1 00:00:37,497 --> 00:00:39,249 "ఏసరోడెన్ జుబటస్." 2 00:00:46,006 --> 00:00:49,426 జేన్, గ్రేబియర్డ్, సిద్ధంగా ఉండండి. మనం డ్రాప్ జోన్ దగ్గరకు వచ్చేశాం. 3 00:00:51,553 --> 00:00:53,638 అలాగే, డేవిడ్. మేము దూకడానికి సిద్ధంగా ఉన్నాం. 4 00:00:59,686 --> 00:01:01,730 చిన్న మార్పు, నేను మాత్రమే సిద్ధంగా ఉన్నాను. 5 00:01:02,731 --> 00:01:04,648 ఇది కొంచెం భయంగా ఉంటుందని నాకు తెలుసు, గ్రేబియర్డ్, 6 00:01:04,648 --> 00:01:07,193 కానీ కింద మన సహాయం అవసరమైన ఒక జంతువు ఉంది. 7 00:01:07,193 --> 00:01:10,322 అంతేకాక, మన హై-టెక్ పారాచూట్స్ మనల్ని సురక్షితంగా దించుతాయి. 8 00:01:12,157 --> 00:01:16,620 మనం డ్రాప్ జోన్ కి వచ్చేశాం. ఎయిర్ డేవిడ్ విమానంలో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. 9 00:01:18,955 --> 00:01:20,332 నిన్ను కింద కలుస్తాను, మిత్రమా. 10 00:01:29,883 --> 00:01:32,177 చూస్తుంటే నీకు సహాయం అవసరం అనుకుంట, గ్రేబియర్డ్. 11 00:01:37,140 --> 00:01:39,226 వేకువనే బయటకొచ్చిన గబ్బిలానికి ఎర వెంటనే దొరుకుతుంది. 12 00:01:41,269 --> 00:01:43,813 అది వేకువనే బయటకు వచ్చిన పక్షికి ఎర వెంటనే దొరుకుతుంది అని కదా? 13 00:01:43,813 --> 00:01:47,817 ఇవాళ కాదు, ఎందుకంటే ఇవాళ మనం "ఏసరోడెన్ జుబటస్" కి సహాయం చేయబోతున్నాం. 14 00:01:49,069 --> 00:01:53,740 నేను చెప్తాను ఉండు, అది గబ్బిలాల శాస్త్రీయ నామం కదా. 15 00:01:53,740 --> 00:01:55,825 చెప్పాలంటే, భారీ గబ్బిలాలు. 16 00:01:55,825 --> 00:01:59,829 భారీ గబ్బిలమా? భారీగా ఉండేది దేనికైనా మన సహాయం ఏం అవసరం ఉంటుంది? 17 00:01:59,829 --> 00:02:02,332 ఎందుకంటే దురదృష్టవశాత్తు, వాటి సంఖ్య బాగా పడిపోయింది. 18 00:02:02,332 --> 00:02:04,584 కొన్ని జంతు జాతులు ప్రమాదంలో పడడానికి ముఖ్య కారణాలలో ఒకటి 19 00:02:04,584 --> 00:02:06,253 వాటికి ఆహార కొరత ఏర్పడడం వల్లే. 20 00:02:06,253 --> 00:02:08,921 కాబట్టి, మనం ముందుగా అవి ఏం తింటాయో కనిపెట్టాలి. 21 00:02:08,921 --> 00:02:10,090 అది చాలా ఈజీ. 22 00:02:10,090 --> 00:02:12,217 రక్తం. అందరికీ ఆ విషయం తెలిసిందే. 23 00:02:12,759 --> 00:02:14,135 భలే ల్యాండ్ అయ్యావు, గ్రేబియర్డ్. 24 00:02:21,351 --> 00:02:23,103 భారీ గబ్బిలం కనిపించింది. 25 00:02:25,480 --> 00:02:28,567 కాదు కాదు, భారీ గబ్బిలాలు కనిపించాయి. 26 00:02:30,569 --> 00:02:32,279 రిలాక్స్, గ్రేబియర్డ్. 27 00:02:32,279 --> 00:02:34,364 కొన్ని వాంపైర్ గబ్బిలాలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి, 28 00:02:34,364 --> 00:02:38,285 కానీ చాలా వరకు గబ్బిలాలు అన్నీ పళ్ళు, ఎలుకలు, చేపలు, బల్లులను... 29 00:02:38,285 --> 00:02:40,078 చింపాంజీలను తింటాయి. 30 00:02:40,078 --> 00:02:43,373 కాదు. ఇతర గబ్బిలాలను తింటాయి. 31 00:02:43,373 --> 00:02:46,126 ఛీ. మహా దారుణం. 32 00:02:46,126 --> 00:02:47,836 బ్రతకడానికి ప్రతిదానికీ ఆహారం కావాలి, డేవిడ్. 33 00:02:49,212 --> 00:02:52,215 ఈ గబ్బిలాలను జైంట్ గోల్డెన్-క్రోన్డ్ ఫ్లయింగ్ ఫాక్స్ లు అంటారు. 34 00:02:52,215 --> 00:02:54,968 అంటే, నా ఐడియా ప్రకారం ఇవి నక్కలు ఏం తింటాయో అవే తింటాయి అనుకుంటున్నా. 35 00:02:54,968 --> 00:02:57,721 -నక్కలు కూడా మిగతా నక్కలను తింటాయా? -లేదు. 36 00:02:58,889 --> 00:03:00,932 ఆహార లిస్టులో నుండి ఒక దానిని తీయొచ్చు అన్నమాట. 37 00:03:01,516 --> 00:03:04,102 నేను ఈ కెమెరాని ఆ గబ్బిలాలలో ఒకదానికి తగిలిస్తే, 38 00:03:04,102 --> 00:03:06,897 అప్పుడు అది ఏం తింటుందో కనిపెట్టి వాటికి ఎలా సహాయం చేయాలో తెలుసుకోవచ్చు. 39 00:03:06,897 --> 00:03:09,482 నీ వెనుక భాగాన్ని చూసుకో. అలాగే మెడని కూడా. 40 00:03:10,942 --> 00:03:12,736 జోక్ చేస్తున్నా, గ్రేబియర్డ్. 41 00:03:12,736 --> 00:03:16,698 అంతేకాక, ఇవి రాత్రుళ్ళు మాత్రమే తిరుగుతాయి, అంటే చీకటి పడేవరకు ఇవి పడుకొనే ఉంటాయి. 42 00:03:16,698 --> 00:03:17,824 మనకు చాలా టైమ్ ఉంది. 43 00:03:23,246 --> 00:03:24,539 అయ్యో. 44 00:03:30,837 --> 00:03:32,839 జేన్, నీకు వందల సార్లు చెప్పాను, 45 00:03:32,839 --> 00:03:35,634 "నేను ఆఫీసు కాల్ లో ఉన్నప్పుడు అరవడం, గోల చేయడం ఊళ పెట్టడం చేయకూడదు" అని. 46 00:03:35,634 --> 00:03:39,304 క్షమించు, అమ్మా, కానీ మేము ఫ్లయింగ్ ఫాక్స్ లు ఏం తింటాయో గమనించడానికి ఒకదానికి దాదాపుగా 47 00:03:39,304 --> 00:03:40,472 కెమెరా తగిలించగలిగాము. 48 00:03:40,472 --> 00:03:43,266 అది మీరు అనుకునేది కాదు. అవి గబ్బిలాలు అంతే. 49 00:03:43,266 --> 00:03:45,018 భారీ గబ్బిలాలు, నిజానికి. 50 00:03:45,018 --> 00:03:47,229 సరే. అలాగే, గుడ్ లక్. 51 00:03:47,229 --> 00:03:49,898 -కాకపోతే కొంచెం... -నిశ్శబ్దంగా ఉంటాం. 52 00:03:49,898 --> 00:03:52,317 మేము గబ్బిలం దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే నిశ్శబ్దంగానే ఉండాలి. 53 00:03:52,317 --> 00:03:56,655 నీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు, కానీ అరగంటలో భోజనం సిద్ధంగా ఉంటుంది. 54 00:03:57,322 --> 00:03:58,531 అలాగే, అలాగే. 55 00:03:58,531 --> 00:03:59,616 అవును, నేను లైన్ లో ఉన్నాను. 56 00:04:00,325 --> 00:04:01,785 జేన్! గ్రేబియర్డ్ ఎగిరిపోతుంది! 57 00:04:01,785 --> 00:04:03,078 ఓహ్, అయ్యో! గ్రేబియర్డ్! 58 00:04:03,078 --> 00:04:06,248 గ్రేబియర్డ్! భయపడకు! నేను వస్తున్నాను! 59 00:04:06,831 --> 00:04:08,124 ఆగండి, ప్లీజ్. 60 00:04:08,124 --> 00:04:10,085 జేన్, నేను నీకు ఇప్పుడు ఏం చెప్పాను? 61 00:04:10,627 --> 00:04:11,628 ఎక్కడికి పోతున్నావు? 62 00:04:11,628 --> 00:04:13,838 గ్రేబియర్డ్ బాల్కనీ నుండి ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్లిందో మాకు తెలీదు. 63 00:04:13,838 --> 00:04:17,466 చింతించకండి, జేన్ వాళ్ళ అమ్మా. మేము దానిని కనిపెడతాం. దానికి ఏమీ కాదు. 64 00:04:18,050 --> 00:04:21,304 అలాగే. మంచిది! భోజనానికి ఇంటికి వచ్చేయండి. 65 00:04:21,304 --> 00:04:22,806 ఏం వండుతున్నారు? 66 00:04:22,806 --> 00:04:24,224 నేను ఇంకా నిర్ణయించుకోలేదు! 67 00:04:24,224 --> 00:04:25,684 డేవిడ్, పదా. 68 00:04:25,684 --> 00:04:28,144 వండే దానిని బట్టి నేను మీ ఇంటికి భోజనానికి రావాలో వద్దో చూస్తున్నాను. 69 00:04:28,144 --> 00:04:29,187 పాస్తా? 70 00:04:29,938 --> 00:04:31,231 భోజనానికి కలుద్దాం! 71 00:04:33,233 --> 00:04:34,317 సరే. 72 00:04:39,030 --> 00:04:41,992 మనం ఎక్కడ నుండి మొదలెట్టాలి? గ్రేబియర్డ్ ఎక్కడైనా ఉండొచ్చు. 73 00:04:43,201 --> 00:04:45,287 మనం వేర్వేరుగా వెళ్తే ఎక్కువ చోట్ల వెతకొచ్చు. 74 00:04:49,749 --> 00:04:51,877 గ్రేబియర్డ్? గ్రేబియర్డ్, ఎక్కడ ఉన్నావు? 75 00:04:52,586 --> 00:04:54,129 గ్రేబియర్డ్? గ్రేబియర్డ్? 76 00:04:54,754 --> 00:04:56,673 -కనిపించిందా? -ఆచూకీ ఏం తెలీలేదు. 77 00:05:00,594 --> 00:05:02,012 అది ఇక్కడ కూడా లేదు. 78 00:05:03,680 --> 00:05:06,057 పాపం గ్రేబియర్డ్. చాలా భయపడుతూ ఉంటుంది. 79 00:05:06,057 --> 00:05:07,893 కచ్చితంగా భయపడుతూ ఉంటుంది. 80 00:05:07,893 --> 00:05:11,146 అది ఎక్కడ ఉందో కనిపించింది, కానీ చెప్తే నీకు అస్సలు నచ్చదు. 81 00:05:15,692 --> 00:05:19,529 అది ఎక్కడ ఉందో తెలిస్తే నాకు ఎందుకు నచ్చదు? ఈ తోట చాలా అందంగా ఉంది. 82 00:05:21,114 --> 00:05:22,866 ఇక్కడ ఎవరు ఉంటారో నీకు తెలీదా? 83 00:05:22,866 --> 00:05:25,076 అందరూ ఆమె ఇంట్లో నుండి అస్సలు బయటకు రాదు అంటారు. 84 00:05:25,076 --> 00:05:28,121 ఈ ప్రాంతం అంతటిలో ఆమె అంత చెడ్డ మనిషి ఎవరూ ఉండరు అని అన్నారు. 85 00:05:28,121 --> 00:05:29,581 -అలాగే అందరూ... -అందరూ అంటే ఎవరు? 86 00:05:30,165 --> 00:05:31,333 ఎక్కువగా నా చెల్లె. 87 00:05:32,667 --> 00:05:35,712 మనుషులు కూడా గబ్బిలాల గురించి చాలా అనుకుంటారు, కానీ అదంతా నిజం కాదు. 88 00:05:35,712 --> 00:05:37,756 ఇక్కడ ఉండే వ్యక్తి విషయంలో కూడా అదే నిజం కావచ్చు. 89 00:05:37,756 --> 00:05:39,841 అంటే, నాకు ఒక విషయం మాత్రం బాగా తెలుసు. 90 00:05:39,841 --> 00:05:42,677 ఈ ఇంట్లోకి వెళ్లిన ఏ వస్తువూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. 91 00:05:42,677 --> 00:05:43,887 చూశావా? 92 00:05:45,847 --> 00:05:47,390 దేనికైనా మొదటిసారి అంటూ ఉంటుందిలే. పదా. 93 00:05:59,402 --> 00:06:00,362 చెప్పాను కదా. 94 00:06:01,279 --> 00:06:02,530 బహుశా ఎవరూ ఇంట్లో లేరేమో. 95 00:06:06,826 --> 00:06:08,411 హలో, నేను జేన్ ని. 96 00:06:08,411 --> 00:06:09,496 ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, 97 00:06:09,496 --> 00:06:12,290 కానీ నా ఫ్రెండ్ గ్రేబియర్డ్ పారాచూట్ తో మీ ఇంటి వెనకాల వాలింది. 98 00:06:12,290 --> 00:06:14,000 దాన్ని మాకు వెనక్కి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం, ప్లీజ్. 99 00:06:16,586 --> 00:06:18,505 నా బొమ్మల్లో ఒకదానిని తీసుకుంటావా? 100 00:06:18,505 --> 00:06:20,465 మనం గ్రేబియర్డ్ ని ఇక్కడే వదిలేయకూడదు. 101 00:06:20,465 --> 00:06:22,676 అది ఇరుక్కుపోయింది. నువ్వే చూశావు కదా. 102 00:06:23,843 --> 00:06:26,054 -నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? -నా ఫ్రెండ్ ని తీసుకురావడానికి. 103 00:06:26,054 --> 00:06:27,847 ఆగు, జేన్. వద్దు. 104 00:06:29,474 --> 00:06:30,475 చీకటి పడుతోంది. 105 00:06:31,142 --> 00:06:33,103 మనం మీ ఇంట్లో భోజనం చేస్తూ ఈ విషయం మాట్లాడుకుందామా? 106 00:06:33,103 --> 00:06:35,480 మనం చిటికెలో వెళ్లి దానిని తీసుకుంటే ఆమె ఏమీ అనుకోదులే. 107 00:06:35,480 --> 00:06:37,148 ఆవిడ కచ్చితంగా అనుకుంటుంది. 108 00:06:43,780 --> 00:06:45,699 అలాగే ఉండు, గ్రేబియర్డ్. నిన్ను నేను కాపాడతాను. 109 00:06:45,699 --> 00:06:48,493 జేన్, త్వరగా. మనం ఇక్కడ ఉండగా దొరకకూడదు. 110 00:06:49,160 --> 00:06:50,370 దాదాపుగా వచ్చేసింది. 111 00:06:51,413 --> 00:06:52,581 హేయ్! 112 00:06:53,707 --> 00:06:55,750 అయ్యో. నేను దీనిని చింపేసాను. 113 00:06:55,750 --> 00:06:57,961 మిమ్మల్నే, నా గుమ్మంలో నుండి పోండి. 114 00:06:58,795 --> 00:07:02,424 -అయ్యో! -ఓహ్, అయ్యో. అయ్యయ్యో. 115 00:07:02,424 --> 00:07:04,467 -మేము వెళ్ళిపోతున్నాం. -పోండి. 116 00:07:04,467 --> 00:07:05,552 గార్డెన్ స్ప్రే 117 00:07:05,552 --> 00:07:06,887 మీరు పురుగుల మందులు వాడుతుంటారా? 118 00:07:06,887 --> 00:07:08,930 ప్రస్తుతం మనకు వేరే సమస్యలు ఉన్నాయి. 119 00:07:08,930 --> 00:07:11,725 వెళ్ళండి. వెంటనే! 120 00:07:11,725 --> 00:07:13,518 మీరు నా ఇంట్లోకి చొరబడ్డారు. 121 00:07:13,518 --> 00:07:15,103 క్షమించండి, మమ్మల్ని క్షమించండి! 122 00:07:20,817 --> 00:07:23,278 ఆగు, మనం గ్రేబియర్డ్ కోసం వెనక్కి వెళ్ళాలి. 123 00:07:23,945 --> 00:07:25,030 అదేంటి? 124 00:07:25,947 --> 00:07:27,282 ఒక ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలం! 125 00:07:28,074 --> 00:07:30,035 అవి పగటి పూట పడుకుంటాయి అన్నావు కదా? 126 00:07:30,035 --> 00:07:32,078 సాయంత్రాలే వాటి వేట మొదలెడతాయి. 127 00:07:32,078 --> 00:07:34,414 దాని రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడు. అది భలే ఉంది. 128 00:07:36,041 --> 00:07:38,627 నన్నడిగితే భయంకరంగా ఉంది అంటా. పరిగెత్తు! 129 00:08:11,868 --> 00:08:13,411 పదా! పదా! 130 00:08:13,411 --> 00:08:16,623 -బహుశా ఇవి మనుషులను తింటాయి ఏమో. -అవి పెద్దవే, కానీ మరీ అంత పెద్దవి కాదు. 131 00:08:19,501 --> 00:08:22,128 మనం కాపాడాలి అని చూసే ప్రతీది మనపై దాడి చేస్తోంది ఎందుకు? 132 00:08:22,128 --> 00:08:24,047 నాకైతే అది దాడి చేస్తుంది అని అనిపించడం లేదు. 133 00:08:24,047 --> 00:08:26,424 అంతేకాదు, ఇప్పుడు అది పోయినట్టు ఉంది. 134 00:08:26,424 --> 00:08:27,759 నిజంగానా? 135 00:08:27,759 --> 00:08:31,888 ఎందుకంటే నేను భోజనం తినడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాను కానీ నేనే భోజనం కావడానికి సిద్ధంగా లేను. 136 00:08:33,682 --> 00:08:35,058 ఏంటి? 137 00:08:37,435 --> 00:08:39,688 అది నన్ను పట్టుకుంది, కదా? 138 00:08:41,188 --> 00:08:42,440 అది నా రక్తాన్ని తాగేస్తుందా? 139 00:08:44,526 --> 00:08:45,819 తాగబోతుందా? 140 00:08:47,821 --> 00:08:50,740 మనుషుల రక్తాన్ని తాగే గబ్బిలాలు చాలా అరుదు. 141 00:08:50,740 --> 00:08:54,160 అంటే, బహుశా తాగొచ్చు. తాగొచ్చు అని చెప్పు. 142 00:08:54,828 --> 00:08:56,997 ఇందుకే నేను విమానంలోనే ఉండాలని అనుకున్నాను, జేన్. 143 00:08:57,664 --> 00:08:59,249 దీనిని నా మీద నుండి వదిలించు! 144 00:08:59,249 --> 00:09:01,626 నాకు దీని భారీ గోళ్లు గుచ్చుకుంటున్నాయి! 145 00:09:02,919 --> 00:09:04,546 నువ్వు ఇప్పుడు భలే కూల్ గా కనిపిస్తున్నావు. 146 00:09:06,214 --> 00:09:07,090 డేవిడ్! 147 00:09:14,389 --> 00:09:16,141 దానికి మన సహాయం అవసరం లేదనుకుంట, జేన్. 148 00:09:16,141 --> 00:09:18,935 మనం దానిని ఇంకా అర్థం చేసుకోవాలి. దాని జాతి ప్రమాదంలో ఉంది. 149 00:09:18,935 --> 00:09:21,271 అది నన్ను తినాలని అనుకుంటుందని నాకు అర్థమైంది. 150 00:09:21,271 --> 00:09:22,772 కాబట్టి ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నాను. 151 00:09:22,772 --> 00:09:25,483 ఆ మాట ఎంత వరకు నిజమో... మనకు తెలీదు. 152 00:09:26,568 --> 00:09:27,903 బహుశా మా అమ్మ సహాయం చేయగలదేమో. 153 00:09:28,737 --> 00:09:30,447 అంతేకాక, భోజనం కూడా రెడీ అయ్యుంటుంది. 154 00:09:31,531 --> 00:09:33,867 తియ్యగా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నావా? 155 00:09:35,702 --> 00:09:38,663 అంటే, అవి రక్తం తాగుతాయా లేదో మీరు కనిపెట్టారా లేదా? 156 00:09:38,663 --> 00:09:39,956 -ఇంకా లేదు. -అవును. 157 00:09:40,457 --> 00:09:42,918 అది మా వెనుక రావడానికి ఇంకొక కారణం ఏదోకటి ఉండి ఉండాలి. 158 00:09:42,918 --> 00:09:45,921 వాంపైర్ గబ్బిలాలు కూడా సహజంగా మనుషుల రక్తాన్ని తాగవు. 159 00:09:45,921 --> 00:09:48,340 ఒకవేళ తాగినా, కేవలం మనుషులు పడుకున్నప్పుడు మాత్రమే. 160 00:09:48,340 --> 00:09:50,508 నేను ఇక బహుశా జీవితంలో మళ్ళీ పడుకోను. 161 00:09:51,760 --> 00:09:53,386 ఆ చీమ ఎక్కడి నుండి వచ్చింది? 162 00:09:53,887 --> 00:09:55,722 అలాగే అది కూడా. 163 00:09:57,224 --> 00:09:59,851 మీ ఇద్దరినీ చూసుకోండి. మీ ఒంటి నిండా చీమలే. 164 00:10:01,603 --> 00:10:02,646 ఇదే అయ్యుంటుంది! 165 00:10:02,646 --> 00:10:05,232 ఆ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలం మన వెంట పడడానికి ఇదే కారణం. 166 00:10:05,232 --> 00:10:07,317 బహుశా అది చీమలను తినాలని అనుకుని ఉంటుంది. 167 00:10:07,317 --> 00:10:10,153 సరే, కానీ మీరిద్దరూ ఎందుకు ఇంత జిడ్డుగా ఉన్నారు? 168 00:10:10,153 --> 00:10:12,239 మేము అనుకోకుండా కొన్ని పళ్ళను తొక్కేసాం. 169 00:10:12,239 --> 00:10:15,033 కానీ తిరిగి గ్రేబియర్డ్ ని ఎలా తెచ్చుకోవాలో నాకు ఒక ఆలోచన వచ్చింది, 170 00:10:15,033 --> 00:10:17,077 అలాగే ఆ పనిలో మనకు ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలం సహాయం చేస్తుంది. 171 00:10:18,161 --> 00:10:19,579 నాకు నీ విమానంలో ఒక భాగం కావాలి. 172 00:10:19,579 --> 00:10:21,581 ముందు మనం తినడం పూర్తి చేద్దామా? 173 00:10:21,581 --> 00:10:23,250 అలాగే ఆ చీమలను కూడా వదిలించుకోవాలి. 174 00:10:29,172 --> 00:10:31,007 ఇది కచ్చితంగా పనిచేస్తుంది అనుకుంటున్నావా? 175 00:10:33,009 --> 00:10:34,094 పనిచేయాలి. 176 00:10:40,976 --> 00:10:43,812 ఆమె గ్రేబియర్డ్ ని లోపలికి తీసుకెళ్లింది. ఆమె దానిని దొంగతనం చేసేసింది. 177 00:10:43,812 --> 00:10:45,272 చెడ్డది అని చెప్పాను కదా. 178 00:10:51,361 --> 00:10:52,904 మీరు నా బెస్ట్ ఫ్రెండ్ ని దొంగతనం చేశారు. 179 00:10:52,904 --> 00:10:54,531 నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ ని అని అనుకున్నానే. 180 00:10:55,115 --> 00:10:56,992 మీరు నా బెస్ట్ ఫ్రెండ్ లో ఒకరిని దొంగతనం చేశారు. 181 00:10:58,243 --> 00:11:01,621 నువ్వు లోనికి వచ్చి నా పండ్ల మొక్కని తొక్కేసావు, కాబట్టి మనిద్దరికీ చెల్లు అయిపోయింది. 182 00:11:01,621 --> 00:11:04,833 అది అనుకోకుండా జరిగింది. మీరు మమ్మల్ని భయపెట్టారు. 183 00:11:04,833 --> 00:11:06,585 నా ఇంటి వెనక్కి ఇద్దరు తెలీని వారు 184 00:11:06,585 --> 00:11:09,170 రహస్యంగా వస్తే నేను ఎంత భయపడి ఉంటాను అనుకుంటున్నావు? 185 00:11:09,170 --> 00:11:10,672 మేము బెల్ కొట్టాము. 186 00:11:11,214 --> 00:11:15,051 అంటే ఇంట్లో ఎవరూ లేకపోతే ఇష్టం వచ్చినట్టు లోనికి వచ్చేయడమేనా? 187 00:11:15,635 --> 00:11:17,095 మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? 188 00:11:20,098 --> 00:11:21,308 కొంచెం ఇక్కడి నుండి పోండి. 189 00:11:22,893 --> 00:11:24,895 ఆగండి! మేము మీకోసం ఒకటి తెచ్చాము. 190 00:11:26,396 --> 00:11:28,315 మేము తోక్కేసిన దానికి బదులుగా. 191 00:11:28,315 --> 00:11:31,318 నా పండ్ల మొక్కకి బదులు ఇంకొక మొక్క తెస్తే తప్ప నేనేం తీసుకోను. 192 00:11:31,902 --> 00:11:32,986 ఇది ఒక గబ్బిలం ఇల్లు. 193 00:11:33,778 --> 00:11:35,238 నా విమానంలో భాగం అది. 194 00:11:36,781 --> 00:11:39,159 మీరు మీ మొక్కలకు పురుగుల మందులు ఎందుకు వాడుతున్నారు? 195 00:11:40,118 --> 00:11:41,995 పురుగులను వదిలించుకోవడానికి. 196 00:11:41,995 --> 00:11:44,414 పురుగుల మందులు పర్యావరణానికి చాలా చెడ్డవి. 197 00:11:44,414 --> 00:11:46,374 ప్రతీదీ పర్యావరణానికి చెడ్డదే. 198 00:11:46,374 --> 00:11:48,710 అది నిజం కాదు. చూడండి. 199 00:11:49,920 --> 00:11:53,924 {\an8}"మన ఆహారాన్ని విషంతో పెంచుతూ అది మంచి ఐడియా అని ఎలా అనుకోగలం?" 200 00:11:53,924 --> 00:11:55,133 జేన్ గుడ్ఆల్ అలా అన్నారు. 201 00:11:55,842 --> 00:11:59,679 పురుగుల మందులు విషపూరితం. పురుగులను వదిలించుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. 202 00:11:59,679 --> 00:12:02,557 అంటే, గబ్బిలాలు చాలా పురుగులను తింటాయి. 203 00:12:06,895 --> 00:12:09,105 -అది గబ్బిలమా? -బొమ్మ అంత బాగా రాలేదు. 204 00:12:09,105 --> 00:12:11,566 కానీ ఒక్క గబ్బిలం ఉన్నా ఒక రాత్రిలో వేల పురుగులను తినగలదు, 205 00:12:11,566 --> 00:12:14,236 మీ అందమైన తోటని కాపాడడానికి ఒక్కటి ఉంటే చాలు. 206 00:12:15,153 --> 00:12:18,573 చిన్నవైనా, పెద్దవైనా చొరబడేవి నాకు ఇష్టం ఉండవు. 207 00:12:18,573 --> 00:12:19,491 ఇక ఉంటాను. 208 00:12:20,742 --> 00:12:21,743 నేను మీతో ఒక డీల్ చేస్తాను. 209 00:12:22,744 --> 00:12:25,121 ఈ రాత్రికి మీ ఇంటి వెనుక ఈ గబ్బిలం గూడుని పెట్టి 210 00:12:25,121 --> 00:12:27,707 మీ తోటలోకి పురుగులను తినడానికి గబ్బిలం వస్తుందో లేదో చూడడానికి ఒప్పుకోండి. 211 00:12:27,707 --> 00:12:29,417 ఇప్పుడు ఇక్కడ కెమెరా పెడతాం అంటున్నావా? 212 00:12:30,043 --> 00:12:33,505 పనిచేస్తే, మీరు ఈ బాక్సును ఉంచుకోవచ్చు, అప్పుడు మీరిక పురుగుల మందులు వాడాల్సిన పని ఉండదు. 213 00:12:33,505 --> 00:12:35,715 అప్పుడు నా గ్రేబియర్డ్ ని వెనక్కి ఇచ్చేస్తారా? 214 00:12:36,716 --> 00:12:37,968 ఒకవేళ పని చేయకపోతే? 215 00:12:37,968 --> 00:12:40,762 -మీరు గ్రేబియర్డ్ ఉంచుకోవచ్చు. -జేన్? 216 00:12:42,639 --> 00:12:45,308 సరే. ఒకటి చెప్పనా? డీల్. 217 00:12:46,393 --> 00:12:48,144 ఈ పురుగులను వదిలించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను... 218 00:12:51,940 --> 00:12:53,233 అలాగే మీ ఇద్దరినీ కూడా. 219 00:13:10,000 --> 00:13:10,834 అంతా బాగానే ఉందా? 220 00:13:12,043 --> 00:13:14,754 మేము ఒక గబ్బిలం గూడుని అలాగే డేవిడ్ వాళ్ళ నాన్న గారి పాత కెమెరాని అక్కడ పెట్టాము. 221 00:13:14,754 --> 00:13:16,590 అనుకున్నట్టే మేము వెతుకుతున్న గబ్బిలం వెనక్కి వచ్చి 222 00:13:16,590 --> 00:13:19,384 అది ఏం తింటుందో మేము కనిపెట్టగలిగితే మేము గ్రేబియర్డ్ ని వెనక్కి తెచ్చుకోగలం. 223 00:13:20,802 --> 00:13:22,387 మరి నీకు ఏం బాధగా లేదా? 224 00:13:24,014 --> 00:13:25,265 నేను దానిని చాలా మిస్ అవుతున్నాను. 225 00:13:25,932 --> 00:13:28,018 ఆవిడతో నన్ను మాట్లాడనివ్వొచ్చు కదా? 226 00:13:28,018 --> 00:13:29,185 నేను హ్యాండిల్ చేయగలను. 227 00:13:31,646 --> 00:13:32,647 నువ్వు చేయగలవని నాకు తెలుసు. 228 00:13:34,482 --> 00:13:36,192 కొంత మంది ఎందుకు అస్తమాను కోపంగా ఉంటారు? 229 00:13:39,195 --> 00:13:40,822 జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు, బుజ్జి. 230 00:13:40,822 --> 00:13:44,200 కొన్నిసార్లు జనం తమలో ఉన్న విషయాలను మార్చుకోవడానికి బదులు 231 00:13:44,200 --> 00:13:46,286 ప్రపంచం మీద కోపపడడానికే మొగ్గుచూపుతుంటారు, 232 00:13:47,954 --> 00:13:50,665 కానీ నువ్వు అలా అస్సలు కాదు. 233 00:13:53,752 --> 00:13:54,920 నేను ఇప్పుడే వస్తాను. 234 00:14:04,304 --> 00:14:06,640 ఇది నేను చిన్నప్పుడు పక్కన పెట్టుకొని పడుకున్న బొమ్మ. 235 00:14:07,974 --> 00:14:11,269 -దీనిని ఈ రాత్రికి నీ దగ్గర ఉంచుకుంటావా? -థాంక్స్, అమ్మా. 236 00:14:11,269 --> 00:14:12,187 లవ్ యు. 237 00:14:13,396 --> 00:14:14,439 ఐ లవ్ యు టూ. 238 00:14:18,151 --> 00:14:21,154 -హాల్ లో లైట్ ని ఆపడం మర్చిపోకు. -అలాగే. 239 00:15:08,493 --> 00:15:09,411 హాయ్. 240 00:15:10,870 --> 00:15:14,791 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 241 00:15:21,298 --> 00:15:22,299 గుడ్ మార్నింగ్. 242 00:15:23,216 --> 00:15:24,384 నువ్వు ఎలా అంటే అలాగే. 243 00:15:24,926 --> 00:15:28,805 ఈవిడ ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రాలు కూడా ఉత్సాహంగా ఉండే మనిషిలా లేదు. 244 00:15:31,308 --> 00:15:33,435 మేము లోనికి వచ్చి గబ్బిలాలు కెమెరాలో పడ్డాయో లేదో చూడొచ్చా? 245 00:15:34,227 --> 00:15:36,187 ఈ సారి అడిగినందుకు థాంక్స్. 246 00:15:37,772 --> 00:15:40,108 అంటే, నిన్న రాత్రి గబ్బిలం శబ్దాలు ఏమైనా విన్నారా? 247 00:15:40,609 --> 00:15:42,485 గబ్బిలం శబ్దం అంటే ఎలా ఉంటుంది? 248 00:15:48,992 --> 00:15:50,285 అడిగినందుకు క్షమించు. 249 00:15:51,119 --> 00:15:52,621 నేను విన్న ఒకే ఒక్క గబ్బిలం గోల 250 00:15:52,621 --> 00:15:55,790 ఆ గబ్బిలాలు నా పెరట్లోని పురుగులను తింటాయి అని మీరు చెప్పిన సలహా మాత్రమే. 251 00:15:55,790 --> 00:15:57,334 మీరు ఆశ్చర్యపోవచ్చు. 252 00:16:01,963 --> 00:16:04,299 నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది పని చేసింది. 253 00:16:04,299 --> 00:16:07,385 ఇది మంచి విషయమే, కానీ ఇది టౌన్సెండ్స్ పెద్ద చెవుల గబ్బిలంలా ఉంది. 254 00:16:07,385 --> 00:16:09,346 కచ్చితంగా మనం వెతుకుతున్న ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలం కాదు. 255 00:16:10,013 --> 00:16:11,514 చాలా ముద్దుగా ఉంది... 256 00:16:12,641 --> 00:16:15,018 వికారమైన విధానంలో. 257 00:16:15,560 --> 00:16:16,561 అలాగే చాలా సహాయం చేస్తుంది కూడా. 258 00:16:16,561 --> 00:16:20,106 అంతేకాక, గబ్బిలాలు రాత్రుళ్ళు మాత్రమే వేటాడతాయి, కాబట్టి అవి మనకు పెద్దగా కనిపించవు. 259 00:16:20,106 --> 00:16:22,067 అయితే నేను ఆ గబ్బిలం డబ్బాను ఉంచుకుంటాను. 260 00:16:22,067 --> 00:16:23,902 అలాగే పురుగుల మందులు వాడడం మానేస్తారా? 261 00:16:25,070 --> 00:16:26,279 ఇవి ఎలా పని చేస్తాయో చూసి నిర్ణయిస్తా. 262 00:16:26,279 --> 00:16:27,781 అది చాలా మంచి మొదటి అడుగు. 263 00:16:27,781 --> 00:16:30,325 మేము ఇంకా ఆ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలు ఏం తింటాయో కనిపెట్టాల్సి ఉంది. 264 00:16:30,325 --> 00:16:33,828 అది పురుగులను తినకపోతే, అప్పుడు వేరే విధమైన మాంసం లేదా పళ్ళను తింటుందేమో. 265 00:16:33,828 --> 00:16:35,205 లేదా మనుషులను కూడా. 266 00:16:35,205 --> 00:16:39,000 డీల్ అంటే డీల్. నేను వెళ్లి నీ కోతి ఫ్రెండ్ ని తీసుకొస్తాను. 267 00:16:39,000 --> 00:16:40,919 -అది చింపాంజీ. -రెండూ ఒక్కటే. 268 00:16:40,919 --> 00:16:43,380 చింపాంజీలను ఏప్ లు అంటారు, కోతులు కాదు... 269 00:16:45,632 --> 00:16:46,633 పట్టించుకోకండి! 270 00:16:47,133 --> 00:16:49,553 మరి, మనం ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలానికి ఎలా సహాయం చేయగలం? 271 00:16:49,553 --> 00:16:51,471 మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. 272 00:16:51,471 --> 00:16:54,891 మాట ఇచ్చినట్టే, ఒక స్టఫి. 273 00:16:56,601 --> 00:16:57,602 థాంక్స్. 274 00:16:59,813 --> 00:17:02,148 హలో, గ్రేబియర్డ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. 275 00:17:03,316 --> 00:17:04,316 ఆగండి. 276 00:17:05,526 --> 00:17:06,987 మీరు దీనికి కుట్లు వేశారా? 277 00:17:08,237 --> 00:17:09,531 బహుశా దానికి అదే బాగయిందేమో. 278 00:17:10,114 --> 00:17:11,908 మీరు రహస్యంగా చాలా మంచోళ్ళు కదా? 279 00:17:13,535 --> 00:17:15,870 ఒక్క క్షణం ఆగు. నేను మీకు ఒకటి ఇవ్వాలి. 280 00:17:21,126 --> 00:17:23,378 హేయ్, మిత్రమా. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. 281 00:17:24,170 --> 00:17:26,214 నేను నిన్ను ఇంకెప్పటికీ నా దగ్గర నుండి పోనివ్వను. 282 00:17:28,300 --> 00:17:29,634 మీరు వెళ్ళడానికి ముందు, 283 00:17:30,802 --> 00:17:34,806 మీ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలానికి పండ్లు నచ్చుతాయో లేదో చూడడానికి ఇవి మీకు సహాయపడొచ్చు అనిపించింది. 284 00:17:34,806 --> 00:17:35,974 వీటిని మందులు లేకుండా పెంచాను. 285 00:17:35,974 --> 00:17:38,435 ఒక టేస్ట్ టెస్టు. మంచి ఐడియా. 286 00:17:38,435 --> 00:17:40,437 ఇప్పుడు మనకు మాంసం ఒక్కటి ఉంటే చాలు. 287 00:17:45,567 --> 00:17:48,612 నారింజలు అలాగే హాట్ డాగ్స్, సిద్ధంగా ఉన్నాయి. 288 00:17:48,612 --> 00:17:51,364 నాకు చాలా ఆకలిగా ఉంది. 289 00:17:51,364 --> 00:17:52,449 డేవిడ్! 290 00:17:52,449 --> 00:17:55,201 ఏంటి? చాలా సేపటి నుండి ఇదే చేస్తున్నాం. 291 00:17:56,494 --> 00:17:57,871 డేవిడ్, మనం ఓర్పుగా ఉండాలి, 292 00:17:57,871 --> 00:18:00,665 అప్పుడే ఫ్లయింగ్ ఫాక్స్ కి పండ్లు ఇష్టమో లేక మాంస ఇష్టమో తెలుస్తుంది. 293 00:18:02,167 --> 00:18:04,044 గ్రేబియర్డ్, అది మన ఎర. 294 00:18:04,044 --> 00:18:05,795 అలాగే ఆ ఫ్లయింగ్ ఫాక్స్ కూడా వచ్చింది. 295 00:18:05,795 --> 00:18:06,922 గ్రేబియర్డ్, చూసుకో! 296 00:18:11,051 --> 00:18:12,219 ఓహ్, అయ్యో! 297 00:18:15,055 --> 00:18:17,474 ఫ్లయింగ్ ఫాక్స్ పళ్ళను లేదా మాంసాన్ని తినడం లేదు. 298 00:18:17,474 --> 00:18:21,019 కానీ అది కచ్చితంగా రక్తాన్ని తాగుతుంది, అలాగే ఇప్పుడు దానికి గ్రేబియర్డ్ రక్తం కావాలని ఉంది. 299 00:18:22,270 --> 00:18:23,730 పారిపో, గ్రేబియర్డ్! 300 00:18:27,067 --> 00:18:28,193 పారిపో, గ్రేబియర్డ్! 301 00:18:31,988 --> 00:18:33,031 చూసుకో! 302 00:18:34,783 --> 00:18:36,576 వెళ్ళు, గ్రేబియర్డ్! వెళ్ళు! 303 00:18:36,576 --> 00:18:37,744 వెళ్ళు, వెళ్ళు! 304 00:18:37,744 --> 00:18:39,579 ఆ గబ్బిలానికి ఏం కావాలి? 305 00:18:39,579 --> 00:18:42,832 అది గ్రేబియర్డ్ వెంట పడడం లేదు, అలాగే అది మన మీద ఉన్న చీమల కోసం కూడా రాలేదు. 306 00:18:44,876 --> 00:18:46,294 అది పండు కోసం వచ్చింది! 307 00:18:46,294 --> 00:18:50,382 ఆ ఫ్లయింగ్ ఫాక్స్ నీ వెంట పడడం లేదు, గ్రేబియర్డ్! దానికి ఆ పండు కావాలి! 308 00:18:50,382 --> 00:18:51,675 దాన్ని విసిరేయ్! 309 00:18:56,179 --> 00:18:58,056 పదా, గ్రేబియర్డ్. ఇలా వచ్చెయ్. 310 00:19:04,771 --> 00:19:06,314 నీకు పండంటి తెలివితేటలు ఉన్నాయి కదా, జేన్? 311 00:19:06,314 --> 00:19:09,109 -అర్థమైందా? నీకు పండంటి... -అర్థమైంది. 312 00:19:14,364 --> 00:19:18,743 అంతే. రక్తం కంటే చాలా రుచిగా ఉంది, కదా? 313 00:19:30,672 --> 00:19:31,673 ఏం జరుగుతోంది? 314 00:19:31,673 --> 00:19:34,175 ఆమె అందరికీ వాళ్ళ వస్తువులు తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఉంది. 315 00:19:35,468 --> 00:19:36,469 అవునా? 316 00:19:37,888 --> 00:19:39,431 గబ్బిలాల గురించి నేను అనుకున్నది తప్పని తెలిసింది, 317 00:19:39,431 --> 00:19:42,350 కాబట్టి పిల్లలు కూడా అంత దారుణమైన వారు అయ్యుండకపోవచ్చు అనిపించింది. 318 00:19:43,768 --> 00:19:45,854 మొదట వచ్చిన కొంతమంది చాలా భయపడ్డారు. 319 00:19:45,854 --> 00:19:48,982 విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో నాకు చాలా చెడ్డ పేరు ఉందంట. 320 00:19:48,982 --> 00:19:51,902 అవును. ఎవరైనా అంత మాట ఎలా నమ్మగలరు? 321 00:19:53,111 --> 00:19:57,032 -అలాగే? -గబ్బిలాల గురించి కూడా నేను తప్పుగానే అనుకున్నాను. 322 00:19:57,032 --> 00:19:59,409 -నేను కూడా అంతే. -అవును. 323 00:20:00,201 --> 00:20:02,078 మీరు మరిన్ని గబ్బిలాల గూళ్ళను పెట్టారా? 324 00:20:03,496 --> 00:20:05,206 అంటే, మొదటి దానికి తోడుగా ఇంకా ఉంటే మంచిది అనిపించింది. 325 00:20:08,335 --> 00:20:10,629 -అలాగే, నాపేరు రాబిన్. -జేన్. 326 00:20:13,048 --> 00:20:15,508 డేవిడ్. సదా మీ సేవలో. 327 00:20:17,427 --> 00:20:18,428 మీరు చేసిన అంతటికీ థాంక్స్. 328 00:20:19,971 --> 00:20:22,766 అయితే మనం మన కాలనిలో మరిన్ని గబ్బిలాల ఇళ్లను పెడదామా? 329 00:20:22,766 --> 00:20:23,892 మంచి ప్లాన్. 330 00:20:23,892 --> 00:20:26,311 కానీ ముందుగా, మనం ఫ్లయింగ్ ఫాక్స్ కి సహాయం చేయాలి. 331 00:20:34,069 --> 00:20:36,905 మనం దాదాపుగా వచ్చేసాం. ఇక మన కర్తవ్యాన్ని పూర్తి చేసే సమయమైంది. 332 00:20:40,283 --> 00:20:42,744 ఇప్పుడు అది ఏం తింటుందో మనకు తెలుసు కాబట్టి, మనం ఫ్లయింగ్ ఫాక్స్ కోసం 333 00:20:42,744 --> 00:20:45,330 మొక్కలు నాటి, దానికి పుష్కలంగా తిండి ఉండేలా చూస్తూ సహాయం చేయొచ్చు. 334 00:20:45,330 --> 00:20:46,790 పదా, గ్రేబియర్డ్. 335 00:20:46,790 --> 00:20:49,918 భయపడకు. ఈసారి మనం కలిసి దూకుదాం. 336 00:20:49,918 --> 00:20:52,837 నేను అన్నాను కదా, ఇంకెప్పటికీ నిన్ను కనిపెట్టుకోకుండా ఉండను. 337 00:20:52,837 --> 00:20:54,130 సిద్ధమా? 338 00:21:00,971 --> 00:21:02,222 అంతే! 339 00:21:07,185 --> 00:21:08,478 సూపర్! 340 00:21:15,569 --> 00:21:17,821 ఫ్లయింగ్ ఫాక్స్ లను కాపాడడానికి సహాయం చేయండి. 341 00:21:24,578 --> 00:21:27,038 -జేన్? -డేవిడ్? 342 00:21:27,038 --> 00:21:28,665 నువ్వు ఆమెతో మాట్లాడడం మొదలెట్టావా? 343 00:21:28,665 --> 00:21:29,958 లీసా పాగుంతలన్ తోనా? 344 00:21:29,958 --> 00:21:31,293 లేదు, ఇంకా కాదు. 345 00:21:31,293 --> 00:21:33,420 నేను వినడానికి వీలుగా వాకిని ఆన్ లో ఉంచుతావా? 346 00:21:33,420 --> 00:21:35,297 నాకు ఫ్లయింగ్ ఫాక్స్ ల గురించి అంతా తెలుసుకోవాలని ఉంది. 347 00:21:35,297 --> 00:21:38,008 -నిజానికి అవి గోల్డెన్ కిరీటం ఫ్లయింగ్ ఫాక్స్. -సరే. 348 00:21:38,008 --> 00:21:40,969 -నువ్వు ఎందుకు గుసగుసగా మాట్లడుతున్నావు? -నేను ఇప్పుడు పడుకొని ఉండాలి. 349 00:21:40,969 --> 00:21:44,097 లీసాతో మాట్లాడడానికి వీలుగా నువ్వు నిద్ర లేచి ఉండడానికి మీ అమ్మ ఒప్పుకోవడం భలే గొప్ప విషయం. 350 00:21:44,681 --> 00:21:46,892 ఆమె ఫిలిప్పీన్స్ లో ఉండడం భలే గొప్ప విషయం. 351 00:21:46,892 --> 00:21:48,476 అవి అక్కడ మాత్రమే ఉంటాయి మరి. 352 00:21:48,476 --> 00:21:50,770 అందుకే లీసాకి ఫ్లయింగ్ ఫాక్స్ ల గురించి అంతా తెలుసు. 353 00:21:50,770 --> 00:21:53,273 అవి నిజానికి గోల్డెన్ కిరీటం ఉన్న ఫ్లయింగ్ ఫాక్స్. 354 00:21:54,482 --> 00:21:55,650 ఆమె వచ్చింది! 355 00:21:56,443 --> 00:21:58,320 -హాయ్, లిసా. -హాయ్, జేన్. 356 00:21:58,320 --> 00:21:59,696 హాయ్, లిసా. 357 00:21:59,696 --> 00:22:01,031 అది ఎవరు? 358 00:22:01,031 --> 00:22:03,074 అది నా ఫ్రెండ్ డేవిడ్, వాకి టాకి ద్వారా మాట్లాడుతున్నాడు. 359 00:22:03,074 --> 00:22:04,743 వాడు కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. 360 00:22:04,743 --> 00:22:06,369 హాయ్, డేవిడ్. 361 00:22:06,369 --> 00:22:10,832 నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది, వాటిని గోల్డెన్ కిరీటం ఫ్లయింగ్ ఫాక్స్ అని ఎందుకు అంటారు? 362 00:22:10,832 --> 00:22:13,251 నేను నీకు ఒకటి చూపించగలనేమో చూస్తాను ఆగండి. 363 00:22:13,251 --> 00:22:14,336 ఇదుగోండి. 364 00:22:14,336 --> 00:22:17,464 -నేను కూడా చూడగలిగితే బాగుండు. -నేను నీకు తర్వాత లీసా పంపిన ఫోటోలు పంపుతాను. 365 00:22:17,464 --> 00:22:22,302 ఫిలిప్పీన్స్ లో ఉన్న 26 జాతుల పళ్ళను తినే గబ్బిలాలలో, 366 00:22:22,302 --> 00:22:26,348 దీని ఒక్కదానికే తన తల మీద "వి" ఆకారంలో 367 00:22:26,348 --> 00:22:29,351 ఒక బంగారు కిరీటం పెట్టినట్టు ఉంటుంది. 368 00:22:29,351 --> 00:22:30,560 భలే ముద్దొస్తుంది. 369 00:22:30,560 --> 00:22:33,271 మీరు ఈ మధ్య గోల్డెన్ కిరీటం ఫ్లయింగ్ ఫాక్స్ లను చూశారా? 370 00:22:33,271 --> 00:22:35,649 అవును, కొన్ని రోజుల క్రితమే. 371 00:22:35,649 --> 00:22:39,110 -నేను వాటిని కనుగొనడానికి బయటకు వెళ్ళినప్పుడు. -మీరు చాలా లక్కీ. 372 00:22:39,110 --> 00:22:41,154 కొన్ని గబ్బిలాల లాగ అవి రక్తాన్ని తాగకపోవడం మీ అదృష్టం. 373 00:22:41,154 --> 00:22:43,907 వాంపైర్ గబ్బిలాలు సహజంగా మనుషుల రక్తాన్ని తాగవు అని నీకు చెప్పాను కదా. 374 00:22:44,407 --> 00:22:46,534 గోల్డెన్ కిరీటం ఫ్లయింగ్ ఫాక్స్ లు పళ్ళను మాత్రమే తింటాయి, కదా? 375 00:22:46,534 --> 00:22:50,830 అవును. గోల్డెన్ కిరీటం ఫ్లయింగ్ ఫాక్స్ లు పళ్ళను తినడానికి ఇష్టపడతాయి, 376 00:22:50,830 --> 00:22:53,375 కానీ వాటికి అంజూర పళ్లంటే చాలా ఇష్టం. 377 00:22:53,375 --> 00:22:57,045 అవి తినే ఆహారంలో డెబ్భై తొమ్మిది శాతం అంజూరాలే ఉంటాయి. 378 00:22:57,045 --> 00:22:59,339 అలాగే అంజూర పళ్ళు కూడా గబ్బిలాలపై ఆధారపడి ఉంటయి, 379 00:22:59,339 --> 00:23:04,052 ఎందుకంటే ఈ ఫ్లయింగ్ ఫాక్స్ లే వాటి విత్తనాలను జల్లడంలో సహాయపడతాయి. 380 00:23:04,052 --> 00:23:06,471 అంటే అవి విత్తనాలు నాటే రైతుల్లాంటివి అన్నమాట. 381 00:23:06,471 --> 00:23:08,014 అది నిజమే, జేన్. 382 00:23:08,014 --> 00:23:11,059 అది టెలిస్కోపా? మీరు అంతరిక్షాన్ని కూడా పరిశోధిస్తుంటారా? 383 00:23:11,059 --> 00:23:12,143 అంతరిక్షం అంటే నాకు చాలా ఇష్టం. 384 00:23:12,143 --> 00:23:15,021 నిజానికి అది వాటిని గుర్తించడానికి వాడే స్కోప్. 385 00:23:15,021 --> 00:23:19,025 ఫ్లయింగ్ ఫాక్స్ లను గుర్తించి, వాటిని లెక్కబెట్టడానికి 386 00:23:19,025 --> 00:23:21,361 మేము నిజానికి దాన్నే వాడుతుంటాం. 387 00:23:21,361 --> 00:23:23,071 అదెలా చేస్తామో నేను చూపిస్తాను చూడు. 388 00:23:23,071 --> 00:23:25,949 మేము సాయంత్రం కావొస్తున్న సమయం వరకు ఎదురుచూడాలి. 389 00:23:25,949 --> 00:23:29,869 అప్పుడే గబ్బిలాలు అవి ఉంటున్న ఇళ్ల నుండి బయటకు వస్తాయి, 390 00:23:29,869 --> 00:23:31,913 అలాగే అప్పుడే మేము వాటిని లెక్కబెట్టగలం. 391 00:23:31,913 --> 00:23:33,248 అవి ఇంకా ఎన్ని ఉన్నాయి? 392 00:23:33,248 --> 00:23:37,586 ప్రస్తుతం ఇంకా 10,000 నుండి 20,000 గబ్బిలాల వరకు మాత్రమే 393 00:23:37,586 --> 00:23:39,504 ఫిలిప్పీన్స్ లో మిగిలి ఉన్నాయి. 394 00:23:39,504 --> 00:23:41,548 ఫ్లయింగ్ ఫాక్స్ ల జాతి ప్రమాదంలో ఎందుకు ఉంది? 395 00:23:41,548 --> 00:23:44,885 మనం వాటి నివాస ప్రాంతాలలోకి చొరబడడం గబ్బిలాలకు నచ్చదు. 396 00:23:44,885 --> 00:23:46,511 మనం వాటి నివాస స్థలాలను నాశనం చేస్తున్నాం. 397 00:23:47,012 --> 00:23:48,388 మనం వాటికి ఏ విధంగా సహాయం చేయగలం? 398 00:23:48,388 --> 00:23:51,182 సమాజాల అలాగే వాలంటీర్లకు ఉన్న శక్తిని 399 00:23:51,182 --> 00:23:53,602 మనం తక్కువగా అంచనా వేయకూడదు. 400 00:23:53,602 --> 00:23:58,607 గబ్బిలాల రక్షణ కోసం ముందుకు వచ్చిన ఈ ఫిలిపీనోలను ఒకసారి చూడండి. 401 00:23:58,607 --> 00:24:01,985 నేను వీళ్లకు గబ్బిలాలను ఎలా లెక్కించి గుర్తించాలో నేర్పుతుంటాను. 402 00:24:01,985 --> 00:24:04,654 ఇంకా కొన్ని ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాల 403 00:24:04,654 --> 00:24:09,784 కాలనీలు మనుగడలో ఉన్నాయి అంటే అందుకు కారణం వీళ్ళే. 404 00:24:09,784 --> 00:24:12,495 ఫిలిప్పీన్స్ లో ఉండే ఒక జాతి జంతువు అంతరించిపోతే 405 00:24:12,495 --> 00:24:16,958 అది కేవలం ఫిలిప్పీన్స్ లో ఉండే జీవవైవిధ్యానికి మాత్రమే నష్టం కాదు, 406 00:24:16,958 --> 00:24:19,461 అది ప్రపంచానికే నష్టం. 407 00:24:19,461 --> 00:24:22,756 ఎందుకంటే, ఎంతైనా మనం అందరం కనెక్ట్ అయి ఉన్నాం. 408 00:24:22,756 --> 00:24:24,966 కానీ ఇక్కడి నుండి మేము అక్కడ ఉన్నవాటికి ఎలా సహాయం చేయగలం? 409 00:24:24,966 --> 00:24:29,596 ఒక మంచి కథను పంచుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. 410 00:24:29,596 --> 00:24:33,683 గబ్బిలాలు అంటే భయపడే వారి మనసులు మారడానికి వీలవుతుంది. 411 00:24:33,683 --> 00:24:37,103 అలాగే ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడు పట్టించుకోవడం మొదలెడతాం. 412 00:24:37,103 --> 00:24:40,857 -మనం అది కచ్చితంగా చేయగలం, జేన్. -అవును, కచ్చితంగా. 413 00:24:40,857 --> 00:24:44,027 డేవిడ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? 414 00:24:44,527 --> 00:24:46,488 ఎవరూ లేరు. పడుకో, మిల్లి. 415 00:24:47,572 --> 00:24:49,866 నేను ఇక వెళ్ళాలి. థాంక్స్, లీసా. 416 00:24:49,866 --> 00:24:51,701 రేపు మాట్లాడుకుందాం, జేన్. 417 00:24:51,701 --> 00:24:53,203 మాతో మాట్లాడినందుకు థాంక్స్, లీసా. 418 00:24:53,203 --> 00:24:55,872 మేము కూడా మాకు వీలైనన్ని జంవుతులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం, 419 00:24:55,872 --> 00:24:57,791 అది ఇక్కడే అయినా లేక ఫిలిప్పీన్స్ లో అయినా సరే. 420 00:24:57,791 --> 00:24:58,917 గుడ్ నైట్. 421 00:25:00,460 --> 00:25:01,795 బై. 422 00:25:05,090 --> 00:25:07,717 {\an8}ఏసరోడెన్ జుబటస్ - మెగా గబ్బిలం ప్రపంచాన్ని కాపాడండి 423 00:25:11,304 --> 00:25:14,558 ది గోల్డెన్ కిరీటం ఉండే ఫ్లయింగ్ ఫాక్స్ లీసా పాగుంతలన్ 424 00:25:57,392 --> 00:25:59,394 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్