1 00:00:06,500 --> 00:00:10,916 వోల్ఫ్‌గాంగ్ మరియు హైకె హోల్‌బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 2 00:00:24,458 --> 00:00:29,125 {\an8}క్రెఫెల్డెన్, 1984 3 00:00:35,500 --> 00:00:38,375 పుట్టినరోజు శుభాకాంక్షలు 6 4 00:01:42,333 --> 00:01:45,875 మార్క్, మనం బయటకు వెళ్ళాలి! ఇప్పుడే! 5 00:01:48,750 --> 00:01:50,166 నాన్నా, ఏం జరుగుతోంది? 6 00:01:50,625 --> 00:01:51,875 మనం వెళ్ళిపోవాలి. 7 00:01:51,875 --> 00:01:53,458 నీకు రాతి బొమ్మలు తెలుసు. 8 00:01:53,458 --> 00:01:54,500 అవి ప్రమాదకరం! 9 00:02:01,958 --> 00:02:03,000 బట్టలు వేసుకో. 10 00:02:04,583 --> 00:02:06,833 మార్క్, ఇది వేసుకో. వేసుకో. 11 00:02:11,291 --> 00:02:12,791 థామస్, సిద్ధంగా ఉన్నావా? 12 00:02:13,375 --> 00:02:15,041 ఈ క్రానికల్ నువ్వు తీసుకో. 13 00:02:33,208 --> 00:02:34,583 మార్క్, రా! 14 00:02:36,416 --> 00:02:39,500 నేను చెప్పినట్టు చెయ్. నాతో ఉండు. నాకు ఏమైనా జరిగితే 15 00:02:40,083 --> 00:02:41,875 మార్క్ను చూసుకో. సరేనా? 16 00:02:42,583 --> 00:02:43,916 మనం మళ్లీ ఇంటికి రాలేము. 17 00:02:44,625 --> 00:02:47,250 అతను మనల్ని కనిపెడతాడు. నీకు అర్థమవుతోందా? 18 00:02:49,916 --> 00:02:52,083 అతను మనల్ని కనిపెట్టకూడదు. 19 00:02:52,333 --> 00:02:55,666 ఏయ్, మార్క్, నిన్ను కాపాడుతాను, సరేనా? 20 00:02:55,666 --> 00:02:57,166 నేను నిన్ను కాపాడుతాను. 21 00:02:58,250 --> 00:02:59,166 ఎల్లప్పుడూ. 22 00:03:01,166 --> 00:03:03,708 -సామాను సర్దుకోలేదు. -తర్వాత కొందాము. ఎక్కు. 23 00:03:11,500 --> 00:03:12,625 కార్ల్! 24 00:03:13,583 --> 00:03:14,666 దయచేసి. 25 00:03:15,333 --> 00:03:17,375 ఇది వాస్తవం కాదు. 26 00:03:19,416 --> 00:03:20,291 విను, బంగారం. 27 00:03:20,833 --> 00:03:23,666 ఎవరూ నీ వెంట పడడం లేదు. నీకు సాయం చేస్తాను. 28 00:03:23,875 --> 00:03:26,375 అయ్యయ్యో! 29 00:03:31,958 --> 00:03:34,541 కనీసం పిల్లలనైనా ఉండనివ్వు. 30 00:03:38,375 --> 00:03:39,541 నన్ను మన్నించు. 31 00:03:50,791 --> 00:03:51,958 అమ్మ! 32 00:03:53,791 --> 00:03:58,000 ఏంజెల్స్ రెస్ట్ శ్మశానవాటిక 33 00:04:04,583 --> 00:04:06,208 అంతా సర్దుకుంటుంది. 34 00:04:31,791 --> 00:04:33,083 అమ్మా. 35 00:04:34,375 --> 00:04:37,041 పెట్రా జిమర్‌మన్ హెడ్ నర్స్ 36 00:04:47,375 --> 00:04:48,875 జన్మదిన శుభాకాంక్షలు మార్క్ 16 37 00:05:04,291 --> 00:05:05,166 బాగుంది! 38 00:05:23,458 --> 00:05:28,250 {\an8}క్రెఫెల్డెన్, 1994 39 00:06:02,166 --> 00:06:05,166 టేప్ ఆర్డర్ చేయాలనుకుంటే, ఈ నియమాలు పాటించాలి. 40 00:06:05,166 --> 00:06:09,125 మీకు కావాల్సింది రాసిస్తే నేను టేప్ మిక్స్ చేస్తాను. డీజే క్వాలిటీ. 41 00:06:09,125 --> 00:06:10,625 నాకు వారం రోజులు కావాలి, 42 00:06:10,625 --> 00:06:13,250 మీరు ఇదే సమయానికి, ఇదే చోట తీసుకెళ్ళవచ్చు. 43 00:06:13,750 --> 00:06:16,458 ఒక్కొక్క టేపుకు ఐదు మార్కులు, ఈ టోపీలో వేయాలి. 44 00:06:16,458 --> 00:06:19,416 మీకు మొత్తం ఆల్బమ్ కావాలంటే, ఇది మా దుకాణం. 45 00:06:19,416 --> 00:06:20,541 ఒరాకిల్ రికార్డులు 46 00:06:24,625 --> 00:06:25,541 ధన్యవాదాలు. 47 00:06:28,416 --> 00:06:29,416 ధన్యవాదాలు. 48 00:06:57,958 --> 00:06:58,875 హలో. 49 00:06:58,875 --> 00:07:02,291 -నువ్వు బెకీ, కదా? -అవును. బాగుంది. ఇక్కడ... 50 00:07:03,291 --> 00:07:05,125 -నాతో వస్తావా? -సరే. 51 00:07:27,583 --> 00:07:31,333 హెవీ మెటల్ వినేకంటే నువ్వు నా పాఠాలు వింటే ఎలా ఉంటుంది? 52 00:07:36,291 --> 00:07:38,208 బ్లాక్ క్రోవ్స్ హెవీ మెటల్ కాదు. 53 00:07:40,375 --> 00:07:42,500 -ఏమన్నావు? -ఏం లేదు. 54 00:07:42,500 --> 00:07:46,875 తప్పకుండా. మేమంతా నువ్వు చెప్పేది వినాలనుకుంటున్నాం. చెప్పు, జిమర్మన్. 55 00:07:46,875 --> 00:07:49,833 బ్లాక్ క్రోవ్స్ హెవీ మెటల్ కాదు అన్నాను అంతే. 56 00:07:50,583 --> 00:07:52,291 మీ అన్నలాగే. 57 00:07:53,083 --> 00:07:54,916 జోకులు వేయడానికి ఎప్పుడూ సిద్ధమే. 58 00:07:54,916 --> 00:07:57,458 ఎప్పుడు ఇబ్బందుల్లో పడతారు. 59 00:07:57,875 --> 00:08:00,375 కుటుంబ పరంపర ఉన్నట్లుంది. 60 00:08:02,666 --> 00:08:04,666 నీకు సంగీతం తెలుసు, కదా? 61 00:08:04,666 --> 00:08:08,458 నువ్వు, మీ అన్న, పెట్రోల్ బంక్ దగ్గర మీ మ్యూజిక్ షాప్. 62 00:08:09,041 --> 00:08:10,750 నేను ఏమనుకుంటానో తెలుసా? 63 00:08:11,166 --> 00:08:13,208 నువ్వు బడికి ఎందుకు వస్తున్నావు? 64 00:08:14,708 --> 00:08:17,958 ఇక్కడ రికార్డులు, టేపుల గురించి ఏం నేర్చుకోలేవు. 65 00:08:18,958 --> 00:08:21,583 ఇక్కడ నిన్నెవరు మిస్ కారు. కదా? 66 00:08:26,333 --> 00:08:27,833 నువ్వు నిలబడతావా? 67 00:08:32,500 --> 00:08:33,541 నిలబడు. 68 00:08:42,333 --> 00:08:43,750 ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. 69 00:08:46,708 --> 00:08:48,916 రా, మీ అన్నలాగే నన్ను కొట్టు... 70 00:08:50,750 --> 00:08:52,125 కొట్టు. 71 00:08:55,166 --> 00:08:56,625 లేదా పిరికివాడివా? 72 00:09:00,000 --> 00:09:01,750 కనీసం మీ అన్న ఆ పని చేసాడు. 73 00:09:02,250 --> 00:09:04,708 దాని గురించి మీ అమ్మ ఏమంటుంది... 74 00:09:17,125 --> 00:09:18,875 -ఏమండీ! -ఏంటి? 75 00:09:19,333 --> 00:09:21,375 నాకు విట్టిగ్ గారి తరగతి కావాలి. 76 00:09:22,958 --> 00:09:25,958 -కొత్తగా వచ్చాను. బెకీ మెయిస్నర్ను. -హలో. సరే. 77 00:09:25,958 --> 00:09:27,833 లోపలకు వచ్చి కూర్చో. 78 00:09:29,208 --> 00:09:31,625 నువ్వు కూడా కూర్చో. 79 00:09:31,625 --> 00:09:34,541 మీ పుస్తకాలు తెరవండి, పేజీ 128. 80 00:09:34,541 --> 00:09:37,375 రెండు దశల యాదృచ్ఛిక ప్రయోగం. 81 00:09:38,000 --> 00:09:39,833 డెన్నిస్, రా, 82 00:09:39,833 --> 00:09:42,041 నువ్వు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు. 83 00:10:00,041 --> 00:10:04,000 ద గ్రిఫన్ 84 00:10:10,416 --> 00:10:12,208 తరగతిలో హెడ్ఫోన్లు వాడకూడదు. 85 00:10:15,666 --> 00:10:17,375 ఇక్కడ నీకు అనుమతి ఉందా? 86 00:10:19,041 --> 00:10:21,375 ఏం చేస్తారు? నన్ను మళ్ళీ బహిష్కరిస్తారా? 87 00:10:26,541 --> 00:10:28,583 పుట్టినరోజు శుభాకాంక్షలు, తమ్ముడు. 88 00:10:30,833 --> 00:10:33,000 రా, చిన్నోడా... 89 00:10:51,791 --> 00:10:53,500 నీకు ఒక కానుక తెచ్చాను. 90 00:10:54,208 --> 00:10:55,500 నాకేం కావాలో నీకు తెలుసు. 91 00:10:57,958 --> 00:10:59,541 -ఏంటి? -వదిలేయ్. 92 00:11:00,791 --> 00:11:03,875 -అమ్మను ఎప్పుడు అసహ్యించుకోకూడదు. -అది వదిలేయమన్నాను. 93 00:11:05,000 --> 00:11:06,416 అది తెలివిలేనితనం. 94 00:11:07,208 --> 00:11:08,291 ఆమెకు గుర్తొస్తావు. 95 00:11:14,000 --> 00:11:15,041 ఆమె ఎలా ఉంది? 96 00:11:15,708 --> 00:11:17,250 ఆమెను నువ్వే అడుగు. 97 00:11:17,583 --> 00:11:19,416 భోజనానికి రావచ్చు. 98 00:11:19,416 --> 00:11:21,208 అమ్మ స్పఘెట్టి చేస్తుంది... 99 00:11:21,916 --> 00:11:23,750 నన్ను ఇబ్బంది పెట్టడం మానవు, కదా? 100 00:11:26,791 --> 00:11:27,958 చిన్ని వెధవ. 101 00:11:30,333 --> 00:11:33,541 -అంతే. నాకు ఇక చాలు. -మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. 102 00:11:33,541 --> 00:11:34,875 మళ్ళీ రేపు రా. 103 00:11:34,875 --> 00:11:37,875 వోల్ఫ్గాంగ్తో మాట్లాడు. సరుకు వెనక్కి తీసుకుంటాను. 104 00:11:37,875 --> 00:11:39,166 నేను నీకు తెలుసు. 105 00:11:39,666 --> 00:11:40,666 అరే... 106 00:11:41,000 --> 00:11:43,666 నేను ఇక్కడికి రోజు వస్తాను, కానీ నన్ను నమ్మవు? 107 00:11:43,666 --> 00:11:44,916 అడ్డు తప్పుకో, మిత్రమా. 108 00:11:53,166 --> 00:11:54,666 అయితే నేను మోసగాడినా, ఏంటి? 109 00:11:54,666 --> 00:11:56,375 నాకు అడ్డు తప్పుకోమని చెప్పాను. 110 00:11:56,958 --> 00:11:59,125 -తప్పుకోకుంటే? -తెలుసుకోవాలనుకుంటున్నావా? 111 00:12:00,625 --> 00:12:01,708 అవసరమైతే. 112 00:12:05,416 --> 00:12:06,583 ఏం జరుగుతోంది? 113 00:12:07,000 --> 00:12:09,750 డబ్బులు ఇవ్వకుండా సరుకు కావాలట. 114 00:12:09,750 --> 00:12:12,125 నేను అతనికి తెలిసినా, నన్ను దొంగలా చూస్తాడు. 115 00:12:12,125 --> 00:12:14,708 నేను ఎప్పుడూ మోసం చేయలేదు. దొంగను కాదు. 116 00:12:14,708 --> 00:12:16,416 ఇది అతని విధి. డబ్బివ్వు. 117 00:12:16,416 --> 00:12:18,041 గల్లా తాళంచెవి పోగొట్టాడు. 118 00:12:18,041 --> 00:12:21,291 అబద్ధం! నేను పోగొట్టలేదు. దాన్ని సురక్షితమైన చోట పెట్టాను. 119 00:12:22,083 --> 00:12:26,041 టాయిలెట్కు వెళ్ళినప్పుడు. ఇప్పుడది కనిపించడం లేదు. కానీ పోగొట్టలేదు. 120 00:12:26,041 --> 00:12:30,625 విను, మేము డెలివరీ చేయాలి, లేదంటే ఈ వారం కొత్త రికార్డులు ఉండవు. 121 00:12:30,625 --> 00:12:32,208 ఇదిగో, నా దగ్గర ఉంది... 122 00:12:34,500 --> 00:12:35,625 ఇది సరిపోదు. 123 00:12:39,666 --> 00:12:42,041 ఐదు, పది, 15... 124 00:12:42,541 --> 00:12:45,041 50, సరిపోయింది. 125 00:12:49,166 --> 00:12:50,333 {\an8}టిప్ 126 00:12:50,791 --> 00:12:53,458 -ఏమండీ. -వినడానికి అక్కడ ఉంది. 127 00:12:53,458 --> 00:12:57,250 కాదు, నేను మెటాలికా వారి ద బ్లాక్ ఆల్బమ్ కోసం వెతుకుతున్నాను. 128 00:12:58,958 --> 00:13:01,541 అది దశాబ్దంలో అత్యుత్తమమైనది. అక్కడ ఉంది. 129 00:13:01,541 --> 00:13:03,583 అది దశాబ్దంలో అత్యుత్తమమైనది కాదు. 130 00:13:03,583 --> 00:13:05,250 అత్యుత్తమ మెటల్ ఆల్బమ్... 131 00:13:05,250 --> 00:13:07,666 మెటాలికా ఆల్బమ్ అనేది పాప్ మ్యూజిక్. 132 00:13:07,666 --> 00:13:09,791 మార్క్, సవినయంగా చెబుతున్నాను, 133 00:13:09,791 --> 00:13:11,375 నీకు అసలేం తెలియదు, 134 00:13:11,375 --> 00:13:12,500 ఏదీ తెలియదు. 135 00:13:12,500 --> 00:13:17,875 ద బ్లాక్ ఆల్బమ్ అత్యుత్తమ, అత్యంత విజయం పొందిన, సమయోచిత ఆల్బమ్... 136 00:13:20,541 --> 00:13:22,500 ఈరోజు అతని పుట్టినరోజు. ఇదిగో. 137 00:13:24,666 --> 00:13:25,916 ఇది ఒక కళాఖండం. 138 00:13:28,583 --> 00:13:30,625 ఇక్కడ మెమో ఎందుకు పని చేస్తాడు? 139 00:13:31,166 --> 00:13:33,416 మూడు రోజులకు చెల్లిస్తే, ఐదు రోజులు చేస్తాడు. 140 00:13:33,833 --> 00:13:34,958 అతను ఇబ్బంది పెడతాడు. 141 00:13:35,666 --> 00:13:38,541 -ఎప్పుడూ ఇక్కడే ఎందుకుంటాడు? -అతనికి మరో పని లేదా? 142 00:13:39,583 --> 00:13:41,000 ఎందుకంటే అతను విధేయుడు. 143 00:13:41,583 --> 00:13:44,083 కెజాయ జోన్స్, బ్లూఫంక్ వాస్తవం. 144 00:13:51,958 --> 00:13:53,041 జన్మదిన శుభాకాంక్షలు. 145 00:13:53,041 --> 00:13:54,291 నా చేతులు చెమటపట్టాయి. 146 00:13:55,958 --> 00:13:58,583 -ఇది నాది మాత్రమే కాదు. -మెమోదా? 147 00:13:59,333 --> 00:14:00,250 నాన్నది. 148 00:14:15,833 --> 00:14:17,166 నువ్వు ఆటపట్టిస్తున్నావు. 149 00:14:17,875 --> 00:14:19,250 ఇది క్రానికలా? 150 00:14:23,000 --> 00:14:25,208 నాకు పదహారేళ్ళప్పుడు ఇచ్చారు. 151 00:14:25,208 --> 00:14:27,166 నాన్న పదహారేళ్ళప్పుడు అతనికి ఇచ్చారు. 152 00:14:27,166 --> 00:14:30,416 అతని తండ్రి, తాతలలాగే. 153 00:14:32,333 --> 00:14:33,916 మన పూర్వీకులు అందరూ. 154 00:14:33,916 --> 00:14:36,416 వాళ్ళంతా సంతకం చేసారు. ఇక్కడ. 155 00:14:36,416 --> 00:14:38,625 {\an8}నాన్న. నేను. 156 00:14:39,708 --> 00:14:41,125 నీకు పదహారేళ్ళు నిండాయి. 157 00:14:41,833 --> 00:14:44,083 నాన్న బదులుగా నేను నీకు దీక్ష ఇస్తాను. 158 00:14:44,083 --> 00:14:46,000 మన విధికి నిన్ను సిద్ధం చేస్తాను. 159 00:14:48,666 --> 00:14:50,458 నువ్వు బాగున్నావని అమ్మకు చెప్పాను. 160 00:14:50,458 --> 00:14:53,708 -నేను బాగున్నాను. -అది నిజం కాదు. ఛ. 161 00:14:54,625 --> 00:14:58,958 మార్క్, బ్లాక్ టవర్కు మనం కావాలి. నువ్వు, నేను. 162 00:15:00,458 --> 00:15:02,458 బ్లాక్ టవర్ అనేది లేదు! 163 00:15:03,041 --> 00:15:06,458 ఈ దుకాణం మనం కలిసి నిర్మించాం. 164 00:15:06,458 --> 00:15:08,541 -ఇది మన భవిష్యత్తు. -ఇది మన భవిష్యత్తు. 165 00:15:12,583 --> 00:15:14,916 నాన్న వాగే సోదిని ఎలా నమ్ముతావు? 166 00:15:20,791 --> 00:15:23,875 మార్క్, ఇది మన విధి. 167 00:15:24,583 --> 00:15:25,875 అనుభూతి చెందడం లేదా? 168 00:15:30,250 --> 00:15:32,750 సరే, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి చదువుతాను. 169 00:15:34,625 --> 00:15:35,875 కానీ నాకు రుజువు కావాలి. 170 00:15:36,541 --> 00:15:37,833 నాకు అద్భుతం జరగాలి. 171 00:15:38,333 --> 00:15:40,500 యూనికార్న్ లేదా రాక్షసుడు. 172 00:15:43,041 --> 00:15:44,875 నీకు రుజువు దొరుకుతుంది. 173 00:15:45,333 --> 00:15:46,416 కానీ అలా కాకుంటే... 174 00:15:47,083 --> 00:15:49,625 అప్పుడు నువ్వు థెరపీ చేయించుకోవాలి. 175 00:15:53,208 --> 00:15:55,458 -ఒప్పందం. -నేను సంతకం చేయాలంటే 176 00:15:55,833 --> 00:15:59,583 నువ్వు రేపు ఇంటికి వచ్చి, అమ్మను కలిసి, మాతో భోజనం చేయాలి. 177 00:16:02,750 --> 00:16:04,250 చిన్ని వెధవ. 178 00:16:35,000 --> 00:16:38,208 కార్ల్ జిమర్మన్ థామస్ జిమర్మన్ - మార్క్ జిమర్మన్ 179 00:16:41,125 --> 00:16:43,000 ఆ రోజుల్లో నాకూ అలాగే జరిగింది. 180 00:16:45,666 --> 00:16:46,875 రేపు రాత్రి మనింట్లో. 181 00:16:47,250 --> 00:16:48,666 ఇదిగో. చదువు. 182 00:16:49,500 --> 00:16:50,625 అధ్యయనం చెయ్. 183 00:17:04,333 --> 00:17:05,750 చివరకు. 184 00:17:46,000 --> 00:17:48,458 -హలో? -హాయ్, స్వీటీ, ఇది నేనే. 185 00:17:49,625 --> 00:17:51,958 -హాయ్, అమ్మ. -అప్పుడే స్థిరపడ్డావా? 186 00:17:52,416 --> 00:17:53,833 సరే. క్రెఫెల్డెన్ బాగుంది. 187 00:17:53,833 --> 00:17:57,791 -నాకు ఎప్పుడూ ఇంటికి రావాలని లేదు. -అరే, అది కేవలం కొన్ని నెలలే. 188 00:17:57,791 --> 00:18:00,083 అప్పుడు నా దగ్గరకు ఇంటికి రా. 189 00:18:00,583 --> 00:18:01,625 నేను వెళ్ళాలి. 190 00:18:01,625 --> 00:18:05,208 శృంగారానికి స్నేహితుడిని కలుస్తున్నాను. ముందుగా నేను కొకైన్ కొనాలి. 191 00:18:05,208 --> 00:18:06,583 బెకీ, ఇక చాలు. 192 00:18:07,750 --> 00:18:09,583 నాన్నా, ఫోన్! 193 00:18:09,958 --> 00:18:11,666 నేను చదువుకునే గదిలో ఎత్తుతాను. 194 00:18:32,583 --> 00:18:35,958 -హాయ్, నేను ఇంటికి వచ్చాను. -ఎక్కడికి వెళ్ళావు? 195 00:18:36,750 --> 00:18:39,416 -నన్ను మన్నించు, నేను... -ముప్పై నిమిషాలు ఆలస్యం. 196 00:18:40,125 --> 00:18:43,291 -నేను చింతిస్తాననే పట్టింపు నీకు లేదా? -అది కాదు. 197 00:18:43,958 --> 00:18:46,708 -ఏమీ కాదు. -మన మధ్య నియమాలు ఉన్నాయి. 198 00:18:47,750 --> 00:18:49,416 నన్ను మన్నించు. 199 00:18:49,416 --> 00:18:51,208 నాకోసం థామస్ వచ్చాడు. 200 00:18:51,791 --> 00:18:53,833 రేపు రాత్రి భోజనానికి వస్తున్నాడు. 201 00:18:54,833 --> 00:18:56,375 థామస్ ఇంటికి వస్తున్నాడా? 202 00:18:57,708 --> 00:18:58,791 అది ఎలా చేసావు? 203 00:19:05,208 --> 00:19:07,750 నేను కోప్పడినందుకు మన్నించు. 204 00:19:09,583 --> 00:19:10,708 ఊరకే చింతిస్తాను. 205 00:19:11,166 --> 00:19:12,416 పరవాలేదు. 206 00:19:13,916 --> 00:19:15,083 జన్మదిన శుభాకాంక్షలు. 207 00:19:16,333 --> 00:19:17,791 చాలా పని చేస్తావని తెలుసు. 208 00:19:18,708 --> 00:19:21,541 కానీ బయట భోజనం చెయ్. లేదా సినిమాకు వెళ్ళు. 209 00:19:21,541 --> 00:19:24,041 నిజంగా, నీకోసం కాస్త సమయం కేటాయించు. 210 00:19:24,041 --> 00:19:26,666 జనాల్ని కలువు. సరదాగా ఉండు. 211 00:19:27,333 --> 00:19:28,833 అది నువ్వు చెప్పడం. 212 00:19:30,000 --> 00:19:31,125 నేను వెళ్ళాలి. 213 00:19:33,125 --> 00:19:34,666 మరీ ఆలస్యంగా పడుకోకు. 214 00:20:25,666 --> 00:20:29,125 ఒరాకిల్ మిక్స్టేప్ 215 00:20:29,250 --> 00:20:31,416 ఎయింట్ నో మౌంటెన్ హై ఎనఫ్ 216 00:20:35,291 --> 00:20:39,291 షేమింగ్ పంప్కిన్స్ 217 00:21:07,000 --> 00:21:11,583 దుస్సమయ నివారిణి 218 00:21:49,666 --> 00:21:54,208 {\an8}పేర్ల జాబితా 219 00:22:08,833 --> 00:22:12,750 గడ్డవేరు 220 00:22:14,916 --> 00:22:16,416 లార్వా 221 00:22:23,625 --> 00:22:24,458 వాపు 222 00:22:32,291 --> 00:22:34,291 {\an8}బ్లాక్ టవర్ అడ్డుకోత 223 00:22:35,833 --> 00:22:37,125 అత్యంత పల్లపు సమతలం... 224 00:22:37,833 --> 00:22:39,416 మార్టెన్స్ కోర్టు... 225 00:22:40,500 --> 00:22:42,208 చిత్తడి సమతలం... 226 00:22:44,708 --> 00:22:46,416 ఆకాశ సమతలం... 227 00:22:52,208 --> 00:22:54,625 కొమ్ములు గలవారి నియమం 228 00:22:56,583 --> 00:22:58,625 గార్గోయిల్ 229 00:23:03,958 --> 00:23:07,416 {\an8}బానిసల వేటగాడు 230 00:23:21,291 --> 00:23:25,000 బ్లాక్ టవర్ పటం 231 00:23:29,583 --> 00:23:32,291 {\an8}ఎడారి 232 00:23:33,208 --> 00:23:35,250 మార్టెన్స్ కోర్టుకు మార్గం. 233 00:23:48,500 --> 00:23:50,041 కొమ్ములు గల మతాచార్యుడు 234 00:23:54,500 --> 00:23:55,750 దాడి 235 00:24:17,208 --> 00:24:18,208 {\an8}ద గ్రిఫన్... 236 00:24:18,208 --> 00:24:21,333 సింహం - డేగ 237 00:27:36,583 --> 00:27:38,041 నా పని ఇంకా అయిపోలేదు. 238 00:27:39,458 --> 00:27:41,041 నాకు ఆలస్యం అవుతుంది. 239 00:27:41,666 --> 00:27:43,666 అసలే వెళ్ళక పోవడం కంటే ఆలస్యం మేలు. 240 00:27:45,458 --> 00:27:47,541 మూడు నిమిషాలు ఆగి రా. 241 00:27:51,625 --> 00:27:54,833 -మనం కనీసం ఒక్కసారైనా కలిసి వెళ్ళలేమా? -కుదరదు. 242 00:27:59,250 --> 00:28:01,250 -కానీ మనం... -దాని గురించి ఆలోచించకు. 243 00:28:01,250 --> 00:28:02,666 మనం దంపతులం కాదు. 244 00:28:12,250 --> 00:28:14,250 కాస్త నిదానంగా వెళ్తావా? 245 00:28:20,791 --> 00:28:21,875 హాయ్! 246 00:28:28,000 --> 00:28:29,166 నేను హలో చెప్పాను. 247 00:28:36,875 --> 00:28:38,083 సరే మరి. 248 00:28:39,458 --> 00:28:41,458 నా జీవితకాల అవకాశం దొరికింది. 249 00:28:41,458 --> 00:28:43,083 నువ్వు ఏమనుకుంటున్నావు? 250 00:28:43,083 --> 00:28:45,000 డైకిరి సర్కస్ 251 00:28:48,500 --> 00:28:52,750 {\an8}డీజే నెబ్? ఎలాంటి మూర్ఖుడు తన పేరు డీజే నెబ్ అని పెట్టుకుంటాడు? 252 00:28:52,750 --> 00:28:54,458 హాస్యాస్పదం. నేను పెట్టుకుంటాను. 253 00:28:54,458 --> 00:28:58,250 నేను పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలి. నా డీజే రావడం లేదు, 254 00:28:58,250 --> 00:29:01,625 -అందుకని నేనే డీజే చేయాలి. -ఇది నీ జీవితకాల అవకాశం ఎలా? 255 00:29:01,625 --> 00:29:05,416 -ఎందుకంటే నేను బిగ్ జాన్ను కలిసాను. -అసలైన బిగ్ జానా? 256 00:29:05,416 --> 00:29:06,416 అసలైనవాడే. 257 00:29:06,416 --> 00:29:09,541 -అతనికి సిస్టం ఏర్పాటు చేసాను. -యూఎస్లో టూర్ చేస్తాడు. 258 00:29:09,541 --> 00:29:13,041 నన్ను తనతో తీసుకెళ్తాడు. అతనికి సౌండ్ ఇంజనీర్లు కావాలి. 259 00:29:13,041 --> 00:29:14,541 భలే. అతను పేరుగాంచినవాడు. 260 00:29:14,541 --> 00:29:15,583 అది అద్భుతంగా ఉంది. 261 00:29:16,083 --> 00:29:17,416 ఇది నా అవకాశం. 262 00:29:17,416 --> 00:29:19,875 ముందుగా నేను చేయగలనని అతనికి చూపించాలి. 263 00:29:19,875 --> 00:29:23,875 నేను సాంకేతికతతో మంచి పార్టీ ఏర్పాటు చేయగలను. చూద్దాం. 264 00:29:26,083 --> 00:29:27,041 హాయ్. 265 00:29:27,791 --> 00:29:28,875 హాయ్. 266 00:29:29,375 --> 00:29:32,333 -నీది నా తరగతే కదా? -అనుకుంటాను. 267 00:29:32,333 --> 00:29:34,583 నీకు గణితం బాగా వచ్చని విన్నాను. 268 00:29:34,833 --> 00:29:37,500 నేను తెలివైనదాన్ని, కానీ... 269 00:29:37,833 --> 00:29:39,791 నేను నీ హోమ్వర్క్ చూసి రాసుకోవచ్చా? 270 00:29:51,000 --> 00:29:52,000 ఏయ్! 271 00:29:53,500 --> 00:29:54,875 నా పేరు సారా. 272 00:29:54,875 --> 00:29:56,125 హలో, సారా. 273 00:29:57,166 --> 00:29:58,208 నా పేరు బెకీ. 274 00:30:00,750 --> 00:30:03,333 -దేవుడా. మార్క్ జిమర్మన్. -అతని సంగతి ఏంటి? 275 00:30:03,333 --> 00:30:04,958 అతనికి కాస్త దూరంగా ఉండు. 276 00:30:04,958 --> 00:30:07,208 -ఎందుకు? -అతను ముక్కోపి. 277 00:30:07,208 --> 00:30:09,083 వాళ్ళ కుటుంబమంతా పిచ్చిదే. 278 00:30:09,083 --> 00:30:13,208 వాళ్ళ అన్న ఒకసారి విట్టిగ్ను కొడితే, బడిలోంచి తీసేసి పిచ్చాసుపత్రికి పంపారు. 279 00:30:13,208 --> 00:30:15,791 మార్క్ కూడా అలాంటివాడే. నన్ను నమ్ము. 280 00:30:15,791 --> 00:30:18,208 నిన్ను నా స్నేహితులకు పరిచయం చేస్తాను. అక్కడ. 281 00:30:18,208 --> 00:30:20,250 తర్వాత చూద్దాం, కానీ ధన్యవాదాలు. 282 00:30:23,333 --> 00:30:26,125 అక్కడ ఎప్పుడూ గేదెల మంద ఆగుతుంది. 283 00:30:27,500 --> 00:30:30,291 ఈ పెద్ద జంతువులకు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలుసు. 284 00:30:30,291 --> 00:30:32,041 ముఖ్యంగా, దూకుడు గల ఎద్దులు. 285 00:30:33,916 --> 00:30:35,125 నిశ్శబ్దంగా ఉంటావా? 286 00:30:38,666 --> 00:30:42,166 గాయపడిన గేదెను వేటాడడం సులభం. 287 00:31:09,958 --> 00:31:10,958 మార్క్! 288 00:31:12,583 --> 00:31:14,333 -హాయ్. -బాగానే ఉన్నావా? 289 00:31:15,250 --> 00:31:16,250 అవును, ఎందుకు? 290 00:31:17,208 --> 00:31:19,625 అంటే, ఎందుకంటే నువ్వు... 291 00:31:21,041 --> 00:31:24,125 -నాకు కావాలి... -తాజాగాలినా? 292 00:31:25,833 --> 00:31:28,708 -అవును, అలాంటిదే. -నిజమే. 293 00:31:33,333 --> 00:31:34,416 నువ్వు బెకీవి, కదా? 294 00:31:41,500 --> 00:31:46,000 మన్నించు, ఇది అంత మంచి సంభాషణ కాదు. నేను సరిగ్గా పడుకోలేదు. 295 00:31:46,416 --> 00:31:48,541 మనం తర్వాత సరిగ్గా మాట్లాడుకుందాం. 296 00:31:49,708 --> 00:31:50,750 అవును, చూద్దాం. 297 00:31:51,791 --> 00:31:54,000 -మంచిది. -మంచిది. 298 00:31:56,416 --> 00:31:58,750 ఓ, అవును. అతిసారమా, వికారమా? 299 00:32:01,125 --> 00:32:04,083 వికారం, కచ్చితంగా వికారమే. 300 00:32:34,916 --> 00:32:36,791 -హాయ్. -లోపలకు రా. 301 00:32:41,041 --> 00:32:42,833 డా. యోర్గ్ పీటర్స్ సైకియాట్రిస్ట్ 302 00:32:42,833 --> 00:32:44,416 మళ్ళీ ప్రయత్నించు, మార్క్. 303 00:32:46,416 --> 00:32:47,833 ఊపిరి పీల్చుకో. 304 00:32:49,125 --> 00:32:50,625 దృష్టి పెట్టు. 305 00:32:53,000 --> 00:32:54,375 ఆ సమయాన్ని గుర్తుచేసుకో. 306 00:32:57,291 --> 00:32:58,625 అక్కడే ఉండు. 307 00:32:59,875 --> 00:33:00,958 మీ నాన్న... 308 00:33:04,041 --> 00:33:06,041 ఆ రాత్రి... 309 00:33:07,291 --> 00:33:08,791 ఆ శ్మశానం... 310 00:33:09,833 --> 00:33:10,916 ఆ స్టూడియో... 311 00:33:12,333 --> 00:33:13,791 అది నీకు ఎలా ఉంది? 312 00:33:14,750 --> 00:33:15,958 ఘోరంగా ఉందా? 313 00:33:19,916 --> 00:33:21,625 అది ఘోరంగా ఉంది, సరేనా? 314 00:33:22,291 --> 00:33:24,083 ఈరోజు నువ్వు హాజరు కాలేదు. 315 00:33:26,125 --> 00:33:28,333 నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. 316 00:33:28,333 --> 00:33:30,875 నీకు కచ్చితంగా ఇకపై సెషన్లు అక్కర్లేదా? 317 00:33:33,333 --> 00:33:34,958 ఇక మూడేళ్ళు చాలు. 318 00:33:35,791 --> 00:33:37,708 నాకు ఇంకా సైకోగా ఉండాలని లేదు. 319 00:33:37,916 --> 00:33:39,875 నీకు కోపం అదుపులో ఉందా? 320 00:33:48,000 --> 00:33:49,250 మనకింకా పది నిమిషాలుంది. 321 00:33:49,250 --> 00:33:52,541 ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇదే సరైన సమయం. 322 00:34:01,250 --> 00:34:04,041 నిన్న మా నాన్న పుస్తకం చదివాను. 323 00:34:04,041 --> 00:34:06,708 ఇది క్రానికలా? 324 00:34:07,625 --> 00:34:09,500 నేను అది చదువుతుండగా... 325 00:34:12,541 --> 00:34:14,333 అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళిపోయాను. 326 00:34:15,166 --> 00:34:16,541 నిజంగా వెళ్ళిపోయాను. 327 00:34:16,875 --> 00:34:19,083 ఇంతకుముందు కలల కంటే భిన్నంగా. 328 00:34:19,083 --> 00:34:20,375 భిన్నంగానా? 329 00:34:21,916 --> 00:34:22,833 చాలా వాస్తవికంగా. 330 00:34:22,833 --> 00:34:26,375 అంటే మీ నాన్న ఎప్పుడూ మాట్లాడే ప్రపంచమా? 331 00:34:26,375 --> 00:34:27,458 బ్లాక్ టవర్. 332 00:34:28,000 --> 00:34:30,541 మొట్టమొదటిసారిగా నిన్ననే అలా జరిగిందా? 333 00:34:30,541 --> 00:34:32,333 అలా భ్రాంతి కలగడం? 334 00:34:34,791 --> 00:34:38,416 మీ నాన్న పదేళ్ళ క్రితం నిన్నటి రోజు చనిపోయారు. కదా? 335 00:34:42,708 --> 00:34:44,083 నువ్వు అనుభవిస్తున్నది 336 00:34:45,208 --> 00:34:47,333 అతని మరణానికి సంబంధించినది. 337 00:34:48,083 --> 00:34:51,916 క్రానికల్. అతను నీకు ఈ ప్రపంచం గురించి చెప్పినది. 338 00:34:52,333 --> 00:34:53,958 నీ పుట్టినరోజు. 339 00:34:54,541 --> 00:34:57,750 మీరిద్దరూ మీ నాన్న వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. 340 00:34:57,750 --> 00:35:01,708 గాయపడ్డాక భ్రాంతి కలగడం సాధారణమే. 341 00:35:02,458 --> 00:35:04,083 కానీ అవి హానికరం కాదు. 342 00:35:04,708 --> 00:35:08,666 ఇది కోలుకోవడానికి సంకేతం. నీకు అదే జరుగుతోంది. 343 00:35:09,166 --> 00:35:12,041 అందుకని కొన్నిసార్లు చాలా వాస్తవికంగా అనిపిస్తుంది. 344 00:35:12,458 --> 00:35:13,416 సరేనా? 345 00:35:16,375 --> 00:35:17,541 సరే. 346 00:35:18,291 --> 00:35:19,750 పురోగతి సాధించావు. 347 00:35:20,833 --> 00:35:21,916 అభినందనలు. 348 00:35:24,125 --> 00:35:26,625 అయితే ఇది అధికారికంగా మన చివరి సెషన్. 349 00:35:27,166 --> 00:35:29,791 -శుభాకాంక్షలు, మార్క్. -మీకు కూడా. 350 00:35:30,333 --> 00:35:31,666 గాయం... 351 00:35:32,500 --> 00:35:34,041 పనికిమాలిన క్రానికల్. 352 00:35:34,041 --> 00:35:35,416 దీంతో నాకు పని లేదు. 353 00:35:50,625 --> 00:35:51,875 నువ్వు చదివావా? 354 00:35:52,625 --> 00:35:56,541 -ఇంకా? -పీడకలలు, స్వరాలు వినిపించాయి. సైకో చెత్త. 355 00:35:56,958 --> 00:35:58,833 నువ్వు నిజంగా టవర్ను చూస్తే... 356 00:35:58,833 --> 00:36:01,708 నీకు అర్థం కాలేదా? లేదా అర్థం చేసుకోవాలని అనుకోవా? 357 00:36:02,250 --> 00:36:04,625 నాన్న మన చెవులు చిల్లులు పడేలా ఇది వాగేవాడు. 358 00:36:04,625 --> 00:36:08,041 మళ్ళీ మళ్ళీ. గ్రిఫన్ లేడు, భ్రాంతులే ఉన్నాయి. 359 00:36:08,041 --> 00:36:10,708 -దాన్ని గాయం అంటారు. -చూస్తూ ఉండు. 360 00:36:10,708 --> 00:36:13,250 ఈ రాత్రి, నీకు రుజువు దొరుకుతుంది. 361 00:36:14,083 --> 00:36:16,416 రాత్రి ఎనిమిది గంటలకు మా ఇంట్లో. డిన్నర్. 362 00:36:36,750 --> 00:36:37,791 హాయ్. 363 00:36:42,916 --> 00:36:43,916 హాయ్. 364 00:36:45,625 --> 00:36:46,458 హాయ్! 365 00:36:47,833 --> 00:36:50,875 -ఇక్కడ ఏం చేస్తున్నావు? -రికార్డు కొంటున్నాను. 366 00:36:51,958 --> 00:36:53,250 దేనికోసం చూస్తున్నావు? 367 00:36:54,750 --> 00:36:57,500 నాకు నిర్వాణ వారి నెవర్మైండ్ కావాలి. 368 00:36:57,500 --> 00:36:59,416 అది అత్యుత్తమ రికార్డు. 369 00:36:59,833 --> 00:37:01,208 మా దగ్గర ఉంది... 370 00:37:01,791 --> 00:37:02,833 ఇక్కడ. 371 00:37:03,250 --> 00:37:05,291 సరే, కానీ మీ దగ్గర వైనల్ మీద ఉందా? 372 00:37:06,583 --> 00:37:08,041 ప్రస్తుతానికి లేదు. 373 00:37:08,958 --> 00:37:10,041 సిగ్గుచేటు. 374 00:37:11,791 --> 00:37:13,416 సీడీలు అంటే అదోలా... 375 00:37:14,041 --> 00:37:16,875 -నిరాసక్తిగానా? -అవును, మరీ చక్కగా ఉంటాయి. 376 00:37:17,333 --> 00:37:18,750 కవర్లు చాలా చిన్నగా ఉంటాయి. 377 00:37:18,750 --> 00:37:20,708 -ఇంకా ఆ పని అంతా ఉండదు. -పూర్తిగా. 378 00:37:20,708 --> 00:37:22,333 అది విప్పడం, దానిపై పెట్టడం! 379 00:37:22,333 --> 00:37:25,833 -ఆల్బమ్ మొత్తం ఒకేసారి వినడం. -కేవలం సింగిల్ పాటలే కాదు. 380 00:37:27,500 --> 00:37:31,000 నేను ప్రతి సాయంత్రం మా నాన్నతో కలిసి పాటలు వినేవాడిని. 381 00:37:32,125 --> 00:37:33,583 అది మా అమ్మతో చేసేదాన్ని. 382 00:37:37,833 --> 00:37:40,666 నువ్వు నాతో బయట తిరగాలని అనుకుంటున్నావా? 383 00:37:41,958 --> 00:37:42,875 తప్పకుండా. 384 00:37:44,666 --> 00:37:45,958 వచ్చేవారం? 385 00:37:47,916 --> 00:37:49,041 ఈరోజు అంటే ఏమంటావు? 386 00:37:50,000 --> 00:37:51,000 ఇప్పుడు? 387 00:37:54,625 --> 00:37:57,583 -నీకు ఆకలేస్తోందా? -ఎల్లప్పుడూ. 388 00:38:07,750 --> 00:38:10,791 -వారం క్రితం క్రెఫెల్డెన్కు మారావా? -అవును. 389 00:38:11,875 --> 00:38:14,458 నేను ఇప్పుడే సామాను తీసి సర్దేసాను. 390 00:38:15,375 --> 00:38:17,916 -ఎలా ఉంది? -క్రెఫెల్డెనా? 391 00:38:19,208 --> 00:38:20,375 బెర్లిన్తో పోల్చితేనా? 392 00:38:23,208 --> 00:38:26,666 అది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 393 00:38:27,500 --> 00:38:28,625 నా ఉద్దేశం... 394 00:38:29,250 --> 00:38:31,458 నేను క్రెఫెల్డెన్ను చులకన చేయను. 395 00:38:32,583 --> 00:38:36,166 నేను ఇక్కడికి రావాలనుకోలేదు. మా అమ్మ పంపించింది. 396 00:38:36,500 --> 00:38:38,333 మా నాన్నతో ఉండడానికి పంపించింది. 397 00:38:38,333 --> 00:38:39,291 ఛత్. 398 00:38:43,625 --> 00:38:45,083 నువ్వు ఇక్కడే పుట్టావు, కదా? 399 00:38:46,166 --> 00:38:48,083 మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? 400 00:38:51,458 --> 00:38:53,000 మా అమ్మ నర్స్. 401 00:38:54,583 --> 00:38:55,833 మీ నాన్న? 402 00:38:58,375 --> 00:38:59,541 పెద్దగా ఏం చేయడు. 403 00:39:08,791 --> 00:39:10,583 క్రెఫెల్డెన్లో ఇంకేం చేయగలవు? 404 00:39:11,666 --> 00:39:14,625 అంటే, పైకప్పులపై బార్బెక్యూ, 405 00:39:14,958 --> 00:39:16,708 రికార్డులు కొనడం... 406 00:39:18,916 --> 00:39:21,166 నిజం చెప్పాలంటే, నాకే తెలియదు. 407 00:39:23,166 --> 00:39:26,125 మార్క్, వుల్ఫీ రికార్డ్ వేర్హౌస్కు వెళ్తున్నాను. సరేనా? 408 00:39:26,125 --> 00:39:29,000 -సరే, తప్పకుండా. -మళ్ళీ కలుస్తాను. 409 00:39:31,041 --> 00:39:32,708 నేను ఎక్కువగా బయట తిరగను. 410 00:39:33,166 --> 00:39:34,875 నా దగ్గర మంచి దుకాణం ఉంది. 411 00:39:35,458 --> 00:39:36,875 నా మిక్స్టేపులు. 412 00:39:37,916 --> 00:39:39,375 మా అన్న. 413 00:39:41,250 --> 00:39:42,625 ఇంకా బడి. 414 00:39:47,208 --> 00:39:48,541 నా జీవితం ఘోరంగా ఉంది. 415 00:39:51,416 --> 00:39:52,875 రికార్డుల దుకాణం నాకిష్టం. 416 00:40:26,958 --> 00:40:28,625 మనం ఇది మళ్ళీ చేద్దామా? 417 00:40:30,125 --> 00:40:33,375 -రేపా? -ఎల్లుండి. 418 00:40:34,791 --> 00:40:36,166 ఆవలి ఎల్లుండి? 419 00:40:44,750 --> 00:40:46,416 ఛత్! 420 00:40:47,125 --> 00:40:49,750 నేను ఇంటికి వెళ్ళాలి! ఛీ. ఛీ. 421 00:40:49,750 --> 00:40:50,791 నన్ను మన్నించు. 422 00:40:52,000 --> 00:40:53,750 నిన్ను బడి దగ్గర కలుస్తాను. 423 00:40:57,583 --> 00:40:59,041 నువ్వు ఒంటరిగా దిగగలవా? 424 00:41:01,916 --> 00:41:03,666 నువ్వు దిగగలవు, మన్నించు. 425 00:41:10,125 --> 00:41:11,666 క్రెఫెల్డెన్కు స్వాగతం. 426 00:41:16,750 --> 00:41:19,541 దుస్సమయ నివారిణి 427 00:41:38,500 --> 00:41:39,750 నేను ఇంటికి వచ్చాను. 428 00:41:45,125 --> 00:41:46,916 అది నా ప్రధాన బహుమతి. 429 00:41:52,750 --> 00:41:54,708 వారానికి 40 పోటీలా? 430 00:41:54,708 --> 00:41:58,708 ఇది మూడుసార్లు గెలుచుకున్నానని అనుకుంటాను. 431 00:42:00,708 --> 00:42:01,708 అవును. 432 00:42:02,666 --> 00:42:05,625 ఇది అందరికి నచ్చదని అంటాను. 433 00:42:06,458 --> 00:42:09,291 ఇది చాలా వికారంగా ఉంది. కానీ విషయం అది కాదు. 434 00:42:10,250 --> 00:42:11,666 ఇది అదృష్టం ఉండడం గురించి. 435 00:42:13,666 --> 00:42:14,583 హాయ్. 436 00:42:15,875 --> 00:42:18,416 హాయ్. మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 437 00:42:26,416 --> 00:42:27,416 చాలా వింతగా ఉంది. 438 00:42:28,916 --> 00:42:30,083 పూర్తిగా. 439 00:42:32,208 --> 00:42:33,708 నేను ఇంతకుముందు ఉన్నట్లుగా. 440 00:42:39,916 --> 00:42:40,916 నీకు ఆకలేస్తుందా? 441 00:42:42,166 --> 00:42:43,083 అవును. 442 00:42:43,083 --> 00:42:44,291 మంచిది. 443 00:42:45,500 --> 00:42:47,791 మెమో తనకు తెల్లని తోలు బూట్లు కొన్నాడు. 444 00:42:47,791 --> 00:42:51,208 -ఇంకా ఒక చవకైన తోలు జాకెట్. -కాదు! 445 00:42:51,208 --> 00:42:53,708 తప్పకుండా! మోటర్హెడ్ లెమ్మీలా తయారవుతున్నాడు. 446 00:42:54,041 --> 00:42:56,083 అయ్యో. అతనికి ఏమీ తోచడం లేదు. 447 00:42:56,083 --> 00:42:57,875 ఇప్పుడు గిటార్ వాయిస్తాడట. 448 00:42:57,875 --> 00:43:00,500 మార్క్ సంగీతంలో ఏదైనా చేస్తాడని నాకు తెలుసు. 449 00:43:00,500 --> 00:43:02,958 ఎప్పుడూ మీ నాన్నతో కలిసి సంగీతం వినే వాడివి. 450 00:43:03,916 --> 00:43:05,958 కానీ నువ్వు, నేను ఊహించలేదు. 451 00:43:07,416 --> 00:43:09,333 థామస్ ఎప్పుడు సంగీతం వినేవాడు. 452 00:43:09,958 --> 00:43:11,916 అతనికి ఇష్టమైనవి భాషలు, 453 00:43:12,208 --> 00:43:13,625 చరిత్ర, 454 00:43:14,000 --> 00:43:15,500 యుద్ధాలు మొదలైనవి. 455 00:43:17,166 --> 00:43:18,541 ఏం చెప్పాలి అనుకుంటున్నావు? 456 00:43:19,541 --> 00:43:20,375 ఏం లేదు. 457 00:43:20,666 --> 00:43:23,708 అంటే నీకు రికార్డుల కంటే వేరే అభిరుచులు ఉండేవి. 458 00:43:27,166 --> 00:43:28,791 నాకు ఆ దుకాణం అంటే గర్వకారణం. 459 00:43:29,916 --> 00:43:31,333 నువ్వు అలాగే ఉండాలి. 460 00:43:32,500 --> 00:43:34,916 కానీ నువ్వు చేయాలనుకునేవి వేరేలా ఉండేవి. 461 00:43:34,916 --> 00:43:38,083 నువ్వు విద్యావేత్తవో, మరొకటో అవుతావని అనుకున్నాం... 462 00:43:38,666 --> 00:43:40,875 అది నేను ఎంచుకున్నది కాదు. 463 00:43:40,875 --> 00:43:42,416 పిచ్చాసుపత్రికి వెళ్ళడం. 464 00:43:43,791 --> 00:43:45,000 నువ్వే ఎంచుకున్నావు. 465 00:43:46,375 --> 00:43:47,541 డిజర్ట్ ఏముంది? 466 00:43:47,541 --> 00:43:51,458 నా కొడుక్కు పిచ్చిపడితే నేను ఊరకే కూర్చుంటానని అనుకున్నావా? 467 00:43:53,208 --> 00:43:55,875 -అందుకే మీ నాన్నలాగా అవుతావా? -ఏయ్! 468 00:44:01,541 --> 00:44:03,333 నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 469 00:44:09,625 --> 00:44:11,875 నేను ఎప్పుడూ నిన్ను కాపాడాలని ప్రయత్నిస్తాను. 470 00:44:13,291 --> 00:44:14,500 ఒకనాడు నీకు అర్థమౌతుంది. 471 00:44:40,916 --> 00:44:42,083 ఆమె ఉద్దేశం అది కాదు. 472 00:44:46,708 --> 00:44:48,083 రుజువు కావాలన్నావు కదా? 473 00:45:04,041 --> 00:45:06,750 {\an8}ఏంజెల్స్ రెస్ట్ శ్మశానవాటిక 474 00:45:16,125 --> 00:45:17,375 నాన్న పాత స్టూడియో. 475 00:45:23,958 --> 00:45:25,500 నాకు ఇక్కడికి రావాలని లేదు. 476 00:45:26,333 --> 00:45:28,500 నువ్వు ఇక్కడికి రాక చాలా ఏళ్ళయింది. 477 00:45:29,250 --> 00:45:32,208 -నాకు ఇక్కడికి రావాలని లేదని చెప్పాను. -నాకు వినబడింది. 478 00:45:33,833 --> 00:45:35,166 కానీ రుజువు ఇక్కడుంది. 479 00:46:01,458 --> 00:46:02,291 ఏయ్! 480 00:46:03,208 --> 00:46:04,916 నీకు పూర్తిగా పిచ్చి పట్టిందా? 481 00:46:05,333 --> 00:46:06,708 కిందికి రా. 482 00:46:08,083 --> 00:46:09,666 ఈ ఆలోచన బాగాలేదు. 483 00:46:15,375 --> 00:46:16,416 నన్ను నమ్ము. 484 00:46:17,416 --> 00:46:18,625 రుజువు కావాలన్నావు. 485 00:46:20,625 --> 00:46:21,791 ఛత్. 486 00:46:25,500 --> 00:46:27,375 నాకు దాని కోసం చావాలని లేదు. 487 00:46:33,250 --> 00:46:35,875 -చివరకు! పైకి రా. -నువ్వే కిందికి రా. 488 00:46:36,958 --> 00:46:38,291 నువ్వు నన్ను పట్టుకోవాలి. 489 00:46:46,541 --> 00:46:47,833 రా! 490 00:46:54,500 --> 00:46:55,583 చాలా బాగుంది. 491 00:47:08,833 --> 00:47:10,416 రా. నువ్వు చేయగలవు. 492 00:47:15,125 --> 00:47:16,958 మన పేరు జిమర్మన్. 493 00:47:16,958 --> 00:47:20,500 తరతరాలుగా హస్తకళాకారులు, పైకప్పులు వేసేవారు, తాపీపనివాళ్ళం. 494 00:47:21,583 --> 00:47:23,041 ఎత్తులు మనకు కొట్టినపిండి. 495 00:47:25,875 --> 00:47:29,000 నువ్వు క్రానికల్పై సంతకం చేసి, వారసత్వాన్ని స్వీకరించావు. 496 00:47:29,500 --> 00:47:30,458 పైకి లే. 497 00:47:41,000 --> 00:47:42,166 నేను అనుకుంటున్నాను. 498 00:47:42,958 --> 00:47:45,000 ఇప్పుడు నీకు ఎత్తులు అంటే భయం లేదు. 499 00:47:46,583 --> 00:47:47,666 పిచ్చిగా ఉంది. 500 00:47:59,250 --> 00:48:00,166 రా. 501 00:48:16,916 --> 00:48:20,375 మనం నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చిన రాత్రి గుర్తుందా? 502 00:48:21,333 --> 00:48:23,833 అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు చూపిస్తాను. 503 00:48:54,666 --> 00:48:55,750 ఇదేంటి? 504 00:48:56,958 --> 00:48:58,166 ఇది దాక్కునే చోటు. 505 00:49:00,125 --> 00:49:01,875 చాలా ప్రత్యేకమైన ప్రదేశం. 506 00:49:02,750 --> 00:49:04,583 ఇది మన పూర్వీకులు తయారు చేసారు. 507 00:49:05,416 --> 00:49:07,833 ఇంద్రజాలంతో రక్షించబడుతోంది. 508 00:49:11,666 --> 00:49:13,458 ఒకటి కనిపెట్టడానికి నీ సాయం కావాలి. 509 00:49:52,458 --> 00:49:53,458 నాన్న సరంజామా. 510 00:50:18,416 --> 00:50:19,500 ఇది తెరువు! 511 00:50:32,875 --> 00:50:35,000 అయితే నాన్న దీన్ని తిరిగి పొందాలనుకున్నాడు. 512 00:50:35,708 --> 00:50:37,000 లోలకం. 513 00:50:38,250 --> 00:50:39,458 ఇది ఖాళీగా ఉంది. 514 00:50:40,208 --> 00:50:43,416 అవును, అది ఇంకా నాకు దొరకలేదు. 515 00:50:44,000 --> 00:50:45,666 నాన్న ఇక్కడే దాచిపెట్టి ఉండాలి. 516 00:50:49,833 --> 00:50:51,208 అదేంటి? 517 00:51:22,166 --> 00:51:23,291 ఇదిగో. 518 00:51:24,416 --> 00:51:25,583 చివరికి. 519 00:51:42,333 --> 00:51:44,250 ఏంజెల్స్ రెస్ట్ శ్మశానవాటిక 520 00:51:58,291 --> 00:51:59,583 ఛత్. 521 00:52:02,750 --> 00:52:05,083 నాన్న దీన్ని నీకు క్యాలిబ్రేట్ చేసాడు... 522 00:52:05,083 --> 00:52:06,666 ఇది నిజంగా జరుగుతోందా? 523 00:52:10,041 --> 00:52:11,625 ఇది నీ రుజువు. 524 00:52:12,083 --> 00:52:13,500 ఇది నీకే స్పందిస్తుంది, 525 00:52:14,000 --> 00:52:15,541 నీ రక్తానికి మాత్రమే. 526 00:52:17,416 --> 00:52:20,125 -నాకు ఇవ్వు. -నా రక్తమా? నా రక్తమే ఎందుకు? 527 00:52:27,541 --> 00:52:32,333 గ్రిఫన్ బ్రతకడానికి మన రక్తం కావాలి. నాది, నీది. 528 00:52:33,458 --> 00:52:35,166 అతను అజేయుడు. 529 00:52:35,166 --> 00:52:38,000 బ్లాక్ టవర్ను పాలిస్తాడు. మానవులను బానిసలుగా చేస్తాడు. 530 00:52:38,000 --> 00:52:40,541 అతన్ని జయించే ఏకైక ఆయుధం లోలకమే. 531 00:52:41,375 --> 00:52:44,166 ఒక సాధారణ వడ్రంగి పనిముట్టు. 532 00:52:44,166 --> 00:52:47,583 అతన్ని మన కుటుంబీకులు తప్ప మరెవరూ చంపలేరు. 533 00:52:48,625 --> 00:52:51,916 ఈ యుద్ధంలో నువ్వు నాతో పాటు ఉంటావా? 534 00:52:52,916 --> 00:52:55,666 కలిసికట్టుగా. గ్రిఫన్కు వ్యతిరేకంగా. 535 00:52:57,041 --> 00:52:59,041 -అంటే ఇప్పుడేనా? -అవును. 536 00:52:59,041 --> 00:53:00,250 నాతో రా. 537 00:53:01,750 --> 00:53:03,666 మనిద్దరం కలిస్తే మంచి అవకాశం ఉంది. 538 00:53:04,333 --> 00:53:05,708 అతన్ని వెతకడం నాకు తెలుసు. 539 00:53:07,416 --> 00:53:10,500 నేను బడికి వెళ్ళడమే కష్టంగా ఉంది. 540 00:53:12,000 --> 00:53:15,625 మనం అతన్ని వేటాడకపోతే, అతనే మనల్ని వేటాడుతాడు. 541 00:53:16,416 --> 00:53:18,250 ఒకవేళ నేను ఒంటరిగా అతన్ని చంపలేకపోతే, 542 00:53:19,208 --> 00:53:20,750 అప్పుడు అతను నీ వెంట పడతాడు. 543 00:53:21,666 --> 00:53:23,041 ఆ తర్వాత నీ పిల్లల వెంట... 544 00:53:28,208 --> 00:53:30,541 రా! మనమిద్దరం! 545 00:53:33,208 --> 00:53:34,833 నేను చేయగలనని అనుకోను. 546 00:53:41,541 --> 00:53:42,750 నీ ఇష్టం. 547 00:53:46,333 --> 00:53:48,291 -అదేంటి? -మనం వెళ్ళిపోవాలి. 548 00:53:57,625 --> 00:53:58,583 థామస్? 549 00:54:00,166 --> 00:54:01,791 -థామస్? -ఏంటి? 550 00:54:02,583 --> 00:54:04,250 అది ఇంతకు ముందు ఇక్కడ ఉందా? 551 00:54:04,250 --> 00:54:06,041 లేదు. 552 00:54:14,416 --> 00:54:15,833 నువ్వు ఏం చేస్తున్నావు? 553 00:54:17,625 --> 00:54:18,875 నన్ను నమ్ము! 554 00:54:21,875 --> 00:54:22,916 థామస్! 555 00:54:24,958 --> 00:54:27,791 థామస్, మనం ఇప్పుడు కిందికి వెళ్ళాలి. 556 00:54:41,166 --> 00:54:43,125 అతను ఎక్కడికి వెళ్ళాడు? 557 00:54:43,125 --> 00:54:44,291 తెలియదు! 558 00:54:47,166 --> 00:54:48,208 రా! 559 00:54:58,833 --> 00:55:00,000 పద! 560 00:55:12,541 --> 00:55:13,666 మార్క్! 561 00:55:18,333 --> 00:55:19,250 బయటకు వెళ్దాం! 562 00:55:31,375 --> 00:55:32,666 దాక్కో! 563 00:55:33,750 --> 00:55:35,708 -వాళ్ళకు ఏం కావాలి? -మనం కావాలి. 564 00:55:36,500 --> 00:55:37,583 వాళ్ళకు మనం కావాలి. 565 00:55:44,208 --> 00:55:47,958 ఇది నిజం కాదు. 566 00:55:48,791 --> 00:55:49,916 ఇది నిజం కాదు. 567 00:55:51,458 --> 00:55:52,458 ఇది నిజం కాదు. 568 00:58:11,375 --> 00:58:13,375 సబ్‌టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 569 00:58:13,375 --> 00:58:15,458 {\an8}క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల