1 00:00:12,597 --> 00:00:15,559 నేల మీద తిరగడానికి నేను డిజైన్ చేయబడలేదు. 2 00:00:15,642 --> 00:00:17,644 భూమి ఉపరితలం ఎగుడుదిగుడుగా మట్టితో నిండి ఉంటుంది. 3 00:00:17,727 --> 00:00:21,690 ఇంకా మేము శాంక్చురీ 573 అక్షాంశాల దిశగా వెళ్లడం లేదు. 4 00:00:21,773 --> 00:00:24,818 ఏవా, నియమావళి ప్రకారం మనం తిరిగి వెళ్లి వేచి చూడాలి, 5 00:00:24,901 --> 00:00:26,945 కాడ్మస్ ప్రైడ్ ఆదేశించిన విధంగా, 6 00:00:27,028 --> 00:00:29,739 భూమి ఎప్పుడు రెడీ అయితే అప్పుడు నువ్వు మిగతా మనుషుల్ని కలుసుకోగలుగుతావు. 7 00:00:29,823 --> 00:00:33,076 నేను మిగతా మనుషుల్ని కనుక్కోలేకపోతే వాళ్లని కలుసుకోలేను కదా. 8 00:00:33,159 --> 00:00:35,245 అందుకే నేను ఇక్కడ రోవీతో ఒక ఒప్పందం చేసుకున్నాను 9 00:00:35,328 --> 00:00:38,415 అతను డైనాస్టీస్ అతుకుని ఎక్కడ సంపాదించాడో ఆ లాకస్ కి మనల్ని తీసుకువెళ్లమని అడిగాను. 10 00:00:38,498 --> 00:00:40,834 వావ్. అది చూడు. 11 00:00:41,418 --> 00:00:42,836 అలా ఎందుకు కొట్టావు? 12 00:00:42,919 --> 00:00:44,129 ఏదీ ముట్టుకోకు. 13 00:00:44,212 --> 00:00:45,505 ఏదీ వాసన చూడకు. 14 00:00:45,589 --> 00:00:48,049 ఖచ్చితంగా ఏదీ రుచి చూడకు. 15 00:00:48,133 --> 00:00:50,302 రోవీ, నేను దాన్ని తినడం లేదు. 16 00:00:50,385 --> 00:00:51,845 నన్ను రోవీ అని పిలవకు. 17 00:00:51,928 --> 00:00:53,346 మంచిది. 18 00:00:53,430 --> 00:00:56,266 - మిస్టర్ కిట్, నీ మాట తీరు చూస్తుంటే టీనేజర్ ప్రవర్తనతో… - సాయం చేయండి! 19 00:00:56,349 --> 00:00:57,684 …విసిగిపోయినట్లు కనిపిస్తోంది. 20 00:00:58,852 --> 00:01:00,186 - సాయం చేయండి! - ఆగండి. 21 00:01:00,270 --> 00:01:01,688 - అది విన్నావా? - వినడం ఏంటి? 22 00:01:01,771 --> 00:01:03,481 - సాయం చేయండి! - మళ్లీ ఏంటి? 23 00:01:03,565 --> 00:01:05,400 - ఎవరో సాయం కోరుతున్నారు. - సాయం చేయండి! 24 00:01:05,483 --> 00:01:07,819 ఆ గొంతులన్నీ నీ తలలోనే వింటున్నావేమో. 25 00:01:07,903 --> 00:01:10,071 ఓమ్నీ, ఎవరో ఆపదలో ఉన్నట్లుగా నువ్వు ఏమైనా విన్నావా? 26 00:01:10,155 --> 00:01:11,907 ఎలాంటి శబ్ద తరంగాలు గుర్తించబడలేదు. 27 00:01:11,990 --> 00:01:14,701 - సాయం! - కానీ, నేను వింటున్నాను. 28 00:01:14,784 --> 00:01:18,121 - ఏవా. - అమ్మా, ఎక్కడ ఉన్నావు? 29 00:01:18,705 --> 00:01:19,873 సాయం చేయండి! 30 00:01:20,540 --> 00:01:23,084 అమ్మా, నాకు భయమేస్తోంది! 31 00:01:23,168 --> 00:01:24,628 - ఏం ఫర్వాలేదు. - సాయం చేయండి! 32 00:01:24,711 --> 00:01:27,756 ఏం చేస్తున్నావు? అది సాండ్ స్నైపర్ పాము. అది బేబీ. 33 00:01:27,839 --> 00:01:29,424 దాని దగ్గరగా వెళ్లకు. 34 00:01:29,507 --> 00:01:32,135 కానీ అది భయపడుతోంది. దానికి సాయం కావాలి. నీకు అది వినిపించడం లేదా? 35 00:01:32,219 --> 00:01:33,553 నాకు వినిపిస్తున్నదల్లా ఆ కటకట చప్పుడే. 36 00:01:33,637 --> 00:01:36,014 నీకు వినిపించిందా? అది వాళ్ల అమ్మని పిలుస్తోంది. 37 00:01:36,097 --> 00:01:38,350 ఆమె గనుక ఈ దగ్గరలో ఉంటే, మనమంతా ప్రమాదంలో పడతాము. 38 00:01:38,433 --> 00:01:41,144 ఆమె మనల్ని భూగర్భంలోకి లాక్కువెళ్లి, మన లివర్ ని విందులా ఆరగిస్తుంది. 39 00:01:41,228 --> 00:01:43,021 అది చూశావా? సరిగ్గా అక్కడ. 40 00:01:43,104 --> 00:01:44,856 అది బెస్టీల్ ఉచ్చుల్లో ఒకటి. 41 00:01:44,940 --> 00:01:47,567 దానికి ట్రాకింగ్ సిగ్నల్ ఉంటుంది. అది నిస్సందేహంగా నీ కోసమే ఉచ్చు పన్నింది. 42 00:01:47,651 --> 00:01:49,236 ఏవా, ఆ జంతువుకి దూరంగా ఉండు. 43 00:01:49,319 --> 00:01:51,947 - నిన్ను కాపాడటం నా బాధ్యత. - దూరంగా వెళ్లు! 44 00:01:52,030 --> 00:01:54,866 - అమ్మా! - అది ఒక బేబీ. దానికి నేను సాయం చేస్తాను. 45 00:01:54,950 --> 00:01:57,702 సరే, నీ అంతట నువ్వు చావుని కొని తెచ్చుకుంటే, నువ్వు ఎలాగూ అదే పని చేస్తావు, 46 00:01:57,786 --> 00:01:59,120 కనీసం ముందుగా నా డబ్బు నాకు చెల్లించు. 47 00:01:59,204 --> 00:02:01,456 ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆమె ఇంకా శిక్షణ తీసుకోలేదు. 48 00:02:01,539 --> 00:02:03,375 అయితే తను వేగంగా విద్య నేర్చుకోగలదో లేదో చూద్దాం. 49 00:02:03,458 --> 00:02:04,459 తను చనిపోయే ప్రమాదం ఉంది. 50 00:02:04,542 --> 00:02:06,378 కానీ, అంతకన్నా మేలైన శిక్షణ మరేదీ ఉండదు. 51 00:02:07,587 --> 00:02:09,798 నీ విద్యాబోధన పద్ధతుల్ని నేను ఆమోదించను. 52 00:02:09,881 --> 00:02:12,300 - సాయం చేయండి. నాకు భయంగా ఉంది. - మరేం ఫర్వాలేదు. 53 00:02:12,384 --> 00:02:13,885 - ఇక్కడ ఒక రాక్షసి ఉంది. - ఏమీ ప్రమాదం లేదు. 54 00:02:13,969 --> 00:02:14,970 అమ్మా! 55 00:02:15,053 --> 00:02:17,264 - నేను ఏమీ చేయను. - భయమేస్తోంది! 56 00:02:17,347 --> 00:02:19,474 నీ పంజా కదుల్చు. 57 00:02:22,561 --> 00:02:23,937 నీకు సాయం చేయనివ్వు. 58 00:02:24,646 --> 00:02:26,064 నీ పంజాని కదుల్చు. 59 00:02:26,147 --> 00:02:28,066 అదీ. మంచిది. 60 00:02:28,149 --> 00:02:30,610 సరే. ఇక్కడ ఏముందో చూద్దాం. 61 00:02:31,236 --> 00:02:33,905 దాదాపు వచ్చేసింది. 62 00:02:33,989 --> 00:02:35,365 బెస్టీల్. మనం ఇంక వెళ్లాలి. 63 00:02:35,448 --> 00:02:38,201 లేదు! నేను చూసుకుంటాను. 64 00:02:39,786 --> 00:02:40,829 లేదు! 65 00:02:41,538 --> 00:02:42,706 మనం దాక్కోవాలి. 66 00:02:42,789 --> 00:02:44,583 - కానీ మనం అలా చేయలేము… - ఏవా, త్వరగా రా! 67 00:02:47,127 --> 00:02:48,253 ఏవా? 68 00:02:48,336 --> 00:02:51,256 సాయం చేయండి! భయమేస్తోంది! 69 00:02:52,883 --> 00:02:56,344 కాపాడు! అమ్మా! కాపాడు! 70 00:03:00,181 --> 00:03:02,183 సాయం చేయండి! కాపాడండి! 71 00:03:03,184 --> 00:03:05,270 సాయం చేయండి! నన్ను కాపాడండి! 72 00:03:05,353 --> 00:03:07,939 - సాయం చేయండి! - అది సరైనది కాదు. 73 00:03:08,023 --> 00:03:09,608 వాడు ఆ బేబీని తీసుకువెళ్లాడు. 74 00:03:09,691 --> 00:03:12,694 నిన్ను తీసుకువెళ్లే కంటే ఆ బేబీ సాండ్ స్నైపర్ ని తీసుకువెళ్లడం మేలు. 75 00:03:39,054 --> 00:03:40,889 అదిగో. లాకస్. 76 00:03:50,732 --> 00:03:52,859 అది చాలా ముచ్చటగా ఉంది. 77 00:03:52,943 --> 00:03:54,694 అందంగా ఉంది. 78 00:04:05,247 --> 00:04:06,665 ఇది… 79 00:04:07,415 --> 00:04:09,542 మిగతా మనుషులు కూడా ఇక్కడ ఉంటారు అంటావా? 80 00:04:09,626 --> 00:04:12,337 లేదు. బెస్టీల్ నీ కోసం వేటాడుతోంది. 81 00:04:12,420 --> 00:04:15,590 నువ్వు ఇంకా ఆ యంత్రం గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి. 82 00:04:22,138 --> 00:04:24,558 ఇవి సంప్రదాయ లాకస్ దుస్తులా? 83 00:04:24,641 --> 00:04:26,768 లేదు. నువ్వు పూర్తిగా పిచ్చిదానిలా కనిపిస్తున్నావు. 84 00:04:27,519 --> 00:04:29,854 కానీ అదృష్టం కొద్దీ మనం రేసులు జరిగే రోజు ఇక్కడకి వచ్చాం. 85 00:04:29,938 --> 00:04:32,899 - రేసులా? ఏం రేసులు? - స్పైడర్ చేపల రేసులు. 86 00:04:32,983 --> 00:04:36,861 కాబట్టి, అదృష్టం కొద్దీ విచిత్రంగా, ఇబ్బందికరంగా కనిపించే స్థానికేతరుల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. 87 00:04:36,945 --> 00:04:38,655 అన్నట్లు, అది మీ ఇద్దరే. 88 00:04:38,738 --> 00:04:39,781 వెళదాం పదండి. 89 00:05:27,412 --> 00:05:29,873 సరే. ఇప్పుడు ఆ నీటి మృగం ఇక్కడే వేచి ఉండాలి. 90 00:05:29,956 --> 00:05:33,919 - మార్కెట్ బాగా రద్దీగా ఉంది. - అది నీటి ఎలుగుబంటి. నేను దానిని అడుగుతా. 91 00:05:34,002 --> 00:05:37,672 సరే, అలాగే. నువ్వు ఏదో మాయలో పడి నీ మెదడులో ఆ వింతజీవితో మాట్లాడుతున్నావు గనుక, 92 00:05:37,756 --> 00:05:41,718 అతను నీటికి దూరంగా ఇంకా చేపలకి దూరంగా ఉండమని చెప్పు. 93 00:05:41,801 --> 00:05:45,180 ఓటో, ఇక్కడే నీటి దగ్గర వేచి ఉండు. 94 00:05:45,263 --> 00:05:47,390 చేపల్ని తినకు. 95 00:05:47,474 --> 00:05:49,392 నేను ఆ రుచికరమైన చేపల్ని తినను. 96 00:05:49,476 --> 00:05:51,353 కానీ నేను నీటిలో మునగడానికి వెళ్తున్నాను. 97 00:05:52,729 --> 00:05:54,272 నేను ఏం చెప్పాను? 98 00:05:54,356 --> 00:05:56,942 కానీ, అతను చేపల్ని తినను అని చెప్పాడు. 99 00:05:57,609 --> 00:06:01,154 ఇక్కడ రుచికరమైన చేప ఉంది, కానీ నేను దాన్ని తినడం లేదు. 100 00:06:01,821 --> 00:06:04,115 నువ్వు ఆ అతుకు సంపాదించినది ఈ ప్రదేశమేనా? 101 00:06:05,450 --> 00:06:06,534 ఇది చూడు! 102 00:06:06,618 --> 00:06:08,203 నేను దాని ఫోటోలు చూశాను. 103 00:06:08,286 --> 00:06:10,163 అదిగో పాత సైకిలు. ఇంకా ఆ దీపం! 104 00:06:10,247 --> 00:06:11,081 ఆగండి 105 00:06:11,164 --> 00:06:12,374 ఆ బోర్డుల్లో ఒకటి! 106 00:06:12,916 --> 00:06:15,168 ఇదంతా మా ట్రయినింగ్ వీడియోలలో చూపించినట్లే ఉంది! మదర్! 107 00:06:15,252 --> 00:06:17,087 ఓహ్, అవును. కారంకుల్ చెత్త ప్యాలెస్. 108 00:06:17,170 --> 00:06:18,296 సారీ మా దుకాణం మూసివేశాం 109 00:06:18,380 --> 00:06:22,050 చెత్తా? అపవాదు! నీకు ఒక విషయం చెప్పాలి. 110 00:06:22,133 --> 00:06:27,889 ఓర్బోనా అంతటా సేకరించిన ప్రత్యేకమైన ఆసక్తికరమైన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. 111 00:06:27,973 --> 00:06:33,144 క్వీన్ ఓహో కోసం ప్రత్యేకంగా నియమితుడైన కారంకుల్ ని మీకు పరిచయం చేస్తున్నాను. 112 00:06:33,228 --> 00:06:35,689 - చక్కని పురాతన వస్తువుల అమ్మకందారు… - నువ్వు ఇంక ఆపచ్చు. 113 00:06:35,772 --> 00:06:38,400 ఆ అమ్మాయి ఇక్కడ ఏవీ కొనడానికి రాలేదు. తనకి కేవలం ఏం కావాలంటే… 114 00:06:38,483 --> 00:06:39,901 కారంకుల్ మీకు వీడ్కోలు చెబుతున్నాడు. 115 00:06:39,985 --> 00:06:41,945 ఆగు, ప్లీజ్! నాకు ఒకటి తప్పనిసరిగా కావాలి. 116 00:06:42,028 --> 00:06:46,032 నిజంగా? ప్లీజ్, లోపలికి రా. నీకు కావాల్సినంత సమయం తీసుకో. అన్నీ చూడు. 117 00:06:46,116 --> 00:06:47,492 మ్యూజిక్! 118 00:06:49,286 --> 00:06:54,416 కారంకుల్ దగ్గర చాలా, చాలా ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి, మీరు కొనడానికి. 119 00:06:54,499 --> 00:06:56,084 ఉదాహరణకి, ఇది చూడు. 120 00:06:56,167 --> 00:07:00,422 పురాతన కాలంలో రాజు సర్ హామిల్టన్ బీచ్ చేతబట్టిన స్పెక్టర్ ఇది. 121 00:07:00,505 --> 00:07:03,133 ఇంకా ఇవి, ఉప్పు ఇంకా పెప్పర్. 122 00:07:03,216 --> 00:07:06,303 ఈ రెండు చిన్న డబ్బాలు చాలాకాలం కిందట అంతరించిపోయాయి 123 00:07:06,386 --> 00:07:10,765 అవి వాటి తలల మీద చిన్న చిన్న రంధ్రాల గుండా శ్వాసని పీల్చేవి. 124 00:07:10,849 --> 00:07:14,102 అయితే, కారంకుల్ దుకాణంలో మీకు ఏది నచ్చింది? 125 00:07:14,185 --> 00:07:16,980 ప్లీజ్, మీకు ఇది ఎక్కడ దొరికిందో నాకు తెలియాలి. 126 00:07:18,440 --> 00:07:20,525 మీకు ఏ వస్తువూ అవసరం లేదు. 127 00:07:20,609 --> 00:07:21,943 సమాచారం కావాలి. 128 00:07:24,029 --> 00:07:27,324 అవును. ఒక అవశేషం, డైనాస్టీస్ రాజవంశం వారికి సంబంధించినది. 129 00:07:27,407 --> 00:07:30,577 తనకి ఈ అతుకు ఎక్కడి నుండి వచ్చిందో కారంకుల్ సంతోషంగా మీకు చెబుతాడు. 130 00:07:30,660 --> 00:07:33,163 అందుకు ఐదు వందల షెల్లాక్స్ అనుకుందామా? 131 00:07:34,080 --> 00:07:35,790 - ఐదు వందలా? - అది చాలా ఎక్కువా? 132 00:07:35,874 --> 00:07:37,334 - మూడు వందలు. - మీ దగ్గర అంత ఉందా? 133 00:07:37,417 --> 00:07:39,461 తన దగ్గర అంత డబ్బు లేదు. 134 00:07:42,172 --> 00:07:43,048 రండి మా దుకాణం తెరిచే ఉంది 135 00:07:43,131 --> 00:07:45,383 అదే కారంకుల్ తుది ధర. 136 00:07:45,467 --> 00:07:48,762 మీకు గనుక ఏదైనా సంపద దొరికితే, మిమ్మల్ని రేపు కలుస్తాను. 137 00:07:48,845 --> 00:07:51,139 కారంకుల్ ఉదయాన్నే దుకాణం తెరుస్తాడు, 138 00:07:51,223 --> 00:07:56,519 కానీ ముందుగా సోలస్ లోని క్వీన్ ప్యాలెస్ లో పని ముగించుకుని వచ్చాక దుకాణం తీస్తాడు. 139 00:07:56,603 --> 00:08:00,440 కారంకుల్ మీకు వీడ్కోలు చెబుతున్నాడు 140 00:08:01,900 --> 00:08:04,861 సరే. నేను మిమ్మల్ని లాకస్ తీసుకువచ్చాను కాబట్టి ఆ ఓమ్నీని నాకు ఇచ్చేయ్. 141 00:08:04,945 --> 00:08:08,907 ఆహ్… ఆహ్. మన ఒప్పందం ఏమిటంటే లాకస్ లో ఆ అతుకు దొరికిన ప్రదేశానికి నువ్వు నన్ను తీసుకువెళ్లాలి. 142 00:08:08,990 --> 00:08:10,867 ఏంటి? అది మన ఒప్పందం కాదు. 143 00:08:10,951 --> 00:08:14,746 నాకు గనుక ఆ సమాచారం దొరికిన వెంటనే, నీకు ఓమ్నీని ఇస్తాను. 144 00:08:14,829 --> 00:08:16,706 నేను మూడు వందల షెల్లాక్స్ ఎక్కడ సంపాదించాలి? 145 00:08:16,790 --> 00:08:18,750 రేసుల్లో మనం ఎప్పుడైనా పందెం కాయచ్చు. 146 00:08:18,833 --> 00:08:21,336 - నేను జూదాన్ని సమ్మతించను. - నేను కూడా ఒప్పుకోను. 147 00:08:21,419 --> 00:08:24,130 స్పైడర్ పక్షుల రేసుల మీద మనం పందెం కాయచ్చా? 148 00:08:24,214 --> 00:08:25,215 స్పైడర్ చేప. 149 00:08:25,298 --> 00:08:27,342 అది చూడటానికి జనం అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. 150 00:08:27,425 --> 00:08:29,386 మా పెద్ద అంకుల్ బూదూ ఒబీదో, 151 00:08:29,469 --> 00:08:32,889 ఆయన ఈ రేసుల్ని చూడటం కోసం పది రోజుల పాటు కాలినడకన ప్రయాణం చేశాడు. 152 00:08:32,972 --> 00:08:34,640 ఇంకా ఆయనకి కేవలం మూడు కాళ్లు మాత్రమే ఉండేవి. 153 00:08:34,724 --> 00:08:37,018 అవును, ఆయన చాలా పెద్ద జూదగాడు. 154 00:08:37,101 --> 00:08:38,895 ఆ విధంగా ఆయన ఇంకో కాలిని పోగొట్టుకున్నాడు. 155 00:08:38,979 --> 00:08:42,231 - నేను మూడు వందల షెల్లాక్స్ గెలుచుకోగలనా? - ఖచ్చితంగా. 156 00:08:42,315 --> 00:08:46,278 మా పెద్ద అంకుల్ ఒబీదో ఒకసారి గెలుపుకి సంబంధించిన ఒక రహస్యాన్ని నాకు చెప్పాడు. 157 00:08:49,489 --> 00:08:51,408 ఎప్పుడూ విజేతనే ఎంచుకోవాలి. 158 00:08:53,118 --> 00:08:54,119 అర్థమైంది. 159 00:08:55,745 --> 00:08:57,664 పోటీల మీద పందెం కాయడం. 160 00:08:57,747 --> 00:08:58,957 అల్లరి జనాలు. 161 00:08:59,040 --> 00:09:00,792 నిన్ను నేను ఇలా పెంచలేదు. 162 00:09:00,875 --> 00:09:03,086 - అయితే నువ్వు మంచి అమ్మవి కావన్నమాట. - మిస్టర్ కిట్. 163 00:09:03,169 --> 00:09:05,797 కాస్త నమ్మకం ఉంచు, మదర్. ఇది నేను చూసుకుంటా. 164 00:09:05,881 --> 00:09:09,134 వార్షిక స్పైడర్ చేపల రేసులకి స్వాగతం, ప్రజలారా. 165 00:09:09,217 --> 00:09:13,221 లాకస్ లో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఇంకా కనువిందు చేసే కార్యక్రమం ఇది. 166 00:09:13,305 --> 00:09:15,891 ఈ రోజు ఎంతమంది జనం వచ్చారో చూడండి. 167 00:09:17,726 --> 00:09:19,436 - రేసు మొదలు కాబోతోంది. - ఎక్స్ క్యూజ్ మీ. 168 00:09:19,519 --> 00:09:21,813 - నీ దగ్గర డబ్బు చూపించు. తరువాత ఎవరు? - సారీ. 169 00:09:21,897 --> 00:09:23,064 - రేసు కాసేపట్లో మొదలవుతుంది. - హాయ్! 170 00:09:23,148 --> 00:09:25,442 - డబ్బు టేబుల్ మీద పెట్టు. - నేను 300 షెల్లాక్స్ గెలవాలి అనుకుంటున్నా. 171 00:09:25,525 --> 00:09:27,944 అయితే, అందరం అదే అనుకుంటాం కదా. ఒక్క క్షణం, సర్. 172 00:09:28,028 --> 00:09:30,697 - నువ్వు ఏం పందెం కాస్తావు, మిస్? - ఇదిగో ఇక్కడ ఉన్న ఈ చిన్న మెషీన్ ని పందెం కాస్తా. 173 00:09:30,780 --> 00:09:33,658 - హేయ్, అది నాది. - నువ్వు గెలిచినా కూడా, ఓర్ క్రస్టీ, 174 00:09:33,742 --> 00:09:35,911 నీకు దాని మీద యాభై షెల్లాక్స్ మించి రావు. 175 00:09:35,994 --> 00:09:37,412 - ఇక, పక్కకి తప్పుకో. - కానీ… 176 00:09:37,495 --> 00:09:39,289 - నా దగ్గర ఇది ఒక్కటే ఉంది. - రేసు మొదలు కాబోతోంది! 177 00:09:39,372 --> 00:09:40,624 ఆ యంత్రం సంగతి ఏంటి? 178 00:09:40,707 --> 00:09:43,043 - ఎక్స్ క్యూజ్ మీ? - మదర్ ని పందెంగా కాయాలి అంటావా? 179 00:09:43,126 --> 00:09:44,544 నాకంటే ఆమెని పందెం కాయడం మేలు. 180 00:09:44,628 --> 00:09:47,172 కానీ, నీ దగ్గర ఇంకేదీ పందెం ఒడ్డడానికి లేకపోతే తప్ప. 181 00:09:47,255 --> 00:09:49,090 సరే. అవును. 182 00:09:49,174 --> 00:09:51,968 ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పెద్ద యంత్రం సరిపోతుందా? 183 00:09:52,052 --> 00:09:54,304 ఏవా, నువ్వేం చేస్తున్నావో తెలుసా? 184 00:09:54,387 --> 00:09:56,473 అత్యాధునికమైనది. చక్కని డిజైన్. 185 00:09:56,556 --> 00:09:58,016 అన్ని ఫీచర్లూ ఉన్నాయి. 186 00:09:58,099 --> 00:09:59,976 సరే, పందెం కాయడానికి నీ దగ్గర ఒకటి ఉంది, బంగారం. 187 00:10:00,060 --> 00:10:01,937 కాబట్టి, నువ్వు పందెం ఒడ్డేవన్నీ ఓర్ క్రస్టీ మీద పెడతావా? 188 00:10:02,020 --> 00:10:04,272 - ఓర్ క్రస్టీ కి ఇవన్నీ గెలవడానికి. - నువ్వు ఏం చేస్తున్నావు? 189 00:10:04,356 --> 00:10:05,815 కంగారుపడకు, మదర్. 190 00:10:05,899 --> 00:10:07,150 - ఓహ్, లేదు. - నన్ను నమ్ము. 191 00:10:07,234 --> 00:10:10,445 - కానీ నువ్వు అలా చేయలేవు… ఆగు. ఒక నిమిషం, ఏవా! - నాకు గెలిచే రహస్యం తెలుసు. 192 00:10:10,528 --> 00:10:11,696 సరే, ఏది ఎలా జరిగినా, 193 00:10:11,780 --> 00:10:14,658 - ఈ యంత్రాన్ని కోల్పోవడమే ఒక విజయం. - వద్దు, అక్కడ ముట్టుకోవద్దు. 194 00:10:14,741 --> 00:10:15,742 ఇది మంచి ప్రదేశం కాదు… 195 00:10:15,825 --> 00:10:18,662 అయితే, ఇందులో విజేత ఏది కావచ్చు? 196 00:10:20,038 --> 00:10:21,081 మంచి ప్రశ్న. 197 00:10:21,164 --> 00:10:25,126 కాదు. కాదు. కాదు. కాదు. 198 00:10:25,210 --> 00:10:27,295 - అక్కడ ఉన్నది! - అదా? ఆ ఓల్ క్రస్టీనా? 199 00:10:27,379 --> 00:10:31,675 లేదు. తనకి కొద్దిగా ఆత్మవిశ్వాసం అవసరం, అంతే. తను ఖచ్చితంగా వేగంగా వెళ్లగలదని నా నమ్మకం. 200 00:10:31,758 --> 00:10:34,553 - ఆత్మవిశ్వాసమా? అది గుడ్డిది. - ఏంటి? 201 00:10:34,636 --> 00:10:38,348 ఆమెని చూడు. ఆ నీరసపు కళ్లు, దాని చర్మం మీద ముడతలు. 202 00:10:38,431 --> 00:10:40,892 ఓల్ క్రస్టీ నువ్వు ఓడిపోయే రహస్యం. 203 00:10:42,227 --> 00:10:43,436 క్రస్టీ? 204 00:10:43,520 --> 00:10:45,063 నువ్వు ఈ రేసు గెలవగలవు. 205 00:10:45,146 --> 00:10:47,899 నేను గెలవలేను. ఎప్పటికీ గెలవలేను. 206 00:10:47,983 --> 00:10:50,026 పందెలు కాయడం మర్చిపోకండి, మిత్రులారా. 207 00:10:50,110 --> 00:10:51,987 మొదటి రేసు కాసేపట్లో మొదలుకాబోతోంది. 208 00:10:54,406 --> 00:10:57,450 ఈ యంత్రం గురించి తెలుసుకోవడం నాకు మంచిగా అనిపించిందని నీకు చెప్పాలి అనుకున్నా. 209 00:10:57,534 --> 00:10:58,535 కానీ అది మంచిగా లేదు. 210 00:10:58,618 --> 00:11:01,329 ఈ రేసు లక్ష్యం: హాప్ ఫ్రూట్. 211 00:11:01,413 --> 00:11:04,874 ఈ రుచికరమైన పండుని ఎవరు మొదటగా అందుకుంటారో వారే విజేత అవుతారు. 212 00:11:10,130 --> 00:11:11,214 రేసు! 213 00:11:11,298 --> 00:11:14,718 ఒక బలమైన అల ఈ స్పైడర్ చేపల్ని మూడు రౌండ్లలో మొదటి రౌండ్ కి చేర్చుతుంది. 214 00:11:14,801 --> 00:11:17,637 ఆ చేపలన్నీ చక్కని వరుసలో ముందుకు వచ్చాయి కానీ ఒక్కటి తప్ప. 215 00:11:17,721 --> 00:11:19,973 ఓల్ క్రస్టీ ఆ అల రాకముందు నిద్రపోయి ఉంటుంది. 216 00:11:20,056 --> 00:11:21,474 తను చాలా చివరన ఉంది. 217 00:11:21,558 --> 00:11:23,059 మరేం ఫర్వాలేదు. మనం ఇది గెలుస్తాం. 218 00:11:23,143 --> 00:11:25,854 లొరాకో ముందుగా దూసుకెళ్తోంది, లేక్ఫిన్ వేగంగా దూసుకొస్తోంది. 219 00:11:25,937 --> 00:11:28,023 గార్వే ఇంకా సింజ్ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. 220 00:11:28,106 --> 00:11:30,984 ముందస్తుగా వెళ్తున్నవారిని చూడాలంటే ఓల్ క్రస్టీ నా బైనాక్యులర్స్ ని అరువు తీసుకోవాలి. 221 00:11:31,067 --> 00:11:33,236 దానికి కుడి ఎడమల తేడా కూడా తెలియడం లేదు. 222 00:11:33,320 --> 00:11:35,697 బహుశా నీ యంత్రానికి నువ్వు చివరిసారి వీడ్కోలు చెప్పావు అనుకుంటా. 223 00:11:35,780 --> 00:11:37,365 వెళ్లు! నువ్వు సాధించగలవు, క్రస్టీ! 224 00:11:37,449 --> 00:11:39,910 లాకస్ లొరాకో చాలా నేర్పుగా నాబీ హాలోని దాటుతోంది. 225 00:11:39,993 --> 00:11:42,078 అందుకే అది స్పైడర్ చేపగా అంత ప్రఖ్యాతి పొందింది. 226 00:11:42,162 --> 00:11:44,331 లేక్ఫిన్ రెండో స్థానంలో ఉంది, ఆ వెనుకనే సింజ్ ఇంకా గార్వే ఉన్నాయి. 227 00:11:44,414 --> 00:11:46,625 ఇంకా ఓల్ క్రస్టీ ఒక మునిగిపోయిన ఓడ కన్నా తప్పుపట్టిన దానిలా ఉంది. 228 00:11:46,708 --> 00:11:49,252 నువ్వు ఓల్ క్రస్టీతో మాట్లాడాలని ఇంకా అనుకుంటున్నావా? 229 00:11:49,336 --> 00:11:50,545 నువ్వు ఇంక మాట్లాడితే మంచిది 230 00:11:50,629 --> 00:11:53,340 ఎందుకంటే నీ యంత్రం మరికాసేపట్లో విడిభాగాలుగా మారిపోబోతోంది. 231 00:11:53,423 --> 00:11:55,675 ఎగురుకుంటూ వెళ్తున్న గార్వే ఆ రింగులని చాకచక్యంగా దాటి 232 00:11:55,759 --> 00:11:57,177 నీరు ఎగజిమ్మే జోన్ లో వేగాన్ని అందుకుంది. 233 00:11:57,260 --> 00:12:00,263 పరవశించిపోతున్న ప్రేక్షకుల సమక్షంలో ఈ రేసులో ఇంకా రెండు ల్యాప్స్ పూర్తి చేయాల్సి ఉంది. 234 00:12:00,347 --> 00:12:02,265 కానీ ఓల్ క్రస్టీ ఇప్పుడే తీరం నుండి దూకింది… 235 00:12:02,349 --> 00:12:03,892 క్రస్టీ, నా మాట వినిపిస్తోందా? 236 00:12:03,975 --> 00:12:07,187 - క్రస్టీ కి నీ మాట వినిపిస్తోంది. - మంచిది! క్రస్టీ గెలవడానికి నేను సాయం చేయగలను. 237 00:12:07,270 --> 00:12:08,688 క్రస్టీ గెలవడానికా? 238 00:12:08,772 --> 00:12:10,357 అవును. క్రస్టీ గెలవడానికి. 239 00:12:10,440 --> 00:12:12,067 నేను చెప్పింది చేయి చాలు. 240 00:12:12,150 --> 00:12:13,068 సరే, ఎడమ వైపు తిరుగు. 241 00:12:13,777 --> 00:12:17,197 ఓహ్! ఇలా జరిగినందుకు సారీ. ఆహ్, నీ కుడి వైపు, నా ఎడమ వైపు. 242 00:12:17,864 --> 00:12:19,574 కుడి వైపు వెళ్లు. ఎడమ వైపు, ఎడమ వైపు, ఎడమ వైపు. 243 00:12:19,658 --> 00:12:22,118 మళ్లీ కుడి వైపు. ఎడమ వైపు తిరుగు. నేరుగా వెళ్లు. 244 00:12:22,202 --> 00:12:23,995 నువ్వు చేయగలవు. ఇప్పుడు పైకెగురు. 245 00:12:24,079 --> 00:12:25,372 పైకి, పైకి, పైకి. కిందకి. 246 00:12:25,455 --> 00:12:27,749 ఆ చిన్ని పాదాల్ని పైకి లేపు. సరే, ఇప్పుడు ఈదు. 247 00:12:27,832 --> 00:12:31,294 ఓల్ క్రస్టీ మొత్తానికి ఇప్పుడు ఆ రింగుల గుండా చాకచక్యంగా దూసుకెళ్తోంది. 248 00:12:31,378 --> 00:12:34,464 ఆఖరికి ఒక గుడ్డి రన్నర్ కూడా అడపాదడపా హాప్ ఫ్రూట్ ని సంపాదించగలుగుతుంది. 249 00:12:34,548 --> 00:12:35,882 నేను ఏకాగ్రతతో ఉన్నా. 250 00:12:35,966 --> 00:12:37,634 నాకు కొత్త బైనాక్యులర్స్ అవసరమా? 251 00:12:37,717 --> 00:12:39,844 ఓల్ క్రస్టీ వేగంగా స్కిప్ స్పిటర్ సింజ్ ని అందుకుంది. 252 00:12:39,928 --> 00:12:41,096 తను నాలాంటిది కాదు. 253 00:12:41,179 --> 00:12:43,723 లాకస్ లొరాకో ఇప్పటికీ తనే ముందుంటానని రుజువు చేస్తోంది. 254 00:12:43,807 --> 00:12:45,600 కానీ ఓల్ క్రస్టీ కి బహుశా ఏదో మూల చిన్న ఆశ ఉన్నట్లుంది 255 00:12:45,684 --> 00:12:47,435 ఎందుకంటే అది ఇంకో ల్యాప్ ఉందనగా మూడో స్థానానికి వచ్చింది. 256 00:12:47,519 --> 00:12:50,146 అదీ! నువ్వు సాధించావు, క్రస్టీ! 257 00:12:50,230 --> 00:12:53,358 ముందంజలో లాకస్ లొరాకో ఉండి, ఈ రేసులో తనకి సాటిలేదని నిరూపిస్తోంది. 258 00:12:59,823 --> 00:13:02,325 లేక్ఫిన్ ఆ రింగుల దగ్గర తడబడింది దానితో 259 00:13:02,409 --> 00:13:04,536 - రేసు తీరే మారిపోయింది. - వెళ్లు! సుడిగాలిలా దూసుకుపో! 260 00:13:04,619 --> 00:13:07,747 లొరాకో మీద షెల్లాక్స్ గెలవచ్చని అప్పుడే ఆశపడకండి. క్రస్టీ దగ్గరగా వచ్చేస్తోంది. 261 00:13:07,831 --> 00:13:09,499 - ఈ రేసు ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. - పద, పద! 262 00:13:09,583 --> 00:13:12,377 చివరి నేరు దారిలోకి వచ్చేశారు. లొరాకో ఇంకా ఓల్ క్రస్టీ పోటాపోటీగా దూసుకొస్తున్నారు. 263 00:13:12,460 --> 00:13:14,629 - నువ్వు గెలుస్తావు, క్రస్టీ! - అవును, గెలుస్తా. 264 00:13:14,713 --> 00:13:17,007 క్రస్టీ గొప్ప విజయాన్ని నమోదు చేయగలుగుతుందా? 265 00:13:17,090 --> 00:13:18,633 ఆమె హాప్ ఫ్రూట్ కోసం అమాంతం దూకింది. 266 00:13:22,596 --> 00:13:24,264 ఓల్ క్రస్టీ గెలిచింది! 267 00:13:24,347 --> 00:13:27,434 కొన్ని తరాల పాటు చెప్పుకునే స్పైడర్ చేపగా క్రస్టీ నిలుస్తుంది. 268 00:13:27,517 --> 00:13:28,768 నేను విజేతని! 269 00:13:28,852 --> 00:13:30,812 పాపం ఓల్ క్రస్టీ కన్నీళ్లు కేరింతలుగా మారాయి! 270 00:13:30,896 --> 00:13:34,232 ఆ ఓల్ క్రస్టీ అదృష్టవంతురాలు. 271 00:13:34,316 --> 00:13:36,735 ఆ ముసలి స్పైడర్ చేపకి అదృష్టం పట్టింది. 272 00:13:36,818 --> 00:13:38,695 ఆమె పని అయిపోయిందని ఎవరు అన్నారు? 273 00:13:40,947 --> 00:13:43,325 మూడు వందల షెల్లాక్స్ సాధించావు, బంగారం. అభినందనలు. 274 00:13:43,408 --> 00:13:46,328 - థాంక్యూ. - నువ్వు పూర్తిగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు, ఏవా. 275 00:13:46,411 --> 00:13:48,413 స్థానిక కరెన్సీ కోసం నన్ను పందెం ఒడ్డావు. 276 00:13:48,496 --> 00:13:51,082 అవును, నిర్లక్ష్యంగా ప్రవర్తించే, ఏవా. కానీ మజాగా ఉంది. 277 00:13:51,166 --> 00:13:54,044 నేను చెత్త కుప్పల్లో పడకుండా కాపాడింది ఏదైనా ఉందంటే అది అదృష్టమే. 278 00:13:54,127 --> 00:13:55,420 అది కేవలం అదృష్టం మాత్రమే కాదు. 279 00:13:55,503 --> 00:13:57,464 నేను క్రస్టీతో మాట్లాడటం వల్ల సాధించింది. 280 00:13:57,547 --> 00:13:59,257 ఇలా చూడు. అది పని చేసింది, కదా? 281 00:13:59,966 --> 00:14:01,885 సరే. 282 00:14:01,968 --> 00:14:04,429 ఇదిగో, ఇది తీసుకుని భద్రంగా దాచు. 283 00:14:04,512 --> 00:14:08,308 ఇక రేపు ఉదయం మనం ఆ అతుకు ఎక్కడి నుండి వచ్చిందో వెతుకుదాం. 284 00:14:08,391 --> 00:14:11,102 మీ అమ్మాయికి, ఒక విజేతని ఎలా ఎంచుకోవాలో తెలుసు. 285 00:14:11,186 --> 00:14:15,106 నా… తను నా కూతురు కాదు. 286 00:14:17,442 --> 00:14:20,695 మిస్టర్ కిట్, ఈ రాత్రికి మనం తలదాచుకోవడానికి ఒక ప్రదేశం కావాలని దయచేసి ఏవాకి చెప్పు. 287 00:14:20,779 --> 00:14:21,780 అదేదో నువ్వే చెప్పు. 288 00:14:21,863 --> 00:14:24,366 కారంకుల్ దుకాణం దగ్గర సరస్సు పక్కన మనం క్యాంప్ వేసుకోవచ్చు. 289 00:14:24,449 --> 00:14:26,660 అతను త్వరగా తిరిగి వస్తే, తనకి ఈ అతుకు ఎక్కడ దొరికిందీ అడుగుతాను… 290 00:14:26,743 --> 00:14:30,038 ఆ బెస్టీల్ రాక్షసుడు ఈ దగ్గరలోనే ఎక్కడో ఉంటాడు, కదా, మిస్టర్ కిట్? 291 00:14:31,039 --> 00:14:33,250 మనం ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. 292 00:14:51,977 --> 00:14:53,687 రోవెండర్. 293 00:14:54,479 --> 00:14:57,774 - ఫిస్కియన్, ఎవరు వచ్చారో వచ్చి చూడు. - ఒక్క క్షణం, డార్లింగ్. 294 00:14:57,857 --> 00:14:59,943 హోస్టియా, చాలా కాలం అయింది… 295 00:15:00,026 --> 00:15:03,446 - చాలా కాలం అయింది. లోపలికి రండి. - థాంక్యూ. 296 00:15:03,530 --> 00:15:05,740 నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను. 297 00:15:05,824 --> 00:15:08,994 నేను ఇలా వచ్చేసినందుకు సారీ. 298 00:15:09,077 --> 00:15:10,078 ఆహ్, ప్లీజ్. 299 00:15:10,161 --> 00:15:12,372 మళ్లీ సారి మీరు మొదటగా ఇక్కడికే రావాలి. 300 00:15:12,455 --> 00:15:14,791 - ఎలా ఉన్నావు? - అంటే, ఏదో నెట్టుకొస్తున్నాను. 301 00:15:14,874 --> 00:15:16,918 జంతుజాలం మళ్లీ తరలిపోతోందని మేము విన్నాము. 302 00:15:17,002 --> 00:15:19,212 అవి అడవికి ప్రాణం లాంటివి. 303 00:15:19,296 --> 00:15:20,463 కానీ ఇప్పుడది నేను పట్టించుకోను. 304 00:15:20,547 --> 00:15:22,007 నువ్వు ఇంకా ఫిస్కియన్ ఎలా ఉన్నారు? 305 00:15:22,090 --> 00:15:24,759 మంచిగా ఉన్నాం. చేపల వేట అతడిని ఎప్పుడూ బిజీగా ఉంచుతుంది 306 00:15:24,843 --> 00:15:27,387 అందువల్ల ఇక్కడ ఎప్పుడూ నిస్తేజంగా ఉండదు. 307 00:15:27,470 --> 00:15:29,264 అంకుల్ రోవెండర్! 308 00:15:29,347 --> 00:15:30,557 ఇదిగో వాళ్లు వచ్చారు. 309 00:15:31,308 --> 00:15:32,601 అందుకు ఎక్కువ సేపు పట్టలేదు. 310 00:15:32,684 --> 00:15:35,312 - నిన్ను మిస్ అయ్యాం, అంకుల్ రోవెండర్. - నేను మీ అంకుల్ ని కాను. 311 00:15:35,395 --> 00:15:36,354 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 312 00:15:36,438 --> 00:15:38,523 - నువ్వు మమ్మల్ని మర్చిపోయావని డాడీ చెప్పాడు. - ఆ వాసన ఏంటి? 313 00:15:38,607 --> 00:15:39,900 ఓహ్, పిల్లలూ. ఇలా రండి ఇంక. 314 00:15:39,983 --> 00:15:41,902 ఈ రాక్షసుల్ని ఇంకా అమ్మేయలేదా? 315 00:15:41,985 --> 00:15:43,778 - మేము అమ్మకానికి లేము. - నా గిఫ్ట్ ఏది? 316 00:15:43,862 --> 00:15:46,239 - మేగ్డన్. చూడు, చూడు. - చెప్పు, అమ్మా. 317 00:15:46,323 --> 00:15:48,950 ఫర్వాలేదు. మరేం ఫర్వాలేదు. వాళ్లు అడిగింది నేను ఇస్తాను. 318 00:15:49,034 --> 00:15:50,994 - మా కోసం ఏం తెచ్చావు? - చూద్దాం, చూద్దాం. 319 00:15:51,077 --> 00:15:53,997 రాక్షసులకి ఇష్టమైనది ఏంటి? ఆహ్, ఇదిగో తీసుకోండి. 320 00:15:54,080 --> 00:15:55,540 - హాప్ ఫ్రూట్. - హాప్ ఫ్రూట్. 321 00:15:55,624 --> 00:15:57,375 నేను పెద్దవాడిని. ఇది నాది. 322 00:15:57,459 --> 00:15:59,044 అంకుల్ రోవెండర్ ఇది నాకు ఇచ్చాడు. 323 00:15:59,127 --> 00:16:00,462 మీరు పంచుకోవడం మర్చిపోవద్దు. 324 00:16:00,545 --> 00:16:01,796 థాంక్యూ, అంకుల్ రోవెండర్. 325 00:16:02,881 --> 00:16:04,841 - చాలా సంతోషం, మేగ్డన్. - హేయ్. ఆగు. ఇది నాది. 326 00:16:04,925 --> 00:16:08,678 రోవెండర్, పాత మిత్రుడా, నిన్ను చూడటం సంతోషంగా ఉంది. నువ్వు అలాగే ఉన్నావు. 327 00:16:08,762 --> 00:16:10,472 అది అబద్ధం ఇంకా అది నీకు తెలుసు. 328 00:16:10,555 --> 00:16:11,932 అయితే నువ్వు లాకస్ రావడానికి కారణం ఏంటి? 329 00:16:12,015 --> 00:16:14,017 - అది నాకు తిరిగి ఇచ్చేయ్! - సరే, ఈ ఇద్దరికీ ఒక గురువు కావాలి. 330 00:16:14,100 --> 00:16:16,228 అంటే, నీకు తెలుసా, వీళ్లని ఇక్కడికి ఒక పని మీద తీసుకువచ్చాను. 331 00:16:16,311 --> 00:16:18,980 అయితే, ఇప్పుడు చెప్పు, వీళ్లు నీ ఫ్రెండ్స్ కదా? 332 00:16:19,064 --> 00:16:21,316 ఫ్రెండ్సా? లేదు, వీళ్లు నా ఫ్రెండ్స్ కాదు. 333 00:16:21,399 --> 00:16:24,653 వాళ్లు కేవలం పాతకాలపు దేశదిమ్మర్లు. అదే వాళ్ల గురించి చెప్పడానికి సరైన మాట. 334 00:16:24,736 --> 00:16:27,155 - వీళ్లని నేను నిన్ననే కలిశాను. - నాకు అర్థమైంది. 335 00:16:27,739 --> 00:16:28,615 ఆహ్… హా. 336 00:16:30,075 --> 00:16:33,328 నేను శాంక్చురీ 573 నుండి వచ్చిన ఏవాని. 337 00:16:33,411 --> 00:16:35,330 మనిషిని. 338 00:16:36,414 --> 00:16:37,832 రోవెండర్, ఇది ఏంటి? 339 00:16:38,708 --> 00:16:40,669 తన పేరు మదర్. 340 00:16:40,752 --> 00:16:42,671 నేను మదర్ యూనిట్ 0-6 ని. 341 00:16:42,754 --> 00:16:44,172 మీ ఇల్లు చాలా ముచ్చటగా ఉంది. 342 00:16:44,756 --> 00:16:46,925 దేనికి, థాంక్యూ, 0-6. 343 00:16:47,008 --> 00:16:49,261 రోవెండర్, నువ్వు ఎక్కడ… 344 00:16:49,344 --> 00:16:52,973 అంటే, ఈమె ఒక హిప్పో మొక్క దగ్గర, ఇంకా ఇదేమో బెస్టీల్ స్థావరంలో దొరికింది. 345 00:16:53,056 --> 00:16:56,309 అది పెద్ద కథ, కానీ… సరే, వాళ్లు బాగానే ఉన్నారు. 346 00:16:56,393 --> 00:16:58,311 అవును, వాళ్లు బాగానే ఉన్నారు. అవును. 347 00:16:58,395 --> 00:16:59,563 మా ఇంట్లో మీ అందరికీ స్వాగతం. 348 00:16:59,646 --> 00:17:00,939 తప్పకుండా. 349 00:17:01,648 --> 00:17:03,316 నేను వెళ్లి పక్క దుప్పట్లు సిద్ధం చేస్తాను. 350 00:17:03,400 --> 00:17:06,570 థాంక్యూ, ఫిస్కియన్. కానీ కేవలం వాళ్లకి మాత్రమే ఏర్పాటు చేయి. నేను వెళ్లాలి. 351 00:17:06,652 --> 00:17:07,654 - వెళ్లాలా? - వెళ్లకు. 352 00:17:07,737 --> 00:17:10,407 నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదు. మాతోనే ఉండాలి. 353 00:17:10,489 --> 00:17:13,618 కానీ, నా పెంటాకా పండుని నువ్వు కాదనుకోవడం ఇదే మొదటిసారి. 354 00:17:13,702 --> 00:17:15,160 నువ్వు పెంటాకాని తెచ్చావా? 355 00:17:15,245 --> 00:17:16,830 యాయ్! పెంటాకా! 356 00:17:17,581 --> 00:17:20,125 ఇదిగో తీసుకో. ఈ రోజు మార్కెట్ నుండి తాజాగా తెచ్చినవి. 357 00:17:20,208 --> 00:17:22,502 నాసన్ ఎప్పుడూ నా కోసం మంచివన్నీ తీసి పక్కన పెడతాడు. 358 00:17:23,085 --> 00:17:24,629 అవి చాలా రుచికరంగా ఉంటాయి, ప్రామిస్. 359 00:17:25,839 --> 00:17:27,799 మదర్, దయచేసి మాతో పాటు కూర్చోండి. 360 00:17:27,882 --> 00:17:30,927 ఓహ్, థాంక్యూ. కానీ అవసరం లేదు. నేను తినలేను. 361 00:17:31,011 --> 00:17:33,805 అయినా సరే, మీరు కూర్చోవడానికి టేబుల్ లో చోటు ఉంది. 362 00:17:33,889 --> 00:17:36,308 మీరు చాలా దయగలవారు. 363 00:17:36,391 --> 00:17:39,102 ఇంకా బహుశా మీ పిల్లల్ని ఆ రేసుల దగ్గరకి వెళ్లనివ్వరు అనుకుంటా. 364 00:17:39,185 --> 00:17:41,521 - తిరగడమా? ఖచ్చితంగా లేదు. - మదర్. 365 00:17:45,066 --> 00:17:47,944 ఈ ఇంట్లో మనం అతిథుల వంక అలా కళ్లార్పకుండా చూడము. 366 00:17:48,028 --> 00:17:49,487 కదా, ఫిస్కియన్? 367 00:17:49,571 --> 00:17:52,657 - ఫిస్కియన్. - అవును. కళ్లప్పగించి చూడద్దు. 368 00:17:52,741 --> 00:17:54,034 నీ కాలికి పది వేళ్లు ఉంటాయా? 369 00:17:55,076 --> 00:17:56,953 మనుషుల కాళ్లకి పది వేళ్లు ఉంటాయని విన్నాం. 370 00:17:57,037 --> 00:17:59,247 నీ కాలి వేళ్లని నాకు చూపిస్తావా? నాకు నీ కాలి వేళ్లని చూడాలని ఉంది. 371 00:17:59,331 --> 00:18:00,957 మనుషుల కాళ్లకి పది వేళ్లు ఉంటాయని డారియస్ చెప్పింది… 372 00:18:01,041 --> 00:18:03,752 సరే. సరే. మాటలు తగ్గించండి, ఎక్కువ తినండి. 373 00:18:03,835 --> 00:18:07,088 పది వేళ్లు, వంద వేళ్లు, వెయ్యి వేళ్లు. ఎవరు పట్టించుకుంటారు? 374 00:18:09,132 --> 00:18:10,342 అవును. 375 00:18:10,425 --> 00:18:11,885 నీ కాలికి పది వేళ్లు ఉన్నాయా? 376 00:18:11,968 --> 00:18:14,137 ఫిస్కియన్. ఇప్పుడు నీ భోజనం నువ్వు తిను. 377 00:18:14,221 --> 00:18:15,430 నువ్వు కూడా తిను, ఏవా. 378 00:18:17,098 --> 00:18:19,434 దీనిని మీరు ఎలా తింటారు? 379 00:18:21,978 --> 00:18:23,021 సారీ. 380 00:18:23,104 --> 00:18:24,147 లేదు, లేదు. 381 00:18:24,231 --> 00:18:26,858 నువ్వు నన్ను గుడ్డివాడిని చేయడానికి ముందే ఇది ఎలా తినాలో చూపిస్తాను. 382 00:18:26,942 --> 00:18:29,402 అది చాలా సింపుల్. ఒకటి తీసుకో. ఇలా. 383 00:18:29,486 --> 00:18:31,112 పైన ఉన్న గట్టి పెంకుని ఇలా పట్టుకో. 384 00:18:31,196 --> 00:18:33,073 - ఈ విధంగానా? - ఇంకా దగ్గరగా. 385 00:18:33,156 --> 00:18:36,243 ఇప్పుడు, దాన్ని గట్టిగా తిప్పు. భయపడకుండా తిప్పు. 386 00:18:36,326 --> 00:18:39,621 - తిప్పాలి! సరే. - అంతే. ఇప్పుడు అసలైన పని చేయాలి. 387 00:18:39,704 --> 00:18:41,998 ఈ గుల్లని పైకెత్తి రుచి చూడాలి. 388 00:18:46,920 --> 00:18:48,755 ఇది నిజంగా చాలా బాగుంది! 389 00:18:48,838 --> 00:18:50,423 నిజం. ఇదే పెంటాకా. 390 00:18:50,507 --> 00:18:54,177 పెంటాకా. పెంటాకా. మనం పెంటాకా తింటున్నాం. 391 00:19:05,021 --> 00:19:06,898 రోవెండర్, నువ్వు రాత్రి ఉండటం లేదా? 392 00:19:06,982 --> 00:19:10,193 నేను ముందే చెప్పాను, ఫిస్కియన్, నేను నిజంగా ఇప్పుడు వెళ్లాలి. 393 00:19:10,694 --> 00:19:12,237 నేను రేపు ఉదయం తిరిగి వస్తాను. 394 00:19:12,320 --> 00:19:13,989 సరే, నువ్వు బాగానే ఉన్నందుకు సంతోషం. 395 00:19:14,072 --> 00:19:18,243 పెంటాకా విందు ఇచ్చినందుకు థాంక్స్. 396 00:19:20,829 --> 00:19:23,415 రోవెండర్, అతను కొన్నిసార్లు అలాగే చేస్తుంటాడు. 397 00:19:23,498 --> 00:19:25,250 గతంలో అయితే, నిజానికి, ఇంతకన్నా ఘోరంగా ఉండేవాడు. 398 00:19:26,167 --> 00:19:27,586 కానీ నీతో పాటు అతడిని చూస్తుంటే, 399 00:19:27,669 --> 00:19:31,423 చాలా కాలం తరువాత మొదటిసారిగా, అతను చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించాడు. 400 00:19:31,506 --> 00:19:33,508 అతను గతంలో ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. 401 00:19:33,592 --> 00:19:37,220 నీకు తెలుసా, మొత్తం ఓర్బోనాలోనే రోవెండర్ గొప్ప మార్గదర్శకుడిగా ఉండేవాడు. 402 00:19:37,304 --> 00:19:39,598 అతను తన వృత్తిని ప్రేమించేవాడు, ఇంకా తన కుటుంబాన్ని ప్రేమించేవాడు. 403 00:19:39,681 --> 00:19:41,141 ఏం జరిగింది? 404 00:19:42,601 --> 00:19:44,269 అతను ఆ రెండింటినీ కోల్పోయాడు. 405 00:19:48,982 --> 00:19:51,192 ఇలా రా. మనం దాదాపు వచ్చేశాం. 406 00:19:53,111 --> 00:19:55,113 నేను పడుకునేది ఇక్కడే. 407 00:19:55,196 --> 00:19:56,823 మనుషులకి కూడా నిద్ర అవసరమా? 408 00:19:56,907 --> 00:19:58,700 ఓహ్, అవును. తప్పనిసరిగా. 409 00:19:59,367 --> 00:20:02,662 మానవుల మనుగడకి అది అవసరం అని మా మదర్ నీకు తప్పకుండా చెబుతుంది. 410 00:20:02,746 --> 00:20:04,331 ఆమె మీ అమ్మ ఎలా అవుతుంది? 411 00:20:04,414 --> 00:20:06,625 మనిషి అమ్మలందరూ అలాగే ఉంటారా? 412 00:20:06,708 --> 00:20:08,919 నాకు తెలియదు. 413 00:20:09,002 --> 00:20:11,463 నీ కాలి వేలి తొడుగుల్ని తీసేస్తావా? 414 00:20:11,546 --> 00:20:13,965 - నావి ఏం తీయాలి? - నీ కాలి వేళ్ల తొడుగులు. 415 00:20:14,549 --> 00:20:16,092 నీ కాలి వేళ్లని చూడాలని ఉంది. 416 00:20:16,927 --> 00:20:19,596 సరే, అలాగే. తప్పకుండా. 417 00:20:19,679 --> 00:20:22,098 పది వేళ్లు. 418 00:20:22,182 --> 00:20:25,727 - పది వేళ్లా? - అవి భలే విచిత్రంగా కదులుతున్నాయి. 419 00:20:25,810 --> 00:20:26,978 నేను వాటిని లెక్కపెట్టవచ్చా? 420 00:20:27,062 --> 00:20:29,648 తప్పకుండా. అలాగే. పది ఉన్నాయేమో చూడండి. 421 00:20:29,731 --> 00:20:31,358 సరే. 422 00:20:31,441 --> 00:20:34,110 ఒకటి, రెండు… 423 00:20:34,194 --> 00:20:36,863 మేగ్డన్, మనుషుల గురించి నువ్వు ఎక్కడ తెలుసుకున్నావు? 424 00:20:36,947 --> 00:20:38,281 నువ్వు ఇందాక ఏదో పేరు చెప్పావు. 425 00:20:38,365 --> 00:20:39,616 నువ్వు డారియస్ గురించి అంటున్నావా? 426 00:20:39,699 --> 00:20:40,992 - జూజీ. - ఓహ్, అవును. 427 00:20:41,076 --> 00:20:42,786 మనకి ఆమె గురించి మాట్లాడే అనుమతి లేదు. 428 00:20:42,869 --> 00:20:45,747 ఆమె చాలా కథలు చెబుతుందని అమ్మ చెప్పింది. 429 00:20:45,830 --> 00:20:50,210 - ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. - ఆమె ఎక్కడ ఉంటుంది? 430 00:20:50,293 --> 00:20:51,670 వాళ్లంతా అక్కడ ఉంటారు. 431 00:20:53,338 --> 00:20:56,383 ఆర్జియన్ సాధువు. ఆమె ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. 432 00:20:56,466 --> 00:20:59,302 ఆమె రాజ కవయిత్రి ఇంకా భవిష్యత్తు చెప్పేది. 433 00:20:59,386 --> 00:21:00,720 కానీ అది చాలా కాలం కిందటి కథ. 434 00:21:00,804 --> 00:21:03,098 ఇప్పుడు ఆమె పిల్లలకి కథలు చెబుతుంది. 435 00:21:03,181 --> 00:21:08,061 మనుషుల కలల గురించి, ఈ గ్రహానికి హాని చేసే భయంకరమైన విషయాల గురించి చెబుతుంది. 436 00:21:08,144 --> 00:21:10,272 కానీ మేము ఆమె గురించి మాట్లాడకూడదు. 437 00:21:17,362 --> 00:21:19,948 ఓమ్నీ, లొకేషన్ ట్రాకింగ్ ని డీయాక్టివేట్ చేయి. 438 00:21:20,031 --> 00:21:21,157 డియాక్టివేట్ అయింది. 439 00:22:08,538 --> 00:22:10,332 టోనీ డిటెర్లిజీ రాసిన నవలల ఆధారంగా 440 00:23:36,626 --> 00:23:38,628 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్