1 00:00:46,171 --> 00:00:48,173 - మాకు కాస్త చెప్తావా, ఎందుకు మమ్మల్ని… - మీరు బయటకెళ్లాలి. 2 00:00:50,926 --> 00:00:52,761 నేను మిమ్మల్ని రేపు తెల్లవారుజామునే పంపాలి. 3 00:00:54,221 --> 00:00:55,471 దేనికి? 4 00:00:55,472 --> 00:00:57,849 - మనం వేరే సైలోకి వెళ్తున్నాం. - అవును. 5 00:00:57,850 --> 00:01:01,269 అక్కడికి వెళ్లి మీరు పిల్లల్ని తీసుకొస్తారని కమీల్ కి నేను చెప్పాను, కానీ నిజానికి… 6 00:01:01,270 --> 00:01:03,563 కానీ నిజానికి విషవాయువు ఎక్కడి నుండి వస్తోందో మేము కనిపెట్టాలి. 7 00:01:03,564 --> 00:01:05,857 - అవును. - మజాక్ చేస్తున్నావా? 8 00:01:05,858 --> 00:01:07,859 చూడు, కావాలంటే నేను ఒక్కడినే వెళ్లగలను. 9 00:01:07,860 --> 00:01:10,444 - లేదు, ఈ పని మీద ఇద్దరు వెళ్లాలి. - ఆగు, ఎందుకో నేను చెప్తా. 10 00:01:10,445 --> 00:01:13,030 - ఒకరు చనిపోయినా ఇంకొకరు ఉంటారనేగా. - హా, ఇంకొకరు ఉంటారు అనే. 11 00:01:13,031 --> 00:01:15,992 - సూపర్. - కెన్నడీ, నువ్వు నాకు అర్థం కావట్లేదు. 12 00:01:15,993 --> 00:01:18,995 "మమ్మల్ని బయటకు పంపండి మొర్రో" అని మూడు నెలలు నానా హంగామా చేశావు. 13 00:01:18,996 --> 00:01:21,330 ఇప్పుడు వెళ్లడానికి ఇష్టం చూపట్లేదేంటి నువ్వు? 14 00:01:21,331 --> 00:01:25,669 లేదు, లేదు. నాకు వెళ్లాలనే ఉంది. కానీ మిగతా పనులే నాకు చికాకు తెప్పిస్తున్నాయి. 15 00:01:30,340 --> 00:01:35,261 నా ఐడియా చెప్తా. ఈ లూకీని సురక్షితంగా సైలో 17కి చేరిస్తే, అప్పుడు నాకు కావాల్సింది నేను చేసుకోవచ్చా? 16 00:01:35,262 --> 00:01:36,512 నీకు కావాల్సింది ఏంటో? 17 00:01:36,513 --> 00:01:41,559 నేను ఎక్కడికైనా వెళ్తా కానీ, మళ్లీ అండర్ గ్రౌండ్లోని ఇలాంటి రంధ్రంలోకి మాత్రం వెళ్లను. 18 00:01:41,560 --> 00:01:43,895 సరే, అలాగే. 19 00:01:43,896 --> 00:01:48,108 నువ్వు లూకస్ ని సైలో 17కి చేర్చు, ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకనవసరం. 20 00:01:48,859 --> 00:01:51,195 సూపర్. అయితే సూట్ వేసేసుకుందాం. 21 00:01:55,824 --> 00:01:57,826 బయటకు వెళ్లు మార్గం 22 00:02:19,431 --> 00:02:21,433 సరే, ఎవరి కంటా పడకుండా వీళ్లని జాగ్రత్తగా ఉంచు. 23 00:02:22,309 --> 00:02:23,851 నువ్వు డానీ బ్లైని కలవాలి. 24 00:02:23,852 --> 00:02:27,104 అతను క్యాంటిన్లోని స్క్రీన్లను మూసేయాలి. సరేనా? 25 00:02:27,105 --> 00:02:28,606 - సరే. - హా. 26 00:02:28,607 --> 00:02:29,691 నేను మళ్లీ వస్తా. 27 00:02:44,331 --> 00:02:45,666 - హేయ్. - హేయ్. 28 00:02:46,250 --> 00:02:47,251 ఏంటి సంగతి? 29 00:02:49,795 --> 00:02:51,587 నేను వాటర్ ఫిల్టరేషన్ దగ్గరికి వెళ్లా. 30 00:02:51,588 --> 00:02:53,673 బయట గార్డులు ఉన్నారు, 31 00:02:53,674 --> 00:02:57,552 అంటే, నీట్లో మందుని కలిపేశారని అర్థం. 32 00:02:57,553 --> 00:02:59,136 అది ప్రభావం చూపడానికి ఎంత సమయం పడుతుంది? 33 00:02:59,137 --> 00:03:01,682 బెర్నార్డ్ అయితే, వెంటనే ప్రభావం చూపుతుందని చెప్పాడు. 34 00:03:02,599 --> 00:03:08,689 పాలని, జ్యూస్ ని, వైన్ ని, ఏదైనా తాగమన్నాడు, కానీ కుళాయి నుండి వచ్చే నీటిని మాత్రం వద్దన్నాడు. 35 00:03:09,481 --> 00:03:12,693 నువ్వేం చేయాలనుకున్నా, అది తక్షణమే చేసేయ్. 36 00:03:17,155 --> 00:03:18,615 నన్ను ఫాలో చేస్తున్నారు. 37 00:03:19,783 --> 00:03:22,411 కాలినడకన, అలాగే కెమెరాల ద్వారా కూడా నాపై నిఘా ఉంది. 38 00:03:23,829 --> 00:03:24,830 కాబట్టి, 39 00:03:25,998 --> 00:03:28,166 మనం ఇకపై కాంటాక్టులో ఉండలేం. 40 00:03:34,089 --> 00:03:35,757 హేయ్, రాబర్ట్. 41 00:03:38,594 --> 00:03:39,678 జాగ్రత్త. 42 00:03:51,481 --> 00:03:52,900 మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? 43 00:03:54,193 --> 00:03:56,527 డెప్యూటీ మెసేజ్ చేసినప్పుడు, మేము డానీతో ఉన్నాం. 44 00:03:56,528 --> 00:03:57,821 ఏం జరుగుతోంది? 45 00:03:58,405 --> 00:03:59,488 నేను బయటకి వెళ్తున్నా. 46 00:03:59,489 --> 00:04:01,324 మేము ఇద్దరమూ వెళ్తున్నాం. 47 00:04:01,325 --> 00:04:03,784 - అవునులే. ఇద్దరమూ వెళ్తున్నాం. - ఏంటి? ఎందుకు? 48 00:04:03,785 --> 00:04:09,332 అంటే, జూలియా బయటకు వెళ్లినప్పుడు, తను మరో సైలోకి వెళ్లింది. 49 00:04:09,333 --> 00:04:10,917 అది వాళ్లకి తెలుసు. 50 00:04:10,918 --> 00:04:13,711 హెల్మెట్లలో నంబర్లు ఉంటాయి. తను వేసుకొచ్చిన హెల్మెట్ ప్రకారం తను సైలో 17కి వెళ్లింది. 51 00:04:13,712 --> 00:04:17,965 అవును, ఆ సైలోలో కొందరు పిల్లలు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. 52 00:04:17,966 --> 00:04:20,301 వాళ్లని ఇక్కడికి తీసుకొస్తానని తను మాటిచ్చింది. 53 00:04:20,302 --> 00:04:21,303 హా. 54 00:04:23,347 --> 00:04:24,681 అయినా కానీ నువ్వు వెళ్లాలనుకుంటున్నావా? 55 00:04:25,891 --> 00:04:27,226 అవును. 56 00:04:28,477 --> 00:04:30,646 నీకు ఇప్పుడు వెళ్లాలని లేదేమో, క్యాట్, కానీ… 57 00:04:32,189 --> 00:04:36,652 కానీ నేను, డానీ ఆ క్లీనింగ్ వీడియోను చూశాం. 58 00:04:38,320 --> 00:04:40,697 బహుశా, తన హెల్మెట్లోని గ్లాస్ ఆ వీడియోను ప్లే చేసిందేమో. 59 00:04:41,448 --> 00:04:42,573 లేదు. 60 00:04:42,574 --> 00:04:44,075 అది సాధ్యమే అని నువ్వు అన్నావు కదా. 61 00:04:44,076 --> 00:04:46,453 బయట… బయట బాగుంటుందో లేదో నాకు తెలీదు. 62 00:04:50,290 --> 00:04:52,584 కానీ నువ్వు బయటకెళ్తే సంతోషపడే వ్యక్తి ఒకరు నాకు తెలుసు. 63 00:04:56,213 --> 00:04:57,339 హా. 64 00:05:01,510 --> 00:05:03,428 మీరు ఎప్పుడైనా కెన్నడీ భార్యని కలిశారా? 65 00:05:06,181 --> 00:05:08,100 బయటకు తను వెళ్లాల్సి వస్తే, ఏమంటుంది? 66 00:05:09,810 --> 00:05:13,145 తను రెండు మూడు పెగ్గులేస్తేనే అలా మాట్లాడుతుందిలే. 67 00:05:13,146 --> 00:05:15,648 తనకి బయటకి వెళ్లాలనుంది అనే మాట డోరిస్ అనదు. 68 00:05:15,649 --> 00:05:17,985 - తనంత తెలివితక్కువగా వ్యవహరించదు. - తను అందరికన్నా తెలివిమంతురాలు. 69 00:05:18,777 --> 00:05:20,904 తను ఒకవేళ ఎవరినైనా చంపాల్సి వస్తే… 70 00:05:23,574 --> 00:05:25,951 - అతడినే చంపే అవకాశముందని చెప్పింది. - అంతేనేమో. 71 00:05:26,618 --> 00:05:28,119 ఇక తను దొరికిపోతే… 72 00:05:28,120 --> 00:05:29,912 తను తప్పించుకుని ఉండేది. 73 00:05:29,913 --> 00:05:34,084 శుభ్రపరచడానికి తనని కనుక బయటకు పంపిస్తే, స్వేచ్ఛ లభించినందుకు, బయటకు వెళ్తున్నందుకు, 74 00:05:34,668 --> 00:05:37,754 ఆనందంగా పాడుకుంటూ వెళ్తానని చెప్పింది. 75 00:05:39,673 --> 00:05:41,842 అది ఒక్క నిమిషానికైనా సరే. 76 00:05:45,512 --> 00:05:47,014 ఒక్క నిమిషానికైనా సరే. 77 00:05:53,729 --> 00:05:55,272 సూట్ టెక్నీషియన్లు సిద్ధంగా ఉన్నారు. 78 00:05:58,817 --> 00:05:59,860 ఇక పద, వెళ్దాం. 79 00:06:30,933 --> 00:06:32,600 మీరు తెల్లవారుజాము వెళ్లవచ్చని నేనన్నానని తెలుసు, 80 00:06:32,601 --> 00:06:34,603 కానీ మీరు ఇప్పుడే వెళ్లాలి. త్వరగా కానివ్వండి. 81 00:06:48,283 --> 00:06:49,284 అది ఆఫ్ అయిపోయింది. 82 00:06:50,744 --> 00:06:53,579 సరే. ఎల్లవేళలా రేడియో ఆన్ లోనే ఉండాలి. 83 00:06:53,580 --> 00:06:57,124 నా మాటలు నీకు హెల్మెట్ ద్వారా వినిపిస్తాయి, నీ మాటలు నాకు రేడియోలో వినిపిస్తాయి, 84 00:06:57,125 --> 00:06:58,918 కానీ కోడ్ భాషలోనే మాట్లాడాలని గుర్తుంచుకో. 85 00:06:58,919 --> 00:07:00,211 నీకు నా మాటలు వినిపిస్తాయా? 86 00:07:00,212 --> 00:07:01,295 వినబడకూడదనే కోరుకుంటున్నా. 87 00:07:01,296 --> 00:07:02,713 - ఏంటి? - ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని? 88 00:07:02,714 --> 00:07:05,341 నువ్వు డిశ్పాచ్ వి. నేను డెప్యూటీ టర్లీని. 89 00:07:05,342 --> 00:07:06,426 - తను క్రేన్. - అంతే. 90 00:07:07,052 --> 00:07:08,344 నాకది గుర్తుండే అవకాశమే లేదు. 91 00:07:08,345 --> 00:07:10,388 - నా పేరు కాల్సో కాకుండా ఇంకేదైనా పెడతారా? - హేయ్, పాట్రిక్. హేయ్. 92 00:07:10,389 --> 00:07:12,932 శాంతించు. మనకి అంత సమయం లేదు, సరేనా? 93 00:07:12,933 --> 00:07:16,519 వాక్, లూకస్ తోనే మాట్లాడుతుంది. నువ్వు అతడిని సైలో 17 వరకు చేర్చు. 94 00:07:16,520 --> 00:07:18,814 అంతే. సరేనా? 95 00:07:27,281 --> 00:07:28,282 అతనికేమీ కాదులే. 96 00:08:18,040 --> 00:08:21,668 డెప్యూటీ టర్లీ, నేను డిశ్పాచ్ ని. నా మాటలు బాగా వినిపిస్తున్నాయా? 97 00:08:25,047 --> 00:08:26,131 అంటే… 98 00:08:28,425 --> 00:08:29,718 పరిస్థితి ఎలా ఉందంటే… 99 00:08:33,514 --> 00:08:36,140 ఇది నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా ఉంది. 100 00:08:47,569 --> 00:08:48,820 ఇక్కడేం లేదు. 101 00:08:51,031 --> 00:08:52,449 అస్సలేం లేదు. 102 00:08:53,450 --> 00:08:54,701 అస్సలంటే అస్సలేం లేదు! 103 00:08:57,162 --> 00:08:58,163 హేయ్! 104 00:09:06,547 --> 00:09:08,090 అదంతా ఏంటి? 105 00:09:39,788 --> 00:09:41,248 నేను డెప్యూటీ టర్లీని. 106 00:09:43,584 --> 00:09:45,669 మేము ఆ అంతస్థుని సమీపిస్తున్నాం. 107 00:10:09,902 --> 00:10:10,903 డిశ్పాచ్. 108 00:10:12,738 --> 00:10:15,908 మాకు… మాకు జరిగిన నష్టం కనిపిస్తోంది. 109 00:10:17,409 --> 00:10:19,286 ఇది మేము ఊహించిన దాని కన్నా దారుణంగా ఉంది. 110 00:10:21,121 --> 00:10:23,332 కానీ, మేము… మేము దర్యాప్తు చేస్తాం. 111 00:10:24,166 --> 00:10:25,250 అలాగే. 112 00:11:03,038 --> 00:11:05,331 - ఆ శబ్దం వినిపిస్తోందా? - ఏంటి? 113 00:11:05,332 --> 00:11:06,542 ఆ శబ్దం వినిపిస్తోందా? 114 00:11:10,671 --> 00:11:14,591 హేయ్, డిశ్పాచ్. మాకు ఏదో జుమ్మనే శబ్దం వినిపిస్తోంది. 115 00:11:15,133 --> 00:11:16,552 మీకు కూడా వినిపిస్తోందా? 116 00:11:27,521 --> 00:11:29,731 బాబోయ్. పరుగెత్తు! పరుగెత్తు! 117 00:11:34,486 --> 00:11:38,615 డెప్యూటీ టర్లీ, నేను డిశ్పాచ్ ని. నా మాటలు వినిపిస్తుంటే, స్పందించు. 118 00:11:42,244 --> 00:11:45,414 డెప్యూటీ కాల్సో, నా మాటలు వినిపిస్తుంటే, స్పందించు. 119 00:11:49,209 --> 00:11:50,626 ఏం జరిగింది? 120 00:11:50,627 --> 00:11:52,879 అవి… అవి తుపాకుల కాల్పుల్లా అనిపించింది. 121 00:11:52,880 --> 00:11:54,505 - బయటి వాళ్ల దగ్గర తుపాకులున్నాయా? - లేవు. 122 00:11:54,506 --> 00:11:55,923 వాళ్లతో మళ్లీ మాట్లాడు. 123 00:11:55,924 --> 00:11:58,177 లైనులో స్టాటిక్ శబ్దం ఏమీ రావట్లేదు. అంతా నిశ్శబ్దంగానే… 124 00:12:07,019 --> 00:12:08,020 ఓకే. 125 00:12:09,438 --> 00:12:13,025 అంతా అయోమయంగా ఉంది. డానీ, నువ్వు మళ్లీ స్క్రీన్లు కనిపించేలా చేస్తావా? 126 00:12:14,860 --> 00:12:16,736 ఏం తెలీట్లేదు. నువ్వు వర్క్ షాపుకు వెళ్లు, 127 00:12:16,737 --> 00:12:18,614 నిన్ను అక్కడకి వచ్చి కలుస్తా, నాకు… నాకు వీలు ఉంటే. 128 00:12:19,531 --> 00:12:20,740 - నువ్వు ఎక్కడికి వెళ్తావు? - ఏమో, 129 00:12:20,741 --> 00:12:23,701 కానీ నేను పరుగెడితే, తను నన్ను అరెస్ట్ చేసేస్తుంది. కాబట్టి నేను ఎక్కడికీ వెళ్లకూడదు. 130 00:12:23,702 --> 00:12:26,495 కాబట్టి… తను ఇక్కడికి వచ్చినప్పుడు, 131 00:12:26,496 --> 00:12:29,166 శాండీ, నేను… నేను నా నివాసానికి వెళ్లిపోయానని తనకి చెప్తావా? 132 00:12:29,666 --> 00:12:31,251 జెర్రీ, కోడ్ అదే కదా? 133 00:12:42,137 --> 00:12:45,015 లూకస్ కైల్, పాట్రిక్ కెన్నడీలను చంపేయడం జరిగింది. 134 00:12:48,268 --> 00:12:49,353 ఏం జరిగింది? 135 00:12:51,563 --> 00:12:54,358 ఎడిట్ చేయని నికల్స్ క్లీనింగ్ వీడియో చూశావు కదా. 136 00:12:55,025 --> 00:12:56,276 అందులో నీకేం కనిపించింది? 137 00:12:56,777 --> 00:12:57,945 శవాలు. 138 00:12:59,446 --> 00:13:01,615 ఒక సైలో జనాభా అంతా చనిపోయినట్టుగా అనిపించింది. 139 00:13:02,282 --> 00:13:04,034 దాన్ని బట్టి నీకేం అర్థమైంది? 140 00:13:14,169 --> 00:13:16,505 వాళ్లు రక్షణాత్మక చర్యను ఆపగలిగారు. 141 00:13:18,423 --> 00:13:20,258 కనీసం కొద్దిసేపటికైనా. 142 00:13:20,259 --> 00:13:22,511 "కొద్దిసేపటికైనా" అనేది ఇక్కడ చాలా కీలకం. 143 00:13:24,221 --> 00:13:27,558 మీ సైలో క్షేమం కోసం ఒక విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం, 144 00:13:28,308 --> 00:13:32,145 అదేంటంటే, రక్షణాత్మక చర్యని నివారించడం అసాధ్యం. 145 00:13:32,729 --> 00:13:36,233 ఆ వీడియోలో నువ్వు చూసిన దృశ్యం అందుకు రుజువని అనుకో. 146 00:13:39,236 --> 00:13:40,487 కానీ… 147 00:13:42,573 --> 00:13:44,741 నికల్స్ చేయాలనుకున్నది అదేనని నువ్వు అనుకుంటున్నావా? 148 00:13:45,492 --> 00:13:46,618 రక్షణాత్మక చర్యని ఆపాలనుకుంటోందా? 149 00:13:47,703 --> 00:13:48,704 తనతో మాట్లాడు. 150 00:13:49,538 --> 00:13:52,332 మనం భయపడుతున్నట్టు తన ఉద్దేశం నిజంగా అదేనా అని నిర్ధారించుకో. 151 00:13:52,916 --> 00:13:54,001 ఒకవేళ అదే అయితే? 152 00:14:01,967 --> 00:14:04,260 వాళ్లని తెల్లవారుజామున పంపాలని కదా మనం అనుకున్నది. 153 00:14:04,261 --> 00:14:08,307 హా, కెన్నడీ కంగారుపడసాగాడు, అందుకే నేను అతన్ని బయటకు పంపాల్సి వచ్చింది. 154 00:14:08,807 --> 00:14:09,808 సరే. 155 00:14:10,726 --> 00:14:14,730 అన్నట్టు ఒక బాధాకరమైన విషయం చెప్పాలి, వాళ్లు సైలో 17కి చేరుకోలేదు. 156 00:14:19,151 --> 00:14:23,030 మన వాళ్ళు సైలో 17కి వెళ్లాలని నువ్వు అనడం వెనుక నీకు వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? 157 00:14:23,530 --> 00:14:24,531 లేదు. 158 00:14:25,532 --> 00:14:29,410 అక్కడున్న పిల్లలు నా ప్రాణాలని కాపాడారు, అందుకని నేను వాళ్లని ఇక్కడికి తెద్దామనుకున్నా, అదే కారణం. 159 00:14:29,411 --> 00:14:31,330 - అంతకన్నా ముఖ్యమైనది ఇంకేం లేదా? - లేదు. 160 00:14:33,123 --> 00:14:36,710 పిల్లల ప్రాణాలను కాపాడటం కన్నా ముఖ్యమైనది ఇంకేం ఉంటుంది, కమీల్? 161 00:14:39,129 --> 00:14:41,173 సైలో 17లో ఏమైందో నీకు తెలుసా? 162 00:14:44,384 --> 00:14:46,220 తెలీదు, నీకు తెలుసా? 163 00:14:47,679 --> 00:14:49,765 తెలీదు. అందుకే నిన్ను అడిగా. 164 00:14:53,435 --> 00:14:55,145 బయట ఏం జరిగింది, హా? 165 00:14:55,938 --> 00:14:57,355 లూకస్, కెన్నడీలకి. 166 00:14:57,356 --> 00:14:59,106 సూట్ సరిగ్గా పని చేయలేదు అనుకుంటా. 167 00:14:59,107 --> 00:15:00,692 - సూట్ సరిగ్గా పని చేయలేదా? - అవును. 168 00:15:01,360 --> 00:15:02,903 తొందరపాటుతో పనులు చేస్తే, జరిగేది అదే. 169 00:15:05,781 --> 00:15:06,782 అవునులే. 170 00:15:07,824 --> 00:15:11,453 కాస్త సమయం తీసుకుని, వాళ్ల సూట్లని బుల్లెట్ ప్రూఫ్ చేసి ఉంటే బాగుండేది. 171 00:17:00,103 --> 00:17:01,563 హ్యూ హొవీ రచించిన సైలో బుక్ సిరీస్ ఆధారితమైనది 172 00:17:24,086 --> 00:17:25,170 షార్లెట్? 173 00:17:26,171 --> 00:17:27,755 ఏం జరుగుతోంది? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 174 00:17:27,756 --> 00:17:28,757 హేయ్. 175 00:17:29,258 --> 00:17:32,301 - తను చెప్పలేదు. - నేను మిమ్మల్ని అడగలేదు, కదా? 176 00:17:32,302 --> 00:17:33,303 అవును. 177 00:17:37,057 --> 00:17:38,141 నువ్వు బాగానే ఉన్నావా? 178 00:17:40,477 --> 00:17:41,895 బాగానే ఉన్నాను, హా. 179 00:17:43,605 --> 00:17:45,231 నేనెవరో తెలుసా? 180 00:17:45,232 --> 00:17:46,984 బ్రహ్మాండంగా తెలుసు, డ్యానియల్. 181 00:17:47,901 --> 00:17:51,321 కానీ, నువ్వు ఆనా చెప్పినట్టు చేసేంత వరకు నేను ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. 182 00:17:51,947 --> 00:17:53,030 మీరిద్దరూ కాస్త 183 00:17:53,031 --> 00:17:55,825 - నా వెంటే ఆ గదిలోకి వస్తారా? - ఓకే. మేము ఇప్పుడు భయంకరమైన రీతిలో ఇక్కడికి వచ్చాం, 184 00:17:55,826 --> 00:17:58,369 - కాబట్టి మేము ఎవరితోనూ ఎక్కడికీ రాం. - ఆ గదిలో ఏముంది? 185 00:17:58,370 --> 00:18:02,832 లాయర్లు. రహస్య ఒప్పందాల మీద సంతకం చేయించుకోవడానికి చాలా మంది లాయర్లు ఉన్నారు. 186 00:18:02,833 --> 00:18:05,042 వాటిపై మీరు సంతకం చేశాక, మనందరం విమానం ఎక్కుతాం, 187 00:18:05,043 --> 00:18:07,837 ఇక రేపు ఈ సమయానికల్లా మీకన్నీ తెలుస్తాయి. 188 00:18:07,838 --> 00:18:11,925 అయితే, వాటి గురించి మీరెవరికీ చెప్పకూడదు, 189 00:18:12,426 --> 00:18:13,676 మేము ఓకే అనేదాకా. 190 00:18:13,677 --> 00:18:15,470 ఏంటి, మీరు… 191 00:18:18,098 --> 00:18:21,684 మీరు నాపై కేసు వేస్తారా? నా బ్యాంక్ ఖాతాలో 700 డాలర్లు ఉన్నాయని. 192 00:18:21,685 --> 00:18:25,730 గిట్మోలో పడతావు. అక్కడున్న లాయర్లలో సగం మంది ప్రభుత్వ లాయర్లే, 193 00:18:25,731 --> 00:18:29,026 అంటే, వాళ్లు నిన్ను గ్వాంటానమో జైలుకు పంపగలరు. 194 00:18:31,278 --> 00:18:32,529 నేనేం తమాషాకి చెప్పట్లేదు. 195 00:18:33,739 --> 00:18:34,740 నేను అక్కడికి వెళ్లా. 196 00:18:35,532 --> 00:18:38,076 అది చాలా బాగుంది. దాన్ని కొనాలని అనుకుంటున్నా. 197 00:18:38,994 --> 00:18:43,498 ఆ దీవిని. కేవలం… కేవలం జైలునే కాదు, మొత్తం దీవిని అన్నమాట. 198 00:18:46,585 --> 00:18:47,586 కాబట్టి… 199 00:18:48,921 --> 00:18:50,505 నా పేరు పెర్ స్టెన్సన్. 200 00:18:50,506 --> 00:18:51,714 మీరెవరో మాకు తెలుసు. 201 00:18:51,715 --> 00:18:55,384 నాకు తెలుసులే. నేను మర్యాదగా వ్యవహరిస్తున్నానంతే. నేను అలా మాట్లాడాలని మా సోషల్ టీమ్ వాళ్లు అంటున్నారు. 202 00:18:55,385 --> 00:18:56,762 నువ్వే కదా జర్నలిస్ట్? 203 00:18:57,387 --> 00:18:59,388 నీకు చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలిసింది, 204 00:18:59,389 --> 00:19:01,225 ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. 205 00:19:02,267 --> 00:19:03,644 నువ్వేది ఎంచుకుంటావు, 206 00:19:04,978 --> 00:19:09,941 రహస్య ఒప్పందంపై సంతకం చేయకుండా, ఆ తొక్కలో బండిలో వెనక్కి వెళ్లిపోతావా? 207 00:19:09,942 --> 00:19:11,192 అప్పుడు నీకేం తెలీదు, 208 00:19:11,193 --> 00:19:14,237 లేదా కొన్ని సంతకాలు పెట్టేసి, 209 00:19:14,238 --> 00:19:18,158 ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాన్ని తెలుసుకుంటావా? 210 00:19:21,411 --> 00:19:26,040 కావాలంటే, మీకు ఒక లక్ష డాలర్లు పడేస్తా. 211 00:19:26,041 --> 00:19:27,500 లక్ష డాలర్లు. అంతేలే. 212 00:19:27,501 --> 00:19:29,418 ప్రపంచంలో అత్యంత ధనికులు అయ్యుండి, 213 00:19:29,419 --> 00:19:33,005 ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం కోసం మాకు ఒక లక్ష డాలర్లు ఇస్తానంటున్నారా? 214 00:19:33,006 --> 00:19:34,674 సరే. తలా పది లక్షల డాలర్లు ఇస్తా. 215 00:19:34,675 --> 00:19:37,051 - ఓరి దేవుడా… అందరినీ అలా కొనేయలేరు. - కానీ సంతకం పెడితేనే. 216 00:19:37,052 --> 00:19:39,637 - పెట్టకపోతే, నయా పైసా కూడా దక్కదు. - ఇక్కడేం జరుగుతోందో నాకు తెలీదు. 217 00:19:39,638 --> 00:19:42,683 నా చెల్లెలికి ఏమైందో తెలుసుకోవాలని తప్ప ఇంకేం తెలుసుకోవాలని నాకు లేదు. 218 00:19:43,976 --> 00:19:45,227 నువ్వు సంతకం చేశావా? 219 00:19:47,479 --> 00:19:51,066 చేశా, ఎందుకంటే, నాకేం అయిందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. 220 00:19:59,408 --> 00:20:00,409 సరే. 221 00:20:02,160 --> 00:20:05,622 కాంగ్రెస్ మెన్ ఓకే అనేశాడు. మరి నువ్వేమంటావు, జర్నలిస్ట్? 222 00:20:09,042 --> 00:20:12,712 దీని గురించి నేను రాయాలంటే, ఎంతకాలం ఆగి రాయాలి? 223 00:20:12,713 --> 00:20:16,549 మహా అయితే అయిదేళ్లు. అంతకంటే తక్కువ సమయమే ఆగాల్సి వస్తుందని ఆశిస్తున్నా. 224 00:20:16,550 --> 00:20:19,468 ఇందాక నేనేం ఎక్కువ చేసి చెప్పలేదు. 225 00:20:19,469 --> 00:20:22,181 ఇక్కడ మేము ప్రపంచాన్ని కాపాడే పనే చేస్తున్నాం. 226 00:20:29,104 --> 00:20:30,105 అలాగే. 227 00:20:30,731 --> 00:20:32,191 అందరం ప్రపంచాన్ని కాపాడేద్దాం. 228 00:20:41,658 --> 00:20:42,659 ఎడ్ హార్వుడ్. 229 00:20:45,162 --> 00:20:46,621 ఏం జరుగుతోంది? 230 00:20:46,622 --> 00:20:49,208 మేము నీతో ఏకాంతంగా మాట్లాడాలి. 231 00:20:53,128 --> 00:20:56,757 ఓర్లా కెంట్ ని ముందు హత్య చేసి, ఆ తర్వాత తన శవాన్ని తరలించారని అనుమానిస్తున్నాం. 232 00:20:58,050 --> 00:21:01,844 కానీ, తన శవం ఇక్కడికి ఎలా చేరుకుంది అనేది మాకు తెలీదు. 233 00:21:01,845 --> 00:21:05,640 అంటే, కెమెరాలని నిర్వీర్యం చేశారని మీరు అన్న మాటలు అబద్ధాలే అన్నమాట. 234 00:21:05,641 --> 00:21:10,144 లేకపోతే, తను మెట్లు ఎక్కి రాలేదని మీకు పక్కాగా ఎలా తెలుస్తుంది? 235 00:21:10,145 --> 00:21:12,730 నీకు ఏమైనా తెలుసా అసలు ఎలా… 236 00:21:12,731 --> 00:21:15,733 ఎలా కెమెరాలకి చిక్కకుండా ఒక శవాన్ని తరలించవచ్చు అనా? 237 00:21:15,734 --> 00:21:17,069 నాకు తెలీదు. 238 00:21:18,570 --> 00:21:20,197 కాకపోతే… 239 00:21:22,032 --> 00:21:24,325 మధ్య అంతస్థుల్లో ఒకప్పుడు ఒకడు ఉండేవాడు. 240 00:21:24,326 --> 00:21:26,702 పిల్లల కోసం అతను ఒక చిన్న షో చేసేవాడు. 241 00:21:26,703 --> 00:21:30,832 అతను వస్తువులని మాయం చేసి, మళ్లీ వాటిని చూపించేవాడు. 242 00:21:31,416 --> 00:21:33,043 దాన్ని మ్యాజిక్ అనేవాడు. 243 00:21:34,545 --> 00:21:38,048 బహుశా ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్కే జరిగిందేమో. 244 00:21:38,549 --> 00:21:42,093 మనం అనవసరంగా సమయం వృథా చేస్తున్నాం. నువ్వు త్వరగా చెప్పేసి ఇంటికి… 245 00:21:42,094 --> 00:21:46,390 చూడు, షెరిఫ్. నీకు అస్సలు అర్థం కాలేదు. 246 00:21:47,808 --> 00:21:51,686 ఈ గనులకి పంపబడిన వాళ్లలో, భయంకరమైన నేరాలు చేసి, ఈ శిక్షకి అర్హులైన వారు 247 00:21:51,687 --> 00:21:55,691 ఆరుగురు మగాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు ఉండుంటారు. అది ఓకే. 248 00:21:56,441 --> 00:21:59,194 ఎక్కువ మంది, పిచ్చి పనులు చేసి వచ్చిన వాళ్లే, 249 00:21:59,945 --> 00:22:03,699 వాళ్లు ఇక్కడికి వచ్చాక, బండరాళ్లు మీద పడి చావడమో, 250 00:22:04,366 --> 00:22:07,536 లేదా ఎలుకలని చంపడానికి వదిలే విషవాయువుని పీల్చి చావడమో జరుగుతుంది. 251 00:22:08,370 --> 00:22:13,457 ఇక ఆ పిల్లలకి వినోదాన్ని పంచాలని ఓ గుడ్డును మాయం చేసే మ్యాజిక్ చేసిన వ్యక్తికి 252 00:22:13,458 --> 00:22:18,505 జ్యుడీషియల్ శాఖ వాళ్లు ఒక విషయం చెప్పారు, ఆ మ్యాజిక్ ఒక సైద్ధాంతిక పురాతన వస్తువు అని. 253 00:22:19,256 --> 00:22:23,093 ఒక సైద్ధాంతిక పురాతన వస్తువు. 254 00:22:23,677 --> 00:22:26,847 కాబట్టి, అతను ఏమీ చేయకపోయినా, ఒక ఐడియా ఉందన్న కారణంతో, 255 00:22:27,347 --> 00:22:29,474 అతడిని ఇక్కడికి పంపించేశారు. 256 00:22:31,101 --> 00:22:33,478 ఈ సొరంగాల్లో జరిగేది ఏంటో తెలిస్తే, మీకు… 257 00:22:34,146 --> 00:22:37,107 అలాంటి వాడిని ఇక్కడికి పంపడం కన్నా ఉరి తీయడమే మేలని అనిపిస్తుంది, 258 00:22:38,025 --> 00:22:40,610 కానీ అతడిని నిర్దాక్షిణ్యంగా ఇక్కడికే పంపించేశారు. 259 00:22:40,611 --> 00:22:45,199 ప్రతీ ఒక్కరినీ జ్యుడిషియల్ శాఖలో ఉన్న నీ పాత దోస్తులే ఇక్కడికి పంపారు. 260 00:22:47,993 --> 00:22:48,994 అయితే… 261 00:22:50,996 --> 00:22:52,998 నన్ను షెరిఫ్ గా నువ్వు గౌరవించట్లేదని అర్థమవుతోంది. 262 00:22:53,665 --> 00:22:54,708 అవును మరి. 263 00:22:56,919 --> 00:22:58,336 మరి జూలియాని గౌరవిస్తావా? 264 00:22:58,337 --> 00:23:01,589 కనీసం తను మెకానికల్ శాఖ నుండి వచ్చింది, తనకి శ్రమ అంటే ఏంటో బాగా తెలుసు, 265 00:23:01,590 --> 00:23:04,801 కానీ షెరిఫ్ గా అంటావా? నేను గౌరవించను. 266 00:23:05,385 --> 00:23:09,096 - మరి హాల్స్టన్ ని? - హాల్స్టన్ నా? అతడిని నేను గౌరవించా. 267 00:23:09,097 --> 00:23:12,935 ఎవడైనా పిచ్చివాడు ఏదైనా పిచ్చి పని చేస్తూ దొరికితే, అతను దాన్ని పట్టించుకోకుండా వదిలేసేవాడు. 268 00:23:13,519 --> 00:23:15,686 జనాల కుటుంబాల గురించి ఆలోచించేవాడు, 269 00:23:15,687 --> 00:23:17,563 గనుల్లో శిక్ష అంటే ఎలా ఉంటుందో పరిగణనలోకి తీసుకునేవాడు. 270 00:23:17,564 --> 00:23:18,731 మంచిది. 271 00:23:18,732 --> 00:23:25,364 నువ్వు అతన్ని గౌరవించినందుకు సంతోషం, ఎందుకంటే అతను నిన్ను ఒక మోసగాడిలా భావించేవాడు. 272 00:23:27,074 --> 00:23:31,703 నీపై ఏడు వేర్వేరు విచారణలకు తెరతీశాడు. 273 00:23:33,121 --> 00:23:34,623 మరి నేను దేనిలో అయినా దొరికానా? 274 00:23:38,585 --> 00:23:41,547 అంటే, నేను మోసగాడిని కానట్టే కదా. 275 00:23:42,714 --> 00:23:44,340 నీ గనుల్లో ఓర్లా కెంట్ శవం దొరకడానికి 276 00:23:44,341 --> 00:23:47,510 ఒక రోజు ముందు నువ్వు తనతో గొడవపడుతూ ఉండగా నేను చూశా. నీ కూతురు… 277 00:23:47,511 --> 00:23:50,513 లెక్క ప్రకారం, సప్లై శాఖకి తదుపరి హెడ్ కావాల్సింది నా కూతురే, 278 00:23:50,514 --> 00:23:53,307 కానీ ఇంతలో ఓర్లా కెంట్ తన పదవిని కొట్టేసింది. 279 00:23:53,308 --> 00:23:55,393 కాబట్టి, తనపై నాకు సహజంగానే కోపం ఉండింది. 280 00:23:55,394 --> 00:23:58,855 ఈ నరకానికి దూరంగా కాస్తంత చక్కని జీవితం జీవించే అవకాశం గ్లెండాకి దక్కింది. 281 00:23:58,856 --> 00:24:01,983 కానీ ఈ చెత్త చోట ఉండే చాలా మంది, 282 00:24:01,984 --> 00:24:04,777 ఒక మనిషి మూలాలని బట్టి, ఆ మనిషి ఎవరితో తిరుగుతుంటారు అనే దాన్ని బట్టి, 283 00:24:04,778 --> 00:24:06,988 ఏవేవో అనేసుకుంటుంటారు కాబట్టి, 284 00:24:06,989 --> 00:24:12,119 ఆ అవకాశం తన నుండి చేజారిపోయి, చక్కని చిక్కని మిస్ కెంట్ కి దక్కింది. 285 00:24:13,078 --> 00:24:15,163 తనతో నా మనస్సులో ఉన్నది చెప్పేశా, ఇక అంతే. 286 00:24:16,039 --> 00:24:20,294 కాబట్టి, ఆ ఫైల్లో ఉన్న పనికిమాలిన విషయాలు కాకుండా ఆధారాలేమైనా ఉంటే చెప్పండి, 287 00:24:20,878 --> 00:24:25,716 లేదంటే దయచేసి ఇక్కడి నుండి, దొబ్బేయండి. 288 00:24:33,015 --> 00:24:35,474 ఓకే, ఇప్పటికి వచ్చావు. వచ్చి, నా ప్లాన్ విను. 289 00:24:35,475 --> 00:24:38,019 తిరుగుబాటు సమయంలో మన దగ్గర గన్ పౌడర్ ఉంది కదా, అది చాలా మిగిలి ఉంది. 290 00:24:38,020 --> 00:24:40,438 - పొద్దుపోయాక ఒక బృందం జ్యుడిషియల్ కి వెళ్తుంది… - సరే. 291 00:24:40,439 --> 00:24:42,231 …వాళ్లు జీడబ్ల్యూపీ యూనిఫామ్స్ వేసుకుని వెళ్తారు, 292 00:24:42,232 --> 00:24:44,942 ఇక మేము గోడ మీద అక్కడక్కడా పేలుడు పదార్థాలని అమర్చి దాన్ని పేల్చేస్తాం, 293 00:24:44,943 --> 00:24:48,821 దానితో గోడ వెనుకనున్న పైపులు కూడా పేలిపోతాయి, ఆ పైపుల్లో విషవాయువు ఉండే పైపు కూడా ఉంటుంది. 294 00:24:48,822 --> 00:24:52,366 సరే, అప్పుడు విషవాయువు అంతా విడుదల అవుతుంది. ఆ తర్వాత ఏంటి? మీరు కొన్ని నిమిషాలే కదా బతకగలిగేది? 295 00:24:52,367 --> 00:24:53,618 - జీడబ్ల్యూపీ యూనిఫామ్స్ లోపల… - వద్దు. 296 00:24:53,619 --> 00:24:55,369 - …క్లీనింగ్ సూట్స్ వేసుకుంటాం. - కానివ్వు. 297 00:24:55,370 --> 00:24:56,537 మమ్మల్ని మెయింటెనెన్స్ టీమ్ అనుకుంటారు. 298 00:24:56,538 --> 00:24:58,080 మన దగ్గర ఆరు సూట్లే ఉన్నాయి. 299 00:24:58,081 --> 00:25:01,709 చూడండి, అది కష్టమైన పనే, కానీ మంచి బృందం ఉంటే, నేను పని పూర్తి చేసేయగలను. 300 00:25:01,710 --> 00:25:02,878 మరి హెల్మెట్లకి రక్షణ ఎలా? 301 00:25:03,462 --> 00:25:04,712 వాటిని నేను కవర్ చేయగలను. 302 00:25:04,713 --> 00:25:08,925 అయితే, హెల్మెట్లు, బాంబులతో ఉన్న ఆరుగురిని జ్యుడిషియల్ శాఖలోకి ఎలా పంపించాలి? 303 00:25:08,926 --> 00:25:11,052 యూనిఫామ్స్ వేసుకున్నంత మాత్రాన అక్కడికి వెళ్లిపోలేం అనుకుంటా. 304 00:25:11,053 --> 00:25:13,471 - సిమ్స్ మనకి పాసులు ఇవ్వగలడా? - కానీ వాయువు సంగతేంటి? 305 00:25:13,472 --> 00:25:15,932 ఆ వాయువుకు వాసన, రంగు ఉండకపోవచ్చు, కదా? 306 00:25:15,933 --> 00:25:19,769 జూల్స్, ఇక్కడ విషయమేంటంటే, కొత్త సూట్స్ వల్ల వాళ్లకి ఒక గంట సమయం లభిస్తుంది. 307 00:25:19,770 --> 00:25:21,604 హా, కానీ ఆ గంటలో అనేక మంది ప్రాణాలు పోతాయి. 308 00:25:21,605 --> 00:25:24,148 ఎంత మంది ప్రాణాలు పోతాయో ఆలోచించావా? 309 00:25:24,149 --> 00:25:27,193 పైపును మూయడానికి ఎంత సేపు పడుతుంది, అక్కడికి పై అంతస్థుల్లో ఎంత మంది ఉన్నారు, 310 00:25:27,194 --> 00:25:30,029 కింది అంతస్థుల్లో ఎంత మంది ఉన్నారు అనే దానిపై ఆధారపడుంటుంది అది. 311 00:25:30,030 --> 00:25:33,200 ఆ అంతస్థులు నివాస సముదాయాలు. జనాలు తమ నివాసాల్లో నిద్రపోతూ ఉంటారు. 312 00:25:35,369 --> 00:25:36,495 ఎందరు చనిపోవచ్చో చెప్పు. 313 00:25:39,998 --> 00:25:41,374 సుమారుగా ఒక వంద నుండి… 314 00:25:41,375 --> 00:25:42,960 వెయ్యి మంది కూడా చనిపోవచ్చు. 315 00:25:44,545 --> 00:25:46,797 వెయ్యి మంది. ఇది వద్దు. 316 00:25:49,716 --> 00:25:51,635 పదివేల మంది చావడం కన్నా అదే మేలు కదా. 317 00:25:52,386 --> 00:25:57,224 బహుశా మనం నీళ్లు తాగేసి అంతా మర్చిపోతే మేలేమో. 318 00:26:00,227 --> 00:26:02,354 - ఈ విషయంలో మనం ఓటింగ్ వేసి నిర్ణయించాలా? - లేదు. 319 00:26:03,605 --> 00:26:09,987 సైలో వాసులు ఓటేసే కదా జూలియాని మేయర్ చేసింది. 320 00:26:14,575 --> 00:26:16,409 నేను ఆలోచించుకోవాలి. నేనేం ఊరికే… 321 00:26:16,410 --> 00:26:19,955 వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోని ప్లాన్ ఏమైనా ఉంటే ఆలోచిస్తారా? 322 00:26:31,341 --> 00:26:32,426 నువ్వు బాగానే ఉన్నావా? 323 00:26:35,596 --> 00:26:37,097 నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. 324 00:26:45,564 --> 00:26:50,736 ముందు ఇటీవలి జ్ఞాపకాలను తీసుకురావడంపై దృష్టి పెట్టాం. అంటే, నేవీలో ఉన్నప్పటివి, మిషన్ కి సంబంధించినవి. 325 00:26:51,778 --> 00:26:53,989 ఇరాన్ కి సంబంధించినవి కూడా. ఇరాన్ భాగాన్ని వదిలేస్తాడని అనుకున్నా. 326 00:26:55,324 --> 00:26:57,825 నేను నా విమానంలో ఎక్కే సమయం దాకా ఏం జరిగాయో గుర్తుంటే 327 00:26:57,826 --> 00:26:59,620 బాగుంటుందని అతను అన్నాడు… 328 00:27:01,705 --> 00:27:04,957 కానీ మిగతావి పక్కకు పెట్టేద్దామని అన్నాడు. కాబట్టి… 329 00:27:04,958 --> 00:27:07,628 నేను మిషన్ పని మీద వెళ్లానని, అది సఫలం కాలేదని నాకు తెలుసు. 330 00:27:08,962 --> 00:27:13,382 నాకు ఏం జరిగిందో తెలుసు, కానీ అది నాకు కాకుండా వేరెవరికో జరిగినట్టు ఉంది. 331 00:27:13,383 --> 00:27:14,801 నువ్వు బాగానే ఉన్నావా? 332 00:27:15,302 --> 00:27:16,969 ఇంతకుముందు కన్నా పర్వాలేదు. 333 00:27:16,970 --> 00:27:19,180 నాకు గుర్తుకు తెప్పించడంలో విక్టర్ సాయపడ్డాడు. 334 00:27:19,181 --> 00:27:20,766 కానీ కొన్ని మర్చిపోయేలా కూడా చేశాడు. 335 00:27:24,019 --> 00:27:25,521 నేను వెళ్లి పడుకునే ప్రయత్నం చేస్తా. 336 00:27:27,189 --> 00:27:28,190 అలాగే. 337 00:27:30,275 --> 00:27:32,736 హా, అంటే నువ్వు అక్కడి నుండి లేవాలి. పడుకోవడానికి నాకు నీ సీటు కావాలి. 338 00:27:35,739 --> 00:27:36,740 సరే. 339 00:27:43,747 --> 00:27:44,831 తను ఎలా ఉంది? 340 00:27:46,124 --> 00:27:48,210 తను నాకు కొన్ని ఝలక్లు ఇచ్చింది, కాబట్టి… 341 00:27:49,294 --> 00:27:50,504 తన పరిస్థితి మెరుగైంది అంటావా? 342 00:27:51,380 --> 00:27:52,464 హా, మెరుగైందేమో. 343 00:27:53,048 --> 00:27:55,092 లేవగానే అర్థమైంది, ఇవాళ నాకు అస్సలు కలిసిరాదని. 344 00:27:55,592 --> 00:27:57,009 మా నాన్న ఎలా చనిపోయాడు? 345 00:27:57,010 --> 00:27:58,761 ఎలా ఉన్నావు, ఏంటి అని పలకరించేది ఏం లేదా? 346 00:27:58,762 --> 00:27:59,846 ఆయన ఎలా చనిపోయాడు? 347 00:27:59,847 --> 00:28:01,514 నువ్వు గనుల్లోకి వెళ్లలేదా? 348 00:28:01,515 --> 00:28:03,349 సొరంగం పైకప్పు కూలి చనిపోయాడని హార్వుడ్ అన్నాడు. 349 00:28:03,350 --> 00:28:05,018 - అయితే అలాగే చనిపోయి ఉంటాడు. - లేదు. 350 00:28:05,936 --> 00:28:08,438 అది చెప్పేటప్పుడు అతను కాస్త తటపటాయించాడు. ఇంకేదో జరిగింది. 351 00:28:11,483 --> 00:28:12,651 ప్లీజ్. 352 00:28:14,987 --> 00:28:15,988 అతడిని ఎవరైనా చంపేశారా? 353 00:28:16,488 --> 00:28:17,573 లేదు. 354 00:28:20,325 --> 00:28:21,410 అతనేం చనిపోలేదు. 355 00:28:22,995 --> 00:28:26,081 గనుల్లో రాళ్లు పడి చనిపోయింది వేరే వ్యక్తి, మీ నాన్న కాదు. 356 00:28:27,958 --> 00:28:29,042 నాకు తెలిసిన దాని ప్రకారం, 357 00:28:30,294 --> 00:28:32,503 మీ నాన్న హార్వుడ్ కి ఏదో తయారు చేసి ఇచ్చాడు. 358 00:28:32,504 --> 00:28:37,342 దానికి బదులుగా, గనుల్లో తర్వాతిసారి చనిపోవాల్సిన వ్యక్తి చనిపోయినట్టు అధికారికంగా నమోదు కాలేదు. 359 00:28:38,135 --> 00:28:39,468 అతని ఐడెంటిటీని మీ నాన్న తీసుకున్నాడు. 360 00:28:39,469 --> 00:28:41,137 చనిపోయిన వ్యక్తి పేరేంటి? 361 00:28:41,138 --> 00:28:43,723 హార్వుడ్ యవ్వారాల్లో వేలు పెడితే, 362 00:28:43,724 --> 00:28:45,893 నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. 363 00:28:48,645 --> 00:28:49,771 అతని పేరు నీకు తెలుసా? 364 00:28:54,776 --> 00:28:55,986 నన్ను కలవమని పిలిచారా? 365 00:28:59,656 --> 00:29:03,785 మిషన్ డైరీ ఎక్కడ ఉందో నీకు తెలుసా? 366 00:29:06,788 --> 00:29:10,042 నా వల్ల ఇప్పుడు ఏ ప్రమాదమూ లేదని తెలీట్లేదా? 367 00:29:12,377 --> 00:29:13,879 అలవాటు అయిపోయిందిలే. 368 00:29:15,172 --> 00:29:19,176 అదెక్కడ ఉందో, ఎవరి దగ్గర ఉందో నీకు తెలిస్తే, 369 00:29:20,177 --> 00:29:21,929 దాన్ని, ఆ మనిషిని కూడా ఇక్కడికి తీసుకురా. 370 00:29:24,681 --> 00:29:25,682 ప్లీజ్. 371 00:29:34,483 --> 00:29:35,651 నిద్రపట్టడం లేదా? 372 00:29:40,614 --> 00:29:45,201 మీరు ఆ మినీ వ్యానుని డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను, డ్యానియల్ వెనుక సీట్లో నిద్రపోయాం. 373 00:29:45,202 --> 00:29:48,455 దాన్ని డ్రైవ్ చేసింది నేను కాదు, అంతేకాకుండా నువ్వు పడుకోలేదని నాకు తెలుసు. 374 00:29:50,749 --> 00:29:52,084 దానిలో మైక్రోఫోన్స్ గట్రా ఏమైనా పెట్టారా? 375 00:29:55,796 --> 00:29:56,839 సరే మరి. 376 00:29:57,464 --> 00:30:00,801 నువ్వు "పోస్ట్"లో రాసిన ఆర్టికల్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు. 377 00:30:01,552 --> 00:30:02,760 మంచిదేలే నీకు. 378 00:30:02,761 --> 00:30:05,013 హా, ఎవరికీ చెప్పవద్దు. 379 00:30:06,223 --> 00:30:09,476 రహస్య ఒప్పందాల్లో ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ సంబంధించిన ప్రతీ ఒక్క విషయమూ కవర్ అవుతుంది. 380 00:30:11,854 --> 00:30:12,980 ఇంతకీ మీ కథ ఏంటి? 381 00:30:15,524 --> 00:30:16,816 నా గురించి రాయాలనుకుంటున్నావా? 382 00:30:16,817 --> 00:30:20,112 ఇది నా సహజమైన స్వభావం. నాకు ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగానే కనిపిస్తారు. 383 00:30:21,238 --> 00:30:25,117 సైనిక నిఘా శాఖలో 20 ఏళ్లు పని చేశా. 384 00:30:25,868 --> 00:30:29,246 దాన్ని వదిలేశాక, ఓ సంస్థని ప్రారంభించా, అది చాలా ఎత్తుకు ఎదిగింది కూడా. 385 00:30:31,874 --> 00:30:33,292 కానీ ఆ విజయం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 386 00:30:34,459 --> 00:30:36,044 నా వల్లే అనుకో. 387 00:30:36,753 --> 00:30:39,673 నేను సరిదిద్దుకోని కొన్ని వ్యక్తిత్వ లోపాల వల్ల అన్నమాట. 388 00:30:40,674 --> 00:30:42,842 అప్పుడే నేను… సెనేటరుని కలుసుకున్నా. 389 00:30:42,843 --> 00:30:45,053 తను కాంగ్రెస్ బరిలో తొలిసారిగా నిలబడినప్పుడు జరిగిన ఎన్నికల ప్రచారంలో. 390 00:30:46,930 --> 00:30:48,140 తనకి డ్రైవరుగా పని చేశా. 391 00:30:50,684 --> 00:30:53,854 మరి ఇప్పుడు మీరు ఆమెకి వినయ విధేయ… ఏంటి? 392 00:30:54,646 --> 00:30:56,397 నా పదవికి ఓ పేరంటూ లేదు. 393 00:30:56,398 --> 00:30:59,525 సెనేటరుపై, ఆమె కూతురిపై ఈగ వాలకుండా చూసుకోవడం నా విధి. 394 00:30:59,526 --> 00:31:00,736 అంటే? 395 00:31:03,405 --> 00:31:04,698 అంటే, చాలా అర్థం ఉందిలే. 396 00:31:20,088 --> 00:31:21,381 ఇక్కడ బయట నిలబడి ఏం చేస్తున్నావు? 397 00:31:22,549 --> 00:31:25,968 - నువ్వు బాగానే ఉన్నావా? - ఒకరు వచ్చారు కాబట్టి బయట ఉన్నా. 398 00:31:25,969 --> 00:31:30,181 నువ్వు ఏవైతే ఎదుర్కొన్నావో, తను కూడా అవే ఎదుర్కొందని చెప్పవచ్చు. 399 00:31:30,182 --> 00:31:32,892 అంటే? కమీల్ తనకి కూడా మతిమరుపు మందులు ఇచ్చిందా? 400 00:31:32,893 --> 00:31:33,977 కమీల్ కాదు. 401 00:31:35,020 --> 00:31:36,188 రాబర్ట్, నేను… 402 00:31:38,065 --> 00:31:39,815 తనకి ఆ మందులు ఇవ్వడం ఆపేశాం, 403 00:31:39,816 --> 00:31:42,528 తద్వారా నీ మాత్రలని మార్చడంలో తను నర్సుకి సహాయపడుతుందని, 404 00:31:43,529 --> 00:31:46,114 ఎందుకంటే, తను ఒక్కదానికే అర్థమవుతుంది… 405 00:31:48,158 --> 00:31:51,203 నువ్వు పడిన కష్టమేంటో. 406 00:31:51,870 --> 00:31:58,210 మనం ఎదుర్కోనున్న భవిష్యత్తు గురించి తనకు ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉందని అనుకుంటున్నా. 407 00:32:03,507 --> 00:32:04,883 జూలియా నికల్స్. 408 00:32:06,468 --> 00:32:07,803 గ్లొరియా హిల్డర్ బ్రాండ్. 409 00:32:12,140 --> 00:32:13,725 నేను నీకు గుర్తులేకపోయినా పర్వాలేదులే. 410 00:32:14,226 --> 00:32:15,726 నాకు చాలా కాలం ఆ మతిమరుపు మందులు ఇచ్చారు, 411 00:32:15,727 --> 00:32:18,938 దాని వల్ల అసలు ఒక్కరినైనా గుర్తుపడతానా లేదా అనుకున్నా. 412 00:32:18,939 --> 00:32:23,360 మనం జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరముంది, అందుకే మిసెస్ హిల్డర్ బ్రాండ్ ని రమ్మన్నా. 413 00:32:24,486 --> 00:32:26,905 అలాగే, తన చేతిలో ఉన్న దాని గురించి కూడా మీకు చెప్పాలి. 414 00:32:27,865 --> 00:32:29,199 నేను ఐటీకి హెడ్ గా ఉన్నప్పుడు, 415 00:32:30,576 --> 00:32:36,331 పరిరక్షకులు అని పిలవబడే ఓ రహస్య గ్రూప్ పవిత్రంగా కొలిచే 416 00:32:37,124 --> 00:32:42,963 పురాతన వస్తువులని నేను, రాబర్ట్ వెతికి పట్టుకునేవాళ్లం. 417 00:32:44,381 --> 00:32:46,341 జార్జ్ వాళ్ల అమ్మ కూడా మా గ్రూపులో ఉండేది. 418 00:32:48,343 --> 00:32:52,764 మన ముందు కాలానికి చెందిన జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నించే వాళ్లు. అందుకని వాళ్లని ముప్పుగా భావించేవాళ్లం. 419 00:32:53,640 --> 00:32:58,644 బయట నివసించే వాతావరణాన్ని ఏర్పాటు చేసి, మన భవిష్యత్తు విషయంలో మళ్లీ ఆశ చిగురింపజేయాలని చూసేవారు. 420 00:32:58,645 --> 00:33:01,565 నీలాగే మేము కూడా నిజం తెలుసుకోవాలనుకున్నాం. 421 00:33:02,232 --> 00:33:04,526 మేము ఎక్కువగా రెండు వస్తువుల కోసం వెతికాం, 422 00:33:05,194 --> 00:33:08,947 ఆ రెండూ నిర్దిష్ట కాలానికి చెందిన జీవన విధానాన్ని తెలిపే డాక్యుమెంట్లు. 423 00:33:09,448 --> 00:33:12,617 ఒకటి స్పైరల్ బౌండ్ నోట్ ప్యాడ్, 424 00:33:12,618 --> 00:33:17,539 దాని కోసం పాత ఐడీ హెడ్లందరూ మూడు వందలు ఏళ్లుగా వెతికారు. 425 00:33:18,165 --> 00:33:19,332 కానీ అది దొరకలేదు. 426 00:33:19,333 --> 00:33:22,127 ఇంకో వస్తువుపై నాకు పిచ్చి అని చెప్పవచ్చు. 427 00:33:23,837 --> 00:33:25,047 అది మిషన్ డైరీ. 428 00:33:26,423 --> 00:33:27,507 ఏ మిషన్? 429 00:33:27,508 --> 00:33:31,677 మిషన్ అనేది ఓ వ్యక్తి పేరు. అతను 140 ఏళ్ల క్రితం పోర్టరుగా పని చేశాడు. 430 00:33:31,678 --> 00:33:33,513 భారీ తిరుగుబాటు సమయంలో, 431 00:33:33,514 --> 00:33:36,642 మెట్లను పేల్చడానికి వాడిన బాంబులని అతనే రవాణా చేశాడు. 432 00:33:37,267 --> 00:33:39,186 మెట్లని మొట్టమొదటగా పేల్చింది నీ మిత్రులే అనుకున్నావా? 433 00:33:39,895 --> 00:33:43,398 మిసెస్ హిల్డర్ బ్రాండ్, చివర్లో ఏం రాసి ఉందో చదివి వినిపిస్తావా? 434 00:33:55,869 --> 00:34:01,083 "నా మెడపై ఓ గుర్తు ఉంది, నా పొట్టపై ఓ మచ్చ ఉంది, 435 00:34:01,625 --> 00:34:04,502 అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు. 436 00:34:04,503 --> 00:34:08,339 నాకు తెలుసనే అనిపిస్తోంది, అవి నిన్నే వచ్చాయేమో, 437 00:34:08,340 --> 00:34:10,842 కానీ ఇప్పుడు నాకు నిన్నటి విషయాలేవీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు. 438 00:34:11,969 --> 00:34:13,219 నాకు భయంగా ఉంది. 439 00:34:14,388 --> 00:34:16,472 మేము అందరమూ చాలా మర్చిపోయాం. 440 00:34:16,473 --> 00:34:20,561 అది వైరస్ ప్రభావమని, ఆ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదని డాక్టర్లు అనేవారు, 441 00:34:21,520 --> 00:34:22,855 కానీ ఆ పరిస్థితి ఆగలేదు. 442 00:34:23,688 --> 00:34:25,774 మతిమరుపు కమ్మేయసాగింది. 443 00:34:26,358 --> 00:34:30,195 నాకు ఇంకా గుర్తున్న విషయాలు ఒక కలలాగా మసకబారిపోయాయి. 444 00:34:30,904 --> 00:34:34,657 ఆలీ లేకపోతే ఏమైపోతానో ఏమో తెలీట్లేదు. ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. 445 00:34:34,658 --> 00:34:39,746 కానీ ఒంటరిగా ఉంటున్న వాళ్లు తినడం మానేశారని విన్నాను. 446 00:34:41,873 --> 00:34:46,170 మెట్లపై నుండి కూడా చాలా మంది దూకడం మొదలుపెట్టారు, అందుకని వలలని కట్టారు. 447 00:34:46,837 --> 00:34:52,176 ఒకవేళ నేను ఆలీని మర్చిపోతే, నిస్సందేహంగా నేను కూడా మెట్లపై నుండి కిందకు దూకేస్తాను." 448 00:34:54,803 --> 00:34:57,431 అతను చివరిగా రాసిన పదాలు అవి. 449 00:34:59,391 --> 00:35:01,143 మీ ఉద్దేశమేంటో నాకు అర్థమైంది… 450 00:35:02,769 --> 00:35:06,189 హా, అది చాలా బాధాకరమైన సంఘటనే, కానీ నేను… నేను చెప్పా కదా, 451 00:35:06,190 --> 00:35:08,774 వెయ్యి మందిని నేను చంపలేను. 452 00:35:08,775 --> 00:35:12,111 ఆ సమయంలో ఐటీకి హెడ్ గా ఉన్న శాల్వడోర్ క్విన్, 453 00:35:12,112 --> 00:35:15,948 రక్షణాత్మక చర్యని నివారించడానికి సైలో వాసులకి మతిమరుపు మందు ఇవ్వాలని నిర్ణయించాడు. 454 00:35:15,949 --> 00:35:19,410 అతను ప్రజల జ్ఞాపకాలను తుడిచివేయాల్సిన అవసరం ఏంటి అని ఎప్పుడూ ప్రశ్నించలేదు, 455 00:35:19,411 --> 00:35:21,205 కానీ దాని వలన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనకి తెలుసు. 456 00:35:21,788 --> 00:35:27,376 క్విన్ లెక్కల ప్రకారం, ఆ మతిమరుపు మందుల వల్ల కలిగిన భయాందోళనలు, గందరగోళం కారణంగా 457 00:35:27,377 --> 00:35:30,506 దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 458 00:35:32,925 --> 00:35:36,929 నువ్వు వెంటనే ఏ చర్యా తీసుకోకపోతే, ఇప్పుడు జరిగేది అదే. 459 00:35:38,472 --> 00:35:43,060 ఈ నిర్ణయం నీకు తీసుకోవాలని లేదని నాకు తెలుసు. 460 00:35:43,644 --> 00:35:44,770 - నాకు తెలుసు. - నిజంగా? 461 00:35:45,812 --> 00:35:49,525 కానీ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. 462 00:36:06,124 --> 00:36:07,751 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 463 00:36:09,878 --> 00:36:12,588 ఎందుకో అసహనంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. 464 00:36:12,589 --> 00:36:13,590 ఆ-హా. 465 00:36:16,218 --> 00:36:18,011 విమానంలో ప్రయాణించడం ఇష్టం లేదా? 466 00:36:18,762 --> 00:36:19,888 లేదు. 467 00:36:20,931 --> 00:36:22,307 నడిపేది నేను అయినప్పుడే నాకు నచ్చుతుంది. 468 00:36:23,851 --> 00:36:26,185 - ఏదైనా నీ చేతుల్లో ఉంటేనే నీకు నచ్చుతుందా? - అంత లేదు. 469 00:36:26,186 --> 00:36:27,938 ఏదైనా సరైన పద్ధతిలో చేస్తేనే నాకు నచ్చుతుంది. 470 00:36:29,189 --> 00:36:32,401 - మరి నీ సంగతేంటి? నువ్వు నిద్రపోవట్లేదా? - అంటే… 471 00:36:34,444 --> 00:36:35,571 రేపు చాలా ముఖ్యమైన రోజు. 472 00:36:36,280 --> 00:36:38,364 హా. ఇంతకీ మనమేం చూడబోతున్నాం? 473 00:36:38,365 --> 00:36:40,075 నీకు మ్యాజిక్ షోలు లాంటివి నచ్చవు కదా. 474 00:36:40,742 --> 00:36:42,618 వాళ్లతో "ఈ నాటకాలు కట్టిబెట్టండి" అని అంటావేమో నువ్వు. 475 00:36:42,619 --> 00:36:44,329 హా, "ఆ సొల్లు ఆపి అసలు విషయానికి రండి," అంటా. 476 00:36:57,926 --> 00:36:59,386 నీకేమైనా కావాలా? 477 00:37:00,637 --> 00:37:02,264 - వద్దు. - సరే. 478 00:37:03,974 --> 00:37:05,976 కానీ కాస్త కాళ్లు పడతావా? 479 00:37:22,534 --> 00:37:26,412 - ఇందాక జరిగిన దానికి సారీ. - ఓకేలే. హా. 480 00:37:26,413 --> 00:37:28,247 మీరు షార్లెట్ డాక్టర్ అని అనుకున్నా. 481 00:37:28,248 --> 00:37:30,875 - కానీ ఇప్పుడు దీనిలో మీకు ప్రమేయముందని తెలిసింది. - లేదు, లేదు. నేను… 482 00:37:30,876 --> 00:37:35,296 లేదు, నేను షార్లెట్ డాక్టరునే. తన చిన్ననాటి జ్ఞాపకాలు 483 00:37:35,297 --> 00:37:37,423 తనకి గుర్తొచ్చేలా చేయడంలో ఇప్పటికీ నాకు మీ సాయం కావాలి… 484 00:37:37,424 --> 00:37:40,218 ఒకవేళ తనకి జీవితాంతం, గత రెండు వారాల్లో జరిగినవి మాత్రమే గుర్తుంటే? 485 00:37:40,219 --> 00:37:41,552 లేదు, ఈ చికిత్స పని చేస్తుంది. 486 00:37:41,553 --> 00:37:43,346 కానీ మీరు గ్యారెంటీ ఏమీ లేదని అన్నారుగా. 487 00:37:43,347 --> 00:37:46,600 అవును, అన్నా, కానీ ఒకేసారి రెండు విషయాలు నిజాలు కాకూడదా ఏంటి! 488 00:37:47,226 --> 00:37:49,645 తను చాలా చక్కగా కోలుకుంటోంది. నిజంగానే చెప్తున్నా. 489 00:38:00,155 --> 00:38:02,366 నేను లాస్ ఏంజలెస్ లో నివసిస్తూ ఉన్నప్పుడు, 490 00:38:02,866 --> 00:38:07,162 నా కూతురు, లూలూ, గ్రాండ్ కాన్యన్ గురించి తప్ప ఇక దేని గురించీ మాట్లాడేది కాదు. 491 00:38:08,747 --> 00:38:11,875 దాన్ని చూడటానికి తీసుకెళ్లమని ఒక నెల పాటు ప్రతిరోజూ మమ్మల్ని బతిమాలేది. 492 00:38:13,210 --> 00:38:14,920 చివరికి, నేనూ, నా భార్య ఒప్పుకున్నాం. 493 00:38:15,546 --> 00:38:18,257 ఒక శుక్రవారం రాత్రి, ఆఫీసు పనయ్యాక మేము రోడ్డు మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాం… 494 00:38:20,759 --> 00:38:23,845 నేను సౌత్ రిమ్ కి చేరుకోవాలని చూస్తూ ఉన్నా, 495 00:38:23,846 --> 00:38:25,388 అదే, సూర్యోదయాన్ని అక్కడి నుండి చూడాలని. 496 00:38:25,389 --> 00:38:28,141 ఆ దృశ్యాన్ని లూలూ చూసి ఎంత సంబరపడిపోతుందో అనేదే నా బుర్రలో తిరుగుతూ ఉంది. 497 00:38:28,892 --> 00:38:29,893 హా. 498 00:38:33,981 --> 00:38:37,651 నేను మరీ అంత ఒత్తిడి తీసుకుని ఉండాల్సింది కాదు. నేను… నేను అప్పుడు బాగా అలసిపోయి ఉన్నా. 499 00:38:39,403 --> 00:38:40,988 కెవిన్ బిషప్ పరిస్థితి కూడా అంతే. 500 00:38:42,823 --> 00:38:47,870 అతని ట్రక్కు సెంటర్ లేన్ నుండి పక్కకు జరగడం నేను గమనించే సరికి, ఆలస్యమైపోయింది. 501 00:38:52,291 --> 00:38:56,502 డ్యానియల్, నేను ఇప్పుడు షార్లెట్ పై ప్రయోగిస్తున్న టెక్నిక్స్, 502 00:38:56,503 --> 00:38:58,546 మందులు, చికిత్స, ఇవన్నీ కూడా 503 00:38:58,547 --> 00:39:03,177 ముప్పై ఏళ్ల క్రితం నాకోసం నేను రూపొందించుకున్నవి, ఎందుకంటే నేను ఆ జ్ఞాపకాన్ని మర్చిపోవాలనుకున్నా. 504 00:39:03,844 --> 00:39:07,805 - దాన్నంతటినీ నేను మర్చిపోయా కూడా… - కానీ మీరు మర్చిపోలేదుగా. ఇప్పుడే చెప్పారుగా. 505 00:39:07,806 --> 00:39:11,351 ఎందుకంటే, సరిగ్గా సమయానికి ఒక విషయం మేము కనుగొన్నాం, అదేంటంటే… 506 00:39:12,769 --> 00:39:15,522 ఏ జ్ఞాపకాలను అట్టిపెట్టుకోవాలి, వేటిని వదిలేయాలి అనేది మనం ఎంచుకోవచ్చు అని. 507 00:39:16,815 --> 00:39:18,817 ఈఎంటీ నివేదిక ప్రకారం… 508 00:39:28,911 --> 00:39:31,997 నా కూతురు చనిపోతూ ఉన్నప్పుడు నేను తనని నా చేతుల్లో పట్టుకుని ఉన్నాను. 509 00:39:36,793 --> 00:39:39,755 నాకు అది గుర్తుంచుకోవాలని లేదు. గుర్తులేదు కూడా. 510 00:39:40,589 --> 00:39:41,882 ఈ చికిత్స పని చేస్తుంది. 511 00:39:51,308 --> 00:39:52,351 మనం ఎక్కడ ఉన్నాం? 512 00:40:03,445 --> 00:40:04,446 అట్లాంటాలో. 513 00:40:09,451 --> 00:40:11,953 మర్చిపోవద్దు, ఇవాళ ఆంథనీ జాకెట్ వేసుకుని వెళ్లాలి. 514 00:40:11,954 --> 00:40:13,037 అమ్మా, వద్దు! 515 00:40:13,038 --> 00:40:16,249 మీ చివరి క్లాస్ డ్రాయింగులో, మీరందరూ జాకెట్లు ధరించి ఉన్నారు. 516 00:40:16,250 --> 00:40:17,959 అది అయిదేళ్ల క్రితం సంగతి. 517 00:40:17,960 --> 00:40:19,294 ఆ ఫోటోలో నువ్వు చాలా బాగున్నావు. 518 00:40:19,795 --> 00:40:21,337 ఆ ఆర్టిస్ట్ చాలా బాగా గీశాడు. 519 00:40:21,338 --> 00:40:23,130 - కమీల్. - ఏంటి? 520 00:40:23,131 --> 00:40:24,758 వాడిని బలవంతపెట్టకు. 521 00:40:26,009 --> 00:40:27,802 ఇప్పుడు ఇది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అయిపోయిందా? 522 00:40:27,803 --> 00:40:29,638 లేదు, వాడే తీసుకోవాల్సిన నిర్ణయమని అంటున్నా. 523 00:40:35,853 --> 00:40:37,020 సరే. 524 00:40:38,522 --> 00:40:39,690 మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. 525 00:40:54,246 --> 00:40:56,498 మీ అమ్మ తాళం చెవులు మర్చిపోయి ఉంటుంది. 526 00:41:00,210 --> 00:41:01,962 ఇక్కడ ఏం పని నీకు? 527 00:41:03,046 --> 00:41:06,592 - నాకు దూరంగా ఉండమని నికల్స్ కి చెప్పా కదా. - అవును, ఇక్కడ కెమెరాలేవీ ఉండవని తను చెప్పింది. 528 00:41:07,092 --> 00:41:09,218 మాకు జ్యుడిషియల్ లోకి వెళ్లడానికి పాసులు కావాలి. 529 00:41:09,219 --> 00:41:10,761 దేనికి? 530 00:41:10,762 --> 00:41:13,848 చూడు, ఎందుకో తను చెప్పలేదు, కానీ ఏ అవసరమూ లేకుండా ఉంటే, 531 00:41:13,849 --> 00:41:15,434 ఇలా నన్ను వంద అంతస్థులు ఎక్కించదు కదా. 532 00:41:19,563 --> 00:41:23,649 ఆంథనీ, మన ప్లాన్ మారింది. 533 00:41:23,650 --> 00:41:25,193 నువ్వు జాకెట్ తీసుకుని వెళ్లు. 534 00:41:25,194 --> 00:41:27,487 - నాన్నా, ఇప్పుడే అన్నావు కదా… - తీసుకుని వెళ్లమన్నా కదా. 535 00:41:29,114 --> 00:41:32,116 ఎవరూ వేసుకోకపోతే, నువ్వు కూడా వేసుకోకు. 536 00:41:32,117 --> 00:41:37,289 మీ అమ్మ డ్యూటీలో బాగా ఇబ్బంది పడుతోంది, నువ్వు ఇలా చేస్తే, తను సంతోషిస్తుంది. 537 00:41:38,207 --> 00:41:39,208 సరేనా? 538 00:41:41,293 --> 00:41:42,710 నా దగ్గర ఇవి మూడు ఉన్నాయి. 539 00:41:42,711 --> 00:41:45,214 ఎక్స్ క్యూజ్ మీ. సారీ, నాకొక స్కూల్ జాకెట్ కావాలి. 540 00:41:46,131 --> 00:41:48,050 సరే. సైజ్ ఎంత? 541 00:41:48,634 --> 00:41:49,926 పక్కాగా తెలీదు… 542 00:41:49,927 --> 00:41:51,303 ఇంత ఎత్తు ఉంటాడు. 543 00:41:54,765 --> 00:41:56,432 మనకి ఆలస్యం అవుతుంది. 544 00:41:56,433 --> 00:41:59,561 సారీ. కావాలంటే, జాకెట్ ని నేను పట్టుకొని వస్తాలే. 545 00:42:01,772 --> 00:42:03,315 సమయానికే చేరుకుంటాంలే, సరేనా? 546 00:42:04,983 --> 00:42:06,359 - ఎక్స్ క్యూజ్ మీ? - చెప్పండి? 547 00:42:06,360 --> 00:42:08,319 ఇది ఆంథనీ సిమ్స్ జాకెట్. 548 00:42:08,320 --> 00:42:11,405 ఈ ఉదయం ఆంథనీకి ఇచ్చింది వేరే జాకెట్ అని జడ్జ్ ఇప్పుడే గ్రహించారు. 549 00:42:11,406 --> 00:42:13,699 ఆంథనీ దగ్గర ఉన్నది అతనికి సరిపోతుంది అనుకుంటాలే. 550 00:42:13,700 --> 00:42:16,286 అది పాతది. పట్టదు. 551 00:42:17,496 --> 00:42:18,704 ఇప్పుడు అతని వద్ద ఉన్నది ఇస్తారా? 552 00:42:18,705 --> 00:42:20,624 జడ్జ్ దాన్ని రీసైక్లింగ్ కి పంపాలనుకుంటున్నారు. 553 00:42:21,333 --> 00:42:22,459 ఒక్క నిమిషం. 554 00:42:27,089 --> 00:42:28,465 - తెచ్చావా? - ఇందులో ఉన్నాయి. 555 00:42:28,966 --> 00:42:29,967 సూపర్. 556 00:42:30,509 --> 00:42:31,635 థ్యాంక్స్. 557 00:42:34,930 --> 00:42:36,014 ఇవి పని చేస్తాయా? 558 00:42:36,682 --> 00:42:37,807 - చేస్తాయి. - చేస్తాయా? 559 00:42:37,808 --> 00:42:38,809 ఇవి చాలు. 560 00:42:39,476 --> 00:42:40,560 నువ్వు బాగానే ఉన్నావా? 561 00:42:40,561 --> 00:42:42,854 ఒక్క రోజులో అన్ని మెట్లు ఎక్కడం, దిగడం నేనెప్పుడు చేశానో నీకు తెలుసా? 562 00:42:42,855 --> 00:42:44,731 ఎప్పుడూ చేయలేదు, ఇదే మొదటిసారి. 563 00:42:55,450 --> 00:42:57,619 - మనం దిగాలి. ఓకే. - ఓకే, అది నాది. 564 00:42:59,872 --> 00:43:01,372 ఇప్పుడు హెలికాప్టర్లలోనా? 565 00:43:01,373 --> 00:43:04,083 అవును, ఈ భాగాన్ని మనం మెల్లగా, కాస్తంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ చూడాలి. 566 00:43:04,084 --> 00:43:05,459 ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? 567 00:43:05,460 --> 00:43:07,628 నా ప్రాపర్టీకి. అది దగ్గర్లోనే ఉందిలే. 568 00:43:07,629 --> 00:43:11,174 మొత్తం మూడు లక్షల ఎకరాలు. అంటే, 1,000 చదరపు కిలోమీటర్లు. 569 00:43:11,175 --> 00:43:14,635 ఒకప్పుడు అందులో 42 పొలాలు ఉండేవి. 570 00:43:14,636 --> 00:43:17,556 మీరు పొలాలని వదులుకోమని నలభై రెండు మంది జార్జియా రైతులని ఒప్పించారా? 571 00:43:18,640 --> 00:43:20,683 నేను వాళ్లకి తరతరాలకు తరగని ఆస్థిని ఇచ్చా, 572 00:43:20,684 --> 00:43:23,645 దాంతో వాళ్ల మనమళ్లే కాదు, ఆ మనమళ్లకు మనమళ్లు కూడా దర్జాగా బతకగలరు. 573 00:43:27,900 --> 00:43:31,402 మీపై ఉన్న ఓ పుకారు గురించి అడగాలనుకుంటున్నా. 574 00:43:31,403 --> 00:43:32,945 నేనేం రోబోటుని కాదు. 575 00:43:32,946 --> 00:43:34,740 అది కాదు, ఇంకో పుకారు. 576 00:43:35,449 --> 00:43:38,492 - యూనికార్న్ కి సంబంధించింది. - అది నిజమైనదే. 577 00:43:38,493 --> 00:43:40,995 అమ్మా, మనం వెనుక ఉన్న దాన్ని తీసుకుందాం, సరేనా? 578 00:43:40,996 --> 00:43:44,123 - అది జోక్ అని అనుకున్నా. - లేదు, లేదు, మా దగ్గర సైన్స్ ఉందిగా. 579 00:43:44,124 --> 00:43:47,084 జన్యులను మార్చగల సొంత టెక్నాలజీని మేము తయారు చేసుకున్నాం. 580 00:43:47,085 --> 00:43:49,837 దానితో పందిని ఏనుగు చేసేయగలం. 581 00:43:49,838 --> 00:43:54,634 గుర్రం, నార్వాల్ తిమింగలం, ఇంకా రైనో డీఎన్ఏలను కలిపి మేము ఓ అద్భుతం సృష్టించాం. 582 00:43:54,635 --> 00:43:57,012 అది పని చేసేదే, కానీ నేనే ఆ ప్రాజెక్టుని నిలిపేశా. 583 00:43:58,472 --> 00:44:01,517 అయితే, ఈ జార్జియా నేలపై రహస్యంగా మీరేం చేస్తున్నారో ఏమో కానీ, 584 00:44:02,017 --> 00:44:04,185 అందులో మీ ఐడియా ఎంత, అతని ఐడియా ఎంత? 585 00:44:04,186 --> 00:44:08,564 అతని ఐడియానే ఇది. నేను కేవలం ఆ ఐడియాని నమ్మి, చేతనైనంత సాయం చేస్తున్నానంతే. 586 00:44:08,565 --> 00:44:14,154 కాబట్టి, నువ్వు కూడా ఇంకాస్తంత తెలుసుకున్నాక, నాలా నమ్ముతావని ఆశిస్తున్నా. 587 00:44:16,156 --> 00:44:17,241 పద. 588 00:44:21,954 --> 00:44:25,874 పిచ్చి సైంటిస్టుగా ఉండకూడదని అలా టక్కున జ్ఞానోదయం అయిపోయిందా మీకు? 589 00:44:26,458 --> 00:44:29,460 నేను ఈ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో పదవ వ్యక్తితో మాట్లాడా. 590 00:44:29,461 --> 00:44:33,631 నేను యూనికార్న్ ని సృష్టించిన తర్వాత, దాన్ని వేటాడి, చంపే అవకాశం అతనికి ఇస్తే, 591 00:44:33,632 --> 00:44:35,217 నాకు 100 కోట్ల డాలర్లు ఇస్తానని అన్నాడు. 592 00:44:36,468 --> 00:44:37,970 ఈ సంపన్నులకు బుర్రే ఉండదు. 593 00:44:38,929 --> 00:44:40,764 మొత్తం చెడదొబ్బేస్తారు! 594 00:44:52,901 --> 00:44:54,026 హేయ్. 595 00:44:54,027 --> 00:44:55,611 జాకెట్ ని తీసుకెళ్లావా? 596 00:44:55,612 --> 00:44:56,738 నాన్న తీసుకెళ్లమన్నాడు. 597 00:44:57,614 --> 00:44:58,740 ఎలా జరిగింది? 598 00:44:59,408 --> 00:45:02,034 ఒక్కడు కూడా జాకెట్ ని తీసుకురాలేదు. నేనే పిచ్చోడిలా తీసుకెళ్లా. 599 00:45:02,035 --> 00:45:03,119 ఎలా జరిగింది అంటావు? 600 00:45:03,120 --> 00:45:04,203 - ఎక్స్ క్యూజ్… - హేయ్… 601 00:45:04,204 --> 00:45:05,330 - హేయ్. - ఆంథనీ! 602 00:45:07,249 --> 00:45:08,625 వాడితో నేను మాట్లాడతానులే. 603 00:45:12,671 --> 00:45:15,506 డిన్నర్ అయ్యాక, ఒక విషయంలో నాకు నీ సాయం కావాలి. 604 00:45:15,507 --> 00:45:18,217 నేను జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లాల్సిన అవసరముంది. 605 00:45:18,218 --> 00:45:21,138 ఎమర్సన్ ని పొడిచిన నర్స్ అక్కడ ఉంది, నేను తనతో మాట్లాడాలి. 606 00:45:21,930 --> 00:45:23,640 ఒక సాక్షిగా నువ్వు అక్కడ ఉండాలి. 607 00:45:26,643 --> 00:45:28,228 - సరే. - ఓకే. 608 00:45:33,984 --> 00:45:36,110 వాడు జాకెట్ ని తీసుకెళ్లేలా చేసినందుకు థ్యాంక్స్. 609 00:45:36,111 --> 00:45:37,112 దానిదేముందిలే. 610 00:45:40,407 --> 00:45:42,700 డిశ్పాచ్, నేను డానీని మాట్లాడుతున్నా. 611 00:45:42,701 --> 00:45:44,203 చెప్పు, డానీ. 612 00:45:44,828 --> 00:45:47,038 మేము డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. 613 00:45:47,039 --> 00:45:48,415 సరే. 614 00:46:54,857 --> 00:46:57,233 హా. నేనే, డానీని. 615 00:46:57,234 --> 00:46:59,610 డెలివరీ చేయబోతూ ఉండగా ఓ సమస్య ఎదురైంది. 616 00:46:59,611 --> 00:47:01,445 ఏంటి ఆ సమస్య, డానీ? 617 00:47:01,446 --> 00:47:03,824 ఓ నివాసంలోకి రెండు పెద్ద కుక్కలు వెళ్లడం చూశా. 618 00:47:04,491 --> 00:47:06,617 చాలా పెద్దవి అన్నమాట. 619 00:47:06,618 --> 00:47:08,953 - అంటే? - కుక్కలు. 620 00:47:08,954 --> 00:47:10,746 జ్యుడిషియల్ గూండాలను జనాలు కుక్కలనే పిలుస్తారు కదా? 621 00:47:10,747 --> 00:47:12,790 - ఏంటి? - అతని ఉద్దేశం సిమ్సా? 622 00:47:12,791 --> 00:47:15,502 - అతని భార్యనా? - ఏంటి? వద్దు, వద్దు. వద్దు. 623 00:47:20,966 --> 00:47:22,550 మనం ముందుకు సాగకూడదు… 624 00:47:22,551 --> 00:47:24,636 మరో అవకాశం వస్తుందంటావా? 625 00:47:35,939 --> 00:47:36,940 వాళ్లని… 626 00:47:38,317 --> 00:47:39,359 వాళ్లని కొనసాగించమని చెప్పు. 627 00:47:41,612 --> 00:47:42,737 ఓకే, డానీ. 628 00:47:42,738 --> 00:47:44,239 డెలీవరీ పని పూర్తి చేయండి. 629 00:47:54,291 --> 00:47:55,292 ఏంటి ఇది? 630 00:47:56,043 --> 00:47:59,880 మా బాస్ మమ్మల్ని అంతస్థుల వారీగా అన్ని పంపుల సర్వీసింగ్ పూర్తి చేయమని ఆదేశించారు. 631 00:48:03,383 --> 00:48:06,427 - దానికి ఆరుగురు కావాలా? - మిగతా అంతస్థుల విషయంలో అయితే అక్కర్లేదు. 632 00:48:06,428 --> 00:48:09,264 కానీ జ్యుడిషియల్ అంతస్థులో ఒక్క రాత్రిలోగా పని పూర్తి అయిపోవాలని చెప్పారు మాకు. 633 00:48:42,130 --> 00:48:43,131 హేయ్. 634 00:49:09,074 --> 00:49:10,200 హేయ్. 635 00:49:10,868 --> 00:49:12,411 హా. డానీ, ఏమైంది? 636 00:49:12,911 --> 00:49:14,705 డానీ ఎవడెహె? 637 00:49:18,083 --> 00:49:19,168 మాట్లాడుతోంది ఎవరు? 638 00:49:20,878 --> 00:49:22,087 నేను డెప్యూటీ కాల్సోని. 639 00:49:23,046 --> 00:49:25,382 - మేము 17వ అంతస్థులో ఉన్నాం. - పాట్రిక్. 640 00:49:27,718 --> 00:49:32,346 కాల్సో, నేను, డెప్యూటీ… క్రేన్ ని. దయచేసి చెప్పు. 641 00:49:32,347 --> 00:49:33,764 డెప్… డెప్యూటీ క్రేన్, హా, ఓకే. 642 00:49:33,765 --> 00:49:38,103 ఇక్కడ మాకు కాస్తంత ఇబ్బంది ఎదురైంది, కానీ, పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. 643 00:49:41,481 --> 00:49:44,817 డానీ? డానీ, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను డిశ్పాచ్ నుండి మాట్లాడుతున్నా. 644 00:49:44,818 --> 00:49:48,906 మీరు ఇప్పుడు డెలివరీ చేయాల్సిన పని లేదు. దయచేసి తిరిగి బేస్ కి వచ్చేయండి. 645 00:49:49,489 --> 00:49:50,490 అయ్య బాబోయ్! 646 00:49:51,158 --> 00:49:53,451 - ఈ… ఈ డానీ ఎవరు? - కాల్సో, కాస్త లైన్ నుండి తప్పుకుంటావా? 647 00:49:53,452 --> 00:49:55,453 నోర్మూసేసుకో. డానీ, నీకు నా సందేశం అందిందా? 648 00:49:55,454 --> 00:49:58,664 నా మాటలు వినిపిస్తున్నాయా? మీరు ఇప్పుడు డెలివరీ చేయాల్సిన పని లేదు… 649 00:49:58,665 --> 00:50:00,958 ఆపేయండి! ఆపేయండి! 650 00:50:00,959 --> 00:50:02,669 దయచేసి తిరిగి బేస్ కి వచ్చేయండి. 651 00:50:04,254 --> 00:50:07,716 - ఆపండి! ఆపండి! - ఆపండి! ఆపండి! ఆపండి! 652 00:50:09,343 --> 00:50:10,344 - ఆపండి! - ఆపండి! 653 00:50:13,639 --> 00:50:14,764 డానీని మాట్లాడుతున్నా. 654 00:50:14,765 --> 00:50:18,477 - హా. చెప్పు, డానీ. - పని ఆపేశాం. తిరిగి బేస్ కి వస్తున్నాం. 655 00:50:26,568 --> 00:50:27,569 హమ్మయ్య. 656 00:50:28,737 --> 00:50:31,573 మార్తా, నీ దగ్గర తాగడానికి డ్రింక్ ఏమైనా ఉందా? 657 00:50:32,574 --> 00:50:34,409 మంచి సరుకే తీస్తా. 658 00:50:40,499 --> 00:50:43,793 కాల్సో. కాల్సో, నేను, క్రేన్ ని. 659 00:50:43,794 --> 00:50:45,170 నా… నా మాటలు వినిపిస్తున్నాయా? 660 00:50:54,763 --> 00:50:57,390 ఏం జరుగుతోందో చెప్తారా? 661 00:50:57,391 --> 00:50:59,559 ప్లీజ్. నన్నేం చేయాలనుకుంటున్నారు? 662 00:50:59,560 --> 00:51:02,228 ఏమీ, నోర్మూసేయ్. సరేనా? 663 00:51:02,229 --> 00:51:04,021 కమీల్, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? 664 00:51:04,022 --> 00:51:05,274 ఇక్కడికి ఎందుకు వచ్చామా? 665 00:51:08,652 --> 00:51:12,906 మనం ఎవరికీ కనిపించని, మన మాటలు ఎవరికీ వినిపించని చోటికి నిన్ను తీసుకువద్దామనుకున్నా, 666 00:51:13,657 --> 00:51:14,992 ఎందుకంటే మనం కాస్త మాట్లాడుకోవాలి. 667 00:51:16,994 --> 00:51:18,412 - సరే. - ఓకే. 668 00:51:19,329 --> 00:51:23,541 నువ్వు చేసే పని ఆపేయమని నీకు చెప్పా, రాబర్ట్, 669 00:51:23,542 --> 00:51:24,751 కానీ నువ్వు ఆపలేదు. 670 00:51:25,252 --> 00:51:27,128 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు నిజంగానే అర్థం కావట్లేదు. 671 00:51:27,129 --> 00:51:29,715 నువ్వు మన కొడుకుని వాడుకున్నావు! 672 00:51:30,883 --> 00:51:33,844 ఆంథనీ ఇంటికి తీసుకువచ్చిన జాకెట్ ఉందే? 673 00:51:34,469 --> 00:51:35,596 అది అసలు వాడిది కానే కాదు. 674 00:51:40,976 --> 00:51:42,352 హా. 675 00:51:49,776 --> 00:51:53,988 ఒకవేళ నువ్వు నీటిలో ఆ మతిమరుపు మందులను కలపడం ఆపగలిగితే… 676 00:51:53,989 --> 00:51:55,239 ఏం చేస్తున్నావు అసలు నువ్వు? 677 00:51:55,240 --> 00:51:57,825 - నిన్ను అదొక్కటే కోరుతున్నా, దాన్ని ఆపేయ్. - నువ్వేం చేస్తున్నావు, రాబ్? 678 00:51:57,826 --> 00:52:01,245 - చెప్పు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. - నువ్వు ఆ పని ఆపాలి. ఆపాలి. 679 00:52:01,246 --> 00:52:02,956 - ఆ మందు వల్ల… - నువ్వేం చేస్తున్నావో చెప్పు! 680 00:52:04,666 --> 00:52:07,753 దీని గురించి తన దగ్గర కాకుండా ఇంకెక్కడికి అయినా వెళ్లి మాట్లాడుకుందామా? 681 00:52:08,420 --> 00:52:10,464 ఏమీ? ఏమీని చంపి పారేస్తా. 682 00:52:11,256 --> 00:52:13,633 - వద్దు, వద్దు! ప్లీజ్! - వద్దు, వద్దు! 683 00:52:13,634 --> 00:52:16,135 - వద్దు! ప్లీజ్, ఆపేయ్… ప్లీజ్! - నిజం చెప్పు. నిజం చెప్పు నాకు. 684 00:52:16,136 --> 00:52:17,137 ప్లీజ్. 685 00:52:19,848 --> 00:52:21,350 నువ్వు ఇలాంటివేం చేయలేదా, ఏంటి! 686 00:52:24,770 --> 00:52:26,313 నేను దీనికన్నా దారుణమైన పనులు చేశా. 687 00:52:28,190 --> 00:52:29,399 అది నిజమే. 688 00:52:30,692 --> 00:52:33,570 నువ్వు చేసేది కరెక్ట్ అయినా… నేను చేసేది కరెక్ట్ అయినా… 689 00:52:36,657 --> 00:52:39,368 మన కొడుక్కి నేను గుర్తున్నా లేకున్నా… 690 00:52:42,579 --> 00:52:49,336 అతని తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా హంతకులు కాకుండా ఉండాల్సిన అవసరముంది. 691 00:53:09,398 --> 00:53:10,524 ఏంటది? 692 00:53:12,150 --> 00:53:13,193 డ్యానియల్ కి తెలుసు. 693 00:53:28,917 --> 00:53:29,918 అది డ్రిల్లింగ్ మెషిన్. 694 00:53:31,587 --> 00:53:34,798 చాలా పెద్ద డ్రిల్లింగ్ మెషిన్. 695 00:54:23,055 --> 00:54:25,057 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్