1 00:00:02,586 --> 00:00:03,879 అదరగొట్టేయ్, తాతి! 2 00:00:12,137 --> 00:00:13,514 2021 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కాలిఫోర్నియా 3 00:00:13,597 --> 00:00:16,600 మహిళల ప్రపంచ ఛాంపియన్ కి ఇక్కడే కిరీట ధారణ చేస్తాం. 4 00:00:16,683 --> 00:00:19,645 కరీసాకి మళ్లీ టైటిల్ దక్కుతుందా? లేక తాతియానా తన కల నెరవేర్చుకుంటుందా? 5 00:00:20,229 --> 00:00:22,105 వెస్టన్-వెబ్ 6 00:00:26,777 --> 00:00:29,112 ఆ ఈవెంట్ లో తిరిగి సత్తా చూపడం చాలా కష్టం 7 00:00:29,196 --> 00:00:31,657 ఎందుకంటే దాని గురించి ఎంతో భావోద్రేకానికి గురవుతున్నాను. 8 00:00:32,908 --> 00:00:34,368 ఆమె ఇక్కడ చక్కగా రాణిస్తుంది. 9 00:00:35,619 --> 00:00:38,121 గురూ, తను సరైన అలను ఎంచుకుంది. 10 00:00:38,789 --> 00:00:41,458 తను ఈ హీట్ లో ప్రతిభ కనబరిచి, నేరుగా ప్రపంచ టైటిల్ గెలుచుకుంటుంది. 11 00:00:51,510 --> 00:00:52,636 వావ్. 12 00:00:54,137 --> 00:00:56,807 అయ్యో! ఇలాంటి విన్యాసాల్లో చివరకు జరిగేదిదే. 13 00:00:57,766 --> 00:00:59,226 -కరీసా! -హా! 14 00:01:06,316 --> 00:01:09,903 ప్రపంచ టైటిల్ గెలుచుకోవడానికి అంగుళం దూరంలోకి వచ్చినప్పుడు, 15 00:01:11,071 --> 00:01:14,741 విజయం కోసం నీ సర్వశక్తులూ ధారపోసినప్పుడు, 16 00:01:14,825 --> 00:01:18,745 పోటీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. 17 00:01:20,163 --> 00:01:21,915 బాగా సర్ఫ్ చేశావు. 18 00:01:23,041 --> 00:01:26,086 నీ ప్రయత్నం చాలలేదు. 19 00:01:27,296 --> 00:01:28,881 ఇక నీ ప్రయాణం ఎటువైపు? 20 00:01:38,974 --> 00:01:41,476 పైప్ లైన్ ఓహు, హవాయి 21 00:01:43,020 --> 00:01:47,107 నాలుగు నెలల తర్వాత 22 00:01:49,818 --> 00:01:53,405 అదిగో, రాస్ అక్కడున్నాడు. తాతికి కోచింగ్ ఇస్తున్నాడు. 23 00:01:54,656 --> 00:01:56,950 రాస్ విలియమ్స్ నా ప్రాణ స్నేహితుడు. 24 00:01:57,451 --> 00:01:59,077 నా చిన్నతనం నుంచీ అతను నాకు తెలుసు… 25 00:01:59,161 --> 00:02:00,495 కెల్లీ స్లేటర్ 11సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ విజేత 26 00:02:00,579 --> 00:02:02,289 …మేం కలిసి సర్ఫ్ చేసేవాళ్లం. 27 00:02:02,372 --> 00:02:04,541 తను రిటైరయ్యాక, కోచింగ్ లోకి దిగాడు. 28 00:02:04,625 --> 00:02:05,918 ప్రస్తుతం అతను అదే పనిలో ఉన్నాడు. 29 00:02:12,007 --> 00:02:13,342 ఇవాళ శిక్షణ ముగిశాక, 30 00:02:13,425 --> 00:02:15,344 ఈ సెషన్ తర్వాత మనం పూర్వాపరాలను ఆలోచించుకుందాం. 31 00:02:15,427 --> 00:02:16,428 రాస్ విలియమ్స్ తాతియానా కోచ్ 32 00:02:16,512 --> 00:02:19,014 -నీళ్లలో తేలికపాటి విన్యాసాలు చేద్దాం, అంతే. -సరే. సరే. 33 00:02:19,640 --> 00:02:22,309 తాతి మానసికంగా సిద్ధమవుతోంది… 34 00:02:22,392 --> 00:02:23,894 -వెళ్దామా? -సరే. 35 00:02:23,977 --> 00:02:26,939 …ఫైనల్ కు ఎలా చేరాలో బేరీజు వేసుకుంటోంది. 36 00:02:30,442 --> 00:02:35,030 గత ఏడాది చివర్లో నేను బాధపడినంతగా నా కెరీర్ లో ఎన్నడూ బాధపడలేదు. 37 00:02:36,698 --> 00:02:39,910 నా క్రీడా జీవితంలో అది ఎంతో క్లిష్టమైన రోజుగా మిగిలిపోయింది. 38 00:02:42,120 --> 00:02:45,499 యావత్తు ప్రపంచంలో అది ఎంతో బాధాకరమైన అనుభూతి. 39 00:02:54,174 --> 00:02:56,677 ఫైనల్స్ జరిగిన రోజునుంచి అసలు నేను సర్ఫింగ్ చేయనేలేదు. 40 00:03:01,974 --> 00:03:04,351 ప్రపంచ టైటిల్ గెలవాలని ప్రతి సర్ఫర్ కలలు కంటాడు, 41 00:03:04,434 --> 00:03:08,564 దానికి చేరువగా వెళ్లడం అంత సులభమేమీ కాదు. 42 00:03:11,900 --> 00:03:17,531 తాతి భావోోద్రేకాలు గల మనిషి. తను మానసికంగా కుంగుబాటులో ఉంది. 43 00:03:20,367 --> 00:03:22,953 ఓటమిని జీర్ణించుకుని, తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. 44 00:03:24,955 --> 00:03:26,498 నాకు కాస్త ఊరట కావాలి. 45 00:03:37,092 --> 00:03:38,093 బర్గర్ తిందామా? 46 00:03:39,178 --> 00:03:40,637 ఫిలిపే టోలెడో ప్రస్తుత ప్రపంచ నంబర్ 2 ర్యాంక్ 47 00:03:40,721 --> 00:03:42,848 ఫిలిపే నా ప్రాణ స్నేహితుల్లో ఒకడు. 48 00:03:44,558 --> 00:03:47,311 ఇదే ఈవెంట్ లో రెండో స్థానంలో వచ్చాడు తను… 49 00:03:47,394 --> 00:03:50,022 నేను పడుతున్న బాధతో పోల్చి చూస్తే 50 00:03:50,105 --> 00:03:53,108 నాకూ, ఫిలిపేకి దగ్గర పోలిక ఉందనుకుంటా. 51 00:03:53,192 --> 00:03:56,904 ఎందుకంటే, నేను ఓడిపోయి ఎంత బాధపడుతున్నానో 52 00:03:56,987 --> 00:04:00,282 రెండో స్థానంలో వచ్చినవారికే అర్ధమవుతుంది. 53 00:04:02,326 --> 00:04:06,205 సెమీస్ లో ఓడిపోవడం కంటే రెండోస్థానంలో రావడమే బాధాకరమనుకుంటాను. 54 00:04:07,039 --> 00:04:08,540 గెలుపుకి చాలా దగ్గరగా వచ్చి, 55 00:04:08,624 --> 00:04:10,542 "ఓకే, నేను ఫైనల్ కి చేరుకున్నాను" అనుకుంటాం. 56 00:04:10,626 --> 00:04:13,420 మొదటి స్థానమా లేక రెెండోదా? మొదటి స్థానానికే ప్రాముఖ్యం ఇస్తాం. 57 00:04:13,504 --> 00:04:16,089 ఇక అంతలోనే 58 00:04:16,173 --> 00:04:18,300 "ఛీ, అదే చివరి హీట్. నా చివరి అవకాశం" అని నిరుత్సాహ పడతాం. 59 00:04:18,382 --> 00:04:19,635 -చాలా బాధగా ఉంటుంది. -అది… 60 00:04:19,718 --> 00:04:21,094 అది నీకెలా అనిపించింది? 61 00:04:21,178 --> 00:04:22,471 చాలా దారుణం. 62 00:04:23,347 --> 00:04:25,891 ఓడిపోయానన్న చేదు నిజాన్ని నేను అసలు గుర్తించలేదు, 63 00:04:25,974 --> 00:04:27,851 ఓటమిని జీర్ణించుకోవడం నాకు చాలా కష్టమైంది. 64 00:04:27,935 --> 00:04:29,144 నువ్వు తిరిగి కోలుకోవడానికి… 65 00:04:29,228 --> 00:04:30,312 -కాస్త సమయం పట్టింది. -నిజంగా? 66 00:04:30,812 --> 00:04:31,855 అవును. 67 00:04:31,939 --> 00:04:33,774 నా జీవితం నా కళ్ల ముందు నిలబడినట్లు అనిపించింది, 68 00:04:33,857 --> 00:04:35,734 "నేను ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను?" అని 69 00:04:35,817 --> 00:04:38,362 నాకు నేను ప్రశ్నించుకున్నాను. 70 00:04:38,987 --> 00:04:44,201 మళ్లీ బరిలోకి దిగాలా వద్దా అనేది తేల్చుకోలేకపోయాను. 71 00:04:45,077 --> 00:04:49,248 పోటీల నుంచి తప్పుకుందామా? ఏమో నాకేం తేలియలేదు. 72 00:04:53,669 --> 00:04:57,297 మరో అవకాశం 73 00:05:03,804 --> 00:05:08,100 నేను బ్రెజిల్ లో పుట్టి, కొవాయి దీవిలో పెరిగాను. 74 00:05:08,684 --> 00:05:10,185 కొవాయి, హవాయి 2005 75 00:05:10,269 --> 00:05:14,648 ప్రపంచంలోనే అత్యుత్తమ సర్ఫర్ ని కావాలని చిన్నప్పుడు కలలు కనేదాన్ని. 76 00:05:15,524 --> 00:05:17,109 నా గోడపై అలా రాసి, 77 00:05:17,192 --> 00:05:19,319 రోజూ దాన్నే చూస్తూ ఉండేదాన్ని. 78 00:05:20,696 --> 00:05:22,614 అప్పట్లో నేను ఎంతోసేపు సర్ఫింగ్ చేసేదాన్ని. 79 00:05:22,698 --> 00:05:27,160 తాతియానా వెస్టన్-వెబ్ భావి సర్ఫర్. 80 00:05:28,287 --> 00:05:32,332 కొన్నేళ్ల తర్వాత, స్థానిక సర్ఫ్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. 81 00:05:38,547 --> 00:05:39,548 ఓ! 82 00:05:39,631 --> 00:05:42,217 ఆ తర్వాత మా నాన్నతో "నాన్నా, నేను గెలవాలనుకుంటున్నా" అన్నాను. 83 00:05:42,301 --> 00:05:43,677 గెలిచావు, టాట్స్! 84 00:05:43,760 --> 00:05:45,846 తర్వాత, ఆశ్చర్యకరంగా… 85 00:05:45,929 --> 00:05:47,598 -భలే ఆడావు! -…గెలిచాను. 86 00:05:47,681 --> 00:05:51,518 తొమ్మిది పదేళ్ల అమ్మాయి తాతియానా వెస్టన్-వెబ్! 87 00:05:53,103 --> 00:05:56,398 తర్వాత ఏడాది నేషనల్స్ లో ఒక ఈవెంట్లో గెలిచాను. 88 00:05:58,025 --> 00:06:02,487 అదే ఏడాది కరీసా తన మొదటి ప్రపంచ టైటిల్ గెలుచుకుంది. 89 00:06:02,571 --> 00:06:04,114 ఏ.ఎస్.పీ వరల్డ్ టూర్ 90 00:06:04,198 --> 00:06:05,782 నేను ఇదే దీవిలో పెరిగాను, 91 00:06:05,866 --> 00:06:10,370 అందువల్ల ఆమె కెరీర్ ఊపందుకోవడం నా కళ్ల ముందే జరిగింది. 92 00:06:11,788 --> 00:06:14,666 నేను "వావ్, కరీసా ప్రపంచ టైటిల్ గెలుచుకుంది, 93 00:06:14,750 --> 00:06:16,668 ఏదో ఒక రోజు నేనూ ప్రపంచ టైటిల్ గెలుస్తాను" అనుకున్నాను. 94 00:06:16,752 --> 00:06:21,089 ఆ తర్వాతే "ప్రొఫెషనల్ క్రీడాకారిణిని కావాలి" అని నాలో ఆలోచన మొలకెత్తింది. 95 00:06:23,634 --> 00:06:25,385 తాతియానా వెస్టన్-వెబ్ భయపడలేదు. 96 00:06:25,469 --> 00:06:27,429 బ్యారెల్ లోకి ప్రవేశించింది. బయటకొస్తుంది కూడా. 97 00:06:30,641 --> 00:06:32,309 ట్యూబ్ కోసం చూస్తోంది, తనకి అది దొరికింది. 98 00:06:32,392 --> 00:06:34,603 అదిగో, తాతియానా! బయటకు వచ్చింది! 99 00:06:34,686 --> 00:06:38,232 తాతియానా వెస్టన్-వెబ్ 2015లో తొలిసారిగా అడుగుపెట్టింది. 100 00:06:38,315 --> 00:06:40,025 ప్రతికూల పరిస్థితుల్లోనూ 101 00:06:40,108 --> 00:06:43,862 దూసుకుపోగల క్రీడాకారుల్లో తను ఒకతె. ఏ దిశగానైనా సర్ఫ్ చేయగల సమర్ధురాలు, 102 00:06:43,946 --> 00:06:46,949 ప్రపంచ టైటిల్ గెలవాలంటే అలాంటి సామర్థ్యం ఉండటం అవసరం. 103 00:06:47,616 --> 00:06:48,825 ఆ శక్తి తనకుంది, పైగా చాలా చిన్నది, 104 00:06:48,909 --> 00:06:50,911 ఇంకా మెరుగ్గా, అద్భుతంగా పోటీ పడగల సత్తా తనకుంది. 105 00:06:50,994 --> 00:06:57,000 అందరూ వినండి, తాతియానా వెస్టన్-వెబ్ కు ఇది గొప్ప విజయం, 106 00:06:57,084 --> 00:07:01,588 తను 2016 యుఎస్ ఓపెన్ సర్ఫింగ్ ఛాంపియన్. 107 00:07:01,672 --> 00:07:03,131 తన కెరీర్ ఇక ఊపందుకోబోతోంది. 108 00:07:03,632 --> 00:07:05,884 అగ్రస్థానంవైపు దూసుకుపోతుంది. 109 00:07:08,262 --> 00:07:10,848 కరీసా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మహిళా సర్ఫర్, 110 00:07:10,931 --> 00:07:13,267 అగ్రస్థానంలో ఉన్నవారిని ఓడించడమే నా లక్ష్యం. 111 00:07:15,561 --> 00:07:20,023 కానీ 2022 సీజన్ ఇప్పటికే మొదలైంది. నేనేమో ఇంకా సంసిద్ధం కాలేదు. 112 00:07:20,858 --> 00:07:22,943 "ఆగండి!" అని అనలేను కదా. 113 00:07:24,820 --> 00:07:25,988 బరిలోకి దిగాల్సిందే మరి. 114 00:07:26,697 --> 00:07:28,699 యుఎస్ఏ పసిఫిక్ మహా సముద్రం 115 00:07:28,782 --> 00:07:31,368 హవాయి పైప్ లైన్, ఓహు 116 00:07:36,623 --> 00:07:39,209 సర్ఫ్ అభిమానులకు స్వాగతం! ఇది బిల్లబోంగ్ ప్రో! 117 00:07:39,293 --> 00:07:40,419 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 1 118 00:07:41,795 --> 00:07:45,382 ఓహు ఉత్తర తీరంనుంచి, ఏడు మైళ్ల అద్భుతం, 119 00:07:45,465 --> 00:07:49,595 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అల, 120 00:07:49,678 --> 00:07:51,221 బంజాయ్ పైప్ లైన్ పైనే అందరి దృష్టీ ఉంది. 121 00:07:51,305 --> 00:07:52,764 దానికి కారణం ఇదే. 122 00:07:52,848 --> 00:07:55,559 పైనుంచి ఓ కొత్త కెరటం వస్తోంది. 123 00:07:56,852 --> 00:08:00,647 అది ప్రమాద స్థాయిని మించి పైకి ఎగసి, భయం గొలిపే స్థాయికి చేరింది. 124 00:08:02,149 --> 00:08:06,111 అంతటా కెరటాల ఉధృతి ఉంది, కాబట్టి ఇక్కడంతా ప్రమాదకరమే. 125 00:08:10,449 --> 00:08:12,743 పైప్ లైన్ వద్ద ఉత్కంఠ, దిగ్భ్రమ నెలకొని ఉన్నాయి. 126 00:08:13,577 --> 00:08:16,246 ఈ రోజు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. 127 00:08:16,997 --> 00:08:22,169 పురుషులతోపాటు సమానంగా మొదటిసారి మహిళలు కూడా పాలుపంచుకుంటున్నారు, 128 00:08:22,252 --> 00:08:23,504 చూసేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. 129 00:08:23,587 --> 00:08:26,215 పురుషుల, మహిళల సమగ్ర టూర్ ను 130 00:08:26,298 --> 00:08:27,716 నిర్వహిస్తున్న తొలి ఏడాది ఇదే. 131 00:08:27,799 --> 00:08:31,595 మహిళల సర్ఫింగ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. 132 00:08:31,678 --> 00:08:33,847 కానీ ఈసారి మరింత పెద్దదిగా కనిపిస్తోంది, కాబట్టి, అవకాశాలు కూడా… 133 00:08:33,931 --> 00:08:34,932 కరీసా మూర్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 134 00:08:35,015 --> 00:08:36,475 …తప్పక ఉంటాయి. 135 00:08:36,558 --> 00:08:39,436 కెరటాల ఉధృతి పెరుగుతోంది. 136 00:08:41,188 --> 00:08:43,941 నా పేరు కరీసా మూర్. ప్రొఫెషనల్ సర్ఫర్ ని. 137 00:08:44,024 --> 00:08:47,152 ఐదు ప్రపంచ టైటిళ్లు, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. 138 00:08:47,736 --> 00:08:48,904 ధన్యవాదాలు. 139 00:08:48,987 --> 00:08:51,823 ప్రతి ప్రపంచ టైటిల్ రేసూ కాస్త భిన్నంగా ఉంటుంది. 140 00:08:52,950 --> 00:08:56,328 ఫైనల్స్ జరిగే రోజున నంబర్ వన్ సీడ్ తో బరిలోకి దిగడం 141 00:08:56,411 --> 00:08:57,746 నాకు ఎంతగానో ప్రేరణనిస్తుంది. 142 00:09:03,460 --> 00:09:06,338 -థాంక్ యూ తాతియానా, మళ్లీ కలుద్దాం. -ఫరవాలేదు, థాంక్స్. 143 00:09:06,421 --> 00:09:07,589 -సరే. -కలుద్దాం. 144 00:09:07,673 --> 00:09:09,216 -సరే. -బై, తాతి. 145 00:09:09,299 --> 00:09:12,886 -ధన్యవాదాలు, మిత్రులారా. -సరే. సన్సెట్ వద్ద కలుద్దాం. 146 00:09:12,970 --> 00:09:16,557 …4.27 మరియు 2.27తో. అదిగో కరీసా మూర్. 147 00:09:18,392 --> 00:09:21,353 తను బ్యారెల్ లోకి వెళ్లింది. అదిగో బయటకు వస్తోంది! 148 00:09:21,436 --> 00:09:24,565 అలపైనుంచి అద్భుతమైన మలుపు తీసుకుంది. చక్కటి ముగింపు. 149 00:09:32,114 --> 00:09:33,115 యో, యో. 150 00:09:33,198 --> 00:09:34,241 జెస్సీ మెండెస్ తాతియానా భర్త 151 00:09:34,324 --> 00:09:35,534 -హాయ్. -హాయ్. 152 00:09:36,702 --> 00:09:39,246 అన్ని బోర్డుల్నీ తీసుకొచ్చావా? నీవద్ద ఎన్ని బోర్డులున్నాయి? 153 00:09:40,163 --> 00:09:41,164 చాలా ఉన్నాయి. 154 00:09:41,248 --> 00:09:43,834 సరే, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. 155 00:09:43,917 --> 00:09:46,170 నేను మూడు తెస్తాను, నువ్వు మరో మూడు తీసుకురా. 156 00:09:47,087 --> 00:09:50,048 నా పేరు జెస్సీ మెండెస్. నేను ప్రొఫెషనల్ సర్ఫర్ ని, 157 00:09:51,091 --> 00:09:54,261 కానీ కొన్నేళ్ల క్రితమే పోటీలనుంచి వైదొలిగాను. 158 00:09:55,554 --> 00:09:57,806 -కరీసా దగ్గర మంచి బోర్డు ఉంది. -చూశా. 159 00:10:01,185 --> 00:10:04,855 గత ఏడాది పోటీలను గుర్తు చేసుకుంటే, అది ప్రపంచ టైటిల్ కాకపోయినా సరే, 160 00:10:04,938 --> 00:10:06,565 ఆమె విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకుంది. 161 00:10:06,648 --> 00:10:09,401 కానీ ప్రస్తుతం, వాటన్నంటినీ ఆమె పరిగణనలోకి తీసుకోబోదు. 162 00:10:09,985 --> 00:10:14,573 నేనొక సాధారణమైన జంటగా, ఆమెకు మద్దతు ఇచ్చేందుకు వచ్చాను. 163 00:10:16,742 --> 00:10:17,993 ఓ దేవుడా! 164 00:10:18,619 --> 00:10:20,913 పోటీల ప్రారంభానికి ముందు, ఈవెంట్ లో భాగంగా, 165 00:10:20,996 --> 00:10:22,456 మహిళల డ్రా జరుగుతోంది. 166 00:10:22,539 --> 00:10:27,127 తాతియానా వెస్టన్-వెబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన మొయినా జోన్స్ వాంగ్ ను ఢీకొంటుంది. 167 00:10:27,211 --> 00:10:31,048 నీకు గుర్తుందా, మనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన తండ్రులు మనల్ని అక్కడికి తీసుకెళ్ళారు, 168 00:10:31,131 --> 00:10:33,133 క్రిస్మస్ రోజున అనుకుంటా కదా? మనిద్దరమే వెళ్లాం కదా? 169 00:10:33,217 --> 00:10:35,010 మొయినా జోన్స్ వాంగ్ పైప్ లైన్ లోకల్ మరియు వైల్డ్ కార్డ్ 170 00:10:35,093 --> 00:10:37,262 నువ్వూ నేనూ 12 అడుగుల ఎత్తున్న అలపైకి వెళ్లాం, 171 00:10:37,346 --> 00:10:39,264 పూర్తిగా దానిలోకి వెళ్లిపోయాం అనుకున్నాం, "ఓ, మనం లోపలకి వెళ్ళాం" 172 00:10:40,265 --> 00:10:41,517 అని మనం అనుకున్నాం. 173 00:10:45,270 --> 00:10:47,105 వైల్డ్ కార్డ్ అంటే, డ్రాలో ఉంటారు గానీ… 174 00:10:47,189 --> 00:10:48,023 జెస్సీ మైలీ-డయర్ 175 00:10:48,106 --> 00:10:49,274 టూర్స్ ఎస్.వి.పి మరియు పోటీల హెడ్ 176 00:10:49,358 --> 00:10:52,611 …పూర్తిస్థాయి టూర్ క్రీడాకారులు కారు, కానీ వాళ్లు స్పాట్ స్పెషలిస్టులు, 177 00:10:52,694 --> 00:10:54,321 అలల గురించి వారికి బాగా తెలుస్తుంది. 178 00:10:54,404 --> 00:10:58,784 వైల్డ్ కార్డు పొందేవారికి సర్ఫింగ్ ఒక వ్యాపకం మాత్రమే. 179 00:10:58,867 --> 00:11:01,870 అది వాళ్ల కెరీర్ కాదు. సరదాగా పాల్గొనే అథ్లెట్లు మాత్రమే. 180 00:11:01,954 --> 00:11:04,831 వాళ్లని తీసుకొచ్చేది అందుకే, వాళ్లని వైల్డ్ కార్డ్ అని కూడా అందుకే అంటాం. 181 00:11:05,457 --> 00:11:09,545 పైప్ కోసం మొయినాను నేనే ఎంపిక చేశాను. ఆమె పైప్ స్పెషలిస్ట్. 182 00:11:09,628 --> 00:11:12,381 ఈ పోటీలు తమ కెరీర్ లోను, తమ జీవితాలలోనూ కూడా 183 00:11:12,464 --> 00:11:16,176 మార్పు తీసుకొస్తాయని వైల్డ్ కార్డ్ క్రీడాకారులు భావిస్తారు. 184 00:11:16,677 --> 00:11:17,803 -అవును. -ప్రయత్నించి చూడు… 185 00:11:17,886 --> 00:11:19,721 ఈ పోటీ ఆసక్తిదాయకంగా మారింది, ఎందుకంటే 186 00:11:19,805 --> 00:11:22,641 వీళ్లు ఒకరితో ఒకరు గట్టిగా పోటీపడతారు. 187 00:11:22,724 --> 00:11:25,811 హోరాహోరీ సాగుతుంది, మొయినా, తాతిలకు ఎంతో చరిత్ర ఉంది, 188 00:11:25,894 --> 00:11:29,273 ఇద్దరూ నువ్వా నేనా అనే విధంగా పోటీ పడతారు. 189 00:11:32,234 --> 00:11:36,321 2021లో పైప్ లైన్ లో నేను ఒక పొరబాటు చేశాను. 190 00:11:36,405 --> 00:11:38,866 ఆ రోజు చాలాసేపు సర్ఫింగ్ చేశాను. 191 00:11:38,949 --> 00:11:41,660 నేను పొరబాటున మొయినా సర్ఫ్ చేస్తున్న అలపైకే వచ్చేశాను. 192 00:11:41,743 --> 00:11:43,203 నిజానికి ఆ అలను ఎంచుకోవడం పొరబాటు. 193 00:11:43,287 --> 00:11:46,331 నేను ముందుకే వెళ్లాను, అప్పటికి అదే అలపై మరొకరు సర్ఫ్ చేస్తున్నట్లు తెలియదు, 194 00:11:46,415 --> 00:11:49,585 అందుకు తనెంతో బాధపడింది. 195 00:11:51,920 --> 00:11:54,798 తను తన బోర్డును ఇసుకలోనే వదిలేసి, నా వద్దకు పరుగెత్తుకు వచ్చింది 196 00:11:54,882 --> 00:11:58,468 నన్ను కొట్టేందుకు ప్రయత్నించింది. "కావాలనే అలా చేశావు" అంటూ తిట్టింది. 197 00:12:00,053 --> 00:12:01,805 సామాజిక మాధ్యమాల్లోనూ నన్ను దుమ్మెత్తిపోసింది. 198 00:12:01,889 --> 00:12:02,723 మొయినా.17 199 00:12:02,806 --> 00:12:04,308 దీనినే మూర్ఖత్వం అంటారు 200 00:12:04,391 --> 00:12:06,393 నేను చేసిన ఒక చిన్న పొరబాటుకు 201 00:12:06,476 --> 00:12:07,978 జనం నన్ను అవహేళన చేయడం మొదలుపెట్టారు. 202 00:12:08,061 --> 00:12:09,938 ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం చాలా ప్రమాదకరం 203 00:12:10,022 --> 00:12:14,318 పైప్ వద్ద నేను చాలా హుషారుగా ఉంటాను. నేను చిన్నదాన్నని, అందంగా ఉంటాననీ నాకు తెలుసు 204 00:12:14,401 --> 00:12:17,571 నేనేదో సాధిస్తానని ఎవరూ అనుకోరు కానీ నాకు మరో పార్శ్వం కూడా ఉంది. 205 00:12:17,654 --> 00:12:19,656 నువ్వు నన్ను కెలికితే, 206 00:12:19,740 --> 00:12:21,575 "నేను నీవెంట పడతాను." 207 00:12:23,660 --> 00:12:25,537 అలపై విన్యాసాన్ని త్వరగా ముగిద్దామని అనుకోకు. 208 00:12:25,621 --> 00:12:27,623 బ్యారెల్ లో విన్యాసం ముగిశాక ఇక చాలునని అనుకోకు. 209 00:12:27,706 --> 00:12:29,541 -దానిపైనే ఉండు. -అలాగే. 210 00:12:29,625 --> 00:12:33,212 అదీ వాళ్లు చెప్పేది. న్యాయ నిర్ణేతలు ఎలా ఆలోచిస్తారో వారు చెప్పారు. 211 00:12:33,295 --> 00:12:35,380 -సరేనా? -అలాగే. 212 00:12:35,964 --> 00:12:37,716 -నేను కొత్త క్రీడా దుస్తులు… -అలాగే. 213 00:12:37,799 --> 00:12:39,510 …పరికరాలు తీసుకెళ్తాను. 214 00:12:39,593 --> 00:12:40,594 సరే. 215 00:12:45,641 --> 00:12:48,310 నీకు తొమ్మిది నిముషాల సమయం ఉంది. అది చాలా ఎక్కువ. 216 00:12:49,186 --> 00:12:51,522 -ఈ బోర్డు తీసుకురానా? -అలాగే. 217 00:12:51,605 --> 00:12:54,691 తాతి, తనకు దూకుడు ఎక్కువ. పట్టుదల కూడా ఎక్కువే. 218 00:12:55,275 --> 00:12:58,695 ఈ టూర్ లో అందరికంటే ఆమెకే పట్టుదల ఎక్కువని చెప్పగలను. 219 00:12:58,779 --> 00:13:03,450 తనేమీ భయపడలేదు. మొయినాలాంటి వారికి తను తలవంచదు. 220 00:13:09,498 --> 00:13:13,335 పోటీ మొదలవుతోంది. ఈ హీట్ హోరాహోరీ జరగబోతోంది. 221 00:13:13,418 --> 00:13:15,921 తాతియానా వెస్టన్-వెబ్ మరియు మొయినా జోన్స్ వాంగ్ 222 00:13:16,004 --> 00:13:18,090 ఈ పోటీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని చూడటం భలే సరదాగా ఉంది. 223 00:13:18,674 --> 00:13:21,426 మొయినాకు ఇక్కడి లైనప్ బాగా తెలుసు. పైప్ లైన్ కి అంకితమైన మహిళల్లో 224 00:13:21,510 --> 00:13:26,723 తను ఒకతె. ఇక్కడి లోటుపాట్లన్నీ ఆమెకు బాగా తెలుసు. 225 00:13:27,558 --> 00:13:30,227 ఇది చాలా క్లిష్టమైన హీట్. తాతికి ఇదొక సవాలు. 226 00:13:33,856 --> 00:13:37,401 అందరికంటే మొయినాయే పైప్ వద్ద ఎక్కువ సర్ఫ్ చేసింది. 227 00:13:42,823 --> 00:13:44,658 కానీ నేను నాపైనే దృష్టి సారించాలి. 228 00:13:46,827 --> 00:13:47,828 మొదటి రౌండ్ 229 00:13:47,911 --> 00:13:49,413 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ మొయినా జోన్స్ వాంగ్ 230 00:13:50,414 --> 00:13:53,000 పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. 231 00:13:54,501 --> 00:13:56,128 ఇది మంచి పరిణామం. 232 00:13:56,211 --> 00:13:57,379 పద, తాతి, పద. 233 00:13:58,255 --> 00:13:59,339 అదిగో తను. 234 00:14:00,299 --> 00:14:02,926 తాతియానా వెస్టన్-వెబ్, అదిగో తను. పైప్ లైన్. 235 00:14:06,263 --> 00:14:08,223 -అదీ, అలాగ. -అదీ, ముందుకు పద. 236 00:14:08,307 --> 00:14:09,516 అది మంచి అల. 237 00:14:10,100 --> 00:14:15,314 మొయినా, తాతియానా విభిన్నమైన మహిళలు, ఇద్దరూ ఖాళీగా ఉండే ఎడమ చేతివైపు బ్యారెళ్ళను ఇష్టపడతారు. 238 00:14:18,400 --> 00:14:20,152 ఇలాంటి విన్యాసాలు వారికి వెన్నతో పెట్టిన విద్య. 239 00:14:23,363 --> 00:14:24,656 జోన్స్ వాంగ్: 7.00 వెస్టన్-వెబ్: 4.44 240 00:14:24,740 --> 00:14:27,117 తాతియానా వెస్టన్-వెబ్ పై 241 00:14:27,201 --> 00:14:30,370 మొయినా జోన్స్ వాంగ్ కు ఆధిక్యం లభించేలా ఉంది. 242 00:14:32,497 --> 00:14:36,210 తాతి, క్రమంగా పుంజుకుంటోంది. 243 00:14:36,293 --> 00:14:39,004 తాతి సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఆమె మొహంపై చిరునవ్వు కనబడుతూ ఉంటుంది. 244 00:14:39,087 --> 00:14:41,173 కానీ ప్రస్తుతం తను చాలా సీరియస్ గా ఉంది. 245 00:14:41,798 --> 00:14:43,800 భారీ స్కోరు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. 246 00:14:43,884 --> 00:14:44,885 జడ్జీల గది 247 00:14:44,968 --> 00:14:47,095 ఇప్పటిదాకా ఎవరూ పెద్ద స్కోరు సాధించలేదు. 248 00:14:47,846 --> 00:14:52,601 భారీ స్కోరు సాధించేందుకు ఒక అసలు సిసలైన అల… 249 00:14:52,684 --> 00:14:53,852 ప్రీతమో అహ్రెంట్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రధాన జడ్జ్ 250 00:14:53,936 --> 00:14:56,688 …ఒక లోతైన బ్యారెల్ లభిస్తే చాలు. 251 00:14:56,772 --> 00:14:59,858 అదిగో, తాతి ముందుకు వెళ్తోంది. భారీ స్కోరు సాధించేందుకు 252 00:14:59,942 --> 00:15:01,985 ఎలాంటి అలనైనా అధిరోహించేందుకు సిద్ధంగా ఉంది. 253 00:15:02,069 --> 00:15:04,238 -తనకు కావలసింది ఒక చక్కటి అల, అంతే. -బాబోయ్, ఆ రేసు… 254 00:15:06,490 --> 00:15:08,367 వెళ్లు, తాతి, సాధించు! 255 00:15:08,951 --> 00:15:12,538 తాతియానా వెస్టన్-వెబ్ బ్యారెల్ లోకి ప్రవేశించింది… 256 00:15:14,790 --> 00:15:15,624 అయ్యో. 257 00:15:16,625 --> 00:15:19,253 ఆ అల విరిగి పడబోతోంది. 258 00:15:27,803 --> 00:15:30,264 ఆ అలలో చాలా శక్తి దాగి ఉంది, 259 00:15:30,347 --> 00:15:34,476 తాతి పైకి లేస్తుందోమో జాగ్రత్తగా గమనించాలి. 260 00:15:38,146 --> 00:15:42,234 పైప్ లైన్ వద్ద తక్కువ లోతులో ఉండే కొండరాళ్లు చాలా ప్రమాదకరమైనవి. 261 00:15:53,245 --> 00:15:59,042 మిత్రులారా, అది చాలా తీవ్రమైనది, విధ్వంసకరమైనది. 262 00:16:00,502 --> 00:16:02,045 -అది పెద్ద పొరబాటు. -అవును. 263 00:16:02,629 --> 00:16:03,964 తను పట్టు తప్పి పడిపోయింది. 264 00:16:05,007 --> 00:16:07,092 ఆ కెరటం తర్వాత, తాతియానా, తీరానికి చేరుకుంటోంది. 265 00:16:07,176 --> 00:16:10,012 నిస్పృహతో తల విదిలిస్తోంది, తనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. 266 00:16:10,929 --> 00:16:12,598 అదిగో. 267 00:16:12,681 --> 00:16:15,809 మొయినా జోన్స్ కోసం అవకాశం వెదుక్కుంటూ వస్తోంది. 268 00:16:16,351 --> 00:16:18,937 తను ఆ అలపైకి వెళ్తోంది. 269 00:16:34,077 --> 00:16:36,788 హీట్ ను భారీ ఆధిక్యంతో ముగించబోతోంది. 270 00:16:37,706 --> 00:16:41,418 కౌంట్ డౌన్ ముగిసేలోగా, తన అధిక్యాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 271 00:16:42,544 --> 00:16:43,754 హవాయి వైల్డ్ కార్డ్… 272 00:16:43,837 --> 00:16:45,172 జోన్స్ వాంగ్: 10.77 వెస్టన్-వెబ్: 9.44 273 00:16:45,255 --> 00:16:49,801 …మొయినా జోన్స్ వాంగ్ రెండో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 274 00:16:50,302 --> 00:16:52,763 తను దారుణంగా ఓడిపోయింది. 275 00:17:06,401 --> 00:17:11,114 ఇది చాలా ఘోరం. ఒక వైల్డ్ కార్డ్ పై ఓడిపోకుండా ఉండాల్సింది. 276 00:17:11,198 --> 00:17:13,075 -సరే, ఫరవాలేదు. -ధన్యవాదాలు. 277 00:17:13,157 --> 00:17:15,285 …చిన్న అమ్మాయి పోటీల్లోనే ఎదుగుతూ వచ్చింది… 278 00:17:15,368 --> 00:17:17,204 నిజానికి హెల్మెట్ పెట్టుకున్నాను. 279 00:17:19,122 --> 00:17:20,582 ధన్యవాదాలు, మిత్రులారా. 280 00:17:20,665 --> 00:17:21,875 భలేగా ఉంది. 281 00:17:26,713 --> 00:17:29,174 తాతి తన సత్తా ఏమిటో తను తెలుసుకోవట్లేదు. 282 00:17:29,258 --> 00:17:31,718 తనొక సర్ఫర్, ప్రత్యేకించి పైప్ వద్ద ఎగసిపడే అలలపై… 283 00:17:31,802 --> 00:17:32,803 షానన్ హ్యూస్ సర్ఫ్ జర్నలిస్ట్ 284 00:17:32,886 --> 00:17:34,179 …ఆమె బాగా చేస్తుందని అంతా భావించారు. 285 00:17:34,263 --> 00:17:38,892 తను నెమ్మదిగా ప్రారంభించి, ఆ తర్వాత పుంజుకోకపోతే, 286 00:17:39,768 --> 00:17:41,937 తను నిరుత్సాహ పడటం సహజం. 287 00:17:43,313 --> 00:17:44,982 ఇది చాలా క్లిష్టమైన పోటీ. 288 00:17:45,065 --> 00:17:47,651 -ఒక్క పొరబాటు. -అవును. 289 00:17:47,734 --> 00:17:49,486 సరైన అల ఒక్కటి దొరికితే బాగుండేది. 290 00:17:49,570 --> 00:17:51,530 అవును. నేను చూశాను. అంతా గమనించాను. 291 00:17:51,613 --> 00:17:53,574 కానీ, ఆ అల దొరికే సమయానికి, 292 00:17:53,657 --> 00:17:54,783 -నేను… -అబ్బా. 293 00:17:54,867 --> 00:17:58,161 తనకొక చక్కటి అల దొరికింది. 294 00:18:00,038 --> 00:18:04,001 ఇది చాలా దారుణం. నాకు ఎలా అనిపిస్తోందంటే… 295 00:18:13,177 --> 00:18:17,598 తాతిపై ఎంత ఒత్తిడి ఉందో నాకు తెలుసు. అది కనబడుతోంది కూడా. 296 00:18:18,348 --> 00:18:20,809 పోటీలు ఎలా జరుగుతాయనే విషయమై చాలా అంచనాలు ఉన్నాయి. 297 00:18:20,893 --> 00:18:23,604 బరిలోకి దిగుతున్న కొత్త అమ్మాయిల్లో చాలామంది ఎంతో ప్రతిభ గలవారు. 298 00:18:24,563 --> 00:18:27,191 తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఆమె… 299 00:18:27,274 --> 00:18:29,401 బహుశా తనకు సరిగ్గా ఏకాగ్రత కుదరలేదేమో. 300 00:18:40,120 --> 00:18:41,288 ఇదిగో. 301 00:18:41,371 --> 00:18:43,207 మీ బిల్లబోంగ్ ప్రో మహిళల పైప్ లైన్ ఫైనల్స్ మొదలవుతున్నాయి. 302 00:18:43,290 --> 00:18:44,833 కరీసా మూర్ వర్సెస్ మొయినా జోన్స్ వాంగ్ 303 00:18:51,298 --> 00:18:56,220 అబ్బో, భలే పోటీ. వైల్డ్ కార్డ్ మొయినా జోన్స్ వాంగ్, 304 00:18:56,303 --> 00:18:59,723 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ కరీసా మూర్ ను ఢీకొంటోంది. 305 00:19:00,641 --> 00:19:03,852 తను ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో టైలర్ రైట్ ను ఓడించింది. 306 00:19:03,936 --> 00:19:07,481 కాబట్టి, ఉత్తర తీరానికి చెందిన ఈ స్థానికురాలి కలలు కొనసాగుతున్నట్లే అర్ధం. 307 00:19:08,065 --> 00:19:11,652 కరీసా మూర్ ఇప్పుడు గట్టెక్కుతుందా? 308 00:19:11,735 --> 00:19:14,905 అదిగో, వైల్డ్ కార్డ్ మొయినా జోన్స్ వాంగ్… 309 00:19:14,988 --> 00:19:16,114 -అవును. -…ముందుకెళ్తోంది. 310 00:19:16,615 --> 00:19:18,534 నేను ఫైనల్లో ఆడాలనుకున్నాను, 311 00:19:18,617 --> 00:19:21,161 దీనికి అసూయ అనేదే సరైన పదం. 312 00:19:21,662 --> 00:19:23,997 -అదిగో, బాగుంది. -మొయినా! 313 00:19:24,081 --> 00:19:27,709 చక్కటి డ్రాప్, అల అంచుపైనుంచి నెమ్మదిగా దిగుతోంది. 314 00:19:27,793 --> 00:19:30,003 -మనం కోరుకున్నది అదే. -బాగుంది. 315 00:19:31,630 --> 00:19:33,757 తనను ఇక పైప్ లైన్ రాణి అనవచ్చునా? 316 00:19:33,841 --> 00:19:35,717 -పూర్తయింది. -ఐదు, నాలుగు… 317 00:19:35,801 --> 00:19:38,720 -మూడు, రెండు, ఒకటి. -మూడు, రెండు, ఒకటి. 318 00:19:39,304 --> 00:19:44,852 బిల్లబోంగ్ ప్రో పైప్ లైన్ ను మొయినా జోన్స్ వాంగ్ గెలుచుకుంది. 319 00:19:44,935 --> 00:19:48,438 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కరీసా మూర్ ను తను ఓడించింది. 320 00:19:49,273 --> 00:19:51,525 నామీద ఒత్తిడి మొదలైంది, 321 00:19:51,608 --> 00:19:56,280 ఎందుకంటే బరిలో ఉండాలంటే ప్రతి పాయింటూ విలువైనదే ఇక. 322 00:20:01,910 --> 00:20:05,914 ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇకపై పోటీలో కొనసాగాలంటే అర్హత పాయింట్లు సంపాదించాలి. 323 00:20:08,041 --> 00:20:10,919 ఖచ్చితంగా ఈ విధానం చాలా వివాదాస్పదమైంది. 324 00:20:11,837 --> 00:20:14,423 కానీ టూర్లో ఇది చాలా ముఖ్యమైనది. 325 00:20:15,257 --> 00:20:17,092 ఐదు ఈవెంట్ల తర్వాత… 326 00:20:19,094 --> 00:20:25,017 చివరకు 22 మంది పురుషులు, పది మంది మహిళలు బరిలో మిగిలారు. 327 00:20:26,268 --> 00:20:27,936 అందరూ ఇళ్లకు వెళ్తున్నారు. 328 00:20:28,020 --> 00:20:29,438 ఇది చాలా బాధాకరమైనది. 329 00:20:30,856 --> 00:20:33,066 ఆరంభంలోనే బాగా ఆడాల్సి ఉంటుంది. 330 00:20:33,150 --> 00:20:36,403 ఎందుకంటే, ఈ ఈవెంట్లలో బాగా ఆడకపోతే, మీ పని అయిపోయినట్లే. 331 00:20:38,322 --> 00:20:41,033 కావలసిన పాయింట్లు సాధించకపోతే, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. 332 00:20:41,116 --> 00:20:42,618 స్టెఫనీ గిల్మోర్ 7సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ ఛాంపియన్ 333 00:20:42,701 --> 00:20:44,286 నీ కెరీర్ పై అది పెద్ద మచ్చగా మిగులుతుంది. 334 00:20:45,329 --> 00:20:47,748 ఆ పాయింట్ల పద్ధతి ఉండకూడదనే అందరూ కోరుకుంటారు… 335 00:20:47,831 --> 00:20:49,541 ఫిలిపే టోలెడో ప్రస్తుత ప్రపంచ నంబర్ 9 336 00:20:49,625 --> 00:20:51,418 …ఎందుకంటే, చాలామందికి ఆ పద్ధతి నచ్చదు. 337 00:20:52,127 --> 00:20:53,378 ఈ ఫార్మాట్ అంటే నాకు ఇష్టం లేదు. 338 00:20:53,462 --> 00:20:54,546 లేకీ పీటర్సన్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 3 339 00:20:54,630 --> 00:20:56,798 టూర్ లో ఉన్న ప్రతి క్రీడాకారుడూ ఏడాది పొడవునా టూర్లో కొనసాగేందుకు 340 00:20:56,882 --> 00:20:57,883 అర్హత సాధించినట్లే లెక్క. 341 00:20:57,966 --> 00:20:59,092 ఈ పద్ధతి మంచిదే. 342 00:20:59,843 --> 00:21:02,179 మొదటి ఐదు ఈవెంట్లకూ ఈ పద్ధతి ఎంతో విలువ ఇస్తుంది. 343 00:21:02,262 --> 00:21:05,015 తక్కువ సీడింగ్ ఉన్న ఆటగాళ్లు బరిలో ఉండరు… 344 00:21:05,098 --> 00:21:06,308 కనోవా ఇగరషి ప్రస్తుత ప్రపంచ నంబర్ 5 345 00:21:06,391 --> 00:21:09,520 …అంటే అసలైన పోటీకే ఆస్కారం ఉంటుంది కదా. 346 00:21:09,603 --> 00:21:10,687 మోర్గన్ సిబిలిక్ ప్రస్తుత ప్రపంచ నంబర్ 33 347 00:21:10,771 --> 00:21:13,357 ఏమో మరి. నా లక్ష్యం దానికంటే ఎక్కువే. 348 00:21:13,440 --> 00:21:14,399 కానీ ఈ ఫార్మాట్ చెత్తది. 349 00:21:15,192 --> 00:21:17,027 ఈ ఏడాది చాలా విభిన్నంగా ఉంది. 350 00:21:17,861 --> 00:21:19,446 ఇలాంటి పద్ధతి ఇంతకుముందు లేదు. 351 00:21:20,572 --> 00:21:22,866 దీనివల్ల ఆరంభంలో చాలా ఒత్తిడి ఉంటుంది. 352 00:21:22,950 --> 00:21:25,577 కానీ ఇప్పుడు, మనుగడకోసం పోటీ పడక తప్పదు. 353 00:21:26,245 --> 00:21:28,580 మిగిలిన సగం ఏడాదిలో కష్టపడాలి. 354 00:21:33,043 --> 00:21:35,546 హవాయి సన్సెట్ బీచ్, ఓహు 355 00:21:40,759 --> 00:21:42,386 సన్సెట్ బీచ్ ఓహు, హవాయి 356 00:21:42,469 --> 00:21:44,304 హర్లీ ప్రో సన్సెట్ బీచ్, 357 00:21:44,388 --> 00:21:46,014 షీసిడో సమర్పణలో పోటీలు మొదలవబోతున్నాయి. 358 00:21:46,098 --> 00:21:47,224 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ 10లో 2 359 00:21:47,850 --> 00:21:51,645 ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే మొయినా జోన్స్ వాంగ్ ను 360 00:21:51,728 --> 00:21:53,188 ఈ రోజు పోటీ నుంచి తప్పించారు. 361 00:21:54,481 --> 00:21:55,649 ఇది చాలా దారుణం. 362 00:21:55,732 --> 00:21:57,776 నువ్వు తప్పకుండా ఈ హీట్ లో గెలుస్తావనుకున్నాను. 363 00:21:57,860 --> 00:21:59,695 ఫరవాలేదు. వాళ్లు నిన్ను తక్కువ అంచనా వేశారు. 364 00:21:59,778 --> 00:22:02,489 -తెలుసు, అయినా ఫరవాలేదులే. -తక్కువ అంచనా వేసి తప్పు చేశారు. 365 00:22:02,573 --> 00:22:03,574 తెహొటు వాంగ్ మొయినా భర్త 366 00:22:05,075 --> 00:22:06,702 మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 367 00:22:06,785 --> 00:22:11,498 ఐదుసార్లు ఛాంపియన్ అయిన కరీసా మూర్ ఈ రోజు తొలి హీట్ లోనే బరిలోకి దిగుతోంది, 368 00:22:11,582 --> 00:22:14,001 ఫేవరెట్లలో ఆమె కూడా ఒకతె. 369 00:22:14,084 --> 00:22:16,170 రెండో హీట్ మొదలవుతోంది. 370 00:22:16,253 --> 00:22:19,548 ఎర్ర రంగు జెర్సీలో తాతియానా వెస్టన్-వెబ్. 371 00:22:19,631 --> 00:22:23,218 అవును, ఈ ఈవెంట్లను పరిగణనలోకి తీసుకునే మిడ్ ఇయర్ కట్ గురించి 372 00:22:23,302 --> 00:22:24,636 మనం మాట్లాడుకుంటున్నాం. 373 00:22:24,720 --> 00:22:28,515 తనంటే ఏంటో నిరూపించుకునేందుకు ఇది తాతియానాకు సరైన చోటు. 374 00:22:29,683 --> 00:22:30,684 మొదటి రౌండ్ 375 00:22:30,767 --> 00:22:32,186 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లూనా సిల్వా 376 00:22:33,437 --> 00:22:35,564 తాతియానా వెస్టన్-వెబ్. 377 00:22:35,647 --> 00:22:38,400 ఆమెకు అలలు సహకరించట్లేదు. 378 00:22:47,201 --> 00:22:48,202 జడ్జీల గది 379 00:22:48,911 --> 00:22:50,120 అయ్యో. 380 00:22:50,204 --> 00:22:51,914 దగ్గర్లో ఉన్న వైద్య బృందం త్వరగా వెళ్లాలి. 381 00:22:53,165 --> 00:22:56,376 అల తాకిడికి ఆమె మోకాలికి దెబ్బ తగిలినట్లుంది. 382 00:22:56,460 --> 00:22:59,129 12.66. ట్రిపుల్ 8 ఆధిక్యంలో ఉన్నారు. 383 00:23:01,256 --> 00:23:02,466 చాలా నొప్పిగా ఉంది. 384 00:23:03,133 --> 00:23:05,135 నాకు తెలుసు. ఈ కుడి పక్కన కదా? 385 00:23:05,219 --> 00:23:07,054 -అవును. -సరే. 386 00:23:07,137 --> 00:23:10,224 -నీకేం కాలేదుగా? -ఆ అల తాకిడికి మోకాలికి గాయమైంది. 387 00:23:10,307 --> 00:23:11,558 ఏం జరిగింది? 388 00:23:11,642 --> 00:23:13,185 ఆ అల నా వీపును బలంగా తాకింది, 389 00:23:13,268 --> 00:23:16,271 ఆ తాకిడికి నేను ముందుకు 390 00:23:16,355 --> 00:23:18,857 -నా మోకాలు లోపలకు నొక్కుకుపోయింది. -ఓహో. 391 00:23:19,566 --> 00:23:21,693 -మధ్యలో. -సరే, ఈ మధ్య భాగంలో… 392 00:23:21,777 --> 00:23:22,986 -అవును, కుడివైపు. -సరే, ఇక్కడ? 393 00:23:23,070 --> 00:23:26,448 ఇది ఎమ్.సి.ఎల్. వంటిది. మరో రకంగా చెప్పాలంటే… 394 00:23:26,532 --> 00:23:28,158 -ఏంటది? -ఎమ్.సి.ఎల్. 395 00:23:28,242 --> 00:23:29,326 -సరే. -ఎమ్.సి.ఎల్. 396 00:23:29,409 --> 00:23:31,870 ప్రస్తుతానికి కదలకుండా ఉండటమే మంచిది. 397 00:23:34,581 --> 00:23:37,084 -నీకేం కాదు, తాతీ. త్వరగానే కోలుకుంటావు. -నేను బాగానే ఉన్నాను. 398 00:23:38,544 --> 00:23:40,170 ఒక్కొక్క అడుగే వెయ్యి. 399 00:23:41,630 --> 00:23:43,715 నన్ను క్షమించు బేబ్. నీ గురించి నాకు తెలుసు. 400 00:23:47,928 --> 00:23:51,056 కరీసా మూర్ ఈ పోటీలో ఓడిపోయింది. 401 00:23:51,139 --> 00:23:55,018 కొత్తగా బరిలోకి దిగిన మోలీ పిక్లమ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. 402 00:23:55,102 --> 00:23:57,312 మరొక ఊహించని పరాజయం. 403 00:23:58,605 --> 00:24:00,357 తను చాలా నిరుత్సాహపడింది. 404 00:24:02,109 --> 00:24:04,570 అవును, కానీ తను గాయపడలేదు. 405 00:24:10,075 --> 00:24:11,118 మళ్లీ కలుద్దాం. 406 00:24:11,201 --> 00:24:15,205 సన్సెట్ పోటీల తర్వాత, నా ర్యాంక్ 14కు పడిపోయింది. 407 00:24:15,789 --> 00:24:17,708 తదుపరి ఈవెంట్లలో నేను పోటీ పడకపోతే, 408 00:24:18,292 --> 00:24:21,587 నాకు కావలసిన అర్హత పాయింట్లు లభించకపోవచ్చు. 409 00:24:21,670 --> 00:24:23,672 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ 410 00:24:24,756 --> 00:24:27,134 14 తాతియానా వెస్టన్-వెబ్ 411 00:24:30,554 --> 00:24:32,097 -ఐ లవ్ యూ. -నాకూ నువ్వంటే ఇష్టం. 412 00:24:32,181 --> 00:24:33,682 తన కెరీర్ ప్రమాదంలో పడింది. 413 00:24:33,765 --> 00:24:35,058 దీనిని నువ్వు హ్యాండిల్ చేయగలవు. 414 00:24:35,142 --> 00:24:37,603 ఆమె అర్హత పాయింట్లు తగ్గిపోయాయి. తనకు గాయమైంది. 415 00:24:37,686 --> 00:24:40,480 వచ్చే ఏడాది తను పోటీ చేయలేదు. 416 00:24:40,564 --> 00:24:41,940 మిడ్ సీజన్ కట్ ను తను దాటలేదు. 417 00:24:42,024 --> 00:24:45,569 అంటే 2023 ఛాంపియన్ షిప్ టూర్ కు తను అర్హత సాధించలేదు. 418 00:24:47,738 --> 00:24:49,281 ఇది తాతియానాకు తట్టుకోలేని దెబ్బ. 419 00:24:53,785 --> 00:24:57,080 రెండు వారాల తర్వాత 420 00:25:02,252 --> 00:25:03,921 నేను నీళ్లలోకి దిగి రెండు వారాలైంది. 421 00:25:05,005 --> 00:25:09,134 ఇక ఈ ఏడాది పోటీ చేయలేననే నిజం నన్ను వణికిస్తోంది. 422 00:25:09,718 --> 00:25:12,221 ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్న పరిణామం. 423 00:25:12,304 --> 00:25:14,515 -హాయ్. హాయ్. -హల్లో, ఎలా ఉన్నావు? 424 00:25:14,598 --> 00:25:16,266 బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? 425 00:25:17,643 --> 00:25:22,689 -అంతా బాగానే ఉందా? -నిన్న చాలా నొప్పిపెట్టింది. 426 00:25:22,773 --> 00:25:23,774 టామ్ అలన్ ఎముకల నిపుణుడు 427 00:25:23,857 --> 00:25:26,151 అయితే ఇవాళ తేలికపాటి వైద్యం మాత్రమే చేద్దాం. 428 00:25:27,069 --> 00:25:29,738 మోకాలిని నీ తలవైపుకి వంచు. 429 00:25:29,821 --> 00:25:30,822 ఓకే. 430 00:25:31,323 --> 00:25:32,324 ఇలా ఫరవాలేదా? 431 00:25:33,158 --> 00:25:35,327 మోకాలిని ఇలా లోపలకు తీసుకుంటుంటే నొప్పిగా ఉంది. 432 00:25:35,410 --> 00:25:36,245 ఓహో. 433 00:25:36,328 --> 00:25:39,039 నిజం చెప్పాలంటే ఒత్తిడి వల్లనే నొప్పి వస్తోంది. 434 00:25:39,122 --> 00:25:40,249 కావచ్చు. 435 00:25:40,332 --> 00:25:43,252 మిడ్ ఇయర్ కట్ వల్ల ఉపయోగం ఏమీ లేదని నా అభిప్రాయం. 436 00:25:43,752 --> 00:25:46,046 నీ మానసిక స్థితి సరిగా లేనప్పుడు, 437 00:25:46,129 --> 00:25:48,173 ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న తలెత్తుతుంది. 438 00:25:48,257 --> 00:25:54,263 పూర్తిస్థాయిలో ఆడాలనుకోవడం మళ్లీ ఎవరి చేతిలోనైనా 439 00:25:54,346 --> 00:25:57,057 ఓడిపోయేందుకేనా? 440 00:25:57,140 --> 00:26:01,395 అలా కాకూడదనుకుంటే నువ్వు మానసికంగా, శారీరికంగా పూర్తిగా కోలుకోవాలి. 441 00:26:02,271 --> 00:26:04,523 ఏదో ఒక రోజు ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఇప్పటికీ అనుకుంటున్నాను. 442 00:26:05,065 --> 00:26:06,400 సరే. 443 00:26:06,483 --> 00:26:09,695 కానీ మానసికంగా కోలుకోవడానికి నన్ను నేను సంసిద్ధం చేసుకోవలసి వచ్చింది. 444 00:26:09,778 --> 00:26:13,115 ఈ ఓటమితో ప్రపంచం అంతమైపోతుందా? కాదు. 445 00:26:13,198 --> 00:26:17,119 నేను ఇప్పటికీ మంచి సర్ఫర్ నేనా? వందశాతం. నేనేంటో నాకు తెలుసు. 446 00:26:17,202 --> 00:26:19,037 మళ్లీ సర్ఫింగ్ చేయాలని ఉంది. 447 00:26:19,121 --> 00:26:21,623 ఏమో మరి. సర్ఫింగ్ చేస్తుంటే నేను ఎంతో మంచిదాన్నని అనిపిస్తుంది. 448 00:26:21,707 --> 00:26:22,791 అవును. 449 00:26:26,545 --> 00:26:29,673 నేను ఎప్పటికీ యోధురాలినే. ఎప్పటికీ పోటీదారునే. 450 00:26:31,341 --> 00:26:36,972 నాలో ఉన్న అహాన్ని బయటకు పంపేసి బాగా కష్టపడాలి. 451 00:26:43,103 --> 00:26:44,104 నా పనిని నేనెంతో మిస్సయ్యాను. 452 00:26:45,105 --> 00:26:46,398 సర్ఫింగ్ ను కూడా మిస్సయ్యాను. 453 00:26:47,524 --> 00:26:51,195 పోర్చుగల్ వెళ్లి, మిడ్ ఇయర్ కట్ కు కావలసిన అర్హత పాయింట్లు సాధించాలి. 454 00:26:53,197 --> 00:26:54,198 నేను సిద్ధం. 455 00:26:55,490 --> 00:26:57,492 పోర్చుగల్ - పినిషి అట్లాంటిక్ సముద్రం 456 00:27:05,334 --> 00:27:08,337 పినిషి పోర్చుగల్ 457 00:27:09,463 --> 00:27:10,672 ఛాంపియన్ షిప్ టూర్ 10లో 3వ ఈవెంట్ 458 00:27:10,756 --> 00:27:13,425 గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ పోర్చుగల్ లోని పినిషెకి స్వాగతం. 459 00:27:13,509 --> 00:27:16,845 మీరంతా రిప్ కర్ల్ సమర్పిస్తున్న ఎంఇఓ ప్రో పోర్చుగల్ పోటీలు చూస్తున్నారు. 460 00:27:16,929 --> 00:27:20,265 ప్రపంచ సర్ఫ్ లీగ్ ఛాంపియన్ షిప్ టూర్ లో స్టాప్ నంబర్ 3 పోటీలు ఇవి. 461 00:27:20,349 --> 00:27:22,809 ఇవాళ చలి వణికిస్తోంది. 462 00:27:23,393 --> 00:27:26,939 నలభై ఆరు డిగ్రీల ఫారెన్ హీట్. ఎనిమిది డిగ్రీల సెల్సియస్. 463 00:27:27,022 --> 00:27:28,065 వాతావరణం బాగోలేదు. 464 00:27:28,148 --> 00:27:30,734 ఈ పరిస్థితిని చాలామంది ఊహించి ఉండరు. 465 00:27:32,736 --> 00:27:34,112 కానీ ఇదే పోర్చుగల్ అంటే మరి… 466 00:27:38,200 --> 00:27:39,201 ఇటలో ఫెర్రేరా ప్రపంచ నంబర్ 16 467 00:27:39,284 --> 00:27:41,495 వేడెక్కేందుకు కాసేపు ఇక్కడే ఉండు సోదరా. 468 00:27:41,578 --> 00:27:43,872 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, డాడీ! 469 00:27:47,835 --> 00:27:50,629 బ్యారెల్ లోకి వెళ్లి బయటకొస్తున్నాను చూడండి. 470 00:27:57,052 --> 00:27:59,555 ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కరీసా మూర్, 471 00:27:59,638 --> 00:28:00,639 శుభారంభం చేస్తోంది. 472 00:28:00,722 --> 00:28:05,018 తను ఫైనల్ కి చేరుకుంటే, పసుపు పచ్చ లీడర్ జెర్సీ తనకు లభిస్తుంది. 473 00:28:05,102 --> 00:28:06,228 ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. 474 00:28:06,854 --> 00:28:09,022 వెబ్ 475 00:28:11,108 --> 00:28:12,901 తాతియానాకు ఇది చాలా క్లిష్టమైన పోటీ. 476 00:28:14,862 --> 00:28:16,780 అలాంటి గాయం తగిలాక పూర్తిస్థాయిలో సత్తా చూపడం, 477 00:28:16,864 --> 00:28:18,156 చాలాకాలం తర్వాత బరిలోకి దిగినప్పుడు, 478 00:28:18,240 --> 00:28:21,577 శారీరికంగాను, మానసికంగానూ కూడా సవాలే. 479 00:28:23,370 --> 00:28:26,957 పోర్చుగల్ లో నా మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. 480 00:28:27,666 --> 00:28:32,171 నా గాయం కారణంగా కనీసం హీట్ లోనైనా గెలుస్తానో లేదో అనుమానమే. 481 00:28:33,881 --> 00:28:38,510 ప్రస్తుతానికి 100 శాతం గెలవాలన్నదే నా ధ్యేయం. 482 00:28:39,136 --> 00:28:40,387 ఎలాంటి పొరబాట్లూ చేయకూడదు. 483 00:28:40,971 --> 00:28:42,097 మొదటి రౌండ్ 484 00:28:42,181 --> 00:28:44,725 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లౌనా సిల్వా 485 00:28:48,437 --> 00:28:51,773 అదిగో తాతి. ఎడమవైపు అలపై చక్కటి విన్యాసం చేస్తోంది. 486 00:28:53,650 --> 00:28:55,485 ఏమాత్రం తగ్గడం లేదు. 487 00:28:57,196 --> 00:28:58,197 అదిగో, మళ్లీ తనే. 488 00:28:59,823 --> 00:29:02,034 దూకుడుగా సర్ఫింగ్ చేస్తోంది. 489 00:29:02,910 --> 00:29:04,244 అల అంచుపైకి నిటారుగా ఎక్కుతోంది. 490 00:29:05,662 --> 00:29:08,123 జడ్జీలకు ఇట్టే నచ్చుతుంది. 491 00:29:09,291 --> 00:29:10,501 తాతికి ఇది చాలా పెద్ద ఊరట. 492 00:29:10,584 --> 00:29:12,753 ర్యాంకింగ్స్ లో దిగజారిపోయిన తరుణంలో ఇది తనకు చాలా ఉపయోగపడుతుంది. 493 00:29:12,836 --> 00:29:13,837 వెస్టన్-వెబ్: 14.83 సిల్వా: 10.83 494 00:29:18,800 --> 00:29:19,801 గ్రెగ్ బ్రౌనింగ్ తాతియానా టీమ్ 495 00:29:19,885 --> 00:29:21,136 నాకు అర్ధం కాలేదు. 496 00:29:21,220 --> 00:29:24,473 -ఎలా చేశావు? -"నేను సాధించగలను" అనుకున్నానంతే. 497 00:29:24,556 --> 00:29:25,974 అద్భుతం. చాలా బాగా చేశావు. 498 00:29:27,434 --> 00:29:30,270 -పూర్తిస్థాయిలో సత్తా చూపా. -అవును. అద్భుతం. 499 00:29:30,354 --> 00:29:32,022 -ఎప్పుడూ సందేహించకు. -అలాగే. 500 00:29:32,105 --> 00:29:33,607 నువ్వు బాగా సర్ఫింగ్ చేశావు. 501 00:29:35,192 --> 00:29:36,401 క్వార్టర్ పైనల్ వెస్టన్-వెబ్ వర్సెస్ రాబిన్సన్ 502 00:29:36,485 --> 00:29:37,694 తాతియానా వెస్టన్-వెబ్, 503 00:29:37,778 --> 00:29:40,364 తను ఇప్పటికే ఈ ఏడాది చక్కటి ఫలితాలను రాబట్టింది. 504 00:29:40,447 --> 00:29:41,657 తను ప్రారంభించింది. 505 00:29:45,536 --> 00:29:46,537 మరొక పెద్ద అల. 506 00:29:47,329 --> 00:29:49,248 సురక్షితంగా ఆడాలని తను అనుకోవట్లేదు. 507 00:29:51,416 --> 00:29:54,336 ఎదురు దాడికి దిగాలనుకుంటోంది. ఆమె చేస్తున్నది అదే. 508 00:29:54,419 --> 00:29:57,130 ఈ సీజన్ లో మొట్టమొదటిసారి తాతియానా వెస్టన్-వెబ్, 509 00:29:57,214 --> 00:29:58,215 సెమీఫైనల్ కి చేరుకుంది. 510 00:29:58,298 --> 00:29:59,508 వెస్టన్-వెబ్: 14.66 రాబిన్సన్: 9.73 511 00:29:59,591 --> 00:30:00,759 తాతియానా వెస్టన్-వెబ్. 512 00:30:01,552 --> 00:30:03,762 తాతి, అద్భుతమైన ప్రదర్శన. 513 00:30:03,846 --> 00:30:06,932 థాంక్స్. ఈ హీట్లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. 514 00:30:07,015 --> 00:30:08,809 తొమ్మిదో రౌండ్ ని దాటి సెమీఫైనల్లోకి 515 00:30:08,892 --> 00:30:10,561 ప్రవేశించడం పట్ల నీకు ఏమనిపిస్తోంది, 516 00:30:10,644 --> 00:30:13,605 అలాగే పోర్చుగల్ లో సెమీఫైనల్ లో గెలుపుకి ఏం దోహదపడుతుందని 517 00:30:13,689 --> 00:30:14,982 నువ్వు భావిస్తున్నావు? 518 00:30:15,065 --> 00:30:17,901 చక్కగా సర్ఫింగ్ చేయడం, అలాగే హీట్ లలో సర్ఫింగ్ చేయడం ఉపయోగపడుతుంది. 519 00:30:17,985 --> 00:30:21,738 సన్సెట్ ఈవెంట్ లో నా హీట్ చివరలో 520 00:30:21,822 --> 00:30:22,906 కాస్త తడబడ్డాను, 521 00:30:22,990 --> 00:30:24,199 నా మోకాలికి గాయమైంది 522 00:30:24,283 --> 00:30:27,494 కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది 523 00:30:27,578 --> 00:30:29,955 ఈ ఏడాది ఆరంభం నుంచి నాకు సరిగ్గా కలసి రాలేదు కూడా. 524 00:30:30,038 --> 00:30:32,916 సెమీ ఫైనల్లో నీ ప్రదర్శన చూడాలని ఉత్సుకతతో ఉన్నా, నీకు అంతా మంచే జరగాలి. 525 00:30:33,000 --> 00:30:34,793 -ఇప్పుడు మోకాలి గాయం నయమైందా? -ఆ. 526 00:30:34,877 --> 00:30:36,003 ఇప్పుడు బాగానే ఉంది. 527 00:30:36,086 --> 00:30:39,882 కాస్త నొప్పిగా ఉన్నా, మొత్తానికి కోలుకున్నాను. 528 00:30:39,965 --> 00:30:41,925 ఫైనల్ కి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. 529 00:30:42,009 --> 00:30:43,468 థ్యాంక్స్. హాయ్. 530 00:30:46,638 --> 00:30:48,640 ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 531 00:30:48,724 --> 00:30:54,062 తాతియానా వెస్టన్-వెబ్, కరీసా మూర్ ల మధ్య 2021 ఫైనల్స్ లో జరిగిన పోరు 532 00:30:54,146 --> 00:30:58,442 మళ్లీ పునరావృతమవుతుందేమో చూడాలి. 533 00:30:59,067 --> 00:31:00,736 ఎదురు చూడాల్సిందే. 534 00:31:05,490 --> 00:31:07,034 ఉదయం 6 గం. 535 00:31:07,117 --> 00:31:09,536 సెమీ ఫైనల్ కు 2 గంటల ముందు 536 00:31:10,829 --> 00:31:12,664 అటువైపు చివరన, మీ ఎడమచేతివైపు దిగువన. 537 00:31:12,748 --> 00:31:13,749 ధన్యవాదాలు. 538 00:31:17,044 --> 00:31:18,962 హమ్మయ్య, ఈ రోజు చాలా బాగుంది. 539 00:31:26,094 --> 00:31:29,890 పోటీకి సమాయత్తం అయ్యేటప్పుడు నేను ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోను. 540 00:31:34,186 --> 00:31:38,023 శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ఒక ప్లాన్ రూపొందించుకుంటాను. 541 00:31:41,401 --> 00:31:43,237 పోర్చుగల్ శీతల ప్రాంతం. 542 00:31:43,320 --> 00:31:47,699 ముందుగానే పోటీకి సమాయత్తం కావాలి. 100 శాతం సిద్ధం కావాలి, 543 00:31:47,783 --> 00:31:51,286 అలా కాకపోతే, చలిలో ఇబ్బందులు పడక తప్పదు. 544 00:32:00,212 --> 00:32:01,964 నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. 545 00:32:02,047 --> 00:32:08,011 కరీసానుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తెలుసు, కానీ నా సానుకూలతలు నాకున్నాయి. 546 00:32:11,431 --> 00:32:15,477 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచిన 547 00:32:15,978 --> 00:32:20,816 తాతియానా వెస్టన్-వెబ్ ఇప్పుడు ప్రపంచ టైటిల్ కు చాలా చేరువలోకి వచ్చింది. 548 00:32:21,358 --> 00:32:22,985 ఈ పోటీ పట్ల నాకెంతో ఆసక్తిగా ఉంది 549 00:32:23,068 --> 00:32:25,654 ఎందుకంటే ఈ ఇద్దరు మహిళల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది, 550 00:32:25,737 --> 00:32:29,533 సర్ఫ్ అభిమానులుగా మనమంతా అలాంటి పోటీని తనివితీరా ఆస్వాదించాల్సిందే. 551 00:32:30,033 --> 00:32:35,247 ముఖాముఖీ జరిగిన పోటీల్లో తాతియానా వెస్టన్-వెబ్ పై కరీసా మూర్ దే పైచేయిగా ఉంది. 552 00:32:36,290 --> 00:32:38,625 తాతి బలహీనత కరీసాయేనని నా ఉద్దేశం… 553 00:32:38,709 --> 00:32:39,751 రోజీ హాడ్జ్ మాజీ డబ్ల్యూ.ఎస్.ఎల్ సర్ఫర్ 554 00:32:39,835 --> 00:32:42,462 తనపై తనకు నమ్మకం కుదరాలంటే తను అలాంటి క్రీడాకారిణిపైనే గెలవాలి 555 00:32:42,546 --> 00:32:44,506 అలాగే ప్రపంచ టైటిల్ గెలిచి తన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. 556 00:32:45,507 --> 00:32:49,052 ఏదో ఒక రోజు తాతిని ఢీకొనాలని నాకు తెలుసు, నేను అత్యుత్తమమైన ప్రతిభను కనబరచాల్సిందే. 557 00:32:49,136 --> 00:32:51,597 ఖచ్చితంగా తను సత్తా చూపిస్తుంది. 558 00:32:51,680 --> 00:32:55,642 తను తెలివైనది, శక్తిమంతురాలు, పైగా గట్టి పోటీదారు కూడా. 559 00:32:57,227 --> 00:33:00,314 ఖచ్చితంగా కరీసా నాకు గట్టి ప్రత్యర్ధే. 560 00:33:00,397 --> 00:33:02,482 తను ఎప్పుడూ వ్యూహాత్మకంగా ఆడుతుంది. 561 00:33:02,566 --> 00:33:05,444 నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఆమె. 562 00:33:05,527 --> 00:33:07,029 గెలిస్తే అలాంటి ప్రపంచ ఛాంపియన్ పైనే గెలవాలి. 563 00:33:07,613 --> 00:33:08,614 సెమీ ఫైనల్ 564 00:33:08,697 --> 00:33:10,032 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ కరీసా మూర్ 565 00:33:10,115 --> 00:33:11,950 అదిగో, కరీసా మూర్ బరిలోకి దిగింది. 566 00:33:14,161 --> 00:33:15,162 పడిపోయింది. 567 00:33:18,957 --> 00:33:21,001 తెల్లవారుజాము వేళ. చాలా చలిగా ఉంది. 568 00:33:21,835 --> 00:33:23,837 కరీసా అథ్లీట్ జోన్ లో ఉంది, 569 00:33:23,921 --> 00:33:26,882 తనను తాను వెచ్చబరుచుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. 570 00:33:28,300 --> 00:33:29,843 తాతియానా వెస్టన్-వెబ్ పై బరిలోకి దిగిన కరీసా 571 00:33:29,927 --> 00:33:32,596 తొలి రైడ్ లో 4.33 పాయింట్లు కోల్పోయింది. 572 00:33:34,681 --> 00:33:36,099 తాతి అదనుకోసం చూస్తోంది. 573 00:33:41,355 --> 00:33:43,524 తను బయటకు రాగలదా? 574 00:33:43,607 --> 00:33:45,192 దురదృష్టవశాత్తూ రాలేకపోయింది. 575 00:33:47,152 --> 00:33:50,781 అప్పుడప్పుడు భయం కలగడం సహజం. 576 00:33:50,864 --> 00:33:53,242 జరిగే నష్టానికి అదే కారణం. 577 00:33:57,996 --> 00:34:00,666 ఎగసిపడుతున్న ఆ అలపై విన్యాసానికి కరీసా సిద్దమవుతోంది. 578 00:34:09,341 --> 00:34:11,092 తాతియానా వెస్టన్-వెబ్ దీటుగా సమాధానమిచ్చేందుకు వచ్చింది. 579 00:34:16,849 --> 00:34:18,266 పద, సత్తా చూపించు. 580 00:34:18,976 --> 00:34:20,101 నీ శక్తిని చాటు. 581 00:34:32,489 --> 00:34:34,324 అద్భుతమైన మూడు చక్కటి మలుపులు. 582 00:34:34,408 --> 00:34:35,409 జడ్జీల గది 583 00:34:35,492 --> 00:34:38,203 ముఖ్యంగా మొదటి మలుపు చాలా చాలా అద్భుతంగా ఉంది. 584 00:34:38,286 --> 00:34:39,955 మూర్: 4.33 3.23 వెస్టన్-వెబ్: 3.93 6.83 585 00:34:40,038 --> 00:34:42,291 ఈ హీట్ లో 6.83 పాయింట్లు ప్రామాణికం. 586 00:34:42,373 --> 00:34:43,542 మూర్: 7.56 వెస్టన్-వెబ్: 10.76 587 00:34:43,625 --> 00:34:47,379 కరీసాపై తాతియానా వెస్టన్-వెబ్ గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. 588 00:34:48,422 --> 00:34:50,841 కరీసా అలపై విన్యాసాం చేస్తోంది. 589 00:34:51,507 --> 00:34:53,886 ఇక ఐదు నిమిషాల, యాభై సెకన్లే మిగిలి ఉంది. 590 00:34:53,969 --> 00:34:58,098 ఈ సెమీ ఫైనల్లో కరీసా మూర్ తిరిగి ఆధిక్యంలోకి రాగలదా? 591 00:34:59,183 --> 00:35:01,476 ఇదొక నిరంతర పోరాటం. 592 00:35:04,396 --> 00:35:09,651 ఏళ్ల తరబడి గడించిన అనుభవం, సామర్ధ్యం మీద నేను ఆశలు పెట్టుకున్నాను. 593 00:35:13,030 --> 00:35:17,576 చక్కటి అలలను గుర్తించి, వాటిపై విన్యాసాలు చేయాలి. 594 00:35:30,339 --> 00:35:33,800 ఈ హీట్ లో కరీసా భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. 595 00:35:47,731 --> 00:35:48,732 గుండె లయ తప్పింది. 596 00:35:50,025 --> 00:35:51,026 వెస్టన్ వెబ్: 10.76 మూర్: 10.17 597 00:35:51,109 --> 00:35:52,819 పోటీ ముగిసింది. స్కోర్లు నమోదయ్యాయి. 598 00:35:52,903 --> 00:35:54,863 తాతియానా వెస్టన్-వెబ్ కు అభినందనలు. 599 00:36:04,790 --> 00:36:05,791 గుడ్ లక్. 600 00:36:06,625 --> 00:36:08,168 కలుద్దాం, రిస్. 601 00:36:08,252 --> 00:36:12,297 కరీసా మూర్ పై తాతియానా వెస్టన్-వెబ్ సాధించిన ఘన విజయం ఇది. 602 00:36:12,381 --> 00:36:13,382 ఈ విజయాన్ని తను ఆస్వాదిస్తుంది. 603 00:36:14,049 --> 00:36:15,717 సాధించావు. 604 00:36:16,343 --> 00:36:18,345 హేయ్, మనం సాధించాం. 605 00:36:20,639 --> 00:36:22,891 మరింత బాగా సర్ఫింగ్ చేయడంలో నాకు స్ఫూర్తి కరీసాయే, 606 00:36:22,975 --> 00:36:28,981 గత ఏడాది నేను కొన్ని పొరబాట్లు చేసి కరీసా చేతిలో ఓడిపోయాను. 607 00:36:30,107 --> 00:36:31,108 ఆమె బహుశా నా అభిమాన… 608 00:36:32,025 --> 00:36:33,527 తను నా అభిమాన సర్ఫర్, 609 00:36:33,610 --> 00:36:37,823 నేను తనపై గెలిస్తే, ఒక పోటీలో గెలిచినట్లుగానే భావిస్తాను. 610 00:36:37,906 --> 00:36:39,032 కాబట్టి… 611 00:36:46,039 --> 00:36:47,833 -ధన్యవాదాలు, అభినందనలు. -థ్యాంక్స్. 612 00:36:47,916 --> 00:36:49,376 తనకు మద్దతు ఇచ్చినందుకు 613 00:36:49,459 --> 00:36:52,880 అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడే తను మెస్సేజ్ పంపింది. 614 00:36:52,963 --> 00:36:54,882 తాతి, ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 615 00:36:54,965 --> 00:36:55,966 ఫైనల్ ఈవెంట్ 616 00:36:56,049 --> 00:36:57,551 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ లేకీ పీటర్సన్ 617 00:36:57,634 --> 00:36:59,553 అక్కడ తాతి తన రంగాన్ని సెట్ చేసుకుంది. 618 00:36:59,636 --> 00:37:03,182 ఎవరైనా సరే, పెద్ద వేదికపై ప్రదర్శన చేయాలనుకుంటే, ఇంతకుమించిన పెద్ద వేదిక ఉండదు. 619 00:37:09,313 --> 00:37:14,526 తాతి ఇప్పుడే తన విజయానికి కావలసిన ఎనిమిది పాయింట్ల రైడ్ చేసింది. 620 00:37:35,672 --> 00:37:36,882 భలే! 621 00:37:37,466 --> 00:37:40,344 తాతి కోసం నేను వంద శాతం ఉత్సాహంగా ఉన్నాను. 622 00:37:40,928 --> 00:37:44,598 ఈ ఏడాది తన విజయానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఆమె సంపాదించుకుంది. 623 00:37:45,307 --> 00:37:47,559 అందుకు మానసికంగా కూడా సిద్ధపడింది 624 00:37:47,643 --> 00:37:52,523 గెలుపు చేజిక్కించుకోవాలనుకుంది. తనలోని ఆ గుణమే నాకు ప్రేరేపణ. 625 00:37:56,151 --> 00:37:58,904 అభినందనలు, తాతి. నువ్వు సాధించావు, లెజెండ్. 626 00:38:03,450 --> 00:38:05,118 ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. 627 00:38:05,202 --> 00:38:06,537 దిగ్భ్రమలో ఉన్నావా ఏంటి? 628 00:38:11,583 --> 00:38:14,962 ఈ ఏడాది నాకు చాలా కష్టమైన సంవత్సరమని తెలుసు 629 00:38:15,045 --> 00:38:16,922 నేను 110 శాతం కష్టపడ్డాను. 630 00:38:19,049 --> 00:38:22,970 ఈ ఏడాది ఖచ్చితంగా టైటిల్ గెలవాలని శ్రమించాను 631 00:38:23,053 --> 00:38:24,805 అది సాధ్యమేనని నాకు తెలుసు. 632 00:38:25,305 --> 00:38:27,349 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ టూర్ ర్యాంకింగ్స్ 633 00:38:27,432 --> 00:38:31,770 కట్ లైన్ 14 తాతియానా వెస్టన్-వెబ్ 634 00:38:32,688 --> 00:38:33,981 04 తాతియానా వెస్టన్-వెబ్ 635 00:38:34,064 --> 00:38:35,899 తాతి బులెట్ లా దూసుకువచ్చింది, 636 00:38:36,400 --> 00:38:39,027 ఇంతగా కష్టపడి విజయం సాధించడం 637 00:38:39,111 --> 00:38:42,990 ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. 638 00:38:43,073 --> 00:38:45,951 ఈ విషయాన్ని తాతియానా వెస్టన్-వెబ్ మాటల్లోనే విందాం. 639 00:38:48,078 --> 00:38:50,914 సన్సెట్ బీచ్ లో నువ్వు ఎదుర్కొన్న పరాజయాలను బట్టి చూస్తే, 640 00:38:50,998 --> 00:38:55,252 అసలు ఒంటి చేత్తో టైటిల్ ను గెలుస్తావని మేం ఊహించనేలేదు. 641 00:38:55,335 --> 00:38:57,254 అది ఎలా సాధ్యమైందో చెబుతావా? 642 00:38:57,337 --> 00:39:00,507 నా అనుభవాన్ని బట్టి చూస్తే, ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది. 643 00:39:03,135 --> 00:39:04,970 ఇలాంటి విజయాలు మరిన్ని ఉంటాయని నాకు తెలుసు. 644 00:39:09,057 --> 00:39:13,520 పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలిపి, లక్ష్యసాధనకు శ్రమించవలసిన సమయమిది. 645 00:39:14,605 --> 00:39:16,982 తాతికి పునర్వైభవం వచ్చింది. 646 00:39:20,235 --> 00:39:21,069 వచ్చే ఎపిసోడ్స్ లో 647 00:39:21,153 --> 00:39:22,529 జీవితాంతం నా సోదరిపై గెలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. 648 00:39:22,613 --> 00:39:23,989 నువ్వు చాలా బాగా ఆడావు. 649 00:39:24,072 --> 00:39:25,532 వాళ్లెంత పోటీ ఇస్తే, నేనంత రెచ్చిపోతా. 650 00:39:25,616 --> 00:39:29,620 ఇది రిప్ కర్ల్ ప్రొ బెల్స్ బీచ్. గంటను ఎవరు మోగిస్తారు? 651 00:39:29,703 --> 00:39:33,874 ఇక్కడ నేను సఫలం కాకపోతే, ఇక ఇంటికే. 652 00:40:32,933 --> 00:40:34,935 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్