1 00:00:13,388 --> 00:00:14,723 ఎగురు! 2 00:00:19,394 --> 00:00:21,355 నేను పుట్టిన రోజు నాకు గుర్తు లేదు. 3 00:00:22,022 --> 00:00:23,982 నా తల్లిదండ్రులు నాకు గుర్తులేరు. 4 00:00:23,982 --> 00:00:26,360 నేను ఈ చోటుకి ఎలా వచ్చి చేరానో నాకు గుర్తు లేదు 5 00:00:26,360 --> 00:00:28,529 ఇది నాకు సరిపడ ప్రదేశం కానే కాదు. 6 00:00:29,488 --> 00:00:32,658 నాకు మొదటగా గుర్తున్నది మాత్రం భయం. 7 00:00:32,658 --> 00:00:35,619 రా! కానివ్వు! 8 00:00:35,619 --> 00:00:37,329 నేను ఇక్కడ ఉన్నది ధైర్యంగా ఉండటానికి. 9 00:00:37,329 --> 00:00:39,665 నేను రక్షణ కోసం శిక్షణ పొందాను. 10 00:00:39,665 --> 00:00:44,545 నేను నా సత్తా చూపించాల్సి ఉంది, కానీ దానికి బదులు, నేను డీలాపడిపోయాను. 11 00:00:44,545 --> 00:00:46,088 ఇలా రా. కానివ్వు. 12 00:00:47,506 --> 00:00:51,969 నేను పిరికివాడిని, అందుకు నన్ను నేనే ద్వేషించుకుంటాను. 13 00:01:27,171 --> 00:01:29,298 - ఆ తరువాత... - ఆకలిగా ఉన్నావా, బుజ్జి బాబు? 14 00:01:29,298 --> 00:01:30,591 ...నేను ఆమెని కలిశాను. 15 00:01:31,758 --> 00:01:33,594 ఇక్కడే ఉండు. నేను వెంటనే వచ్చేస్తాను. 16 00:01:33,594 --> 00:01:35,387 నా జీవితంలో మొదటిసారి, 17 00:01:35,387 --> 00:01:37,181 భయం కాకుండా మరొక ఫీలింగ్ నాలో ఏర్పడింది. 18 00:01:38,348 --> 00:01:39,766 నేను క్షేమంగా ఉన్నాను అనిపించింది. 19 00:01:41,059 --> 00:01:43,520 నేను ప్రేమని చవిచూశాను అనిపించింది. 20 00:01:45,689 --> 00:01:48,817 ఇంకా ప్రేమ, అది మన ఆలోచనల్ని మార్చివేయగలదు. 21 00:01:51,987 --> 00:01:55,824 నేను ఆమెని రక్షించగలను. అతడిని రక్షించగలను. 22 00:02:03,373 --> 00:02:05,501 నేను ఉన్న ప్రయోజనమే అది. 23 00:02:19,473 --> 00:02:20,599 కానీ నేను పొరబడ్డాను. 24 00:02:22,392 --> 00:02:23,602 నేను అతడిని కాపాడలేకపోయాను. 25 00:02:27,981 --> 00:02:29,024 సరిగ్గా ఆ క్షణం, 26 00:02:29,691 --> 00:02:33,403 నా గురించి నాకు ఉన్న అంచనాలు, నాలో ఉన్న భయాలు, 27 00:02:34,488 --> 00:02:35,739 అవన్నీ నిజం అయ్యాయి. 28 00:03:34,214 --> 00:03:36,675 బోనీ గార్మస్ రాసిన పుస్తకం ఆధారంగా 29 00:04:44,618 --> 00:04:46,703 మూర్ అండ్ సన్స్ ఫ్యామిలీ మార్చురీ మహోగనీ కలెక్షన్ 30 00:05:22,114 --> 00:05:23,365 సిబ్బంది విభాగం. నేను... 31 00:05:24,575 --> 00:05:26,034 అవును, అది నిజం. 32 00:05:28,912 --> 00:05:29,913 ఏంటి? 33 00:05:33,292 --> 00:05:35,878 ఓహ్, దేవుడా. ఎప్పుడు? 34 00:05:36,753 --> 00:05:38,881 మీకు కాలం కలిసిరాకపోతే గనుక 35 00:05:38,881 --> 00:05:41,008 దాని అర్థం దేవుడు మీ గురించి ఆలోచన చేయడం లేదని కాదు. 36 00:05:41,008 --> 00:05:43,385 జోసెఫ్ ని అతని సోదరులు మోసం చేశారు, 37 00:05:44,052 --> 00:05:46,305 అతడిని బానిసగా అమ్మేశారు, కానీ దేవుడికి అతని పట్ల వేరే ఆలోచన ఉంది. 38 00:05:46,305 --> 00:05:47,806 నిజం, ఆయనకు వేరే ఆలోచన ఉంది. 39 00:05:47,806 --> 00:05:50,100 డేవిడ్ కేవలం ఒక గొర్రెలుకాసే కుర్రవాడు... 40 00:05:50,100 --> 00:05:52,519 - అమ్మా. అమ్మా... - ...కానీ దేవుడికి వేరే ఆలోచన ఉంది. 41 00:05:52,519 --> 00:05:54,313 డాక్టర్ ఏవన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 42 00:05:55,772 --> 00:05:57,149 అతను అంత్యక్రియల ప్రదేశంలో ఉన్నాడు. 43 00:05:58,859 --> 00:06:01,278 అతను మట్టిలో ఉన్నాడని అనుకున్నాను. 44 00:06:02,196 --> 00:06:05,073 అతను అంత్యక్రియల ప్రదేశంలో ఉన్నాడు, మంగళవారంనాడు ఖననం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. 45 00:06:05,616 --> 00:06:07,034 అతని ఆత్మ ఎక్కడ ఉంది? 46 00:06:08,493 --> 00:06:10,537 అతని ఆత్మ స్వర్గలోకంలో దేవుడి దగ్గరకి వెళ్లిపోయింది. 47 00:06:11,205 --> 00:06:12,206 తన శరీరం వెళ్లలేదా? 48 00:06:12,789 --> 00:06:14,082 అది మట్టిలో ఉండిపోయింది. 49 00:06:14,917 --> 00:06:16,502 మనం రెవరెండ్ గారి మాటలు విందాం, సరేనా? 50 00:06:16,502 --> 00:06:19,171 - ...దేవుడికి ఒక ఆలోచన ఉందని నమ్మండి. - అవును. 51 00:06:19,171 --> 00:06:21,924 ఎందుకంటే ఆయన మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తాడు. 52 00:06:21,924 --> 00:06:23,258 అది నిజం. 53 00:06:23,258 --> 00:06:25,260 - ఏమెన్. - ఏమెన్. 54 00:06:27,179 --> 00:06:29,848 నేను నిద్రపోయే ముందు చేసే ప్రార్థనల్లో డాక్టర్ ఏవన్స్ గురించి కూడా ప్రార్థిస్తాను. 55 00:06:29,848 --> 00:06:31,475 అది చాలా మంచి విషయం, స్వీటీ. 56 00:06:31,475 --> 00:06:34,311 ఆ పాతకాలపు మంచిని గురించి నేర్చుకుందాం 57 00:06:34,311 --> 00:06:38,607 మరి ఆ తారల కిరీటాన్ని ఎవరు ధరిస్తారో తెలుసుకుందాం 58 00:06:38,607 --> 00:06:42,903 మంచి ప్రభువా, నాకు మార్గం చూపించు 59 00:06:44,279 --> 00:06:48,367 ఓ సిస్టర్స్, మనం కిందికి వెళదాం 60 00:06:48,367 --> 00:06:51,745 కిందికి వెళదాం, కిందికి రండి 61 00:06:51,745 --> 00:06:52,663 నేను ఇప్పుడే వస్తాను. 62 00:06:52,663 --> 00:06:56,708 ఓ సిస్టర్స్, మనం కిందికి వెళదాం 63 00:06:56,708 --> 00:07:00,379 నది దగ్గరకి వెళ్లి ప్రార్థనలు చేద్దాం 64 00:07:01,505 --> 00:07:05,759 నేను ప్రార్థన కోసం నది దగ్గరకి వెళ్లినప్పుడు 65 00:07:05,759 --> 00:07:09,137 పాతకాలపు మంచి గురించి నేర్చుకుంటున్నప్పుడు 66 00:07:09,137 --> 00:07:13,016 అంగీని, కిరీటాన్ని ఎవరు ధరిస్తారో తెలుసుకుందాం 67 00:07:13,016 --> 00:07:16,937 మంచి ప్రభువా, నాకు మార్గం చూపించు 68 00:07:17,646 --> 00:07:21,316 ఓ బ్రదర్స్, మనం కిందికి వెళదాం 69 00:07:21,316 --> 00:07:25,028 మనం కిందికి వెళదాం, కిందికి రండి 70 00:07:25,028 --> 00:07:28,991 ఓ బ్రదర్స్, మనం కిందికి వెళదాం 71 00:07:28,991 --> 00:07:32,828 నది దగ్గరకి వెళ్లి ప్రార్థనలు చేద్దాం 72 00:07:33,537 --> 00:07:37,833 నేను నది దగ్గరకి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు 73 00:07:37,833 --> 00:07:41,295 పాతకాలపు మంచి గురించి నేర్చుకుంటున్నప్పుడు 74 00:07:41,295 --> 00:07:45,215 తారల కిరీటాన్ని ఎవరు ధరిస్తారో తెలుసుకుందాం 75 00:07:45,215 --> 00:07:48,802 మంచి ప్రభువా, మాకు మార్గం చూపించు 76 00:08:15,162 --> 00:08:16,163 మిస్? 77 00:08:17,247 --> 00:08:20,334 రాల్ఫ్ బెయిలీ. కాల్విన్ ఏవన్స్ గురించి టైమ్స్ పత్రికలో నేను ఒక వ్యాసం రాస్తున్నాను. 78 00:08:20,334 --> 00:08:22,503 మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. 79 00:08:23,337 --> 00:08:24,505 మీరు కుటుంబసభ్యులని భావిస్తున్నాను. 80 00:08:25,589 --> 00:08:26,590 కాదు. 81 00:08:28,175 --> 00:08:32,054 మొదటి రెండు వరుసలు కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తారు, అందుకని అలా అనుకున్నాను... 82 00:08:33,972 --> 00:08:35,933 సరే, అయితే ఆయన మీకు ఎలా పరిచయమో నాకు చెప్పగలరా? 83 00:08:35,933 --> 00:08:38,727 ఏదైనా ఒక సంఘటన గురించి నాతో పంచుకోగలరా? ఆయన మీకు చాలాకాలంగా తెలుసా? 84 00:08:40,395 --> 00:08:41,395 లేదు. 85 00:08:42,981 --> 00:08:44,691 లేదు, మీరు... 86 00:08:44,691 --> 00:08:48,862 లేదు, నాకు ఆయన చాలాకాలంగా తెలియదు. నాకు ఆయనతో ఎక్కువ కాలం పరిచయం లేదు. 87 00:08:50,572 --> 00:08:52,574 కానీ, నాకు కొద్దిగా ఆయన గురించిన నేపథ్యం కావాలి. 88 00:08:52,574 --> 00:08:54,785 ఆయన గురించి కొన్ని విషయాలు విన్నాను. 89 00:08:55,410 --> 00:08:58,080 నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆయన గురించి కొన్ని స్మృతులు ఉన్నాయని చెప్పాడు, 90 00:08:58,080 --> 00:09:00,707 ఇంకా మరొకరు అయితే కాస్త శ్రుతి మించి ఆయనని... 91 00:09:00,707 --> 00:09:03,293 నేను కేవలం ఇక్కడ అతను అన్నది చెబుతున్నాను... ఆయన ఒక తలతిక్క మనిషి అని చెప్పాడు. 92 00:09:05,462 --> 00:09:07,881 ఆయనతో పరిచయం ఉన్న ఎవరికైనా అది ఖచ్చితంగా అబద్ధం అని తెలుస్తుంది. 93 00:09:08,465 --> 00:09:09,967 ఆయన గురించి అంతగా తెలియదని ఇందాకే అన్నారు కదా. 94 00:09:09,967 --> 00:09:12,052 ఆయనతో ఎక్కువ కాలం పరిచయం లేదు అన్నాను. 95 00:09:12,052 --> 00:09:14,304 అవును, నేను అదే అన్నాను. మీకు ఆయనతో ఎక్కువ కాలంగా పరిచయం లేదని. 96 00:09:15,138 --> 00:09:17,391 ఆగండి, మీరు ఇక్కడికి కుక్కల్ని తీసుకురాకూడదు అనుకుంటా. 97 00:09:17,391 --> 00:09:18,892 నేను వస్తున్న దారిలో ఒక బోర్డు చూశాను. 98 00:09:19,726 --> 00:09:21,103 మీకు కలిగిన విషాదానికి సారీ. 99 00:09:29,736 --> 00:09:35,534 ప్రతి దానికీ ఒక సీజన్ అంటూ ఉంటుంది. పుట్టుకకు ఒక సమయం, మరణానికి ఒక సమయం ఉంటాయి. 100 00:09:36,451 --> 00:09:40,747 కాల్విన్ ఏవన్స్ ఒక మేధావి, రసాయనిక శాస్త్రానికి అంకితమైన కెమిస్ట్ 101 00:09:40,747 --> 00:09:44,001 ఆయన ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవించాడు. 102 00:09:44,001 --> 00:09:47,713 కాల్విన్ ఏవన్స్ కి కుటుంబ సంబంధీకులు ఎవరూ లేరు. 103 00:09:48,422 --> 00:09:51,592 దేవుడు మన గురించి ఏం ఆలోచన చేశాడో మనకు తెలియకపోవచ్చు, 104 00:09:51,592 --> 00:09:56,638 కానీ అతను ఎప్పుడూ దేవుడి బిడ్డగానే ఉంటాడని మనం నమ్మాలి. 105 00:09:57,723 --> 00:10:01,643 ఇంకా అతను ప్రేమించే వ్యక్తులైన మీరు, అతని సమాజం, తీరని లోటుని అనుభవిస్తున్నారు, 106 00:10:01,643 --> 00:10:04,938 కాల్విన్ మంచితనంలో ఇంకా మీరు ఒకరికొకరి ఓదార్పులో స్వాంతన పొందుతున్నారు. 107 00:10:18,911 --> 00:10:20,621 ఆమె నాతో చాలా రోజుల నుండి మాట్లాడటం లేదు. 108 00:10:21,872 --> 00:10:24,791 నన్ను ముట్టుకోలేదు. నా వైపు కనీసం చూడలేదు. 109 00:10:33,008 --> 00:10:34,885 ఈ విషాదం నా వల్ల జరిగిందనే విషయాన్ని 110 00:10:34,885 --> 00:10:37,721 కాలం గడిచే కొద్దీ ఆమె మర్చిపోతుంది అనుకున్నాను, కానీ అది ఎలా సాధ్యం? 111 00:10:39,264 --> 00:10:43,185 ఎందుకంటే వైఫల్యాలు ఎప్పుడూ మర్చిపోలేనివి. 112 00:10:46,563 --> 00:10:49,024 - అతను నిన్ను బయటకి వెళ్దామని అడిగాడా? - లేదు, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. 113 00:10:49,024 --> 00:10:51,735 ఆమె ఎవరో చూడు. తదేకంగా చూడకు, బెర్తా. 114 00:10:51,735 --> 00:10:54,613 తను ఇక్కడికి వచ్చిందంటే నమ్మలేకుండా ఉంది. అతను పోయి కొద్ది రోజులు కూడా కాలేదు. 115 00:11:29,314 --> 00:11:31,817 అతని ప్రతి వాసన నాకు తెలుసు. 116 00:11:32,651 --> 00:11:36,947 స్నానం చేసిన తరువాత అతని వాసన, బయట నుంచి వచ్చినప్పుడు వాసన. 117 00:11:36,947 --> 00:11:38,949 పరిగెత్తిన తరువాత వచ్చే అతని వాసన. 118 00:11:40,409 --> 00:11:43,745 కానీ ఇక్కడ, నాకు ఏ వాసన రావడం లేదు. 119 00:11:48,208 --> 00:11:49,209 ఇది బాగానే ఉంది. 120 00:11:50,961 --> 00:11:52,337 ఎలిజబెత్, నువ్వు వచ్చావు. 121 00:11:53,505 --> 00:11:55,549 నా వస్తువులు ఎక్కడ? కాల్విన్ వస్తువులు ఎక్కడ? 122 00:11:55,549 --> 00:11:58,635 మిస్ జాట్, నువ్వు మరీ ఇంత వెంటనే రానవసరం లేదు. మీరు విశ్రాంతి తీసుకోవాలి. 123 00:11:58,635 --> 00:12:00,971 నేను పని చేయాలి. నాకు నా పరిశోధన, నా నోట్ బుక్స్ కావాలి. 124 00:12:00,971 --> 00:12:02,514 కాల్విన్ ఇంకా నేను చాలా సన్నిహితంగా... లేదు, 125 00:12:02,514 --> 00:12:06,393 రెమ్సెన్ గ్రాంట్ కోసం మా పరిశోధనలు సమర్పించే విషయంలో చాలా దగ్గరగా వచ్చాం. నేను ఒక్క రోజు కూడా మిస్ కాలేను. 126 00:12:07,019 --> 00:12:08,687 ఆ గదిలో అన్నీ స్టోరేజ్ గదిలోకి తరలిపోయాయి. 127 00:12:09,271 --> 00:12:10,981 సరే. నేను ఒక ఫారమ్ నింపి ఇవ్వనా? 128 00:12:12,107 --> 00:12:14,651 డాక్టర్ ఏవన్స్ పరిశోధనలు ఇక మీదట హేస్టింగ్స్ సంస్థకి చెందుతాయి. 129 00:12:18,488 --> 00:12:21,700 కానీ అది మా పరిశోధన. మేము చాలా దగ్గరగా వచ్చాము. 130 00:12:22,367 --> 00:12:25,287 నా ఖాళీ సమయాలలో నేను ఏదైనా ఖాళీ ల్యాబ్ ని వాడుకోవచ్చా? 131 00:12:26,038 --> 00:12:28,999 చాలా సారీ. అది... అది ఒక పాలసీ. 132 00:12:32,377 --> 00:12:38,133 అతని వ్యక్తిగతమైన వస్తువుల సంగతి ఏంటి? అతని రికార్డులు, దుస్తులు, అతని ల్యాబ్ కోట్? 133 00:12:39,092 --> 00:12:44,181 నాకు తెలుసు... నీకు ఇంకా డాక్టర్ ఏవన్స్ మధ్య ఒక అసాధారణమైన అనుబంధం ఉందని తెలుసు. 134 00:12:44,181 --> 00:12:45,557 కానీ మనం వేచి ఉండాలి. 135 00:12:45,557 --> 00:12:49,895 అతని సోదరుడో లేదా ఇంకెవరైనా రక్తసంబంధీకులో వచ్చి 136 00:12:49,895 --> 00:12:52,272 అతని వస్తువుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు వస్తారో లేదో చూడాలి. 137 00:12:53,398 --> 00:12:55,734 సారీ. నీకు ఏడుపు వస్తే గనుక... 138 00:12:55,734 --> 00:12:56,818 నాకు అవసరం లేదు. 139 00:12:57,945 --> 00:13:02,950 నేను పని చేయాలి. నేను పని చేయాల్సిన అవసరం ఉంది, ఫ్రాన్. ప్లీజ్. 140 00:13:04,243 --> 00:13:06,745 డియర్, ఒక కెమిస్ట్ మద్దతు లేకుండా ఎలా చేస్తావు... 141 00:13:10,958 --> 00:13:13,043 డబ్బులకు ఇబ్బంది ఉండచ్చు. కానీ నేను ఏం చేయగలనో అది చేస్తాను. 142 00:13:13,043 --> 00:13:16,755 బహుశా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అవకాశం ఉండచ్చు. కానీ డాక్టర్ ఏవన్స్ కుక్క... 143 00:13:17,339 --> 00:13:20,467 ఆ కుక్క లేకుండా నువ్వు తిరిగి వస్తే, నేను తగిన ఏర్పాట్లు చేయగలను. 144 00:13:24,012 --> 00:13:24,930 థాంక్యూ. 145 00:13:33,063 --> 00:13:35,607 ప్రతి రోజు ఉదయం ఆమె బయలుదేరి వెళ్లినప్పుడు, నాకు భయం వేసేది. 146 00:13:36,441 --> 00:13:38,569 ఎందుకంటే ఒకవేళ ఆమె తిరిగి రాకపోతే? 147 00:13:38,569 --> 00:13:42,072 నీకు ఆహారం ఇక్కడ పెడుతున్నాను. అది ఖచ్చితంగా మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీ అవుతుంది. 148 00:13:43,031 --> 00:13:44,074 నేను టీవీ ఆన్ చేస్తున్నాను. 149 00:13:44,074 --> 00:13:47,411 సాధారణంగా నేను కార్టూన్ షోలని చూడను, కానీ పరిస్థితులను బట్టి, 150 00:13:47,411 --> 00:13:49,246 నేను న్యూస్ చూడటానికి ఇష్టపడతాను. 151 00:13:49,246 --> 00:13:50,205 వెనుక తలుపు తెరిచే ఉంది... 152 00:13:50,205 --> 00:13:52,374 నాకు కాస్త ఉపశమనం దొరికింది, 153 00:13:52,374 --> 00:13:55,043 ఎందుకంటే నేను చేసిన పనికి ఆమెకి ముఖం చూపించే అవసరం ఉండదు. 154 00:14:02,676 --> 00:14:07,347 "గ్రే" అనే పదంలో ఏ అని పలికిన విధానం 155 00:14:07,347 --> 00:14:10,267 అమెరికన్ స్పెల్లింగ్ లో ఆమోదించినట్లుగా, 156 00:14:10,267 --> 00:14:15,230 ఆ పదబంధంలో 14వ అడ్డం ఆధారం "ఎర్ల్ బ్లాంక్ టీ" అనేది తప్పు. 157 00:14:15,230 --> 00:14:20,527 దానిని ఇ అని పలకాలి, ఎందుకంటే దానికి చార్ల్స్ గ్రే పేరు పెట్టారు. 158 00:14:22,779 --> 00:14:24,072 నీకు ఇదంతా అర్థం అవుతోందా? 159 00:14:24,072 --> 00:14:26,325 అర్థం అవుతోంది, ఇంకా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 160 00:14:26,325 --> 00:14:28,702 అమ్మాయి, నువ్వు హేళనగా అంటున్నావా? 161 00:14:29,995 --> 00:14:30,996 ఖచ్చితంగా కాదు. 162 00:14:49,264 --> 00:14:53,310 ఈ సమయంలో ఇలాంటి ఘోరం జరగడం దారణమని తెలుసు ఎందుకంటే డాక్టర్ ఏవన్స్ 163 00:14:53,310 --> 00:14:55,812 నిధుల కోసం తన అధ్యయనాన్ని దాదాపు నివేదించబోయాడు, కానీ... 164 00:14:57,439 --> 00:14:58,857 మీకు అర్థమైంది అనుకుంటా 165 00:14:59,358 --> 00:15:04,488 రెమ్సెన్ ఫౌండేషన్ సంస్థ ఆ నిధులని వేరే చోట మంజూరు చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. 166 00:15:04,488 --> 00:15:05,572 నేను ఊహించాను. 167 00:15:06,240 --> 00:15:08,909 నేను దాని గురించే మీతో మాట్లాడాలి అనుకున్నాను. 168 00:15:10,953 --> 00:15:13,914 ఇక్కడ జరిగింది గత కొద్ది రోజులుగా జీర్ణం చేసుకోవడానికి సమయం పట్టింది 169 00:15:14,623 --> 00:15:17,376 ఎందుకంటే కాల్విన్ నాకు ప్రియమిత్రుడు ఇంకా నా ల్యాబ్ సహచరుడు కూడా. 170 00:15:17,376 --> 00:15:18,836 అది నాకు తెలియదు. 171 00:15:19,545 --> 00:15:21,672 అందుకే నేను ఆలోచిస్తున్నాను... 172 00:15:22,256 --> 00:15:24,716 ఇంకా ఇది "సాధ్యమేనా" అనేది నాకు అనుమానమే. 173 00:15:25,801 --> 00:15:28,512 డాక్టర్ ఏవన్స్ అధ్యయనాన్ని నేను కొనసాగించాలని అనుకుంటున్నాను. 174 00:15:28,512 --> 00:15:30,013 అది కేవలం అతని కోసం మాత్రమే కాదు, 175 00:15:30,013 --> 00:15:35,269 కానీ మనకి కొన్ని సంవత్సరాలుగా ఎదురవుతున్న ఆ పెద్ద ప్రశ్నలకు జవాబులు కనుక్కునే ప్రయత్నం కోసం కూడా. 176 00:15:38,021 --> 00:15:39,857 దాన్ని మా బోర్డులో చర్చించనివ్వు. 177 00:15:51,285 --> 00:15:52,286 నీకు ఒక కానుక తెచ్చాను. 178 00:15:53,996 --> 00:15:54,997 సారీ, సర్? 179 00:15:55,831 --> 00:15:56,665 దాన్ని తెరిచి చూడు. 180 00:16:01,170 --> 00:16:02,171 సరే. 181 00:16:05,090 --> 00:16:07,259 నేను... ఇది... 182 00:16:08,468 --> 00:16:11,805 వావ్, న్యూక్లియోటైడ్స్ గురించి ఇది జాట్ ఇంకా ఏవన్స్ చేసిన పరిశోధన. 183 00:16:11,805 --> 00:16:13,182 లేదు, డాక్టర్ బోరివిట్జ్. 184 00:16:13,182 --> 00:16:17,019 ఇది న్యూక్లియోటైడ్స్ గురించి హేస్టింగ్స్ సంస్థ పరిశోధన, 185 00:16:17,019 --> 00:16:19,605 ఇప్పుడు ఆ ఫలితాలని నువ్వు పునరుత్పత్తి చేయాలి. 186 00:16:22,733 --> 00:16:26,361 ఈ విషయంలో నేను మీకు సాయం చేయగలను, సర్. నిజంగా, చేయగలను. నేను కేవలం... 187 00:16:26,361 --> 00:16:29,615 నేను చేయని పరిశోధనని నాదని నేను చెప్పుకోలేను. 188 00:16:29,615 --> 00:16:31,783 అయితే అది చేయి. నాతో కలిసి చేయి. 189 00:16:31,783 --> 00:16:35,704 చూడు, ఏవన్స్ చెప్పినట్లుగా ఈ పరిశోధన గనుక అంత విప్లవాత్మకమైనది అయితే, 190 00:16:35,704 --> 00:16:40,792 అప్పుడు నువ్వు, నేను కలిసి ఈ ఫలితాలను ఒక్కొక్కటిగా పునరుత్పత్తి చేసి దానిని మనదిగా ప్రకటించుకుందాం. 191 00:16:42,794 --> 00:16:43,795 మరి మిస్ జాట్ సంగతి ఏంటి? 192 00:16:46,048 --> 00:16:50,427 చూడు, ఈ పని నీతో కాదు అంటే, నేను నీ బదులు వేరే వాళ్లని వెతుక్కుంటాను. 193 00:16:58,060 --> 00:17:02,231 కాల్విన్ పరిశోధన వృథా పోవడం సిగ్గుచేటు విషయం. 194 00:18:31,737 --> 00:18:33,405 రుతుస్రావ చక్రం ప్రారంభం ముగింపు 195 00:18:36,325 --> 00:18:38,160 జనవరి 196 00:18:51,798 --> 00:18:57,804 గర్భం దాల్చడం గురించిన నిర్ధారణ ఉభయచరాల అండోత్సర్గము 197 00:19:23,413 --> 00:19:24,414 ఎక్స్ క్యూజ్ మీ. 198 00:19:26,291 --> 00:19:28,502 నేను వస్తానని మీకు తెలుసు అనుకున్నాను. 199 00:19:28,502 --> 00:19:31,964 ఫార్మకాలజీ ల్యాబ్ కోసం కొన్ని సాంపిల్స్ ని తీసుకురమ్మని డాక్టర్ డొనాటీ అడిగారు. 200 00:19:33,715 --> 00:19:35,759 అయి ఉండచ్చు. ఎవరూ నాకు ఏమీ చెప్పరు. 201 00:19:37,094 --> 00:19:38,011 నీకు కావలసింది తీసుకువెళ్లు. 202 00:19:51,316 --> 00:19:55,070 {\an8}పారిశుధ్యం పని కొనసాగుతోంది 203 00:19:56,446 --> 00:19:58,323 {\an8}నియంత్రణ ప్రయోగాత్మకం 204 00:22:17,671 --> 00:22:20,007 ఆమె కడుపులో బిడ్డ ఉందని తనకన్నా నాకు ముందే తెలుసు. 205 00:22:20,757 --> 00:22:24,011 వాన పడుతుందని చాలా ముందే నాకు తెలిసినట్లే ఇది కూడా తెలుసు. 206 00:22:27,848 --> 00:22:31,810 బహుశా ఇది మాకు కొత్త ఆరంభం కావచ్చు అనుకున్నాను. 207 00:22:31,810 --> 00:22:32,895 ఒక కొత్త ఆరంభం. 208 00:22:59,254 --> 00:23:02,382 హలో, నేను సాయం చేయనా? 209 00:23:03,634 --> 00:23:06,220 అంతా బాగానే ఉందా? నేను తలుపు తడుతున్నాను. 210 00:23:06,220 --> 00:23:08,347 నేను ఒక పరిశ్రమ ప్రామాణికమైన కెమికల్ ల్యాబ్ తయారు చేస్తున్నాను. 211 00:23:10,057 --> 00:23:11,475 ఇప్పుడు మంచి సమయం కాదా? 212 00:23:11,475 --> 00:23:12,559 దేనికి చెడు సమయం? 213 00:23:13,810 --> 00:23:18,315 ఎల్ఎ టైమ్స్ లో వచ్చిన ఈ వ్యాసం, ఇది కాల్విన్ ని ఒక రాక్షసుడిగా వర్ణిస్తూ రాసినది. 214 00:23:18,899 --> 00:23:22,069 "కుటుంబ సభ్యుల వరుసలో కూర్చున్న ఒంటరి మహిళ కూడా ఏం చెప్పిందంటే, ఆమె మాటల్లోనే, 215 00:23:22,069 --> 00:23:24,196 'నాకు అతని గురించి పూర్తిగా తెలియదు' అంది." 216 00:23:25,781 --> 00:23:27,449 ఇది దారుణంగా ఉంది. నేను ఎప్పుడూ అలా చెప్పను. 217 00:23:27,449 --> 00:23:30,619 ఖచ్చితంగా. ఇది ఆ పాత్రికేయుని బాధ్యతారాహిత్యం. 218 00:23:31,161 --> 00:23:32,287 మనం ఒక ఇంజంక్షన్ దావా వేయచ్చు. 219 00:23:35,123 --> 00:23:37,042 ఎవరైనా తన గురించి ఏం ఆలోచిస్తారనేది కాల్విన్ ఎప్పుడూ లెక్క చేయలేదు. 220 00:23:38,794 --> 00:23:39,920 అది అప్పుడు. 221 00:23:39,920 --> 00:23:41,547 ఇప్పుడు ఏం రాశారు అనేది రికార్డుగా ఉంది. 222 00:23:42,589 --> 00:23:45,592 టైమ్స్ లో ఎవరితో అయినా నేను మాట్లాడతాను. అఫిడవిట్ మీద నాకు నీ సంతకం కావాలి. 223 00:23:45,592 --> 00:23:47,803 బహుశా అంతవరకూ రాదు, కానీ ఆ వివరాలు నీకు చెబుతాను. 224 00:23:48,679 --> 00:23:50,055 సారీ. మీరు ఎవరు? 225 00:23:51,557 --> 00:23:52,683 నా పేరు హారియెట్ స్లోన్. 226 00:23:54,101 --> 00:23:55,602 నేను ఈ ఎదురుగానే ఉంటాను. 227 00:23:56,311 --> 00:23:57,437 కాల్విన్ నా స్నేహితుడు. 228 00:24:00,774 --> 00:24:02,693 సారీ. నేను ప్రస్తుతం స్థిమితంగా లేను. 229 00:24:04,069 --> 00:24:05,445 - శుభ రాత్రి. - మీకు కూడా. 230 00:24:18,166 --> 00:24:20,043 నాలో ఒక ఆలోచన మెదిలింది. 231 00:24:20,544 --> 00:24:24,464 నేను మెలకువగా ఉన్న సమయం అంతా ఆ కిటికీ దగ్గర నిలబడి కాపలా కాయడం మొదలుపెట్టాను. 232 00:24:25,424 --> 00:24:28,051 నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు మరొక అవకాశం దొరికింది. 233 00:24:38,937 --> 00:24:42,149 ఇంక మరోసారి నేను పొరపాటు చేయను. నేను చేయలేను. 234 00:24:43,192 --> 00:24:48,822 ఈ గదిలో 1934 వరకూ భోజనం అందించేవారు కాదు. 235 00:24:48,822 --> 00:24:54,953 1939 వరకూ ఈ గదిలో వేడి వంటకాలు వడ్డించేవారు కాదు. 236 00:24:55,662 --> 00:25:00,417 సోమవారాలు ఐరిష్ మసాలాలతో గొడ్డు మాంసం. మంగళవారాలు చికెన్ ఇంకా డంప్లింగ్స్. 237 00:25:01,001 --> 00:25:04,421 లేదా అది బుధవారమా? నాకు ఖచ్చితంగా గుర్తులేదు. 238 00:25:04,421 --> 00:25:07,007 - ఆగు. అప్పుడు ఆ రోజుల్లో... - సారీ. ఎక్స్ క్యూజ్ మీ, మిస్టర్ ఆస్టర్. 239 00:25:11,637 --> 00:25:12,804 ఇప్పుడు చూద్దాం. 240 00:25:12,804 --> 00:25:14,473 బోరివిట్జ్, నీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? 241 00:25:15,641 --> 00:25:16,642 తప్పకుండా. 242 00:25:18,519 --> 00:25:21,855 ఎలిజబెత్, నేను సారీ చెప్పాలి, అంత్యక్రియల సమయంలో నీకు చెప్పే అవకాశం రాలేదు, 243 00:25:21,855 --> 00:25:24,942 కానీ నీకు జరిగిన విషాదానికి నా సంతాపం. 244 00:25:26,026 --> 00:25:27,236 మీరు ఇద్దరూ సన్నిహితులని తెలుసు. 245 00:25:27,945 --> 00:25:30,739 థాంక్యూ. నువ్వు ఇంకా లౌరెల్ తో ప్రేమలో ఉన్నావా? 246 00:25:35,369 --> 00:25:36,370 నీకు తెలుసా? 247 00:25:37,204 --> 00:25:38,205 అందరికీ తెలుసు. 248 00:25:40,123 --> 00:25:42,251 మా వస్తువులన్నీ డొనాటీ స్వాధీనం చేసుకున్నాడు. 249 00:25:42,876 --> 00:25:43,961 మా పరిశోధన. 250 00:25:43,961 --> 00:25:45,671 కాల్విన్ వ్యక్తిగత వస్తువులు. 251 00:25:45,671 --> 00:25:47,798 లౌరెల్ ఇప్పుడు స్టోరేజ్ గదిలో పని చేస్తుందని కూడా తెలుసు. 252 00:25:47,798 --> 00:25:53,345 కాబట్టి, నేను కొన్ని వస్తువులు తీసుకోవచ్చా అని ఆమెను నువ్వు అడగాలి. ఏదైనా కానీ. 253 00:25:56,932 --> 00:25:58,684 నేను ప్రయత్నిస్తాను. నిజంగా. 254 00:26:00,561 --> 00:26:01,687 థాంక్యూ, ఆల్ఫ్రెడ్. 255 00:26:09,570 --> 00:26:12,906 లేదు, మంగళవారంనాడు క్రీమ్ సాస్ లో గొడ్డు మాంసం ముక్కలు వడ్డించేవారు, 256 00:26:13,907 --> 00:26:18,704 బుధవారంనాడు చికెన్ ఇంకా డంప్లింగ్ వంటకాలు ఇంకా శుక్రవారం నాడు నాసిరకపు చేపల వంటకం వడ్డించేవారు. 257 00:26:20,289 --> 00:26:21,498 లాస్ ఏంజెలెస్ టైమ్స్ 258 00:26:21,498 --> 00:26:22,583 ఎల్.ఏ టైమ్స్. 259 00:26:34,011 --> 00:26:35,429 అయ్యో. మిమ్మల్ని వేచి ఉంచినందుకు సారీ. 260 00:26:36,180 --> 00:26:38,932 రెండు వారాల పని ఈ రోజే చేసినట్లు ఉంది. ఏది ఏమైనా. 261 00:26:38,932 --> 00:26:41,018 - ఆలస్యానికి సారీ, మిసెస్... - స్లోన్. 262 00:26:41,018 --> 00:26:43,854 మిసెస్ స్లోన్. అవును. సరే, నాకు మీ ఉత్తరం అందింది. 263 00:26:43,854 --> 00:26:46,315 ఏదైనా కొత్త సమాచారం తెలిస్తే మాకు సంతోషం. మీ దగ్గర ఏం సమాచారం ఉంది? 264 00:26:46,315 --> 00:26:48,609 వైట్ వోల్ఫ్ ఫాల్ట్ భూకంపం గురించి ఏదైనా సమాచారం... 265 00:26:48,609 --> 00:26:52,196 నిజానికి, కాల్విన్ ఏవన్స్ మీద మీరు రాసిన వ్యాసం గురించి మాట్లాడటానికి వచ్చాను. 266 00:26:53,447 --> 00:26:54,990 బాగా రాశాను, కదా? 267 00:26:54,990 --> 00:26:56,992 ఏమైనా వివరాలు మిస్ అయ్యానా? అతను ఒక విచిత్రమైన మనిషిలా అనిపించాడు. 268 00:26:56,992 --> 00:27:01,705 అతను విచిత్రమైన మనిషి కాదు. అతను ఒక మేధావి. మంచి మనిషి. 269 00:27:02,206 --> 00:27:04,166 మీరు రాసిన వ్యాసంలో అవాస్తవాలు ఉన్నాయి. 270 00:27:04,166 --> 00:27:07,503 ఇంకా మీరు రాసినది చట్టపరంగా చర్యలు తీసుకోదగ్గది ఇంకా తప్పు. అది తప్పు. 271 00:27:07,503 --> 00:27:09,963 ఎక్కడ నేను ఖచ్చితంగా తప్పు చేశాను? 272 00:27:09,963 --> 00:27:12,090 ఎందుకంటే ఇందులో ఏమైనా నిర్దిష్టమైన వాస్తవాలు ఉంటే, అది... 273 00:27:12,090 --> 00:27:14,635 {\an8}ఇది కేవలం ఉపోద్ఘాతం, ఒక పూర్తి చిత్రణ. 274 00:27:14,635 --> 00:27:17,095 {\an8}"ఏవన్స్ కి సైంటిఫిక్ సమాజంలో ఎంత గౌరవం ఉన్నా, 275 00:27:17,095 --> 00:27:19,473 అతను ఏకాంతంగా జీవించేవాడని అంటారు. 276 00:27:19,473 --> 00:27:22,142 అతని సహచరులతో ముభావంగా ఉంటాడని, నవ్వడానికి కూడా సిగ్గు పడతాడని అంటారు." 277 00:27:22,142 --> 00:27:27,356 ఇలా రాశారు, "ఆయన ఎంత మేధావో అంత బోరింగ్ మనిషి. గొప్ప మేధస్సు, పెద్ద బోరు," అని. 278 00:27:27,356 --> 00:27:29,066 దీనిని జర్నలిజమ్ అంటారా? 279 00:27:30,567 --> 00:27:32,778 నాకు తెలిసిన అందరిలో అత్యంత ఆత్మీయంగా ఉండే వ్యక్తి కాల్విన్. 280 00:27:33,529 --> 00:27:36,073 అతని మేధస్సు గొప్పది అయితే, అతని హృదయం ఇంకా గొప్పది. 281 00:27:36,073 --> 00:27:37,866 ఈ ఆర్టికల్ లో అది రాసి ఉండాలి. 282 00:27:37,866 --> 00:27:39,701 - కానీ అవి ఎవరో చెప్పినవి... - అనామక అభిప్రాయాలు. 283 00:27:39,701 --> 00:27:41,954 - అతని తోటి ఉద్యోగులు చెప్పారు. - ఆ రాతప్రతులు నేను చూడాలి. 284 00:27:43,330 --> 00:27:44,790 ప్రయత్నించి చూడండి. 285 00:27:46,124 --> 00:27:49,336 చూడండి, నేను సారీ చెబుతున్నాను. నిజంగా సారీ. 286 00:27:50,212 --> 00:27:52,548 కానీ వివాదాలు, మసాలాలు ఉంటేనే పేపర్లు అమ్ముడవుతాయి. 287 00:27:52,548 --> 00:27:53,924 నేను కేవలం నా ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాను. 288 00:27:57,261 --> 00:27:59,263 నేను మీకు ముందే చెప్పినట్లు, ఈ రోజు ఇక్కడ చాలా పని ఒత్తిడి ఉంది. 289 00:27:59,263 --> 00:28:02,599 కాబట్టి, మీ దగ్గర ఇంకో స్టోరీ ఉంటే మాట్లాడండి, లేదంటే నేను తిరిగి నా పనిలో పడాలి. 290 00:28:21,660 --> 00:28:23,954 - గుడ్ ఈవెనింగ్. - నేను లేకుండానే పని మొదలుపెట్టావు. 291 00:28:24,454 --> 00:28:26,331 లేదు, నిజానికి మొదలుపెట్టలేదు. కేవలం అంతా సిద్ధం చేస్తున్నాను. 292 00:28:27,541 --> 00:28:29,126 నేను కొద్దిగా అయోమయంలో ఉన్నాను. 293 00:28:30,919 --> 00:28:32,129 - అవును. - ఇక్కడ నుంచి మొదలుపెడదాం. 294 00:28:44,391 --> 00:28:46,560 నిదానం, నిదానం, నిదానం. 295 00:28:47,186 --> 00:28:48,604 ఇక్కడ, ఇక్కడ. 296 00:28:49,438 --> 00:28:51,315 నువ్వు ముందుగా సిల్వర్ కార్బొనేట్ వేశావు, కదా? 297 00:28:52,566 --> 00:28:53,650 అది మీరు చేశారు అనుకున్నాను. 298 00:29:08,582 --> 00:29:09,833 మీకు అది సరిగ్గానే ఉందనిపిస్తోందా? 299 00:29:11,502 --> 00:29:12,711 మనం ఏదో మిస్ అయ్యాం అనిపిస్తోంది. 300 00:29:12,711 --> 00:29:13,795 అలా చెప్పకు. 301 00:29:16,298 --> 00:29:17,841 నేను పొరపాటు పడుతుంటే గనుక క్షమించండి, 302 00:29:17,841 --> 00:29:19,968 కానీ ఈ కమిటీ 303 00:29:19,968 --> 00:29:22,137 అమెరికా రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పని చేస్తుందని భావిస్తున్నాను. 304 00:29:23,805 --> 00:29:26,058 సరే. మేమందరం దానిని ఆమోదిస్తున్నాం. 305 00:29:26,058 --> 00:29:27,893 నేను కూడా రాజ్యాంగానికి బద్ధురాలినే. 306 00:29:31,146 --> 00:29:36,026 ఇంకా మీరు రాజ్యాంగానికి బద్ధులై ఉన్నారంటే అందులో దాని సవరణలు కూడా ఉంటాయని భావిస్తాను. 307 00:29:36,026 --> 00:29:38,278 ఇంకా అందులోని పద్నాలుగవ సవరణ కూడా, అది... 308 00:29:44,159 --> 00:29:48,539 అది ప్రజలందరికీ... 309 00:29:49,957 --> 00:29:52,417 చట్టం ద్వారా సమాన రక్షణ కల్పిస్తుంది. 310 00:29:52,417 --> 00:29:56,004 కాబట్టి... సరిగ్గా ఇక్కడే అది కాస్త వివాదాస్పదం అవుతుంది. 311 00:29:56,004 --> 00:29:58,882 బెవెర్లీ ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ కి 312 00:29:58,882 --> 00:30:04,179 ఆ ఫ్రీవే నిర్మాణం విషయంలో నాకన్నా, మా పొరుగువారికన్నా 313 00:30:04,763 --> 00:30:07,850 ప్రత్యేక హక్కులు ఎలా సంక్రమిస్తాయి? 314 00:30:08,350 --> 00:30:13,814 మా అందరికీ సమాన రక్షణ ఉంటుందని భావిస్తున్నాం. మీలో ఎవరైనా దాని గురించి వివరిస్తారా? 315 00:30:18,151 --> 00:30:21,446 లేదా? అయితే నా వాదనని కొనసాగిస్తాను. 316 00:30:22,906 --> 00:30:28,579 మా ప్రాంతాన్ని నేలమట్టం చేసే ఈ ఫ్రీవేని మీరు నిర్మించాలని భావిస్తున్నారు... 317 00:30:39,548 --> 00:30:43,802 హాయ్. దీని కోసం లౌరెల్ ని మ్యూసో అండ్ ఫ్రాంక్ కి తీసుకువెళ్లాల్సి ఉంది. 318 00:30:44,553 --> 00:30:45,554 లోపలికి రా. 319 00:30:48,682 --> 00:30:49,683 ఇది నాకు చాలా ముఖ్యం. 320 00:30:50,851 --> 00:30:51,894 మరేం ఫర్వాలేదు. 321 00:30:53,061 --> 00:30:59,860 కానీ... ఎలిజబెత్, లౌరెల్, నేను ఆ మొత్తం స్టోర్ రూమ్ ని వెతికాము, 322 00:30:59,860 --> 00:31:01,737 కానీ మాకు నీ పరిశోధన పత్రాలు ఏవీ కనిపించలేదు. 323 00:31:02,863 --> 00:31:03,947 బహుశా అవి ఎక్కడో పోయి ఉండచ్చు, 324 00:31:03,947 --> 00:31:07,075 లేదా బహుశా వాటిని ప్రమాదవశాత్తూ బయట పారేసి ఉండచ్చు. 325 00:31:07,075 --> 00:31:10,245 నేను అంటే... నేను వాటిని చూడలేదు. 326 00:31:13,081 --> 00:31:14,208 సారీ. 327 00:31:15,209 --> 00:31:16,210 మరేం ఫర్వాలేదు. 328 00:31:19,463 --> 00:31:20,672 మీ డిన్నర్ ని ఆస్వాదించండి. 329 00:31:20,672 --> 00:31:21,757 థాంక్స్. 330 00:31:27,012 --> 00:31:29,014 {\an8}సి. ఏవన్స్ వ్యక్తిగత సామగ్రి 331 00:32:02,881 --> 00:32:07,094 అది చాలా చిన్న పెట్టె అని తెలుసు, కానీ అందులో అతని జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. 332 00:32:08,095 --> 00:32:09,096 మాకు సంబంధించినవి. 333 00:32:10,180 --> 00:32:15,102 అతను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు. మరి అతని వస్తువులు ఎందుకు సర్దిపెట్టారు? 334 00:32:21,733 --> 00:32:25,487 హారియెట్, నేను మరోసారి వస్తాను. -సి 335 00:32:29,908 --> 00:32:30,993 అమ్మా! 336 00:32:32,286 --> 00:32:33,787 అమ్మా, వాడిని ఆపమని చెప్పు! 337 00:32:33,787 --> 00:32:35,330 జూనియర్, ఆ బాణం కింద పడేయ్. 338 00:32:35,330 --> 00:32:37,833 - అమ్మా, అది నా బాణాన్ని తీసుకుంది! - లేదు, నేను తీసుకోలేదు! 339 00:32:37,833 --> 00:32:38,750 అమ్మా! 340 00:32:38,750 --> 00:32:40,836 - దానితో నన్ను కొట్టకు! - అది తిరిగి ఇచ్చేయ్! 341 00:32:41,420 --> 00:32:44,590 మీ పనులకు అడ్డు రావాలని కాదు, కానీ మీకు ఇది ఇవ్వాలని వచ్చాను. 342 00:32:46,049 --> 00:32:48,302 లేదా బహుశా, కాల్విన్ ఇవ్వాలని అనుకున్నాడు. 343 00:32:48,302 --> 00:32:50,262 - లేదు, నేను కాదు! - అవును, నువ్వే! 344 00:32:50,262 --> 00:32:52,306 ఇది నా కుర్చీ, నీది కాదు. 345 00:32:53,557 --> 00:32:55,893 - మీరు లోపలికి వస్తారా? - లేదు, ఫర్వాలేదు. 346 00:32:55,893 --> 00:32:57,394 అమ్మా, వచ్చి వాడిని పట్టుకో! 347 00:32:57,936 --> 00:32:59,980 ఒక నిమిషం టైమ్ ఇవ్వండి. వాళ్లకి భోజనం పెట్టేస్తే ఊరుకుంటారు. 348 00:32:59,980 --> 00:33:01,273 కానీ రండి. లోపలికి రండి. 349 00:33:01,273 --> 00:33:02,983 - డిన్నర్! - ఆపు! 350 00:33:02,983 --> 00:33:04,401 లేదు, నువ్వు ఆపు! 351 00:33:08,322 --> 00:33:09,698 వాడు నన్ను ముట్టుకుంటున్నాడు! 352 00:33:25,464 --> 00:33:28,717 మేము చివరిసారి మాట్లాడుకున్నప్పుడు తన మీద చాలా కోపం వచ్చింది. 353 00:33:29,801 --> 00:33:31,470 ఇంకా నాకు ఇప్పటికీ కోపంగానే ఉంది, తెలుసా. కాబట్టి... 354 00:33:32,304 --> 00:33:34,681 అతని మీద కోపంతో మాట్లాడినందుకు ఇప్పుడు నా మీద నాకే కోపంగా ఉంది. 355 00:33:38,769 --> 00:33:39,770 మీకు జాజ్ మ్యూజిక్ ఇష్టమేనా? 356 00:33:41,438 --> 00:33:42,523 ఈ మధ్యనే ఇష్టం ఏర్పడుతోంది. 357 00:33:45,651 --> 00:33:48,028 కాల్విన్ మొదట ఇక్కడి ఇంటికి మారినప్పుడు, నేను అతడిని చూడలేదు. 358 00:33:48,028 --> 00:33:49,238 ట్రక్కు వచ్చి వెళ్లడమే తెలుసు. 359 00:33:50,781 --> 00:33:53,283 అప్పుడు నేను పొరుగువారికి స్వాగతం చెబుతూ స్వీటుని తీసుకుని వెళ్లాను, 360 00:33:53,283 --> 00:33:56,078 లోపలి నుండి చార్లీ పార్కర్ సంగీతం వినిపించింది. 361 00:33:56,578 --> 00:34:00,123 అప్పుడు నేను, " ఈ కుటుంబానికి మంచి అభిరుచి ఉంది" అనుకున్నాను. 362 00:34:01,917 --> 00:34:02,960 ఎంత ఆశ్చర్యపోయి ఉంటానో ఊహించండి 363 00:34:02,960 --> 00:34:05,921 ఐదు ఇళ్ల పరిధిలో ఒక తెల్లజాతి కుర్రవాడు తలుపు తీసి మాట్లాడాడు. 364 00:34:08,799 --> 00:34:10,425 అతను డాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? 365 00:34:12,302 --> 00:34:17,391 నేను కిటికీలో నుంచి ఒకసారి చూశాను ఇంకా దాని గురించి ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేదాన్ని. అది... 366 00:34:18,600 --> 00:34:19,810 ఓహ్, అవును. అవును. 367 00:34:19,810 --> 00:34:24,606 - అదీ... నాకు బాగా నవ్వొచ్చింది. - భుజాలు తెగ ఊపడం, తల బాగా ఊపడం. 368 00:34:30,362 --> 00:34:31,362 దేవుడా. 369 00:34:41,081 --> 00:34:43,375 అయితే, ఒక ఇంటి వంటగదిలో పరిశ్రమ స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసే అవసరం 370 00:34:43,375 --> 00:34:45,878 ఎవరికైనా ఎందుకు ఉంటుందో నాకు చెప్పగలరా? 371 00:34:47,880 --> 00:34:49,672 మా పరిశోధనని నేను పూర్తి చేయాలి. 372 00:34:56,471 --> 00:34:57,472 నేను... 373 00:34:59,558 --> 00:35:00,809 నాకు చాలా తక్కువ టైమ్ ఉంది. 374 00:35:07,774 --> 00:35:08,775 మీరు గర్భవతి. 375 00:35:10,360 --> 00:35:11,528 - నేను ఆ పని చేయలేను. - మీరు చేయగలరు. 376 00:35:11,528 --> 00:35:12,988 నా వల్ల కాదు. 377 00:35:14,072 --> 00:35:17,409 ఎవరూ దానిని చేయలేరు. కానీ మనం అలవాటు చేసుకోవాలి. 378 00:35:18,869 --> 00:35:21,330 మనం ఇది చేయలేము అనుకుంటాం, కానీ ఏదోలాగ చేయగలుగుతాం. 379 00:35:22,915 --> 00:35:23,999 తల్లి అంటే అదే. 380 00:37:44,306 --> 00:37:45,516 డాక్టర్ మేసన్ ఆఫీస్. 381 00:37:46,683 --> 00:37:49,561 మిస్ జాట్, మిమ్మల్ని అధికారికంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. 382 00:37:50,145 --> 00:37:51,522 దయచేసి, నన్ను ఎలిజబెత్ అని పిలవండి. 383 00:37:52,689 --> 00:37:55,609 మీకు కలిగిన విషాదానికి నా సంతాపం. 384 00:37:55,609 --> 00:37:58,695 ఏవన్స్ మంచి మనిషి. మంచి మనిషితో పాటు మంచి రోవర్ కూడా. 385 00:38:00,113 --> 00:38:02,824 మీరు సిద్ధమయ్యాక వీలైనంత త్వరలో మాతో పాటు రోయింగ్ కి రావాలి. 386 00:38:03,325 --> 00:38:05,410 ఈ పరిస్థితుల్లో మీరు అక్కడికి రాలేరు. 387 00:38:05,410 --> 00:38:08,038 - నేను రోయింగ్ ప్రాక్టీసు చేస్తున్నాను. - మంచిది. 388 00:38:08,872 --> 00:38:10,707 అది మంచిది కాదా? కాల్విన్ ఒక యంత్రాన్ని తయారు చేశాడు. 389 00:38:10,707 --> 00:38:13,627 అంటే, నిజమే, అతను చేసి ఉండచ్చు అనుకుంటాను, కానీ అది కేవలం... 390 00:38:13,627 --> 00:38:15,963 ఎవరూ ఒక పనిగా ఆ యంత్రం మీద ప్రాక్టీసు చేయడం నేను ఎప్పుడూ వినలేదు. 391 00:38:16,630 --> 00:38:18,048 మీరు రోజులో ఎంత దూరం ప్రాక్టీసు చేస్తున్నారు? 392 00:38:18,048 --> 00:38:20,008 దాదాపు రోజుకి పదివేల మీటర్లు. 393 00:38:21,093 --> 00:38:24,513 గర్భవతులు బాధని ఓర్చుకోవడానికి శారీరకంగా సిద్ధపడతారని విన్నాను, 394 00:38:24,513 --> 00:38:26,390 కానీ మీరు బిడ్డని ప్రసవించడానికి పూర్తిగా తయారు అవుతున్నారు. 395 00:38:27,766 --> 00:38:29,518 అవును, మీ హెల్త్ రిపోర్టులు అన్నీ బాగానే ఉన్నాయి. 396 00:38:29,518 --> 00:38:32,312 కానీ మీరు హాస్పిటల్ కి రావడానికి ఇంతకాలం ఎందుకు జాప్యం చేశారు? 397 00:38:32,813 --> 00:38:34,064 మీకు చివరి మూడు నెలల సమయమే ఉంది. 398 00:38:37,609 --> 00:38:38,610 అంటే... 399 00:38:40,946 --> 00:38:47,077 నేను, అంటే, ఏం అనుకున్నాను అంటే... గర్భం దానంతట అదే పోతుంది అనుకున్నాను. 400 00:38:53,041 --> 00:38:56,128 మిస్ జాట్, మీకు ఎవరైనా తోడు ఉన్నారా? 401 00:38:56,128 --> 00:38:58,589 స్నేహితులు లేదా బంధువులు? మీ అమ్మగారు? 402 00:39:00,382 --> 00:39:01,383 ఎవరైనా? 403 00:39:05,012 --> 00:39:06,013 నాకు తోడుగా ఒక కుక్క ఉంది. 404 00:39:07,764 --> 00:39:09,850 కుక్కలు మంచి తోడు. 405 00:39:10,601 --> 00:39:13,437 ఇంకా మా పొరుగు ఇంటి ఆవిడ ఉన్నారు. 406 00:39:20,152 --> 00:39:23,822 ఒక కుక్క, ఇంకా ఒక పొరుగు ఇంటి ఆవిడ ఇంకా ఒక రోయింగ్ యంత్రం. 407 00:39:25,741 --> 00:39:26,867 అద్భుతం. 408 00:39:27,659 --> 00:39:30,829 మీరు పూర్తిగా కోలుకున్నాక, బోట్ హౌస్ దగ్గర మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. 409 00:39:31,496 --> 00:39:34,291 అందుకు కొంత సమయం పడుతుంది. బహుశా ఒక ఏడాది కావచ్చు. 410 00:39:35,292 --> 00:39:36,877 నా పడవలో రెండో సీటు ఖాళీగా ఉంది, 411 00:39:36,877 --> 00:39:38,420 అందులో మీరు సరిపోతారని ఎందుకో అనిపిస్తోంది. 412 00:39:38,420 --> 00:39:42,216 ఈ మధ్య సమయంలో, మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వండి. 413 00:39:42,758 --> 00:39:45,719 త్వరలో, నిద్ర అనేది గతకాలపు జ్ఞాపకం అవుతుంది. 414 00:39:52,309 --> 00:39:54,603 లేలాండ్ మేసన్, ఎం.డి. బోట్ హౌస్ - ఒక సంవత్సరం 415 00:40:00,150 --> 00:40:02,819 మీరు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద? 416 00:40:02,819 --> 00:40:04,112 అది నీకు తెలుసు అనుకుంటా. 417 00:40:04,613 --> 00:40:05,864 నాకు తెలియదు. 418 00:40:08,116 --> 00:40:09,618 నువ్వు కడుపుతో ఉన్నావు. 419 00:40:09,618 --> 00:40:11,995 అవును, నేను గర్భవతిని. అది నిజం. 420 00:40:12,788 --> 00:40:15,916 మిస్టర్ ఆస్టర్, కిందటి నెలలో నా పని ఏమైనా నెమ్మదిగా సాగిందా? 421 00:40:15,916 --> 00:40:18,043 అంటే, లేదు. 422 00:40:18,043 --> 00:40:20,587 నాకు అంటువ్యాధి ఏమీ లేదు. నాకు కొలరా వ్యాధి లేదు. 423 00:40:20,587 --> 00:40:22,548 నా కడుపులో ఉన్న బిడ్డ వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. 424 00:40:22,548 --> 00:40:24,883 గర్భవతులైన ఆడవాళ్లు ఉద్యోగాలు చేయరని 425 00:40:24,883 --> 00:40:25,968 నీకు బాగా తెలిసి ఉంటుంది. 426 00:40:25,968 --> 00:40:29,388 నువ్వు గర్భవతివి మాత్రమే కాదు, నీకు పెళ్లి కాలేదు, ఇది ఇంకా అప్రతిష్ట. 427 00:40:29,388 --> 00:40:31,139 గర్భం దాల్చడం అనేది ప్రకృతి సహజం. 428 00:40:31,932 --> 00:40:33,851 మనుషులు అందరూ అలాగే పుడతారు. 429 00:40:34,351 --> 00:40:36,603 గర్భం దాల్చడం గురించి ఆమె నాకు వివరిస్తోందా? 430 00:40:36,603 --> 00:40:39,231 - నువ్వు ఎవరని అనుకుంటున్నావు? - ఒక మహిళని. 431 00:40:40,148 --> 00:40:43,694 గర్భంలో ఫలదీకరణ జరిగిన జీవకణంలో యాభై శాతం అండం, ఇంకో యాభై శాతం వీర్యకణాలు ఉంటాయి. 432 00:40:43,694 --> 00:40:46,071 ఇటువంటి పరిస్థితిలో మగవారిని ఉద్యోగం నుండి తొలగిస్తారా? 433 00:40:46,947 --> 00:40:48,073 అది న్యాయంగా ఉంటుంది. నిజమే కదా? 434 00:40:48,699 --> 00:40:51,243 నువ్వు ఏ మగవారి గురించి మాట్లాడుతున్నావు? ఏవన్స్ గురించా? 435 00:40:51,243 --> 00:40:53,871 ఏ మగవారయినా. ఒక పెళ్లికాని మహిళ గర్భవతి అయితే, 436 00:40:53,871 --> 00:40:55,914 ఆమె గర్భానికి కారకుడైన మగవాడిని కూడా 437 00:40:55,914 --> 00:40:57,875 ఉద్యోగంలో నుండి తీసేస్తారా? 438 00:40:57,875 --> 00:41:00,127 - మీరు కాల్విన్ ని ఉద్యోగం నుండి తీసేసి ఉండేవారా? - నిజానికి కాదు. 439 00:41:00,127 --> 00:41:02,004 అయితే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడానికి మీకు ఏ కారణం లేదు. 440 00:41:02,754 --> 00:41:05,757 నాకు కారణం ఉంది. నువ్వు మహిళవి. గర్భం దాల్చినది నువ్వు. 441 00:41:06,258 --> 00:41:08,385 మాకు కొన్ని నియమాలు ఉంటాయి, మిస్ జాట్. 442 00:41:08,385 --> 00:41:11,889 ఈ కారణంతో కాదు. ఉద్యోగుల నియమావళిని నేను పూర్తిగా చదివాను. 443 00:41:12,514 --> 00:41:13,765 ఇది అందులో రాయని నియమం. 444 00:41:13,765 --> 00:41:16,602 అందువల్ల, ఇది చట్టప్రకారం చెల్లదు. 445 00:41:17,728 --> 00:41:20,355 ఏవన్స్ బతికి ఉంటే నిన్ను చూసి చాలా సిగ్గుపడేవాడు. 446 00:41:21,440 --> 00:41:24,318 లేదు. లేదు, అతను సిగ్గుపడేవాడు కాదు. 447 00:41:40,792 --> 00:41:41,627 ఎలిజబెత్. 448 00:41:42,503 --> 00:41:44,880 హాయ్. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. 449 00:41:44,880 --> 00:41:47,090 మీ దగ్గర ఏదైనా గొడ్డలి ఉందేమో తీసుకుందాం అనుకున్నాను. 450 00:41:47,758 --> 00:41:49,551 - నిజంగానా? - అవును. 451 00:41:49,551 --> 00:41:51,637 ఆ పెద్ద సుత్తితో పని సరిగ్గా కావడం లేదు. 452 00:41:51,637 --> 00:41:52,804 నా దగ్గర గొడ్డలి లేదు. 453 00:41:53,555 --> 00:41:55,224 సరే. గుడ్ నైట్. 454 00:41:55,224 --> 00:41:57,309 సరే, నేను కూడా మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాను. 455 00:41:57,809 --> 00:41:59,728 {\an8}ఆ రిపోర్టర్ మరొక వ్యాసం రాశాడు. 456 00:42:00,521 --> 00:42:03,023 "ఆ కౌన్సిల్ సభ్యులు వాళ్ల కుర్చీలలో కూర్చుని మెలికలు తిరుగుతూ కనిపించారు 457 00:42:03,023 --> 00:42:05,067 హారియెట్ స్లోన్..." అంటే నేను... 458 00:42:05,067 --> 00:42:08,111 "ఆ గదిలో అందరికీ రాజ్యాంగ చట్టాల గురించి ఉపోద్ఘాతం వివరించిన సందర్భంలో." 459 00:42:09,071 --> 00:42:10,531 వాళ్లు మెలికలు తిరిగేలా చేశాను. 460 00:42:14,326 --> 00:42:16,870 ఒట్టు, ఇది విచిత్రంగా అనిపిస్తుంది, 461 00:42:16,870 --> 00:42:19,873 కానీ,నేను అలా మాట్లాడటానికి కాల్విన్ సాయం చేశాడు అనిపిస్తుంది. 462 00:42:22,084 --> 00:42:25,003 - మీ ఉద్దేశం ఏంటి? - అంటే, నేను టైమ్స్ కార్యాలయానికి వెళ్లాను 463 00:42:25,003 --> 00:42:27,005 ఇంకా అతని గురించి మరొక వ్యాసం రాయమని అడిగాను, 464 00:42:27,756 --> 00:42:29,132 కానీ ఆ రిపోర్టర్ కుదరదు అన్నాడు. 465 00:42:29,132 --> 00:42:31,093 ఎందుకంటే వార్తాపత్రికలు అలా పని చేయవు. 466 00:42:31,093 --> 00:42:33,095 కానీ నేను అక్కడికి వెళ్లకపోయి ఉంటే, 467 00:42:33,095 --> 00:42:35,055 ఆ రిపోర్టర్ ఎప్పటికీ ఆ కౌన్సిల్ సమావేశానికి వచ్చి ఉండేవాడు కాదు, 468 00:42:35,055 --> 00:42:37,224 మన కమ్యూనిటీకి మేలు జరుగుతుందంటూ 469 00:42:37,224 --> 00:42:39,601 నా ఇంటి ప్రాంతాన్ని కూల్చివేసి ఫ్రీవే నిర్మించాలనే కొందరు జాత్యహంకారుల కుట్ర గురించి 470 00:42:39,601 --> 00:42:40,894 ఎల్ఏ టైమ్స్ లో ఈ వార్తని రాసేవాడు కాదు. 471 00:42:42,354 --> 00:42:44,606 అందులో కాల్విన్ చేసిన సాయం ఏం ఉంది? 472 00:42:46,483 --> 00:42:47,568 నాకు తెలియదు, నేను కేవలం... 473 00:42:50,612 --> 00:42:52,739 ఆ గదిలో అతను నాతో పాటు ఉన్నాడనే అనుభూతి కలిగింది. 474 00:42:58,495 --> 00:42:59,496 గుడ్ నైట్. 475 00:42:59,496 --> 00:43:00,581 ఎలిజబెత్? 476 00:43:04,418 --> 00:43:05,627 మీరు అణుచుకుంటున్న భావోద్వేగాన్ని... 477 00:43:08,505 --> 00:43:10,841 మీరు ఏదో ఒక దశలో బయటకు రానివ్వక తప్పదు. 478 00:43:39,036 --> 00:43:43,040 కెమిస్ట్రీ ఆఫ్ ఫుడ్స్ రచన జేమ్స్ బెల్ 479 00:43:46,585 --> 00:43:48,420 సూపర్ చికెన్ వంటకాలు 480 00:43:48,420 --> 00:43:51,381 అద్భుతంగా త్వరగా ఇంకా తేలికగా రోస్ట్ చికెన్ 481 00:44:05,437 --> 00:44:07,481 సారీ. నేను ఏం చేసినా, అందుకు సారీ. - కాల్విన్ 482 00:45:34,985 --> 00:45:37,738 అన్నీ కోల్పోయిన మనిషికి మనం ఏం చెప్పగలం? 483 00:45:42,868 --> 00:45:44,786 అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. 484 00:45:45,704 --> 00:45:48,457 మేము పరిగెత్తి అలసిపోయిన ప్రతిసారీ కాల్విన్ ఒక మాట అనేవాడు. 485 00:45:50,125 --> 00:45:52,336 "పరుగులో ఉన్న అందం అదే" అనేవాడు. 486 00:45:55,088 --> 00:45:57,132 మనం మరింక ముందుకు సాగలేమని అనుకుంటాం. 487 00:45:58,050 --> 00:45:59,510 గతించిన రోజుల గురించి విచారిస్తాం 488 00:45:59,510 --> 00:46:01,595 లేదా రేపు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతాం, 489 00:46:02,387 --> 00:46:07,184 అప్పుడు మనం చేయవలసిందల్లా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లడమే. 490 00:46:09,269 --> 00:46:14,525 ఒక అడుగు, మరొక అడుగు, ఇంకొక అడుగు. 491 00:46:19,029 --> 00:46:20,864 మనం అది మాత్రమే ఆలోచించాలి. 492 00:46:20,864 --> 00:46:23,200 ఒక అడుగు. ఇంకొక అడుగు. 493 00:46:26,870 --> 00:46:30,415 ఆ తరువాత, ఖచ్చితంగా, మనం గమ్యానికి చేరుకుంటాం. 494 00:47:26,388 --> 00:47:28,390 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్