1 00:00:13,680 --> 00:00:16,808 సైలోని వదిలి వెళ్లాలని నోటితో అభ్యర్థించినట్లయితే, దానికి అనుమతి తప్పక లభిస్తుంది, 2 00:00:18,352 --> 00:00:19,811 కానీ దాన్ని ఉపసంహరించుకొనే వీలు ఉండదు. 3 00:00:22,648 --> 00:00:24,107 మిమ్మల్ని శుభ్రం చేయమని కోరడం జరిగింది, 4 00:00:24,107 --> 00:00:26,693 అందుకు కావలసిన వస్తువులని మీకు అందించడం జరిగింది, 5 00:00:28,362 --> 00:00:30,572 కానీ శుభ్రపరచమని మిమ్మల్ని బలవంతపెట్టడం అనేది జరగదు. 6 00:00:31,532 --> 00:00:33,325 ద్వారం దాటి బయటకు అడుగుపెట్టాక, 7 00:00:34,159 --> 00:00:35,786 చట్టం మీకు వర్తించదు. 8 00:00:39,206 --> 00:00:40,666 చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 9 00:00:43,043 --> 00:00:44,711 ఇంత హడావిడి చేసినందుకు క్షమించండి. 10 00:01:21,331 --> 00:01:23,625 మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో మనకు తెలీదు. 11 00:01:26,503 --> 00:01:28,630 సైలోని ఎవరు నిర్మించారో మనకు తెలీదు. 12 00:01:31,049 --> 00:01:35,012 సైలో బయట ఉండేదంతా, ఏ మార్పూ లేకుండా అలాగే ఎందుకు ఉంటుందో మనకు తెలీదు. 13 00:01:40,184 --> 00:01:43,353 బయటకు వెళ్లడం ఎప్పుడు సురక్షితమో కూడా మనకు తెలీదు. 14 00:01:48,233 --> 00:01:50,027 ఆ బయటకు వెళ్లే రోజు ఈ రోజు కాదని మాత్రమే... 15 00:01:53,280 --> 00:01:54,531 మనకు తెలుసు. 16 00:03:47,186 --> 00:03:49,313 {\an8}హ్యూ హొవీ రాసిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 17 00:04:32,898 --> 00:04:34,149 ఎందుకు అలా అన్నాడు? 18 00:04:39,530 --> 00:04:41,907 శుభ్రం చేయడానికి షెరిఫ్ ని పంపుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. 19 00:04:41,907 --> 00:04:44,785 ఒకసారి మాట అన్నాక, వాళ్లకి ఇంకో దారి ఉండదు కదా. 20 00:04:44,785 --> 00:04:46,870 కానీ బయటకు వెళ్లాలని షెరిఫ్ కి ఎందుకు అనిపించింది? 21 00:04:50,791 --> 00:04:52,167 అది జరుగుతోంది. 22 00:04:53,502 --> 00:04:55,212 అయ్యయ్యో. అతను వస్తున్నాడు. 23 00:05:13,146 --> 00:05:14,273 అయ్యయ్యో. 24 00:05:19,695 --> 00:05:20,696 కానివ్వు. 25 00:05:24,616 --> 00:05:25,909 బాబోయ్, ఆలిసన్. 26 00:05:28,620 --> 00:05:29,788 నువ్వు చెప్పింది నిజమే. 27 00:05:46,805 --> 00:05:48,056 వాళ్లు కూడా ఇది చూడాలి. 28 00:06:29,723 --> 00:06:31,433 - ఎంత? - పది. 29 00:06:31,934 --> 00:06:36,063 అతను శుభ్రం చేయడని పది నాణేలు పందెం కాస్తున్నావా? వాళ్లు తప్పకుండా శుభ్రం చేస్తారు. 30 00:06:36,063 --> 00:06:39,566 విషం ప్రభావానికి చావకుండా అతను మూడు నిమిషాలైనా నిలువగలడా? దాని మీద కాయాలి పందెం. 31 00:07:03,423 --> 00:07:04,967 నువ్వు చేయగలవు, షెరిఫ్! 32 00:07:25,904 --> 00:07:27,239 అతను ఏం చేస్తున్నాడు? 33 00:07:29,783 --> 00:07:31,910 ఇంతకు ముందు ఎప్పుడైనా, ఎవరైనా హెల్మెట్ తీసేశారా? 34 00:07:39,668 --> 00:07:40,878 పైకి లేయ్! 35 00:07:43,046 --> 00:07:44,006 ఎక్కడికి వెళ్తున్నాడు? 36 00:07:45,507 --> 00:07:46,884 అతని భార్య దగ్గరికి. 37 00:08:13,994 --> 00:08:16,371 షెరిఫ్ చనిపోయాడు. ఇప్పుడు ఏంటి? 38 00:08:17,915 --> 00:08:21,418 అబద్ధాలకోరు. వాడొక అబద్ధాలకోరు! 39 00:08:26,507 --> 00:08:30,302 హేయ్! హేయ్! ఆపండి! 40 00:08:31,261 --> 00:08:33,722 ఆపండి ఇక! వినండి. 41 00:08:33,722 --> 00:08:37,433 అందరూ వినండి, శాంతించండి! చెప్పేది వినండి! 42 00:08:41,730 --> 00:08:44,608 ఇప్పుడు జరిగినది చాలా దారుణమైనదే, అందులో సందేహం లేదు. 43 00:08:45,442 --> 00:08:48,362 అలా అని మనం పిచ్చిగా ప్రవర్తిస్తే ఎలా! 44 00:08:48,362 --> 00:08:51,406 శుభ్రం చేయడం కోసం షెరిఫ్ ని పంపించారని ఎవరైనా గొడవ చేయాలనుకుంటే, 45 00:08:51,406 --> 00:08:53,700 వాళ్లు మధ్య అంతస్థుల్లోనో, లేదా పైన అంతస్థుల్లోనో కొట్టుకోని చావమనండి, 46 00:08:54,326 --> 00:08:58,747 కానీ కింది అంతస్థుల్లో ఉన్న మనకి, అది మనకి అక్కర్లేని విషయం. 47 00:08:58,747 --> 00:09:01,959 మన పనేంటంటే లైట్లు వెలిగేలా చూడటం. 48 00:09:02,543 --> 00:09:03,544 అంతే! 49 00:09:04,044 --> 00:09:05,754 జనరేటరు పని చేసేలా చూసుకోవడం. 50 00:09:05,754 --> 00:09:07,506 అంతే! 51 00:09:07,506 --> 00:09:09,967 సైలోలో అన్నీ సక్రమంగా జరిగేలా చూడటం! 52 00:09:09,967 --> 00:09:12,010 అంతే! 53 00:09:13,136 --> 00:09:14,888 ఈ కింది అంతస్థుల్లో, 54 00:09:15,973 --> 00:09:19,226 మనం పనులు అయ్యేలా చూస్తాం. సరేనా? 55 00:09:19,226 --> 00:09:20,477 అంతే! 56 00:09:21,019 --> 00:09:21,895 సరేనా? 57 00:09:24,731 --> 00:09:26,984 - సరేనా? - హా! 58 00:09:49,089 --> 00:09:51,175 షెరిఫ్ డిపార్టుమెంట్ షెరిఫ్ బెకర్ 59 00:09:51,717 --> 00:09:53,552 {\an8}మార్న్స్ 60 00:10:01,852 --> 00:10:03,770 నీకు కరీన్స్ నుండి ఒక సందేశం వచ్చింది. 61 00:10:03,770 --> 00:10:07,357 రీసైక్లింగ్ దగ్గరికి జనాలు చాలా మంది వస్తున్నారని మనకి మరిన్ని హెచ్చరికలు అందుతున్నాయి, 62 00:10:07,357 --> 00:10:09,776 పైపులు, సుత్తుల వంటి వాటి కోసం వాళ్లు ఎగబడుతున్నారట... 63 00:10:09,776 --> 00:10:11,486 హా. జనాలు పిచ్చోళ్లు. 64 00:10:11,486 --> 00:10:12,696 వాళ్లు భయపడుతున్నారు. 65 00:10:12,696 --> 00:10:16,617 హా, నేను రేడియో ద్వారా అందరినీ వాకబు చేస్తాను. 66 00:10:16,617 --> 00:10:18,577 క్యాంటిన్ నుండి ఏమైనా తీసుకురానా? 67 00:10:18,577 --> 00:10:20,120 నువ్వు ఇక ఇంటికి వెళ్లు, శాండీ. 68 00:10:23,707 --> 00:10:25,209 అతను ఆమెని చాలా గాఢంగా ప్రేమించాడు. 69 00:10:26,460 --> 00:10:27,753 ఎందుకు చేశాడో నీకు అర్థం కాకపోతే, కారణమదే. 70 00:10:30,255 --> 00:10:31,256 సరే. 71 00:10:37,763 --> 00:10:39,097 {\an8}షెరిఫ్ గా నా ఆఖరి చర్యగా, హాల్స్టన్ బెకర్ అనే నేను, 72 00:10:39,097 --> 00:10:40,390 {\an8}జూలియా నికల్స్ ని నా వారసురాలిగా నామినేట్ చేస్తున్నాను. 73 00:11:43,453 --> 00:11:45,080 నాది మీడియమ్ సైజ్. 74 00:11:46,123 --> 00:11:48,041 అది 20 ఏళ్ల క్రిందటి మాట. 75 00:11:50,669 --> 00:11:52,838 జెన్సన్ బిడ్డ పుట్టేది వచ్చే వారంలోనే. 76 00:11:52,838 --> 00:11:57,593 ఒకప్పుడు వీటిని ఏడాదికి 25 చేసేదాన్ని, పుట్టే బిడ్డల్లో ప్రతి పదవ బిడ్డకు వచ్చేలా. 77 00:11:57,593 --> 00:11:59,553 ఈసారి అయిదు అయినా ఎక్కువే. 78 00:12:01,346 --> 00:12:03,348 - డ్రింక్ ఏమైనా తీసుకుంటావా? - హా. 79 00:12:05,142 --> 00:12:07,644 ఇలాంటి సందర్భాల్లో, మనం మంచివి తాగాలి. 80 00:12:12,524 --> 00:12:14,359 ఇది తిరుగుబాటుకు ముందు తయారైన డ్రింక్. 81 00:12:15,277 --> 00:12:16,862 బహుశా అన్నింటికన్నా ముందు, మొదట్లోనే చేసిందేమో. 82 00:12:20,324 --> 00:12:21,533 థ్యాంక్యూ. 83 00:12:21,533 --> 00:12:22,826 హాల్స్టన్ బెకర్ జ్ఞాపకార్థం. 84 00:12:29,958 --> 00:12:32,169 షెరిఫ్ గా ఎవరు ఉండాలో నిర్ణయించుకున్నావా? 85 00:12:33,462 --> 00:12:34,755 నా కళ్ల ముందు ఉండే వ్యక్తి షెరిఫ్ కాదా? 86 00:12:34,755 --> 00:12:38,634 కొత్త షెరిఫ్ కి శిక్షణ ఇస్తాను, కానీ నేనైతే రిటైర్ అయిపోతాను. 87 00:12:40,886 --> 00:12:42,513 జమాల్ రిటైర్ అయ్యేటప్పుడు, 88 00:12:42,513 --> 00:12:45,641 షెరిఫ్ గా హాల్స్టన్ ని ఎంచుకోవాలని కోరాడు. అప్పుడు పని చాలా సులభంగా అయిపోయింది. 89 00:12:45,641 --> 00:12:47,559 హాల్స్టనే కనుక రిటైర్ అవుతుంటే కనుక, 90 00:12:47,559 --> 00:12:49,645 నేను అతని కోరికనే అనుసరించేదాన్ని, కానీ ఇప్పుడు... 91 00:12:49,645 --> 00:12:53,106 జ్యుడిషియల్ శాఖ వాళ్లు, తమ వాళ్లని ఆ పదవిలోకి ఎక్కించాలని చూస్తారు. 92 00:12:53,607 --> 00:12:56,068 హాల్స్టన్ నీతో ఏమీ చెప్పలేదా? 93 00:13:02,074 --> 00:13:05,410 మేయర్ల లెడ్జర్లను పరిశీలిస్తున్నా. ఇప్పటికి 97వ సంవత్సరం దాకా చూశాను. 94 00:13:06,870 --> 00:13:12,459 జననాలు. మరణాలు. ఆ ఏడాది ఎంత నీరు వినియోగమైంది. ఎన్ని కంప్యూటర్ కేబుల్స్ వాడారు. 95 00:13:12,459 --> 00:13:14,127 ఎవరినైనా బయటకు పంపారా అంటే, 96 00:13:15,420 --> 00:13:19,758 ఇప్పటిదాకా, ఏ మేయర్ కూడా శుభ్రం చేయడానికి షెరిఫ్ ని పంపలేదు. 97 00:13:19,758 --> 00:13:21,969 అతనే వెళ్లాడు, నువ్వేమీ పంపలేదు కదా. 98 00:13:21,969 --> 00:13:25,013 నేను దిక్కుతోచలేని స్థితిలో ఉన్నానని ఈ ప్రస్తావన తెచ్చానని అనుకుంటున్నావేమో, 99 00:13:26,139 --> 00:13:30,894 ఈ లెడ్జర్లు లేక ముందు ఏం జరిగిందో నాకు తెలీదు కాబట్టి తెచ్చాను. 100 00:13:32,437 --> 00:13:34,064 అంటే తిరుగుబాటుకు ముందా? 101 00:13:34,064 --> 00:13:36,525 తిరుగుబాటుకు ఏది కారణమైందో, దానికి ముందు. 102 00:13:38,944 --> 00:13:40,404 దానికి కారణం శుభ్రపరచడమే అని ఆందోళన పడుతున్నావా? 103 00:13:41,113 --> 00:13:44,449 - ఎక్కడ అస్థిరత ప్రారంభమవుతుందా అని ఆందోళనగా ఉంది. - హా. 104 00:13:45,742 --> 00:13:48,078 అందుకే వీలైనంత త్వరగా మనం షెరిఫ్ ని ఎంచుకోవాలి. 105 00:13:52,291 --> 00:13:53,917 ఇదే చివరిది. ఆన్నీ అయిపోయాయి. 106 00:13:53,917 --> 00:13:55,294 థ్యాంక్యూ. 107 00:13:56,336 --> 00:13:57,754 నాకు ఇది కావాలి. 108 00:13:58,797 --> 00:14:01,592 - లేదు, నీకు ఇవ్వను, లేదు! నువ్వు... - లేదు. నాకు ఇది కావాలి. 109 00:14:01,592 --> 00:14:04,136 - నా సుత్తిని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. - హేయ్! 110 00:14:04,136 --> 00:14:05,762 - గొడవ ఆపండి! - నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది కావాలి! 111 00:14:05,762 --> 00:14:09,349 - సుత్తిని వదులు. - హేయ్! గొడవ ఆపండి! 112 00:14:10,225 --> 00:14:12,352 అబ్బా. జ్యుడిషియల్ మనుషులు. 113 00:14:12,895 --> 00:14:14,229 అయ్యయ్యో. 114 00:14:18,358 --> 00:14:19,735 డెప్యూటీ బ్రూక్స్. 115 00:14:20,402 --> 00:14:22,821 మిస్టర్ సిమ్స్, గొడవని నేను అదుపు చేయగలను. 116 00:14:25,532 --> 00:14:26,867 వాళ్ల పేర్లు తీసుకో. 117 00:14:31,330 --> 00:14:33,165 మనకి కొత్త షెరిఫ్ ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా? 118 00:14:33,832 --> 00:14:36,293 ఎందుకంటే, రీసైక్లింగ్ వద్ద ఇంకా పెద్ద క్యూ ఉంది, 119 00:14:36,293 --> 00:14:39,129 డెప్యూటీ కూడా సరిపడా మందు గుండు ఉండేలా చూసుకోమని నాతో అన్నాడు. 120 00:14:47,179 --> 00:14:48,889 పద్నాల్గవ అంతస్థులో అంతా బాగుంది. 121 00:15:03,195 --> 00:15:05,364 - ఏం చేస్తున్నావు? - ఏం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాను? 122 00:15:05,364 --> 00:15:07,616 ఏదో కోపంతో వచ్చినట్టుగా కనిపిస్తున్నావు. 123 00:15:07,616 --> 00:15:09,409 ఆ కోపాన్ని ఆ టోస్టర్ మీద చూపిస్తున్నావు. 124 00:15:09,409 --> 00:15:12,162 లేదు, నేను దీన్ని బాగు చేస్తున్నా. 125 00:15:12,955 --> 00:15:15,582 నీకు 13 ఏళ్లు ఉన్నప్పటి నుండి నువ్వు ఇక్కడికి వస్తున్నావు... 126 00:15:15,582 --> 00:15:16,542 మళ్లీ మొదలుపెట్టిందిరా నాయనా. 127 00:15:16,542 --> 00:15:18,877 ...వచ్చి ఏదోకటి బాగు చేస్తావు, నీ సమస్యల నుండి తప్పించుకోవాలని. 128 00:15:18,877 --> 00:15:22,089 కాస్త నా మానాన నన్ను పని చేసుకోనిస్తావా? 129 00:15:22,089 --> 00:15:25,259 షెరిఫ్ శుభ్రం చేసిన తర్వాత నువ్వు అన్న మాటలకు, నీ మూడ్ కి ఏమైనా సంబంధం ఉందా? 130 00:15:26,468 --> 00:15:28,011 నిన్న రాత్రి షర్లీ ఇక్కడికి వచ్చింది. 131 00:15:28,011 --> 00:15:31,515 "అతను అబద్ధాలకోరు!" అని అరుచుకుంటూ ఆవేశంగా వెళ్లిపోయావని తను అంది. 132 00:15:31,515 --> 00:15:32,641 నేనేమీ అరవలేదు. 133 00:15:34,226 --> 00:15:37,312 ఒకటి చెప్పనా? ఇక్కడికి వచ్చి, కుర్చీలో కూర్చుని, నా సాధనాలను ఉపయోగించడమంటే, 134 00:15:37,312 --> 00:15:38,438 అది అందరికీ లభించే విషయం కాదు. 135 00:15:38,438 --> 00:15:42,025 కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలంటే, విషయమేంటో చెప్పు. 136 00:15:45,320 --> 00:15:46,655 సరే, అయితే ఉండనులే. 137 00:15:47,990 --> 00:15:51,201 నువ్వు ఇక్కడికి టోస్టరును బాగు చేయాలని రాలేదు. నాతో మాట్లాడదామని వచ్చావు. 138 00:15:52,202 --> 00:15:53,579 అది నీకు కష్టమైన విషయమే. 139 00:15:56,290 --> 00:15:57,708 సరే. కంగారేం లేదు, కావాలసినంత సమయం తీసుకో. 140 00:16:08,302 --> 00:16:09,511 జార్జ్ గురించి ఇలా ఉన్నా. 141 00:16:10,637 --> 00:16:12,598 అతను చనిపోయి మూడు నెలలు అయింది. 142 00:16:14,099 --> 00:16:16,810 - అతను అబద్ధమాడాడు అని అంటున్నావా? - కాదు. హాల్స్టన్ అబద్ధమాడాడు. 143 00:16:17,311 --> 00:16:19,188 - జార్జ్ హత్యకు గురయ్యాడని ఇంకా అనుకుంటున్నావా? - హా. 144 00:16:19,188 --> 00:16:22,816 - హా, ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకోలేదు, కాబట్టి... - అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? 145 00:16:22,816 --> 00:16:24,818 ఎందుకంటే, చివరిసారిగా నేను అతడిని కలిసినప్పుడు, 146 00:16:24,818 --> 00:16:26,778 అతను నాకు ఒకటి చూపాలని చాలా ఆతృతగా ఉన్నాడు. 147 00:16:27,529 --> 00:16:29,907 నా తదనంతర వ్యక్తిగా కూపర్ నియమితుడు అయ్యాడని మేమందరం పార్టీ చేసుకుంటున్నాం. 148 00:16:30,741 --> 00:16:33,577 మాకు అనుమతి లభించలేదు కాబట్టి, జార్జ్ కాస్త భయపడేవాడు, 149 00:16:33,577 --> 00:16:34,995 అందుకని అలాంటి వాటికి అతను వచ్చేవాడే కాదు. 150 00:16:34,995 --> 00:16:36,205 కంప్యూటర్ బాసూ! 151 00:16:37,915 --> 00:16:39,082 వాళ్లు నా చేత తాగిస్తున్నారు. 152 00:16:39,082 --> 00:16:41,502 నువ్వు వద్దని గట్టిగా చెప్తున్నట్టే ఉందిలే. 153 00:16:41,502 --> 00:16:44,630 కూప్. నీకు నీళ్లు తెచ్చిస్తాము, వచ్చి కూర్చుందువు దా. 154 00:16:48,592 --> 00:16:49,593 కేకు ఇవ్వనా? 155 00:16:50,093 --> 00:16:52,429 {\an8}నువ్వు బాధపడతావు! 156 00:17:02,189 --> 00:17:05,651 హేయ్, మన గురించి అందరికీ తెలుసు. ఎవరూ పట్టించుకోరు. 157 00:17:05,651 --> 00:17:07,528 మనల్ని గనులకు పంపించరులే. 158 00:17:07,528 --> 00:17:09,530 నువ్వు అక్కడైనా బతికేయగలవు, గట్టి దానివు నువ్వు. 159 00:17:10,864 --> 00:17:13,242 హేయ్, ఒకటి జరిగింది. 160 00:17:14,785 --> 00:17:15,993 చాలా ముఖ్యమైంది. 161 00:17:15,993 --> 00:17:18,497 అదేంటో ఇక్కడ చెప్పలేను, తర్వాత నీకు నాతో మాట్లాడే వీలు దొరుకుతుందా? 162 00:17:18,497 --> 00:17:20,040 హా, అలాగే. నేను పొద్దుపోయేదాకా పని చేస్తా. 163 00:17:20,040 --> 00:17:21,875 అయితే మీ ఇంటికి వచ్చి చెప్తాలే. 164 00:17:21,875 --> 00:17:22,960 సరే. 165 00:17:23,544 --> 00:17:24,837 అందరూ వినండి! 166 00:17:25,921 --> 00:17:27,005 కూప్ ఎక్కడ? 167 00:17:27,005 --> 00:17:28,298 కూప్ ఇక్కడికి రావాలి. 168 00:17:29,383 --> 00:17:31,385 ఈ పార్టీ అంతా అతని గురించే కదా. ఇలా రా. 169 00:17:32,052 --> 00:17:34,221 కూప్, నీకు పిచ్చ కంగారుగా ఉందని నాకు తెలుసు. 170 00:17:37,224 --> 00:17:40,477 - జూల్స్ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. - నేను వెళ్తాలే. 171 00:17:40,477 --> 00:17:42,980 కూపర్ కి అందరూ ఒక ఓ వేసుకోండి. వేసుకోండి! 172 00:17:55,284 --> 00:17:58,078 పని అయ్యేసరికి అర్ధరాత్రి అయింది, నేను బాగా అలసిపోయాను. 173 00:17:58,954 --> 00:18:00,831 జార్జ్ ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూశా. 174 00:18:10,382 --> 00:18:11,383 జార్జ్? 175 00:18:40,037 --> 00:18:41,747 చివరిసారి ఇది చూసినప్పుడు ఎక్కడ ఉన్నావో గుర్తుందా? 176 00:18:41,747 --> 00:18:42,873 నాకేం కావాలో అది దొరికింది. 177 00:19:04,061 --> 00:19:05,812 - హేయ్. - హేయ్. 178 00:19:05,812 --> 00:19:07,606 నీకు పెద్దగా హ్యాంగ్ ఓవర్ అయినట్టు ఏమీ అనిపించట్లేదే. 179 00:19:07,606 --> 00:19:09,358 హ్యాంగ్ ఓవర్ ఏం లేదు. బాధగా ఉంది అంతే. 180 00:19:10,442 --> 00:19:11,276 ఎందుకు? 181 00:19:12,986 --> 00:19:14,988 - నీకు తెలీదా? - ఇప్పుడే లేచా. ఏమైంది? 182 00:19:14,988 --> 00:19:17,074 కంప్యూటర్ బాబు అయిన జార్జ్, నిన్న రాత్రి మెట్ల మీద నుండి పడిపోయాడు. 183 00:19:19,535 --> 00:19:20,827 ఆత్మహత్య అని అంటున్నారు. 184 00:19:23,539 --> 00:19:24,665 అతను నీకు బాగా తెలుసా? 185 00:19:41,223 --> 00:19:43,809 చూడు, జూల్స్, నీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. 186 00:19:44,643 --> 00:19:46,103 నాకు అతనంటే నిజంగానే చాలా ఇష్టం. 187 00:19:46,103 --> 00:19:48,730 ఆత్మహత్య అంటే సైలోపై నేరం చేసినట్టుగా పరిగణించడం జరుగుతుంది. 188 00:19:48,730 --> 00:19:51,567 - తెలుసు. - అతనే స్వయంగా దూకలేదని నీ దగ్గర రుజువు ఉంటే, 189 00:19:51,567 --> 00:19:54,111 నాకు పేపర్ వర్క్ చాలా తగ్గించినదానివి అవుతావు. కానీ... 190 00:19:55,362 --> 00:19:56,488 కానీ హత్య అంటావా? 191 00:19:57,739 --> 00:20:00,033 ఎవరు చేశారు? ఎందుకు? 192 00:20:00,033 --> 00:20:03,745 నాకు తెలీదు! అతను ఆత్మహత్య చేసుకోలేదని మాత్రం నాకు తెలుసు, హ్యాంక్. 193 00:20:03,745 --> 00:20:06,498 ఇలా చూడు, హత్యే అయితే, నాకు ఇంకా చాలా సమాచారం అవసరం అవుతుంది. 194 00:20:06,498 --> 00:20:09,293 - ఎందుకు చంపారో కారణం, ఇంకా అవకాశం అవసరం అవుతాయి. - ఏదోకటి చెప్పాలని చెప్పకు, హ్యాంక్. 195 00:20:09,293 --> 00:20:11,670 హేయ్, నేను ఏదొకటి చెప్పాలని చెప్పట్లేదు, ఏంటంటే... 196 00:20:15,716 --> 00:20:16,633 ఏంటి? హా? 197 00:20:19,511 --> 00:20:21,054 మీ ఇద్దరూ బాగా సన్నిహితులని తెలుసు... 198 00:20:22,222 --> 00:20:25,434 నేను గ్రహించాను, కానీ కింద ఎవరూ పట్టించుకోరు కదా. విషయం ఏంటంటే, 199 00:20:25,434 --> 00:20:28,520 మీరిద్దరి బంధానికి సమ్మతి లభించి ఉంటే, ఇదంతా ఇంకా తేలిగ్గా ఉంటుంది. 200 00:20:28,520 --> 00:20:30,022 భాగస్వామికి కొన్ని హక్కులు ఉంటాయి. 201 00:20:31,356 --> 00:20:32,524 హా. అంటే... 202 00:20:36,069 --> 00:20:37,070 తొక్కలే. 203 00:20:38,488 --> 00:20:40,115 నీ ఆందోళనని పైనున్నవారికి చేరుస్తాను. 204 00:20:40,115 --> 00:20:42,826 అతనికి బాగా తెలిసిన సహోద్యోగి ఇలా అంటోందని చెప్తాను. 205 00:20:42,826 --> 00:20:45,412 షెరిఫ్ ఏమంటాడో చూద్దాం. అతను మంచి వాడు. 206 00:20:46,288 --> 00:20:47,998 ఆత్మహత్య అంటే ఎవరికీ నచ్చే అంశం కాదు. 207 00:20:53,629 --> 00:20:54,630 కానివ్వు! 208 00:21:11,355 --> 00:21:12,564 ఆవిడే. 209 00:21:13,065 --> 00:21:15,025 - తన పేరేంటి? - ఏంటి? 210 00:21:15,025 --> 00:21:17,152 తన పేరేంటి? 211 00:21:17,152 --> 00:21:19,154 జూలియా. 212 00:21:19,154 --> 00:21:21,031 జూలియా నికల్స్. 213 00:21:32,751 --> 00:21:36,255 శవం ఇక్కడే, ఈ వెంటిలేషన్ యూనిట్ మీదే గుర్తించబడింది. 214 00:21:40,342 --> 00:21:44,346 జార్జ్ అటుఇటుగా ఒక 100 అడుగుల ఎత్తు నుండి పడిపోయుంటాడు. 215 00:21:44,888 --> 00:21:46,390 సాక్షులు ఎవరూ లేరు. 216 00:21:46,390 --> 00:21:48,851 కాబట్టి, ఇంత కన్నా ఎక్కువ సమాచారం మీకు ఇవ్వలేని పరిస్థితి. 217 00:21:51,019 --> 00:21:52,688 మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు. 218 00:21:53,438 --> 00:21:55,065 నేను... నేను ఎప్పుడూ కంగారుపడుతూనే ఉంటా, సర్. 219 00:21:56,525 --> 00:21:59,736 అర్థమైంది. ఆత్మహత్య అనేది చాలా పెద్ద నేరం. 220 00:21:59,736 --> 00:22:02,698 - ఇది ఆత్మహత్య కాదు. - అది ఇప్పటికే చెప్పారు కదా. 221 00:22:02,698 --> 00:22:06,827 హా. అతను మనస్థాపానికి గురి కాలేదు. అలా చేసుకొనే ఆలోచన అతనికి ఉందని కూడా అనిపించలేదు. 222 00:22:06,827 --> 00:22:07,911 అతను ఆత్మహత్య చేసుకుంటాడని 223 00:22:07,911 --> 00:22:10,414 తెలిపేలా అతని భావావేశాల్లో హఠాత్తుగా ఏ మార్పులు రావడమూ నేను చూడలేదు... 224 00:22:10,414 --> 00:22:14,001 జనాలు భావావేశాలను చక్కగా దాచుకోగలరని మనందరమూ చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా. 225 00:22:14,501 --> 00:22:15,502 అతను మీకెలా తెలుసు? 226 00:22:17,462 --> 00:22:20,299 - జార్జ్... - ఇక్కడ అందరూ అందరికీ సుపరిచితులే. 227 00:22:21,008 --> 00:22:23,677 పైగా జార్జ్ చాలా సరదాగా ఉండే కంప్యూటర్ బాబు. 228 00:22:24,887 --> 00:22:26,346 అతనిది హత్య అని మీకెందుకు అనిపిస్తోంది? 229 00:22:26,346 --> 00:22:27,514 అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? 230 00:22:27,514 --> 00:22:28,640 నాకు తెలిసినదాని ప్రకారం, అతను... 231 00:22:28,640 --> 00:22:32,644 హత్యకు, కారణం, ఇంకా అవకాశం కావాలని తనకి చెప్పాను... 232 00:22:32,644 --> 00:22:34,771 హా, కానీ అవకాశం దొరికిందని చెప్తున్నా కదా. 233 00:22:34,771 --> 00:22:36,982 తెల్లవారు మూడు గంటలకు చావడమేంటి? 234 00:22:37,482 --> 00:22:39,359 మెట్లపై అప్పుడు ఎవరూ ఉండరు కదా? 235 00:22:41,403 --> 00:22:42,946 పోర్టర్లు తప్ప. 236 00:22:44,031 --> 00:22:45,407 లేదా దూకాలనుకొనేవాళ్లు తప్ప. 237 00:22:47,492 --> 00:22:48,869 డిశ్పాచ్ విభాగానికి వెళ్లు. 238 00:22:48,869 --> 00:22:51,496 ఈ సంఘటన జరిగినప్పుడు, మెట్లపై పోర్టర్లు ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. 239 00:22:51,496 --> 00:22:52,581 - అలాగే. - హా. 240 00:22:59,087 --> 00:23:01,381 గడియారం బాగుంది. అదేమైనా పురాతన వస్తువా? 241 00:23:02,591 --> 00:23:05,469 - ఇది చట్టబద్ధమైనదే. - బాగుందని మాత్రమే అన్నా. 242 00:23:07,971 --> 00:23:09,848 చూడండి, మీ సహోద్యోగి విషయంలో చింతిస్తున్నాను. 243 00:23:11,767 --> 00:23:14,436 అతని శవాన్ని నేను మళ్లీ పరిశీలిస్తాను. పెనుగులాటుకు సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయేమో చూస్తాను. 244 00:23:14,436 --> 00:23:15,521 సరే. 245 00:23:16,021 --> 00:23:19,274 అభ్యంతరం లేకపోతే ఓ సాయం చేయగలరా, నాకు కనిపించనివి, మీకు కనిపించే అవకాశం ఉందేమో. 246 00:23:20,192 --> 00:23:21,610 మీకు ఇష్టమైతేనే. 247 00:23:24,947 --> 00:23:27,950 అదేం లేదు. తప్పకుండా వస్తా. హా. 248 00:23:40,838 --> 00:23:43,423 అసాధారణంగా ఏదైనా జరిగిందా అనేది చూడాలి. 249 00:23:44,383 --> 00:23:49,137 పడిపోతే తగిలే గాయాలు కాకుండా, పెనుగులాటకు సంబంధించిన ఆధారాలు. 250 00:23:52,391 --> 00:23:54,226 - సిద్ధంగా ఉన్నారా? - హా. 251 00:24:07,030 --> 00:24:08,282 కొందరు... 252 00:24:09,324 --> 00:24:12,244 గతంలో చేసిన ఆత్మహత్యా ప్రయత్నాల్లో భాగంగా తన మణికట్టును కోసుకుంటారు. 253 00:24:14,830 --> 00:24:16,498 కానీ పక్కాగా చావాలనే ఉద్దేశంతో... 254 00:24:18,792 --> 00:24:20,294 ఎత్తు నుండి దూకుతారు. 255 00:24:26,258 --> 00:24:29,261 ఇన్నేళ్ల అనుభవం ఉన్నా కానీ, శవాన్ని చూస్తే నేను తట్టుకోలేను. 256 00:24:30,762 --> 00:24:32,222 - మీరెప్పుడైనా... - శవాన్ని చూశానా అనేనా? చూశా. 257 00:24:32,222 --> 00:24:33,599 నాకు 12 ఏళ్లున్నప్పుడు మా అన్నయ్య శవాన్ని. 258 00:24:33,599 --> 00:24:37,227 నాకు 13 ఏళ్లున్నప్పుడు మా అమ్మ శవాన్ని. కానీ అది మీకు తెలుసు, కాబట్టి... 259 00:24:39,938 --> 00:24:42,191 ఎవరైనా హత్య అంటే, దాన్ని దర్యాప్తు చేయాలి. 260 00:24:42,191 --> 00:24:44,401 అలా వాళ్లు ఎందుకు అన్నారో తెలుసుకోవాలి... 261 00:24:44,401 --> 00:24:46,361 ఎందుకంటే, అతడిని హత్య చేశారు. అదే కారణం. 262 00:24:47,279 --> 00:24:50,741 కానీ మీ గతాన్ని బట్టి చూస్తే, అది ఆత్మహత్య అని మీకు నమ్మాలని లేదు. 263 00:24:51,241 --> 00:24:53,327 అది నేను అర్థం చేసుకోగలను. 264 00:24:56,413 --> 00:24:57,414 కొత్తగా ఏమైనా తెలిసిందా? 265 00:24:58,707 --> 00:24:59,833 లేదు. 266 00:25:00,501 --> 00:25:01,919 డిశ్పాచ్ వాళ్లు ఏమన్నారు? 267 00:25:02,544 --> 00:25:05,047 పోర్టర్లకి పనేం లేదు అన్నారు. పైకి కానీ, కిందికి కానీ ఎవరూ వెళ్లలేదట. 268 00:25:05,047 --> 00:25:06,840 - జ్యుడిషియల్ శాఖ వాళ్లు వస్తున్నారు. - సరే. 269 00:25:06,840 --> 00:25:09,134 ఆత్మహత్య అయ్యుండే అవకాశం గల ఈ సంఘటన గురించి సమాచారం కావాలట. 270 00:25:09,134 --> 00:25:12,137 మీరు చుట్టుపక్కల విచారించండి. 271 00:25:12,846 --> 00:25:14,681 మెట్లపై ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. 272 00:25:15,265 --> 00:25:16,433 సరే. 273 00:25:24,024 --> 00:25:25,359 తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? 274 00:25:25,984 --> 00:25:26,985 వద్దు. 275 00:25:30,280 --> 00:25:32,241 మీకు, జార్జ్ కి మధ్య ఎంత కాలం నుండి సంబంధం నడుస్తోంది? 276 00:25:34,368 --> 00:25:35,827 నేను ఎవరికీ చెప్పను. 277 00:25:36,537 --> 00:25:38,497 మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 278 00:25:39,831 --> 00:25:41,333 మీకు అనుమతి ఎందుకు లభించలేదు? 279 00:25:46,463 --> 00:25:47,464 ఎందుకు లభించలేదు? 280 00:25:49,174 --> 00:25:50,759 చూడండి, ఏం జరిగిందో మనకి తెలియాలంటే, 281 00:25:50,759 --> 00:25:52,386 మీరు నాకు నిజం చెప్పాల్సి ఉంటుంది. 282 00:25:52,386 --> 00:25:54,263 హత్య జరిగిందని చెప్పడానికి మీరు నా డెప్యూటీ దగ్గరికి వెళ్లారంటే, 283 00:25:54,263 --> 00:25:56,306 మీరు సహాయం కోసమే కదా వెళ్లారు? 284 00:25:57,015 --> 00:25:58,642 అతను ఆత్మహత్య చేసుకోలేదు. 285 00:25:59,351 --> 00:26:00,602 సరే. 286 00:26:03,981 --> 00:26:05,607 నేను జ్యుడిషియల్ వాళ్లని కలవడానికి వెళ్తాను. 287 00:26:09,152 --> 00:26:10,988 జూలియా, తెలియకపోవడం అనేది, 288 00:26:12,573 --> 00:26:14,408 మిమ్మల్ని జీవితాంతం వేధిస్తుంది. 289 00:26:19,955 --> 00:26:21,540 అతను నాకు ఒకటి వదిలి వెళ్లాడు. 290 00:26:23,333 --> 00:26:24,626 ఏంటి? 291 00:26:24,626 --> 00:26:28,964 మీరు షెరిఫ్, నేనేమో షెరిఫ్ ని కాదు, 292 00:26:28,964 --> 00:26:32,134 కాబట్టి జ్యుడిషియల్ వాళ్లకి నా గురించి మీరు చెప్పరని నాకు మాట ఇవ్వండి. 293 00:26:32,134 --> 00:26:33,218 అది పురాతన వస్తువా? 294 00:26:34,261 --> 00:26:36,096 ఒకవేళ అదే అయితే, దాన్ని నేను జప్తు చేసుకోవాల్సి ఉంటుంది. 295 00:26:40,058 --> 00:26:41,852 లేదు, నాకు అతనేమీ వదిలి వెళ్లలేదు. 296 00:26:42,394 --> 00:26:43,395 మీకు చూపించడానికి ఏమీ లేదు. 297 00:26:45,355 --> 00:26:47,107 కానీ నిజంగా ఎక్కడ చూశానో నేను చెప్పను కదా? 298 00:26:49,818 --> 00:26:51,028 సైలో చాలా పెద్ద ప్రదేశం. 299 00:27:24,645 --> 00:27:25,687 ఏంటిది? 300 00:27:26,813 --> 00:27:28,065 నాకు తెలీదు. 301 00:27:28,065 --> 00:27:31,068 బహుశా నీకు తుది వీడ్కోలు చెప్పడానికి ఇది ఇచ్చాడేమో. 302 00:27:35,864 --> 00:27:37,199 దానితో పాటు ఈ చీటీని కూడా పెట్టాడు. 303 00:27:41,328 --> 00:27:42,538 మిగతా ముక్క ఏది? 304 00:27:42,538 --> 00:27:44,122 అంతే ఉంది. నాకు తెలీదు. 305 00:27:46,124 --> 00:27:49,294 "చివరిసారి ఇది చూసినప్పుడు ఎక్కడ ఉన్నావో గుర్తుందా?" 306 00:27:55,676 --> 00:27:58,762 ఇప్పుడు నేను మీకు చూపబోయేది పురాతన వస్తువు కన్నా చాలా పెద్ద చట్టవిరుద్ధమైనది. 307 00:27:59,429 --> 00:28:02,641 పైన అంతస్థుల్లో ఉన్న వారికి దీని గురించి తెలిసే ఉంటుంది, కానీ ఎవరూ పట్టించుకుంటున్నట్లుగా లేదు. 308 00:28:03,225 --> 00:28:04,810 నేను కూడా పైన అంతస్థుల్లో ఉండేవాడినే, 309 00:28:05,602 --> 00:28:07,437 కానీ మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు తెలీదు. 310 00:28:10,274 --> 00:28:11,650 {\an8}ఈ ప్రదేశం దాటి ముందుకు వెళ్లరాదు 311 00:28:11,650 --> 00:28:13,819 {\an8}ఒప్పందం ఉల్లంఘించినట్టుగా పరిగణించబడి శిక్ష విధించడం జరుగుతుంది 312 00:28:16,655 --> 00:28:18,198 మన మధ్య ఒప్పందం దీనికి కూడా వర్తిస్తుంది కదా? 313 00:28:18,949 --> 00:28:19,950 హా. 314 00:28:22,619 --> 00:28:23,787 సరే మరి. 315 00:28:33,672 --> 00:28:35,632 మీకు చీకటి అంటే భయం లేదు కదా. 316 00:28:39,428 --> 00:28:40,888 లేదా ఇరుకుగా ఉండే ప్రదేశాలన్నా. 317 00:28:42,806 --> 00:28:43,807 లేదా ఎత్తులన్నా. 318 00:29:13,962 --> 00:29:16,006 {\an8}- ఇదంతా ఎవరి పని? - నాకు తెలీదు. 319 00:29:16,715 --> 00:29:18,467 తిరుగుబాటుకు ముందు జరిగిందని అనుకుంటున్నాం మేము. 320 00:29:22,221 --> 00:29:24,515 హేయ్, జాగ్రత్త. 321 00:29:28,268 --> 00:29:30,812 - కింద ఏముంది? - మీరే చూస్తారుగా. 322 00:30:12,187 --> 00:30:13,188 థ్యాంక్స్. 323 00:30:15,399 --> 00:30:19,236 ఒకానొకప్పుడు ఇక్కడ సుమారుగా 100 వర్క్ లైట్స్ ఉండేవేమో. 324 00:30:20,070 --> 00:30:23,115 ఇప్పుడు ఇవే మిగిలాయి. 325 00:30:25,242 --> 00:30:26,451 అదేంటి? 326 00:30:26,451 --> 00:30:29,746 శిథిలావస్థలో ఉన్న, సైలోని తవ్విన యంత్రం అని అనుకుంటున్నా. 327 00:30:29,746 --> 00:30:33,584 ఒక సిద్ధాంతం ప్రకారం, ఆ యంత్రం తవ్వుకుంటూ ఇంత కిందికి వచ్చింది, 328 00:30:33,584 --> 00:30:35,460 దీన్ని బయటకు తీసుకురావడం కష్టం అయింది, 329 00:30:35,460 --> 00:30:41,258 కాబట్టి, పితామహులు దాని చుట్టూ ముప్పై అడుగుల కాంక్రీటుతో గోడలు కట్టేశారు. 330 00:30:42,885 --> 00:30:47,222 ఆ యంత్రం సుమారుగా ఒక వంద సంవత్సరాల నుండి ఇలాగే ఉండుంటుంది. 331 00:30:47,806 --> 00:30:50,267 విలువైన వాటన్నింటినీ ఎప్పుడో తీసేసుకొని ఉంటారు. 332 00:30:51,977 --> 00:30:53,937 నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు, 333 00:30:54,438 --> 00:30:57,274 సైలో గురించి నాకు చాలా, చాలా తక్కువ తెలుసని అర్థమైంది. 334 00:31:00,819 --> 00:31:01,904 సిద్ధంగా ఉన్నారా? 335 00:31:05,240 --> 00:31:07,242 కింద చూడకుండా ఉంటే మంచిది. 336 00:31:14,416 --> 00:31:15,334 మీరు బాగానే ఉన్నారా? 337 00:32:00,462 --> 00:32:01,880 అసలేంటి ఈ ప్రదేశం? 338 00:32:02,422 --> 00:32:03,590 జార్జ్. 339 00:32:04,174 --> 00:32:05,759 అతను అంతా క్రమపద్ధతిలో సెట్ చేశాడు. 340 00:32:10,055 --> 00:32:13,141 చివరిసారిగా నేను దీన్ని చూసినప్పుడు, అది ఇక్కడ ఉండింది. 341 00:32:19,231 --> 00:32:20,357 ఈ పెట్టెలో ఉండింది. 342 00:32:29,116 --> 00:32:32,828 ఇవన్నీ ఉన్నాయి కాబట్టే, మా బంధాన్ని అతను రహస్యంగా ఉంచమని చెప్పాడు. 343 00:32:32,828 --> 00:32:36,206 ఒకవేళ అతను దొరికిపోతే, నేను అందులో ఇరుక్కుపోకూడదని అతని ఆలోచన. 344 00:32:37,624 --> 00:32:39,001 ఇవన్నీ పురాతన వస్తువులా? 345 00:32:40,252 --> 00:32:41,253 హా. 346 00:32:44,298 --> 00:32:45,549 ఏమో మరి... 347 00:32:47,217 --> 00:32:48,468 దీన్ని చూడటం ఇదే మొదటిసారి. 348 00:32:50,470 --> 00:32:52,264 బహుశా దీన్ని నువ్వు చూడాలని అనుకున్నాడేమో? 349 00:32:52,264 --> 00:32:53,432 ఇదేంటో అస్సలు తెలీదు. 350 00:33:00,731 --> 00:33:04,651 అయితే, జార్ద్ పురాతన వస్తువులను అమ్మడం, వాటితో వ్యాపారం చేసేవాడా? 351 00:33:04,651 --> 00:33:06,862 అవును. తిరుగుబాటుకు ముందు కాలానికి చెందిన వస్తువులంటే అతనికి పిచ్చి. 352 00:33:06,862 --> 00:33:09,948 ఒక్కడే ఇక్కడికి వచ్చి, ఒక వస్తువు కోసం వెతికేవాడు. 353 00:33:09,948 --> 00:33:12,117 - ఏ వస్తువు కోసం? - ఏమో. నాకెప్పుడూ చెప్పలేదు. 354 00:33:12,117 --> 00:33:13,952 చూస్తే తెలిసిపోతుందని అనేవాడు. 355 00:33:16,955 --> 00:33:17,873 అది వింతగా ఉందే. 356 00:33:19,291 --> 00:33:22,586 ఈ ప్లాస్టీక్ వైరు, సిలిండర్ చుట్టూ ఉండాల్సిన వైరు. 357 00:33:31,970 --> 00:33:33,639 ఒక్క నిమిషం. ఆగండి. 358 00:34:18,100 --> 00:34:19,141 ఏంటిది? 359 00:34:53,552 --> 00:34:54,553 ఏంటది? 360 00:34:59,183 --> 00:35:00,559 వీటిని మీరు ఇంతకు ముందు చూశారా? 361 00:35:01,268 --> 00:35:02,269 లేదు. 362 00:35:03,937 --> 00:35:06,398 వీటి గురించి అతను మీకెప్పుడూ చెప్పలేదా? వీటిలో ఏం ఉండవచ్చు అని ఏమైనా? 363 00:35:06,398 --> 00:35:07,482 లేదు. 364 00:35:10,903 --> 00:35:14,031 "తొలగించబడిన ఫైళ్ళను రికవర్ చేయడం ఎలాగో తెలిపే సూచనలు." 365 00:35:17,868 --> 00:35:19,870 వెనుక పక్క ఏదో రాసుంది. 366 00:35:20,746 --> 00:35:22,206 ఇది జార్జ్ చేతి రాత కాదు. 367 00:35:24,666 --> 00:35:25,792 ఇది నా భార్య చేతి రాత. 368 00:35:28,754 --> 00:35:30,380 మీ భార్యకు జార్జ్ ఎవరో తెలుసా? 369 00:35:30,923 --> 00:35:33,842 అతనికి కంప్యూటర్ సంబంధించిన పని ఏదో ఉంటే, అది ఆలిసన్ చేసింది. తను బయటకు వెళ్లక ముందు. 370 00:35:36,136 --> 00:35:38,013 మరి మీరు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? 371 00:35:42,226 --> 00:35:44,520 జార్జ్, ఇంకా మీ భార్య... 372 00:35:46,230 --> 00:35:47,689 మీరు అతనితో మాట్లాడారా? 373 00:35:47,689 --> 00:35:48,899 ఒకసారి మాట్లాడాను. 374 00:35:53,654 --> 00:35:55,489 అయ్య బాబోయ్. గడియారం. 375 00:35:57,324 --> 00:35:58,700 మీరు దాన్ని ఇంతకు ముందే చూశారు కదా? 376 00:35:58,700 --> 00:36:00,536 అందుకే మీరు అతని మణికట్టులని పరిశీలించారు. 377 00:36:01,411 --> 00:36:05,207 మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని మీకు తెలిసింది అలాగే. 378 00:36:06,750 --> 00:36:08,836 అందుకే మీరు ఇక్కడికి వచ్చారా? 379 00:36:08,836 --> 00:36:11,213 మీ భార్య శుభ్రం చేయడానికి వెళ్లడానికి, నాకు ఏదైనా సంబంధం ఉందేమో తెలుసుకోవడానికా? 380 00:36:11,213 --> 00:36:13,090 జార్జ్ ఎందుకు చనిపోయాడో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. 381 00:36:13,090 --> 00:36:15,592 అబద్ధం! మీ భార్య శుభ్రం చేయడానికి బయటకు వెళ్లడానికి, జార్జ్ కి ఏదైనా సంబంధం ఉందేమో 382 00:36:15,592 --> 00:36:18,011 తెలుసుకోవాలనే మీరు అనుకుంటున్నారు. 383 00:36:18,011 --> 00:36:20,764 జ్యుడిషియల్ శాఖకు అతని మరణం ప్రమాదవశాత్తు జరిగిందని నేను చెప్పాల్సి ఉంటుంది. 384 00:36:20,764 --> 00:36:23,976 ఎందుకు? ఎందుకలా చెప్పడం? అతను హత్యకు గురయ్యాడు! 385 00:36:23,976 --> 00:36:26,061 - ఎవరు హత్య చేశారు? - అది నాకు తెలీదు! 386 00:36:26,061 --> 00:36:28,313 జార్జ్ ఇది దాచిపెట్టడానికి, ఒక బలమైన కారణమే ఉంది. 387 00:36:28,313 --> 00:36:31,233 అతడిని ఎందుకు చంపారో, బహుశా... ఇదే మనకు చెప్పవచ్చు. 388 00:36:31,233 --> 00:36:33,068 ఒక తొక్కలో హార్డ్ డ్రైవును అతను ఎందుకు దాచాడో నాకు తెలీదు. 389 00:36:33,068 --> 00:36:37,239 ఇది చాలా ప్రమాదకరమైన పురాతన వస్తువు, దీని వల్ల సైలోలోని శాంతిభద్రతలకు ముప్పు ఉంది. 390 00:36:37,239 --> 00:36:41,034 సైలోలోని శాంతిభద్రతలు ఏమైతే నాకేంటి! మీరు మీ పని చేయండి! 391 00:36:41,034 --> 00:36:43,120 సైలోలోని శాంతిభద్రతలను పరిరక్షించడం కూడా నా పనే. 392 00:36:43,120 --> 00:36:44,788 మరి నిజాన్ని కనిపెట్టడం మీ పని కాదా? 393 00:36:44,788 --> 00:36:48,292 ఇతరులెవరూ దీన్ని చూడకముందే దీన్ని నేను తగలబెట్టేస్తాను. 394 00:36:48,292 --> 00:36:49,960 - వద్దు. - ఇక చాలు! 395 00:36:52,212 --> 00:36:56,675 మీ భార్య మాటను మీరు వినుంటే, ఈపాటికి తను బతికే ఉండేదేమో! 396 00:37:02,222 --> 00:37:06,894 నా ఆఫీసుకు చేరుకోవడానికి నేను క్యాంటిన్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. 397 00:37:07,895 --> 00:37:10,856 కాబట్టి, ఇప్పుడు నేను సూర్యోదయానికి ముందే ఆఫీసుకు వెళ్లిపోతున్నాను, 398 00:37:10,856 --> 00:37:12,566 చీకటి పడ్డాకే ఇంటికి తిరిగి వెళ్తున్నాను, 399 00:37:12,566 --> 00:37:15,068 ఆ గుట్ట మీద తన శవం కనిపించకూడదు అనే ఒకే ఒక్క కారణంతో అలా చేస్తున్నా. 400 00:37:17,154 --> 00:37:19,531 ఆలిసన్ కూడా ఎన్నో ప్రశ్నలు అడిగింది. 401 00:37:25,704 --> 00:37:27,206 తను ఎప్పుడూ భయపడలేదు. 402 00:37:27,831 --> 00:37:30,125 అయితే... దయచేసి... 403 00:37:31,710 --> 00:37:32,711 నాకు సాయపడండి. 404 00:37:41,803 --> 00:37:43,555 జార్జ్ కి ఏం జరిగిందో నేను కనుగొనే ప్రయత్నం చేస్తూనే ఉంటా, 405 00:37:43,555 --> 00:37:46,975 కానీ మీరు ఏ హడావిడీ చేయకూడదు, అలాగే సమస్యలకు దూరంగా ఉండాలి. 406 00:37:46,975 --> 00:37:48,602 ఆ గడియారాన్ని ఇకపై వేసుకోవద్దు! 407 00:37:48,602 --> 00:37:51,605 అది చట్టబద్ధమైనదే కావచ్చు, కానీ అది అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. 408 00:37:52,898 --> 00:37:55,526 నాకు ఏమైనా దొరికితే, మీకు వర్తమానం పంపుతాను. 409 00:37:55,526 --> 00:37:56,610 ఒక సంకేతాన్ని అన్నమాట. 410 00:37:57,152 --> 00:37:58,278 మాటిస్తున్నా. 411 00:37:58,278 --> 00:37:59,446 సంకేతం అంటే? 412 00:37:59,446 --> 00:38:00,989 చూసినప్పుడు మీకే తెలుస్తుందిలే. 413 00:38:01,490 --> 00:38:03,116 వేచి ఉండే సమయంలో నేను చేయగలిగింది ఏమైనా ఉందా? 414 00:38:03,116 --> 00:38:05,202 ముందు ఇదేంటో నేను కనిపెట్టాలి, 415 00:38:05,202 --> 00:38:08,747 మీరు నన్ను నమ్మాలి. 416 00:38:12,292 --> 00:38:13,502 సరే. 417 00:38:15,170 --> 00:38:17,464 తన భార్య మాటని అతను వినుంటే, ఆమె బతికే ఉండేది అని 418 00:38:17,464 --> 00:38:18,841 నువ్వు నిజంగానే అతనితో చెప్పావా? 419 00:38:19,675 --> 00:38:21,802 అలా చెప్పి కూడా, ఇంకా అతని నుండి ఏ వర్తమానమూ అందలేదే అని ఆలోచిస్తున్నావు. 420 00:38:23,554 --> 00:38:26,223 జూల్స్, ఈ విషయాన్ని నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. 421 00:38:26,723 --> 00:38:31,144 - నన్ను వేచి ఉండమని చెప్పాడు, అదే నేను చేశా. - కానీ నీకు వర్తమానం కానీ, సంకేతం కానీ అందలేదు. 422 00:38:33,730 --> 00:38:36,650 నువ్వు ఆశగా ఎదురుచూస్తున్న సమాధానాలు ఇంకా నీకు దక్కనందుకు చింతిస్తున్నా, 423 00:38:36,650 --> 00:38:38,944 కానీ నువ్వు ఇవాళ్టికి ఇక విశ్రమిస్తే మేలేమో. 424 00:38:38,944 --> 00:38:43,198 ఏదైనా చేయ్. దృష్టి మరల్చుకో. 425 00:38:44,408 --> 00:38:45,868 బహుశా నేను నా దృష్టిని దాని మీదనే పెట్టాలేమో. 426 00:38:48,203 --> 00:38:49,955 నేను షెరిఫ్ కి మొత్తం చూపలేదు. 427 00:38:59,590 --> 00:39:01,633 జార్జ్ నాకోసం వదిలి వెళ్లిన చీటీలోని కింది భాగాన్ని చూపలేదు. 428 00:39:01,633 --> 00:39:03,886 "నాకు కావాల్సింది దొరికింది." 429 00:39:03,886 --> 00:39:06,138 దీన్ని షెరిఫ్ కి ఎందుకు చూపించలేదు? 430 00:39:06,138 --> 00:39:08,223 తను దేని కోసమైతే వెతుకుతున్నాడో, అది పురాతన వస్తువు కన్నా 431 00:39:08,223 --> 00:39:10,058 చాలా ప్రమాదకరమైనదని జార్జ్ నాతో చెప్పాడు. 432 00:39:10,559 --> 00:39:13,353 దాని గురించి నాకు తెలిసినా, నన్ను బయటకు పంపించేస్తారేమో అని అతని భయం. 433 00:39:13,353 --> 00:39:15,230 ఇంతకీ అతను దేని కోసం వెతుకుతూ ఉన్నాడు? 434 00:39:17,316 --> 00:39:19,151 జూల్స్, ఇది ప్రమాదకరంగా మారుతోంది. 435 00:39:24,031 --> 00:39:24,907 అవును. 436 00:39:26,658 --> 00:39:27,868 దీన్ని నేను తర్వాత బాగు చేస్తాను. 437 00:39:28,744 --> 00:39:29,953 వద్దు. 438 00:39:29,953 --> 00:39:31,580 హా, అలాగే. 439 00:39:35,000 --> 00:39:36,001 సరే. 440 00:39:37,294 --> 00:39:38,295 హేయ్. 441 00:39:39,546 --> 00:39:41,715 కింద, నీ ప్రాణం పోకుండా చూసుకో. 442 00:39:43,634 --> 00:39:44,635 సరే. 443 00:39:53,060 --> 00:39:55,729 ల్యాండింగ్ ప్రదేశాల్లో ఆగడం కానీ, ఊరికే తిరగడం కానీ చేయరాదు 444 00:39:55,729 --> 00:39:57,940 షెరిఫ్ విషయంలో జడ్జ్ కొందరిని సూచించింది. 445 00:39:58,440 --> 00:39:59,775 నలుగురూ అంతంత మాత్రం అభ్యర్థులే, 446 00:39:59,775 --> 00:40:02,319 షెరిఫ్ గా తనకు కావలసిన వ్యక్తి పైకి మన దృష్టి మరల్చడానికి తను ఆ పేర్లు చెప్పింది. 447 00:40:03,445 --> 00:40:06,073 - పాల్ బిల్లింగ్స్. - నాకు అతను గుర్తున్నాడు. అతను డెప్యూటీగా పని చేశాడు. 448 00:40:06,073 --> 00:40:07,157 హా, మధ్య అంతస్థుల్లో చేసేవాడు. 449 00:40:07,157 --> 00:40:09,910 అతను మంచి వాడే, కానీ జ్యుడిషియల్ శాఖలో చేరడానికి డెప్యూటీ పదవిని వదులుకొని వెళ్లిపోయాడు. 450 00:40:09,910 --> 00:40:11,995 పెళ్ళయింది, ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని అలా చేశాడు. 451 00:40:11,995 --> 00:40:15,249 నిజం చెప్పాలంటే, పాల్ బిల్లింగ్స్ అంత చెత్త అభ్యర్థేమీ కాదు. 452 00:40:15,249 --> 00:40:17,334 నాకు అంతంత మాత్రం వాళ్లు వద్దు. 453 00:40:17,334 --> 00:40:20,629 ఆ తలుపు గుండా ఎవరోకరు వచ్చి, సాయుధ అల్లరి మూక మెట్లు ఎక్కి వస్తున్నారని 454 00:40:20,629 --> 00:40:23,507 ఎవరైనా వచ్చి చెప్తారేమో అని, ప్రతి నిమిషం చస్తున్నా నేను. 455 00:40:23,507 --> 00:40:26,677 అలాగే 140 ఏళ్ళ శాంతి చెల్లాచెదురైపోతుందేమో అని కంగారు పడిపోతున్నా. 456 00:40:27,511 --> 00:40:30,389 నాకు తర్వాత వచ్చే ఆలోచన ఏంటో తెలుసా, దీని గురించి హాల్స్టన్ తో మాట్లాడాలి అని. 457 00:40:30,389 --> 00:40:33,642 హా, నేను కూడా దాని గురించే రోజుకు పది సార్లు అయినా ఆలోచిస్తా. 458 00:40:34,434 --> 00:40:36,645 ఆ పదవి ఫలానా వ్యక్తికి ఇవ్వండి అని అతను చెప్పుంటే బాగుండు. 459 00:40:38,313 --> 00:40:39,690 అతను చెప్పాడు కూడా. 460 00:40:43,944 --> 00:40:46,530 - ఒక చీటీలో రాసి పెట్టాడు. - ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? 461 00:40:46,530 --> 00:40:48,782 ఎందుకంటే, అది భలే కామెడీగా ఉంటుంది, 462 00:40:48,782 --> 00:40:52,119 చివర్లో అతని మానసిక పరిస్థితి బాగాలేదని అది చెప్పకనే చెప్తుంది. 463 00:40:52,703 --> 00:40:55,289 - ఇంతకీ అతను ఎవరిని ఎంపిక చేశాడు? - ముందు నువ్వు గుండె దిటువు చేసుకోవాలి. 464 00:40:58,625 --> 00:41:02,504 "షెరిఫ్ గా నా ఆఖరి చర్యగా, హాల్స్టన్ బెకర్ అనే నేను, 465 00:41:02,504 --> 00:41:06,758 జూలియా నికల్స్ ని నా వారసురాలిగా నామినేట్ చేస్తున్నాను." 466 00:41:06,758 --> 00:41:08,844 - జూలియా నికల్స్? - తను ఒక ఇంజినీర్. 467 00:41:09,803 --> 00:41:12,139 "ఆమె అందుకు ఒప్పుకోకపోయినా, నా వ్యక్తిగత ప్రాపర్టీ అయిన ఈ బ్యాడ్జీని 468 00:41:12,139 --> 00:41:14,892 తనకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హాల్స్టన్ బెకర్." 469 00:41:15,475 --> 00:41:16,351 ఆమే ఎందుకు? 470 00:41:16,351 --> 00:41:19,771 చెప్పాను కదా, చివరికి వచ్చేసరికి, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని. 471 00:41:20,856 --> 00:41:21,982 నేను తనని కలవాలనుకుంటున్నా. 472 00:41:22,482 --> 00:41:23,692 పక్కాగా చెప్తున్నావా? 473 00:41:24,610 --> 00:41:26,778 కలవాలని ఉంది అన్నా, ఆ ఉద్యోగం ఇస్తానని అనలేదు. 474 00:41:26,778 --> 00:41:28,739 నేను తనకి సందేశం పంపి, పైకి వచ్చే పని రేపే ప్రారంభం చేయమని చెప్తా. 475 00:41:29,489 --> 00:41:31,408 లేదు. నేనే తన దగ్గరికి వెళ్తాను. 476 00:41:31,408 --> 00:41:33,619 అవునా? 144 అంతస్థులు ఉన్నాయి. 477 00:41:34,578 --> 00:41:36,872 శుభ్రం చేయడానికి ఈ మధ్యనే ఒక షెరిఫ్ ని పంపాను. 478 00:41:37,831 --> 00:41:41,168 సైలోలో నేను నడుస్తూ తిరిగితే మేలు. జనాలు, తమ మేయరును చూడాలి కదా. 479 00:42:18,247 --> 00:42:19,790 నీ దగ్గర చాలా పెద్ద తాడు ఉందే. 480 00:42:21,458 --> 00:42:22,584 అవును. 481 00:42:24,336 --> 00:42:25,671 ఎందుకు? 482 00:42:27,506 --> 00:42:28,924 నేను వెళ్లాల్సిన చోటుకు వెళ్లాలంటే, అది కావాల్సిందే. 483 00:42:29,550 --> 00:42:30,759 సరే. ఇంతకీ ఆ చోటు ఎక్కడ? 484 00:42:32,761 --> 00:42:33,846 గతంలోకి. 485 00:42:34,972 --> 00:42:36,014 గతంలోనా? 486 00:42:39,184 --> 00:42:40,602 ఇంతకీ దేని కోసం వెతుకుతున్నావు? 487 00:42:40,602 --> 00:42:43,230 నేను దేని కోసం వెతుకుతున్నాను అనేది, నేను కనిపెట్టినదానితో పోల్చితే, అసలు ముఖ్యమైనదే కాదు. 488 00:42:44,898 --> 00:42:46,275 అది నువ్వే. 489 00:42:46,859 --> 00:42:48,861 వావ్. దరిద్రుడా. 490 00:42:50,445 --> 00:42:52,281 నిజంగా అడుగుతున్నా, దేని కోసం వెతుకుతున్నావో చెప్పు. 491 00:42:53,365 --> 00:42:54,908 అది దొరికాక చెప్తాలే. 492 00:42:54,908 --> 00:42:57,995 - చెప్పు. చెప్పు. - నా మీద నుండి లేయ్... సరే, సరే. 493 00:42:59,705 --> 00:43:00,873 అది ఒక ద్వారం అనుకుంటా. 494 00:43:05,169 --> 00:43:06,336 ద్వారమా? 495 00:43:07,838 --> 00:43:08,964 ద్వారం అంటే? 496 00:43:10,007 --> 00:43:12,926 దాన్ని నేను ఒక పాత చిత్రంలో చూశాను. 497 00:43:12,926 --> 00:43:15,053 అది చిన్న సొరంగం చివర్లో ఉంటుంది. 498 00:43:15,053 --> 00:43:18,140 దాన్ని తెరిస్తే ఏముంటుంది? అసలు అది నిజమైనదే అని నీకెందుకు అనిపిస్తుంది? 499 00:43:18,140 --> 00:43:20,100 నాకు తెలీదు. అందుకే నేను దాన్ని కనిపెట్టాలి. 500 00:43:20,100 --> 00:43:22,853 అది అడుగున ఎక్కడో ఉంది. 501 00:43:24,313 --> 00:43:25,647 అడుగున అంటావా? 502 00:43:26,148 --> 00:43:28,901 కింద నీళ్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఉన్నాయి. 503 00:43:28,901 --> 00:43:30,819 ఎవరైనా ద్వారాన్ని అడుగున ఎందుకు పెడతారు? 504 00:43:30,819 --> 00:43:34,239 - నీకు నీళ్లంటే భయమని నాకు తెలుసు. - అవును, నాకు భయమే, జార్జ్. 505 00:43:34,239 --> 00:43:36,325 ఎందుకంటే, నీటిలో మునిగితే, ఊపిరి ఆడదు. 506 00:43:36,325 --> 00:43:38,827 ఒకవేళ నువ్వు పట్టుతప్పి తాడు నుండి పడిపోతే? 507 00:43:38,827 --> 00:43:41,121 మళ్లీ నువ్వు పైకి లేవలేకపోతే? ఒకవేళ... 508 00:43:41,121 --> 00:43:42,372 నేను జాగ్రత్తగా ఉంటా. 509 00:43:46,168 --> 00:43:47,586 సరే, నాకు ఒక మాట ఇవ్వు. 510 00:43:49,755 --> 00:43:51,006 నువ్వు కిందికి దిగాలని అనుకుంటే, 511 00:43:51,006 --> 00:43:54,801 నాకు నువ్వు తిరిగి పైకి వచ్చే దాకా ఆ విషయం చెప్పకు. 512 00:43:56,470 --> 00:43:57,596 సరేనా? 513 00:44:00,140 --> 00:44:01,350 సరే. 514 00:44:02,935 --> 00:44:04,061 సరే. 515 00:45:09,793 --> 00:45:10,794 సరే మరి. 516 00:46:17,528 --> 00:46:18,403 అయ్యో! 517 00:46:23,325 --> 00:46:24,326 ఛ. 518 00:47:37,733 --> 00:47:39,735 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్