1 00:00:22,648 --> 00:00:24,650 {\an8}అబద్ధాలకోరులు - ఇక నిజం చెప్పండి! పితామహులు సన్నాసులు 2 00:00:36,870 --> 00:00:38,288 ఇక్కడి నుండి లైట్ తో వెళ్ళకూడదు, టిమ్. 3 00:00:39,498 --> 00:00:42,251 ఇంజినీరింగ్ వాళ్ళు మా నాన్నకి ఒక సందేశం పంపారు. 4 00:00:52,427 --> 00:00:54,888 - ఇక్కడికి ఎందుకు వచ్చావు? - ఇంజినీరింగ్ వాళ్ళు ఒక సందేశం పంపారు. 5 00:00:57,808 --> 00:00:59,016 వీడిని ఎందుకు తీసుకొచ్చావు, రాయ్? 6 00:00:59,017 --> 00:01:01,478 టిమ్మీయే ఒప్పించి తీసుకొచ్చాడు. 7 00:01:03,772 --> 00:01:05,356 పావుగంటలో జనరేటర్ ని వరద ముంచెత్తుతుంది 8 00:01:05,357 --> 00:01:06,775 నువ్వేమంటావు? 9 00:01:07,985 --> 00:01:09,486 మనకి మరో దారి లేదు అనుకుంటా. 10 00:01:12,573 --> 00:01:13,866 హా, నాకు కూడా అదే అనిపిస్తోంది. 11 00:01:15,492 --> 00:01:18,077 - వీడిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్ళు. - సరే. 12 00:01:18,078 --> 00:01:20,956 - వెళ్ళు. ఇక్కడి నుండి వెళ్ళిపో. - నాన్నా. నాన్నా. 13 00:01:26,211 --> 00:01:27,254 గంటలు అయిదుసార్లు మోగాక. 14 00:01:44,354 --> 00:01:46,481 ఈ గంటల గోల ఏంటి? 15 00:01:47,191 --> 00:01:49,233 ముందే అనుకున్నన్ని సార్లు గంట మోగితే, వాళ్ళు దాడి చేస్తారు. 16 00:01:49,234 --> 00:01:50,985 ఎన్నిసార్లు అయి ఉండవచ్చు? 17 00:01:50,986 --> 00:01:53,154 మూడుసార్లు అనిపిస్తోంది. 18 00:01:53,155 --> 00:01:54,364 అంతా సిద్ధం చేయండి! 19 00:01:57,409 --> 00:01:59,203 కళ్ళు మూసుకోండి! పక్కకు చూడండి! 20 00:02:03,665 --> 00:02:04,665 అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళండి! 21 00:02:04,666 --> 00:02:06,292 రసెల్ మనకి ప్రాణాలతో కావాలి. అర్థమైందా? 22 00:02:06,293 --> 00:02:08,586 - స్వేచ్ఛ కోసం! - స్వేచ్ఛ కోసం! 23 00:02:09,838 --> 00:02:11,798 ముందుకు పదండి! ముందుకు పదండి! 24 00:02:27,523 --> 00:02:28,857 ఆగకుండా పదండి! 25 00:02:31,443 --> 00:02:34,071 అందరూ వెనుదిరగండి! వెనుదిరగండి! 26 00:02:43,956 --> 00:02:45,331 నా చేయి జారిపోయింది. నా ఉద్దేశం మాత్రం... 27 00:02:45,332 --> 00:02:47,417 తెలుసు. నాకు తెలుసు. 28 00:02:50,379 --> 00:02:51,755 అతను తలుపు ఎందుకు తెరవలేదు? 29 00:02:53,048 --> 00:02:54,716 తెరవవద్దని అతనికి చెప్పారు. 30 00:03:00,097 --> 00:03:01,682 రసెల్ అబద్ధం చెప్పుంటాడా? 31 00:03:03,433 --> 00:03:04,476 నాకు తెలీదు. 32 00:03:08,272 --> 00:03:09,690 అది కనుక్కోవడానికి ఒకే ఒక దారి ఉంది. 33 00:03:13,110 --> 00:03:14,444 ఒకవేళ అతను అబద్ధం చెప్పి ఉంటే? 34 00:03:19,533 --> 00:03:20,909 ఎలాగూ మనకి చావు తప్పదు కదా. 35 00:03:49,021 --> 00:03:50,271 బయటకు వెళదాం పదండి. 36 00:03:50,272 --> 00:03:52,107 బయటకు వెళదాం పదండి! 37 00:05:13,063 --> 00:05:14,815 ఓరి దేవుడా. 38 00:08:36,808 --> 00:08:37,726 తెరుచుకోవే. 39 00:09:46,211 --> 00:09:47,129 తెరుచుకో! 40 00:10:32,966 --> 00:10:34,593 అబ్బా. ఛ. 41 00:10:38,555 --> 00:10:41,767 అబద్ధాలు 42 00:13:28,141 --> 00:13:30,143 హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారితమైనది 43 00:16:19,646 --> 00:16:20,564 సరే మరి. 44 00:17:06,068 --> 00:17:07,736 రా, ఆలస్యం అయితే బాగోదు. 45 00:17:12,950 --> 00:17:14,785 అందరూ వినండి, ఈమె పేరు జూలియా. 46 00:17:16,369 --> 00:17:17,286 తను నేరస్థురాలా? 47 00:17:17,287 --> 00:17:20,789 కాదు, బార్నీ, తను నేరస్థురాలు కాదు. మెకానికల్ శాఖలోకి కొత్తగా వచ్చిందంతే. 48 00:17:20,790 --> 00:17:23,669 మధ్య అంతస్థుల నుండి వచ్చింది. పందెం ఓడిపోయి వచ్చింది అనుకుంటా. 49 00:17:25,796 --> 00:17:27,381 ఇలా రా, పాపా. 50 00:17:37,975 --> 00:17:38,976 సరే, చెప్పేది జాగ్రత్తగా విను. 51 00:17:39,560 --> 00:17:42,520 అయిదు నిమిషాలకు ఒకసారి లోడ్ వస్తుంది. అర్థమైందా? 52 00:17:42,521 --> 00:17:43,855 ఇక్కడ పని ఏంటో తనకి చెప్పేశాలే. 53 00:17:43,856 --> 00:17:46,024 తనకి సరిగ్గా చెప్పావో లేదో. 54 00:17:46,859 --> 00:17:50,778 మామూలుగా అయితే, రీసైక్లింగ్ వాళ్ళు పనికిరాని వస్తువులనే గొట్టం గుండా పంపించాలి, 55 00:17:50,779 --> 00:17:53,949 కానీ, దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. 56 00:17:54,575 --> 00:17:58,203 ఏ వస్తువైనా, అగ్నికి ఆహుతైపోయే ముందు చివరిగా ఇక్కడికే వస్తుంది. 57 00:17:58,745 --> 00:18:01,248 మంచి వస్తువులని మళ్ళీ రీసైక్లింగుకే పంపించేస్తాం. 58 00:18:01,874 --> 00:18:05,002 ఇంకా మంచి వస్తువులని వాకర్ కి ఇచ్చేస్తాం. 59 00:19:20,619 --> 00:19:21,994 ఇక్కడ వేడిగా ఉంటుంది. 60 00:19:21,995 --> 00:19:24,205 నీళ్లు బాగా తాగాలి, లేదంటే అస్థిపంజరం అయిపోతావు. 61 00:19:24,206 --> 00:19:26,083 గ్లాడీస్, మరీ దారుణంగా చెప్పకు. 62 00:19:26,792 --> 00:19:29,585 మరీ దారుణమైనది ఏంటో చెప్పనా, షర్లీ పాప్స్? 63 00:19:29,586 --> 00:19:31,420 బెల్టుపై నిద్రపోవడం, 64 00:19:31,421 --> 00:19:35,092 అప్పుడు జట్టు రోలర్ల మధ్యలో ఇరుక్కొని, తల పుచ్చకాయలా పగిలిపోతుంది. 65 00:19:37,010 --> 00:19:38,803 - ఇది వాకర్ కి పంపాలా? - ఇన్సినేటర్ కి పంపాలి. 66 00:19:38,804 --> 00:19:39,972 వాకర్ కి బొమ్మలంటే పడదు. 67 00:19:40,681 --> 00:19:41,639 నేను తీసుకోవచ్చా? 68 00:19:41,640 --> 00:19:42,724 దేనికి? 69 00:19:43,600 --> 00:19:45,726 ఒక నిమిషం సమయం దక్కితే, దీన్ని బాగు చేసేస్తా. 70 00:19:45,727 --> 00:19:48,939 నీకు ఒక నిమిషం సమయం ఉంటే, నా పని కొంచెం చేసి పెట్టు. 71 00:19:52,693 --> 00:19:55,529 - నీకు నిద్ర లేకుండా చేస్తున్నామా? - లేదు. 72 00:19:57,197 --> 00:19:59,490 నీకు ఇష్టం లేకపోతే, నువ్వు మిసెస్ వీవర్స్ దగ్గర ఉండాల్సిన పని లేదు. 73 00:19:59,491 --> 00:20:00,993 మా ఇంట్లో ఉండవచ్చు, నేను, నాన్న ఉంటాం. 74 00:20:02,077 --> 00:20:03,287 పర్వాలేదులే. 75 00:20:05,330 --> 00:20:06,623 నీ ఇష్టం. 76 00:20:19,303 --> 00:20:21,345 నీ వయస్సు వారు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి, 77 00:20:21,346 --> 00:20:23,599 నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. 78 00:20:26,977 --> 00:20:28,645 నీకు స్నేహితులు అంటే ఇష్టం లేదేమో. 79 00:20:30,272 --> 00:20:31,773 ఏం చేస్తున్నావు? 80 00:20:32,399 --> 00:20:34,651 - ఏమీ లేదు. - నిజంగా? 81 00:20:38,447 --> 00:20:39,656 ఇదేమైనా బొమ్మల షాపా? 82 00:20:40,157 --> 00:20:42,158 దీని మీద అయిదు నిమిషాలు కూర్చుంటా అంతే. 83 00:20:42,159 --> 00:20:43,534 ఇక్కడ, నువ్వు నా కోసం పని చేయాలి. 84 00:20:43,535 --> 00:20:46,330 నా కోసం, సైలో కోసం పని చేయాలి అనుకో, కానీ ముఖ్యంగా నా కోసమే. 85 00:20:48,582 --> 00:20:49,791 నువ్వేమైనా బాగు చేయాలనుకుంటే... 86 00:20:52,503 --> 00:20:53,504 దీన్ని బాగు చేయ్. 87 00:20:58,884 --> 00:21:00,344 దీన్ని ట్రాష్ లైన్లో చూశా. 88 00:21:01,803 --> 00:21:03,514 దాన్ని బాగు చేయగలవేమో చూడు. 89 00:21:09,895 --> 00:21:10,811 ఇంతకీ ఏంటిది? 90 00:21:10,812 --> 00:21:12,648 అదేంటో నువ్వే కనుక్కో. 91 00:21:17,861 --> 00:21:18,946 చాలా కాలమైంది. 92 00:21:20,864 --> 00:21:22,241 దేనికి చాలా కాలమైంది? 93 00:21:24,493 --> 00:21:25,786 నాకు ఒక నేస్తం ఉండి. 94 00:21:30,624 --> 00:21:33,001 మా అమ్మ చనిపోయాక... 95 00:21:33,544 --> 00:21:35,337 మీ అమ్మ ఆత్మహత్య చేసుకున్నాక. 96 00:21:36,755 --> 00:21:38,674 ఇక్కడ మేమేమీ తడుముకోము. 97 00:21:39,550 --> 00:21:41,342 ఏదైనా పంపు పని చేయకపోతే, మేము... 98 00:21:41,343 --> 00:21:46,430 "అది పూర్తి సామర్థ్యంతో పని చేయట్లేదేమో" లాంటి డైలాగ్స్ కొట్టం. 99 00:21:46,431 --> 00:21:47,599 అది పని చేయట్లేదని చెప్పేస్తాం. 100 00:21:49,768 --> 00:21:51,979 అది బాధాకరమైన, దారుణమైన విషయమే. 101 00:21:53,313 --> 00:21:55,023 కానీ మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. 102 00:21:58,360 --> 00:21:59,319 అవును... 103 00:22:00,779 --> 00:22:05,450 అదేదో అంటు వ్యాధి అన్నట్టు, ఇతర పిల్లలు నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు, 104 00:22:05,951 --> 00:22:07,410 లేదా, ఏం చెప్పాలో వాళ్లకి తెలీలేదేమో. 105 00:22:07,411 --> 00:22:10,998 కాబట్టి, చాలా కాలమైందనే చెప్పాలి. 106 00:22:13,667 --> 00:22:14,667 హేయ్. 107 00:22:14,668 --> 00:22:18,005 ఒకటి చెప్పనా? కొన్నేళ్ల క్రితం నాకు న్యుమోనియా వచ్చింది. 108 00:22:19,047 --> 00:22:20,548 అది ఇక్కడ ఎలా వచ్చిందనేది మిస్టరీ. 109 00:22:20,549 --> 00:22:22,634 కానీ ఆరోగ్యం బాగా దెబ్బ తింది, 110 00:22:23,635 --> 00:22:27,472 డాక్టర్ స్టర్న్ నాకు పెన్సిలిన్ తెచ్చిచ్చారు, దానితో నాకు నయమైపోయింది. 111 00:22:29,683 --> 00:22:31,018 కానీ ఆ మొదటి రాత్రి... 112 00:22:33,145 --> 00:22:34,771 నాకు భయంకరమైన కల వచ్చింది. 113 00:22:35,731 --> 00:22:37,983 కానీ అది కల కాదు. నేను మేలుకున్నాక, కలలో జరిగినట్టే జరిగింది. 114 00:22:39,484 --> 00:22:45,032 కళ్ళు తెరిచాక, నేను నిద్రలో ఉన్నప్పుడు 115 00:22:45,616 --> 00:22:46,825 అందరూ వెళ్లిపోయారని గ్రహించా. 116 00:22:48,202 --> 00:22:49,411 ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. 117 00:22:52,706 --> 00:22:54,458 అంత భయం నాకెప్పుడూ కలగలేదు. 118 00:22:57,002 --> 00:22:59,921 ఆ తలుపు తెరిచి, వరండాలోకి వెళ్ళాను. 119 00:22:59,922 --> 00:23:03,591 "ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా?" అంటూ గట్టిగా అరిచాను. 120 00:23:03,592 --> 00:23:04,927 ఎన్నిసార్లు అరిచానో తెలీదు, 121 00:23:06,053 --> 00:23:09,806 చివరికి వరండా చివరన ఉండే ఫ్రెడ్, "అరవకు తల్లీ, సమయం తెల్లవారు మూడయింది," అన్నాడు. 122 00:23:13,769 --> 00:23:15,062 ఆ మాట వినగానే ఎంత హాయిగా అనిపించిందో. 123 00:23:26,114 --> 00:23:27,324 ఇక ఆపండి. 124 00:23:45,050 --> 00:23:46,467 వాకర్ కి చెప్పి బాగు చేయించుకున్నావా? 125 00:23:46,468 --> 00:23:47,970 లేదు, నేనే బాగు చేశా. 126 00:23:49,596 --> 00:23:50,597 నీకే ఇస్తున్నా. 127 00:23:51,348 --> 00:23:54,142 ఏంటి? ఎందుకు? నేనేమీ పసికూనని కాదు. నాకెందుకు బొమ్మ! 128 00:23:54,643 --> 00:23:55,644 షర్లీ. 129 00:23:56,270 --> 00:23:57,729 నిన్న ఫీల్ అయ్యావని, కూల్ చేద్దామని ఇస్తోంది. 130 00:23:58,355 --> 00:24:00,983 దాన్ని తీసుకొని, తన మీద కోపం వదిలేయ్. 131 00:24:04,403 --> 00:24:05,404 ఎలా బాగు చేశావు? 132 00:24:08,490 --> 00:24:10,825 దాని లోపల ఉండే కాయిల్డ్ స్ప్రింగ్ పాడయింది. 133 00:24:10,826 --> 00:24:12,578 కాబట్టి వాకర్ వర్క్ షాపులో దాన్ని రిపేర్ చేశాను. 134 00:25:05,839 --> 00:25:07,049 హలో? 135 00:25:09,301 --> 00:25:10,511 ఎవరైనా ఉన్నారా? 136 00:25:25,901 --> 00:25:26,860 రావే. 137 00:25:37,162 --> 00:25:38,372 రా. 138 00:28:37,134 --> 00:28:38,218 అయ్యాయో! 139 00:30:20,237 --> 00:30:21,446 సరే మరి. 140 00:31:18,086 --> 00:31:19,504 ముందుకు వెళ్లడం ప్రమాదకరం శిక్షార్హం 141 00:31:19,505 --> 00:31:20,588 ఒప్పంద ఉల్లంఘన 142 00:31:20,589 --> 00:31:21,924 హేయ్. 143 00:31:41,485 --> 00:31:42,777 ఏంటి ఈ రాతలు? 144 00:31:42,778 --> 00:31:43,779 వేలు ఎప్పుడూ 145 00:31:44,404 --> 00:31:46,322 అవి తిరుగుబాటు కాలానికి చెందినవి అనుకుంటా. 146 00:31:46,323 --> 00:31:49,117 అంతకు మించి నాకు తెలీదు. 147 00:31:52,663 --> 00:31:56,208 ఒకసారి, నేను నాక్స్ తో, ఇంకా అతని మిత్రులు కొంత మందితో ఇక్కడికి వచ్చి, 148 00:31:56,792 --> 00:31:58,001 అక్కడ నిద్రపోయా. 149 00:31:58,585 --> 00:32:00,921 వాళ్ళు నా గురించి మర్చిపోయారనుకుంటా. 150 00:32:01,505 --> 00:32:04,465 ఏదేమైనా, వాళ్ళు నన్ను వదిలేసి, లైట్స్ ఆపేసి వెళ్లిపోయారు, 151 00:32:04,466 --> 00:32:06,760 నాకు మెలకువ వచ్చాక, ఏమీ కనిపించలేదు. 152 00:32:08,053 --> 00:32:09,554 మళ్ళీ నీ కోసం వచ్చారా? 153 00:32:09,555 --> 00:32:10,639 లేదు. 154 00:32:11,181 --> 00:32:12,599 మరి ఎలా బయటపడ్డావు? 155 00:32:14,685 --> 00:32:15,686 నేను బయటపడితేగా. 156 00:32:16,228 --> 00:32:18,021 ఇక్కడే ఉండిపోయా జీవితాంతం. 157 00:32:22,234 --> 00:32:24,862 నేను చాలా అంటే చాలా నిదానంగా బయటపడే పని మొదలుపెట్టాను. 158 00:32:26,196 --> 00:32:27,406 కానీ బయట అయితే పడ్డాను. 159 00:32:29,575 --> 00:32:30,576 నేనైతే బయటపడగలిగే దాన్ని కాదు. 160 00:32:31,869 --> 00:32:32,870 తప్పకుండా బయటపడే దానివే. 161 00:32:33,620 --> 00:32:36,957 ఇంకేం చేస్తావు? చస్తావా? 162 00:32:55,267 --> 00:32:56,101 ఏంటిది? 163 00:38:37,860 --> 00:38:42,155 ఏం దాస్తున్నావు రస్ 164 00:38:43,198 --> 00:38:44,199 హలో? 165 00:38:45,075 --> 00:38:46,076 నిజం 166 00:40:14,623 --> 00:40:15,541 సరే మరి. 167 00:41:05,090 --> 00:41:06,049 సరే మరి. 168 00:42:34,429 --> 00:42:35,430 బతికిన వాళ్ళు ఎవరైనా మాకు సాయపడండి 169 00:43:37,534 --> 00:43:38,744 హేయ్! 170 00:43:42,581 --> 00:43:45,667 మంచిది. సంగీతం విన్నావన్నమాట. 171 00:43:46,335 --> 00:43:48,336 ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. 172 00:43:48,337 --> 00:43:51,048 కాబట్టి, ఒక విషయం చెప్తా, విను. 173 00:43:52,716 --> 00:43:54,593 నువ్వు తలుపును తెరవాలని చూశావు... 174 00:43:58,847 --> 00:44:02,517 నేను అర్థం చేసుకోగలను, మూసి ఉన్న తలుపును చూస్తే, 175 00:44:02,518 --> 00:44:04,144 అవతలి వైపు ఏముందో తెలుసుకోవాలనిపిస్తుందిలే. 176 00:44:04,645 --> 00:44:06,480 నేను అర్థం చేసుకోగలను. 177 00:44:08,607 --> 00:44:10,567 విషయం ఏంటంటే, అదే పని నువ్వు మళ్ళీ చేస్తే... 178 00:44:12,569 --> 00:44:13,779 నిన్ను చంపేస్తా. 179 00:45:04,746 --> 00:45:06,748 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్