1 00:00:36,746 --> 00:00:38,915 "గేవియాలిస్ గెంజటికస్." 2 00:00:44,462 --> 00:00:45,797 ఏమైనా కనిపించిందా? 3 00:00:45,797 --> 00:00:47,883 జేన్ నేను కెప్టెన్ ని కావచ్చు అంది. 4 00:00:49,175 --> 00:00:51,928 నేను, "ఏమైనా కనిపించిందా?" అన్నాను. 5 00:00:52,804 --> 00:00:54,055 మనం ఇంతకీ దేనిని వెతుకుతున్నాం? 6 00:00:54,055 --> 00:00:55,015 ఒక ఘరియల్ కోసం. 7 00:00:55,599 --> 00:00:56,725 దాని గురించి మునుపెప్పుడూ వినలేదు. 8 00:00:56,725 --> 00:00:59,895 చాలా మంది విని ఉండరు. అవి ఇతర జంతువులకు దూరంగా ఉండడానికే ఇష్టపడతాయి. 9 00:00:59,895 --> 00:01:02,480 కానీ అవి డైనోసార్లకు సంబంధించిన సరీసృపాలు. 10 00:01:02,480 --> 00:01:05,150 -అవి చూడడానికి టీ. రెక్స్ లాగ ఉంటాయా? -లేదు. 11 00:01:05,150 --> 00:01:07,402 -ఒక ట్రైసెరాటాప్స్? -కాదు, చెప్పాలంటే... 12 00:01:07,402 --> 00:01:08,778 ఒక ప్యాచీసేఫలాసారస్? 13 00:01:08,778 --> 00:01:11,615 కాదు, చూడడానికి కొంచెం అలా ఉంటాయి! 14 00:01:14,576 --> 00:01:16,578 వింతైన ముక్కుతో ఉన్న మొసలి లాగా? 15 00:01:17,078 --> 00:01:19,122 అవి వింతైనవి కాదు. వ్యత్యాసమైనవి. 16 00:01:19,956 --> 00:01:22,334 అవి అనేక లక్షల సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నాయి. 17 00:01:22,334 --> 00:01:27,589 కానీ ఇప్పుడు ప్రపంచంలో అవి కేవలం దాదాపు 600 మాత్రమే మిగిలి ఉన్నాయి. 18 00:01:27,589 --> 00:01:28,840 కేవలం 600? 19 00:01:29,841 --> 00:01:31,218 పాపం వింత ముక్కులు ఉన్న ఘరియల్స్. 20 00:01:31,218 --> 00:01:34,763 -మనం వాటికి సహాయం చేయాలి. -కానీ ముందు, మనం వాటిని అర్థం చేసుకోవాలి. 21 00:01:34,763 --> 00:01:35,847 అంటే అర్థం... 22 00:01:38,433 --> 00:01:40,268 -మనం వాటిని ఫాలో అవ్వాలి. -త్వరగా! 23 00:01:43,939 --> 00:01:45,440 అయితే, దాని ముక్కు ఎందుకు పనికొస్తుంది? 24 00:01:45,440 --> 00:01:48,735 నాకు తెలీదు. ఇంకా. మనం ఇప్పుడు అది కనిపెట్టడానికే వచ్చాము. 25 00:01:48,735 --> 00:01:50,654 ఆ ముక్కుని ఫాలో అవుదాం. 26 00:01:51,821 --> 00:01:55,575 మరీ వేగంగా వెళ్తున్నాం అన్నాను! "వేగం ఎక్కువైంది!" అన్నాను. 27 00:01:56,576 --> 00:01:57,911 ఇది ఇరుక్కుపోయినట్టు ఉంది! 28 00:02:00,121 --> 00:02:01,498 మనం సమస్యలో చిక్కుకున్నాం. 29 00:02:01,498 --> 00:02:03,667 తెలుసు. మనం పని చేయాల్సింది అక్కడ. 30 00:02:04,834 --> 00:02:07,379 నాకు ఇక కెప్టెన్ గా ఉండడం ఇష్టం లేదు. 31 00:02:09,129 --> 00:02:10,882 వెనక్కి తిప్పు! వెనక్కి తిప్పు! 32 00:02:10,882 --> 00:02:13,552 చూస్తుంటే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నది ఘరియల్స్ మాత్రమే కాదు అనుకుంట! 33 00:02:19,599 --> 00:02:20,725 అమ్మా! 34 00:02:21,643 --> 00:02:24,145 నీ దృష్టిని ఆకర్షించాలంటే ఇంకేం చేయాలో తోచలేదు. 35 00:02:24,145 --> 00:02:25,689 నేను నిన్ను మూడు సార్లు పిలిచాను. 36 00:02:25,689 --> 00:02:28,024 కానీ చింపాంజీలు ఈత కొట్టలేవు అని నీకు తెలుసు కదా. 37 00:02:28,024 --> 00:02:30,235 నిజానికి నాకు తెలీదు, 38 00:02:30,235 --> 00:02:33,446 కానీ దానిని పూల్ దగ్గరకు తీసుకెళ్లింది నేను కాదు కదా. 39 00:02:33,446 --> 00:02:35,532 ఇది మాకు మా అన్వేషణలో సాయం చేస్తోంది. 40 00:02:35,532 --> 00:02:36,616 నిజంగా? 41 00:02:37,659 --> 00:02:41,079 ఇవాళ నీకున్న ఒకే ఒక్క పని నాతో కలిసి పని చేయడం. 42 00:02:41,079 --> 00:02:43,081 మన డీల్ ఏంటో నీకు తెలుసు. ముందు పని, తర్వాతే ఈత. 43 00:02:43,081 --> 00:02:46,167 నిన్ను ఈ వారాంతానికి మీ నాన్న అలాగే సాష వచ్చి తీసుకెళ్లడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. 44 00:02:46,167 --> 00:02:50,505 -అమ్మా, మేము ఏం చేయడా... -ముఖ్యమైన జంతువుని కాపాడుతున్నారా? నాకు తెలుసు. 45 00:02:50,505 --> 00:02:52,716 కానీ ఇప్పుడు నువ్వు కొన్ని కో-ఆప్ పనులు చేయాల్సి ఉంది. 46 00:02:52,716 --> 00:02:54,134 పదా. ఇక బయటకు రా. 47 00:03:03,810 --> 00:03:06,104 మనం ఇలా పనులు చేయాల్సిన బిల్డింగ్ లో ఎందుకు ఉంటున్నాం? 48 00:03:06,104 --> 00:03:07,898 ఎందుకంటే ఇది కో-ఆప్ బిల్డింగ్, 49 00:03:07,898 --> 00:03:11,026 దానర్థం మనం అందరం బిల్డింగ్ ని అలాగే అందరూ వాడే పూల్ ని 50 00:03:11,026 --> 00:03:13,612 జాగ్రత్తగా చూసుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలి అని అర్థం. 51 00:03:14,195 --> 00:03:16,323 నీకు కూడా అందరితో కలిసి పని చేయడం ఇష్టం అనుకున్నానే. 52 00:03:17,115 --> 00:03:22,329 మనం ఎంత త్వరగా పెయింట్ వేస్తే, నువ్వు అంత త్వరగా నీ జంతువుని కాపాడడానికి పోవచ్చు... దాని పేరు ఏమన్నావు... 53 00:03:22,329 --> 00:03:24,289 "గేవియాలిస్ గెంజటికస్." 54 00:03:24,289 --> 00:03:28,168 సరే. అది ఖచ్చితంగా కల్పించిన పేరే. అది నిజమైన పేరు కాదు. 55 00:03:28,168 --> 00:03:31,129 -అది నిజమైన పేరు. -అలాగే అవి డైనోసార్ల జాతి జంతువులు. 56 00:03:31,129 --> 00:03:32,672 డైనోసార్లు నిజంగా సూపర్. 57 00:03:32,672 --> 00:03:34,132 మీకు ఏది బాగా ఇష్టం? 58 00:03:34,132 --> 00:03:35,258 స్పైనోసారస్. 59 00:03:35,258 --> 00:03:36,426 మంచి సమాధానం. 60 00:03:37,719 --> 00:03:39,429 హేయ్, నువ్వు మరియావా? 61 00:03:40,263 --> 00:03:41,765 అది నేనేనా? 62 00:03:42,724 --> 00:03:44,559 అవును, అది నేనే. 63 00:03:45,685 --> 00:03:48,855 అంటే, అదే నా పేరు. మరియా. 64 00:03:50,148 --> 00:03:53,151 సరే, నేను ఆండ్రేని. కుమారి నాతో నిన్ను కలవమని చెప్పింది, నువ్వే కదా? 65 00:03:53,151 --> 00:03:56,071 నేను ఈ మధ్యనే వచ్చాను, నేను నా వాలంటీర్ పనిని పూర్తి చేయాలి, 66 00:03:56,071 --> 00:03:58,198 కాబట్టి, నేనిక నీ వాడినే. 67 00:03:58,698 --> 00:03:59,574 నా వాడివే. 68 00:04:00,617 --> 00:04:02,369 అంటే, నేను చాలా బాగా పెయింట్ వేయగలను. 69 00:04:04,120 --> 00:04:05,705 నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. 70 00:04:07,165 --> 00:04:09,417 అతను అన్నది కుర్చీల గురించి, అమ్మా. 71 00:04:10,252 --> 00:04:13,463 అవును. అవును, వాటికి వేస్తే చాలా సంతోషం. 72 00:04:14,172 --> 00:04:16,966 నేను వెళ్లి ఇంకొన్ని బ్లుష్లు తెస్తా. బ్రష్ లు. 73 00:04:17,884 --> 00:04:20,637 వస్తువులు. నేను వెంటనే వస్తాను. 74 00:04:22,138 --> 00:04:24,432 అతనితో కలిసి పని చేస్తూ ఎంజాయ్ చెయ్, జేన్! 75 00:04:24,432 --> 00:04:25,934 అయితే, నీకు బాగా నచ్చే డైనోసార్ ఏంటి? 76 00:04:25,934 --> 00:04:29,604 నాకు తొమ్మిది ఇష్టం. వాటిని ముందు నుండి వెనక్కి చెప్పనా, వెనక నుండి ముందుకు చెప్పనా? 77 00:04:30,897 --> 00:04:33,650 ఎలా చెప్తే ఏంటి? డైనోసార్లు అంతరించిపోయాయి. 78 00:04:33,650 --> 00:04:36,861 అలాగే మనం గనుక ఘరియల్స్ కి సహాయం చేయకపోతే, అవి కూడా పోతాయి. పదా, డేవిడ్. 79 00:04:36,861 --> 00:04:38,113 ఘరియల్ అంటే ఏంటి? 80 00:04:38,113 --> 00:04:41,741 ఒక వింతగా కనిపించే ముక్కు మీద పెద్ద పిడి ఉన్నట్టు ఉండే సరీసృపం. 81 00:04:41,741 --> 00:04:42,826 ఇలా ఉంటుంది. 82 00:04:43,743 --> 00:04:45,036 మేము ఆ ముక్కు మీద పిడి ఎందుకు ఉందో 83 00:04:45,036 --> 00:04:47,414 కనిపెడితేనే అవి శాశ్వతంగా అంతరించిపోకుండా వాటికి మేము సహాయం చేయగలం. 84 00:04:48,039 --> 00:04:50,542 అది చాలా ముఖ్యమైన పని. నేను సహాయం చేయడానికి ఏమైనా చేయగలనా? 85 00:04:50,542 --> 00:04:51,751 మీరు ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. 86 00:04:51,751 --> 00:04:54,296 మేము మా పనిని పూర్తి చేయడానికి వీలుగా మీరు మా అమ్మకు పెయింటింగ్ లో సహాయం చేయండి. 87 00:04:54,296 --> 00:04:56,298 అలాగే. గుడ్ లక్. 88 00:04:58,800 --> 00:04:59,885 నాకు అతను నచ్చాడు. 89 00:05:03,471 --> 00:05:04,472 జేన్? 90 00:05:07,267 --> 00:05:10,103 జేన్! జేన్? 91 00:05:18,320 --> 00:05:19,988 చాలా బాగా ట్రై చేశావు, జేన్. బయటకు రా. 92 00:05:21,698 --> 00:05:23,491 పూల్ నుండి బయటకు రా. వెంటనే. 93 00:05:24,784 --> 00:05:26,828 ఆ నీళ్లు భలే బలంగా వచ్చి పడ్డాయి. 94 00:05:26,828 --> 00:05:28,413 అవును, నిజమే. 95 00:05:29,414 --> 00:05:30,540 మీకు థాంక్స్. 96 00:05:32,334 --> 00:05:34,377 అయితే, మీ "ఘారి-ఎల్లే" విషయంలో ఏమైనా పురోగతి సాధించారా? 97 00:05:34,377 --> 00:05:36,254 అది ఘరియల్. అలాగే ఏం లేదు. 98 00:05:36,254 --> 00:05:40,508 చూస్తుంటే, జంతుజాతి సంరక్షణ కంటే కుర్చీలకు పెయింట్ వేయడమే ముఖ్యం అనుకుంట. 99 00:05:40,508 --> 00:05:42,427 నువ్వు చాలా మొండిదానివే, ఆహ్? 100 00:05:42,427 --> 00:05:44,137 మీకు అస్సలు తెలీదు. 101 00:05:44,137 --> 00:05:45,222 అవును. 102 00:05:46,181 --> 00:05:49,100 నేను వెళ్లి కాస్త తడి ఆరబెట్టుకుంటాను. మేము కాసేపటిలో వచ్చి పెయింట్ వేయడానికి సహాయం చేస్తాం. 103 00:05:50,143 --> 00:05:51,061 అంటే, మెల్లిగా రా. 104 00:05:58,109 --> 00:06:00,403 భలే, పరువు అంతా పోయింది. 105 00:06:00,403 --> 00:06:04,532 నిజమే. జంతువులను కాపాడడానికంటే కుర్చీలకు పెయింట్ వేయడం ముఖ్యం అని నువ్వు ఎలా అనుకున్నావు? 106 00:06:04,532 --> 00:06:07,535 ఎందుకంటే ఇక్కడ ఉండాలంటే నెలకు రెండు గంటలు వాలంటీర్ పని చేయాలి కాబట్టి. 107 00:06:07,535 --> 00:06:09,246 నేనేం నిన్ను పెద్ద పని చేయమని అడగలేదే. 108 00:06:09,829 --> 00:06:13,625 జంతువులకు సహాయం చేయడానికి వచ్చేసరికి జనం ఏదొక ముఖ్యమైన పని ఉంది అని చెప్తూనే ఉంటారు. 109 00:06:13,625 --> 00:06:18,129 కానీ, మనం ఏమీ చేయకపోతే, అవి కనిపించకుండా పోతాయి. ఎప్పటికీ. 110 00:06:20,173 --> 00:06:22,676 నాకు కాస్త ఏకాంత సమయం కావాలి. ప్లీజ్. 111 00:06:53,206 --> 00:06:55,584 ప్రతీ వ్యక్తి ముఖ్యమే. 112 00:06:55,584 --> 00:06:58,753 {\an8}ప్రతీ వ్యక్తికి తాను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. 113 00:06:58,753 --> 00:07:02,632 {\an8}ప్రతీ వ్యక్తి మార్పును తీసుకురాగలరు. 114 00:07:04,009 --> 00:07:05,635 ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పి చూడు. 115 00:07:17,480 --> 00:07:19,316 "కిందకి చూడు." 116 00:07:27,073 --> 00:07:28,658 అది ఘరియల్! 117 00:07:30,785 --> 00:07:31,745 పదా! 118 00:07:40,378 --> 00:07:41,880 ఘరియల్ ఎక్కడికి పోయింది? 119 00:07:43,048 --> 00:07:45,550 -అది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. -అది ఆడది అని నీకెలా తెలుసు? 120 00:07:45,550 --> 00:07:48,053 మంచి పాయింట్. ఆ జంతువు ఇక్కడే ఎక్కడో ఉండి ఉండొచ్చు. 121 00:07:48,845 --> 00:07:50,597 బహుశా మనం విడిగా వెతికితే ఎక్కువ ప్రదేశాలలో వెతకగలం ఏమో. 122 00:07:50,597 --> 00:07:52,432 నాతో మాట్లాడడానికి నీ దగ్గర నీ వాకి-టాకీ ఉందా? 123 00:07:53,308 --> 00:07:54,643 ఉంది. ఓవర్. 124 00:07:55,227 --> 00:07:58,438 ఎవరు మొదట ఘరియల్ ని కనిపెడతారో వారు కెప్టెన్ కావచ్చు. సరేనా? 125 00:08:01,024 --> 00:08:02,067 ఏంటి? 126 00:08:03,485 --> 00:08:06,321 నీకు అలా ఆడాలని ఉందా. నీ పని అయిపోయింది! 127 00:08:08,073 --> 00:08:09,616 ఆ శబ్దం చేస్తున్నది ఏంటి? 128 00:08:23,838 --> 00:08:25,549 నేను ఆ కిటుకుకి మళ్ళీ పడను. 129 00:08:26,758 --> 00:08:30,887 నేనే ఘరియల్ ని అయితే, ఎక్కడికి వెళ్తాను? 130 00:08:31,471 --> 00:08:33,097 అంటే, మొదటిగా, నేను ఇలా నిలబడి ఉండను. 131 00:08:33,097 --> 00:08:34,224 నేను నా పొట్ట మీద పడుకొని ఉంటా. 132 00:08:37,769 --> 00:08:39,770 కెప్టెన్ డేవిడ్ వస్తున్నాడు కాసుకో. 133 00:08:44,067 --> 00:08:45,360 శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తోంది. 134 00:08:45,360 --> 00:08:46,778 ఏం గట్టిగా వినిపిస్తోంది? 135 00:08:48,363 --> 00:08:51,283 నీ ఘరియలేనా? ఈ సారి సరిగ్గా ఉచ్చరించానా? 136 00:08:51,283 --> 00:08:54,160 అవును. డేవిడ్ ఇంకా నేను దాని ఆచూకీని కోల్పోయాం. 137 00:08:55,453 --> 00:08:57,080 అంటే, అది ఎలాంటి శబ్దం చేస్తోంది? 138 00:08:57,080 --> 00:08:59,541 పాప్ అనే లాంటి శబ్దం. 139 00:08:59,541 --> 00:09:00,792 అంటే... 140 00:09:01,543 --> 00:09:03,753 కాదు, ఎలా అంటే... 141 00:09:06,256 --> 00:09:07,841 అవి డైనోసార్ల లాంటివి అన్నమాట. 142 00:09:08,842 --> 00:09:11,553 అంటే, జనం అందరూ డైనోసార్లు సింహాలలాగ గర్జించేవి అనుకుంటారు. 143 00:09:11,553 --> 00:09:14,306 కానీ నిజానికి అవి మొసళ్ళు అలాగే అలిగేటర్లలాగ బుసకొట్టడం లేదా 144 00:09:14,306 --> 00:09:15,724 మొరగడం లాంటి శబ్దాలు చేసి ఉండొచ్చు. 145 00:09:17,934 --> 00:09:20,145 నాకు సహాయం చేసినందుకు చాలా థాంక్స్. 146 00:09:20,145 --> 00:09:23,607 నువ్వు కాస్త వెళ్లి విరామం తీసుకోవచ్చు కదా, ఆ పాప్ అనే శబ్దం ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టొచ్చు కదా? 147 00:09:25,442 --> 00:09:27,652 సరే. ఇదుగో, అమ్మా. 148 00:09:27,652 --> 00:09:29,779 మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఆండ్రే. థాంక్స్! 149 00:09:31,072 --> 00:09:32,782 అది నీకు ఏమాత్రం సహాయం చేయలేదు, అవునా? 150 00:09:36,912 --> 00:09:40,957 హేయ్, మీరు గనుక ఒక చింపాంజీని చూస్తే, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పకండి. 151 00:09:42,292 --> 00:09:43,543 ఏంటి? 152 00:09:52,469 --> 00:09:53,845 నేను ఘరియల్ ని కనిపెట్టాను! 153 00:09:53,845 --> 00:09:55,889 భలే చేశావు, కెప్టెన్ డేవిడ్. 154 00:09:59,142 --> 00:10:00,644 కాదు, దానిని కనిపెట్టింది నేను! 155 00:10:01,186 --> 00:10:02,437 నేను నేరుగా దాని వైపే వెళ్తున్నాను! 156 00:10:04,481 --> 00:10:05,857 ఇప్పుడు నేనే కెప్టెన్ ని! 157 00:10:08,109 --> 00:10:09,402 ఏంటి? 158 00:10:13,573 --> 00:10:15,533 ఆ ఘరియల్ ఇప్పుడు ఆ శబ్దాన్ని చేసిందా? 159 00:10:20,622 --> 00:10:22,582 నీ కూతురు నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉంది. 160 00:10:23,250 --> 00:10:24,918 -నిజంగా? -అవును. 161 00:10:25,877 --> 00:10:28,588 నేను చూసిన ప్రతీ జంతువును కాపాడాలి అని అనుకునేవాడిని. 162 00:10:28,588 --> 00:10:31,925 ఇంటికి ఒక డజను వరకు పక్షుల పిల్లలను, ఉడతల పిల్లలను తీసుకెళ్లి ఉంటాను. 163 00:10:32,425 --> 00:10:34,094 మా అమ్మానాన్నలకు మతి పోయేది. 164 00:10:35,303 --> 00:10:37,764 అవును, మా ఇంటికి కూడా చాలా దెబ్బలు తగిలిన పక్షులు వచ్చాయి. 165 00:10:39,015 --> 00:10:40,392 ఆ ఫీలింగ్ ని నేను మిస్ అవుతున్నాను. 166 00:10:41,810 --> 00:10:42,727 ఏం ఫీలింగ్? 167 00:10:42,727 --> 00:10:45,522 పిల్లాడిగా ఉన్న ఫీలింగ్. ప్రపంచాన్ని మార్చగలను అనుకోవడాన్ని. 168 00:10:48,692 --> 00:10:50,569 తను నిజంగానే ప్రపంచాన్ని మార్చగలను అని నమ్ముతుంది. 169 00:11:12,924 --> 00:11:16,803 అంటే ఆ పిడి ఉన్నది ఇందుకన్నమాట! పాప్ అంటూ శబ్దాలు చేయడానికి. 170 00:11:16,803 --> 00:11:17,888 కానీ ఎందుకు? 171 00:11:20,974 --> 00:11:22,684 జేన్, కెప్టెన్ డేవిడ్ ని మాట్లాడుతున్నాను! 172 00:11:22,684 --> 00:11:24,561 అద్భుతం. నువ్వు దానిని భయపెట్టేసావు! 173 00:11:24,561 --> 00:11:26,021 మేము దేనిని భయపెట్టేశాం? 174 00:11:26,021 --> 00:11:27,480 మన ఘరియల్ ని! 175 00:11:27,480 --> 00:11:29,566 కానేకాదు. అందుకు అవకాశమే లేదు. 176 00:11:29,566 --> 00:11:30,650 నేను దానిని... 177 00:11:32,277 --> 00:11:35,155 మేము ఆ ఘరియల్ ని కనిపెట్టాం, అలాగే అది వింత శబ్దాలు... 178 00:11:35,155 --> 00:11:36,948 పాప్ అనే శబ్దాలు చేస్తుంది. అంటే... 179 00:11:38,241 --> 00:11:41,411 రెండు ఘరియల్స్, అలాగే రెండూ ఆ పాపింగ్ శబ్దం చేస్తున్నాయా? 180 00:11:41,411 --> 00:11:42,621 దీనికి అర్థం ఏంటో తెలుసా? 181 00:11:42,621 --> 00:11:45,290 గ్రేబియర్డ్ ఇంకా నేను కూడా కెప్టెన్స్ అవుతామా? 182 00:11:46,458 --> 00:11:47,459 కాదు. 183 00:11:47,459 --> 00:11:49,127 అంటే, బహుశా కావచ్చు. 184 00:11:49,127 --> 00:11:52,547 దానర్థం అవి రెండు కూడా మనం ఈ వాకి-టాకిలతో ఏం చేస్తున్నామో అదే చేస్తున్నాయి అని! 185 00:11:52,547 --> 00:11:53,924 ఆడుతున్నాయా? 186 00:11:53,924 --> 00:11:55,300 మాట్లాడుతున్నాయి! 187 00:11:55,926 --> 00:11:58,470 -అయినా భలే విషయమే. -కానీ మనం ఆ విషయాన్ని ధృవీకరించుకోవాలి. 188 00:11:58,470 --> 00:12:00,513 నీ ఘరియల్ ని పూల్ లోకి తీసుకురాగలవేమో చూడు. 189 00:12:00,513 --> 00:12:02,098 నేను దానిని ఎలా తీసుకురావా... 190 00:12:07,020 --> 00:12:08,605 అదేం పట్టించుకోకు. గ్రేబియర్డ్ ఆ పని మొదలెట్టింది. 191 00:12:08,605 --> 00:12:10,315 అది ఆ మొసలిని నీ వైపే తీసుకొస్తోంది. 192 00:12:13,360 --> 00:12:14,778 వెళ్ళు, గ్రేబియర్డ్! వెళ్ళు! 193 00:12:20,867 --> 00:12:23,995 భలే పని చేశావు, గ్రేబియర్డ్. ఘరియల్ కి ఇతర జంతువుల దగ్గర ఉండడం నచ్చదు. 194 00:12:25,872 --> 00:12:27,457 చూసుకో, గ్రేబియర్డ్, నువ్వు ఈత కొట్టలేవు! 195 00:12:42,138 --> 00:12:43,682 గ్రేబియర్డ్, దీని మీదకు దూకు! 196 00:12:59,698 --> 00:13:00,740 ఇదుగో. 197 00:13:01,283 --> 00:13:03,535 అది నేను కాదు. గ్రేబియర్డ్ చేసిన పని. 198 00:13:03,535 --> 00:13:05,161 నేను వెళ్లి ఇంకొన్ని టవల్స్ తీసుకొస్తాను. 199 00:13:05,161 --> 00:13:06,663 గ్రేబియర్డ్ సంగతి ఏంటి? 200 00:13:07,330 --> 00:13:08,748 దానిని నేను శుభ్రం చేస్తాను. 201 00:13:12,460 --> 00:13:13,962 నేను ఈ షర్ట్ ని ఈ మధ్యనే కొన్నాను. 202 00:13:21,636 --> 00:13:22,929 నీ పని ఎంత వరకు వచ్చింది? 203 00:13:23,430 --> 00:13:24,723 కొంచెం అయింది. 204 00:13:24,723 --> 00:13:26,016 మాకు రెండు ఘరియల్స్ కనిపించాయి, 205 00:13:26,016 --> 00:13:28,852 అలాగే ఆ రెండూ కూడా భలేగా ముక్కుతో పాప్ అనే శబ్దాలు చేస్తున్నాయి. 206 00:13:28,852 --> 00:13:29,936 ఇలా. 207 00:13:31,354 --> 00:13:34,065 -అలా ఎందుకు చేస్తున్నాయి? -ఆ విషయాన్ని మేము ఇంకా కనిపెట్టలేదు. 208 00:13:34,774 --> 00:13:37,402 సరే, అయితే త్వరపడండి. వాటి జాతి ప్రమాదంలో ఉంది కదా. 209 00:13:40,030 --> 00:13:41,740 నన్ను కొంచెం సేపు సహాయం చేయమంటావా? 210 00:13:41,740 --> 00:13:44,117 ఆ పనిని నేను చూసుకుంటానులే. 211 00:13:44,117 --> 00:13:48,663 నువ్వు వెళ్లి ఘరియల్ ని కాపాడు, నేను మన వాలంటీర్ పని సంగతి చూస్తాను. 212 00:13:48,663 --> 00:13:50,707 ప్రతీ వ్యక్తి తమ వంతు పనిని చేయాలి. 213 00:13:50,707 --> 00:13:53,001 నువ్వు నీ పనిని చెయ్, నేను నా పని చేస్తాను. 214 00:13:53,877 --> 00:13:55,420 పెయింట్ పోసినందుకు క్షమించు, అమ్మా. 215 00:13:55,420 --> 00:13:56,755 అదేం పర్లేదు. 216 00:13:57,797 --> 00:13:59,049 కానీ గ్రేబియర్డ్ ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. 217 00:14:03,970 --> 00:14:05,680 జేన్, ఇక్కడికి రా. 218 00:14:06,556 --> 00:14:07,933 ఇదుగో. 219 00:14:12,479 --> 00:14:14,231 లోనికి రా. నాకొక ఐడియా వచ్చింది. 220 00:14:16,483 --> 00:14:18,610 వాటికి మనం వస్తున్నట్టు తెలీదు. 221 00:14:24,157 --> 00:14:27,702 అది చూడు. ముక్కు పోయేంత అద్భుతంగా ఉంది కదా? 222 00:14:27,702 --> 00:14:28,870 భలే డైలాగ్. 223 00:14:28,870 --> 00:14:31,331 అందరూ నన్ను కోకెప్టెన్ డేవిడ్ అని ఉత్తినే పిలవరు. 224 00:14:31,331 --> 00:14:32,916 నిన్ను ఎవరూ అలా పిలవరు. 225 00:14:32,916 --> 00:14:34,459 గ్రేబియర్డ్ నన్ను అలా పిలుస్తుంది. 226 00:14:38,380 --> 00:14:43,593 -అవి మాట్లాడుకుంటున్నాయి! -కానీ అవి ఏమని చెప్తున్నాయి? 227 00:14:45,929 --> 00:14:46,846 భయపెట్టేశా! 228 00:14:46,846 --> 00:14:48,598 నేను అనుకున్నదానికన్నా మీరిద్దరూ చాలా బాగా భయపడ్డారు. 229 00:14:49,432 --> 00:14:50,684 భలే చేశారు. 230 00:14:51,434 --> 00:14:52,519 అవి కదులుతున్నాయి! 231 00:14:53,478 --> 00:14:56,565 "అవా"? అంటే ఉన్నది ఒక్క ఘరియల్ కాదా? 232 00:14:56,565 --> 00:14:57,941 మొదటి దానికి ఇంకొక ఫ్రెండ్ దొరికింది. 233 00:14:57,941 --> 00:15:01,319 -అవి ఆగకుండా పాప్ అంటూ శబ్దం చేస్తూనే ఉన్నాయి. -అది అవి మాట్లాడుకునే విధానం అని మా ఉద్దేశం. 234 00:15:01,319 --> 00:15:04,823 అవి ఖచ్చితంగా "పెద్ద డామ్ ఉన్న నదికి దూరంగా ఉండండి" అని చెప్తున్నాయి అంటాను. 235 00:15:04,823 --> 00:15:06,491 చాలా స్పష్టంగా చెప్పారే. 236 00:15:07,325 --> 00:15:08,368 నేను వాటి గురించి ఆన్లైన్ లో చూశాను. 237 00:15:08,368 --> 00:15:10,620 ఘరియల్స్ అంతరించిపోవడానికి ముఖ్య కారణాలలో ఒకటి 238 00:15:10,620 --> 00:15:13,999 జనం అవి ఉంటున్న నదుల మీద డామ్ లు నిర్మించడమే. 239 00:15:13,999 --> 00:15:16,251 -ఎందుకు? -కరెంటు ఉత్పత్తి కోసం. 240 00:15:16,251 --> 00:15:17,711 వాళ్ళు ఆ పనిని ఆపేయాలి. 241 00:15:17,711 --> 00:15:19,004 అంటే, మనకు లైట్లు కావాలి కదా. 242 00:15:19,004 --> 00:15:20,213 కానీ అస్తమాను అవసరం లేదు. 243 00:15:20,213 --> 00:15:23,174 అందరూ జాగ్రత్తగా ఎంత కరెంటు వాడుతున్నారో చూసుకుంటూ ఆదా చేస్తే అవసరం ఉండదు. 244 00:15:23,174 --> 00:15:24,801 లైట్లు ఆపేయడం గురించా? 245 00:15:24,801 --> 00:15:26,803 మనకు అప్పుడు అంత కరెంటు తయారుచేయాల్సిన పని ఉండదు. 246 00:15:26,803 --> 00:15:28,680 అప్పుడు ఘరియల్ ని కాపాడగలమా? 247 00:15:28,680 --> 00:15:30,599 అది సరైన దిశలో మొదటి అడుగు అవుతుంది. 248 00:15:30,599 --> 00:15:33,310 నువ్వు అన్నది నిజమే. అలాగే అనేక ఇతర జంతువులకు కూడా మేలు జరుగుతుంది. 249 00:15:34,352 --> 00:15:36,229 జంతువులను కాపాడడం విషయానికి వస్తే, 250 00:15:36,229 --> 00:15:39,524 నేను వెళ్లి మీ ఫ్రెండ్ గ్రేబియర్డ్ మీద నుండి పెయింట్ మొత్తం వదిలిందో లేదో చూసి వస్తాను. 251 00:15:39,524 --> 00:15:41,401 దానిని ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచాను. 252 00:15:41,401 --> 00:15:42,861 దానికి ఎండ అంటే ఇష్టమే. 253 00:15:48,950 --> 00:15:51,119 అవును, అతను చాలా కూల్. 254 00:15:54,205 --> 00:15:55,415 ఇంకొక ఘరియల్? 255 00:15:55,415 --> 00:15:57,500 కానీ దానికి ముక్కు మీద పిడి లేదు. 256 00:15:59,586 --> 00:16:03,006 -అన్నిటికీ అది ఉంటుంది కదా? -బహుశా ఉండదేమో. 257 00:16:03,673 --> 00:16:06,968 అది ఆడది అయ్యుండొచ్చు. ఆడ ఘరియల్స్ మగ వాటికన్నా చిన్నగా ఉంటాయి. 258 00:16:06,968 --> 00:16:09,971 -అక్కడ ఉన్నదానిలా. -అది నీళ్ళలోకి వెళ్తోంది. 259 00:16:09,971 --> 00:16:13,266 ఘరియల్ పోటీ. నీటి కింద ఉండి నువ్వు ఎంత సేపు బబుల్స్ వదలగలవు? 260 00:16:13,266 --> 00:16:16,144 -ఎనిమిది సెకన్లు. నువ్వు? -ఇప్పుడు తెలుసుకుందాం. 261 00:16:36,456 --> 00:16:38,250 తొమ్మిది సెకన్లు. కొత్త రికార్డు. 262 00:16:38,250 --> 00:16:40,794 అవి మనలాగే బుడగలు ఊదే పోటీ పెట్టుకుంటున్నాయా? 263 00:16:40,794 --> 00:16:43,380 చూడడానికి అలాగే ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉంటా! 264 00:17:03,316 --> 00:17:05,276 పది సెకన్లు. 11 సెకన్లకు ప్రయత్నిద్దామా? 265 00:17:05,276 --> 00:17:07,152 మన పనిని పూర్తి చేసిన తర్వాత. 266 00:17:07,152 --> 00:17:08,655 కానీ మనం ఆ పనిని ఎలా చేయబోతున్నాం? 267 00:17:10,824 --> 00:17:11,824 నాతో పదా. 268 00:17:17,622 --> 00:17:21,126 ఏమంటారు? మీ అమ్మా నేను మంచి భాగస్వాములం కాగలం, కదా? 269 00:17:21,126 --> 00:17:22,919 మేము ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. 270 00:17:22,919 --> 00:17:26,006 మేము సహాయం చేయడానికి వచ్చాము. అలాగే గమనించడానికి. 271 00:17:26,006 --> 00:17:28,007 అంటే, మీ అమ్మ అద్భుతమైన పెయింటర్. 272 00:17:28,592 --> 00:17:29,843 ఆండ్రేకి కూడా చాలా ట్యాలెంట్ ఉంది. 273 00:17:31,553 --> 00:17:34,431 చూస్తుంటే ప్రేమ వికసిస్తోంది ఘరియల్స్ మధ్య మాత్రమే కాదనుకుంట. 274 00:17:36,099 --> 00:17:38,018 -అంతే. -ఏంటి? 275 00:17:38,018 --> 00:17:41,646 మగ ఘరియల్ వాటి ముట్టి సహాయంతో ఆ గిజ్ అనే శబ్దాన్ని చేసి, బుడగలు ఊదుతూ 276 00:17:41,646 --> 00:17:43,857 ఆడ ఘరియల్స్ ని ఆకట్టుకోవడానికి చూస్తాయి, 277 00:17:43,857 --> 00:17:47,611 ఆండ్రే తన పెయింటింగ్ ప్రతిభను చూపించి ఇప్పుడు... 278 00:17:47,611 --> 00:17:49,321 అలాగే డైనోసార్ల గురించి చెప్తూ. 279 00:17:49,321 --> 00:17:51,531 ...మా అమ్మని ఆకట్టుకోవడానికి చూస్తున్నట్టు. 280 00:17:53,116 --> 00:17:54,367 ప్రయత్నం పని చేస్తుందా? 281 00:17:55,577 --> 00:17:57,037 నాకు డైనోసార్లు అంటే ఇష్టమే. 282 00:17:57,037 --> 00:17:59,247 కాదు, నీకు అవి నచ్చవు. అవి భయంకరమైనవి అన్నావు. 283 00:18:05,045 --> 00:18:06,713 నేను ఇంకా కెప్టెన్ గా ఉండొచ్చా? 284 00:18:07,339 --> 00:18:08,340 మనం అందరం కాగలం. 285 00:18:11,051 --> 00:18:12,135 అదిగో మన ఘరియల్ జంట. 286 00:18:12,636 --> 00:18:14,346 చూడు, ఆడది కొన్ని గుడ్లు పెట్టింది. 287 00:18:14,346 --> 00:18:17,224 దానర్థం ఈ నదిలో త్వరలోనే మరిన్ని ఘరియల్స్ ఉంటాయి అన్నమాట. 288 00:18:18,058 --> 00:18:19,434 చూస్తుంటే ఈ ఘరియల్స్ కనిపెట్టినట్టు ఉన్నాయి, 289 00:18:19,434 --> 00:18:21,895 మంచి జంట కావాలి అంటే బాగా మాట్లాడుకోవాలని. 290 00:18:21,895 --> 00:18:24,272 అవును, గ్రేబియర్డ్ ఇంకా నేను కూడా ఆ విషయాన్ని కనిపెట్టేసాం. 291 00:18:24,272 --> 00:18:25,357 కదా, కోకెప్టెన్? 292 00:18:26,942 --> 00:18:29,402 ఆగు, జలపాతం ఎటు వైవు ఉంది? 293 00:18:38,411 --> 00:18:39,829 ఘరియల్స్ ని కాపాడడానికి సహాయం చేయండి. 294 00:18:44,084 --> 00:18:45,418 అమ్మా, మాకు నీ సహాయం కావాలి. 295 00:18:45,418 --> 00:18:48,004 మన ఘరియల్ సాహసం చేసిన గ్రేబియర్డ్ ఇంకా తడిగానే ఉన్నాడు. 296 00:18:48,004 --> 00:18:49,339 ఒక్క క్షణం, జేన్. 297 00:18:51,675 --> 00:18:52,968 ఎవరికి మెసేజ్ పంపుతున్నావు? 298 00:18:52,968 --> 00:18:56,846 ఆండ్రేకా? నేను ఇంకా అతనికి నా ఫేవరెట్ డైనోసార్ల లిస్టు చెప్పాలి. 299 00:18:56,846 --> 00:19:01,184 ఇప్పుడు నీ కాల్ కి లేట్ అవ్వడం లేదా, అదెవరో హెర్ప... 300 00:19:01,184 --> 00:19:03,979 హెర్పెటోలోజిస్ట్. అంటే సరీసృపాలు నిపుణులు అని అర్థం. 301 00:19:03,979 --> 00:19:07,566 డాక్టర్ రుచిరా సోమవీర మనతో ఘరియల్స్ గురించి మాట్లాడడానికి ఏ క్షణమైనా కాల్ చేయొచ్చు. 302 00:19:07,566 --> 00:19:08,775 అవును. 303 00:19:09,484 --> 00:19:10,735 అది ఆయనే అయ్యుంటారు! 304 00:19:11,570 --> 00:19:14,197 నువ్వు కొంచెం గ్రేబియర్డ్ ని చూసుకుంటావా? అలాగే ఆండ్రేకి హాయ్ చెప్పాను అని చెప్పు. 305 00:19:14,197 --> 00:19:16,366 సరే, ఇక బయలుదేరు. ఎంజాయ్ చెయ్. 306 00:19:18,034 --> 00:19:20,120 హలో? హాయ్. 307 00:19:20,120 --> 00:19:21,746 లేదు, లేదు, నేను బిజీగా లేను. 308 00:19:22,914 --> 00:19:24,916 హాయ్, రూ. 309 00:19:24,916 --> 00:19:26,585 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 310 00:19:26,585 --> 00:19:28,712 మాతో ఘరియల్స్ గురించి మాట్లాడుతున్నందుకు థాంక్స్. 311 00:19:28,712 --> 00:19:30,213 మేము చాలా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాము. 312 00:19:30,213 --> 00:19:33,425 నా మొదటి ప్రశ్న, మీ వెనుక ఉన్న అద్భుతమైన మొసలి పెయింటింగ్లు మీరే వేశారా? 313 00:19:34,259 --> 00:19:35,343 థాంక్స్. 314 00:19:35,343 --> 00:19:38,889 అంటే, మొత్తం పేరు నాకే రాకూడదు. అందులో కొంచెం మొసళ్ళ సహకారం కూడా ఉంది. 315 00:19:40,140 --> 00:19:41,808 ఒక పిల్ల మొసలి పెయింట్ వేయగలదా? 316 00:19:41,808 --> 00:19:43,560 నేను ఈ మొసళ్ళ పై అధ్యాయనం చేస్తున్నప్పుడు, 317 00:19:43,560 --> 00:19:47,606 వాటి పొట్ట మీద హానికరం కానీ పెయింట్ పూసి 318 00:19:47,606 --> 00:19:48,690 వాటిని పేపర్ మీద అద్దాము. 319 00:19:48,690 --> 00:19:51,776 ఆర్ట్ ద్వారా అనేక కోణాల్లో చూడడానికి మనకు వీలవుతుంది. 320 00:19:51,776 --> 00:19:53,820 -భలే ఉంది. -నిజమే. 321 00:19:53,820 --> 00:19:57,198 మీరు వాటిని చూసినప్పుడు, మీకు హత్తుకోవాలనిపించే బుజ్జి జంతువు కనిపించదు. 322 00:19:57,198 --> 00:20:00,118 జనం వాటిని చూసి భయపడుతుంటారు, కానీ వాటిలో కూడా అందమైన కోణం ఉంది. 323 00:20:00,118 --> 00:20:03,330 మొసళ్ళ గురించి జనం తప్పుగా అర్థం చేసుకొనే అతిపెద్ద విషయం ఏంటి? 324 00:20:03,330 --> 00:20:07,626 మొసళ్ళు సరీసృపాలలోనే అతిగొప్ప తల్లిదండ్రులు. 325 00:20:07,626 --> 00:20:11,421 అలాగే ఘరియల్స్ విషయానికి వస్తే, తండ్రులే పిల్లల పోషణను చూసుకుంటాయి, 326 00:20:11,421 --> 00:20:14,758 అలాగే వాటిని తమ వీపుపై మోస్తూ, వేటగాళ్ల నుండి కాపాడుతుంటాయి. 327 00:20:14,758 --> 00:20:16,676 ఆ పిల్లల్ని చూడు, జేన్. 328 00:20:16,676 --> 00:20:19,930 చాలా ముద్దుగా ఉన్నాయి. ఘరియల్స్ అంత మంచిగా పిల్లలని పెంచుతాయని నాకు తెలీదు. 329 00:20:19,930 --> 00:20:23,558 అంటే, వాటి రక్తం చల్లనిది కావచ్చు, కానీ హృదయం చాలా వెచ్చనిది. 330 00:20:24,851 --> 00:20:27,896 మీకు మొసళ్ళు అలాగే సరీసృపాల గురించి అధ్యాయం చేయాలని ఎప్పుడు అనిపించింది? 331 00:20:27,896 --> 00:20:30,398 నాకు నడక వచ్చినప్పటి నుండి. ఒకసారి ఈ ఫోటోలను చూడండి. 332 00:20:30,398 --> 00:20:31,983 ఆ బీచ్ లో ఉన్నప్పుడు మీ వయసు ఎంత? 333 00:20:31,983 --> 00:20:33,485 దాదాపు 15. 334 00:20:33,485 --> 00:20:38,740 సరీసృపాలు చూసినప్పుడు, ఆసక్తికరమైనవిగా, అందమైనవిగా, అలాగే అందరూ అపార్థం చేసుకునే జీవులుగా కనిపించాయి, 335 00:20:38,740 --> 00:20:42,035 కాబట్టి వాటి గురించి తెలుసుకొని, వాటికి మనం ఎలా సహాయం చేయగలమో చూడాలి అనుకున్నాను. 336 00:20:42,035 --> 00:20:43,161 వాటికి మనం ఎలా సాయం చేయగలం? 337 00:20:43,161 --> 00:20:45,914 అందరికీ మొసళ్ళు చాలా ముఖ్యమైనవి అని చెప్పండి. 338 00:20:45,914 --> 00:20:47,999 ఉదాహరణకు, అవి ఎపెక్స్ వేటాడే జీవులు, 339 00:20:47,999 --> 00:20:50,210 దానర్థం అవి ఆహార క్రమంలో అత్యంత పై స్థానంలో ఉంటాయి. 340 00:20:50,210 --> 00:20:54,089 ఘరియల్స్ చేపలను తిని, చేపల సంఖ్య పెరిగిపోకుండా చూసుకుంటాయి. 341 00:20:56,049 --> 00:20:57,050 రెహాన్! 342 00:20:57,050 --> 00:20:58,969 మీకు నా పేరు ఎలా తెలుసు? 343 00:20:58,969 --> 00:21:00,804 ఎందుకంటే ఒక సైంటిఫిక్ పేపర్ ని రాసిన అత్యంత యువ 344 00:21:00,804 --> 00:21:02,430 ఆస్ట్రేలియన్ వి నువ్వు. 345 00:21:02,430 --> 00:21:04,307 జేన్ తన హీరోల గోడ మీద నీ ఫోటో కూడా పెట్టుకుంది. 346 00:21:04,307 --> 00:21:07,769 నువ్వు ఆక్టోపస్ అలాగే బ్రౌన్ మచ్చల వ్రాస్ చేపల మధ్య ఉన్న ప్రత్యేకమైన 347 00:21:07,769 --> 00:21:11,106 స్నేహాన్ని గుర్తించినప్పుడు కేవలం పదేళ్ల కుర్రాడివి అని ఆన్లైన్ లో చదివాను. 348 00:21:11,106 --> 00:21:13,233 కానీ నేను ఆ పనిని మా నాన్న లేకుండా చేయగలిగి ఉండేవాడిని కాదు. 349 00:21:13,233 --> 00:21:17,571 రెహాన్, వీడికి మూడేళ్ళ వయసులో నేను సముద్రంలోకి స్నోర్కేలింగ్ చేస్తూ అన్వేషించడానికి వెళ్ళినప్పుడు 350 00:21:17,571 --> 00:21:18,655 నా మీద ఎక్కి వచ్చేవాడు. 351 00:21:18,655 --> 00:21:20,574 అచ్చం ఒక తండ్రి ఘరియల్ లాగ. 352 00:21:21,408 --> 00:21:23,660 అవును, అవి భలే గొప్ప జంతువులు. 353 00:21:23,660 --> 00:21:26,955 ముఖ్యంగా చెప్పాలంటే, అవి డైనోసార్లు భూమి మీద తిరిగినప్పటి నుండి ఇక్కడ ఉన్నాయి. 354 00:21:26,955 --> 00:21:29,666 డైనోసార్లు భలే గొప్పవి. త్వరగా, నీకు నచ్చిన రెండిటి పేర్లు చెప్పు. 355 00:21:29,666 --> 00:21:31,418 డైలోఫసారస్ ఇంకా స్పైనోసారస్. 356 00:21:31,418 --> 00:21:34,129 కాస్మెసేరటాప్స్ ఇంకా జిగనాటోసారస్. 357 00:21:35,297 --> 00:21:38,091 ఘరియల్స్ అలాగే ఇతర మొసలి జాతి జంతువులకు సాయం చేయడానికి మేము ఇంకేం చేయగలం? 358 00:21:38,091 --> 00:21:41,845 మీరు విరాళాలు సేకరించి ఆ డబ్బును సంరక్షణ చేసే సంస్థలకు ఇవ్వొచ్చు. 359 00:21:41,845 --> 00:21:45,640 ఉదాహరణకు, రెహాన్ వాళ్ళ స్కూల్ లో, వాళ్ళు వాడిన ప్లాస్టిక్ ని తీసుకొని, 360 00:21:45,640 --> 00:21:49,394 దానికి బదులు డబ్బు ఇచ్చి, ఆ డబ్బును జంతువులను కాపాడడానికి విరాళంగా ఇస్తారు. 361 00:21:49,394 --> 00:21:52,355 -బహుశా మనం కూడా అలా ఏమైనా చేయొచ్చు. -మంచి ఐడియా. 362 00:21:52,355 --> 00:21:55,317 అలాగే, మీ కుతూహలాన్ని పోగొట్టుకోకండి. 363 00:21:55,317 --> 00:21:59,487 ఇంకొకటి గుర్తుచుకోండి, అందంగా ముద్దొచ్చే జంతువులు మాత్రమే ముఖ్యం కాదు. 364 00:21:59,487 --> 00:22:01,489 థాంక్స్, రెహాన్. అలాగే మీకు కూడా థాంక్స్, రు. 365 00:22:01,489 --> 00:22:02,866 సరే, మీకు చాలా థాంక్స్. 366 00:22:03,450 --> 00:22:05,243 -బై! -బై! బై-బై! 367 00:22:06,703 --> 00:22:08,038 నువ్వు కూడా నేను అనుకునేదే అనుకుంటున్నావా? 368 00:22:08,038 --> 00:22:10,916 నేను ఘరియల్ లాగ మా నాన్న వీపు మీద ఎక్కి తిరగాలి అనుకోవడమా? 369 00:22:10,916 --> 00:22:13,293 కాదు, మన పొరుగువారికి ఘరియల్స్ గురించి చెప్పి 370 00:22:13,293 --> 00:22:15,337 -వాటికి సహాయం చేయడం గురించి. -అది కూడాలే. 371 00:22:15,337 --> 00:22:18,590 అలాగే తర్వాత మీ నాన్న వీపు మీదకి ఎక్కి పిల్ల ఘరియల్స్ లాగ తిరగడం గురించి కూడా. 372 00:22:18,590 --> 00:22:19,507 పదా. 373 00:22:34,022 --> 00:22:35,982 -పదా, జేన్! -వస్తున్నాను. 374 00:23:17,482 --> 00:23:19,484 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్