1 00:00:36,413 --> 00:00:38,206 "డేనియస్ ప్లెక్సిపస్." 2 00:00:45,714 --> 00:00:48,758 నువ్వు ఇది చూస్తున్నావా, డేవిడ్? ఇది డేనియస్ ప్లెక్సిపస్. 3 00:00:48,758 --> 00:00:50,969 అది మోనార్క్ సీతాకోకచిలుక శాస్త్రీయ పేరు అం... 4 00:00:51,761 --> 00:00:52,596 డేవిడ్? 5 00:00:52,596 --> 00:00:54,764 ఆగు, జేన్. ఇక్కడికి చొరబాటుదారులు ప్రవేశించారు. 6 00:00:58,059 --> 00:00:59,227 డేవిడ్? 7 00:00:59,227 --> 00:01:02,522 నా వైపుకు రాకు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, మిల్లి. 8 00:01:02,522 --> 00:01:04,148 ఏం చేస్తున్నావు? 9 00:01:04,148 --> 00:01:05,275 ఒక దానిని కాపాడుతున్నాను. 10 00:01:05,275 --> 00:01:06,735 దేనిని కాపాడుతున్నావు? 11 00:01:06,735 --> 00:01:08,445 మోనార్క్ సీతాకోకచిలుకలు. 12 00:01:09,821 --> 00:01:11,197 అవును. అలాగే... 13 00:01:11,197 --> 00:01:14,284 ఇది చాలా ముఖ్యమైన పని, కాబట్టి నేను ఇక తిరిగి పని మొదలెట్టాలి. 14 00:01:18,788 --> 00:01:20,040 తను ఏం చేస్తోంది? 15 00:01:20,790 --> 00:01:21,875 చిరాకు తెప్పిస్తోంది. 16 00:01:22,918 --> 00:01:25,170 -నీ ఉద్దేశం సీతాకోకచిలుకా? -అవును. 17 00:01:25,170 --> 00:01:26,504 తింటుందా? 18 00:01:27,464 --> 00:01:30,717 లేదు. సీతాకోకచిలుకలకు తినడానికి పొడవాటి నాలుకలు ఉంటాయి. 19 00:01:33,887 --> 00:01:36,681 అది ఎలా వంగుతుందో చూడు. నాది కూడా అలా వంగుతుందేమో చూడాలి. 20 00:01:40,810 --> 00:01:42,229 ఆగు, అది బయలుదేరింది. 21 00:01:42,229 --> 00:01:43,939 దానిని ఎదుర్కోవడానికి మార్గాన్ని కనిపెడుతున్నాను. 22 00:01:49,444 --> 00:01:51,404 నువ్వు వాటిని ఎలా కాపాడబోతున్నావు? 23 00:01:52,530 --> 00:01:53,698 జాగ్రత్తగా. 24 00:01:54,824 --> 00:01:58,870 మోనార్క్ సీతాకోకచిలుకలు మెక్సికో నుండి యుఎస్ కి అలాగే ఒక్కోసారి కెనడాకి కూడా 25 00:01:58,870 --> 00:02:01,122 ప్రయాణం చేసి గుడ్లు పెడతాయి. 26 00:02:01,122 --> 00:02:03,208 -పిల్ల గొంగళిపురుగులను. -అవును. 27 00:02:03,208 --> 00:02:05,502 కానీ ప్రతీ ఏడాది వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. 28 00:02:05,502 --> 00:02:07,212 మేము ఒకదాన్ని ట్యాగ్ చేసి దాని ఫాలో అయ్యి 29 00:02:07,212 --> 00:02:09,421 ప్రయాణంలో వాటికి ఎక్కడ సహాయం అవసరం అవుతుందో కనిపెడతాం. 30 00:02:09,421 --> 00:02:11,925 అంత చిన్నది చాలా దూరం ప్రయాణం చేస్తుంది కదా. 31 00:02:11,925 --> 00:02:15,220 నీకు చెప్పాను కదా, ఇది చాలా ముఖ్యమైన పని. 32 00:02:19,099 --> 00:02:20,225 నేను దాన్ని మిస్ అయ్యాను. 33 00:02:20,225 --> 00:02:21,601 పైకి వెళ్లి కనిపిస్తుందేమో చూడు. 34 00:02:21,601 --> 00:02:22,519 మంచి ఐడియా. 35 00:02:23,103 --> 00:02:24,187 గట్టిగా పట్టుకో, గ్రేబియర్డ్. 36 00:02:27,274 --> 00:02:28,275 డేవిడ్? 37 00:02:28,858 --> 00:02:29,901 ఏంటి, మిల్లి? 38 00:02:30,402 --> 00:02:32,404 నువ్వు నా కీచైన్ ని చూశావా? 39 00:02:32,404 --> 00:02:33,363 లేదు. 40 00:02:33,363 --> 00:02:36,074 -నీది నాకు ఇస్తావా? -లేదు. 41 00:02:36,074 --> 00:02:37,492 -ఎందుకు? -ఎందుకంటే ఇది నాది. 42 00:02:37,492 --> 00:02:38,660 ఓహ్. 43 00:02:40,120 --> 00:02:42,956 అలాగే, ఇది లేకుండా నేను బయటకు వెళ్ళడానికి లేదు. 44 00:02:43,540 --> 00:02:46,084 డేవిడ్, నువ్వు ఇది కచ్చితంగా చూడాలని అనుకుంటావు. 45 00:02:46,835 --> 00:02:48,587 డాడీని లేదా నాన్నని వెతకమని అడుగు. 46 00:02:52,549 --> 00:02:54,259 ఆగు, అవి ఏంటి? 47 00:02:54,759 --> 00:02:55,844 జూమ్ చెయ్. 48 00:02:57,804 --> 00:02:59,055 అమ్మో. 49 00:02:59,055 --> 00:03:01,600 "అమ్మో" అనేది సరైన పదమే. ట్యాగ్ చేయడానికి సిద్ధం అవుతున్నాము. 50 00:03:04,227 --> 00:03:05,520 సిద్ధమా, గ్రేబియర్డ్? 51 00:03:11,151 --> 00:03:12,152 డేవిడ్? 52 00:03:14,404 --> 00:03:16,948 ఏంటి, మిల్లి? మేము ఇక్కడ ప్రపంచాన్ని కాపాడడానికి చూస్తున్నాం. 53 00:03:16,948 --> 00:03:19,326 నా కీచైన్ ని పోగొట్టుకున్నాను. 54 00:03:19,326 --> 00:03:20,577 డాడీకి లేదా నాన్నకి తెలుసా? 55 00:03:21,161 --> 00:03:23,413 నేను చాలా పెద్ద సమస్యలో పడబోతున్నాను. 56 00:03:24,456 --> 00:03:27,375 ట్యాగ్ చేసేశాం! 57 00:03:27,375 --> 00:03:29,044 నువ్వు సాధించావు, గ్రేబియర్డ్! 58 00:03:29,628 --> 00:03:31,463 అయ్యో. అవి మా వైపే వస్తున్నాయి. 59 00:03:33,089 --> 00:03:34,591 ఇక్కడ ఒక సమస్య వచ్చింది! 60 00:03:34,591 --> 00:03:35,800 నాకు కూడా. 61 00:03:35,800 --> 00:03:37,802 పట్టుకో, గ్రేబియర్డ్! 62 00:03:38,386 --> 00:03:39,930 గ్రేబియర్డ్! 63 00:03:42,474 --> 00:03:46,269 చింపాంజీ పడిపోయింది. మళ్ళీ చెప్తున్నా, చింపాంజీ పడిపోయింది. 64 00:03:49,648 --> 00:03:51,441 ఏమైంది, అమలా? 65 00:03:51,441 --> 00:03:52,984 గ్రేబియర్డ్ అయింది. 66 00:03:52,984 --> 00:03:54,945 -నేను మీకు సహాయం చేస్తాను. -వద్దు! అవసరం లేదు. 67 00:03:54,945 --> 00:03:58,698 నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి, జేన్, ముఖ్యంగా ఇతరుల తోటల విషయంలో. 68 00:03:58,698 --> 00:04:00,659 గ్రేబియర్డ్ క్షమించమని అడుగుతోంది, మిస్టర్ పటేల్. 69 00:04:00,659 --> 00:04:03,370 ఇది పడినప్పుడు మేము మోనార్క్ సీతాకోకచిలుకలకు ఎలా సహాయం చేయగలమా అని చూస్తున్నాం. 70 00:04:03,370 --> 00:04:06,539 సరే, కానీ పడేటట్టు అయితే వేరే చోట పడమను. ఇక్కడ సీతాకోకచిలుకలు ఏమీ లేవు. 71 00:04:08,083 --> 00:04:09,084 కానీ ఉండొచ్చు కదా. 72 00:04:10,377 --> 00:04:12,796 నేను ఇప్పుడు ఈ సమస్యతో వేగలేను, మిల్లి. 73 00:04:12,796 --> 00:04:14,506 జేన్ ఇంకా గ్రేబియర్డ్ లకు నా సహాయం కావాలి. 74 00:04:14,506 --> 00:04:16,716 కానీ నాకు కూడా నీ సహాయం కావాలి. 75 00:04:16,716 --> 00:04:18,552 అవును, కానీ జేన్ సమస్య పెద్దది. 76 00:04:18,552 --> 00:04:20,554 మేము సీతాకోకచిలుకలకు సహాయం చేయడానికి ఏమీ చేయకపోతే 77 00:04:20,554 --> 00:04:22,639 అవి ఇక ఉండకపోవచ్చు. 78 00:04:24,182 --> 00:04:26,977 కానీ ఒకవేళ నేను లేకుండా పోతే? 79 00:04:28,228 --> 00:04:29,563 అవి ఉండాలి కదా. 80 00:04:29,563 --> 00:04:32,983 సీతాకోకచిలుకలు పరాగసంపర్కంలో సహాయం చేస్తాయి. ఎక్కువ సీతాకోకచిలుకలు ఉంటే ఎక్కవుగా పువ్వులు ఉంటాయి. 81 00:04:32,983 --> 00:04:35,402 -అమలా లాగ. -వద్దు, ముట్టుకోకు. 82 00:04:35,986 --> 00:04:36,987 క్షమించండి. 83 00:04:36,987 --> 00:04:38,697 సీతాకోకచిలుకలకు పువ్వులు అంటే ఇష్టం ఉండొచ్చు, 84 00:04:38,697 --> 00:04:41,992 కానీ వాటి పిల్లలు... గొంగళిపురుగులకు... మిల్క్ వీడ్ మొక్కలే నచ్చుతాయి. 85 00:04:41,992 --> 00:04:43,618 అయితే మీరు మిల్క్ వీడ్ మొక్కలు నాటాలి. 86 00:04:44,619 --> 00:04:46,204 నేను కలుపు మొక్కలు నాటను. 87 00:04:46,204 --> 00:04:49,332 అది నిజానికి కలుపు మొక్క కాదు. పేరులో మాత్రమే వీడ్ అని ఉంది అంతే. 88 00:04:49,332 --> 00:04:51,334 అంటే వేల్ షార్క్ నిజానికి ఎలా తిమింగలం కాదో అలాగ. 89 00:04:51,334 --> 00:04:53,378 ఒక వాగుడుకాయ నిజానికి ఒక కాయ ఎలా కాదో అలా. 90 00:04:53,378 --> 00:04:55,881 వాగుడుకాయ అంటే నిజానికి ఒక ఎగిరే చింపాంజీతో తిరిగే ఒక చిన్న పిల్ల. 91 00:04:55,881 --> 00:04:58,967 దయచేసి నీ సీతాకోకచిలుకలను కాపాడే పనిని ఇంకెక్కడైనా పెట్టుకో. 92 00:05:08,226 --> 00:05:09,060 జేన్. 93 00:05:10,896 --> 00:05:11,938 ఏమైంది? 94 00:05:11,938 --> 00:05:14,816 మిస్టర్ పటేల్ కి ఆయన తోటలో మిల్క్ వీడ్ ని నాటడం ఇష్టం లేదు. 95 00:05:14,816 --> 00:05:16,693 అది చెడ్డ విషయమా? 96 00:05:16,693 --> 00:05:19,321 ఆయన గొంగళిపురుగులు అవే తింటాయి అని చెప్పారు. 97 00:05:21,531 --> 00:05:24,868 గొంగళిపురుగులు లేకపోతే, సీతాకోకచిలుకలు ఉండవు. అవును, గ్రేబియర్డ్. 98 00:05:24,868 --> 00:05:28,038 నువ్వు మిస్టర్ పటేల్ కి సీతాకోకచిలుకలు ఉంటే పువ్వులు ఎక్కువ ఉంటాయని చెప్పావా? 99 00:05:28,038 --> 00:05:32,500 చెప్పకుండా ఉండను కదా. కానీ ఆయన వినిపించుకోలేదు. ఈ పెద్దోళ్లు ఎప్పుడూ చెప్పేది వినిపించుకోరు. 100 00:05:32,500 --> 00:05:35,837 పెద్దోళ్ళు అలాగే చెల్లెళ్ళు కూడా. 101 00:05:38,173 --> 00:05:41,801 బహుశా మన సీతాకోకచిలుక తినకపోవడానికి కారణం అది గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందేమో. 102 00:05:41,801 --> 00:05:45,138 ఆ విషయం కనిపెట్టడానికి ఒక్కటే మార్గం ఉంది. తిరిగి మన సాహసాన్ని మొదలెడదామా? 103 00:05:54,689 --> 00:05:58,318 నేను ట్రాకర్ ని కనిపెట్టాను. సమాచారాన్ని నీకు ఇప్పుడు పంపుతున్నాను. 104 00:06:00,654 --> 00:06:02,656 అది అప్పుడే అంత దూరం ప్రయాణించిందా? 105 00:06:04,324 --> 00:06:08,245 అవును. ఇక్కడ ఏమని ఉందంటే, సీతాకోకచిలుకలు గాలి సహాయం తీసుకొని సుదూర ప్రదేశాలకు ప్రయాణిస్తాయి అంట. 106 00:06:08,828 --> 00:06:11,331 -గాలి, ఆహ్? -తేలుకుంటు వెళ్లగలిగినప్పుడు రెక్కలాడించడం ఎందుకు? 107 00:06:20,048 --> 00:06:22,509 హేయ్, గ్రేబియర్డ్, ఆ మేఘం నీలాగే ఉంది. 108 00:06:26,096 --> 00:06:29,516 అలాగే అది ఎంత వేగంగా వెళ్తుందో చూడు. ఎందుకో నీకు తెలుసా? 109 00:06:31,601 --> 00:06:34,771 అవును. ఇక గాలిలో తేలుకుంటూ వెళ్లే సమయమైంది. 110 00:06:34,771 --> 00:06:36,898 గ్లైడ్ మోడ్ ని ఆన్ చేస్తున్నాను. 111 00:06:38,817 --> 00:06:43,113 వేగం పెరుగుతోంది. మీరు ఆ గాలి మీదే తేలుతూ వెళితే నేరుగా మన సీతాకోకచిలుక దగ్గరకు వెళ్ళిపోతారు. 112 00:06:47,200 --> 00:06:48,410 మిల్లి ఏం కావాలని అంది? 113 00:06:48,410 --> 00:06:49,911 అది తన కీచైన్ ని పోగొట్టుకుంది. 114 00:06:49,911 --> 00:06:50,912 కీచైన్? 115 00:06:50,912 --> 00:06:52,163 మమ్మల్ని దత్తతు తీసుకున్నప్పుడు, 116 00:06:52,163 --> 00:06:54,666 మా నాన్నలు మా కొత్త ఇంటికి మా ఇద్దరికీ కీచైన్ లు ఇచ్చారు. 117 00:06:54,666 --> 00:06:56,084 అది భలే విషయం. 118 00:06:56,084 --> 00:06:59,212 నాకు ఒక బొమ్మ ట్రక్ కావాలి, కానీ, పోనిలే. 119 00:06:59,796 --> 00:07:01,047 మిల్లి బాధపడుతుందా? 120 00:07:01,047 --> 00:07:02,966 తను అస్తమానం ఏదోకటి పోగొట్టుకుంటూనే ఉంటుంది. 121 00:07:02,966 --> 00:07:04,718 అదే కనిపిస్తుందిలే. 122 00:07:07,429 --> 00:07:09,890 -కానీ మనం పోగొట్టుకోనిది ఏంటో తెలుసా? -మన సీతాకోకచిలుకా? 123 00:07:11,516 --> 00:07:12,642 పట్టుకో, గ్రేబియర్డ్. 124 00:07:18,398 --> 00:07:22,027 అది కదలడం ఆగిపోయింది. బహుశా విశ్రాంతి తీసుకుంటుందో లేక పడుకుంటుందేమో? 125 00:07:22,027 --> 00:07:24,988 సీతాకోకచిలుకలు పగలు ప్రయాణం చేసి రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి. 126 00:07:24,988 --> 00:07:27,365 ఇప్పుడు ఇంకా పగలే, అది పడుకోకూడదు. 127 00:07:27,365 --> 00:07:28,867 బహుశా ఏమైనా తింటుందేమో. 128 00:07:28,867 --> 00:07:32,078 నాకు ఇక్కడ మొక్కలేమీ కనిపించడం లేదు. అవి ఎలా ఆహారం తినగలవు? 129 00:07:32,078 --> 00:07:33,580 అవి తినడం లేదు. 130 00:07:34,789 --> 00:07:35,624 ఏమైంది? 131 00:07:36,416 --> 00:07:37,626 అది చనిపోయింది. 132 00:07:43,089 --> 00:07:44,090 హలో. 133 00:07:55,810 --> 00:07:57,229 అంతా బాగానే ఉందా? 134 00:07:59,606 --> 00:08:00,565 హగ్ కావాలా? 135 00:08:01,149 --> 00:08:02,067 అవును. 136 00:08:07,781 --> 00:08:09,908 సరే. ఇద్దరికీ ఇస్తాను. 137 00:08:11,534 --> 00:08:12,786 ఏమైంది? 138 00:08:12,786 --> 00:08:16,706 మేము ఒక సీతాకోకచిలుకను ట్యాగ్ చేసి అది మేక్సీకో నుండి కెనడా వెళ్లే ప్రయాణాన్ని ట్రాక్ చేద్దాం అనుకున్నాం. 139 00:08:16,706 --> 00:08:18,583 కానీ అది దారిలోనే చనిపోయింది. 140 00:08:18,583 --> 00:08:20,961 -నాకు బాధగా ఉంది. -అవును. 141 00:08:21,545 --> 00:08:23,171 మేము కొంచెం బాగా ఫీల్ అయ్యేలా చేయడానికి 142 00:08:23,171 --> 00:08:24,965 -మీరు స్నాక్స్ ఏమైనా తెచ్చారా? -సరే. 143 00:08:24,965 --> 00:08:27,050 బహుశా దానికి సరిపడంత ఆహారం లేక అది చనిపోయింది ఏమో. 144 00:08:27,050 --> 00:08:29,302 ఆ సిటీలో అస్సలు పువ్వులే లేవు. 145 00:08:29,302 --> 00:08:30,971 అలాగే నాకు మిల్క్ వీడ్ కూడా కనిపించలేదు. 146 00:08:30,971 --> 00:08:33,472 గొంగళిపురుగులు తినే మొక్క అది ఒక్కటే, 147 00:08:33,472 --> 00:08:36,308 కాబట్టి మోనార్క్ సీతాకోకచిలుకలు దాని మీదే గుడ్లు పెడతాయి. 148 00:08:36,308 --> 00:08:38,311 సీతాకోకచిలుకలు మన ఆహారం అలాగే పువ్వుల పరాగసంపర్కం 149 00:08:38,311 --> 00:08:40,313 విషయంలో మనకు సహాయం చేస్తున్నట్టు మనం సహాయం చేయాలి అంటే 150 00:08:40,313 --> 00:08:42,440 అప్పుడు జనం కూడా వాళ్ళ తోటల్లో మొక్కలు నాటాలి. 151 00:08:42,440 --> 00:08:44,025 మిస్టర్ పటేల్ లాంటి వారు. 152 00:08:44,025 --> 00:08:47,279 ఆయనతో వేగడం చాలా కష్టం. ఆయనకు తన తోట అంటే చాలా పట్టింపు. 153 00:08:48,947 --> 00:08:51,908 డేవిడ్? డేవిడ్? 154 00:08:53,868 --> 00:08:56,288 మిల్లి, నా వస్తువుల గురించి నీకు ఏమని చెప్పాను? 155 00:08:56,288 --> 00:08:57,497 వాడొద్దు అన్నావు. 156 00:08:57,497 --> 00:08:58,873 మరి నువ్వు ఏం చేస్తున్నావు? 157 00:08:58,873 --> 00:09:02,002 వాడుతున్నాను. కానీ నాకు నీ సహాయం కావాలి. 158 00:09:02,002 --> 00:09:06,464 నేను నా వాకి ఫోన్ ని తీసుకోవడానికి వస్తున్నాను అంతే. 159 00:09:07,215 --> 00:09:08,925 నాకు అది ఒక గిన్నెలో పెట్టి ఇస్తారా, ప్లీజ్? 160 00:09:08,925 --> 00:09:10,135 ఇదుగో. 161 00:09:10,135 --> 00:09:11,219 థాంక్స్. 162 00:09:11,219 --> 00:09:12,596 నేను నిమిషంలో వస్తా, జేన్. 163 00:09:16,308 --> 00:09:18,310 బహుశా ఒక జేన్ గుడ్ఆల్ చెప్పిన వాక్యం నిన్ను ఉత్సాహపరచగలదేమో. 164 00:09:20,061 --> 00:09:20,896 ఒకటి దొరికింది. 165 00:09:22,022 --> 00:09:25,609 "మనం మన విలువలను మార్చుకోనంత కాలం రాజి పడడంలో తప్పు లేదు." 166 00:09:28,361 --> 00:09:30,572 సరే. ఇదెలా ఉంది? 167 00:09:31,740 --> 00:09:35,869 "ఇతరులు నీతో ఏకిభావించకపోతే, వాళ్ళు చెప్పేది వినడం చాలా ముఖ్యం." 168 00:09:35,869 --> 00:09:37,954 మరి అవతలోళ్లు నా మాట వినడం సంగతి? 169 00:09:39,748 --> 00:09:40,999 కొనసాగించు. 170 00:09:40,999 --> 00:09:45,086 "కానీ నువ్వు వాళ్ళు చెప్పేది విన్న తర్వాత కూడా నువ్వే కరెక్టు అని నీకు అనిపిస్తే, 171 00:09:45,086 --> 00:09:47,672 నీతో ఉన్న నీ నమ్మకం తోడుగా ఉండి ధైర్యాన్ని ఇస్తుంది." 172 00:09:47,672 --> 00:09:50,717 నువ్వు అన్నది నిజమే, అమ్మా. మిస్టర్ పటేల్ నేను చెప్పేది వినాలి అంతే. 173 00:09:50,717 --> 00:09:54,638 ఏంటి? ఆహ్? నీకు అది సరిగ్గా అర్థం అయినట్టు లేదు. 174 00:09:59,684 --> 00:10:00,852 థాంక్స్. 175 00:10:06,608 --> 00:10:07,984 నువ్వు బాగానే ఉన్నావా? 176 00:10:08,944 --> 00:10:09,945 లేదు. 177 00:10:13,448 --> 00:10:15,408 అది కేవలం ఒక కీచైన్, మిల్లి. 178 00:10:15,408 --> 00:10:17,994 అందులో మనం ఒక కుటుంబం అయినప్పుడు... 179 00:10:20,455 --> 00:10:22,207 మనం మనమయ్యాము అని ఉంది. 180 00:10:24,125 --> 00:10:25,502 నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 181 00:10:26,002 --> 00:10:30,840 కానీ ఒకవేళ డాడీ ఇంకా నాన్న కోపం తెచ్చుకొని నన్ను వద్దు అనుకుంటే? 182 00:10:31,675 --> 00:10:34,469 కొన్నిసార్లు డాడీ ఇంకా నాన్న మనల్ని వదిలేస్తారేమో అని నాకు కూడా భయం వేస్తుంది, 183 00:10:34,469 --> 00:10:36,471 కానీ అలా ఏం జరగదు. 184 00:10:36,471 --> 00:10:37,764 ఒట్టు? 185 00:10:37,764 --> 00:10:41,142 లక్ష సార్లు ఒట్టు. 186 00:10:41,142 --> 00:10:44,896 నేను వెళ్లి జేన్ తో నా పని పూర్తి చేసుకొని వస్తా, అప్పుడు నీ కీచైన్ వెతకడంలో సహాయం చేస్తాను. 187 00:10:44,896 --> 00:10:46,064 సరే. 188 00:10:56,074 --> 00:10:59,494 నేను వచ్చేలోపు నీకు బాధ తగ్గుతుంది అంటే నువ్వు నా వాకిని తీసుకోవచ్చు. 189 00:10:59,995 --> 00:11:01,496 థాంక్స్, డేవిడ్. 190 00:11:02,539 --> 00:11:07,210 గుర్తుంచుకో, కొంచెం సేపే. మొత్తానికి ఇవ్వడం లేదు. 191 00:11:17,470 --> 00:11:19,264 మిస్టర్ పటేల్! ఆగండి. 192 00:11:20,891 --> 00:11:23,560 నాకు తెలిసింది. మీరు చెప్పేది వినాలి. 193 00:11:23,560 --> 00:11:25,937 క్షమించు. నేను వినాలా? 194 00:11:27,397 --> 00:11:29,774 అంటే, మీరు, నేను కూడా. మనం అందరం వినాలి. 195 00:11:29,774 --> 00:11:33,028 మనం గనుక జంవుతులకు, కీటకాలకు అలాగే మొక్కలకు మంచి... 196 00:11:33,028 --> 00:11:34,487 ముట్టుకోకు. 197 00:11:35,071 --> 00:11:38,074 క్షమించాలి. మనం వాటికి బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే, 198 00:11:38,074 --> 00:11:39,784 మనం అందరం ఒకరు చెప్పేది ఒకరు వినాలి. 199 00:11:40,535 --> 00:11:42,996 సీతాకోకచిలుకలు మూడు దేశాలు దాటి ప్రయాణించి 200 00:11:42,996 --> 00:11:46,666 తమ పిల్ల గొంగళిపురుగులు కూడా సీతాకోకచిలుకలు కావడానికి అవకాశం ఇస్తాయి. 201 00:11:46,666 --> 00:11:51,546 అవి అంత పనిచేయగలిగినప్పుడు, మనం చెప్పేది విని నేర్చుకుంటే పోయేది ఏముంది? కొంచెం? 202 00:11:54,257 --> 00:11:56,801 నాకు ఈ మొక్కలు ఎందుకు ఇంత ఇష్టమో తెలుసా? 203 00:11:57,385 --> 00:11:58,678 -వాటి వాసనా? -కాదు. 204 00:11:58,678 --> 00:11:59,763 -వాటి అందం? -కాదు. 205 00:11:59,763 --> 00:12:01,848 -వాటి రంగులు? -కాదు. ఇక గెస్ చేయడం ఆపు. 206 00:12:01,848 --> 00:12:04,809 ఇవి నాకు నా కుటుంబాన్ని గుర్తుచేస్తాయి, అందుకే ఇవంటే నాకు అంత ఇష్టం. 207 00:12:05,393 --> 00:12:06,895 ముఖ్యంగా ఇప్పుడు మనతో లేనివారు. 208 00:12:07,479 --> 00:12:09,147 అయితే అమలా ఎవరు? 209 00:12:10,315 --> 00:12:14,611 అమలాకి మా దాది పేరు పెట్టాను. అంటే మా బామ్మ. 210 00:12:16,279 --> 00:12:18,490 ఆమె ఒక కలువ పువ్వు లాంటి మహిళ, 211 00:12:19,241 --> 00:12:22,202 తన చుట్టూ ఉన్న పరిస్థితులు అల్లకల్లోలమైన నదిలా తయారైనప్పుడు నిలకడగా నిలిచింది. 212 00:12:23,119 --> 00:12:25,038 మీ దాది గొప్ప మహిళలా ఉంది. 213 00:12:27,207 --> 00:12:29,542 మీ కుటుంబం ఎప్పుడైనా సుదూర ప్రయాణాలు చేసారా? 214 00:12:29,542 --> 00:12:33,630 మా టాటా మెక్సికో నుండి వచ్చారు, అలాగే మా లోల ఫిలిప్పీన్స్ నుండి వచ్చింది. 215 00:12:33,630 --> 00:12:37,300 అంటే మీ టాటా కూడా ఆ సీతాకోకచిలుకలు ప్రయాణించినంత దూరం ప్రయాణించారు. 216 00:12:38,677 --> 00:12:40,512 అవును, మీరు అన్నది నిజమే. 217 00:12:41,513 --> 00:12:45,684 కాకపోతే, నేను ట్యాగ్ చేసిన సీతాకోకచిలుక చనిపోయింది. 218 00:12:47,727 --> 00:12:48,770 అది వినడం బాధాకరం. 219 00:12:49,896 --> 00:12:55,318 కానీ అది చేసిన ఆ ప్రయాణం వల్ల తన గొంగళిపురుగులు బ్రతికే అవకాశం దొరికింది, కదా? 220 00:12:56,695 --> 00:12:57,696 మీరు అన్నది నిజమే. 221 00:12:58,196 --> 00:13:00,907 ఒకటి చెప్పనా, మీరు గనుక మిల్క్ వీడ్ ని నాటితే ఒక పిల్ల గొంగళిపురుగు బ్రతకడానికి 222 00:13:00,907 --> 00:13:02,367 అవకాశం ఇచ్చిన వ్యక్తి అవుతారు. 223 00:13:05,203 --> 00:13:06,454 డేవిడ్? 224 00:13:06,454 --> 00:13:08,790 -వాడు ఇక్కడ లేడు. -మిల్లి, డేవిడ్ ఎక్కడ? 225 00:13:08,790 --> 00:13:10,750 వాడు నీతో ఉన్నాడు అనుకున్నాను. 226 00:13:15,130 --> 00:13:17,090 నేను ఇప్పుడే వస్తాను, మిస్టర్ పటేల్. 227 00:13:17,090 --> 00:13:18,675 నువ్వు వస్తావని నాకు తెలుసు. 228 00:13:30,770 --> 00:13:32,856 మన సీతాకోకచిలుక ఏదో ఒక పెద్ద పని చేస్తున్నట్టు ఉంది. 229 00:13:32,856 --> 00:13:34,649 -అవునా? -నేను నీకు చూపిస్తాను పద. 230 00:13:34,649 --> 00:13:38,153 ఈసారి నేను కూడా నీతో గాలిలో ప్రయాణించొచ్చా? 231 00:13:38,737 --> 00:13:40,655 నువ్వు ఆ విషయాన్ని గ్రేబియర్డ్ తో మాట్లాడుకోవాలి. 232 00:13:43,158 --> 00:13:44,409 పదా. 233 00:13:46,036 --> 00:13:48,038 ఇది సురక్షితమే, కదా? 234 00:13:48,038 --> 00:13:51,499 దాదాపుగా అంతే. గట్టిగా పట్టుకో. మనం కొన్ని సీతాకోకచిలుకల పిల్లల్ని కనిపెట్టాలి. 235 00:13:55,712 --> 00:13:57,339 గొంగళిపురుగుల కోసం స్కాన్ చెయ్, డేవిడ్. 236 00:13:57,339 --> 00:13:59,758 స్కాన్ చేస్తున్నాను. గొంగళిపురుగులు ఏం కనిపించలేదు. 237 00:13:59,758 --> 00:14:01,509 నాకేం అర్థం కావడం లేదు. 238 00:14:01,509 --> 00:14:05,263 దానికి పిల్లలు ఏం లేకపోతే, అది ఇంత దూరం ప్రయాణించి ఏం ప్రయోజనం? 239 00:14:06,306 --> 00:14:07,557 అది పడ్డ ప్రయాస అంత వృధానే. 240 00:14:07,557 --> 00:14:11,311 గొంగళిపురుగులు లేవు, కానీ స్కానర్ లో వేరే జీవం ఉనికి తెలిసింది. 241 00:14:11,311 --> 00:14:12,646 మార్గాన్ని సెట్ చేశాను. 242 00:14:13,521 --> 00:14:17,984 -జేన్, అక్కడ చూడు. అది ఒక... -ఒక పట్టు గూడు. 243 00:14:17,984 --> 00:14:19,778 సీతాకోకచిలుకలు ముందు గొంగళిపురుగులుగా మొదలయ్యి 244 00:14:19,778 --> 00:14:22,155 తర్వాత వాటి చుట్టూ గూడు అల్లుకొని 245 00:14:22,155 --> 00:14:25,617 ఆ తర్వాత సీతాకోకచిలుకగా మారతాయి. 246 00:14:29,329 --> 00:14:30,538 అద్భుతం. 247 00:14:30,538 --> 00:14:31,623 అలాగే వింత కూడా. 248 00:14:31,623 --> 00:14:33,041 చాలా వింతైన విషయం. 249 00:14:33,041 --> 00:14:34,584 చూడు, ఇంకా ఉన్నాయి. 250 00:14:36,169 --> 00:14:37,796 మనం ఇంకొక దాన్ని ట్యాగ్ చేయాలి. 251 00:14:48,223 --> 00:14:51,518 నేను బయటకు వెళ్ళేది లేదు. ఇంతకు ముందు గ్రేబియర్డ్ పడిపోయింది కదా? 252 00:14:53,853 --> 00:14:55,146 నాకు ట్యాగ్ చేసేది ఇవ్వు. 253 00:15:01,403 --> 00:15:05,407 అవి కదులుతూనే ఉన్నాయి. 254 00:15:05,407 --> 00:15:09,578 నేను ఆ స్నాక్ తిని ఉండకూడదు. 255 00:15:12,080 --> 00:15:13,331 ఆ ముందు ఇంకొకటి ఉంది. 256 00:15:14,708 --> 00:15:16,751 ఇది భలే సరదాగా ఉండేలా ఉంది. 257 00:15:16,751 --> 00:15:18,378 ఏంటి? సరదాగా ఏం ఉంటుంది? 258 00:15:22,883 --> 00:15:25,051 ఇదేం సరదాగా లేదు. 259 00:15:28,346 --> 00:15:29,514 సూపర్! 260 00:15:31,224 --> 00:15:32,225 మనం సాధించాం! 261 00:15:38,189 --> 00:15:39,316 మిస్టర్ పటేల్! 262 00:15:41,318 --> 00:15:43,278 క్షమించండి, కానీ మీరు అన్నది నిజం. 263 00:15:43,278 --> 00:15:45,447 -దేని గురించి? -సీతాకోకచిలుకల గురించి. 264 00:15:45,447 --> 00:15:47,616 మొత్తం ప్రయాణం అంతా అవి ఒక్కటే చేయవు. 265 00:15:48,241 --> 00:15:51,620 -అవి మొదలుపెడితే, వాటి పిల్లలు ప్రయాణం పూర్తి చేస్తాయి. -ఆహ్, భలే గొప్ప విషయం. 266 00:15:52,495 --> 00:15:55,415 తెలుసా, మా తాతబామ్మలు సగం ప్రపంచం దాటి మా అమ్మా నాన్నలు, ఆ తర్వాత నేను, నా తమ్ముళ్లు 267 00:15:55,415 --> 00:15:58,710 అలాగే చెల్లెల్లు ఇక్కడ మరిన్ని అవకాశాలు పొందుకోవాలి అన్న 268 00:15:58,710 --> 00:16:01,087 ఉద్దేశంతో ఈ దేశానికి వచ్చారు. 269 00:16:01,588 --> 00:16:04,090 అందుకోసం ఆ ప్రక్రియలో వాళ్ళు చాలా త్యాగం చేశారు. 270 00:16:04,966 --> 00:16:08,220 వినడానికి అచ్చం నీ సీతాకోకచిలుకలు చేసినట్టే ఉంది. 271 00:16:08,929 --> 00:16:11,473 మనం విషయం తెలుసుకోవడానికి ఒకరు చెప్పేది ఇంకొకరం వినాలి అంతే. 272 00:16:14,142 --> 00:16:15,268 చూడు. 273 00:16:15,268 --> 00:16:16,978 ఒక అందమైన తొట్టా? 274 00:16:16,978 --> 00:16:20,774 కాదు. నేను తొట్టెని చూపడం లేదు. దానిలోపల ఉన్నదాన్ని చూపుతున్నా. 275 00:16:20,774 --> 00:16:23,068 వసంత ఋతువు వచ్చేసరికి మొలక రావచ్చు. 276 00:16:24,778 --> 00:16:26,780 -మీరు మిల్క్ వీడ్ మొక్కలు నాటారా? -కొన్ని. 277 00:16:26,780 --> 00:16:31,117 కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు అలాగే వాళ్ళ పిల్లలకు సహాయం చేద్దాం అన్న ఉద్దేశంతో. 278 00:16:31,117 --> 00:16:32,202 థాంక్స్. 279 00:16:32,202 --> 00:16:33,995 మీరు దీనికి ఏం పేరు పెట్టబోతున్నారు? 280 00:16:33,995 --> 00:16:38,500 అమిష్, నాకు అస్తమాను చిరాకు చెప్పించే నా చిన్న తమ్ముడు, 281 00:16:39,084 --> 00:16:42,546 కానీ, ఈ మిల్క్ వీడ్ లాగే వాడు నాకు వద్దు అని అనుకున్నాను, 282 00:16:42,546 --> 00:16:44,297 కానీ ఇప్పుడు వాడు లేకపోతే నేను ఉండలేను. 283 00:16:44,297 --> 00:16:46,591 భలే మాట చెప్పారు, మిస్టర్ పటేల్. థాంక్స్. 284 00:16:48,009 --> 00:16:49,135 పదా, డేవిడ్. 285 00:16:49,135 --> 00:16:52,138 మనం మన సీతాకోకచిలుక దాని ప్రయాణాన్ని ముగించిందో లేదో చూడాలి. 286 00:16:52,138 --> 00:16:53,515 నువ్వు వెళ్ళు, నేను వస్తాను. 287 00:17:00,605 --> 00:17:01,439 మనం దగ్గరకు వచ్చామా? 288 00:17:03,066 --> 00:17:05,235 సరే. కానీ ఆశలు పెంచుకోవద్దు. 289 00:17:06,611 --> 00:17:07,529 బహుశా అది సగం దూరంలో... 290 00:17:10,364 --> 00:17:11,408 చనిపోయి ఉండొచ్చు. 291 00:17:12,909 --> 00:17:15,453 ఇది బాధాకరమే, కానీ దీని ప్రయాస వ్యర్థం అయ్యుంటుందని నేను అనుకోను. 292 00:17:16,662 --> 00:17:18,747 ఆగు, నేను జూమ్ చేస్తే? 293 00:17:18,747 --> 00:17:20,458 అది నేను అనుకునేదేనా? 294 00:17:21,208 --> 00:17:23,335 సీతాకోకచిలుక గుడ్లు. అలాగే చూడు... 295 00:17:26,171 --> 00:17:28,174 వందల కొలది గొంగళిపురుగులు. 296 00:17:29,342 --> 00:17:30,677 అవి భలే అందంగా ఉన్నాయి. 297 00:17:31,261 --> 00:17:34,389 ఈ సీతాకోకచిలుకలకు తమ ప్రయాణంలో ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కొంచెం మిల్క్ వీడ్ ఉంటే చాలు. 298 00:17:36,975 --> 00:17:38,810 డేవిడ్ కి ఇది చూపించే వరకు నేను ఆగలేకపోతున్నాను. 299 00:17:42,564 --> 00:17:43,607 దొరికిందా? 300 00:17:44,691 --> 00:17:45,692 ఇంకా లేదు. 301 00:17:45,692 --> 00:17:48,486 మనం నీ దానిని కనిపెట్టేవరకు నువ్వు నాది తీసుకుంటావా? 302 00:17:48,486 --> 00:17:50,405 -నిజంగా? -నిజంగా. 303 00:17:50,405 --> 00:17:52,532 థాంక్స్, డేవిడ్. 304 00:17:53,783 --> 00:17:54,951 ఏం పర్లేదు. 305 00:17:55,619 --> 00:17:57,120 -ఇదుగో. -థాంక్స్. 306 00:17:59,080 --> 00:18:00,999 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 307 00:18:06,129 --> 00:18:11,259 వావ్. ఇది భలే ఉంది. 308 00:18:11,843 --> 00:18:13,053 ఇంకా ఉంది చూడు. 309 00:18:18,225 --> 00:18:19,309 ఇప్పుడు నువ్వు ట్రై చెయ్. 310 00:18:27,651 --> 00:18:28,777 మిల్లి? 311 00:18:29,361 --> 00:18:30,320 హాయ్, జేన్. 312 00:18:30,320 --> 00:18:32,572 మన పని పూర్తి చేశాక ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాను. 313 00:18:32,572 --> 00:18:35,283 మంచి ఆలోచన. దీనిని చూడు, మిల్లి. 314 00:18:37,869 --> 00:18:40,872 -వింతగా ఉంది. -అద్భుతంగా కూడా ఉంది, కదా. 315 00:18:41,581 --> 00:18:43,041 అద్భుతమైన వింతలా ఉంది. 316 00:18:53,051 --> 00:18:55,136 మోనార్క్ సీతాకోకచిలుకలను కాపాడడంలో సహాయం చేయండి. 317 00:18:59,683 --> 00:19:01,893 డేవిడ్, నేను కూడా సీతాకోకచిలుకల వ్యక్తితో మాట్లాడొచ్చా? 318 00:19:01,893 --> 00:19:05,480 -నీ ఉద్దేశం డాక్టర్ ప్యాట్రిక్ గ్వెర్రా తోనా? -అవును, నాకు సీతాకోకచిలుకల గురించి వినాలని ఉంది. 319 00:19:05,480 --> 00:19:07,399 నువ్వు ఆ విషయం జేన్ ని అడగాలి. 320 00:19:09,442 --> 00:19:11,945 -జేన్ ని ఏమని అడగాలి? -నేను కూడా ప్యాట్రిక్ తో మాట్లాడొచ్చా? 321 00:19:11,945 --> 00:19:14,656 తప్పకుండా, ఆయనకు మోనార్క్ సీతాకోకచిలుకల గురించి అంతా తెలుసు. 322 00:19:14,656 --> 00:19:16,324 కానీ ముందు, ఇది చూడండి. 323 00:19:16,324 --> 00:19:17,409 మట్టా? 324 00:19:17,409 --> 00:19:19,744 నేను గెస్ చేస్తాను. అందులో మిల్క్ వీడ్ విత్తనాలు ఉన్నాయా? 325 00:19:19,744 --> 00:19:22,038 అవును. మిస్టర్ పటేల్ మిగిలిన కొన్ని విత్తనాల్ని ఇచ్చారు. 326 00:19:22,038 --> 00:19:23,164 నాకు తెలుసు. 327 00:19:23,164 --> 00:19:25,166 ఇవి పెరగడం మొదలయ్యాక వీటిని బయటకు తీసుకొస్తాను. 328 00:19:25,166 --> 00:19:28,503 అప్పుడు మన దగ్గరకు సీతాకోకచిలుకలు వస్తాయి, అప్పుడు మనం కూడా ప్యాట్రిక్ లాగ చాలా నేర్చుకోవచ్చు. 329 00:19:28,503 --> 00:19:29,838 నేను ఎదురు చూడలేకపోతున్నాను. 330 00:19:29,838 --> 00:19:31,047 వచ్చాడు. 331 00:19:31,047 --> 00:19:32,924 హాయ్, ప్యాట్రిక్! 332 00:19:35,218 --> 00:19:36,428 మీరు మ్యూట్ లో ఉన్నారు. 333 00:19:37,596 --> 00:19:40,098 -క్షమించాలి, అలా అస్తమాను అవుతుంది. -అదేం పర్లేదు లెండి. 334 00:19:40,098 --> 00:19:42,767 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. హాయ్... 335 00:19:42,767 --> 00:19:44,853 -నేను మిల్లిని. -ఈమె నా చెల్లి. 336 00:19:44,853 --> 00:19:47,981 మీతో మోనార్క్ సీతాకోకచిలుకల గురించి మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 337 00:19:47,981 --> 00:19:49,274 మొదటి ప్రశ్న, 338 00:19:49,274 --> 00:19:52,861 గొంగళిపురుగులు సీతాకోకచిలుకలుగా మారినపుడు, ఎక్కడికి వెళ్లాలో వాటికి ఎలా తెలుస్తుంది? 339 00:19:52,861 --> 00:19:56,740 మోనార్క్ లకు, అవి పుట్టినప్పుడే సమాచారం అంతా వాటి మెదడులో ఉంటుంది. 340 00:19:56,740 --> 00:19:59,701 అలాగే గొప్ప విషయం ఏంటంటే, వాటి మెదడు చాలా చిన్నగా ఉంటుంది, 341 00:19:59,701 --> 00:20:01,578 ఒక గుండు సూది గుండు అంత. 342 00:20:01,578 --> 00:20:03,997 మేము కూడా ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. 343 00:20:03,997 --> 00:20:06,207 మీకు చూపించడానికి నా దగ్గర ఏమైనా ఫోటో ఉందేమో చూస్తాను. 344 00:20:06,207 --> 00:20:08,001 మీరు ఆ ఫొటోలో ఏం చేస్తున్నారు? 345 00:20:08,001 --> 00:20:10,420 మేము కట్టబడిన మోనార్క్ సీతాకోకచిలుకను టెస్ట్ చేస్తున్నాం. 346 00:20:10,420 --> 00:20:13,632 దాని ద్వారా మాకు అది ఏ దిశలో ఎగరడానికి ప్రయత్నిస్తుందో తెలుస్తుంది. 347 00:20:13,632 --> 00:20:16,509 ఉదాహరణకు, అది ఉత్తరానికి వెళ్తుందా, దక్షిణానికా, తూర్పుకా లేక పశ్చిమానికా అని. 348 00:20:16,509 --> 00:20:18,094 చాలా బాగుంది. 349 00:20:18,094 --> 00:20:20,305 మీరు మొదటి నుండి సీతాకోకచిలుకలతోనే పని చేయాలని ఆశపడ్డారా? 350 00:20:20,305 --> 00:20:21,389 అలా ఏం కాదు. 351 00:20:21,389 --> 00:20:23,516 నేను నా చిన్నప్పుడు ఒక డిటెక్టివ్ ని కావాలి అనుకున్నాను. 352 00:20:23,516 --> 00:20:25,560 మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అలాంటి పనే చేస్తున్నా. 353 00:20:25,560 --> 00:20:27,604 నేను సమస్యలను పరిష్కరిస్తూ, డిటెక్టివ్ పని చేస్తూ, 354 00:20:27,604 --> 00:20:30,607 మోనార్క్ లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ అవి ఏం చేస్తున్నాయో కనిపెడుతున్నాను. 355 00:20:30,607 --> 00:20:34,152 వాటి వలస ప్రయాణం మొత్తం నాకు నా కుటుంబ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. 356 00:20:34,152 --> 00:20:36,404 మా అమ్మా నాన్నలు ఫిలిప్పీన్స్ నుండి వలస వచ్చి 357 00:20:36,404 --> 00:20:38,865 నేరుగా కెనడాకు వెళ్లారు. 358 00:20:38,865 --> 00:20:40,283 అలాగే ఒకసారి నేను పెరిగి పెద్దయిన తర్వాత, 359 00:20:40,283 --> 00:20:43,245 నేను కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వలస వచ్చాను, 360 00:20:43,245 --> 00:20:44,204 ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా. 361 00:20:44,204 --> 00:20:46,706 వినడానికి చాలా కష్టమైన పనిలా ఉంది, మోనార్క్ లకు కూడా అది కష్టంగానే ఉంటుందా? 362 00:20:46,706 --> 00:20:50,210 ఈ మధ్య మోనార్క్ లకు ఆ వలస ప్రయాణం కొంచెం కష్టం అవుతోంది. 363 00:20:50,210 --> 00:20:52,963 చాలా కాలం క్రితం, మోనార్క్ లు వలస ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, 364 00:20:52,963 --> 00:20:55,090 అవి బహిరంగ ప్రదేశాల గుండా ప్రయాణం చేసేవి. 365 00:20:55,090 --> 00:20:58,635 కానీ ఇప్పుడు, సిటీల కారణంగా, ఒక్కసారిగా ఆ వాటి నివాసస్థలాలు మారిపోయాయి. 366 00:20:58,635 --> 00:21:01,763 ఇప్పుడు ముందెన్నడూ లేనంత పెద్ద బిల్డింగులు ఉన్నాయి. 367 00:21:01,763 --> 00:21:04,140 మేము ఈ బిల్డింగులను మోనార్క్ సీతాకోకచిలుకల వలస క్రమానికి 368 00:21:04,140 --> 00:21:06,851 ఆటంకం కలిగించకుండా ఎలా కట్టగలమా అని తెలుసుకోవడానికి చూస్తున్నాం. 369 00:21:06,851 --> 00:21:08,270 వాటికి సహాయం చేయడానికి మనం ఏం చేయగలం? 370 00:21:08,270 --> 00:21:10,730 మంచి విషయం ఏంటంటే, అందరూ వారి వంతు పని చేయొచ్చు. 371 00:21:10,730 --> 00:21:12,524 నేను నా స్క్రీన్ ని షేర్ చేస్తాను. 372 00:21:12,524 --> 00:21:13,900 నా పేరు జెనవీవ్ లీరూ, 373 00:21:13,900 --> 00:21:16,695 నేను గాటినూ, క్యుబెక్, కెనడాలో నుండి 16 సంవత్సరాల 374 00:21:16,695 --> 00:21:18,280 మోనార్క్ సీతాకోకచిలుకల సంరక్షకురాలిని. 375 00:21:18,280 --> 00:21:22,200 నేను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా మోనార్క్ సీతాకోకచిలుకల సంరక్షణ మీద పనిచేస్తున్నాను. 376 00:21:22,200 --> 00:21:24,119 ఆమె వాటికి తగిలించిన చిన్ని కంప్యూటర్ల ద్వారా 377 00:21:24,119 --> 00:21:25,662 పరిశోధకులు డేటా సేకరించడానికి సహాయం చేస్తోంది, 378 00:21:25,662 --> 00:21:28,081 దాని సహాయంతో మోనార్క్ లు ఎగురుతున్నప్పుడు పరిశోధకులు 379 00:21:28,081 --> 00:21:29,708 వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలరు. 380 00:21:29,708 --> 00:21:31,084 అది భలే విషయం. 381 00:21:31,084 --> 00:21:32,669 అలాగే, ఏడెన్ వాంగ్ అనబడే కుర్రాడు కూడా. 382 00:21:32,669 --> 00:21:36,256 అతను న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఒక 14 ఏళ్ల కుర్రాడు. 383 00:21:36,256 --> 00:21:38,550 నేను ఎనిమిది సంవత్సరాలుగా మిల్క్ వీడ్ ని నాటుతున్నాను, 384 00:21:38,550 --> 00:21:40,802 నాకు ఆరేళ్లప్పుడు నేను ప్రారంభించాను. 385 00:21:40,802 --> 00:21:42,095 అతను మోనార్క్ లకు 386 00:21:42,095 --> 00:21:44,431 వాటి ప్రయాణ సమయంలో మరింత నివాస స్థలం అలాగే ఆహారం 387 00:21:44,431 --> 00:21:46,600 -అందించడానికి సహాయం చేస్తున్నాడు. -భలే గొప్ప సాయం చేస్తున్నాడు. 388 00:21:46,600 --> 00:21:49,102 మెక్సికోలోని ఒకరు సహాయం చేస్తున్నప్పటి వీడియోని చూపిస్తాను చూడండి. 389 00:21:49,102 --> 00:21:51,021 హాయ్, నా పేరు హోయెల్ మోరెనో. 390 00:21:51,605 --> 00:21:53,899 మేము ఇప్పుడు మోనార్క్ సీతాకోకచిలుకల సంరక్షణ స్థలంలో ఉన్నాము. 391 00:21:53,899 --> 00:21:57,569 మేము "సీతాకోకచిలుకలు అలాగే వాటి ప్రజలు" అనే నాన్-ప్రాఫిట్ సంస్థను స్థాపించి, 392 00:21:57,569 --> 00:21:59,779 వీటి అడవులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. 393 00:21:59,779 --> 00:22:01,781 నేను కూడా సీతాకోకచిలుకల రిజర్వులో పనిచేయగలిగితే బాగుండు. 394 00:22:01,781 --> 00:22:02,866 నేను కూడా. 395 00:22:02,866 --> 00:22:04,367 మోనార్క్ ల ఈ అద్భుతమైన 396 00:22:04,367 --> 00:22:06,995 రిలే పరుగును పూర్తి చేయడంలో సహాయం చేయడానికి అందరూ కలిసి పనిచేస్తున్నారు. 397 00:22:06,995 --> 00:22:09,164 ఇంకొకటి చెప్పనా? దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సభ్యులను కలవచ్చు. 398 00:22:09,164 --> 00:22:11,708 మేము మా పొరుగింటి వారితో కలిసి మిల్క్ వీడ్ పెంచడంతో మొదలెడుతున్నాం. 399 00:22:11,708 --> 00:22:13,668 -భలే, అది మంచి విషయం. -థాంక్స్, ప్యాట్రిక్. 400 00:22:13,668 --> 00:22:15,003 మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. 401 00:22:15,003 --> 00:22:19,132 గుర్తుంచుకోండి, మీరు చేసేది ఏమైనా అనవసరం, అది చాలా చిన్నదైనా, పెద్దదే అయినా కూడా, 402 00:22:19,132 --> 00:22:20,091 చివరికి విలువైనదే. 403 00:22:20,091 --> 00:22:21,885 -థాంక్స్. బై. -మళ్ళీ కలుద్దాం, బై. 404 00:22:21,885 --> 00:22:23,762 -బై, ప్యాట్రిక్. -బై. 405 00:22:24,930 --> 00:22:27,474 మనకు ఇవ్వడానికి ఏమైనా విత్తనాలు మిగిలి ఉన్నాయేమో మిస్టర్ పటేల్ గారిని అడుగుదామా? 406 00:22:27,474 --> 00:22:30,810 అవును, మనం మళ్ళీ వెళితే ఆయనకు కూడా నచ్చుతుంది. పదా. 407 00:22:33,813 --> 00:22:35,315 మేము మీకు ఎలా సహాయం చేయగలం? 408 00:23:23,863 --> 00:23:26,116 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్