1 00:00:07,007 --> 00:00:10,636 అబద్ధాలు 2 00:00:19,186 --> 00:00:20,854 హేయ్, నీ పేరేంటి? 3 00:00:22,564 --> 00:00:23,774 జూలియా. 4 00:00:26,818 --> 00:00:30,113 జూలియా? అంటే నాటికలోలానా? 5 00:00:31,198 --> 00:00:32,198 అవును. 6 00:00:34,076 --> 00:00:36,870 - ఇక్కడ కూడా అది పాపులారా? - అవును. 7 00:00:37,412 --> 00:00:38,664 ఎక్కడి నుండి వచ్చావు? 8 00:00:40,165 --> 00:00:44,293 నేను బయటి నుండి, అంటే, వేరే సైలో నుండి వచ్చాను. 9 00:00:44,294 --> 00:00:45,378 ఏ సైలో నుండి? 10 00:00:45,379 --> 00:00:47,005 మొత్తం 50 ఉన్నాయి. 11 00:00:49,383 --> 00:00:50,884 యాభైయా? 12 00:00:51,927 --> 00:00:54,011 హా, ఇది 17వ సైలో. 13 00:00:54,012 --> 00:00:58,391 కాబట్టి, దీనికి దగ్గరగా 15, 16, ఇంకా 18వ సైలోలు ఉంటాయి. 14 00:00:58,392 --> 00:00:59,935 మరి నువ్వు ఎంత దూరం నడిచావు? 15 00:01:02,604 --> 00:01:04,230 - తెలీదు, అంటే... - సూర్యుడు ఎటు వైపు ఉన్నాడు? 16 00:01:08,944 --> 00:01:10,195 ఏమో... ఎవరు... 17 00:01:12,948 --> 00:01:14,283 అసలు ఎవరు నువ్వు? 18 00:01:15,367 --> 00:01:17,119 హేయ్. వద్దు, ఆగు! 19 00:01:21,248 --> 00:01:23,458 ఇదిగో, నేను మాట్లాడాలనే అనుకుంటున్నా, 20 00:01:24,126 --> 00:01:29,131 కానీ నువ్వు కూడా... బదులు ఇవ్వాలి. 21 00:01:33,177 --> 00:01:34,636 నా పేరు సోలో. 22 00:01:36,805 --> 00:01:37,806 సోలోనా? 23 00:01:38,557 --> 00:01:39,558 అవును. 24 00:01:42,853 --> 00:01:44,313 మరి ఇంటి పేరు? 25 00:01:44,980 --> 00:01:46,481 ఇంటి పేరేం లేదు, ఉత్త సోలోనే. 26 00:01:47,149 --> 00:01:49,442 ఎందుకంటే, నేను ఇక్కడ ఒక్కడినే ఉన్నా. 27 00:01:49,443 --> 00:01:50,569 కాబట్టి నేను సోలో అన్నమాట. 28 00:01:55,782 --> 00:01:57,618 ఇక్కడి జనాలను బలవంతంగా ఎవరూ బయటకు పంపించేయలేదు. 29 00:01:59,244 --> 00:02:00,579 వాళ్ళే వెళ్లిపోదామనుకున్నారు. 30 00:02:05,125 --> 00:02:08,211 వాళ్ళు బయటికి వెళ్ళిన రోజు, బయటంతా ఆహ్లాదకరంగా ఉంది. 31 00:02:08,794 --> 00:02:14,926 అందరూ నవ్వుతూ ఉన్నారు, కానీ అంతలో దుమ్ముతో కూడిన గాలి మళ్ళీ వీసింది, 32 00:02:14,927 --> 00:02:20,640 దానితో విష పదార్థాలు కొంత సేపటికి పోయి, మళ్ళీ వచ్చినట్టున్నాయి, 33 00:02:20,641 --> 00:02:23,644 చాలా వచ్చినట్టున్నాయి, అప్పుడే అందరూ చనిపోయారు. 34 00:02:24,436 --> 00:02:26,729 కానీ, శుభ్రం చేయడానికి బయటకు వెళ్లే వారు మూడు నిమిషాల్లో చనిపోతారు. 35 00:02:26,730 --> 00:02:30,692 మరి వీళ్ళు అంతకన్నా ఎక్కువ సేపు ఎలా బతకగలిగారు? 36 00:02:31,652 --> 00:02:33,028 నాకు తెలీదు. నువ్వు ఎలా బతకగలిగావు? 37 00:02:35,239 --> 00:02:37,199 నేను సూటు వేసుకొని ఉన్నా, ఇంకా... 38 00:02:38,867 --> 00:02:42,787 హేయ్, నిన్ను కూడా రాన్ లానే బయటకు పంపారా? 39 00:02:42,788 --> 00:02:45,123 - రాన్? రాన్ ఎవరు? - రాన్ టకర్. 40 00:02:45,624 --> 00:02:47,333 శుభ్రం చేయడానికి వెళ్లి, ఆ పని చేయని వాడు. 41 00:02:47,334 --> 00:02:50,170 బయట ప్రమాదమేమీ లేదని అనుకున్నాడు. బయటకు వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పాడు. 42 00:02:51,046 --> 00:02:52,798 కానీ వెళ్ళాక, శుభ్రం చేయలేదు. 43 00:02:53,382 --> 00:02:59,513 లెన్స్... లెన్స్ మీద ఉండే దుమ్ములో "అబద్ధాలు" అని రాశాడంతే. 44 00:03:03,183 --> 00:03:06,353 ఆ తర్వాత కనిపించకుండా పక్కకి వెళ్ళిపోయాడు. 45 00:03:06,937 --> 00:03:12,525 రెండు రోజుల తర్వాత, వాళ్ళు లెన్స్ మీద "అబద్ధాలు" అని పెయింట్ చేశారు, 46 00:03:12,526 --> 00:03:17,197 అది కూడా సరిగ్గా అతను రాసిన చోటే, అప్పుడే తిరుగుబాటు మొదలైంది. 47 00:03:17,698 --> 00:03:20,033 ఇక రసెల్ నన్ను ఇక్కడ ఉంచాడు. 48 00:03:21,034 --> 00:03:24,830 రసెల్ ఐటీ శాఖకు హెడ్ అన్నమాట. నేను అతని షాడోని. 49 00:03:25,831 --> 00:03:26,831 అప్పుడు రసెల్ నాకొకటి చెప్పాడు, 50 00:03:26,832 --> 00:03:29,626 "ఏది ఏమైనా కానీ, 51 00:03:30,252 --> 00:03:35,632 వాల్టులోకి ఎవరినీ రానివ్వకు... అస్సలు రానివ్వకు," అని. 52 00:03:42,055 --> 00:03:43,974 కానీ అందరూ బయటకు ఎందుకు వెళ్లిపోయారు? 53 00:03:45,517 --> 00:03:47,352 బయట ప్రమాదమేమీ లేదనుకున్నారు కాబట్టి. 54 00:03:48,520 --> 00:03:50,689 ఎందుకంటే, అతను ప్రమాదమేమీ లేదన్నాడు, కాబట్టి వీళ్ళు కూడా... 55 00:03:51,356 --> 00:03:53,107 కాదు, అతను చనిపోవడం వీళ్ళు చూడలేదు కాబట్టి. 56 00:03:53,108 --> 00:03:54,358 అతను చనిపోవడం వీళ్ళకి కనిపించలేదు. 57 00:03:54,359 --> 00:03:58,655 కాబట్టి, అతను ఇంకా బతికే ఉన్నాడేమో అని అనుకున్నారు. 58 00:04:05,954 --> 00:04:07,206 అలా అనుకొని అందరూ బయటకు వెళ్లిపోయారా? 59 00:04:08,248 --> 00:04:09,249 అవును. 60 00:04:11,460 --> 00:04:12,503 ఏమైంది? 61 00:04:17,132 --> 00:04:18,341 నేను కూడా శుభ్రం చేయలేదు. 62 00:04:21,720 --> 00:04:25,181 ఒక సూట్ కావాలి, నేను... నేను మా సైలోకి వెళ్ళిపోవాలి. 63 00:04:25,182 --> 00:04:26,475 ఒక్క నిమిషం! ఏంటి? 64 00:05:44,469 --> 00:05:46,930 {\an8}హ్యూ హొవీ రచించిన బుక్ సిరీస్, సైలో ఆధారంగా తెరకెక్కించడం జరిగింది 65 00:06:04,031 --> 00:06:06,033 - అతడిని వదిలేయండి! - అమ్మా... 66 00:06:07,284 --> 00:06:08,869 అమ్మా! ఇంటికి వెళ్ళిపో! 67 00:06:12,039 --> 00:06:14,333 మరేం పర్వాలేదు! నాకేం కాదు! 68 00:06:16,335 --> 00:06:17,753 టెడ్డీ! 69 00:06:18,545 --> 00:06:21,506 అతడిని కావాలని ఇరికించారు. గోడ మీద ఆ రాతలన్నీ వాళ్ళే రాశారు. 70 00:06:21,507 --> 00:06:22,925 అతడినేమీ ఇరికించలేదు. 71 00:06:23,800 --> 00:06:26,136 అది అతని పనే. ఆ పనికి గర్వపడుతున్నానని కూడా చెప్పా నేను. 72 00:06:27,054 --> 00:06:29,056 ఇది మన నివాస ప్రాంతం. 73 00:06:29,723 --> 00:06:34,978 ఇవన్నీ మన గోడలు, మనకు నచ్చినవి మనం రాసుకోవచ్చు. 74 00:06:37,773 --> 00:06:39,066 కాకపోతే, ఈసారి అతడిని తీసుకెళ్లిపోయారు. 75 00:06:39,775 --> 00:06:42,109 నువ్వు ఎందుకు భయపడుతున్నావో మా అందరికీ తెలుసు, ఎవిలిన్. 76 00:06:42,110 --> 00:06:43,737 వాళ్ళు ఏం చేయగలరో మనందరికీ తెలుసు. 77 00:06:44,404 --> 00:06:48,325 మెకానికల్ నుండి ఒకరిని శిక్షించి, మిగతా వాళ్ళని హెచ్చరించాలని చూస్తున్నారు. 78 00:06:51,245 --> 00:06:52,454 కానీ మనం వాళ్లకి ఆ అవకాశం ఇవ్వం. 79 00:06:53,121 --> 00:06:54,706 - ఏమంటారు? - ఇవ్వం. 80 00:06:55,290 --> 00:06:57,251 - ఏమంటారు? - ఇవ్వం. 81 00:07:00,337 --> 00:07:01,922 నీ కొడుక్కి శిక్ష పడనివ్వం. 82 00:07:09,847 --> 00:07:12,850 సర్వర్ గది 83 00:07:50,095 --> 00:07:51,345 ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? 84 00:07:51,346 --> 00:07:54,683 మనం "నియమావళి"తో మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. 85 00:07:55,309 --> 00:07:57,728 నేను అన్నింటినీ మర్చిపోవాలనుకున్నా. 86 00:08:01,231 --> 00:08:02,232 మరీ ముఖ్యంగా, దాన్ని. 87 00:08:02,983 --> 00:08:05,651 నియమావళి 88 00:08:05,652 --> 00:08:06,945 కానీ కొన్నింటిని మర్చిపోలేం. 89 00:08:08,071 --> 00:08:11,617 "ఎవరైనా శుభ్రం చేయకపోతే, యుద్ధానికి సన్నద్ధం కావాలి." 90 00:08:13,785 --> 00:08:14,786 గోడల మీద రాతలకి కూడా. 91 00:08:17,080 --> 00:08:19,081 మీరు గోడలపై రాతలని అరికట్టే పని మీద ఉండాలి కదా. 92 00:08:19,082 --> 00:08:21,919 మరీ ముఖ్యంగా తిరుగుబాటుకు మద్దతుగా ఉండే వాటిని. 93 00:08:23,837 --> 00:08:27,173 లేదా "శుభ్రం చేయని వ్యక్తి గురించి 94 00:08:27,174 --> 00:08:29,760 - గొప్పగా వర్ణించే రాతలని." - "...వర్ణించే రాతలని." 95 00:08:35,015 --> 00:08:38,308 గోడ మీద రాతలు రాసినందుకు మీరు ఎవరినైనా అరెస్ట్ చేశారా? 96 00:08:38,309 --> 00:08:40,270 మెకానికల్ కి చెందిన ఒకడిని అరెస్ట్ చేశాం. 97 00:08:40,979 --> 00:08:41,980 అతనేం రాశాడు? 98 00:08:42,731 --> 00:08:44,566 నిన్న నేను ఏదైతే చూశానో, అదే. 99 00:08:47,361 --> 00:08:49,530 జూలియా అమర్ రహే. 100 00:08:50,030 --> 00:08:51,405 అతను చేసింది కెమెరాలో చూసి పట్టుకున్నారా? 101 00:08:51,406 --> 00:08:53,950 లేదు, ఒకరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పట్టుకున్నాం. 102 00:08:53,951 --> 00:08:57,370 120 కన్నా దిగువ ఉండే అంతస్థుల్లోని కెమెరాల్లో చాలా వాటిని నాశనం చేసేశారు. 103 00:08:57,371 --> 00:08:59,288 వాళ్లకి నికల్స్ చెప్పేసి ఉంటుంది. 104 00:08:59,289 --> 00:09:00,998 కెమెరాల సంగతి తనకి ఎలా తెలుసు? 105 00:09:00,999 --> 00:09:04,044 నాకు తెలిసినంత వరకు, తను ఆ విషయాన్ని పసిగట్టేసినట్టుంది. 106 00:09:05,879 --> 00:09:07,756 ఎంతైనా తను చాలా గొప్పది, కదా? 107 00:09:08,715 --> 00:09:12,052 నా అంచనాలకు కూడా అందని వ్యక్తి తను. 108 00:09:14,137 --> 00:09:16,515 తనని నేను రెండు సార్లే కలుసుకున్నా. 109 00:09:18,559 --> 00:09:21,144 తనని చూస్తే, బయటకు వెళ్లాలని ఆరాటపడే మహిళలా కనిపించలేదు. 110 00:09:23,564 --> 00:09:25,523 తన దగ్గర అత్యంత ప్రమాదకర స్థాయి పురాతన వస్తువు ఉండింది. 111 00:09:25,524 --> 00:09:28,569 తిరుగుబాటు కాలానికి ముందటి హార్డ్ డ్రైవ్. 112 00:09:30,863 --> 00:09:31,946 అందులో ఏముంది? 113 00:09:31,947 --> 00:09:37,369 నికల్స్ స్క్రీన్ మీద చూపించిన, శుభ్రం చేసే 200 ఏళ్ల వీడియో కాకుండా, 114 00:09:38,328 --> 00:09:40,455 ఇంకేముందో నాకు తెలీదు. దాన్ని నేను నాశనం చేసేశా. 115 00:09:43,041 --> 00:09:45,209 బయటకు వెళ్లాలనుంది అని తను చెప్పిందా? 116 00:09:45,210 --> 00:09:47,963 - చెప్పినా, చెప్పకపోయినా తనని బయటకు పంపించే వాళ్ళమే. - కానీ ఆ ముక్క చెప్పిందా లేదా? 117 00:09:48,463 --> 00:09:50,257 హా. చెప్పింది. 118 00:09:56,013 --> 00:09:58,807 గోడల మీద రాతల విషయంలో ఈసారి అరెస్ట్ చేసేటప్పుడు, 119 00:09:59,474 --> 00:10:02,352 పై అంతస్థుల వాళ్ళనో, మధ్య అంతస్థుల వాళ్ళలో చేయండి. 120 00:10:04,229 --> 00:10:05,104 "నియమావళి" ప్రకారం... 121 00:10:05,105 --> 00:10:09,775 "నియమావళి" ప్రకారం, నేరం మెకానికల్ పైకి వేసేసి, మిగతా సైలో వాసులని వాళ్లపైకి ఉసిగొల్పాలి. 122 00:10:09,776 --> 00:10:10,902 అది నాకు తెలుసు. 123 00:10:10,903 --> 00:10:12,487 కానీ జూలియా... 124 00:10:14,698 --> 00:10:16,283 తను మామూలు వ్యక్తి కాదు. 125 00:10:17,075 --> 00:10:19,620 తను ఇప్పటిదాకా ఎవరూ చేయని పని చేసింది. 126 00:10:20,871 --> 00:10:22,998 కాబట్టి మనం "నియమావళి"కి లోబడే ఆలోచించాల్సిన పని లేదు. 127 00:10:24,625 --> 00:10:26,168 ఇది తేలికైన పని కాదని తెలుసు. 128 00:10:27,836 --> 00:10:28,837 మనం ఎప్పుడూ చూడని రంగును 129 00:10:30,422 --> 00:10:32,633 ఊహించుకోవడం అంత కష్టంగానే ఇది కూడా ఉండవచ్చు. 130 00:10:33,550 --> 00:10:34,760 కానీ ప్రయత్నిద్దాం. 131 00:10:38,847 --> 00:10:42,351 మీరు అరెస్ట్ చేసిన మెకానికల్ కి చెందిన వ్యక్తిని విడుదల చేయండి. 132 00:10:42,935 --> 00:10:44,144 కాస్త దయ చూపించు. 133 00:10:45,354 --> 00:10:48,065 ఇక నీకు అభ్యంతరం లేకపోతే, నేను ఇక్కడి నుండి దొబ్బేస్తా. 134 00:10:54,112 --> 00:10:56,072 జూలియా 17వ సైలోకి వెళ్లిందా? 135 00:10:56,073 --> 00:10:57,157 అవును. 136 00:11:00,118 --> 00:11:01,410 అక్కడ తను బతకగలదా? 137 00:11:01,411 --> 00:11:02,495 బతకలేకపోవచ్చు. 138 00:11:02,496 --> 00:11:04,831 ఆ సైలో చాలా కాలం నుండి నిర్జీవంగా ఉంది. 139 00:11:06,834 --> 00:11:10,003 నేను నిన్ను నా షాడోగా చేసుకోక ముందు నుండే. 140 00:11:23,976 --> 00:11:24,977 అబ్బా. 141 00:11:45,998 --> 00:11:48,000 రాన్ టకర్ అమర్ రహే 142 00:12:13,775 --> 00:12:17,613 మాకు బయటకు వెళ్లాలనుంది 143 00:12:24,203 --> 00:12:26,038 అరెస్ట్ చేయమని కొందరి పేర్లు ఇచ్చా కదా. అదెక్కడి దాకా వచ్చింది? 144 00:12:26,663 --> 00:12:29,624 అదే, నికల్స్, ఎవరి కంప్యూటర్లలో అయితే ఆ ఫుటేజీని పెట్టిందో, అది చూసి ఉండగల వాళ్లు అన్నమాట. 145 00:12:29,625 --> 00:12:31,334 వాళ్లందరినీ మెడికేషన్ లో ఉంచాం. 146 00:12:31,335 --> 00:12:33,295 కారణం, భయాందోళనలు ఎక్కువయ్యాయని చెప్పాం. 147 00:12:33,879 --> 00:12:36,298 మరి నికల్స్ కి సాయపడిన ఆ ఇద్దరి మాటేంటి? 148 00:12:36,798 --> 00:12:38,674 పాట్రిక్ కెన్నడీ, ఇంకా డానీ బ్లై. 149 00:12:38,675 --> 00:12:40,636 వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాం. 150 00:12:41,637 --> 00:12:43,639 - వాళ్లని కూడా మెడికేషన్ లో ఉంచారా? - ఇంకా లేదు. 151 00:12:46,350 --> 00:12:47,351 ఎందుకు? 152 00:13:00,906 --> 00:13:04,159 వీటిని ఇంత టైటుగా కట్టాల్సిన పనేంటో అర్థం కావట్లేదు. 153 00:13:19,716 --> 00:13:21,176 తీసేశా. 154 00:13:24,388 --> 00:13:25,389 ఓకేనా? 155 00:13:29,268 --> 00:13:30,394 నేనెవరో తెలుసా? 156 00:13:32,855 --> 00:13:34,731 నువ్వెవరో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు, సిమ్స్. 157 00:13:36,066 --> 00:13:39,319 చంటి పిల్లలు అన్నం తినకపోతే, అమ్మానాన్నలు నీ పేరు చెప్పి బెదిరిస్తారు. 158 00:13:40,112 --> 00:13:41,989 పిల్లలు అన్నం తిన్నాలి మరి. 159 00:13:43,198 --> 00:13:44,199 నేనైతే పక్కాగా నా ఆహారం తింటా. 160 00:13:45,075 --> 00:13:46,076 నన్ను వదిలేస్తున్నావా? 161 00:13:48,453 --> 00:13:50,788 వదిలేసినంత మాత్రాన నాకు కావాల్సిన పని జరగదు కదా. 162 00:13:50,789 --> 00:13:51,999 అవునా? 163 00:13:54,376 --> 00:13:55,919 నీకు ఇంకేం పని చేసి పెట్టాలి? 164 00:13:57,963 --> 00:13:59,590 ఇప్పటికే డోరిస్ ని పొట్టన పెట్టుకున్నావు కదా. 165 00:14:00,507 --> 00:14:01,884 నీ భార్యనా? 166 00:14:03,177 --> 00:14:07,931 అవును, నా భార్యేరా, చచ్చినోడా. 167 00:14:08,724 --> 00:14:12,394 ఇంకేం తీసుకోగలవు నా నుండి. 168 00:14:13,937 --> 00:14:15,105 అదీ గాక, నేను చాలా చూశాను. 169 00:14:15,606 --> 00:14:16,899 నాకు చాలా విషయాలు తెలుసు కూడా. 170 00:14:20,277 --> 00:14:24,156 ఇదంతా పెద్ద అబద్ధం అని నాకు తెలుసు. 171 00:14:26,366 --> 00:14:29,411 కాబట్టి, నీ ముచ్చట్లు ఆపి, నన్ను చంపే కార్యక్రమానికి వస్తావా? 172 00:14:32,789 --> 00:14:35,417 విషయాలు తెలిసిన వాళ్లందరినీ చంపాల్సిన పని లేదు. 173 00:14:37,336 --> 00:14:40,296 ఒక నిమిషం నీ అర్థం కాని సోదిని ఆపి, 174 00:14:40,297 --> 00:14:44,426 నన్ను ఇక్కడ ఎందుకు బంధించావో చెప్పి చస్తావా? 175 00:14:48,055 --> 00:14:49,139 ఒక మందు ఉంది. 176 00:14:50,307 --> 00:14:51,600 అది మర్చిపోయేలా చేస్తుంది. 177 00:14:55,062 --> 00:14:56,104 దేన్ని మర్చిపోయేలా? 178 00:14:58,065 --> 00:15:00,234 ముందు, నువ్వు మర్చిపోవాలని మేము అనుకొనే వాటితో మొదలుపెడతాం. 179 00:15:00,817 --> 00:15:03,612 కొంచెం డోసు ఇస్తే, గత కొన్ని వారాల్లో జరిగినదంతా నువ్వు మర్చిపోతావు. 180 00:15:06,865 --> 00:15:08,282 మరి ఎక్కువ డోసు ఇస్తే? 181 00:15:08,283 --> 00:15:10,869 డోరిస్ చనిపోక ముందు ఉన్న స్థితికి నిన్ను తీసుకెళ్లగలం. 182 00:15:13,163 --> 00:15:14,622 దాని వల్ల ఏంటి లాభం? 183 00:15:14,623 --> 00:15:18,418 తను... తను ఏమైపోయిందా అని నేను ఊరంతా పిచ్చోడిలా తిరుగుతూ ఉండాలా? 184 00:15:22,923 --> 00:15:29,012 అది కుదరదు. ఆ మందు నిజమైనదే అయితే, నన్ను చాలా వెనక్కి తీసుకెళ్ళాలి. 185 00:15:30,055 --> 00:15:31,765 నన్ను 22 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళాలి. 186 00:15:32,933 --> 00:15:33,976 తనని కలవక ముందు ఉన్న సమయానికి. 187 00:15:35,853 --> 00:15:38,605 ఆ పని చేసి పెట్టాలి నువ్వు. ఎందుకంటే, అదే నాకు మేలు చేస్తుంది. 188 00:15:41,525 --> 00:15:42,860 ఆ పని చేయగలం. 189 00:15:43,569 --> 00:15:46,446 కానీ, ముందు మాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి. 190 00:15:55,497 --> 00:15:56,582 చాలా బాగుంది కదా? 191 00:16:03,964 --> 00:16:05,090 ఏంటది? 192 00:16:08,886 --> 00:16:09,887 తెలీదు. 193 00:16:11,972 --> 00:16:14,515 నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే... 194 00:16:14,516 --> 00:16:18,060 షెరిఫ్ నికల్స్ శుభ్రపరచడం గురించి నివేదిక పూర్తి అయిందా? 195 00:16:18,061 --> 00:16:19,270 అయిపోవచ్చేసింది. 196 00:16:19,271 --> 00:16:20,855 ఇంకొక్క సాక్షి వాంగ్మూలం కావాలంతే. 197 00:16:20,856 --> 00:16:23,775 తనకి బయటకి వెళ్లాలనుంది అని మిస్ నికల్స్ చెప్పిందా? 198 00:16:24,276 --> 00:16:26,069 మేయర్ ప్రకారం, 199 00:16:26,820 --> 00:16:29,865 మిస్టర్ సిమ్స్, ఇంకా అక్కడ ఉన్న నలుగురు-అయిదుగురు రెయిడర్ల ప్రకారం చెప్పింది. 200 00:16:30,490 --> 00:16:32,326 ఇంకాసేపట్లలో అయిదవ రెయిడర్ తో మాట్లాడబోతున్నా. 201 00:16:32,993 --> 00:16:34,995 సరే, అది కానివ్వు అయితే. 202 00:16:41,210 --> 00:16:42,127 యువర్ హానర్... 203 00:16:44,963 --> 00:16:46,298 నాకు సిండ్రోమ్ ఉంది. 204 00:16:48,926 --> 00:16:50,677 నాకు మినహాయింపు ఇస్తున్నట్టు సిమ్స్ చెప్పాడు. 205 00:16:52,721 --> 00:16:54,097 అతని నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నా. 206 00:16:55,474 --> 00:17:00,270 ఒప్పందంలో ఉండే కొన్ని వివక్షపూరిత వాక్యాల కారణంగా, అనవసరంగా ఏర్పడిన... 207 00:17:01,563 --> 00:17:04,066 కొన్ని దురాలోచనలని చెరిపివేయాల్సిన సమయం వచ్చేసింది. 208 00:17:08,654 --> 00:17:12,824 సిండ్రోమ్ కి కారణాన్ని తెలిపే సిద్ధాంతం ఒకటుంది, తెలుసా? 209 00:17:13,825 --> 00:17:17,246 దానికి కారణం రక్తంలో ఉన్న లోపం కానీ, విటమిన్ల లోపం కానీ కాదు. 210 00:17:17,871 --> 00:17:23,544 అలవాటు లేని కొత్త పరిస్థితికి మానవుల్లో సహజంగానే పుట్టుకొచ్చే ప్రతిచర్యే అది. 211 00:17:24,502 --> 00:17:28,757 మానవ శరీరం, భూగర్భంలో జీవించడానికి తగ్గట్టుగా నిర్మాణం కాలేదు. 212 00:17:29,550 --> 00:17:32,845 మనలో ఎవరం కూడా, 200 కంటే ఎక్కువ అడుగులు నేరుగా నడవలేం. 213 00:17:37,474 --> 00:17:38,851 జూలియా నికల్స్ తప్ప. 214 00:17:43,105 --> 00:17:44,731 తన శుభ్రపరచడం గురించి నివేదిక పూర్తయ్యాక... 215 00:17:46,859 --> 00:17:47,860 దాన్ని ముందు నాకే చూపించు. 216 00:17:55,450 --> 00:17:56,451 హేయ్! 217 00:17:57,995 --> 00:17:59,245 ఏంటది? 218 00:17:59,246 --> 00:18:00,330 తెరిచి చూడు. 219 00:18:04,543 --> 00:18:05,711 ఏంటిది? 220 00:18:19,766 --> 00:18:21,059 చికెన్ సలాడ్. 221 00:18:21,685 --> 00:18:22,686 అంత చండాలంగా ఏమీ ఉండదు. 222 00:18:23,520 --> 00:18:25,479 అంటే, నాకు తెలీదనుకో, 223 00:18:25,480 --> 00:18:28,775 రుచి ఇప్పుడు చెప్పలేననుకో, కానీ మొదటిసారి తిన్నప్పుడు నచ్చింది. 224 00:18:32,863 --> 00:18:34,323 అయ్య బాబోయ్. 225 00:18:35,657 --> 00:18:37,576 - ఏమైంది? - ఏం లేదులే. 226 00:18:38,994 --> 00:18:42,706 అంటే, నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది. 227 00:18:48,337 --> 00:18:49,379 సూట్ దొరకలేదా? 228 00:18:51,256 --> 00:18:55,134 బెల్ట్, ఇంకా కొంత సామాగ్రి కనిపించింది, 229 00:18:55,135 --> 00:18:58,597 నాశనం కాని పది అడుగుల గుడ్డ ఉంది. 230 00:18:59,598 --> 00:19:04,102 సూట్ చేయడానికి అది చాలదు, ఇక నా సూట్ అంటావా? 231 00:19:04,686 --> 00:19:07,105 దాన్ని ముక్కలుముక్కలు చేసేశా, కాబట్టి ఇప్పుడేం లేదు. 232 00:19:08,398 --> 00:19:12,569 సూట్లను రూమ్ యస్ లోనే తయారు చేస్తారు. 233 00:19:13,278 --> 00:19:17,449 సూట్లు చేయడానికి కావాల్సిన సామాగ్రి క్రిటికల్ సప్లై ఛాంబరులో ఉంటుంది. 234 00:19:18,700 --> 00:19:20,536 కానీ, అది... 235 00:19:21,495 --> 00:19:22,496 నీటిలో ఉందా? 236 00:19:23,914 --> 00:19:25,707 అవి తడిసిపోకుండా ఉండాలని కోరుకుంటున్నా. 237 00:19:26,667 --> 00:19:27,917 సారీ, ఏమన్నావు? 238 00:19:27,918 --> 00:19:29,878 అవి తడిసిపోకుండా... 239 00:19:30,546 --> 00:19:31,838 హా? 240 00:19:31,839 --> 00:19:33,130 - నాకు... - తెలుసు, 241 00:19:33,131 --> 00:19:35,174 నేను... నేను జోక్ వేద్దామని చూశా. 242 00:19:35,175 --> 00:19:37,010 కానీ చాలా కాలమైంది కదా, సారీ. 243 00:19:41,849 --> 00:19:43,559 - జూలియా? - ఏంటి? 244 00:19:44,184 --> 00:19:45,602 నువ్వు ఎందుకు శుభ్రం చేయలేదు? 245 00:19:49,815 --> 00:19:52,734 - నేను శుభ్రం చేయనని ముందే చెప్పా కాబట్టి. - హా, అందరూ ముందు అదే చెప్తారు. 246 00:19:55,863 --> 00:19:57,906 జనాలు ఎందుకు శుభ్రం చేస్తారో నేను కనిపెట్టా. 247 00:20:00,033 --> 00:20:01,034 అంటే... 248 00:20:04,621 --> 00:20:10,252 జనాలు... ఎందుకు శుభ్రం చేస్తారంటే, వాళ్ళు బయటకు వెళ్ళాక... 249 00:20:11,086 --> 00:20:15,339 వాళ్లకి అక్కడ అందమైన ఆకాశం, అందమైన చెట్లు, 250 00:20:15,340 --> 00:20:18,467 పచ్చ గడ్డి, ఇంకా పూలు కనిపిస్తాయి. 251 00:20:18,468 --> 00:20:20,094 శుభ్రం చేస్తే బాగుంటుందని వాళ్లకి అనిపిస్తుంది. 252 00:20:20,095 --> 00:20:22,680 లోపల ఉన్న వాళ్లందరికీ బయట ఎలా ఉంటుందో చూపించాలని వాళ్ళు ఆరాటపడతారు. 253 00:20:22,681 --> 00:20:24,349 అక్కడ ఎంత అందంగా ఉందో చూపించాలని. 254 00:20:25,058 --> 00:20:27,019 - అవును, కానీ నువ్వు ఆ పని చేయలేదు. - అవును. 255 00:20:27,686 --> 00:20:29,687 నేను శుభ్రం చేయలేదు, ఎందుకంటే, అదంతా అబద్ధం. 256 00:20:29,688 --> 00:20:32,648 అదంతా అబద్ధం, ఎందుకంటే వేరే వాళ్ళు శుభ్రం చేస్తున్న ఫుటేజీ చూశా నేను, 257 00:20:32,649 --> 00:20:36,569 అక్కడ కొన్ని జీవులు ఉన్నాయి, 258 00:20:36,570 --> 00:20:38,446 అవి గాల్లో ఎగురుతూ ఉన్నాయి... 259 00:20:38,447 --> 00:20:40,449 పక్షులు. వాటిని పక్షులు అంటారు. 260 00:20:42,034 --> 00:20:45,787 సరే. నేను బయటకు వెళ్ళినప్పుడు, ఆ పక్షులని చూశా, సరేనా? 261 00:20:46,371 --> 00:20:47,496 కానీ అవి 262 00:20:47,497 --> 00:20:51,334 నేను చూసిన, ఆ శుభ్రం చేసే ఫుటేజీలో కదిలినట్టే కదులుతూ ఉన్నాయి. 263 00:20:51,335 --> 00:20:53,044 ఖచ్చితంగా అలాగే అన్నమాట. 264 00:20:53,045 --> 00:20:57,256 కాబట్టి, క్యాంటిన్ లో ఉండే స్క్రీన్ సరిగ్గానే చూపుతోందని, 265 00:20:57,257 --> 00:20:58,967 నేను చూస్తున్నదే అబద్ధమని అర్థమైంది. 266 00:20:59,843 --> 00:21:00,844 అదే, హెల్మెట్ ద్వారా. 267 00:21:01,803 --> 00:21:05,306 - వాళ్ళు అలా ఎలా చేస్తారో నాకు తెలీదు. - చాలా అధునాతనమైన కంప్యూటర్ల ద్వారా. 268 00:21:05,307 --> 00:21:07,266 సరే. కానీ అది అబద్ధం, కదా? 269 00:21:07,267 --> 00:21:08,352 మరి నేనెందుకు శుభ్రం చేయాలి? 270 00:21:09,102 --> 00:21:10,436 అందుకే, నేను ఆ పని చేయలేదు. 271 00:21:10,437 --> 00:21:11,562 ముందుకు నడవడం మొదలుపెట్టా. 272 00:21:11,563 --> 00:21:13,397 నడుచుకుంటూ ముందుకు సాగా, 273 00:21:13,398 --> 00:21:18,320 కానీ నేను చేస్తున్న పని వల్ల ఇక్కడ జరిగినట్లే అక్కడా జరిగే అవకాశం ఉందని అనుకోలేదు. 274 00:21:18,862 --> 00:21:20,822 - అది మాత్రం నేను ఊహించలేదు. - ఎవరు మాత్రం ఊహించగలరు! 275 00:21:34,378 --> 00:21:35,462 నువ్వు ఎలా బతికి బయటపడ్డావు? 276 00:21:39,216 --> 00:21:43,095 అందరూ చనిపోయారు, కానీ నీకు ఏమీ కాలేదు. ఎలా? 277 00:21:44,638 --> 00:21:48,516 నేను... నేను ఉండాలి కదా, లేకపోతే ఈ వాల్టును ఎవరు చూసుకుంటారు? 278 00:21:48,517 --> 00:21:51,311 అది కాదు, అంటే, అక్కడ ఎంత కాలం నుండి ఉంటున్నావు? ఎలా... 279 00:21:52,521 --> 00:21:56,567 ఒంటరిగా ఉంటున్నానని అన్నావు కదా, నీ దగ్గర ఆహారం ఉంది, కాబట్టి... 280 00:21:57,609 --> 00:22:00,863 నా పని నేను చేస్తున్నానంతే. తలుపు మాత్రం మూసేసే ఉంచుతా. 281 00:22:01,738 --> 00:22:02,906 దాన్ని తెరవనే తెరవను. 282 00:22:04,825 --> 00:22:06,368 - ఎప్పటికీనా? - ఎప్పటికీ. 283 00:22:09,329 --> 00:22:11,456 ఎందుకంటే, కొందరు లోనికి రావడానికి ప్రయత్నించారని అర్థమవుతోంది, కాబట్టి... 284 00:22:14,501 --> 00:22:18,296 నేను పుస్తకాలు చదువుతా, సంగీతం వింటా... 285 00:22:18,297 --> 00:22:22,134 సోలో? నేను ఒకటి... ఒకటి అడగనా... 286 00:22:24,761 --> 00:22:27,555 హాలు బయట ఉండే శవాలు, 287 00:22:27,556 --> 00:22:29,640 మిగతా శవాలంత పాతవి కాదు. 288 00:22:29,641 --> 00:22:30,726 కాబట్టి... 289 00:22:32,519 --> 00:22:33,520 ఏం జరిగింది? 290 00:23:06,512 --> 00:23:08,679 నాకు ఆహారం దొరకలేదు, అది ఇచ్చినందుకు థ్యాంక్యూ. 291 00:23:08,680 --> 00:23:12,476 అది చాలా బాగుంది. 292 00:23:13,393 --> 00:23:14,645 థ్యాంక్యూ. 293 00:23:22,069 --> 00:23:25,197 నేనేమీ మంచిగా ఉండాలని ప్రయత్నించలేదు, నాకు నువ్వు ఆహారం తినడం కావాలి అంతే. 294 00:23:28,534 --> 00:23:29,535 ఎందుకు? 295 00:23:30,619 --> 00:23:33,871 నువ్వు ఆహారం తిన్నప్పుడే కదా, నువ్వు నిజమైన మనిషివి అని, 296 00:23:33,872 --> 00:23:35,457 నేను ఊహించుకోవట్లేదని నాకు అర్థమయ్యేది. 297 00:23:38,502 --> 00:23:39,503 జనాలున్నట్టు ఊహించుకుంటావా? 298 00:23:41,129 --> 00:23:43,130 ఏమైంది... హేయ్... ఆగాగు, సోలో. 299 00:23:43,131 --> 00:23:44,341 నేను... 300 00:24:18,041 --> 00:24:21,085 ఆ పిచ్చోడి నుండి నువ్వు పిల్లలని కాపాడినప్పుడు నీకు ఇచ్చిన అవార్డ్ ఇది. 301 00:24:21,086 --> 00:24:22,588 అతని పేరేంటి? 302 00:24:23,547 --> 00:24:24,965 ఆ పేరును నేనెప్పుడూ పలకను. 303 00:24:27,050 --> 00:24:28,677 ఆ మనిషి అసలు లేడన్నట్టు. 304 00:24:29,303 --> 00:24:30,304 మంచి పనే అది. 305 00:24:31,138 --> 00:24:32,222 ఇక ఇది. 306 00:24:33,432 --> 00:24:35,725 పిస్టల్ షూటింగ్ లో నిన్ను తలదన్నే రెయిడర్ ఎవరూ లేరు. 307 00:24:35,726 --> 00:24:37,059 చిన్న ఆయుధాల నిపుణుడు బెస్ట్ షూటర్ అవార్డ్ 308 00:24:37,060 --> 00:24:38,145 ఇప్పటికీ లేరు. 309 00:24:40,772 --> 00:24:42,024 నువ్వన్నది నిజమే, రెజ్జీ. 310 00:24:42,941 --> 00:24:44,234 అది నిజమే. 311 00:24:45,485 --> 00:24:48,070 మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషమే, మిస్టర్ సిమ్స్... 312 00:24:48,071 --> 00:24:49,198 నన్ను రాబ్ అని పిలువులే. 313 00:24:50,199 --> 00:24:51,699 లేదు, సర్, నేనలా పిలవలేను... 314 00:24:51,700 --> 00:24:56,204 ప్రస్తుతమున్న ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా, రిటైర్ అయిన రెయిడర్లను కూడా తిరిగి పనిలోకి 315 00:24:56,205 --> 00:24:57,997 తీసుకుంటున్నామని నీకు అర్థమయ్యే ఉంటుంది. 316 00:24:57,998 --> 00:24:59,290 వాళ్ళని తీసుకోవాలి. 317 00:24:59,291 --> 00:25:00,374 మనందరి బాధ్యత అది. 318 00:25:00,375 --> 00:25:05,714 కానీ నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నిన్ను మెకానికల్ కి పంపిస్తున్నాం. 319 00:25:10,761 --> 00:25:12,261 ఈ వయస్సులోనా? 320 00:25:12,262 --> 00:25:16,433 మనిద్దరమూ ఎప్పట్నుంచో ఒకరికొకరం సాయపడుతూ వస్తున్నాం. 321 00:25:18,227 --> 00:25:19,936 మీ రుణం తీర్చుకోమంటున్నారు. 322 00:25:19,937 --> 00:25:22,855 ఆర్చీ బ్రెంట్ తో ఏకాంతంగా అయిదు నిమిషాలు కావాలని అడిగావు. 323 00:25:22,856 --> 00:25:24,316 కానీ నీకు పది నిమిషాలు ఇచ్చా. 324 00:25:28,278 --> 00:25:30,821 మెకానికల్ లో నన్ను ఎక్కువ కాలం ఉంచరని మాత్రం చెప్పండి. 325 00:25:30,822 --> 00:25:33,074 అక్కడి గాలి నాకు పడదు. 326 00:25:33,075 --> 00:25:34,535 ఎక్కువ కాలమేమీ పట్టదు. 327 00:25:35,619 --> 00:25:38,120 హేయ్. హేయ్, బాస్... హేయ్. మనకి మాట్లాడుకొనే అవకాశం... 328 00:25:38,121 --> 00:25:39,915 - నాకు సమయం లేదు. - ఇది... ఇది చాలా ముఖ్యమైనది. 329 00:25:40,582 --> 00:25:44,627 షర్లీ ఏం చేస్తోందో తెలుసుకోవాలని, తనపై ఒక కన్నేసి ఉంచమని నీకు చెప్పా. 330 00:25:44,628 --> 00:25:46,171 అది చేయకుండా, తనతో చేతులు కలిపావు. 331 00:25:48,215 --> 00:25:49,842 అది నాకు తెలిసిపోయిందని ఆశ్చర్యంగా ఉందా? 332 00:25:51,635 --> 00:25:53,512 తనపై కన్నేసి ఉంచమని నీకు మాత్రమే చెప్పానని అనుకుంటున్నావా? 333 00:25:55,430 --> 00:25:56,889 అవును, నేను... 334 00:25:56,890 --> 00:26:00,102 నేను అక్కడికి వెళ్లాను, కానీ... దాని గురించే నీతో మాట్లాడాలి. 335 00:26:01,603 --> 00:26:03,897 ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు, జీన్. 336 00:26:04,398 --> 00:26:05,982 చాలా దూరం నడవాలని తెలుసు. 337 00:26:05,983 --> 00:26:08,610 నేనేం చూశానో నాకు తెలుసు! నేనేం అబద్ధాలు చెప్పట్లేదు! 338 00:26:10,529 --> 00:26:14,824 ఒప్పందంలో షెరిఫ్ బాధ్యతలను వివరించే విభాగానికి వస్తే, 339 00:26:14,825 --> 00:26:18,828 శుభ్రం చేసిన ప్రతి ఘటనపై జ్యుడిషియల్ శాఖకి నివేదికని ఇవ్వాల్సిన బాధ్యత 340 00:26:18,829 --> 00:26:20,246 షెరిఫ్ దే అని అందులో ఉంటుంది. 341 00:26:20,247 --> 00:26:22,165 అందుకే నేను మిమ్మల్ని రమ్మన్నాను. 342 00:26:23,250 --> 00:26:26,628 షెరిఫ్ నికల్స్ ని చెరసాలలో వేసిన తర్వాతే ఆమెని నేను చూశాను. 343 00:26:28,672 --> 00:26:30,591 కానీ ఆమెని అరెస్ట్ చేసేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు, కదా? 344 00:26:31,466 --> 00:26:32,551 అవును. 345 00:26:34,303 --> 00:26:35,804 మొక్కజొన్న పొలంలోనా? 346 00:26:36,430 --> 00:26:37,806 అవును. 347 00:26:38,390 --> 00:26:42,519 పారిపోయే ముందు, ఆమె ఏమంది? 348 00:27:00,245 --> 00:27:01,246 నిద్ర పట్టట్లేదా? 349 00:27:03,373 --> 00:27:06,710 పొరపాటున కాఫీని సమయం దాటాక తాగేసినట్టున్నా. 350 00:27:07,211 --> 00:27:08,212 మరి మీకు? 351 00:27:10,422 --> 00:27:11,715 కంగారుగా ఉంది. 352 00:27:14,009 --> 00:27:17,303 గర్భవతి కావటానికి తీసే లాటరీకి మాకు మరో అవకాశం వస్తుందని నేను అనుకోలేదు, 353 00:27:17,304 --> 00:27:21,557 కానీ షెరిఫ్ బయటకు వెళ్లడం వలన, రేపు బోనస్ గా ఇంకో లాటరీ తీస్తున్నారు, 354 00:27:21,558 --> 00:27:23,936 కిందటి సారి తీసిన చీటీల నుండే తీస్తారు. 355 00:27:24,728 --> 00:27:27,231 మా పేరు వచ్చే అవకాశం ఎక్కువే ఉందని నా భర్త చెప్తూ ఉన్నాడు. 356 00:27:28,232 --> 00:27:29,483 గుడ్ లక్. 357 00:27:30,859 --> 00:27:33,736 పిల్లల్ని కనాలని నాకు, రిక్ కి చాలా ఉంది, 358 00:27:33,737 --> 00:27:35,738 కానీ పరిస్థితులని చూస్తుంటే, పిల్లల్ని కనడం సరైన పనో కాదో 359 00:27:35,739 --> 00:27:37,157 మాకు అర్థం కావట్లేదు. 360 00:27:44,831 --> 00:27:47,709 బిడ్డను కంటే, మనలో ఒక ఆశ ఉదయిస్తుంది. 361 00:27:52,047 --> 00:27:55,717 ఈ చెట్లను నాటిన వారికి, వాటి కింద సేద తీరే అదృష్టం దక్కలేదు. 362 00:28:00,472 --> 00:28:01,640 మీకు పిల్లలు ఉన్నారా? 363 00:28:04,893 --> 00:28:05,978 హా. 364 00:28:06,603 --> 00:28:07,771 ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? 365 00:28:16,989 --> 00:28:18,365 మా తొలి సంతానం కలిగే సమయంలో... 366 00:28:19,074 --> 00:28:21,284 నేను మా పాపని చూడక ముందే, తన సవ్వడి విన్నాను. 367 00:28:21,285 --> 00:28:23,328 నా భార్య కడుపు దగ్గర చెవి పెట్టి విన్నా. 368 00:28:24,872 --> 00:28:26,707 ఎవరు పుడతారా అని ఎన్నో నెలలు ఎదురుచూస్తూ గడుపుతాం. 369 00:28:28,333 --> 00:28:33,964 ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, ఎలా ఏడుస్తారు, ఎలా నవ్వుతారు అనే ఆలోచనలే మనల్ని ముంచేస్తాయి. 370 00:28:35,841 --> 00:28:38,218 ఇక వాళ్ళు పుట్టాక, తొలిసారిగా చూస్తాం. 371 00:28:40,053 --> 00:28:41,430 వాళ్లేమో చక్కగా, అద్భుతంగా ఉంటారు. 372 00:28:46,351 --> 00:28:48,854 ఇక వెళ్లి పడుకొనే ప్రయత్నం చేస్తా. 373 00:28:50,772 --> 00:28:52,191 నా పేరు ఫీబీ వెల్స్. 374 00:28:54,193 --> 00:28:55,402 నా పేరు పీట్ నికల్స్. 375 00:28:58,113 --> 00:28:59,947 - అయ్యయ్యో. - పర్వాలేదు. 376 00:28:59,948 --> 00:29:01,407 - నేనిందాక అన్నవి... - మరేం పర్వాలేదు. 377 00:29:01,408 --> 00:29:03,368 కనీసం కొంత మంచైనా జరిగిందిగా. 378 00:29:06,830 --> 00:29:07,998 లాటరీలో మీరు గెలవాలని కోరుకుంటున్నా. 379 00:29:10,459 --> 00:29:11,460 థ్యాంక్యూ. 380 00:29:13,003 --> 00:29:14,087 ఇక నేను... 381 00:29:16,340 --> 00:29:17,591 గుడ్ నైట్. 382 00:29:49,122 --> 00:29:50,040 హేయ్. 383 00:29:53,710 --> 00:29:56,296 - ఏంటి? - హేయ్. ఆగు. 384 00:30:03,512 --> 00:30:05,264 నాకొక ఐడియా వచ్చింది. 385 00:30:05,931 --> 00:30:07,223 అగ్నిమాపక సిబ్బంది. 386 00:30:07,224 --> 00:30:08,641 హా, విషయం ఏంటో చెప్పు! 387 00:30:08,642 --> 00:30:10,351 వాళ్లకి హెల్మెట్స్ ఉంటాయి, సూట్స్ ఉంటాయి. వాళ్లకి... 388 00:30:10,352 --> 00:30:13,187 వాళ్లకి ఎయిర్ ట్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు పొగలోకి వెళ్తారు. 389 00:30:13,188 --> 00:30:14,565 ఆ సూట్లు చాలవు. 390 00:30:15,858 --> 00:30:19,610 బయటకెళ్ళినా ప్రాణాలని నిలిపేలా వాటిని డిజైన్ చేయలేదు. భలేవాడివే. 391 00:30:19,611 --> 00:30:21,697 హా. శుభ్రపరచడానికి వాడే సూట్లు కూడా అంతే కదా. 392 00:30:29,329 --> 00:30:31,582 నేను అగ్నిమాపక సిబ్బంది సూట్ ని వాడొచ్చు. 393 00:30:33,125 --> 00:30:34,417 అదేమంత చండాలమైన ఐడియా కాదు. 394 00:30:34,418 --> 00:30:35,835 హా, అంతే అంటావా? 395 00:30:35,836 --> 00:30:38,588 - అంటే... నాకు మళ్ళీ అనుమానం వచ్చింది. - అవి ఎక్కడ ఉంటాయి? 396 00:30:38,589 --> 00:30:41,966 అగ్నిమాపక సామాగ్రి మూడు చోట్ల ఉంటాయి. 397 00:30:41,967 --> 00:30:44,635 ఇంజినీరింగ్ విభాగంలో, 70, ఇంకా 23వ అంతస్థుల్లో ఉంటాయి. 398 00:30:44,636 --> 00:30:47,680 - ఇరవై మూడవ అంతస్థులో ఎక్కడ? - రీసైక్లింగ్ పక్కన. 399 00:30:47,681 --> 00:30:51,768 - సరే. - ఆగు, ఒక సమస్య ఎదురు కావచ్చు. 400 00:31:17,920 --> 00:31:19,712 మన్నించాలి. పొద్దుపోయాక వచ్చాను. 401 00:31:19,713 --> 00:31:20,796 ఏమైనా జరిగిందా? 402 00:31:20,797 --> 00:31:23,925 షెరిఫ్ నికల్స్ శుభ్రపరచడం గురించి నేను చేసిన నివేదికను, సమర్పించే ముందు 403 00:31:23,926 --> 00:31:25,176 ఒకసారి మీకు చూపించమన్నారు కదా. 404 00:31:25,177 --> 00:31:26,302 దీన్ని ఇంత అర్జంటుగా ఇవ్వాలా? 405 00:31:26,303 --> 00:31:30,056 నికల్స్ ని అదుపులోకి తీసుకునేటప్పుడు సాయపడిన అయిదు రెయిడర్లతోనూ నేను మాట్లాడాను. 406 00:31:30,057 --> 00:31:33,017 తను బయటకు వెళ్తానని చెప్పిందని నలుగురు చెప్పారు. 407 00:31:33,018 --> 00:31:34,185 కానీ ఒకరు అలా చెప్పలేదా? 408 00:31:34,186 --> 00:31:37,980 అయిదవ వ్యక్తి... వారి దృష్టి అంతా పనిపైనే ఉండిందని చెప్పారు. 409 00:31:37,981 --> 00:31:42,152 తను బయటకు వెళ్తానని చెప్పడం ఇతరులు విన్నారంటే, తను అది చెప్పి ఉండవచ్చని అన్నారు. 410 00:31:42,861 --> 00:31:43,986 కానీ నీకు అనుమానంగా ఉందా? 411 00:31:43,987 --> 00:31:45,655 నేను షెరిఫ్ నికల్స్ ని మెట్లపై పైకి తీసుకెళ్తున్నప్పుడు, 412 00:31:45,656 --> 00:31:48,074 తను ఆ మాట అనలేదని తనే నాకు చెప్పింది. 413 00:31:48,075 --> 00:31:49,910 ఒక్క నిమిషం. ఆ ముక్క నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? 414 00:31:52,704 --> 00:31:55,581 తన మాటలని నమ్మవచ్చో, లేదో అనిపించింది. 415 00:31:55,582 --> 00:31:59,418 నేను వేరే వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, కానీ సాక్షులకి ఏమైనా సందేహాలు ఉంటే, 416 00:31:59,419 --> 00:32:01,921 నికల్స్ ని బయటకు పంపక ముందు విచారణని జరిపి ఉండాలి కదా. 417 00:32:01,922 --> 00:32:03,423 - అది ఒప్పందంలో... - అది ఒప్పందంలో ఉంది. హా. 418 00:32:04,883 --> 00:32:06,260 నాకు తెలుసు. 419 00:32:08,345 --> 00:32:09,888 - ఇంకేమైనా... - ఇంకేం లేదు. 420 00:32:10,973 --> 00:32:12,057 దీని సంగతి ఇక నేను చూసుకుంటాలే. 421 00:32:14,184 --> 00:32:16,144 దీన్ని నా దృష్టికి తెచ్చినందుకు థ్యాంక్యూ, షెరిఫ్. 422 00:32:17,062 --> 00:32:18,355 గుడ్ నైట్. 423 00:33:40,479 --> 00:33:41,480 నాక్స్. 424 00:33:44,816 --> 00:33:47,193 షర్లీ, వెనక్కి తిరిగి, నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపో. 425 00:33:47,194 --> 00:33:50,280 - మాకు టెడ్డీని ఇచ్చేస్తే, వెళ్ళిపోతాం. - అది జరగని పని. 426 00:33:54,701 --> 00:33:56,118 ఈ గూండాలను ఎక్కడి నుండి తెప్పించారు? 427 00:33:56,119 --> 00:33:59,789 - గూండాలా? ఆపు షర్ల్ ఇక. వీళ్ళు డెప్యూటీలు. - హెల్మెట్లు పెట్టుకొని ఉన్నవాళ్లు కాదు కదా. 428 00:33:59,790 --> 00:34:02,542 అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తీసుకెళ్లడానికి నేను ఎలా అంగీకరిస్తాను! 429 00:34:02,543 --> 00:34:04,211 - అయితే అతడిని విడుదల చేయి! - టెడ్డీని వదిలేయండి! 430 00:34:06,380 --> 00:34:08,422 పోలీసులం. ఇక్కడి నుండి వెళ్లిపోండి! 431 00:34:10,092 --> 00:34:11,676 మనం ఇలాంటి వాళ్ళం కాదు! 432 00:34:11,677 --> 00:34:14,136 ఇప్పుడు ఇలాగే ఉండాలేమో! 433 00:34:14,137 --> 00:34:17,891 టెడ్డీని వదిలేయండి! 434 00:34:36,159 --> 00:34:38,535 చూడండి, మనందరికీ కావాల్సింది ఒకటే. 435 00:34:38,536 --> 00:34:39,704 మనందరికీ టెడ్డీ బయటకు రావడమే కావాలి. 436 00:34:39,705 --> 00:34:41,956 - టెడ్డీని వదిలేయండి! టెడ్డీని వదిలేయండి! - చూడండి... 437 00:35:01,518 --> 00:35:03,937 - అతడిని వదిలేయండి! - వద్దు! 438 00:35:17,910 --> 00:35:19,494 ఏం చేస్తున్నారు? 439 00:35:24,208 --> 00:35:26,460 అతను వెనక్కి వెళ్ళిపోయాడు! అక్కడికెళ్లి పట్టుకోండి! 440 00:35:29,880 --> 00:35:31,215 - కూప్? - కూపర్! 441 00:35:33,800 --> 00:35:34,800 ఏం కాలేదులే. 442 00:35:34,801 --> 00:35:37,053 - నీకేం కాలేదు, కూప్. ఏం కాలేదు. - కూప్. 443 00:35:37,054 --> 00:35:39,639 - హేయ్, మిత్రమా. నీకేం కాలేదు. - కూప్, మేమున్నాంగా. 444 00:35:39,640 --> 00:35:40,891 నీకేమీ కాలేదులే. 445 00:35:41,683 --> 00:35:42,683 కూప్. 446 00:35:42,684 --> 00:35:44,685 - కూప్. - ఏమీ కాలేదులే. 447 00:35:44,686 --> 00:35:46,104 మరేం పర్వాలేదు. 448 00:35:50,859 --> 00:35:51,860 బాసూ? 449 00:35:58,200 --> 00:36:00,452 ఎవరైనా కాపాడండి! ప్లీజ్! 450 00:36:06,500 --> 00:36:09,545 ఒకటి 451 00:36:43,996 --> 00:36:45,371 ఫీబీ వెల్స్ - మహిళ గోప్యం 452 00:36:45,372 --> 00:36:47,206 ఈ ప్రక్రియకి కోడ్ గా సైలో ఆరెంజ్ ని కేటాయించడం జరిగింది 453 00:36:47,207 --> 00:36:48,791 పేషెంట్ లో గర్భ నియంత్రణకి ఉన్న క్యాప్సుల్ ని తీయరాదు. 454 00:36:48,792 --> 00:36:50,502 ఆ క్యాప్సూల్ తీసివేయబడిందని పేషెంట్ నమ్మాలి. 455 00:36:56,466 --> 00:36:59,343 ఆ ఫైర్ బాంబును విసిరిన సన్నాసి ఎవరో ఎవరికీ తెలీదు. 456 00:36:59,344 --> 00:37:01,096 వాళ్ళు మెకానికల్ వాళ్ళు కాదు. 457 00:37:01,680 --> 00:37:02,931 మరి ఇంకో వ్యక్తి? 458 00:37:05,434 --> 00:37:06,435 హా. 459 00:37:07,352 --> 00:37:09,187 మెకానికల్ లోనే పుట్టి, పెరిగాడు. 460 00:37:09,188 --> 00:37:10,354 టెర్రీ కూపర్. 461 00:37:10,355 --> 00:37:11,856 అతనంత మంచోడు ఇంకెవరూ ఉండరు. 462 00:37:11,857 --> 00:37:13,066 అతను కేవలం... 463 00:37:14,693 --> 00:37:18,280 హా, ఆ ఫైర్ బాంబు విసరకుండా ఆ సన్నాసిని ఆపే ప్రయత్నం చేశాడంతే. 464 00:37:20,490 --> 00:37:21,742 ఏం కావాలి నీకు? 465 00:37:22,868 --> 00:37:23,994 బాస్, 466 00:37:25,454 --> 00:37:27,246 మాకు అంతా కావాలి. 467 00:37:27,247 --> 00:37:28,373 కానీ ముందుగా... 468 00:37:30,584 --> 00:37:31,627 మాకు మీరు కావాలి. 469 00:37:53,232 --> 00:37:54,483 వచ్చినందుకు థ్యాంక్స్. 470 00:37:55,734 --> 00:37:57,818 ఇక్కడ మనకి ఏ ప్రమాదమూ లేదు, కెమెరాలు ఉండవు, వినేవాళ్ళు ఉండరు. 471 00:37:57,819 --> 00:38:00,656 మాకు కావాల్సిందేదో మమ్మల్ని చేసుకోనివ్వవచ్చు కదా? 472 00:38:01,281 --> 00:38:04,242 టెడ్డీని విడిపించుకొనే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. 473 00:38:04,243 --> 00:38:05,576 నిజంగానా? 474 00:38:05,577 --> 00:38:07,204 వాళ్లకి దొరక్కుండా వాడ్ని ఎంతకాలం దాస్తావు? 475 00:38:27,432 --> 00:38:28,725 కూపర్ మనకి దూరమైపోయాడు. 476 00:38:35,023 --> 00:38:36,441 దాన్ని నేను అస్సలు దిగమింగుకోలేకపోతున్నా. 477 00:38:39,778 --> 00:38:40,779 నేను కూడా. 478 00:38:50,163 --> 00:38:51,831 ఏం చేస్తున్నావు? కాలికి గాయం అవుతుంది. 479 00:38:51,832 --> 00:38:53,958 ఎవరినైనా కొట్టాలనుంటే, నన్ను కొట్టు. 480 00:38:53,959 --> 00:38:55,502 దేవుడా. 481 00:38:56,962 --> 00:38:58,547 దేవుడా. 482 00:39:00,424 --> 00:39:02,217 నువ్వు నిజంగానే కొడతావు అనుకోలేదు. 483 00:39:03,510 --> 00:39:05,095 నేను కూడా అనుకోలేదు కొడతానని. 484 00:39:14,605 --> 00:39:15,606 షర్ల్... 485 00:39:17,608 --> 00:39:19,443 కోపం నీ ఒక్క దానికే ఉంది అనుకోకు. 486 00:39:22,237 --> 00:39:24,740 జూల్స్ దూరమైంది నీ ఒక్క దానికే అనుకోకు. 487 00:39:30,245 --> 00:39:32,539 హా, తను దూరమైందని నేను అనుకోవట్లేదు. 488 00:39:36,752 --> 00:39:38,337 తను బయటకు వెళ్లి రెండు రోజులైంది. 489 00:39:39,838 --> 00:39:41,840 ఆ గుట్ట అవతల తనేం చూసిందో మనకి తెలీదు. 490 00:39:42,549 --> 00:39:48,347 తను బయట ఎక్కడోక్కడ ప్రాణాలతోనే ఉండి ఉండవచ్చు. 491 00:39:52,059 --> 00:39:53,434 చూడు, నేను... 492 00:39:53,435 --> 00:39:55,062 సరే. సరే. 493 00:39:55,646 --> 00:39:58,232 నీ అంత కసిగా నిజం తెలుసుకోవాలని నాకు కూడా ఉంది, 494 00:39:58,899 --> 00:40:00,859 కానీ నీ పద్ధతిలో చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. 495 00:40:04,279 --> 00:40:05,489 మరెలా చేద్దామంటావు? 496 00:40:07,950 --> 00:40:10,911 మన చిన్నప్పుడు, మనం ఇక్కడికి వచ్చి అంతా గాలిస్తూ ఉండేవాళ్ళం కదా? 497 00:40:12,829 --> 00:40:15,082 మనకి పేర్లు ఉన్న ఒక గోడ కనిపించింది, గుర్తుందా? 498 00:40:16,375 --> 00:40:17,501 హా? 499 00:40:19,628 --> 00:40:21,338 దాని అర్థం ఏంటో అప్పుడు మనకి తెలీలేదు. 500 00:40:24,341 --> 00:40:25,758 ఇప్పుడు నాకు తెలుసు అనుకుంటా. 501 00:40:25,759 --> 00:40:27,426 ఏదోక రోజు తెల్లవారుజామున, 502 00:40:27,427 --> 00:40:31,056 రొటీన్ మెయింటెనెన్స్ అని చెప్పి, క్యాంటిన్ లో ఉండే డిస్ ప్లే స్క్రీన్లను 503 00:40:31,765 --> 00:40:33,015 షట్ డౌన్ చేసేస్తా, 504 00:40:33,016 --> 00:40:37,187 వాటితో పాటు, షెరిఫ్ ఆఫీసులో ఉండే కెమెరాలని కూడా ఆఫ్ చేసేస్తా. 505 00:40:38,313 --> 00:40:41,108 ఎయిర్ లాక్ ని నేనే తెరుస్తా, 506 00:40:42,734 --> 00:40:45,112 గుట్ట దాటి కనిపించకుండా వెళ్లిపోవడానికి 507 00:40:46,530 --> 00:40:51,076 నీకు అయిదు నిమిషాల సమయం ఉంటుంది, ఆ తర్వాత నేను స్క్రీన్లను రీయాక్టివేట్ చేస్తా. 508 00:40:54,997 --> 00:40:56,665 ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నావా? 509 00:40:59,168 --> 00:41:00,961 నాకు నా సూట్ ఎప్పుడు తెచ్చిస్తావు? 510 00:41:03,714 --> 00:41:07,801 ఐటీ హెడ్ గా, నాకొక సూట్ ఉంది. 511 00:41:10,387 --> 00:41:14,182 దాని సైజ్ మార్చి ఇద్దామనుకున్నా. 512 00:41:14,183 --> 00:41:15,892 నువ్వు తాటి చెట్టంత ఉన్నావు. 513 00:41:15,893 --> 00:41:20,439 అందుకే నీకు ప్రత్యేకమైన సూట్ చేస్తే మంచిదనిపించింది. 514 00:41:21,023 --> 00:41:23,734 షాడోగా ఒక వ్యక్తిని అనుకుంటున్నానని, వారి కోసం అని చెప్తా. 515 00:41:24,318 --> 00:41:27,028 మామూలుగా అయితే, సైజులు తీసుకోవడానికి వాళ్ళు ఒక బృందాన్ని పంపిస్తారు, 516 00:41:27,029 --> 00:41:32,200 కానీ ఇది మనిద్దరి మధ్య ఉండే విషయమే కనుక, 517 00:41:32,201 --> 00:41:35,494 ఆ పని నేనే చేస్తా. 518 00:41:35,495 --> 00:41:37,831 నీ సైజులని నేనే తీసుకుంటా. 519 00:42:07,569 --> 00:42:09,571 ముందు చేతులతో మొదలుపెట్టాలి. 520 00:42:10,239 --> 00:42:11,573 ఇలా పెట్టాలి... 521 00:42:26,380 --> 00:42:28,464 సైజులు రాసుకోవా? 522 00:42:28,465 --> 00:42:29,883 అక్కర్లేదు. 523 00:42:34,638 --> 00:42:35,847 బెర్నార్డ్. 524 00:42:35,848 --> 00:42:36,932 చెప్పు. 525 00:42:38,517 --> 00:42:40,018 నిన్ను ఒకటి అడగవచ్చా? 526 00:42:43,063 --> 00:42:44,439 నేనేమైనా ఉపయోగపడ్డానా? 527 00:42:45,524 --> 00:42:47,484 నేను నీతో మాత్రమే మాట్లాడగలను. 528 00:42:50,988 --> 00:42:52,781 కానీ మాట్లాడటమే నీకు కావాలి. 529 00:42:53,574 --> 00:42:57,577 నా అభిప్రాయంతో నీకు పని లేదు, దాన్ని పట్టించుకోవు కూడా. 530 00:42:57,578 --> 00:43:01,582 నీ అభిప్రాయం నాకు ముఖ్యం, దాన్ని నేను పట్టించుకుంటా. 531 00:43:02,165 --> 00:43:03,333 కానీ పక్కకు పెట్టేశావు. 532 00:43:04,251 --> 00:43:07,628 మెకానికల్ లో గోడ మీద రాసిన వాడిని విడుదల చేస్తే మంచిదని నీకు చెప్పాను. 533 00:43:07,629 --> 00:43:09,172 అతడిని వదిలేశాం. 534 00:43:09,173 --> 00:43:13,593 అవును, కానీ ఫైర్ బాంబు వల్ల, తుపాకీ కాల్పుల వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాక వదిలేశారు. 535 00:43:13,594 --> 00:43:15,219 - అది నీ ప్లానేనా? - కాదు. 536 00:43:15,220 --> 00:43:17,764 నిజమా? ఎందుకంటే, ఆ ఘటనలన్నీ "నియమావళి"లో సూచించినట్టే జరిగాయి. 537 00:43:18,724 --> 00:43:20,017 వాళ్ళు తిరగబడేలా చేసి, 538 00:43:20,893 --> 00:43:24,313 తద్వారా సైలో వాసులందరి దృష్టిలో మెకానికల్ వాళ్లని శత్రువులుగా చేసి, 539 00:43:25,230 --> 00:43:28,192 చివరగా తిరుగుబాటును అణచివేయాలని నీ ప్లాన్. 540 00:43:31,028 --> 00:43:32,320 అది నా ప్లాన్ కాదు. 541 00:43:32,321 --> 00:43:33,488 పక్కానా? 542 00:43:34,907 --> 00:43:36,366 నీతో అబద్ధం ఆడను. 543 00:43:37,618 --> 00:43:39,786 - అబద్ధం ఆడేశావు కదా. - ఎలా? 544 00:43:40,621 --> 00:43:44,082 బయటకు వెళ్తానని జూలియా నికల్స్ చెప్పలేదు కదా? 545 00:43:50,672 --> 00:43:51,673 లేదు. 546 00:43:52,299 --> 00:43:54,050 సూట్ కి సైజులు తీసేసుకున్నావా? 547 00:43:54,051 --> 00:43:55,426 తీసుకున్నా. 548 00:43:55,427 --> 00:43:57,345 అయితే, ఇక బయలుదేరు. 549 00:43:57,346 --> 00:43:59,264 ఈసారి వస్తే, నా సూట్ తోనే రా. 550 00:44:09,358 --> 00:44:10,733 సోలో? 551 00:44:10,734 --> 00:44:11,901 సోలో, నువ్వు అన్నది నిజమే. 552 00:44:11,902 --> 00:44:15,072 అది నీటిలో ఉంది, కానీ నేను వెళ్లి తీసుకురాగలను అనుకుంటా. 553 00:44:15,614 --> 00:44:17,782 నేను నీటిలోకి దిగితే, 554 00:44:17,783 --> 00:44:19,825 ఒక అంతస్థు కిందికి దిగి, 555 00:44:19,826 --> 00:44:22,161 ఇళ్ల గుండా వెళ్లగలనేమో, 556 00:44:22,162 --> 00:44:23,913 అలా ఇళ్ల మధ్య సందులోకి వెళ్లగలనేమో, 557 00:44:23,914 --> 00:44:27,500 కానీ నీటిలో ఉన్నప్పుడు నాకు గాలి అందించే యంత్రాన్ని నేను రూపొందించాలి. 558 00:44:27,501 --> 00:44:31,588 అంటే, నేను నీటిలో ఉన్నప్పుడు దాన్ని నడపడానికి నాకు నీ సాయం కావాలి. 559 00:44:34,716 --> 00:44:35,759 సోలో? 560 00:44:40,055 --> 00:44:42,265 నాకు నీ సాయం కావాలి. 561 00:44:42,266 --> 00:44:44,433 నేను బయటకు రాలేను! 562 00:44:44,434 --> 00:44:46,645 కానీ నువ్వు గతంలో బయటకు వచ్చావు కదా. 563 00:44:47,646 --> 00:44:48,897 నాకు తెలుసు... చూడు... 564 00:44:50,148 --> 00:44:51,190 హాలులో ఉండే రెండు శవాలు... 565 00:44:51,191 --> 00:44:53,193 నేను తలుపు తెరవకూడదు. 566 00:44:54,903 --> 00:44:58,197 నువ్వు నాకు ఆహారం ఇచ్చావుగా. తలుపు తెరిచే ఇచ్చావుగా. 567 00:44:58,198 --> 00:45:00,074 - అవును. - మరి? 568 00:45:00,075 --> 00:45:02,244 నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు తెరవను. 569 00:45:09,084 --> 00:45:10,918 చూడు, నిన్ను బలవంతపెట్టాలని నాకు లేదు. 570 00:45:10,919 --> 00:45:13,380 ఇక్కడేం జరిగిందో నాకు తెలియాల్సిన పని లేదు, సరేనా? 571 00:45:14,173 --> 00:45:15,174 నాకు అర్థమైంది. 572 00:45:16,216 --> 00:45:17,926 దాని గురించి నీకు మాట్లాడాలని లేదని తెలుసు, 573 00:45:18,510 --> 00:45:21,805 నువ్వు అందరినీ కోల్పోయావని కూడా తెలుసు. 574 00:45:24,683 --> 00:45:25,808 కానీ నేను నా సైలోకి వెళ్లాలి. 575 00:45:25,809 --> 00:45:28,520 నేను వెళ్ళాలి, సరేనా? 576 00:45:29,396 --> 00:45:31,647 నువ్వు తలుపును తెరవకూడదని కూడా నాకు తెలుసు... 577 00:45:31,648 --> 00:45:34,693 - అది నా డ్యూటీ. - కానీ నాకు నీ సాయం కావాలి. 578 00:45:35,986 --> 00:45:37,236 సరేనా? 579 00:45:37,237 --> 00:45:40,032 నా సైలో వాసులని కాపాడుకోవడంలో నీ సాయం కావాలి... 580 00:45:40,908 --> 00:45:43,869 పది వేల మంది ప్రాణాలు, సోలో. 581 00:45:45,370 --> 00:45:46,872 పది వేల మంది. 582 00:45:49,583 --> 00:45:52,502 చూడు, నాకు సాయం చేయడం వల్ల, ఇక్కడ జరిగిన ఘోరంలో ఏ మార్పూ జరగదని తెలుసు, 583 00:45:52,503 --> 00:45:53,878 కానీ నేను నా సైలోకి వెళ్తే... 584 00:45:53,879 --> 00:45:56,798 అక్కడికి వెళ్లడంలో నువ్వు నాకు సాయపడితే, 585 00:45:58,342 --> 00:46:02,846 ఇక్కడ జరిగినదే, అక్కడ కూడా జరగకుండా మనం ఆపగలమేమో. 586 00:46:04,932 --> 00:46:06,225 కానీ నాకు... 587 00:46:08,936 --> 00:46:10,562 నాకు నీ సాయం కావాలి. 588 00:46:16,276 --> 00:46:17,444 ప్లీజ్. 589 00:46:24,826 --> 00:46:26,119 నేను సాయపడలేను. 590 00:47:08,120 --> 00:47:10,580 "ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మేము లోపలికి వస్తాం." 591 00:47:10,581 --> 00:47:13,667 ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మేము లోపలికి వస్తాం 592 00:47:27,973 --> 00:47:29,099 సరే. 593 00:47:31,935 --> 00:47:32,936 నాకు అర్థమైంది. 594 00:47:40,694 --> 00:47:42,154 పర్వాలేదులే. నాకు అర్థమైంది. 595 00:47:44,573 --> 00:47:46,074 ఆహారం పెట్టినందుకు థ్యాంక్స్, నేను... 596 00:47:48,243 --> 00:47:49,369 నేను మళ్ళీ కలుస్తా నిన్ను. 597 00:47:50,704 --> 00:47:53,039 ఆగు! 598 00:47:53,040 --> 00:47:54,541 ఏం చేయబోతున్నావు? 599 00:47:55,667 --> 00:47:57,169 ఏమో. నేను... 600 00:47:57,753 --> 00:47:59,087 ఏదోక మార్గం వెతుక్కుంటాలే. 601 00:48:16,313 --> 00:48:17,522 మీకెలా అనిపిస్తోంది? 602 00:48:17,523 --> 00:48:19,482 ఉద్రేకంగా ఉంది. 603 00:48:19,483 --> 00:48:21,026 కంగారుగానూ ఉంది. 604 00:48:21,735 --> 00:48:24,404 అది కాదు, నా ఉద్దేశం మీకు తిమ్మిరిగా ఏమైనా ఉందా? ఇది మీకు తెలుస్తోందా? 605 00:48:26,198 --> 00:48:27,407 సారీ. 606 00:48:28,200 --> 00:48:29,451 తిమ్మిరిగా ఉంది. 607 00:48:30,285 --> 00:48:31,245 మంచిది. 608 00:48:32,037 --> 00:48:33,830 కంగారుపడాల్సిన పని లేదు. 609 00:48:35,207 --> 00:48:37,459 ఈ ప్రక్రియ చిటికెలో అయిపోతుంది. 610 00:48:41,672 --> 00:48:42,506 డాక్టర్ నికల్స్. 611 00:48:44,216 --> 00:48:47,845 మీకు సదా రుణపడి ఉంటాం మేము. 612 00:48:50,389 --> 00:48:55,852 మాకు బాగా తెలుసు, మాకు దక్కిన ఈ అవకాశానికి కారణం 613 00:48:55,853 --> 00:48:58,646 మీ అమ్మాయి... 614 00:48:58,647 --> 00:48:59,815 థ్యాంక్యూ. 615 00:49:02,276 --> 00:49:03,819 మీకు అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నా. 616 00:50:17,351 --> 00:50:19,394 ఇప్పుడు మీరు సంతానం కోసం ప్రయత్నించవచ్చు. 617 00:50:22,231 --> 00:50:24,191 లేదు. కదలవద్దు. 618 00:50:28,487 --> 00:50:31,031 కొన్ని కుట్లు వేయాలి, ఆ తర్వాత మీరు వెళ్లిపోవచ్చు. 619 00:50:40,332 --> 00:50:41,583 వెళ్ళవద్దు! 620 00:51:01,436 --> 00:51:02,812 నేను చండాలంగా ఉన్నానా? 621 00:51:02,813 --> 00:51:04,522 లేదు, లేదు. నేను... 622 00:51:04,523 --> 00:51:08,944 నువ్వు వేరేగా ఉంటావనుకున్నానంతే... 623 00:51:12,322 --> 00:51:14,658 నేను ఇంత దూరం ఎప్పుడూ రాలేదు. 624 00:51:18,745 --> 00:51:20,122 ఇది చాలా విశాలంగా ఉంది. ఇక్కడ... 625 00:51:23,166 --> 00:51:25,794 ఇక్కడ చాలా స్థలం ఉన్నట్టు ఉంది. 626 00:51:30,132 --> 00:51:31,216 ఇంకా చూడాలనుందా? 627 00:51:36,930 --> 00:51:37,930 హా. 628 00:51:37,931 --> 00:51:39,850 సరే. ఎక్కడికి వెళదామంటావు? 629 00:51:46,607 --> 00:51:47,733 పైకి వెళదామంటావా? 630 00:51:56,783 --> 00:51:58,159 పైకి వెళదామా? 631 00:51:58,160 --> 00:51:59,244 సరే. 632 00:52:00,787 --> 00:52:01,830 రా. 633 00:52:17,179 --> 00:52:18,722 హా. జాగ్రత్త. 634 00:52:26,188 --> 00:52:27,773 హేయ్, జాగ్రత్త. 635 00:52:28,565 --> 00:52:31,609 - పర్వాలేదు. పర్వాలేదులే. హేయ్. - వద్దు. 636 00:52:31,610 --> 00:52:33,444 - వద్దు! - హేయ్. 637 00:52:33,445 --> 00:52:35,279 లేదు, లేదు. నీకేమైనా నొప్పి కలిగించానా? బాగానే ఉన్నావా? 638 00:52:35,280 --> 00:52:37,866 - లేదు! బాగానే ఉన్నాననుకుంటా. - అయ్యయ్యో... లేదు, లేదు. 639 00:52:38,450 --> 00:52:39,867 ఇందులో నీ తప్పేం లేదు. 640 00:52:39,868 --> 00:52:41,328 - క్షమించు. - పర్వాలేదు. 641 00:52:41,995 --> 00:52:42,995 కూర్చొనే ఉండు. 642 00:52:42,996 --> 00:52:44,164 మనం కూర్చుందాం. 643 00:52:44,706 --> 00:52:45,791 నేను ఇక్కడ కూర్చుంటా. 644 00:52:46,792 --> 00:52:48,544 చాలా కాలమైంది కదా, అందుకే. 645 00:52:51,672 --> 00:52:52,881 నాకు తెలుసు. 646 00:52:57,135 --> 00:52:59,179 నువ్వు నిజమైన మనిషివే, కదా? 647 00:53:03,308 --> 00:53:04,351 అవును. 648 00:53:06,520 --> 00:53:07,563 అవును, నేను నిజమైన మనిషినే. 649 00:54:14,588 --> 00:54:16,590 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్