1 00:00:36,454 --> 00:00:38,957 "కార్కేరడాన్ కార్కేరియస్." 2 00:00:43,628 --> 00:00:44,880 క్యానన్ బాల్! 3 00:00:48,466 --> 00:00:51,553 సాటిలైట్ టాగర్ సిద్ధంగా ఉంది. మన కింద గమనిస్తూ ఉండు, డేవిడ్. 4 00:00:51,553 --> 00:00:54,222 షార్క్ లు వాటి ఎరను కింద నుండి వచ్చి పట్టుకోవడానికి ఇష్టపడతాయి. 5 00:00:54,222 --> 00:00:56,683 -ఏంటో? ఎందుకు? -అప్పుడైతే నువ్వు దానిని చూడలేవు కదా. 6 00:00:57,976 --> 00:00:58,977 తినేస్తుంది! 7 00:00:59,603 --> 00:01:02,731 నువ్వు భయపడడానికి ఏం లేదు, డేవిడ్. మనం ఒక లోహపు బోనులో ఉన్నాం. 8 00:01:02,731 --> 00:01:04,983 షార్క్ లపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కూడా వీటిలోని దిగుతారు. 9 00:01:04,983 --> 00:01:06,693 మనం ఈ పనిని ఎందుకు చేస్తున్నామో మళ్ళీ చెప్తావా? 10 00:01:06,693 --> 00:01:09,487 మనకు గ్రేట్ వైట్ షార్క్ ల గురించి తెలీనిది చాలా ఉంది. 11 00:01:09,487 --> 00:01:12,866 అవి గొప్పవి. అలాగే షార్కులు. అంతకంటే తెలుసుకోవాల్సింది ఏం లేదు. 12 00:01:12,866 --> 00:01:14,534 నిజానికి మనకు వాటి గురించి చాలా తక్కువ తెలుసు. 13 00:01:14,534 --> 00:01:16,745 అవి ఎక్కువగా ఏం చేస్తూ సమయం గడుపుతాయో మనకు తెలీదు. 14 00:01:17,329 --> 00:01:19,331 ఇంకా. అలాగే మనకు ఆ విషయం తెలీకపోతే... 15 00:01:19,915 --> 00:01:21,625 అవి ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలీదు. 16 00:01:21,625 --> 00:01:24,669 అవును. దానర్థం మన నుండి వాటికి ఎంత సహాయం అవసరమో కూడా మనకు తెలీదు. 17 00:01:25,170 --> 00:01:28,048 నాకెందుకో మనకే సహాయం అవసరం అవుతుంది అనిపిస్తోంది. 18 00:01:28,048 --> 00:01:29,716 అవి మనుషులను కూడా తింటాయా? 19 00:01:29,716 --> 00:01:31,051 అనుకోకుండా మాత్రమే. 20 00:01:31,551 --> 00:01:33,678 అనుకోకుండా ఎవరైనా ఒక మనిషిని ఎలా తింటారు? 21 00:01:33,678 --> 00:01:35,680 ఎందుకంటే మనల్ని అది తినే జంతవు ఏమో అనుకుని పొరపడి, 22 00:01:35,680 --> 00:01:37,474 అనుకోకుండా కొరకడం వల్ల. 23 00:01:37,474 --> 00:01:38,558 నేను నీకు చూపిస్తాను చూడు. 24 00:01:39,309 --> 00:01:40,477 గ్రేబియర్డ్ ని జేన్ పిలుస్తోంది. 25 00:01:40,977 --> 00:01:42,896 గ్రేబియర్డ్? గ్రేబియర్డ్! 26 00:01:46,274 --> 00:01:50,362 సీల్ డీకాయ్ ని నీళ్లలో వెయ్, ఆ తర్వాత షార్క్ వస్తుందో లేదో కనిపెట్టు. 27 00:02:01,498 --> 00:02:03,250 మనం ఇప్పుడు నీడ బొమ్మలాట ఆడుతున్నామా? 28 00:02:03,250 --> 00:02:06,920 అలాంటిదే. షార్కులు నీటి కింద నుండి వచ్చి పట్టుకుంటాయి అని చెప్పాను గుర్తుందా? 29 00:02:06,920 --> 00:02:09,381 నేను ఆ మాట ఎప్పటికీ మర్చిపోను. 30 00:02:09,381 --> 00:02:11,591 అవి వాటి ఎరని అలాగే గమనిస్తాయి. 31 00:02:11,591 --> 00:02:15,220 -దానిని చూడు. -అది ఒక సీల్ ఆకారమా లేక మనిషి ఆకారమా? 32 00:02:15,220 --> 00:02:18,932 తేడా చెప్పడం కష్టం కదా? షార్కులు కూడా అలాగే పొరబడతాయి. అవి మనుషులను వేటాడటానికి చూడవు, 33 00:02:18,932 --> 00:02:21,560 కాకపోతే ఒక్కోసారి అనుకోకుండా తప్పుడు అంచనాతో కొరుకుతుంటాయి. 34 00:02:21,560 --> 00:02:23,103 అయితే మనం భయపడాల్సిన పనిలేదా? 35 00:02:29,818 --> 00:02:31,361 నేను సీల్ ని కాదు. నేను సీల్ ని కాదు. 36 00:02:32,028 --> 00:02:34,573 -జేన్? -మన డీకాయ్ ఎక్కడికి పోయింది? 37 00:02:35,156 --> 00:02:36,533 అది నేరుగా మన పైనే ఉంది. 38 00:02:36,533 --> 00:02:39,119 అంటే ఇప్పుడు సొరచేప మన కిందే ఉంది. 39 00:02:41,746 --> 00:02:42,747 టాటా. 40 00:02:42,747 --> 00:02:46,459 ఏంటి? నిన్ను ఇలా కూర్చోబెట్టి తొయ్యడం చాలా కష్టం. 41 00:02:47,335 --> 00:02:50,422 ఇంకా చిన్న పిల్లలా ఇలాంటి ఊహాగానాల ఆటలే ఆడుతున్నావు ఏంటి, ఆహ్? 42 00:02:51,381 --> 00:02:52,966 అది కనిపించిందా, డేవిడ్? 43 00:02:52,966 --> 00:02:57,262 అదృష్టవశాత్తు లేదు. కానీ అది ఆడది అని నీకెలా తెలుసు? 44 00:02:57,262 --> 00:02:59,306 ఆడ షార్కులు మగ వాటికన్నా పెద్దగా ఉంటాయి. 45 00:02:59,306 --> 00:03:00,640 ఆటలు ఆడడం ఆపు, డేవి. 46 00:03:00,640 --> 00:03:03,977 నాన్నకి తన ఫేవరెట్ రెసిపీని వండడానికి కిరాణా లిస్టులో ఉన్న వస్తువులు అన్నీ కావాలి. 47 00:03:04,644 --> 00:03:08,398 సాసి సిఫుడ్ పేయ 48 00:03:08,398 --> 00:03:10,775 మనం ఏదైనా మర్చిపోతే తర్వాత ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. 49 00:03:14,362 --> 00:03:15,196 ఎవరు చేస్తున్నారో తెలుసా? 50 00:03:15,196 --> 00:03:16,281 హేయ్, బుజ్జి. 51 00:03:17,115 --> 00:03:18,533 నేను లిస్టులో పార్స్లి పెట్టానా? 52 00:03:20,368 --> 00:03:21,244 ఉంది. 53 00:03:21,244 --> 00:03:23,413 -అలాగే కుంకుమ పువ్వు? -ఆహ్-హాహ్. 54 00:03:23,413 --> 00:03:26,541 అలాగే గుర్తుంచుకో, బొంబ బియ్యం తేవాలి, క్రితం సారి తెచ్చిన జిగురు బియ్యం కాదు. 55 00:03:26,541 --> 00:03:27,667 బొంబ, జిగురు బియ్యం కాదు. 56 00:03:27,667 --> 00:03:28,960 అలాగే. 57 00:03:28,960 --> 00:03:32,756 సరే, థాంక్స్. అలాగే కొంచెం త్వరగా వస్తారా, మిల్లికి చాలా ఆకలిగా ఉంది. 58 00:03:32,756 --> 00:03:33,924 లవ్ యు. 59 00:03:34,466 --> 00:03:35,675 లవ్ యు టూ. 60 00:03:36,509 --> 00:03:37,969 పదా, బుజ్జి. మనం త్వరగా పని పూర్తి చేయాలి. 61 00:03:37,969 --> 00:03:40,680 అసలు కుంకుమ పువ్వు అంటే ఏంటి? 62 00:03:42,265 --> 00:03:44,684 క్షమించు, జేన్. మన అన్వేషణను వాయిదా వేయాలి. 63 00:03:46,394 --> 00:03:47,604 వీలైతే శాశ్వతంగా. 64 00:03:48,104 --> 00:03:51,191 కానీ కార్కేరడాన్ కార్కేరియస్ కి ట్రాకర్ ని అంటించడం సంగతి ఏంటి? 65 00:03:51,191 --> 00:03:53,652 కార్కేర... ఏమన్నావు? 66 00:03:53,652 --> 00:03:56,446 కార్కేరడాన్ కార్కేరియస్. 67 00:03:56,446 --> 00:03:58,657 అది గ్రేట్ వైట్ షార్క్ శాస్త్రీయ పేరు. 68 00:03:58,657 --> 00:04:00,450 మరి నువ్వు దానిని అలాగే పిలవొచ్చు కదా? 69 00:04:00,450 --> 00:04:02,494 శాస్త్రీయ పేరుతొ పిలిస్తే ఇంకా మజాగా ఉంటుంది. 70 00:04:03,119 --> 00:04:06,623 మజా అనే పదానికి నీకు, నాకు ఉన్న అర్థాలే వేరు. 71 00:04:07,415 --> 00:04:09,042 చూడు, సూప్ డిస్కౌంట్ లో ఉంది. 72 00:04:09,042 --> 00:04:09,960 సూప్ ఒకటి కొంటే మూడు 73 00:04:09,960 --> 00:04:11,044 అవును, మనకు ఇది కావాలి. 74 00:04:11,044 --> 00:04:15,549 ఏంటి? ఒకటికి మూడా? అలా అస్సలు జరగదు. 75 00:04:15,549 --> 00:04:17,132 కాస్త స్థలం ఏర్పాటు చెయ్, కోరాజొన్సీటో. 76 00:04:17,132 --> 00:04:19,427 పదా, నడువు. అందులో నుండి లెగు. 77 00:04:21,805 --> 00:04:25,725 అయితే, ఈ షార్కుల కథ ఏంటి? 78 00:04:25,725 --> 00:04:28,728 మేము ఒకదానికి ట్రాకర్ పెట్టి అవి వాటి సమయాన్ని ఎలా గడుపుతాయో చూడాలి అనుకుంటున్నాం. 79 00:04:28,728 --> 00:04:30,814 అది సులభమే కాదు, సముద్రంలో గడుపుతాయి. 80 00:04:30,814 --> 00:04:32,065 కానీ అందులోనే సరిగ్గా ఎక్కడ? 81 00:04:32,065 --> 00:04:34,943 షార్కులు చాలా సేపు కనిపించకుండా పోతుంటాయి, 82 00:04:34,943 --> 00:04:37,904 -కానీ అది ఎందుకో శాస్త్రవేత్తలకు ఇంకా తెలీదు. -ఇప్పుడు అదంతా ఎందుకు? 83 00:04:38,488 --> 00:04:40,323 ఎందుకంటే అవి తిరుగులేని ఎపెక్స్ వేట చేపలు. 84 00:04:40,323 --> 00:04:42,409 అది ఇంకొక శాస్త్రీయ పేరా? 85 00:04:42,409 --> 00:04:46,705 కాదు, ఎపెక్స్ అంటే అవి సముద్ర జీవుల ఆహార పరిణామక్రమంలో అన్నిటికంటే పైన ఉంటాయని. 86 00:04:46,705 --> 00:04:48,873 అవి లేకపోతే, ఎర చేపలను తినడానికి ఏదీ ఉండదు, 87 00:04:48,873 --> 00:04:52,043 అప్పుడు అవన్నీ సముద్రంలో ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినేస్తాయి, అప్పుడు సముద్రంలోని సమతుల్యం దెబ్బతింటుంది. 88 00:04:52,544 --> 00:04:55,714 ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి నువ్వు ఎందుకు చింత పెంచుకుంటున్నావు, ఆహ్? 89 00:04:55,714 --> 00:04:57,048 ఇవన్నీ ఎవరోకరు పట్టించుకోవాలి కాబట్టి. 90 00:04:59,676 --> 00:05:01,344 షార్కులు చేపలను తింటాయి, కదా? 91 00:05:01,928 --> 00:05:05,348 చేపలు, సీల్స్ అలాగే అప్పుడప్పుడు తిమింగలాలు కళేబరాలను కూడా. 92 00:05:05,348 --> 00:05:08,894 సరే, నాకైతే ఇక్కడ చచ్చిన తిమింగలాలు ఏవీ ఉన్నట్టు కనిపించడం లేదు, 93 00:05:08,894 --> 00:05:12,105 కానీ ఇక్కడ కచ్చితంగా ఒక చేపల విభాగం ఉంది. 94 00:05:12,105 --> 00:05:14,441 బహుశా నువ్వు వెతికే షార్కు అక్కడ ఉంటుందేమో. 95 00:05:14,441 --> 00:05:16,651 మంచి ఐడియా, టాటా. నేను ఇప్పుడే వస్తాను. 96 00:05:17,152 --> 00:05:21,114 కంగారు పడకు. అలాగే తలాఫియా చేపలు సేల్ లో ఉన్నాయో లేదో చెప్పు, సరేనా? 97 00:05:21,114 --> 00:05:22,282 అలాగే. 98 00:05:31,374 --> 00:05:35,503 మనం చేపల కోసం వెతుకుతుండాలి, గ్రేబియర్డ్, చచ్చిన చేపలను నొక్కుతూ కాదు. 99 00:05:38,089 --> 00:05:39,841 చేపను ఎరగా వాడదామా? 100 00:05:39,841 --> 00:05:41,426 నీ ఆలోచనా విధానం నాకు నచ్చింది. 101 00:05:44,596 --> 00:05:45,972 నేను దీనిని కనీసం చదవలేకపోతున్నాను. 102 00:05:45,972 --> 00:05:47,057 నన్ను చూడనివ్వు. 103 00:05:49,768 --> 00:05:53,563 "బంగాళదుంపల చిప్స్." 104 00:05:54,397 --> 00:05:56,399 సర్లే, బాగానే ప్రయత్నించావు, డేవి. అది నీకు కావాల్సింది. 105 00:05:57,400 --> 00:06:00,403 బియ్యం సెక్షన్. సరే, ఆ బొంబ బియ్యం ఎక్కడ? 106 00:06:08,119 --> 00:06:11,039 -షార్క్! -డేవి. డేవి, నిశ్శబ్దం. 107 00:06:11,915 --> 00:06:12,958 షార్క్. 108 00:06:15,335 --> 00:06:16,711 ఏంటి? మెల్లిగానే చెప్పాను కదా. 109 00:06:19,172 --> 00:06:21,174 జేన్, ఆ షార్క్ వచ్చేసింది. 110 00:06:21,174 --> 00:06:23,843 నాకు తెలుసు. నేను దానిని రప్పించడానికి చేపలను ఎర వేశా. 111 00:06:32,519 --> 00:06:34,020 అది ఎంత అందంగా ఉందో. 112 00:06:38,066 --> 00:06:40,360 అది దగ్గరకు వచ్చినప్పుడు, ట్యాగ్ అంటించు. 113 00:06:42,070 --> 00:06:43,071 చేయను అంటే ఏంటి నీ ఉద్దేశం? 114 00:06:45,115 --> 00:06:48,743 అది పెద్దగా ఉన్నది నిజమే. అది ప్రపంచంలోనే అతిపెద్ద వేటాడే చేప కదా. 115 00:06:55,166 --> 00:06:57,335 నువ్వు తోసే విధానం మీద నీకు ట్రైనింగ్ ఇవ్వాలి. 116 00:07:04,342 --> 00:07:05,343 హాయ్. 117 00:07:07,929 --> 00:07:11,182 నేను నీకు ట్యాగ్ అంటిస్తున్నాను అని నీకు చాలా కోపంగా ఉందని నాకు ఎందుకో అనిపిస్తోంది, 118 00:07:12,642 --> 00:07:15,896 కానీ ఇప్పుడు నువ్వు ఎంత వేగంగా ఈదగలవో నేను చూడబోతున్నాను. 119 00:07:15,896 --> 00:07:17,063 గ్రేబియర్డ్, పరిగెత్తు! 120 00:07:22,819 --> 00:07:25,322 జేన్, ఎక్కడ ఉన్నావు? చెప్పు. 121 00:07:26,072 --> 00:07:27,699 చేపకు బలైపోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నా. 122 00:07:27,699 --> 00:07:28,783 దానికి ట్యాగ్ ని అంటించావా? 123 00:07:28,783 --> 00:07:30,994 లేదు, కానీ దానికి కోపం తెప్పించాను అని అనుకుంటున్నాను. 124 00:07:33,914 --> 00:07:35,749 అద్భుతం, కోపంగా ఉన్న షార్క్. 125 00:07:35,749 --> 00:07:38,793 నేను వస్తున్నాను, కానీ వస్తున్నందుకు నాకు అస్సలు సంతోషంగా లేదు. 126 00:07:44,925 --> 00:07:47,010 {\an8}"కస్టమర్ కి ఆరు మాత్రమేనా?" 127 00:07:49,596 --> 00:07:50,931 నేను దీనిని కొంచెం తీసుకోవచ్చా? 128 00:07:50,931 --> 00:07:52,641 సరే, డేవిడ్, 129 00:07:52,641 --> 00:07:55,310 కానీ తర్వాత వాటిని తిరిగి వెనక్కి పెట్టడంలో నువ్వు సహాయం చేయాలి. 130 00:07:55,310 --> 00:07:56,394 అలాగే. 131 00:08:00,982 --> 00:08:02,567 -కుడి వైపు తిరుగు. -అలాగే. 132 00:08:05,946 --> 00:08:07,155 దీనిని నములు. 133 00:08:10,951 --> 00:08:12,535 భలే అడ్డుపడ్డావు. 134 00:08:12,535 --> 00:08:14,788 ఆ షార్కుకు ట్యాగ్ అంటించకపోవడమే ఏం భలేగా లేదు. 135 00:08:16,873 --> 00:08:17,874 మీరిద్దరూ ఏం చేశారు? 136 00:08:18,541 --> 00:08:20,293 -పరిశోధన. -షార్క్ నుండి తప్పించుకుంది. 137 00:08:21,127 --> 00:08:23,588 ఆ తప్పించుకొనేది కాస్త నిశ్శబ్దంగా తప్పించుకోవచ్చు కదా. 138 00:08:23,588 --> 00:08:25,257 అవును, చాలా నిశ్శబ్దంగా. 139 00:08:25,257 --> 00:08:27,425 మీరు ఎంత పాడు చేసారో చూడండి. 140 00:08:27,425 --> 00:08:30,220 అందరి ముందూ పరువు పోయింది. వెంటనే ఇదంతా శుభ్రం చేయడం మొదలెట్టండి. 141 00:08:32,931 --> 00:08:33,932 ప్లానెట్ హోప్ 142 00:08:33,932 --> 00:08:37,435 "మన భవిష్యత్తుకు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఉదాసీనత." 143 00:08:38,019 --> 00:08:41,523 -ఉదాసీనత అంటే ఏంటి? -నాకు కూడా సరిగ్గా తెలీదు. 144 00:08:41,523 --> 00:08:44,109 దానర్థం పట్టింపు లేకపోవడం లేదా లెక్క చేయకపోవడం. 145 00:08:44,609 --> 00:08:48,071 మీరిద్దరూ ఇప్పుడు చేసిన ఈ రాద్ధాంతాన్ని ఎలా శుభ్రం చేయకుండా నిలబడ్డారో అలా అన్నమాట. 146 00:08:48,071 --> 00:08:51,491 లేదా షార్కులకు సహాయం చేయకుండా జనం ఉదాసీనతగా ఉండడం కూడా. 147 00:08:51,491 --> 00:08:53,285 నువ్వు దానిని తిప్పికొట్టిన విధానం నాకు నచ్చింది. 148 00:08:55,662 --> 00:08:58,540 నేను నీకు హాయం చేస్తాను, నాన్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. 149 00:08:59,416 --> 00:09:03,211 షార్కులు భయంకరంగా ఉండడం వల్లే జనం సహాయం చేయరు, కోరాజొన్సీటో. 150 00:09:03,795 --> 00:09:05,755 కాదు, వాటిని అర్థం చేసుకోవడం లేదు. 151 00:09:05,755 --> 00:09:08,800 కొన్ని భయంకరంగా ఉన్నాయని అవి కనుమరుగైపోవడానికి మనం ఒప్పుకోకూడదు. 152 00:09:08,800 --> 00:09:11,845 మనుషులు ఈ ప్రపంచంలోనే ఎపెక్స్ జీవులు, 153 00:09:11,845 --> 00:09:15,015 అంటే ఈ జీవ వ్యవస్థ నాశనమైపోకుండా కాపాడడం మన పని. 154 00:09:15,015 --> 00:09:16,266 మనం అది చేయనే చేయడం లేదు. 155 00:09:20,353 --> 00:09:22,355 ఆమె ప్రపంచాన్ని కాపాడాలని చాలా బలంగా కోరుకుంటుంది. 156 00:09:45,045 --> 00:09:48,465 నువ్వు భయంకరంగా లేవు. జనం నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే. 157 00:09:52,052 --> 00:09:53,470 నేను నిన్ను నిరాశపరిచినందుకు క్షమించు. 158 00:09:54,971 --> 00:09:59,559 పట్టు వదలకు. ఇంకా సమయం ఉంది. 159 00:10:00,143 --> 00:10:01,645 దాని స్వరం అలా అస్సలు ఉండదు. 160 00:10:04,272 --> 00:10:05,523 అలాగా. 161 00:10:07,025 --> 00:10:08,985 అలాగే ప్రపంచానికి ఉన్న సమయం కూడా మించిపోతుంది. 162 00:10:09,778 --> 00:10:13,907 నువ్వు మార్చలేని విషయాల గురించి చింతించడం మానుకుంటావని నా కోరిక. 163 00:10:13,907 --> 00:10:15,784 కానీ అదే అసలు విషయం, టాటా. 164 00:10:15,784 --> 00:10:19,746 మనం మార్చగలం. కాస్త ఆసక్తి చూపించాలి అంతే. 165 00:10:19,746 --> 00:10:22,040 మన చింత ఒక విషయాన్ని మార్చే విధంగా మనల్ని 166 00:10:22,040 --> 00:10:24,167 నడిపిస్తుంది అంటే చింతించడంలో తప్పు లేదు. 167 00:10:24,167 --> 00:10:26,545 నువ్వు బాగా ఇష్టపడే ఆ ఆవిడ లాగా? 168 00:10:26,545 --> 00:10:30,257 జేన్ గుడ్ఆల్ ఈ ప్రపంచాన్ని మార్చి జంతువులను కాపాడడానికి ప్రయత్నిస్తోంది. 169 00:10:30,257 --> 00:10:31,591 నేను కూడా అదే చేయాలని అనుకుంటున్నాను. 170 00:10:31,591 --> 00:10:33,051 నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? 171 00:10:34,636 --> 00:10:37,305 మనం సముద్రంలో అతిగా చేపలు పట్టి మితిమీరి చేపల్ని చంపేస్తుండడంతో 172 00:10:37,305 --> 00:10:39,349 షార్కులు ఇబ్బందుల్లో పడ్డాయి. 173 00:10:39,349 --> 00:10:42,978 మనం గనుక అవి ఎలా బ్రతుకుతాయో తెలుసుకుంటే, మనము వాటిని ఎలా కాపాడాలో తెలుసుకోగలం. 174 00:10:43,895 --> 00:10:45,397 అవును. 175 00:10:45,397 --> 00:10:48,275 అందుకే మీరు ఒక దానిని ట్యాగ్ చేయాలి అనుకున్నారు, అప్పుడు దాన్ని ఫాలో అవ్వొచ్చు అని కదా? 176 00:10:48,275 --> 00:10:49,401 అవును! 177 00:10:49,401 --> 00:10:52,237 కానీ మేము ప్రయత్నించిన ప్రతీసారి, మా ప్రయత్నం విఫలమైంది. 178 00:10:52,237 --> 00:10:55,907 నేను మిగతా వారు అందరూ ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, 179 00:10:56,908 --> 00:10:58,410 వాళ్ళలా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. 180 00:10:59,536 --> 00:11:02,497 బహుశా నువ్వు ఒక వ్యక్తిలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఏమో. 181 00:11:03,331 --> 00:11:04,332 నాకు అర్థం కాలేదు. 182 00:11:04,332 --> 00:11:08,670 బహుశా నువ్వు కొంచెం ఆ షార్కులాగ ఆలోచించాలి ఏమో. 183 00:11:09,963 --> 00:11:12,299 ఒక షార్కులాగ. 184 00:11:12,299 --> 00:11:13,550 థాంక్స్, టాటా. 185 00:11:14,092 --> 00:11:15,093 మేము వెంటనే వస్తాం. 186 00:11:19,431 --> 00:11:20,640 నన్ను తినేయకు! 187 00:11:20,640 --> 00:11:23,560 సారి. మీ నాన్నకు ఇంకా కోపంగా ఉందా? 188 00:11:25,312 --> 00:11:28,106 మా డాడీ వంటల కోసం షాపింగ్ కి వచ్చిన ప్రతీసారి ఆయనకు కంగారు ఎక్కువవుతుంది. 189 00:11:30,358 --> 00:11:31,359 ఆయనే వదులుకుంటాడులే. 190 00:11:31,985 --> 00:11:34,279 మన షార్క్ కి ట్యాగ్ ఎలా అంటించాలో నాకు ఒక ఐడియా వచ్చింది. 191 00:11:34,279 --> 00:11:36,615 ఆ పనిలో కొంచెం యాక్షన్ ఇంకా ప్రమాదం ఉంటుందా? 192 00:11:36,615 --> 00:11:37,908 అవును. 193 00:11:37,908 --> 00:11:39,117 -అయితే నేను రాను. -ఏంటి? 194 00:11:39,117 --> 00:11:42,871 జోక్ చేశా. నాకు ప్రమాదం లేనంత సేపు నేను తప్పక వస్తాను. 195 00:11:43,955 --> 00:11:45,332 నేను ప్రమాదంలో ఉంటానా? 196 00:11:45,916 --> 00:11:47,918 సీల్ లా నువ్వు ఎంత బాగా శబ్దాలు చేయగలవు? 197 00:11:47,918 --> 00:11:49,294 ఆ శబ్దాలు చేయడంలో నేను బెస్ట్. 198 00:11:53,757 --> 00:11:54,883 గట్టిగానా? 199 00:11:57,469 --> 00:11:58,470 డేవిడ్. 200 00:12:00,722 --> 00:12:03,099 -నా గొంతులో ఏదో ఉంది. -ఆహ్-హాహ్. 201 00:12:04,809 --> 00:12:05,810 సరే, మన ప్లాన్ ఏంటి? 202 00:12:07,687 --> 00:12:10,398 ఇక పని ముగిద్దాం. 203 00:12:12,359 --> 00:12:13,944 నువ్వు కాస్త సీరియస్ గా అరవాలి. 204 00:12:17,781 --> 00:12:19,199 ఏమైనా కనిపించిందా, గ్రేబియర్డ్? 205 00:12:24,162 --> 00:12:26,331 సరే. నీకు అది కనిపిస్తే చెప్పు. 206 00:12:32,254 --> 00:12:34,214 అలాగే దృష్టి మళ్ళించకు. 207 00:12:38,969 --> 00:12:40,512 అర్థమైందా? 208 00:12:51,606 --> 00:12:53,817 {\an8}చేపలు 209 00:12:55,443 --> 00:12:58,488 చేప ఒక్కటే ఉంది. నాకు ఇంకా సత్తా ఉంది. 210 00:13:08,123 --> 00:13:11,167 నేను ఒక గ్రేట్ వైట్ షార్కును ఆకర్షించడానికి ఒక సీల్ లా నటిస్తున్నాను, 211 00:13:11,167 --> 00:13:12,752 అది వస్తే నా బెస్ట్ ఫ్రెండ్ దానిని ట్యాగ్ చేస్తుంది. 212 00:13:14,004 --> 00:13:15,005 బాగా చేసావు. 213 00:13:21,887 --> 00:13:23,513 అది వచ్చినట్టు ఆచూకీ ఇంకా తెలీలేదా, గ్రేబియర్డ్? 214 00:13:24,347 --> 00:13:25,974 గ్రేబియర్డ్, ఉన్నావా? 215 00:13:31,897 --> 00:13:33,648 గ్రేబియర్డ్, వినిపిస్తుందా? ఓవర్. 216 00:13:36,359 --> 00:13:37,360 జేన్? 217 00:13:40,238 --> 00:13:42,490 బహుశా నేను సీల్ లాగే కదిలితే మంచిదేమో? 218 00:13:46,119 --> 00:13:47,871 గ్రేబియర్డ్, స్పందించు! 219 00:13:55,712 --> 00:13:58,089 చేపల సెక్షన్ ఎక్కడ ఉందో తెలుసా? 220 00:14:00,884 --> 00:14:02,928 అది వస్తుంది అని గ్రేబియర్డ్ చెప్పింది. 221 00:14:02,928 --> 00:14:05,013 కనీసం అది నన్ను కింద నుండి వేటాడలేదు. 222 00:14:05,639 --> 00:14:09,017 షార్కులా ఆలోచించాలి. కింద నుండి వేటాడాలి. 223 00:14:31,831 --> 00:14:32,832 దొరికింది! 224 00:14:33,541 --> 00:14:34,542 సూపర్! 225 00:14:41,466 --> 00:14:42,634 గ్రేబియర్డ్. 226 00:14:50,559 --> 00:14:54,020 డబ్బులు చెల్లించే వరకు ఆగలేకపోయావా, గ్రేబియర్డ్? 227 00:14:54,020 --> 00:14:55,313 దీనికి ఆకలి వేసింది. 228 00:15:00,360 --> 00:15:02,112 చాలా చేపలు కొన్నారు. 229 00:15:02,821 --> 00:15:04,948 అంటే, కెవిన్ కి సిఫుడ్ పేయ చేయడం అంటే బాగా ఇష్టం. 230 00:15:07,075 --> 00:15:08,076 ఏమైంది? 231 00:15:08,702 --> 00:15:12,706 షార్కులు ఇబ్బందుల పాలు కావడంలో ప్రాముఖ్యమైన కారణాలలో ఒకటి అతిగా చేపలు పట్టడమే. 232 00:15:12,706 --> 00:15:14,583 చేపలు లేకపోతే, షార్కులు ఉండవు. 233 00:15:14,583 --> 00:15:17,711 అంటే, అవి ఈ రొయ్యలను మిస్ అవ్వవు కదా? 234 00:15:18,503 --> 00:15:21,798 లేదు, కానీ ఆ రొయ్యలను తినే చేపలు, అలాగే ఆ చేపలను తినే సీల్స్, ఇక చివరిగా 235 00:15:21,798 --> 00:15:24,885 ఆ సీల్స్ ని తినే షార్కులు. మనందరికీ ఒక కనెక్షన్ ఉంది. 236 00:15:28,513 --> 00:15:30,098 ఇది మీ నాన్న లిస్టులో ఉంది. 237 00:15:30,974 --> 00:15:33,727 వీళ్ళు ఒక గ్రేట్ వైట్ షార్క్ ని కాపాడగలం అని ఊహించగలిగినప్పుడు, 238 00:15:33,727 --> 00:15:35,979 మనం కూడా అప్పుడప్పుడూ వేరే వాటిని 239 00:15:35,979 --> 00:15:38,899 తినే ధైర్యం చేయగలం అని నాకు అనిపిస్తోంది. 240 00:15:38,899 --> 00:15:40,442 వారానికి ఒకసారి మాంసం తినకపోవడం 241 00:15:40,442 --> 00:15:43,778 లేదా తిన్నా వాతావరణానికి హాని కలిగించని మాంసం మాత్రమే తినడం లాంటిది. 242 00:15:44,905 --> 00:15:46,907 మీ నాన్న కూడా దీనికి ఒప్పుకుంటాడు అని నాకు అనిపిస్తుంది. 243 00:15:48,116 --> 00:15:50,410 మీ దగ్గర వాతావరణ అనుకూల చేపలు ఏమైనా ఉన్నాయా? 244 00:15:50,410 --> 00:15:51,494 ఇలా రండి. 245 00:15:56,291 --> 00:15:57,876 ఇందులోకి ఈ చిప్స్ ఎలా వచ్చాయి? 246 00:16:12,974 --> 00:16:16,102 ఆ సాటిలైట్ ట్యాగింగ్ సిగ్నల్ చాలా స్పష్టంగా వస్తోంది. 247 00:16:20,357 --> 00:16:21,691 అది ఎక్కడికి వెళ్తోంది? 248 00:16:21,691 --> 00:16:23,109 త్వరలోనే తెలియాలని కోరుకో. 249 00:16:26,780 --> 00:16:28,240 అది మన చుట్టూ తిరిగి వచ్చిందా? 250 00:16:28,240 --> 00:16:30,742 లేదు, అది ఇంకా మనకు ముందే ఉంది. 251 00:16:32,827 --> 00:16:34,120 ఇంకొకటి ఉంది చూడు. 252 00:16:38,541 --> 00:16:41,545 -అవి దానికన్నా చిన్నగా ఉన్నాయి. -దానర్థం... 253 00:16:41,545 --> 00:16:42,629 అవి మగ షార్కులు. 254 00:16:42,629 --> 00:16:45,340 ఎందుకంటే ఆడ షార్కులు మగ వాటికన్నా చిన్నగా ఉంటాయి. 255 00:16:46,424 --> 00:16:48,426 అవి పిల్లల్ని కనడానికి ఇక్కడికే వస్తాయి అనుకుంట. 256 00:16:51,513 --> 00:16:54,057 ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు. 257 00:16:57,686 --> 00:17:00,146 ఏంటి? నేను చిప్స్ తినొచ్చు అని మా నాన్న అన్నారు. 258 00:17:22,878 --> 00:17:24,795 గ్రేట్ వైట్ షార్కులను కాపాడడానికి సహాయం చేయండి. 259 00:17:30,135 --> 00:17:32,053 ఆగు, టాటా. నేను ఇప్పుడే వస్తాను. 260 00:17:32,679 --> 00:17:36,016 -ఎక్కడికి వెళ్తున్నావు? -నేను కార్లి జాక్సన్ తో మాట్లాడాలి. 261 00:17:36,016 --> 00:17:37,100 అది ఎవరు? 262 00:17:37,100 --> 00:17:39,728 ఆమె షార్కులపై అధ్యాయనం చేసే మెరైన్ బయోలజిస్టు. 263 00:17:39,728 --> 00:17:41,104 మనం షార్కులకు సహాయం చేసాం కదా? 264 00:17:41,104 --> 00:17:43,064 అవును, కానీ మనము ఇంకా చాలా చేయగలం. 265 00:17:43,064 --> 00:17:46,735 సరే, కానీ మరీ ఎక్కువ సమయం తీసుకోకు, కోరాజొన్సీటో. త్వరలోనే భోజనం సిద్ధం అవుతుంది. 266 00:17:46,735 --> 00:17:47,986 సరే. 267 00:17:48,570 --> 00:17:50,989 -కార్లి. -హాయ్. నువ్వు జేన్ వి అయ్యుంటావు. 268 00:17:50,989 --> 00:17:54,117 అవును. షార్కుల గురించి మాట్లాడడానికి నాతో కలిసినందుకు థాంక్స్. 269 00:17:54,117 --> 00:17:57,245 ఏం పర్లేదు. నువ్వు నాకు అన్ని ఈమెయిల్స్ ఇంకా మెసేజ్ లు పంపిన తర్వాత 270 00:17:57,245 --> 00:17:59,164 నేను... కాదు అనలేను కదా? 271 00:17:59,164 --> 00:18:01,166 మీ పక్కన పచ్చగా ఉన్నవి ఏంటి? 272 00:18:01,166 --> 00:18:02,250 ఇక్కడ ఉన్నాయా? 273 00:18:02,918 --> 00:18:07,130 ఇది నేను పని చేస్తున్నప్పుడు వాడిన షార్క్ ట్యాగ్లు. 274 00:18:07,130 --> 00:18:09,674 మేము వీటిని షార్కుల రెక్కలకు తగిలిస్తాం, వాటి రెక్క మీద పెట్టిన 275 00:18:09,674 --> 00:18:12,177 చిన్న చెవి రింగులాగ ఉంటుంది. 276 00:18:12,677 --> 00:18:15,680 అలాగే ఈ ట్యాగ్ ల మీద మా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. 277 00:18:15,680 --> 00:18:17,682 కాబట్టి, ఎవరైనా ఆ షార్కును పట్టుకుంటే, 278 00:18:17,682 --> 00:18:20,727 వాళ్ళు మాకు ఫోన్ చేసి ఆ షార్కు ఎక్కడ దొరికిందో చెప్పగలరు. 279 00:18:20,727 --> 00:18:24,940 నిజానికి, నేను ఒక షార్కుకు ట్యాగ్ అంటించే వీడియోని తీసి చూపుతాను చూడు. 280 00:18:24,940 --> 00:18:26,942 ఇది ఒక బ్లాక్ టిప్ షార్కు. 281 00:18:26,942 --> 00:18:29,819 నువ్వు చూస్తున్నావు కదా, మేము ఆ షార్కు పొడవు ఎంత ఉందో చూస్తున్నాం. 282 00:18:29,819 --> 00:18:31,071 ఆ ట్యూబ్ దేనికి? 283 00:18:31,071 --> 00:18:34,950 ఆ ట్యూబ్ ద్వారా షార్క్ నోట్లోకి నీరు వెళ్తాయి, అప్పుడు అది ఊపిరి తీసుకోగలదు. 284 00:18:34,950 --> 00:18:37,077 అప్పుడు మేము షార్కుకి ట్యాగ్ అంటిస్తాము. 285 00:18:37,077 --> 00:18:40,330 మేము షార్కుతో పని పూర్తి చేసిన తర్వాత, దానిని నీళ్ళలోకి వదులుతాము, 286 00:18:40,330 --> 00:18:42,207 అప్పుడు అది ఆరోగ్యంగా తిరిగి ఈదుకుంటూ పోతుంది. 287 00:18:42,207 --> 00:18:44,042 మీరు షార్కులను మొదటిగా ఇష్టపడడం మొదలెట్టింది ఎప్పుడు? 288 00:18:44,042 --> 00:18:50,423 నాకు అప్పుడు అయితే లేదా ఆరేళ్ళు అనుకుంట, నేను షార్కుల మీద ఈ పుస్తకాన్ని చదివాను, 289 00:18:50,423 --> 00:18:52,384 చదివిన వెంటనే నాకు అవి తెగ నచ్చేసాయి. 290 00:18:52,384 --> 00:18:55,595 అప్పుడే నేను పెరిగి పెద్దదాన్ని అయ్యాకా ఒక షార్క్ శాస్త్రవేత్తని కావాలి అనుకున్నాను. 291 00:18:55,595 --> 00:18:57,180 మీరు ముందెప్పుడైనా షార్కుతో ఈదారా? 292 00:18:57,180 --> 00:18:59,599 ఆ వీడియో దొరుకుతుందేమో చూద్దాం. 293 00:18:59,599 --> 00:19:06,022 నేను బెలిజ్ లో ఉన్నాను, ఈ వీడియోలో నేను ఒక నర్స్ షార్కుతో ఈదుతున్నాను, 294 00:19:06,022 --> 00:19:07,691 అప్పుడు నేను నిజానికి నా రీసెర్చ్ చేస్తున్నాను. 295 00:19:07,691 --> 00:19:11,486 బోనులో లేకుండా షార్కుని చూస్తే డేవిడ్ చాలా భయపడతాడు. 296 00:19:11,486 --> 00:19:14,906 నిజానికి మనకు షార్కులు అంటే ఎంత భయమో షార్కులకు మనం అంటే అంతేకంటే భయం. 297 00:19:14,906 --> 00:19:18,076 చాలా సార్లు షార్కులు జనం మీద దాడి చేసినప్పుడు, 298 00:19:18,076 --> 00:19:21,079 అది పొరపాటునే జరుగుతుంది, ఎందుకంటే వాటి చూపు అంత బాగోదు. 299 00:19:21,079 --> 00:19:24,332 కాబట్టి అవి మనం ఆహారం అనుకుంటాయి, కానీ ఒకసారి కొరికిన తర్వాత, అవన్నీ, 300 00:19:24,332 --> 00:19:27,961 "దారుణంగా ఉంది," అనుకుని వెనక్కి పోతాయి, ఎందుకంటే తప్పు చేసాం అని వాటికి తెలుసు. 301 00:19:28,545 --> 00:19:31,006 జనం షార్కుని సముద్రంలో చూస్తే ఏం చేయాలి? 302 00:19:31,590 --> 00:19:34,259 నేనైతే ఎప్పుడూ వాటికీ దూరంగా ఉండమని చెప్తాను, అస్సలు ముట్టుకోకూడదు. 303 00:19:34,259 --> 00:19:38,638 షార్కుల మీద ఉన్న భయాన్ని వదిలి గౌరవాన్ని తెచ్చుకోవడం చాలా అవసరం. 304 00:19:38,638 --> 00:19:39,848 మనం వాటికి ఎలా సహాయం చేయగలం? 305 00:19:39,848 --> 00:19:43,643 చిన్న పిల్లలు షార్కులకు సహాయం చేయడానికి చాలా పనులు చేయొచ్చు. 306 00:19:43,643 --> 00:19:47,147 వాటిలో ఒకటి తగుమోతాదులో సముద్ర ఆహారాన్ని తినడం. 307 00:19:47,147 --> 00:19:50,942 ఆ ఆహారం పర్యావరణ అనుకూల ప్రదేశంలో మాత్రమే పట్టబడి 308 00:19:50,942 --> 00:19:53,987 కొన్ని జాతులను మితిమీతి పట్టడం లేదని నిర్ధారించుకోవాలి. 309 00:19:53,987 --> 00:19:56,281 కొంతమంది పిల్లలైతే ఇంకాస్త ముందడుగు వేసి, 310 00:19:56,281 --> 00:19:57,866 అనేక కార్యక్రమాలలో చేరుతున్నారు, 311 00:19:57,866 --> 00:20:02,662 అంటే షార్క్స్ 4 కిడ్స్ అనబడే కార్యక్రమం, పిల్లలను షార్కుల సంరక్షణలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తుంది. 312 00:20:02,662 --> 00:20:06,875 అలాగే డైసన్ ఛీ లాంటి యువ పర్యావరణ యోధులు కూడా ఉన్నారు. 313 00:20:06,875 --> 00:20:10,045 అతను నీటిలో నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసి మన సముద్రాలకు 314 00:20:10,045 --> 00:20:12,255 మేలు చేయడం కోసం పాటుపడుతున్నాడు. 315 00:20:12,255 --> 00:20:14,507 నేను కూడా నా సొంత సంస్థను ప్రారంభించాను... 316 00:20:14,507 --> 00:20:15,592 {\an8}మిస్ 317 00:20:15,592 --> 00:20:19,638 {\an8}...మైనారిటీస్ ఇన్ షార్క్ సైన్సెస్, మరొక ముగ్గురు నల్లజాతి మహిళా షార్క్ శాస్త్రవేత్తలతో కలిసి. 318 00:20:19,638 --> 00:20:22,515 ఎందుకంటే ఈ రంగంలో మాలాగా కనిపించే వారిని ఎవరినీ మేము ముందు చూసిందే లేదు, 319 00:20:22,515 --> 00:20:25,936 కాబట్టి మాలాగా ఇంకెవరూ ఫీల్ కాకూడదు అని మేము నిర్ణయించుకున్నాం. 320 00:20:25,936 --> 00:20:29,397 మా లక్ష్యం షార్క్ సైన్స్ లోనికి మరింత వైవిధ్యాన్ని తీసుకురావాలనే, 321 00:20:29,397 --> 00:20:33,318 ఎందుకంటే షార్క్ సైన్స్ మీద ఎంత మంది కలిసి పనిచేస్తే, 322 00:20:33,318 --> 00:20:34,819 అన్ని విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. 323 00:20:34,819 --> 00:20:36,905 తద్వారా మనం షార్కులను కాపాడగలం. 324 00:20:36,905 --> 00:20:39,616 మీరు మరింత మందిని షార్కులను కాపాడడానికి ప్రోత్సహించడం నాకు చాలా నచ్చింది. 325 00:20:39,616 --> 00:20:42,118 జేన్, భోజనము సిద్ధం! 326 00:20:42,118 --> 00:20:44,204 -వింటుంటే ఇక నువ్వు వెళ్ళాలి అనుకుంట. -నాకైతే వెళ్లాలనే లేదు. 327 00:20:44,204 --> 00:20:46,248 కానీ షార్కులకు సహాయం చేయడానికి నేను నాకు వీలైంది అంతా చేస్తాను. 328 00:20:46,248 --> 00:20:48,583 -నాతో మాట్లాడినందుకు థాంక్స్, కార్లి. -బై, జేన్. 329 00:20:48,583 --> 00:20:51,962 మర్చిపోకు, షార్కులు "ఫిన్-టాస్టిక్" జీవులు. 330 00:20:52,796 --> 00:20:55,298 డేవిడ్ కి ఆ జోక్ బాగా నచ్చుతుంది. బై! 331 00:20:58,051 --> 00:20:59,177 కార్కేరడాన్ కార్కేరియస్ 332 00:20:59,177 --> 00:21:01,763 గ్రేట్ వైట్ షార్కులు వాటి సమయంలో అధికభాగాన్ని ఎక్కడ గడుపుతాయో కనిపెట్టు. 333 00:21:08,103 --> 00:21:10,522 జేన్, నీ భోజనాన్ని గ్రేబియర్డ్ తినేస్తోంది! 334 00:21:11,606 --> 00:21:13,066 గ్రేబియర్డ్! 335 00:21:53,106 --> 00:21:55,108 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్