1 00:00:11,178 --> 00:00:12,554 ఎక్కడికి వెళ్తున్నాము? 2 00:00:13,138 --> 00:00:17,226 వచ్చేశాం, పాపా. ఇటు పద. 3 00:00:22,689 --> 00:00:24,274 సమయానికి వస్తావు అన్నావుగా. 4 00:00:26,026 --> 00:00:27,027 అదీగాక ఒంటరిగా వస్తానన్నావు. 5 00:00:27,027 --> 00:00:28,946 నా కూతురు ఎవరికీ చెప్పదు. 6 00:00:29,655 --> 00:00:32,073 ఇవి తీసుకోవడానికి నాకు వేరొకరు దొరికితే తప్ప. 7 00:00:42,000 --> 00:00:44,670 నువ్వు పట్టుబడితే, అది నీకే దొరికిందని చెప్తా. 8 00:00:45,254 --> 00:00:46,380 ఎవరూ పట్టుబడరులే. 9 00:00:46,380 --> 00:00:49,842 అంత నమ్మకం పనికిరాదు. ఎప్పుడూ సైలోదే పైచేయి అవుతుంది. 10 00:01:06,441 --> 00:01:07,526 నేను మోయగలను. 11 00:01:09,069 --> 00:01:10,612 సరే. 12 00:01:12,030 --> 00:01:13,115 నా కోసం కుందేలు తెచ్చావా? 13 00:01:14,366 --> 00:01:15,993 ఇది పెంపుడు జంతువు కాదు, సరేనా? 14 00:01:18,036 --> 00:01:21,957 - మనం దీన్ని తినం కదా. - అవును, తినం. 15 00:01:23,792 --> 00:01:25,961 ఇది అస్సలు కదలట్లేదు. దీనికి బాగాలేదు అనుకుంటా. 16 00:01:27,129 --> 00:01:28,463 అదే అసలు విషయం, పాపా. 17 00:01:51,195 --> 00:01:52,696 మనం ఇక్కడికి వచ్చింది పిల్లల కోసం కాదు. 18 00:02:03,373 --> 00:02:04,750 వద్దు. 19 00:02:05,834 --> 00:02:07,336 ఎక్కువ సేపు పట్టదులే. 20 00:02:07,336 --> 00:02:09,170 కానివ్వు, నాకు నిద్ర వస్తోంది. 21 00:02:09,170 --> 00:02:10,380 తెలుసు. 22 00:02:10,380 --> 00:02:12,049 నేను ఇక్కడ ఉండలేను. 23 00:02:13,425 --> 00:02:14,510 మిస్ హిల్డర్ బ్రాండ్. 24 00:02:29,942 --> 00:02:32,444 నా ఏజెంట్లతో మీరు పెద్దగా సహకరించలేదు. 25 00:02:41,036 --> 00:02:44,248 నాకు సహకరిస్తారనే అనుకుంటున్నా, గ్లొరియా. 26 00:02:47,376 --> 00:02:50,003 నువ్వు సెక్యూరిటీ మనిషివి. 27 00:02:51,255 --> 00:02:53,090 నీ భార్యకు గర్భస్రావం అయింది. 28 00:02:53,590 --> 00:02:54,842 మీ జ్ఞాపక శక్తి బాగానే పని చేస్తోంది. 29 00:02:56,093 --> 00:02:57,553 అది మంచి విషయమే. 30 00:02:57,553 --> 00:03:02,140 మీరిద్దరూ పిల్లల మీద ఆశలు వదులుకున్నారు, కానీ మీ లాటరీకి ఇంకా సమయం ఉండింది. 31 00:03:02,140 --> 00:03:04,685 అప్పుడు నేను నీకు కాస్త ఫో... 32 00:03:05,185 --> 00:03:07,646 - ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. - ఫోలిక్ యాసిడ్. అవును. 33 00:03:07,646 --> 00:03:10,274 ప్రతీరోజు రాత్రి ఆమె తాగే టీలో ఒక చుక్క వేయాలి. అది పని చేసిందా? 34 00:03:10,274 --> 00:03:12,609 వచ్చే నెలకు మా అబ్బాయికి అరేళ్లు నిండుతాయి. 35 00:03:17,364 --> 00:03:18,365 నాకు మీ సాయం కావాలి. 36 00:03:20,492 --> 00:03:23,161 మీరు నాతో సహకరించి, నాకు కావాల్సింది చెప్పినట్లయితే, 37 00:03:23,161 --> 00:03:26,874 మీ కలలకు మీరు దూరం కాకుండా స్వయంగా నేను చూసుకుంటాను. 38 00:03:28,458 --> 00:03:29,626 నీకు నేను సహకరించకపోతే? 39 00:03:31,211 --> 00:03:33,380 శుభ్రం చేయడానికి ముసలావిడని బయటకు పంపించేస్తావా? 40 00:03:34,006 --> 00:03:35,007 లేదు. 41 00:03:35,841 --> 00:03:37,551 తనకి ఏ మందులూ ఇవ్వకుండా ఈ గదిలోనే ఉంచేలా చేస్తా, 42 00:03:37,551 --> 00:03:41,305 ఆ తర్వాత ఆమె తన జీవితమంతా ఈ గోడలను చూస్తూ బతకాల్సి వస్తుంది. 43 00:03:42,973 --> 00:03:44,641 నేను నిన్ను ఎందుకు నమ్మాలి? 44 00:03:45,642 --> 00:03:48,562 ఎందుకంటే మీ వల్లే నాకు కొడుకు పుట్టాడు. 45 00:03:51,523 --> 00:03:54,359 మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచడం నాకేం సరదా కాదు. 46 00:03:55,068 --> 00:03:58,947 కానీ ఈ పరిస్థితి మీదనే సైలో భవిష్యత్తు ఆధారపడుంది. 47 00:03:59,823 --> 00:04:03,076 జూలియా నికల్స్ మిమ్మల్ని కలవడానికి వచ్చింది. 48 00:04:03,660 --> 00:04:05,245 ఆ వెంట్ నుండి ఏదో తీసుకుంది. 49 00:04:07,206 --> 00:04:08,957 అదేంటో చెప్పండి. 50 00:04:12,336 --> 00:04:13,337 ఒక సంచి. 51 00:04:14,296 --> 00:04:16,173 దాన్ని అక్కడ దాచింది షెరిఫ్ హాల్స్టనా? 52 00:04:18,884 --> 00:04:19,718 అవును. 53 00:04:20,636 --> 00:04:22,137 ఆ సంచిలో ఏముంది? 54 00:04:45,702 --> 00:04:48,622 తనకి మంచి మందులు వేయ్. ప్రతీ డోసు, ప్రతీ రోజు. 55 00:04:49,540 --> 00:04:51,458 తనని ఎవరైనా కలవాలనుకుంటే, నా అనుమతి తప్పనిసరిగా కావాలి. 56 00:04:52,042 --> 00:04:53,043 అలాగే, సర్. 57 00:04:57,798 --> 00:04:59,633 థ్యాంక్యూ, మిస్ హిల్డర్ బ్రాండ్. 58 00:05:00,926 --> 00:05:01,927 మీ సాయానికి. 59 00:05:04,263 --> 00:05:06,807 నువ్వు గెలుస్తావని నిజంగానే నీకు అనిపిస్తోందా? 60 00:05:10,894 --> 00:05:12,271 గెలవాలి, తప్పదు. 61 00:06:43,487 --> 00:06:45,531 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 62 00:07:06,385 --> 00:07:08,846 ఈ కింద ఉన్న మెట్ల మీద తను వెళ్లడం కెమెరాలలో రికార్డ్ అయింది, 63 00:07:08,846 --> 00:07:10,472 కానీ ఆ తర్వాత తను ఎటు వెళ్లిందో తెలీట్లేదు. 64 00:07:12,140 --> 00:07:14,184 మెడికల్ కింద నుండి ఉండే మెట్లపై కవరేజీ అంత బాగా ఉండదు. 65 00:07:14,184 --> 00:07:17,396 తను దొరికాక, బంధించండి. తన దగ్గర అత్యంత ప్రమాదకరమైన పురాతన వస్తువు ఉంది. 66 00:07:17,396 --> 00:07:19,273 దాన్ని ఎవరూ తాకకూడదని నీ బృందంలో వాళ్లకి చెప్పు. 67 00:07:19,273 --> 00:07:20,357 అలాగే, సర్. 68 00:07:49,845 --> 00:07:50,679 యాక్సెస్ తిరస్కరించబడింది 69 00:07:50,679 --> 00:07:52,431 సిస్ ఆప్ డ్రైవ్ ని తెరవడానికి ఈ టర్మినల్ కి అనుమతి లేదు 70 00:08:16,163 --> 00:08:17,414 ఇప్పుడు ఏం చేస్తావు? 71 00:08:17,414 --> 00:08:20,250 దాని గుండెలో ఒక చిన్న రంధ్రం ఉందనుకుంటా. 72 00:08:20,250 --> 00:08:21,835 - జేకబ్ గుండెలో ఉన్నట్టుగానా? - హా. 73 00:08:22,920 --> 00:08:26,089 దాన్ని నేను కనుగొని, పూడ్చేస్తా. 74 00:08:26,089 --> 00:08:28,175 - అది నీకు ఎలా కనిపిస్తుంది? - దీని ద్వారా. 75 00:08:30,260 --> 00:08:31,929 సరే మరి, దాన్ని ఇక్కడికి తీసుకురా. 76 00:08:46,568 --> 00:08:48,737 ఈ భాగం కాస్త భయంకరంగా ఉంటుంది. 77 00:08:49,321 --> 00:08:52,241 - ఇక్కడే ఉండి చూస్తావంటావా? - హా, మొత్తం చూస్తాను. 78 00:08:52,824 --> 00:08:53,825 సరే అయితే. 79 00:09:03,710 --> 00:09:05,838 దీని గుండెని చూస్తావా? 80 00:09:07,047 --> 00:09:08,048 వచ్చి చూడు. 81 00:09:12,553 --> 00:09:14,346 బాబోయ్, చాలా పెద్దగా ఉంది. 82 00:09:14,346 --> 00:09:16,849 బంగారం, ఇందులో నుండి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. 83 00:09:17,474 --> 00:09:21,311 సైలోలో ఇలాంటి పరికరం ఇదే మొదటిది. దీనిలోనుండి చూస్తే చిన్నవి పెద్దగా కనిపిస్తాయి. 84 00:09:21,311 --> 00:09:25,816 ఇదే కనుక పని చేస్తే, దీని ద్వారా మనం ఇతరులకు సాయపడవచ్చు. 85 00:09:31,738 --> 00:09:32,823 సరే. 86 00:09:35,492 --> 00:09:37,202 షెరిఫ్, నేను బిల్లింగ్స్ ని. 87 00:09:40,622 --> 00:09:42,374 షెరిఫ్, నేను బిల్లింగ్స్ ని. 88 00:09:46,461 --> 00:09:47,546 ఏంటి సంగతి, బిల్లింగ్స్? 89 00:09:48,130 --> 00:09:49,965 నువ్వు వెంటనే ఆఫీసుకు రావాలి. 90 00:10:04,438 --> 00:10:06,356 హేయ్! ఏం చేస్తున్నారు మీరు? 91 00:10:06,356 --> 00:10:09,484 - మా పని అయ్యేదాకా మీరు ఆగాలి. - లేదు, లేదు. ఇది మా ఆఫీసు. 92 00:10:10,277 --> 00:10:11,403 వాళ్లు ఈ పని ఎలా చేయగలుగుతున్నారు? 93 00:10:11,403 --> 00:10:14,448 నమోదవ్వని పురాతన వస్తువుల కోసం గాలించమని మెడోస్ ఆదేశించింది. 94 00:10:14,448 --> 00:10:15,532 ఏంటి? 95 00:10:16,491 --> 00:10:18,368 ఇదేదో సోది యవ్వారంలా ఉంది. 96 00:10:18,368 --> 00:10:20,829 అసలు తను అలా ఎందుకు ఆదేశించింది అనేదే ప్రశ్న. 97 00:10:20,829 --> 00:10:22,581 నన్నెందుకు అలా చూస్తున్నావు? నాకు తెలీదు. 98 00:10:22,581 --> 00:10:24,917 చివరి పురాతన వస్తువును సిమ్సే తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేదీ రాలేదు. 99 00:10:24,917 --> 00:10:27,836 ఆహా. నిన్న నువ్వు మెడోస్ ని కలవడానికి వెళ్లావు కదా, ఏమైంది? 100 00:10:27,836 --> 00:10:30,506 ఏమీ జరగలేదు. నువ్వు అన్నట్టే తనకి ఇడ్లీ, ఆమ్లెట్ తీసుకెళ్లాను. 101 00:10:30,506 --> 00:10:31,924 తన ఆరోగ్యం బాలేదు. 102 00:10:32,633 --> 00:10:35,177 హేయ్! కాస్త తగ్గు, హొవీ. 103 00:10:35,177 --> 00:10:38,138 మీరు ఒప్పందాన్ని ధిక్కరిస్తున్నారని మీకు తెలుసు, కదా? 104 00:10:38,138 --> 00:10:42,976 చాలా పెద్ద కారణం ఉంటే కానీ పోలీసు స్టేషన్లలో గాలింపు చేపట్టకూడదు. 105 00:10:44,019 --> 00:10:45,854 నేనేమంటున్నానో అర్థమవుతోందా? 106 00:10:59,701 --> 00:11:02,079 నేల కింద కూడా తనిఖీ చేయ్. 107 00:11:09,920 --> 00:11:11,630 నాకెంత బాధగా అనిపించిందో తెలుసా? 108 00:11:12,130 --> 00:11:14,633 నేను చేయగల పని ఇదొక్కటే. 109 00:11:14,633 --> 00:11:20,305 జేకబ్ కి ఇలాంటిదే మన దగ్గర ఉండుంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఓసారి ఊహించుకో. మనం... చెప్తున్నా కదా, మనం... 110 00:11:21,807 --> 00:11:26,937 మనం అనుభవించిన బాధని ఇతర కుటుంబాలు అనుభవించకూడదనే నా ఈ ప్రయత్నమంతా. 111 00:11:26,937 --> 00:11:28,730 నాకు కూడా బాధ కలిగిందని నీకు అనిపించట్లేదా? 112 00:11:29,231 --> 00:11:32,025 కానీ అలా అని నువ్వు అనధికారంగా ఏ పరికరాలు పడితే ఆ పరికరాలు చేసేస్తే ఎలా! 113 00:11:32,025 --> 00:11:35,779 ఆ పరికరాన్ని ఉపయోగించి గుండె సంబంధిత రోగాలకి చికిత్స చేయవచ్చు. అది ప్రాణాలను కాపాడగలదు. 114 00:11:35,779 --> 00:11:38,365 అసలు భూతద్దాన్ని చట్టవిరుద్దమైన వస్తువుగా ఎందుకు చేశారు? 115 00:11:38,365 --> 00:11:40,117 నాకు తెలుసు, కానీ నియమాలు అలాగే ఏడ్చాయి. 116 00:11:40,117 --> 00:11:42,119 నువ్వు నియమాలను చక్కగా అనుసరిస్తావుగా. అందులో ఏ సందేహం లేదు. 117 00:11:42,119 --> 00:11:44,538 - నువ్వేమంటున్నావు? - నీకూ, జూల్స్ కి తప్ప 118 00:11:44,538 --> 00:11:45,664 నేను చేసే పని ఎవరికీ తెలీదు. 119 00:11:45,664 --> 00:11:47,749 నేనే జ్యుడిషియల్ వాళ్లకి చెప్పానని అనుకుంటున్నావా? 120 00:11:47,749 --> 00:11:51,003 ఒప్పందంలో సొంత కుటుంబంపై ఫిర్యాదు చేయడం గురించి ఏదోకటి ఉండే ఉంటుంది. 121 00:11:51,003 --> 00:11:53,005 అసలు ఆ ఆలోచన నీకెలా వచ్చింది? 122 00:11:53,005 --> 00:11:54,840 మరి వాళ్లకి ఇంకెలా తెలుస్తుంది? 123 00:11:54,840 --> 00:11:57,968 ఎందుకంటే, ఇన్ఫార్మర్లు ఎక్కడ పడితే ఉంటారు కాబట్టి. 124 00:11:58,719 --> 00:11:59,970 నువ్వూ గుట్టుచప్పుడు కాకుండా చేయలేదే! 125 00:11:59,970 --> 00:12:01,889 మన ఇంటికి అద్దాలను, లోహాలను తెప్పించుకుంటున్నావు, 126 00:12:01,889 --> 00:12:03,807 పొద్దుపోయాక మన అమ్మాయిని పొలంలోకి తీసుకెళ్తున్నావు. 127 00:12:05,142 --> 00:12:07,644 దయచేసి నా మాట విను, హానా. వాళ్లకి కావాల్సిందేదో ఇచ్చేయ్, 128 00:12:07,644 --> 00:12:09,813 లేదంటే వాళ్లు మన ఇల్లును గుల్ల చేసేస్తారు. 129 00:12:10,689 --> 00:12:12,608 జూలియా గది... దయచేసి నా మాట విను. 130 00:12:13,859 --> 00:12:16,737 నీకు దీని ద్వారా ఏ ప్రయోజనం అందుతుందో ఏమో కానీ, అది మంచిదే అవ్వాలని కోరుకుంటున్నా. 131 00:12:20,616 --> 00:12:21,450 చాలు. 132 00:12:22,910 --> 00:12:24,161 మీకు కావాల్సింది ఇస్తా. 133 00:12:25,454 --> 00:12:26,455 ఆపండి. 134 00:12:48,060 --> 00:12:49,061 ఏంటిది? 135 00:13:24,012 --> 00:13:25,180 వద్దు! 136 00:13:34,022 --> 00:13:35,607 ఇప్పుడు ఆ జంతువు విషయానికి వద్దాం. 137 00:13:37,818 --> 00:13:39,027 అదెక్కడ ఉందో చెప్పేయండి, 138 00:13:39,027 --> 00:13:41,280 మేము ఆ రైతు మీద వేసిన కేసును ఎత్తేస్తాం. 139 00:13:42,948 --> 00:13:43,949 అది చనిపోయింది. 140 00:13:44,616 --> 00:13:47,035 మాంసం మేము తినేశాం, మిగతాది ఎరువుగా వాడాం. 141 00:13:51,248 --> 00:13:54,710 మీరు సమయం కేటాయించినందుకు, సహకరించినందుకు జ్యుడిషియల్ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు. 142 00:14:07,764 --> 00:14:10,684 ప్రమాణపూర్తిగా చెప్తున్నా, నేను చెప్పలేదు. 143 00:14:17,608 --> 00:14:20,235 పర్వాలేదులే. నేను చూసుకుంటా. 144 00:15:03,529 --> 00:15:05,489 - మేము దాన్ని తనిఖీ చేయాలి. - అది జరగని పని. 145 00:15:09,159 --> 00:15:10,160 ఇక్కడ కాస్త సాయం కావాలి. 146 00:15:11,703 --> 00:15:13,330 ఓరి నాయనోయ్. 147 00:15:13,830 --> 00:15:14,831 సరే. 148 00:15:24,258 --> 00:15:25,968 ఇదుగో. ఇప్పుడు కడుపు నిండిందా, సన్నాసీ? 149 00:15:38,272 --> 00:15:39,273 ఇక పదండి. 150 00:15:48,699 --> 00:15:50,117 నువ్వు వీళ్లతో పని చేసేవాడివి కదా? 151 00:15:50,117 --> 00:15:53,287 {\an8}నేను అడ్మినిస్ట్రేషన్ శాఖలో పని చేసేవాడిని. ఈ అతిగాళ్లతో పని చేయలేదు. 152 00:15:53,287 --> 00:15:54,371 {\an8}షెరిఫ్ 153 00:15:55,038 --> 00:15:56,081 ఏంటి? నేనూ బూతులు మాట్లాడతాను. 154 00:15:57,457 --> 00:15:59,710 ఏదేమైనా, ఇది సాధారణంగా చేసిన సోదాలా లేదు. 155 00:15:59,710 --> 00:16:01,378 - ఇది... - ఇది వ్యక్తిగతంగా చేసినది. 156 00:16:02,588 --> 00:16:03,589 ఛ. 157 00:16:04,548 --> 00:16:06,633 ఈ పని చేసింది మెడోస్ కాదు. దీని వెనుక ఆమె హస్తం లేదు. 158 00:16:07,176 --> 00:16:09,386 - వారెంట్ మీద తన సంతకమే ఉంది. - అది కాదు, నేను అక్కడ ఉన్నప్పుడు, 159 00:16:10,470 --> 00:16:12,181 నాకేదో తేడాగా అనిపించింది. 160 00:16:12,181 --> 00:16:14,308 తను కాదనుకుంటా అసలు ఇన్ ఛార్జీ. 161 00:16:15,058 --> 00:16:17,436 - ఇంకెవరు? - సిమ్స్. 162 00:16:18,228 --> 00:16:19,313 - రాబర్ట్? - అవును. 163 00:16:19,313 --> 00:16:21,356 అతను ఒప్పందం అమలయ్యేలా చూసుకొనే వ్యక్తి. అధికారం కోసం ఏది పడితే... 164 00:16:21,356 --> 00:16:24,026 లేదు. నేను ఇక్కడికి రాక ముందు నుండే నా అడ్దు తొలగించుకోవాలని చూస్తూ ఉన్నాడు. 165 00:16:24,026 --> 00:16:26,695 ఈ పని కేవలం టీజర్ మాత్రమే. 166 00:16:26,695 --> 00:16:29,865 అతనికి నేను జైల్లో పడటమో, చావడమో కావాలి. అప్పటిదాకా అతను ఈ పనులను ఆపడు. 167 00:16:32,451 --> 00:16:33,535 అబ్బా. 168 00:16:33,535 --> 00:16:36,330 ఇది చట్టవ్యతిరేకమైన సోదా అని, చట్టవిరుద్దమైన జప్తు అని అన్నావు కదా? 169 00:16:38,832 --> 00:16:40,667 వీళ్లు ప్రక్రియలోని చాలా దశలను పట్టించుకోలేదు. 170 00:16:40,667 --> 00:16:43,170 ముందు నోటీసు ఇవ్వాలి, ఆధారం కోసం కోరాలి... 171 00:16:43,170 --> 00:16:45,506 - జ్యుడిషియల్ శాఖకి వెళ్దాం పద. - దేనికి? 172 00:16:47,758 --> 00:16:49,843 ఇది హార్డ్ డ్రైవ్ లాగా కనిపిస్తోందా నీకు? 173 00:16:52,012 --> 00:16:53,013 లేదు, సర్. 174 00:16:53,931 --> 00:16:54,932 ఇది? 175 00:16:55,516 --> 00:16:58,560 - ఇది అసలు కంప్యూటరుకు పెట్టడానికి వీలవుతుందా? - లేదు, సర్. 176 00:16:58,560 --> 00:17:02,314 వారెంటులో పనికిరాని ఆఫీసు సామాను తీసుకురమ్మని ఉందా? 177 00:17:02,314 --> 00:17:03,565 ఆమె ఆఫీసులో ఇవే దొరికాయి. 178 00:17:03,565 --> 00:17:05,817 మీరు శ్రద్ధపెట్టి వెతికితే కదా! 179 00:17:06,859 --> 00:17:08,069 ఇప్పుడు కొత్త ప్లాన్. 180 00:17:09,570 --> 00:17:13,367 ఒకటవ అంతస్థు నుండి 50వ అంతస్థు దాకా పని చేసిన ప్రతి ఒక పోర్టరును పట్టుకోండి. 181 00:17:13,367 --> 00:17:16,578 తను ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా, లేద మాట్లాడిందా కనుక్కోండి. అదే... 182 00:17:16,578 --> 00:17:18,413 సారీ. నేను అడ్డుకునే ప్రయత్నం చేశా. 183 00:17:18,413 --> 00:17:20,207 మిస్ నికల్స్, ఇలా నా ఆఫీసు లోపలికి... 184 00:17:20,207 --> 00:17:21,834 - రాబర్ట్ సిమ్స్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. - ...రాకూడదు. 185 00:17:21,834 --> 00:17:23,669 ఒక్క నిమిషం, నీ ఆఫీసును సోదా చేసినందుకే కదా? 186 00:17:23,669 --> 00:17:25,587 - నీకు మండుతుందని మెడోస్ కి చెప్పా కూడా... - మెడోసా తొక్కా! 187 00:17:25,587 --> 00:17:28,131 దర్యాప్తు విషయంలో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. 188 00:17:28,131 --> 00:17:30,592 - ఇప్పుడు కొత్త నేరాలను కనిపెడుతున్నారా ఏంటి? - డెప్యూటీ బిల్లింగ్స్. 189 00:17:30,592 --> 00:17:33,053 పద్నాల్గవ సెక్షన్, మూడవ సబ్ సెక్షన్, పేరా 12బీ. 190 00:17:33,053 --> 00:17:37,015 - చట్టవిరుద్దమైన సోదా, జప్తు. - అది 23వ సెక్షన్, 19వ సబ్ సెక్షన్, ఆరవ పేరా. 191 00:17:37,015 --> 00:17:39,893 చిన్నప్పుడు నువ్వు గెలుచుకున్న ఒప్పంద పోటీలన్నీ 192 00:17:40,435 --> 00:17:42,396 ఇప్పుడు పనికి వస్తున్నాయి కదా, పాల్? 193 00:17:42,980 --> 00:17:44,231 అలాగే అనిపిస్తోంది. 194 00:17:44,231 --> 00:17:46,900 మిస్ నికల్స్, ఆ సోదా ఆదేశానికి, నాకూ ఎటువంటి సంబంధమూ లేదు. 195 00:17:46,900 --> 00:17:49,319 నీ ఏజెంట్లు ప్రోటోకాల్ ని ఉల్లంఘించారు, దానికి నిన్నే బాధ్యునిగా పరిగణిస్తున్నా. 196 00:17:49,319 --> 00:17:51,405 నీకు నచ్చకపోతే, మెడోస్ కి చెప్పుకోపో. 197 00:17:51,405 --> 00:17:52,865 అతనికి సంకెళ్లు వేసి, స్టేషనుకు తీసుకుపో. 198 00:17:56,076 --> 00:17:58,078 నువ్వు ఈ పని బాగా ఆలోచించే చేస్తున్నావా? 199 00:17:58,579 --> 00:18:00,914 నా ఆలోచనకి, దీనికీ సంబంధమే లేదు. మా బాస్ చెప్పింది చేస్తున్నానంతే. 200 00:18:03,959 --> 00:18:04,960 అది తాత్కాలికమేలే. 201 00:18:12,926 --> 00:18:15,345 ఇవన్నీ పైకి తీసుకెళ్లి, ఎక్కడ నుండి తీశారో అక్కడే పెట్టండి. 202 00:18:16,180 --> 00:18:19,766 హేయ్! నువ్వు కూడా నీ బాసుతో కలిసి ఊచలు లెక్కపెడతావా? నా దగ్గర చాలా సంకెళ్లు ఉన్నాయి. 203 00:18:20,934 --> 00:18:23,770 - నువ్వు దీనికి అనుభవించి తీరుతావు. - ఏడిచావులే. 204 00:18:29,860 --> 00:18:32,529 సూపర్. మీరు అక్కడికి రాక ముందు మా స్టేషన్ ఎలా అయితే ఉండిందో, అలాగే ఉండాలి. 205 00:19:28,627 --> 00:19:29,503 క్యాంప్బెల్ షర్లీ 206 00:19:29,503 --> 00:19:31,588 వాకర్ మార్తా 207 00:19:31,588 --> 00:19:33,674 నికల్స్ హానా 208 00:19:37,719 --> 00:19:38,595 అనుమతి ఉన్నవారికే యాక్సెస్ 209 00:19:38,595 --> 00:19:40,264 ఎంచుకున్న వ్యక్తిపై నిఘా రిపోర్ట్ 210 00:20:06,957 --> 00:20:08,208 జూల్స్? 211 00:20:09,209 --> 00:20:10,210 అంతా ఓకేనా? 212 00:20:12,212 --> 00:20:14,214 అమ్మ భూతద్దం చేయడం నీకు ఎందుకు ఇష్టం లేదు? 213 00:20:16,800 --> 00:20:19,511 చూడు, నాకు తెలుసు ఆ పని నేనే చేశానని నువ్వు... 214 00:20:19,511 --> 00:20:21,722 లేదు, తను ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలుసుకోవాలనుకుంటున్నా. 215 00:20:21,722 --> 00:20:24,308 గతంలో ఎప్పుడూ నీ మాట నేను విననే లేదు. కానీ ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నా. 216 00:20:24,308 --> 00:20:26,852 నాకు అది తెలియాలి. 217 00:20:40,032 --> 00:20:41,700 అది భూతద్దం గురించి కానే కాదు. 218 00:20:42,367 --> 00:20:43,368 అంటే? 219 00:20:45,996 --> 00:20:47,247 ఏడాదికి రెండు, మూడుసార్లు, 220 00:20:47,247 --> 00:20:52,085 పిల్లలు పుడతారనే ఆనందంతో ఉండే యువజంటకు, తమ నవజాత శిశువు చనిపోయిందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 221 00:20:53,337 --> 00:20:54,505 అది నా పనిలో భాగం. 222 00:20:55,339 --> 00:20:56,840 కానీ అది కాదు కష్టమైన భాగం. 223 00:20:57,591 --> 00:21:00,844 కొన్నేళ్ల తర్వాత ఆ జంట ఎదురైనప్పుడు 224 00:21:00,844 --> 00:21:02,513 ఆ బాధ వాళ్లకి మిగిల్చిన వేదనని చూడటం. 225 00:21:03,680 --> 00:21:06,099 నష్టం ఒక్కొక్కరినీ ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. 226 00:21:06,099 --> 00:21:10,854 ఒక్కోసారి అది నీ లోకాన్ని కుచించుకుపోయేలా చేస్తుంది. 227 00:21:11,522 --> 00:21:14,358 నీ తమ్ముడు పోయాక, నా పరిస్థితి కూడా అదే అయింది. 228 00:21:15,275 --> 00:21:17,069 నీకూ, అమ్మకు తోడుగా ఉండాల్సిన సమయంలో 229 00:21:17,069 --> 00:21:19,655 నేను ఇక్కడ ఎక్కువ సమయం గడిపాను. 230 00:21:21,532 --> 00:21:23,033 దానికి నేను పశ్చాత్తాప్పడని క్షణం లేదు. 231 00:21:24,117 --> 00:21:25,118 క్షమించమని అడుగుతున్నా కూడా. 232 00:21:31,667 --> 00:21:33,210 కానీ మీ అమ్మ విషయంలో... 233 00:21:35,128 --> 00:21:38,715 ఆ బాధ వ్యతిరేక ప్రభావాన్ని చూపింది, ప్రమాదకరమైన విషయాల వైపు తను వెళ్లేలా చేసింది. 234 00:21:39,800 --> 00:21:41,301 తను సమాధానాల కోసం ఎంతలా ప్రయత్నించేది అంటే, 235 00:21:41,301 --> 00:21:44,054 వాటిని పొందడానికి నియమాలను సైతం తుంగలో తొక్కేసేది. 236 00:21:44,054 --> 00:21:45,722 కానీ జనాలకు సాయపడాలనే తను చూసేది. 237 00:21:45,722 --> 00:21:47,891 నేను కూడా తనకి సాయపడదాం అనుకున్నా, తనని రక్షిద్దామనే అనుకున్నా. 238 00:21:47,891 --> 00:21:49,226 ఆ విషయం తప్ప ఇంకేదీ నేను పట్టించుకోలేదు. 239 00:21:49,226 --> 00:21:51,645 భూతద్దాన్ని కాదు. ఇక దేన్నీ కాదు. 240 00:21:54,481 --> 00:21:55,858 కానీ నా ప్రయత్నాలు చాల్లేదు. 241 00:21:58,318 --> 00:21:59,570 జ్యుడిషియల్ వాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు... 242 00:22:01,446 --> 00:22:04,992 నేను వారిని అడ్డుకొని ఉండాల్సింది. 243 00:22:06,493 --> 00:22:10,289 వాళ్లు చెప్పినట్టు వినడం కాకుండా నేను ఇంకేదైనా చేసి ఉండాల్సింది. 244 00:22:12,499 --> 00:22:18,630 ఆ ఏజెంట్లు మీ అమ్మ యంత్రాన్ని ముక్కలు చేసినప్పుడు, తన మనస్సు కూడా ముక్కలు అయిపోయింది. 245 00:22:21,133 --> 00:22:26,430 నేను తనని మళ్లీ మామూలు మనిషిని చేయడానికే ప్రయత్నించాను, కానీ తను నన్ను పట్టించుకోలేదు. 246 00:22:27,181 --> 00:22:28,557 నేను పట్టు విడిచా. 247 00:22:31,935 --> 00:22:33,395 తనని నిరశపరిచా. 248 00:22:36,940 --> 00:22:39,318 అందుకే నిన్ను మెకానికల్ లోనే వదిలేశా. 249 00:22:41,778 --> 00:22:44,865 నీకూ, మీ అమ్మకి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి, జూల్స్. 250 00:22:46,033 --> 00:22:49,119 నువ్వు మెకానికల్ కి వెళ్లినప్పుడు, నేను చాలా బాధపడ్డాను. 251 00:22:49,912 --> 00:22:52,706 అలా చేసినందుకు నువ్వు నన్ను అసహ్యించుకున్నా, అదే మంచిదని నాకు తెలుసు. 252 00:22:52,706 --> 00:22:54,333 అక్కడ ఉంటే 253 00:22:54,333 --> 00:22:59,129 మీ అమ్మలా దొరకని సమాధానాల కోసం పాకులాడే బదులు నీ ముందు ఉండే 254 00:22:59,129 --> 00:23:02,341 అసలైన వస్తువులను బాగు చేయడానికే నీ ప్రతిభ వాడతావని నాకు తెలుసు. 255 00:23:04,051 --> 00:23:05,427 అయినా చివరికి అదే స్థితికి వచ్చా. 256 00:23:07,304 --> 00:23:08,514 అవును. 257 00:23:10,432 --> 00:23:12,184 తను నిన్ను నిందించింది. 258 00:23:13,936 --> 00:23:16,230 నువ్వే ఫిర్యాదు చేశావని అనుకుంది. నేను కూడా అదే అనుకున్నా. 259 00:23:16,230 --> 00:23:20,150 నాకు తెలుసు. ప్రమాణపూర్తిగా చెప్తున్నా, ఆ పని నేను చేయనేలేదు. ఎప్పటికీ చేయను కూడా. 260 00:23:20,150 --> 00:23:21,610 హా, నాకు తెలుసు. 261 00:23:22,778 --> 00:23:27,032 జ్యుడిషియల్ వాళ్లు, అద్దాల్లో ఉండే సెన్సార్ల ద్వారా అమ్మని గమనిస్తూ ఉన్నారు. 262 00:23:27,032 --> 00:23:28,492 తన ఫైల్ నాకు దొరికింది. 263 00:23:28,492 --> 00:23:31,411 - నువ్వేం అంటున్నావు? - వాళ్ల దగ్గర కెమెరాలు ఉన్నాయి. 264 00:23:31,411 --> 00:23:34,122 ఇంకా... వాళ్లు పోర్టర్లు, ఇన్ఫార్మర్ల ద్వారానే వింటారు అనుకోకు, 265 00:23:34,122 --> 00:23:35,207 వాళ్ల దగ్గర పరికరాలు ఉన్నాయి. 266 00:23:35,207 --> 00:23:37,251 భూతద్దం గురించి వాళ్లకి తెలిసింది అలాగే. 267 00:23:37,835 --> 00:23:39,545 వాళ్లకన్నీ తెలిసేది కూడా అలాగే. 268 00:23:42,756 --> 00:23:44,424 తను నన్ను అస్సలు నమ్మలేదు. 269 00:23:44,424 --> 00:23:46,093 తెలుసు. నాకు తెలుసు. 270 00:23:46,718 --> 00:23:47,803 నేను కూడా నిన్ను నమ్మలేదు. 271 00:23:48,929 --> 00:23:50,764 జూలియా. 272 00:23:56,353 --> 00:23:58,772 నాకు తెలుసు. సారీ. 273 00:24:00,065 --> 00:24:01,608 ఇప్పటికీ నేను తనని చాలా మిస్ అవుతుంటా. 274 00:24:03,485 --> 00:24:04,486 నేను కూడా. 275 00:24:09,283 --> 00:24:11,493 - మధ్యలో వచ్చినందుకు క్షమించాలి. - పర్వాలేదు. 276 00:24:11,493 --> 00:24:12,953 నిర్వహణ వాళ్లు వచ్చారు. 277 00:24:14,538 --> 00:24:18,125 - ఎందుకు? - వెంట్లను తనిఖీ చేయాలట. 278 00:24:18,125 --> 00:24:19,793 అతను మాట వినట్లేదు అసలు. 279 00:24:21,712 --> 00:24:24,673 - ఏదైనా పని ఉందని వాళ్లకి చెప్పావా? - లేదు. 280 00:24:24,673 --> 00:24:26,008 - నువ్వేమైనా చెప్పావా? - లేదు. 281 00:24:27,551 --> 00:24:29,303 అతనికి తర్వాత రమ్మని చెప్పగలవా? 282 00:24:29,970 --> 00:24:31,054 ప్లీజ్. 283 00:24:31,054 --> 00:24:32,139 సరే. 284 00:24:35,184 --> 00:24:37,686 మనం గ్లొరియాని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ వినేవాళ్లు ఎవరూ ఉండరు అన్నావు కదా. 285 00:24:37,686 --> 00:24:39,855 - హా. - ఎందుకంటే, ఇక్కడ కెమెరాలు లేవు. 286 00:24:39,855 --> 00:24:41,481 ఆ నిర్వహణ వాడు వచ్చింది కెమెరా పెట్టడానికే. 287 00:24:42,441 --> 00:24:44,776 ప్రస్తుతానికి, ఇక్కడ ఉంటే వాళ్లకి ఏమీ కనిపించదు. 288 00:24:46,278 --> 00:24:48,197 - ఏంటది? - హార్డ్ డ్రైవ్. 289 00:24:48,197 --> 00:24:49,406 - అందులో ఏముంది? - ఏమో. 290 00:24:49,406 --> 00:24:52,159 ఏముందో కనుక్కుందామని నీ కంప్యూటరులో చూశా, కానీ తెరవలేకపోయా. 291 00:24:52,159 --> 00:24:54,119 ఏదో అనుమతి కావాలంటోంది. 292 00:24:54,620 --> 00:24:57,789 వాక్ దగ్గరికి తీసుకెళ్తా. అందరి సంగతి తెలీదు కానీ, తను ఖచ్చితంగా తెరవగలదు. 293 00:24:58,624 --> 00:25:01,793 నువ్వు... నువ్వు తనకి నేను వస్తున్నానని వర్తమానం పంపుతావా? 294 00:25:01,793 --> 00:25:04,254 నేను ఆరుకల్లా అక్కడ ఉంటా. 295 00:25:04,254 --> 00:25:08,342 హా, జూల్స్, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. 296 00:25:08,342 --> 00:25:09,635 తప్పకుండా. 297 00:25:16,600 --> 00:25:17,434 సరే మరి. 298 00:25:28,403 --> 00:25:33,408 ఐడీ. తర్వాతి వాళ్లు రావాలి. ఐడీ. 299 00:25:33,408 --> 00:25:34,868 అబ్బా. 300 00:25:34,868 --> 00:25:38,247 - ఐడీ. బ్యాగ్ చెక్ చేయాలి. - అబ్బా. 301 00:25:38,247 --> 00:25:40,832 - ఏం జరుగుతోంది? - అది నేను నిన్ను అడగాలి. 302 00:25:42,292 --> 00:25:44,086 వాళ్లని త్వరగా చేయమని చెప్పకపోయావా? 303 00:25:44,086 --> 00:25:46,213 ఇప్పుడు వెళ్లాల్సిన పనికి ఆలస్యమైతే, ఇవాళ్టి పనులన్నింటికీ ఆలస్యమవుతుంది. 304 00:25:46,213 --> 00:25:47,714 హా, సరే, నేను చూస్తాలే. 305 00:25:57,140 --> 00:25:58,308 హేయ్, జెర్రీ. 306 00:26:04,940 --> 00:26:07,442 - చెప్పండి, సర్. - ఒక కప్పు కాఫీ తీసుకురాగలవా? 307 00:26:22,374 --> 00:26:24,501 బ్లాక్ కాఫీ. చక్కెర, క్రీమ్ వద్దు. 308 00:26:27,421 --> 00:26:28,755 సరే. 309 00:26:42,936 --> 00:26:43,937 థ్యాంక్స్. 310 00:26:45,147 --> 00:26:47,733 ఇంకో సాయం చేసిపెట్టగలవా? 311 00:26:48,442 --> 00:26:50,319 ఒక నిమిషం నీ రేడియో ఇస్తావా? 312 00:26:55,365 --> 00:26:57,743 - మిస్టర్ సిమ్స్, సర్... నేను... - ఒక్క కాల్ చేసుకుంటానంతే. 313 00:26:57,743 --> 00:27:00,913 నాకు... మనం ఆగితే మంచిది అనిపిస్తోంది, 314 00:27:01,538 --> 00:27:03,498 ఎవరైనా వచ్చేదాకా ఆగితే మంచిదనిపిస్తోంది. 315 00:27:05,125 --> 00:27:06,293 అది ఓకే అయితే. 316 00:27:08,712 --> 00:27:12,049 షెరిఫ్ వచ్చేదాకనా? లేదా బిల్లింగ్స్ వచ్చేదాకనా? 317 00:27:15,093 --> 00:27:17,888 హా, నువ్వన్నది న్యాయమే. అర్థం చేసుకోగలను. 318 00:27:18,555 --> 00:27:19,556 వదిలేయిలే. 319 00:27:20,224 --> 00:27:22,142 నీ మీద పగ, ప్రతీకారాల్లాంటివేవీ పెట్టుకోనులే. 320 00:27:42,329 --> 00:27:43,330 హలో. 321 00:27:44,748 --> 00:27:47,709 - ఈసారి కూడా నేను రాక ముందే పడుకుంది కదా? - ఇప్పుడే పడుకోపెట్టి వచ్చా. 322 00:27:48,836 --> 00:27:49,837 ఈ రోజంతా హడావిడిగా గడిచిందా? 323 00:27:50,671 --> 00:27:52,589 బాబోయ్, దారుణంగా. 324 00:27:56,301 --> 00:27:57,511 భోజనం అయిపోవచ్చింది. 325 00:28:10,190 --> 00:28:11,024 బాగానే ఉన్నావా? 326 00:28:16,697 --> 00:28:19,825 - సారీ, నాకు... - పర్వాలేదు. వాటిని నేను తర్వాత తీస్తాను. 327 00:28:20,492 --> 00:28:22,119 నువ్వు పైకి వెళ్లినప్పటి నుండి నీ చేయి వణకడం ఎక్కువైంది. 328 00:28:22,119 --> 00:28:23,245 నాకేం కాలేదులే. 329 00:28:24,204 --> 00:28:25,789 - ఈ ఉద్యోగం. - ఉద్యోగం వల్ల కాదు. 330 00:28:26,582 --> 00:28:27,708 ఉద్యోగమంటే నాకు ఇష్టం. కానీ... 331 00:28:30,294 --> 00:28:34,006 ఇవాళ తన పక్షాన కానీ, సిమ్స్ పక్షాన కానీ నిలవాల్సిన పరిస్థితికి తను నన్ను తీసుకొచ్చింది. 332 00:28:34,006 --> 00:28:36,800 - అది అర్థం పర్థం లేని పని. - అదో తలకాయ నొప్పి యవ్వారంలే. 333 00:28:39,303 --> 00:28:41,430 తను మరో తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తోందని అందరూ అనుకుంటున్నారు. 334 00:28:41,430 --> 00:28:44,016 - ఆ మాట నీతో ఎవరన్నారు? - జనాలు భయంభ్రాంతులకు గురవుతున్నారు. 335 00:28:44,016 --> 00:28:46,768 జరుగుతున్న ఘటనలను, ఈ వారంలో జరిగిన మరణాలను బట్టి చూడు. 336 00:28:46,768 --> 00:28:48,520 - ఇది మామూలు కాదు. - నీకు నా గురించి కంగారుగా ఉంటే... 337 00:28:48,520 --> 00:28:51,857 నీ గురించి కంగారు. ఒత్తిడి వల్ల నీ పరిస్థితి ఇంకా దిగజారుతోంది మరి. 338 00:28:51,857 --> 00:28:55,944 బంగారం, నాకేం కాదు. నా మాట నమ్ము. 339 00:29:05,287 --> 00:29:06,288 నిర్వహణ గ్రహీత: మార్తా వాకర్ 340 00:29:06,288 --> 00:29:08,123 మీ దగ్గరికి ఒక వర్తమానం వస్తోంది ఆరు గంటలకు రావచ్చు. డాక్టర్ పీట్ నికల్స్ 341 00:29:48,539 --> 00:29:49,748 హలో? 342 00:29:50,999 --> 00:29:54,294 హలో? ఎవరైనా ఉన్నారా? 343 00:30:05,180 --> 00:30:06,181 హలో? 344 00:30:16,984 --> 00:30:18,277 అబ్బా. 345 00:30:22,197 --> 00:30:23,740 - హలో? - వాక్? 346 00:30:25,409 --> 00:30:26,535 ఏంటి సంగతి? 347 00:30:26,535 --> 00:30:29,246 - జూల్స్ ని చూశావా? - తను వస్తోందా? 348 00:30:29,913 --> 00:30:31,665 తను ఒక గంట క్రితమే ఇక్కడికి వచ్చుండాలి. 349 00:30:31,665 --> 00:30:34,418 - తను నీకు కనిపిస్తే నాకు చెప్పవా? - అలాగే. 350 00:30:58,025 --> 00:30:59,026 లూకస్ కైల్? 351 00:30:59,693 --> 00:31:00,694 హా, నేనే. 352 00:31:01,195 --> 00:31:02,279 ఇది నీకే. 353 00:31:05,616 --> 00:31:07,367 {\an8}స్టాండర్ట్ పోర్టర్ - కైల్, లూకస్ మొదటి అంతస్థు క్యాంటీన్ 354 00:31:07,951 --> 00:31:13,498 {\an8}"డబ్ల్యూ"కు ఇంకా మరిన్నింటికి సమాధానాలు లభించవచ్చు. ఇప్పుడు ఇంటి నంబరు 613లో మాట్లాడుకుందామా? 355 00:31:17,252 --> 00:31:18,253 కనిపిస్తోందా? 356 00:31:19,338 --> 00:31:20,881 నాకు "డబ్ల్యూ" ఆకారం కనిపిస్తోంది. 357 00:31:54,540 --> 00:31:55,541 హాయ్. లోపలికి రా. 358 00:31:56,166 --> 00:31:57,793 - నిను ఎవరైనా ఫాలో అయ్యారా? - లేదు. 359 00:31:58,794 --> 00:32:01,171 అయిదు నిమిషాల్లో జ్యుడిషియల్ రైడర్లు ఇక్కడికి వస్తారు. 360 00:32:01,171 --> 00:32:02,506 నేను చెప్పాల్సింది మూడు నిమిషాల్లో చెప్పేస్తా. 361 00:32:04,341 --> 00:32:05,342 ఎందుకు నువ్వు... 362 00:32:06,051 --> 00:32:07,511 వాళ్లు మన మాటలను వినగలరు. వద్దు. 363 00:32:07,511 --> 00:32:09,304 సరే. నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావట్లేదు... 364 00:32:09,304 --> 00:32:10,764 నా దగ్గర ఇది ఉంది. 365 00:32:11,849 --> 00:32:14,017 - పాత హార్డ్ డ్రైవా? - అవును, నువ్వు దాన్ని తెరిచి, అందులో ఏముందో చూడాలి, 366 00:32:14,017 --> 00:32:16,895 కానీ దాన్ని తెరవడానికి కావాల్సిన అధికారం నాకు లేదు. 367 00:32:19,189 --> 00:32:22,818 సరే, అధికారం అంటే? 368 00:32:23,402 --> 00:32:24,570 సిస్ అని... ఏదో ఉంటుంది. 369 00:32:25,696 --> 00:32:27,906 - సిస్ ఆప్? - హా, అసలు ఏంటది? 370 00:32:28,699 --> 00:32:30,993 అది ఐటీ హెడ్ కి, జ్యుడిషియల్ సెక్యూరిటీ హెడ్ కి ఉండే అధికారం. 371 00:32:30,993 --> 00:32:32,369 - అది నేను... - మరి షెరిఫ్ కి? 372 00:32:33,078 --> 00:32:34,955 - షెరిఫ్ కి కూడా. - నేను ప్రయత్నించి చూశా. కానీ తెరవలేకపోయా. 373 00:32:34,955 --> 00:32:37,916 నువ్వు దీన్ని నీ ఆఫీసులోని కంప్యూటరుతో లింక్ చేసి చూడాలి. 374 00:32:38,500 --> 00:32:40,711 నేను అక్కడికి వెళ్లలేను. 375 00:32:41,503 --> 00:32:43,755 దీన్ని నువ్వు ఇంకేదైనా మార్గంలో తెరవగలవా? 376 00:32:44,256 --> 00:32:45,465 దయచేసి సాయపడు. 377 00:32:45,465 --> 00:32:48,177 ఈ డ్రైవ్ లో చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనుకుంటా. 378 00:32:48,177 --> 00:32:49,595 ప్రశ్నలు అంటే? 379 00:32:50,137 --> 00:32:52,055 అంటే, శుభ్రం చేయడానికి హాల్స్టన్ భార్య బయటకు ఎందుకు వెళ్లింది? 380 00:32:52,055 --> 00:32:54,641 జార్జ్ కి ఏమైంది? జాన్స్ ని, మార్న్స్ ని ఎందుకు చంపారు? 381 00:32:54,641 --> 00:32:57,853 - వాళ్లు... ఏంటి, వాళ్లని చంపారా? - అవును, చంపారు. 382 00:33:00,189 --> 00:33:02,941 ఎందుకు? ఇంతకీ ఈ జార్జ్ ఎవరు? 383 00:33:04,902 --> 00:33:06,111 నా స్నేహితుడు. 384 00:33:07,029 --> 00:33:07,863 స్నేహితుడా? 385 00:33:11,742 --> 00:33:16,205 - ఇప్పుడు బాగా అర్థమవుతోందిలే. - లేదు, ఇప్పుడు నీకు వివరించేంత సమయం నాకు లేదు. 386 00:33:16,205 --> 00:33:17,873 - నన్ను వాడుకుంటున్నావా? తెలిసిపోతోంది. - హా. ఒకటి చెప్పనా? 387 00:33:17,873 --> 00:33:20,501 ఇప్పుడు నాకు మరో దారి లేదు, అందుకే నిన్ను వాడుకుంటున్నా. 388 00:33:20,501 --> 00:33:22,669 నువ్వు కూడా నాకు సాయపడాలి. 389 00:33:22,669 --> 00:33:24,838 బయట ఏముందో అని ఆలోచిస్తూ, రోజూ రాత్రి క్యాంటిన్ లో 390 00:33:24,838 --> 00:33:26,632 కూర్చునేది నువ్వే కదా. 391 00:33:26,632 --> 00:33:29,176 నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ డ్రైవ్ లోనే ఉన్నాయేమో! 392 00:33:29,843 --> 00:33:33,138 తెరవడానికి నాకు అధికారం లేని దాన్ని 393 00:33:33,138 --> 00:33:35,557 - నేను తెరవకూడదు అనుకుంటా. - కానీ నాకు అధికారం ఉంది కదా. 394 00:33:35,557 --> 00:33:38,143 అవును, జూలియా, కానీ నియమాలు అందరికీ వర్తిస్తాయి. 395 00:33:43,899 --> 00:33:45,317 అయ్య బాబోయ్. 396 00:33:50,697 --> 00:33:52,157 దీన్ని చూడు. 397 00:33:52,157 --> 00:33:53,700 సెన్సార్. కెమెరా. 398 00:33:53,700 --> 00:33:56,286 వాళ్లు దీని ద్వారా మనల్ని గమనిస్తుంటారు. దీని ద్వారానే మనల్ని నియంత్రిస్తుంటారు. 399 00:33:59,915 --> 00:34:02,709 - ఇవి మన ఇళ్లల్లో ఉన్నాయా? - ఇవి లేని చోటంటూ ఏదీ లేదు. 400 00:34:02,709 --> 00:34:05,504 మనం నిజం కనిపెట్టకపోతే, ఇంకెవరూ కనిపెట్టలేరు. 401 00:34:05,504 --> 00:34:09,174 కాబట్టి, దయచేసి నాకు సాయపడు. 402 00:34:09,882 --> 00:34:11,092 - బతిమాలుతున్నా. - నేను... 403 00:34:13,136 --> 00:34:16,431 నేను తెరవగలిగినా కూడా, మా అమ్మ... 404 00:34:16,431 --> 00:34:17,724 - తనకి నేను తప్ప ఇంకెవరూ... - మీ అమ్మ? 405 00:34:17,724 --> 00:34:19,434 హా, తనని చూసుకోవడానికి ఇప్పుడు నేను తప్ప ఎవరూ లేరు. 406 00:34:19,434 --> 00:34:21,228 - నాకేదైనా జరిగితే అంతే, కాబట్టి నా వల్ల... - ఇది... 407 00:34:22,020 --> 00:34:23,230 సమయం అయిపోయింది. 408 00:34:23,230 --> 00:34:25,148 నువ్వు కూడా వెళ్లిపో. మీ అమ్మ కోసం. 409 00:34:26,525 --> 00:34:27,400 జూలియా. 410 00:34:30,070 --> 00:34:31,697 అబ్బా. జూలియా. 411 00:34:45,918 --> 00:34:50,799 జూలియా నికల్స్. జ్యుడిషియల్ శాఖ ఆదేశానుసారం, వెంటనే తలుపును తెరవండి. 412 00:35:01,852 --> 00:35:03,061 ఐడీ, ఇంకా బ్యాగ్ ఇవ్వండి. 413 00:35:03,061 --> 00:35:05,439 - బ్యాగును పై అంతస్థులో తనిఖీ చేశారు. నేను త్వరగా వెళ్లాలి. - ఐడీ, బ్యాగ్ ఇవ్వండి. 414 00:35:05,439 --> 00:35:07,399 కామెడీయా? నేనెవరో తెలుసా? 415 00:35:07,399 --> 00:35:08,775 - మేడమ్. - ఇదే నా ఐడీ. 416 00:35:08,775 --> 00:35:10,652 - మీ బ్యాగ్ తెరవండి. - మీ సూపర్వైజర్ ఎక్కడ? 417 00:35:10,652 --> 00:35:13,322 - కామెడీ చేస్తున్నావా? - వాళ్లెవరైనా కానీ, సంతృప్తి అయితే వ్యక్తం చేయరు. 418 00:35:13,906 --> 00:35:15,657 ఈమె మీ షెరిఫ్, ఈమె నాతో పాటు వస్తోంది. 419 00:35:16,283 --> 00:35:17,117 కానీ... 420 00:35:17,659 --> 00:35:19,870 ఇప్పుడు మేయరుని కూడా ప్రశ్నిస్తున్నావా? 421 00:35:24,833 --> 00:35:26,835 నువ్వు సిమ్స్ ని అరెస్ట్ చేశావు. ఇప్పుడు ఎక్కడ చూసినా తనిఖీలే. 422 00:35:26,835 --> 00:35:29,004 - ఏం జరుగుతోంది, షెరిఫ్? - నువ్వు ఊహించింది నిజమే. సరేనా? 423 00:35:29,004 --> 00:35:31,882 జ్యుడిషియల్ వాళ్లు మొత్తాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇది నడిపించేది మెడోస్ కాదు. 424 00:35:32,633 --> 00:35:34,551 - సిమ్స్. - అది అసంభవం. 425 00:35:35,886 --> 00:35:37,888 రాబర్ట్ నియమాలను తూచ తప్పకుండా పాటించే వ్యక్తి. 426 00:35:38,430 --> 00:35:39,806 మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు. 427 00:35:39,806 --> 00:35:42,518 - నాకొక చోటు తెలుసు, కాకపోతే కాస్త నడవాలి. - సరే. 428 00:35:50,025 --> 00:35:51,026 సరే మరి. 429 00:35:52,027 --> 00:35:54,905 సైలోలో ఇక్కడ దొరికినంత ఏకాంతం ఇంకెక్కడా దొరకదు. 430 00:35:55,447 --> 00:35:56,823 ఇప్పుడు వివరంగా చెప్పు. 431 00:35:56,823 --> 00:35:59,409 జ్యుడిషియల్ శాఖని సిమ్స్ రహస్యంగా నడుపుతున్నాడు అంటున్నావా? 432 00:35:59,409 --> 00:36:01,578 హా, జడ్జ్ కాదు. 433 00:36:02,371 --> 00:36:04,039 - సిమ్స్ కి ఏం కావాలి ఇంతకి? - ఏమో మరి. 434 00:36:04,623 --> 00:36:07,084 సైలోపై పెత్తనం చలాయించాలనుకుంటున్నాడో? నేరాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నాడో? 435 00:36:07,084 --> 00:36:09,086 ఏమో మరి. తన ఉద్దేశం ఏమైనా కానీ, నా అడ్డు తొలగించాలనుకుంటున్నాడు. 436 00:36:09,086 --> 00:36:10,462 నీ తర్వాత, నన్నే. 437 00:36:12,339 --> 00:36:14,258 అసలు ఈ పదవే నాకు ఇష్టం లేదు. 438 00:36:16,260 --> 00:36:17,553 ఇంతకీ వాళ్లు దేని కోసం వెతుకుతున్నారు? 439 00:36:19,096 --> 00:36:20,222 నీ ఉద్దేశం ఏంటి? 440 00:36:20,222 --> 00:36:23,725 ముందు నీ ఇంట్లో వెతికారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. 441 00:36:25,602 --> 00:36:27,354 అంత భయంకరమైనది నీ దగ్గర ఏముంది? 442 00:36:29,731 --> 00:36:31,108 నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. 443 00:36:31,108 --> 00:36:34,695 సమయం మించిపోతోంది, జూలియా. మనకి అంత సమయం లేదు. 444 00:36:35,487 --> 00:36:36,738 నీ దగ్గర హార్డ్ డ్రైవ్ ఉంటే, అప్పుడు... 445 00:36:39,783 --> 00:36:40,784 అబ్బా. 446 00:36:41,827 --> 00:36:43,120 "హార్డ్ డ్రైవ్" అనేశా. 447 00:36:44,538 --> 00:36:46,373 హార్డ్ డ్రైవే అని నాకెలా తెలుసబ్బా? 448 00:36:47,541 --> 00:36:48,584 అయ్యయ్యో. 449 00:36:52,963 --> 00:36:55,549 నువ్వే. నువ్వే అన్నమాట. 450 00:36:57,384 --> 00:37:01,805 మన్నించాలి, షెరిఫ్ నికల్స్. ఇప్పుడు నీకు బయటకు వెళ్లాలని ఉందని అన్నావా? 451 00:37:03,265 --> 00:37:05,392 లేదు, ఆ మాట నేను అనలేదు. 452 00:37:05,392 --> 00:37:08,729 నువ్వు ఆ మాట అనడం నాకు స్పష్టంగా వినిపించింది. 453 00:37:08,729 --> 00:37:11,356 - రాబర్ట్, నీకు కూడా వినిపించిందా? - బాగా వినిపించింది. 454 00:37:11,356 --> 00:37:12,733 లేదు. 455 00:37:12,733 --> 00:37:14,818 ఒక షెరిఫ్ వెళ్లి ఎంతో కాలం కాక ముందే ఇంకో షెరిఫ్ బయటకు వెళ్తోంది. 456 00:37:15,319 --> 00:37:17,321 ఈ షెరిఫ్ లకి ఏమైందో ఏమో ఈమధ్య. 457 00:37:17,321 --> 00:37:19,990 నువ్వే అన్నమాట. మెడోస్ భయపడేది ఇతనికి కాదు. 458 00:37:19,990 --> 00:37:22,534 తను భయపడేది నిన్ను చూసే. 459 00:37:24,203 --> 00:37:25,329 అవును. 460 00:37:27,080 --> 00:37:30,876 సైలో మనుగడ సాగించాలంటే, ఎవరోకరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని 461 00:37:30,876 --> 00:37:32,377 పితామహులకి తెలుసు. 462 00:37:33,086 --> 00:37:38,008 ఇక్కడ జరిగే వాటన్నింటి గురించి అన్నీ తెలిసిన వాడు, సర్వం ఎరిగిన వాడు, 463 00:37:38,008 --> 00:37:41,303 బుద్ధి కుశలత ఉన్న వాడు అన్నమాట. 464 00:37:42,888 --> 00:37:43,889 అదృష్టవశాత్తూ ఆ వ్యక్తిని నేనే. 465 00:37:44,848 --> 00:37:49,853 వాళ్లందరినీ ఎందుకు చంపావు? నాకు అదే అర్థం కావట్లేదు. 466 00:37:49,853 --> 00:37:52,731 మిస్ నికల్స్, మనం ఉనికిలో ఉన్నంత కాలం, 467 00:37:52,731 --> 00:37:57,110 ఎన్నో సమస్యలు తలెత్తుతూ వస్తున్నాయి, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 468 00:37:58,403 --> 00:38:03,283 పది మంది బాగు కోసం ఒకరిని బలి చేయడానికి నేను వెనుకాడను. 469 00:38:03,283 --> 00:38:04,368 దేని కోసం? 470 00:38:05,536 --> 00:38:07,829 హార్డ్ డ్రైవ్, ఇంకా వేడి కాకుండా ఆపే ఆ తొక్కలో టేపు కోసమా? 471 00:38:07,829 --> 00:38:08,914 ఇదంతా ఆ టేపు గురించి కాదు. 472 00:38:08,914 --> 00:38:10,332 ఇది సైలో మనుగడ గురించి. 473 00:38:10,332 --> 00:38:13,919 ఆ హార్డ్ డ్రైవ్ వల్ల సైలోలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. 474 00:38:13,919 --> 00:38:18,423 సైలో యొక్క 140 ఏళ్ళ చరిత్రలో నీ రూపంలో దానికి ఎదురవుతున్న ప్రమాదం ఎప్పుడూ ఎదురు కాలేదు. 475 00:38:18,423 --> 00:38:20,717 నిన్ను కాసేపట్లో తుంచేస్తాంలే. 476 00:38:59,965 --> 00:39:01,466 తన మిత్రులందరూ ఏమైపోయారు? 477 00:39:01,967 --> 00:39:03,260 తన సోదరి. అత్తమ్మ. 478 00:39:03,260 --> 00:39:05,262 - వాళ్లెందుకు రాలేదో నీకు తెలుసు... - వాళ్లు పిరికోళ్లు. 479 00:39:06,221 --> 00:39:07,222 అది నిజం కాదు... 480 00:39:09,850 --> 00:39:12,477 తను గుండెపోటు కారణంగా చనిపోయి ఉంటే అందరూ వచ్చేవాళ్ళే. 481 00:39:14,980 --> 00:39:17,024 ఇంకా బాగా జరిగి ఉండాల్సింది అని తప్పక అనిపిస్తుంది, కానీ... 482 00:39:17,024 --> 00:39:18,108 కానీ ఏమీ జరగలేదు. 483 00:39:20,152 --> 00:39:21,153 వాళ్లందరూ పిరికి పందలు. 484 00:39:22,362 --> 00:39:23,363 తను కూడా అంతే. 485 00:39:26,033 --> 00:39:27,034 జూల్స్. 486 00:39:40,797 --> 00:39:42,925 పో. వెళ్లిపో. 487 00:39:43,675 --> 00:39:46,512 వెళ్లు! వెళ్లిపో! పోవే! 488 00:40:02,736 --> 00:40:05,572 నన్ను అరెస్ట్ చేసినందుకు అనుభవిస్తావని చెప్పా కదా. 489 00:40:23,257 --> 00:40:25,092 నీకు ఇది హ్యాంక్ పంపాడా? 490 00:40:25,092 --> 00:40:27,886 షెరిఫ్ స్టేషన్లన్నింటికీ పది నిమిషాల క్రితం ఈ సందేశం అందింది. 491 00:40:27,886 --> 00:40:31,139 లేదు, ఏదో తేడా కొడుతోంది. తను ఇక్కడికి రావాల్సి ఉంది. 492 00:40:31,849 --> 00:40:33,684 - సాక్షులు ఎవరు? - మేయర్. 493 00:40:33,684 --> 00:40:35,519 కొందరు జ్యుడిషియల్ రైడర్లు. 494 00:40:36,019 --> 00:40:38,272 హా, వాళ్ల మాటలని నమ్మవచ్చులే. వాళ్లు సత్యహరిశ్చంద్రులు కదా. 495 00:40:38,272 --> 00:40:40,482 నేను విన్నదే నీకు చెప్తున్నా, వాక్. 496 00:40:40,482 --> 00:40:43,610 హా. నువ్వు అన్నది నిజమే. మన్నించు, షర్లీ. నాకు అసలు... 497 00:40:43,610 --> 00:40:44,778 అర్థమవుతోందిలే. 498 00:40:47,614 --> 00:40:50,450 తిరుగుబాటు జరిగినందుకు చివరికి మనకే శిక్ష పడుతుందని నాక్స్ అన్నాడు. 499 00:40:51,618 --> 00:40:53,620 అతను పిచ్చివాగుడు వాగుతున్నాడని అనుకున్నా. 500 00:40:55,455 --> 00:40:58,792 అయితే తర్వాత ఏం జరుగుతుంది? 501 00:41:06,967 --> 00:41:09,553 ఆగు, పాల్. దయచేసి నా మాట విను. 502 00:41:09,553 --> 00:41:12,306 - లేదు. నిన్ను ఇక నేను అర్థం చేసుకోలేను. - నేనేమీ... కాదు, విను! నువ్వు... 503 00:41:12,306 --> 00:41:14,141 నీకు నచ్చినప్పుడు ఒప్పందాన్ని అమలు చేయాలంటావు... 504 00:41:14,141 --> 00:41:15,475 - లేదు. - ...నచ్చనప్పుడు వద్దంటే ఎలా? 505 00:41:15,475 --> 00:41:17,477 - నేను బయటకు వెళ్తానని అస్సలు అనలేదు. - ఆ పని నేను చేయలేను. 506 00:41:17,477 --> 00:41:19,104 - నేను విన్నాను. - అబద్ధం. 507 00:41:19,104 --> 00:41:20,981 - మేయర్, ఇంకా నా ఏజెంట్లు కూడా విన్నారు. - లేదు. 508 00:41:20,981 --> 00:41:23,192 ఇంత కంటే ఇంకేం ఆధారం కావాలంటావు, షెరిఫ్ బిల్లింగ్స్. 509 00:41:23,192 --> 00:41:25,527 - నా ప్రమాణ స్వీకారం అయ్యేదాకా నేను షెరిఫ్ కాదు... - వీళ్లు నన్ను ఇరికిస్తున్నారు. 510 00:41:25,527 --> 00:41:26,987 - నోర్మూసుకో! - నువ్వు అబద్ధం ఆడుతున్నావు! 511 00:41:26,987 --> 00:41:29,823 హేయ్, నువ్వు అన్నది వీళ్లు సరిగ్గా వినలేదని నీకు అనిపిస్తే, విచారణను కోరే హక్కు నీకు ఉంది. 512 00:41:29,823 --> 00:41:30,908 - ఉందా? ఎవరిని కోరాలి? - ఉంది! 513 00:41:30,908 --> 00:41:33,035 జ్యుడిషియల్ శాఖనా? వీడేగా జ్యుడిషియల్ అంటే! 514 00:41:35,579 --> 00:41:36,830 నోర్మూసుకోమన్నానా! 515 00:41:38,749 --> 00:41:40,250 ఆ పని చేయాల్సిన అవసరం లేదు, రాబర్ట్! 516 00:41:41,835 --> 00:41:44,713 నేను తనని ముందే హెచ్చరించాను. నీ నివేదికలో దాన్ని కూడా తప్పనిసరిగా చేర్చు. 517 00:41:50,260 --> 00:41:51,887 ఏం చూస్తున్నారు? 518 00:41:59,311 --> 00:42:00,145 హేయ్. 519 00:42:03,857 --> 00:42:05,150 అయ్యయ్యో. 520 00:42:18,080 --> 00:42:19,581 వద్దు! 521 00:43:16,680 --> 00:43:18,682 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్