1 00:01:01,144 --> 00:01:03,063 లారా డేవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:01:13,532 --> 00:01:14,783 అంతా బాగా జరుగుతుంది. 3 00:01:14,783 --> 00:01:16,535 అవును, తప్పు దొర్లడానికి అవకాశమే లేదు కదా? 4 00:01:16,535 --> 00:01:18,495 - తనకి నువ్వు నచ్చుతావు. - ఆహా. 5 00:01:20,163 --> 00:01:22,457 టౌనుకు వచ్చావు కదా, న్యూయార్క్ యూనివర్సిటీని ఏమైనా చూస్తావా? 6 00:01:24,168 --> 00:01:25,169 ఏమో. 7 00:01:25,669 --> 00:01:27,129 తను యూనివర్సిటీకి వెళ్లకూడదు. 8 00:01:27,129 --> 00:01:29,256 వెళ్తే, రోజూ రాత్రికి డిన్నర్ సమయానికి ఇంటికి రాలేదు కదా? 9 00:01:29,798 --> 00:01:31,466 నీకు నాటకాలంటే చాలా ఇష్టమని మీ నాన్న చెప్పాడు, 10 00:01:31,466 --> 00:01:35,012 కాబట్టీ రేపు జరగబోయే "బేర్ ఫుట్ ఇన్ ద పార్క్" నాటికకి టికెట్స్ బుక్ చేశాను. 11 00:01:36,430 --> 00:01:40,309 నీల్ సైమన్ కదా? అతనికి ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు? సూపర్ కదా? 12 00:01:42,603 --> 00:01:44,521 రేపు మనిద్దరమే వెళ్తాం అనుకున్నా. 13 00:01:47,191 --> 00:01:50,903 ఒకటి చెప్పనా? కానర్స్ కి ఇవ్వాల్సిన బౌల్ పని చాలా ఉంది. 14 00:01:50,903 --> 00:01:52,779 స్టూడియోలో రాత్రంతా ప్రశాంతంగా పని చేసుకుంటాలే. 15 00:01:52,779 --> 00:01:55,991 - నేను రాను, మీ ఇద్దరూ వెళ్లండి. - లేదు, మనందరమూ కలిసి వెళ్లాలన్నది నా ఆలోచన. 16 00:01:55,991 --> 00:01:58,285 తప్పకుండా, ఈసారి అలాగే అందరం కలిసి వెళ్దాం. 17 00:02:03,248 --> 00:02:04,958 టికెట్స్ బుక్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పు. 18 00:02:06,752 --> 00:02:09,588 థ్యాంక్స్. నేను బాత్రూమ్ వెళ్లొస్తా. 19 00:02:16,386 --> 00:02:17,387 సరే మరి. 20 00:02:18,514 --> 00:02:19,765 అంతా బాగానే జరగబోతోంది, సరేనా? 21 00:02:21,808 --> 00:02:22,809 నువ్వు బాగా మాట్లాడుతున్నావు. 22 00:02:23,310 --> 00:02:25,145 నేనెలా మాట్లాడుతున్నానో నాకు తెలుసులే, నువ్వేం చెప్పనక్కర్లేదు. 23 00:02:30,234 --> 00:02:32,486 - తను చాలా గొప్ప వ్యక్తిలా ఉంది. - నిజంగానే నీకలా అనిపిస్తోందా? 24 00:02:32,486 --> 00:02:33,987 తను స్వతంత్రంగా ఉంటోంది. 25 00:02:34,988 --> 00:02:36,406 అంత కన్నా గొప్ప విషయం ఇంకేం ఉంటుంది? 26 00:02:38,158 --> 00:02:39,159 ఏమీ ఉండదులే. 27 00:02:41,370 --> 00:02:43,580 అతను నకిలీ జీవితంలోకి ఎందుకు దిగాడు? 28 00:02:44,540 --> 00:02:48,502 ఏమో. బహుశా నిన్ను కాపాడాలనే అలా చేశాడేమో. 29 00:02:48,502 --> 00:02:49,586 దేని నుండి కాపాడాలని? 30 00:02:50,671 --> 00:02:51,839 నాకు అస్సలు తెలీదు. 31 00:02:52,923 --> 00:02:55,926 - నాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే... - అతను నాతో అబద్ధమాడాడు. 32 00:02:57,427 --> 00:02:58,428 నాతో కూడా. 33 00:03:04,560 --> 00:03:09,314 కాబట్టి, తన పేరును అతను మార్చుకున్నాడంటే, నా పేరును కూడా మార్చి ఉండవచ్చు కదా. 34 00:03:10,357 --> 00:03:11,692 హా. 35 00:03:13,193 --> 00:03:14,194 నా పుట్టినరోజును కూడా. 36 00:03:15,028 --> 00:03:16,029 మార్చి ఉండవచ్చు. 37 00:03:19,908 --> 00:03:22,953 ఒక వ్యక్తికి తమ గురించి తెలియాల్సిన కనీస సొంత విషయాలు ఇవి. 38 00:03:33,005 --> 00:03:34,464 - బెయిలీ. - ఏంటి? 39 00:03:35,340 --> 00:03:36,800 ఏం చెప్పాలనుకుంటున్నావు, హానా? 40 00:03:37,634 --> 00:03:41,180 ఇదంతా అర్థవంతంగానే ఉంది అనిపించేలా ఏం చెప్పగలవు? 41 00:03:42,973 --> 00:03:45,809 ఏమీ లేదు. ఏమీ చెప్పలేను. 42 00:03:50,772 --> 00:03:54,985 మనం పడుకొని నిద్రపోదాం. రేపు ఉదయాన్నే మనకి విమాన ప్రయాణం ఉంది. ఇంటికి వెళ్తున్నాం. 43 00:03:56,278 --> 00:03:57,279 ఏంటి? 44 00:03:58,030 --> 00:03:59,281 అతని గురించి అక్కడ మనమేమీ తెలుసుకోలేం. 45 00:04:04,703 --> 00:04:05,704 నువ్వు అన్నదానిలో నిజముంది. 46 00:04:06,788 --> 00:04:10,375 ఇక్కడే ఏదో ఉంది. నాకు అది తెలుస్తోంది. 47 00:04:13,837 --> 00:04:14,838 అయితే, ఇక్కడ ఉందామంటావా? 48 00:04:18,257 --> 00:04:20,677 హా, అవును. 49 00:04:38,570 --> 00:04:40,447 నాకు 15 ఏళ్లప్పుడు నువ్వు చూసుండాల్సింది. 50 00:04:40,948 --> 00:04:42,366 అప్పుడు నీ జుట్టు ఏ రంగులో ఉండేది? 51 00:04:42,366 --> 00:04:46,453 నిజం చెప్తున్నా కదా, అది అస్సలు బాగుండేది కాదు. అమ్మ లేకుండా జీవించడం అంత సులభం కాదు. 52 00:04:52,876 --> 00:04:55,045 తాతయ్యా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. 53 00:04:55,838 --> 00:04:57,089 హా. 54 00:04:59,341 --> 00:05:01,802 గ్రేడీ బ్రాడ్ఫర్డ్ 55 00:05:18,694 --> 00:05:20,195 న్యాయ శాఖ యునైటెడ్ స్టేట్స్ మార్షల్ 56 00:05:24,783 --> 00:05:26,076 డెప్యూటీ బ్రాడ్ఫర్డ్ ఆఫీసు. 57 00:05:26,076 --> 00:05:27,244 హా. ఆయన ఉన్నారా? 58 00:05:27,244 --> 00:05:29,705 ఆయన సెలవులపై వెళ్లాడు. ఆయన వాయిస్ మెయిల్ కి రూట్ చేయనా? 59 00:05:30,747 --> 00:05:31,790 సెలవులపై వెళ్లాడా? 60 00:05:31,790 --> 00:05:32,875 అవును, మేడమ్. 61 00:05:33,750 --> 00:05:35,127 నన్నేమైనా చెప్పమంటారా? 62 00:05:35,627 --> 00:05:39,089 వద్దు, కానీ ఆయన సెలవుల్లో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దగ్గరికి వచ్చి నాకు బ్యాడ్జీ ఎందుకు చూపాడో 63 00:05:39,089 --> 00:05:42,676 చెప్పగలిగే వ్యక్తితో నాకు లైను కలపగలరా? 64 00:05:45,596 --> 00:05:48,599 - వారియర్స్ ఆట చూశావా? - లేదు, నేను వచ్చింది అందుకు కాదు, బాబూ. 65 00:05:48,599 --> 00:05:51,351 కానీ నిన్న రాత్రి జరిగిన ఆటలోని చివరి భాగాన్ని టీవీలో చూశా. 66 00:05:51,852 --> 00:05:55,314 - డిరోజన్ డంక్ చేస్తూ కర్రీతో భలే ఆడుకున్నాడు కదా? - హా, అది సూపర్ గా ఉండింది. 67 00:05:55,314 --> 00:05:56,857 అంత పొద్దుపోయేదాకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? 68 00:05:57,858 --> 00:05:59,651 - నాన్నా! - తర్వాతి రోజు లేచి స్కూలుకు వెళ్లాలి కదా. 69 00:05:59,651 --> 00:06:00,736 మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 70 00:06:01,445 --> 00:06:03,947 అబ్బా. ప్లే ఆఫ్స్ కదా, నాన్నా. 71 00:06:06,033 --> 00:06:09,578 సరే, ఈ విషయాన్ని మర్చిపోయా అనుకోకు. 72 00:06:14,541 --> 00:06:15,375 గ్రేడీని మాట్లాడుతున్నా. 73 00:06:15,375 --> 00:06:16,543 సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? 74 00:06:17,044 --> 00:06:17,961 ఏంటి? 75 00:06:17,961 --> 00:06:20,797 నువ్వు సెలవులపై వెళ్లావని మీ ఆఫీసు వాళ్లు చెప్పారు. అది భలే గమ్మత్తుగా ఉంది. 76 00:06:20,797 --> 00:06:23,050 కానీ నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సెలవుల్లో ఉన్నావని అనిపించనే లేదు. 77 00:06:24,885 --> 00:06:26,553 హానా, నేను సాయపడటానికే వచ్చాను. 78 00:06:26,553 --> 00:06:28,597 మరి విషయం ఏంటో చెప్పు. 79 00:06:28,597 --> 00:06:32,267 సాసలీటోకి రాకముందు ఓవెన్, ఇంకా బెయిలీకి సంబంధించిన గుర్తింపు డాక్యుమెంట్లేవీ లేవు ఎందుకు? 80 00:06:32,851 --> 00:06:34,728 ఏంటి? లేవని నీకెవరు చెప్పారు? 81 00:06:34,728 --> 00:06:36,146 ఎవరు చెప్తే ఏంటి? 82 00:06:36,146 --> 00:06:38,941 చూడు, ఓవెన్, ఆన్లైనులో రికార్డులని తొలగించగలిగే సాఫ్ట్ వేర్ పని మీద షాప్ సంస్థలో 83 00:06:38,941 --> 00:06:41,485 పని చేస్తున్నాడు, అలాంటి వ్యక్తి తన రికార్డులనే తొలగించుకొని ఉండవచ్చు కదా? 84 00:06:43,862 --> 00:06:46,865 ఆ సాఫ్ట్ వేరే పని చేస్తుంటే, మోసం చేశాడని అవెట్ ని ఎందుకు అరెస్ట్ చేస్తారు! 85 00:06:46,865 --> 00:06:49,284 అదే పని చేస్తుంటే నేనూ, ఓవెన్ ఈపాటికి ఒకే బెడ్ పై నిద్రపోతూ ఉండేవాళ్ళం, 86 00:06:49,284 --> 00:06:52,454 అతను నాకు అబద్ధం చెప్పాడన్న విషయం కూడా నాకు తెలిసి ఉండేది కాదు. 87 00:06:52,454 --> 00:06:53,580 అది నిజం కాదు. 88 00:06:53,580 --> 00:06:56,708 అవునా? తన పేరును ఓవెన్ ఎందుకు మార్చుకున్నాడు? 89 00:06:58,585 --> 00:07:00,254 నువ్వు ఏవేవో పిచ్చిపిచ్చిగా ఊహించుకుంటున్నావు. 90 00:07:00,254 --> 00:07:02,047 నువ్వు నాకు మొత్తం విషయం చెప్తే బాగుంటుంది. 91 00:07:02,047 --> 00:07:05,092 ఓవెన్ కి ఏం కాకుండా చూసుకోవాలనే నా ప్రయత్నం, ఓవెన్ కి, బెయిలీకి, నీకు కూడా. 92 00:07:05,092 --> 00:07:07,427 నా సంగతి నేను చూసుకోగలనులే. 93 00:07:08,136 --> 00:07:09,304 ఇప్పుడు నువ్వు చేసే పని అదేనా? 94 00:07:10,973 --> 00:07:13,058 - అంటే? - ఎక్కడున్నావు నువ్వు? 95 00:07:14,434 --> 00:07:15,769 హానా? 96 00:07:16,436 --> 00:07:17,437 నేను ఇంట్లో ఉన్నాను. 97 00:07:17,437 --> 00:07:19,273 హా, అదే నిజం అయ్యుంటే, అవెట్ మీ ఇంట్లోకి చొరబడమని పంపిన 98 00:07:19,273 --> 00:07:21,900 ఆ గూండాగాడు ఇంకా పెంట పెంట చేసుండేవాడు. 99 00:07:21,900 --> 00:07:24,027 ఏంటి? అవెట్ గూండాని పంపాడా... 100 00:07:24,027 --> 00:07:27,114 అబ్బా, ఎక్కడ ఉన్నావు నువ్వు? హోటల్ లోనా? 101 00:07:27,114 --> 00:07:29,658 నిన్ను ఎక్కించుకొని తీసుకురమ్మని నేను శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఒక డెప్యూటీని పంపుతాను. 102 00:07:30,784 --> 00:07:32,452 నా ఇంటిపై ఓ కన్నేసి ఉంచావా నువ్వు? 103 00:07:33,078 --> 00:07:34,621 నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, హానా? 104 00:07:34,621 --> 00:07:35,998 నేనెక్కడ ఉంటే నీకు ఎందుకు? 105 00:07:43,672 --> 00:07:45,966 ఒక వ్యక్తికి తమ గురించి తెలియాల్సిన కనీస సొంత విషయాలు ఇవి. 106 00:07:45,966 --> 00:07:48,260 నేను ఏం క్లాస్ చదువుతున్నానో తనకి తెలీదు. 107 00:07:55,017 --> 00:07:56,018 హోటల్ ఆర్జెంట్ హానా, 108 00:07:56,018 --> 00:07:57,102 మోంట్రియల్ లో ఒక వ్యక్తిని కలిశాను, 109 00:07:57,102 --> 00:07:59,354 {\an8}మేము రైలులో ప్రయాణిస్తుంటాం, పార్కులో సరదాగా గడుపుతుంటాం. 110 00:07:59,354 --> 00:08:01,440 {\an8}నీ ఎనిమిదవ క్లాసు ఎలా సాగుతోంది? కెరోల్ 111 00:08:17,372 --> 00:08:18,373 హానా. 112 00:08:21,502 --> 00:08:22,836 ఇక్కడేం జరిగింది? 113 00:08:23,587 --> 00:08:25,714 నేను ఏ క్లాసులో చదువుతున్నానో కూడా తనకి తెలీదు. 114 00:08:30,761 --> 00:08:31,762 నన్ను చూడనివ్వు. 115 00:08:40,895 --> 00:08:42,813 నీ కోపాన్ని నా గిన్నె మీద చూపించాల్సిన అవసరం లేదు కదా. 116 00:08:44,858 --> 00:08:46,568 కానివ్వు. దీనికి బదులు ఒక కొత్త గిన్నె చేయాలి నువ్వు. 117 00:08:55,369 --> 00:08:56,662 ఇప్పుడు పర్వాలేదు. 118 00:08:57,329 --> 00:08:59,540 - నేను చేయలేకపోతున్నాను. - మధ్యలోనే వదిలేస్తున్నావా? 119 00:08:59,540 --> 00:09:01,500 అంతా గరుకుగా ఉంది. దాన్నంతటినీ తీసివేయడం నా వల్ల కాదు. 120 00:09:01,500 --> 00:09:03,126 అయితే? ఇది అరకే, మ్యూజియంకి కాదు. 121 00:09:03,126 --> 00:09:05,462 నువ్వు నటించాల్సిన పని లేదు. ఇది చండాలంగా ఉందని మనిద్దరికీ తెలుసు. 122 00:09:05,462 --> 00:09:09,466 హేయ్, హేయ్. తప్పు ఎక్కడ జరిగిందో వేలెత్తి చూపడం చాలా తేలిక. 123 00:09:10,175 --> 00:09:12,094 అలా కాకుండా ఒక్క క్షణం ఆగి 124 00:09:12,094 --> 00:09:14,471 మరింత క్షుణ్ణంగా పరిశీలించి, ఉన్న విషయాల గురించి సంతృప్తి పడాలి. 125 00:09:16,515 --> 00:09:20,185 అయితే నేను ఏ క్లాసులో చదువుతున్నానో మా అమ్మకి తెలీదనే విషయాన్ని పట్టించుకోకుండా, 126 00:09:20,185 --> 00:09:23,063 తనకి నా పేరేంటో బాగా గుర్తున్నందుకు ఆనందపడిపోవాలంటావా? 127 00:09:23,689 --> 00:09:24,773 - అర్థమైంది. - హానా. 128 00:09:24,773 --> 00:09:25,858 లేదు, ఇక నేను పోతాను. 129 00:09:28,652 --> 00:09:29,653 హానా. 130 00:09:33,490 --> 00:09:35,492 దేని మీద దృష్టి పెట్టాలి అనేది నీ ఇష్టం. 131 00:09:42,749 --> 00:09:45,252 బాబీ అక్కడ అంతా ఓకేనా? 132 00:09:49,006 --> 00:09:50,340 బాబీ కాల్ చేస్తున్నారు 133 00:09:54,761 --> 00:09:56,680 గుడ్ నైట్, బెయిలీ. ఇక్కడికి త్వరగా వచ్చేయ్. అక్కడ అంతా ఓకేనా? 134 00:09:56,680 --> 00:09:57,764 నేను నీకు తర్వాత కాల్ చేయనా? 135 00:10:00,475 --> 00:10:01,351 తప్పకుండా 136 00:10:01,351 --> 00:10:02,436 నేను ఎదురు చూస్తుంటా 137 00:10:15,782 --> 00:10:19,536 హేయ్. మీ నాన్న ఒక రెస్టారెంటులో పార్కింగులో పని చేశాడు కదా, దాని పేరు ఏంటి? 138 00:10:19,536 --> 00:10:22,456 ఒకరి ఖరీదైన కారుకు గీతలు పడ్డాయని ఆ ఉద్యోగం పోయిందని చెప్పాడు కదా? 139 00:10:24,583 --> 00:10:25,876 అవునులే. 140 00:10:25,876 --> 00:10:27,294 అది కూడా ఆబద్ధమే అనుకుంటున్నావా? 141 00:10:28,587 --> 00:10:29,922 అంటే, వివరాలన్నీ చాలా ఖచ్చితంగా చెప్పాడు. 142 00:10:29,922 --> 00:10:33,800 అదే కదా. అతను యువకునిగా ఉన్నప్పటి సంగతులన్నీ నీకెంతో ఇష్టంగా చెప్పాడు కదా, 143 00:10:33,800 --> 00:10:35,219 అవన్నీ అబద్ధాలు అయ్యుండవు. 144 00:10:35,219 --> 00:10:37,221 వాటిలో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. 145 00:10:37,221 --> 00:10:40,140 ఉదాహరణకు, ఆ రెస్టారెంట్ పేరు. అది మనకి గుర్తుంటే, దాన్ని మనం వెతకవచ్చు. 146 00:10:40,140 --> 00:10:41,808 అతను ఎవరికైతే తెలుసో, వారిని కనుగొనే ప్రయత్నం చేద్దాం. 147 00:10:43,143 --> 00:10:45,771 నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? నేనేదో పిచ్చిదాని అన్నట్టు చూస్తున్నావు. 148 00:10:46,605 --> 00:10:48,941 అదేం లేదు. నాకు అదంతా అర్థమైంది. కానీ, 149 00:10:50,067 --> 00:10:51,527 నాకు ఆ రెస్టారెంట్ పేరు గుర్తు లేదు. 150 00:10:51,527 --> 00:10:53,987 సరే. మరి హై స్కూలులో ఉండగా పడవలో చేసిన ప్రయాణం గుర్తుందా? 151 00:10:53,987 --> 00:10:56,281 అతడిని కోస్ట్ గార్డ్ కాపాడాడు అన్నాడు కదా, ఆ ప్రయాణం గురించి అడుగుతున్నా. 152 00:10:57,074 --> 00:10:58,825 నాకు అది చెప్పలేదు అనుకుంటా. 153 00:10:58,825 --> 00:11:00,702 సరే. దాన్ని నేను కూడా నీకు చెప్పుండాల్సింది కాదు. 154 00:11:01,745 --> 00:11:03,330 ఇప్పుడు నాకు అదేంటో తెలుసుకోవాలనుంది. 155 00:11:04,540 --> 00:11:06,917 ఆగు. ప్రిన్స్ టన్ లోని గణిత ప్రొఫెసర్ గుర్తున్నాడా? 156 00:11:06,917 --> 00:11:10,045 ఓపిక గురించి నాకు క్లాసు పీకేటప్పుడు అతని గురించి చెప్తుంటాడు కదా. 157 00:11:10,671 --> 00:11:13,131 హా. నాన్న అతని పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, దాన్ని అతను ఫ్రేమ్ చేసి పెట్టాడు. 158 00:11:13,131 --> 00:11:14,883 మిగతా పిల్లలందరికీ హెచ్చరికలా. 159 00:11:14,883 --> 00:11:17,636 హా. దాని నుండి నాన్న స్ఫూర్తి మాత్రమే తీసుకున్నాడని ఎప్పుడూ చెప్పేవాడు, 160 00:11:17,636 --> 00:11:19,263 అదంతా కాస్త వింతగా అనిపించేది ఎందుకో. 161 00:11:19,263 --> 00:11:20,973 హా. అతనికి ఆ ప్రొఫెసర్ అంటే చాలా ఇష్టం. ఆయన పేరేంటి? 162 00:11:23,058 --> 00:11:23,976 టోబయాస్ అని ఏదో ఉండాలి. 163 00:11:23,976 --> 00:11:28,313 టోబయాస్ కాకర్? కుకర్? 164 00:11:28,313 --> 00:11:30,315 కుక్మన్. అతడిని కుక్ అని పిలిచేవాడు. 165 00:11:30,315 --> 00:11:33,986 టోబయాస్ కుక్మన్ అనే పేరు గల గణిత ప్రొఫెసర్లు ఎంత మంది ఉంటారంటావు? 166 00:11:35,946 --> 00:11:37,239 ఒక్కరే కనిపిస్తున్నాడు. 167 00:11:37,865 --> 00:11:39,032 ఫీల్డ్స్ మెడల్ అంటే ఏంటి? 168 00:11:39,032 --> 00:11:42,327 గణిత శాస్త్రంలో అది నోబెల్ ప్రైజ్ లాంటిది. ఆయన ఉండేది ప్రిన్స్ టన్ లోనేనా? 169 00:11:42,327 --> 00:11:43,704 కాదు. 170 00:11:44,872 --> 00:11:46,290 టోబయాస్ కుక్మన్ అమెరికన్ గణిత ప్రొఫెసర్ 171 00:11:46,290 --> 00:11:48,125 {\an8}ఆస్టిన్ లోని టెక్సస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ 172 00:11:49,543 --> 00:11:50,544 తయారవ్వు. 173 00:11:59,303 --> 00:12:00,137 హేయ్. 174 00:12:00,137 --> 00:12:02,472 హేయ్, మీరిద్దరూ ఎలా ఉన్నారు? 175 00:12:03,140 --> 00:12:06,476 - ఆ విషయం ఎందుకు అడుగుతావులే! - అలాగే. 176 00:12:06,977 --> 00:12:08,020 ఏంటి సంగతి? 177 00:12:08,020 --> 00:12:11,940 జేక్ ఆర్డర్ ఇచ్చిన కాఫీలో ఏదో తక్కువ అయిందని అటెండరుతో గొడవ పెట్టుకుంటున్నాడు. 178 00:12:11,940 --> 00:12:15,068 ఇంట్లో ఓవెన్ కి బీరువా లాంటిది ఏమైనా ఉందా? 179 00:12:16,069 --> 00:12:17,070 బీరువానా? 180 00:12:17,070 --> 00:12:18,947 హా, లేడీ పాల్ హుండీ ఉంది కదా, 181 00:12:18,947 --> 00:12:23,160 అందులో ఒక చిన్న తాళం చెవి ఉంది. అదేదో ఫైర్ ఫ్రూఫ్ బీరువాకి చెందినదని జేక్ అన్నాడు. 182 00:12:24,620 --> 00:12:26,038 రహస్యమైన బీరువానా? 183 00:12:26,914 --> 00:12:28,457 అదెక్కడ ఉండవచ్చో ఏమైనా ఐడియా ఉందా? 184 00:12:28,457 --> 00:12:32,461 ఏమో. అతని ఆఫీసులో కానీ, పడక గదిలోని అరలో కానీ ఉండవచ్చు. 185 00:12:32,461 --> 00:12:35,047 సరే, అర్థమైంది. నేనేమైనా చేసి పెట్టాలా? 186 00:12:36,340 --> 00:12:38,717 హా, ఒకటి చేసిపెట్టాలి. జేక్ కి నా మాటలు వినిపిస్తాయా? 187 00:12:40,427 --> 00:12:41,553 లేదు. 188 00:12:41,553 --> 00:12:45,474 మంచిది. నా బెడ్ కింద ఒక బ్యాగు ఉంది. దాన్ని నీ దగ్గర పెట్టుకోగలవా? 189 00:12:45,474 --> 00:12:46,892 అలాగే. అందులో ఏముంది? 190 00:12:47,643 --> 00:12:49,478 నీకు తెలీకపోవడమే మంచిదేమో. 191 00:12:53,440 --> 00:12:57,277 హానా హాల్. 16 ఏళ్ల తన సవతి కూతురు అయిన బెయిలీ మైఖెల్స్ తో తను ఎక్కడో తిరుగుతోంది. 192 00:12:57,277 --> 00:13:00,572 చివరిగా 36 గంటల క్రిందట వారు సాసలీటోలో ఉన్న తమ ఇంట్లో ఉన్నారని మాత్రమే మనకి తెలుసు. 193 00:13:00,572 --> 00:13:02,866 కానీ ఆధారలన్నింటినీ చూస్తుంటే వాళ్లు ఊరి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. 194 00:13:03,450 --> 00:13:04,493 హానా కారు ఇంటి బయటే ఉంది. 195 00:13:04,493 --> 00:13:07,871 కాబట్టి రెంటల్ కారులో వెళ్లారా, బస్సులో వెళ్లారా, రైల్లోనా, విమానంలోనా అనేది మీరు చూడండి. 196 00:13:07,871 --> 00:13:11,875 తన క్రెడిట్ కార్డులని, ఏటిఎం లావాదేవీలు, తన ఎలక్ట్రానిక్ లావాదేవీలను ట్రాక్ చేయండి, సరేనా? 197 00:13:11,875 --> 00:13:13,043 తను ఆచూకీ మనకి వెంటనే తెలియాలి. 198 00:13:15,420 --> 00:13:17,339 - రొషెల్? - బాస్ నిన్ను కలవాలనుకుంటోంది. 199 00:13:17,339 --> 00:13:19,383 "హాయ్, గ్రేడీ. ముందే వచ్చేశావే. సెలవులు ఎలా గడిచాయి?" అని అనడానికా? 200 00:13:19,383 --> 00:13:20,676 తను కోపంగా ఉన్నట్టుంది. 201 00:13:32,604 --> 00:13:35,899 హానా హాల్ ఎవరు? సాసలీటో నీకేం పని? 202 00:13:40,779 --> 00:13:41,947 దాని గురించే చెప్పబోతున్నా. 203 00:13:42,614 --> 00:13:44,199 నాతో అబద్ధమాడటం నేరమని నీకు తెలుసుగా. 204 00:13:45,158 --> 00:13:46,326 నా సెలవుల గురించా? 205 00:13:49,246 --> 00:13:50,247 చెప్పు. 206 00:14:05,804 --> 00:14:07,472 శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మార్చేస్తారు టొబయాస్ కుక్మన్ 207 00:14:16,857 --> 00:14:17,858 బెయిలీ. 208 00:14:25,741 --> 00:14:27,993 మనోడు ఎన్ని మెడల్స్ గెలుచుకున్నాడబ్బా? 209 00:14:27,993 --> 00:14:29,203 అన్నీ గెలుచుకున్నట్టున్నాడు. 210 00:14:32,748 --> 00:14:37,419 హాయ్. మేము ప్రొఫెసర్ కుక్మన్ ని కలవవచ్చా? 211 00:14:38,378 --> 00:14:39,379 మీకు అపాయింట్మెంట్ ఉందా? 212 00:14:39,379 --> 00:14:41,924 - మా నాన్న అతనికి ఒకప్పుడు విద్యార్థి. - కావాలంటే మేము వేచి ఉంటాం. 213 00:14:41,924 --> 00:14:44,384 కానీ, మీరు ఇంకెక్కడైనా వేచి ఉండాల్సి ఉంటుంది, 214 00:14:44,384 --> 00:14:48,472 ఎందుకంటే, 24వ తారీఖు దాకా ఆయన ఖాళీగా లేడు. 215 00:14:48,472 --> 00:14:49,848 ఆ రోజంటే మేము రెండు వారాలు ఆగాలి. 216 00:14:51,517 --> 00:14:54,394 నా పేరు హానా. ఈమె పేరు బెయిలీ. మీ పేరేంటి? 217 00:14:55,062 --> 00:14:56,188 షెరిల్. 218 00:14:56,188 --> 00:14:58,398 హాయ్, షెరిల్. మా కోసం ఇంత సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్స్. 219 00:14:59,066 --> 00:15:04,905 ఎందుకంటే, కోర్పస్ క్రిస్టీలోని గణిత విద్యార్థుల్లో బెయిలీ టాప్ లో ఉంది అన్నమాట, 220 00:15:04,905 --> 00:15:08,116 తన తండ్రిలా టెక్సస్ యూనివర్సిటీలో చేరాలా, తన అక్కలా రైస్ లో చేరాలా అనేది తను తేల్చుకోలేకపోతోంది. 221 00:15:08,116 --> 00:15:09,243 మీకు విషయం అర్థమైంది కదా, 222 00:15:09,243 --> 00:15:13,539 కుక్ ని కలవకుండా మేము వెళ్లిపోతే, తను కూడా రైస్ లో చేరిపోతుందేమో... 223 00:15:16,208 --> 00:15:20,003 అతనితో కాసేపు మాట్లాడగలిగే అవకాశం మీరు ఎలాగోలా కల్పిస్తే, మాకు అదే పది వేలు. 224 00:15:28,846 --> 00:15:30,180 ప్రస్తుతం కుక్ క్లాసులో ఉన్నాడు, 225 00:15:30,180 --> 00:15:33,267 కానీ మీరు ఆ క్లాస్ బయట వేచి ఉండగలిగితే, క్లాస్ అవ్వగానే మీరు ఆయనతో మాట్లాడవచ్చు. 226 00:15:33,267 --> 00:15:35,894 కానీ ఆయనకు అంతరాయం కలిగించడం కానీ, శబ్దం చేయడం కానీ చేయవద్దు. 227 00:15:36,395 --> 00:15:37,938 అలాగే. చాలా చాలా థ్యాంక్స్. 228 00:15:42,860 --> 00:15:44,611 గణిత విద్యార్థా? బాబోయ్! 229 00:15:45,153 --> 00:15:46,947 నీకు ఆ ఐడియా నచ్చిందని ఇలా చెప్తున్నావా? 230 00:16:09,386 --> 00:16:11,096 బెయిలీ, ఆగు. మనం ఆగాలి. 231 00:16:11,597 --> 00:16:12,598 షెరిల్ చెప్తే మనం వినాలా ఏంటి! 232 00:16:13,182 --> 00:16:17,436 ఈ మ్యాట్రిక్స్ విషయంలో గమ్మతైన అంశం ఏంటంటే, దీన్ని పర్యాయాన్ని ఏదైనా సున్నా కానీ వెక్టారుకు 233 00:16:17,436 --> 00:16:19,313 - వర్తింపజేసినప్పుడు... - అక్కడ రెండు సీట్లు ఉన్నాయి. 234 00:16:24,318 --> 00:16:25,319 సారీ. 235 00:16:27,529 --> 00:16:29,573 మీలో సగం మందికి దీని వల్ల అంతరాయం కలిగిందని 236 00:16:29,573 --> 00:16:32,201 మిగతా సగం మందికి అసలు మొదట్నుంచే అర్థం కాట్లేదని నాకు బాగా తెలుసు, 237 00:16:32,201 --> 00:16:34,161 కాబట్టి ఇక ఈ క్లాసును ఇంతటితో ముగిద్దాం, సరేనా? 238 00:16:41,835 --> 00:16:44,171 మన్నించాలి. కాస్త దారి ఇవ్వండి. 239 00:16:49,301 --> 00:16:50,928 మీకు క్లాసులకి ఇలా మధ్యలో అంతరాయం కలిగించడం అలవాటా, 240 00:16:50,928 --> 00:16:52,679 లేకపోతే ఆ బంపర్ ఆఫర్ నాకే దక్కిందా? 241 00:16:53,472 --> 00:16:57,518 మన్నించాలి. మేమేమీ కావాలని... నా పేరు హానా హాల్. ఈమె పేరు బెయిలీ మైఖెల్స్. 242 00:16:57,518 --> 00:16:58,435 మీకేం కావాలి? 243 00:16:58,435 --> 00:17:01,230 గతంలో మీ విద్యార్థిగా ఉన్న వ్యక్తిని గుర్తించడంలో మీ సాయం కావాలి. 244 00:17:01,230 --> 00:17:03,857 మీరు నా క్లాసుకు అంతరాయం కలిగించాక కూడా నేను మీకు ఎందుకు సాయపడతాను? 245 00:17:03,857 --> 00:17:05,526 మాకు సాయపడగలిగేవారు మీరొక్కరే ఏమో. 246 00:17:10,113 --> 00:17:11,114 ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు? 247 00:17:12,115 --> 00:17:15,618 నా దగ్గర ఉన్న పాత ఫోటో ఇదే. 248 00:17:16,118 --> 00:17:18,497 అతను మీ విద్యార్థిగా 26 ఏళ్ల క్రితం ఉండుంటాడు. 249 00:17:18,497 --> 00:17:20,332 అతని పేరు మీరేమైనా చెప్పగలరా? 250 00:17:21,666 --> 00:17:24,837 అతను 26 ఏళ్ల క్రితం నా విద్యార్థి అని గుర్తుంది కానీ, అతని పేరేంటో తెలీదా మీకు? 251 00:17:24,837 --> 00:17:28,924 అతని ప్రస్తుత పేరేంటో మాకు తెలుసు, కానీ అతను పేరును మార్చుకున్నాడు. అది చాలా పెద్ద కథ. 252 00:17:28,924 --> 00:17:30,551 - క్లుప్తంగా చెప్పండి. - అతను మా నాన్న. 253 00:17:31,677 --> 00:17:32,803 ఇప్పుడు ఆయన ఏమైపోయాడో తెలీదు. 254 00:17:35,222 --> 00:17:37,599 - నాకూ, అతనికీ ఉన్న లింక్ ని ఎలా కనుగొన్నారు? - అతను మీ గురించి మాట్లాడేవాడు. 255 00:17:38,100 --> 00:17:40,143 ఆయనకి చాలా ఇష్టమైన ప్రొఫెసర్ మీరే అని అన్నాడు. 256 00:17:41,645 --> 00:17:43,272 ఆ మాటకి పొంగిపోయాననే చెప్పాలి, 257 00:17:43,272 --> 00:17:46,483 కానీ ఇతడిని నేను గుర్తుపట్టలేకపోతున్నా. నేను వేలాది సంఖ్యలోని విద్యార్థులకి పాఠాలు చెప్పాను. 258 00:17:46,483 --> 00:17:49,069 చాలా మందిని నేను మర్చిపోయా కూడా. 259 00:17:50,779 --> 00:17:53,198 మీరు టీచర్ వృత్తిలోకి చేరిన మొదటి ఏడాదిలోనో, రెండవ ఏడాదిలోనో మీకు విద్యార్థిగా ఉండుంటాడు. 260 00:17:55,701 --> 00:17:58,078 మీ జ్ఞాపకశక్తి గురించి నాకు తెలీదు, మిసెస్ హాల్, 261 00:17:58,078 --> 00:18:01,123 కానీ నా విషయంలో మాత్రం, అవెంత పాతవైతే, నాకు అవి అంత గుర్తుండవు 262 00:18:01,123 --> 00:18:03,625 మీరు రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లి వాకబు చేస్తే మేలేమో. 263 00:18:05,544 --> 00:18:07,171 మీ విద్యార్థుల్లో అతనంత దారుణమైన విద్యార్థి ఇంకెవరూ లేరు. 264 00:18:07,921 --> 00:18:09,923 అతను మిడ్ టర్మ్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మీరు అతనితో అన్న మాటలవి. 265 00:18:09,923 --> 00:18:11,967 అతని పరీక్షా ఫలితాన్ని మీరు ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు. 266 00:18:11,967 --> 00:18:15,762 ఇతర విద్యార్థులకి ఉదాహరణగా ఉండాలని దాన్ని మీ ఆఫీసులో తగిలించి పెట్టుకున్నారు. 267 00:18:15,762 --> 00:18:17,431 అది చాలా దారుణమైన పని అనుకోండి. 268 00:18:18,015 --> 00:18:21,518 ఆ పనికి మీ మీద కోపం తెచ్చుకోవాల్సింది పోయి, నా భర్త దాన్ని సవాలుగా తీసుకున్నాడు. 269 00:18:22,144 --> 00:18:23,520 ఫైనల్ పరీక్షల్లో టాప్ మార్కులు సాధించాడు. 270 00:18:30,485 --> 00:18:32,070 - ఆ ఫోటోని నాకు మళ్లీ చూపించరా? - అలాగే. 271 00:18:37,993 --> 00:18:41,788 పేరు గుర్తు రావట్లేదు కానీ, ముఖం చూస్తే పరిచయం ఉన్న ముఖంలానే ఉంది. 272 00:18:43,081 --> 00:18:44,416 ఇతను... 273 00:18:45,876 --> 00:18:49,505 నాకు గుర్తున్న ముఖానికి, ఇక్కడున్న ముఖానికి కాస్త తేడా ఉంది. పూర్తిగా కాదులే. 274 00:18:51,715 --> 00:18:52,758 కనబడకుండా పోయాడా? 275 00:18:55,260 --> 00:18:56,637 ఆయన షాప్ సంస్థలో పని చేసేవాడు. 276 00:18:56,637 --> 00:18:59,848 మూడు రోజుల క్రితం ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుండీ ఏమైపోయాడో తెలీదు. 277 00:19:01,767 --> 00:19:03,852 నాతో రండి. మీకు ఉపయోగపడే సమాచారం ఏమైనా ఉందేమో చూద్దాం. 278 00:19:07,356 --> 00:19:08,649 గోప్యమైనది న్యాయ శాఖ 279 00:19:14,279 --> 00:19:15,572 మరి... 280 00:19:16,823 --> 00:19:19,409 - ఇది మన సమస్య కాదు. - జోకా? 281 00:19:19,409 --> 00:19:22,412 - ఓవెన్ మైఖెల్స్ పశ్చిమ టెక్సస్ లో ఉన్నాడా? - అస్సలు లేడు అనుకుంటా. 282 00:19:22,412 --> 00:19:24,498 - మరి మన సమస్య కానే కాదు. - సమస్య అతను ఎక్కడ ఉన్నాడని కాదు. 283 00:19:24,498 --> 00:19:27,000 ఈ ఆఫీసులోని వాళ్లు పని సక్రమంగా చేసుంటే... 284 00:19:27,000 --> 00:19:30,045 గ్రేడీ, అతను ఎంచుకొన్న మార్గానికి నువ్వు ఎలా బాధ్యుడివి అవుతావు! 285 00:19:30,045 --> 00:19:31,421 ఈ ఆఫీసుది ఎలా బాధ్యత అవుతుంది! 286 00:19:31,421 --> 00:19:35,008 సరే, సరే. కానీ నవోమీ వూ వచ్చేసి ఓవెన్ ముఖాన్ని మీడియా వాళ్లకి చూపిస్తూ ఉంటే... 287 00:19:35,008 --> 00:19:38,804 అప్పుడైనా అతనికి తెలిసి వస్తుంది, ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని. 288 00:19:38,804 --> 00:19:41,181 అయినా, నువ్వు ఇన్నాళ్ల నుండి ఈ వృత్తిలో ఉన్నావు, జనాలు మారరనే విషయం 289 00:19:41,181 --> 00:19:43,058 ఈపాటికి నీకు తెలిసి ఉండాలి కదా. 290 00:19:43,851 --> 00:19:45,060 మరి ఆ అమ్మాయి సంగతేంటి? 291 00:19:45,060 --> 00:19:48,230 - తను చాలా ప్రమాదంలో ఉంది. - సాసలీటోలోనే తను ఉండుంటే తనకి ప్రమాదం ఉండేది కాదు. 292 00:19:48,230 --> 00:19:49,731 మనం ఎలాంటి వాళ్లతో వ్యవహరిస్తున్నామో నీకు తెలుసు. 293 00:19:49,731 --> 00:19:51,733 ఈ విషయం వాళ్లకి తెలిస్తే, తను ఎక్కడ ఉన్నా లాభం ఉండదు. 294 00:19:52,317 --> 00:19:54,152 ఆ విషయం వాళ్ల నాన్న ఆలోచించి ఉండాల్సింది కదా. 295 00:19:58,824 --> 00:20:00,576 వెళ్లేటప్పుడు తలుపు మూసి వెళ్లు. 296 00:20:15,257 --> 00:20:18,677 అతని పరీక్ష ఫలితాన్ని గోడకి వేలాడదీశాను కాబట్టి అతని పేరు నాకు గుర్తుండి ఉంటుంది అనుకున్నారా? 297 00:20:19,928 --> 00:20:22,848 అయితే అది నిజమా? మీరు నిజంగానే దాన్ని ఫ్రేమ్ కట్టించారా? 298 00:20:24,516 --> 00:20:26,602 నేను అప్పుడు యువకుడిని అన్న విషయం మీరు గ్రహించాలి. 299 00:20:26,602 --> 00:20:31,398 నా విద్యార్థుల వయస్సు కన్నా నా వయస్సు కాస్తంత ఎక్కువ ఉంటుందంతే. అలా నా అధికారం చూపవచ్చు అనుకున్నా. 300 00:20:31,398 --> 00:20:32,941 మరి దాన్ని ఎందుకు తీసేశారు? 301 00:20:34,067 --> 00:20:36,653 నా భార్య దాన్ని చూసింది, తనకి అది నచ్చలేదు. 302 00:20:36,653 --> 00:20:39,698 ఒక విద్యార్థి ఫెయిల్ అయిన విషయాన్ని నేను గొప్పగా చూపించుకుంటున్నానని, 303 00:20:39,698 --> 00:20:41,450 అది మంచిది కాదని తను చెప్పింది. 304 00:20:42,034 --> 00:20:44,536 - తెలివైన మహిళ ఆమె. - నాకంటే తెలివైనదే, అందులో సందేహమే లేదు. 305 00:20:46,413 --> 00:20:48,749 నేను 90ల దశకంలో మీ ఫైనల్ పరీక్షల పేపర్లన్నీ తెచ్చా. 306 00:20:48,749 --> 00:20:49,958 థ్యాంక్స్. 307 00:20:53,879 --> 00:20:57,216 వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనుకుంటా. ఇక్కడ బ్లైండ్ గ్రేడింగ్ పద్ధతి అనుసరిస్తాం. 308 00:20:57,216 --> 00:20:58,342 అంటే, వాటిపై పేర్లు ఏవీ ఉండవు. 309 00:20:58,342 --> 00:21:00,344 నంబర్లను తనిఖీ చేయగలిగే అవకాశం ఏమైనా ఉందా? 310 00:21:00,344 --> 00:21:04,014 ఉందేమో. షెరిల్, ఆర్కైవ్స్ లో ఉండే ఫైలింగ్ క్యాబినెట్స్ లో ఓసారి చూడు. 311 00:21:04,014 --> 00:21:05,516 అక్కడ రోస్టర్ ఏమైనా ఉందేమో చూడు. 312 00:21:05,516 --> 00:21:09,394 ఇంకా, 1996 నుండి 1998 దాకా నా క్లాసు జాబితాలను ఇవ్వమని రిజిస్ట్రారును అడుగు. 313 00:21:09,394 --> 00:21:10,521 సరే. 314 00:21:13,398 --> 00:21:15,609 కానీ, పేరు ఎందుకు మార్చుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. 315 00:21:15,609 --> 00:21:18,028 దానికి, అతని సంస్థలో మోసం జరిగిందనే ఆరోపణలకి సంబంధం ఏంటి? 316 00:21:18,028 --> 00:21:19,821 ఆ సంబంధాన్ని కనుగొనాలనే మేము చూస్తున్నాం. 317 00:21:20,989 --> 00:21:24,826 షాప్ సంస్థలో చేరడానికి ముందే తను ఏదైనా సమస్యలో ఇరుక్కుని ఉండవచ్చు. అదేంటో మాకు కూడా తెలీదు. 318 00:21:24,826 --> 00:21:29,122 కానీ మేము తేడాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అతను చెప్పిన వాటికి... 319 00:21:29,122 --> 00:21:30,290 నిజానికి మధ్యనా? 320 00:21:38,841 --> 00:21:42,386 ప్రస్తుతం మీరు ఎంతటి బాధను అనుభవిస్తున్నారనేది నా ఊహలకు కూడా అందడం లేదు, 321 00:21:42,386 --> 00:21:44,847 కానీ మీకు ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో ఏమో కానీ, 322 00:21:44,847 --> 00:21:50,352 నేను దిగాలుగా ఉన్నప్పుడు, ఐన్ స్టీన్ అన్న ఒక మాటని నేను గుర్తు తెచ్చుకొనేవాడని, అది నాకు ప్రశాంతతని ఇచ్చేది. 323 00:21:50,352 --> 00:21:51,353 ఐన్ స్టీన్? 324 00:21:52,771 --> 00:21:57,025 "వాస్తవికతకు సంబంధించినంత వరకు ఇప్పటిదాకా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, 325 00:21:57,776 --> 00:21:58,944 అవి ఖచ్చితమైనవి కాదు. 326 00:21:59,570 --> 00:22:01,321 ఖచ్చితమైనవి ఏవైతే ఉన్నాయో, 327 00:22:02,364 --> 00:22:04,241 అవి వాస్తవికతకు సంబంధించినవి కాదు." 328 00:22:05,033 --> 00:22:06,702 కాస్త అర్థమయ్యే భాషలో చెప్తారా? 329 00:22:07,953 --> 00:22:09,746 ఎవరికీ ఏమీ తెలీదు. 330 00:22:35,772 --> 00:22:36,773 దేవుడా! 331 00:22:37,691 --> 00:22:38,942 అక్కడ అంతా ఓకేనా? 332 00:22:45,324 --> 00:22:47,075 - ఏంటి సంగతి? - ఏమీ లేదు. 333 00:22:49,286 --> 00:22:50,287 హానా ఏమైనా కాల్ చేసిందా? 334 00:22:51,622 --> 00:22:52,873 లేదు. 335 00:22:55,876 --> 00:22:57,961 జూల్స్, నాకు తెలీని విషయమేమైనా నీకు తెలుసా? 336 00:22:58,462 --> 00:23:00,464 - లేదు. - ఎందుకంటే, నేను తన లాయరుని. 337 00:23:00,464 --> 00:23:01,632 అది నాకు తెలుసు. 338 00:23:01,632 --> 00:23:03,133 హా, నాకు తెలీకుండా ఏమైనా జరుగుతూ ఉంటే, 339 00:23:03,133 --> 00:23:05,677 నాకు తెలీని విషయం గురించి ఎఫ్.బీ.ఐ వాళ్లేమైనా బాంబు పేల్చితే, 340 00:23:05,677 --> 00:23:09,181 - అప్పుడు నేను తనని కాపాడలేను. - సరే, సరే. కాస్త శాంతించు. 341 00:23:12,518 --> 00:23:15,312 హానా, బెయిలీల కోసం ఓవెన్ ఒక బ్యాగ్ నిండా నగదు ఉంచి వెళ్లాడు. 342 00:23:17,314 --> 00:23:18,357 నగదు అంటే ఎంత? 343 00:23:18,941 --> 00:23:21,109 యాభై కోట్ల డాలర్లకు కాస్త ఎక్కువే ఉంటుంది అనుకుంటా. 344 00:23:21,944 --> 00:23:25,822 బాబోయ్, ఎఫ్.బీ.ఐ వాళ్లకి ఈ విషయం తెలిస్తే రఫ్ ఆడించేస్తారు. 345 00:23:25,822 --> 00:23:28,951 ఏమో మరి. ఇప్పుడు అది కనిపించట్లేదు కదా, కాబట్టి అంతగా రఫ్ ఆడించలేరేమో. 346 00:23:28,951 --> 00:23:30,160 కామెడీ చేస్తున్నావా? 347 00:23:30,160 --> 00:23:33,288 జూల్స్, తన భర్త దొంగిలించిన డబ్బును కనుక హానా దాస్తూ ఉంటే, 348 00:23:33,288 --> 00:23:35,332 తనపై కూడా నేరం చేసినట్టు కేసు వేస్తారు. 349 00:23:35,332 --> 00:23:38,210 - దర్యాప్తుకు అడ్డం వస్తుందని కేసు కూడా... - ఓవెన్, ఆ డబ్బును దొంగిలించి ఉండకపోవచ్చేమో! 350 00:23:38,210 --> 00:23:41,046 అబ్బా ఛ. బ్యాగులో ఎవరైనా యాభై మిలియన్ డాలర్ల నగదును ఉంచుకుంటారా? 351 00:23:41,046 --> 00:23:42,798 చూశావా, ఇందుకే ఈ విషయం నీకు చెప్పవద్దని తను అంది, 352 00:23:42,798 --> 00:23:45,092 ఎందుకంటే, ఎప్పటిలాగే నువ్వు కంగారుపడిపోతావని తనకి తెలుసు. 353 00:23:45,092 --> 00:23:47,803 అవును. తనని... తనని పట్టించుకొనే నాలాంటి వాడిని నమ్మడం మాని, 354 00:23:47,803 --> 00:23:49,763 తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటోంది, అది నా తప్పే అంటావా! 355 00:23:49,763 --> 00:23:53,016 - జేక్, తను నన్ను నమ్మింది. ఓవెన్ ని నమ్మింది. - అది తనని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో చూడు. 356 00:23:53,767 --> 00:23:56,103 మళ్లీ ఒంటరి అయిపోతుందేమో అన్న భయం తనకి ఉండి కూడా 357 00:23:56,103 --> 00:23:57,771 భలే భలే మనుషులని ఎంచుకుంటూ ఉంటుంది. 358 00:23:57,771 --> 00:24:00,107 మళ్లీ ఒంటరి అయిపోతుందన్న భయం హానాకి లేదు, సరేనా? 359 00:24:00,107 --> 00:24:01,400 తనకి ఇరుక్కుపోతుందన్న భయం ఉందంతే. 360 00:24:01,400 --> 00:24:03,360 అందుకే కదా తను నన్ను పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుంది! 361 00:24:03,360 --> 00:24:07,030 కాదు, జేక్. నువ్వొక వెధవవి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోకూదదు అనుకుంది. 362 00:24:10,409 --> 00:24:11,410 హా, అంతే అయ్యుంటుంది. 363 00:24:13,120 --> 00:24:15,414 కానీ, నేను అంత వెధవనే అయితే... 364 00:24:17,916 --> 00:24:19,334 తనకి అండగా నేను ఎందుకు ఇప్పుడు ఉన్నానంటావు? 365 00:24:29,803 --> 00:24:31,638 - ఏమైనా దొరికిందా? - లేదు. 366 00:24:35,517 --> 00:24:36,560 ఏంటిది? 367 00:24:37,060 --> 00:24:39,605 1997 వసంత కాలానికి సంబంధించిన రోస్టర్. 368 00:24:39,605 --> 00:24:43,609 మీరు 1996లో సీనియర్ సెమినార్లను ఇచ్చారు, ఆ తర్వాత 1998లోనే గ్రాడ్యుయేట్ విద్యార్థులకి క్లాసులు తీసుకున్నారు, 369 00:24:43,609 --> 00:24:45,319 కాబట్టి అతను ఈ క్లాసుకు చెందినవాడే అయ్యుండాలి. 370 00:24:45,903 --> 00:24:47,362 సూపర్, షెరిల్. 371 00:24:47,362 --> 00:24:48,447 థ్యాంక్యూ. 372 00:24:55,704 --> 00:24:57,915 సారీ. ఈ పేర్లు చూస్తున్నా నాకేమీ గుర్తు రావట్లేదు. 373 00:24:59,791 --> 00:25:02,377 డెబ్బై మూడు మంది విద్యార్థులు. వాళ్లలో ఎంత మంది మగవాళ్లు? 374 00:25:02,377 --> 00:25:04,171 నలభై తొమ్మిది మంది. నేను లెక్కపెట్టా. 375 00:25:04,755 --> 00:25:06,590 నలభై తొమ్మిది అంటే వంద కోట్ల కన్నా చాలా మేలు కదా. 376 00:25:07,382 --> 00:25:08,675 - ఇలా ఇవ్వండి, మళ్లీ చూస్తా. - సరే. 377 00:25:11,637 --> 00:25:12,638 ఏంటి? 378 00:25:14,014 --> 00:25:16,433 ఆ యువతి పేరేంటో గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నా. 379 00:25:17,017 --> 00:25:18,143 యువతి ఎవరు? 380 00:25:18,727 --> 00:25:22,147 మిడ్ టర్మ్ మీద అతను ఏకాగ్రత పెట్టలేకపోవడానికి ఆమెనే కారణమని అతను అన్నాడు. 381 00:25:22,147 --> 00:25:25,025 ఒక క్లాసులోని అమ్మాయి మీద మనస్సు పారేసుకున్నాడని 382 00:25:25,025 --> 00:25:28,779 నాకు అతను ఒక పెద్ద లేఖ రాశాడు, అది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. 383 00:25:28,779 --> 00:25:32,074 ఆమె ఉన్నప్పుడు, తను దృష్టి పెట్టలేకపోయేవాడని, అంతగా అది కుదిరేది కాదని రాశాడు. 384 00:25:35,285 --> 00:25:36,787 ఆవిడ ఈమేనా? 385 00:25:40,290 --> 00:25:44,294 అవుననే నాకూ చెప్పాలని ఉంది, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నా. 386 00:25:45,838 --> 00:25:47,548 ఇక్కడ జాబితాలో కూడా "ఒలీవియా" అనే పేరు లేదు. 387 00:25:50,300 --> 00:25:52,553 ఆమె మీ అమ్మనా? ఒలీవియా? 388 00:25:53,136 --> 00:25:55,264 కాలేజీలో ఉండగా సీనియర్ ఇయర్ లో వాళ్లు కలుసుకున్నారు. 389 00:25:55,889 --> 00:26:00,269 మా నాన్న నాకు అదే చెప్పాడు, అందుకో సగం మాత్రమే నిజం అయ్యుండవచ్చు కూడా. 390 00:26:00,269 --> 00:26:01,478 అన్ని విషయాల లాగానే. 391 00:26:05,148 --> 00:26:06,692 మరి ఇప్పుడేం చేస్తారు? 392 00:26:10,529 --> 00:26:12,906 షెరిల్, వార్షిక పుస్తకాలని ఏ లైబ్రరీలో పెడతారు? 393 00:26:18,495 --> 00:26:20,581 నువ్వు వాకబు చేయమని అడిగిన మహిళ గురించి లారీ ఏదో సంపాదించాడు... 394 00:26:20,581 --> 00:26:21,748 ఆ విషయాన్ని వదిలేయమని అతనికి చెప్పేయ్. 395 00:26:31,675 --> 00:26:32,634 {\an8}షాప్ సీ.ఎఫ్.ఓ, అవెట్ థాంప్సన్ కి ఎదురు తిరిగారు 396 00:26:32,634 --> 00:26:33,552 {\an8}ఎస్ఈసీకి సహకరించేలా ఉన్నారు 397 00:26:36,013 --> 00:26:37,514 మనం హానా హాల్ మీద దర్యాప్తును వదిలేస్తున్నామా? 398 00:26:38,223 --> 00:26:39,933 హా. నీకేమైనా సమాచారం లభించిందా? 399 00:26:39,933 --> 00:26:42,394 తను, ఆ అమ్మాయి నిన్న ఉదయం ఎస్ఎఫ్ఓ విమానాశ్రయం నుండి ప్రయాణమయ్యారు. 400 00:26:46,064 --> 00:26:48,025 అయ్య బాబోయ్! 401 00:26:48,692 --> 00:26:50,068 అయ్య బాబోయ్! 402 00:26:55,032 --> 00:26:57,326 ఆర్కైవ్ కోసమని వార్షిక పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. 403 00:26:57,826 --> 00:26:59,203 అతిథులకి ఇచ్చే పాస్వర్డ్ ఇదుగోండి. 404 00:26:59,203 --> 00:27:02,247 ర్యాకులని దాటి వెళ్లాక కంప్యూటర్లు ఉంటాయి. 405 00:27:02,247 --> 00:27:04,041 మీ సాయానికి చాలా చాలా థ్యాంక్స్. 406 00:27:20,807 --> 00:27:21,892 హేయ్. 407 00:27:25,687 --> 00:27:27,773 మనకి ఇక్కడేం లభిస్తుంది? 408 00:27:29,566 --> 00:27:32,236 - ముందు వెళ్లి కూర్చుందాం పద. - లేదు. మనకి ఇక్కడ... 409 00:27:32,236 --> 00:27:34,321 అతని గురించి మనకి ఏ విషయాలు తెలుస్తాయి? 410 00:27:35,739 --> 00:27:37,366 నా గురించి ఏ విషయాలు తెలుస్తాయి? 411 00:27:38,534 --> 00:27:41,620 - అసలు నేనెవరో కూడా నాకు తెలీదు. - బెయిలీ. 412 00:27:41,620 --> 00:27:45,415 భయంకరమైన విషయం ఏంటంటే, అతను నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. 413 00:27:48,126 --> 00:27:51,088 నాకు పదేళ్లు వచ్చేదాకా నేను మా స్నేహితుల ఇంట్లో పడుకోలేదు తెలుసా! 414 00:27:53,257 --> 00:27:54,258 అలా పడుకోడానికి వెళ్లినప్పుడు కూడా... 415 00:27:56,385 --> 00:28:00,973 నేను పడుకొనేదాకా నాన్న, ఇంటి బయట కారులోనే ఉన్నాడు, 416 00:28:02,015 --> 00:28:04,226 తను లేకుండా నేను ఉండగలను అని నిర్ధారించుకోవడానికి. 417 00:28:04,226 --> 00:28:05,894 ఆ విషయం నాకు అతను చెప్పాడు. 418 00:28:05,894 --> 00:28:08,355 నేను ఏడున్నర గంటల దాకే ఉండగలిగాను అని కూడా చెప్పాడా? 419 00:28:09,982 --> 00:28:10,983 ఆ తర్వాత నేను... 420 00:28:11,900 --> 00:28:16,488 నేను బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి... ఇంటికి వెళ్దామని నాన్నతో అన్నాను. 421 00:28:19,157 --> 00:28:22,703 నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. అలా ఎప్పటికీ ఉంటానని నాకు చెప్పాడు. 422 00:28:24,538 --> 00:28:28,166 - బెయిలీ, నేను... - లేదు. వెళ్దాం పద. 423 00:28:55,611 --> 00:28:57,487 - మాట్లాడు. - తర్వాత మాట్లాడతాలే. 424 00:28:57,487 --> 00:28:58,572 నాకేం పర్వాలేదు. 425 00:29:01,491 --> 00:29:02,492 నాకేం పర్వాలేదు. 426 00:29:13,462 --> 00:29:15,297 అసలు నేనెవరో కూడా నాకు తెలీదు. 427 00:29:19,635 --> 00:29:21,512 అసలు నేనెవరో తనకి కూడా తెలీదు. 428 00:29:23,972 --> 00:29:27,809 - ఆ కార్గో ట్రక్కు నీకు పనికి కూడా రాదు. - బాబోయ్. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? 429 00:29:27,809 --> 00:29:29,937 ట్రక్కులో పెట్టడానికి నీకు ఏ సామానూ లేదు కదా అని అంటున్నా. 430 00:29:29,937 --> 00:29:31,688 ఈ ట్రక్కే నాది అయ్యుంటేనా... 431 00:29:31,688 --> 00:29:34,274 నీ చెక్క యంత్రాలని పెట్టుకొని నువ్వు బండిని నడపలేవుగా, 432 00:29:34,274 --> 00:29:36,443 ఎందుకంటే, నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు కదా. 433 00:29:36,443 --> 00:29:37,694 ఆ వివరాలన్నీ అవసరమా! 434 00:29:46,787 --> 00:29:48,372 - అది... - దింపినందుకు థ్యాంక్స్. 435 00:30:27,703 --> 00:30:29,204 నా కూజాని ఏం చేస్తున్నావు? 436 00:30:30,205 --> 00:30:31,540 దీనికి మెరుగులు దిద్దుతున్నా. 437 00:30:31,540 --> 00:30:34,877 ఇది నా అత్యుత్తమ కళాఖండం కావలసిన కూజా. 438 00:30:34,877 --> 00:30:36,879 నా అద్భుతమైన సృష్టి. 439 00:30:37,462 --> 00:30:38,547 కానీ దీనికి అంత సీన్ లేదు. 440 00:30:41,258 --> 00:30:43,385 తను వెళ్లిపోయే ముందు వెళ్లి ఓసారి పలకరిస్తావా? 441 00:30:45,554 --> 00:30:47,431 - లేదు. - తను నిన్ను చూడాలనుకుంటోంది. 442 00:30:48,515 --> 00:30:49,516 ఇప్పుడా? 443 00:30:50,017 --> 00:30:52,978 నన్ను ఇప్పుడు చూడాలనుకుంటోందా? ఇప్పుడు నేనెవరినో కూడా తనకి తెలీనే తెలీదు. 444 00:30:52,978 --> 00:30:54,730 తను నీకు తల్లి. నువ్వు తనకి తెలీకుండా ఎలా ఉంటావు! 445 00:30:57,941 --> 00:30:59,860 చూడు, తనకి నీ స్నేహితులెవరో తెలిసి ఉండకపోవచ్చు, 446 00:30:59,860 --> 00:31:02,029 ఎమిలూ హ్యారిస్ అంటే నీకు పిచ్చి అని తెలిసి ఉండకపోవచ్చు, 447 00:31:02,029 --> 00:31:06,074 నువ్వు భయంకరమైన డ్రైవర్ అని కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ నీ ఇప్పటి విషయాలు. ఇవన్నీ మారిపోతాయి. 448 00:31:06,074 --> 00:31:08,785 నీ సంగీతం, నీ మిత్రులు ఇవన్నీ మారుతాయి. నీ డ్రైవింగ్ కూడా మారిపోతుందని ఆశిస్తున్నా. 449 00:31:08,785 --> 00:31:09,953 నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? 450 00:31:11,246 --> 00:31:14,082 తనతో టచ్ లో ఉంటే పోయే నష్టమేమీ లేదని అంటున్నా. 451 00:31:15,501 --> 00:31:18,003 తను ఇక్కడ ఉండనప్పుడు తనతో టచ్ లో నేనెందుకు ఉండాలి? 452 00:31:19,630 --> 00:31:20,631 హానా. 453 00:31:22,090 --> 00:31:23,091 హానా, చెప్పేది విను. 454 00:31:33,560 --> 00:31:34,811 తాతయ్య... 455 00:31:36,104 --> 00:31:39,149 ఒక మాట, నాకు డ్రైవింగ్ చాలా బాగా వచ్చు. 456 00:31:59,628 --> 00:32:02,172 - హేయ్. - బీరువా నా స్టూడియోలో ఉండవచ్చని అనుకుంటున్నా. 457 00:32:02,172 --> 00:32:03,257 నీ స్టూడియోలోనా? 458 00:32:03,257 --> 00:32:06,426 నేను కొన్నింటిని అమ్మనని, ఎవరికీ ఇవ్వనని ఓవెన్ కి తెలుసు. 459 00:32:07,261 --> 00:32:09,137 మా తాతయ్య కూజా నీకు తెలుసు కదా? 460 00:32:09,137 --> 00:32:10,973 - తెలుసు. - దాని కింద చూడు. 461 00:32:10,973 --> 00:32:12,057 అలాగే. 462 00:32:13,600 --> 00:32:17,604 ఇంకో విషయం, ఆ డబ్బులున్న బ్యాగ్ ఉండేది నీ బెడ్ కిందేనా? 463 00:32:19,273 --> 00:32:21,108 అవును. ఏమైంది? 464 00:32:22,734 --> 00:32:24,236 ఇప్పుడు అది నీ బెడ్ కింద లేదు. 465 00:32:26,071 --> 00:32:27,990 - బాగా చూశావా? - బాగా చూశా, హాన్. 466 00:32:28,574 --> 00:32:29,825 ఇప్పుడు నన్నేం చేయమంటావు? 467 00:32:34,955 --> 00:32:35,956 ఆ బీరువా ఎక్కడుందో కనుగొను. 468 00:32:52,389 --> 00:32:53,724 ఇంకా ఏమీ దొరకలేదా? 469 00:33:03,984 --> 00:33:04,985 ఏంటి? 470 00:33:07,738 --> 00:33:10,282 నేను కూడా నీ వయస్సులో ఉన్నప్పుడు, కాస్త నీలానే ఉండేదాన్ని. 471 00:33:10,282 --> 00:33:12,492 ఆ విషయం ఇప్పటిదాకా నాకు తట్టనేలేదు. 472 00:33:14,703 --> 00:33:15,704 సరే. 473 00:33:18,248 --> 00:33:19,541 నా మాటలని నువ్వు నమ్మట్లేదు కదా? 474 00:33:21,668 --> 00:33:26,298 ఇప్పుడు నేనెవరో నాకు తెలీదు కాబట్టి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కూడా కావట్లేదు. 475 00:33:26,298 --> 00:33:29,092 హేయ్, నువ్వెవరో నాకు తెలుసు. నీకు కూడా తెలుసు. 476 00:33:30,135 --> 00:33:32,804 నీ పేరు, నీ పుట్టినరోజు, ఇవన్నీ ఉత్త వివరాలు మాత్రమే. 477 00:33:33,639 --> 00:33:35,098 ముఖ్యమైన వివరాలే అవి. 478 00:33:35,098 --> 00:33:37,518 ఈ పరిస్థితి నీకు తలెత్తకపోయి ఉన్నా, 479 00:33:38,268 --> 00:33:43,023 నువ్వెవరు అని, నువ్వు ఏం కావాలి అని నీకు చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తారు. 480 00:33:43,565 --> 00:33:46,151 అవన్నీ నీకు తెలిసి ఉంటాయనే నేను అంటున్నా. 481 00:33:47,653 --> 00:33:48,737 నువ్వేం అనుకుంటావో ఏమో కానీ, 482 00:33:48,737 --> 00:33:51,865 మిగతావన్నీ నిర్ణయించుకోగల తెలివి నీకు ఉంది, 483 00:33:51,865 --> 00:33:53,617 ఇంకా వాటికి కట్టుబడి ఉండేంత మొండితనం నీకు ఉంది కూడా. 484 00:33:59,039 --> 00:34:00,207 నేను మొండిదాన్ని అని అనుకుంటున్నావా? 485 00:34:01,583 --> 00:34:03,544 నేను అంత చెప్తే, నువ్వు అర్థం చేసుకుంది ఇదా? 486 00:34:12,511 --> 00:34:14,513 - హలో. - ప్రాక్టీస్ మ్యాచులు. 487 00:34:14,513 --> 00:34:16,473 ప్రాక్టీస్ మ్యాచుల విషయమే నాకు తట్టలేదు. 488 00:34:17,056 --> 00:34:18,725 మన్నించాలి. ఎవరు మీరు? 489 00:34:18,725 --> 00:34:20,768 చర్చి నుండి ఎలనార్ మెక్ గొవర్న్ ని కాల్ చేస్తున్నా. 490 00:34:20,768 --> 00:34:24,523 2011లో మ్యాచ్ జరిగిన రోజుల్లో పెళ్లిళ్లు ఏమైనా జరిగాయా అని అడుగుతూ మీరు నిన్న వచ్చారు కదా? 491 00:34:25,023 --> 00:34:26,108 హా, అవును. 492 00:34:26,108 --> 00:34:29,444 మీ కథని నేను మా చర్చికి నిత్యం వచ్చే ఒకావిడకి చెప్పాను, 493 00:34:29,444 --> 00:34:31,905 ఆమె కొడుకు లాంగ్ హార్న్ జట్టులో ఆటగాడు, 494 00:34:31,905 --> 00:34:35,659 అది ఆటలు మొదలవ్వడానికి ముందు జరిగిన పెళ్లి అయ్యుండవచ్చని ఆమె అంది. 495 00:34:35,659 --> 00:34:38,203 "బాబోయ్, నేను వెర్రిదాన్ని," అని అనుకున్నా. 496 00:34:38,203 --> 00:34:41,206 ప్రాక్టీసు మ్యాచుల ఆలోచనే నాకు రాలేదు. 497 00:34:41,206 --> 00:34:43,583 ప్రాక్టీసు మ్యాచులు స్టేడియంలో ఆడారా? 498 00:34:43,583 --> 00:34:47,295 మామూలు మ్యాచులలానే స్టేడియంలో ఆడారు, అవును. జనాలు కూడా బాగానే వచ్చి చూస్తారు. 499 00:34:47,295 --> 00:34:50,632 ఎలనార్, ఆ సీజనుకు చెందిన ప్రాకీసు మ్యాచులప్పుడు జరిగిన పెళ్లిళ్లు ఏమైనా ఉన్నాయేమో చూశారా? 500 00:34:50,632 --> 00:34:56,722 చూశా. ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడ పెళ్లి జరిగింది, 501 00:34:57,389 --> 00:35:00,184 - అది రేయస్, స్మిత్ ల పెళ్లి. - ఏంటి సంగతి? 502 00:35:00,184 --> 00:35:03,687 - పెళ్లి మధ్యాహ్నం జరిగింది. - ఒక్క నిమిషం. సరే, సారీ. 503 00:35:03,687 --> 00:35:07,232 - రేయస్ అంటే రే-య-సే కదా? - అవును. హా. 504 00:35:07,232 --> 00:35:08,609 - ఇంకా స్మిత్ కదా? - హా. 505 00:35:08,609 --> 00:35:12,362 రేయస్ అని ఎవరూ లేరు, కానీ క్యాథరిన్ స్మిత్ ఉన్నారు. 506 00:35:12,988 --> 00:35:15,365 ఎలనార్, వధువు మొదటి పేరు, క్యాథరిన్ ఆ? 507 00:35:16,241 --> 00:35:18,493 కాదు, వధువు పేరు క్యాథరిన్ కాదు. 508 00:35:18,493 --> 00:35:20,871 తన పేరు ఆండ్రియా. 509 00:35:22,039 --> 00:35:23,916 ఇంకా, తన భర్త పేరు... 510 00:35:24,917 --> 00:35:27,669 అతని పేరు, ఒక్క నిమిషం ఆగండి, చార్లెస్. 511 00:35:27,669 --> 00:35:30,547 అది ఆండ్రియా రేయస్, చార్లెస్ స్మిత్ల పెళ్లి. 512 00:35:30,547 --> 00:35:33,133 మీ సాయానికి చాలా చాలా థ్యాంక్స్. 513 00:35:33,133 --> 00:35:34,760 దానిదేముందిలెండి. 514 00:35:35,260 --> 00:35:38,430 చర్చికి నువ్వు వెళ్లావు అని నువ్వు అన్న విషయం నిజమే అన్నమాట. 515 00:35:39,097 --> 00:35:39,932 కావచ్చు. 516 00:35:39,932 --> 00:35:41,141 చర్చల జట్టు 517 00:35:41,141 --> 00:35:43,477 వారిలో క్యాథరిన్ స్మిత్ ఉన్నారా? 518 00:35:44,895 --> 00:35:47,231 ఇండెక్సులో అదే ఉంది మరి. 519 00:35:50,734 --> 00:35:51,735 ఒక్క నిమిషం. 520 00:35:55,364 --> 00:35:56,490 బెయిలీ. 521 00:37:27,206 --> 00:37:29,208 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్