1 00:00:26,109 --> 00:00:27,152 ఆపేయ్. 2 00:00:28,570 --> 00:00:29,571 {\an8}నియమావళి 3 00:00:35,452 --> 00:00:40,624 {\an8}శుభ్రం చేయని సందర్భంలో, యుద్ధానికి సన్నద్ధం కావాలి 4 00:01:38,557 --> 00:01:39,558 కార్ల్? 5 00:01:46,023 --> 00:01:47,941 దయచేసి లోపలే ఉండండి, యువర్ హానర్. 6 00:01:48,692 --> 00:01:49,901 ఏం జరుగుతోంది? 7 00:01:49,902 --> 00:01:51,486 షెరిఫ్ శుభ్రం చేయలేదు, మేడమ్. 8 00:01:55,574 --> 00:01:59,411 అందరూ వీలైనంత త్వరగా, వీలైనంత నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్లిపోండి. 9 00:02:00,120 --> 00:02:02,706 మీ భద్రతే మాకు ప్రధానం. 10 00:02:05,083 --> 00:02:08,503 అందరూ వీలైనంత త్వరగా, వీలైనంత నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్లిపోండి. 11 00:02:09,545 --> 00:02:11,673 మీ భద్రతే మాకు ప్రధానం. 12 00:02:14,259 --> 00:02:17,887 అందరూ వీలైనంత త్వరగా, వీలైనంత నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్లిపోండి. 13 00:02:17,888 --> 00:02:19,222 నికల్స్ గుట్టను దాటి వెళ్ళింది. 14 00:02:19,223 --> 00:02:20,848 - తెలుసు. - నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు. 15 00:02:20,849 --> 00:02:22,099 అలారం మోగించమని నేనే చెప్పాను. 16 00:02:22,100 --> 00:02:24,185 డ్యూటీలో లేని, అలాగే రిజర్వులో ఉన్న రెయిడర్స్ ఇప్పుడు రంగంలోకి దిగారు. 17 00:02:24,186 --> 00:02:27,523 మంచిది. రాత్రి ఎనిమిది గంటలకు ఎమర్జెన్సీ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ప్రకటించు, 18 00:02:28,106 --> 00:02:30,525 దానితో షెరిఫ్ డెప్యుటీలందరికీ ఇన్ ఛార్జీవి నువ్వే అవుతావు. 19 00:02:30,526 --> 00:02:32,068 అంతే కాక, నికల్స్ నాన్న మీద ఓ కన్నేసి ఉంచాలి. 20 00:02:32,069 --> 00:02:33,486 అలా అని అతడిని వేధించవద్దు. 21 00:02:33,487 --> 00:02:36,072 అతను ఎవరితో మాట్లాడుతున్నాడో, అతనితో ఎవరు మాట్లాడుతున్నారో గమనించండి. 22 00:02:36,073 --> 00:02:38,491 నికల్స్ ని శుభ్రం చేయడానికి పంపించిందే దీనికి అడ్డుకట్ట వేయడానికి. 23 00:02:38,492 --> 00:02:40,243 ఇవాళ కాసేపయ్యాక నేను ఒక ప్రసంగం ఇస్తాను. 24 00:02:40,244 --> 00:02:41,702 ఏం జరుగుతోందో విన్నావా? 25 00:02:41,703 --> 00:02:44,205 మరో తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని జనాలు మాట్లాడుకుంటున్నారు. 26 00:02:44,206 --> 00:02:46,207 అందుకే, ఇవాళ ఏం జరిగిందో జనాలకు తెలియాలి. 27 00:02:46,208 --> 00:02:47,542 ఆ విషయంపైనే దర్యాప్తు జరుగుతోంది. 28 00:02:47,543 --> 00:02:49,252 నికల్స్ కి తెలిసిన వారందరినీ విచారిస్తున్నాం. 29 00:02:49,253 --> 00:02:50,546 ఏం జరిగిందో నాకు తెలుసు. 30 00:02:51,505 --> 00:02:53,464 కింది అంతస్థుల్లో ఉండే ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకోవాలి. 31 00:02:53,465 --> 00:02:54,550 వాళ్ళని చెరసాలలో వేయండి. 32 00:02:55,175 --> 00:02:57,093 కానీ అక్కడి వాళ్ళు ఈ విషయంలో పండగ చేసుకుంటున్నారు. 33 00:02:57,094 --> 00:02:58,595 హేయ్! 34 00:02:59,429 --> 00:03:02,849 జనులారా, కాస్త శాంతించండి. 35 00:03:02,850 --> 00:03:07,645 అందరూ శాంతించండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 36 00:03:07,646 --> 00:03:08,980 నా మాట వినండి. 37 00:03:08,981 --> 00:03:11,399 అందరూ వీలైనంత త్వరగా, వీలైనంత నిశ్శబ్దంగా ఇళ్లకు... 38 00:03:11,400 --> 00:03:13,901 వద్దు, అధికారిక ప్రకటనలను అలా కట్ చేసేయకూడదు! 39 00:03:13,902 --> 00:03:14,987 మీ భద్రతే మాకు ప్రధానం... 40 00:03:15,988 --> 00:03:18,282 హేయ్! వద్దు. ఆ పని చేయవద్దు. 41 00:03:19,241 --> 00:03:20,324 భలే వారే! 42 00:03:20,325 --> 00:03:21,617 నియమాలను రూపొందించింది నేను కాదు. 43 00:03:21,618 --> 00:03:22,995 హ్యాంక్, దొబ్బేయ్ నువ్వు! 44 00:03:23,620 --> 00:03:25,788 మీరు చూసిందే నేను కూడా చూశాను. 45 00:03:25,789 --> 00:03:27,040 ఆమె గుట్ట దాటి వెళ్ళింది. 46 00:03:27,749 --> 00:03:29,418 అంటే, అక్కడ ఏమీ కాదనే కదా అర్థం. 47 00:03:30,919 --> 00:03:32,628 నాకు కూడా బయటకు వెళ్లాలనుంది. 48 00:03:32,629 --> 00:03:34,755 ఆ మాట అనకు. అలా అనకూడదు. 49 00:03:34,756 --> 00:03:38,050 దయచేసి శాంతించండి. అలా అనకూడదు. 50 00:03:38,051 --> 00:03:39,177 పక్కకు జరగండి. 51 00:03:39,178 --> 00:03:43,556 హ్యాంక్, వదిలేయ్. 52 00:03:43,557 --> 00:03:45,975 - దీన్ని చూసుకోవడం నీ వల్ల కాని పని. - అవును! 53 00:03:45,976 --> 00:03:48,644 నువ్వు అన్నీ మూసుకొని, వీళ్ళు చెప్పేదేంటో వినాలి. 54 00:03:48,645 --> 00:03:49,562 అవును! 55 00:03:49,563 --> 00:03:52,523 - ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. - అవును! 56 00:03:52,524 --> 00:03:54,525 - ఏమంటారు? - ఉంది! 57 00:03:54,526 --> 00:03:57,821 ఇప్పటిదాకా ఎవరూ చూడని దృశ్యాన్ని మేము చూశాము. 58 00:03:58,864 --> 00:04:01,490 - దాన్ని ఏమని అర్థం చేసుకోవాలో మాకు తెలియాలి. - అవును. 59 00:04:01,491 --> 00:04:03,869 జూలియా నికల్స్ మనందరి మనిషి. 60 00:04:05,287 --> 00:04:07,039 మరి తనని ఎందుకు పట్టించావు? 61 00:04:17,382 --> 00:04:18,257 నేను పట్టించిన మాట నిజమే. 62 00:04:23,847 --> 00:04:27,226 జూల్స్ నాకు తోబుట్టువుతో సమానం, కానీ ఏదోక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది నాకు. 63 00:04:29,728 --> 00:04:30,896 తను ఇక్కడే ఉన్నట్టు వారికి తెలుసు. 64 00:04:32,439 --> 00:04:34,148 వాళ్ళు మన ఇళ్ళని ఛిన్నాభిన్నం చేసి ఉండేవాళ్ళు. 65 00:04:34,149 --> 00:04:36,026 వాళ్ళు ఒక సాకు కోసం ఎదురు చూస్తున్నారంతే. 66 00:04:37,402 --> 00:04:40,029 మనం వెర్రోళ్ళం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్లకి మనం చూపించాలి... 67 00:04:40,030 --> 00:04:43,658 సైలోకి విద్యుత్తు సరఫరాని నిలిపేసి, అంతా స్తంభింపజేస్తే, ఆ ఆలోచన మార్చుకుంటారు. 68 00:04:43,659 --> 00:04:45,785 అవును! 69 00:04:45,786 --> 00:04:46,954 ఒక్కసారే! 70 00:04:48,872 --> 00:04:50,832 సైలోని మనం ఒక్కసారే స్తంభింపజేయగలం. 71 00:04:51,667 --> 00:04:53,000 ఆ తర్వాత వాళ్ళు మనల్ని అణచివేస్తారు. 72 00:04:53,001 --> 00:04:55,003 జూల్స్ గుట్ట దాటి వెళ్లడం అందరం చూశాం. 73 00:04:55,504 --> 00:04:58,215 ఇక అబద్ధాలను మేము వినలేం. మాకు నిజం కావాలి. 74 00:05:01,426 --> 00:05:02,553 నేను చెప్పేది వినండి! 75 00:05:03,345 --> 00:05:04,346 వినండి. 76 00:05:17,734 --> 00:05:20,487 ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి కదా, ముందు ఆ పని చూడండి. 77 00:05:27,119 --> 00:05:28,662 నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. 78 00:05:29,496 --> 00:05:30,956 కొంచెం రెచ్చగొట్టినా, హింసని ఆపలేము. 79 00:05:31,957 --> 00:05:33,457 అది ఆదేశమా? 80 00:05:33,458 --> 00:05:34,585 అవును. 81 00:07:00,587 --> 00:07:02,673 {\an8}హ్యూ హొవీ రచించిన బుక్ సిరీస్, సైలో ఆధారంగా తెరకెక్కించబడింది 82 00:07:19,690 --> 00:07:20,941 డాక్టర్? 83 00:07:21,775 --> 00:07:22,901 డాక్టర్ నికల్స్? 84 00:07:27,364 --> 00:07:29,408 ఆండర్సన్ బిడ్డ ఆపకుండా ఏడుస్తూనే ఉంది. 85 00:07:42,462 --> 00:07:44,214 ఇలా ఎలా జరిగింది, పాపా? 86 00:07:44,923 --> 00:07:45,924 ఏంటి? 87 00:07:46,717 --> 00:07:48,468 తన మోచేయి డిస్ లొకేట్ అయింది. 88 00:07:52,639 --> 00:07:53,682 సెట్ చేసేశాను. 89 00:07:54,516 --> 00:07:55,559 అయిపోయింది. 90 00:07:57,561 --> 00:07:58,645 నన్ను ఏమైనా... 91 00:07:59,354 --> 00:08:00,439 పాపం, చిట్టి తల్లి. 92 00:08:10,949 --> 00:08:12,159 పాపం, చిట్టి తల్లి. 93 00:08:19,166 --> 00:08:20,334 నిజంగానే అంటున్నావే. 94 00:08:21,293 --> 00:08:23,586 షెరిఫ్ శాఖకి నువ్వు ఇన్ చార్జీవా? 95 00:08:23,587 --> 00:08:25,923 ప్రస్తుతానికి. తాత్కాలికంగానే, పాల్. 96 00:08:26,507 --> 00:08:28,549 షెరిఫ్ ఇంటిని శుభ్రపరిచే పని కూడా చేస్తున్నాము. 97 00:08:28,550 --> 00:08:31,762 నువ్వు కుటుంబ సమేతంగా వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లాలని బెర్నార్డ్ అనుకుంటున్నాడు. 98 00:08:32,638 --> 00:08:34,639 మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని చూస్తున్నాడు. 99 00:08:34,640 --> 00:08:36,517 తను గుట్ట దాటి వెళ్ళింది. 100 00:08:37,726 --> 00:08:39,227 మరి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎలా నెలకొంటాయి? 101 00:08:40,020 --> 00:08:44,441 అలా మనమే చేయాలి. అందరం ప్రశాంతంగా, మామూలుగా వ్యవహరించాలి. 102 00:08:53,659 --> 00:08:56,410 ఒప్పందంలోని ఇంకేమైనా భాగాలను ఉల్లంఘించాలని బెర్నార్డ్ ప్లాన్ చేస్తున్నాడా? 103 00:08:56,411 --> 00:08:57,662 పాల్, ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. 104 00:08:57,663 --> 00:09:00,122 నికల్స్ శుభ్రం చేయలేదు కదా, ఇప్పుడు కూడా దానిపై నేను రిపోర్ట్ తయారు చేయాలా? 105 00:09:00,123 --> 00:09:01,208 తయారు చేయాలి మరి. 106 00:09:04,169 --> 00:09:05,921 ఇప్పటికీ నువ్వు నీ వాంగ్మూలం నాకు ఇవ్వలేదు. 107 00:09:07,798 --> 00:09:09,925 నికల్సే స్వయంగా బయటకు వెళ్లాలని చెప్పడం గురించి. 108 00:09:16,932 --> 00:09:20,227 సరే, నా వాంగ్మూలాన్ని విను. 109 00:09:21,520 --> 00:09:25,190 నికల్స్, పురాతన వస్తువులకు సంబంధించిన మన చట్టాలను ఉల్లఘించిందని బెర్నార్డ్ భావించాడు. 110 00:09:25,732 --> 00:09:29,151 ఏ ఆటంకమూ లేకుండా అరెస్ట్ చేయాలని ఆమెని మొక్కజొన్నల పొలానికి రప్పించాడు. 111 00:09:29,152 --> 00:09:32,071 ఆమె దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన పురాతన వస్తువు గురించి ఆమెని అతను నిలదీశాక... 112 00:09:32,072 --> 00:09:33,489 ఆ వస్తువునే తర్వాత అతను నాశనం చేశాడు. 113 00:09:33,490 --> 00:09:35,617 సైలో మంచి కోసమే అతనలా చేశాడు. 114 00:09:37,035 --> 00:09:40,789 ఆమెని అతను నిలదీసినప్పుడు, నా కళ్ళ ముందే "నేను బయటకు వెళ్తాను," అని ఆమె అంది. 115 00:09:41,456 --> 00:09:43,875 ఆమెని అదుపులోకి తీసుకోవాలని రెయిడర్లు వచ్చినప్పుడు పారిపోయింది. 116 00:09:43,876 --> 00:09:45,543 వాళ్ళు ఆమెని వెంబడించి పట్టుకున్నారు. 117 00:09:45,544 --> 00:09:46,669 నా వాంగ్మూలం ముగిసింది. 118 00:09:46,670 --> 00:09:47,754 అది చాలా? 119 00:09:51,508 --> 00:09:52,426 ఒక్క విషయం. 120 00:09:54,344 --> 00:10:00,100 బయటకు వెళ్తానని నికల్స్ చెప్పింది కదా, మరి తనకి పారిపోవాల్సిన అవసరమేంటి? 121 00:10:01,977 --> 00:10:02,895 అది నాకు తెలీదు. 122 00:10:03,729 --> 00:10:05,647 మనస్సు మార్చుకొని ఉంటుంది. 123 00:10:12,487 --> 00:10:13,947 ఒకవేళ తను బతికే ఉంటే? 124 00:10:16,074 --> 00:10:19,577 తను బయట ప్రాణాలతోనే ఉండే అవకాశం ఉన్నప్పుడు, మనం ఏదోకటి చేయాలి కదా! 125 00:10:19,578 --> 00:10:20,871 తను చనిపోయి ఉంటుంది. 126 00:10:21,997 --> 00:10:24,166 ఆ సూట్ లో అంత గాలి ఉండాలి కదా! 127 00:10:26,793 --> 00:10:28,795 తనకి ఇవ్వమని నాకొక చీటీ ఇచ్చావు కదా, అందులో ఏముంది? 128 00:10:29,671 --> 00:10:31,006 నువ్వు చదువుతావని అనుకున్నానే. 129 00:10:31,798 --> 00:10:34,800 హా, చదివా, కానీ... నాకు అది అర్థం కాలేదు. 130 00:10:34,801 --> 00:10:36,261 నీకు అర్థం అవ్వకూడదనే అలా రాశా. 131 00:10:36,970 --> 00:10:39,681 నాకు, తనకి సంబంధించిన ఒక రహస్యమైన జోకులే అది. 132 00:10:41,099 --> 00:10:42,726 సరఫరాల శాఖలో అవి బాగుంటాయని అన్నావు కదా. 133 00:10:44,144 --> 00:10:45,019 నీ ఉద్దేశం టేపులా? 134 00:10:45,020 --> 00:10:48,482 కొద్ది సేపు నన్ను ఒంటరిగా బాధపడనిస్తావా? 135 00:10:54,446 --> 00:10:55,614 క్షమించు, వాక్. 136 00:10:58,283 --> 00:10:59,117 కానీ... 137 00:11:00,327 --> 00:11:02,037 ఉత్త బాధపడిపోవడం వల్ల ఏ లాభమూ ఉండదు. 138 00:11:12,631 --> 00:11:13,549 హేయ్, షర్ల్. 139 00:11:16,009 --> 00:11:17,219 ఏం కావాలి నీకు? 140 00:11:17,845 --> 00:11:20,514 నేను వాకర్ తో ఒంటరిగా మాట్లాడాలి. 141 00:11:25,727 --> 00:11:26,728 నువ్వు వెళ్ళులే. 142 00:11:39,199 --> 00:11:40,158 ఎలా ఉన్నావు? 143 00:11:40,742 --> 00:11:42,493 ఎలా ఉన్నానని అనుకుంటున్నావు? 144 00:11:42,494 --> 00:11:45,746 హా. అది చెత్త ప్రశ్న. సారీ. 145 00:11:45,747 --> 00:11:46,665 చూడు... 146 00:11:48,125 --> 00:11:49,417 క్షమించాలి, వాకర్. 147 00:11:49,418 --> 00:11:52,171 కానీ జ్యుడిషియల్ సెక్యూరిటీ వాళ్ళు నిన్ను విచారించాలని అనుకుంటున్నారు. 148 00:11:53,547 --> 00:11:54,798 నేనెక్కడ ఉంటానో వాళ్లకి తెలుసు కదా. 149 00:11:55,716 --> 00:11:58,468 నిజానికి, నిన్ను అదుపులోకి తీసుకోమన్నారు. 150 00:11:59,219 --> 00:12:01,304 ఇప్పుడు షెరిఫ్ శాఖ, జ్యుడిషియల్ శాఖ కింద పని చేస్తోందా? 151 00:12:01,305 --> 00:12:03,348 అవును. ఒక గంట క్రితం నుండి. 152 00:12:05,642 --> 00:12:07,268 నువ్వు నాతో రావాలి, వాక్... 153 00:12:07,269 --> 00:12:08,353 ఇంకో విషయం... 154 00:12:10,939 --> 00:12:12,649 నిజంగానే అదుపులోకి తీసుకున్నట్టు అనిపించేలా ఉండాలి. 155 00:12:14,651 --> 00:12:15,735 అది అసంభవం. 156 00:12:15,736 --> 00:12:18,071 శుభ్రం చేయము అని అందరూ అంటారు, కానీ శుభ్రం చేస్తారు. 157 00:12:18,572 --> 00:12:19,865 యువర్ హానర్, నా కళ్ళతో చూశా. 158 00:12:20,699 --> 00:12:24,203 ఆమె గుడ్డని బయటకు తీసి, కింద పడేసింది. 159 00:12:26,622 --> 00:12:29,124 - కానీ ఆ తర్వాత... - ఏంటి? చనిపోకూడదని కూడా అనేసుకుందా? 160 00:12:31,502 --> 00:12:33,420 తను నడుచుకుంటూ గుట్ట దాటి వెళ్ళింది. 161 00:12:37,966 --> 00:12:38,967 నేను నమ్మను. 162 00:12:40,052 --> 00:12:41,386 అందరూ చూశారు అది. 163 00:12:45,015 --> 00:12:46,016 ఇక నువ్వు బయలుదేరు. 164 00:12:57,986 --> 00:12:59,029 ఇప్పుడేం చేస్తావు, బెర్నార్డ్? 165 00:13:34,398 --> 00:13:37,526 మెకానికల్ శాఖకి చెందిన సన్నాసులని ఇక్కడికి రావద్దని చెప్పాం కదా. 166 00:13:41,738 --> 00:13:43,490 నిన్ను చూడటం బాగుందిరా, ముష్టి వెధవా. 167 00:13:44,408 --> 00:13:45,576 నిన్ను మిస్ అయ్యా. 168 00:13:46,785 --> 00:13:48,911 నీ షాడో గురించి ఏవేవో కథలు విన్నాను. 169 00:13:48,912 --> 00:13:50,913 పై అంతస్థుల వాళ్లకి బాగా మండి ఉంటుంది. 170 00:13:50,914 --> 00:13:52,791 అవును, వాళ్ళు అందరి మీదా పడుతున్నారు. 171 00:13:54,042 --> 00:13:55,043 వాళ్ళ బొంద. 172 00:13:55,836 --> 00:13:57,671 మనకి వాళ్ళ అవసరం కన్నా, మన అవసరమే వాళ్లకి ఎక్కువ. 173 00:14:00,090 --> 00:14:01,592 ఈసారి అలా అనిపించట్లేదు. 174 00:14:03,302 --> 00:14:06,221 హా, నిజమే. కానీ దాని సంగతి నువ్వు చూసుకుంటావులే. 175 00:14:07,222 --> 00:14:08,557 మీ నాన్న లక్షణాలే నీకూ అబ్బేయి. 176 00:14:10,642 --> 00:14:13,061 ఒక్కోసారి అది మంచి విషయమో, చెడు విషయమో అర్థం కాదు. 177 00:14:13,854 --> 00:14:16,398 నేను చెప్తున్నా కదా, అది మంచి విషయమే. 178 00:14:17,608 --> 00:14:19,359 అయన వల్లే, నేను ప్రాణాలతో బయటపడ్డాను. 179 00:14:27,618 --> 00:14:28,660 నాకు సాయం కావాలి. 180 00:14:29,661 --> 00:14:31,205 సరే. నేను చేయగలిగింది చేస్తా. 181 00:14:32,289 --> 00:14:33,373 రెండు పనులు చేసి పెట్టాలి. 182 00:14:33,999 --> 00:14:36,960 ఎవరైనా వచ్చి, ఆయుధాలు చేయమంటే, చేయవద్దు. 183 00:14:37,461 --> 00:14:38,420 అది చాలా ప్రమాదకరం. 184 00:14:45,010 --> 00:14:46,136 రెండో పని ఏంటి? 185 00:14:58,732 --> 00:15:00,234 నేను ఎందుకు వచ్చానో నీకు తెలియాలి. 186 00:15:01,610 --> 00:15:02,611 అంతేలే. 187 00:15:20,087 --> 00:15:22,881 నీకు డ్రింక్ ఇచ్చేదాన్నే, కానీ నువ్వు అంత సేపు ఉండాలని అనుకోవట్లేదు. 188 00:15:25,217 --> 00:15:26,218 అర్థమైంది. 189 00:15:26,718 --> 00:15:29,136 కావాలంటే, నువ్వు కూడా ఒక డ్రింక్ తీసుకో. 190 00:15:29,137 --> 00:15:30,222 నేను తాగడం మానేశా. 191 00:15:32,391 --> 00:15:33,475 మానేశావా? 192 00:15:36,520 --> 00:15:37,688 ఎప్పటి నుండి? 193 00:15:38,522 --> 00:15:39,356 ఇవాళ్టి నుండే. 194 00:15:46,488 --> 00:15:50,909 ఈ సాయంత్రం సైలో వాసులని ఉద్దేశించి ప్రసంగించనున్నాను, నువ్వు మద్దతు ఇచ్చి, నా వెనుకే ఉండాలని కోరడానికి వచ్చా. 195 00:15:52,744 --> 00:15:54,079 నీ వెనక ఉండాలా? 196 00:15:54,580 --> 00:15:57,332 అందరం కలిసే ఉన్నామని చూపడానికి, జనాలకు ధైర్యం ఇవ్వడానికి. 197 00:15:59,168 --> 00:16:00,169 కానీ నన్ను ఆదేశించాలని చూడకు. 198 00:16:03,005 --> 00:16:05,631 పది వేల మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి, 199 00:16:05,632 --> 00:16:07,342 నిన్ను ఆదేశించాల్సి ఉంటుందని అనిపించలేదు. 200 00:16:10,512 --> 00:16:14,683 గౌరవంతో నిన్ను అడగడానికి నేనే స్వయంగా వచ్చా. 201 00:16:15,184 --> 00:16:17,603 తను గుట్టని ఎలా దాటిందో నీకు తెలుసా? 202 00:16:19,479 --> 00:16:20,646 టేప్ వల్లే అయ్యుంటుంది. 203 00:16:20,647 --> 00:16:22,941 ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆ విషయం ఎవరోకరు కనిపెట్టేస్తారు. 204 00:16:23,734 --> 00:16:26,904 దాన్ని నికల్స్ దొంగిలించినప్పుడు, తనని గనులకి పంపించకుండా పొరపాటు చేశాను. 205 00:16:28,739 --> 00:16:30,157 నువ్వు భయపడుతున్నావు. 206 00:16:31,491 --> 00:16:33,327 నా గురించి నీకన్నా బాగా ఎవరికీ తెలీదు. 207 00:16:34,786 --> 00:16:37,246 అయితే, జనాలు ఆవేశంతో వచ్చి 208 00:16:37,247 --> 00:16:40,291 తలుపులు పగులగొట్టేసి, మనందరినీ చంపేస్తారు అనుకుంటున్నావా? 209 00:16:40,292 --> 00:16:43,045 నేనేం అనుకుంటున్నాననే దాని గురించి భయం లేదు, చూసిన దాని గురించే భయపడుతున్నా. 210 00:16:44,213 --> 00:16:46,089 గుట్ట అవతల తనకి కనిపించే దాని గురించి భయపడుతున్నా. 211 00:16:46,673 --> 00:16:48,591 శవాలు వేలాది సంఖ్యలో ఉంటాయి. 212 00:16:48,592 --> 00:16:50,135 ఒక సైలోలోని జనాలందరూ చనిపోయారు. 213 00:16:50,802 --> 00:16:53,346 సైలోలో ఉండేవారు అంతర్యుద్ధం చేసుకొని చనిపోయినట్టు ఉంటుంది ఆ దృశ్యం. 214 00:16:53,347 --> 00:16:54,639 అదే నన్ను భయపెడుతోంది. 215 00:16:54,640 --> 00:16:56,517 ఎందుకంటే, అక్కడ జరిగినదే, ఇక్కడ కూడా జరగవచ్చు. 216 00:16:57,017 --> 00:16:59,394 నీ ఆరాధ్య "నియమావళి"లో ఎప్పుడు ఏం చేయాలో చెప్పే ప్రొటోకాల్స్ ఉంటాయి కదా. 217 00:16:59,978 --> 00:17:01,771 ఎవరైనా శుభ్రం చేయకపోతే ఏం చేయాలి అనేది ఉంది. 218 00:17:01,772 --> 00:17:03,940 కానీ ఎవరైనా నడుచుకుంటూ, కనిపించకుండా వెళ్ళిపోతే ఏం చేయాలో 219 00:17:03,941 --> 00:17:05,943 "నియమావళి"లో లేదు. 220 00:17:06,818 --> 00:17:09,779 అలా జరగవచ్చని పితామహులు ఉహించి ఉండరు, అది సాధ్యమని అనడం వాళ్లకి ఇష్టం లేదు కాబోలు. 221 00:17:09,780 --> 00:17:13,282 కానీ నేడు అది జరిగింది, సైలో వాసులందరూ దాన్ని చూశారు. 222 00:17:14,034 --> 00:17:15,492 అయితే, ఏం చేయబోతున్నావు? 223 00:17:15,493 --> 00:17:18,704 అది తేల్చడానికే ఇక్కడికి వచ్చా. 224 00:17:20,582 --> 00:17:22,000 నేనేం సాయపడలేను. 225 00:17:24,502 --> 00:17:26,127 ఒకప్పుడు నువ్వు నా షాడోవి. 226 00:17:26,128 --> 00:17:29,132 - కానీ ఇప్పుడు కాదు కదా. - ఇది ఎమర్జెన్సీ. 227 00:17:36,723 --> 00:17:38,433 నిన్ను నేనెప్పటికీ అర్థం చేసుకోలేను. 228 00:17:39,059 --> 00:17:40,060 సంగతి ఏంటి, మేరీ? 229 00:17:41,728 --> 00:17:43,230 పాతికేళ్ల రహస్యం. 230 00:17:44,815 --> 00:17:46,066 ఏం దాస్తున్నావు? 231 00:17:48,026 --> 00:17:49,319 నా దగ్గర ఏం దాస్తున్నావు నువ్వు? 232 00:17:50,946 --> 00:17:52,197 ఏదో దాస్తున్నావు నువ్వు. 233 00:17:54,157 --> 00:17:56,118 నాకు నీ సాయం కావాలి, 234 00:17:56,785 --> 00:17:58,703 మన పాత స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, 235 00:17:58,704 --> 00:18:00,622 సైలో బాగు కోసం కానీ, సాయపడాలని నీకు లేకపోతే, 236 00:18:01,582 --> 00:18:03,083 నీకు కావాల్సింది ఏంటో చెప్పు. 237 00:18:04,459 --> 00:18:05,918 ఇంకా విశాలమైన నివాసమా? 238 00:18:05,919 --> 00:18:06,962 ఏదైనా పురాతన వస్తువు కావాలా? 239 00:18:07,754 --> 00:18:09,964 పెద్ద కర్ర కావాలా? ఏం కావాలి నీకు? 240 00:18:09,965 --> 00:18:11,842 ఇప్పటికీ నా గురించి నీకేమీ తెలీదు కదా? 241 00:18:15,095 --> 00:18:16,889 సరే మరి. నాకేం కావాలో చెప్తా ఆగు. 242 00:18:22,394 --> 00:18:23,686 విజర్డ్ ఆఫ్ ఆజ్ 243 00:18:23,687 --> 00:18:25,898 ఈ కథలో చాలా శక్తివంతమైన మాంత్రికుడు ఒకడు ఉంటాడు, 244 00:18:27,107 --> 00:18:28,859 కానీ ఆయన ఎవరికీ కనిపించడు. 245 00:18:30,319 --> 00:18:32,654 చివరికి కనిపించినప్పుడు, అతను మోసగాడని వాళ్లకి తెలిసిపోతుంది... 246 00:18:33,780 --> 00:18:36,115 చిల్లర ట్రిక్స్ చేస్తూ నమ్మించాడని తెలుసుకుంటారు. 247 00:18:36,116 --> 00:18:37,034 అంటే, నేను మోసగాడినా? 248 00:18:38,785 --> 00:18:40,871 లేదు, అది నేను. 249 00:18:43,415 --> 00:18:47,711 కథ చివర్లో, అతను హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి, పరారైపోతాడు. 250 00:18:50,172 --> 00:18:51,256 నాకు కావాల్సింది కూడా అదే. 251 00:18:53,550 --> 00:18:54,676 నాకు ఆ సాయం చేసి పెట్టగలవా? 252 00:18:55,177 --> 00:18:57,554 నువ్వు చేస్తానంటే, నేను కూడా నీకు సాయపడతా. 253 00:18:58,764 --> 00:18:59,765 సాయం చేయలేవు అంటావా... 254 00:19:01,350 --> 00:19:02,976 తూర్పు తిరిగి దండం పెట్టి, దొబ్బేయ్. 255 00:19:37,928 --> 00:19:41,056 నాకు అస్సలు ఇష్టం లేకపోయినా, తప్పక నిన్ను జైల్లో పెట్టాల్సి వస్తోంది. 256 00:19:42,516 --> 00:19:46,185 ఏం జరుగుతోంది, హ్యాంక్? ముసలమ్మలని జైల్లో పెట్టడం ఎప్పట్నుండి చేస్తున్నావు? 257 00:19:46,186 --> 00:19:49,815 మీ ఇద్దరినీ విచారించాలని జ్యుడిషియల్ శాఖ నుండి నాకు ఆదేశాలు అందినప్పటి నుండి. 258 00:19:56,947 --> 00:20:00,284 ఏమైనా కావాలంటే, ఎవరైనా వచ్చే దాకా కేకలు పెట్టు. 259 00:20:04,162 --> 00:20:05,204 ఎక్కడికి వెళ్తున్నావు? 260 00:20:05,205 --> 00:20:08,667 మేయర్ ఇచ్చే ప్రసంగాన్ని అందరూ వినేలా మేము చూసుకోవాలి. 261 00:20:09,418 --> 00:20:12,003 ముందు, జనాలందరూ ఇంటికే పరిమితం కావాలని అన్నారు, 262 00:20:12,004 --> 00:20:13,839 ఇప్పుడు అందరూ బయటకు రావాలని అంటున్నారు. 263 00:20:14,464 --> 00:20:16,258 రండి. వెళదాం పదండి. 264 00:20:19,386 --> 00:20:20,387 బయటకు వెళ్ళు మార్గం 265 00:20:23,348 --> 00:20:25,684 అయితే, వాళ్లకి ఏం చెప్పావు? 266 00:20:27,019 --> 00:20:28,562 ఏం చెప్పలేదు. 267 00:20:29,354 --> 00:20:30,772 ఇంకా నువ్వు చెప్పావేమో అనుకున్నా. 268 00:20:31,356 --> 00:20:32,608 నేనలా చెప్పనని నీకు తెలుసు కదా. 269 00:20:42,367 --> 00:20:45,036 హ్యాంక్ తనని డెప్యూటీ స్టేషన్ లోని జైల్లో వేశాడు. 270 00:20:45,037 --> 00:20:46,454 మెక్ లెయిన్ కూడా అక్కడే ఉంది. 271 00:20:46,455 --> 00:20:47,915 ఖచ్చితంగా టేప్ గురించే అయ్యుంటుంది. 272 00:20:48,582 --> 00:20:50,875 జూల్స్ ఐటీ వాళ్ళ నుండి దొంగిలించిన టేప్, ఎందుకూ పనికి రానిది, కదా? 273 00:20:50,876 --> 00:20:55,088 దాని స్థానంలో మెక్ లెయిన్, వాకర్లు మన హీట్ టేప్ ని పెట్టి ఉంటారు. 274 00:20:55,631 --> 00:20:59,050 ఒక్క నిమిషం, సూట్ టేప్ పని చేయలేదని జ్యుడిషియల్ శాఖ వాళ్లకి తెలుసు అంటావా? 275 00:20:59,051 --> 00:21:00,676 వాళ్లకి తెలిసే ఉండాలి. 276 00:21:00,677 --> 00:21:04,890 మనం వాక్ దగ్గరికి చేరుకుని, ఏం జరిగిందో తెలుసుకోగలిగితే, మనకి ఆధారం లభిస్తుంది. 277 00:21:05,557 --> 00:21:08,309 కానీ జనాలు జ్యుడిషియల్ శాఖ వాళ్ళు చెప్పింది కాకుండా, వాకర్ చెప్పేది ఎందుకు నమ్ముతారు? 278 00:21:08,310 --> 00:21:11,271 ఎందుకంటే, జూలియా గుట్ట దాటడం వాళ్ళు చూశారు కాబట్టి. 279 00:21:17,027 --> 00:21:18,778 - విషయం ఏంటంటే... - నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 280 00:21:18,779 --> 00:21:22,198 అది మన పనే అని జ్యుడిషియల్ శాఖ వాళ్లకి అనుమానం రావచ్చు, కానీ పక్కాగా వాళ్లకి తెలీదు. 281 00:21:22,199 --> 00:21:23,909 ఆ ప్లాన్ లో నీకు చోటు లేదు. 282 00:21:24,660 --> 00:21:27,119 ఆ టేప్ తనకి ఇచ్చింది నేనే. 283 00:21:27,120 --> 00:21:28,996 - కావచ్చు. కానీ... - కానీలు, గీనీలు ఏవీ లేవు. 284 00:21:28,997 --> 00:21:33,334 జూలియా నా దగ్గరికి వచ్చింది, టేప్ మార్చమని నన్ను వేడుకుంది. 285 00:21:33,335 --> 00:21:34,836 అందులో నీకేం పాత్ర లేదు. 286 00:21:34,837 --> 00:21:36,838 లేదు, లేదు. తొక్కేం కాదు. 287 00:21:36,839 --> 00:21:38,756 మనం నోరు విప్పకుండా ఉందాం, 288 00:21:38,757 --> 00:21:41,092 ఏం జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారో చెప్పనిద్దాం. 289 00:21:41,093 --> 00:21:42,427 ఆ తర్వాత, అదేం జరగలేదని చెప్పేద్దాం. 290 00:21:43,011 --> 00:21:44,470 టేపే కారణమని వాళ్లకి తెలుసు. 291 00:21:44,471 --> 00:21:46,557 అది పక్కాగా మనిద్దరికి మాత్రమే తెలుసు. 292 00:21:47,641 --> 00:21:49,767 నోళ్లు మూసుకొని ఉందాం. ఏమీ ఎరగనట్టు నటిస్తే సరిపోతుంది కదా. 293 00:21:49,768 --> 00:21:51,769 బుర్ర వాడు కాస్త. 294 00:21:51,770 --> 00:21:54,689 వాళ్లకి మనమేం చెప్పనక్కర్లేదు. 295 00:21:54,690 --> 00:21:57,608 మన గురించి లేనిపోనివి చెప్పేవాడెవడో వాళ్లకి దొరక్కపోడు, 296 00:21:57,609 --> 00:22:01,905 అప్పుడు శుభ్రం చేయడానికి ఇద్దరినీ గనులకు పంపిస్తారు. 297 00:22:03,240 --> 00:22:08,579 ఇంతటితో దీన్ని ముగించాలంటే, నేరం చేసింది నేనేనని ఒప్పుకుంటే సరిపోతుంది. 298 00:22:09,580 --> 00:22:12,791 నేను ప్రారంభించిన దానికి నీకు శిక్ష పడుతుంటే, నేను చూస్తూ ఉండలేను. 299 00:22:13,876 --> 00:22:15,877 అయితే, వాళ్ళు మనిద్దరినీ చంపేస్తారు. 300 00:22:15,878 --> 00:22:18,755 ఇవాళ కాకపోతే ఎప్పుడైనా వాళ్ళది చేసి తీరతారు. 301 00:22:20,716 --> 00:22:22,301 ఇలా అయినా, మనం కలిసి చావవచ్చు. 302 00:22:55,375 --> 00:22:59,003 ఇవాళ ఉదయం మీరు ఏదైతే చూశారో, 303 00:22:59,004 --> 00:23:02,883 అది మీలో అనిశ్చితిని కలిగించడమే కాక, మిమ్మల్ని కలవరపెట్టిందని కూడా నాకు తెలుసు. 304 00:23:05,344 --> 00:23:10,474 కానీ, ఇవాళ మంచి రోజని మీకు చెప్పడానికే నేను వచ్చా. 305 00:23:11,767 --> 00:23:16,188 నేటి నుండి కొత్త శకం మొదలుకానుంది. 306 00:23:17,689 --> 00:23:19,942 మనకి గుర్తున్నంత వరకు, 307 00:23:20,692 --> 00:23:24,947 శుభ్రం చేయడానికి బయటకు ఎవరు వెళ్లినా, వారు గుట్టపై చనిపోయేవారు. 308 00:23:25,739 --> 00:23:29,660 సురక్షితం కాని బయటి ప్రపంచంలో ఉండే విష పదార్థాలను పీల్చి చనిపోయేవారు. 309 00:23:31,245 --> 00:23:33,330 కానీ ఇవాళ్టితో ఆ భావనకు చెల్లుచీటి పడిపోయింది. 310 00:23:34,456 --> 00:23:38,042 షెరిఫ్ నికల్స్ బయటకు వెళ్తానని అన్నది. 311 00:23:38,043 --> 00:23:39,962 తను బయటకు వెళ్ళింది. 312 00:23:42,297 --> 00:23:44,549 శుభ్రం చేయకూడదని నిర్ణయించుకుంది. 313 00:23:44,550 --> 00:23:48,679 - తను ఒక ద్రోహి. - తను ద్రోహి కానే కాదు. 314 00:23:49,847 --> 00:23:51,974 జూలియా నికల్స్ ఒక యోధురాలు. 315 00:23:52,683 --> 00:23:57,646 చాలా విషయాల్లో మా ఇద్దరికీ భేదాభ్రిపాయాలు ఉన్నాయి, కానీ తనపై నాకు చాలా గౌరవం ఉంది. 316 00:23:58,313 --> 00:24:01,357 ఇవాళ అయితే ఆ గౌరవం రెట్టింపు అయింది. 317 00:24:01,358 --> 00:24:02,901 తను బతికే ఉంది. 318 00:24:03,986 --> 00:24:05,362 లేదు. 319 00:24:06,488 --> 00:24:08,949 లేదు. అది నిజమైతే బాగుండు... 320 00:24:10,284 --> 00:24:12,494 నిజంగానే అది నిజమైతే బాగుండు. 321 00:24:15,914 --> 00:24:21,545 కానీ, తను సైలోకి ఎంతో మేలు చేసిన యోధురాలిగా మరణించింది. 322 00:24:22,462 --> 00:24:24,256 అది అసాధ్యం. 323 00:24:25,340 --> 00:24:29,428 ఈ పెద్దమనుషుల అరుపులను వింటారా? 324 00:24:30,220 --> 00:24:34,057 లేకపోతే, జూలియాని ఎందుకు యోధురాలని అన్నానో వింటారా? 325 00:24:37,144 --> 00:24:38,395 తను బయటకు వెళ్ళక ముందు... 326 00:24:40,564 --> 00:24:43,192 నేను షెరిఫ్ నికల్స్ ని ఒక విషయం అడిగా, 327 00:24:44,109 --> 00:24:46,694 తన సూట్ ని ఒక కొత్త రకం టేపుతో చుట్టవచ్చా అని. 328 00:24:46,695 --> 00:24:51,991 మన ప్రతిభావంతమైన సూట్ టెక్నీషియన్లే దాన్ని డిజైన్ చేశారు. 329 00:24:51,992 --> 00:24:53,535 దానికి ఆమె... 330 00:24:54,828 --> 00:24:57,247 ధైర్యంగా ఒప్పుకుంది. 331 00:25:00,375 --> 00:25:02,377 ఆమె గుట్ట దాటి వెళ్ళింది కాబట్టి, 332 00:25:03,212 --> 00:25:08,591 బయటి ప్రమాదాలను మరింత మెరుగ్గా తట్టుకొనే శక్తి 333 00:25:08,592 --> 00:25:11,052 మన కొత్త టేపుకు ఉందని నిరూపితమైనది. 334 00:25:11,053 --> 00:25:17,726 ఇన్నేళ్ల మన జీవిత చరిత్రలో ఇదే తొలి ముందడుగు అని చెప్పవచ్చు. 335 00:25:25,108 --> 00:25:26,818 ఇంతటితో మనం ఆగిపోము. 336 00:25:27,611 --> 00:25:32,574 మన సూట్లని మరింత మెరుగ్గా, మరింత శక్తివంతంగా చేయడానికి, కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాం. 337 00:25:33,534 --> 00:25:39,163 బయట ఉన్న ప్రమాదాల నుండి మనకి రక్షణ కల్పిస్తూ, సైలో నుండి సురక్షితంగా బయటపడాలనే 338 00:25:39,164 --> 00:25:40,749 మన అసలైన లక్ష్యానికి దగ్గరగా చేసే 339 00:25:41,416 --> 00:25:48,006 టేపును రూపొందించడానికి కూడా కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటాం. 340 00:26:02,062 --> 00:26:06,191 ఈ అద్భుతమైన పురోగతికి మేయర్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, 341 00:26:06,859 --> 00:26:12,363 అంతే కాకుండా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి సరైన దిశలో నడిపిస్తున్నందుకు 342 00:26:12,364 --> 00:26:14,032 ఆయన్ని అభినందిస్తున్నాను. 343 00:26:15,367 --> 00:26:20,162 ఒప్పందం ద్వారా నాకు దక్కిన అధికారాలను ఉపయోగించి, 344 00:26:20,163 --> 00:26:24,208 ఈ అద్భుతమైన పురోగతి సాధించినందుకు వేడుక జరుపుకోవడానికి 345 00:26:24,209 --> 00:26:26,837 ప్రతి ఇంటికి అయిదు క్రెడిట్స్ పంపిణీ చేయాలని ఆదేశిస్తున్నాను. 346 00:26:28,589 --> 00:26:33,342 ఈ కొత్త టేప్, మనందరి జీవితాల్లో ఏదోక రోజు వెలుగులు నింపగలదని 347 00:26:33,343 --> 00:26:35,720 ఆశాభావం వ్యక్తం చేద్దాం. 348 00:26:35,721 --> 00:26:37,139 వాళ్ళు అబద్ధమాడుతున్నారు. 349 00:26:38,307 --> 00:26:43,728 ఐటీ వాళ్ళు కావాలని పనికిమాలిన టేపును వాడుతున్నారని జూలియా కనుగొంది. 350 00:26:43,729 --> 00:26:48,065 జూలియా వాడింది కొత్త టేపేమీ కాదు, మనం వాడే మంచి టేపే అది. 351 00:26:48,066 --> 00:26:53,738 వాళ్ళు అది వాడాలనుకోలేదు, మెకానికల్ శాఖకి చెందిన వాళ్లెవరో టేపును మార్చేశారు. 352 00:26:53,739 --> 00:26:56,491 - మేయర్ చెప్పేదంతా అబద్ధం. - హేయ్! 353 00:26:57,659 --> 00:26:59,953 - నీ పేరేంటి? - జూలియా నికల్స్. 354 00:27:02,956 --> 00:27:05,125 - నాతో రా. - ఏంటి ఇక్కడ సమస్య? 355 00:27:06,543 --> 00:27:08,961 - తను నా కింద పని చేసే వ్యక్తి. - తనని అరెస్ట్ చేస్తున్నా. 356 00:27:08,962 --> 00:27:11,381 - నువ్వు దగ్గరికి రాకు. - బాబోయ్, అలాగే. 357 00:27:12,925 --> 00:27:14,927 120 కన్నా కింది అంతస్థులకి రావడం ఇదే మొదటిసారా? 358 00:27:17,346 --> 00:27:18,639 నా పేరు నాక్స్. 359 00:27:21,099 --> 00:27:23,227 తను ఎలాంటి సమస్యా సృష్టించే వ్యక్తి కాదని నేను హామీ ఇస్తున్నాను. 360 00:27:23,936 --> 00:27:25,521 ఇవాళ తన మనస్సు బాగాలేదంతే. 361 00:27:26,647 --> 00:27:29,816 స్నేహితురాలిని దూరం చేసుకుంది, ఇంకా తాగుతూ ఉంది, 362 00:27:30,734 --> 00:27:32,903 కానీ సైలోలో ఉండే మంచి టెక్నీషియన్లలో తన పేరు ముందు వరుసలో ఉంటుంది. 363 00:27:34,154 --> 00:27:35,821 ఈ డెప్యూటీ కూడా తన విషయంలో హామీ ఇవ్వగలడు. 364 00:27:35,822 --> 00:27:36,990 హ్యాంక్? 365 00:27:39,034 --> 00:27:41,787 షర్లీ లేకుంటే చాలా కష్టమని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 366 00:27:44,039 --> 00:27:45,790 హా, తన మీద మేము కన్నేసి ఉంచుతాం. 367 00:27:45,791 --> 00:27:47,543 కర్ఫ్యూ మొదలయ్యే లోపు తను ఇంట్లో ఉంటుంది. 368 00:27:50,212 --> 00:27:52,756 తను ఇలాగే రెచ్చగొట్టేలా వాగితే, తనని గనులకి పంపించక తప్పదు. 369 00:27:59,471 --> 00:28:01,306 థ్యాంక్యూ. నీకు ఒకటి రుణపడి ఉన్నా. 370 00:28:01,849 --> 00:28:03,183 మీ ఇద్దరూ కూడా. 371 00:28:09,398 --> 00:28:11,899 పద. మనం కాస్త మాట్లాడుకోవాలి. 372 00:28:11,900 --> 00:28:14,236 మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. 373 00:28:17,990 --> 00:28:19,116 అబ్బా. 374 00:28:20,784 --> 00:28:21,952 తనని ఫాలో చేయి. 375 00:28:29,251 --> 00:28:32,628 అది నిజమనిపించేలా చేయడానికి, మేము, కొన్ని డైలాగులను అదనంగా జోడించాము. 376 00:28:32,629 --> 00:28:34,672 దానికి మీకు బాగానే ముట్టజెప్పాం కదా. 377 00:28:34,673 --> 00:28:36,758 మా అవసరం మళ్ళీ ఉంటే, మాకొక మాట చెప్పండి. 378 00:28:37,634 --> 00:28:39,720 నేను చెప్పేదాకా, ఈ విషయం ఎక్కడా చెప్పకండి. 379 00:28:40,679 --> 00:28:42,848 లేదంటే, మీకు జైలు శిక్ష కంటే ఘోరమైన శిక్ష పడుతుంది. 380 00:28:58,280 --> 00:29:00,157 ప్రసంగంలో అడ్డుపడిన వారి సంగతి చూసుకున్నా. 381 00:29:01,200 --> 00:29:02,825 చెప్పాలంటే, వాళ్ళ నటన అదిరింది. 382 00:29:02,826 --> 00:29:04,036 బాగా చేశారు. 383 00:29:04,536 --> 00:29:05,579 థ్యాంక్స్. 384 00:29:07,664 --> 00:29:09,123 అదేంటో తెలుసా నీకు? 385 00:29:09,124 --> 00:29:10,334 తెలుసు. 386 00:29:11,126 --> 00:29:12,293 అది ముఖ్యమైనదా? 387 00:29:12,294 --> 00:29:14,796 అప్పుడు ముఖ్యమైనది కాదు, కానీ ఇప్పుడు ముఖ్యమైనదే. 388 00:29:16,298 --> 00:29:19,134 బయట వాతావరణం ఎలా ఉంది? ఏవైనా ఘటనలు చోటు చేసుకున్నాయా? 389 00:29:19,760 --> 00:29:22,553 జనాలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. హింసాత్మక ఘటనలేవీ చోటు చేసుకోలేదు. 390 00:29:22,554 --> 00:29:24,639 డెప్యుటీలందరూ మన కిందే పని చేస్తున్నారు. 391 00:29:24,640 --> 00:29:27,100 గూఢచారులు, సమస్యలు సృష్టించే చరిత్ర ఉన్నవారిపై నిఘా వేసి ఉంచారు. 392 00:29:27,726 --> 00:29:29,019 నువ్వు పరిస్థితులని మన వైపు తిప్పావు. 393 00:29:30,437 --> 00:29:31,480 ప్రస్తుతానికి. 394 00:29:32,272 --> 00:29:33,898 ఇదంతా నువ్వు ఒక్కడివే చేయాల్సిన పని లేదు. 395 00:29:33,899 --> 00:29:36,776 నేనే కనుక నీ షాడోని అయి ఉంటే, మనకేమీ కాకుండా నేను చూసుకోగలను, అలాగే... 396 00:29:36,777 --> 00:29:39,320 ఈ ప్రసంగం వల్ల మనకి ఒకట్రెండు రోజులు ఉపశమనం లభిస్తుందంతే. 397 00:29:39,321 --> 00:29:42,240 విపత్తు ముగిసిపోలేదు. నువ్వు ఇప్పుడున్న స్థానంలోనే కొనసాగాలి. 398 00:29:42,241 --> 00:29:43,992 ఇక నేను బయలుదేరుతా. 399 00:29:44,701 --> 00:29:47,412 నేను ఆదేశించిన కర్ఫ్యూని నేనే ఉల్లంఘిస్తే బాగోదు. 400 00:30:00,509 --> 00:30:01,802 మీ గురించి నేను మర్చిపోలేదు. 401 00:30:03,512 --> 00:30:05,681 మీరు మేయర్ ప్రసంగం మిస్ అయి ఉండాల్సింది కాదు. 402 00:30:08,350 --> 00:30:09,476 మీరు... 403 00:30:13,647 --> 00:30:14,648 ఇక బయటకు వెళ్లిపోవచ్చు. 404 00:30:15,732 --> 00:30:18,068 కర్ఫ్యూకి ఇంకో 30 నిమిషాల సమయం ఉంది. ఈలోపు మీరు ఇంటికి వెళ్లిపోండి. 405 00:30:19,987 --> 00:30:21,904 జ్యుడిషియల్ శాఖ వాళ్ళు మమ్మల్ని విచారించాలని అన్నావే. 406 00:30:21,905 --> 00:30:24,782 అవును. ఇందాక విచారించాలనుకున్నారు, కానీ ఇప్పుడు అక్కర్లేదట. 407 00:30:24,783 --> 00:30:27,953 జూలియా గుట్టని ఎలా దాటిందో మేయర్ చెప్పేశాడుగా. 408 00:30:28,912 --> 00:30:30,204 ఏమన్నాడు ఆయన? 409 00:30:30,205 --> 00:30:32,624 ఐటీ వాళ్ళు కొత్త రకమైన టేపును డిజైన్ చేశారట. 410 00:30:35,627 --> 00:30:36,670 పదండి. 411 00:30:38,714 --> 00:30:39,840 థ్యాంక్యూ. 412 00:30:43,594 --> 00:30:45,136 - మిస్టర్ మేయర్. - మేయర్. 413 00:30:45,137 --> 00:30:46,722 మీరు చేసిన సేవకు ధన్యవాదాలు. 414 00:30:51,518 --> 00:30:54,897 జేఎల్ 415 00:31:17,503 --> 00:31:18,795 ఆలస్యమైనందుకు సారీ. 416 00:31:19,463 --> 00:31:20,547 ఆంథనీ పడుకున్నాడా? 417 00:31:22,090 --> 00:31:24,050 నువ్వు ఏమైపోయావా అని అడిగాడు. 418 00:31:24,051 --> 00:31:26,386 "నాన్నకి మన మీద ఇప్పుడు ప్రేమ లేదనుకుంటా," అని అన్నాను నేను. 419 00:31:28,472 --> 00:31:29,473 హనీ, ఊరికే సరదాకి అన్నానంతే. 420 00:31:30,849 --> 00:31:33,601 సారీ. బాగా అలసిపోయా కదా, అందుకే ఏమీ అర్థం కావట్లేదు, 421 00:31:33,602 --> 00:31:36,355 ఎమర్జెన్సీ ముగిసే దాకా ఇలానే ఉంటుంది. 422 00:31:38,357 --> 00:31:39,399 తీసుకో. 423 00:31:44,071 --> 00:31:45,239 నీ డిన్నర్ ని వేడి చేస్తా. 424 00:31:46,198 --> 00:31:47,282 థ్యాంక్స్. 425 00:31:51,119 --> 00:31:53,371 బెర్నార్డ్ తో మాట్లాడే అవకాశం దక్కిందా? 426 00:31:53,372 --> 00:31:57,834 నేను సూటిగా అడిగేశా, కానీ ఇప్పుడు నేనున్న స్థానంలోనే కొనసాగడం చాలా ముఖ్యమని అన్నాడు. 427 00:31:57,835 --> 00:31:59,169 ప్రస్తుతానికి అయితే తప్పదు అన్నాడు. 428 00:32:01,505 --> 00:32:03,131 అతనికి షాడో కావాలి. 429 00:32:03,632 --> 00:32:04,924 అది నేను కాకపోయినా పర్వాలేదు. 430 00:32:04,925 --> 00:32:06,968 అది దక్కాల్సింది నీకే అని మనిద్దరికీ తెలుసు. 431 00:32:06,969 --> 00:32:08,386 దానికి నువ్వే అర్హుడివి. 432 00:32:08,387 --> 00:32:10,222 ఇంకా దేని కోసం చూస్తున్నాడు ఆయన? 433 00:32:13,100 --> 00:32:14,560 అది కనుగొనే ప్రయత్నంలోనే ఉన్నా. 434 00:32:16,019 --> 00:32:17,937 ప్రసంగానికి మెడోస్ కూడా వస్తుందని నీకు తెలుసా? 435 00:32:17,938 --> 00:32:19,064 తెలీదు. 436 00:32:20,190 --> 00:32:22,818 తను అక్కడికి ఎందుకు వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు. 437 00:32:26,864 --> 00:32:29,157 చివరిసారి తను ఎప్పుడు బయటకు వచ్చిందో కూడా నాకు గుర్తు లేదు. 438 00:32:29,908 --> 00:32:31,451 కానీ అప్పుడు అలజడి బాగానే సృష్టించింది. 439 00:32:34,872 --> 00:32:36,999 నువ్వు జ్యుడిషియల్ శాఖలో ఉన్నప్పుడు, ఆమెతో పని చేశావా? 440 00:32:37,499 --> 00:32:39,418 అసలు నేను ఒ కదాన్ని ఉన్నానని కూడా తనకి తెలీదు. 441 00:32:40,335 --> 00:32:43,380 కానీ, ఆమె జ్యుడిషియల్ శాఖకి ముందు ఐటీలో పని చేసిందట. 442 00:32:44,923 --> 00:32:47,467 అప్పట్లో మెడోస్ కి, బెర్నార్డ్ కి పరిచయం ఉండేదా? 443 00:32:48,719 --> 00:32:49,927 హా, పరిచయం ఉండి ఉండవచ్చు. 444 00:32:49,928 --> 00:32:52,346 అప్పుడు అతను ఐటీకి హెడ్ కదా. ఎందుకు అది అడిగావు? 445 00:32:52,347 --> 00:32:54,807 ఇదంతా తను ఒక్కడే చూసుకోవాల్సిన పని లేదని బెర్నార్డ్ తో అన్నాను, 446 00:32:54,808 --> 00:32:57,060 కానీ అతను పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించలేదు. 447 00:32:57,686 --> 00:33:00,731 అంటే, ఇదంతా అతను ఒక్కడే చూసుకోవట్లేదేమో అనిపిస్తోంది. 448 00:33:01,982 --> 00:33:04,109 అతను మెడోస్ తో మాట్లాడుతున్నాడు అంటావా? 449 00:33:05,986 --> 00:33:07,154 ఏమో మరి. 450 00:33:08,739 --> 00:33:11,450 కానీ ఇవాళ అతను ఆమెని అదోలా చూశాడు. 451 00:33:18,957 --> 00:33:21,293 ఇప్పటికీ నువ్వు ఊహలకు ఏ మాత్రం అందవు. 452 00:33:22,878 --> 00:33:23,921 లోపలికి రా. 453 00:33:32,346 --> 00:33:34,264 నీ సపోర్ట్ కి ధన్యవాదాలు. 454 00:33:36,517 --> 00:33:37,893 మనస్సు ఎందుకు మార్చుకున్నావు? 455 00:33:39,394 --> 00:33:41,647 నిజం చెప్పాలంటే, నువ్వు అక్కడ నవ్వులపాలు అవుతుంటే చూడాలని వచ్చా. 456 00:33:42,648 --> 00:33:44,358 నీ చుట్టూ అంతా పేక మేడలా కూలిపోవడం చూడాలని. 457 00:33:45,192 --> 00:33:46,401 మరి? 458 00:33:48,987 --> 00:33:51,490 రాజకీయాలు నీకు సెట్ కావని అనుకున్నాను. 459 00:33:52,282 --> 00:33:55,911 కానీ ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు చూశాక, 460 00:33:57,329 --> 00:33:58,664 నా అంచనా తప్పని అనిపిస్తోంది. 461 00:34:00,707 --> 00:34:02,125 నేను బాగానే మాట్లాడా, కదా? 462 00:34:03,043 --> 00:34:06,128 ప్రసంగానికి అడ్డు తగిలినవాళ్లు మీ మనుషులే కదా? 463 00:34:06,129 --> 00:34:09,381 అవును, అలాంటి విషయంలో రిస్క్ తీసుకోకూడదు. 464 00:34:09,382 --> 00:34:12,219 ఆ కథ బాగానే పండింది అనుకుంటా. 465 00:34:13,094 --> 00:34:14,096 పండిందా? 466 00:34:14,721 --> 00:34:16,223 చాలా కామెడీగా ఉంది. 467 00:34:17,224 --> 00:34:20,185 కానీ ప్రస్తుత పరిస్థితిలో, నీకు కావాల్సిన పనిని అది చేసి పెట్టిందిలే. 468 00:34:22,020 --> 00:34:24,022 దాన్ని ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ లా చూశా. 469 00:34:25,732 --> 00:34:29,360 జనాలు ఒక అద్భుతాన్ని చూశారు, అది నిజం కాదని నేను చెప్తే, 470 00:34:30,070 --> 00:34:32,613 కొందరు నమ్మే అవకాశం ఉందేమో, కానీ నేను చూసిందే జనాలు కూడా చూశారు. 471 00:34:32,614 --> 00:34:36,868 కాబట్టి, రెండు రకాల టేపులు ఉన్నాయి అని వాళ్ళకి ఒక కథ చెప్పాను. 472 00:34:36,869 --> 00:34:39,995 ఇప్పుడు ఎవరైనా వేరే కథ చెప్పాలని చూసినా, 473 00:34:39,996 --> 00:34:42,206 నా కథని అబద్ధం చేసినట్టు అవుతుంది. 474 00:34:43,792 --> 00:34:46,210 దాని వల్ల కూడా లాభం లేకపోతే, 475 00:34:47,254 --> 00:34:49,005 అణచివేసే ఆప్షన్ ఎలాగూ ఉంది. 476 00:34:53,385 --> 00:34:56,596 అణచివేయడం అనేది కొంత కాలం పాటు మాత్రమే పని చేస్తుంది, కానీ... 477 00:34:56,597 --> 00:34:58,098 కానీ ఏంటి? 478 00:34:59,850 --> 00:35:01,852 వాళ్లకి నమ్మకం కలిగించేది ఏదైనా నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. 479 00:35:03,312 --> 00:35:05,313 అందుకే నాకు నువ్వు కావాలి. 480 00:35:05,314 --> 00:35:06,981 నీకు నేను అక్కర్లేదు. 481 00:35:06,982 --> 00:35:08,774 అదే విషయాన్ని ఇవాళ నువ్వు రుజువు చేశావు, 482 00:35:08,775 --> 00:35:12,821 నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో, గోడ మీద ఒకే రాత మూడుసార్లు కనిపించింది. 483 00:35:13,906 --> 00:35:15,574 "జేఎల్." 484 00:35:16,491 --> 00:35:17,743 పై అంతస్థుల్లో పరిస్థితే ఇలా ఉంది. 485 00:35:18,619 --> 00:35:20,746 ఇక కింది అంతస్థుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. 486 00:35:21,788 --> 00:35:23,206 ప్రసంగం ప్రభావం కొన్ని రోజులే ఉంటుంది, 487 00:35:23,207 --> 00:35:26,752 నువ్వు లేకుండా ఈ సంక్షోభాన్ని నేను హ్యాండిల్ చేయలేను. 488 00:35:27,920 --> 00:35:30,213 నువ్వు కాక ఆ వాల్టులోకి వెళ్లిన ఏకైక వ్యక్తిని నేనే అని కదా. 489 00:35:30,214 --> 00:35:33,717 కాదు, నేను నీ మాట తప్ప ఇంకెవరి మాటా వినను కాబట్టి. 490 00:35:34,760 --> 00:35:37,095 మరొక షాడోని వెతికే ప్రయత్నం చేశాను, కానీ... 491 00:35:40,849 --> 00:35:42,351 నీలా ఎవరూ పని చేయలేరు. 492 00:35:43,018 --> 00:35:45,228 చూడు, ఇందాక నీ సాయం కోసం అడిగినప్పుడు, 493 00:35:45,229 --> 00:35:48,815 నేను ప్రోత్సాహకాలను, లంచాలని ఇవ్వజూపాను, అది... 494 00:35:49,358 --> 00:35:52,611 అది నిన్ను అవమానపరచడమే అవుతుందని గ్రహించాను. 495 00:35:53,237 --> 00:35:54,738 స్వలాభం కోసం పొగిడినట్టు కూడా ఉంది. 496 00:35:56,031 --> 00:35:57,324 కాబట్టి, నేను... 497 00:35:58,367 --> 00:36:00,953 నేను... క్షమించమని కోరుతున్నా. 498 00:36:05,290 --> 00:36:06,458 థ్యాంక్యూ. 499 00:36:12,798 --> 00:36:14,132 నేనొకటి చూపిస్తా. 500 00:36:15,801 --> 00:36:18,344 మనం చేతితో సంకేతాలు చేసుకుంటూ మాట్లాడుకుందాం. 501 00:36:18,345 --> 00:36:21,723 మధ్య అంతస్థుల్లో ఉండే వారికి కూడా మనతో చేతులు కలపాలనిపిస్తే, దాన్ని వారికి నేర్పిద్దాం. 502 00:36:24,810 --> 00:36:26,352 హేయ్! 503 00:36:26,353 --> 00:36:28,981 వెలుతురులోకి రా, లేదంటే మేమే నిన్ను బలవంతంగా లాగుతాం. 504 00:36:30,440 --> 00:36:31,692 నేనే. 505 00:36:33,485 --> 00:36:35,195 ఇక్కడ నీకేంటి పని, కూపర్? 506 00:36:40,325 --> 00:36:41,743 నిన్ను ఫాలో చేయమని నాక్స్ చెప్పాడు. 507 00:36:42,369 --> 00:36:44,453 నువ్వు గూఢచారివా, కూప్? 508 00:36:44,454 --> 00:36:46,330 నేను కూడా అదే అనుకున్నా. 509 00:36:46,331 --> 00:36:49,543 నువ్వేం చూశావో, మేమేం మాట్లాడుకున్నామో అతనికి చెప్పేయ్. 510 00:36:50,127 --> 00:36:51,545 అతను మమ్మల్ని ఆపలేడు. 511 00:36:52,337 --> 00:36:54,298 కర్ఫ్యూ కల్లా ఇంటికి చేరుకున్నావని అతనికి చెప్తాను. 512 00:36:56,008 --> 00:36:57,134 మీ అందరి విషయంలోనూ అదే చెప్తా. 513 00:36:59,011 --> 00:37:00,219 ఎందుకు? 514 00:37:00,220 --> 00:37:02,055 ఎందుకంటే, నేను జూలియా షాడోగా ఉన్నా. 515 00:37:02,848 --> 00:37:06,058 అంతా గడబిడ అవుతూ ఉండినప్పుడు జనరేటర్ గదిలో మేమిద్దరమే ఉన్నాం. 516 00:37:06,059 --> 00:37:07,811 తనే లేకపోయి ఉంటే, మనందరం చచ్చి ఉండేవాళ్ళం. 517 00:37:09,730 --> 00:37:11,481 కాబట్టి, నేను ఇక్కడికి నాక్స్ చెప్పిన పని మీద రాలేదు. 518 00:37:13,483 --> 00:37:14,943 జూలియా కోసం వచ్చా. 519 00:37:15,777 --> 00:37:17,738 మీరేం చేస్తున్నారో ఏమో కానీ, అందులో నాకు కూడా భాగం కావాలనుంది. 520 00:37:28,415 --> 00:37:31,626 టేప్ విషయంలో బెర్నార్డ్ చెప్పింది అబద్ధం. 521 00:37:31,627 --> 00:37:33,794 టేపును మార్చింది వాకరే అని నాకు తెలుసు, ఎందుకంటే తను పంపింది... 522 00:37:33,795 --> 00:37:35,214 నీకేం తెలీదు, అమ్మాయి. 523 00:37:39,092 --> 00:37:42,053 నువ్వు అలాంటి మాటలు అంటూ ఉంటే, మనందరినీ గనుల్లోకి పంపించేస్తారు. 524 00:37:42,054 --> 00:37:43,972 వాళ్లకి గూఢచారులు ప్రతిచోటా ఉన్నారు. 525 00:37:46,642 --> 00:37:48,017 మేము ఎక్కడ ఉన్నామో నీకెలా తెలుసు? 526 00:37:48,018 --> 00:37:50,062 ఈ మహానుభావుడి వెనకే వచ్చా. 527 00:37:51,647 --> 00:37:54,232 ఇలాంటి పనికి మీలో ఒక్కరు కూడా సెట్ కారు. 528 00:37:54,233 --> 00:37:58,277 మీకు ఇది చేతకాని పని. కాబట్టి, టేప్ గురించి, జూలియా గురించి మాట్లాడటం ఆపివేయండి. 529 00:37:58,278 --> 00:38:00,572 అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. 530 00:38:03,659 --> 00:38:04,742 నువ్వూ మాతో చేతులు కలుపుతావా? 531 00:38:04,743 --> 00:38:06,537 మీ లక్ష్యం ఏంటి? 532 00:38:07,162 --> 00:38:08,746 మాలాంటి వారిని కనుగొంటాం. 533 00:38:08,747 --> 00:38:10,623 మాలా ఆలోచించే వారిని కనుగొంటాం. 534 00:38:10,624 --> 00:38:13,293 ఎవరైతే తమకి అబద్ధాలు చెప్తున్నారని గ్రహించి, నిజం తెలుసుకోవాలని అనుకుంటుంటారో, వారిని. 535 00:38:13,919 --> 00:38:15,838 మీ సంఖ్య గణనీయమైన స్థాయికి చేరుకున్నప్పుడు ఏం చేస్తారు? 536 00:38:17,089 --> 00:38:18,464 సమాధానాలను డిమాండ్ చేస్తాం. 537 00:38:18,465 --> 00:38:22,009 హా, మీకు సమాధానాలు దక్కవు. 538 00:38:22,010 --> 00:38:23,302 దక్కకుంటే పోరాడతాం. 539 00:38:23,303 --> 00:38:24,930 అందుకు వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. 540 00:38:25,514 --> 00:38:28,851 రెయిడర్లు, డెప్యూటీలు ఎంత మంది తిరుగుతున్నారో చూస్తూ ఉన్నారు కదా. 541 00:38:29,476 --> 00:38:31,561 మీలో ఎవరైనా ఏదైనా చేయకపోతారా అని చూస్తున్నారు వాళ్ళు. 542 00:38:31,562 --> 00:38:34,313 - వాళ్ళ దగ్గర లేని ఆయుధాలంటూ ఏవీ లేవు. - రెయిడర్లు, డెప్యుటీలలో కూడా కొంత మందికి 543 00:38:34,314 --> 00:38:37,192 నిజం తెలుసుకోవాలని ఉండవచ్చేమో. 544 00:38:38,068 --> 00:38:39,319 ఉండవచ్చు. 545 00:38:41,405 --> 00:38:44,448 కాసేపటి క్రితం, సైలోలోని గోడలపై 546 00:38:44,449 --> 00:38:46,326 కొత్తగా ఒకటి గీస్తున్నారని రేడియోలో విన్నాను. 547 00:38:47,494 --> 00:38:48,871 అది "జేఎల్." 548 00:38:50,747 --> 00:38:51,957 అంటే, జూలియా అమర్ రహే అని. 549 00:38:53,876 --> 00:38:55,002 అది మంచిదే. 550 00:38:55,836 --> 00:38:57,629 మంచిదే, ఎందుకంటే అదే నిజం కాబట్టి. 551 00:38:58,130 --> 00:38:59,590 తను బతికే ఉందని నాకనిపిస్తోంది. 552 00:39:01,049 --> 00:39:02,551 నీకేం అనిపిస్తోంది, వాక్? 553 00:39:03,802 --> 00:39:07,264 మీరందరూ నిజం తెలుసుకోవాలని నడుం బిగించారు కాబట్టి, అవుననే చెప్తా. 554 00:39:09,391 --> 00:39:11,018 తను బతికే ఉంది. 555 00:39:25,532 --> 00:39:29,953 పాతికేళ్లలో తొలిసారిగా, నాకు తాగాలనిపించట్లేదు. 556 00:39:31,622 --> 00:39:34,750 ఈ విషయంలో నా ఆలోచనలన్నీ పక్కాగా ఉండాలనుకుంటున్నా. 557 00:39:35,459 --> 00:39:38,170 నీ విషయంలో కూడా. 558 00:39:40,714 --> 00:39:42,256 నీకు సాయపడతాను, బెర్నార్డ్. 559 00:39:42,257 --> 00:39:43,966 థ్యాంక్యూ. నాకు తెలుసు మనిద్దరం చేతులు కలిపితే... 560 00:39:43,967 --> 00:39:47,011 ముందు, నాకు నువ్వు ఏం చేయాలో చెప్తా విను. 561 00:39:47,012 --> 00:39:48,680 నువ్వేం అడిగితే అది ఇస్తా. 562 00:39:49,556 --> 00:39:53,352 అయితే, నాకోసం మంచి టేప్ తెప్పించి పెట్టు, ఈ సంక్షోభం ముగిసే దాకా దాన్ని వేరేగా ఎక్కడైనా ఉంచు. 563 00:39:53,977 --> 00:39:55,061 ఎందుకు? 564 00:39:55,062 --> 00:39:57,940 నాకు స్వేచ్ఛ కావాలి. 565 00:39:58,774 --> 00:39:59,899 నీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు... 566 00:39:59,900 --> 00:40:02,069 విజర్డ్ కి దక్కినట్టు నువ్వు నాకు హాట్ ఎయిర్ బెలూన్ ని తెచ్చివ్వలేవు, 567 00:40:03,070 --> 00:40:07,783 కాబట్టి జూలియా నికల్స్ కి దక్కిందే నాకు కూడా కావాలి. 568 00:40:11,203 --> 00:40:12,663 నేను బయటకు వెళ్లాలనుకుంటున్నా. 569 00:41:11,471 --> 00:41:13,473 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్