1 00:00:17,684 --> 00:00:18,685 పిటీ! 2 00:00:20,729 --> 00:00:23,232 పిటీ! పిటీ! 3 00:00:28,195 --> 00:00:30,989 -వద్దు! వెళ్ళకు! -నన్ను వెళ్లనివ్వు! నేను వెళ్ళాలి. 4 00:00:32,281 --> 00:00:35,327 లేదు! మనం తనని రక్షించాలమ్మా! మనం రక్షించాలి! 5 00:00:35,410 --> 00:00:38,247 -వద్దు! ఆగు! ఆగు బాబూ! -లేదు! నన్ను వెళ్ళనివ్వు! 6 00:00:40,082 --> 00:00:42,751 పిటీ! పిటీ! పిటీ! 7 00:00:43,293 --> 00:00:45,212 మాడ్! మాడ్! 8 00:00:45,295 --> 00:00:46,296 రక్షించండి! 9 00:00:49,216 --> 00:00:51,426 పిటీ! పిటీ! 10 00:00:54,388 --> 00:00:55,639 పిటీ! 11 00:00:58,267 --> 00:00:59,268 పిటీ. 12 00:01:01,979 --> 00:01:03,230 పిటీ. 13 00:01:03,313 --> 00:01:05,065 భయపడకు, మాడ్. 14 00:01:05,649 --> 00:01:07,317 భయపడకు. నాతో రా. 15 00:01:25,002 --> 00:01:29,298 వద్దు, వద్దు. నన్ను వదులు! నన్ను వదులు! 16 00:01:30,340 --> 00:01:31,800 ప్లీజ్. బాబూ! 17 00:01:31,884 --> 00:01:33,468 నా పాపని రక్షించనివ్వండి! 18 00:01:34,970 --> 00:01:37,431 నా పాపని రక్షించనివ్వండి! 19 00:01:37,514 --> 00:01:40,517 నా పాప! ఎవరైనా నా పాపని రక్షించండి! 20 00:01:41,351 --> 00:01:43,353 మనమిక ఆగచ్చు, పిటీ. 21 00:02:53,173 --> 00:02:54,633 గుడ్ మార్నింగ్. 22 00:02:54,716 --> 00:02:56,426 హేయ్. 23 00:02:59,471 --> 00:03:00,639 ఓహ్, మీరు కాలిపోతున్నారు. 24 00:03:02,516 --> 00:03:04,309 మంటల్లో పరిగెత్తి వచ్చానులే. 25 00:03:06,562 --> 00:03:08,522 తారు పేపరుతో చేసిన గుడిసె మంటల్లో కాలిపోయింది. 26 00:03:08,605 --> 00:03:11,441 నా బుల్లి గర్ల్ ఫ్రెండ్ మాడ్ పెటిట్ అందులో ఉంది, కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. 27 00:03:11,525 --> 00:03:13,360 నేను లోపలికి వెళ్లి తనని కాపాడాను. 28 00:03:13,443 --> 00:03:15,487 ఈసారి మంచి కల వచ్చినట్లుందే. 29 00:03:15,571 --> 00:03:20,492 నేనైతే అలా అంటానో లేదో తెలీదు, కానీ చాలా కాలం తర్వాత వచ్చింది. 30 00:03:20,576 --> 00:03:24,788 అవును. సరే, ఏదేమైనా కానీ మీరు ప్రశాంతంగా ఉన్నారు. కొత్తగా ఉంది. 31 00:03:24,872 --> 00:03:27,040 అవును, ఇక్కడ మాత్రం కాదు. 32 00:03:29,835 --> 00:03:33,839 నేను 54, 55 ఏళ్ళ క్రితం నార్వేకు చెందిన ఉరుము దేవుడు 33 00:03:33,922 --> 00:03:39,428 తోర్ గురించి ఒక కామిక్ బుక్ చదివిన విషయం గుర్తొచ్చింది. 34 00:03:40,929 --> 00:03:45,392 అతని తండ్రి ఓడిన్ కు ఒక కుర్చీ… ఒక సింహాసనం ఉంది. 35 00:03:46,560 --> 00:03:49,980 సింహాసనం పేరు హ్లిస్కాఫ్. 36 00:03:51,356 --> 00:03:53,400 ఓడిన్ ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, 37 00:03:53,483 --> 00:03:59,781 అతను ప్రతి విషయాన్నీ, ప్రతి చోటునీ ఒకేసారి చూడగలిగేవాడు. 38 00:04:01,909 --> 00:04:03,619 నా మెదడులో ఆలోచనలు ప్రస్తుతం అలా ఉన్నాయి. 39 00:04:04,578 --> 00:04:10,250 మాడ్, మా అమ్మ. సెన్సియా. నువ్వు. 40 00:04:10,334 --> 00:04:11,335 నేనా? 41 00:04:12,252 --> 00:04:13,712 నా గురించి తెలిసి నెల కూడా కాలేదు. 42 00:04:15,881 --> 00:04:19,384 నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే, నేనిప్పుడు ఇలా కూర్చుని ఉండేవాడిని కాదు. 43 00:04:23,555 --> 00:04:24,806 నేను ఇప్పటికీ వేడిగా ఉన్నానా? 44 00:04:25,849 --> 00:04:28,810 అవును. కొంచెం నీళ్ళు తాగండి. 45 00:04:30,604 --> 00:04:31,730 మందు వేసుకోండి. 46 00:04:34,525 --> 00:04:35,984 నేను వెళ్లి స్నానం చేసి వస్తాను. 47 00:04:38,153 --> 00:04:39,821 మిస్ షిర్లీ రింగ్ కాల్ చేశారు. 48 00:04:41,448 --> 00:04:44,284 డబ్ల్యూ-ఆర్-ఐ-ఎన్-జి! 49 00:04:44,368 --> 00:04:45,369 అవును. 50 00:04:56,338 --> 00:04:57,339 హలో? 51 00:04:57,422 --> 00:04:59,258 నేను, టోలెమీని. 52 00:04:59,341 --> 00:05:01,718 ఎవరో నాకు తెలుసు. 53 00:05:01,802 --> 00:05:04,012 ఫోన్ మోగకముందే నువ్వేనని నాకు తెలుసు. 54 00:05:04,096 --> 00:05:06,098 నీ కోసం ఏం చేయమంటావ్, మిస్ రింగ్? 55 00:05:06,640 --> 00:05:09,351 -"అవును" అని చెప్పు. -అవును. 56 00:05:09,434 --> 00:05:12,187 దేని కోసం అవునని చెబుతున్నావో తెలుసుకోవాలని లేదా? 57 00:05:12,271 --> 00:05:13,397 ఖచ్చితంగా ఉంది, 58 00:05:13,480 --> 00:05:17,192 కానీ నేను అవునని ఇప్పుడు చెప్పినా, తర్వాత చెప్పినా తేడా ఉండదు. 59 00:05:17,276 --> 00:05:19,444 నువ్వు పిచ్చోడివి తెలుసా, టోలెమీ గ్రే? 60 00:05:19,528 --> 00:05:22,865 అవును, కానీ ఆ పిచ్చితనమే నన్ను బతికేలా చేస్తోంది. 61 00:05:22,948 --> 00:05:25,659 సరే, నాతో కలిసి లంచ్ చేయాలని అనిపిస్తే, 62 00:05:25,742 --> 00:05:29,037 హిల్ స్ట్రీట్ లో ఉన్న మోనిక్ టీ హౌస్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. 63 00:05:29,621 --> 00:05:32,457 నేను రెండు గంటలకి నా ఫ్లాట్ లో ఉంటాను. 64 00:05:36,253 --> 00:05:38,630 ఒక్కరోజు ఆగగలవా? కేవలం ఒక్కరోజు. 65 00:05:39,214 --> 00:05:40,507 నేను కొత్త మందులు తీసుకుంటున్నాను, 66 00:05:40,591 --> 00:05:42,634 ప్రస్తుతం నా ఆరోగ్యం కొద్దిగా బాగోలేదు. 67 00:05:42,718 --> 00:05:45,304 -అయితే రేపు కలుద్దామా? -సందేహమే లేదు. 68 00:05:45,804 --> 00:05:47,806 -ఒంటిగంటకి? -తప్పకుండా వస్తాను. 69 00:05:48,557 --> 00:05:50,934 -బై, టోలెమీ. -బై, షిర్లీ. 70 00:06:00,027 --> 00:06:01,528 బై, షిర్లీ. 71 00:06:05,490 --> 00:06:07,034 ఓహ్, ఒక్క క్షణంలో మీకు అడ్డం లేస్తాను. 72 00:06:07,117 --> 00:06:08,785 మీ అద్దంలో చూసుకోవాలని అనుకున్నానంతే. 73 00:06:08,869 --> 00:06:09,870 నాకది నచ్చింది. 74 00:06:09,953 --> 00:06:14,333 అవునా? మొదట బాగుంటుందా లేదా అనిపించింది, కానీ ఏమో నాకు తెలీదు. 75 00:06:16,376 --> 00:06:17,753 మిస్ రింగ్ ఎలా ఉన్నారు? 76 00:06:17,836 --> 00:06:19,213 నన్ను టీకి ఆహ్వానించింది. 77 00:06:19,922 --> 00:06:21,590 -టీకా? -ఈ మధ్యాహ్నం. 78 00:06:22,174 --> 00:06:24,843 సరే అయితే, మీకు అంత ఉత్సాహంగా ఉంటే… 79 00:06:24,927 --> 00:06:27,179 రోజర్ తో మధ్యాహ్నం ఎంత సేపటి వరకు బయట ఉంటావు? 80 00:06:28,388 --> 00:06:29,598 నాకు తెలీదు. ఎందుకు? 81 00:06:29,681 --> 00:06:33,393 సరే, లంచ్ తర్వాత ఇంటికి ఆమెను ఇంటికి తీసుకొచ్చి సరదాగా గడుపుతాం అనుకుంటున్నాను. 82 00:06:34,520 --> 00:06:37,356 -"సరదాగా గడపడం" అంటే ఏంటో చెప్పండి. -మగవాళ్ళకి కూడా కొన్ని రహస్యాలు ఉంటాయి, అవునా? 83 00:06:38,190 --> 00:06:40,943 సరే అయితే, మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. 84 00:06:41,026 --> 00:06:42,152 మీకు ఎన్ని గంటలు కావాలి? 85 00:06:42,236 --> 00:06:44,363 అదీ, లంచ్ సుమారు మూడు గంటలకి అయిపోతుంది. 86 00:06:44,446 --> 00:06:46,240 కాబట్టి ఇంకో రెండు గంటలు కావాలి. 87 00:06:46,323 --> 00:06:47,407 రెండు గంటలా… 88 00:06:49,701 --> 00:06:52,204 సరే. జాగ్రత్తగా ఉండండి, అంకుల్. 89 00:06:52,287 --> 00:06:54,248 నేను ఎలాంటి ప్రమాణాలు చేయలేను. 90 00:07:00,754 --> 00:07:02,130 హాయ్. 91 00:07:06,677 --> 00:07:07,761 ఎలా ఉన్నావు? 92 00:07:07,845 --> 00:07:09,805 -బాగున్నాను, నువ్వు? -బాగున్నాను. 93 00:07:17,104 --> 00:07:18,856 -నువ్వు బానే ఉన్నావా? -ఏమీ లేదు. బానే ఉన్నాను. 94 00:08:01,732 --> 00:08:03,192 హాయ్, పిటీ పాపా. 95 00:08:05,277 --> 00:08:11,533 నీకు సెలవు రోజు ఉంటే, అన్ని ఖర్చులూ పోను బ్యాంకులో… 96 00:08:12,784 --> 00:08:13,869 …కొంత డబ్బు ఉంటే ఏం చేస్తావు? 97 00:08:19,291 --> 00:08:24,505 సూర్యోదయం కంటే ముందు నిన్ను నిద్ర లేపుతాను. 98 00:08:27,633 --> 00:08:31,220 లేక్ అల్లాటూనాకి బస్సులో వెళతాం. 99 00:08:33,764 --> 00:08:38,684 మన షూస్, సాక్స్ తీసేసి, సరస్సు ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్లి, 100 00:08:39,477 --> 00:08:41,563 సూర్యోదయాన్ని చూస్తాం. 101 00:08:41,647 --> 00:08:42,898 అంతేనా? 102 00:08:45,359 --> 00:08:46,985 ఆ తర్వాత మనం మ్యూజియంకి వెళ్లి, 103 00:08:48,111 --> 00:08:50,822 అక్కడి కళని ఆస్వాదిస్తాం. 104 00:08:59,957 --> 00:09:00,958 అవును. 105 00:09:56,930 --> 00:09:57,931 మిస్టర్ గ్రే. 106 00:09:59,266 --> 00:10:00,267 గుడ్ మార్నింగ్. 107 00:10:12,863 --> 00:10:15,240 -మీ పేరేంటి? -హెర్నాండేజ్. 108 00:10:16,033 --> 00:10:17,701 మిమ్మల్ని కలిసినందుకు సంతోషం, మిస్టర్ హెర్నాండేజ్. 109 00:10:17,784 --> 00:10:20,704 లేదు, మిస్టర్ గ్రే. మిస్టర్ హెర్నాండేజ్ కాదు, హెర్నాండేజ్ అనండి చాలు. 110 00:10:20,787 --> 00:10:22,039 నాకు ఆ పేరు బాగా నచ్చింది. 111 00:10:22,915 --> 00:10:26,877 -మీరు ఈ ప్రాంతానికి చెందిన వారేనా, హెర్నాండేజ్? -40 ఏళ్ళ నుండీ ఉంటున్నా. సరిగ్గా ముప్ఫై ఎనిమిదేళ్ళు. 112 00:10:26,960 --> 00:10:30,797 నాకు ఏడేళ్ళ వయసప్పుడు, నా తల్లిదండ్రులు దక్షిణ మెక్సికోలోని ఒక గ్రామం నుండి ఇక్కడికి వచ్చారు. 113 00:10:30,881 --> 00:10:32,216 స్పానిష్ మాట్లాడగలరా? 114 00:10:32,299 --> 00:10:34,885 లేదు, కొద్దిగా యాస మాత్రమే ఉంది. 115 00:10:35,677 --> 00:10:37,054 నాకు కొన్ని పదాలు తెలుసు. 116 00:10:37,137 --> 00:10:39,097 మీతో మిగిలిపోయే విషయాలు వింతగా ఉంటాయి కదూ, హా? 117 00:10:39,181 --> 00:10:40,474 అవును. 118 00:10:41,391 --> 00:10:42,434 అవును, చాలా వింతగా ఉంటాయి. 119 00:10:51,777 --> 00:10:53,111 వైరస్… 120 00:11:22,975 --> 00:11:24,059 ఏవండీ. 121 00:11:25,727 --> 00:11:29,189 ఆ కళ్ళలో మీకు ఏం కనబడుతోంది? 122 00:11:29,273 --> 00:11:30,274 నేను… నాకు… 123 00:11:30,357 --> 00:11:33,944 నా ఉద్దేశం, మీరు కళ్ళని మాత్రమే చూసినప్పుడు, 124 00:11:34,653 --> 00:11:36,780 ఏం కనిపిస్తోందో చెప్పండి. 125 00:11:41,827 --> 00:11:42,828 నాకు తెలీదు. 126 00:11:44,496 --> 00:11:46,123 ధృడ సంకల్పం అయ్యుంటుందా? 127 00:11:47,207 --> 00:11:50,586 -దృఢ నిశ్చయం. ధిక్కారం. -లేదు. లేదు. లేదు. 128 00:11:50,669 --> 00:11:53,964 నా ఉద్దేశం, అవును, మీరు… మీరు చెప్పింది నిజమే కావొచ్చు. 129 00:11:54,548 --> 00:11:57,634 కానీ నేను… నా ఉద్దేశం ఏంటంటే… 130 00:11:59,261 --> 00:12:00,262 రంగు గురించి. 131 00:12:01,346 --> 00:12:06,101 అతని కళ్ళ చుట్టూ చూసినప్పుడు, మీకు… మీకు ఏ రంగు కనిపిస్తోంది? 132 00:12:07,811 --> 00:12:08,812 నీలమా? 133 00:12:08,896 --> 00:12:11,023 -నీలమా? -నీలం. 134 00:12:12,149 --> 00:12:13,150 నీలం… 135 00:12:14,776 --> 00:12:16,278 -ఖచ్చితంగా. -అవును. 136 00:12:16,945 --> 00:12:17,946 నీలం. 137 00:12:19,072 --> 00:12:20,073 థాంక్యూ, మేడం. 138 00:12:20,157 --> 00:12:21,158 పరవాలేదు. 139 00:12:23,243 --> 00:12:24,244 నీలం. 140 00:12:28,123 --> 00:12:29,499 నీలం. 141 00:12:31,919 --> 00:12:33,045 నీలం. 142 00:12:58,904 --> 00:13:00,197 ఎలా ఉన్నావో చూడు, బాబూ. 143 00:13:03,283 --> 00:13:04,993 అదిగో. పట్టుకుందాం. 144 00:13:06,370 --> 00:13:07,955 కానివ్వు. విసురు. 145 00:13:09,248 --> 00:13:10,249 మంచిది పట్టుకో. 146 00:13:11,250 --> 00:13:12,918 ప్రయత్నించు. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. 147 00:13:22,886 --> 00:13:26,265 -మనం ఎందుకు ఆగు… ఆగుతున్నాం? -ఎందుకంటే మనం వచ్చేశాం, మిస్టర్ గ్రే. 148 00:13:28,058 --> 00:13:30,185 -ఎక్కడికి వచ్చేశాం? -లేక్ అల్లాటూనా. 149 00:13:30,269 --> 00:13:32,312 తర్వాత ఇక్కడికే రావాలని చెప్పారు, కాదా? 150 00:13:34,648 --> 00:13:35,816 అవును. అవును, ఖచ్చితంగా చెప్పాను. 151 00:14:15,772 --> 00:14:16,815 అందంగా ఉంది. 152 00:14:18,525 --> 00:14:21,320 ఇంకా అందమైంది కూడా చూశాను, కానీ ఇది సరిపోతుంది. 153 00:14:22,446 --> 00:14:23,572 సమయం అయింది. 154 00:14:24,364 --> 00:14:25,532 నాకు తెలుసు. 155 00:14:26,533 --> 00:14:28,160 ఇంటికి బయలుదేరడం మంచిది. 156 00:14:30,078 --> 00:14:33,332 చివరిగా ఒక్క పని చేసి, తర్వాత నీ దగ్గరకు వచ్చేస్తాను. 157 00:14:37,085 --> 00:14:38,086 నేను మాటిస్తున్నాను. 158 00:14:38,879 --> 00:14:40,672 మరీ ఎక్కువ సమయం తీసుకోవద్దు, సరేనా, పిటీ? 159 00:14:41,715 --> 00:14:42,716 నేను ప్రయత్నిస్తాను. 160 00:15:10,953 --> 00:15:12,329 మనం వచ్చేశాం, మిస్టర్ గ్రే. 161 00:15:12,412 --> 00:15:13,872 ఇంటికి వచ్చేశాం, ఇంటికి వచ్చేశాం. 162 00:15:13,956 --> 00:15:16,875 థాంక్యూ, హెర్నాండేజ్. మీతో ప్రయాణించినందుకు సంతోషంగా ఉంది. 163 00:15:16,959 --> 00:15:18,502 నాక్కూడా. 164 00:15:19,253 --> 00:15:20,254 ఇందులో ఉన్నది… 165 00:15:23,131 --> 00:15:24,466 ఇది మీ కోసం. 166 00:15:24,550 --> 00:15:27,219 థాంక్యూ, కానీ టిప్స్ తీసుకోవడం నిబంధనలకు విరుద్దం. 167 00:15:27,302 --> 00:15:28,971 ఓహ్, అదీ, దీన్ని టిప్ గా అనుకోకండి, 168 00:15:29,054 --> 00:15:34,268 ఒక సాయం కోసం లేదా కొనసాగింపు సేవల కోసం అనుకోండి. 169 00:15:35,227 --> 00:15:39,690 కాసేపట్లో ఇక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, కోపంగా ఉన్నట్టు ఉండి, పొట్టి జుట్టుతో ఉంటాడు, 170 00:15:39,773 --> 00:15:43,110 నా… నా అపార్ట్ మెంట్ తలుపు దగ్గరికి వస్తాడు. 171 00:15:43,193 --> 00:15:44,528 ఏంటిదంతా, మిస్టర్ గ్రే? 172 00:15:44,611 --> 00:15:46,488 ఓహ్, ఇందులో మీరు కంగారు పడాల్సింది ఏదీ లేదు. 173 00:15:46,572 --> 00:15:48,949 మీరు చేయాల్సిందల్లా అతను లోపలికి రాగానే, 174 00:15:49,032 --> 00:15:51,410 మీరు ఐదు నిమిషాల పాటు ఎదురుచూసి 175 00:15:51,493 --> 00:15:54,997 మీరు ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా హార్న్ మోగించడం మొదలుపెట్టండి. 176 00:15:55,080 --> 00:15:58,083 చాలా గట్టిగా ఎక్కువసేపు హార్న్ మోగించండి. 177 00:15:58,166 --> 00:15:59,668 చాలా గట్టిగా మోగించాలి, సరేనా? 178 00:15:59,751 --> 00:16:02,337 -అంతేనా? నేను చేయాల్సింది అదేనా? -అవును, సర్, అంతే. 179 00:16:02,421 --> 00:16:04,756 నా కోసం మీరు ఆ పని చేయగలిగితే, 180 00:16:04,840 --> 00:16:06,341 మీరు ఈ ముసలోడికి సంతోషం కలిగిస్తారు. 181 00:16:09,178 --> 00:16:10,637 మీ కోసం చేస్తాను, మిస్టర్ గ్రే. 182 00:16:12,431 --> 00:16:13,682 మీరు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. 183 00:16:17,311 --> 00:16:19,688 థాంక్యూ. థాంక్యూ, హెర్నాండేజ్. 184 00:16:19,771 --> 00:16:22,566 మీరు చాలా మంచివారు. మిమ్మల్ని మెచ్చుకుని తీరాలి. 185 00:16:22,649 --> 00:16:23,650 అలాగే, సర్. 186 00:16:23,734 --> 00:16:25,360 -ఈ రోజు బాగా గడపండి. -మీరు కూడా. 187 00:17:37,891 --> 00:17:39,226 బాల్మూర్ సింగిల్ మాల్ట్ స్కాచ్ 188 00:17:48,151 --> 00:17:51,238 రెండుకి తొమ్మిది కలిపితే పదకొండు. 189 00:17:56,493 --> 00:17:59,663 రెండుకి తొమ్మిది కలిపితే పదకొండు. 190 00:18:08,463 --> 00:18:09,464 రాబిన్. 191 00:18:12,092 --> 00:18:16,346 నేనిక్కడ నిజం కోసం ఎదురు… ఎదురుచూస్తూ ఉన్నాను. 192 00:18:17,014 --> 00:18:20,100 ఇప్పుడు నేను గతం మొత్తాన్నీ గుర్తు చేసుకోగలిగినప్పటికీ… 193 00:18:21,101 --> 00:18:24,104 …ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలీదు. 194 00:18:24,688 --> 00:18:27,149 నాకు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 195 00:18:27,232 --> 00:18:31,278 నాకు తెలియాలి, అప్పుడే నేను అందుకు తగ్గట్లుగా ప్రవర్తించగలుగుతాను. 196 00:18:38,660 --> 00:18:41,830 నన్ను… ఈరోజు జరగబోయే దానికి నన్ను క్షమించు. 197 00:18:44,416 --> 00:18:46,293 కానీ నేను పరిస్థితిని చక్కబెట్టాలి. 198 00:18:48,378 --> 00:18:50,756 ఆ వెధవ తను చేసిన పనికి మూల్యం చెల్లించి తీరాలి. 199 00:18:54,927 --> 00:18:57,221 ఇలా జరగాలని నువ్వు కోరుకోలేదని నాకు తెలుసు… 200 00:18:59,848 --> 00:19:01,099 కానీ మరో దారి లేదు. 201 00:19:04,561 --> 00:19:07,856 అతనే. మనిషి రూపంలో వచ్చిన నిజం. 202 00:19:10,234 --> 00:19:12,152 నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసులే పెద్దాయనా! 203 00:19:12,736 --> 00:19:14,446 ఐ లవ్ యు, రాబిన్. 204 00:19:22,371 --> 00:19:25,165 -ఎవరది? -ఎవరో నీకు తెలీదా ఏంటి! 205 00:19:26,166 --> 00:19:27,751 త్వరగా తలుపు తెరువు! 206 00:19:28,502 --> 00:19:29,878 లోపలికి రా. తెరిచే ఉంది. 207 00:19:41,932 --> 00:19:43,642 కూర్చో, మిస్టర్ గల్లా. 208 00:20:02,411 --> 00:20:07,541 మిస్సిసిపిలోని బర్డెట్ లో నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, ముసలివాళ్ళు మా పిల్లలతో ఏమని చెప్పే వారంటే 209 00:20:07,624 --> 00:20:10,252 సీల్ చేయని సీసాలోంచి మద్యం అస్సలు తాగొద్దని చెప్పేవారు. 210 00:20:10,335 --> 00:20:12,045 ఓహ్, అవునా? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? 211 00:20:12,129 --> 00:20:14,173 అదేంటంటే, అప్పట్లో శత్రువులు 212 00:20:14,256 --> 00:20:16,425 చాలా తేలిగ్గా తాగే మద్యంలో విషం కలిపేసేవారు. 213 00:20:16,508 --> 00:20:18,594 అవును, కానీ నువ్వు కూడా ఇదే సీసా నుండి తాగుతున్నావు కదా! 214 00:20:18,677 --> 00:20:19,970 నేను తాగడం చూశావా? 215 00:20:23,640 --> 00:20:26,059 నాతో పరాచకాలు ఆడడం ఆపు, ముసలోడా. 216 00:20:26,143 --> 00:20:28,187 నిన్ను నువ్వే బాధ పెట్టుకునే అవకాశం ఉంది. 217 00:20:28,270 --> 00:20:32,566 చూడు, ఆ సీసాలో ఉన్నది విషం అనడానికి అది మరో కారణం కావొచ్చు. 218 00:20:33,317 --> 00:20:35,444 నువ్వు చెప్పినట్లు నేను ముసలోడిని కాబట్టి 219 00:20:35,527 --> 00:20:38,363 నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఎంతమాత్రం వెనకాడను. 220 00:20:40,282 --> 00:20:42,284 ఈ విస్కీలో విషం కలిపానని అంటున్నావా? 221 00:20:42,367 --> 00:20:44,119 నువ్వు నా మేనల్లుడిని చంపావా? 222 00:21:04,056 --> 00:21:06,058 నీకు విషం ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు, ఆల్ఫ్రెడ్. 223 00:21:07,267 --> 00:21:08,435 అలాంటి ఆలోచన కూడా చేయకు. 224 00:21:14,441 --> 00:21:16,818 నువ్వు నా బంగారు నాణేల వంక తదేకంగా చూడడం నేను గమనించాను. 225 00:21:17,611 --> 00:21:18,987 వాటిని ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నావా? 226 00:21:19,071 --> 00:21:20,697 ఇందులో ఆలోచించాల్సింది ఏముంది! 227 00:21:20,781 --> 00:21:23,742 పైగా, వాటి వల్ల నీకేం ఉపయోగం ఉంటుంది? 228 00:21:24,409 --> 00:21:25,494 ఆ డబ్బుతో ఏం చేస్తావు? 229 00:21:25,577 --> 00:21:27,663 వేగాస్ వెళతావా, వీలైనంత మందితో శృంగారం జరుపుతావా? 230 00:21:27,746 --> 00:21:30,499 ముసలితనం వల్ల నువ్వు అలాంటివేవీ చేయలేవు. 231 00:21:32,000 --> 00:21:35,671 నిజానికి ఒక ఆడది నిన్ను చూసినప్పుడల్లా నిన్ను దోచుకోవడానికి వస్తుందని భయపడి 232 00:21:35,754 --> 00:21:37,756 నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా 233 00:21:37,840 --> 00:21:39,216 వెనకాడతావని నీనా చెప్పింది. 234 00:21:39,299 --> 00:21:40,467 ఊహించడానికే నవ్వొస్తోంది. 235 00:21:41,468 --> 00:21:43,136 ఒక ఆడదానికి భయపడుతున్న మగవాడు. 236 00:21:43,220 --> 00:21:45,389 ఈ వెధవని చెర్నకోలతో కొట్టాలి. 237 00:21:46,932 --> 00:21:49,893 నీ దగ్గర ఈ నాణేలు ఉంటే ఏం చేస్తావు? 238 00:21:49,977 --> 00:21:52,938 వాటిని బంగారం అమ్మే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాను. అది నిజమైన బంగారం అయితే, అమ్మేసి డబ్బు తీసుకుంటాను. 239 00:21:54,523 --> 00:21:56,900 నీలాంటి వెధవ సరిగ్గా ఇలాగే చేస్తాడని అనుకున్నాను. 240 00:21:56,984 --> 00:21:59,069 -ఎవరిని వెధవ అంటున్నావురా ముసలోడా? -నిన్నే. 241 00:22:00,821 --> 00:22:02,739 ఈ డబ్లూన్స్ ని చూడు. 242 00:22:02,823 --> 00:22:05,909 ఇవి పాతవి. చాలా పాతవి. 243 00:22:06,493 --> 00:22:09,955 అసలైన అమెరికన్ నాణేలు. సేకర్తలు వెతికే వస్తువులు. 244 00:22:10,747 --> 00:22:14,918 ఒక సేకర్తకు ఇవి 40,000 డాలర్ల కంటే ఎక్కువ విలువ చేస్తాయి. 245 00:22:16,503 --> 00:22:19,464 వాటి బంగారం బరువు ప్రకారం నాలుగు వేల డాలర్లే దక్కుతాయి. 246 00:22:21,091 --> 00:22:22,176 సరే అయితే. 247 00:22:23,552 --> 00:22:26,138 సరే, వాటిని నాకు ఇచ్చేయి, వాటిని కొనే వ్యక్తిని నేను కనిపెడతాను. 248 00:22:28,473 --> 00:22:33,520 నీకు ఒక సంవత్సరం పాటు ప్రతినెలా ఇలాంటిది ఒకటి అందేలా లేదా దీని విలువకు సమానమైన 249 00:22:33,604 --> 00:22:36,148 డబ్బు అందేలా నేను ఏర్పాటు చేయగలను. 250 00:22:36,231 --> 00:22:40,944 ఆ విధంగా నేను చేయగలను. నువ్వు చేయాల్సిందల్లా నా ప్రశ్నకు సమాధానం చెప్పడం. 251 00:22:41,028 --> 00:22:43,530 -నీకు ఇప్పటికే సమాధానం తెలుసని అనుకుంటున్నాను. -నాకు తెలుసు. 252 00:22:44,990 --> 00:22:46,867 కానీ నీ నోటి వెంట వినాలని అనుకుంటున్నాను. 253 00:22:48,285 --> 00:22:50,537 నేను అలాంటి పని చేస్తానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? 254 00:22:50,621 --> 00:22:52,873 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అదే కారణం వల్ల. 255 00:22:53,707 --> 00:22:54,750 డబ్బు కోసం. 256 00:22:56,251 --> 00:23:00,714 ఒక ఏడాది పాటు ప్రతి నెలా రెండు నాణేలు, లేదా అంతకు సమానమైన విలువ. 257 00:23:03,634 --> 00:23:05,969 జాగ్రత్త, బాబూ. ఇదేమీ జోక్ కాదు. 258 00:23:21,443 --> 00:23:22,444 అవును. 259 00:23:23,862 --> 00:23:26,532 అవును, నేనే నీ ప్రియమైన మేనల్లుడిని చంపాను. 260 00:23:27,783 --> 00:23:31,662 తలకు గురిపెట్టి కాల్చి చంపాను, ఎందుకంటే అతను నా ప్రేయసిని దూరంగా తీసుకెళ్ళిపోదామని అనుకున్నాడు. 261 00:23:32,579 --> 00:23:34,081 ఇప్పుడు అతని ఇల్లు నా సొంతమైంది. 262 00:23:35,123 --> 00:23:37,584 అతని భార్య నా సొంతమైంది, నా ప్రేయసి. 263 00:23:38,961 --> 00:23:41,380 అతని కారులోనే తిరుగుతున్నాను. 264 00:23:41,463 --> 00:23:43,340 అతని మంచం మీదే నిద్రపోతున్నాను. 265 00:23:44,508 --> 00:23:47,761 అతని కూతురు, నా కొడుకు ఇద్దరూ నన్ను నాన్న అని పిలుస్తున్నారు. 266 00:23:50,430 --> 00:23:52,182 ఏం… ఏంటి? 267 00:23:52,266 --> 00:23:53,976 చంపుతుండగా నన్ను చూసింది ఎవరు? 268 00:23:54,059 --> 00:23:55,978 నీ గన్ బయటికి తీయి, బాబూ! అతనికి గురిపెట్టు. 269 00:23:56,061 --> 00:23:58,772 ఏయ్! ఇటు చూడు. చంపుతుండగా నన్ను చూసింది ఎవరు? 270 00:23:59,398 --> 00:24:02,067 సాక్షుల గురించి ఏ వార్తా పత్రికల్లోనూ రాలేదు. 271 00:24:03,193 --> 00:24:07,155 నువ్వు దెయ్యాన్ని నమ్ముతావా, మిస్టర్ గల్లా? 272 00:24:11,451 --> 00:24:12,786 నీ దెయ్యం నా చేతిలోనే ఉంది. 273 00:24:12,870 --> 00:24:15,455 అవును. ఇప్పుడు నేను ఈ బంగారు నాణేలు తీసుకుంటున్నాను. 274 00:24:15,539 --> 00:24:19,543 వెళ్లి నీనాతో పాటే జీవిస్తాను, అర్థమయిందా? 275 00:24:19,626 --> 00:24:23,130 తర్వాత ఆ రోజు నన్ను ఎవరు చూశారో నువ్వు నాకు చెబుతావు. 276 00:24:23,213 --> 00:24:25,883 నేను నీకు ఏమీ చెప్పబోవడం లేదు. 277 00:24:25,966 --> 00:24:27,342 ఇప్పుడు… 278 00:24:27,426 --> 00:24:30,762 …నువ్వు నాకు ఆ డబ్బు ఇచ్చేసి, నాకు కావలసింది చెప్పకపోతే, 279 00:24:30,846 --> 00:24:33,348 నీకు ఊపిరాడకుండా చేసి చంపేస్తాను. 280 00:24:33,432 --> 00:24:35,976 తర్వాత ఆ దరిద్రపు మొహం రాబిన్ ని, అన్ని బంగారు నాణేలు ఇచ్చేవరకూ, 281 00:24:36,059 --> 00:24:38,520 రహస్యాలు చెప్పేవరకూ చితక్కొడతాను. 282 00:24:38,604 --> 00:24:40,147 రాబిన్, వద్దు! 283 00:24:43,859 --> 00:24:46,111 ఓహ్, ముసలోడా. 284 00:24:46,195 --> 00:24:49,406 -ముసలోడివైనా నీ దగ్గర చాలా బలం ఉందే? -అందుకే నేనింకా బతికే ఉన్నాను. 285 00:24:49,489 --> 00:24:51,366 అవును, నన్ను ఓడిస్తాననే అనుకుంటున్నావా? 286 00:24:51,450 --> 00:24:54,119 దాని గురించి నాకు తెలీదు, కానీ నిన్ను ఖచ్చితంగా కాల్చి పారేస్తాను. 287 00:24:54,203 --> 00:24:56,413 ఏయ్ ఆగు, ముసలోడా. 288 00:24:56,496 --> 00:24:58,540 సెన్సియా తన భర్తని దీంతోనే కాల్చింది. 289 00:24:59,666 --> 00:25:00,959 ఏయ్, ఏయ్! అరె… 290 00:25:01,043 --> 00:25:02,169 ఏంటి? 291 00:25:02,252 --> 00:25:04,129 ఒరేయ్ ముస… 292 00:25:17,643 --> 00:25:19,394 ఓహ్, వీడు రాబిన్ కి హాని చేస్తే నేను ఊరుకోను. 293 00:25:19,478 --> 00:25:21,772 వాడ్ని పట్టుకో, బాబూ! వాడు పారిపోయేలోగా వాడ్ని పట్టుకో! 294 00:25:21,855 --> 00:25:22,856 త్వరగా! 295 00:25:24,858 --> 00:25:26,610 అయ్యో, అయ్యో. 296 00:25:35,577 --> 00:25:36,787 ఓహ్, దేవుడా. 297 00:25:49,091 --> 00:25:50,092 అమ్మా? 298 00:25:53,720 --> 00:25:55,138 అతన్ని రాబిన్ కి హాని చేయనివ్వకూడదు. 299 00:25:55,222 --> 00:25:56,557 సెన్సియా? 300 00:25:57,140 --> 00:25:59,476 నా మీద దాడి చేసిన వారికంటే వీడు తక్కువేం కాదు. 301 00:26:01,228 --> 00:26:04,606 వద్దు, పిటీ, వద్దు! మనం స్విమ్మింగ్ కి వెళదాం. 302 00:26:07,526 --> 00:26:09,862 వాళ్ళు గొడవపడకుండా ఆపు. 303 00:26:09,945 --> 00:26:11,405 మీకున్నది కుటుంబం మాత్రమేనని 304 00:26:13,240 --> 00:26:15,367 మీరెప్పుడూ అంటూ ఉండేవారు అంకుల్. 305 00:26:15,450 --> 00:26:17,494 -కానివ్వు, బుజ్జి. -వాడి పని పట్టు, బాబూ. 306 00:26:26,003 --> 00:26:27,171 హేయ్! 307 00:26:27,254 --> 00:26:29,756 -చెత్త… -ఎవరైనా అతన్ని రక్షించండి. 308 00:26:33,552 --> 00:26:34,553 అరె ఛ! 309 00:26:38,056 --> 00:26:39,057 ఓహ్, దేవుడా! 310 00:26:39,141 --> 00:26:42,144 -ఏంటిది? -ఎవరైనా సాయం చేయండి. 311 00:26:42,227 --> 00:26:44,730 -ఎవరైనా సాయం చేయండి. -ఏయ్, అంబులెన్స్ ని పిలవండి! 312 00:26:46,398 --> 00:26:48,483 -నువ్వు ఏం చేస్తున్నావ్? -నీకు సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. 313 00:26:48,567 --> 00:26:50,235 నన్నొదులు. అవి నావి. నాకు… 314 00:26:50,319 --> 00:26:53,113 -నీకు సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఆపు! -నేను నిన్ను చంపేస్తాను. 315 00:26:53,197 --> 00:26:54,198 ఆగు! నన్ను వెళ్లనివ్వు! 316 00:26:54,281 --> 00:26:57,201 ఇచ్చేయ్! నన్ను వదులు! నన్ను వదులు! 317 00:26:57,284 --> 00:27:00,829 ఏయ్! నువ్వు… ఏయ్! వాడ్ని వదిలేయ్, దొంగమొహమా! 318 00:27:01,955 --> 00:27:03,665 వెళ్ళిపో! 319 00:27:03,749 --> 00:27:05,876 -నేను అంబులెన్స్ ని పిలుస్తాను. -అయ్యో! 320 00:27:05,959 --> 00:27:08,420 ఓహ్, దేవుడా. 321 00:27:08,504 --> 00:27:11,632 నువ్వు… దొరికావురా. నిన్ను వదిలేది లేదు. 322 00:27:13,175 --> 00:27:15,302 వాడు… వాడు దొరికాడు, రెజ్జీ. 323 00:27:15,385 --> 00:27:17,596 నేను… వాడు మూల్యం చెల్లించాలి. 324 00:27:17,679 --> 00:27:19,223 అవును. నిన్ను… 325 00:27:20,057 --> 00:27:21,058 పరిగెత్తు. 326 00:27:21,141 --> 00:27:23,477 పరి… పరిగెత్తు. అవును, పరిగెత్తు. 327 00:27:23,560 --> 00:27:27,898 దయచేసి నాకు సాయం చేయండి. నేను… నేను… ఈ వెధవని కాల్చాను. 328 00:27:30,567 --> 00:27:33,529 వాడు… వాడు మూల్యం చెల్లించాలి. వాడు… మూల్యం చెల్లించాలి. 329 00:27:43,330 --> 00:27:44,373 చూసుకో, బాబూ! 330 00:27:44,456 --> 00:27:46,208 కోయ్? 331 00:27:46,291 --> 00:27:48,085 -అయిపోయింది, పిటీ. -మీ ఆయుధం కిందపెట్టండి! 332 00:27:48,168 --> 00:27:51,255 -అయిపోయింది. -నేను చూసుకుంటాను, మిస్టర్ గ్రే. 333 00:27:51,338 --> 00:27:54,049 మిస్టర్ గ్రే, మీ చేతిలో ఆయుధం కింద పెట్టండి. 334 00:27:55,509 --> 00:27:56,760 వెంటనే ఆయుధం కింద పెట్టండి. 335 00:27:58,262 --> 00:27:59,263 నేను చెప్పేది మీకు అర్థమయిందా? 336 00:28:03,100 --> 00:28:06,144 పరవాలేదు, మిస్టర్ గ్రే. పరవాలేదు. 337 00:28:09,356 --> 00:28:11,733 నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. 338 00:28:14,111 --> 00:28:15,112 నేను చూసుకుంటాను. 339 00:28:16,113 --> 00:28:17,197 -వేరే ఆయుధాలు లేవు. -నేను చూసుకుంటాను. 340 00:28:20,242 --> 00:28:23,495 ఓహ్, దేవుడా. దేవుడా. ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 341 00:28:24,580 --> 00:28:25,956 దేవుడు దయ చూపించాలి. 342 00:28:28,125 --> 00:28:29,585 నేను చూసుకుంటాను, మిస్టర్ గ్రే. 343 00:28:30,377 --> 00:28:33,547 నాతో రండి. సరేనా? నాతో రండి. 344 00:28:34,423 --> 00:28:35,549 నాతో నడవండి. 345 00:28:36,091 --> 00:28:37,801 మీరు నిశ్శబ్దంగా ఉండడం మంచిది. 346 00:28:37,885 --> 00:28:40,804 మీరు మాట్లాడేది ఏదైనా మీకు వ్యతిరేకంగా వాడడం జరుగుతుంది. 347 00:28:40,888 --> 00:28:42,556 మీకు లాయర్ ను నియమించుకునే హక్కు ఉంది… 348 00:28:43,056 --> 00:28:46,101 ఆరు నెలల తర్వాత 349 00:28:47,311 --> 00:28:48,395 మిస్టర్ గ్రే? 350 00:28:49,938 --> 00:28:51,273 మిస్టర్ గ్రే, నా మాట వినిపిస్తోందా? 351 00:28:57,988 --> 00:28:59,198 మిస్టర్ గ్రే. 352 00:29:00,782 --> 00:29:02,159 సాతానా! 353 00:29:03,410 --> 00:29:04,620 మనం నరకంలో ఉన్నామా? 354 00:29:05,412 --> 00:29:06,580 ఎలా ఉన్నారు? 355 00:29:08,165 --> 00:29:10,918 దెయ్యాన్ని ఓడించాను. గొప్ప విషయం కదూ? 356 00:29:12,127 --> 00:29:13,253 అవును, ఓడించారు. 357 00:29:23,263 --> 00:29:24,681 ఎలా ఉంది, పిటీ? 358 00:29:25,265 --> 00:29:27,059 కో… కోయ్ డాగ్. 359 00:29:27,142 --> 00:29:29,978 నువ్వు… నువ్వు చెప్పినట్లే నేను చేశాను, 360 00:29:30,062 --> 00:29:33,273 అలాగే... ఆ నిధిపై రక్త ప్రోక్షణ జరిపాను 361 00:29:33,357 --> 00:29:35,484 కాబట్టి ఆ నిధికి ఉన్న విశిష్టత ఏమాత్రం తగ్గలేదు. 362 00:29:35,567 --> 00:29:37,778 నువ్వు సాధిస్తావని నాకు ఎప్పుడూ తెలుసు. 363 00:29:45,661 --> 00:29:46,787 హాయ్, అంకుల్. 364 00:29:48,997 --> 00:29:51,500 రెజ్జీ! రెజ్జీ! 365 00:29:51,583 --> 00:29:52,668 ఎలా ఉంది? 366 00:29:52,751 --> 00:29:54,294 ఓహ్, రెజ్జీ. 367 00:29:55,420 --> 00:29:57,214 రెజ్జీ, నన్ను క్షమించు. 368 00:29:57,297 --> 00:29:58,549 సారీ దేనికి? 369 00:29:59,800 --> 00:30:02,427 నేను… ఓహ్, నేను… నేను మర్చిపోయాను. 370 00:30:02,511 --> 00:30:04,429 సారీ చెప్పాల్సిన విషయమేదీ లేదు, అంకుల్. 371 00:30:05,180 --> 00:30:06,765 మీరు చేయగలిగింది మీరు చేశారు. 372 00:30:08,267 --> 00:30:09,935 నేను… నేను చేశానా. 373 00:30:21,113 --> 00:30:22,531 కష్టపడకండి, అంకుల్. 374 00:30:23,240 --> 00:30:24,616 మీ కోసం నేను తీసుకొస్తాను. 375 00:30:25,242 --> 00:30:26,577 రాబిన్. 376 00:30:27,202 --> 00:30:29,955 వసంతకాలపు మొదటి పక్షి. 377 00:30:35,711 --> 00:30:36,712 అందరూ నిలబడండి. 378 00:30:46,054 --> 00:30:47,055 దయచేసి కూర్చోండి. 379 00:30:51,101 --> 00:30:54,271 నాకు సమర్పించిన పత్రాలను చదివాను, నాకు స్పష్టంగా అర్థమయింది ఏంటంటే 380 00:30:54,354 --> 00:30:57,816 ఈ సమావేశం పూర్తయిన తర్వాత, ఈ కేసు విషయంలో నేను న్యాయబద్ధంగా తీర్పు ఇవ్వగలను. 381 00:30:57,900 --> 00:30:59,860 సరే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని 382 00:30:59,943 --> 00:31:04,281 మిస్ బార్నెట్ బృందం అందిస్తున్న సాక్ష్యాల ప్రత్యేక ప్రవేశంపై నా అభ్యంతరాల్ని పునః పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాను. 383 00:31:04,364 --> 00:31:07,075 యువర్ ఆనర్, మిస్టర్ టోలెమీ గ్రే వీలునామాలో స్పష్టంగా ఒక విషయం పేర్కొన్నారు 384 00:31:07,159 --> 00:31:11,163 తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా దావా వేస్తే, ఈ సాక్ష్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. 385 00:31:11,246 --> 00:31:14,291 వాస్తవానికి ఆయన ఆఖరి కోరికలు ఎంతవరకూ సాధ్యమవుతాయన్న విషయాన్ని పరీక్షించడానికే మనమిక్కడ ఉన్నాం. 386 00:31:14,374 --> 00:31:16,502 మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మిస్ లియమ్. 387 00:31:17,961 --> 00:31:21,965 మిస్టర్ గ్రే అభ్యర్థనని సాక్ష్యంలో ఎందుకు జత పరచకూడదో నాకు అర్థం కావట్లేదు. 388 00:31:22,049 --> 00:31:24,843 మిస్ బార్నెట్, లేదా ఆవిడ లాయర్ ఏం చెప్పినా సరే, 389 00:31:24,927 --> 00:31:26,595 మిస్టర్ గ్రే ఆఖరి కోరికలుగా చెప్పబడేవి 390 00:31:26,678 --> 00:31:31,266 చెల్లుబాటు అవుతాయా లేదా అన్న ప్రశ్నకు సంబంధించి ఒకే ఒక్క సవరణ మాత్రమే ఉండగలదు. 391 00:31:31,350 --> 00:31:34,353 నా దగ్గర ఇరుగుపొరుగు, స్నేహితులు, మిస్టర్ గ్రే నివసించే 392 00:31:34,436 --> 00:31:36,230 పరిసరాల్లోని వ్యాపారుల దగ్గర నుండి 393 00:31:36,313 --> 00:31:38,815 తీసుకున్న 33 వాంగ్మూలాలు ఉన్నాయి. 394 00:31:38,899 --> 00:31:43,070 ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా వారందరూ చెప్పిందేమంటే, 395 00:31:43,153 --> 00:31:46,281 చట్ట పరంగా మానసిక సంకల్ప లోపం అని పిలవబడే రుగ్మతితో 396 00:31:46,365 --> 00:31:48,408 కనీసం గత ఆరేళ్లుగా మిస్టర్ గ్రే బాధపడుతున్నారని తేటతెల్లమైంది. 397 00:31:48,492 --> 00:31:51,620 అంటే మిస్ బార్నెట్ ఆయన్ని కలవక ముందు ఎంతోకాలం నుండి. 398 00:31:51,703 --> 00:31:56,959 మిస్టర్ గ్రే కుటుంబం ఆయన అన్ని అవసరాలను పట్టించుకుంది. 399 00:31:57,042 --> 00:31:59,711 మిస్ బార్నెట్ కు ఆయన గురించి తెలియడానికి ఒకే ఒక కారణం 400 00:31:59,795 --> 00:32:02,923 హిల్డా బ్రౌన్ ఆయనను ఒకసారి చూసి రమ్మని ఆమెని అడగడమే. 401 00:32:03,006 --> 00:32:03,841 అవును, నిజమే. 402 00:32:03,924 --> 00:32:07,928 టోలెమీ గ్రేకి ఆస్తులన్నీ అతని కుటుంబానికి, వాస్తవానికి అతని బాగోగులు 403 00:32:08,011 --> 00:32:09,972 చూసిన వారికి మాత్రమే దక్కాలి. 404 00:32:10,055 --> 00:32:11,640 అయోమయ స్థితిలో ఉన్న 405 00:32:11,723 --> 00:32:15,310 ముసలివాడి ద్వారా ప్రయోజనం పొందాలనుకున్న యువతికి కాదు. 406 00:32:16,270 --> 00:32:19,565 మిస్టర్ అబ్రోమోవిచ్, మిస్టర్ మాల్మన్ ఆరోపణల గురించి మీరేమంటారు? 407 00:32:19,648 --> 00:32:22,359 సరిగ్గా ఇటువంటి వాదనలతోనే తన వీలునామాపై అతని కుటుంబం 408 00:32:22,442 --> 00:32:23,694 వివాదం లేవనెత్తవచ్చని టోలెమీ నాకు చెప్పారు. 409 00:32:23,777 --> 00:32:27,739 ఆయన మానసిక వికలాంగుడనే ఎటువంటి భావననైనా తిప్పికొట్టేందుకు 410 00:32:27,823 --> 00:32:30,492 ఆయన ఏంజెలా లియమ్ ని కలవాల్సిందిగా నేను సూచించాను. 411 00:32:41,795 --> 00:32:44,214 నా దగ్గర మూడు ఎర్ర యాపిల్స్, రెండు కమలాలు, 412 00:32:44,298 --> 00:32:46,216 మార్కెట్లో కొన్న ఒక సాసేజ్ ఉన్నాయి. 413 00:32:47,134 --> 00:32:48,886 ఓహ్, అవును, నా చిన్నతనంలో, 414 00:32:48,969 --> 00:32:52,806 సాసేజ్ తో పాటు ఇంట్లో తయారుచేసిన యాపిల్ సాస్ ఉంటే నాకు పండగే. 415 00:32:54,474 --> 00:32:56,351 నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 416 00:32:56,435 --> 00:32:58,979 నేను మీ వంక చూడాలా లేక కెమెరా వంక చూడాలా? 417 00:32:59,062 --> 00:33:00,189 నా వంక చూస్తే సరిపోతుంది. 418 00:33:00,272 --> 00:33:04,151 అదీ, మీ దగ్గర మూడు ఉన్నాయని చెప్పారు, కాబట్టి మీరు చెప్పింది నిజమేనని అనుకుంటున్నాను. 419 00:33:05,444 --> 00:33:06,904 ఈరోజు తేదీ ఎంత? 420 00:33:06,987 --> 00:33:11,450 ఈరోజు తేదీ ఏప్రిల్ 21, 2021. 421 00:33:11,533 --> 00:33:14,661 అంటే మా చెల్లెలు జూన్ పుట్టినరోజుకు మూడు రోజుల తర్వాత. 422 00:33:15,412 --> 00:33:16,788 నీకు గుర్తుందా, నీసీ? 423 00:33:16,872 --> 00:33:18,832 మీ పూర్తి పేరు ఏంటి? 424 00:33:18,916 --> 00:33:21,793 నా పేరు టోలెమీ రాబర్ట్స్ గ్రే. 425 00:33:21,877 --> 00:33:26,673 టోలెమీ అనేది ఈజిప్ట్ ని పరిపాలించిన గ్రీక్ రాజు పేరు, క్లియోపాత్రా తండ్రి. 426 00:33:26,757 --> 00:33:30,594 రాబర్ట్స్ అనేది మా అమ్మ ఇంటిపేరు, వాళ్ళ కుటుంబ పేరు. 427 00:33:30,677 --> 00:33:34,848 గ్రే అనేది మా నాన్న పేరు, ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. 428 00:33:34,932 --> 00:33:36,767 ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలిశామో తెలుసా, మిస్టర్ గ్రే? 429 00:33:36,850 --> 00:33:39,269 తెలుసు, నేను రాయబోయే వీలునామా చట్టబద్ధంగా నిలబడాలంటే, 430 00:33:39,353 --> 00:33:43,732 నా మానసిక పరిస్థితి సరిగ్గా ఉందని నేను నిరూపించుకోవాలి. 431 00:33:43,815 --> 00:33:46,777 మన సంబాషణని వీడియో కెమెరా రికార్డు చేస్తోందన్న విషయం మీకు తెలుసా? 432 00:33:46,860 --> 00:33:50,030 అవును. అవును, నేను మొదటిసారి వీడియో కెమెరాలో కనిపిస్తున్నాను. 433 00:33:50,113 --> 00:33:51,615 మిస్సిసిపిలో నా చిన్నతనంలో, 434 00:33:51,698 --> 00:33:53,784 చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే మామూలు కెమెరా ఉండేది. 435 00:33:53,867 --> 00:33:57,329 కాబట్టి, ఈ సమయంలో మీరు ఎటువంటి మానసిక సమస్యలతో 436 00:33:57,412 --> 00:34:01,208 బాధపడడం లేదని నిరూపించడానికి నేను ఈ పద్ధతిని వాడితే మీకు పరవాలేదా? 437 00:34:01,291 --> 00:34:02,334 ఓహ్, అలాగే మేడమ్. 438 00:34:02,417 --> 00:34:04,545 -మీరు ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? -అవును, అనుకుంటున్నాను. 439 00:34:04,628 --> 00:34:08,757 అలాగే రాబిన్ బార్నెట్ ను నా ట్రస్టీగా నియమించాలని అనుకుంటున్నాను. 440 00:34:08,841 --> 00:34:11,260 నా ఉద్దేశం, ఆస్తి మొత్తం తనకు చెందుతుందని కాదు, 441 00:34:11,342 --> 00:34:13,719 కానీ దాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం తన చేతిలో ఉంటుంది. 442 00:34:13,804 --> 00:34:17,683 మీ కుటుంబ సభ్యులు ఈ బాధ్యతకు అనర్హులని మీరు భావిస్తున్నారా? 443 00:34:17,766 --> 00:34:19,016 లేదు, అలాంటిదేమీ లేదు. 444 00:34:19,101 --> 00:34:21,645 నా ఉద్దేశంలో, వాళ్ళు వాస్తవానికి మంచివాళ్ళే. 445 00:34:21,728 --> 00:34:25,940 కానీ దీనంతటికీ రాబిన్ నిర్వహకురాలిగా ఉంటూ, నెలవారీ పద్ధతిలో ఎవరికి అందాల్సినవి 446 00:34:26,024 --> 00:34:29,277 వారికి అందిస్తూ, రెజ్జీ పిల్లలు కాలేజీ చదువులు చదివే వయసు వచ్చేసరికి 447 00:34:29,360 --> 00:34:30,654 వారి చదువులకయ్యే ఖర్చు అందించాలి 448 00:34:30,737 --> 00:34:34,783 అలాగే హిల్యార్డ్ జైలుకి వెళ్లే సరికి, జైలు నిర్వహించే ట్రస్ట్ ఎకౌంటులో 449 00:34:34,867 --> 00:34:36,409 కొంత డబ్బు ఉండేలా చూడాలి. 450 00:34:36,493 --> 00:34:39,621 మిస్ బార్నెట్ కు నిర్వహణా బాధ్యతలు అప్పజెప్పాలని ఎందుకు అనుకుంటున్నారు, మిస్టర్ గ్రే? 451 00:34:39,705 --> 00:34:42,875 నిర్వహకురాలిగా ఉండదగ్గ అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి రాబిన్. 452 00:34:42,958 --> 00:34:47,087 తను నిద్రపోయే ముందు అందరూ బాగానే ఉన్నారా లేదా అని నిర్ధారించుకునే మనస్తత్వం ఆమెది. 453 00:34:47,170 --> 00:34:49,797 నిర్వహణ అన్నది తనకు పుట్టుకతో వచ్చిన విద్య. 454 00:34:49,882 --> 00:34:52,885 ఆమె వృధా చేసే రకం కాదు, పనికిమాలిన పనులు చేయదు. 455 00:34:52,967 --> 00:34:56,429 నేను… నేను తనకి వ్యక్తిగతంగా ఏదైనా చెప్పొచ్చా? 456 00:34:56,513 --> 00:34:57,598 కానివ్వండి. 457 00:34:58,682 --> 00:35:02,102 రాబిన్ నీకో విషయం చెప్పాలి 458 00:35:02,186 --> 00:35:06,732 నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, 459 00:35:07,691 --> 00:35:14,531 కోయ్ అందించిన వారసత్వ సంపదను నీ చేతుల్లో పెడుతున్నందుకు ఆయన ఎంతో సంతోషిస్తాడని నాకు తెలుసు. 460 00:35:15,991 --> 00:35:16,992 నువ్వు నన్ను రక్షించావు. 461 00:35:17,743 --> 00:35:19,995 నా మాట నిలబెట్టుకునేందుకు సాయం చేశావు. 462 00:35:21,038 --> 00:35:26,668 నువ్వు రాకముందు వరకూ గడిచిన నా జీవితానికి అర్థం లేదని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. 463 00:35:29,379 --> 00:35:30,631 ఐ లవ్ యు, బర్డ్. 464 00:35:38,722 --> 00:35:43,268 సరే, మాకు అన్ని పత్రాలను పరిశోధించే హక్కు, ఈ ఆధారాన్ని 465 00:35:43,352 --> 00:35:46,897 మా నిపుణులు అంచనా వేసే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. 466 00:35:46,980 --> 00:35:48,941 కానీ ఇక్కడ మరికొన్ని సమస్యలున్నాయి. 467 00:35:49,024 --> 00:35:50,025 ఎలాంటివి? 468 00:35:50,108 --> 00:35:51,902 ఈ యువతి వయసు. 469 00:35:51,985 --> 00:35:54,821 -తనొక టీనేజీ అమ్మాయి. -నాకు పద్దెనిమిదేళ్ళు. 470 00:35:54,905 --> 00:35:58,200 హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్న ఒక టీనేజీ అమ్మాయి 471 00:35:58,283 --> 00:36:01,787 ఒక మారణాయుధంతో నా క్లయింట్లపై దాడి చేసింది. 472 00:36:01,870 --> 00:36:04,873 అబ్జెక్షన్. మిస్ బార్నెట్ ఎవరిమీదైనా దాడి చేసిందనడానికి ఎటువంటి సాక్ష్యం లేదు. 473 00:36:04,957 --> 00:36:06,875 పోలీస్ రిపోర్ట్ లేదు, 911కి కాల్ రాలేదు… 474 00:36:06,959 --> 00:36:10,963 తను రోడ్డు మీద ఒక మహిళ వెంట పడుతూ, ఆమెని కుర్చీతో కొట్టడం కొందరు చూశారు. 475 00:36:11,046 --> 00:36:11,922 వదంతి. 476 00:36:12,005 --> 00:36:14,258 తను శానిటోరియంలో ఉన్న మిస్టర్ గ్రేని చూడడానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. 477 00:36:14,341 --> 00:36:15,217 అది ఎందుకంటే వాళ్ళు… 478 00:36:15,300 --> 00:36:18,303 ఎందుకంటే మిస్టర్ గ్రే రక్త సంబంధీకులకు తాత్కాలిక సంరక్షణా బాధ్యత ఇవ్వబడింది, 479 00:36:18,387 --> 00:36:21,181 పైగా మిస్ బార్నెట్ ఆయన్ని కలవకుండా నిషేధం విధించారు. 480 00:36:21,265 --> 00:36:23,433 -ఆరు నెలల పాటు. -తర్వాత ఈ లాయర్. 481 00:36:23,517 --> 00:36:25,435 మిస్టర్ గ్రే ట్రస్ట్ కు సంబంధించిన అధికారం 482 00:36:25,519 --> 00:36:28,438 ఆరు నెలలకు పైగా ఈయన దగ్గరే ఉంచుకున్నారు. 483 00:36:28,522 --> 00:36:33,735 మిస్ బార్నెట్ తో చేతులు కలిపి ఫిర్యాదుదారులకు రూపాయి కూడా అందకుండా చేశారు, 484 00:36:33,819 --> 00:36:36,405 ఆపై వాటాదారులకు చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తున్నారు. 485 00:36:36,488 --> 00:36:39,116 మిస్టర్ గ్రే ఆ విధంగా అభ్యర్థించారు. 486 00:36:39,199 --> 00:36:41,326 -ఓహ్, అలాగని మీరంటున్నారు. -నన్ను అబద్ధాల కోరని అంటున్నారా, మాల్మన్? 487 00:36:41,410 --> 00:36:43,787 -ఓహ్, ఆపు. ఇక ఊరుకో. -జెంటిల్మెన్, ప్లీజ్, కూర్చోండి. 488 00:36:43,871 --> 00:36:46,874 చూడండి యువర్ ఆనర్, నేను చెప్పేదేమిటంటే, 489 00:36:46,957 --> 00:36:50,335 ఒక యువతి డబ్బుకోసం ఒక ముసలి వ్యక్తిని ప్రలోభ పెట్టిన కేసు ఇది. 490 00:36:50,419 --> 00:36:52,880 మీరు నా మీద, ఆవిడ మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. 491 00:36:52,963 --> 00:36:56,633 జెంటిల్మెన్, కూర్చోండి! 492 00:36:56,717 --> 00:36:57,801 దయచేసి కూర్చోండి. 493 00:36:59,136 --> 00:37:01,263 లేదంటే మీ ఇద్దరూ కోర్టును ధిక్కరించినందుకు పరిణామాలు ఎదుర్కోవాలి. 494 00:37:01,763 --> 00:37:03,432 భోజనం వేళయింది. 495 00:37:03,515 --> 00:37:06,643 మనం విశ్రాంతి తీసుకుని, తిరిగి రెండున్నరకు కలుద్దాం. 496 00:37:07,519 --> 00:37:11,106 మిస్ బార్నెట్, మీరు కాసేపు ఆగుతారా? 497 00:37:28,123 --> 00:37:29,917 మీరు హిల్డాని, వాళ్ళ అబ్బాయిని బెదిరించారా? 498 00:37:34,963 --> 00:37:36,256 మీరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. 499 00:37:36,340 --> 00:37:40,260 -లేదు. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. -దేన్ని అర్థం చేసుకోవాలని? 500 00:37:40,344 --> 00:37:42,554 ఈ కేసు మొత్తం గందరగోళంగా ఉంది. 501 00:37:42,638 --> 00:37:44,556 ఒక్కసారిగా మాయమైపోయిన డిమెన్షియా, 502 00:37:44,640 --> 00:37:47,476 కనీస విద్య కూడా లేకుండా వందల కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన ముసలి వ్యక్తి. 503 00:37:47,559 --> 00:37:49,353 అదా, పాపా గ్రే మూడో క్లాసు పూర్తి చేశారు, 504 00:37:49,436 --> 00:37:52,189 ఆ తర్వాత జీవితాంతం ఎన్నో పుస్తకాలు చదువుతూనే ఉన్నారు, కాబట్టి… 505 00:37:52,272 --> 00:37:53,357 మీ సంగతేంటి? 506 00:37:54,483 --> 00:37:58,153 మీ నాన్నని రోడ్డుమీద చంపి పడేశారు, మీ అమ్మ ఒక వేశ్య. 507 00:38:01,031 --> 00:38:06,328 మీకు తెలుసా, మా అమ్మకి డబ్బిచ్చే తెల్లజాతి వ్యక్తి ఒకడు ఉండేవాడు, 508 00:38:06,411 --> 00:38:09,790 ఒకరోజు మా అమ్మ ఇంట్లో లేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. 509 00:38:09,873 --> 00:38:12,459 అతను నా బట్టలూడదీయడానికి ప్రయత్నించాడు. నేను కత్తి బయటికి తీశాను. 510 00:38:12,543 --> 00:38:16,755 నేను అతని తలమీద లాంతరుతో కొట్టేలోగా అతను ఇక్కడ కోసేశాడు. 511 00:38:17,297 --> 00:38:19,508 అతన్ని ఎనిమిదిసార్లు పొడిచాను. 512 00:38:19,591 --> 00:38:22,135 అతను చావకపోవడం కేవలం అతని అదృష్టం. 513 00:38:22,719 --> 00:38:25,597 కానీ నన్ను చూసినప్పుడు మా అమ్మ మొహం చూడాలి, 514 00:38:25,681 --> 00:38:29,977 వెంటనే తేరుకుని, నాకు తనే కుట్లు వేసింది. 515 00:38:30,060 --> 00:38:31,478 తను చేయగలిగింది చేసింది. 516 00:38:33,689 --> 00:38:37,025 మా అమ్మ ఎలాంటిదైనా నాకు అనవసరం. తను నన్ను ప్రేమించింది. 517 00:38:38,569 --> 00:38:40,320 అలాగే మిస్టర్ గ్రే కూడా అనుకుంటున్నాను. 518 00:38:44,992 --> 00:38:48,287 ఆయన లాంటి వ్యక్తిని నేను గతంలో చూడలేదు. 519 00:38:49,454 --> 00:38:54,585 సరైన పని చేయాలని తన జీవితాంతం ఎదురుచూశారు, చివరికి కొద్ది తేడాతో విజయం సాధించారు. 520 00:38:55,586 --> 00:38:58,964 -ఆయన ఆల్ఫ్రెడ్ గల్లాని హత్య చేశారు. -అవును, అదీ, ఆల్ఫ్రెడ్ కి అలా జరగాల్సిందే. 521 00:39:00,966 --> 00:39:03,343 బహుశా మీరు వెళ్లి మీ లాయరును తెచ్చుకుంటే మంచిది. 522 00:39:03,427 --> 00:39:04,428 ఎందుకు? 523 00:39:04,511 --> 00:39:06,638 ఎందుకంటే మీరు పొడిచినట్లు ఒప్పుకున్నారు. 524 00:39:06,722 --> 00:39:08,432 అయితే ఏంటి? నన్ను జైల్లో పెడతారా? 525 00:39:08,515 --> 00:39:10,267 నేను మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని అనుకోవచ్చు. 526 00:39:10,350 --> 00:39:12,728 -ఓహ్, నేను పట్టించుకోను. -మీకు డబ్బు అవసరం లేదా? 527 00:39:12,811 --> 00:39:13,812 నాకు కావలసింది ఏంటో చెప్పనా? 528 00:39:14,855 --> 00:39:18,233 నేను ఖగోళ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేయాలి, 529 00:39:18,317 --> 00:39:21,987 ఎలాన్ మస్క్ రాకెట్లో అంగారకుడి పైకి వెళ్ళడానికి నాకొక సీట్ కావాలి. 530 00:39:22,070 --> 00:39:24,156 మీకు డబ్బు అవసరం లేకపోతే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? 531 00:39:24,239 --> 00:39:26,158 ఎందుకంటే నాకు పాపా గ్రే అంటే ఇష్టం. 532 00:39:26,909 --> 00:39:30,746 నేను నాపై వ్యక్తిగత దాడిని తిప్పికొట్టాలని, ఆయన తరపున నిలబడాలని కోరుకుంటారని నాకు తెలుసు. 533 00:39:32,289 --> 00:39:35,876 మిస్టర్ గ్రే ట్రస్ట్ నిర్వహణా బాధ్యతలు మీరే చేపట్టాలని నేను నిర్ణయిస్తే? 534 00:39:37,920 --> 00:39:40,380 ఆయన రికార్డింగ్ గురించి నాకు తెలీదు. 535 00:39:43,467 --> 00:39:45,636 దాన్ని చూడకముందు, నేను… 536 00:39:45,719 --> 00:39:50,349 మీరు... నీసీకి, వారికి అనుకూలంగా తీర్పు చెబుతారని ఖచ్చితంగా అనుకున్నాను. 537 00:39:50,432 --> 00:39:56,230 వాళ్ళు వీలునామాను సవాలు చేయొచ్చని మిస్టర్ అబ్రోమోవిచ్ నాతో అన్నారు. 538 00:39:56,939 --> 00:39:59,775 కాబట్టి నేను ఇప్పటికే దానికి సిద్ధమయ్యాను. 539 00:40:00,484 --> 00:40:02,736 కానీ నిర్ణయం మీకు అనుకూలంగా వస్తే? 540 00:40:02,819 --> 00:40:08,534 నేను బాచిలర్ డిగ్రీ పూర్తి చేయడానికి మూడున్నర ఏళ్ళు పడుతుంది, 541 00:40:08,617 --> 00:40:14,957 ఆ తర్వాత పట్టా పుచ్చుకోవడానికి మరో నాలుగు నుండి ఆరేళ్ళు పడుతుంది. 542 00:40:15,666 --> 00:40:18,836 కాబట్టి, మరో పదేళ్ళలో నా చదువు పూర్తవుతుంది, 543 00:40:18,919 --> 00:40:22,506 ఆర్టీ, లతిషాలు అప్పుడే కాలేజీ చదువు మొదలుపెడతారు. 544 00:40:22,589 --> 00:40:26,343 అప్పటికి హిల్లీ సొంతగా ఏదైనా సాధిస్తాడు 545 00:40:26,426 --> 00:40:27,928 లేదంటే జైలుకి వెళతాడు, ఇంకా… 546 00:40:28,011 --> 00:40:30,180 మిస్ రింగ్ బహుశా చనిపోవచ్చు. 547 00:40:32,015 --> 00:40:35,811 కాబట్టి, పాపా గ్రే కోరుకున్నది అదే అయితే… 548 00:40:48,991 --> 00:40:49,992 రాబిన్. 549 00:40:50,075 --> 00:40:51,076 ఫుల్టన్ కౌంటీ కోర్ట్స్ 550 00:40:51,159 --> 00:40:52,953 మీరిక వెళ్ళచ్చు. 551 00:40:53,036 --> 00:40:54,371 ఒక్కదానివే మాట్లాడడం పర్లేదా? 552 00:40:54,454 --> 00:40:57,249 అవును. మాకు రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నాకు దగ్గరగా ఉన్న ఏకైక వ్యక్తి తనే. 553 00:40:58,000 --> 00:40:59,001 సరే. 554 00:41:04,214 --> 00:41:07,050 తీర్పుని మేము సవాలు చేయొచ్చని మిస్టర్ మాల్మన్ చెప్పారు. 555 00:41:07,759 --> 00:41:09,803 నేను మీతో గొడవ పడాలని అనుకోవడం లేదు, నీసీ ఆంటీ. 556 00:41:09,887 --> 00:41:13,015 కాబట్టి, మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలనుకుంటే, అది మీ ఇష్టం. 557 00:41:14,808 --> 00:41:17,019 -ఎంత? -ఏంటి? 558 00:41:17,769 --> 00:41:18,770 ఎంత? 559 00:41:18,854 --> 00:41:20,480 సరే. 560 00:41:20,564 --> 00:41:23,734 మీ బిల్స్, నీనా బిల్స్ కట్టగలిగినంత. 561 00:41:23,817 --> 00:41:27,112 పిల్లలు కాలేజీ చదువు పూర్తి చేయగలిగినంత, ఒకవేళ ఇష్టపడితే హిల్లీ కూడా చదువుకోగలిగినంత. 562 00:41:27,196 --> 00:41:29,364 చదువుకుని, ఏదైనా సాధించాలనుకునే నల్లజాతి ప్రజల కోసం 563 00:41:29,448 --> 00:41:32,117 నిధులు అందించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయమని పాపా గ్రే నన్ను అడిగారు. 564 00:41:32,201 --> 00:41:33,535 ఒక ఫౌండేషన్ స్థాపించి, నిధుల్లో అధికభాగం 565 00:41:33,619 --> 00:41:36,038 అందులో ఉండేలా చేయమని మిస్టర్ అబ్రోమోవిచ్ ను అడుగుతాను. 566 00:41:36,663 --> 00:41:40,876 -సరేనా? -ఆయన నా రక్త సంబంధీకుడు, రాబిన్, నీకు కాదు. 567 00:41:40,959 --> 00:41:43,045 మరైతే ఆయన్ని నీ రక్త సంబంధీకుడిగా ఎందుకు చూసుకోలేదు? 568 00:41:43,128 --> 00:41:44,588 నేను పాపా గ్రేని సరిగా చూడలేదని… 569 00:41:44,671 --> 00:41:46,048 మీరు ఆ అపార్ట్ మెంట్లో ఒక్కసారి అడుగుపెట్టి చూసుంటే, 570 00:41:46,131 --> 00:41:47,883 ఆయన ఆస్తి వ్యవహారాలు కూడా మీరే చూస్తూ ఉండేవారు, నేను కాదు. 571 00:41:47,966 --> 00:41:50,594 నీకు చాలా పొగరుంది పిల్లా. 572 00:41:50,677 --> 00:41:54,598 నేను ఏం చేసి ఉండాల్సిందో నాకు చెబుతున్నావా, ఇన్నేళ్ళూ పాపా గ్రేని చూసుకోలేదని అంటున్నావా! 573 00:41:54,681 --> 00:41:55,849 సంవత్సరాలు. 574 00:41:56,767 --> 00:41:59,019 అర్థమయిందా? వారాలు కాదు. 575 00:42:05,025 --> 00:42:07,611 -మీకు జరిగిన దానికి నేను బాధపడుతున్నాను… -అవును. 576 00:42:08,904 --> 00:42:10,030 నిజంగా. 577 00:42:13,617 --> 00:42:18,080 నిన్ను మరింత బాగా చూసుకుని ఉండాల్సింది. నాకిప్పుడు అర్థమవుతోంది, కానీ… 578 00:42:19,206 --> 00:42:22,417 రాబిన్, నిన్ను నా ఇంట్లో ఉంచుకున్నాను. 579 00:42:22,501 --> 00:42:25,295 -తర్వాత నన్ను ఇంట్లోంచి గెంటేశారు! -ఎందుకంటే నిన్ను కాపాడాలని అనుకున్నాను. 580 00:42:25,379 --> 00:42:27,548 -మీకు అర్థం కావడం లేదా? -ఏదో ఒకటి. 581 00:42:27,631 --> 00:42:30,217 ఎందుకంటే నేనెవరో తెలియకుండానే పాపా గ్రే నన్ను ఆదరించారు. 582 00:42:30,300 --> 00:42:33,387 ఆయన నా నుండి ఏదీ ఆశించలేదు, అలాగే ఆయన నుండి నేను కూడా ఏదీ ఆశించలేదు. 583 00:42:37,641 --> 00:42:39,893 అయ్యో, బాధ పడకండి. 584 00:42:41,228 --> 00:42:42,646 నేను మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోవడం లేదు. 585 00:42:43,438 --> 00:42:46,567 నేను… పాపా గ్రే రాసిన దాన్ని నేను అనుసరిస్తున్నాను అంతే. 586 00:42:47,067 --> 00:42:48,777 నేను… నేనది చేసి తీరాలి. 587 00:42:57,035 --> 00:42:58,495 మిమ్మల్ని మిస్సయ్యాను. 588 00:43:05,169 --> 00:43:06,420 నేను పోరాడుతూనే ఉండాలి. 589 00:43:07,171 --> 00:43:09,590 -కానీ… -నేనది చేసి తీరాలి. 590 00:43:35,657 --> 00:43:36,658 హేయ్. 591 00:43:37,492 --> 00:43:40,037 హేయ్. బానే ఉన్నావా? 592 00:43:40,120 --> 00:43:41,830 ఉన్నాను, బానే ఉన్నాను. థాంక్యూ. 593 00:43:46,376 --> 00:43:47,711 పాపా గ్రే? 594 00:43:50,839 --> 00:43:51,840 పాపా గ్రే. 595 00:43:53,050 --> 00:43:54,218 పాపా గ్రే. 596 00:43:55,469 --> 00:43:56,470 హాయ్. 597 00:43:58,764 --> 00:44:00,432 -బ… బర్డ్? -అవును. 598 00:44:02,100 --> 00:44:05,395 వసంతకాలపు మొదటి పక్షి. 599 00:44:05,979 --> 00:44:07,314 అవును. 600 00:44:07,397 --> 00:44:08,857 ఎలా ఉన్నారు, అంకుల్? 601 00:44:11,944 --> 00:44:13,779 ఇక్కడ చాలా చెడ్డ వారు ఉన్నారు. 602 00:44:14,821 --> 00:44:18,408 అమ్మాయి, వాళ్ళు నిన్నుకూడా బంధించే లోగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. 603 00:44:18,992 --> 00:44:21,453 నన్ను ఈ కుర్చీకి ఎలా కట్టేశారో చూశావా? 604 00:44:21,537 --> 00:44:23,580 -అవును. -అవును. లే… లేదు. 605 00:44:23,664 --> 00:44:26,917 లేదు, లేదు, లేదు. ఇది… ఇది మంచం. 606 00:44:27,000 --> 00:44:29,419 -మంచం. అవును. -అవును. 607 00:44:29,503 --> 00:44:32,714 కానీ మిమ్మల్ని మీ పాత అపార్ట్ మెంట్ కి తీసుకెళతాను. 608 00:44:32,798 --> 00:44:34,591 నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. 609 00:44:34,675 --> 00:44:36,260 అలాగే మిస్ షిర్లీ రింగ్ ని కూడా. 610 00:44:38,595 --> 00:44:41,431 డబ్ల్యు-ఆర్-ఐ-ఎన్-జి. 611 00:44:42,766 --> 00:44:46,895 డబ్ల్యు… డబ్ల్యు-ఆర్-ఐ… 612 00:44:47,813 --> 00:44:50,899 డబ్ల్యు-ఆర్-ఐ… 613 00:44:51,608 --> 00:44:55,946 డబ్ల్యు-ఆర్-ఐ-ఎన్… 614 00:44:56,613 --> 00:44:58,282 -జి. -జి. 615 00:45:02,786 --> 00:45:04,663 అక్కడ… అక్కడ మంటలు చెలరేగుతున్నాయి. 616 00:45:05,747 --> 00:45:07,165 చాలా పెద్దది. 617 00:45:08,250 --> 00:45:09,668 అది చాలా సేపు మండింది. 618 00:45:13,255 --> 00:45:15,924 దెయ్యం అందులోంచి బయటికి వచ్చి… 619 00:45:17,134 --> 00:45:19,261 కానీ నేను దానికి ఏమీ చెప్పలేదు. 620 00:45:23,432 --> 00:45:24,766 నేనిప్పుడు పెద్దయ్యాను కదా. 621 00:45:26,810 --> 00:45:27,811 అవును, అయ్యారు. 622 00:45:28,937 --> 00:45:31,023 నేను… నేను మాడ్ పెటిట్ ను రక్షించాను. 623 00:45:32,733 --> 00:45:34,693 నేను మంటల్లోకి పరిగెత్తాను. 624 00:45:36,320 --> 00:45:38,197 తనని బయటికి తీసుకొచ్చాను. 625 00:45:41,200 --> 00:45:44,411 మా బట్టలనిండా మసి నిండిపోయింది. 626 00:45:46,663 --> 00:45:47,664 హేయ్. 627 00:45:49,041 --> 00:45:52,085 కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. 628 00:45:54,046 --> 00:45:55,047 నిజంగా? 629 00:45:55,923 --> 00:45:57,716 అవును. నిజం. 630 00:45:58,967 --> 00:46:00,302 అంతా బాగానే ఉంది. 631 00:46:03,180 --> 00:46:04,389 అది పుస్తకమా? 632 00:46:08,435 --> 00:46:10,979 కావాలంటే మీకోసం చదివి వినిపిస్తాను. 633 00:46:12,773 --> 00:46:13,774 సరే. 634 00:46:17,653 --> 00:46:22,491 "సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఈ విశ్వంలో నక్షత్రాలు ఉన్నాయి. 635 00:46:26,119 --> 00:46:28,497 అవన్నీ ఒకే చోటి నుండి వచ్చాయి." 636 00:46:31,083 --> 00:46:32,668 ఆ చోటు ఎక్కడుందో మీకు తెలుసా, అంకుల్? 637 00:46:43,345 --> 00:46:44,346 ఇల్లు. 638 00:46:47,224 --> 00:46:48,225 అవును. 639 00:46:51,186 --> 00:46:52,771 ఏడవద్దు. 640 00:46:54,356 --> 00:46:55,357 ఇల్లు. 641 00:47:24,052 --> 00:47:28,682 నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, పిటీ, అదేంటంటే మనం చస్తూనే పుడతాం. 642 00:47:30,434 --> 00:47:36,190 మనం వదిలే ప్రతి శ్వాస స్వర్గానికి ఒకడుగును దగ్గర చేస్తుంది. 643 00:47:37,065 --> 00:47:40,444 దాన్ని విస్మరిస్తే, జీవితానికి అర్ధం లేకుండా పోతుంది. 644 00:47:42,404 --> 00:47:46,742 నువ్వు అర్థవంతమైన జీవితం గడపాలంటే, చావుని అంగీకరించాలి. 645 00:47:48,118 --> 00:47:51,872 కానీ నాకు మాడ్ బాగా గుర్తుకొస్తుంది. తను ఎప్పటికీ తిరిగిరాదు. 646 00:48:00,756 --> 00:48:03,425 తను నవ్వితే ఎలా ఉంటుందో నీకు గుర్తుందా? 647 00:48:05,594 --> 00:48:08,347 టికిల్ నదిలో మీరిద్దరూ నవ్వుతూ కేరింతలు కొడుతూ 648 00:48:08,430 --> 00:48:09,723 ఆడుకోవడం గుర్తుందా? 649 00:48:13,185 --> 00:48:15,646 ఒకసారి మేము ఒక క్యాట్ ఫిష్ ని పట్టుకుని 650 00:48:15,729 --> 00:48:18,857 ఒడ్డున పడేసాం, అది ఏం చేయలేకపోయింది. 651 00:48:18,941 --> 00:48:21,735 ఆ రోజు రాత్రి అమ్మ మాకోసం క్యాట్ ఫిష్ పులుసు చేసింది, మేము సాయం చేశాం. 652 00:48:23,195 --> 00:48:25,280 అదే జీవితంలోని మ్యాజిక్. 653 00:48:25,364 --> 00:48:28,825 నువ్వు నీ బుల్లి గర్ల్ ఫ్రెండ్ ని, తన నవ్వుని గుర్తు చేసుకోగలిగినంత కాలం… 654 00:48:31,537 --> 00:48:33,372 …తను కూడా ఎక్కడో నవ్వుతూ ఉంటుంది. 655 00:48:34,164 --> 00:48:35,874 -అవునా? -అవును. 656 00:49:06,446 --> 00:49:07,447 వాల్టర్ మోస్లీ రచనపై ఆధారపడింది 657 00:51:05,983 --> 00:51:07,985 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ