1 00:00:37,247 --> 00:00:39,332 "డైసరోస్ బైకొర్నిస్." 2 00:00:45,171 --> 00:00:46,172 నా వంతు. 3 00:00:48,800 --> 00:00:50,719 మనం నల్లని రైనో కోసం వెతుకుతున్నాం అనుకున్నానే. 4 00:00:50,719 --> 00:00:52,387 ఇది చూడడానికి బూడిద రంగులో ఉంది. 5 00:00:52,387 --> 00:00:55,849 నల్లని రైనో బూడిద రంగులోనే ఉంటుంది. నిజానికి, తెల్ల రైనోలు కూడా అంతే. 6 00:00:55,849 --> 00:00:57,267 అలాంటప్పుడు పేరులో రంగు ఉండి దండగ. 7 00:00:57,767 --> 00:00:59,644 ఆ పేరు పెట్టినవారికి పేర్లు పెట్టడం రాదు అనుకుంట. 8 00:01:02,272 --> 00:01:03,982 నువ్వు ఒక నల్లని రైనోని దానికి ఉండే పొడవాటి, 9 00:01:03,982 --> 00:01:06,192 సూటిగా ఉండే పెదాలు అలాగే గుండ్రని చెవులను బట్టి గుర్తుపట్టొచ్చు. 10 00:01:06,192 --> 00:01:09,112 "గుండ్రని చెవులు ఉన్న రైనో" పేరు పలకడానికి బాగుంది. 11 00:01:11,364 --> 00:01:13,074 వాటి వినికిడి శక్తి కూడా చాలా బలమైంది. 12 00:01:13,074 --> 00:01:14,534 లేదా "సూపర్ వినికిడి ఉన్న రైనో." 13 00:01:14,534 --> 00:01:17,579 కాబట్టి ఇప్పుడు మనం దగ్గరకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. 14 00:01:17,579 --> 00:01:20,206 దగ్గరగానా? ముందు మనం ఒక ప్లాన్ వేయాలి కదా? 15 00:01:21,124 --> 00:01:23,168 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దాని పొడవాటి కొమ్ములు కనిపించడం లేదా? 16 00:01:23,668 --> 00:01:25,921 చూశాను! చూశాకే అది మగది అని తెలుసుకున్నాను కూడా. 17 00:01:25,921 --> 00:01:28,340 మగవాటికి మందమైన కొమ్ములు ఉండి, సహజంగా ఒంటరిగా తిరుగుతాయి. 18 00:01:28,340 --> 00:01:29,841 పదా, డేవిడ్! 19 00:01:37,432 --> 00:01:38,683 జేన్, ఆగు! 20 00:01:40,018 --> 00:01:41,937 నువ్వు నాతో రైనోలకు కోపం ఎక్కువ అని చెప్పావు కదా? 21 00:01:41,937 --> 00:01:43,688 అవును, కానీ అది వాటి తప్పు కాదు. 22 00:01:43,688 --> 00:01:46,233 ఒకప్పుడు లక్షల రైనోలు ఉండేవి, 23 00:01:46,233 --> 00:01:47,317 కానీ పోచింగ్ కారణంగా, 24 00:01:47,317 --> 00:01:49,527 ఇప్పుడు ప్రపంచంలో 6000 కంటే తక్కువ ఉన్నాయి. 25 00:01:49,527 --> 00:01:50,654 పోచింగ్ అంటే ఏంటి? 26 00:01:50,654 --> 00:01:53,949 ఇల్లీగల్ గా వేటాడడం. రైనోలను వాటి కొమ్ముల కోసం చంపేస్తున్నారు. 27 00:01:54,658 --> 00:01:57,285 నా విషయంలో అలా జరిగితే నేను కూడా తెలీని వారిని దగ్గరకు రానివ్వను. 28 00:01:57,786 --> 00:01:59,704 కానీ దాని వీపు మీద ఉన్న ఆ పక్షిని చూశావా? 29 00:02:00,205 --> 00:02:02,040 అది ఎర్ర ముక్కు ఉన్న ఆక్స్ పెకర్ పక్షి. 30 00:02:02,040 --> 00:02:05,210 దానికి ఉన్న ఎర్రని ముక్కు వల్ల అలా పిలుస్తారా? ఆ పేరు దానికి బాగా సరిపోయింది. 31 00:02:05,210 --> 00:02:07,837 ఏదో కారణంగా, రైనోలు వాటిని తమ వీపుల మీద ఉండనిస్తాయి. 32 00:02:07,837 --> 00:02:09,631 అది ఎందుకో మనం కనిపెట్టేసి, ఆ తర్వాత మనం 33 00:02:09,631 --> 00:02:11,424 వాటికి ఎలా సహాయం చేయగలమో తెలుసుకోగలం అనుకుంటున్నావా? 34 00:02:11,424 --> 00:02:14,719 అవును. మనం వాటికి సహాయం చేసే క్రమంలో మొదటి అడుగు రైనోలను అర్థం చేసుకోవడమే. 35 00:02:14,719 --> 00:02:17,889 ఆక్స్ పెకర్ దేనినో పొడుస్తోంది. నాకు తెలిసి అది తింటుంది అనుకుంట. 36 00:02:18,473 --> 00:02:21,309 -మనం ఇంకా దగ్గరగా వెళ్ళాలి. -మనం ముందు ప్లాన్ వేయాలి. 37 00:02:21,309 --> 00:02:22,852 దగ్గరగా వెళ్లడమే మన ప్లాన్. 38 00:02:22,852 --> 00:02:24,020 అది ఎలా ప్లాన్ అవుతుంది? 39 00:02:25,605 --> 00:02:26,606 ఏమైంది, గ్రేబియర్డ్? 40 00:02:31,194 --> 00:02:33,488 -అయ్యో! -కొత్త ప్లాన్, పరుగెత్తు! 41 00:02:38,702 --> 00:02:39,786 బానే ఉన్నావా? 42 00:02:39,786 --> 00:02:41,955 నేను బాగానే ఉన్నాను. మనం తిరిగి రైనో దగ్గరకు వెళ్ళాలి. 43 00:02:44,082 --> 00:02:45,834 చూస్తుంటే దెబ్బ బాగా తగిలినట్టు ఉంది. 44 00:02:49,588 --> 00:02:52,632 చిన్నగా గీచుకుంది అంతే. మనం సమయం వృధా చేస్తున్నాం. పదా. 45 00:02:52,632 --> 00:02:55,594 -నువ్వు దానికి ఒక బ్యాండేజ్ కడితే మంచిదేమో. -నాకేం కాలేదు. 46 00:02:55,594 --> 00:02:57,762 సరే, కానీ మనం ఇప్పుడైనా ప్లాన్ వేద్దామా? 47 00:02:57,762 --> 00:02:58,889 ఈసారి నిజమైన ప్లాన్ వేయాలి. 48 00:02:58,889 --> 00:03:01,975 "పెద్ద కొమ్ము ఉన్న రైనోకి తెలీకుండా వెనక నుండి వెళ్లి దానికి బలి కాకుండా ట్రై చేయాలి" అన్నట్టు కాదు. 49 00:03:01,975 --> 00:03:02,893 మనకు ఒక ప్లాన్ ఉంది. 50 00:03:02,893 --> 00:03:05,186 నేను ఆ ఆక్స్ పెకర్ ఏం చేస్తుందో చూడడానికి చాలా దగ్గరగా వెళ్ళాను, 51 00:03:05,186 --> 00:03:08,023 -నువ్వు అనవసరంగా గోల చేయనంత వరకు. -అంటే ఇది నా తప్పు అంటున్నావా? 52 00:03:08,023 --> 00:03:09,107 నువ్వు గట్టిగా ప్లాన్ గురించి 53 00:03:09,107 --> 00:03:11,192 మాట్లాడనంత వరకు ఆ రైనో మనల్ని చూసిందే లేదు. 54 00:03:11,192 --> 00:03:12,444 సరే, కానీ మన దగ్గర ప్లాన్ ఉండి ఉంటే, 55 00:03:12,444 --> 00:03:14,487 మన కథ దాదాపుగా "రైనో-ఓవర్" అయ్యేది కాదు. 56 00:03:14,487 --> 00:03:17,032 డేవిడ్, "రైనో-ఓవర్" ఒక పదం కాదు. 57 00:03:17,032 --> 00:03:20,035 అవును, అది పదమే. ఒక ఖడ్గమృగం చేతులో నీ కథ దాదాపుగా ముగిసినప్పుడు ఆ పదాన్ని వాడొచ్చు. 58 00:03:20,035 --> 00:03:21,953 "రైనో-ఓవర్." 59 00:03:22,704 --> 00:03:25,165 -నువ్వు ఏమంటావు, గ్రేబియర్డ్? -అవును. ఒక జట్టు ఎంచుకో. 60 00:03:32,339 --> 00:03:34,132 నువ్వు జంతువులకు సాయం చేయడం కొనసాగించాలి అనుకుంటే 61 00:03:34,132 --> 00:03:36,051 ఇలా అస్తమాను భయపడడం మానుకోవాలి. 62 00:03:36,051 --> 00:03:37,844 నువ్వు కూడా జంతువులకు సాయం చేయాలి అనుకుంటే, 63 00:03:37,844 --> 00:03:39,554 అస్తమాను నేను ఏం చేయాలో నాకు చెప్పడం మానేయాలి. 64 00:03:39,554 --> 00:03:42,224 నేను నీకు ఏం చేయాలో చెప్పకపోతే, మనం ఏమీ చేయలేము! 65 00:03:54,653 --> 00:03:57,781 హాయ్. నువ్వు నీ కోతి ఫ్రెండ్ ని అక్కడే వదిలేసావు. 66 00:04:04,746 --> 00:04:06,373 అది ఒక చింపాంజీ. 67 00:04:06,373 --> 00:04:07,916 అలాగే థాంక్స్. 68 00:04:08,875 --> 00:04:10,335 అంతా బాగానే ఉందా? 69 00:04:10,335 --> 00:04:12,587 అంతా చాలా బాగుంది, శ్రీమతి జే! 70 00:04:13,922 --> 00:04:14,965 మీరు ఎలా ఉన్నారు? 71 00:04:15,632 --> 00:04:17,675 ఓహ్, అంటే, పర్లేదు బాగున్నాను. 72 00:04:17,675 --> 00:04:21,221 సరే, ఇవాళ మీరు ఏ అడవి జంతువు వెనుక పడుతున్నారు? 73 00:04:21,221 --> 00:04:22,681 "డైసరోస్ బైకొర్నిస్." 74 00:04:24,307 --> 00:04:25,725 నువ్వు కాస్త వివరిస్తే తప్ప నాకు అర్థం కాదు. 75 00:04:25,725 --> 00:04:28,520 అది చూడడానికి ఒక ఆధునిక యుగ ట్రైసెరాటాప్స్ లాగ ఉంటుంది. 76 00:04:29,020 --> 00:04:30,730 అంటే, డేవిడ్ అయితే అలాగే చెప్పేవాడు. 77 00:04:31,439 --> 00:04:33,817 ఒక ఆధునిక యుగ ట్రైసెరాటాప్స్. 78 00:04:34,859 --> 00:04:35,860 ఒక ఖడ్గమృగమా? 79 00:04:35,860 --> 00:04:39,531 అవును. డైసరోస్ బైకొర్నిస్ అనేది దాని శాస్త్రీయ నామం. 80 00:04:39,531 --> 00:04:43,159 మేము ఒక చిన్ని ఎర్రని ముక్కు ఉండే ఆక్స్ పెకర్ ని అది దాని వీపు మీద ఎందుకు ఉండనిస్తుందో 81 00:04:43,159 --> 00:04:44,327 తెలుసుకోవడానికి చూస్తున్నాం. 82 00:04:45,537 --> 00:04:49,332 -భలే ఆసక్తికరమైన ప్రశ్న. -హాయ్, శ్రీమతి జోసెఫ్. 83 00:04:49,332 --> 00:04:50,417 హాయ్! 84 00:04:51,042 --> 00:04:54,254 -మీకోసం ఒక చిన్న కానుక. -నాకోసమా? థాంక్స్. 85 00:04:54,254 --> 00:04:55,589 చాక్లెట్ చిప్. 86 00:04:55,589 --> 00:04:58,466 అలెక్స్, నువ్వు ఈ మధ్య భలే బేకింగ్ చేస్తున్నావు. 87 00:04:58,466 --> 00:05:01,344 అవును, నిజానికి మేము వచ్చే వారం నుండి పైలు వండడం మొదలెడతాము. 88 00:05:01,344 --> 00:05:03,138 పైలా? నేను ఆగలేకపోతున్నాను. 89 00:05:03,138 --> 00:05:04,222 -థాంక్స్. -బై. 90 00:05:06,099 --> 00:05:10,020 ఒకటి చెప్పనా, నేను అతనికి రెండవ ఫ్లోర్ లో వండడం అంటే 91 00:05:10,020 --> 00:05:12,314 ఇష్టం ఉన్న ఒక పొరుగింటి వ్యక్తిని పరిచయం చేశాను. 92 00:05:13,231 --> 00:05:17,110 ఆ నల్లని రైనో ఆ చిన్ని పక్షిని ఎందుకు ఉండనిస్తుందో ఏమైనా తెలిసిందా? 93 00:05:17,110 --> 00:05:20,697 ఇంకా లేదు, కానీ ఎందుకు అనేది తెలుసుకుంటే రైనోకి సహాయం చేసే దిశగా ఒక అడుగు వేసినట్టే. 94 00:05:21,615 --> 00:05:23,950 బహుశా ఇలాంటి ముఖ్యమైన పనిలో నీకు తోడుగా 95 00:05:23,950 --> 00:05:25,452 ఇంకొకరు ఉంటే మంచిది. 96 00:05:25,952 --> 00:05:28,413 అవును, అందుకే నాతో గ్రేబియర్డ్ ఉంది. 97 00:05:29,039 --> 00:05:30,373 అవును. 98 00:05:31,041 --> 00:05:32,584 -బై, శ్రీమతి జే. -బై. 99 00:05:35,253 --> 00:05:37,255 చూస్తుంటే రైనోలు పచ్చని ఆకులు, 100 00:05:37,255 --> 00:05:41,509 పుల్లలు అలాగే "సక్యూ-లెంట్స్?" 101 00:05:41,509 --> 00:05:42,594 అవి ఏదైతే అవిలే. 102 00:05:43,094 --> 00:05:44,679 వెళ్లి జేన్ కి చెప్పు. 103 00:05:44,679 --> 00:05:47,724 -లేదు. నేను ఈ పనిని సొంతంగా చేస్తున్నాను. -అవునా? 104 00:05:49,226 --> 00:05:51,686 ఎందుకు? మీరిద్దరూ గొడవపడ్డారా? 105 00:05:52,354 --> 00:05:54,856 అవును. ఒక విధంగా. 106 00:05:55,357 --> 00:05:57,859 కానీ ఇప్పుడు నువ్వు సమస్యలో పడితే నిన్ను ఎవరు కాపాడతారు? 107 00:05:58,652 --> 00:06:02,280 -నన్ను ఎవరూ కాపాడాల్సిన పని లేదు. -నీకు ఇంకొకరి సహాయం అస్తమాను కావాలి. 108 00:06:02,280 --> 00:06:03,281 లేదు, అవసరం లేదు. 109 00:06:03,281 --> 00:06:05,533 అంతేకాక, నాకు ఒక ప్లాన్ ఉంది. 110 00:06:06,493 --> 00:06:08,328 అదేనా నీ ప్లాన్? 111 00:06:08,828 --> 00:06:12,290 కాదు. దీని ద్వారా నేను కనిపెట్టిన విషయాలను రికార్డు చేస్తాను. 112 00:06:16,586 --> 00:06:18,129 నువ్వు వాకి ద్వారా జేన్ తో మాట్లాడాలి. 113 00:06:18,129 --> 00:06:19,798 ఆమె నీ బెస్ట్ ఫ్రెండ్. 114 00:06:22,259 --> 00:06:23,510 ఇప్పుడు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. 115 00:06:23,510 --> 00:06:26,012 నా బెస్ట్ ఫ్రెండ్ కమాయ. 116 00:06:28,807 --> 00:06:31,351 నువ్వు నా రెండవ బెస్ట్ ఫ్రెండ్ వి కావచ్చు. 117 00:06:47,826 --> 00:06:51,496 నాతో వాకి లేకపోతే నేను జేన్ తో మాట్లాడాల్సిన పని ఉండదు, కదా? 118 00:06:55,792 --> 00:06:56,793 ఏమైనా కనిపించిందా? 119 00:06:58,336 --> 00:07:00,338 బహుశా దగ్గరలో ఉన్న చెత్త డబ్బా దగ్గర చూడాలేమో? 120 00:07:03,300 --> 00:07:04,301 దాక్కో! 121 00:07:11,308 --> 00:07:13,643 డేవిడ్, హాయ్! నువ్వు జేన్ కోసం వెతుకుతున్నావా? 122 00:07:13,643 --> 00:07:16,897 లేదు. నిజానికి నేను ఒక రైనో కోసం వెతుకుతున్నాను. మీరు ఒకదానిని ఇక్కడ ఏమైనా చూశారా? 123 00:07:16,897 --> 00:07:20,233 ఈ మధ్య ఏం చూడలేదు. ఒక కన్నేసి ఉంచుతాలే. 124 00:07:21,943 --> 00:07:24,529 శ్రీమతి జోసెఫ్, మీకు "సకుల్-లెంట్" అంటే ఏంటో తెలుసా? 125 00:07:25,113 --> 00:07:26,364 "సక్యూలెంట్" అంటున్నావా? 126 00:07:26,364 --> 00:07:27,616 అంటే, అదొక రకమైన మొక్క. 127 00:07:27,616 --> 00:07:30,911 నువ్వు ఏదైనా ఒక విధమైన సక్యూలెంట్ మొక్క కోసం వెతుకుతున్నావా? 128 00:07:30,911 --> 00:07:32,287 నాకు ఖచ్చితంగా తెలీదు. 129 00:07:32,287 --> 00:07:34,331 నేను నల్లని రైనోలు ఏం తింటాయో తెలుసుకోవడానికి ఆన్లైన్ లో చూస్తుండగా 130 00:07:34,331 --> 00:07:36,458 అందులో సక్యూలెంట్స్ ఇంకా ఆకులు అని చెప్పారు. 131 00:07:37,375 --> 00:07:39,169 అయితే, నువ్వు గార్డెన్ షెడ్ దగ్గర చూస్తే, 132 00:07:39,169 --> 00:07:41,421 అక్కడ కొన్ని పచ్చని ఆకులు కనిపించవచ్చు. 133 00:07:41,421 --> 00:07:42,923 నేను వెళ్లి వెంటనే చూస్తాను. 134 00:07:42,923 --> 00:07:44,799 -మీ సలహాకు థాంక్స్, శ్రీమతి జే! -అదేం పర్లేదు. 135 00:07:48,678 --> 00:07:53,391 నేను ఇక్కడ ఒక నల్లని రైనో అడుగులు చూశాను అనుకున్నాను. 136 00:07:53,391 --> 00:07:54,517 ఆ పొద వెనుకా? 137 00:07:55,018 --> 00:07:58,104 అవును, కానీ అక్కడ ఏం లేదు. తప్పుగా అనుకున్నాను. 138 00:07:58,813 --> 00:08:01,024 బహుశా గార్డెన్ షెడ్ దగ్గర ఉందేమో? 139 00:08:02,317 --> 00:08:03,526 అక్కడికి నేను తర్వాత వెళ్తాను. 140 00:08:03,526 --> 00:08:04,903 సరే. 141 00:08:04,903 --> 00:08:06,238 థాంక్స్, శ్రీమతి జే! 142 00:08:06,738 --> 00:08:08,740 -లారెన్, హాయ్. -హాయ్. 143 00:08:08,740 --> 00:08:13,453 -వచ్చేవారం పైలు చేస్తున్నారు అని విన్నాను. -నేను ఆర్డర్లు తీసుకుంటున్నాను. 144 00:08:13,453 --> 00:08:15,997 మీకు తియ్యనిది ఇష్టమా లేక ఉప్పు కారం ఉండాలా? 145 00:08:15,997 --> 00:08:17,666 -నువ్వే ఒకటి ఎంచుకో! -సరే. 146 00:08:18,250 --> 00:08:19,709 కానీ నాకు తీపి అంటే ఇష్టమే. 147 00:08:25,298 --> 00:08:27,175 దానిని బయట కనిపెట్టలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. 148 00:08:27,759 --> 00:08:30,345 ఆ 201లో ఉండే ఆవిడకు ఇది నచ్చదు. 149 00:08:37,894 --> 00:08:39,104 నువ్వు అది చూశావా? 150 00:08:40,188 --> 00:08:42,606 ఆ ఆక్స్ పెకర్ మనల్ని చూసినప్పుడు ఒక కూత పెట్టింది. 151 00:08:42,606 --> 00:08:44,192 అది రైనోని వారించింది అనుకుంటున్నావా? 152 00:08:46,319 --> 00:08:48,947 బహుశా ఆ ఆక్స్ పెకర్ ప్రమాదాన్ని గుర్తించి చెప్పడానికి దానితో ఉంటుందేమో. 153 00:08:51,408 --> 00:08:53,159 దాని హెచ్చరిక పనిచేసినట్టు ఉంది. 154 00:09:15,891 --> 00:09:17,434 పదా. 155 00:09:19,769 --> 00:09:22,230 డేవిడ్ రికార్డింగ్. దాదాపుగా భోజనం సమయం అయింది. 156 00:09:22,230 --> 00:09:23,732 నేను గార్డెన్ షెడ్ దగ్గరకు వచ్చాను. 157 00:09:23,732 --> 00:09:25,942 ఒకసారి నేను కొన్ని సక్యూలెంట్స్ లేదా ఆకు కూరలను తీసుకున్నాకా, 158 00:09:25,942 --> 00:09:27,527 వాటిని వాడి రైనోని ఇక్కడికి రప్పిస్తాను, 159 00:09:27,527 --> 00:09:29,613 తద్వారా దాని వీపు మీద ఉన్న పక్షి ఏం చేస్తుందో గమనిస్తాను. 160 00:09:31,072 --> 00:09:32,449 అలాగ జేన్ కంటే ముందే అది కనిపెడతాను. 161 00:09:38,163 --> 00:09:39,164 అద్భుతం. 162 00:09:39,164 --> 00:09:40,248 వచ్చేసింది. 163 00:09:50,425 --> 00:09:51,593 తృటిలో ప్రమాదం తప్పింది. 164 00:09:53,637 --> 00:09:54,930 డేవిడ్ ఎక్కడ? 165 00:09:54,930 --> 00:09:57,140 బహుశా తన గదిలో సురక్షితంగా కూర్చొని ఉండి ఉంటాడు. 166 00:09:57,140 --> 00:09:59,309 అలాగా. ఇంతకీ ఏమైంది? 167 00:10:14,115 --> 00:10:15,492 నేను నల్లని రైనోని కనిపెట్టాను. 168 00:10:15,492 --> 00:10:17,285 లేదా అదే నన్ను కనిపెట్టింది ఏమో. 169 00:10:17,285 --> 00:10:20,622 చూస్తుంటే దానికి దురద వస్తున్నట్టు ఉందే? ఎందుకు? 170 00:10:20,622 --> 00:10:22,332 నేను దానికి దగ్గరగా వెళ్ళాలి. 171 00:10:22,332 --> 00:10:24,000 ఇప్పుడు ఆహారాన్ని ఎరగా వేసే సమయమైంది. 172 00:10:36,012 --> 00:10:38,014 రైనోతో పాటు ఉన్నది కేవలం ఆ ఆక్స్ పెకర్ మాత్రమే కాదు, 173 00:10:38,014 --> 00:10:40,725 దాని నిండా కీటకాలు ఉన్నాయి! వాటి వల్ల నాకు కూడా దురదగా ఉంది. 174 00:10:43,270 --> 00:10:45,230 ఛీ, ఆ ఆక్స్ పెకర్ ఇప్పటి వరకు తింటుంది పురుగులనా? 175 00:10:45,230 --> 00:10:46,856 అది రైనో వీపు మీద ఉన్న పురుగుని తినేసింది! 176 00:10:46,856 --> 00:10:50,318 ఆ పురుగులను సులభంగా పట్టుకోవచ్చు కాబట్టి అది వీపు మీద ఉంటుందేమో. 177 00:10:50,318 --> 00:10:53,238 కానీ దానిని ఆ రైనో ఎందుకు ఉండనిస్తుందో ఇంకా తెలీలేదు. 178 00:10:53,780 --> 00:10:57,617 ఒకవేళ ఆ పురుగులు దానికి దురద పుట్టిస్తుంటే తప్ప! 179 00:11:07,794 --> 00:11:09,254 అది మళ్ళీ వెళ్ళిపోతోంది. 180 00:11:11,965 --> 00:11:14,175 నేను ఎరగా ఇంకా ఆహారాన్ని తీసుకురావాలి. 181 00:11:16,845 --> 00:11:18,430 నాకు కూడా ఆక్స్ పెకర్ ఫ్రెండ్ ఉండి ఉంటే బాగుండు. 182 00:11:19,681 --> 00:11:21,892 అసలు ఏ ఫ్రెండ్ ఉన్నా బాగుండేది. 183 00:11:22,517 --> 00:11:26,187 కాబట్టి ఆ ఆక్స్ పెకర్... అన్నప్పుడు రైనో వెనక్కి తిరిగింది. 184 00:11:26,187 --> 00:11:29,608 అది దానిని వారించినట్టు ఉంది, గ్రేబియర్డ్ నన్ను వారించినట్టే! 185 00:11:29,608 --> 00:11:32,569 ఆసక్తిగా ఉంది. కానీ నేను నిన్ను డేవిడ్ గురించి అడిగాను. 186 00:11:35,155 --> 00:11:36,615 సరే. విషయం చెప్పు. 187 00:11:38,074 --> 00:11:39,242 మేము గొడవపడ్డాం. 188 00:11:39,242 --> 00:11:40,535 నువ్వు ఏం చేసావు? 189 00:11:40,535 --> 00:11:42,579 వాడు నాతో నేను అస్తమానం వాడికి ఏం చేయాలో చెప్తాను అన్నాడు. 190 00:11:42,579 --> 00:11:44,456 నువ్వు ఏం చేసావు? 191 00:11:46,333 --> 00:11:47,709 నేను వాడు అన్నిటికీ భయపడతాడు అన్నాను. 192 00:11:48,585 --> 00:11:49,586 నువ్వు... 193 00:11:51,296 --> 00:11:53,215 నేను వాడు అన్నిటికీ భయపడతాడు అన్నాను. 194 00:11:53,798 --> 00:11:56,801 అలాగా. చూస్తుంటే మీరిద్దరూ అనకూడని కొన్ని మాటలు అని బాధపడుతున్నట్టు ఉన్నారు. 195 00:11:56,801 --> 00:11:59,054 నాకు వాడి అవసరం లేదు కాబట్టి అదంతా అనవసరం. 196 00:11:59,054 --> 00:12:01,973 నేను రైనోని కనిపెట్టాను. ఆ ఆక్స్ పెకర్ దానిని వారించడం చూసా. 197 00:12:01,973 --> 00:12:03,642 అదంతా నేను ఒక్కదానినే చేశాను. 198 00:12:03,642 --> 00:12:05,268 దానితో తొక్కేయబడేంత ప్రమాదంలో పడ్డావు కూడా. 199 00:12:05,769 --> 00:12:08,521 ప్రకృతి ప్రమాదకరమైంది. దానిలో నాకు నచ్చే గుణాలలో అది ఒకటి. 200 00:12:08,521 --> 00:12:10,273 నీకు మొదటి నుండి ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు. 201 00:12:10,273 --> 00:12:11,942 చిన్నప్పటి నుండే. 202 00:12:11,942 --> 00:12:14,319 కాకపోతే క్షమించమని అడిగేంత ధైర్యం నీకు ఉందా? 203 00:12:17,280 --> 00:12:19,908 అయితే డేవిడ్ నీకు పంపించిన వార్త ఏంటో నీకు తెలుసుకోవాలని లేదేమోలే, ఆ డబ్బా... 204 00:12:20,533 --> 00:12:22,160 బీఎమ్ఎస్? 205 00:12:22,160 --> 00:12:23,912 బాల్కనీ మెసేజ్ సిస్టమ్. 206 00:12:24,621 --> 00:12:26,581 -ఇందాక దాని శబ్దం విన్నాను. -అవునా? 207 00:12:37,801 --> 00:12:39,052 డేవిడ్ వాకి ఫోన్? 208 00:12:45,016 --> 00:12:47,435 చూస్తుంటే వాడికి ఇక నాతో ఫ్రెండ్ గా ఉండడం ఇష్టం లేనట్టు ఉంది. 209 00:12:52,357 --> 00:12:55,151 హేయ్, అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? 210 00:12:55,151 --> 00:12:57,612 నేను బిల్డింగ్ దగ్గరలో రైనోకి ఆహారం ఏమైనా దొరుకుతుందేమో చూస్తున్నాను. 211 00:12:57,612 --> 00:13:02,158 సరే, నువ్వు బిల్డింగ్ ప్రాంగణంలో వెతకొచ్చు, కానీ నువ్వు వెతకగల ఇంకొక ప్రదేశం గురించి చెప్పనా? 212 00:13:02,158 --> 00:13:03,410 జేన్ వాళ్ళ అపార్ట్మెంట్. 213 00:13:03,410 --> 00:13:06,538 మొన్న నేను వాళ్ళ అమ్మ కొన్ని సక్యూలెంట్ కాయగూరలు తేవడం చూశాను. 214 00:13:07,038 --> 00:13:08,873 ఆమె నీకు ఖచ్చితంగా అవి ఇస్తుందని అనుకుంటున్నాను. 215 00:13:09,457 --> 00:13:11,001 నేను వాటిని ఇంకొక చోట వెతుక్కుంటాలెండి. 216 00:13:11,001 --> 00:13:16,715 ఒకటి చెప్పనా, ఒకరిపై కోపం ఉన్నా కూడా వారిని మిస్ అవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. 217 00:13:17,382 --> 00:13:20,677 -అవునా? -అవును. అలా అందరికీ అస్తమాను అవుతుంది. 218 00:13:21,177 --> 00:13:23,930 అంటే, నా చెల్లితో, నా మాజీ ప్రాయుడితో, నా పిల్లలతో. 219 00:13:25,515 --> 00:13:28,018 చాలా సార్లు మనం ఎక్కువగా ప్రేమించే వారే 220 00:13:28,018 --> 00:13:30,103 మనల్ని అత్యంత ఎక్కువగా కోపానికి గురిచేసేవారు అవుతారు. 221 00:13:30,103 --> 00:13:31,980 జేన్ ఇంకా నీ మధ్య కూడా అదే జరుగుతుందని నా ఉద్దేశం. 222 00:13:35,066 --> 00:13:38,111 థాంక్స్. మళ్ళీ కలుస్తాను, శ్రీమతి జే. 223 00:13:39,404 --> 00:13:40,405 తప్పకుండా కలువు. 224 00:13:43,325 --> 00:13:44,326 శ్రీమతి జే! 225 00:13:45,243 --> 00:13:47,954 నేను ఒక రైనో చేతుల్లో చావుకు ఎంత దగ్గరకు వెళ్లానో చెప్తే మీరు నమ్మరు. 226 00:13:48,580 --> 00:13:50,498 భలే ఆసక్తికరమైన విషయం. 227 00:13:50,498 --> 00:13:53,835 అంటే, నేను ఇప్పుడే డేవిడ్ ని చూశాను, వాడు నాకు ఆ విషయం ఏం చెప్పలేదు. 228 00:13:55,462 --> 00:13:58,882 ఎందుకంటే ఇప్పుడు ఇక నేను ఇంకా డేవిడ్ కలిసి అన్వేషణలు చేయడం లేదు. 229 00:14:00,258 --> 00:14:03,303 అవునా? ఎందుకు? 230 00:14:05,013 --> 00:14:06,014 మేము గొడవపడ్డాం. 231 00:14:07,724 --> 00:14:09,684 అంటే, కోపం రావడంలో ఎలాంటి తప్పు లేదు... 232 00:14:09,684 --> 00:14:12,729 నాకు తెలుసు. ముఖ్యంగా మనం మన కోపాన్ని మంచికి ఉపయోగించగలిగితే అస్సలు తప్పు లేదు. 233 00:14:13,230 --> 00:14:16,441 అంటే, వాటి కొమ్ముల గురించి రైనోలను చంపడం వల్ల నాకు చాలా కోపంగా ఉంది, 234 00:14:16,441 --> 00:14:17,859 కాబట్టి నేను వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాను. 235 00:14:17,859 --> 00:14:18,944 అద్భుతం! 236 00:14:18,944 --> 00:14:22,906 శ్రీమతి జే, మీరు డేవిడ్ వాకిని తీసుకొని, ఏమైనా రైనోలు కనిపిస్తే నాకు చెప్తారా? 237 00:14:24,282 --> 00:14:27,744 "మనం అందరం మన సొంత జీవితాల పట్ల బాధ్యత తీసుకొని 238 00:14:27,744 --> 00:14:32,082 మన చుట్టూ ఉన్న అన్నింటిపై, ముఖ్యంగా ఒకరిపై ఒకరం గౌరవం అలాగే ప్రేమను 239 00:14:32,082 --> 00:14:33,500 వ్యక్తపరుస్తూ ఉండాలి." 240 00:14:34,584 --> 00:14:37,295 ఆ వ్యాఖ్య ఉన్న స్టికర్ ని నేను వాడి కోసం చేశాను. అది జేన్ గుడ్ఆల్ చెప్పిన మాట. 241 00:14:38,004 --> 00:14:40,131 ఆమె చాలా తెలివైన వ్యక్తిలా ఉంది. 242 00:14:42,384 --> 00:14:47,305 బహుశా నువ్వు, డేవిడ్ కూడా మీ గొడవకు బాధ్యత తీసుకోవాలి ఏమో? 243 00:14:50,225 --> 00:14:52,102 వాడికి ఇక నాతో ఫ్రెండ్ గా ఉండాలని లేదు అనుకుంట. 244 00:14:52,936 --> 00:14:53,979 నేను అలా అనుకోను. 245 00:14:54,604 --> 00:14:56,523 ఏదైతేనేం, రైనోలు అంటే గుర్తుకు వచ్చింది, 246 00:14:56,523 --> 00:15:00,026 నేను మూడవ ఫ్లోర్ హాల్ లో చాలా గట్టి శబ్దాలను విన్నాను. 247 00:15:01,194 --> 00:15:02,529 నేను వెళ్లి అదేంటో చూస్తాను. 248 00:15:03,530 --> 00:15:04,531 ఆగు, జేన్. 249 00:15:05,073 --> 00:15:07,325 నాకెందుకో నీకు ఇది అవసరం అవుతుంది అనిపిస్తోంది. 250 00:15:08,535 --> 00:15:10,829 సరే, ఇక త్వరపడు, ఆ రైనోని నువ్వు వెళ్ళిపోనివ్వకూడదు. 251 00:15:34,060 --> 00:15:35,020 డేవిడ్? 252 00:15:36,354 --> 00:15:37,522 అవును, జేన్ వాళ్ళ అమ్మగారు? 253 00:15:37,522 --> 00:15:39,274 బయట అంతా బాగానే ఉందా? 254 00:15:40,692 --> 00:15:43,028 అవును. పర్లేదు. 255 00:15:46,823 --> 00:15:47,824 జేన్ ఇక్కడ లేదు. 256 00:15:48,533 --> 00:15:50,493 అదేం పర్లేదు. నేను మీ కోసమే వచ్చాను. 257 00:15:50,994 --> 00:15:53,079 మీరు సక్యూలెంట్ కాయగూరలు లేదా ఆకుకూరలు అరువుగా ఇవ్వగలరా? 258 00:15:53,079 --> 00:15:55,540 అరువుగా అంటే మొత్తానికే. 259 00:15:56,041 --> 00:15:58,793 ఆ రైనో వాటిని తిన్న తర్వాత వాటిని మీరు తీసుకోవాలని అనుకోరు. 260 00:16:05,008 --> 00:16:06,509 ఆ శబ్దం ఆ చివరి నుండి వచ్చింది. 261 00:16:06,509 --> 00:16:09,512 ఆ ఆక్స్ పెకర్ గనుక మనల్ని చూసి అరిచింది అంటే, మనం అనుకున్నది కరెక్టు అని అర్థం. 262 00:16:15,060 --> 00:16:16,478 -డేవిడ్? -జేన్? 263 00:16:16,478 --> 00:16:18,813 -నువ్వు రైనోవి అనుకున్నాను! -నేను కూడా నువ్వు అదే అనుకున్నాను! 264 00:16:18,813 --> 00:16:21,942 -నన్ను భయపెట్టేశావు. -నువ్వు నన్ను భయపెట్టలేదు. 265 00:16:23,443 --> 00:16:25,528 మేము రైనోకి దగ్గరగా వెళ్తే ఆ ఆక్స్ పెకర్ పక్షి 266 00:16:25,528 --> 00:16:26,988 అరుస్తుందో లేదో చూడడానికి వెళ్తున్నాం. 267 00:16:26,988 --> 00:16:28,406 ఇంతకు ముందు హాల్ లో అదే జరిగింది. 268 00:16:28,406 --> 00:16:31,243 అంటే, ఆ ఆక్స్ పెకర్ రైనోకి హెచ్చరికలు చేస్తుంది అంటున్నావా? 269 00:16:31,243 --> 00:16:33,203 నేను, గ్రేబియర్డ్ అదే అనుకుంటున్నాం. 270 00:16:33,787 --> 00:16:35,789 నేను రైనో దాని తల గోక్కోవడం చూసాను, 271 00:16:35,789 --> 00:16:37,916 తర్వాత ఆ ఆక్స్ పెకర్ దాని మీద పురుగులను తినడం చూసా. 272 00:16:37,916 --> 00:16:40,460 అంటే చిరాకు తెప్పించే పురుగులను తినడానికి ఆ రైనో దానిని ఉండనిస్తుందా? 273 00:16:40,460 --> 00:16:42,712 నేను అదే కనుగొనడానికి వెళ్తున్నాను. 274 00:16:44,798 --> 00:16:46,299 సరే, గుడ్ లక్. 275 00:16:47,384 --> 00:16:49,302 -సరే, నీకు కూడా. -సరే. 276 00:16:51,096 --> 00:16:52,097 బై. 277 00:16:52,889 --> 00:16:53,890 అవును. 278 00:16:55,976 --> 00:16:57,894 సరే, గుడ్ బై. 279 00:17:05,068 --> 00:17:08,196 -నువ్వు అన్నిటికీ భయపడతావని నేను అనుకోను. -అవునా? 280 00:17:08,196 --> 00:17:09,906 మనం ప్రమాదకరమైన పనులు చేస్తుంటాం. 281 00:17:09,906 --> 00:17:11,491 కొంచెం భయం వేయడం సహజమే. 282 00:17:12,617 --> 00:17:15,536 జరగబోయే అత్యంత దారుణమైన, భయంకరమైన విషయాన్ని ఆలోచించడం ద్వారానే 283 00:17:16,036 --> 00:17:18,081 నువ్వు బహుశా గొప్ప ప్లానులు వేస్తున్నావు ఏమో. 284 00:17:18,998 --> 00:17:22,585 -కాబట్టి, నన్ను క్షమించు. -థాంక్స్. 285 00:17:23,085 --> 00:17:25,546 నువ్వు నాకు చెప్పడానికి ఏమీ లేదా? 286 00:17:28,967 --> 00:17:31,428 ఏంటి? నువ్వు నిజంగానే నాకు అస్తమాను ఏదోకటి చెప్తుంటావు. 287 00:17:32,596 --> 00:17:34,431 కానీ ఎందుకో నేను అర్థం చేసుకోగలను. 288 00:17:35,098 --> 00:17:37,601 మన ముఖ్యమైన పనులలో నువ్వే మా నాయకురాలివి. 289 00:17:37,601 --> 00:17:39,769 కాబట్టి, నన్ను క్షమించు. 290 00:17:42,814 --> 00:17:44,065 కానీ నీ అంత సారి కాదు. 291 00:17:47,152 --> 00:17:49,529 సరేలే, నేను కూడా నీ అంత సారీ. 292 00:17:50,572 --> 00:17:52,407 నాయకురాలిగా, నేను దానిని అంగీకరిస్తున్నాను. 293 00:17:52,991 --> 00:17:53,992 ఇంకొక విషయం. 294 00:17:57,412 --> 00:17:58,246 ఇదుగో. 295 00:17:59,873 --> 00:18:00,874 థాంక్స్. 296 00:18:03,293 --> 00:18:05,962 మన ఇద్దరి ఐడియాలను చెక్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ వేద్దామా? 297 00:18:05,962 --> 00:18:07,255 కలిసి చేద్దాం అంటేనే. 298 00:18:20,518 --> 00:18:21,770 డేవిడ్ రికార్డింగ్. 299 00:18:21,770 --> 00:18:25,065 నేను ఆ రైనో తినే ఆహారాన్ని తిని చూశాను, అంత బాలేదు. 300 00:18:25,941 --> 00:18:30,403 అంటే, నేను ఆ రైనోని చూస్తున్నాను. మన ప్లాన్ ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఓవర్. 301 00:18:30,403 --> 00:18:31,696 నువ్వు సిద్ధం అయితే నేను కూడా సిద్ధమే. 302 00:18:33,406 --> 00:18:34,908 హేయ్, ఆక్స్ పెకర్ పక్షి! 303 00:18:36,618 --> 00:18:38,411 ఇక్కడ ఉన్నాను! 304 00:18:44,125 --> 00:18:47,212 నువ్వు అన్నది నిజమే, ఆ రైనోకి ఆ ఆక్స్ పెకర్ పక్షి హెచ్చరిక ఇచ్చింది. ఇప్పుడు నీ వంతు! 305 00:18:52,133 --> 00:18:54,636 నేను బెంచ్ దగ్గర ఉన్నాను! అంటే, నేను బెంచ్ కింద ఉన్నాను. 306 00:18:54,636 --> 00:18:56,471 నేను తినడానికి ఏం బాగొను! 307 00:18:57,514 --> 00:18:59,558 ఇలా రా, ఖడ్గమృగమా. నీకు ఆకలిగా ఉందా? 308 00:19:15,865 --> 00:19:16,825 హాయ్. 309 00:19:18,410 --> 00:19:21,121 డేవిడ్. నువ్వు జేన్ తో సమాధానపడ్డావా? 310 00:19:21,121 --> 00:19:23,582 అవును. అలాగే మేము కలిసి ఒక ప్లాన్ కూడా వేసాం. 311 00:19:23,582 --> 00:19:25,709 అది భలే విషయం. 312 00:19:26,459 --> 00:19:30,046 ఒకటి చెప్పనా, ఈ సందర్భాన్ని వేడుక జరుపుకోవడానికి నేను మీ ఇద్దరికీ ఒకటి ఇస్తాను. 313 00:19:30,046 --> 00:19:32,507 ఇందుకు, నేను నా బేక్ చేయబడిన కేకులు ఇస్తాను. 314 00:19:40,223 --> 00:19:41,600 త్వరగా! అది వచ్చేస్తోంది! 315 00:19:51,693 --> 00:19:54,070 అది భలే ఉంది. 316 00:19:55,030 --> 00:19:56,281 చూడు, మన ప్లాన్ పనిచేస్తోంది. 317 00:19:56,281 --> 00:19:57,824 అలాగే స్పష్టంగా అంతా చూడగలుగుతున్నాం. 318 00:19:58,325 --> 00:20:03,413 ఆ ఆక్స్ పెకర్ పురుగులను తింటుంది, కానీ కేవలం రైనో వీపు మీద నుండి మాత్రమే కాదు. 319 00:20:03,413 --> 00:20:05,081 అది దాని చెవుల్లో నుండి కూడా తింటుందా? 320 00:20:05,081 --> 00:20:07,500 అలాగే ముక్కులో నుండి? ఛీ. 321 00:20:10,420 --> 00:20:13,590 బహుశా దానిని ముక్కులోది తినే ఎర్రని ముక్కు పక్షి అనాలేమో. 322 00:20:15,467 --> 00:20:18,345 కానీ ఆ ఆక్స్ పెకర్ కేవలం చిరాకు తెప్పించే పురుగులను తినడం మాత్రమే కాదు, 323 00:20:18,345 --> 00:20:19,971 అది రైనోని శుభ్రంగా ఉంచుతుంది కూడా. 324 00:20:19,971 --> 00:20:22,682 అత్యంత దారుణమైన విధానంలో. 325 00:20:23,934 --> 00:20:26,436 అలాగే దానిని వారించడం గురించి నువ్వు అన్నది కూడా నిజమే. 326 00:20:27,771 --> 00:20:31,733 ఆ ఆక్స్ పెకర్ పోచర్ల నుండి కాపాడుకోవడానికి రైనోకి ఉన్న ఇంకొక జత కళ్లలా పనిచేస్తోంది. 327 00:20:32,317 --> 00:20:33,735 అవి రెండూ భలే జట్టు. 328 00:20:38,823 --> 00:20:40,867 నువ్వు అన్నది నిజం, గ్రేబియర్డ్. మనది కూడా భలే జట్టే. 329 00:20:42,327 --> 00:20:43,578 హేయ్, పిల్లలూ. 330 00:20:43,578 --> 00:20:44,788 హాయ్, శ్రీమతి జే. 331 00:20:48,041 --> 00:20:51,670 -సరే, మీరు మీ పనిని పూర్తి చేసారా? -చేసేసాం. 332 00:20:52,837 --> 00:20:55,090 ఇప్పుడు మేము రైనోలను అర్థం చేసుకున్నాం కాబట్టి వాటికి సహాయం చేయగలం. 333 00:20:55,090 --> 00:20:56,007 ఎలా? 334 00:20:56,007 --> 00:20:58,927 ఆ ఆక్స్ పెకర్ లాగే మేము కూడా రైనోని జాగ్రత్తగా చూసుకుంటాం. 335 00:20:58,927 --> 00:21:02,264 అంటే, మనం అందరం చేయాల్సిన పనే కదా అది? ఒకరి క్షేమాన్ని ఇంకొకరు చూసుకోవాలి కదా? 336 00:21:02,847 --> 00:21:06,309 ఒకరిని ఒకరం, అలాగే జంతువుల క్షేమాన్ని కూడా. 337 00:21:07,978 --> 00:21:08,853 నిమ్మకాయ నీళ్లు కావాలా? 338 00:21:10,605 --> 00:21:12,190 -ఇదుగోండి. -థాంక్స్. 339 00:21:12,190 --> 00:21:15,193 అలాగే చాక్లేట్ చిప్ కేకు తినాలని ఎవరికి ఉంది? 340 00:21:16,319 --> 00:21:17,320 థాంక్స్. 341 00:21:23,827 --> 00:21:25,579 ఆ కెమెరాతో ఏం పని? 342 00:21:25,579 --> 00:21:27,497 ఇది ఈ రైనో ఉన్న ప్రదేశాన్ని గమనిస్తూ 343 00:21:27,497 --> 00:21:29,291 దగ్గరలోకి పోచర్లు రాకుండా చూసుకుంటుంది. 344 00:21:29,291 --> 00:21:31,167 మంచి ప్లాన్. ఆ కెమెరా వీడియోని ఆన్లైన్ లో పెడదాం, 345 00:21:31,167 --> 00:21:33,169 అప్పుడు మనతో పాటు అందరూ రైనోని గమనించగలరు. 346 00:21:33,169 --> 00:21:34,754 అది ఇంకా మంచి ప్లాన్. 347 00:21:36,089 --> 00:21:38,717 చూస్తుంటే ఆ రైనో ఇంకా ఆక్స్ పెకర్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నట్టు ఉంది. 348 00:21:39,342 --> 00:21:40,760 కలిసి ఉంటే ఖచ్చితంగా చాలా బలమైన జట్టు కాగలవు. 349 00:21:42,429 --> 00:21:44,306 నిజమే, గ్రేబియర్డ్. మనం కూడా. 350 00:21:55,108 --> 00:21:56,610 ఖడ్గమృగాలను కాపాడడానికి సహాయం చేయండి. 351 00:21:59,779 --> 00:22:01,698 డేవిడ్, నీ వీడియోని ఎందుకు ఆపావు? 352 00:22:01,698 --> 00:22:05,118 రైనోల నిపుణుడు డాక్టర్ మాథ్యూ ముటిండతో మన కాల్ ఏ క్షణమైనా మొదలుకావచ్చు. 353 00:22:05,118 --> 00:22:10,832 నేను జాయిన్ అయ్యాను, కానీ మిల్లి నా ట్యాబ్లెట్ తో ఆడడం వల్ల ఇలా అయింది. 354 00:22:11,499 --> 00:22:12,918 నువ్వు దానిని అలాగే వదిలేస్తే మంచిది. 355 00:22:12,918 --> 00:22:15,754 అస్సలు కుదరదు. ఆయన రావడానికి ముందే... 356 00:22:16,463 --> 00:22:17,464 దీనిని వదిలించుకోవాలి. 357 00:22:17,464 --> 00:22:19,049 ఇప్పుడిక సమయం లేదు. 358 00:22:19,049 --> 00:22:21,259 -హాయ్, మాథ్యూ. -హాయ్, జేన్. 359 00:22:22,177 --> 00:22:24,179 హాయ్, యునికార్న్? 360 00:22:24,179 --> 00:22:26,723 అది డేవిడ్. వాడికి ఆ ఫిల్టర్ ని ఎలా తీయాలో తెలీడం లేదు. 361 00:22:26,723 --> 00:22:29,684 నువ్వు దానిని నీ వీడియో సెట్టింగ్స్ లో తీయొచ్చు. 362 00:22:31,603 --> 00:22:33,396 థాంక్స్, ఇది చాలా బాగుంది. 363 00:22:33,396 --> 00:22:34,731 ఇవాళ చాలా కష్టపడ్డాం. 364 00:22:34,731 --> 00:22:38,318 ముందు ఒక నల్ల రైనో మా వెంటపడింది, ఆ తర్వాత నేను ఒక యునికార్న్ ని అయ్యాను. 365 00:22:38,318 --> 00:22:40,487 మిమ్మల్ని ఒక నల్ల ఖడ్గమృగం వెంటాడిందా? 366 00:22:40,487 --> 00:22:43,782 మేము రైనోలు ఆక్స్ పెకర్ లను వాటి మీద ఎందుకు ఉండనిస్తాయో కనిపెట్టడానికి ప్రయత్నించాం. 367 00:22:43,782 --> 00:22:45,033 మీరు ఏం కనిపెట్టారు? 368 00:22:45,033 --> 00:22:46,243 అవి ఫ్రెండ్స్ అని. 369 00:22:46,243 --> 00:22:48,036 అంటే, అది నిజం కాదు. 370 00:22:48,536 --> 00:22:51,498 నల్లని ఖడ్గమృడాలు అలాగే ఎర్రని ముక్కు ఉన్న ఆక్స్ పెకర్ లకు 371 00:22:51,498 --> 00:22:53,750 ఒక సహజీవన సంబంధం ఉంటుంది. 372 00:22:53,750 --> 00:22:55,085 సహజీవనం అంటే ఏంటి? 373 00:22:55,085 --> 00:22:56,878 ఇలా చూడండి, మీకు చూపిస్తాను. 374 00:22:56,878 --> 00:23:01,383 సహజీవనం అంటే రెండు జీవులు ఒకదాని నుండి ఇంకొకటి లాభపడే విధానం. 375 00:23:01,383 --> 00:23:06,012 ఎర్రని ముక్కు ఉన్న ఆక్స్ పెకర్ కి రైనో మీద ఉండడం వల్ల ఆహారం దొరుకుతుంది, 376 00:23:06,012 --> 00:23:09,432 అలాగే రైనోకి కూడా ఆ ఆక్స్ పెకర్ శుభ్రం చేస్తూ ప్రమాద హెచ్చరికలు 377 00:23:09,432 --> 00:23:11,768 చేయడం వల్ల లాభం ఉంటుంది. 378 00:23:11,768 --> 00:23:14,771 అది జరగడం మేము చూశాము. మీరు ఎన్ని నల్లని రైనోలని చూసుకున్నారు? 379 00:23:14,771 --> 00:23:17,148 చాలా. నేను మీకు కిట్యూయ్ గురించి చెప్తాను వినండి, 380 00:23:17,148 --> 00:23:19,526 అది వారం రోజుల వయసు ఉండగా తల్లి వదిలేసిన 381 00:23:19,526 --> 00:23:23,530 ఒక చిన్న నల్ల రైనో గురించిన కథ. 382 00:23:23,530 --> 00:23:26,658 అవి పెరుగుతూ ఆరోగ్యంగా అలాగే బలంగా తయారవుతాయి. 383 00:23:26,658 --> 00:23:30,120 నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి మనుషుల తాకిడి తక్కువగా 384 00:23:30,120 --> 00:23:33,039 ఉండే ప్రదేశాలకు వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది, 385 00:23:33,039 --> 00:23:37,878 అప్పుడే ఒక నిజమైన అడవిలో ఉండగల నల్లని రైనో కాగలదు. 386 00:23:37,878 --> 00:23:39,337 కిట్యూయ్ ఇప్పుడు ఎలా ఉంది? 387 00:23:39,337 --> 00:23:41,339 అది ఇప్పుడు బాగా పెరిగి బలంగా ఉంది. 388 00:23:41,339 --> 00:23:43,592 మేము దానిని ఇప్పుడు తన సొంత ప్రాంతానికి తరలించాం. 389 00:23:43,592 --> 00:23:49,848 ఇప్పుడు అది హాయిగా తింటూ, తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని త్వరలోనే వీలైతే పిల్లలని కనొచ్చు. 390 00:23:49,848 --> 00:23:51,600 నల్లని రైనోలను బాధపెడుతున్న సమస్యలు ఏంటి? 391 00:23:51,600 --> 00:23:54,311 నల్లని రైనోలకు మూడు పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. 392 00:23:54,311 --> 00:23:57,647 పోచింగ్, అంటే వాటి కొమ్ము కోసం జనం వాటిని చంపేయడం. 393 00:23:57,647 --> 00:24:02,402 రెండు, నివాసస్థలము కొరత ఏర్పడడం, అంటే మనుషులు పొలాల కోసం అడవులను కొట్టేస్తున్నారు. 394 00:24:02,402 --> 00:24:03,945 అలాగే చివరిగా, వాతావరణ మార్పు, 395 00:24:04,529 --> 00:24:08,909 అంటే వర్షాలు తగ్గడం వల్ల నల్లని రైనోకి ఆహారం లేకపోవడం. 396 00:24:08,909 --> 00:24:10,827 మీకు జంతువులకు సహాయం చేయాలని ఎప్పుడు అనిపించింది? 397 00:24:10,827 --> 00:24:14,664 నా చిన్నప్పటి నుండే. అలాగే నేను వెటర్నరీ స్కూల్ నుండి ఉత్తీర్ణత పొందిన తర్వాత, 398 00:24:14,664 --> 00:24:18,043 లెవ అరణ్య జంతువుల కన్సర్వన్సీలో పని చేయడం మొదలెట్టాను, 399 00:24:18,043 --> 00:24:21,796 ఇక్కడ అనేక జంతువులు సామరస్యంగా కలిసి నివసిస్తున్నాయి. 400 00:24:21,796 --> 00:24:25,008 -ఇప్పుడు మేము ఏం చేయగలం? -మీరు ఒక సంరక్షణ క్లబ్ లో చేరవచ్చు, 401 00:24:25,008 --> 00:24:27,427 లేదా మీ స్కూల్ లో ఒకదానిని మొదలెట్టొచ్చు. 402 00:24:27,427 --> 00:24:30,347 ప్రపంచంలో ఉన్న అందరికీ అవగాహన తెప్పించడం ద్వారా 403 00:24:30,347 --> 00:24:33,183 మీరు భవిష్యత్ తరాల అడవి జంవుతులను కాపాడినవారు అవుతారు, 404 00:24:33,183 --> 00:24:36,645 అప్పుడు మనం ఆనందిస్తున్న ఈ జీవితాన్ని అవి కూడా పొందగలవు. 405 00:24:36,645 --> 00:24:38,813 -గొప్ప ఐడియాలు. -మేము మిగతా పిల్లలను కూడా చేర్చుకుంటాం. 406 00:24:38,813 --> 00:24:41,149 థాంక్స్, మాథ్యూ. రేపు స్కూల్ లో ఇది చెప్పాలని చాలా ఆతృతగా ఉంది. 407 00:24:41,149 --> 00:24:42,317 అది గొప్ప విషయం. 408 00:24:42,317 --> 00:24:47,614 ప్రపంచాన్ని కాపాడగల భవిష్యత్తు తరాల సంరక్షకులతో ఈ విషయాలు పంచుకోవడం 409 00:24:47,614 --> 00:24:49,074 నాకు చాలా సంతోషంగా ఉంది. 410 00:24:49,074 --> 00:24:51,826 బై, అలాగే మీ సమయానికి చాలా థాంక్స్. 411 00:24:51,826 --> 00:24:52,994 బై, మాథ్యూ. 412 00:24:53,620 --> 00:24:56,873 -సరే, మనం మన క్లబ్ ని ఏమని పిలవాలి? -కిట్యూయ్ క్లబ్ అంటే ఎలా ఉంటుంది? 413 00:24:56,873 --> 00:25:00,001 బాగుంది. జేన్, ఈ రైనో ఫిల్టర్ ని చూడు. 414 00:25:02,128 --> 00:25:04,631 -భలే, ఆక్స్ పెకర్ ఫిల్టర్ కూడా ఉందా? -చూస్తాను ఉండు. 415 00:25:18,562 --> 00:25:20,146 హేయ్, జేన్. ఇది చూడు. 416 00:25:20,730 --> 00:25:21,815 నీకది దొరికింది! 417 00:26:02,731 --> 00:26:04,733 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్