1 00:00:41,459 --> 00:00:43,503 "రేంజిఫర్ టెరాండస్." 2 00:00:50,010 --> 00:00:52,804 జేన్, మనం ఎంత సేపు ఇలా దాక్కోవాలి? 3 00:00:52,804 --> 00:00:54,014 ఇక్కడ చాలా చల్లగా ఉంది. 4 00:00:54,014 --> 00:00:56,141 మన పనిని పూర్తి చేయడానికి ఎంత సేపు అవసరం అయితే అంత సేపు. 5 00:00:56,141 --> 00:00:58,059 మనం ఈ పనిని వెచ్చగా ఉండే వేరే ప్రదేశంలో చేయలేమా? 6 00:00:58,059 --> 00:00:59,936 కరీబులు కేవలం ఉత్తర ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. 7 00:01:00,437 --> 00:01:01,563 నాకు ఎదో వినిపిస్తోంది. 8 00:01:01,563 --> 00:01:03,231 ఇంతకీ నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావు? 9 00:01:04,565 --> 00:01:05,567 హేయ్! 10 00:01:06,484 --> 00:01:07,986 ఇదేం సరదాగా లేదు, గ్రేబియర్డ్. 11 00:01:07,986 --> 00:01:09,738 మనం దాక్కుని ఉండాలి. 12 00:01:12,657 --> 00:01:14,159 ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండండి. 13 00:01:14,159 --> 00:01:16,161 ఆ అందమైన కవర్ ని నువ్వు మాత్రమే ఎందుకు వేసుకుంటున్నావు? 14 00:01:16,161 --> 00:01:17,329 దీనిని నేనే చేసుకున్నా కాబట్టి. 15 00:01:17,329 --> 00:01:18,663 నువ్వు దీనిని ఈసారి వేసుకోవచ్చులే. 16 00:01:18,663 --> 00:01:21,750 ఇక మీ ఇద్దరూ తిరిగి మీరు దాక్కొనే ప్రదేశాలకు వెళ్ళండి, అప్పుడే మనం 17 00:01:21,750 --> 00:01:25,086 కరీబులు అస్తమాను కదులుతూ, ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం ఎందుకు ఉండవో కనిపెట్టగలం. 18 00:01:25,712 --> 00:01:27,881 అవి బహుశా వెచ్చగా ఉండడం కోసం తిరుగుతూ ఉంటాయేమో. 19 00:01:27,881 --> 00:01:28,924 అది చాలా మంచి ఐడియా. 20 00:01:31,927 --> 00:01:33,428 సరే, గ్రేబియర్డ్. 21 00:01:33,428 --> 00:01:34,763 ఇక మొదలు. 22 00:01:39,976 --> 00:01:41,436 అది బుల్లి రెయిన్ డీర్ కదా? 23 00:01:41,436 --> 00:01:43,104 అది ఒక చిన్న కరీబు. 24 00:01:43,104 --> 00:01:45,815 -కరీబు ఇంకా రెయిన్ డీర్లు రెండూ ఒకటే జంతువు. -ఏంటి? 25 00:01:48,777 --> 00:01:50,779 -అలాగే దాని తండ్రి కూడా వచ్చింది. -తల్లి. 26 00:01:50,779 --> 00:01:53,865 -నీకెలా తెలుసు? -మగవి ప్రతీ ఆకురాలు కాలంలో కొమ్ములు వదిలించుకుంటాయి. 27 00:01:53,865 --> 00:01:55,659 ఆడవి మాత్రమే శీతాకాలంలో వాటిని ఉంచుకుంటాయి. 28 00:01:57,953 --> 00:01:59,120 అవి భలే అందంగా ఉన్నాయి. 29 00:01:59,120 --> 00:02:02,332 ప్రతీ ఏడాది వాటి సంఖ్య మరింత పడిపోవడం చాలా బాధాకరం. 30 00:02:02,332 --> 00:02:03,583 మనము వాటికి సహాయం చేయాలి. 31 00:02:03,583 --> 00:02:06,253 అందుకే అవి ఒక ప్రదేశంలో ఎందుకు ఉండవో మనం కనిపెట్టాలి, 32 00:02:06,253 --> 00:02:08,087 అలా చేస్తేనే కరీబులను మనము అర్థం చేసుకోగలం. 33 00:02:08,712 --> 00:02:09,713 చూడు. 34 00:02:09,713 --> 00:02:12,217 దాని తల్లి ఇంకొక ప్రదేశానికి వెళదాం అంటుంది. కానీ ఎందుకు? 35 00:02:15,637 --> 00:02:17,681 అయ్యో. నేను దానిని భయపెట్టేశాను. అది దారి తప్పిపోవచ్చు. 36 00:02:17,681 --> 00:02:19,683 మనం దానిని తిరిగి తన తల్లి దగ్గరకు పంపాలి. 37 00:02:19,683 --> 00:02:21,142 ఇది విప్పడానికి నాకు సాయం చెయ్. 38 00:02:26,940 --> 00:02:28,525 పదా, అది పారిపోతోంది. 39 00:02:28,525 --> 00:02:31,361 అది చూస్తే తెలుస్తుందిలే. దానికి మనకన్నా రెండు కాళ్ళు ఎక్కువ ఉన్నాయి. 40 00:02:31,361 --> 00:02:33,196 ఆగు, పిల్లా! 41 00:02:38,034 --> 00:02:39,411 దాని వేగాన్ని మనం అందుకోలేం. 42 00:02:42,664 --> 00:02:46,126 కానీ దాని అమ్మ ఆ వేగాన్ని అందుకోగలదు, అలాగే అది సహాయాన్ని తెచ్చుకుంది కూడా. 43 00:02:46,126 --> 00:02:47,419 ఒక కరీబుల మంద. 44 00:02:49,337 --> 00:02:51,172 అవి అన్నీ ఒకే చోట కదలకుండా ఉండి ఉంటే చాలా బాగుండేది. 45 00:02:51,172 --> 00:02:53,758 -ఇప్పుడు ఏం చేయాలి, జేన్? -అవి తొక్కేయకుండా జాగ్రత్త పడాలి. 46 00:03:04,561 --> 00:03:05,687 అద్భుతం. 47 00:03:07,063 --> 00:03:08,690 కరీబులు నిజంగానే అస్తమానం కదులుతుంటాయి. 48 00:03:08,690 --> 00:03:11,610 అది ఎందుకో కనిపెట్టడానికి మనం వాటిని తిరిగి వెనక్కి రప్పించడం ఎలా? 49 00:03:11,610 --> 00:03:13,236 మళ్ళీ దాక్కోవడం ద్వారా! 50 00:03:17,657 --> 00:03:19,826 నేను ఇక ఆట ఆడను. 51 00:03:22,662 --> 00:03:24,664 నిజంగానే, జేన్, నువ్వు ఎక్కడ ఉన్నావు? 52 00:03:27,667 --> 00:03:28,793 తాతయ్య! 53 00:03:29,711 --> 00:03:30,921 జేమ్స్ తాతయ్య? 54 00:03:30,921 --> 00:03:32,923 తాతయ్య, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. 55 00:03:33,757 --> 00:03:36,301 భలే. హలో, డేవిడ్. 56 00:03:36,927 --> 00:03:37,802 హలో, జేన్. 57 00:03:37,802 --> 00:03:39,888 బయటకు రావడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. 58 00:03:43,350 --> 00:03:44,601 ఇవాళ మీరు పని చేయడం లేదా? 59 00:03:44,601 --> 00:03:48,230 లేదు, నేను ఇవాళ కమ్యూనిటీ వంట శాలలో వాలంటీర్ పని చేస్తున్నాను. 60 00:03:48,230 --> 00:03:49,314 కానీ... 61 00:03:50,106 --> 00:03:52,108 చూస్తుంటే ఇది భలే రుచిగా ఉండేలా ఉంది. 62 00:03:52,776 --> 00:03:55,528 -నాకోసమేనా? -నేను అందరి కోసం వంట వండాను. 63 00:03:55,528 --> 00:03:57,948 నీకోసం కూడా, జేన్, నీకు ఇష్టమైతేనే. 64 00:03:58,573 --> 00:04:00,200 థాంక్స్, కానీ మేము విరామం తీసుకోలేం. 65 00:04:00,200 --> 00:04:02,244 మేము ఇప్పుడు "రేంజిఫర్ టెరాండస్" ని ట్రాక్ చేస్తున్నాం. 66 00:04:02,994 --> 00:04:07,082 అది కరీబుల శాస్త్రీయ నామం, అలాగే అది చాలా ముఖ్యమైన పని. 67 00:04:07,082 --> 00:04:10,710 -కానీ నాకు తినాలని ఉంది. -నువ్వు ఎప్పుడైనా తినొచ్చు. 68 00:04:11,211 --> 00:04:15,131 సరే, మీరు చేస్తున్న ఈ కరీబుల పని గురించి, నాకు అంతా వినాలని ఉంది. 69 00:04:17,591 --> 00:04:19,928 అయితే మేము చిన్న విరామం తీసుకోగలం లెండి. 70 00:04:19,928 --> 00:04:21,263 మీరు తీసుకోగలరని నాకు తెలుసు. 71 00:04:23,473 --> 00:04:24,808 అది గ్రేబియర్డ్ కదా? 72 00:04:25,433 --> 00:04:28,019 అవును, మేమందరం అడవిలో దాక్కుంటున్నాం. 73 00:04:29,854 --> 00:04:31,898 అంటే, మాలో కొందరు లెండి. 74 00:04:32,399 --> 00:04:34,901 అలాగే మాలో కొందరు మంచుతో ఆడుతున్నారు. 75 00:04:35,402 --> 00:04:37,279 చాలా దారుణం, గ్రేబియర్డ్. 76 00:04:38,697 --> 00:04:39,698 పదండి, లోనికి వెళదాం. 77 00:04:43,326 --> 00:04:45,579 అప్పుడు మేము ఒక కరీబు మందతో పరుగెత్తాము. 78 00:04:45,579 --> 00:04:47,956 చెప్పాలంటే కరీబుల మంద నుండి పరుగెత్తాము. 79 00:04:48,999 --> 00:04:51,126 అవి ఒక కారు అంత వేగంగా పరుగెత్తగలవు అని మీకు తెలుసా? 80 00:04:51,126 --> 00:04:54,254 అవును, నాకు తెలుసు. కానీ చిన్న దూరాలు మాత్రమే. 81 00:04:54,254 --> 00:04:56,464 ఇది ఊహించుకో: మన వెనుక ఒక కరీబు. 82 00:04:56,464 --> 00:04:58,133 ముందు గడ్డకట్టిన ఒక చెరువు. 83 00:04:58,133 --> 00:05:00,093 అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. 84 00:05:00,093 --> 00:05:02,012 నువ్వు ఏం చేసావు? 85 00:05:02,012 --> 00:05:04,014 ఏమీ లేదు. ఆ మంద మా మీద నుండి దూకి వెళ్ళింది. 86 00:05:04,014 --> 00:05:05,849 చూడడానికి అవి ఎగురుతున్నట్టు ఉంది. 87 00:05:05,849 --> 00:05:08,894 కానీ మేము ఇంకా అవి అస్తమాను ఎందుకు కదులుతాయో కనిపెట్టాల్సి ఉంది. 88 00:05:08,894 --> 00:05:11,688 అవును, అవి ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండవు. 89 00:05:11,688 --> 00:05:13,315 అదేదో మిస్టరీలా ఉందే. 90 00:05:14,608 --> 00:05:16,401 బహుశా అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి ఏమో. 91 00:05:16,985 --> 00:05:19,070 ఏమో, కానీ తల్లి కరీబు తన పిల్లను పోనిచ్చేటప్పటికి 92 00:05:19,070 --> 00:05:21,114 ఆ ప్రదేశంలో ఇంకా చాలా మేత ఉంది. 93 00:05:22,198 --> 00:05:24,284 మనం ఇక తిరిగి మన పని మొదలెడదాం పద, డేవిడ్. 94 00:05:24,284 --> 00:05:28,705 అంటే, అవి ఆహారం కోసం వెతుకుతున్నట్టు అయితే, ఇక్కడ చాలా ఉంది. 95 00:05:29,289 --> 00:05:31,166 సరే. ఇక ప్లేట్లు ఖాళీ చేయండి, పిల్లలు. 96 00:05:31,166 --> 00:05:34,044 -భోజనం తెచ్చినందుకు మళ్ళీ థాంక్స్, నాన్నా. -అదేం పర్లేదు. 97 00:05:35,754 --> 00:05:38,173 ఒకసారి మనం బయటకు వెళ్ళాకా, మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. 98 00:05:40,592 --> 00:05:42,719 మీరు అదంతా ఎందుకు పారేస్తున్నారు? 99 00:05:42,719 --> 00:05:44,012 దానిని కూడా ఎందుకు? 100 00:05:44,012 --> 00:05:46,014 ఎందుకంటే నా కడుపు నిండిపోయింది. 101 00:05:46,014 --> 00:05:48,475 నేను స్వీట్ తినడం కోసం ఖాళీ ఉంచుకుంటున్నాను. 102 00:05:49,059 --> 00:05:51,853 స్వీట్ ఉంది, కదా? 103 00:05:52,812 --> 00:05:55,899 ఇలాంటి పని వల్ల ప్రతీ ఏడాది వంద కోట్ల టన్నుల ఆహారం వ్యర్ధంగా పోతోంది. 104 00:05:55,899 --> 00:05:57,108 అంటే ఏంటి నీ ఉద్దేశం? 105 00:05:57,859 --> 00:06:00,445 అంటే, మీరు ఎక్కువ వంట వండుకుంటే 106 00:06:00,445 --> 00:06:02,739 అదనపు ఆహారాన్ని తర్వాత తినడానికి ఉంచుకోవచ్చు అని. 107 00:06:02,739 --> 00:06:03,823 నిజం. 108 00:06:04,532 --> 00:06:06,243 కానీ మా దగ్గర బోలెడంత ఉంది. 109 00:06:07,077 --> 00:06:10,080 కెవిన్, నువ్వు వాళ్లకు కథలను చెప్పలేదా? 110 00:06:11,373 --> 00:06:12,374 అంటే... 111 00:06:12,374 --> 00:06:14,417 నువ్వు వాటిని మర్చిపోలేదు, కదా? 112 00:06:14,417 --> 00:06:16,628 కథలా? ఏం కథలు, బుజ్జి? 113 00:06:17,629 --> 00:06:20,090 మేము పడుకునేటప్పుడు నువ్వు మాకు చెప్పే కథలా? 114 00:06:20,090 --> 00:06:23,677 చూడు, నాన్నా, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామా? 115 00:06:23,677 --> 00:06:26,596 అవును, అంటే మనం ఆ విషయాన్ని ఎప్పటికీ మాట్లాడుకోము అని అర్థం. 116 00:06:28,139 --> 00:06:30,559 అంటే, మేము ఇక తిరిగి మా కరీబు దగ్గరకు వెళ్తాము. 117 00:06:30,559 --> 00:06:32,811 కానీ స్వీట్ గురించి నా ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. 118 00:06:32,811 --> 00:06:34,354 కరీబు ముఖ్యం, డేవిడ్. 119 00:06:34,896 --> 00:06:36,565 భోజనానికి థాంక్స్, జేమ్స్ తాతయ్య. 120 00:06:37,065 --> 00:06:39,693 చాలా రుచిగా ఉంది. సలాడ్ కూడా. 121 00:06:39,693 --> 00:06:41,069 సరే, అదేం పర్లేదు. 122 00:06:52,080 --> 00:06:55,584 మెల్లిగా కదులు. అవి మనల్ని చూడడమో లేక మళ్ళీ పారిపోవడమో జరగకూడదు. 123 00:07:00,046 --> 00:07:01,047 ఏమీ లేదు. 124 00:07:03,216 --> 00:07:04,467 వెతకడం కొనసాగిద్దాం. 125 00:07:12,517 --> 00:07:13,894 కరీబు ఇక్కడ కూడా లేదు. 126 00:07:14,644 --> 00:07:17,230 మా తాతయ్య కథలు అని వేటి గురించి అని ఉంటారు? 127 00:07:17,772 --> 00:07:19,691 ఏమో. నువ్వు ఆయన్నే ఎందుకు అడగలేదు? 128 00:07:19,691 --> 00:07:22,152 ఎందుకంటే నాన్న ఆ విషయం విన్నాక మొహం మాడ్చుకున్నాడు. 129 00:07:24,446 --> 00:07:25,655 కరీబు. 130 00:07:27,949 --> 00:07:29,117 మళ్లీనా. 131 00:07:29,117 --> 00:07:30,911 మనం వాటిని ఫాలో అవ్వాలి. పదా. 132 00:07:39,753 --> 00:07:41,546 నేను నా గదిలోకి వెళ్లి ఆడుకోనా? 133 00:07:46,885 --> 00:07:48,845 ఎవరికైనా కాఫీ కావాలా? 134 00:07:52,349 --> 00:07:53,350 నీళ్లు? 135 00:07:55,727 --> 00:07:57,479 నేను వెళ్లి మిల్లితో ఆడతాను. 136 00:08:05,320 --> 00:08:06,446 నాకు ఒక నిమిషం ఏకాంతంగా కావాలి. 137 00:08:21,920 --> 00:08:23,380 అవి పారిపోతున్నాయి. 138 00:08:35,933 --> 00:08:37,435 ఎక్కడికి వెళ్తున్నారు, తాతయ్యా? 139 00:08:37,435 --> 00:08:41,356 నేను ఇందాక కమ్యూనిటీ వంట శాలకి వెళదాం అని అనుకుని వచ్చాను. 140 00:08:41,898 --> 00:08:43,483 మీరు వెతుకుతున్న కరీబులు కనిపించాయా? 141 00:08:44,734 --> 00:08:45,860 అవి మళ్ళీ తప్పించుకున్నాయి. 142 00:08:46,695 --> 00:08:48,989 మేము దాక్కొని గమనించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అవి చూసేసి పారిపోతున్నాయి. 143 00:08:49,864 --> 00:08:51,241 మాకు ఒక కొత్త ప్లాన్ కావాలి. 144 00:08:51,241 --> 00:08:52,867 ఏమైనా ఐడియాలు ఉన్నాయా, తాతయ్యా? 145 00:08:52,867 --> 00:08:54,327 నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. 146 00:08:54,327 --> 00:08:58,373 కరీబులకు మన పూర్వికులతో ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది అని నీకు తెలుసా, 147 00:08:58,373 --> 00:08:59,916 అంటే మన కుటుంబంతో? 148 00:08:59,916 --> 00:09:03,879 మరి నన్ను దత్తత తీసుకున్నారు కదా, నా విషయంలో కూడా అంతేనా? 149 00:09:05,714 --> 00:09:09,009 కుటుంబం అంటే కుటుంబమే, అది ఎలాంటి ఏర్పాటు అయినా సరే. 150 00:09:09,718 --> 00:09:13,054 నీకు నిన్ను కన్న అమ్మా నాన్నలతో అలాగే నీ పూర్వికులతో సంబంధం ఉంది, 151 00:09:13,054 --> 00:09:17,225 అలాగే ఇప్పుడు మా కుటుంబం ఇంకా మా పూర్వికులతో కూడా నీకు సంబంధం ఉంది. సరేనా? 152 00:09:18,393 --> 00:09:19,477 సరే. 153 00:09:19,477 --> 00:09:21,688 సరే, మన వంశ ప్రజలను డెనే ప్రజలు అంటారు. 154 00:09:21,688 --> 00:09:23,440 డెనే అంటే ఏంటి అర్థం? 155 00:09:23,440 --> 00:09:27,360 డెనే వారు కరీబులు ఉండే ప్రదేశంలో నివసించే స్థానిక జాతి ప్రజలలో ఒక జాతి వారు. 156 00:09:27,360 --> 00:09:29,404 ఇంకొక ప్రశ్న. 157 00:09:29,404 --> 00:09:31,281 స్థానిక ప్రజలు అంటే ఏంటనా? 158 00:09:31,281 --> 00:09:34,159 ఇతర ప్రజలు రావడానికి ముందు, ఒక ప్రదేశంలో మొట్టమొదటిగా చేరి 159 00:09:34,159 --> 00:09:38,330 తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఏర్పరచుకున్న ప్రజలు అని అర్థం. 160 00:09:38,914 --> 00:09:40,332 సరే, నాతో రండి. 161 00:09:51,176 --> 00:09:54,638 నేను మీ నాన్న చిన్నప్పుడు వాడికి ఈ కథను చెప్పేవాడిని. 162 00:09:54,638 --> 00:09:57,891 ఇది చాలా చాలా కాలం క్రితం జరిగిన విషయం, 163 00:09:57,891 --> 00:09:59,434 అప్పటికి ప్రపంచం మొదటి అడుగులు వేస్తోంది. 164 00:09:59,434 --> 00:10:01,519 అప్పట్లో, జనాలకు ఇప్పుడు ఉన్నట్టు కరెంటు, 165 00:10:01,519 --> 00:10:07,192 నీళ్ల వ్యవస్థ, అలాగే అపార్ట్మెంట్ బిల్డింగులు ఉండేవి కాదు. 166 00:10:08,526 --> 00:10:11,321 అడవిలో ఉండే అన్ని జంతువుల లాగే, 167 00:10:11,321 --> 00:10:13,907 వారు కూడా తమ మనుగడ కోసం భూమితో ఉన్న బంధం మీద ఆధారపడి 168 00:10:13,907 --> 00:10:16,159 బ్రతుకు సాగిస్తూ ఉండేవారు. 169 00:10:17,285 --> 00:10:20,413 కానీ వాళ్ళు బ్రతకడానికి చాలా కష్టపడి పనిచేసేవారు. 170 00:10:23,959 --> 00:10:28,296 డెనే వారు తమ ప్రజలకు ఒక మంచి, సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండాలి అని కోరుకున్నారు. 171 00:10:30,215 --> 00:10:34,135 కాబట్టి వాళ్ళు తమతో ఆ అడవి ప్రాంతాన్ని అలాగే భూమిని పంచుకుంటున్న 172 00:10:34,135 --> 00:10:37,472 జంతువులతో ఒక పెద్ద మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. 173 00:10:38,056 --> 00:10:39,641 అప్పుడు మా ప్రజలు ఇలా అడిగారు, 174 00:10:39,641 --> 00:10:42,811 "రానున్న కాలంలో మా కుటుంబం మీతో కలిసి 175 00:10:42,811 --> 00:10:46,856 చిరకాలం బ్రతకాలంటే మేము ఏం చేయాలి?" 176 00:10:47,399 --> 00:10:50,443 అందుకు స్పందిస్తూ, కరీబు ఇలా అంది, 177 00:10:51,152 --> 00:10:53,655 "మనుషులు అలాగే జంతువులు ఆరోగ్యంగా ఉండాలంటే, 178 00:10:53,655 --> 00:10:56,908 మనం కలిసి ఈ భూమిని సాగు చేయాలి. 179 00:10:59,578 --> 00:11:03,039 మీరు మా తోలుతో బట్టలు చేసుకొని వెచ్చగా ఉండొచ్చు, 180 00:11:03,039 --> 00:11:06,251 అలాగే మా కొమ్ములతో మీకు అవసరమైన ఆయుధాలు చేసుకోవచ్చు, 181 00:11:07,085 --> 00:11:12,382 కానీ మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని ఈ పద్దతులను గౌరవించాలి, 182 00:11:12,382 --> 00:11:14,009 ఎక్కువ తీసుకోకూడదు. 183 00:11:14,009 --> 00:11:16,011 ఏదీ వృధా కాకూడదు. 184 00:11:17,178 --> 00:11:20,390 అలాగే మేము మీతో ఈ నేలను పంచుకుంటున్నట్టే, 185 00:11:20,390 --> 00:11:23,852 మీరు కూడా ఇతరులతో పంచుకోవాలని గుర్తుంచుకోవాలి. 186 00:11:24,519 --> 00:11:29,441 మీకు ఎక్కువగా ఉన్నది ఏదైనా, తక్కువ ఉన్నవారికి ఇవ్వండి. 187 00:11:29,941 --> 00:11:34,321 అలాగే ఈ నేలను కాపాడుకోవడం గురించిన పాఠాలను మీ పిల్లలు 188 00:11:34,321 --> 00:11:36,573 అందరికీ బాగా చెప్పండి, 189 00:11:36,573 --> 00:11:40,368 అప్పుడే వాళ్ళు తమ పిల్లలకు చెప్పగలరు" అంది. 190 00:11:46,416 --> 00:11:48,793 ప్రస్తుతం మనకు తెలిసిన జ్ఞానాన్ని 191 00:11:48,793 --> 00:11:52,839 రానున్న తరాలకు అందేలా చేయడం మన అందరి బాధ్యత. 192 00:11:53,715 --> 00:11:56,176 కానీ చాలా సంవత్సరాల తర్వాత, 193 00:11:56,843 --> 00:11:59,095 డెనే ప్రజలు మాత్రమే కాక, ఇంకా చాలా మంది 194 00:11:59,679 --> 00:12:02,390 ఈ ప్రదేశంలో నివసించడం మొదలెట్టారు. 195 00:12:03,975 --> 00:12:08,480 అడవులను మనం ఇబ్బంది పెడితే, అప్పుడు అందులో ఉండే జంతువులను కూడా ఇబ్బంది పెట్టినట్టే. 196 00:12:09,439 --> 00:12:14,277 నేటికీ, డెనే ప్రజలు కరీబులను కాపాడడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. 197 00:12:14,945 --> 00:12:17,906 కరీబు మనల్ని కాపాడడానికి పనిచేసినట్టే. 198 00:12:18,782 --> 00:12:21,243 నువ్వు ఈ కథను ముందెప్పుడూ చెప్పలేదు ఎందుకు, నాన్నా? 199 00:12:22,285 --> 00:12:25,413 అంటే, నేను దీనిని మర్చిపోయినట్టు ఉన్నాను. 200 00:12:26,414 --> 00:12:28,792 మీ తాతయ్య నేను నీ వయసులో ఉన్నప్పుడు ఈ కరీబు కథలాంటి 201 00:12:28,792 --> 00:12:30,794 అనేక ముఖ్యమైన కథలు చెప్పారు. 202 00:12:30,794 --> 00:12:32,796 నీకు మిగతావి గుర్తున్నాయా? 203 00:12:33,797 --> 00:12:37,384 ఉన్నాయనే అనుకుంటున్నాను. బహుశ మీ తాత గుర్తుచేస్తే చెప్పగలనేమో? 204 00:12:38,385 --> 00:12:39,678 సంతోషంగా చెప్తాను. 205 00:12:40,262 --> 00:12:41,388 ఆ కథలు నేను కూడా వినొచ్చా? 206 00:12:41,388 --> 00:12:43,390 తప్పకుండా. 207 00:12:43,390 --> 00:12:45,600 కరీబులు నిరంతరం ప్రదేశాలు మారుతుండడం వెనుక కారణం 208 00:12:45,600 --> 00:12:49,354 కథలో చెప్పినట్టు అవి ఉంటున్న అడవులను కొట్టేయడమే అయ్యుంటుంది అనుకుంటున్నారా? 209 00:12:49,354 --> 00:12:52,566 కరీబులు అంతరించిపోవడానికి ముఖ్య కారణాలలో ఒకటి అవి ఉంటున్న ప్రదేశాలు మరుగవ్వడమే, 210 00:12:53,149 --> 00:12:56,403 కానీ ఆ కారణంగానే అవి ఒక ప్రదేశంలో ఉండడం లేదు అని మనం ఎలా నిరూపించగలం? 211 00:12:56,903 --> 00:13:00,031 అవి సురక్షితంగా ఫీల్ అవ్వగల ఒక ప్రదేశానికి మనం వాటిని తీసుకెళ్లగలిగితే? 212 00:13:00,031 --> 00:13:04,035 ఆహారం అలాగే చెట్లతో సౌకర్యంగా అనిపించే అన్ని వసతులు ఉన్న ప్రదేశం అయితే ఎలా ఉంటుంది? 213 00:13:04,035 --> 00:13:06,997 వింటుంటే మీ ముగ్గురూ చాలా మంచి ప్లాన్ వేసినట్టు ఉన్నారు. 214 00:13:07,914 --> 00:13:08,999 ఇక పని మొదలుపెడితే మంచిది. 215 00:13:08,999 --> 00:13:11,042 మొదటి పని, కరీబుని కనిపెట్టాలి. 216 00:13:11,042 --> 00:13:12,252 అవును. 217 00:13:12,961 --> 00:13:15,422 -బై, జేమ్స్ తాతయ్య. -భోజనానికి థాంక్స్. 218 00:13:21,636 --> 00:13:22,554 అక్కడ ఉంది. 219 00:13:23,138 --> 00:13:25,056 ఇప్పుడు మనకు సురక్షితంగా ఉండే ఒక ప్రదేశం కావాలి. 220 00:13:26,308 --> 00:13:27,851 ఆ ప్రదేశం ఎక్కడో నాకు తెలుసు. 221 00:13:28,768 --> 00:13:31,271 అలాగే కరీబుని అక్కడికి తీసుకెళ్లడానికి మనకు ఒక మార్గం కూడా కావాలి. 222 00:13:32,063 --> 00:13:34,232 అప్పుడు మీ భోజనం సమయంలో మిగిలిన ఆహారాన్ని వాడొచ్చు. 223 00:13:41,573 --> 00:13:45,285 డేవిడ్, మేము ఎరను తీసుకొచ్చాము. నువ్వు కరీబుని గమనిస్తున్నావా? 224 00:13:45,285 --> 00:13:46,661 అవును. 225 00:13:51,124 --> 00:13:52,417 కానీ అవి వెళ్లిపోతున్నాయి, జేన్. 226 00:13:55,837 --> 00:13:58,173 త్వరగా! అవి వెళ్లిపోతున్నాయి. 227 00:13:59,382 --> 00:14:00,383 డేవిడ్? 228 00:14:01,218 --> 00:14:02,427 ఇక్కడ ఉన్నాను. 229 00:14:05,639 --> 00:14:08,225 నేను ఇరుక్కుపోయాను. నేను వాటిని ఫాలో అవ్వలేను. 230 00:14:10,018 --> 00:14:13,563 నువ్వు వెళ్లి ఈ మిగిలిన ఆహారాన్ని వాడి కరీబుని ఇక్కడికి తీసుకురాగలవా? 231 00:14:18,902 --> 00:14:21,488 వాటిని ఇటువైపు నడిపించు, గ్రేబియర్డ్. మిగతా పని నేను చేస్తాను. 232 00:14:22,781 --> 00:14:27,911 నేను రాలేకపోతున్నాను. కరీబు వెళ్ళిపోతోంది! 233 00:14:39,339 --> 00:14:42,551 అంతే! గ్రేబియర్డ్, నువ్వు సాధిస్తున్నావు! 234 00:14:47,681 --> 00:14:48,765 అవి ఇటే వస్తున్నాయి. 235 00:14:51,226 --> 00:14:52,644 అవి నేరుగా నా వైపే వస్తున్నాయి. 236 00:15:02,153 --> 00:15:04,948 చూస్తుంటే నీకు కరీబు-బూ తగిలినట్టు ఉంది. 237 00:15:04,948 --> 00:15:07,909 అర్థమైందా? కరీబు-బూ? 238 00:15:09,077 --> 00:15:10,495 బాగానే ఉన్నావా, గ్రేబియర్డ్? 239 00:15:17,627 --> 00:15:19,212 జేన్, అవి నీవైపే వస్తున్నాయి. 240 00:15:20,297 --> 00:15:24,134 అవి వచ్చాయి. కరీబులు వాటి సురక్షితమైన ప్రదేశం వైపు తింటూ వస్తున్నాయి. 241 00:15:24,759 --> 00:15:27,721 అంటే, చిరు తిండి తిన్నట్టు తింటూ వస్తున్నాయి. 242 00:15:27,721 --> 00:15:30,223 అవి ఒక్కొక్క ముక్కలో చిన్న భాగాన్ని తింటున్నాయి అంతే. 243 00:15:30,223 --> 00:15:32,642 అవి మొత్తం ఎందుకు తినడం లేదో ఏమో. 244 00:15:32,642 --> 00:15:35,145 నాకు తెలీదు, కానీ ఇప్పుడు అవి అక్కడే ఉంటాయి అనుకుంటున్నాను. 245 00:15:37,063 --> 00:15:38,398 అవి చాలా అందంగా ఉన్నాయి. 246 00:15:39,900 --> 00:15:41,026 ఆగు! వద్దు, వెళ్ళిపో... 247 00:15:43,361 --> 00:15:44,487 కండి. 248 00:15:48,533 --> 00:15:50,201 జేన్. ఇక్కడ. 249 00:15:50,201 --> 00:15:52,954 -కరీబు ఎక్కడ? -పోయాయి. 250 00:15:55,790 --> 00:15:57,876 అవి ఎందుకు వెళ్తున్నాయో మనకు ఇంకా తెలీదు. 251 00:15:58,585 --> 00:16:00,128 మనం కనిపెడతాంలే. 252 00:16:00,128 --> 00:16:03,590 కానీ ఇంకాస్త ఆహారాన్ని వదిలి వెళ్లడం ద్వారా అవి మంచి పని చేసాయి. 253 00:16:03,590 --> 00:16:06,843 మీ తాతయ్య కథలాగే. పంచుకోవడం. 254 00:16:06,843 --> 00:16:08,011 దానిని నేను చూడొచ్చా? 255 00:16:12,390 --> 00:16:16,811 "నేడు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఉండే ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?" 256 00:16:17,479 --> 00:16:19,064 -జేన్ గుడ్ఆల్? -అవును. 257 00:16:19,064 --> 00:16:21,066 కరీబులు డెనే ప్రజలకు చెప్పినట్టే, 258 00:16:21,066 --> 00:16:23,818 భూమి నుండి అవసరమైనంత మాత్రమే తీసుకుంటున్నాయి. ఎక్కువ కాదు. 259 00:16:23,818 --> 00:16:25,695 అప్పుడు అందరూ మనుగడ సాగించవచ్చు. 260 00:16:25,695 --> 00:16:27,614 నిజం. 261 00:16:27,614 --> 00:16:28,990 చూడు! 262 00:16:30,867 --> 00:16:32,661 -మిగతా కరీబు మంద. -దాక్కోండి! 263 00:16:37,791 --> 00:16:39,542 మొదటి కరీబు వదిలి వెళ్లిన దానిని అవి తింటున్నాయి. 264 00:16:39,542 --> 00:16:42,546 అవి ఎంత కావాలో అంత మాత్రమే తింటున్నాయి కాబట్టి అలా కదులుతూ వెళ్తున్నాయి. 265 00:16:43,171 --> 00:16:44,673 అందరికీ సరిపడేంత వదులుతూ. 266 00:16:45,215 --> 00:16:47,092 మనుషులు కూడా చేయాల్సిన పని అది. 267 00:16:47,092 --> 00:16:48,593 మనం నిజంగానే అది చేయాలి. 268 00:16:52,556 --> 00:16:53,682 నాకొక ఐడియా వచ్చింది. 269 00:16:57,269 --> 00:16:59,396 కమ్యూనిటీ వంట శాల కోసం మిగిలిన ఆహారం అంతా, తాతయ్యా. 270 00:16:59,396 --> 00:17:03,483 ఈ ఆహారం చాలా మందికి తిండి పెట్టడానికి చాలా పనికొస్తుంది. 271 00:17:03,483 --> 00:17:04,901 మఃషి చొ, 272 00:17:04,901 --> 00:17:08,196 -దానికి అర్థం, "ధన్యవాదాలు" అని. -అదేం పర్లేదు, తాతయ్యా. 273 00:17:08,196 --> 00:17:11,074 మేము కొన్ని కుకీలు కూడా పెట్టాము. కానీ ఎందుకో మర్చిపోయా. 274 00:17:11,741 --> 00:17:15,745 గౌరవం, పంచుకోవడం అలాగే... 275 00:17:15,745 --> 00:17:17,162 బాధ్యత. 276 00:17:17,872 --> 00:17:19,583 ఆ కథను నేను రాత్రి పడుకునేటప్పుడు చెప్తాను. 277 00:17:20,292 --> 00:17:23,295 ఆ తర్వాత మీ ఇద్దరికీ చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. 278 00:17:24,963 --> 00:17:26,131 నీకు కూడా. 279 00:17:26,965 --> 00:17:29,384 నాకు? జంతువుల కథలు కూడా ఉండే ఉంటాయని ఆశిస్తున్నాను. 280 00:17:29,384 --> 00:17:30,510 కొన్ని ఉన్నాయి. 281 00:17:30,510 --> 00:17:32,637 నక్కల గురించి ఉన్న కథ వింటే నీ మతి పోతుంది. 282 00:17:34,431 --> 00:17:38,059 డెనే ప్రజల కథ వింటే, ఇంకా ఎక్కువ మంది జనం కరీబులకు సహాయం చేస్తారు అనుకుంటున్నారా? 283 00:17:38,059 --> 00:17:41,021 అంటే, కథలు మన జ్ఞానాన్ని భద్రపరుస్తాయి. 284 00:17:41,021 --> 00:17:43,690 అలాగే జనం కరీబుల గురించి తెలుసుకుంటే, 285 00:17:43,690 --> 00:17:49,029 బహుశా అప్పుడు భూమి నుండి తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా అలోచించి అడుగులు వేయొచ్చు. 286 00:17:51,197 --> 00:17:52,240 అర్థమైంది, తాతయ్యా. 287 00:17:52,240 --> 00:17:53,408 నాకు కూడా. 288 00:17:53,992 --> 00:17:55,285 అది తప్పకుండా సాయపడుతుంది. 289 00:17:56,661 --> 00:17:58,830 -సిద్ధమా, నాన్నా? నేను నిన్ను తీసుకెళ్తాను. -థాంక్స్. 290 00:18:07,631 --> 00:18:09,591 మనం జంతువుల నుండి నేర్చుకోగలది ఎంతో ఉంది. 291 00:18:09,591 --> 00:18:11,259 అలాగే మనం నేర్చుకునేది అంతా ఇతరులతో పంచుకోవాలి, 292 00:18:11,259 --> 00:18:14,638 అప్పుడే మనం చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటాం. 293 00:18:15,805 --> 00:18:17,307 గ్రేబియర్డ్! 294 00:18:26,483 --> 00:18:27,943 కరీబులను కాపాడడానికి సహాయం చేయండి. 295 00:18:30,946 --> 00:18:34,407 -డేవిడ్! డేవిడ్, ఎక్కడ ఉన్నావు? -నేను వస్తున్నాను. 296 00:18:36,826 --> 00:18:38,161 నువ్వు ఏం తింటున్నావు? 297 00:18:38,161 --> 00:18:40,372 మిగిలిన ఆహారం. రెండవసారి తింటుంటే ఇంకా రుచిగా ఉంది. 298 00:18:40,372 --> 00:18:43,959 నాకు కొంచెం ఉంచు, కరీబు గార్డియన్, స్టార్ గోషేతో మన కాల్ అయ్యాక నేను వచ్చి తింటా. 299 00:18:45,210 --> 00:18:46,211 ఆమె వచ్చేసింది. 300 00:18:46,711 --> 00:18:47,921 హాయ్, స్టార్. 301 00:18:47,921 --> 00:18:49,297 హాయ్, జేన్. హాయ్, డేవిడ్. 302 00:18:49,297 --> 00:18:51,216 చూస్తుంటే నీ నోటి నిండా ఆహారం ఉన్నట్టు ఉంది. 303 00:18:56,304 --> 00:18:57,764 అవా? 304 00:18:57,764 --> 00:18:59,266 అవి మగ కరీబు కొమ్ములు. 305 00:18:59,266 --> 00:19:02,310 మగ కరీబులు కొమ్ములు వదిలించుకున్నప్పుడే అడవి కూడా ఎందుకు కొమ్ములు వదులుకోవు? 306 00:19:02,310 --> 00:19:05,981 ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు, చలికాలంలో వాటిని అవి సంరక్షించుకోవడానికి, 307 00:19:05,981 --> 00:19:10,110 అలాగే తమ ఆహారాన్ని కాపాడుకునే సమయంలో వాడడానికి ఆడ కరీబులు వాటి కొమ్ములు ఉంచుకుంటాయి. 308 00:19:10,110 --> 00:19:14,406 భలే. అలాగే క్షమించండి, ఒక రోజంతా కరీబుల మందను ఫాలో అవ్వడం వల్ల నాకు ఆకలి వేసింది. 309 00:19:14,406 --> 00:19:16,116 అవి చాలా ఎక్కువగా తిరుగుతాయి. 310 00:19:16,116 --> 00:19:18,243 అవి నిరంతరం ఎందుకు కదులుతూ ఉంటాయో కనిపెట్టడానికి ఫాలో అయ్యాం. 311 00:19:18,243 --> 00:19:19,619 మరి మీరు ఏం కనిపెట్టారు? 312 00:19:19,619 --> 00:19:21,997 మేము కరీబులు కేవలం ఒక ప్రదేశంలో ఎంత కావాలో అంత మాత్రమే తిని 313 00:19:21,997 --> 00:19:24,249 తర్వాతి సమయానికి లేదా మిగతా కరీబులకు ఆహారాన్ని వదులుతాయి అని కనిపెట్టాం. 314 00:19:24,249 --> 00:19:25,208 నువ్వు అన్నది నిజమే. 315 00:19:25,208 --> 00:19:28,211 కొన్ని కరీబులు ఉష్ణోగ్రత ఆధారంగా తిరుగుతాయి, 316 00:19:28,211 --> 00:19:31,006 అలాగే కొన్ని వివిధ ఆహార వనరుల కోసం తిరుగుతాయి. 317 00:19:31,006 --> 00:19:32,465 మీరు కరీబులతో కలిసి ఎక్కడ పనిచేస్తారు? 318 00:19:32,465 --> 00:19:37,053 ఈ ఏరియాలోనే, ఇక్కడ మేము క్లిన్సే-జా కరీబు మెటర్నిటీ పెన్ ని నడిపిస్తున్నాం. 319 00:19:37,053 --> 00:19:38,597 మెటర్నిటీ పెన్ అంటే ఏంటి? 320 00:19:38,597 --> 00:19:41,474 అది చుట్టూ ఫెన్స్ వేయబడిన ఒక పెద్ద ప్రదేశం. 321 00:19:41,474 --> 00:19:44,269 మేము అడవుల్లో నుండి గర్భంతో ఉన్న కరీబులను తీసుకొస్తాం. 322 00:19:44,269 --> 00:19:47,063 అప్పుడు అవి సురక్షితంగా వాటి పిల్లలను అక్కడ కనొచ్చు. 323 00:19:47,063 --> 00:19:49,316 తర్వాత వాటిని మేము తిరిగి అడవిలోకి వదులుతాము. 324 00:19:49,316 --> 00:19:52,736 -వాటిని మనం ఎందుకు కాపాడాల్సి వస్తోంది? -అవి పర్వతాల మధ్య ఉన్నప్పుడు 325 00:19:52,736 --> 00:19:55,906 చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, క్రూర జంతువులు వాటి వెంట ఈజీగా పడుతుంటాయ్. 326 00:19:55,906 --> 00:19:58,617 -కాబట్టి, ఈ ప్రదేశంలో అవి సురక్షితంగా ఉంటాయి. -మీరు వాటికి మేత పెట్టే అవకాశం ఉంటుందా? 327 00:19:58,617 --> 00:20:00,702 -ఉంటుంది. -మీరు చాలా లక్కీ. 328 00:20:00,702 --> 00:20:02,245 కరీబులకు సాయం చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? 329 00:20:02,245 --> 00:20:04,289 చాలా ఏళ్ల క్రితం, మా సమాజాలలో ఉన్న పెద్దలు 330 00:20:04,289 --> 00:20:07,334 కరీబుల సంఖ్య తగ్గుతుందని చెప్పి మాతో వాటిని వేటాడొద్దు అని చెప్పారు. 331 00:20:07,334 --> 00:20:12,088 కాబట్టి, మేము మూస్ మాంసాన్ని తినేవారం, అలాగే నేను ఆ మాంసాన్ని కడిగి, కోయడానికి మా అమ్మకు సహాయం చేసేదాన్ని. 332 00:20:12,088 --> 00:20:14,341 కాబట్టి, ఆ పని చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. 333 00:20:14,341 --> 00:20:16,051 నేను ఆ విషయం ముందెప్పుడూ ఆలోచించలేదు. 334 00:20:16,051 --> 00:20:19,596 చాలా మంది ఆలోచించరు, ఎందుకంటే మనం సహజంగా మాంసాన్ని షాపుల్లో కొంటుంటాం కదా? 335 00:20:20,263 --> 00:20:22,557 కానీ మనం తినడానికి ముందు ఎంత పని చేయాల్సి ఉంటుందో 336 00:20:22,557 --> 00:20:26,478 తెలిస్తే, ఆ జంతువు పట్ల మనకు కృతజ్ఞత పుడుతుంది. 337 00:20:26,478 --> 00:20:28,772 అలాగే మనం ఎంత కావాలో అంతే తీసుకొని ఆహారాన్ని వృధా చేయము. 338 00:20:28,772 --> 00:20:30,398 నువ్వు అన్నది కరెక్ట్, డేవిడ్. 339 00:20:30,398 --> 00:20:31,816 కరీబుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? 340 00:20:31,816 --> 00:20:36,029 ఇక్కడ చూస్తున్నారా? మన కరీబుల సంఖ్య తగ్గడానికి పెద్ద కారణం అడవులు నశించడమే. 341 00:20:36,029 --> 00:20:38,323 మనం ప్రకృతిలో ఉన్న సమతుల్యతను దెబ్బ తీశాము. 342 00:20:38,323 --> 00:20:40,867 మనం ఆ సమతుల్యత తిరిగి ఏర్పడడానికి సాయం చేయొచ్చు. 343 00:20:40,867 --> 00:20:44,996 కరీబుల లాగే, మనం కూడా ఒక జాతి జంతువులం అని గుర్తుంచుకోవడం ముఖ్యం. 344 00:20:44,996 --> 00:20:47,624 మనది మానవ జాతి, అలాగే మనం కూడా కలిసి పనిచేయాలి. 345 00:20:47,624 --> 00:20:49,209 అయితే సాయం చేయడానికి మనం ఏం చేయగలం? 346 00:20:49,209 --> 00:20:51,503 మీరు ఇవాళ నేర్చుకున్నది అందరికీ చెప్పడం ద్వారా మొదలెట్టొచ్చు. 347 00:20:51,503 --> 00:20:52,963 అలాగే తక్కువగా వృధా చేయడం ద్వారా. 348 00:20:52,963 --> 00:20:55,423 మీ అమ్మా నాన్నలతో, లేదా పెద్దలతో మాట్లాడండి, 349 00:20:55,423 --> 00:20:59,052 అలాగే దగ్గరలో ఉన్న చెత్త వేసే ప్రదేశాలకు వెళ్లి మీ చెత్తను ఎక్కడకు తీసుకెళ్తారో చూడండి. 350 00:20:59,052 --> 00:21:01,888 ఈ చెత్త వల్ల మన పర్యావరణం దారుణంగా దెబ్బ తింటుంది. 351 00:21:01,888 --> 00:21:06,601 అలాగే అది కరీబులపై, ఇంకా మనతో సహా ఇతర జంతుజాతుల ఆవాసాలపై ప్రభావం చూపుతుంది. 352 00:21:07,894 --> 00:21:11,064 అంత చెత్తను చూస్తుంటే నాకు ఇక చెత్తను వేయాలనే అనిపించడం లేదు. 353 00:21:11,064 --> 00:21:15,318 నేను ముందెప్పుడూ చెత్త కుప్పలను చూసిందే లేదు. ఖచ్చితంగా వాసన వస్తూ ఉంటుంది. 354 00:21:15,318 --> 00:21:17,487 నువ్వు అన్నది నిజమే కావచ్చు. నేను కూడా చూడలేదు. 355 00:21:17,487 --> 00:21:20,699 ఇవాళ మాతో కరీబుల గురించి మాట్లాడినందుకు చాలా థాంక్స్, స్టార్. 356 00:21:20,699 --> 00:21:24,119 మీకే థాంక్స్. మీ ఇద్దరినీ కలవడం నాకు చాలా సంతోషం. 357 00:21:24,119 --> 00:21:26,621 -బై, స్టార్. -మళ్ళీ కలుద్దాం. 358 00:21:27,372 --> 00:21:31,084 నువ్వు త్వరగా రావాలి, జేన్. త్వరలోనే అంతా తినేయబోతున్నాను. 359 00:21:46,141 --> 00:21:47,976 దాదాపుగా పూర్తయిపోయింది. 360 00:21:50,896 --> 00:21:53,189 డెనే నేషన్ కు చెందిన జార్జ్ బ్లాండిన్ (1923-2008) స్పూర్తితో 361 00:22:29,726 --> 00:22:31,728 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్