1 00:00:15,057 --> 00:00:18,727 నాకు 14 లేదా 15 ఏళ్ల వయసు ఉన్నప్పడు మొదటిసారి సర్ఫింగ్ పోటీలకు వెళ్లాను. 2 00:00:24,733 --> 00:00:28,111 అప్పుడు చూసిన ప్రొఫెషనల్ మహిళల పోటీలు నాకు ఇప్పటికీ గుర్తే. 3 00:00:29,863 --> 00:00:31,698 "నేను కూడా ఈ పోటీల్లో పాల్గొనాలి 4 00:00:31,782 --> 00:00:33,784 ప్రపంచంలోనే గొప్ప సర్ఫర్ ని కావాలి," అని 5 00:00:35,202 --> 00:00:36,912 కలలు కనే దాన్ని. 6 00:00:39,164 --> 00:00:40,249 ఇది చాలా సహజంగా అనిపించింది. 7 00:00:44,211 --> 00:00:46,755 ఈ ఆటలో ఏదో ఉంది. 8 00:00:46,839 --> 00:00:48,841 అలాంటి స్థాయి ఆ ఆటకు ఉంది. 9 00:00:48,924 --> 00:00:51,176 డాన్సింగ్ తో పాటు రకరకాల ఆటలు ప్రయత్నించి చూశాను, 10 00:00:51,260 --> 00:00:54,221 కానీ సర్ఫింగ్ ఎంతో కోమలమైన, స్టయిల్ గా ఉండే ఆట. 11 00:00:56,223 --> 00:00:58,851 రెండేళ్లు గడిచేసరికి అవే పోటీల్లో 12 00:00:58,934 --> 00:01:01,019 పాల్గొనే అవకాశం నాకు లభించింది. 13 00:01:01,103 --> 00:01:02,729 రెండు మూడు రోజులు స్కూలుకి డుమ్మా కొట్టాను. 14 00:01:03,564 --> 00:01:05,315 వర్ధమాన క్రీడాకారిణిగా పోటీల్లోకి అడుగుపెట్టిన నేను, 15 00:01:05,399 --> 00:01:09,236 నా హీరోలందరినీ ఓడించి, ప్రపంచ టైటిల్ ను గెలుచుకున్నాను. 16 00:01:10,445 --> 00:01:14,408 ఆ తర్వాత ఏడాది నేనే గెలిచాను, ఆ తర్వాత ఏడాది కూడా నేనే గెలిచాను. 17 00:01:14,491 --> 00:01:16,201 ఆ తర్వాత ఏడాది కూడా గెలిచాను. 18 00:01:16,702 --> 00:01:18,579 గిల్మోర్ మళ్ళీ కెరటాన్ని అధిరోహించింది. 19 00:01:19,705 --> 00:01:21,623 కెరటం కింద ఖాళీ గుండా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. 20 00:01:22,207 --> 00:01:25,627 ఆ కెరటం కిందకు వెళ్ళింది. సునిశితమైన అంచనా. 21 00:01:25,711 --> 00:01:28,755 చక్కగా బయటకు వచ్చింది. ఎంత గొప్ప ప్రయత్నం. 22 00:01:28,839 --> 00:01:31,508 నా వరకూ రైడ్లు పరిపూర్ణంగా ఉండవనిపిస్తుంది. 23 00:01:33,302 --> 00:01:36,138 స్టెఫ్ చాలా త్వరగా కెరీర్ ను మొదలుపెట్టిందని గుర్తు. 24 00:01:36,221 --> 00:01:38,640 ఆమె నిస్సందేహంగా మనం... 25 00:01:38,724 --> 00:01:39,933 కెల్లీ స్లేటర్ పదకొండు సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ 26 00:01:40,017 --> 00:01:41,810 ...మునుపెన్నడూ చూడని ఉత్తమ మహిళా సర్ఫర్. 27 00:01:41,894 --> 00:01:45,439 ఇప్పుడు స్టెఫనీ గిల్మోర్ ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్. 28 00:01:45,522 --> 00:01:46,565 బీచ్ వేవర్ మాయి ప్రో 29 00:01:46,648 --> 00:01:49,610 ఎందుకో తెలీదు గానీ, నాకు స్టెఫ్ అంటే ఇష్టం, నేను ఆమెకు వీరాభిమానిని. 30 00:01:49,693 --> 00:01:53,071 ఈ విజయాలు ఎందాకా? ఎనిమిది, తొమ్మిది? స్లేటర్, ఎక్కడిదాకా వెళ్తాం మనం? 31 00:01:53,155 --> 00:01:55,032 నాకు ఆ ప్రశ్న అంటే చిరాకు. 32 00:01:55,115 --> 00:01:56,867 ఉండేది ఒక్క స్టెఫ్ మాత్రమే. 33 00:01:56,950 --> 00:01:58,744 మా క్రీడలో తను ఒక ఆరాధ్య దేవత. 34 00:01:58,827 --> 00:02:02,122 ఆమె కెరీర్ తొలి ఏళ్లను ఒకసారి చూస్తే గనక, 35 00:02:02,206 --> 00:02:04,082 అప్పటి పరిస్థితులు వేరు. 36 00:02:04,166 --> 00:02:07,669 గిల్మోర్ మరొకసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 37 00:02:08,211 --> 00:02:10,380 మహిళల సర్ఫింగ్ పరిణతి చెందడంతో 38 00:02:10,464 --> 00:02:12,216 గెలుపు కష్టసాధ్యంగా మారింది. 39 00:02:12,799 --> 00:02:14,468 తాతియానా వెస్టన్-వెబ్. 40 00:02:14,551 --> 00:02:17,804 వేగం, శక్తి, ఫ్లో వంటి వాటిలో ఆమె నిష్ణాతురాలు. 41 00:02:17,888 --> 00:02:18,805 తాతియానా వెస్టన్-వెబ్ ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ #4 42 00:02:18,889 --> 00:02:20,307 ఇప్పుడు కొత్త సర్ఫర్లు వచ్చారు 43 00:02:20,390 --> 00:02:21,725 వారు మరింత దూకుడుగా ఆడుతున్నారు. 44 00:02:21,808 --> 00:02:23,477 జొవేన్ డిఫే చాలా దూకుడుగా ఆడుతుంది. 45 00:02:23,560 --> 00:02:24,561 జొవేన్ డిఫే ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ #2 46 00:02:24,645 --> 00:02:27,356 కెరటాలపై విన్యాసాలు చేయడంలో వారిది విభిన్న శైలి. 47 00:02:27,439 --> 00:02:28,398 కరీసా మూర్ నాలుగు సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ 48 00:02:28,482 --> 00:02:31,026 కరీసా మూర్ తన విన్యాసానికి తానే ఆశ్చర్యపోయింది. 49 00:02:31,109 --> 00:02:33,987 ఇది దాదాపుగా మీరు రెండు భిన్నమైన క్రీడలను తిలకిస్తున్నట్లే ఉంటుంది. 50 00:02:34,071 --> 00:02:35,948 సాంప్రదాయక విన్యాసాలు, గిల్మోర్ లాగ... 51 00:02:36,031 --> 00:02:37,866 చక్కనైన ఆటతీరు ఆమె సొంతం. 52 00:02:38,534 --> 00:02:42,079 ...గాల్లో విన్యాసాలు చేయడం లేకపోతే తన శక్తిని ప్రదర్శించడం. 53 00:02:42,162 --> 00:02:45,082 ఇప్పుడు సర్ఫింగ్ దృక్కోణం ఈ విధంగా మారుతోంది. 54 00:02:45,165 --> 00:02:48,585 స్టెఫ్ కి ఇది సవాల్ వంటిదే. తను ఒక స్టయిల్ క్వీన్. 55 00:02:49,253 --> 00:02:54,550 తనలో శక్తిసామర్ధ్యాలు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు ఈ పోటీలో తను గెలిచి తీరాలి. 56 00:03:04,476 --> 00:03:09,565 టైటిల్ వేట 57 00:03:13,193 --> 00:03:16,238 వహాకా మెక్సికో 58 00:03:16,989 --> 00:03:18,365 ఉదయం 5 గంటల 58 నిమిషాలు 59 00:03:23,704 --> 00:03:26,582 స్టెఫనీ గిల్మోర్ ఏడు సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ ఛాంపియన్ 60 00:03:28,959 --> 00:03:32,254 ఈ రోజు తొందరగా ప్రారంభించాను. కానీ అలా తరచూ చేయను. 61 00:03:33,672 --> 00:03:35,924 నేను ఈ ఆటలోకి ప్రవేశించిన కొత్తలో త్వరగా ప్రారంభించేదాన్ని... 62 00:03:36,008 --> 00:03:40,179 జొవేన్, ఉదయం నాలుగు గంటలకే రంగంలోకి దిగిపోయేది. 63 00:03:40,929 --> 00:03:43,223 వాళ్లంతా విభిన్నమైన మనుషులు. 64 00:03:44,975 --> 00:03:46,185 అల్పాహారం ఇచ్చినందుకు థాంక్స్. 65 00:03:47,186 --> 00:03:48,228 అది నా బాధ్యత. 66 00:03:51,773 --> 00:03:54,610 టూర్ లో ఇది నా 15వ సంవత్సరం. 67 00:03:55,319 --> 00:03:58,197 ఇవి నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దుస్తులు. అయినా నాకంత మూఢ నమ్మకాలేమీ లేవు, కానీ... 68 00:03:58,280 --> 00:04:01,450 నా స్టయిల్ పై నాకు చాలా నమ్మకం ఉంది. కానీ పోనుపోను చాలా కష్టంగా మారుతోంది. 69 00:04:03,827 --> 00:04:05,162 ఈ కొత్త తరం అమ్మాయిలు, 70 00:04:05,245 --> 00:04:10,083 అద్భుతమైన ప్రతిభ గలవారు, అవకాశం లభిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటారు. 71 00:04:10,167 --> 00:04:12,920 కెరటాలపై విన్యాసాల్లో వేగాన్నీ, దూకుడునీ కనబరుస్తారు. 72 00:04:13,587 --> 00:04:14,588 పద. 73 00:04:15,839 --> 00:04:17,757 ఈ ఏడాది నా సీజన్ ఏమంత గొప్పగా లేదు. 74 00:04:19,091 --> 00:04:21,053 చివరిసారి నేను గెలిచిన ఈవెంట్ ఏమిటో నాకు గుర్తు కూడా లేదు. 75 00:04:21,136 --> 00:04:22,387 మీకేమైనా గుర్తుందా? 76 00:04:24,181 --> 00:04:26,141 ఈ టూర్ లో నేనే ఎక్కువ వయసున్న అమ్మాయినంటే నమ్మలేకపోతున్నా. 77 00:04:27,267 --> 00:04:28,435 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. 78 00:04:28,519 --> 00:04:30,687 మీ వయసెంత అని అడిగితే ఏమైనా అనుకుంటారా? 79 00:04:30,771 --> 00:04:32,397 ఏమీ అనుకోను. నా వయసు 33. 80 00:04:33,440 --> 00:04:37,569 అమ్మాయిలకు 37 ఏళ్లు వస్తే ఈ ఆటనుంచి రిటైర్ కావచ్చు. 81 00:04:37,653 --> 00:04:40,906 ఒకవైపు పిల్లల్ని కంటూ, మరోవైపు పోటీల్లో పాల్గొనడం కష్టమైన పనే. 82 00:04:40,989 --> 00:04:42,574 పిల్లలకోసం నేను తొందరపడుతున్నానని కాదు, 83 00:04:42,658 --> 00:04:45,077 కానీ కొంతమంది అబ్బాయిలను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. 84 00:04:45,160 --> 00:04:47,037 "సాకర్ జట్టుకు సరిపడా పిల్లల్ని కంటాను, మరోవైపు 85 00:04:47,120 --> 00:04:49,081 నా కెరీర్ ను కూడా చూసుకుంటాను" అంటూ ఉంటారు వాళ్లు. 86 00:04:49,164 --> 00:04:52,835 వాళ్ల మాటలు భలే బాగుంటాయి. 87 00:04:54,419 --> 00:04:58,674 టూర్ లో పాల్గొనే క్రీడాకారిణుల సత్తాను గమనిస్తే, మనం రెండు పడవల మీద కాళ్లు వేయలేం. 88 00:04:59,258 --> 00:05:02,511 నేను ఆట మీదే దృష్టి పెట్టి, ఎలాగైనా సరే గెలిచి తీరాలి. 89 00:05:04,429 --> 00:05:06,807 నేను ఇప్పటికి ఏడుసార్లు ప్రపంచ సర్ఫింగ్ ఛాంపియన్ ని. 90 00:05:06,890 --> 00:05:09,768 అందరికంటే గొప్పదాన్ని అనిపించుకోవాలంటే మరొక్కసారి గెలవాలి. 91 00:05:10,561 --> 00:05:13,021 మెక్సికోలో అమీతుమీ తేల్చుకుంటాను. 92 00:05:14,773 --> 00:05:17,109 క్విక్ సిల్వర్ సమర్పించు కరొనా ఓపెన్ మెక్సికో 93 00:05:17,192 --> 00:05:20,988 మెక్సికో - బార్రా డి లా క్రూజ్ పసిఫిక్ మహా సముద్రం 94 00:05:22,865 --> 00:05:25,742 శుభోదయం, ప్రపంచంలో 95 00:05:25,826 --> 00:05:29,538 అందమైన బార్రా డి లా క్రూజ్ సుందర ప్రాంతానికి మీ అందరికీ స్వాగతం. 96 00:05:29,621 --> 00:05:32,457 వరల్డ్ సర్ఫ్ లీగ్ ఛాంపియన్ టూర్ లీగ్ లో భాగంగా 97 00:05:32,541 --> 00:05:34,626 ఏడవ నంబర్ స్టాప్ కోసం జరిగే 98 00:05:34,710 --> 00:05:36,837 క్విక్ సిల్వర్ సమర్పిస్తున్న కరోనా ఓపెన్ మెక్సికో. 99 00:05:36,920 --> 00:05:37,963 ఛాంపియన్ షిప్ టూర్ ఈవెంట్ తొమ్మింట్లో ఏడవది 100 00:05:38,046 --> 00:05:41,175 -దీన్ని చూడు. -హేయ్, నేస్తం. 101 00:05:41,758 --> 00:05:43,552 మనకు ఇది ఇక్కడే స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. 102 00:05:43,635 --> 00:05:45,012 డాన్స్ చేస్తూ నడుస్తోంది. 103 00:05:47,639 --> 00:05:50,851 ఛాంపియన్ షిప్ టూర్లో ఇక రెండే ఈవెంట్లు మిగిలి ఉన్న నేపథ్యంలో, 104 00:05:50,934 --> 00:05:54,688 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కు అర్హత సాధించేందుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. 105 00:05:54,771 --> 00:05:56,398 మెక్సికో, టహిటీ. 106 00:05:57,524 --> 00:06:01,195 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కు చేరుకోవాలంటే, ఈ ఏడాది... 107 00:06:01,278 --> 00:06:02,279 రోజీ హాడ్జ్ మాజీ డబ్ల్యూ.ఎస్.ఎల్ సర్ఫర్ 108 00:06:02,362 --> 00:06:04,531 ...సర్ఫర్లు తప్పనిసరిగా టాప్ ఫైవ్ లో చోటు సంపాదించాలి. 109 00:06:04,615 --> 00:06:08,160 మెక్సికో, టహిటీల్లో టాప్ ఫైవ్ లో ఉన్న సర్ఫర్లకు 110 00:06:08,243 --> 00:06:10,871 ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం లభిస్తుంది. 111 00:06:12,206 --> 00:06:14,708 ప్రపంచ ర్యాంకింగుల్లో టైలర్ రైట్ ఏడవ స్థానానికి పడిపోయింది. 112 00:06:14,791 --> 00:06:17,211 జొవేన్ డిఫే ఒక గెలుపుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 113 00:06:17,294 --> 00:06:20,005 తాతియానా నాలుగో స్థానంలో ఉంది. 114 00:06:20,088 --> 00:06:21,798 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఛాంపియన్ షిప్ టూర్ ర్యాంకింగ్స్ 115 00:06:21,882 --> 00:06:24,426 అసమాన క్రీడాకారిణిగా పేరొందిన స్టెఫనీ గిల్మోర్, 116 00:06:24,510 --> 00:06:26,094 ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 117 00:06:26,178 --> 00:06:28,138 ప్రపంచ టైటిల్ ను గెలవాలంటే, 118 00:06:28,222 --> 00:06:30,807 ఈవెంట్లలో గెలిచి, ఫైనల్స్ కు చేరుకోవాలి. 119 00:06:31,475 --> 00:06:33,685 కానీ ప్రస్తుతానికి స్టెఫ్ కి ఆ అవకాశం కనిపించట్లేదు. 120 00:06:34,603 --> 00:06:37,856 ఆమె టాప్ ఫైవ్ లో నిలిచి, డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ కు చేరాలంటే 121 00:06:37,940 --> 00:06:39,608 మెక్సికోలో గెలిచి తీరాలి. 122 00:06:43,070 --> 00:06:45,697 స్టెఫనీ గిల్మోర్ మరియు బ్రాంటీ మెకాలే మధ్య పోటీని మనం చూస్తున్నాం. 123 00:06:47,574 --> 00:06:50,244 తనదైన స్టయిల్ తో విన్యాసాలు చేసే అత్యుత్తమ క్రీడాకారిణి స్టెఫనీ. 124 00:06:50,994 --> 00:06:52,829 సున్నితమైన, సొగసైన, చక్కని విన్యాసమది. 125 00:06:53,705 --> 00:06:55,040 అదిగో చూడండి. 126 00:06:55,123 --> 00:06:58,043 బ్రాంటీ మెకాలే వెనుక నుంచి కెరటంపైకి అధిరోహించింది. 127 00:07:00,796 --> 00:07:02,214 అందుకు తనకు భారీ స్కోర్ లభిస్తుంది. 128 00:07:02,297 --> 00:07:03,757 6.4. 129 00:07:04,383 --> 00:07:06,260 ఏ క్రీడాకారిణి అయినా ఫామ్ లో ఉంటే, 130 00:07:06,343 --> 00:07:07,594 ప్రపంచ ఛాంపియన్లను ఇట్టే ఓడిస్తుంది. 131 00:07:07,678 --> 00:07:10,722 ఆ విషయం స్టెఫనీ గిల్మోర్ కు చాలా స్పష్టంగా తెలుసు. 132 00:07:11,390 --> 00:07:14,476 స్టెఫనీ గిల్మోర్, నీకు 6.87 పాయింట్లు అవసరం. 133 00:07:14,560 --> 00:07:15,894 అదిగో. అదరగొట్టేయ్. 134 00:07:18,438 --> 00:07:21,525 స్టెఫనీ గిల్మోర్. నవ్వుతూనే ప్రత్యర్ధుల్ని మట్టి కరిపిస్తుంది. 135 00:07:21,608 --> 00:07:23,235 మహిళల సర్ఫింగ్ అందంగా, 136 00:07:23,318 --> 00:07:26,321 సుకుమారంగా ఉన్నా పోటీలు హోరాహోరీ జరుగుతాయని 137 00:07:26,405 --> 00:07:27,781 ప్రపంచానికి నేను చూపించదలిచాను. 138 00:07:28,323 --> 00:07:32,536 అసాధ్యమైన విన్యాసాలను కూడా సునాయాసంగా చేయగల దిట్ట ఆమె. 139 00:07:32,619 --> 00:07:36,874 ప్రత్యర్ధులు స్టెఫ్ ను తక్కువ అంచనా వేస్తే ప్రమాదంలో పడటం ఖాయం. 140 00:07:36,957 --> 00:07:37,958 లూక్ కెనెడీ సర్ఫ్ జర్నలిస్ట్ 141 00:07:38,041 --> 00:07:40,460 ఆ విన్యాసం చేసేందుకు కాస్త శ్రమ పడుతోంది. 142 00:07:40,544 --> 00:07:41,753 7.37. 143 00:07:41,837 --> 00:07:43,463 మూడు, రెండు, ఒకటి. 144 00:07:43,547 --> 00:07:44,965 స్టెఫనీ గెలిచింది. 145 00:07:45,048 --> 00:07:47,134 తుది స్కోర్ గిల్మోర్: 14.07 - మెకాలే: 12.57 146 00:07:47,759 --> 00:07:49,511 ఇప్పుడు ఐదోస్థానంలో ఉన్నావు. 147 00:07:49,595 --> 00:07:52,097 ఆ స్థానం కోసం ముగ్గురు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. 148 00:07:52,848 --> 00:07:55,475 అది చాలా కష్టమైన విషయమే. దాని గురించి ఆలోచించకుండా ఉందామనుకుంటున్నా. 149 00:07:55,559 --> 00:07:57,728 ఏమో మరి. ఆ విషయం ప్రస్తావించినందుకు థాంక్స్. 150 00:07:58,478 --> 00:07:59,771 ఏదేమైనా, థాంక్యూ. అభినందనలు, స్టెఫ్. 151 00:07:59,855 --> 00:08:00,856 థాంక్స్. మళ్లీ కలుద్దాం. 152 00:08:01,607 --> 00:08:02,816 చీర్స్. 153 00:08:02,900 --> 00:08:05,360 స్టెఫ్ చాలా ప్రతిభావంతురాలు... 154 00:08:05,444 --> 00:08:06,945 మిక్ ఫానింగ్ మూడు సార్లు డబ్ల్యూ.ఎస్.ఎల్ ప్రపంచ ఛాంపియన్ రిటైర్డ్ 155 00:08:07,029 --> 00:08:10,490 ...ఒక హీట్ లో గెలిచేందుకు ప్రతిసారీ పదికి పది పాయింట్లు సాధించాల్సిన అవసరం 156 00:08:10,574 --> 00:08:11,783 లేదని ఆమె భావిస్తుంది. 157 00:08:13,118 --> 00:08:14,995 శాలీ ఫిట్జిబన్స్ జొవేన్ డిఫే - కీలీ ఆండ్రూ 158 00:08:15,078 --> 00:08:17,915 జొవేన్ డిఫే వంటి అమ్మాయిలు కూడా ఈ పోటీలో ఉన్నారు. 159 00:08:17,998 --> 00:08:19,958 ఈ ఏడాది తను ఒక్క ఈవెంట్ లో గెలిచింది. 160 00:08:20,542 --> 00:08:24,046 పూర్తిస్థాయిలో శక్తియుక్తులు ప్రదర్శించేందుకు ఆమె సిద్ధంగా ఉంది. 161 00:08:24,129 --> 00:08:26,882 ప్రతి ఐదు లేదా పదేళ్లకు కొత్త క్రీడాకారిణులు, కొత్త తరం 162 00:08:26,965 --> 00:08:29,051 వచ్చి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. 163 00:08:29,134 --> 00:08:34,890 తను ఆ తరానికి చెందిన అమ్మాయే. వీరందరికీ ఆదర్శం స్టెఫ్. 164 00:08:34,972 --> 00:08:37,683 ఇప్పడు అందరూ ప్రపంచ టైటిల్ కోసమే పోటీపడుతున్నారు. 165 00:08:41,897 --> 00:08:45,817 నాపేరు జొవేన్ ఢిపే. ప్రొఫెషనల్ సర్ఫర్ ని. 166 00:08:46,527 --> 00:08:47,528 జొవేన్ ఢిపే, ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ #2 167 00:08:47,611 --> 00:08:51,073 నేను ఫ్రాన్స్ మధ్య భాగంలో పుట్టాను. అక్కడ సముద్రమన్నదే లేదు. 168 00:08:51,156 --> 00:08:55,160 అందువల్ల నేను సర్ఫర్ ని అవుతానని అనుకోలేదు. 169 00:08:56,119 --> 00:08:58,038 జొవేన్ గెలుస్తుందని 170 00:08:58,121 --> 00:09:00,165 ఎవరూ ఊహించరు. 171 00:09:00,249 --> 00:09:02,125 వాళ్లు నన్ను డార్క్ హార్స్ అంటూ ఉంటారు. 172 00:09:02,209 --> 00:09:06,296 నేను బరిలోకి దిగినప్పుడు నేను గెలవనని అందరూ అనుకుంటూ ఉంటారు. 173 00:09:08,757 --> 00:09:10,968 ఆమె టాప్ ఫైవ్ లో చోటు సంపాదించిందంటే, 174 00:09:11,051 --> 00:09:12,803 పెద్ద పెద్ద క్రీడాకారిణులెవరైనా ఇంటిదారి పట్టారనే అర్థం. 175 00:09:13,470 --> 00:09:15,472 ఎలాగైనా టాఫ్ ఫైవ్ లో చోటు సంపాదించాలని అనుకుంటున్నాను, 176 00:09:15,556 --> 00:09:20,185 ఎందుకంటే, అది నా మొత్తం కెరీర్ నే మార్చివేయవచ్చు. 177 00:09:21,103 --> 00:09:22,646 ఈ పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 178 00:09:22,729 --> 00:09:25,816 ఫ్రాన్స్ కు చెందిన జొవేన్ డిఫే, బ్రీసా హెనెస్సీల మధ్య పోటీ. 179 00:09:25,899 --> 00:09:27,067 పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. 180 00:09:27,150 --> 00:09:28,151 జడ్జీల గది 181 00:09:28,235 --> 00:09:29,653 స్కోర్లు సాధించేందుకు చాలా అనుకూలంగా ఉంది. 182 00:09:29,736 --> 00:09:30,988 ఓకే, అదిగో మొదటి కెరటం. 183 00:09:31,071 --> 00:09:33,907 జొవేన్ డిఫే, తన ప్రతిభ చూపేందుకు చక్కటి చోటు అది. 184 00:09:34,491 --> 00:09:37,119 అదిగో తను. ఏం చేయబోతోందో చూద్దాం. 185 00:09:38,412 --> 00:09:41,248 శారీరికంగా కాళ్లకు ఎక్కువ శ్రమ కలిగే ఆట ఇది. 186 00:09:41,331 --> 00:09:45,002 కానీ నా శరీరం చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి నేను గెలుస్తాననే అనుకుంటున్నాను. 187 00:09:45,836 --> 00:09:47,462 మొదటి మలుపు అద్భుతం. 188 00:09:47,546 --> 00:09:48,589 చాలా బాగుంది. 189 00:09:48,672 --> 00:09:49,756 బాగా ఆడింది. 190 00:09:49,840 --> 00:09:51,383 ఇప్పుడామే తనకిష్టమైన కెరటాన్ని ఎంచుకుంటోంది. 191 00:09:52,885 --> 00:09:56,513 జొవేన్ డిఫే కెరటాలపై విన్యాసాలు చేస్తోంది. 192 00:09:58,056 --> 00:10:00,434 జొవేన్, ఆమెలో ఆ దూకుడుతనం ఉంది మరి. 193 00:10:01,101 --> 00:10:02,227 బామ్! 194 00:10:02,311 --> 00:10:04,563 చాలా మంచి విన్యాసం అది. చాలా బాగా చేసింది. 195 00:10:05,147 --> 00:10:06,732 జొవేన్ డిఫే, 6.23. 196 00:10:06,815 --> 00:10:10,444 రెండు ఉత్తమ స్కోర్లు - డిఫే: 12.05 హెనెస్సీ: 5.17 197 00:10:10,527 --> 00:10:11,737 ఓకే, కానివ్వండి! 198 00:10:12,821 --> 00:10:14,281 బ్రీసా హెనెస్సీ. 199 00:10:15,449 --> 00:10:16,491 పెద్ద స్కోర్ సాధిస్తోంది. 200 00:10:16,575 --> 00:10:18,619 జొవేన్ డిఫే ఇక్కడ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందా? 201 00:10:18,702 --> 00:10:19,786 హెనెస్సీ: 12.97 డిఫే: 12.06 202 00:10:19,870 --> 00:10:22,164 నాలో ఉన్న శక్తిని కొంత దాచుకుని, 203 00:10:22,247 --> 00:10:24,583 సరైన సమయంలో దాన్ని ఉపయోగించాల్సి ఉంది. 204 00:10:25,209 --> 00:10:27,461 ధీటైన సమాధానమిస్తోంది. జొవేన్ డిఫే. 205 00:10:27,544 --> 00:10:29,254 పంచ్. 206 00:10:30,214 --> 00:10:33,926 అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళింది. చక్కటి ఫినిష్. 207 00:10:34,009 --> 00:10:39,431 అవును. ఆరంభంలోనే డిఫే అద్భుతమైన విన్యాసం చేసింది. భావోద్రేకాలను కనబరుస్తోంది. 208 00:10:39,515 --> 00:10:40,349 మంచి ఫినిష్. 209 00:10:40,432 --> 00:10:43,060 ఈ హీట్ లో ఆమెకిది మంచి అవకాశం. 210 00:10:44,811 --> 00:10:47,523 తుది స్కోర్ హెనెస్సీ: 12.97 డిఫే: 14.00 211 00:10:47,606 --> 00:10:50,484 మంచి ఫినిష్. చక్కటి ఫినిష్. బాగుంది. 212 00:10:51,652 --> 00:10:54,821 బరిలోకి దిగినప్పుడు జొవేన్ మనసు పెట్టి ఆడుతుంది. 213 00:10:55,697 --> 00:10:58,283 కానీ జొవేన్ ప్రయాణం అంత సాఫీగా సాగేలా కనిపించడం లేదు. 214 00:11:01,703 --> 00:11:03,789 సర్ఫింగ్ చాలా ఖరీదైన ఆట. 215 00:11:04,540 --> 00:11:06,667 క్రీడాకారిణులకు స్పాన్సర్ దొరకడం చాలా ముఖ్యం. 216 00:11:07,835 --> 00:11:09,294 నాకు 18 ఏళ్లు వచ్చేవరకూ, 217 00:11:09,378 --> 00:11:13,048 నా ఖర్చులన్నీ రాక్సీ సంస్థ భరించేది. 218 00:11:13,632 --> 00:11:15,717 కానీ ఆ ఏడాది చివరినాటికి, 219 00:11:15,801 --> 00:11:19,012 నాకు 19 ఏళ్లు వచ్చాయి, రాక్సీ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేదు. 220 00:11:22,391 --> 00:11:23,559 కొందరు అమ్మాయిలకు ఆర్థిక సహకారం 221 00:11:23,642 --> 00:11:27,563 దక్కకపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. 222 00:11:28,730 --> 00:11:31,984 కాబట్టి స్టెఫ్ గిల్మోర్ లాంటి వారితో పోల్చి చూస్తే, 223 00:11:32,067 --> 00:11:34,653 ఇదొక వింతగా కనిపిస్తుంది. 224 00:11:34,736 --> 00:11:36,113 టీవీ వాణిజ్య ప్రకటన 225 00:11:36,196 --> 00:11:39,157 స్టెఫ్ కి బ్రైట్ లింగ్, నికాన్, ఆడీ సంస్థల నుంచి 226 00:11:39,241 --> 00:11:42,870 స్పాన్సర్ షిప్స్ ఉన్నాయి. 227 00:11:44,371 --> 00:11:47,332 ప్రపంచ టైటిల్ కోసం పోటీ పడుతున్న జొవేన్ లాంటి వారు, 228 00:11:47,416 --> 00:11:51,420 స్పాన్సర్లు లేకపోతే, గెలవడం చాలా కష్టం. 229 00:11:51,503 --> 00:11:53,088 కాలరాయ్ 230 00:11:53,172 --> 00:11:54,882 దురదృష్టవశాత్తూ, మహిళల సర్ఫింగ్ లో, 231 00:11:54,965 --> 00:11:57,759 ప్రముఖ క్రీడాకారిణులు కొందరు మాత్రమే చేతులారా సంపాదిస్తున్నారు. 232 00:11:57,843 --> 00:12:00,637 మిగతావాళ్ల సంపాదన చెప్పుకోదగినంతగా ఉండటం లేదు. 233 00:12:00,721 --> 00:12:01,722 సరే మరి. యాక్షన్. 234 00:12:02,598 --> 00:12:04,683 నా పేరు తాతియానా వెస్టన్-వెబ్. 235 00:12:04,766 --> 00:12:07,644 నా వయసు 25 ఏళ్లు, నేనొక ప్రొఫెషనల్ సర్ఫర్ ని. 236 00:12:07,728 --> 00:12:08,979 తాతియానా వెస్టన్-వెబ్ ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ #4 237 00:12:09,062 --> 00:12:11,106 తాతియానా ఊహించని విధంగా గెలిచే సత్తా ఉన్న క్రీడాకారిణి. 238 00:12:18,530 --> 00:12:20,073 ఇవి భలే బాగున్నాయి. 239 00:12:20,157 --> 00:12:23,327 నాకు నత్తగుల్లలను కూడా తినాలని చాలా ఉంది. 240 00:12:23,410 --> 00:12:25,871 టూర్ లో ఆర్ధిక పరమైన వ్యత్యాసం చాలా ఉంది. 241 00:12:25,954 --> 00:12:30,000 స్పాన్సర్ సహకారం ఉన్నట్లయితే ఆటలో ప్రతిభ కనబరచాల్సిందే. 242 00:12:30,083 --> 00:12:32,503 మీరు పూర్తి ప్యాకేజీని వినియోగించుకోవాలి. 243 00:12:32,586 --> 00:12:34,963 మీరు బాగా మార్కెట్ అయ్యేలా ఉండాలి. 244 00:12:35,047 --> 00:12:36,423 ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వండి. 245 00:12:36,507 --> 00:12:38,300 నేను టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాను. 246 00:12:38,383 --> 00:12:40,552 గతంలో చాలామంది నాపై సందేహాలు వ్యక్తం చేశారు, 247 00:12:40,636 --> 00:12:42,513 వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తాను, 248 00:12:43,138 --> 00:12:45,057 స్టెఫ్ ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ, 249 00:12:45,140 --> 00:12:46,141 నేను ఆమెను ఓడించగలను. 250 00:12:46,975 --> 00:12:48,185 కాస్త కెమెరాతో కూడా మాట్లాడు. 251 00:12:48,268 --> 00:12:49,895 ముందు నా పొట్ట నిండాకే కెమెరాతో మాట్లాడతా. 252 00:12:50,521 --> 00:12:52,481 తినడమంటే నాకు చాలా ఇష్టం. సర్ఫింగ్ కూడా. 253 00:12:53,482 --> 00:12:54,691 కానీ ఎక్కువగా తిండే ఇష్టం. 254 00:12:56,360 --> 00:12:57,778 సర్ఫింగ్ కూడా. 255 00:12:58,654 --> 00:13:02,199 తాతియానా చాలా పట్టుదల గల క్రీడాకారిణి. 256 00:13:02,282 --> 00:13:03,659 ప్రత్యర్ధులపై నిర్దయగా దాడి చేస్తుంది. 257 00:13:03,742 --> 00:13:05,953 ఇక్కడ కూడా ఎలాగైనా కానీ అలాగే దాడి చేసేస్తుంది. 258 00:13:10,999 --> 00:13:12,876 మొదటి రౌండ్ 259 00:13:12,960 --> 00:13:15,212 తాతియానా వెస్టన్-వెబ్ వర్సెస్ సేజ్ ఎరిక్సన్ 260 00:13:16,213 --> 00:13:20,092 తదుపరి హీట్ లో సేజ్ ఎరిక్సన్ మరియు తాతియానా వెస్టన్-వెబ్. 261 00:13:21,343 --> 00:13:24,137 అదిగో, అది తనకు అలవాటైన ఆరంభ విన్యాసం. 262 00:13:25,556 --> 00:13:26,682 చాలా శక్తిమంతమైన విన్యాసం అది. 263 00:13:30,143 --> 00:13:31,436 విరిగిపడుతున్న కెరటం. 264 00:13:32,563 --> 00:13:33,897 ఆమె నిలవగలుగుతుందా? 265 00:13:33,981 --> 00:13:36,441 తాను నియంత్రణ కోల్పోలేదని జడ్జీలకు తెలియచెప్పింది. 266 00:13:37,067 --> 00:13:38,360 అదరగొట్టేసింది. 267 00:13:38,861 --> 00:13:41,280 చిన్న కెరటం. చక్కగా సర్ఫ్ చేసింది. 268 00:13:41,864 --> 00:13:43,740 వెస్టన్-వెబ్, తన సత్తా చూపించబోతోంది. 269 00:13:44,616 --> 00:13:49,037 జొవేన్, ఇంకా నాలాంటి అమ్మాయిలు అలాంటి శక్తిమంతమైన విన్యాసాలకు వెనుకాడరు 270 00:13:49,121 --> 00:13:50,789 ఎందుకంటే అలాంటివి జడ్జీలను ఆకట్టుకుంటాయి. 271 00:13:50,873 --> 00:13:53,041 అవి దూకుడుతనంతో ఉంటాయి, అదే సమయంలో అందంగానూ అనిపిస్తాయి. 272 00:13:53,750 --> 00:13:55,043 అక్కడక్కడ గ్లామర్ మెరుపులు. 273 00:13:55,752 --> 00:13:58,088 తాతియానా, గత కొన్నేళ్లుగా 274 00:13:58,172 --> 00:14:02,509 కరీసా, స్టెఫ్, టైలర్ వంటి క్రీడాకారిణులకు చాలా దగ్గరగా వస్తోంది. 275 00:14:03,093 --> 00:14:07,848 ఆమెలో ఇప్పుడు బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. 276 00:14:07,931 --> 00:14:09,558 ఇప్పుడు ఆమెలో ఏమాత్రం బెరుకు లేదు. 277 00:14:10,142 --> 00:14:13,187 ఈ హీట్ లో తాతి వెస్టన్-వెబ్ సాధికారత కనబరిచింది. 278 00:14:13,270 --> 00:14:14,479 వెస్టన్-వెబ్: 6.16 ఎరిక్సన్: 0.50 279 00:14:15,522 --> 00:14:17,941 నేను దూకుడుగా ఆడే క్రీడాకారిణిని. 280 00:14:18,025 --> 00:14:20,652 దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతాను. 281 00:14:22,821 --> 00:14:23,989 తాతి ప్రారంభించింది. 282 00:14:25,532 --> 00:14:27,409 ఆమె ముందుకు సేజ్ ఎరిక్సన్ వచ్చింది. 283 00:14:28,035 --> 00:14:32,664 ఆమె తాతీకి అడ్డు వచ్చిందనుకుంటా. తనకు ప్రాధాన్యం ఉందని సేజ్ అనుకుంటోంది. 284 00:14:33,248 --> 00:14:34,958 మనం ఇప్పుడు ఒకటి తేల్చాలి. 285 00:14:35,042 --> 00:14:37,669 తాతియానా వెస్టన్-వెబ్ స్కోరు సాధించకుండా 286 00:14:37,753 --> 00:14:40,172 సేజ్ ఎరిక్సన్ అడ్డుపడిందా? 287 00:14:40,255 --> 00:14:41,965 ప్రాధాన్యం తాతీకి ఉందా? 288 00:14:42,925 --> 00:14:44,343 అయితే ఆమె అడ్డుపడినట్లే లెక్క. 289 00:14:44,801 --> 00:14:47,763 తమకు ప్రాధాన్యం ఉన్న కెరటంపైకి వెళ్ళి స్కోర్ చేయకుండా... 290 00:14:47,846 --> 00:14:48,889 ప్రీతమో అహ్రెంట్ డబ్ల్యూ.ఎస్.ఎల్ హెడ్ జడ్జ్ 291 00:14:48,972 --> 00:14:50,849 ...ప్రత్యర్ధి దారికి అడ్డుపడి, వారి స్కోరింగ్ సామర్థ్యాన్ని 292 00:14:50,933 --> 00:14:54,102 అడ్డుకోవడాన్నే జోక్యం చేసుకోవడం అంటారు. 293 00:14:54,186 --> 00:14:56,313 జోక్యం చేసుకోవడమనే పాయింట్ పై 294 00:14:56,396 --> 00:15:00,150 తాతీకి ఎక్కువ పాయింట్లు లభించేలా చేసి, సేజ్ పెద్ద తప్పు చేసింది, 295 00:15:00,859 --> 00:15:04,279 ఒక్కసారి నువ్వు ప్రత్యర్థి దారికి అడ్డు తగిల్తే, ఇక సెకండ్ స్కోరింగ్ హక్కులు పోయినట్లే... 296 00:15:04,363 --> 00:15:05,822 రెనటో హికెల్ మాజీ డబ్ల్యూ.ఎస్.ఎల్ హెడ్ జడ్జ్ 297 00:15:05,906 --> 00:15:07,282 ...ఇక నీకు ఒక స్కోరే మిగులుతుంది, 298 00:15:07,366 --> 00:15:11,203 అంటే, ఇక ఆ హీట్ లో నువ్వు గెలవడం దాదాపుగా అసాధ్యమన్నమాటే. 299 00:15:11,286 --> 00:15:14,248 గణాంకాల ప్రకారం, సేజ్ గెలవదనే అర్థం. 300 00:15:14,331 --> 00:15:17,876 అందువల్ల తాతియానా వెస్టన్-వెబ్ కే గెలుపు అవకాశాలు ఎక్కువ. 301 00:15:19,795 --> 00:15:22,798 వెస్టన్-వెబ్: 15.57 ఎరిక్సన్: 3.43 302 00:15:22,881 --> 00:15:25,259 -మొదటి ప్రాధాన్యత నాకు ఉండింది. -నువ్వు చవకబారుదానివి. 303 00:15:25,342 --> 00:15:27,219 నువ్వేదో గొప్పదానివి అనుకున్నా. 304 00:15:28,512 --> 00:15:29,805 అంత చెత్తలా ప్రవర్తిస్తావనుకోలేదు. 305 00:15:31,932 --> 00:15:34,226 మొదటి ప్రాధాన్యత తనకి ఉండే అవకాశమే లేదు. 306 00:15:34,935 --> 00:15:37,938 పైగా "ఎవరికి ప్రాధాన్యత ఉంది?" అని నన్ను అడిగింది. 307 00:15:38,021 --> 00:15:39,273 నేను "నాకే ప్రాధాన్యత ఉంది" అని చెప్పాను. 308 00:15:39,356 --> 00:15:42,192 ఆమె అక్కడ కూర్చుని "నేను ఎందుకలా చేస్తాను?" అని అంది. 309 00:15:43,068 --> 00:15:44,611 నువ్వేం చేశావో నీకు తెలుసు. 310 00:15:45,320 --> 00:15:47,781 ఆ కెరటంపైకి ఎందుకు వెళ్లడం? అదొక పనికిమాలిన కెరటమే కదా. 311 00:15:48,907 --> 00:15:50,158 ఆమె నన్ను చవకబారు మనిషినని అంది. 312 00:15:50,242 --> 00:15:52,578 నేనొక చవకబారు మనిషినని... 313 00:15:53,453 --> 00:15:55,038 నా ఆట నేను ఆడానంతే. 314 00:15:58,041 --> 00:16:01,211 తాతియానా, కరీసా. కెరటాలపై చాలా దూకుడుగా విన్యాసాలు చేస్తారు. 315 00:16:01,295 --> 00:16:03,172 దూకుడుతనం అంటే... 316 00:16:04,173 --> 00:16:06,884 నీపైన తెడ్డు వేయడం వంటిది. వాళ్లు నీ వ్యక్తిగత స్పేస్ లోకి వస్తారు. 317 00:16:07,593 --> 00:16:09,803 అది అన్నివేళలా బాగుండదు, 318 00:16:09,887 --> 00:16:13,515 కానీ స్కోర్లు తెచ్చిపడుతుందని చెప్పొచ్చు. 319 00:16:13,599 --> 00:16:16,018 మేం ఉన్నది అందుకే మరి. 320 00:16:16,101 --> 00:16:18,187 కానీ స్కోరింగ్ కి అది కొలమానం కాదు. 321 00:16:18,270 --> 00:16:21,440 వేగం, శక్తి, ఫ్లో వంటివే పనికొస్తాయి కదా? దూకుడుతనం కాదు. 322 00:16:24,735 --> 00:16:25,736 అది నిజం. 323 00:16:26,862 --> 00:16:29,489 -ఇది బాగుందని అనుకుంటున్నాను. -అవును. 324 00:16:32,409 --> 00:16:35,037 రిప్ కర్ల్ డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, 325 00:16:35,120 --> 00:16:38,290 టాప్ ఫైవ్ లో ఎవరున్నారనేది మనం తేల్చబోతున్నాం. 326 00:16:38,373 --> 00:16:39,917 కరీసా మూర్. 327 00:16:40,000 --> 00:16:42,628 చూడబోతే ఆమె తన జాబితాలో మరో ఛాంపియన్ షిప్ ను చేర్చుకునేలా ఉంది. 328 00:16:44,546 --> 00:16:49,510 శాలీ ఫిట్జిబన్స్ కి కూడా టాప్ ఫైవ్ లో చోటు దక్కుతుంది. 329 00:16:50,219 --> 00:16:53,847 రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టైలర్ రైట్ ను 330 00:16:53,931 --> 00:16:56,600 ఇసాబెల్లా నికోల్స్ ఓడించింది. 331 00:16:56,683 --> 00:16:59,353 ఆమె టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకోవాలంటే, 332 00:16:59,436 --> 00:17:01,939 జరగబోయే తహీతీ ఈవెంట్ లో పెద్ద స్కోర్ సాధించాల్సి ఉంటుంది. 333 00:17:06,652 --> 00:17:07,736 గుడ్ ఈవినింగ్. 334 00:17:07,819 --> 00:17:08,945 ఫ్రెంచ్ పోలినేషియా న్యూస్ 335 00:17:09,029 --> 00:17:10,405 ఈ రాత్రి ప్రధాన వార్తలు: 336 00:17:10,489 --> 00:17:13,700 కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, 337 00:17:14,201 --> 00:17:17,788 ఫ్రెంచ్ పోలీనేషియాలోని ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. 338 00:17:17,871 --> 00:17:21,666 రోజుకు 2,000 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి, 339 00:17:21,750 --> 00:17:26,296 వైరస్ సోకిన కారణంగా ఈ వారాంతంలో ముప్పై ఎనిమిది మంది రోగులు మరణించారు. 340 00:17:27,130 --> 00:17:28,715 తహితీ గురించి వచ్చిన మెసేజ్ చూశావా? 341 00:17:28,799 --> 00:17:31,593 తహీతీని రెడ్ జోన్ లో ఉంచారట. 342 00:17:33,011 --> 00:17:34,263 జెస్సీ మైలీ డయర్ డబ్ల్యూ.ఎస్.ఎల్ పోటీకి హెడ్ 343 00:17:34,346 --> 00:17:36,139 కోవిడ్ -19 కారణంగా తహీతీ ఛాంపియన్ షిప్ 344 00:17:36,223 --> 00:17:38,225 టూర్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నామని 345 00:17:38,308 --> 00:17:39,518 ప్రకటిస్తున్నాను. 346 00:17:40,644 --> 00:17:44,022 మామూలుగా, ఈవెంట్ ముగిసేసరికి, మీరు టాప్ ఫైవ్ లో లేనట్లయితే, 347 00:17:44,106 --> 00:17:45,691 ఇక మీరు ప్రపంచ టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయినట్లే. 348 00:17:47,234 --> 00:17:50,529 ఈ ఏడాది చివరి ఈవెంట్ ను రద్దు చేసారు కాబట్టి, ఇక దీంతోనే సరి. 349 00:17:50,612 --> 00:17:52,447 డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్స్ లో చోటు కోసం పోటీ పడే 350 00:17:52,531 --> 00:17:54,366 టాప్ ఫైవ్ జాబితా ఈ పోటీల్లోనే వెల్లడవుతుంది. 351 00:17:54,449 --> 00:17:55,993 కాబట్టి, ఈ పరిణామం మొత్తం పరిస్థితిని మార్చేసింది. 352 00:17:58,871 --> 00:18:00,038 ఇదంతా దారుణం. 353 00:18:00,539 --> 00:18:01,915 కోవిడ్ నాకు అస్సలు నచ్చలేదు. 354 00:18:01,999 --> 00:18:03,834 "ఆస్పత్రులలో ఐసియు బెడ్స్ అన్నీ నిండిపోయాయి. 355 00:18:03,917 --> 00:18:06,628 మరో 48 గంటల్లో ఆ పరిస్థితి దిగజారి హ్యాండిల్ చేయలేని స్థితికి చేరుకుంటుంది." 356 00:18:07,212 --> 00:18:08,505 ఇది దారుణం. 357 00:18:08,589 --> 00:18:11,925 ఇప్పుడు కోవిడ్ కేసులు మేమున్న గ్రామంలోనూ వెలుగుచూస్తున్నాయి. 358 00:18:14,386 --> 00:18:15,762 -రద్దయిపోయాయిగా? -అవును. 359 00:18:15,846 --> 00:18:17,139 -సరే. ఛ. -హా. 360 00:18:17,222 --> 00:18:19,308 ప్రభుత్వం సరిహద్దులను మూసేయబోతోంది. 361 00:18:19,391 --> 00:18:20,559 టైలర్ రైట్ ప్రస్తుత సంయుక్త ప్రపంచ ర్యాంకింగ్ #6 362 00:18:20,642 --> 00:18:22,311 తహీతీలో జరిగే పోటీలు తమకు కలిసి వస్తాయని 363 00:18:22,394 --> 00:18:25,689 అక్కడ సత్తా కనబరిచి, బాగా స్కోర్ సాధించి మంచి ర్యాంకింగులు 364 00:18:25,772 --> 00:18:29,693 పొందవచ్చని చాలామంది అమ్మాయిలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 365 00:18:30,569 --> 00:18:32,029 తహీతీలో పోటీలు రద్దు కాగానే, 366 00:18:32,112 --> 00:18:35,324 నేను, "సరే, ఇక్కడ మెక్సికోలోనే మంచి స్కోర్ సాధించాలి, 367 00:18:35,407 --> 00:18:37,993 ఎందుకంటే ఇకపై ఈవెంట్ లేదు కదా" అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. 368 00:18:39,620 --> 00:18:41,830 కాబట్టి, మొత్తం ఒత్తిడి అంతా ఈ ఈవెంట్ పైనే పడింది. 369 00:18:43,165 --> 00:18:44,750 అందులోనూ ఐదో స్థానంలో ఉండేసరికి అది రెట్టింపు అయింది. 370 00:18:44,833 --> 00:18:46,126 అవును. 371 00:18:46,210 --> 00:18:47,878 అంతా దాగుడుమూతల ఆటలాగ ఉంది. 372 00:18:47,961 --> 00:18:48,879 దాగుడు మూతలు. 373 00:18:48,962 --> 00:18:49,963 ఆండీ కింగ్ కోచ్ 374 00:18:50,047 --> 00:18:52,424 నువ్వేదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నావు. 375 00:18:52,508 --> 00:18:53,884 దాన్ని దాచలేవు, స్టెఫ్. 376 00:18:56,261 --> 00:18:58,222 స్టెఫ్ దూకుడుగా ఆడుతుందని మీరు భావిస్తున్నారా? 377 00:18:58,305 --> 00:19:00,015 అవును. 378 00:19:00,098 --> 00:19:02,976 -దూకుడుగా? -నేను భయపడుతున్నా, ఆమె నన్ను భయపెడుతోంది. 379 00:19:03,060 --> 00:19:05,145 ఆమె తన చిరునవ్వు వెనక దాన్ని దాచేసింది. 380 00:19:05,229 --> 00:19:07,064 ఆమె స్నాపర్ లో పెరిగింది. 381 00:19:07,147 --> 00:19:08,440 ఆ లైనప్ లో ఆమె చాలా ప్రమాదకరమైనది. 382 00:19:08,524 --> 00:19:10,484 అది ప్రపంచంలోనే బాగా పోటీపడగల లైనప్. 383 00:19:10,567 --> 00:19:12,319 ఆమె చిరునవ్వుతో దాన్ని సొంతం చేసుకుంది. 384 00:19:22,704 --> 00:19:24,831 ప్రపంచ టైటిల్ ను చేజార్చుకునే అవకాశం ఉంది కాబట్టి, 385 00:19:24,915 --> 00:19:28,043 నేను టాప్ ఫైవ్ లో ఉండి తీరాలి. 386 00:19:28,794 --> 00:19:31,672 తాతిని అధిగమించడం చాలా కష్టం, 387 00:19:31,755 --> 00:19:35,467 కానీ నీ స్టయిలే నీకు రక్ష. 388 00:19:35,551 --> 00:19:36,760 నాకు అక్కడే కోపం వస్తుంది. 389 00:19:36,844 --> 00:19:39,555 "స్టయిల్" అనే పదాన్ని పలకకుండా వాళ్లని నిషేధించాలి. 390 00:19:39,638 --> 00:19:41,723 నాకు అది తప్ప ఇంకేదీ లేదనట్టు. 391 00:19:42,474 --> 00:19:43,767 నీకు అది చాలు. 392 00:19:44,476 --> 00:19:47,271 -లేదు, కానీ... అదొక్కటే చాలదు. -నీలో అదిగాక ఇంకా చాలా ఉన్నాయి. 393 00:19:47,354 --> 00:19:51,775 నువ్వు ఏడుసార్లు ప్రపంచ టైటిల్స్ గెలిచావు, ఎన్నో విజయాలు సాధించావు. 394 00:19:54,361 --> 00:19:57,364 ఆస్ట్రేలియాలో మార్గరెట్ రివర్ ఈవెంట్ లో... 395 00:19:57,447 --> 00:19:58,448 మూడు నెలల ముందు 396 00:19:58,532 --> 00:20:01,368 …తాతియానా వెస్టన్-వెబ్ ను ఢీకొన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. 397 00:20:01,451 --> 00:20:03,620 తాతీ బ్రెజిల్ కి ప్రాతినిథ్యం వహిస్తోంది. 398 00:20:03,704 --> 00:20:05,664 ఈ సీజన్లో ఆధిక్యత కనబరుస్తోంది. 399 00:20:05,747 --> 00:20:07,666 స్టెఫనీ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తోంది. 400 00:20:08,542 --> 00:20:10,711 తాతియానా చాలా ప్రమాదకరమైన క్రీడాకారిణి. 401 00:20:10,794 --> 00:20:14,173 కొత్త తరానికి చెందిన తాతియానా వెస్టన్-వెబ్, జొవేన్ డిఫే లు 402 00:20:14,256 --> 00:20:18,260 స్టెఫ్ ను అధిగమించేందుకు తమ పవర్ గేమ్ ను అభివృద్ధి చేసుకున్నారు. 403 00:20:19,052 --> 00:20:23,807 తాతియానా చాలా బలమైన ప్రత్యర్థి. ఆమెకు ఏ హీట్ లోనూ గట్టిగా పోటీ ఇవ్వలేకపోయాను. 404 00:20:23,891 --> 00:20:26,310 స్టెఫ్ గిల్మోర్ సరిగ్గా ఆడటం లేదు. 405 00:20:26,393 --> 00:20:30,272 స్టెఫనీ గిల్మోర్ పై తాతియానా వెస్టన్-వెబ్ విజయం సాధించింది. 406 00:20:30,355 --> 00:20:33,108 మీ ఛాంపియన్, తాతియానా వెస్టన్-వెబ్. 407 00:20:35,152 --> 00:20:36,695 ఓటమి అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. 408 00:20:36,778 --> 00:20:39,239 ఈ కొత్త తరం అమ్మాయిలను 409 00:20:39,323 --> 00:20:41,575 ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టేందుకు ఎలా ఆడాలో 410 00:20:42,284 --> 00:20:44,036 ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాను. 411 00:20:46,079 --> 00:20:50,125 ఈ అమ్మాయిలు చాలా గట్టివారు. వాళ్ల శక్తియుక్తులు ఎంతో గొప్పవి. 412 00:20:51,084 --> 00:20:53,045 వాళ్లందరిలోకీ నేనే బలహీనురాలిని. 413 00:20:57,591 --> 00:21:00,594 మనం ఇప్పుడు అధికారికంగా క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభిస్తున్నాం. 414 00:21:01,220 --> 00:21:03,388 ఈ ఈవెంట్లోకి గిల్మోర్ ప్రపంచంలోనే ఐదవ స్థానంలో బరిలోకి దిగుతోంది, 415 00:21:03,472 --> 00:21:05,349 చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో. 416 00:21:06,850 --> 00:21:08,268 క్వార్టర్ ఫైనల్ కి వస్తున్నపుడు, 417 00:21:08,352 --> 00:21:11,605 నేను టాప్ ఫైవ్ లో ఉండకపోవచ్చుననే వాస్తవాన్ని గ్రహించి బరిలోకి దిగాలి. 418 00:21:11,688 --> 00:21:13,649 నేను మంచి ఫలితాన్ని రాబట్టాలి, 419 00:21:13,732 --> 00:21:16,485 కానీ, ఈ అమ్మాయిలందరినీ చూస్తున్నప్పుడు, "నేను మరింత మెరుగైన 420 00:21:16,568 --> 00:21:18,028 ప్రదర్శన ఎలా ఇవ్వాలి?" అని అనుకున్నాను. 421 00:21:18,820 --> 00:21:20,155 నేను ఆమెను ఓడించాలి. 422 00:21:20,656 --> 00:21:21,532 తదుపరి హీట్: 423 00:21:21,615 --> 00:21:24,493 తాతియానా వెస్టన్-వెబ్ మరియు స్టెఫనీ గిల్మోర్. 424 00:21:26,119 --> 00:21:27,746 మళ్లీ ఇవాళ కూడా పోరు హోరాహోరీ జరుగుతుంది. 425 00:21:27,829 --> 00:21:28,872 కీలకమైన రోజు. 426 00:21:28,956 --> 00:21:30,874 ముప్పై సెకన్లలో ప్రారంభమవుతుంది. 427 00:21:31,708 --> 00:21:33,043 ఈ కొత్త తరం అమ్మాయిలతో 428 00:21:33,126 --> 00:21:36,421 నేను యుద్ధం చేయబోతున్నానని నాకు నేను చెప్పుకున్నాను. 429 00:21:37,256 --> 00:21:39,508 తాతియానా సర్ఫింగ్ అద్భుతం. 430 00:21:39,591 --> 00:21:42,427 నేను విభిన్నంగా చేయాలి. మరింతగా కష్టపడాలి. 431 00:21:44,096 --> 00:21:48,267 ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 432 00:21:52,229 --> 00:21:54,147 అదిగో స్టెఫనీ గిల్మోర్. 433 00:21:55,858 --> 00:21:57,025 బాగుంది. 434 00:21:58,735 --> 00:22:00,153 ఆ కెరటాన్ని ఇట్టే అధిరోహించింది. 435 00:22:00,237 --> 00:22:01,405 సొగసైన సర్ఫింగ్. 436 00:22:01,488 --> 00:22:04,658 తాతియానా వెస్టన్-వెబ్. ఎయిర్ డ్రాప్. 437 00:22:05,409 --> 00:22:07,411 అలాంటి చోటే తాతి విజృంభిస్తుంది. 438 00:22:07,494 --> 00:22:11,331 కెరటం కాస్త ముందే విరిగి పడింది. 5.33. 439 00:22:11,415 --> 00:22:12,791 గిల్మోర్: 11.16 వెస్టన్-వెబ్: 5.33 440 00:22:13,959 --> 00:22:15,335 తాతీ కెరటం పై రైడ్ చేయడం చూశాం. 441 00:22:16,003 --> 00:22:17,838 అద్భుతమైన మలుపు. 442 00:22:18,255 --> 00:22:20,465 మహిళలు తమ శక్తినంతా ఉపయోగించి ప్రదర్శన చేస్తే, 443 00:22:20,549 --> 00:22:23,218 జడ్జీలు ఇష్టపడతారు కానీ, నేను కంట్రోల్ చేయలేను. 444 00:22:23,844 --> 00:22:26,054 నువ్వు స్టెఫనీ గిల్మోర్ ను ఓడించాలంటే 445 00:22:26,138 --> 00:22:27,639 ఆ రకమైన సమ్మేళనం అవసరం అవుతుంది మరి. 446 00:22:28,557 --> 00:22:30,893 స్టెఫ్ చక్కటి కార్వ్ తీసుకుంది. 447 00:22:30,976 --> 00:22:32,895 ఇదే బహుశా చివరి ఎక్స్ చేంజ్. 448 00:22:33,604 --> 00:22:35,439 ఇప్పుడు నాకు కావలసిన విధంగా నేను సర్ఫ్ చేయబోతున్నాను. 449 00:22:35,522 --> 00:22:39,610 నేను భయంకరంగా విరుచుకు పడేవిధంగా ఆడాలి, 450 00:22:39,693 --> 00:22:41,737 కానీ అదే సమయంలో నేను సుకుమారంగా ఆడతాను. 451 00:22:43,947 --> 00:22:45,407 చాలా అందమైన కెరటంపైన... 452 00:22:45,908 --> 00:22:47,576 రెండు అద్భుతమైన టర్న్ లు తీసుకుంది. 453 00:22:48,327 --> 00:22:52,164 తనకు ఇష్టం లేకపోయినా, స్టెఫనీ గిల్మోర్ 454 00:22:52,247 --> 00:22:53,916 విన్యాసాన్ని తాతియానా తిలకించాల్సి వచ్చింది. 455 00:22:53,999 --> 00:22:54,833 అర్థమైంది. 456 00:22:56,418 --> 00:22:57,294 అది సరిపోతుంది. 457 00:22:57,878 --> 00:23:01,924 తుది స్కోర్ గిల్మోర్: 15.50 వెస్టన్-వెబ్: 7.33 458 00:23:02,007 --> 00:23:05,594 మిగతా అమ్మాయిలందరూ బాగానే ఆడుతున్నా, 459 00:23:05,677 --> 00:23:08,138 అందరికంటే తాను ఎంతో మిన్న అనే విషయాన్ని 460 00:23:08,222 --> 00:23:09,932 స్టెఫ్ గుర్తుంచుకోవాలి. 461 00:23:10,599 --> 00:23:13,268 స్టెఫ్ ఆషామాషీ క్రీడాకారిణి కాదు, 462 00:23:13,352 --> 00:23:17,814 పైగా నేను పోటీలో అలా విఫలమవడం కూడా బాగోలేదు. 463 00:23:17,898 --> 00:23:20,234 కానీ మొత్తానికి, ఈవెంట్ ముగిసే సమయానికి, 464 00:23:20,317 --> 00:23:23,737 ప్రపంచ ఫైనల్లో అర్హతకు కావలసిన పాయింట్లు సంపాదించాను. 465 00:23:24,363 --> 00:23:25,614 బాగా పోరాడావు. 466 00:23:27,074 --> 00:23:28,951 ఆమె బోర్డు బాగా పాడైంది. 467 00:23:29,034 --> 00:23:30,244 -నిజంగా? -అవును. 468 00:23:30,994 --> 00:23:33,455 -బాగు చేసేవాడు ఇక్కడున్నాడా? -ఏమో మరి. 469 00:23:33,539 --> 00:23:35,207 ఈ పట్టణంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. 470 00:23:35,290 --> 00:23:37,709 -అవును. -నా బోర్డు వాడుకోవచ్చు. దీని పొడవు 5'8". 471 00:23:37,793 --> 00:23:38,794 ఏమో మరి. 472 00:23:38,877 --> 00:23:40,671 ఈ బోర్డుపై ఆమె అనేకసార్లు విజయం సాధించింది. 473 00:23:40,754 --> 00:23:41,922 -అవును. -తనకేం కాదు. 474 00:23:42,005 --> 00:23:44,049 హేయ్, స్టెఫ్. 475 00:23:45,133 --> 00:23:46,134 బాగా ఆడావు. 476 00:23:46,218 --> 00:23:48,720 ఇక రెండు హీట్లు ఆడితే ఇది విరిగిపోతుంది అనుకుంటా. 477 00:23:48,804 --> 00:23:52,224 కెల్లీ ఇప్పుడే చెబుతున్నాడు తన బోర్డు వాడుకోవచ్చని. 478 00:23:53,475 --> 00:23:54,685 అది మంచి విషయమే. 479 00:24:01,400 --> 00:24:03,527 కెరటాలు ఎగసిపడుతున్నాయి. 480 00:24:07,114 --> 00:24:11,326 జొవేన్ డిఫే మరియు మలియా మాన్యువెల్ మధ్య గొప్ప పోటీ జరగబోతోంది. 481 00:24:13,203 --> 00:24:17,833 నా శక్తినంతా వినియోగించి, అత్యుత్తమంగా పోరాడతానని నాకు తెలుసు... 482 00:24:17,916 --> 00:24:20,294 క్వార్టర్ ఫైనల్ జొవేన్ డిఫే వర్సెస్ మలియా మాన్యువెల్ 483 00:24:20,377 --> 00:24:23,172 ...అందుకే ఈ ఉదయం హాయిగా నిద్ర లేచా, సంతోషంగా ఉన్నా. 484 00:24:23,714 --> 00:24:24,840 బాగా ఆడు, పాపా. 485 00:24:25,757 --> 00:24:27,801 జొవేన్ డిఫే రంగంలోకి దిగింది. 486 00:24:28,468 --> 00:24:30,220 నురగలు కక్కుతున్న కెరటం ఆమె మీదకు వస్తోంది. 487 00:24:31,263 --> 00:24:32,222 చాలా దురదృష్టకరం. 488 00:24:32,306 --> 00:24:34,641 అలాంటి కెరటంపై ఆమె చేసేదేం ఉండదు. 489 00:24:34,725 --> 00:24:36,935 మలియా మాన్యువెల్ వేగం పుంజుకుంటోంది 490 00:24:37,519 --> 00:24:39,813 ఆమె కెరటాన్ని ఒక పుస్తకంలా అధ్యయనం చేస్తోంది. 491 00:24:40,397 --> 00:24:42,482 కెరటాన్ని చక్కగా ఎంచుకుంది. 492 00:24:43,609 --> 00:24:46,069 నీ సత్తా చూపించు జొవేన్, నీ సత్తా చూపించు. 493 00:24:46,737 --> 00:24:48,655 ఇక్కడ జొవేన్ డిఫే స్కోర్ సాధించాల్సిన అవసరం ఉంది. 494 00:24:50,866 --> 00:24:51,867 భారీ ఎయిర్ డ్రాప్. 495 00:24:54,494 --> 00:24:56,163 జొవేన్ డిఫే పడిపోయింది. 496 00:24:56,246 --> 00:25:00,667 కెరటాన్ని ఎంచుకోవడంలో తేడా, జొవేన్ దురదృష్టవంతురాలు. 497 00:25:01,376 --> 00:25:04,254 తుది స్కోర్ మాన్యువెల్: 12.67 డిఫే: 9.67 498 00:25:04,338 --> 00:25:06,507 ఫ్రాన్స్ నుంచి ఈ పోటీలను వీక్షిస్తున్నవారు ఈ అమ్మాయి హీట్ లో 499 00:25:06,590 --> 00:25:08,926 ఓడిపోయినందుకు నిరాశకు లోనై ఉంటారు. 500 00:25:09,676 --> 00:25:13,347 మలియా మాన్యువెల్, స్టెఫ్ గిల్మోర్ తోపాటు ఫైనల్ కి చేరింది. 501 00:25:13,430 --> 00:25:18,477 జొవేన్ డిఫే హీట్ లో ఓడిపోయినా, క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం ద్వారా, 502 00:25:18,560 --> 00:25:20,687 ఫైనల్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది. 503 00:25:21,188 --> 00:25:22,981 పెద్ద స్పాన్సర్ షిప్ ను కోల్పోయినా, 504 00:25:23,065 --> 00:25:26,443 టాప్ పైవ్ లో చేరాలన్న ఆమె పట్టుదలను చూస్తే, 505 00:25:26,527 --> 00:25:28,487 ఆమె తనకు తాను గర్వపడాలి. 506 00:25:28,570 --> 00:25:34,076 లోయర్ ట్రెసిల్స్ లో జరిగే ఫైనల్స్ లో చోటు సంపాదించావు. అక్కడ కలుద్దాం. 507 00:25:34,159 --> 00:25:36,078 థాంక్యూ కైపో. థాంక్యూ. అక్కడ కలుద్దాం. 508 00:25:38,163 --> 00:25:41,542 ప్రపంచ ఫైనల్స్ కు చేరడం నా లక్ష్యం. 509 00:25:42,251 --> 00:25:48,257 ఇప్పుడు స్టెఫ్ గిల్మోర్ లాంటి టాప్ సర్ఫర్లను ఓడించడం నా ముందున్న సవాల్. 510 00:25:55,639 --> 00:25:58,600 శుభోదయం, హ్యాపీ ఫైనల్స్ డే. 511 00:25:58,684 --> 00:26:00,686 ఈ ఉదయం చాలా అద్భుతంగా ఉంది. 512 00:26:01,436 --> 00:26:04,064 తదుపరి హీట్: హవాయీకి చెందిన మలియా మాన్యువెల్ 513 00:26:04,648 --> 00:26:06,650 వర్సెస్ స్టెఫనీ గిల్మోర్. 514 00:26:06,733 --> 00:26:10,070 చివరికి, మనం వేచి చూస్తున్న క్షణం రానే వచ్చింది. 515 00:26:10,612 --> 00:26:13,991 బీచ్ లో వీక్షకులు ఎవరూ లేరు, కానీ ప్రపంచంలోని అత్యుత్తమ 516 00:26:14,074 --> 00:26:16,618 సర్ఫర్లంతా ఈ పోటీకి వీక్షకులయ్యారు. 517 00:26:17,703 --> 00:26:20,289 ఒక అద్భుతమైన ఈవెంట్ కు ముగింపు పలికేందుకు 518 00:26:20,372 --> 00:26:22,457 మలియా మాన్యువెల్ మరియు స్టెఫనీ గిల్మోర్. 519 00:26:23,876 --> 00:26:26,003 పెను సవాల్ కు స్టెఫ్ సిద్ధమవుతోంది. 520 00:26:26,086 --> 00:26:30,340 అత్యంత శక్తిమంతమైన మరియు అనూహ్యమైన ఫలితాలను రాబట్టే... 521 00:26:30,424 --> 00:26:31,425 ఏఐ ఫరెవర్ 522 00:26:31,508 --> 00:26:32,676 ...మహిళా సర్ఫర్లలో మలియా ఒకతె, 523 00:26:32,759 --> 00:26:35,929 కాగా స్టెఫనీ కేవలం టాప్ ఫైవ్ లో చోటు సంపాదించి 524 00:26:36,013 --> 00:26:38,390 ఎనిమిదో ప్రపంచ టైటిల్ గెలవడమే కాదు, 525 00:26:38,473 --> 00:26:41,226 తన స్టయిల్ ను తనకు అనుకూలంగా మలచుకోవాలని కూడా చూస్తోంది. 526 00:26:41,310 --> 00:26:42,936 తన కెరీర్ కోసం ఆమె పోరాడుతోంది. 527 00:26:44,438 --> 00:26:45,689 బాగా ఆడు. 528 00:26:47,941 --> 00:26:49,151 చూద్దాం. 529 00:26:52,029 --> 00:26:53,780 గుర్రప్పందాలను నేను సమర్థించను. 530 00:26:55,657 --> 00:26:58,702 నాకు అనుభవం ఉందన్న విషయాన్ని నేను గుర్తుంచుకోవాలి. 531 00:26:58,785 --> 00:26:59,786 ఈ అమ్మాయిలను నేను ఓడించగలను. 532 00:26:59,870 --> 00:27:02,331 నా స్టయిల్ నాకు ఏడు ప్రపంచ టైటిల్స్ ను తెచ్చి పెట్టింది. 533 00:27:02,414 --> 00:27:03,999 నేనేమీ మార్చుకోవలసిన అవసరం లేదు. 534 00:27:04,082 --> 00:27:06,251 ఇది నా రోజు. నేను సాధిస్తాను. 535 00:27:06,335 --> 00:27:09,713 తదుపరి హీట్, తొమ్మిది నిమిషాల, 30 సెకన్లలో. 536 00:27:09,796 --> 00:27:11,089 తొమ్మిది నిమిషాల 30 సెకన్లలో. 537 00:27:12,633 --> 00:27:14,259 స్టెఫీని చూడండి, తను, 538 00:27:14,343 --> 00:27:17,221 "నేను సరదాకోసం సర్ఫింగ్ చేస్తున్నానంతే" అన్నట్లుగా ఉంది. 539 00:27:18,096 --> 00:27:20,474 కానీ గెలవాలనే తను ఇక్కడికి వచ్చింది. 540 00:27:20,557 --> 00:27:23,727 ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని అనుకోకపోతే ఆమె ఇక్కడికి వచ్చేది కాదు. 541 00:27:24,978 --> 00:27:29,358 ఆమె మొహంలో ఆ గాంభీర్యం అలా వచ్చి... మళ్లీ మాయమైపోతుంది. 542 00:27:30,234 --> 00:27:33,403 బరిలోకి దిగితే, ఆమె పూర్తిగా మారిపోతుంది. 543 00:27:34,404 --> 00:27:36,031 ముప్పై సెకన్లలో పోటీ ఆరంభమవుతుంది. 544 00:27:36,114 --> 00:27:37,658 ముప్ఫై సెకన్లలో మొదలవుతుంది. 545 00:27:37,741 --> 00:27:39,368 ఈ సీజన్ లో ఇదే చివరి హీట్. 546 00:27:39,451 --> 00:27:41,286 సాధించు, స్టెఫ్. 547 00:27:41,370 --> 00:27:42,871 శాలీ ఫిట్జిబన్స్ ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ #3 548 00:27:42,955 --> 00:27:44,164 ఆ కెరటాలను చూడండి. 549 00:27:45,582 --> 00:27:46,667 భయంకరంగా ఉన్నాయి. 550 00:27:51,296 --> 00:27:53,215 ఈవెంట్ ఫైనల్ - స్టెఫనీ గిల్మోర్ వర్సెస్ మలియా మాన్యువెల్ 551 00:27:53,298 --> 00:27:55,259 మూడు, రెండు, ఒకటి. 552 00:27:57,261 --> 00:27:58,846 గిల్మోర్ కు అద్భుతమైన ఆరంభం. 553 00:28:00,055 --> 00:28:01,306 అందమైన బ్యారెల్ రైడ్. 554 00:28:02,599 --> 00:28:04,518 పైప్ డ్రైనర్. దాన్ని ఛేదించు. 555 00:28:05,435 --> 00:28:06,436 అదీ లెక్క! 556 00:28:10,774 --> 00:28:14,152 స్టెఫ్ చక్కటి ప్రతిభ కనబరిచింది. 557 00:28:14,236 --> 00:28:16,572 జవాబిచ్చేందుకు మాన్యువెల్ సిద్ధమవుతోంది. 558 00:28:16,655 --> 00:28:18,991 కెరటంపైనుంచి దిగి, నియంత్రణతో నిలబడింది. 559 00:28:19,074 --> 00:28:21,785 చక్కటి పొజిషన్. మరో కెరటంపైకి సర్ఫ్ చేస్తోంది. 560 00:28:25,622 --> 00:28:26,957 ఆ రైడ్ ఆమెను ఆధిక్యంలో నిలబెడుతుంది. 561 00:28:27,040 --> 00:28:28,041 మాన్యువెల్: 13.20 గిల్మోర్: 7.33 562 00:28:28,125 --> 00:28:30,127 అదిగో, మరో పెద్ద కెరటం. 563 00:28:30,878 --> 00:28:33,505 గిల్మోర్ ను చూడండి. గొప్ప అవకాశం లభించింది. 564 00:28:34,256 --> 00:28:35,716 మొదటి సెక్షన్లో బాగా ఆడింది. 565 00:28:37,259 --> 00:28:40,512 వావ్. పది పాయింట్లు వస్తాయి. బాగా ఆడు. 566 00:28:41,680 --> 00:28:43,807 స్టెఫనీ గిల్మోర్ ఇక్కడే అద్భుతంగా ఆడుతుంది. 567 00:28:44,391 --> 00:28:45,350 బాబోయ్. అదరగొడుతోంది. 568 00:28:45,434 --> 00:28:49,563 ఏదిఏమైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. 569 00:28:50,480 --> 00:28:52,482 -అడ్డంకులేం లేవు, చక్కగా ముగించు. -స్టెఫ్. స్టెఫ్. 570 00:28:57,362 --> 00:28:58,864 గిల్మోర్ కష్టపడి ముగించింది, 571 00:28:58,947 --> 00:29:01,325 అయినా బోర్డును వదలలేదు. 572 00:29:01,408 --> 00:29:03,410 ఆధిక్యం సాధించాలంటే ఆమెకు 5.87 పాయింట్లు అవసరం. 573 00:29:03,493 --> 00:29:07,748 స్టెఫనీ గిల్మోర్, నీ చివరి రైడ్ లో 8.5 పాయింట్లు వచ్చాయి. 574 00:29:07,831 --> 00:29:10,667 మహిళల సర్ఫింగ్ రాణికి 8.5 పాయింట్లు. 575 00:29:10,751 --> 00:29:11,752 ఓరి నాయనోయ్. 576 00:29:11,835 --> 00:29:13,670 -అది చాలా పెద్ద స్కోర్. -అవును. పెద్ద... స్కోరే. 577 00:29:13,754 --> 00:29:15,756 తప్పకుండా గెలుపు ఆమెదే. 578 00:29:15,839 --> 00:29:18,258 అదిగో. మరో పెద్ద కెరటం. 579 00:29:19,092 --> 00:29:22,513 స్టెఫ్ గిల్మోర్ ఈ కెరటంకోసం తన ప్రాధాన్యతను వినియోగించుకుంటోంది. 580 00:29:27,100 --> 00:29:28,727 పడిపోయింది. 581 00:29:29,436 --> 00:29:30,479 ఛీ. 582 00:29:31,313 --> 00:29:34,358 మలియాకు కేవలం 7.57 పాయింట్లు చాలు. 583 00:29:34,441 --> 00:29:38,487 తను సర్ఫింగ్ చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే, ఆ స్కోర్ ఈజీగా సాధిస్తుంది. 584 00:29:38,570 --> 00:29:40,155 ఇక ఐదు నిమిషాలే మిగిలి ఉంది. 585 00:29:40,239 --> 00:29:41,823 -అదిగో. -ఐదు నిమిషాలు. 586 00:29:42,699 --> 00:29:45,035 ఈ కెరటం మాన్యువెల్ కి ఎలా ఉపయోగపడుతుంది? 587 00:29:47,955 --> 00:29:49,748 పెద్ద ఓపెన్ వాల్. 588 00:29:49,831 --> 00:29:52,709 కార్వ్ తీసుకునేందుకు పైకి వెళ్లింది కానీ, చేజార్చుకుంది. 589 00:29:52,793 --> 00:29:53,919 వావ్. 590 00:29:54,002 --> 00:29:56,547 ఆమెకు అదే చివరి అవకాశం ఏమో. 591 00:29:57,756 --> 00:30:01,093 ముప్ఫై సెకన్లు. ఏ అలజడీ లేదు. కెరటాలు కూడా లేవు. 592 00:30:03,679 --> 00:30:05,639 గెలిచేది స్టెఫనీ గిల్మొరే. 593 00:30:07,766 --> 00:30:12,145 ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు... 594 00:30:12,229 --> 00:30:13,438 వావ్! 595 00:30:13,522 --> 00:30:15,566 ...ఒకటి. 596 00:30:18,193 --> 00:30:19,820 గిల్మోర్: 15.83 మాన్యువెల్: 15.27 597 00:30:19,903 --> 00:30:21,488 శక్తి, దారుఢ్యం, టెక్నిక్ వంటి అంశాల్లో 598 00:30:21,572 --> 00:30:24,658 మహిళల సర్ఫింగ్ చాలా ముందంజ వేసింది. 599 00:30:26,326 --> 00:30:28,287 మహిళల సర్ఫింగ్ హోరాహోరీగా ఉంటుంది, కానీ సొగసైనది కూడా, 600 00:30:28,370 --> 00:30:30,163 సెక్సీగానూ, అథ్లీటిక్ గానూ ఉంటుంది. 601 00:30:30,789 --> 00:30:34,251 మేమంతా విభిన్నంగా సర్ఫ్ చేస్తాం, కానీ పోటీతత్వం కూడా సమానంగా ఉంటుంది. 602 00:30:34,334 --> 00:30:36,628 అదే అన్నింటికన్నా ముఖ్యం. 603 00:30:36,712 --> 00:30:41,049 ఇప్పుడు ఆమెకు డబ్ల్యూ.ఎస్.ఎల్ ఫైనల్ ఫైవ్ లో నాలుగో స్థానం లభించింది. 604 00:30:44,219 --> 00:30:46,763 నా సర్ఫింగ్ ని జనం ఎలా అర్థం చేసుకున్నా పట్టించుకోను. 605 00:30:48,640 --> 00:30:53,854 మనం నిర్భీతిగా బరిలోకి దిగాలి. "నీకంటే గొప్పగా ఆడతాను చూడు" 606 00:30:53,937 --> 00:30:55,606 అనే తెగువ చూపించాలి. 607 00:30:56,481 --> 00:30:58,066 అప్పుడు నువ్వు సత్తా చూపిస్తావు. 608 00:30:59,818 --> 00:31:02,779 ఎనిమిదోసారి ప్రపంచ ఛాంపియన్ అయితే ఎలా ఉంటుంది, 609 00:31:02,863 --> 00:31:04,865 అప్పుడు ఎలా ఫీలవుతానోనని తరచూ అనుకుంటూ ఉంటాను. 610 00:31:04,948 --> 00:31:06,325 ఎనిమిది అనేది ఒక అందమైన సంఖ్య. 611 00:31:08,368 --> 00:31:10,287 ధన్యవాదాలు. వరల్డ్ సర్ఫ్ లీగ్ ఛాంపియన్ షిప్ టూర్ 612 00:31:10,370 --> 00:31:13,457 మహిళల ఫైనల్. 613 00:31:13,540 --> 00:31:14,625 అద్భుతంగా జరిగింది. 614 00:31:14,708 --> 00:31:18,504 చక్కటి ఫామ్ లో ఉన్న ఇద్దరు క్రీడాకారిణులు నువ్వా నేనా అనే రీతిలో పోరాడారు 615 00:31:18,587 --> 00:31:20,631 నేనెన్నడూ చూడని చక్కటి ఫైనల్స్ ఇది. 616 00:31:21,381 --> 00:31:23,509 మహిళల సర్ఫింగ్ నే కాకుండా 617 00:31:23,592 --> 00:31:25,469 మొత్తం సర్ఫింగ్ ఆటనే స్టెఫ్ మరో స్థాయికి తీసుకువెళ్లిందనేది 618 00:31:25,552 --> 00:31:27,137 నిర్వివాదాంశం. 619 00:31:29,014 --> 00:31:31,558 కానీ తన స్టయిల్ ను ఆమె కాపాడుకోవడమనేది రానున్న 620 00:31:31,642 --> 00:31:34,645 సంవత్సరాల్లో ఆమెకు ఎదురయ్యే పెను సవాల్. 621 00:31:35,395 --> 00:31:38,690 ఈ ఛాంపియన్ మీ అందరికీ చిరపరిచితురాలే. 622 00:31:38,774 --> 00:31:41,026 ఈ రెండు రకాల సర్ఫింగ్ లో రాణించేందుకు అవకాశం ఎలా ఇవ్వాలో 623 00:31:41,109 --> 00:31:46,240 ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 624 00:31:46,949 --> 00:31:49,159 ఫైనల్ ఈవెంట్ లో అగ్రస్థానంలో నిలబడిన వ్యక్తి 625 00:31:49,243 --> 00:31:52,204 ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన స్టెఫనీ గిల్మోర్. 626 00:31:52,287 --> 00:31:55,457 లేదా అదే భవిష్యత్తు మార్గం అని మనం అనవచ్చు. 627 00:31:55,541 --> 00:31:58,210 మీరు అద్భుతమైన ఆటను కనబర్చండి లేదా టూర్ నుంచి తప్పుకోండి. 628 00:32:01,672 --> 00:32:02,881 దేవుడా. 629 00:32:02,965 --> 00:32:04,883 -నమ్మలేకపోతున్నాను. -బాబోయ్. 630 00:32:07,052 --> 00:32:08,595 ఎన్నడూ కలగని ఆనందం కలుగుతోంది. 631 00:32:09,221 --> 00:32:10,347 గెలవడం నాకిష్టం. 632 00:32:11,557 --> 00:32:13,475 -చాలాకాలం తర్వాత. -చాలాకాలం తర్వాత ఈ గెలుపు. 633 00:32:14,142 --> 00:32:16,186 అవును. నువ్వు సాధించావు. 634 00:32:16,270 --> 00:32:18,856 ఎనిమిదో టైటిల్ కోసం నువ్వు ట్రెసిల్స్ కి వెళ్తున్నావు. 635 00:32:19,439 --> 00:32:20,440 ఓరి దేవుడా. 636 00:32:25,195 --> 00:32:26,113 తర్వాతి ఎపిసోడ్ లో 637 00:32:26,196 --> 00:32:28,073 నిరీక్షణకు తెర పడింది. 638 00:32:29,116 --> 00:32:30,158 ఐదు... 639 00:32:30,242 --> 00:32:32,244 ఆ సర్ఫర్లలో ఒకరు ప్రపంచ టైటిల్ ను ఎగరేసుకుపోతారు. 640 00:32:32,327 --> 00:32:33,579 నాలుగు... 641 00:32:33,662 --> 00:32:35,414 ఆ సమయం వచ్చినప్పడు నువ్వు అద్భుతంగా ఆడగలవా? 642 00:32:35,497 --> 00:32:36,748 మూడు... 643 00:32:36,832 --> 00:32:39,126 చరిత్ర పుస్తకాల్లో నీ పేరు రాసే సమయం వచ్చింది. లెజెండ్ గా నిలిచిపోతావు. 644 00:32:39,209 --> 00:32:41,378 -రెండు... -నేను గెలుస్తాను. 645 00:32:41,461 --> 00:32:42,921 నేను గెలుస్తాను. 646 00:32:43,005 --> 00:32:45,132 -ఒకటి. -మొదలుపెట్టండి! 647 00:33:37,184 --> 00:33:39,186 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్