1 00:00:35,579 --> 00:00:38,081 "ఐలురోపోడ మెలనోలూక." 2 00:00:44,754 --> 00:00:46,840 నీ పని ఎలా సాగుతోంది, డేవిడ్? 3 00:00:46,923 --> 00:00:48,258 చాలా ఇబ్బందిగా ఉంది. 4 00:00:48,341 --> 00:00:52,345 -గుర్తుంచుకో, తాడును అందుకుని పైకి లాగు. -సరే. 5 00:00:53,096 --> 00:00:54,806 అందుకోవడం వరకు బాగానే ఉంది. 6 00:00:55,765 --> 00:00:58,852 పైకి లాగడమే కష్టంగా ఉంది. 7 00:01:05,609 --> 00:01:06,985 షో-ఆఫ్ చేస్తోంది. 8 00:01:08,528 --> 00:01:10,030 హాయ్, గ్రేబియర్డ్. 9 00:01:10,113 --> 00:01:11,948 ఇంతకీ మనం అసలు చెట్లు ఎందుకు ఎక్కుతున్నట్టు? 10 00:01:12,032 --> 00:01:13,366 జైంట్ పాండాని కనిపెట్టడానికి! 11 00:01:13,450 --> 00:01:15,702 అవి సాధారణంగా నేల మీద ఉంటాయి కదా? 12 00:01:15,785 --> 00:01:17,996 అవును, కానీ అవి చెట్లు కూడా చాలా బాగా ఎక్కగలవు. 13 00:01:18,079 --> 00:01:21,082 వాటి పిల్లలు కూడా మృగాల బారి నుండి తప్పించుకోవడానికి చెట్లు ఎక్కుతాయి. 14 00:01:22,083 --> 00:01:23,084 మృగాలా? 15 00:01:23,168 --> 00:01:27,172 అవును. మంచు చిరుత, నక్క అలాగే పసుపు గొంతు మార్టెన్ లాంటి వాటి నుండి. 16 00:01:27,255 --> 00:01:29,382 -నాకు కూడా మార్టిన్ పేరుతొ ఒకరు తెలుసు. -అది ఒక రకమైన వీసిల్. 17 00:01:29,466 --> 00:01:31,801 సరే, ఆ మార్టిన్ కూడా అలాంటోడే. 18 00:01:34,429 --> 00:01:36,264 గ్రేబియర్డ్ ఏదో కనిపెట్టింది. 19 00:01:37,557 --> 00:01:39,267 దయచేసి అది ఒక క్రూరమృగం అని మాత్రం చెప్పకు. 20 00:01:40,518 --> 00:01:42,187 కాదు, అది… 21 00:01:42,854 --> 00:01:43,855 జైంట్ పాండా. 22 00:01:43,939 --> 00:01:45,357 అది చాలా అందంగా ఉంది. 23 00:01:45,440 --> 00:01:47,192 ఎక్కడ? నాకు కూడా చూడాలని ఉంది. 24 00:01:47,275 --> 00:01:48,526 అది ఎక్కడ ఉంది? 25 00:01:53,615 --> 00:01:56,243 డేవిడ్, నిశ్శబ్దంగా ఉండు, లేదంటే అది భయపడి పారిపోతుంది. 26 00:01:56,326 --> 00:01:58,828 మనం దాన్ని గమనించడానికి వచ్చాము, మరీ దగ్గరకు వెళ్ళడానికి కాదు. 27 00:01:58,912 --> 00:02:01,539 అడవి జంతువులకు జనం అస్సలు అలవాటు కాకూడదు. 28 00:02:05,168 --> 00:02:07,254 చూస్తుంటే అది దేనికోసమో వెతుకుతున్నట్టు ఉంది. 29 00:02:10,298 --> 00:02:11,591 జేన్? 30 00:02:11,675 --> 00:02:13,343 జైంట్ పాండాలకు వాటి పంజాలలో ఆరు వేళ్ళు ఎందుకు 31 00:02:13,426 --> 00:02:15,845 -ఉంటాయో కనిపెట్టడానికి ఇదే మనకు అవకాశం. -జేన్. 32 00:02:15,929 --> 00:02:17,347 ఎలుగుబంటి జాతిలో ఆరు వేళ్ళు ఉండేది వీ… 33 00:02:17,430 --> 00:02:18,848 జేన్! 34 00:02:18,932 --> 00:02:20,267 ఏమైంది, డేవిడ్? 35 00:02:23,687 --> 00:02:25,272 ఒక పాండా పిల్ల. 36 00:02:25,355 --> 00:02:27,440 అది నాకు దగ్గరగా రావడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. 37 00:02:27,524 --> 00:02:28,567 కదలకు. 38 00:02:28,650 --> 00:02:31,611 తల్లి గనుక నిన్ను చూస్తే, నువ్వు హాని తలపెట్టడానికి వచ్చావనుకుని పిల్లను కాపాడటానికి రావచ్చు. 39 00:02:32,529 --> 00:02:34,948 నా మీద "దాడి చేయడానికి" రావచ్చని మంచిగా చెప్తున్నావు కదా? 40 00:02:36,074 --> 00:02:38,577 చూస్తుంటే ఇది నాతో ఆడటానికి చూస్తున్నట్టు ఉంది. 41 00:02:38,660 --> 00:02:40,370 తల్లి వ్యతిరేక దిశలో వెళ్తోంది. 42 00:02:42,289 --> 00:02:44,499 చెట్టు పై దూరంగా ఉండటం వల్ల పిల్లను చూడలేకపోతోంది ఏమో. 43 00:02:44,583 --> 00:02:47,168 పాండా పిల్లలు వాటికి మూడేళ్లు వచ్చేవరకు తల్లితోనే ఉండాలి. 44 00:02:47,252 --> 00:02:49,838 నేను వెళ్లి దాన్ని వెనక్కి రప్పించడానికి చూస్తాను. 45 00:02:49,921 --> 00:02:51,339 మరి ఈ లోగా నేనేం చేయాలి? 46 00:02:52,507 --> 00:02:53,633 నాకు ఇది చాలా నచ్చేస్తోంది. 47 00:02:53,717 --> 00:02:55,468 అక్కడే ఉండు. 48 00:02:57,345 --> 00:02:58,763 అలాగే దానితో ఆటలాడకు. 49 00:02:58,847 --> 00:03:00,640 మనం వాటిని గమనించడానికి మాత్రమే వచ్చాము, డేవిడ్. 50 00:03:00,724 --> 00:03:03,643 త్వరగా కానివ్వు, జేన్. ఇది గారాలు వలుకపోసి నన్ను వశపరచుకుంటోంది. 51 00:03:03,727 --> 00:03:05,604 నేను ఇలా చేయాలని ఎన్నాళ్ళ నుండో చూస్తున్నాను! 52 00:03:07,898 --> 00:03:09,107 అక్కడ ఉంది! 53 00:03:11,026 --> 00:03:13,111 చింతించకు, నీ పిల్లను తిరిగి నీతో చేర్చుతాను! 54 00:03:13,194 --> 00:03:14,362 నువ్వు ఇక్కడ ఉన్నావా. 55 00:03:16,323 --> 00:03:18,491 -నువ్వు ఏం చేస్తున్నావు? -అంటే… 56 00:03:18,575 --> 00:03:20,410 గ్రేబియర్డ్ కి నా స్కార్ఫ్ ఎందుకు చుట్టావు? 57 00:03:20,493 --> 00:03:21,494 అది ఒక జిప్ లైన్. 58 00:03:21,578 --> 00:03:24,080 మేము ఐలురోపోడ మెలనోలూకకి వాటి పంజాలలో ఆరు వేళ్ళు ఎందుకు 59 00:03:24,164 --> 00:03:25,582 ఉంటాయో కనిపెట్టడానికి చూస్తున్నాం. 60 00:03:25,665 --> 00:03:26,875 ఐలురో-ఏంటి? 61 00:03:26,958 --> 00:03:28,752 అది జైంట్ పాండాల శాస్త్రీయ నామం. 62 00:03:28,835 --> 00:03:30,795 ఆ విషయాన్ని కనిపెట్టడానికి నీకు నా గది కావాల్సి వచ్చిందా? 63 00:03:31,713 --> 00:03:32,672 ల్యాండింగ్ బాగుంటుందని. 64 00:03:34,549 --> 00:03:35,550 జేన్? 65 00:03:35,634 --> 00:03:38,511 ఒక్క క్షణం, డేవిడ్. నాకు సమస్య వచ్చినట్టు ఉంది. 66 00:03:41,389 --> 00:03:43,225 ఖచ్చితంగా సమస్యలో పడ్డాను. 67 00:03:43,934 --> 00:03:45,727 నాకు కూడా చిన్న సమస్య వచ్చింది. 68 00:03:51,316 --> 00:03:53,985 నేను రాత్రికి నిన్ను పికప్ చేసుకున్నాకా ఇదంతా శుభ్రం చేయాలి. 69 00:03:54,069 --> 00:03:56,279 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా? 70 00:03:56,363 --> 00:03:57,822 ఆండ్రే నన్ను బయటకు తీసుకెళ్తున్నాడు. 71 00:03:57,906 --> 00:03:59,783 -డేట్ మీదా? -అవును. 72 00:03:59,866 --> 00:04:01,451 నేను డేట్ కి వెళ్తున్నానని నీతో చెప్పాను, 73 00:04:01,534 --> 00:04:05,538 నువ్వేమో చైనా వెళ్తున్నాను అన్నావు, నాకు తెలిసి నీ పాండాల అన్వేషణ మీద అనుకుంట. 74 00:04:05,622 --> 00:04:08,208 ఐలురోపోడ మెలనోలూక రీసెర్చ్ మిషన్ మీద. 75 00:04:12,420 --> 00:04:13,588 అది బాగానే ఉంది. 76 00:04:13,672 --> 00:04:15,840 నాకు ఎందుకు కంగారుగా ఉందో తెలీడం లేదు. 77 00:04:15,924 --> 00:04:17,175 ఎందుకంటే నీకు అతను నచ్చాడు. 78 00:04:18,718 --> 00:04:20,303 అవును, నిజమే అనుకుంట. 79 00:04:20,387 --> 00:04:21,680 నువ్వు చాలా అందంగా ఉన్నావు, అమ్మా. 80 00:04:21,763 --> 00:04:23,306 థాంక్స్. 81 00:04:26,309 --> 00:04:28,228 టైమ్ అయింది. లేట్ అయింది కూడా. 82 00:04:28,728 --> 00:04:32,107 "వెంటనే వస్తున్నాను." 83 00:04:36,152 --> 00:04:37,153 మరీ ఎక్కువ అయిందా? 84 00:04:37,237 --> 00:04:38,572 కొంచెం. 85 00:04:44,911 --> 00:04:46,830 మరీ దగ్గరగా రాకు. 86 00:04:47,330 --> 00:04:48,623 నేను నీకు అలవాటు కాకూడదు. 87 00:04:50,041 --> 00:04:52,043 గమనించాలి అంతే. 88 00:04:56,172 --> 00:04:57,591 ఏం కాదు, బేబీ. 89 00:04:57,674 --> 00:04:58,967 ఏం చేయాలో జేన్ కి తెలుసు. 90 00:05:08,351 --> 00:05:09,603 నువ్వు నన్ను కాపీ కొడుతున్నావా? 91 00:05:11,688 --> 00:05:12,856 ఇది కాపీ చెయ్. 92 00:05:14,566 --> 00:05:15,442 బేబీ! 93 00:05:18,737 --> 00:05:20,238 సరే, ఇది ట్రై చెయ్. 94 00:05:29,539 --> 00:05:31,416 డేవిడ్ వాళ్ళ నాన్నలు నిన్ను చూసుకుంటాం అన్నారు, 95 00:05:31,499 --> 00:05:33,460 అలాగే మేము ఈ వీధి చివర ఉన్న రెస్టారెంట్ కి వెళ్తున్నాం. 96 00:05:33,543 --> 00:05:35,587 కాబట్టి నీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయమని వాళ్ళను అడుగు. 97 00:05:35,670 --> 00:05:36,922 -సరేనా? -సరే. 98 00:05:37,672 --> 00:05:40,258 -అత్యవసరం అయితేనే. -అలాగే. 99 00:05:41,051 --> 00:05:41,885 నిజమైన అవసరం, 100 00:05:41,968 --> 00:05:45,180 పాండాల మీద ట్రాకింగ్ పరికరం పెట్టడం ఎలా అన్నట్టు పిచ్చి పిచ్చి సందేహాలకు కాదు. 101 00:05:45,263 --> 00:05:47,933 మేము చేస్తున్న పని అది కాదు. ఇది అంతకంటే చాలా కష్టమైన పని. 102 00:05:48,475 --> 00:05:50,101 అయితే మీరిద్దరూ ఏం చేస్తున్నట్టు? 103 00:05:50,727 --> 00:05:54,189 మేము ఆ పాండా పిల్ల మాకు అలవాటు పడటానికి ముందే దాన్ని తల్లితో చేర్చాలి. 104 00:05:54,272 --> 00:05:56,274 అది మనుషులకు అలవాటు పడటం మంచి విషయం కాదా? 105 00:05:56,358 --> 00:05:59,027 పాండాకు అతిపెద్ద ముప్పు మనుషుల నుండే. 106 00:05:59,110 --> 00:06:00,946 అడవి జంతువులు జనానికి అలవాటు పడితే… 107 00:06:01,029 --> 00:06:04,074 -అది ఆ జంతువుకు మంచిది కాదు అంటావా? -అవును. 108 00:06:06,701 --> 00:06:08,203 ఇది రావడానికి ఇంత సేపు పడుతుంది ఎందుకు? 109 00:06:08,286 --> 00:06:10,413 అమ్మా, రిలాక్స్. అంతా బాగానే జరుగుతుంది. 110 00:06:11,539 --> 00:06:13,375 నువ్వు అన్నది నిజమే. సరిగ్గా చెప్పావు. 111 00:06:19,172 --> 00:06:20,882 నేను ఇలాంటి రియాక్షన్ ఇస్తావని అస్సలు అనుకోలేదు. 112 00:06:22,717 --> 00:06:25,303 నేనే వచ్చి నిన్ను తీసుకెళదాం అనుకున్నాను. 113 00:06:25,387 --> 00:06:27,264 పర్లేదు, క్షమించు. అదేం పర్లేదు. 114 00:06:27,764 --> 00:06:28,848 నిన్ను ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. 115 00:06:28,932 --> 00:06:30,684 అంటే, నువ్వు ఈ బిల్డింగ్ లోనే ఉంటావని నాకు తెలుసు, 116 00:06:30,767 --> 00:06:32,102 అలాగే నేను ఇక్కడే ఉంటా, కానీ మనం కలిసి ఉందాం కదా. 117 00:06:35,355 --> 00:06:37,399 -హేయ్, ఆండ్రే. -హేయ్, జేన్. 118 00:06:38,108 --> 00:06:39,442 ఇవి నీకోసం తెచ్చాను. 119 00:06:43,113 --> 00:06:44,364 నేను కూడా నీకోసం ఏమైనా తెచ్చి ఉండాల్సింది. 120 00:06:50,620 --> 00:06:52,831 ఇవి చాలా అందంగా ఉన్నాయి. చాలా థాంక్స్. 121 00:06:52,914 --> 00:06:54,958 నీకు ప్రయాణించడం ఇష్టం అని నువ్వు చెప్పడం గుర్తుంది, 122 00:06:55,041 --> 00:06:57,752 అందుకే మనకు అందుబాటులో ఉండని పువ్వులు తెచ్చాను. 123 00:06:57,836 --> 00:06:58,879 అది వెదురు పువ్వా? 124 00:06:58,962 --> 00:07:00,380 అవును. బాగా కనిపెట్టావు. 125 00:07:00,964 --> 00:07:02,966 అది జైంట్ పాండాకు బాగా ఇష్టమైన ఆహారం. 126 00:07:04,050 --> 00:07:05,677 ఇవాళ నువ్వు ఇంకొక జంవుతును కాపాడుతున్నావా? 127 00:07:05,760 --> 00:07:06,595 నా పనే అది. 128 00:07:12,642 --> 00:07:14,060 ఎవరో డేట్ కి బాగా రెడీ అయినట్టు ఉన్నారు. 129 00:07:14,603 --> 00:07:17,355 -నిన్ను తీసుకెళ్తున్న అదృష్టవంతుడు ఎవరు? -అది నేనే. 130 00:07:17,981 --> 00:07:18,899 నేను ఆండ్రేని. 131 00:07:18,982 --> 00:07:20,525 నిన్ను చాలా మెచ్చుకోవాలి. 132 00:07:22,861 --> 00:07:24,571 నా ఉద్దేశం నువ్వు తెచ్చిన పూల బొకేని చూసి. 133 00:07:25,780 --> 00:07:26,615 నేను లూకస్ ని. 134 00:07:28,158 --> 00:07:29,659 అలాగే నేను మహారాజు కెవిన్ ని. 135 00:07:29,743 --> 00:07:31,536 మీ ఇద్దరినీ కలవడం సంతోషంగా ఉంది. 136 00:07:32,495 --> 00:07:35,540 మేము జేన్ పడుకునే సమయానికి వచ్చేస్తాం. ఈమెను చూసుకుంటున్నందుకు మళ్ళీ థాంక్స్. 137 00:07:35,624 --> 00:07:37,292 -లేదు, అదేం పర్లేదు. -మీరు నెమ్మదిగా ఎంజాయ్ చేయండి, మరియా. 138 00:07:37,375 --> 00:07:39,586 మేము ఇవాళ రాత్రి యువరాణి థీమ్ తో సినిమా చూస్తున్నాం. 139 00:07:44,925 --> 00:07:47,177 డేవిడ్ ఈ కోటలో తన విభాగంలో ఉన్నాడు. 140 00:07:48,345 --> 00:07:49,179 వాడి బెడ్ రూమ్ లో. 141 00:07:50,722 --> 00:07:52,349 బై, అమ్మా. బై, ఆండ్రే. 142 00:07:54,517 --> 00:07:58,063 -అవును. బై, ఆండ్రే. -ఆపు. 143 00:08:00,190 --> 00:08:01,733 మనం కూడా డేట్స్ కి వెళ్ళేవాళ్ళం గుర్తుందా? 144 00:08:03,318 --> 00:08:05,445 పాప్ కార్న్ సిద్ధంగా ఉందా? 145 00:08:05,946 --> 00:08:06,947 వస్తున్నాం, యువరాణి. 146 00:08:10,408 --> 00:08:11,785 డేవిడ్? 147 00:08:11,868 --> 00:08:12,953 నేను ఇక్కడ ఉన్నాను. 148 00:08:13,036 --> 00:08:14,162 నువ్వు ఏం చేస్తున్నావు? 149 00:08:15,038 --> 00:08:17,832 దాక్కుంటున్నాను. రోలీ నన్ను తన అమ్మలా చూస్తోంది అని నాకు అనిపిస్తోంది. 150 00:08:20,877 --> 00:08:22,337 నువ్వు దానికి పేరు పెట్టావా? 151 00:08:22,420 --> 00:08:26,132 పెట్టకూడదు అనే అనుకున్నాను, కానీ… ఎంత అందంగా ఉందో చూడు. 152 00:08:30,679 --> 00:08:31,638 రోలీ. 153 00:08:32,681 --> 00:08:35,642 ఎందుకంటే దానికి రోల్ అవ్వడం ఇష్టం. అది నేనే నేర్పించాను. 154 00:08:35,725 --> 00:08:37,018 అంటే ఏంటి నీ ఉద్దేశం? 155 00:08:37,101 --> 00:08:42,816 అది నేను చేసే పనులన్నీ కాపీ కొడుతోంది, గెంతడం అలాగే దూకడం తప్ప, 156 00:08:42,899 --> 00:08:44,651 ఇంకాసేపటిలో అది కూడా చేస్తుంది. 157 00:08:44,734 --> 00:08:48,655 జంతువులు విషయాలను నేర్చుకునే విధానం అదే, వాటి తల్లిదండ్రులను కాపీ కొడుతుంటాయి. 158 00:08:49,155 --> 00:08:51,700 అందుకే మనం దీనిని వెంటనే తల్లి దగ్గరకు తీసుకెళ్లాలి. 159 00:08:51,783 --> 00:08:53,535 దీని అసలు తల్లి దగ్గరకు, డేవిడ్. 160 00:08:53,618 --> 00:08:55,996 అప్పుడే ఇది మనిషిలా కాకుండా పాండాగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటుంది. 161 00:08:57,789 --> 00:08:59,374 అది ఎక్కడికి పోయింది? 162 00:09:00,750 --> 00:09:01,918 వెనక్కి వచ్చెయ్, రోలీ! 163 00:09:03,211 --> 00:09:06,590 ఖచ్చితంగా నైట్ రైలీ కంటే దారుణంగా కిందకు తోసేస్తారు. 164 00:09:06,673 --> 00:09:08,508 -అవకాశమే లేదు. -రోలీ. 165 00:09:08,592 --> 00:09:11,303 అవును, నీకు ఇంకా ఎక్కువ నొప్పి రావాలని కోరుకుంటున్నాం. 166 00:09:11,386 --> 00:09:13,346 -నిజంగా? -వెనక్కి రా. 167 00:09:13,430 --> 00:09:14,890 నువ్వు నీ మొహం మీద పడ్డావు. 168 00:09:14,973 --> 00:09:16,766 ఆ ఒక్కటి మినహా, మిగతాది అంతా ఒకేలా ఉంది. 169 00:09:18,184 --> 00:09:19,811 రోలీ, వద్దు! 170 00:09:20,562 --> 00:09:22,105 మీరిద్దరూ ఏం చేస్తున్నారు? 171 00:09:36,661 --> 00:09:38,371 మీ సర్వర్ వెంటనే వస్తారు. 172 00:09:38,455 --> 00:09:39,831 -చాలా థాంక్స్. -థాంక్స్. 173 00:09:42,876 --> 00:09:44,294 మంచి చోటు. 174 00:09:44,377 --> 00:09:45,545 ఇది జేన్ కి బాగా ఇష్టమైన చోటు. 175 00:09:46,838 --> 00:09:48,590 -ఓహ్, వెజిటేరియన్… -వెజిటేరియన్, అవును. 176 00:09:50,717 --> 00:09:52,677 సరే, ఇంతకీ ఆమెకు జంతువులు అంటే ఎందుకు అంత ఇష్టం? 177 00:09:52,761 --> 00:09:54,429 అది ఒక పెద్ద కథ. 178 00:09:54,512 --> 00:09:55,972 నాకు మొత్తం కథ వినాలని ఉంది. 179 00:09:58,350 --> 00:10:00,894 పాండా పిల్లను కోల్పోతున్నాం. మేము చేస్తున్నది అదే, మిల్లి. 180 00:10:00,977 --> 00:10:02,229 ఇది ఒక "పాండా-సమస్య." 181 00:10:02,312 --> 00:10:05,398 -అది పార్క్ వైపు వెళ్తోంది అనుకుంట. -దాన్ని మనకు అలవాటు పడనివ్వకూడదు. 182 00:10:05,482 --> 00:10:07,484 మరి అది తన తల్లి దగ్గరకు వెళ్ళడానికి మనం ఏం చేయగలం? 183 00:10:07,567 --> 00:10:10,487 నాకు కూడా తెలీదు. అడవి జంతువులు అడవి జంతువుల్లాగే ఉండాలి, 184 00:10:10,987 --> 00:10:13,031 లేదంటే అవి మనుషులను చూసి వాళ్ళు వాటికి సాయం చేస్తారు అనుకుంటాయి, 185 00:10:13,114 --> 00:10:14,866 కానీ అందరూ సాయం చేసేవాళ్ళు ఉండరు. 186 00:10:15,992 --> 00:10:18,912 అయితే మనం ఏం చేయాలి? ఏమీ చేయలేమా? 187 00:10:18,995 --> 00:10:21,331 మీరు మనుషుల్లా కనిపించకపోతే ఏమవుతుంది? 188 00:10:21,414 --> 00:10:22,624 ఈమె అన్నది నిజమే. 189 00:10:22,707 --> 00:10:25,669 కొన్నిసార్లు జంతు సంరక్షకులు పిల్లల తల్లిలాగ వేషం వేసుకుంటుంటారు, 190 00:10:25,752 --> 00:10:27,754 అలా అయితే అవి మనుషులకు అలవాటు పడవని. 191 00:10:27,837 --> 00:10:29,839 కానీ మనం పాండాల్లాగ కనిపించడం ఎలా సాధ్యం? 192 00:10:34,427 --> 00:10:36,012 నాన్నా అలాగే పాప్ వస్తువులా? 193 00:10:36,096 --> 00:10:37,389 మంచి ఐడియా, మిల్లి. 194 00:10:37,472 --> 00:10:40,225 పాండాలాగ మారే ప్రక్రియ మొదలెడదాం. 195 00:10:42,352 --> 00:10:43,812 జౌస్ట్! 196 00:10:52,779 --> 00:10:55,115 ఇది మనిద్దరమే చూస్తున్నామా? 197 00:10:56,575 --> 00:10:58,076 నాకు కార్యక్రమం నచ్చడం మొదలైంది. 198 00:10:58,994 --> 00:11:01,079 -మేము కొన్ని బట్టలు తీసుకోవచ్చా? అలాగే ఒక ఫోన్? -అలాగే మీ తలగళ్ళు? 199 00:11:01,162 --> 00:11:03,623 -అలాగే మేము పార్క్ కి వెళ్ళొచ్చా? -అలాగే నాకు ఇంకొంచెం పాప్ కార్న్ ఇస్తారా? 200 00:11:07,711 --> 00:11:11,047 నేను హాల్ లోకి వచ్చేసరికి తను నిద్ర లేచి నేను అంతవరకు 201 00:11:11,131 --> 00:11:13,341 చూస్తున్న న్యూస్ కార్యక్రమం చూస్తోంది. 202 00:11:13,425 --> 00:11:15,176 అప్పుడు తనకు నాలుగేళ్లు అనుకుంట. అయిదు కావచ్చు. 203 00:11:15,260 --> 00:11:19,055 అది జంతువులు అలాగే మొక్కల గురించి, ప్రపంచంలో ఉన్న వాటిలో ఎన్ని అంతరించిపోతున్నాయో 204 00:11:19,139 --> 00:11:20,682 -చెప్తున్న కార్యక్రమం. -ఎన్ని అంతరించిపోతున్నాయి? 205 00:11:20,765 --> 00:11:24,603 చాలాపెద్ద సంఖ్యలోనే, మనం ఏం చేయకపోతే దాదాపుగా పదిలక్షల జాతులు 206 00:11:24,686 --> 00:11:25,770 అంతరించిపోతాయి. 207 00:11:26,438 --> 00:11:29,816 ఆ తర్వాత నేను తన దగ్గరకు వెళ్లేసరికి ఆమె ఏడుస్తోంది. 208 00:11:30,859 --> 00:11:32,235 -పాపం జేన్. -అవును. 209 00:11:32,319 --> 00:11:35,363 జంతువులు అంతరించిపోతున్నాయి అని మనకు తెలిసిన తర్వాత కూడా మనం అందరం కలిసి పనిచేసి 210 00:11:35,447 --> 00:11:37,657 వాటిని ఎందుకు కాపాడలేకపోతున్నామో తనకు అర్థం కావడం లేదు అంది. 211 00:11:37,741 --> 00:11:39,284 అయితే మరి నువ్వు ఏమని చెప్పావు? 212 00:11:39,367 --> 00:11:41,995 నేను ఏమని చెప్పగలను? అంటే, ఆ ప్రశ్నకు సమాధానం ఏమైనా ఉందా? 213 00:11:43,038 --> 00:11:44,039 మరి ఏం చేసావు? 214 00:11:44,122 --> 00:11:45,123 నేను ఆన్లైన్ లో చెక్ చేశా. 215 00:11:47,167 --> 00:11:48,919 మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వారి గురించి చదివాను, 216 00:11:49,002 --> 00:11:52,172 గ్రెటా థన్బెర్గ్, అలాగే డేవిడ్ సుజుకి ఇంకా… 217 00:11:52,255 --> 00:11:53,798 జేన్ గుడ్ఆల్. 218 00:11:54,799 --> 00:11:57,344 వాళ్ళిద్దరి మొదటి పేరు ఒకటే కావడం వల్ల ఆవిడంటే తనకు చాలా ఇష్టం. 219 00:11:57,427 --> 00:11:58,553 నిజమే. 220 00:11:58,637 --> 00:12:01,806 ఆ తరువాత, జంతువులను కాపాడటానికి తాను చేయగల ప్రతీది చేయడం మొదలెట్టింది. 221 00:12:01,890 --> 00:12:04,643 కారణంగా కొన్నిసార్లు నాకు బాగా కోపం తెప్పిస్తుంది అనుకో. 222 00:12:07,145 --> 00:12:09,439 కానీ తనకు ఈ ప్రపంచాన్ని కాపాడాలని బలమైన సంకల్పం ఉంది. 223 00:12:09,522 --> 00:12:11,524 మనకు జేన్ లాంటి వారు ఇంకా చాలా మంది కావాలి. 224 00:12:12,567 --> 00:12:13,610 ఇద్దరు జేన్ల లాంటి వారు. 225 00:12:20,075 --> 00:12:21,743 "మేము నీ మేకప్ తీసుకోవచ్చా?" 226 00:12:23,870 --> 00:12:24,788 సరే, నాకు… 227 00:12:26,831 --> 00:12:27,832 అమ్మ ఒప్పుకుంది. 228 00:12:27,916 --> 00:12:29,459 ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేసేవారం? 229 00:12:34,839 --> 00:12:37,259 తల్లి లేదా పాండా పిల్లను ఏమైనా చూశావా, గ్రేబియర్డ్? 230 00:12:46,309 --> 00:12:48,228 -నీకు మేకప్ వేయడంలో సాయం కావాలా? -సరే. 231 00:12:52,148 --> 00:12:54,401 సరే, ఇంతకీ మన ప్లాన్ ఏంటి? 232 00:12:54,484 --> 00:12:55,777 పాండాల లాగ రెడీ అవ్వాలి. 233 00:12:55,860 --> 00:12:57,988 పిల్లని కనిపెట్టాలి. పిల్లని తల్లి దగ్గరకు తీసుకెళ్లాలి. 234 00:12:58,071 --> 00:13:00,574 తల్లికి ఆరు వేళ్ళు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలి. 235 00:13:00,657 --> 00:13:04,369 నాకు కూడా ఆరు వేళ్ళు ఉండి ఉంటే బాగుండు. ఈ పని వేగంగా జరిగేది. 236 00:13:12,919 --> 00:13:13,962 అది వచ్చింది. 237 00:13:14,921 --> 00:13:16,214 మనం ఏం చేయాలి? 238 00:13:17,424 --> 00:13:20,969 నేను రోలీని కనిపెడతా, నువ్వు అలాగే గ్రేబియర్డ్ తల్లిని నా దగ్గరకు తీసుకొచ్చే ప్లాన్ వేయండి. 239 00:13:21,052 --> 00:13:24,055 నేను వెళ్లి రోలీని కనిపెడదాం అనుకున్నా. అది ఎన్ని ముద్దొచ్చే చిలిపి పనులు చేస్తుందో. 240 00:13:24,139 --> 00:13:26,850 సరే, అలాగే. నువ్వు రోలీని కనిపెట్టు, ఇక్కడ గ్రేబియర్డ్ ఇంకా నేను కలిసి… 241 00:13:26,933 --> 00:13:27,934 మంచి ప్లాన్. 242 00:13:30,520 --> 00:13:32,188 నాకు అది కనిపించగానే నీకు వాకిలో చెప్తా. 243 00:13:34,858 --> 00:13:36,192 నా మేకప్ పూర్తి చేసి వెళ్తావా? 244 00:13:38,278 --> 00:13:39,738 రోలీ? 245 00:13:41,239 --> 00:13:43,116 రోలీ? 246 00:13:46,411 --> 00:13:48,246 రోలీ, ఎక్కడ ఉన్నావు? 247 00:13:49,623 --> 00:13:53,043 మీరు ఇక్కడ ముద్దొచ్చే పాండా పిల్లను ఏమైనా చూశారా? 248 00:13:54,211 --> 00:13:55,545 నేను కాకుండా. 249 00:13:58,506 --> 00:13:59,716 ఎక్కడైనా కనిపించిందా? 250 00:14:00,217 --> 00:14:02,469 -ఇంకా లేదు. మీకు? -లేదు. 251 00:14:02,552 --> 00:14:04,346 అది కనిపించిన వెంటనే నాకు చెప్పు. 252 00:14:04,429 --> 00:14:08,016 -పాండా పిల్లల మనుగడకు వాటి తల్లి చాలా కీలకం. -పాపం రోలీ. 253 00:14:08,099 --> 00:14:12,854 నేను గనుక భయపడుతున్న పాండా పిల్లను అయితే ఎక్కడికి వెళ్తాను? 254 00:14:13,980 --> 00:14:15,190 ఏదైనా ఎక్కి కూర్చుంటాను! 255 00:14:15,857 --> 00:14:18,443 చెట్టు మీద లేదు. మరి… 256 00:14:19,611 --> 00:14:21,613 ఆ జూలు ఎవరిదో నాకు తెలుసు. 257 00:14:22,530 --> 00:14:24,658 మనం విడిగా వెళదాం. ఏమైనా చూస్తే శబ్దం చెయ్. 258 00:14:31,206 --> 00:14:32,207 ఏమైనా కనిపించిందా, గ్రేబియర్డ్? 259 00:14:39,798 --> 00:14:42,008 ఏమైంది, గ్రేబియర్డ్? నీకు అది కనిపించిందా? 260 00:14:43,510 --> 00:14:45,053 అది నా వెనుకే ఉంది, కదా? 261 00:14:46,471 --> 00:14:48,181 ఈ వేషం పనిచేస్తే బాగుండు. 262 00:14:52,978 --> 00:14:54,896 ఓహ్, రోలీ. ఏం కాదు. 263 00:14:55,397 --> 00:15:01,528 డేవిడ్ అనబడే బాగా తెలివైన పిల్లాడు ఒకడు, ఒక పాండా అయిన నాతో నిన్ను కనిపెట్టమని చెప్పాడు. 264 00:15:02,153 --> 00:15:03,905 నిన్ను చూసి నాకు భలే సంతోషంగా ఉంది. 265 00:15:05,574 --> 00:15:08,827 జేన్, మంచి విషయం. నాకు పిల్ల కనిపించింది. నీకు తల్లి కనిపించిందా? 266 00:15:08,910 --> 00:15:11,121 అవును. దానికే నేను కనిపించాను 267 00:15:12,289 --> 00:15:14,374 ఇది నన్ను అస్సలు వదలడం లేదు. 268 00:15:14,457 --> 00:15:16,293 నన్ను దీని పిల్ల అనుకుంటుంది ఏమో. 269 00:15:16,793 --> 00:15:18,879 మంచిది. అయితే అది నిన్ను ఇక్కడికి ఫాలో చేసుకుంటూ రావచ్చు. 270 00:15:18,962 --> 00:15:22,340 చూస్తుంటే దీనికి ఎక్కడికీ కదిలే ఉద్దేశం లేనట్టు ఉంది. ఇది నిద్రపోతోంది. 271 00:15:24,551 --> 00:15:26,928 ఎలుగుబంటి హగ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. 272 00:15:29,306 --> 00:15:31,474 -రోలీకి ఆకలి వేస్తున్నట్టు ఉంది. -ఆహారం! 273 00:15:31,558 --> 00:15:34,311 -ఆహారాన్ని ఎరగా చూపి దీన్ని నీ దగ్గరకు రప్పించగలను. -మంచి ఐడియా. 274 00:15:34,394 --> 00:15:35,937 పాండాలు ఏం తింటాయి? 275 00:15:36,021 --> 00:15:37,022 ఎక్కువగా వెదురు మొక్కలే. 276 00:15:37,105 --> 00:15:38,440 ఇప్పుడు వెదురు మొక్క ఎక్కడ దొరుకుతుంది? 277 00:15:38,523 --> 00:15:40,025 ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. 278 00:15:40,108 --> 00:15:42,736 గ్రేబియర్డ్, నువ్వు వచ్చి నాకు బదులు పడుకోవాలి. 279 00:15:44,279 --> 00:15:45,280 గ్రేబియర్డ్. 280 00:15:48,366 --> 00:15:50,994 తెలుసా, నేను కూడా కాలేజీలో జేన్ గుడ్ఆల్ గురించి చదివాను. 281 00:15:51,077 --> 00:15:54,122 నాకు బాగా నచ్చిన ఆమె మాట ఒకటి గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. 282 00:15:54,706 --> 00:15:56,041 వాళ్ళ అమ్మ ఆమెకు చెప్పిన మాట అది. 283 00:15:56,666 --> 00:16:00,378 "నీకు ఏదైనా నిజంగా కావాలని ఉంటే, నువ్వు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. 284 00:16:00,462 --> 00:16:03,089 ఎదురైన ప్రతీ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. 285 00:16:03,590 --> 00:16:04,758 ప్రయత్నం మానకూడదు." 286 00:16:05,759 --> 00:16:06,927 జేన్ కూడా అదే చెప్తుంటుంది. 287 00:16:08,220 --> 00:16:10,096 నీతో మాట్లాడటం దానికి బాగా నచ్చుతుంది. 288 00:16:10,680 --> 00:16:12,474 వాళ్ళ అమ్మకు కూడా నచ్చాలని నా కోరిక. 289 00:16:15,977 --> 00:16:18,063 అమ్మా, నాకు నీ పువ్వులు కావాలి! 290 00:16:19,147 --> 00:16:20,398 వెదరు మొక్కవి చాలు. 291 00:16:28,114 --> 00:16:30,283 గ్రేబియర్డ్, నాకు వెదురు మొక్క దొరికింది. 292 00:16:33,954 --> 00:16:36,373 గ్రేబియర్డ్, నిద్ర లెగు. మనం వెళ్ళాలి. 293 00:16:43,505 --> 00:16:46,299 పాండా నేను అనుకున్న దానికంటే ఎత్తులో కూర్చుంది. 294 00:16:46,383 --> 00:16:48,885 చింతించకు, రోలీ. మీ అమ్మ త్వరలోనే ఇక్కడికి వస్తుంది. 295 00:16:50,387 --> 00:16:52,347 అక్కడ ఉంది. నాతో రా, రోలీ. 296 00:17:02,315 --> 00:17:03,650 మన ప్లాన్ పని చేస్తోంది, జేన్. 297 00:17:10,699 --> 00:17:12,742 ఇవి దూరంగా అస్సలు "పండ" లేకపోయాయి. 298 00:17:13,743 --> 00:17:14,910 నా మాటల చమత్కారం చూసావా? 299 00:17:16,955 --> 00:17:18,290 అవును, మేము ఇద్దరం చూశాం. 300 00:17:20,250 --> 00:17:21,584 డేవిడ్, చూడు. 301 00:17:21,668 --> 00:17:24,337 అవును, వెదురు పెద్ద రుచిగా కనిపించడం లేదు. 302 00:17:24,880 --> 00:17:25,714 కాదు. 303 00:17:25,796 --> 00:17:30,135 అది తన ఆరవ వేలు వాడి తినడానికి వీలుగా వెదురు కర్ర మీద ఆకులు పీకుతోంది. 304 00:17:31,094 --> 00:17:32,596 బొటను వేలులాగ వాడుతోందా? 305 00:17:34,139 --> 00:17:37,267 ఆరు వేళ్ళు ఉన్న ఎలుగుబంటి ఇది ఒక్కటే కావడానికి అదే కారణం అయ్యుంటుంది. 306 00:17:37,350 --> 00:17:40,478 ఎందుకంటే వెదురు తినే ఎలుగుబంటి అది ఒక్కటే కాబట్టా? 307 00:17:40,562 --> 00:17:42,564 అవును. చాలా తింటాయి. 308 00:17:42,647 --> 00:17:45,066 ఇప్పుడు అది తన పిల్లకు కూడా ఎలా వలుచుకోవాలో చూపిస్తోంది. 309 00:17:45,567 --> 00:17:48,111 పాండా పిల్లలకు వాటి తల్లులు చాలా అవసరం కదా, ఆహ్? 310 00:17:48,194 --> 00:17:50,196 అలాగే అప్పుడప్పుడు మంచి మనుషుల సాయం కూడా కావాలి. 311 00:17:50,280 --> 00:17:52,365 కానీ దూరం నుండి మాత్రమే. 312 00:17:52,949 --> 00:17:53,950 అవును. 313 00:17:58,121 --> 00:17:59,664 నేను రోలీని మిస్ అవుతున్నాను. 314 00:17:59,748 --> 00:18:01,875 మనం ఇంకొంచెం సేపు వాటితో గడపొచ్చా? 315 00:18:01,958 --> 00:18:04,336 మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి వాటిని చూడొచ్చు, 316 00:18:04,419 --> 00:18:05,879 కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే… 317 00:18:05,962 --> 00:18:07,547 నాకు తెలుసు, తెలుసు. 318 00:18:07,631 --> 00:18:09,049 అవి అడవి జంతువుల్లాగే ఉండాలి. 319 00:18:10,258 --> 00:18:12,761 బై, రోలీ. ఐ లవ్ యు. 320 00:18:17,974 --> 00:18:19,392 మనం ఇంకా గమనించడం పూర్తి కాలేదు. 321 00:18:19,476 --> 00:18:22,020 -అంటే ఏంటి నీ ఉద్దేశం? -మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, 322 00:18:22,103 --> 00:18:24,731 అవి నల్లగా తెల్లగా ఎందుకు ఉంటాయి? అవి ఇంకేం తింటాయి? 323 00:18:24,814 --> 00:18:27,567 -వాటి పిల్లలు ఎన్ని రోజులు… -కానీ అవి వెళ్లిపోయాయి కదా. 324 00:18:28,735 --> 00:18:31,404 -అయితే మనం ఫాలో అవుదాం. -ఏంటి, ఎలా? 325 00:18:31,488 --> 00:18:35,033 మనం వాటిని చూడటం తప్ప ఏం చేయలేము అన్నంత మాత్రాన ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేయలేము అని కాదు. 326 00:18:35,116 --> 00:18:36,868 -సిద్ధమా? -అవును. 327 00:18:37,953 --> 00:18:39,287 దేనికి? 328 00:18:46,878 --> 00:18:47,837 అవును! 329 00:18:55,053 --> 00:18:56,805 పాండాలను కాపాడటానికి సాయం చేయండి. 330 00:19:00,976 --> 00:19:02,269 డేవిడ్? 331 00:19:02,352 --> 00:19:05,355 -హాయ్, జేన్. -నువ్వు ఇంకా పాండా వేషం వేసుకుని ఎందుకు ఉన్నావు? 332 00:19:05,438 --> 00:19:07,691 -నేను రోలీని చాలా మిస్ అవుతున్నాను. -నేను కూడా. 333 00:19:07,774 --> 00:19:10,944 కానీ నువ్వు డాక్టర్ బిన్బిన్ లీతో మన కాల్ మొదలయ్యే ముందు ఖచ్చితంగా బట్టలు మార్చుకోవా? 334 00:19:11,027 --> 00:19:14,155 ఆమె జైంట్ పాండాల పై రీసెర్చ్ చేస్తుంది. ఆమెకు ఈ వేషం నచ్చుతుంది అనుకుంటున్నా. 335 00:19:15,115 --> 00:19:16,199 హాయ్, జేన్. 336 00:19:16,283 --> 00:19:17,951 హాయ్, డేవిడ్. 337 00:19:18,034 --> 00:19:20,620 -హాయ్, బిన్బిన్. -నువ్వు పాండా వేషం ఎందుకు వేసుకున్నావు, డేవిడ్? 338 00:19:20,704 --> 00:19:24,207 మేము ఒక పాండా పిల్లను దాని తల్లి దగ్గరకు చేర్చడానికి ఇలా జైంట్ పాండా వేషం వేసాము. 339 00:19:24,291 --> 00:19:25,292 నేను దానికి రోలీ అని పేరు పెట్టాను. 340 00:19:25,375 --> 00:19:27,502 అది మాకు అలవాటు పడకుండా మేము జాగ్రత్తపడ్డాం కూడా. 341 00:19:27,586 --> 00:19:30,171 మంచిగా ఆలోచించారు. పాండా వేషం నీకు చాలా బాగా నప్పింది. 342 00:19:30,255 --> 00:19:31,548 నాకు తెలుసు. థాంక్స్. 343 00:19:31,631 --> 00:19:33,758 మీరు ఎప్పుడైనా పాండాలాగ వేషం వేసుకున్నారా, బిన్బిన్? 344 00:19:33,842 --> 00:19:35,135 అవును. ఇది చూడు. 345 00:19:35,719 --> 00:19:37,721 -పాండా డ్రెస్ భలే ఉంది. -వేసుకుంటే హాయిగా ఉండేలా ఉంది. 346 00:19:37,804 --> 00:19:39,973 మీకు కూడా దానిని తీయకూడదు అని అనిపించి ఉంటుంది, కదా? 347 00:19:40,056 --> 00:19:44,185 నిజం చెప్పాలంటే, ఆ పాండా బట్టల మీద పాండాల మూత్రం చల్లుతారు, 348 00:19:44,269 --> 00:19:47,939 కాబట్టి నేను నా రీసెర్చ్ పూర్తి అయిన వెంటనే దాన్ని తీసేసాను. 349 00:19:49,316 --> 00:19:50,400 వాటి మీద పాండా మూత్రం ఎందుకు చల్లారు? 350 00:19:50,483 --> 00:19:55,280 పాండాలా డ్రెస్ వేసుకోవడం మాత్రమే కాదు, వాటిలా వాసన రావడం కూడా చాలా ముఖ్యం, 351 00:19:55,363 --> 00:19:58,533 ఎందుకంటే పాండాలకు చాలా సున్నితమైన వాసన సామర్థ్యం ఉంటుంది. 352 00:19:58,617 --> 00:20:01,453 అలా అయితే వాటిని అడవుల్లోకి వదిలాకా, అవి మనుషులకు అలవాటు పడకుండా 353 00:20:01,536 --> 00:20:02,954 వాటంతట అవే బ్రతకగలవు. 354 00:20:03,038 --> 00:20:05,832 మీ వెనుక ఉన్న కొండలు భలే అందంగా ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నారు, బిన్బిన్? 355 00:20:05,916 --> 00:20:07,751 ఇది పాండాల అభయారణ్యం, 356 00:20:07,834 --> 00:20:10,837 అడవి పాండాలు బ్రతికే రక్షిత ప్రాంతాలలో ఇది ఒకటి. 357 00:20:11,421 --> 00:20:13,048 వాటికి రక్షణ ఎందుకు అవసరం? 358 00:20:13,131 --> 00:20:16,760 జైంట్ పాండాలకు ఉన్న ప్రధానమైన ముప్పు నివాసస్థలాలు నాశనం కావడమే. 359 00:20:16,843 --> 00:20:21,473 అవి మాయమవుతుండటం వల్ల వాటిని ప్రమాదంలో పడ్డ జాతిగా చాలా కాలం క్రితం ప్రకటించారు. 360 00:20:21,556 --> 00:20:25,268 కాబట్టి, వాటి సంఖ్యను పెంచడానికి పరిష్కారం వాటి నివాసస్థలాలను కాపాడటానికి 361 00:20:25,352 --> 00:20:27,979 ఇలాంటి రక్షిత ప్రాంతాలను సృష్టించడమే. 362 00:20:28,063 --> 00:20:31,441 -మరి ఆ ప్లాన్ పనిచేసిందా? -అవును. ఇక్కడ చూడండి. 363 00:20:32,025 --> 00:20:33,485 అరవై ఏళ్ల తర్వాత, 364 00:20:33,568 --> 00:20:38,031 తీసుకోబడింది పరిరక్షణ చర్యలు అలాగే ప్రోగ్రామ్ల కారణంగా పాండాలు ఎక్కువగా పిల్లల్ని కన్నాయి. 365 00:20:38,615 --> 00:20:41,034 ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతోంది. 366 00:20:41,117 --> 00:20:45,830 కాబట్టి, ఇప్పుడు ప్రమాదంలో ఉన్న జంతు జాతి కాకుండా, ప్రమాదంలో పడే అవాకాశం ఉన్న జంతు జాతి అయింది. 367 00:20:45,914 --> 00:20:48,333 అంటే, ఇప్పుడు జైంట్ పాండాలకు మన సహాయం అవసరం లేదా? 368 00:20:48,416 --> 00:20:51,419 ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటే ఇంకా వాటికి ముప్పు ఉన్నట్టే, 369 00:20:51,503 --> 00:20:55,674 కాబట్టి వాటిని సంరక్షించడానికి మనం తీసుకున్న చర్యలను కొనసాగించడం చాలా ముఖ్యం. 370 00:20:55,757 --> 00:20:58,051 మీరు ఎన్ని పాండాలు ఉన్నాయో లెక్కబెట్టి ఎలా ట్రాక్ చేస్తుంటారు? 371 00:20:58,134 --> 00:21:00,971 ఎవరైనా వాటిని లెక్కబెడుతుంటారా? ఎందుకంటే వాటిని కనిపెట్టడానికి మేము చాలా కష్టపడ్డాం. 372 00:21:01,054 --> 00:21:05,392 మంచి ప్రశ్న. జైంట్ పాండాలు అడవుల్లో బ్రతికే ఒకే ఒక్క ప్రదేశం చైనా. 373 00:21:05,976 --> 00:21:09,980 అలాగే ఆ పని చేయడానికి 2,300 మందికి నాలుగు ఏళ్ళు పడుతుంది. 374 00:21:10,063 --> 00:21:12,065 మీరు ఎప్పుడైనా అడవిలో జైంట్ పాండాను చూశారా? 375 00:21:12,148 --> 00:21:15,318 అవును. ఆ పాండా ఫోటో కూడా నా దగ్గర ఉంది. 376 00:21:15,402 --> 00:21:18,071 కానీ అదే నా మొదటి, అలాగే ఆఖరి ఫోటో, 377 00:21:18,154 --> 00:21:20,865 ఎందుకంటే వాటిని అడవుల్లో కనిపెట్టడం చాలా కష్టం. 378 00:21:20,949 --> 00:21:22,993 కానీ నేను దానిని అలా చూడటం వల్లే 379 00:21:23,076 --> 00:21:26,454 వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేయడానికి నాకు ప్రోత్సాహం అందింది. 380 00:21:26,538 --> 00:21:30,750 -అయితే మీకు పాండాలు అంటే మొదటి నుండీ ఇష్టమా? -అవును, ఇతర అడవి జంతువులు కూడా ఇష్టమే. 381 00:21:30,834 --> 00:21:35,881 జైంట్ పాండాలను అంబ్రెల్లా జాతి జీవులు అంటారు, అంటే వాటి నివాస స్థలాలను కాపాడటం ద్వారా, 382 00:21:35,964 --> 00:21:39,342 మనం వాటితో కలిసి ఆ ప్రదేశంలో ఉండే ఇతర జాతులను కూడా కాపాడగలం. 383 00:21:39,426 --> 00:21:41,887 జైంట్ పాండాలతో కలిసి చైనాలో ఇంకేం జంతువులు ఉంటాయి? 384 00:21:41,970 --> 00:21:43,096 చూపిస్తాను ఆగండి. 385 00:21:43,179 --> 00:21:46,308 బంగారు బండ ముక్కు కోతులు. బంగారు రంగు కోళ్లు. 386 00:21:46,391 --> 00:21:47,851 జైంట్ సాలమండర్లు, 387 00:21:47,934 --> 00:21:50,186 అవి ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచరాలలో ఒకటి. 388 00:21:50,270 --> 00:21:52,981 అయితే, జైంట్ పాండాలకు సాయం చేయడం ద్వారా మనం వీటికి కూడా సాయం చేయగలం. 389 00:21:53,064 --> 00:21:55,025 -అవును. -వాటిని కాపాడటానికి మనం ఏం చేయగలం? 390 00:21:55,108 --> 00:21:56,860 మీరు ఇక్కడ పాండాల గురించి, వాటి పరిసరాల 391 00:21:56,943 --> 00:21:59,362 గురించి నేర్చుకున్న విషయాలను, అలాగే మనం కొనే ప్రతీ వస్తువు 392 00:21:59,446 --> 00:22:03,033 కోసం సహజ వనరులను ఖర్చు చేస్తున్నాం అని అందరికీ చెప్పడం ద్వారా వాటిని కాపాడగలరు. 393 00:22:03,116 --> 00:22:04,618 మనం ఏదైనా ఒకటి కొత్తది కొంటే, 394 00:22:04,701 --> 00:22:07,370 అందుకు మన పర్యావరణంలో ఉన్న సహజ వనరులు ఖర్చు అవుతాయి. 395 00:22:07,454 --> 00:22:10,624 అది జైంట్ పాండాల స్వస్థలాలపై మాత్రమే కాక, ఇతర జాతి జంతువులపై 396 00:22:10,707 --> 00:22:13,543 కూడా ప్రభావం చూపిస్తుంది. 397 00:22:13,627 --> 00:22:17,881 కాబట్టి, అవసరం లేకపోతే ఒక ఏడాది పాటు బట్టలు కొనుక్కోకుండా ఉండమని 398 00:22:17,964 --> 00:22:19,132 నేను అందరికీ సవాలు విసురుతున్నాను. 399 00:22:19,216 --> 00:22:21,885 -ఈజీ. నాకు అవే బట్టలను మళ్ళీ వేసుకోవ్సడం ఇష్టం. -అద్భుతం! 400 00:22:22,677 --> 00:22:24,971 -మీతో మాట్లాడటం చాలా సంతోషం. బై. -బై, బిన్బిన్. 401 00:22:25,055 --> 00:22:26,473 బై, బిన్బిన్. థాంక్స్. 402 00:22:27,057 --> 00:22:30,018 హేయ్, జేన్. అయితే నేను ఒక ఏడాది పాటు ఈ పాండా వేషంలో ఉండొచ్చు ఏమో. 403 00:22:30,101 --> 00:22:31,102 అది చాలా అందంగా ఉంది. 404 00:22:31,186 --> 00:22:33,188 కానీ మనం తర్వాత కాపాడబోయి జంతువు మంచు చిరుత, నక్క లేదా 405 00:22:33,271 --> 00:22:34,814 పసుపు రంగు గొంతు ఉండే మార్టెన్ అయితే ఏం చేస్తావు? 406 00:22:34,898 --> 00:22:36,900 -అవి పాండాలను తింటాయి కదా? -అవును. 407 00:22:36,983 --> 00:22:38,902 అయితే నేను ఈ బట్టలు తీసేస్తా. 408 00:22:38,985 --> 00:22:40,362 గుడ్ నైట్, జేన్. 409 00:22:40,445 --> 00:22:42,197 గుడ్ నైట్, రోలీ. నువ్వు ఎక్కడ ఉన్నా సరే. 410 00:22:42,280 --> 00:22:43,448 నైట్, డేవిడ్. 411 00:22:58,213 --> 00:22:59,965 జేన్, ఇక పడుకోవాలి. 412 00:23:39,004 --> 00:23:41,006 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్