1 00:00:20,625 --> 00:00:26,125 {\an8}క్రెఫెల్డెన్, 1984 2 00:00:37,916 --> 00:00:40,125 గ్రిఫన్ గురించి నాన్న చెప్పింది గుర్తుందా? 3 00:00:40,666 --> 00:00:42,416 అతన్ని ఓడించగలిగేది మనమే, కదా? 4 00:00:46,708 --> 00:00:48,000 మార్క్. 5 00:00:50,458 --> 00:00:53,625 నువ్వు దాన్ని నమ్మాలి, సరేనా? లేదంటే అది పనిచేయదు. 6 00:01:00,250 --> 00:01:01,291 అమ్మను చూసుకో! 7 00:01:24,833 --> 00:01:25,833 నాకు చూపించు! 8 00:01:28,083 --> 00:01:30,958 నిజంగా ఆ ద్వారం అనేది ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. 9 00:02:01,083 --> 00:02:04,000 నాతోటి ఉద్యోగికి ఒకటి ఇవ్వడానికి నేను ఇక్కడ ఆగాలి. 10 00:02:05,833 --> 00:02:07,208 దయచేసి అది ఇవ్వు. 11 00:02:08,791 --> 00:02:11,291 నేను ఇది లోపల ఇచ్చి వచ్చాక వెళ్దాము. 12 00:02:15,583 --> 00:02:17,500 హలో, డాక్టర్ చెన్నార్డ్! 13 00:02:24,250 --> 00:02:27,125 మార్క్, తలుపుకు తాళం వెయ్. తాళం వెయ్! త్వరగా! 14 00:02:27,666 --> 00:02:29,375 -శాంతించు! -వద్దు! 15 00:02:29,750 --> 00:02:32,333 -నిశ్శబ్దంగా రా. -హేయ్, మిత్రమా! 16 00:02:32,333 --> 00:02:36,916 -నన్ను వదలండి. అమ్మా! -అతన్ని పట్టుకోండి! 17 00:02:37,458 --> 00:02:38,875 కింద పడి ఉండు. 18 00:02:39,791 --> 00:02:41,375 అమ్మా! 19 00:02:44,125 --> 00:02:47,416 మార్క్! 20 00:03:08,458 --> 00:03:11,750 ఒరాకిల్ రికార్డులు 21 00:03:24,625 --> 00:03:29,041 బ్లాక్ టవర్ అంతటా నేలపై పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. 22 00:03:29,791 --> 00:03:31,250 గ్రిఫన్ బసాల్ట్ గనులు. 23 00:03:31,541 --> 00:03:32,708 ఇక్కడ ఏం చేస్తున్నాడు? 24 00:03:32,708 --> 00:03:36,333 అతను ఈ ప్రదేశం అంతటా మానవులను వేటాడి అక్కడకు తీసుకొస్తాడు. 25 00:03:36,333 --> 00:03:38,708 వాళ్ళ చేత బలవంతంగా రాళ్ళను తవ్విస్తారు. 26 00:03:38,708 --> 00:03:41,083 -వారిలో థామస్ ఒకడు. -కచ్చితంగా. 27 00:03:41,083 --> 00:03:42,875 ఇందులోని ఏదో ఒక గనిలో ఉంటాడు. 28 00:03:45,208 --> 00:03:48,458 -మనం అతన్ని ఎలా కనిపెట్టాలి? -నా దగ్గర ఒక ఉపాయం ఉంది. 29 00:03:49,833 --> 00:03:51,916 నేను ఇక్కడ ఒక క్యాబిన్ కట్టాను. 30 00:03:52,291 --> 00:03:53,291 క్యాబిన్ కట్టావా? 31 00:03:54,583 --> 00:03:55,666 ఇంకా ఈ గుడిసె 32 00:03:55,666 --> 00:03:59,000 ఈ ప్రాంతంలోని ఏకైక నీటి వనరు దగ్గర ఉంది. 33 00:03:59,708 --> 00:04:02,625 అప్పుడప్పుడు కొమ్ములు గలవారు మానవుల్ని వేటాడాక, 34 00:04:02,625 --> 00:04:06,416 వాళ్ళను గనులకు తీసుకెళ్ళే ముందు నీళ్ళ కోసం ఇక్కడికి వస్తారు. 35 00:04:06,833 --> 00:04:10,125 -మనం వాళ్ళ కోసం వేచి ఉందాం. -వాళ్ళ వెంటే గనికి వెళ్దాం. 36 00:04:10,125 --> 00:04:13,791 -థామస్ను బయటకు తీసుకొద్దాం. -మనమిద్దరం! 37 00:04:17,625 --> 00:04:19,000 ప్రాణం కన్నా మానం మిన్న 38 00:04:19,125 --> 00:04:21,500 మనం కొన్ని దెయ్యాలను హతమారుద్దాం. 39 00:04:32,791 --> 00:04:34,250 తండ్రీ. 40 00:04:35,333 --> 00:04:38,791 మీరు చెప్పినట్లుగానే, ప్రపంచాలు తిరిగే యాత్రికుడు 41 00:04:38,791 --> 00:04:41,708 బానిసల కారవాన్ నుండి 42 00:04:42,583 --> 00:04:45,750 తన అన్నను విడిపించే ప్రయత్నం చేసాడు, కానీ తప్పించుకున్నాడు. 43 00:04:48,541 --> 00:04:54,083 ఇన్ని సంవత్సరాలలో ఇదే నా మొదటి పరాజయం. 44 00:05:15,375 --> 00:05:18,541 ఎల్లప్పుడూ విధేయంగా, నిజాయితీగా ఉన్నావు, 45 00:05:19,166 --> 00:05:20,125 ఫెండియా. 46 00:05:54,583 --> 00:05:56,208 నీ పేరు చెప్పు. 47 00:05:58,291 --> 00:06:00,708 డేమియా, నా తండ్రీ! 48 00:06:00,708 --> 00:06:04,166 నీ పూర్వాధికారి కంటే నువ్వు చక్కగా సేవ చేయాలి. 49 00:06:22,625 --> 00:06:25,458 వోల్ఫ్గాంగ్ మరియు హైకె హోల్బైన్ రచించిన డెర్ గ్రైఫ్ నవల ఆధారంగా 50 00:06:27,958 --> 00:06:31,916 ద గ్రిఫన్ 51 00:06:33,291 --> 00:06:35,500 హాయ్, మార్క్ను. ఒక మంచి వార్త ఉంది. 52 00:06:35,500 --> 00:06:39,791 నాకు మెమో దొరికాడు, అందుకని ఆ ప్యాకేజీని మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళకు. 53 00:06:39,791 --> 00:06:41,916 దాన్ని బడికి తీసుకురా. 54 00:06:42,625 --> 00:06:47,458 నువ్వు చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. నిన్ను చూడాలని ఆత్రుతగా ఉంది. ఉంటాను. 55 00:07:24,750 --> 00:07:26,791 బాధపడుతున్నావని పోలీసులకు చెప్పాను. 56 00:07:26,791 --> 00:07:29,416 మళ్ళీ ఎప్పుడూ చొరబడవని చెప్పాను. 57 00:07:29,416 --> 00:07:33,041 -ముఖ్యంగా చర్చిలోకి. -ధన్యవాదాలు. 58 00:07:35,375 --> 00:07:37,458 మార్క్కు ఏం చేస్తావో నాకు తెలియదు. 59 00:07:38,625 --> 00:07:41,166 అతను చెప్పింది చాలా నమ్మశక్యంగా అనిపించింది. 60 00:07:41,166 --> 00:07:42,583 ఎందుకంటే అతనది నమ్ముతాడు. 61 00:07:44,291 --> 00:07:47,416 మార్క్ ఏది వాస్తవమో, ఏది కాదో తెలుసుకోవాలని చూస్తున్నాడు. 62 00:07:47,416 --> 00:07:50,375 తన జీవితాంతం అదే చేస్తున్నాడు. 63 00:07:50,375 --> 00:07:55,125 కానీ నువ్వు అతనికి వంత పాడడం వల్ల తాను అనుకున్నది నిజం అనుకుంటాడు. 64 00:07:55,125 --> 00:07:56,500 నన్ను మన్నించు. 65 00:07:57,916 --> 00:07:58,916 బెకీ. 66 00:08:01,875 --> 00:08:05,916 అతనితో ఉండాలా వద్దా అనేది చివరకు నీ నిర్ణయమే. 67 00:08:05,916 --> 00:08:07,875 కానీ నీకు మార్క్పై శ్రద్ధ ఉంటే, 68 00:08:08,375 --> 00:08:12,125 బాధ్యతాయుతంగా సరైన పని చెయ్, సరేనా? 69 00:08:15,958 --> 00:08:17,750 నీకోసం కారులో ఎదురు చూస్తాను. 70 00:08:19,875 --> 00:08:21,958 ఈరోజు నిన్ను బడికి తీసుకెళ్తాను. 71 00:08:32,541 --> 00:08:34,166 నాన్నా? 72 00:08:37,791 --> 00:08:38,625 ఏంటి? 73 00:08:49,750 --> 00:08:52,208 ఇందులో ఉన్నదంతా మార్క్ నమ్ముతాడు. 74 00:09:00,791 --> 00:09:01,666 ధన్యవాదాలు. 75 00:09:22,125 --> 00:09:24,375 -ఏమైంది? -నిజంగా ఇది మంచి ఆలోచనా? 76 00:09:25,166 --> 00:09:26,458 అది మంచి ఉపాయమా? 77 00:09:27,833 --> 00:09:30,375 మనది ఒంటరిగా వెయ్యి కొమ్ముల రాక్షసులతో పోరాటం. 78 00:09:30,375 --> 00:09:33,041 -పోలీసులకు, పెద్ద వాళ్ళకు చెప్పలేమా? -సరే... 79 00:09:37,250 --> 00:09:41,041 విను. ముందుగా మనల్ని ఎవరూ నమ్మరు. ఇక రెండవది, 80 00:09:41,041 --> 00:09:43,875 నీకు నమ్మించడం అసలే రాదు. 81 00:09:43,875 --> 00:09:45,958 నువ్వు మనల్ని రాక్షసుల నుండి కాపాడావు. 82 00:09:45,958 --> 00:09:48,833 -నీకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి. -కానీ నాకు తెలీదు... 83 00:09:50,250 --> 00:09:51,375 అవి ఎలా పని చేస్తాయో. 84 00:09:51,375 --> 00:09:53,958 నువ్వు నిన్న చేసావు, అది మళ్ళీ చేయవచ్చు. 85 00:09:54,500 --> 00:09:57,625 పెద్ద వాళ్ళు ఎవరు నువ్వు చేసేవి చేయలేరు. లేదా ఆ శక్తి లేదు. 86 00:09:57,625 --> 00:10:00,666 అందుకే మనం థామస్ను కాపాడబోతున్నాం. మనం ఇద్దరం. 87 00:10:00,666 --> 00:10:03,125 పోలీసులు కాదు, సరేనా? 88 00:10:07,958 --> 00:10:09,291 పద! 89 00:10:41,750 --> 00:10:46,041 ఏంటి దొంగరాణి? ఇంట్లో ఎలా జరిగింది? 90 00:10:47,333 --> 00:10:48,583 అద్భుతంగా. 91 00:10:49,458 --> 00:10:50,375 మరి నీకు? 92 00:10:50,958 --> 00:10:54,166 నా తల్లిదండ్రులు పనిమీద ఊరెళ్ళారు. వారికి ఇంకా తెలియదు. 93 00:10:55,291 --> 00:10:56,541 -ఒకవేళ తెలిసినా-- -బెకీ! 94 00:11:06,833 --> 00:11:08,083 అతన్ని నీ బుర్ర తిననీయకు. 95 00:11:18,125 --> 00:11:19,291 -హాయ్! -హాయ్! 96 00:11:22,958 --> 00:11:24,500 -బాగానే ఉన్నావా? -అవును. 97 00:11:24,500 --> 00:11:25,833 -నిజంగానా? -అవును. 98 00:11:27,458 --> 00:11:29,000 ఎందుకంటే నేను వెళ్ళాలి. 99 00:11:29,666 --> 00:11:31,000 నీ దగ్గర క్రానికల్ ఉందా? 100 00:11:32,375 --> 00:11:34,375 మా నాన్న దగ్గర నుండి తీసుకో. 101 00:11:38,500 --> 00:11:40,208 మీ నాన్నా? మీ నాన్న దగ్గర ఎందుకు? 102 00:11:40,208 --> 00:11:42,208 మనకు విరామం కావాలి. 103 00:11:44,125 --> 00:11:45,583 దేని నుండి విరామం? 104 00:11:45,583 --> 00:11:46,791 దేని నుండి అంటే... 105 00:11:48,083 --> 00:11:50,833 మనకు, ఒకరి నుండి మరొకరికి. 106 00:11:52,875 --> 00:11:53,708 అలాగా? 107 00:11:54,708 --> 00:11:57,250 -నేను ఏదైనా తప్పు చేసానా? -లేదు. 108 00:11:57,541 --> 00:11:58,958 నేనంటే నీకిష్టం అనుకున్నాను. 109 00:12:00,333 --> 00:12:02,208 -ఇష్టపడ్డాను. -అయితే సమస్య ఏంటి? 110 00:12:03,833 --> 00:12:04,875 నాకు... 111 00:12:06,666 --> 00:12:10,041 -కాస్త దూరం ఉండాలనుకుంటున్నాను. -దూరం అంటే ఏంటి? 112 00:12:10,041 --> 00:12:12,750 -రెండు మీటర్లా? రెండు రోజులా? వారాలా? -అంటే ఎడబాటు. 113 00:12:16,125 --> 00:12:18,250 -కనీసం నేను ఏం చేసానో చెప్పవా? -కాదు! 114 00:12:18,250 --> 00:12:20,333 -మనం ఒకరంటే మరొకరికి ఇష్టం-- -కాదు! 115 00:12:20,333 --> 00:12:22,083 ఎందుకంటే నువ్వు మానసిక రోగివి. 116 00:12:22,583 --> 00:12:24,875 నువ్వు ఇంకా బ్లాక్ టవర్ను నమ్ముతావు! 117 00:12:25,541 --> 00:12:27,833 నేను నీతో ఉంటే, అది ఇంకా ఘోరంగా మారుతుంది. 118 00:12:33,375 --> 00:12:34,583 నన్ను మన్నించు. 119 00:13:09,208 --> 00:13:10,375 అంతా బాగానే ఉందా? 120 00:13:12,666 --> 00:13:13,958 క్రానికల్ ఎక్కడ ఉంది? 121 00:13:16,416 --> 00:13:17,708 క్రానికల్ లేదు. 122 00:13:19,250 --> 00:13:21,541 ఏదైతేనేం. మనం అది లేకున్నా చేయవచ్చు. కదా? 123 00:13:22,791 --> 00:13:24,333 అవును. మనం చేయగలం. 124 00:13:25,000 --> 00:13:27,500 మార్టెన్స్ చర్చి దగ్గర 30 నిమిషాల్లో కలుస్తాను. 125 00:13:27,875 --> 00:13:30,041 టవర్ కోసం నా సరంజమా తెచ్చుకుంటాను. 126 00:13:43,000 --> 00:13:45,666 పునరుజ్జీవనం కోసం ప్రయోగము 127 00:13:52,541 --> 00:13:53,375 పెంపుడు జంతువుల దుకాణం కోటెయాస్ 128 00:13:53,375 --> 00:13:54,958 శుభోదయం, డాక్టర్ పీటర్స్. 129 00:13:55,750 --> 00:13:57,125 కోటెయాస్ గారు... 130 00:13:58,750 --> 00:14:00,666 మీరు అపాయింట్మెంట్ తీసుకోలేదు. 131 00:14:02,250 --> 00:14:03,583 ఇది అత్యావశ్యకం. 132 00:14:04,416 --> 00:14:07,791 -ఇది ఒక దోమ గురించి. -దోమనా? 133 00:14:09,541 --> 00:14:11,208 నా దగ్గర ఎక్కువ సమయం లేదు. 134 00:14:32,750 --> 00:14:33,583 హాయ్! 135 00:14:34,333 --> 00:14:35,958 నీకోసం వెతుకుతున్నాను. 136 00:14:37,333 --> 00:14:38,333 ఎలా ఉన్నావు? 137 00:15:15,958 --> 00:15:17,791 -హాయ్. -శుభోదయం. 138 00:15:17,791 --> 00:15:20,333 సౌండ్ సిస్టం తీసుకెళ్ళడానికి వచ్చాను. 139 00:15:20,791 --> 00:15:21,875 బెన్ ష్రూడరా? 140 00:15:21,875 --> 00:15:25,250 అవును, నేను నిన్ననే రావాల్సింది. ఒక సందేశం పంపాను. 141 00:15:25,250 --> 00:15:26,583 అది ఎప్పుడో తీసుకెళ్ళారు. 142 00:15:27,750 --> 00:15:30,833 -ఏంటి? -అవును, నిన్ననే అద్దెకు ఇచ్చాను. 143 00:15:30,833 --> 00:15:33,208 రాత్రి 7 లోపు తీసుకోవాలని నీకు చెప్పాను. 144 00:15:33,208 --> 00:15:37,166 -అయితే నేను మరొకటి తీసుకుంటాను. -మిత్రమా, ఇది వారాంతం. 145 00:15:37,166 --> 00:15:40,500 రెండు వారాంతాల తర్వాత తీసుకోవడానికి నీ పేరు మీద ఉంచుతాను. 146 00:15:40,500 --> 00:15:43,416 నాకు సౌండ్ సిస్టం ఈరోజే కావాలి. నా పార్టీ ఈరోజే. 147 00:15:43,416 --> 00:15:48,666 అలా అయితే చూస్తాను. సిగ్గుచేటు, అయినా సౌండ్ సిస్టం లేదు. 148 00:15:48,666 --> 00:15:51,916 వచ్చేసారి ఏదైనా ఆర్డర్ చేస్తే, ఏర్పాటుకు కట్టుబడి ఉండు. 149 00:15:53,750 --> 00:15:55,625 మన దగ్గర ఏమైనా ఉందా? 150 00:15:55,625 --> 00:15:57,000 పనికిమాలిన వెధవ! 151 00:15:58,375 --> 00:15:59,625 పనికిమాలిన సారా! 152 00:16:00,333 --> 00:16:01,166 ఏయ్! 153 00:16:04,458 --> 00:16:05,625 ఇప్పుడేంటి? 154 00:16:06,750 --> 00:16:08,208 నువ్వు చెప్పింది నిజమే, సరే? 155 00:16:08,208 --> 00:16:10,125 సారాకు సహాయం చేసాను. సిస్టం పోయింది. 156 00:16:10,833 --> 00:16:12,791 నేనొక వెధవను. ఇప్పుడు సంతోషమా? 157 00:16:21,041 --> 00:16:23,791 నిన్న నా సోదరుడితో వచ్చి తీసుకెళ్ళాను. 158 00:16:23,791 --> 00:16:24,750 ఏంటి? 159 00:16:25,375 --> 00:16:26,291 అవును. 160 00:16:26,791 --> 00:16:28,000 ఎప్పటిలాగే. 161 00:16:29,208 --> 00:16:31,125 సారా సారానే. నువ్వు నువ్వే. 162 00:16:33,166 --> 00:16:34,625 నేను నేనే. 163 00:16:37,875 --> 00:16:39,416 ధన్యవాదాలు. 164 00:16:42,875 --> 00:16:45,125 -హాయ్. -హలో, పెట్రా. 165 00:16:45,125 --> 00:16:46,291 హాయ్. 166 00:17:01,458 --> 00:17:04,708 డా. ఫిలిప్ చెన్నార్డ్ సైకియాట్రిస్ట్ మరియు సైకో థెరపిస్ట్ 167 00:17:08,125 --> 00:17:10,416 -పెట్రా? -ఏంటి? 168 00:17:10,416 --> 00:17:13,791 -నేను, యోర్గ్ పీటర్స్. ఒక నిమిషం? -బట్టలు మార్చుకుంటున్నాను. 169 00:17:13,791 --> 00:17:15,041 ఇది మార్క్ గురించి. 170 00:17:18,541 --> 00:17:21,500 అత్యవసర గది మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునే గది 171 00:17:22,458 --> 00:17:23,833 ఏం జరిగింది? 172 00:17:24,250 --> 00:17:26,208 నేను ఒక నిమిషం మాట్లాడాలి. 173 00:17:26,750 --> 00:17:29,583 నా కూతురు బెకీ ఇప్పుడు మార్క్ స్నేహితురాలు. 174 00:17:29,583 --> 00:17:30,791 నీకు కూతురు ఉందా? 175 00:17:31,166 --> 00:17:36,041 రెండు వారాల క్రితం నాతో ఉండడానికి వచ్చి, బడిలో మార్క్ను కలిసింది. 176 00:17:39,041 --> 00:17:40,166 చూస్తుంటే... 177 00:17:42,166 --> 00:17:46,083 అతని పరిస్థితి నేను అనుకున్న దానికంటే తీవ్రంగా ఉంది. 178 00:17:48,791 --> 00:17:49,916 కానీ... 179 00:17:53,208 --> 00:17:54,416 దాని అర్థం ఏంటి? 180 00:17:54,416 --> 00:17:58,041 మార్క్ తన తండ్రి క్రానికల్లో ఉన్నదంతా నిజమేనని నమ్ముతున్నాడు. 181 00:18:00,083 --> 00:18:01,583 -హలో. -హలో. 182 00:18:03,083 --> 00:18:06,666 మార్క్ బ్లాక్ టవర్కు వెళ్ళాలని అనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. 183 00:18:07,041 --> 00:18:09,208 అతని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. 184 00:18:09,666 --> 00:18:13,250 అతను ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నాడేమో. 185 00:18:23,416 --> 00:18:25,750 అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిబ్బంది ఉందా? 186 00:18:26,375 --> 00:18:27,208 సిబ్బందా? 187 00:18:29,500 --> 00:18:32,125 థామస్లాగే అతనికి మందులు, విశ్రాంతి కావాలి. 188 00:18:32,666 --> 00:18:34,583 అతనికి భద్రత, ప్రోత్సాహం కావాలి. 189 00:18:34,583 --> 00:18:37,166 అతన్ని జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకో. 190 00:18:41,333 --> 00:18:42,291 నేను... 191 00:18:43,416 --> 00:18:46,791 నా భర్త ఆత్మహత్య చేసుకుని చావడం, 192 00:18:49,875 --> 00:18:52,208 ఇది మార్క్కు జరగడం నేను చూడాలా? 193 00:18:52,208 --> 00:18:55,625 అతన్ని పిచ్చాసుపత్రిలో అసలే చేర్పించకూడదు. 194 00:18:56,750 --> 00:18:58,708 నాకు ఇక మీ సహాయం అక్కరలేదు. 195 00:19:04,875 --> 00:19:07,875 ష్లోస్పార్క్ సినిమా థియేటర్ పునరుద్ధరణ కోసం మూసివేయబడింది 196 00:19:16,375 --> 00:19:19,416 అయితే, నాకు నీ లైటింగ్ కాన్సెప్ట్ చూపించు. 197 00:19:24,083 --> 00:19:26,625 జాన్, ఏమనుకుంటున్నావు? 198 00:19:35,708 --> 00:19:36,625 సరే, మిత్రమా. 199 00:19:37,166 --> 00:19:41,958 వాస్తవం ఏమిటంటే, ఈ పాడుబడిన ప్రదేశమే 200 00:19:44,416 --> 00:19:47,458 నేను చూసిన అత్యంత అందమైన ప్రదేశం. 201 00:19:48,500 --> 00:19:50,708 ఈ సౌండ్ సిస్టం చక్కగా పనిచేస్తే, 202 00:19:52,083 --> 00:19:55,291 నువ్వు నాతో టూర్కు వస్తావు. సరేనా? 203 00:19:56,250 --> 00:19:57,083 తప్పకుండా! 204 00:19:58,750 --> 00:20:00,083 డీజే ఎవరు? 205 00:20:02,666 --> 00:20:04,208 ప్రస్తుతానికి ఎవరూ లేరు. 206 00:20:08,041 --> 00:20:09,625 నా సంగతి ఏంటి? 207 00:20:10,625 --> 00:20:13,000 -జాన్. అది అద్భుతంగా ఉంటుంది. -అవునా? 208 00:20:13,666 --> 00:20:14,750 నన్ను డిర్క్ అను. 209 00:20:19,666 --> 00:20:21,333 అతను ఏమనుకుంటున్నాడు? బాగుందా? 210 00:20:22,250 --> 00:20:24,041 ఇది పనిచేస్తుందని చెప్పాను. 211 00:20:37,208 --> 00:20:38,083 ఏయ్. 212 00:20:39,125 --> 00:20:40,083 బడి లేదా? 213 00:20:40,916 --> 00:20:41,791 ఒంటిపూట. 214 00:20:42,291 --> 00:20:43,541 ఆ బ్యాగు సంగతి ఏంటి? 215 00:20:44,500 --> 00:20:45,500 ఒకరిని కలుస్తున్నా. 216 00:20:49,708 --> 00:20:50,750 మనం మాట్లాడుకోవచ్చా? 217 00:20:51,958 --> 00:20:53,291 నిజంగా నా దగ్గర సమయం లేదు. 218 00:20:57,458 --> 00:20:59,000 ఎటర్నియా 219 00:21:00,666 --> 00:21:01,666 హలో, మార్క్! 220 00:21:03,041 --> 00:21:04,875 అమ్మా! 221 00:21:18,500 --> 00:21:19,708 అతన్ని పట్టుకోండి! 222 00:21:20,791 --> 00:21:22,041 గట్టిగా పట్టుకోండి! 223 00:21:31,958 --> 00:21:34,500 అతను తప్పించుకుంటున్నాడు! 224 00:22:04,333 --> 00:22:05,833 అద్భుతం. 225 00:22:09,375 --> 00:22:11,208 ఏయ్, ఇది నమ్మశక్యంగా లేదు. 226 00:22:12,833 --> 00:22:15,500 -చాలా బాగుంది. -అవును, ధన్యవాదాలు. 227 00:22:18,208 --> 00:22:21,250 బాంబును డిఫ్యూజ్ చేస్తున్నావా? నా వైపు ఎందుకు చూడవు? 228 00:22:22,666 --> 00:22:23,958 బాగుందా? 229 00:22:25,125 --> 00:22:27,750 -అద్భుతం. -సరే. 230 00:22:28,333 --> 00:22:30,875 -ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? -కచ్చితంగా. 231 00:22:31,375 --> 00:22:34,041 ఇకపై నీ డ్రైవర్ను కాను. అంతే. 232 00:22:34,041 --> 00:22:36,208 నిన్న చర్చి దగ్గర జరిగిన రచ్చ... 233 00:22:36,208 --> 00:22:39,375 ఇప్పుడు నాకు 18 ఏళ్ళు! నాపై నేరచరిత్ర నమోదు చేయవచ్చు. 234 00:22:39,750 --> 00:22:43,958 నీకు ఏదైనా కావాలంటే అంతా అద్భుతం. కానీ నాకు అవసరం ఉంటే సహాయం చేయవు. 235 00:22:43,958 --> 00:22:46,708 నీకు కనీసం ఫోన్ చేయలేను. చాలా పిచ్చిగా ఉంది. 236 00:22:46,708 --> 00:22:48,750 మనం కలిసి తిరగడం అందరికీ తెలుసు. 237 00:22:48,750 --> 00:22:52,041 అందరి ముందు నేను కనిపించనట్లే నటిస్తావు. 238 00:22:53,250 --> 00:22:55,041 నన్ను చూసి సిగ్గుపడుతున్నట్లుగా. 239 00:22:55,041 --> 00:22:57,125 ఛ, సారా! నీకోసం ఏదైనా చేస్తాను. 240 00:22:57,708 --> 00:23:01,541 మన సంబంధం రహస్యంగా ఉంచాలంటే, నేను నీతో ఉండను. 241 00:23:46,708 --> 00:23:47,541 ఏయ్. 242 00:23:47,541 --> 00:23:50,250 అరగంట నుండి ఎదురుచూస్తున్నాను. థామస్కు సగం రోజు. 243 00:23:50,250 --> 00:23:52,708 -సైకియాట్రిస్టులు నా వెంట పడ్డారు? -ఇప్పుడా? 244 00:23:53,166 --> 00:23:55,250 -వాళ్ళు ఆలస్యం చేసారు. -మిత్రమా, నిజంగా. 245 00:24:00,416 --> 00:24:01,791 శాంతించు. ఇక్కడ ఎవరూ లేరు. 246 00:24:02,541 --> 00:24:04,875 -మా అమ్మకు ఈ చర్చి తెలుసు. -బహుశా అది-- 247 00:24:05,875 --> 00:24:06,750 రండి! 248 00:24:07,250 --> 00:24:08,125 అతని పట్టుకో. 249 00:24:08,125 --> 00:24:09,041 ఆగు! 250 00:24:09,458 --> 00:24:10,708 అతన్ని వదిలేయ్! 251 00:24:12,208 --> 00:24:15,583 -శాంతంగా ఉండు. -తల కదిలించకు. 252 00:24:57,833 --> 00:24:58,791 పద, పద, పద! 253 00:25:32,708 --> 00:25:33,875 మార్క్? 254 00:25:55,083 --> 00:25:56,333 అదేంటి? 255 00:25:56,791 --> 00:25:58,333 అది ఏంటి? 256 00:25:59,166 --> 00:26:00,416 ఏమో, తెలియదు. 257 00:26:02,625 --> 00:26:03,666 ఎందుకు? 258 00:26:05,333 --> 00:26:06,833 నాకు తెలియదు. 259 00:26:07,583 --> 00:26:10,833 ఛ, మిత్రమా. మనం ఈ ద్వారం దగ్గరి నుండి వెళ్ళిపోవాలి. 260 00:26:26,583 --> 00:26:29,083 నేను వెనక్కి వెళ్ళాలి. వాళ్ళను అక్కడ వదిలేయలేను. 261 00:26:29,083 --> 00:26:31,166 అది మంచి ఆలోచన అనుకోను. 262 00:26:32,625 --> 00:26:35,375 -ఒక క్షణం ఆగు. -నేను వాళ్ళకు సహాయం చేయాలి. 263 00:26:35,375 --> 00:26:39,291 మనం థామస్ను కారవాన్ దగ్గర చూసినప్పుడు తొలిసారిగా తెలివైన విషయం చెప్పావు. 264 00:26:40,875 --> 00:26:42,333 "ఇప్పుడు సరైన సమయం కాదు." 265 00:26:43,458 --> 00:26:44,958 ఇప్పుడు నీకు అదే చెబుతున్నాను. 266 00:26:46,708 --> 00:26:48,541 వాళ్ళు అది నువ్వు అని అనుకుంటారు. 267 00:26:48,541 --> 00:26:51,375 నువ్వు కనిపించగానే, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. 268 00:26:52,458 --> 00:26:53,416 అక్కడ, 269 00:26:53,791 --> 00:26:55,625 ఇప్పుడు మనం ఏం చేయలేము. 270 00:26:57,000 --> 00:26:58,958 అక్కడ జరిగిన దానిలో మన తప్పులేదు. 271 00:27:00,041 --> 00:27:02,000 కానీ ఇక్కడ మనకు పథకం ఉంది. లక్ష్యం ఉంది! 272 00:27:03,833 --> 00:27:06,791 -థామస్ను బయటకు తీసుకురావడం. -సరిగ్గా, ఇద్దరం. 273 00:27:12,250 --> 00:27:13,583 మనం హీరోలం అవుతాం! 274 00:27:18,000 --> 00:27:19,916 తొలుత ప్రతిరోజు ఇక్కడ తిరిగేవాడిని. 275 00:27:21,041 --> 00:27:23,958 ద్వారం నుండి అడవికి, అక్కడి నుండి ఎడారికి, 276 00:27:23,958 --> 00:27:26,958 ఆపై నది ఒడ్డు నుండి పర్వత చెరువు వరకు. 277 00:27:27,625 --> 00:27:29,791 ప్రతిరోజు. అక్కడికి, వెనుకకు. 278 00:27:29,791 --> 00:27:31,000 ముందుకు వెనుకకు. 279 00:27:32,250 --> 00:27:35,333 ఒక వారం తర్వాత అనుకున్నాను, "మార్క్ తిరిగిరాడు. 280 00:27:35,333 --> 00:27:36,833 "ఇక్కడే శాశ్వతంగా ఉంటాను." 281 00:27:36,833 --> 00:27:38,958 -మన్నించు. -అది అంత ఘోరంగా లేదు. 282 00:27:38,958 --> 00:27:43,125 క్రమ క్రమంగా ఇది నా చోటు అనిపించసాగింది. తెలుసా? 283 00:27:43,125 --> 00:27:47,500 -ఇంటిలా కాదు. పిచ్చి, కదా? -బ్లాక్ టవర్ మనసు మార్చినట్టుగా... 284 00:27:49,041 --> 00:27:49,875 నీకు కూడానా? 285 00:27:50,625 --> 00:27:52,750 నా కడుపులో అదోలా అనిపించింది. 286 00:27:53,333 --> 00:27:54,666 ఎదురు చూస్తున్నట్లుగా. 287 00:27:57,583 --> 00:27:59,416 మొదట, నా కాలు పనిచేయసాగింది. 288 00:27:59,416 --> 00:28:01,833 ఆపై ఇంకా మెరుగ్గా చూస్తూ, ఆలోచించసాగాను. 289 00:28:01,833 --> 00:28:03,833 నా పోరాట శైలి చాలా మెరుగుపడింది. 290 00:28:04,541 --> 00:28:08,125 పోరాడటానికి నా దగ్గర ఉల్రిచ్ అనే కర్ర ఉంది. తర్వాత చూపిస్తాను. 291 00:28:08,583 --> 00:28:10,041 లార్స్ ఉల్రిచ్లాగా. 292 00:28:10,458 --> 00:28:13,666 టవర్ నాలాంటి బద్ధకస్తుడిని పనిమంతుడిలా మార్చగలిగితే, 293 00:28:13,666 --> 00:28:16,583 అది నీకు ఇంకెంతగా చేయగలదు? నిజమేనా, సూపర్ హీరో? 294 00:28:16,583 --> 00:28:19,541 -ఇంకెంత దూరం? -ఆ పర్వతం దగ్గర. 295 00:28:20,500 --> 00:28:21,333 సరే. 296 00:28:21,875 --> 00:28:25,291 సరే, మిత్రమా. ఇప్పటి వరకు 90లలోని ఉత్తమ ఆల్బమ్లు. వెళ్ళు. 297 00:28:26,541 --> 00:28:29,750 -మొదటిది, నిర్వాణ వారి నెవర్మైండ్. -అంగీకరించను. 298 00:28:29,750 --> 00:28:32,833 -రెండవది, డా. డ్రే యొక్క ద క్రానిక్. -మిత్రమా! 299 00:28:32,833 --> 00:28:35,250 -మూడవది, పేవ్మెంట్. -మరీ ఘోరం. 300 00:28:41,583 --> 00:28:43,125 పార్టీకి వస్తున్నావా? 301 00:28:43,750 --> 00:28:44,791 తప్పకుండా. 302 00:28:46,750 --> 00:28:47,625 ఏయ్! 303 00:28:53,000 --> 00:28:55,416 నువ్వు వచ్చినందుకు సంతోషం. 304 00:29:00,250 --> 00:29:01,083 చీర్స్! 305 00:29:04,375 --> 00:29:05,583 పార్టీలో కలుస్తాను! 306 00:29:18,125 --> 00:29:19,666 బీరు కొంచెమే తాగాను, సరేనా? 307 00:29:20,083 --> 00:29:21,458 ఒక చెడు వార్త ఉంది. 308 00:29:27,583 --> 00:29:30,291 -ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. -తను మార్క్. 309 00:29:30,291 --> 00:29:32,750 -అలా జరగదు. -అతన్ని గుర్తించారు. 310 00:29:34,583 --> 00:29:35,958 నిన్ను హెచ్చరించాను, బెకీ. 311 00:29:36,625 --> 00:29:40,833 నువ్వు అతన్ని బలపరిచినట్లుగా భావించి, తన ఊహల్లో తేలిపోయాడు. 312 00:29:43,125 --> 00:29:44,375 అతను ఒక వ్యక్తిని చంపాడు. 313 00:29:47,916 --> 00:29:48,916 నన్ను మన్నించు. 314 00:29:50,375 --> 00:29:52,083 ఇక నీవు నేను చెప్పినట్లు వినాలి. 315 00:29:52,500 --> 00:29:55,750 నువ్వు నీ గదిలో ఉండాలి. టీవీ, ఫోన్లు ఉండవు. 316 00:29:55,750 --> 00:29:56,875 నేను వచ్చేవరకు. 317 00:29:58,291 --> 00:29:59,583 అర్థమైందా? 318 00:30:02,291 --> 00:30:04,541 మంచిది. అయితే నీ గదికి వెళ్ళు. 319 00:30:05,625 --> 00:30:07,250 నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. 320 00:31:07,416 --> 00:31:10,291 త్వరలో చీకటి పడనుంది. ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. 321 00:31:11,208 --> 00:31:12,125 సరే. 322 00:31:19,208 --> 00:31:21,375 యోర్గ్ పీటర్స్, డిటెక్టివ్ బ్రేకర్ను కలవాలి. 323 00:31:21,375 --> 00:31:22,625 సరే, ఇలా రండి. 324 00:31:36,875 --> 00:31:38,750 నేను చెన్నార్డ్కు ఫోన్ చేసాను. 325 00:31:40,333 --> 00:31:41,166 నాకు తెలుసు. 326 00:31:41,166 --> 00:31:44,166 నువ్వు హెచ్చరించినా అతనికి ఫోన్ చేసాను. 327 00:31:48,541 --> 00:31:50,875 మొదట కార్ల్, ఆ తర్వాత థామస్, ఇప్పుడు... 328 00:31:53,083 --> 00:31:55,583 డాక్టర్ పీటర్స్ వచ్చేసారా? 329 00:31:59,958 --> 00:32:01,583 నిన్ను నువ్వు తమాయించుకోగలవా? 330 00:32:03,250 --> 00:32:04,958 నేను ఇకపై అలాగే ఉండాలి. 331 00:32:29,708 --> 00:32:30,583 డాక్టర్ పీటర్స్. 332 00:32:34,708 --> 00:32:38,625 ముగ్గురు మగ నర్సులు స్పృహ కోల్పోయారు, ఇంకా ఇది. 333 00:32:41,750 --> 00:32:44,750 నా 40 ఏళ్ళ పోలీసు విధిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. 334 00:32:44,750 --> 00:32:48,500 ఇది చాలా ముఖ్యమైన విషయం. అతను మీ రోగినా? 335 00:32:48,500 --> 00:32:51,333 -అంటే మార్క్ ఇది చేయగలడా అని అంటున్నారా? -అవును. 336 00:32:56,875 --> 00:32:58,000 అవును, చేయగలడు. 337 00:33:06,916 --> 00:33:08,500 దుస్సమయ నివారిణి 338 00:33:47,083 --> 00:33:49,916 ఇదంతా ఎవరు కట్టారని ఎప్పుడైనా అనుకున్నావా? 339 00:33:50,500 --> 00:33:52,250 స్తంభాలు, లైట్ బాక్సులు? 340 00:33:54,333 --> 00:33:56,125 ఇదంతా క్రానికల్లో రాసి ఉంది. 341 00:33:59,583 --> 00:34:00,916 మీరు డేటింగ్ చేస్తున్నారా? 342 00:34:04,500 --> 00:34:06,958 -పాస్పోర్ట్ ఫోటో అంతే. -కానీ ఆమె నీకిష్టం. 343 00:34:07,958 --> 00:34:10,875 నా ఉద్దేశం, ఆమె అంటే నీకు ఇష్టం. నిజంగా ఇష్టం. 344 00:34:12,916 --> 00:34:13,791 నాకు తెలియదు. 345 00:34:18,291 --> 00:34:19,458 నిన్ను ఇష్టపడుతోందా? 346 00:34:21,083 --> 00:34:22,916 -తెలియదు. -మిత్రమా. 347 00:34:23,333 --> 00:34:25,625 "అవును." "కాదు." "తెలియదు." "ఏమో." 348 00:34:25,625 --> 00:34:27,583 ఈరోజు పొడిపొడిగా మాట్లాడుతున్నావు. 349 00:35:04,208 --> 00:35:06,208 మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడే! 350 00:35:08,166 --> 00:35:09,458 ఏం జరుగుతోంది? 351 00:35:10,375 --> 00:35:11,500 ఇప్పుడే! 352 00:35:15,333 --> 00:35:17,708 -ఏం జరుగుతోంది? -ఇక్కడ ఎప్పుడూ వర్షం పడదు. 353 00:35:17,708 --> 00:35:20,000 సమస్య ఏంటి? వర్షం పడుతోంది. అయితే ఏంటి? 354 00:35:34,125 --> 00:35:37,166 వాటికి నీళ్ళు తగలగానే అవి పొదుగుతాయి. 355 00:35:39,916 --> 00:35:41,333 అదే నా సమస్య. 356 00:35:50,791 --> 00:35:52,166 పరిగెత్తు! 357 00:36:29,333 --> 00:36:31,333 పరిగెత్తు! 358 00:36:55,458 --> 00:36:56,625 ఛ! 359 00:38:41,000 --> 00:38:42,458 రాత్రి నిద్ర పట్టలేదు, కదా? 360 00:38:50,250 --> 00:38:51,458 మన మిత్రులు ఎండిపోయారు. 361 00:38:53,125 --> 00:38:54,333 మనం భలే చేసాం, కదా? 362 00:38:54,875 --> 00:38:55,708 భలే చేసామా? 363 00:38:56,666 --> 00:38:57,916 రాయి పైకి ఎక్కడం! 364 00:38:59,541 --> 00:39:00,541 చాలా సునాయాసం! 365 00:39:06,208 --> 00:39:08,083 ఏమైంది? సరిగా నిద్ర పోలేదా? 366 00:39:08,083 --> 00:39:10,791 నీకు పూల గురించి తెలిసి కూడా ఏం చెప్పలేదా? 367 00:39:10,791 --> 00:39:12,583 సాధారణంగా ఇక్కడ వర్షం పడదు. 368 00:39:13,125 --> 00:39:14,083 సాధారణంగానా? 369 00:39:15,916 --> 00:39:18,416 నీకు ఇది కేవలం ఒక సాహస యాత్ర! 370 00:39:18,958 --> 00:39:21,416 చివరకు నువ్వు పెద్ద హీరో అవుతావు! 371 00:39:22,458 --> 00:39:23,500 శాంతించు! 372 00:39:25,541 --> 00:39:29,458 నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను, నీవల్ల మనం దాదాపుగా చనిపోయేవాళ్ళం. 373 00:39:30,208 --> 00:39:34,583 ఇకపై ఏదైనా ప్రమాదకరమైనది ఉంటే, నాకు తెలియాలి. అర్థమైందా? 374 00:39:40,125 --> 00:39:42,708 ఇంకోసారి "చాలా సునాయాసం" అన్నావంటే... 375 00:39:47,750 --> 00:39:48,666 అప్పుడు... 376 00:40:42,125 --> 00:40:44,625 {\an8}''బెకీ, ఈ పుస్తకాన్ని మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తే, 377 00:40:44,625 --> 00:40:47,000 ''మీరు పజిల్ను పరిష్కరించి, ద్వారం తెరవొచ్చు. 378 00:40:55,875 --> 00:40:57,583 నువ్వు చెప్పిందంతా నిజమే... 379 00:41:14,666 --> 00:41:17,041 ఇక్కడే వేచి ఉంటావా? తేవలసింది ఓ రెండు పెట్టెలే. 380 00:41:17,666 --> 00:41:19,666 పరవాలేదు. నేను నీతో వస్తాను. 381 00:41:22,750 --> 00:41:26,583 ఇల్లు ఎంత చిందరవందరగా ఉందో తెలియదు. అలాగే మా నాన్న కూడా ఉంటాడు. 382 00:41:27,416 --> 00:41:30,583 -ఇప్పుడు అతని మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. -నాకు ఏం కాదు. 383 00:42:00,916 --> 00:42:02,333 ఇది చాలా బాగుంది! 384 00:42:04,208 --> 00:42:06,083 -అలాగా? -అవును! 385 00:42:12,250 --> 00:42:14,083 నేను ఇక్కడకు ముందే రావాల్సింది. 386 00:42:25,041 --> 00:42:27,166 హాయ్, నా పేరు సారా. 387 00:42:28,291 --> 00:42:29,416 బెన్ స్నేహితురాలిని. 388 00:42:37,000 --> 00:42:39,541 ఎవరో బెకీ అని ఫోన్ చేసింది. ఫోన్ చేయుమన్నది. 389 00:42:42,958 --> 00:42:44,250 కలిసినందుకు సంతోషం. 390 00:42:59,875 --> 00:43:01,041 -హాయ్. -హాయ్. 391 00:43:01,625 --> 00:43:03,416 రా, నీ బ్యాగు తీసుకుంటాను. 392 00:43:03,416 --> 00:43:04,333 ధన్యవాదాలు. 393 00:43:10,333 --> 00:43:12,916 -మనం వెళ్దామా? -గ్రంథాలయానికా? 394 00:43:12,916 --> 00:43:14,958 -రిజిస్ట్రారు కార్యాలయం దగ్గరా? -అవును. 395 00:43:14,958 --> 00:43:16,500 పట్టణానికి మరోవైపునా? 396 00:43:18,166 --> 00:43:20,166 -ఆపై మార్క్ దగ్గరకా? -తన తల్లి కోసం. 397 00:43:49,250 --> 00:43:51,583 కాస్త ముందుకు వెళితే సరస్సు వచ్చేస్తుంది. 398 00:43:56,291 --> 00:43:57,416 నన్ను మన్నించు. 399 00:43:58,291 --> 00:43:59,625 నేను నీకు చెప్పాల్సింది. 400 00:44:02,041 --> 00:44:04,875 అది ప్రమాదకరమైన తెలివి తక్కువ పని. మన్నించు. 401 00:44:09,625 --> 00:44:10,625 సరే. 402 00:44:11,375 --> 00:44:12,208 సరే. 403 00:44:16,375 --> 00:44:21,583 నీకు చెరువు దగ్గర మరింతగా నచ్చుతుంది. మనం ఈత కొట్టవచ్చు. చల్లబడవచ్చు. 404 00:44:21,583 --> 00:44:22,500 అది బాగుంటుంది. 405 00:44:31,416 --> 00:44:33,125 మనం ఇందులోంచి అక్కడికి వెళ్ళాలి. 406 00:44:33,875 --> 00:44:35,250 ముందు నువ్వు పద, మిత్రమా. 407 00:44:35,250 --> 00:44:38,791 -నేరుగా ఈ పొదల్లోంచా? -చెరువు దీని వెనుకే ఉంది. 408 00:44:40,916 --> 00:44:44,083 సరే. మనం కొమ్ములు గలవారి కోసం ఇక్కడే వేచి ఉండలేమా? 409 00:44:54,083 --> 00:44:56,458 సరే, హీరోను కావాలనుకుని అంతా పాడు చేసాను. 410 00:44:57,250 --> 00:44:59,666 కానీ నీకు ఏమీ అక్కరలేదు. నీకు ఏదీ నచ్చదు. 411 00:45:00,833 --> 00:45:03,666 నువ్వు వద్దనుకుంటే నీ దగ్గర శక్తులు ఉండి ఏం లాభం? 412 00:45:04,541 --> 00:45:07,208 నిష్కర్షగా ఉంటే సూపర్మ్యాన్ కూడా ఎగరలేడు. 413 00:45:10,125 --> 00:45:11,250 ఈతకు వెళుతున్నాను. 414 00:45:39,250 --> 00:45:43,375 మిత్రమా, రా! నీళ్ళు చక్కగా ఉన్నాయి, మిత్రమా. 415 00:45:55,666 --> 00:45:57,000 ఛ. 416 00:46:03,041 --> 00:46:04,458 చాలా బాగుంది కదా? 417 00:46:04,458 --> 00:46:05,375 ఏయ్! 418 00:46:52,625 --> 00:46:55,750 ఒరాకిల్ రికార్డులు 419 00:47:20,083 --> 00:47:21,458 నిర్లక్ష్యం. 420 00:49:19,458 --> 00:49:21,458 సబ్టైటిల్ అనువాద కర్త నల్లవల్లి రవిందర్ రెడ్డి 421 00:49:21,458 --> 00:49:23,541 {\an8}క్రియేటివ్ సూపర్వైజర్ రాజేశ్వరరావు వలవల