1 00:00:12,138 --> 00:00:15,058 -హాయ్. ఎలా ఉన్నారు? -హాయ్. మీకు ఏం కావాలి? 2 00:00:15,141 --> 00:00:16,685 నాకు పాలతో చేసిన కాఫీ కావాలి. 3 00:00:16,768 --> 00:00:18,019 -పాలతో కాఫీ కావాలా? -అవును. 4 00:00:18,103 --> 00:00:19,896 -నాకు బ్లాక్ కాఫీ ఇవ్వండి, ప్లీజ్. థాంక్స్. -ఒక కాఫీ. 5 00:00:19,980 --> 00:00:22,315 -పాలు ఎక్కువ కావాలి. అవును. -పాలు ఎక్కువ కావాలి. 6 00:00:22,399 --> 00:00:24,150 -మీరు చెల్సీ కదా? -అవును, మేడం. 7 00:00:24,818 --> 00:00:26,278 నేను ఇది నమ్మలేకపోతున్నాను! 8 00:00:26,361 --> 00:00:29,531 -ఆగండి, మీరు మీ కాఫీ తీసుకున్నారా? -నాకు చాలా కంగారుగా ఉంది. మర్చిపోయా. 9 00:00:29,614 --> 00:00:31,199 -మీరు మీ కాఫీ మర్చిపోయారు. -మీ కాఫీని మర్చిపోకండి… 10 00:00:31,283 --> 00:00:32,784 అది మీ కాఫీ. కదా? 11 00:00:32,867 --> 00:00:34,744 -ఇదుగోండి. -థాంక్స్, బేబీ. 12 00:00:34,828 --> 00:00:36,663 మీకు చాలా థాంక్స్! 13 00:00:37,914 --> 00:00:39,291 బై. మీ రోజును బాగా ఎంజాయ్ చేయండి. 14 00:00:40,458 --> 00:00:45,088 ఒకటి చెప్పనా, మీ నాన్న, ఇంకా నేను లాయర్లమే అయినా 15 00:00:45,171 --> 00:00:48,717 నీకు లా చదవాలనే ఇష్టం మొదటి నుండి లేదు. 16 00:00:48,800 --> 00:00:50,552 కానీ చిన్నప్పుడు మీతో బాగా వాదించే దాన్ని. 17 00:00:50,635 --> 00:00:52,637 -అవును. నువ్వు మంచి లాయర్ కాగలవు అనుకున్నాం… -ఇప్పటికీ వాదిస్తున్నాను. 18 00:00:52,721 --> 00:00:54,306 …ఎందుకంటే నీకు వాదించడం చాలా ఇష్టం. 19 00:00:54,389 --> 00:00:57,893 కానీ నీకు మీ అమ్మమ్మతో కలిసి లా అండ్ ఆర్డర్ కార్యక్రమం చూడటం చాలా ఇష్టం కదా? 20 00:00:57,976 --> 00:01:00,061 అమ్మమ్మ తన ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కేటప్పుడు 21 00:01:00,145 --> 00:01:03,231 మేమిద్దరం కలిసి… లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళం. 22 00:01:04,733 --> 00:01:07,485 నేను తనతో కలిసి పక్కన థ్రెడ్ మిల్ మీద పరిగెత్తేదాన్ని. 23 00:01:07,569 --> 00:01:09,696 లా అండ్ ఆర్డర్ కార్యక్రమం చోటుచేసుకునే ప్రపంచంలో, 24 00:01:09,779 --> 00:01:12,616 అన్ని నేరాలను ఛేదించి, చెడ్డ వారిని కచ్చితంగా పట్టుకుంటుంటారు, 25 00:01:12,699 --> 00:01:14,618 -ఆ క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగవు కూడా. -అవును. 26 00:01:14,701 --> 00:01:15,785 అయినా కూడా, మనందరికీ తెలుసు… 27 00:01:15,869 --> 00:01:18,705 -నిజ జీవితంలో అలా జరగదు. -…నిజ జీవితంలో అలా జరగదు. 28 00:01:20,665 --> 00:01:22,125 అలాగే కానివ్వు. 29 00:01:22,208 --> 00:01:24,044 అప్పుడు నేను అతనితో, "కదలొద్దు" అని చెప్పి, మీద పడ్డాను. 30 00:01:24,127 --> 00:01:26,213 నేను అంతగా పోరాడటానికి కారణం అదే. 31 00:01:27,881 --> 00:01:29,549 ఈ క్షణాన్ని తలచుకుంటే ఉత్సాహం ఎక్కువైపోతోంది! 32 00:01:29,883 --> 00:01:34,471 దమ్మున్న స్త్రీలు న్యాయం కోసం పోరాడతారు 33 00:01:35,764 --> 00:01:37,432 మేము ఒక కథలు చెప్పే వర్క్ షాప్ కి వెళ్తున్నాం… 34 00:01:37,515 --> 00:01:38,516 మాన్హట్టన్ న్యూ యార్క్ 35 00:01:38,600 --> 00:01:40,644 …మర్రిష్క హర్గీటే, లా అండ్ ఆర్డర్: ఎస్యువి షో స్టార్, 36 00:01:40,727 --> 00:01:44,814 మరియు నిజ జీవితంలో లైంగిక దాడులకు లోనైన వారి కొరకు పోరాడుతున్న కార్యకర్త. 37 00:01:44,898 --> 00:01:49,402 మన కథను చెప్పి, మన గళం వినేలా చేయగలగడం ఎంత బలమైన విషయమో మర్రిష్కకి బాగా తెలుసు. 38 00:01:49,486 --> 00:01:52,989 -ఓరి, నాయనో! ఇది భలే ఉంది! -హాయ్. 39 00:01:53,073 --> 00:01:54,532 మిమ్మల్ని కలవడం నాకు మహా సంతోషంగా ఉంది. 40 00:01:54,616 --> 00:01:56,910 -నాకు కూడా! -ఓరి, నాయనో. 41 00:01:56,993 --> 00:01:58,828 నాకు కూడా ఎగిరి గంతేయాలని ఉంది. 42 00:01:58,912 --> 00:02:01,164 మనం కలవడానికి ఇది భలే ప్రదేశం. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషం. 43 00:02:01,248 --> 00:02:03,083 -నేను ఇక్కడ షూటింగ్ చేశా. -ఎవరినైనా తరుముకుంటూ వచ్చారా? 44 00:02:03,166 --> 00:02:04,542 -ఎవరితోనైనా మాట్లాడారా? -అదొక ఇంటర్వ్యూ. 45 00:02:04,626 --> 00:02:06,127 నేను నా యూనిఫామ్ లో వచ్చి, నా బ్యాడ్జ్ చూపించి, 46 00:02:06,211 --> 00:02:08,004 -కొన్ని ప్రశ్నలు అడిగాను అంతే. -పరుగెత్తాల్సిన పని పడలేదా? 47 00:02:08,087 --> 00:02:10,006 అప్పుడు నేను అతనితో, "కదలొద్దు" అని చెప్పి, అతని మీద పడ్డాను. 48 00:02:10,090 --> 00:02:11,466 కానీ ఇవాళ అలా ఏం జరగదు లెండి. 49 00:02:11,550 --> 00:02:13,009 -ఎందుకు జరగదు? -ఇక ప్రారంభిద్దామా? 50 00:02:13,802 --> 00:02:14,844 ఎవరి మీద అయినా పడేటట్టు అయితే 51 00:02:14,928 --> 00:02:15,971 -ఒక మాట చెప్పండి చాలు. -తప్పకుండా. 52 00:02:16,054 --> 00:02:17,806 కుడి చేతితో మొదలుపెడదాం. కానివ్వు. 53 00:02:17,889 --> 00:02:21,893 రెండు, ఒకటి. రెండు, ఒకటి. 54 00:02:23,478 --> 00:02:24,980 సరే. ఇప్పుడు చూడండి. 55 00:02:25,063 --> 00:02:28,733 మనం అందరం రిలాక్స్ అయి, కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 56 00:02:28,817 --> 00:02:31,903 ది మోత్ లో కథలు చెప్పడం అంటే, మీ జీవితంలో జరిగిన మార్పుల గురించి పంచుకోవడమే కదా? 57 00:02:31,987 --> 00:02:33,488 అన్నా రోబెర్ట్స్ కథలు చెప్పే విధానాన్ని నేర్పించే వ్యక్తి 58 00:02:33,572 --> 00:02:34,406 మనం మార్పు గురించి చెప్పాలి. 59 00:02:34,489 --> 00:02:36,950 మన తర్వాతి ఆట, మీ మనసుకు ముందు ఏది వస్తే దాని గురించి చెప్పాలి. 60 00:02:37,033 --> 00:02:38,410 సారా ఆస్టిన్ జెన్నెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 61 00:02:38,493 --> 00:02:40,829 "నేను డాష్ తో ఉండేదాన్ని, ఇప్పుడు నేనే డాష్ అయిపోయాను." 62 00:02:40,912 --> 00:02:43,957 దీనిని మనం ఎన్నో విధాలుగా చెప్పవచ్చు! 63 00:02:44,040 --> 00:02:46,793 మర్రిష్క హర్గీటే - నటి & వ్యవస్థాపకురాలు, జాయ్ ఫుల్ హార్ట్ ఫౌండేషన్ 64 00:02:46,877 --> 00:02:50,755 నేను ఇంతకు ముందు అందరూ నాకంటే చాలా బెటర్ అనుకునేదాన్ని, 65 00:02:51,506 --> 00:02:57,429 కానీ ఇప్పుడు నా విలువ ఏంటో నాకు తెలుసు. 66 00:02:57,512 --> 00:02:58,722 సూపర్. 67 00:02:58,805 --> 00:03:00,974 -భలే చెప్పావు. -సూపర్ చెప్పావు. 68 00:03:01,057 --> 00:03:02,225 మాకు బాగా నచ్చింది. 69 00:03:03,393 --> 00:03:05,937 ఇంకొకటి చూద్దాం. నేను ఇంతకు ముందు స్కర్ట్స్ వేసుకునే దాన్ని. 70 00:03:09,608 --> 00:03:11,276 ఇది భలే ఉంది! 71 00:03:11,359 --> 00:03:12,485 -ఇప్పుడు… -అవును! 72 00:03:12,569 --> 00:03:16,406 ఇప్పుడేమో, నేను 1999 తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా వాటిని వేసుకోలేదు. 73 00:03:17,449 --> 00:03:20,368 నేను ప్రథమ మహిళగా ఉండేటప్పుడు, బ్రెజిల్ వెళ్ళాను. 74 00:03:20,452 --> 00:03:24,122 నేను, ప్రథమ మహిళలు వేసుకొనే స్కర్ట్ సూట్ వేసుకున్నాను. 75 00:03:24,205 --> 00:03:26,082 మేము బాగా మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చారు. 76 00:03:26,166 --> 00:03:29,669 వాళ్ళు దానిని "ప్రెస్ స్ప్రే" అని పిలుస్తారు అంట, అక్కడికి బోలెడంత మంది ఫోటోగ్రాఫర్లను పిలిచారు. 77 00:03:29,753 --> 00:03:32,464 మేము మా మీటింగ్ పూర్తి చేసుకున్నాం. మేము కలవాల్సిన వారిని కలిసాం. 78 00:03:32,547 --> 00:03:35,050 నేను తిరిగి వైట్ హౌస్ కు వెళ్ళిపోయాను. 79 00:03:35,133 --> 00:03:39,346 తర్వాత ఎవరో ఒకరు నా స్కర్ట్ క్రింద నుండి ఫోటో తీసి… 80 00:03:39,429 --> 00:03:41,640 రియోలో నేను వేసుకున్న బ్రాండు 81 00:03:41,723 --> 00:03:45,810 లోదుస్తులు అమ్ముతామని బిల్ బోర్డులు పెట్టినట్లు తెలిసింది. 82 00:03:46,394 --> 00:03:47,604 ఓరి, దేవుడా. 83 00:03:47,687 --> 00:03:52,734 మొత్తం కనిపించేలా ఏం లేదు, కానీ విషయం ఏంటో తెలిసేలా ఉంది. 84 00:03:52,817 --> 00:03:55,070 అది జరిగిన తర్వాత మా ఆలోచనా విధానమే మారిపోయింది. 85 00:03:55,153 --> 00:03:58,198 తర్వాత నేను ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసినప్పుడు, "నేను అలాంటి బట్టలు వేసుకోనవసరం లేదు" అనుకున్నా. 86 00:03:58,281 --> 00:04:00,825 -యూనిఫామ్ అవసరం లేదు. కాబట్టి… -దాన్ని వదిలేశారు. 87 00:04:00,909 --> 00:04:03,787 -వావ్. ఓరి, నాయనో. -ఒక్కసారిగా చాలా మార్పు చోటు చేసుకుంది. 88 00:04:03,870 --> 00:04:04,871 ఇదుగోండి. 89 00:04:04,955 --> 00:04:06,539 మా అమ్మ గురించి ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. 90 00:04:09,459 --> 00:04:16,132 మీరు వృత్తి రీత్యా బలమైన, ధైర్యవంతురాలైన ఒక పోలీసు ఆఫీసర్ గా 91 00:04:16,216 --> 00:04:20,387 మీరు నేరాలను పరిష్కరిస్తూ, చెడ్డవారిని పట్టుకొని చట్టానికి అప్పజెప్పే పాత్రను పోషిస్తుంటారు. 92 00:04:20,470 --> 00:04:22,222 అలా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎంత వరకు నచ్చుతుంది? 93 00:04:22,305 --> 00:04:26,476 అంటే, అది… నేను ఎస్యువిలో నటించడం ఊహించని విధంగా జరిగిన విషయం 94 00:04:26,560 --> 00:04:31,147 ఎందుకంటే ఆ కార్యక్రమం సహాయంతో ప్రతీ ఒక్కరి ఇంట్లో టీవీలలో లైంగిక వేధింపులకు 95 00:04:31,231 --> 00:04:35,151 సంబంధించిన కథలు జనానికి తెలిసేలా చేయగలిగాము. 96 00:04:35,235 --> 00:04:36,570 -ఈ విషయంపై… -జనం ధ్యాస పెట్టేలా చేసాం. 97 00:04:36,653 --> 00:04:40,615 గుర్తింపు తెచ్చారు. చాన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని అందరికీ తెలిసేలా చేసాం. 98 00:04:40,699 --> 00:04:43,743 వాటిని ఎదుర్కొన్న వారి కథలను జనం నమ్మడం ప్రారంభించారు. 99 00:04:43,827 --> 00:04:45,787 అది చాలా ముఖ్యమైన విషయం. అవును! 100 00:04:45,870 --> 00:04:47,664 ఇది ఎంత సీరియస్ విషయమో జనానికి చూపించడం వల్ల 101 00:04:47,747 --> 00:04:51,751 అందులోని విషయాన్ని గ్రహించలేకుండా చూసేవారి ఊహలు అడ్డురాకుండా చేయగలిగారు. 102 00:04:51,835 --> 00:04:53,962 చెల్సీ, నాకు తెలిసి నేను ఆ మాటను చాలా చోట్ల విన్నాను. 103 00:04:54,045 --> 00:04:56,047 "నా కేసులో కూడా మీరే డిటెక్టివ్ అయ్యుంటే బాగుండు" అనేవారు. 104 00:04:56,131 --> 00:04:59,384 -అది చాలా దారుణమైన విషయం. -అది… అవును, మనసును కలచివేసే విషయం. 105 00:05:00,176 --> 00:05:01,720 నాకు కార్యక్రమంలో పాత్ర పోషించే అవకాశం దొరికినప్పుడు, 106 00:05:01,803 --> 00:05:04,055 "నేను పోలీసులతో బాగా గడపాలి. వారితో ఉంటే చాలు" అనుకునేదాన్ని. 107 00:05:04,139 --> 00:05:07,142 కానీ నేను సావి ప్రోగ్రామ్ లో శిక్షణ తీసుకున్న తర్వాత, 108 00:05:07,225 --> 00:05:09,603 అంటే సెక్సువల్ అసాల్ట్ వయోలెన్స్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్, 109 00:05:09,686 --> 00:05:13,690 అందులో మాకు జనం చెప్పేది ఆలకించడం నేర్పించారు. 110 00:05:14,441 --> 00:05:16,693 ఒకరు చెప్పేది వినడానికి మరొకరు దగ్గర ఉండడం 111 00:05:16,776 --> 00:05:21,698 న్యాయం జరగడానికి… మొదటి అడుగు లాంటిది. 112 00:05:21,781 --> 00:05:22,866 ఆ మాట నాకు బాగా నచ్చింది. 113 00:05:22,949 --> 00:05:25,577 బ్రౌన్స్ విల్ న్యూ యార్క్ 114 00:05:26,786 --> 00:05:30,582 గృహ హింస నుండి బయటపడి, తన సమాజంలో ఉన్న అమ్మాయిలను గైడ్ చేస్తున్న వ్యక్తిగా, 115 00:05:30,665 --> 00:05:33,460 కత్రినా కూడా బాధను వినడంలోని బలం ఎలాంటిదో తెలుసుకుంది. 116 00:05:33,543 --> 00:05:36,671 నేను ఆమెను, అలాగే కొంతమంది అమ్మాయిలను 117 00:05:36,755 --> 00:05:38,381 ఆత్మరక్షణ క్లాసులలో కలుసుకోబోతున్నాను. 118 00:05:39,299 --> 00:05:40,133 కమ్యూనిటీ సెంటర్ 119 00:05:40,217 --> 00:05:41,509 -హాయ్! -హాయ్! 120 00:05:41,593 --> 00:05:43,136 -మీకు హగ్ ఇవ్వవచ్చా? -నాకు కూడా హగ్ చేసుకోవాలని ఉంది. 121 00:05:43,220 --> 00:05:44,554 సరే, మంచిది. 122 00:05:44,638 --> 00:05:47,057 నేను నాకు తెలిసి ఆత్మరక్షణ క్లాసు… 123 00:05:47,140 --> 00:05:48,850 -నేనైతే తీసుకోలేదు. -…తీసుకొని 20 ఏళ్ళు అవుతుంది. 124 00:05:48,934 --> 00:05:50,894 కత్రినా కూక్ బ్రౌన్లీ - ఫౌండర్ యంగ్ లేడీస్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ 125 00:05:50,977 --> 00:05:52,187 కాబట్టి ఇవాళ మాకు మూడినట్టే ఉంది. 126 00:05:52,812 --> 00:05:53,772 నేను నాకు వీలైనంత బాగా ట్రై చేస్తా. 127 00:05:53,855 --> 00:05:56,107 నువ్వు పడితే, నేను నిన్ను లేపుతాను. నేను పడితే నువ్వు నన్ను లేపు. సరేనా? 128 00:05:56,191 --> 00:05:57,734 -తప్పకుండా. -తప్పకుండా. పదా. 129 00:05:58,944 --> 00:06:02,948 అయిదు. నాలుగు. కానివ్వండి. కానివ్వండి. 130 00:06:03,031 --> 00:06:05,575 -మూడు. రెండు. -అంతే. కానివ్వండి. 131 00:06:05,659 --> 00:06:07,285 -ఆపండి! -కానివ్వండి. 132 00:06:11,373 --> 00:06:13,875 -అది భలే ఉంది. -సరే, మిత్రులారా! 133 00:06:14,542 --> 00:06:17,963 సరే, పోరాటానికి సిద్ధంగా ఎలా ఉంటారో అలా ఉండండి. 134 00:06:18,046 --> 00:06:19,798 మీరు సిద్ధంగా ఉండేలా ఉండండి. సరేనా? 135 00:06:19,881 --> 00:06:21,466 -కానివ్వండి! -లేదు! 136 00:06:22,509 --> 00:06:25,136 యంగ్ లేడీస్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ అనేది 137 00:06:25,220 --> 00:06:27,472 ఆత్మగౌరవం, స్వీయ అవగాహన, 138 00:06:28,056 --> 00:06:31,518 మంచి పోషణ, ధ్యాన పాఠాలు నేర్పించే హింసా రహిత ఒక వర్క్ షాప్ ప్రోగ్రామ్. 139 00:06:32,102 --> 00:06:33,645 నేను బ్రౌన్స్ విల్ ని చూసినప్పుడు 140 00:06:33,728 --> 00:06:36,690 కాస్త సహాయం అవసరమైన ఒక ప్రాంతం అని అనుకున్నాను. 141 00:06:37,649 --> 00:06:40,110 ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ప్రమాదం అంచుల్లో బ్రతుకుతున్నారు. 142 00:06:40,610 --> 00:06:43,238 మీలో ఎవరైనా ఆత్మరక్షణ క్లాసులకు వెళ్ళారా? 143 00:06:43,530 --> 00:06:44,573 లేదు. 144 00:06:44,656 --> 00:06:46,950 లేదు. అక్కడ మీరు అనుకున్నట్టు ఉందా? 145 00:06:47,033 --> 00:06:50,078 నేను అక్కడ సూట్స్ వేసుకున్న మగాళ్లు ఉంటారేమో, 146 00:06:50,161 --> 00:06:51,371 మేము వారిపై దాడి చేయాలేమో అనుకున్నాను. 147 00:06:51,454 --> 00:06:52,289 లానైయ 148 00:06:52,372 --> 00:06:55,041 అక్కడ నీకు మాత్రం భయం వేయలేదు అంటావు. అంతేనా? 149 00:06:56,793 --> 00:07:00,046 అంటే, లిటిల్ రాక్ నుంచి వెళ్లిన ఒక చిన్న పిల్లగా నేను కాస్త భయపడ్డాను… 150 00:07:01,131 --> 00:07:03,675 మా ప్రాంతంలో చాలా మంది దగ్గర తుపాకులు ఉండేవి కాబట్టి 151 00:07:03,758 --> 00:07:06,970 మా స్కూల్ కి మెటల్ డిటెక్టర్ లు ఉండేవి. 152 00:07:07,053 --> 00:07:09,556 స్కూళ్లలో మీరు మార్చాలనుకొనే ఒక విషయం ఏమిటి? 153 00:07:10,432 --> 00:07:12,559 సరే, మా స్కూళ్లలో మెటల్ డిటెక్టర్స్ పెట్టడానికి కారణం 154 00:07:12,642 --> 00:07:16,313 పిల్లలు స్కూల్ బాత్ రూంలలో కత్తిపోట్లకు గురవుతూ… 155 00:07:16,396 --> 00:07:17,397 కార్మెన్ 156 00:07:17,480 --> 00:07:20,025 …ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారు. కాబట్టి నాకు కొంచెం కంగారుగా ఉంది. 157 00:07:20,108 --> 00:07:23,403 నా విషయంలో అయితే న్యాయం జరగలేదు, 158 00:07:23,486 --> 00:07:26,448 కాబట్టి ఇతరుల కొరకు నేను న్యాయం జరిగేలా పోరాడుతున్నాను. 159 00:07:26,948 --> 00:07:31,161 నా మాజీ కాబోయే భర్త రికెర్స్ ఐలాండ్ లో పోలీసు ఆఫీసర్. 160 00:07:31,244 --> 00:07:33,830 పోలీసు ఉద్యోగి కావడంతో నేను అతనితో సంతోషంగా ఉండగలను అనుకున్నాను. 161 00:07:35,123 --> 00:07:37,417 కానీ అదొక దారుణమైన హింసాపూరితమైన బంధం. 162 00:07:38,627 --> 00:07:40,587 నేను అతన్ని వదిలేద్దామని అనుకున్నాను. 163 00:07:40,670 --> 00:07:43,215 కాబట్టి జనవరి 9, 1993లో, 164 00:07:43,298 --> 00:07:46,343 నేను అలాగే నా మాజీ కాబోయే భర్త, మామూలుగా మాట్లాడుకుంటున్నాం. 165 00:07:47,344 --> 00:07:51,932 అప్పుడు నా చిన్న కూతురు నా చేతుల్లో ఉంది, అలాగే ఆ సమయానికి నేను గర్భవతిని కూడా. 166 00:07:52,515 --> 00:07:56,728 నేను చిన్న బిడ్డను పడుకోబెట్టడానికి లోపలికి తీసుకెళ్లి 167 00:07:57,354 --> 00:08:01,191 బయటకు వచ్చేసరికి, అతను నా వైపు తుపాకీ ఎక్కుపెట్టాడు. 168 00:08:01,983 --> 00:08:04,236 అతను నాతో, "ఇవాళ నీకు చావే, ముండా" అన్నాడు. 169 00:08:07,113 --> 00:08:08,156 క్రైమ్ సీన్ సెక్షన్ ఎస్.సి.పి.డి 170 00:08:08,240 --> 00:08:10,116 నన్ను పది సార్లు కాల్చాడు. 171 00:08:10,200 --> 00:08:12,077 ది న్యూయార్క్ టైమ్స్ మెట్రో మండే, జనవరి 11, 1993 172 00:08:12,160 --> 00:08:13,536 నేను కోమా నుంచి బయటపడ్డాను. 173 00:08:13,620 --> 00:08:14,621 వ్యక్తిపై కాల్పుల కేసు పెట్టబడింది 174 00:08:14,704 --> 00:08:15,956 అరెస్ట్ కాబడిన పోలీసు అధికారి 175 00:08:16,039 --> 00:08:19,042 లేచిన తర్వాత నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న నా గర్భంలో ఉన్న నా బిడ్డకు ఏమైందనే. 176 00:08:19,125 --> 00:08:21,002 మహిళ పై కాల్పులు - హత్యాయత్నం కేసు నమోదు 177 00:08:21,086 --> 00:08:24,214 డాక్టర్ నా బిడ్డ బ్రతకలేదు అని చెప్పారు. 178 00:08:25,382 --> 00:08:26,675 వాడు రెండే గంటలు బ్రతికాడు అంట. 179 00:08:27,676 --> 00:08:31,304 ఇది నా కథ. 180 00:08:34,515 --> 00:08:37,644 ఒకటి చెప్పనా, మర్రిష్క, నేను బాగా గౌరవించే ఒక విషయం ఏమిటంటే, 181 00:08:37,726 --> 00:08:44,401 దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని బయటపడిన వారిని బాధితులలాగా చూడటం కంటే 182 00:08:44,484 --> 00:08:46,820 -ప్రాణాలతో బయటపడిన వారిగా చూడడం గొప్ప విషయం. -అవును. 183 00:08:46,903 --> 00:08:49,781 -కదా? అలా చేసినప్పుడే ఇతరులు వారికి చేసిన పనుల… -లేదు. 184 00:08:49,864 --> 00:08:52,784 …ఆధారంగా వారిని జనం నిర్వచించడం ఆపుతారు. 185 00:08:52,867 --> 00:08:58,748 అవును. ఎవరిదైనా వాచీ లేదా కారు దొంగతనం చేయబడితే, 186 00:08:58,832 --> 00:09:02,961 వారు చెప్పేది నమ్మాలని, వారిని గౌరవించాలని, వారి మాట వినాలని ఆశిస్తారు. 187 00:09:03,044 --> 00:09:06,006 అలాంటప్పుడు వారి శరీర మానాన్ని దోచుకున్నప్పుడు కూడా, 188 00:09:06,798 --> 00:09:07,966 అదే స్పందనను కోరుకుంటారు కదా. 189 00:09:08,049 --> 00:09:09,175 నిజం. 190 00:09:09,259 --> 00:09:15,932 అదే మా… మా జాయ్ ఫుల్ హార్ట్ బృందంలో మాకున్న ధ్యేయం… 191 00:09:16,016 --> 00:09:20,437 బయట పడిన వారిని… వారికి తగిన గుర్తింపు వచ్చేలా చేయడం. 192 00:09:20,520 --> 00:09:21,771 అదే మీకున్న శక్తి. 193 00:09:21,855 --> 00:09:27,444 నేను ఈ మధ్య జనంతో నేను రేప్ కాబడ్డాను అని చెప్పడం ప్రారంభించాను. 194 00:09:28,111 --> 00:09:32,198 అప్పటి నుండి, 195 00:09:33,408 --> 00:09:36,286 ఆ విషయాన్ని చెప్పుకోగల వీలు దొరకడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. 196 00:09:36,369 --> 00:09:39,956 ఆ విషయాన్ని బయటకు చెప్పే స్థితికి రావడానికి 197 00:09:40,040 --> 00:09:42,626 నాకు చాలా ఏళ్ళే పట్టింది. 198 00:09:42,709 --> 00:09:46,046 కానీ ఇప్పుడు నేను, "నాకు జరిగింది నా వ్యక్తిత్వాన్ని నిర్వచించదు" అనే ధోరణిలో ఉన్నాను. 199 00:09:46,129 --> 00:09:49,466 -నిజం. -ఇప్పుడు నేను ఇంకా ధైర్యంగా సమాధానం ఇస్తున్నాను. 200 00:09:53,345 --> 00:09:55,513 అందరూ ఒక గదిలో కూడుకొని 201 00:09:55,597 --> 00:09:58,892 ఒకరు తమ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటుండగా అక్కడ కూర్చొని వింటుంటే, 202 00:09:58,975 --> 00:10:01,436 వారికి వ్యక్తిగతమైన ఒక విషయాన్ని, వారికి దగ్గరైన ఒక సందర్భాన్ని పంచుకునేటప్పుడు వింటే, 203 00:10:01,519 --> 00:10:03,438 వారి జీవితమే మారిపోతుంది. 204 00:10:04,272 --> 00:10:06,858 అయితే, ఎవరైనా ముందు మాట్లాడతారా? 205 00:10:06,942 --> 00:10:08,318 సరే. 206 00:10:08,401 --> 00:10:10,654 -సరే. అలాగే. -చాలా థాంక్స్. 207 00:10:12,906 --> 00:10:15,367 మా అమ్మ 34 ఏళ్లకు చనిపోయింది. 208 00:10:16,159 --> 00:10:19,371 అలాగే మా తాతయ్య కూడా 34 ఏళ్లకే చనిపోయారు. 209 00:10:19,454 --> 00:10:22,958 అలాగే నేను కూడా నా 34వ పుట్టిన రోజున… 210 00:10:23,041 --> 00:10:26,336 తర్వాత నా పరిస్థితి ఏం కాబోతుంది అనే భయంతో 211 00:10:26,419 --> 00:10:28,046 గడగడలాడిపోయాను. 212 00:10:28,630 --> 00:10:31,550 నేను ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. 213 00:10:31,633 --> 00:10:34,594 కొందరు కళాకారులైన నా స్నేహితులతో పాటు నన్ను కూడా 214 00:10:34,678 --> 00:10:37,472 మోటార్ సైకిల్స్ మీద లాస్ వేగాస్ లోని 215 00:10:37,556 --> 00:10:40,141 సర్క్ డు సోలెయ్ కి వెళదామని ఆహ్వానించారు. 216 00:10:40,225 --> 00:10:44,688 వారందరూ కొంచెం, రిలాక్స్ గా, చిలిపిగా, హిప్పీలులాగా ఉండే వారు. 217 00:10:44,771 --> 00:10:45,772 అప్పుడు నేను, 218 00:10:46,439 --> 00:10:49,276 నేను నా కారులో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేలా అయితే వస్తా అన్నాను. 219 00:10:50,110 --> 00:10:53,446 అయితే మేము బయలుదేరి, రెండున్నర గంటలు అయ్యే సరికి, అందరూ, 220 00:10:53,530 --> 00:10:56,241 "మర్రిష్క, ఒకరి చెప్పనా, మరీ అంత భయంగా ఉండకు" అన్నారు. 221 00:10:56,324 --> 00:11:00,495 అప్పుడు నేను కూడా, "ఒకటి చెప్పనా? నాకు కూడా జీవితమంతా భయంతో బ్రతకాలని లేదు" అనుకున్నాను. 222 00:11:00,579 --> 00:11:04,332 అప్పుడు, నేను బండి ఎక్కి ప్రయాణం ప్రారంభించాను. 223 00:11:04,416 --> 00:11:06,167 బహుశా 30 సెకన్లు అవుతుందేమో, 224 00:11:06,251 --> 00:11:10,547 మాతో కార్లో వచ్చిన ఒక వ్యక్తి సెల్ ఫోన్ చూస్తూ కారు నడపడం వల్ల 225 00:11:10,630 --> 00:11:13,967 నా మోటార్ సైకిల్ ని గుద్దింది. 226 00:11:14,050 --> 00:11:18,138 ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. నేను గాల్లో ఎగురుకుంటూ పడ్డాను. 227 00:11:18,889 --> 00:11:21,516 అప్పుడు నేను, "వావ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. 228 00:11:21,600 --> 00:11:23,393 నేను కూడా వాళ్లలాగే చనిపోతున్నాను" అనుకున్నాను. 229 00:11:24,060 --> 00:11:30,150 కానీ తర్వాత నేను నేలపై పడి, ఇంకా ప్రాణాలతో ఉన్నాను అని గ్రహించాను. 230 00:11:31,943 --> 00:11:37,490 అలాగే నా గతకాలపు విషయాలు ఇక నాతో లేవని గ్రహించాను. 231 00:11:37,574 --> 00:11:40,952 అప్పుడు నా ఈ జీవితం మొదలైంది. అవును. 232 00:11:42,037 --> 00:11:43,371 వావ్. 233 00:11:43,830 --> 00:11:45,332 వావ్! 234 00:11:50,128 --> 00:11:51,922 సరే, ఇంకొన్ని దెబ్బలు కొట్టండి! 235 00:11:52,005 --> 00:11:53,465 ఇలా బాగుంది. 236 00:11:53,548 --> 00:11:57,552 అయిదు. నాలుగు. కానివ్వండి. కానివ్వండి. 237 00:11:57,636 --> 00:11:59,679 -మూడు. రెండు. -అంతే. కానివ్వండి. 238 00:12:00,263 --> 00:12:01,556 -టైమ్ అయింది! -కానివ్వండి. 239 00:12:02,057 --> 00:12:04,601 నేను కోమా నుండి బయట పడిన తర్వాత, 240 00:12:04,684 --> 00:12:08,396 నేను మళ్ళీ ఎప్పటికీ నడవలేను అని డాక్టర్ ఇంకా అతని స్టాఫ్ చెప్పారు. 241 00:12:08,480 --> 00:12:11,858 నేను మాట్లాడనని అన్నారు. అలాగే మామూలు జీవితం బ్రతకలేను అన్నారు. 242 00:12:12,984 --> 00:12:14,819 నేను ఒక ఫిజికల్ థెరపిస్ట్ ని పెట్టుకున్నాను. 243 00:12:14,903 --> 00:12:18,990 ఆయన నాతో… ఆయన నేను మళ్ళీ నడవగలను అని నమ్మాడు. 244 00:12:19,074 --> 00:12:21,993 నేను ఆయనతో, "నేను మళ్ళీ నడవలేను. 245 00:12:22,077 --> 00:12:24,704 డాక్టర్లు నేను ఎప్పటికీ నడవలేను అన్నారు" అని చెప్పాను. 246 00:12:25,664 --> 00:12:28,875 అందుకు ఆయన, "నేను అదంతా నమ్మను. 247 00:12:28,959 --> 00:12:33,088 నిన్ను చూస్తుంటే నువ్వు నడవగలవు అని నాకు అనిపిస్తుంది" అన్నారు. 248 00:12:35,423 --> 00:12:37,634 అలాగే నేను నా మొదటి అడుగు వేసిన తర్వాత, 249 00:12:39,219 --> 00:12:41,221 నన్ను ఏదీ ఆపలేదు. 250 00:12:42,180 --> 00:12:44,516 ఒక ప్రమాదకరమైన బంధంలో ఉండకూడదు అని నీకు ఎవరూ చెప్పకపోతే 251 00:12:44,599 --> 00:12:46,810 అలాంటి బంధంలోకి నువ్వు దిగకూడదని నీకు తెలీదు. 252 00:12:46,893 --> 00:12:49,104 ఎవరూ చెడ్డ బంధాలలో ఉండకూడదు. 253 00:12:49,187 --> 00:12:51,231 మీరు సహాయం కోసం ఎవరి వైపు చూడలేదు, కదా? 254 00:12:51,314 --> 00:12:54,901 -మీ గృహ హింస సమస్య విషయంలో. -నేను పోలీసులను చాలా సార్లు 255 00:12:54,985 --> 00:12:55,819 సహాయం కోసం పిలిచాను. 256 00:12:55,902 --> 00:12:56,987 మరి వాళ్ళు వచ్చారా? 257 00:12:57,070 --> 00:12:58,446 వచ్చారు, కానీ అతను కూడా పోలీసోడు కావడంతో 258 00:12:58,530 --> 00:13:01,658 ఎవరూ నాకు సహాయం చేయలేదు. 259 00:13:02,367 --> 00:13:05,912 నాకు కన్ను నల్లగా అయినా, పెదాలు పగిలిపోయినా, 260 00:13:05,996 --> 00:13:10,125 వాడు తన బ్యాడ్జి చూపించేవాడు, అప్పుడు వాళ్లు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. 261 00:13:11,960 --> 00:13:14,129 ఉన్నట్టుండి ఏమీ మాట్లాడకుండా పోయేవారు. 262 00:13:16,673 --> 00:13:19,009 చివరికి మన న్యాయవ్యవస్థ నాకు ఏం చేయలేకపోయింది. 263 00:13:19,092 --> 00:13:20,218 వాడికి పదేళ్లు జైలు శిక్ష వేశారు. 264 00:13:20,302 --> 00:13:21,303 పది సార్లు నన్ను కాల్చినందుకు. 265 00:13:21,386 --> 00:13:24,055 నన్ను కాల్చినందుకు. కాల్చిన ప్రతీ బుల్లెట్ కు ఒక ఏడాది శిక్ష పడింది. 266 00:13:24,139 --> 00:13:25,640 అది మీకు న్యాయం అనిపించిందా? 267 00:13:25,724 --> 00:13:28,476 అది న్యాయం కాదు. అది న్యాయం కాలేదు. 268 00:13:28,560 --> 00:13:30,812 అయినప్పటికీ, మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యారు. 269 00:13:30,896 --> 00:13:32,397 అంత జరిగినా పోలీస్ ని అయ్యాను, 270 00:13:32,480 --> 00:13:36,735 ఎందుకంటే నాకు దక్కని న్యాయాన్ని నేను ఇతరులకు దక్కేలా చేయాలని. 271 00:13:36,818 --> 00:13:40,447 మరి మన దేశంలో పోలీసు వ్యవస్థ నాశనమైంది అని భావించే యువతకు మీరు… 272 00:13:40,530 --> 00:13:43,909 ఏమని చెప్తుంటారు? 273 00:13:43,992 --> 00:13:48,997 వ్యవస్థ నిజంగానే పాడైంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పోలీసు డిపార్ట్మెంట్ లోనికి వెళ్లగలిగితే, 274 00:13:49,080 --> 00:13:52,083 వారికి స్వరం అందించగలరు. అలా చేసి… మార్పును తీసుకురాగలరు. 275 00:13:55,170 --> 00:13:58,048 జనం అక్రమాలు చేస్తారు కాబట్టి మనకు పోలీసులు కావాలి. 276 00:13:58,131 --> 00:14:01,760 కానీ మానసిక ఆరోగ్యం విషయంలో వాళ్లకు ట్రైనింగ్ ఉండటం లేదు. 277 00:14:01,843 --> 00:14:04,137 గృహ హింస చరిత్ర ఉన్న వారితో ఎలా డీల్ చేయాలో 278 00:14:04,221 --> 00:14:07,807 పోలీసులకు ట్రైనింగ్ ఉండటం లేదు. 279 00:14:07,891 --> 00:14:09,809 పోలీసులు ప్రతీదానికి అవసరం లేదు. 280 00:14:09,893 --> 00:14:11,102 బాగా చేస్తున్నారు. 281 00:14:11,186 --> 00:14:14,689 నేను మా చీఫ్ తో, "నేను ఒక మెంటార్ ప్రోగ్రామ్ ప్రారంభించాలి అనుకుంటున్నాను" అన్నాను. 282 00:14:14,773 --> 00:14:16,274 ఆయన కూడా అది మంచి ఐడియా అన్నారు. 283 00:14:17,108 --> 00:14:19,319 ఇంకోసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని 284 00:14:20,487 --> 00:14:22,113 నోటి ద్వారా బయటకు వదలండి. 285 00:14:25,075 --> 00:14:26,409 ఆ తర్వాత శరీరాన్ని కదిలించండి. 286 00:14:26,493 --> 00:14:27,994 -చాలా థాంక్స్. -బాగుంది. థాంక్స్. 287 00:14:29,537 --> 00:14:31,790 మా అందరికీ మిస్ కత్రినా, 288 00:14:32,290 --> 00:14:34,834 మేము ఎలాంటి వారితో స్నేహం చేయాలో చెప్పారు. 289 00:14:34,918 --> 00:14:36,002 ఆ సలహా మీకు పనికొచ్చిందా? 290 00:14:36,836 --> 00:14:38,672 నా చెడ్డ వైఖరి విషయంలో నాకు ఎలా సహాయం చేయాలో వాళ్లకు తెలుసు. 291 00:14:38,755 --> 00:14:39,589 కనాసియా 292 00:14:40,757 --> 00:14:41,591 అవును. 293 00:14:41,675 --> 00:14:46,680 ఈ బృందం నాకు నేను ఎలాంటి దానినో అలా ఉండటానికి ఆత్మవిశ్వాసం వచ్చేలా చేసింది. 294 00:14:46,763 --> 00:14:48,723 నన్ను నాలాగా మార్చింది. 295 00:14:48,807 --> 00:14:53,603 అలాగే మా అమ్మాయిలకు కూడా ఈ సమాజానికి సేవ చేయడానికి 296 00:14:53,687 --> 00:14:57,274 అనేక అవకాశాలు ఉన్నాయి అని తెలిసేలా చేసింది. కాబట్టి, చాలా సంతోషం. 297 00:14:57,357 --> 00:14:59,776 నాకు కొత్త స్నేహితులు కూడా దొరికారు. 298 00:14:59,859 --> 00:15:01,903 ముఖ్యంగా అస్తమాను చిరాకు తెప్పించే ఈ పిల్ల. 299 00:15:01,987 --> 00:15:04,614 కార్మెన్ వచ్చిన ప్రారంభంలో, కనీసం మాట్లాడేది కూడా కాదు. 300 00:15:04,698 --> 00:15:07,158 చాలా నిశ్శబ్దంగా ఉండేది. 301 00:15:07,242 --> 00:15:09,536 ఏమాత్రం మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు చూడండి. 302 00:15:09,619 --> 00:15:11,788 మా పిల్ల మానిక్యూర్ చేయించుకుంది. 303 00:15:11,871 --> 00:15:14,457 -ఆమె ఇతరులను ఏడిపిస్తోంది. -నిజమే. జనాన్ని ఏడిపిస్తోంది. 304 00:15:14,541 --> 00:15:17,961 నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, బుజ్జి. మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది. 305 00:15:22,841 --> 00:15:27,178 కత్రినా లాగే, బ్రిట్నీ కూడా న్యాయ వ్యవస్థను అన్ని కోణాల నుండి చూసింది. 306 00:15:27,262 --> 00:15:29,764 అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల 307 00:15:29,848 --> 00:15:32,017 చేయించడానికి లాయర్ గా కష్టపడుతోంది. 308 00:15:32,100 --> 00:15:35,395 అలాగే ఒకప్పుడు జైలుకు వెళ్లిన మహిళకు కూతురిగా పాటు పడుతుంది. 309 00:15:36,271 --> 00:15:38,356 -హాయ్. ఎలా ఉన్నారు? -హాయ్. 310 00:15:38,440 --> 00:15:40,108 -మిమ్మల్ని కలవడం సంతోషం. -బాగున్నాను. 311 00:15:40,191 --> 00:15:43,778 మనం ఇప్పుడు రీఫౌండ్రిలోకి వెళ్లి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. 312 00:15:43,862 --> 00:15:45,989 మంచిది. నాకు "రీఫౌండ్రి" అనే పేరు బాగా నచ్చింది. 313 00:15:46,072 --> 00:15:47,365 నోయెల్ క్లియర్లి బోర్డు ఆఫీసర్, రీఫౌండ్రి 314 00:15:47,449 --> 00:15:49,451 రీఫౌండ్రిలో మా లక్ష్యం జైలు నుండి విడుదలైన వారు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా, 315 00:15:49,534 --> 00:15:51,161 అలాగే నిరుద్యోగం బారిన పడకుండా అరికట్టడమే. 316 00:15:51,244 --> 00:15:52,329 ఇతని పేరు జీన్. 317 00:15:52,412 --> 00:15:53,830 జీన్ మనిగో చేయి తిరిగిన హస్తకళాకారుడు & వ్యాపారవేత్త 318 00:15:53,914 --> 00:15:55,540 ఇతను న్యూయార్క్ లో మా మొదటి బృందం నుండి పాసయిన వ్యక్తి, 319 00:15:55,624 --> 00:15:56,917 అలాగే ఈయన చేయి తిరిగిన హస్తకళాకారుడు, 320 00:15:57,000 --> 00:15:59,836 ఈయన ఇవాళ మీకు కొన్నిటిని ఎలా చేయాలో చేసి చూపిస్తాడు. 321 00:15:59,920 --> 00:16:03,715 మీరందరూ ఇవాళ వైన్ అరను తయారు చేయబోతున్నారు. 322 00:16:03,798 --> 00:16:05,467 -సరే. -అలాగే. 323 00:16:06,051 --> 00:16:10,096 మీ చెక్క కాస్త పాతది అన్నట్టు కనిపించేలా చేసే రంగును మీకు ఇస్తున్నాను. 324 00:16:10,180 --> 00:16:11,306 -మంచిది. -సరే. 325 00:16:11,389 --> 00:16:14,476 మీలో ఒకరు దీన్ని పూయండి, ఇంకొకరు అయిదు వరకు లెక్క పెట్టి తుడిచేయండి. 326 00:16:14,559 --> 00:16:16,478 ఏడు వరకు లెక్క పెడితే ఏమవుతుంది? 327 00:16:16,561 --> 00:16:17,812 ఏడు అయినా పర్లేదు. 328 00:16:18,855 --> 00:16:21,066 నీకు హస్తకళలు బాగా వచ్చా, బ్రిట్నీ? 329 00:16:21,149 --> 00:16:23,443 నేను లీగల్ వాదనల్లో నా కళను చాలా బాగా చూపించాల్సి ఉంటుంది. 330 00:16:23,526 --> 00:16:25,403 అవును! చేయాలి. అది నిజమే. 331 00:16:25,487 --> 00:16:28,490 నువ్వు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తులలో ఒకదానివి. 332 00:16:28,573 --> 00:16:30,242 బ్రిట్నీ కే. బార్నెట్ లాయర్ & సామాజిక వ్యవస్థల స్థాపకురాలు 333 00:16:30,325 --> 00:16:32,786 క్షమాభిక్ష ఇప్పించే పనిని నేను ఈ మధ్య పేరు కోసం చేసేవారి కంటే ముందే ప్రారంభించాను. 334 00:16:32,869 --> 00:16:37,249 నేను ఇప్పటి వరకు 36 మందిని జీవిత ఖైదు శిక్ష బారి నుండి విడిపించాను. 335 00:16:37,332 --> 00:16:40,252 అయితే మీ బ్యాక్ గ్రౌండ్ గురించి మాకు కొంచెం చెప్పండి. 336 00:16:40,335 --> 00:16:42,796 నేను మొదటి నుండి లాయర్ కావాలని కోరుకున్నాను. క్లైర్ హ్యూక్స్ టేబుల్ లా అవ్వాలి అనుకునేదాన్ని. 337 00:16:42,879 --> 00:16:43,880 ఓహ్, అమ్మో, సూపర్. 338 00:16:43,964 --> 00:16:46,591 కానీ గ్రామీణ తూర్పు టెక్సాస్ లో పెరగడం కారణంగా, 339 00:16:46,675 --> 00:16:50,470 అక్కడ నల్లజాతి లాయర్లు పెద్దగా ఉండేవారు కాదు. 340 00:16:50,554 --> 00:16:55,100 కాబట్టి, నేను ఆ కలను కొన్నాళ్ళు మర్చిపోయాననే చెప్పాలి. 341 00:16:56,059 --> 00:16:57,602 అప్పటికే మా అమ్మ జైల్లో ఉంది, 342 00:16:57,686 --> 00:17:00,313 కాబట్టి నా చెల్లితో ఎలాగైనా బతికి బట్ట కట్టడానికే చేశాను. 343 00:17:00,397 --> 00:17:04,150 అలా ఒకరోజు, "హేయ్, నేను లా చదువుదాం అనుకుంటున్నాను" అని చెప్పాను. 344 00:17:04,234 --> 00:17:07,487 నేను 1986 యాంటీ-డ్రగ్ వాడక చట్టం గురించి చదివాను. 345 00:17:07,571 --> 00:17:11,032 మనం డ్రగ్స్ వాడే వారి పట్ల, అమ్మే వారి పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదు. 346 00:17:15,286 --> 00:17:16,287 ది రెవరెండ్ సిసిల్ విలియమ్స్ 347 00:17:16,371 --> 00:17:18,957 మనం చూస్తే చాలా మంది బీదవారు, 348 00:17:19,040 --> 00:17:23,795 ముఖ్యంగా నల్లజాతి వారు జైళ్లకు పోవడం కనిపిస్తుంది. 349 00:17:23,879 --> 00:17:25,964 పలుకుబడి ఉన్న చాలా మంది తెల్లవారు పొడి రూపంలో ఉండే కొకైన్ వాడుతున్నారు, 350 00:17:26,046 --> 00:17:28,925 కానీ వర్ణజాతి ప్రజల సమాజాలలో మాత్రం క్రాక్ కొకైన్ ప్రబలుతోంది. 351 00:17:29,009 --> 00:17:32,429 అందువల్ల డ్రగ్స్ వాడకం అన్న కారణం చూపి నల్ల వారిని, చామనఛాయ ఉన్న వారిని 352 00:17:32,512 --> 00:17:35,015 అధిక మొత్తంలో జైళ్లకు పంపుతున్నారు. 353 00:17:35,098 --> 00:17:38,685 మా అమ్మ జైలుకు వెళ్లి వచ్చింది. ఆమెకు క్రాక్ కొకైన్ వ్యసనం ఉండేది. 354 00:17:38,768 --> 00:17:42,606 ఆ సమయంలో మా అమ్మను పునరావాస కేంద్రానికి పంపాలి, జైలుకు కాదు. 355 00:17:42,689 --> 00:17:46,735 నేను, "మా అమ్మ జైలుకు వెళ్లినా కూడా వ్యసనాన్ని వదులుకుంది" అని చెబుతుంటాను. 356 00:17:46,818 --> 00:17:47,903 "జైలుకు వెళ్లడం వల్ల కాదు." 357 00:17:50,614 --> 00:17:52,949 నేను జైల్లో మా అమ్మను మొదటి సారి కలవడానికి వెళ్లడం గుర్తుంది, 358 00:17:53,033 --> 00:17:54,784 మేము మధ్యలో ఒక గాజు గోడ ఉండగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. 359 00:17:54,868 --> 00:17:57,203 ఆ రోజు నా మనసును తాకిన ఒక విషయం ఏమిటంటే 360 00:17:57,287 --> 00:18:01,917 నేను వెళ్లడానికి ముందు ఒక చిన్న బిడ్డ 361 00:18:02,000 --> 00:18:06,004 తన అమ్మను తాకాలని చేయి చాపినప్పుడు అద్దంపై పడిన చేయి ముద్రే. 362 00:18:06,087 --> 00:18:07,881 అది చూసి నా మనసు చలించిపోయింది. 363 00:18:07,964 --> 00:18:11,176 కుటుంబంలో ఒక వ్యక్తి జైలుకు వెళితే, వాళ్ళ మొత్తం కుటుంబం నిర్బందించబడినట్టే. 364 00:18:11,259 --> 00:18:13,386 అది నేను స్వయంగా అనుభవించి ఉన్నాను, 365 00:18:13,470 --> 00:18:15,972 అందువల్లే, "గర్ల్స్ ఎంబ్రేసింగ్ మథర్స్" బృందం పుట్టింది. 366 00:18:16,765 --> 00:18:18,767 మా జెమ్ బృందం ద్వారా, మరింత మంది ఆడపిల్లలు 367 00:18:18,850 --> 00:18:21,228 భవిష్యత్తులో ఈ వ్యవస్థలోకి రాకుండా చూసి, 368 00:18:21,311 --> 00:18:24,231 కేవలం బతికి బట్టకట్టడం మాత్రమే కాకుండా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా చేయడమే. 369 00:18:24,314 --> 00:18:27,567 అది చాలా ప్రత్యేకమైన మీటింగ్. వాళ్ళు అక్కడి వారికి భోజనం తెచ్చారు… 370 00:18:27,651 --> 00:18:28,944 ఏంజెలికా జరగోజా ప్రోగ్రామ్ డైరెక్టర్, జెమ్ 371 00:18:29,027 --> 00:18:31,863 …వాళ్ళు ఒక పాఠాన్ని, అలాగే ఆర్ట్ థెరపీని అక్కడికి తీసుకొచ్చారు. 372 00:18:31,947 --> 00:18:33,949 -అమ్మలు పిల్లల్ని తాకడానికి వీలవుతుందని. -ఒకరిని ఒకరు తాకడం కోసం. 373 00:18:34,032 --> 00:18:36,785 జైల్లో కలిస్తే ఎలా ఉంటుందో అలా కాకుండా, అందరినీ ఒక గదిలోకి తీసుకెళ్తారు. 374 00:18:36,868 --> 00:18:39,579 జైల్లో అయితే మీరు ఒకరికి ఒకరు ఎదురుగా టేబుల్ మీద కూర్చుని 375 00:18:39,663 --> 00:18:41,081 అక్కడే ఉండి మాట్లాడుకోవాలి. 376 00:18:41,164 --> 00:18:44,084 కానీ ఈ వీక్షణల్లో, మీరు ఒక పెద్ద గదిలో, మీ కూతురితో కలిసి కూర్చోవచ్చు. 377 00:18:44,167 --> 00:18:46,711 మీ బిడ్డకు జుట్టు అల్లవచ్చు, హత్తుకోవచ్చు. 378 00:18:46,795 --> 00:18:49,756 ఇలాంటి ప్రోగ్రామ్ లు ఇంకా ఎక్కువ ఎందుకు లేవు, బ్రిట్నీ? 379 00:18:49,839 --> 00:18:54,844 అంటే… చెప్పాలంటే, వీటి అవసరం ఉందని 380 00:18:54,928 --> 00:18:56,471 ఎక్కడ చూసినా చాలా స్పష్టంగా తెలుస్తుంది. 381 00:18:56,555 --> 00:18:59,808 కానీ నాకు తెలిసి, ఈ దేశంలో ఉన్న క్రిమినల్ లీగల్ వ్యవస్థ 382 00:18:59,891 --> 00:19:01,768 కేవలం శిక్ష వేయడం మీద దృష్టి సారించడంతో ఇలా అవుతుంది. 383 00:19:03,019 --> 00:19:06,606 లా అండ్ ఆర్డర్ లో వక్రీకరించబడిన ఈ విధానాలు ఎన్నో ఏళ్లుగా పాతుకుపోవడంతో 384 00:19:06,690 --> 00:19:09,859 వ్యవస్థలో మానవత్వ కోణం లోపించింది. 385 00:19:11,236 --> 00:19:16,449 ఏంజెలికా, నువ్వు ఈ పని చేయడానికి దారి తీసిన నీ జీవిత పయనం అలాగే 386 00:19:16,533 --> 00:19:19,160 నువ్వు ఇప్పుడు చేస్తున్న పని గురించి మాకు చెప్పు. 387 00:19:19,244 --> 00:19:22,914 నేను చిన్నతనంలోనే వ్యసనాలకు లోనై ఎన్నో పాట్లు పడ్డాను. 388 00:19:23,582 --> 00:19:25,250 కుటుంబ సభ్యుల ద్వారా నాకు డ్రగ్స్ అలవాటయ్యాయి. 389 00:19:25,333 --> 00:19:28,295 నేను చివరిసారిగా జైలుకు వెళ్ళినప్పుడు, నేరం చేయకుండానే వెళ్ళాను, 390 00:19:28,378 --> 00:19:31,631 కారణంగా పదేళ్లు నన్ను ప్రొబేషన్ పై బయటకు వదిలారు, కానీ నాకు పని దొరకలేదు. 391 00:19:31,715 --> 00:19:33,008 ఎవరూ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. 392 00:19:33,091 --> 00:19:37,721 కారణంగా నేను ప్రతీ నెల కట్టవలసిన ఫీజు కట్టడానికి వీలయ్యేది కాదు. 393 00:19:39,097 --> 00:19:41,683 నేనేమో, అప్పటికే ముగ్గురు పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్నాను. 394 00:19:41,766 --> 00:19:46,354 కాబట్టి నేను తిరిగి కోర్టుకు వెళ్ళినప్పుడు, జడ్జి నన్ను రెండేళ్లు టీడీసీకి పంపాడు. 395 00:19:46,938 --> 00:19:49,024 టీడీసీ: టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ 396 00:19:49,107 --> 00:19:52,110 అప్పటికి నా కూతురికి 11 ఏళ్ళు, అది తన తల్లి జైలుకు వెళ్లి రావడం చాలా సార్లు చూసింది. 397 00:19:52,193 --> 00:19:54,905 నా కూతురు తన తల్లి మెరుగవుతుందని ఎన్నో విన్నది, కానీ అలా జరగలేదు. 398 00:19:54,988 --> 00:19:56,531 దానికి విసుగు పుట్టింది. 399 00:19:59,242 --> 00:20:02,871 మొదటి రెండు సార్లు నాతో ఏమీ మాట్లాడలేదు. 400 00:20:03,705 --> 00:20:07,876 అప్పుడు జెమ్ ప్రోగ్రామ్ వారు వచ్చారు, నా కూతురితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేశాను, 401 00:20:07,959 --> 00:20:09,252 అప్పుడు నా కూతురు మౌనం వీడి, 402 00:20:09,336 --> 00:20:11,213 "అమ్మా, నాకు ఇదెలా చేయాలో తెలీడం లేదు. నాకు సహాయం చేస్తావా?" అంది. 403 00:20:13,131 --> 00:20:15,258 ఒక తల్లిగా ఆ మాటలు వినడం… 404 00:20:15,342 --> 00:20:18,637 ఎన్నో రోజులుగా నా కూతురు నోట మాట వినాలని తపించిన నాకు ఆ సంతోషం వర్ణనాతీతం. 405 00:20:19,221 --> 00:20:21,598 కేవలం గర్ల్స్ ఎంబ్రేసింగ్ మథర్స్ కార్యక్రమం వారు 406 00:20:21,681 --> 00:20:25,644 నాకు బతకడానికి మరొక మార్గం తెలిసింది. 407 00:20:28,605 --> 00:20:30,482 ప్రజలు అభివృద్ధి చెందడానికి 408 00:20:31,149 --> 00:20:34,402 అలాగే తమ అనుభవాల ద్వారా ఇతరులకు సహాయం చేసేలా చేయడం ఎలా? 409 00:20:34,486 --> 00:20:38,323 ఈ కారణంగానే మాతో ఏంజెలికా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. 410 00:20:38,406 --> 00:20:40,659 ఆమె ఇవాళ మా ప్రోగ్రామ్ డైరెక్టర్. 411 00:20:40,742 --> 00:20:42,869 ఇది కేవలం జనాన్ని జైలు నుండి విడిపించడం గురించి కాదు, వాళ్ళను 412 00:20:42,953 --> 00:20:45,372 -ఎలాంటి పరిస్థితుల్లోకి విడిపిస్తున్నామనేది కూడా ముఖ్యం. -అవును. 413 00:20:45,455 --> 00:20:49,459 ఈ ఆర్థిక సామర్థ్యం అందించే అంశం నాకు మా ప్రోగ్రామ్ లో చాలా ముఖ్యమైన విషయం. 414 00:20:49,542 --> 00:20:52,379 -కచ్చితంగా. అది కూడా ఉండాలి. -దాని సహాయంతో జనం బీదరికం నుండి 415 00:20:52,462 --> 00:20:54,881 బయట పడి నేరాల వైపు మళ్లకుండా ఉంటారు. 416 00:20:55,507 --> 00:20:58,009 మీ దగ్గర ఫలితాలను ఇవ్వగల విధానం ఉంది. 417 00:20:58,093 --> 00:21:01,263 అలాగే మీరు కిమ్ కర్దాషియన్ లాంటి 418 00:21:01,346 --> 00:21:03,056 గొప్ప వ్యక్తులను మీతో చేర్చుకున్నారు. 419 00:21:03,139 --> 00:21:06,017 ఆమె నన్ను చూసి, చాలా మంది వెనకడుగు వేసిన సమయంలో 420 00:21:06,101 --> 00:21:09,187 నేను చేస్తున్న పనికి మద్దతుగా నిలిచింది. 421 00:21:11,189 --> 00:21:14,234 లాస్ ఏంజెలెస్ కాలిఫోర్నియా 422 00:21:15,652 --> 00:21:18,196 అన్యాయ తీర్పును సవాలు చేయడం సులభం కాదు. 423 00:21:18,280 --> 00:21:20,699 బ్రిట్నీ చేస్తున్న పని గురించి కిమ్ విన్నప్పుడు, 424 00:21:20,782 --> 00:21:22,617 ఆమెకు సహాయం చేయాలనే ఆశ ఆమెలో పుట్టింది. 425 00:21:22,701 --> 00:21:27,038 ఆ తర్వాత మన న్యాయ వ్యవస్థను సరిదిద్దే క్రమంలో 426 00:21:27,122 --> 00:21:30,667 మరింత సహకారం అందించాలనే ఉద్దేశంతో మరింత నేర్చుకోవడానికి ఆమె లా స్కూల్ కి కూడా వెళ్ళింది. 427 00:21:30,750 --> 00:21:34,296 ఒకసారి మనం ఆలోచిస్తే, ఆమె దగ్గర ఒక భారీ గ్లోబల్ ప్లాట్ ఫామ్ ఉంది. 428 00:21:34,379 --> 00:21:36,298 అనేక కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. 429 00:21:36,381 --> 00:21:38,925 వందల కోట్ల మంది అంటే అసలు ఊహించడానికి కూడా 430 00:21:39,009 --> 00:21:41,011 -కష్టంగా ఉంది. -ప్రతీ ఖండంలో వారూ ఫాలో అవుతుండచ్చు. 431 00:21:41,094 --> 00:21:42,929 -చివరికి అంటార్కిటికా వారు కూడా కావచ్చు. -కచ్చితంగా. 432 00:21:46,224 --> 00:21:48,226 -ఎలా ఉన్నారు? -ఓరి, నాయనో, పిల్లా. 433 00:21:49,352 --> 00:21:51,104 -హాయ్. ఎలా ఉన్నారు? -హాయ్. నేను బాగానే ఉన్నాను. 434 00:21:51,187 --> 00:21:52,939 -ఓహ్, అమ్మో. -మంచిది. 435 00:21:58,069 --> 00:22:00,530 అయితే, కిమ్, మన ఇద్దరికీ తల్లిదండ్రులలో లాయర్లు ఉన్నారు, 436 00:22:00,614 --> 00:22:03,533 అలాగే నేను నా చిన్నప్పుడు ఏ రోజూ లాయర్ కావాలని అనుకోలేదని ఒప్పుకుంటా. 437 00:22:03,617 --> 00:22:05,452 మరి నువ్వు నీ చిన్నప్పుడు లాయర్ అవ్వాలి అనుకునే దానివా? 438 00:22:05,535 --> 00:22:08,330 నువ్వు మీ నాన్నను చూసి, "నేను కూడా ఆయనలా లాయర్ కాగలనా" అని అనుకున్నావా? లేదా? 439 00:22:08,413 --> 00:22:09,956 -నిజానికి నేను అనుకున్నాను. -అవునా? 440 00:22:10,040 --> 00:22:12,834 ఆయన ఆఫీసులో, మీరు ఊహించగల అన్ని రకాల సాక్ష్యాల పుస్తకాలు ఉండేవి. 441 00:22:12,918 --> 00:22:14,544 కిమ్ కర్దాషియన్ వ్యాపారవేత్త & లా అప్రెంటిస్ 442 00:22:14,628 --> 00:22:19,799 ఆ సమయంలో నా అక్క చెల్లెళ్ళు పూల్ లో బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకునేవారు. 443 00:22:19,883 --> 00:22:23,762 కానీ నేనేమో ఆయన ఆఫీసులో కూర్చొని సాక్ష్యాల పుస్తకాలు తిరగేసేదాన్ని. 444 00:22:24,721 --> 00:22:26,056 నువ్వు లా చేయడం విధి రాత, కదా? 445 00:22:26,139 --> 00:22:28,391 -ప్రతీ దానికి ఒక కారణం ఉంటుంది. -ప్రతీది మన జీవన పయనంలో భాగమే. 446 00:22:28,475 --> 00:22:29,809 నువ్వు ఒక గేమ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నావా? 447 00:22:29,893 --> 00:22:32,896 నేను నిన్నే చూస్తున్నాను, అమ్మా, ఎందుకంటే ఈ మధ్య కిమ్ నీకంటే ఎక్కువ చదివింది. 448 00:22:32,979 --> 00:22:35,982 ఏమో. నాకు కిమ్ కి ఇది బాగా సులభంగా ఉంటుందేమో అనిపిస్తోంది. 449 00:22:36,066 --> 00:22:38,276 కాస్త శ్రమ పడ్డాను, కానీ చివరికి సాధించాను. 450 00:22:39,694 --> 00:22:44,950 సరే. "ఒక వ్యక్తి ఎలాంటి సందర్భాల్లో తమను తాము కాపాడుకోవడానికి ప్రాణాంతకమైన 451 00:22:45,033 --> 00:22:46,952 శక్తిని ఉపయోగించగలరు?" చెప్తారా? 452 00:22:47,035 --> 00:22:50,538 ఒకరిపై ప్రాణాంతకమైన అపాయం ఏర్పడినప్పుడు, లేదా ప్రాణాంతకమైన అపాయం తప్పక ఉందని నమ్మిన 453 00:22:50,622 --> 00:22:53,708 సందర్భాలలో ఒక వ్యక్తి ప్రాణాంతకమైన శక్తిని ఉపయోగించవచ్చు. 454 00:22:54,709 --> 00:22:58,797 "బెదిరింపు/బ్లాక్ మెయిల్ మరియు దొంగతనం మధ్య వ్యత్యాసాన్ని వివరించండి." 455 00:23:00,173 --> 00:23:04,219 అంటే, దోపిడీ అనేది ఒక వ్యక్తిని ఎదుర్కొని చేసే పని, 456 00:23:04,302 --> 00:23:07,514 కానీ బెదిరింపు అలాగే బ్లాక్ మెయిల్ చేయడానికి ఒకరిని ఎదుర్కోవాల్సిన పని లేదు. 457 00:23:08,098 --> 00:23:09,349 సరే, నీకు ఇంకొక పాయింట్, అమ్మా. 458 00:23:09,432 --> 00:23:11,518 -చాలా థాంక్స్. -సరే. ఇంకొకటి. 459 00:23:15,063 --> 00:23:16,481 కరెక్ట్. 460 00:23:17,107 --> 00:23:20,068 అమ్మా, నువ్వు మంచి ప్రయత్నమే చేసావు. 461 00:23:20,151 --> 00:23:21,319 చాలా థాంక్స్, బంగారం. 462 00:23:21,403 --> 00:23:23,613 అయితే, కిమ్, మేము నీతో మాట్లాడాలి అనుకోవడానికి ఉన్న ఒక కారణం ఏంటంటే 463 00:23:23,697 --> 00:23:26,241 క్రిమినల్ న్యాయ సంస్కరణల విషయంలో 464 00:23:26,324 --> 00:23:30,203 నువ్వు చేసిన పని, అలాగే నీ నిబద్ధతే. 465 00:23:30,287 --> 00:23:34,874 వైట్ హౌస్ కి వెళ్లాలని నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి నాకు చెప్పు. 466 00:23:34,958 --> 00:23:37,752 నేను రూజ్వెల్ట్ గదిలో ఒక మీటింగ్ కి వెళ్లడం నాకు గుర్తుంది. 467 00:23:37,836 --> 00:23:39,504 అది క్షమాభిక్ష పెట్టమని కోరుతూ పెట్టిన మీటింగ్, 468 00:23:39,588 --> 00:23:42,382 అప్పుడు నాతో నా టీచర్లు కూడా ఉన్నారు. 469 00:23:42,465 --> 00:23:44,801 వాళ్ళు తమకు తెలిసిన ప్రతీ లా పదాన్ని… 470 00:23:45,385 --> 00:23:48,305 -అక్కడ వాడారు, నాకు అవేంటో అస్సలు తెలీదు. -డీకోడ్ చేసే వ్యక్తి ఎక్కడ? 471 00:23:48,388 --> 00:23:51,433 అవును, వాళ్ళు అక్కడ "డిఓజె" అనేవారు, నేనేమో, కూర్చొని మెసేజిలలో 472 00:23:51,516 --> 00:23:53,226 "డిఓజె అంటే ఏంటి?" అని అడిగేదాన్ని. 473 00:23:53,310 --> 00:23:55,437 ఆమె దానికి, "డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్" అనేది, అప్పుడు నేను, 474 00:23:55,520 --> 00:23:58,315 "నేను ముందెప్పుడూ ఇక్కడికి రాలేదు. అది నాకెలా తెలుస్తుంది?" అనుకునేదాన్ని. 475 00:23:58,398 --> 00:23:59,900 అప్పుడే నువ్వు లా స్కూల్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నావా? 476 00:23:59,983 --> 00:24:01,192 -ఆ క్షణంలో? -అవును. అవును. 477 00:24:01,276 --> 00:24:03,653 -భలే విషయం. గొప్ప సందర్భం అన్నమాట. -ఎందుకంటే నాకు చాలా సిగ్గేసింది. 478 00:24:03,737 --> 00:24:06,573 నేను వరుసగా ఫెయిల్ అవ్వడం కారణంగా అందరిలా కాకుండా 479 00:24:06,656 --> 00:24:09,659 ఒకటిన్నర ఏడాది ఎక్కువే పట్టినా కూడా… 480 00:24:09,743 --> 00:24:10,869 నువ్వు పట్టు వదలలేదు. 481 00:24:10,952 --> 00:24:12,454 నేను పట్టు వదలలేదు. 482 00:24:13,121 --> 00:24:14,706 అంటే, నేను లెటర్లు తెరిచే ప్రతీసారి 483 00:24:14,789 --> 00:24:17,792 నా పిల్లలు నాతో ఉండేవారు. వాళ్ళు నేను ఏడవడం చూసారు. 484 00:24:17,876 --> 00:24:19,794 కానీ వాళ్ళు నేను చివరిగా ఏడవడం చూసింది 485 00:24:19,878 --> 00:24:22,422 -మహా సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చినప్పుడే… -సూపర్. సంతోషం వల్ల, కదా? 486 00:24:22,505 --> 00:24:23,840 …అంటే, నేను సాధించాను అనుకున్నాను. 487 00:24:23,924 --> 00:24:26,468 అంటే, నేను అంత మొండిగా పోరాడడానికి కారణం అదే. 488 00:24:26,551 --> 00:24:29,179 ఎందుకంటే నా పిల్లలు గనుక అరెస్ట్ అయితే, 489 00:24:30,305 --> 00:24:34,142 నేను అరెస్ట్ అయినప్పుడు బయటపడేంత బలమైన అవకాశాలు వాళ్లకు లేవు. 490 00:24:34,226 --> 00:24:37,187 -లేదా నా పిల్లలు. నా తెల్ల పిల్లలు. -మీరు అరెస్ట్ అయినా. మీ పిల్లలు కూడా, అవును. 491 00:24:37,270 --> 00:24:41,441 ఈ విషయమే నన్ను ఆగకుండా ముందుకు వెళ్లేలా చేస్తుందని నా ఉద్దేశం. 492 00:24:46,613 --> 00:24:48,865 మనం బలంగా స్పందించే కథలు ఏమైనా ఉన్నాయా అంటే 493 00:24:48,949 --> 00:24:50,909 ఎక్కువగా మన దృష్టి కోణాన్ని మార్చగలిగేవి అయ్యుంటాయి. 494 00:24:50,992 --> 00:24:53,787 అది తెలిసిన తర్వాత, మనం ప్రపంచాన్ని కాస్త వేరేగా, 495 00:24:53,870 --> 00:24:55,956 లేదా ఆ ప్రపంచంలో మిమ్మల్ని మీరే వేరేగా చూసుకోవడం ప్రారంభిస్తారు. 496 00:24:56,039 --> 00:24:58,124 సరే, తర్వాత ఎవరు? 497 00:24:58,208 --> 00:24:59,292 -సరే. -అలాగే. 498 00:24:59,376 --> 00:25:01,586 -తర్వాత నువ్వే! -నేను వేరే రకమైన కథ చెప్పబోతున్నాను. 499 00:25:01,670 --> 00:25:03,755 మంచిది, మాకు కొంచెం… 500 00:25:03,838 --> 00:25:05,507 వెరైటీ కావాలి. 501 00:25:08,343 --> 00:25:11,846 నేను ఫస్ట్ క్లాసులో చదివేటప్పుడు, అందరితో బాగా మెలగాలని చూసేదాన్ని, 502 00:25:11,930 --> 00:25:15,475 అలాగే రహస్యంగా శ్రీమతి మిచెల్ కి నేనే బాగా ఇష్టం ఉండాలని కోరుకునే దాన్ని. 503 00:25:15,559 --> 00:25:19,145 అలా ఉండగా, కొన్నాళ్ళకు నా హోమ్ వర్క్ మాయం కావడం మొదలైంది. 504 00:25:19,229 --> 00:25:22,065 కానీ విషయం ఏంటంటే, నేను క్రమం తప్పకుండా నా హోమ్ వర్క్ చేసి ఇచ్చేదాన్ని, 505 00:25:22,148 --> 00:25:24,651 కారణం శ్రీమతి మిచెల్ కి నేను నచ్చాలని చూస్తుండేదాన్ని కాబట్టి. 506 00:25:24,734 --> 00:25:27,529 అయితే ఒకరోజు, శ్రీమతి మిచెల్ ఆటలు ఆడుకొనే పీరియడ్ లో ఒక మూల దాక్కుంది, 507 00:25:27,612 --> 00:25:30,991 ఒక కుర్రాడు నా డెస్క్ నుండి నా హోమ్ వర్క్ తీసుకొని, 508 00:25:31,074 --> 00:25:33,743 నా పేరు చెరిపేసి, వాడి పేరు రాసి, 509 00:25:33,827 --> 00:25:36,162 అది వాడి హోమ్ వర్క్ అన్నట్టు ఇస్తున్నాడని తెలుసుకుంది. 510 00:25:36,246 --> 00:25:39,249 అప్పుడు ఆ కుర్రాడిని ఆట పీరియడ్ నుండి తీసేసారు. 511 00:25:39,332 --> 00:25:43,044 అయితే, కొన్ని వారాలు గడిచిన తర్వాత, ఆ కుర్రాడు నా దగ్గరకు 512 00:25:43,128 --> 00:25:46,131 మేము ఖాళీగా, ఆడుకొనే సమయంలో వచ్చాడు. 513 00:25:46,214 --> 00:25:49,509 వాడు, "ఓయ్, చెల్సీ, నీకు శ్రీమతి మిచెల్ బాగా ఇష్టం అనుకుంటా కదా" అన్నాడు. 514 00:25:49,593 --> 00:25:51,136 అందుకు నేను, "శ్రీమతి మిచెల్ నాకు చాలా ఇష్టం" అన్నాను. 515 00:25:51,219 --> 00:25:53,638 వాడు, "నీకు బాగా ఇష్టమైన వారిని నువ్వు అభినందించడానికి ఏమనాలో తెలుసా?" అన్నాడు. 516 00:25:53,722 --> 00:25:55,223 నేను, "లేదు" అన్నాను, 517 00:25:56,057 --> 00:25:57,809 వాడు, "పోయి చావు" అనాలి అన్నాడు. 518 00:25:58,518 --> 00:26:03,106 అప్పుడు నేను, శ్రీమతి మిచెల్ దగ్గరకు వెళ్లి "శ్రీమతి మిచెల్, పోయి చావు" అన్నాను. 519 00:26:05,609 --> 00:26:07,986 ఆమె చాలా కోప్పడింది. 520 00:26:08,069 --> 00:26:11,823 అది చూసి నేను ఏడుపు మొదలెట్టా, ఎందుకంటే నేను ఏదో తప్పుగా చేసానని నాకు తెలిసిపోతోంది. 521 00:26:11,907 --> 00:26:13,283 కానీ ఏం తప్పు చేసానో తెలీడం లేదు. 522 00:26:13,366 --> 00:26:16,661 అలాగే లిటిల్ రాక్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో, 523 00:26:16,745 --> 00:26:18,622 అప్పట్లో పిల్లల్ని తప్పకుండా కొట్టాలనే నిబంధన ఉండేది. 524 00:26:18,705 --> 00:26:22,584 నేను భయంతో ఏడుస్తుండగా, శ్రీమతి మిచెల్ నాతో హాల్ లో 525 00:26:22,667 --> 00:26:24,544 గోడపై చేతులు పెట్టించి పిర్ర మీద చితక్కొట్టింది. 526 00:26:24,628 --> 00:26:26,087 నేను ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. 527 00:26:26,171 --> 00:26:29,466 ఆమె నన్ను కొట్టిన తర్వాత, గట్టిగా హత్తుకుంది, 528 00:26:29,549 --> 00:26:31,801 హత్తుకొని, "రేపు మరొక కొత్త రోజు" అని చెప్పింది. 529 00:26:31,885 --> 00:26:35,805 తర్వాత నేను ఇంటికి వెళ్లిన తర్వాత, మా అమ్మా నాన్నలు నాకు డిక్షనరీ ఎలా వాడాలో నేర్పించారు. 530 00:26:38,600 --> 00:26:40,727 వావ్. 531 00:26:41,895 --> 00:26:43,521 భలే కథ. 532 00:26:44,689 --> 00:26:48,026 -నువ్వు ఎప్పుడైనా… నేను ఆ కుర్రాడిని కనిపెడతా! -చెత్త కుర్రాడు! 533 00:26:48,109 --> 00:26:51,112 -ఇది భలే కథ. -నిజమే. 534 00:26:51,696 --> 00:26:54,324 కానీ నాకు మనసుకు బాగా హత్తుకున్న ఒక విషయం ఏంటంటే 535 00:26:54,407 --> 00:26:56,368 ఆమె చివరికి నిన్ను హత్తుకొని 536 00:26:56,451 --> 00:26:58,411 రేపు మరొక కొత్త రోజు అనడం భలే ఉంది. 537 00:26:58,495 --> 00:26:59,746 ఖోల్ సాల్మన్ కథలు చెప్పే విధానాన్ని నేర్పించే వ్యక్తి 538 00:26:59,829 --> 00:27:03,208 అలా అనడం వల్ల, "సరే, నేను చెడ్డదాన్ని కాదు" అనే ఆలోచన నీలో పుడుతుంది. 539 00:27:03,291 --> 00:27:05,544 కానీ ఈ కథలన్నీ చాలా కొత్తదనం ఉన్న కథలు 540 00:27:05,627 --> 00:27:07,212 వీటి ద్వారా మనం అందరం ఏదోకటి నేర్చుకోవడమో 541 00:27:07,295 --> 00:27:09,256 లేక మన మనసులో ఒక గ్రహింపు రావడమో… 542 00:27:09,339 --> 00:27:12,467 నేడు మనల్ని మనలాగా తీర్చిదిద్దిన ప్రాథమిక విషయాలు ఈ కథలన్నీ. 543 00:27:13,718 --> 00:27:17,556 క్రిమినల్ జస్టిస్ సంస్కరణ అనేది చాలా క్లిష్టమైన విషయం. 544 00:27:17,639 --> 00:27:18,640 ఒక వైపు, 545 00:27:18,723 --> 00:27:22,352 నీకు ఉన్న పెద్ద ఫాలోయింగ్ కారణంగా నువ్వు చేసే పని ఏదైనా చాలా మందికి తెలుస్తుంది. 546 00:27:22,435 --> 00:27:26,773 కానీ అదే సమయంలో, నిన్ను అందరి ముందు నిలబెట్టి వారికి లక్ష్యం అయ్యేలా చేయగలదు. 547 00:27:26,856 --> 00:27:28,858 నీ ఫాలోవర్స్ ఎలా స్పందించారు? 548 00:27:28,942 --> 00:27:33,530 నువ్వు సోషల్ మీడియాలో చూసిన ప్రత్యేకమైన, గొప్ప కేసులు ఏమైనా ఉన్నాయా? 549 00:27:33,613 --> 00:27:36,533 ఒక సెలబ్రిటీ చేసే పనులు కొందరిని ప్రోత్సహించవచ్చు, 550 00:27:36,616 --> 00:27:38,577 కానీ అదే సమయంలో అది మాకే వ్యతిరేకంగా పని చేయవచ్చు. 551 00:27:38,660 --> 00:27:41,454 కాబట్టి నేను ఎప్పుడూ సరైన ఎత్తుగడలే వేస్తుంటాను. 552 00:27:41,538 --> 00:27:46,418 ఆ తర్వాత ఒకసారి నా సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ కి తెలిసేలా చేయాలని అనుకున్నాక, 553 00:27:46,501 --> 00:27:49,254 అప్పుడు వాళ్ళు కూడా ఆసక్తి చూపి, సహాయం చేయాలనుకుంటారు. 554 00:27:49,337 --> 00:27:52,716 అన్నిటికంటే మనసుకు బాధ కలిగించిన రోజు అంటే, ఒక ఉరి తీయబడిన రోజే. 555 00:27:52,799 --> 00:27:54,551 నేను ఆ విషయమంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. 556 00:27:54,634 --> 00:27:56,428 సామెతలు 24:11 చావునకై పట్టుబడినవారిని నీవు తప్పించుము; 557 00:27:56,511 --> 00:27:58,138 నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? 558 00:27:58,221 --> 00:28:00,056 కానీ నేను అప్పుడు స్కిమ్స్ ఫిట్టింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. 559 00:28:00,140 --> 00:28:03,643 అలాగే నేను నా మేకప్ కిట్లు చెక్ చేయాలి, ఎందుకంటే మేము లాంచ్ చేయాలంటే 560 00:28:03,727 --> 00:28:05,604 ఆ గంటలోనే దాన్ని నేను ఆమోదించాల్సి ఉంటుంది. 561 00:28:05,687 --> 00:28:07,314 #బ్రాండన్ ని కాపాడండి 562 00:28:07,397 --> 00:28:10,609 ఒక వ్యక్తిని ఉరి తీయబోతున్నారు. దాంతో, కార్యక్రమం జరిగినంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నా. 563 00:28:10,692 --> 00:28:12,027 #బ్రాండన్ బెర్నార్డ్ ఉరి తీయబడకూడదు: 564 00:28:12,110 --> 00:28:13,820 1. అప్పటికి అతనికి 18 ఏళ్ళు. 2. కాల్చినది అతను కాదు. 565 00:28:13,904 --> 00:28:16,531 నా పిల్లలు నా చుట్టూ పరిగెడుతూ, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగేవారు. 566 00:28:16,615 --> 00:28:19,534 అప్పుడు నేను అతనితో మా పిల్లల్ని మాట్లాడించాను. 567 00:28:19,618 --> 00:28:21,411 బ్రాండన్ బెర్నార్డ్ ఉరి తీయబడటానికి రెండు గంటలే ఉంది. 568 00:28:21,494 --> 00:28:25,582 అతనికి చివరి క్షణాల్లో, ఉరికంబం ఎక్కడం ఎలా ఉంటుందో తెలియాలని 569 00:28:25,665 --> 00:28:29,127 అలాగే ఒక మంచి వ్యక్తిని చంపబోతున్నారని జనానికి తెలిసేలా చేయాలనుకున్నాను. 570 00:28:29,211 --> 00:28:31,588 ఈ ఉరితీయబడుతున్న వ్యక్తి వెనుక కుటుంబాలు ఉన్నాయి. 571 00:28:33,173 --> 00:28:37,385 కొన్ని సార్లు మేము విజయవంతంగా ఉరిశిక్షను తప్పించాం. 572 00:28:37,469 --> 00:28:38,637 కొన్ని సార్లు మేము ఆపలేకపోయాం. 573 00:28:38,720 --> 00:28:41,056 బ్రాండన్ ఎంత గొప్ప వ్యక్తో నేను ఎంత సేపైనా మీకు చెప్పగలను. 574 00:28:41,139 --> 00:28:42,891 ఈ ధోరణి మారాలి: మన వ్యవస్థ ఎంతో దారుణంగా ఉంది 575 00:28:42,974 --> 00:28:47,229 ఈ అన్యాయాల వైపు నేను నా జీవితంలో ముందే దృష్టి సారించలేకపోవడం నమ్మలేకపోయా. 576 00:28:47,312 --> 00:28:50,273 నువ్వు గొప్ప తల్లిదండ్రుల దగ్గర పెరిగిన దానివి, 577 00:28:50,357 --> 00:28:53,109 చిన్న వయసులో నుండే వాళ్ళు నీకు ప్రపంచం గురించి ఎంతో నేర్పించారు. 578 00:28:53,193 --> 00:28:54,819 వాటిపై నాకు అభిప్రాయం కూడా ఉండాలనేవారు. 579 00:28:54,903 --> 00:28:58,823 అలా ఒక అభిప్రాయం కలిగి ఉండటం ఎంతో బలాన్ని చేకూర్చుతుంది 580 00:28:58,907 --> 00:29:00,367 మనకు అది ఎంతో నేర్పుతుంది. 581 00:29:00,450 --> 00:29:05,705 అంటే, ఇలాంటి పరిస్థితుల పట్ల నా అభిప్రాయం ఏంటని ముందెన్నడూ ఎవరూ నన్ను అడగలేదు… 582 00:29:05,789 --> 00:29:09,459 నాకు అస్సలు తెలీదు. నేను బెవర్లీ హిల్స్ లో నా చిన్న ప్రపంచంలోనే పెరిగాను, తెలుసా? 583 00:29:09,542 --> 00:29:12,546 కానీ నేను నా పిల్లల్ని అలా పెంచాలి అనుకోవడం లేదు. 584 00:29:12,629 --> 00:29:18,718 నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు, మఫ్తీలో ఉన్న పోలీసుకు కొకైన్ అమ్మినందుకు 585 00:29:18,802 --> 00:29:22,347 మా అంకుల్ రోజర్ ని అరెస్ట్ చేసి, తర్వాత జైలుకు పంపించారు. 586 00:29:22,430 --> 00:29:25,934 ఆ అనుభవం నాపై చాలా పెద్ద ప్రభావం చూపిందని నా ఉద్దేశం, 587 00:29:26,017 --> 00:29:28,353 ఎందుకంటే ఆయన నాపై ప్రేమను మాత్రమే చూపించారు. 588 00:29:28,436 --> 00:29:33,483 నాకు కేవలం ఒక మంచి వ్యక్తిగా మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి 589 00:29:33,567 --> 00:29:36,111 ఒక చెడు పని చేసారని తెలుసుకోవడం కష్టమే, 590 00:29:36,194 --> 00:29:38,363 కానీ ఆ ఒక్క చర్య ఆయన మిగిలిన జీవితం నాశనం కావడానికి కారణం కాకూడదు. 591 00:29:38,446 --> 00:29:39,823 నిజం. 592 00:29:39,906 --> 00:29:42,492 తప్పు చేసిన వారు జైలుకు వెళ్లకూడదని నేను అనడం లేదు. 593 00:29:42,576 --> 00:29:44,286 కొన్ని సార్లు జనాన్ని సరిదిద్దే ఉద్యోగాలలో పని చేసేటప్పుడు, 594 00:29:44,369 --> 00:29:48,331 జనం 'మనం జైలు శిక్ష ఉండకూడదు అంటుంటాం' అనుకుంటారు, కానీ అవసరమైనప్పుడు 595 00:29:48,415 --> 00:29:50,083 -కఠినంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది. -అది నిజమే. 596 00:29:50,166 --> 00:29:55,255 జైళ్లకు బదులు సంస్కరణ తీసుకురావడానికి మరిన్ని పునరావాస కేంద్రాలు ఎందుకు ఉండటం లేదు? 597 00:29:55,338 --> 00:30:01,761 చిన్న మార్పుతో సాధించగల పురోగతిని కాదని జీవితాలను నాశనం చేస్తున్నారు. 598 00:30:01,845 --> 00:30:03,680 నేనైతే ఎవరికైనా ఇంకొక అవకాశం ఇవ్వాలని అంటాను. 599 00:30:06,099 --> 00:30:07,267 యెరక్ ట్రైబల్ నేషన్ కాలిఫోర్నియా 600 00:30:07,350 --> 00:30:09,019 మేము ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్నాం, 601 00:30:09,102 --> 00:30:12,564 ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. 602 00:30:13,690 --> 00:30:15,191 నేను జడ్జి ఆబీని కలవబోతున్నాను 603 00:30:15,275 --> 00:30:18,361 ఆమె యెరక్ తెగ ప్రజల కోసం వారి సంప్రదాయం మరియు విలువలకు అనుగుణంగా 604 00:30:18,445 --> 00:30:21,573 మొట్టమొదటి ప్రత్యేకమైన గిరిజన న్యాయ వ్యవస్థను ఏర్పరచి, నడిపిస్తోంది. 605 00:30:22,449 --> 00:30:25,452 ఆమె మనం సమాజంలోని ప్రజలను బాగు చేయాలే తప్ప 606 00:30:25,535 --> 00:30:27,746 శిక్షించకూడదు అని నమ్ముతుంది. 607 00:30:28,330 --> 00:30:30,957 న్యాయం అంటే ఏంటి, అలాగే దానిని ఎలా అమలు చేస్తారనే 608 00:30:31,041 --> 00:30:34,961 విషయాలలో మనం నేర్చుకోగలవి ఎన్నో ఉన్నాయని నా ఉద్దేశం. 609 00:30:43,887 --> 00:30:45,472 మేము అలా అస్సలు చేయం. 610 00:30:47,265 --> 00:30:49,559 -మీరు అలా ఎప్పుడైనా కోర్టులో చేశారా? -లేదు, మేము అలా చేయము. 611 00:30:49,643 --> 00:30:51,269 హలో. 612 00:30:51,353 --> 00:30:52,646 హలో, తల్లి. స్వాగతం. 613 00:30:53,271 --> 00:30:55,148 వావ్, ఇది భలే ఉంది. 614 00:30:55,232 --> 00:30:56,983 మేము మిమ్మల్ని ఏమని పిలవాలి? ఎందుకంటే మాకు గుర్తులేదు. 615 00:30:57,067 --> 00:31:00,403 -హిల్లరీ అంటే చాలు. అంతే. -అలాగే పిలుస్తాం, సరే. 616 00:31:00,487 --> 00:31:02,989 -మీరు ఎప్పుడైనా ఏకోర్న్ సూప్ తాగారా? -లేదు. కానీ తాగాలని ఉంది. 617 00:31:03,073 --> 00:31:03,907 లారా వైట్ వుడ్స్ 618 00:31:03,990 --> 00:31:05,450 మేము మీకోసం దాన్ని బాగా స్పెషల్ గా చేస్తాం. 619 00:31:05,533 --> 00:31:07,911 నేను మీకు ఈ చిన్న రాయిని కూడా ఇస్తాను. 620 00:31:07,994 --> 00:31:09,287 సరే. 621 00:31:12,707 --> 00:31:14,209 ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు. 622 00:31:15,752 --> 00:31:17,504 -మీరు ఇంకేమైనా అనుకుంటూ ఉండవచ్చు. -అది నాకు తెలుసు. 623 00:31:17,587 --> 00:31:19,798 నాకు తెలిసి ఇదే ఈ ప్రదేశంలో ఉన్న అత్యంత గట్టి… ఏకోర్న్. 624 00:31:22,133 --> 00:31:25,762 అయితే మీరు ఎలాంటి పరిష్కారాలు కనిపెట్టారు? 625 00:31:25,845 --> 00:31:28,974 న్యాయ వ్యవస్థలో వచ్చిన సమస్య ఏంటంటే 626 00:31:29,057 --> 00:31:31,309 కచ్చితంగా మేమే రైటు, మీరు కాదు అనడానికి లేదు 627 00:31:31,393 --> 00:31:33,019 ఎందుకంటే ఎప్పటికైనా మనం అందరం కలిసే ఉండాలి. 628 00:31:33,103 --> 00:31:36,648 కాబట్టి ఏర్పరచే విధానం సంస్కృతికి సరిపడేది అయి ఉండాలి. 629 00:31:36,731 --> 00:31:40,026 అంటే మనం సమాజాన్ని నిబంధనలతో పునర్నిర్మించుకోవాలి. ఈ ప్రోగ్రామ్ లు ఆ పనే చేస్తాయి. 630 00:31:45,198 --> 00:31:48,577 షాన్ ఓ'నీల్ యెరక్ తెగ సభ్యుడు 631 00:31:48,660 --> 00:31:51,204 నేను సాన్ ఫ్రాన్సిస్కో లో జడ్జిగా పని చేశాను 632 00:31:51,288 --> 00:31:53,164 ఎందుకంటే నేను అనేక ఏళ్ళు రాష్ట్ర కమిషనర్ గా పని చేశా. 633 00:31:55,083 --> 00:31:58,461 మొదట్లో, నేను ఇంటికి వచ్చినప్పుడు, జనం చూసి, "నువ్వు జడ్జివి కాదు 634 00:31:58,545 --> 00:32:00,964 ఎందుకంటే నీకు ఈ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి తెలుసు" అనేవారు. 635 00:32:01,047 --> 00:32:03,925 అప్పుడు నేను, "నాకు అందరూ తెలుసు, అలాగే మీకు నేను తెలుసు. 636 00:32:04,009 --> 00:32:05,427 ఇప్పుడు మీరు చెప్పాలనుకునేది ఏంటి?" అనేదాన్ని. 637 00:32:06,303 --> 00:32:07,137 జడ్జి ఆబీ చీఫ్ జడ్జి 638 00:32:07,220 --> 00:32:09,347 మనం 500 ఏళ్ల క్రితం ఉన్నాం అనుకోండి, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి 639 00:32:09,431 --> 00:32:11,474 నది దగ్గర చక్కర్లు కొడుతూ కనిపించినోడిని న్యాయం చెప్పమని అంటాం అనుకున్నారా? 640 00:32:12,809 --> 00:32:14,394 రాష్ట్ర న్యాయ విధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు, 641 00:32:14,477 --> 00:32:16,605 ఫెడరల్ న్యాయ విధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు, 642 00:32:16,688 --> 00:32:19,983 అలాగే అవి మనకు సరిపోతాయి అని నాకు అనిపించలేదు. 643 00:32:21,359 --> 00:32:25,030 ఇది నా ఇల్లు, వీరికి ఒక న్యాయ వ్యవస్థను పెట్టడం నా లక్ష్యం అనిపించింది. 644 00:32:25,113 --> 00:32:29,200 నేను ఒక విధానాన్ని ఏర్పరచి, నేను లేకపోయినా అది స్థిరంగా ఉండేలా నాకు 645 00:32:29,284 --> 00:32:33,121 చేతనైనంత చేయాలని నాకు అర్థమైంది. 646 00:32:38,001 --> 00:32:41,046 సంక్షేమ కోర్టు అనేది జనం మద్యం లేదా డ్రగ్స్ అలవాటుతో 647 00:32:41,129 --> 00:32:44,841 బాధపడుతుంటే వాటిని వదిలించుకోవడానికి సహకారం ఇవ్వడానికి స్థాపించబడింది. 648 00:32:45,425 --> 00:32:49,429 మేము కేవలం వారికి సమస్యను పరిష్కరించడానికి మాత్రమే సహాయం చేయము, 649 00:32:49,512 --> 00:32:52,140 మేము వారిని చూసి, "మీకు ఇంకేమైనా సహాయం కావాలా?" అని కూడా అడుగుతాం. 650 00:32:53,350 --> 00:32:55,143 ఇక్కడ ఫెర్న్ మొక్క సూపర్ మార్కెట్ లా ఉంది, 651 00:32:55,227 --> 00:32:57,604 ఎక్కడ చూసినా చాలా మంచివి కనిపిస్తున్నాయి. 652 00:32:59,731 --> 00:33:02,234 లారా మా యెరక్ కోర్టులో సాంస్కృతిక ఆఫీసర్. 653 00:33:02,317 --> 00:33:06,613 ఆమె సంక్షేమ కోర్టులో ఉన్న వారు తిరిగి మా సంప్రదాయంలో కలవడానికి వారికి సహాయం చేస్తుంది. 654 00:33:08,365 --> 00:33:11,076 ఇక్కడ ఉన్న నా కూతురికి అల్లిక పని కొంచెం తెలుసు. 655 00:33:11,159 --> 00:33:14,037 మేము కేవలం ఉత్తమమైన ఫెర్న్ మొక్కలు మాత్రమే తీసుకుంటాం, 656 00:33:14,120 --> 00:33:18,959 అందులోను మేము బాగా లోపల ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకొని బుట్టలు అల్లుతాం. 657 00:33:20,043 --> 00:33:21,127 ఇలా అందరితో బయట కలిసి ఉండడం… 658 00:33:21,211 --> 00:33:22,295 చెర్రీ మూన్ సంక్షేమ కోర్టు క్లయింట్ 659 00:33:22,379 --> 00:33:23,880 …అలాగే ఇక్కడికి నా కూతుళ్లను ఇలా తీసుకువచ్చి 660 00:33:23,964 --> 00:33:26,216 వారితో కలిసి ఈ పని చేయడం చాలా బాగుంది. 661 00:33:27,300 --> 00:33:30,053 ఇంతకు ముందు నేను వ్యసనానికి లోనై ఉన్నప్పుడు ఇలా చేయలేకపోయేదాన్ని, కానీ… 662 00:33:31,137 --> 00:33:35,225 వ్యసనాలు అన్నీ ఒకప్పటి గాయాల కారణంగా పుడతాయని నా ఉద్దేశం. 663 00:33:35,308 --> 00:33:38,812 చారిత్రాత్మక గాయాలు, తరాల వారీగా ఏర్పడిన గాయాల వల్ల. 664 00:33:38,895 --> 00:33:41,022 అయినంత మాత్రాన వ్యసనాలకు లొంగడాన్ని నేను సమర్థించను, 665 00:33:41,106 --> 00:33:44,985 కానీ… కానీ దాని వెనుకున్న కారణాన్ని గుర్తించడం ముఖ్యం. 666 00:33:46,528 --> 00:33:51,283 యెరక్ వారి భాషలో పోలీస్ అంటే, "పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే వారు" అని అర్థం, 667 00:33:51,366 --> 00:33:53,577 ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లిపోయేవారు. 668 00:33:54,411 --> 00:33:56,705 వాళ్ళను బోర్డింగ్ స్కూళ్లలో జాయిన్ చేసేవారు. 669 00:33:58,331 --> 00:34:02,502 ఎంతో దారుణంగా చూసేవారు, ఇండియన్ ప్రజలను చెంపేయాలి అనేటట్టు ఉండేవారు. 670 00:34:04,838 --> 00:34:08,800 వ్యతిరేకతను అణగదొక్కడానికి స్థానిక ప్రజలకు 671 00:34:08,884 --> 00:34:11,970 భారీ మొత్తంలో మద్యం ఇచ్చేవారు. 672 00:34:14,222 --> 00:34:18,268 ఆక్రమణ తరువాత, మా వారిలో చాలా మందికి మునుపెన్నడూ లేని ప్రవర్తనలు ఏర్పడ్డాయి. 673 00:34:18,351 --> 00:34:20,019 మేము ముందు ఆ ప్రవర్తనలను సరిదిద్దుకోవాలి. 674 00:34:22,021 --> 00:34:23,523 సహాయం కోసం అడగడం కష్టం. 675 00:34:24,316 --> 00:34:25,901 కానీ నేను బాగుపడాలని నిర్ణయించుకోవడానికి ముందు, 676 00:34:25,983 --> 00:34:29,988 మేము మా కుటుంబాల నుండి అందగల సహాయాన్ని పూర్తిగా తీసుకున్నాం అనిపించింది, 677 00:34:30,070 --> 00:34:33,282 వారే మమ్మల్ని పంపడంతో చాలా బాధ వేసింది. 678 00:34:33,365 --> 00:34:35,492 అవును. ఒక చిన్న పక్షి కథ ఒకటి ఉంది, 679 00:34:35,577 --> 00:34:37,996 ఒక యెరక్ పక్షి కథ. అది విన్నావా? 680 00:34:38,079 --> 00:34:39,956 దాని రెక్క విరిగిపోతుంది, 681 00:34:40,039 --> 00:34:42,876 కాబట్టి శీతాకాలంలో అది తన కుటుంబంతో కలిసి దక్షిణానికి వెళ్ళలేదు. 682 00:34:43,960 --> 00:34:45,003 ఆ పక్షి అడవిలోనే ఉండిపోతుంది. 683 00:34:45,086 --> 00:34:48,173 శీతాకాలంలో సురక్షితంగా ఉండటానికి ఒక ప్రదేశం కావాలి అనుకుంటుంది. 684 00:34:49,423 --> 00:34:53,637 ముందు అది ఒక ఓక్ చెట్టు దగ్గరకు వెళ్లి దానికి బహుమతిగా ఒక పాట పాడి వినిపిస్తుంది. 685 00:34:53,720 --> 00:34:55,012 "నేను నీతో ఉండవచ్చా, 686 00:34:55,096 --> 00:34:57,641 నా రెక్క విరిగింది, నేను నా కుటుంబంతో ఎగరలేను" అంటుంది. 687 00:34:58,475 --> 00:35:01,269 అందుకు ఓక్ చెట్టు, "నాకు నీతో ఆటలాడే సమయం లేదు" అంటుంది. 688 00:35:02,229 --> 00:35:04,147 ఆ చిన్న పక్షి, "ఓహ్, సరే" అనుకుంటుంది. 689 00:35:04,648 --> 00:35:08,318 ఎవరూ తనకు సహాయం చేయడం లేదని బాగా నిరుత్సాహ పడుతుంది. 690 00:35:09,236 --> 00:35:11,613 ఇంతలో ఒక రెడ్ వుడ్ చెట్టు దగ్గరకు వెళ్తుంది. 691 00:35:11,696 --> 00:35:14,491 ఆ రెడ్ వుడ్ చెట్టు, "ఓహ్, సరే, నువ్వు నాలో ఉండవచ్చు" అంటుంది. 692 00:35:17,494 --> 00:35:21,373 అప్పుడు సృష్టికర్త క్రిందకు వచ్చి, రెడ్ వుడ్ చెట్టు దగ్గరకు వెళ్లి, 693 00:35:21,456 --> 00:35:24,918 "నువ్వు చేసిన మంచి కార్యానికి గాను ఈ అడవిలో మిగతా వాటికంటే ఎక్కువ కాలం బ్రతికి, 694 00:35:25,001 --> 00:35:26,127 అతి పెద్ద దానివి అవుతావు. 695 00:35:27,087 --> 00:35:28,463 నీకు ఎలా బ్రతకాలో తెలుసు" అంటాడు. 696 00:35:29,381 --> 00:35:31,633 తర్వాత ఓక్ చెట్టు దగ్గరకు వెళ్లి, 697 00:35:31,716 --> 00:35:34,636 "ఇక నుండి నువ్వు ఎకార్న్స్ కాస్తావు, 698 00:35:34,719 --> 00:35:36,638 వాటిని జనానికి ఆహారంగా ఇస్తావు. 699 00:35:36,721 --> 00:35:39,224 ఎందుకంటే అది ముఖ్యమైన పని" అని అంటాడు. 700 00:35:40,016 --> 00:35:43,979 ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మన అందరికీ ఒకరిని ఒకరు 701 00:35:44,062 --> 00:35:47,023 చూసుకుంటూ, అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది అనే. 702 00:35:48,942 --> 00:35:51,194 ఈ తెగ వారి మధ్య నాకు అందే సహకారం 703 00:35:51,278 --> 00:35:55,073 అలాగే ఇక్కడ మేము చేసే సాంస్కృతిక కార్యకలాపాలు, 704 00:35:55,156 --> 00:35:57,617 నేను ఇక్కడి దాన్ని అన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తాయి, 705 00:35:57,701 --> 00:36:00,287 అది జీవితానికి ఒక సమతుల్యతను ఇస్తుంది. 706 00:36:00,370 --> 00:36:03,081 అలాగే ఇప్పుడు ఇక్కడ నా పిల్లలతో ఉంటూ 707 00:36:03,164 --> 00:36:06,418 వారికి సమాజంలో పాల్గొనడం నేర్పించడమే నేను కోలుకోవడానికి సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. 708 00:36:07,878 --> 00:36:10,589 అవును, ఒక గుర్తింపు ఉండడం చాలా ముఖ్యం. 709 00:36:10,672 --> 00:36:11,673 అవును. 710 00:36:12,299 --> 00:36:15,552 మీరు అది… అంటే, మీరు జనంలో ఆ ఐక్యతను 711 00:36:15,635 --> 00:36:18,555 వెలికి తీయడానికి చాలా కష్టపడుతున్నారు. 712 00:36:18,638 --> 00:36:21,433 "అసలు ఏంటి కారణం? 713 00:36:21,516 --> 00:36:24,019 ఇది ఏ గాయం వల్ల అవుతుంది? మీ సమస్య ఏంటి?" అని తెలుసుకుంటున్నారు. 714 00:36:24,102 --> 00:36:27,230 అలా చేయడం నిజంగా మేలైన విషయం, కానీ మేము అలా చేయడం లేదు. 715 00:36:27,314 --> 00:36:29,357 అంటే, మంచిని మాత్రమే తీసుకుంటున్నాం, సరేనా? 716 00:36:29,441 --> 00:36:31,067 నా ఉద్దేశం, జనంలో ఎంతో మంచి ఉంది. 717 00:36:32,068 --> 00:36:33,153 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 718 00:36:33,236 --> 00:36:35,030 మనం అక్కడ ఉన్న మంట దగ్గరకు వెళ్తున్నాం. 719 00:36:45,457 --> 00:36:48,960 మీరు ఇదంతా ఒక బుట్టలో చేయగలుగుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. 720 00:36:49,044 --> 00:36:51,504 ఇది బాగా చిక్కగా అవుతుంది. చాలా బాగా… 721 00:36:51,588 --> 00:36:54,633 -చూసుకోండి. సరే. -ఇంకాస్త, ఇంకాస్త వేస్తున్నారు. 722 00:36:54,716 --> 00:36:55,884 బెర్తా పీటర్స్ సంస్కృతిని నిలబెట్టే వ్యక్తి & పెద్ద 723 00:36:55,967 --> 00:36:58,428 ఈ చిన్నవి బుట్టకు అంటుకుపోతాయి, కాబట్టి వాటిని అస్తమాను కదుల్చుతూ ఉండాలి. 724 00:36:58,511 --> 00:36:59,930 -సరే. ముందుకు… -అదెలా ఉందో చూసారా? 725 00:37:00,013 --> 00:37:01,973 -అవును. -ఇక ఈ పనిని నీ నుండి తీసుకొని… 726 00:37:02,057 --> 00:37:03,558 నేను చేస్తే మంచిదేమో. 727 00:37:07,062 --> 00:37:08,230 భలే చేస్తున్నావు, బెర్ట్. 728 00:37:10,857 --> 00:37:14,778 మీరంతా ఈ విషయాన్ని ఎలా ఆలోచిస్తున్నారో చూస్తుంటే నాకు భలే నచ్చుతుంది. 729 00:37:14,861 --> 00:37:17,739 మా నుండి వెళ్ళిపోయిన సంక్షేమ క్లయింట్స్ 730 00:37:17,822 --> 00:37:19,282 ఇప్పటికీ తిరిగి వస్తుంటారు, 731 00:37:19,366 --> 00:37:22,118 తమకు ఇంకాస్త సహకారం కావాలనో 732 00:37:22,202 --> 00:37:25,163 లేదా, వారిని అర్థం చేసుకొనే మనుషులకు దగ్గరగా ఉండాలనో వస్తుంటారు. 733 00:37:25,247 --> 00:37:26,248 అలాగే… 734 00:37:26,623 --> 00:37:27,624 ఏంటి? 735 00:37:28,333 --> 00:37:30,126 అది నా ప్రతివాదులలో ఒకరు, కాబట్టి… 736 00:37:30,210 --> 00:37:31,878 అది చాలా బలమైన వాదన. అవును. 737 00:37:31,962 --> 00:37:34,548 మీరు ఎప్పుడైనా ఎంత చెప్పినా… 738 00:37:34,631 --> 00:37:36,633 మీరు చెప్పింది పని చేయని వారిని కలుసుకున్నారా? 739 00:37:36,716 --> 00:37:38,677 మీరు ఎంత ప్రయత్నించినా మారని వారు. 740 00:37:38,760 --> 00:37:41,263 అంటే, మా దగ్గరకు వచ్చే వారు కొందరు మూడు, నాలుగు, ఐదేళ్లకు మారుతుంటారు. 741 00:37:41,346 --> 00:37:42,347 నేను ఓటమిని అంగీకరించను. 742 00:37:42,430 --> 00:37:44,516 అంటే, మనం… అలుపు లేకుండా ప్రయత్నించాలి. 743 00:37:45,141 --> 00:37:47,602 మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విరామం ఉండకూడదు. 744 00:37:49,312 --> 00:37:53,400 నాకు తెలిసి, సమాధానకరమైన, భద్రమైన అలాగే సురక్షితమైన సమాజం కోసం 745 00:37:53,483 --> 00:37:58,530 ఒకరి తర్వాత ఒకరిని వరసగా శిక్షించుకుంటూ పోతే ఏం సాధించలేం అని నా ఉద్దేశం. 746 00:37:58,613 --> 00:38:01,074 అది పిల్లల దగ్గర పని చేయదు, వ్యవస్థల మధ్య పని చేయదు. 747 00:38:01,157 --> 00:38:05,787 కాబట్టి మీరు ఇక్కడ చేస్తున్న వాటి నుండి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 748 00:38:05,870 --> 00:38:08,248 నేను మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే, కాబట్టి, 749 00:38:08,331 --> 00:38:11,084 నాతో సమయం గడిపినందుకు థాంక్స్. మీరు చేస్తున్న అంతటికీ థాంక్స్. 750 00:38:11,167 --> 00:38:13,712 జడ్జి ఆబీ ఇక్కడ చేసింది ఏంటంటే 751 00:38:13,795 --> 00:38:17,966 కేవలం ఒక వ్యక్తి పై ఉండే బాధ్యత పై మాత్రమే దృష్టి నిలపకుండా, 752 00:38:18,049 --> 00:38:20,427 ఆ వ్యక్తి విషయంలో పూర్తి సమాజానికి బాధ్యత కలిగి ఉండేలా 753 00:38:20,510 --> 00:38:24,014 ఒక వ్యవస్థను తయారు చేసింది. 754 00:38:24,097 --> 00:38:25,765 చాలా థాంక్స్. 755 00:38:25,849 --> 00:38:29,352 దేవుడు యెరక్ ప్రజలను ఎందుకు చేసాడో తెలుసా? 756 00:38:29,436 --> 00:38:30,437 లేదు. 757 00:38:30,520 --> 00:38:37,110 తెలీదా? మనం సృష్టించబడటానికి ఉన్న ఒకే ఒక్క కారణం భూమిపై సమతుల్యతను తీసుకురావడానికి మాత్రమే. 758 00:38:37,193 --> 00:38:40,947 చెడ్డ వాటిని వదులుకొని, మంచి వాటిని అభివృద్ధి చేస్తూ, 759 00:38:41,031 --> 00:38:43,408 ఈ ప్రపంచానికి తిరిగి సమతుల్యతని 760 00:38:43,491 --> 00:38:45,076 -అందించగలం అని మనం నమ్ముతాం. -సమతుల్యత. 761 00:38:45,827 --> 00:38:49,831 అది ఎంతో అందమైన విషయం, అలాగే అది మన పట్ల, 762 00:38:50,498 --> 00:38:54,044 మన మనుగడ పట్ల అలాగే ఈ ప్రపంచం పట్ల మనకున్న పెద్ద బాధ్యత. 763 00:38:58,298 --> 00:39:00,842 "డ్రాకులా వాన్ హెల్సింగ్ పై దాడి చేస్తాడు, 764 00:39:00,926 --> 00:39:03,470 అప్పుడు వాన్ హెల్సింగ్ పవిత్ర జలం ఉన్న చిన్న బుడ్డి తీసి, 765 00:39:03,553 --> 00:39:05,138 అందులోని నీటిని డ్రాకులాపై వేస్తాడు. 766 00:39:05,222 --> 00:39:10,310 మరి వాన్ హెల్సింగ్ అతను చేసిన పనిని స్వీయ రక్షణ కోసం చేసానని చెప్పగలడా?" 767 00:39:10,393 --> 00:39:12,020 -అవును. -నీ బజరు నొక్కు. 768 00:39:14,314 --> 00:39:15,774 -అవును. -కాదు. 769 00:39:15,857 --> 00:39:17,108 -అవును. -కాదు. 770 00:39:17,192 --> 00:39:19,152 ఒకసారి దాడి జరిగే ప్రమాదం తప్పిన తర్వాత 771 00:39:19,236 --> 00:39:21,696 స్వీయ రక్షణను రక్షణ అనడానికి లేదు. 772 00:39:21,780 --> 00:39:24,366 ఒక వాంపైర్ ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు. 773 00:39:25,075 --> 00:39:26,076 మీరు తప్పుగా చెప్పారు. 774 00:39:27,452 --> 00:39:29,621 మీ మధ్య చాలా పోటీతత్వం ఉంది. నాకు అది తెలుస్తోంది. 775 00:39:29,704 --> 00:39:31,206 నేను ఎవరికీ సపోర్ట్ చేయను. 776 00:40:23,466 --> 00:40:25,468 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్