్లి 435 00:44:36,300 --> 00:44:38,344 వారి పని విధానం మార్చమననా? 436 00:44:39,345 --> 00:44:41,764 ఇది వింతగా ఉందని తెలుసు, కానీ నన్ను నమ్ము. 437 00:44:41,848 --> 00:44:44,267 ఈ పురుగుమందులు అందరినీ జబ్బుపడేలా చేస్తున్నాయి. 438 00:44:44,392 --> 00:44:45,560 నేను జబ్బుపడలేదు. 439 00:44:46,102 --> 00:44:48,354 పొలంలో ఎవరికీ ఏ జబ్బూ లేదు. 440 00:44:49,147 --> 00:44:50,523 ఎందుకిలా చేస్తున్నావు? 441 00:44:52,191 --> 00:44:55,319 ఏమి చేస్తున్నాను? సాయం చెయ్యాలని చూస్తున్నాను. 442 00:44:57,363 --> 00:44:58,823 నీ పుస్తకం కోసం కాదా? 443 00:45:02,743 --> 00:45:04,370 మనల్ని సురక్షితంగా ఉంచాలని. 444 00:45:05,288 --> 00:45:08,374 మనల్ని ఇక్కడికి లాక్కువచ్చావు కుటుంబాన్ని ప్రమాదంలో 445 00:45:08,458 --> 00:45:10,418 పడేసి ఏమీ చెయ్యాలనుకోవటం లేదు. 446 00:45:11,502 --> 00:45:13,129 ఇప్పుడు నేను నిన్ను లాక్కువచ్చాను! 447 00:45:13,212 --> 00:45:14,922 మీ అమ్మ మాట విని ఉండాల్సింది, 448 00:45:15,006 --> 00:45:17,300 నాతో, ఒక చేతకాని రైతుతో ప్రేమలో పడకుండా ఉండాల్సింది. 449 00:45:17,383 --> 00:45:18,759 పిచ్చిగా మాట్లాడకు. 450 00:45:19,760 --> 00:45:22,972 నువ్వు వీటిని చదవటం ఇదే మొదటిసారి. 451 00:45:23,055 --> 00:45:25,850 ఏళ్ల తరబడి స్పానిష్ నేర్చుకోమని పోరుతున్నాను. 452 00:45:25,933 --> 00:45:28,978 ఇప్పుడు హటాత్తుగా భాష మీద ఆసక్తి కలిగిందా? 453 00:45:29,061 --> 00:45:30,938 నాకు వ్యతిరేకంగా వాడటానికేగా? 454 00:45:31,022 --> 00:45:33,191 స్పానిష్ రానందుకు నా మీద విరుచుకుపడకు. 455 00:45:33,274 --> 00:45:36,110 చివరికి నేర్చుకుంటున్నాను. అది నీకు సరిపోలేదా? 456 00:45:36,194 --> 00:45:39,363 దేశీయ భాష రానందుకు నీమీద విరుచుకుపడ్డానా? 457 00:45:39,447 --> 00:45:42,867 నీకు నౌవాట్ తెలుసా? మీ తాత ముత్తాతల భాష నేర్చుకున్నావా? 458 00:45:43,451 --> 00:45:45,495 నేర్చుకోలేదని నిన్ను గెలిచేశానా? 459 00:45:47,997 --> 00:45:49,665 ఇది నీ గురించి కాదు. 460 00:45:50,750 --> 00:45:54,378 వారి జాతి, సంస్కృతీ అంటే ఇంత ఇష్టమున్నవాడివి, 461 00:45:54,462 --> 00:45:57,173 నువ్వు వారి రక్షణకోసం పోరాడతావనుకున్నాను. 462 00:45:58,466 --> 00:45:59,759 నేను చేస్తాను. 463 00:46:03,304 --> 00:46:05,515 అదుగో. మొదలయ్యింది. 464 00:46:05,598 --> 00:46:10,853 తెల్ల దొరసాని వచ్చి పేద పిచ్చి రైతులను రక్షించిందండి. 465 00:46:14,732 --> 00:46:16,400 క్షమించు. ఆగు. 466 00:46:23,658 --> 00:46:25,326 ఇద్దరం ఒత్తిడిలో ఉన్నాము. 467 00:46:27,870 --> 00:46:30,331 ఇది మనిద్దరికీ పెద్ద మార్పు. 468 00:46:32,416 --> 00:46:35,836 మా కుటుంబంలో మేనేజర్ అయిన మొదటి వ్యక్తిని నేను. 469 00:46:39,257 --> 00:46:41,801 ఇక్కడ బాగా పనిచెయ్యాలి. 470 00:46:45,221 --> 00:46:46,430 కూలీల సంగతేంటి? 471 00:46:52,520 --> 00:46:54,355 నువ్వు వారిని కాపాడాలి. 472 00:46:56,315 --> 00:46:57,316 కాపాడతాను. 473 00:47:23,467 --> 00:47:24,635 ఏమిటది? 474 00:47:26,596 --> 00:47:28,264 ఇది మన పొలం నుండి. 475 00:47:30,016 --> 00:47:33,853 సెలెరీని ఒక నిజమైన రైతు మాత్రమే పండించగలడని మా నాన్న అనేవారు. 476 00:47:34,770 --> 00:47:38,608 పండటానికి ఎక్కువ సమయం తీసుకునే పంటల్లో సెలెరీ కూడా ఒకటి. 477 00:47:39,525 --> 00:47:42,028 ఇది సున్నితమైనది, కోమలమైనది, 478 00:47:42,111 --> 00:47:46,907 త్వరగా పండించాలనుకునే రైతులను భయపెడుతుంది. 479 00:47:50,036 --> 00:47:50,953 కానీ... 480 00:47:53,289 --> 00:47:54,790 ఆ కరకర రావటానికి, 481 00:47:56,792 --> 00:47:58,252 ఓపిక ఇంకా 482 00:47:59,003 --> 00:48:00,087 నమ్మకం కావాలి. 483 00:48:06,052 --> 00:48:08,054 నాకే సింబాలిక్‌గా చెపుతున్నావా? 484 00:48:09,305 --> 00:48:11,807 నీకు అర్ధమయ్యేలా చెప్పాలనుకున్నాను అంతే. 485 00:48:15,728 --> 00:48:16,562 నేను... 486 00:48:17,730 --> 00:48:18,731 బాగానే ఉన్నావా? 487 00:48:21,859 --> 00:48:23,194 తెలియదు. నాకు... 488 00:48:25,154 --> 00:48:28,449 దేవుడా. కూర్చో. కూర్చో, బేబీ. 489 00:48:31,952 --> 00:48:34,664 నువ్వు కొన్ని టెస్టులకు రావాలి. 490 00:48:34,747 --> 00:48:37,750 -ఏమయ్యింది? -ఏమీ కాకపోవచ్చు. 491 00:48:37,833 --> 00:48:40,795 -ఎలర్జీ అనుకుంటాను. -కాకపొతే? 492 00:48:42,380 --> 00:48:45,132 కొందరు రైతులకు కూడా దద్దుర్లు వచ్చాయని విన్నా. 493 00:48:45,633 --> 00:48:47,843 రోగుల గురించి కూలంకషంగా చర్చించలేను. 494 00:48:47,927 --> 00:48:51,097 పురుగు మందుల గురించి వ్యాసాలు చదివాను. 495 00:48:52,890 --> 00:48:56,686 అదేనంటారా? ఊళ్ళోవాళ్ళు శాపం అంటున్నారు. 496 00:48:59,772 --> 00:49:02,650 నేను గోల్డెన్ వ్యాలీకి వచ్చిన కొత్తలో, నేను... 497 00:49:03,275 --> 00:49:04,819 నేను ఒకటి చూసాను. 498 00:49:05,778 --> 00:49:08,989 రోగులు వింత లక్షణాలు చూపటం మొదలెట్టారు. 499 00:49:09,740 --> 00:49:13,160 కళ్ళు తిరగటం, నిస్సత్తువ, దృష్టి పెట్టలేకపోవడం, 500 00:49:13,244 --> 00:49:16,455 దగ్గు, భ్రాంతి, 501 00:49:16,539 --> 00:49:19,250 ఇంకా శరీరం మీద దద్దుర్లు. 502 00:49:19,333 --> 00:49:21,043 నాకూ అదేనంటారా? 503 00:49:21,460 --> 00:49:23,421 నేనూ, బిడ్డా బాగానే ఉన్నామా? 504 00:49:28,509 --> 00:49:30,094 నాకు ఆధ్యాత్మిక భావన లేదు. 505 00:49:30,845 --> 00:49:34,056 కానీ కొన్ని విషయాలు సైన్స్‌కు అందవు. 506 00:49:34,140 --> 00:49:36,350 నీకు సరైన సమాధానం చెప్పలేను కానీ, 507 00:49:36,434 --> 00:49:39,019 ఊరిలో చాలామంది ప్రార్ధనను నమ్ముతారు. 508 00:49:39,812 --> 00:49:41,355 నువ్వూ అదే చేస్తే మంచిది. 509 00:49:42,690 --> 00:49:44,191 తమాషా చెయ్యటం లేదు కదా? 510 00:49:44,900 --> 00:49:46,277 రాష్ ముందే కనిపెట్టాము. 511 00:49:46,360 --> 00:49:50,156 నీకోసం సమయం షెడ్యూల్ చేసి, టెస్ట్స్ పూర్తి చేస్తాను. 512 00:50:04,754 --> 00:50:07,006 ఎవరైనా పురుగుమందుల వలన జబ్బుపడ్డారా? 513 00:50:07,089 --> 00:50:09,592 లేదు, మాకేమీ కాలేదు. ఆడవాళ్లకు మాత్రమే. 514 00:50:09,675 --> 00:50:10,843 ఏమిటి? 515 00:50:13,971 --> 00:50:15,473 డాక్టర్ ఏమన్నారు? 516 00:50:16,432 --> 00:50:19,310 అనీటా గారి దగ్గరకు వెళతాము. ఆమె మేము జాగ్రత్తగా ఉండేలా చూస్తుంది. 517 00:50:20,436 --> 00:50:21,896 ఎవరు చూసేది? 518 00:50:25,065 --> 00:50:26,776 అనీటా. 519 00:50:29,153 --> 00:50:30,488 మాంత్రికురాలు. 520 00:50:31,822 --> 00:50:34,366 నువ్వు కూడా నమ్ముతావని చెప్పకు. 521 00:50:48,714 --> 00:50:50,466 ఆడవారికి మాత్రమే జరుగుతుంది. 522 00:51:11,070 --> 00:51:12,822 సమాచారం, ఎలా సహాయపడగలను? 523 00:51:12,905 --> 00:51:15,783 గోల్డెన్ కౌంటీ క్లర్కు ఆఫీస్ నెంబర్ ఇవ్వగలరా? 524 00:51:15,866 --> 00:51:16,951 వేచి ఉండండి. 525 00:51:26,335 --> 00:51:28,921 ఇంకొక ఊరిలో జరిగింది. 526 00:51:39,390 --> 00:51:41,100 వెళ్ళేటప్పుడు తాళం వేసెయ్యి. 527 00:52:22,057 --> 00:52:25,269 గోల్డెన్ వ్యాలీ, సిఎ 1968-'76 528 00:52:25,352 --> 00:52:27,688 గోల్డెన్ వ్యాలీ బర్త్ రేట్లు 529 00:52:41,744 --> 00:52:42,870 గర్భిణీ స్త్రీలలో జరుగుతుంది 530 00:52:46,248 --> 00:52:48,792 ఆర్బింగ్టన్, సిఎ 1968-'76 ఆర్బింగ్టన్ బర్త్ రేట్లు 531 00:52:51,337 --> 00:52:53,380 ఇంకొక ఊరా? ఆర్బింగ్టన్ 532 00:52:54,715 --> 00:52:58,052 తెలుపు హిస్పానిక్ 533 00:53:08,103 --> 00:53:10,564 హిస్పానిక్ బర్త్ రేట్ 5 ఏళ్లుగా పెరిగింది 534 00:53:19,365 --> 00:53:24,787 వెళ్లేముందు సంచి తనిఖీ చెయ్యబడుతుంది 535 00:53:57,945 --> 00:54:00,280 ఇంటిపేరు - ఎఫ్ 097-010117 536 00:54:00,364 --> 00:54:02,574 మరణ రికార్డ్ 1971 గోల్డెన్ కౌంటీ మరణ రికార్డ్ 1973 గోల్డెన్ కౌంటీ 537 00:54:02,658 --> 00:54:04,702 మరణ రికార్డ్ 1974 గోల్డెన్ కౌంటీ 538 00:54:14,628 --> 00:54:15,963 రిజిస్టర్ 539 00:54:21,218 --> 00:54:26,598 అక్టోబర్ 11 తెరెసా ఫ్లోరెస్ జూన్ 11, 1955 540 00:54:26,682 --> 00:54:28,100 తెరెసా చనిపోయింది. 541 00:54:28,600 --> 00:54:32,312 పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆమె నాకు చూపించాలని ప్రయత్నిస్తుంది. 542 00:54:32,396 --> 00:54:35,232 ఈ పురుగుమందులు గర్భవతులకు విషం. 543 00:54:37,776 --> 00:54:42,614 కౌంటీ క్లర్క్ ఆఫీస్‌కు వెళ్లాను. ఇక్కడ హిస్పానిక్ మహిళలకు పిల్లలు పుట్టట్లేదు. 544 00:54:43,824 --> 00:54:44,992 ఆలోచించు, బెటో! 545 00:54:46,076 --> 00:54:48,078 మెక్సికన్ పిల్లలు ఎక్కడ? 546 00:54:49,121 --> 00:54:50,706 హైమెని కలిసాము, 547 00:54:51,540 --> 00:54:53,625 అంతే. అంతే. 548 00:54:54,877 --> 00:54:59,048 నేను ఎర్నెస్టోతో మాట్లాడాను. ఇదేదో శాపం అని చెప్పాడు. 549 00:55:03,552 --> 00:55:06,597 దగ్గర్లో ఉన్న ఆర్బింగ్టన్ అనే ఇంకో ఊరిలో జరిగింది. 550 00:55:08,474 --> 00:55:10,476 వాళ్ళ మెటర్నిటీ క్లినిక్‌కు ఫోన్ చేసాను. 551 00:55:11,477 --> 00:55:13,687 వారు నీకేమి చెప్తారనుకున్నావు? 552 00:55:14,480 --> 00:55:17,483 ఆర్బింగ్టన్ జననాలు కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. 553 00:55:19,026 --> 00:55:21,403 సమస్య ఏమిటో వారు కనిపెట్టి ఉంటే? 554 00:55:23,697 --> 00:55:26,700 అందరూ చెప్పేది నిజమని మనకు తెలిస్తే? 555 00:55:27,076 --> 00:55:29,078 ఇది శాపమని. 556 00:55:31,455 --> 00:55:33,499 తెలుసుకునే మార్గం ఉంది. 557 00:55:44,384 --> 00:55:46,386 నేను చేసేది నమ్మలేకపోతున్నాను. 558 00:56:02,903 --> 00:56:05,197 -అయిపోయింది. -ఒకే. 559 00:56:05,280 --> 00:56:06,949 మనం ఈ రాత్రి వేచి ఉండాలి. 560 00:56:07,783 --> 00:56:09,952 రేపు ఉదయం మరింత తెలుస్తుంది. 561 00:56:14,498 --> 00:56:16,291 ఎక్కువగా ఆలోచించకు. 562 00:56:53,412 --> 00:56:54,538 బెటో. 563 00:57:27,237 --> 00:57:29,323 నీకు పూర్తిగా మతి పోయింది. 564 00:58:52,948 --> 00:58:54,992 బెటో! మంటలు! 565 00:59:41,246 --> 00:59:42,539 నువ్వేమి... 566 00:59:46,460 --> 00:59:47,377 నువ్వు. 567 00:59:49,129 --> 00:59:52,132 నువ్వే చేసావు. తెరెసాను వెనక్కు తెచ్చావు. 568 00:59:52,215 --> 00:59:54,426 డయానా. కత్తి కింద పెట్టు. 569 00:59:54,509 --> 00:59:57,554 నీ రక్ష కోసం చేస్తున్నాను. నీకు రక్షకులు అవసరం. 570 00:59:57,637 --> 00:59:59,181 నానుండి దూరంగా ఉండు! 571 01:00:01,975 --> 01:00:02,893 డయానా! 572 01:00:03,560 --> 01:00:04,644 ఏమి చేసావు? 573 01:00:07,314 --> 01:00:08,482 కత్తి కింద పెట్టు. 574 01:00:08,940 --> 01:00:10,859 -సాయం చేయాలనుకుంటున్నాను. -వద్దు. 575 01:00:11,360 --> 01:00:13,362 డయానా. డయానా. 576 01:00:13,445 --> 01:00:15,614 బేబీ. బేబీ, నా వైపు చూడు. 577 01:00:16,740 --> 01:00:18,116 కత్తి కింద పెట్టు. 578 01:00:20,744 --> 01:00:21,953 రక్తం కారుతుంది. 579 01:02:37,255 --> 01:02:38,298 తెరెసా. 580 01:02:56,149 --> 01:02:57,734 నానుండి నీకు ఏమి కావాలి? 581 01:03:02,989 --> 01:03:05,033 లేదు! లేదు! 582 01:03:06,952 --> 01:03:08,328 లేదు! 583 01:03:46,366 --> 01:03:48,285 మీ సంతకం, శ్రీమతి హెర్నాండెజ్. 584 01:03:48,368 --> 01:03:50,912 నాకర్ధం కావట్లేదు! 585 01:03:52,789 --> 01:03:53,790 అనుమతి లేదు 586 01:03:53,873 --> 01:03:55,750 బిడ్డకోసం, సంతకం చెయ్యాలి. 587 01:03:55,834 --> 01:04:00,422 రఫాయెల్‌కు కాల్ చెయ్యండి! మా భర్తకు కాల్ చెయ్యండి! 588 01:04:00,505 --> 01:04:03,967 ప్రయత్నించాము కానీ సమాధానం లేదు. మరిసోల్, నా మాట విను. 589 01:04:04,843 --> 01:04:07,345 నా మాట విను. నీకు సాయం చేయాలనుకుంటున్నాను. 590 01:04:07,429 --> 01:04:10,724 సంతకం పెట్టకపోతే, డాక్టర్ రారు, బిడ్డకు ప్రమాదం. 591 01:04:11,141 --> 01:04:13,351 బిడ్డ చనిపోవచ్చు. చావు. 592 01:04:14,978 --> 01:04:17,731 సంతకం పెట్టకపోతే ఇద్దరూ చనిపోవచ్చు. 593 01:04:17,814 --> 01:04:21,818 ఇద్దరూ, ఇద్దరూ చనిపోతారు. సంతకం. 594 01:04:23,236 --> 01:04:24,154 ఇదుగో. 595 01:04:26,197 --> 01:04:28,575 ధన్యవాదాలు. మంచిది. మంచిది. 596 01:04:34,623 --> 01:04:35,540 హలో? 597 01:04:36,207 --> 01:04:37,083 బెటో? 598 01:04:37,167 --> 01:04:40,837 -డయానా? ఇంకా మెలుకువగానే ఉన్నావా? -భయంగా ఉంది. 599 01:04:41,421 --> 01:04:45,008 -ఏమి జరుగుతుంది? -లక్షణాలు పెరుగుతున్నాయి. 600 01:04:45,508 --> 01:04:46,885 దద్దుర్లు ఎక్కువయ్యాయి. 601 01:04:47,761 --> 01:04:49,012 భ్రాంతి కలుగుతుంది. 602 01:04:49,763 --> 01:04:51,264 నర్స్‌కు చెప్పావా? 603 01:04:53,475 --> 01:04:54,434 లేదు. 604 01:04:57,729 --> 01:04:59,272 ఈ రాత్రి ఏదో చూసాను. 605 01:05:03,026 --> 01:05:04,861 మరిసోల్ నొప్పితో అరుస్తుంటే 606 01:05:04,944 --> 01:05:07,572 నర్స్ తనతో ఏదో సంతకం పెట్టించుకుంది. 607 01:05:09,866 --> 01:05:10,909 ఏమిటది? 608 01:05:14,371 --> 01:05:15,413 నాకు తెలియదు. 609 01:05:16,498 --> 01:05:17,749 నాకు తెలియదు. 610 01:05:18,166 --> 01:05:21,378 రేపు నీ పని అయ్యాక నువ్వు ఆర్బింగ్టన్ వెళ్ళాలి. 611 01:05:22,796 --> 01:05:24,964 డాక్టర్‌తో స్వయంగా మాట్లాడాలి 612 01:05:25,048 --> 01:05:27,801 పురుగుమందుల గురించి ఆయనకు ఏమి తెలుసో చూడాలి. 613 01:05:39,396 --> 01:05:41,356 మన బిడ్డను కాపాడుకోవాలి. 614 01:08:05,041 --> 01:08:10,296 ‌‌ఆర్బింగ్టన్ మెడికల్ క్లినిక్ 615 01:08:10,380 --> 01:08:14,217 ఈ ఊరిలో జనాభా అసమానత గురించి వినటం ఇదే మొదటిసారి. 616 01:08:14,926 --> 01:08:18,179 ఈ లక్షణాలతో ఉన్న గర్భిణీ స్త్రీలను చూసారా? 617 01:08:18,263 --> 01:08:21,683 నేనుండగా చూడలేదు, కానీ ఇది నేను రాక ముందు. 618 01:08:23,518 --> 01:08:24,811 కాస్త చూడగలరా? 619 01:08:26,479 --> 01:08:30,233 దురదృష్టవశాత్తు, నాకంటే ముందు ఉన్నవారు వారి రికార్డులు ఉంచలేదు. 620 01:08:34,112 --> 01:08:36,447 అయన వివరాలు ఇస్తాను. 621 01:08:44,622 --> 01:08:47,876 డా. డబ్ల్యు. బెల్ ఎండి 9932 ఏడవ ఆవ్ - గోల్డెన్ వ్యాలీ, సిఎ 622 01:08:51,170 --> 01:08:52,630 మీ ఫోన్ వాడుకోవచ్చా? 623 01:09:09,939 --> 01:09:10,982 హలో. 624 01:09:13,359 --> 01:09:14,944 బెటో, ఏమయ్యింది? 625 01:09:17,238 --> 01:09:18,197 ఏమిటి? 626 01:09:38,885 --> 01:09:40,219 దేవుడా. 627 01:11:06,264 --> 01:11:10,351 డా. వెల్టన్ వెల్, ఎండి నార్త్‌వెస్ట్ మెటర్నిటీ క్లినిక్ 628 01:11:29,954 --> 01:11:31,372 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనుమతి 629 01:11:31,456 --> 01:11:35,209 పేషెంట్ - గాబ్రియేలా ఆర్టిజ్ సంస్థ గోల్డెన్ వ్యాలీ మెటర్నిటీ క్లినిక్ 630 01:12:13,831 --> 01:12:16,918 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనుమతి 631 01:12:23,800 --> 01:12:24,926 మొదటి బిడ్డా? 632 01:12:26,677 --> 01:12:27,887 అవును. 633 01:12:32,016 --> 01:12:34,018 నీకు పిల్లలున్నారా? 634 01:12:35,478 --> 01:12:36,562 ఇంకా లేరు. 635 01:12:37,855 --> 01:12:39,023 ఏదో ఒక రోజు. 636 01:12:40,858 --> 01:12:41,859 ఆశిస్తున్నాను. 637 01:12:44,195 --> 01:12:46,197 బెటోకు, నాకూ ఇద్దరు కావాలి. 638 01:12:48,199 --> 01:12:49,826 ఎంత ఎక్కువైతే అంత మంచిది. 639 01:12:54,247 --> 01:12:58,126 పేషెంట్ - రోసా లిం ఆ - పిల్లల సంఖ్య 1 640 01:12:58,209 --> 01:13:00,128 కుటుంబ ఆరోగ్యం కోసం. 641 01:13:02,296 --> 01:13:03,965 నీ సంగతేంటి, రోసా? 642 01:13:05,258 --> 01:13:07,135 మరింత మంది కావాలనుకుంటున్నావా? 643 01:13:09,387 --> 01:13:12,431 అనుకున్నాను. కానీ కుదరలేదు. 644 01:13:15,893 --> 01:13:17,311 క్షమించు. 645 01:13:22,733 --> 01:13:24,026 మాకు హేమిటో ఉన్నాడు. 646 01:13:25,027 --> 01:13:26,821 మేము అదృష్టవంతులం, 647 01:13:29,407 --> 01:13:31,200 గతరాత్రి ఏమయ్యిందో గుర్తులేదు. 648 01:13:34,787 --> 01:13:37,165 మందులు ఎక్కువగా ఇచ్చారు. 649 01:13:40,459 --> 01:13:41,711 మొదటి బిడ్డా? 650 01:13:43,713 --> 01:13:44,755 అవును. 651 01:13:45,673 --> 01:13:46,883 నా రెండవ బిడ్డ. 652 01:13:49,427 --> 01:13:50,887 ఇంకొకరు కావాలి. 653 01:14:00,855 --> 01:14:03,357 పేషెంట్ - తెరెసా ఫ్లోరెస్ లింగం స్త్రీ - పిల్లల సంఖ్య 0 654 01:14:07,904 --> 01:14:12,783 చనిపోయింది కుటుంబ నియంత్రం ఆపరేషన్ సంక్లిష్టతలు 655 01:14:19,165 --> 01:14:20,499 క్షమించు. 656 01:14:32,345 --> 01:14:34,096 నా బిడ్డ. 657 01:14:37,099 --> 01:14:38,768 నా బిడ్డ. 658 01:14:55,868 --> 01:14:58,120 నేను ఆపరేషన్ థియేటర్‌లో ఎందుకున్నాను? 659 01:15:00,915 --> 01:15:03,501 అనవసర విషయాల్లో తలదూర్చినందుకు. 660 01:15:04,627 --> 01:15:08,464 మిగతా వెర్రివాళ్ళలాగా శాపాన్ని నమ్మాల్సింది. 661 01:15:11,676 --> 01:15:13,636 -మహమ్మారి సోకుతున్నప్పుడు... -లేదు! 662 01:15:13,719 --> 01:15:15,554 ...ఆపటం నా బాధ్యత. 663 01:15:15,638 --> 01:15:16,847 ఆపు! 664 01:15:18,182 --> 01:15:20,726 రాక్షసుడా! 665 01:15:22,311 --> 01:15:23,980 నువ్వు ఇలా చెయ్యలేవు! 666 01:15:25,314 --> 01:15:28,442 దురదృష్టవశాత్తు, నీకు నొప్పులు మొదలయ్యాయి 667 01:15:28,526 --> 01:15:32,113 ప్రసవించే సమయంలో చనిపోయావు. 668 01:15:32,571 --> 01:15:34,073 కానీ శుభవార్త. 669 01:15:34,156 --> 01:15:35,741 నీ బిడ్డను కాపాడగలను. 670 01:15:35,825 --> 01:15:39,996 దీని గురించి ఎవరికైనా చెప్పావేమో తెలియాలి అంతే. 671 01:15:41,664 --> 01:15:45,418 -కారోల్! అతనెక్కడ? -వస్తున్నాడు. 672 01:15:45,501 --> 01:15:48,337 వీళ్ళను ఇక్కడకు తెచ్చి తప్పు చేసాడు. గ్యాస్ తీసుకురా. 673 01:15:49,171 --> 01:15:51,882 లేదు. లేదు! 674 01:15:51,966 --> 01:15:53,884 కాపాడండి! కాపాడండి! 675 01:15:53,968 --> 01:15:57,722 ఆపు! ఆపు. ఆపు. 676 01:16:01,559 --> 01:16:03,561 దయచేసి, ఇది చెయ్యనవసరం లేదు. 677 01:16:04,270 --> 01:16:08,065 ఇది చెయ్యనవసరం లేదు. నా బిడ్డకు హాని చెయ్యకు. 678 01:16:10,276 --> 01:16:11,485 బెటో! 679 01:16:14,071 --> 01:16:15,197 బెటో! 680 01:16:23,539 --> 01:16:24,540 లేదు! 681 01:16:46,645 --> 01:16:47,563 రా, వెళదాం. 682 01:16:47,646 --> 01:16:49,648 -పర్లేదు. పర్లేదు. -సరే. 683 01:16:59,992 --> 01:17:01,744 లేదు! 684 01:17:08,667 --> 01:17:13,547 నీ మందు వేసుకుని, నీ పని నువ్వు చూసుకోవచ్చుగా? 685 01:17:16,509 --> 01:17:17,718 మందా? 686 01:17:18,886 --> 01:17:20,429 ఆగ్వా ఫ్రెస్కా? 687 01:17:21,680 --> 01:17:23,516 పురుగుమందులు కాదు. 688 01:17:24,183 --> 01:17:25,851 నువ్వే విషం ఇస్తున్నావు. 689 01:17:25,935 --> 01:17:28,270 ఈ పిచ్చోళ్ళు ఊరికే ఆసుపత్రికి రారు. 690 01:17:29,230 --> 01:17:30,731 కాస్త భయపెట్టాలి. 691 01:17:30,815 --> 01:17:32,233 దద్దుర్లు, 692 01:17:32,983 --> 01:17:34,276 తలనొప్పి. 693 01:17:34,860 --> 01:17:38,781 డాక్టరో బెల్, సరిగ్గా చెప్పారు. పిల్లలందరినీ చూసుకోవడం కష్టం. 694 01:17:41,325 --> 01:17:42,743 కాపాడండి! కాపాడండి! 695 01:18:49,685 --> 01:18:52,062 బెటో. పర్లేదు. 696 01:18:52,146 --> 01:18:54,648 పర్లేదు. నాతో ఉండు. నాతో ఉండు. 697 01:18:54,732 --> 01:18:58,402 నాతో ఉండు. నాతో ఉండు! పర్లేదు, పర్లేదు. 698 01:19:00,196 --> 01:19:03,324 పర్లేదు, పర్లేదు. 699 01:19:21,842 --> 01:19:23,511 నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు. 700 01:19:24,929 --> 01:19:28,807 -వచ్చేసావు! -బాగున్నావు. 701 01:19:30,309 --> 01:19:32,686 -ఇవి ఏమిటి? -అమ్మ పంపింది. 702 01:19:34,438 --> 01:19:37,650 తానే నీకు ఇవ్వాలనుకుంది, కానీ ఆగలేకపోయింది. 703 01:19:37,733 --> 01:19:39,443 రేపు వస్తుంది. 704 01:19:39,902 --> 01:19:41,111 ఆమె గురించి నీకు తెలుసు. 705 01:19:43,322 --> 01:19:44,657 హే, అందగాడా. 706 01:19:46,283 --> 01:19:47,660 చిన్ని హోసే. 707 01:19:47,743 --> 01:19:50,829 బాగున్నాడు. బ్రాస్లెట్ బాగుంది. 708 01:19:50,913 --> 01:19:52,206 వేసి ఉంచు. 709 01:20:01,090 --> 01:20:02,174 ఇంతేనా? 710 01:20:02,258 --> 01:20:05,302 మాద్రేస్ ఆల్ మాల్ టిమ్పో, బ్యూనా కార బై డయానా 711 01:20:13,018 --> 01:20:15,396 కష్టకాలంలో, ధైర్యంగా ఉండండి. 712 01:20:15,854 --> 01:20:19,400 ఎంత భయానకంగా ఉన్నా మంచి కోసం పోరాడమని గుర్తు చేస్తుంది. 713 01:20:21,944 --> 01:20:24,905 -ఎవరది? ఎవరది? -హాయ్. 714 01:20:25,573 --> 01:20:27,491 ఎవరది, పాపాయి? 715 01:20:38,085 --> 01:20:43,465 సెయింట్ అగాథా ప్రసూతి కేంద్రం లాస్ ఏంజిల్స్, సిఎ 716 01:20:49,847 --> 01:20:54,351 నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. 717 01:20:56,520 --> 01:21:01,066 కంగారు పడద్దు. జాగ్రత్తగా చూసుకుంటాం. సరేనా? 718 01:21:01,150 --> 01:21:04,737 దీనిపై నీ సంతకం కావాలి. అవును. 719 01:21:08,991 --> 01:21:13,412 అవును, అంతే, ధన్యవాదాలు. బాగుంది. బాగుంది. 720 01:21:16,498 --> 01:21:17,708 శ్వాస తీసుకో. 721 01:21:19,043 --> 01:21:20,252 శ్వాస తీసుకో. 722 01:21:30,763 --> 01:21:32,181 20వ శతాబ్దం మొత్తం, 723 01:21:32,264 --> 01:21:35,434 యునైటెడ్ స్టేట్స్ అంతటా నేషనల్ యూజెనిక్స్ ఉద్యమంలో భాగంగా. 724 01:21:35,517 --> 01:21:40,064 64,000 పైగా మహిళలకు మరియు పురుషులకు బలవంతంగా వంధ్యీకరించబడ్డారు 725 01:21:41,482 --> 01:21:43,150 వారు తమ జాత్యహంకార ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు 726 01:21:43,233 --> 01:21:47,529 జన్యుపరంగా అనర్హులుగా భావించబడినవారి పునరుత్పత్తి హక్కులను పరిమితం చేసి. 727 01:21:48,572 --> 01:21:50,783 1975 లో, మెక్సికన్ వలస మహిళలు కొందరు 728 01:21:50,866 --> 01:21:54,370 లాస్ ఏంజిల్స్‌లోని ఆసుపత్రికి వ్యతిరేకంగా క్లాస్ యాక్షన్ వ్యాజ్యాన్ని ప్రారంభించారు 729 01:21:54,453 --> 01:21:56,330 వారి అనుమతి లేకుండా వంధ్యీకరించినందుకు. 730 01:21:58,248 --> 01:22:02,670 దావా విఫలమైంది. 731 01:22:04,296 --> 01:22:06,173 ఇటీవల, ఈ అభ్యాసం మళ్లీ ప్రజల దృష్టికి తీసుకురాబడింది 732 01:22:06,256 --> 01:22:08,258 జార్జియాలోని ICE డిటెన్షన్ సెంటర్‌లో. 733 01:22:08,342 --> 01:22:10,052 ఆరోపణ ఏమిటంటే ఇది ఫెడరల్ సౌకర్యం... 734 01:22:10,135 --> 01:22:11,261 గళమెత్తుదాం 735 01:22:11,345 --> 01:22:16,100 వారు వారి సంరక్షణలో, వారి అదుపులో, ఉన్న వలస వచ్చిన మహిళలను 736 01:22:16,183 --> 01:22:19,019 ఆరోగ్య కారణాలు, అనుమతి లేకుండా వారి పునరుత్పత్తి 737 01:22:19,103 --> 01:22:22,189 అవయవాలను తీసివేసే డాక్టర్ వద్దకు పంపుతున్నారని. 738 01:22:23,023 --> 01:22:27,945 2020లో ఈ సినిమా రూపొందించే నాటికి, 739 01:22:28,028 --> 01:22:32,700 బాధితుల్లో ఎవరికీ న్యాయం జరగలేదు. 740 01:23:23,709 --> 01:23:25,711 సబ్‌టైటిల్ అనువాద కర్త వీణ మండలి 741 01:23:25,794 --> 01:23:27,796 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల