1 00:00:11,428 --> 00:00:12,596 ఎక్కడ ఉన్నావు? 2 00:00:21,605 --> 00:00:22,981 ట్రాయ్? 3 00:00:26,318 --> 00:00:27,527 ట్రాయ్? 4 00:00:27,528 --> 00:00:28,820 శ్వాస తీసుకుంటూ ఉండు, బాసూ. 5 00:00:29,821 --> 00:00:31,782 శ్వాస తీసుకోవడం ఆపకు. నన్ను చూడు. 6 00:00:34,451 --> 00:00:35,994 శ్వాస తీసుకుంటూ ఉండు. నీకేం కాదు. 7 00:00:36,787 --> 00:00:38,705 శ్వాస ఆపకుండా తీసుకో, ట్రాయ్. అంతే. 8 00:00:39,706 --> 00:00:41,499 శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించు. 9 00:00:41,500 --> 00:00:43,376 ఓకే. ఓకే. 10 00:00:43,377 --> 00:00:45,337 శాంతించు. నా మాటలు వినిపిస్తున్నాయా? 11 00:00:45,838 --> 00:00:48,674 ఓకే. మేము రాపిడ్-సీక్వెన్స్ ప్రక్రియ ద్వారా నిన్ను మేల్కొల్పాల్సి వచ్చింది, క్షమించు. 12 00:00:49,341 --> 00:00:50,508 సర్. 13 00:00:50,509 --> 00:00:52,134 అయ్య బాబోయ్. అవును. 14 00:00:52,135 --> 00:00:54,262 చూడు, నీ శరీర ఉష్ణోగ్రత పడిపోతోంది. 15 00:00:54,263 --> 00:00:56,556 మేము ఉష్ణోగ్రతని పెంచే థర్మల్ ఫ్లష్ ప్రక్రియ మొదలుపెడుతున్నాం, సరేనా? 16 00:00:56,557 --> 00:00:57,558 ఎంత… 17 00:00:59,643 --> 00:01:00,726 ఎంత కాలం? 18 00:01:00,727 --> 00:01:01,895 ఏడేళ్లు. 19 00:01:02,604 --> 00:01:03,814 కానివ్వు. ఇది కొరుకు. 20 00:01:05,691 --> 00:01:07,609 సరే మరి. ఎక్కిస్తున్నా. 21 00:01:10,112 --> 00:01:13,573 ఓకే. ఎక్కిస్తున్నా. ఎక్కుతోంది. ఎక్కుతోంది, ఎక్కేస్తోంది. 22 00:01:13,574 --> 00:01:16,451 అయిపోయింది. అంతే. అంతే. 23 00:01:17,703 --> 00:01:18,786 ఇతని కాళ్లు పట్టుకో. 24 00:01:18,787 --> 00:01:19,788 అయిపోయిందిలే. 25 00:01:21,874 --> 00:01:22,875 ఇతని కాళ్లు పట్టుకో! 26 00:02:18,472 --> 00:02:20,097 నిద్ర బాగానే పోయావా? 27 00:02:20,098 --> 00:02:22,892 నిద్ర కాదు అసలు సమస్య. మేల్కొనేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి. 28 00:02:22,893 --> 00:02:24,520 అవునులే, సారీ. నీళ్లు తాగు. 29 00:02:26,480 --> 00:02:29,274 - ఇంతకంటే మంచి పద్ధతి ఇంకోటి ఉంటే బాగుంటుంది. - మేము దానిపై కసరత్తు చేస్తాం. 30 00:02:32,611 --> 00:02:34,446 ఇది రెండు రోజుల క్రితం రికార్డ్ అయింది. 31 00:02:35,739 --> 00:02:37,782 వాల్టులోకి ఎందుకు వచ్చావు? 32 00:02:37,783 --> 00:02:39,992 ఇక్కడికి నాన్న నన్ను పంపాడు. ఏమన్నాడంటే… 33 00:02:39,993 --> 00:02:41,370 నీ పేరేంటి? 34 00:02:42,913 --> 00:02:43,996 జిమ్మీ. 35 00:02:43,997 --> 00:02:46,791 మీ నాన్న పేరు రసెల్ కాన్రాయ్. ఆయన ఐటీ హెడ్. 36 00:02:46,792 --> 00:02:47,876 ఏ సైలో ఇది? 37 00:02:49,878 --> 00:02:51,547 ఆయన ఏం చెప్పాడు, జిమ్మీ? 38 00:02:52,589 --> 00:02:54,716 ఏం జరిగినా, లోపలికి ఎవరినీ రానివ్వవద్దని అన్నాడు. 39 00:02:55,926 --> 00:02:57,636 నీతో పెద్దవారు ఎవరైనా ఉన్నారా? 40 00:02:58,303 --> 00:03:02,641 నన్ను ఇక్కడికి సోలో తీసుకొచ్చాడు, కానీ మళ్లీ తిరుగుబాటుదారులతో పోరాడటానికని వెళ్లిపోయాడు. 41 00:03:05,102 --> 00:03:06,227 ఏ సైలో? 42 00:03:06,228 --> 00:03:07,271 పదిహేడవ సైలో. 43 00:03:07,855 --> 00:03:10,982 క్లీనింగ్ పని విఫలమవ్వడంతో మొదలైంది ఇదంతా. అతను కనిపించకుండా పోవడంతో పరిస్థితి ఇంకా ముదిరింది. 44 00:03:10,983 --> 00:03:13,359 దాంతో వాళ్లు బయటకెళ్తే ఏం కాదని అనుకున్నారు కదా. 45 00:03:13,360 --> 00:03:16,488 అవును. తిరుగుబాటుకు షెరిఫే నాయకత్వం వహించాడు. 46 00:03:16,989 --> 00:03:20,741 వాళ్లని ఐటీకి దూరంగా ఉంచడానికి, ఐటీ షాడో, బ్రిడ్జిని పేల్చేశాడని అనుకుంటున్నాం, 47 00:03:20,742 --> 00:03:22,536 కానీ ఎలాగో తెలీదు కానీ, షెరిఫ్ అవతలి వైపుకు చేరుకున్నాడు. 48 00:03:23,412 --> 00:03:26,664 అతను ఆ పిల్లాడి తండ్రి అయిన ఐటీ హెడ్ ని వాల్ట్ దగ్గరికి తీసుకెళ్లి, 49 00:03:26,665 --> 00:03:31,211 ఆ పిల్లాడు కనుక తలుపు తెరవకపోతే వాళ్ల నాన్న తలలోకి బుల్లెట్ దిగుతుందని బెదిరించాడు. 50 00:03:34,923 --> 00:03:36,175 కానీ ఆ పిల్లాడు తలుపు తెరవలేదు. 51 00:03:36,967 --> 00:03:38,010 అబ్బా. 52 00:03:38,719 --> 00:03:40,178 - హా. - ఇది ఎప్పుడు జరిగింది? 53 00:03:40,179 --> 00:03:41,345 రెండు గంటల క్రితం. 54 00:03:41,346 --> 00:03:43,556 ఇన్ని జరిగాయంటే రక్షణాత్మక చర్యను అమలు చేయాల్సిందే. 55 00:03:43,557 --> 00:03:46,935 హా, రక్షణాత్మక చర్యను అమలు చేయాలని చూశాం, కానీ కాంపౌండుని డెలివర్ చేయలేకపోయాం. 56 00:03:47,477 --> 00:03:49,645 పైప్ లైనులో ప్రెజర్ తగ్గనే లేదు. 57 00:03:49,646 --> 00:03:52,398 మేమింకా నిర్ధారించలేదు అది యాంత్రిక లోపం వల్ల జరిగిందా, లేదంటే… 58 00:03:52,399 --> 00:03:54,901 లేదా వాళ్లు ఆ డెలివరీ పైపును కనుగొని, మూసేసి ఉంటారు. 59 00:03:54,902 --> 00:03:56,528 - హా. - అలా గతంలో వేరే సైలో వాళ్లు కూడా చేశారుగా. 60 00:03:58,155 --> 00:04:00,740 కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈసారి ఫలితం వేరేలా ఉండాలి. 61 00:04:00,741 --> 00:04:01,908 అందుకే కదా నన్ను లేపింది. 62 00:04:01,909 --> 00:04:03,202 అవును. 63 00:04:05,537 --> 00:04:06,997 నువ్వు బాగానే ఉన్నావా? 64 00:04:08,415 --> 00:04:09,707 హా. 65 00:04:09,708 --> 00:04:11,125 ఏరియల్ సర్వేలెన్స్ చేస్తున్నారా? 66 00:04:11,126 --> 00:04:12,669 ఆపరేషన్స్ వాళ్లు ఓ డ్రోన్ తో గమనిస్తున్నారు. 67 00:04:18,716 --> 00:04:20,009 ఏమైనా అప్ డేట్ ఉందా? 68 00:04:20,010 --> 00:04:21,220 ఇంకా ఏం లేదు. 69 00:04:22,721 --> 00:04:26,183 ట్రాయ్, ఈమె పేరు సూసన్. ఇప్పుడు షిఫ్టులో ఉన్న మన సీనియర్ డ్రోన్ కమాండర్. 70 00:04:29,061 --> 00:04:30,478 మీ దగ్గర పేలోడ్ ఎంత ఉంది? 71 00:04:30,479 --> 00:04:33,524 ముప్పై లీటర్ల కాంపౌండ్, రెండు వేల రౌండ్ల మందుగుండు సామాగ్రి. 72 00:04:46,828 --> 00:04:48,205 నాకు నమ్మకం లేదు. 73 00:04:59,383 --> 00:05:02,094 సర్, సైలో 17 తలుపులు తెరుచుకుంటున్నాయి. 74 00:05:10,811 --> 00:05:11,895 బాబోయ్. 75 00:05:28,495 --> 00:05:29,663 మీ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నాం! 76 00:05:35,752 --> 00:05:36,753 ట్రాయ్. 77 00:05:38,839 --> 00:05:42,133 ప్రస్తుతానికి ఏమీ చేయవద్దు. అప్పుడే కాదు. 78 00:05:42,134 --> 00:05:45,219 వాళ్లు ఎక్కువ సేపు బయట ఉంటే, ఇంకో సైలోని చూసి, దాని దగ్గరికి వెళ్లే ప్రమాదముంది. 79 00:05:45,220 --> 00:05:47,597 చూడు, వాళ్లని మళ్లీ లోపలికి ఎలా పంపించాలో చూద్దాం. 80 00:05:47,598 --> 00:05:49,724 ఫార్వర్డ్ వాల్ట్ డోర్ దగ్గర ఉన్న పైపును వాడదాం. 81 00:05:49,725 --> 00:05:51,475 దాని ద్వారా రక్షణాత్మక చర్యని అమలు చేద్దాం. 82 00:05:51,476 --> 00:05:54,187 వాళ్ల గ్రౌండ్ వాటర్ పంప్ పని చేయట్లేదు. జెనరేటర్ పైకి నీళ్లు వచ్చేశాయి. 83 00:05:54,188 --> 00:05:55,771 మనం ఫార్వర్డ్ వాల్ట్ డోర్లను వాడలేం. 84 00:05:55,772 --> 00:05:57,064 సూసన్. 85 00:05:57,065 --> 00:06:00,276 టెక్నీషియన్లందరినీ పంపించేసి, అందుబాటులో ఉన్న పైలట్లందరినీ వెంటనే రప్పిద్దాం. 86 00:06:00,277 --> 00:06:03,906 ఇంకా డ్రోన్లను ఎగరేయండి. పదింటిలోకి మందుగుండు సామగ్రి ఎక్కించాలి. ఇరవై డ్రోన్లలోకి కాంపౌండ్ ఎక్కించాలి. 87 00:06:04,823 --> 00:06:08,117 వాటిని చాలా ఎత్తులో ఉంచాలి. బయటకొచ్చిన వారికి అవి కనిపించకూడదు, వాటి శబ్దం వినిపించకూడదు. 88 00:06:08,118 --> 00:06:09,577 ఎవరైనా గట్టు పైకి వెళ్తే తప్ప, 89 00:06:09,578 --> 00:06:12,288 వాళ్ల సంఖ్య 9,500కి చేరే వరకు నన్ను అప్రమత్తం చేయవద్దు. 90 00:06:12,289 --> 00:06:13,332 నాకు ఆకలేస్తోంది. 91 00:06:43,820 --> 00:06:45,405 బాబోయ్, ఇది ఏడ్చినట్టు ఉంది. 92 00:06:46,573 --> 00:06:49,076 అవును. పైగా కొంచెం కొంచెమే వడ్డిస్తారు. 93 00:06:51,161 --> 00:06:52,162 ఆ-హా. 94 00:06:52,871 --> 00:06:53,914 అది పాత జోకేలే. 95 00:07:01,880 --> 00:07:03,381 నాకు ఇదెందుకో నచ్చట్లేదు. 96 00:07:03,382 --> 00:07:05,633 వాళ్లు పైపును మూసేశారు కాబట్టి, సైలో లోపల రక్షణాత్మక చర్యని అమలు చేయలేం. 97 00:07:05,634 --> 00:07:08,386 బయటకి వచ్చి, వాళ్లు మనకి మరో అవకాశం ఇస్తున్నారు. 98 00:07:08,387 --> 00:07:11,890 రక్షణాత్మక చర్యలు అంటే, అవి సైలో లోపల జరగాలి. 99 00:07:13,684 --> 00:07:14,768 అప్పుడు ఇన్ఫెక్షన్ సోకదు. 100 00:07:15,269 --> 00:07:19,398 నువ్వు అనుకున్నట్టు చేస్తే, సైలో బయట రక్షణాత్మక చర్యని అమలు చేసినట్టవుతుంది. 101 00:07:19,982 --> 00:07:22,400 వాళ్ల చావులు భయంకరంగా ఉంటాయి. 102 00:07:22,401 --> 00:07:24,610 - అది కూడా ఆరుబయట. - మనకి మరో మార్గమేం లేదు కదా. 103 00:07:24,611 --> 00:07:26,612 మన వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారో ఏమో. 104 00:07:26,613 --> 00:07:30,950 మనవాళ్లు మానసిక వేదనకి గురై, వాళ్ల మనోస్థైర్యం, మిషన్ ని హ్యాండిల్ చేసే తీరు దెబ్బతింటాయేమో అని నా భయం. 105 00:07:30,951 --> 00:07:35,413 డైరెక్టివ్ ప్రకారం, సైలోల మధ్య సంబంధాలను నివారించడమే అత్యంత కీలకం, దాని తర్వాతే ఏదైనా. 106 00:07:35,414 --> 00:07:36,622 అది నేను అర్థం చేసుకోగలను. 107 00:07:36,623 --> 00:07:38,249 - లేదు, ఏంటో చెప్పు. - నేను చెప్పేది అది కాదు. 108 00:07:38,250 --> 00:07:39,542 అంతా దానిపైనే ఆధారపడి ఉంది. 109 00:07:39,543 --> 00:07:41,961 - అది కాదు నేను చెప్పేది… - ఎక్స్ క్యూజ్ మీ, సర్. 110 00:07:41,962 --> 00:07:43,172 బయటకొచ్చిన వాళ్లు గట్టుపైకి ఎక్కారు. 111 00:07:43,755 --> 00:07:44,756 అయ్య బాబోయ్. 112 00:07:45,424 --> 00:07:47,341 హేయ్, నీ పైలట్లకి ఏం కాకుండా నేను చూసుకుంటా. 113 00:07:47,342 --> 00:07:48,426 ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 114 00:07:48,427 --> 00:07:49,428 సరే. 115 00:08:17,164 --> 00:08:19,291 జెంకిన్స్, నువ్వు షెరిఫ్ ని గమనిస్తూ ఉండు. 116 00:08:38,977 --> 00:08:40,312 మొత్తం ఎంతమంది ఉన్నారు? 117 00:08:41,395 --> 00:08:43,857 9,832 మంది. 118 00:08:46,026 --> 00:08:47,444 ఆపరేషన్ ఎలా చేయాలో చెప్తా, వినండి. 119 00:08:47,945 --> 00:08:50,447 మొదటి గ్రూప్, షెరిఫ్, ఇంకా అతని కుటుంబం సంగతి చూసుకుంటుంది. 120 00:08:51,198 --> 00:08:54,743 గ్రూప్ 2, ర్యాంప్ దగ్గర కాంపౌండుని ప్రయోగిస్తుంది, దాని వల్ల వాళ్లు మళ్లీ లోపలికి వెళ్లకుండా ఉంటారు. 121 00:08:55,619 --> 00:08:58,496 టార్గెట్ ఏరియా అంతా కాంపౌండుతో నిండిపోయే వరకు, 122 00:08:58,497 --> 00:09:00,874 గ్రూప్స్ 3, 4 ఒకదాని తర్వాత ఒకటి చక్కర్లు కొడుతూ పర్యవేక్షిస్తాయి. 123 00:09:01,750 --> 00:09:04,794 గ్రూప్స్ 5, 6 ఆదేశాలు అందగానే లక్ష్యాలపై దాడి చేయాలి. అర్థమైందా? 124 00:09:04,795 --> 00:09:07,047 - అయింది, సర్. - మంచిది. ఇక మొదలుపెట్టండి. 125 00:09:12,970 --> 00:09:15,012 - గ్రూప్స్, రిపోర్ట్ చేయండి. - గ్రూప్ 1, సిద్ధం. 126 00:09:15,013 --> 00:09:17,014 గ్రూప్ 2, సిద్ధం. 127 00:09:17,015 --> 00:09:18,641 - గ్రూప్ 3, సిద్ధం. - గ్రూప్ 4, సిద్ధం. 128 00:09:18,642 --> 00:09:19,934 గ్రూప్ 5, సిద్ధం. 129 00:09:19,935 --> 00:09:20,936 గ్రూప్ 6, సిద్ధం. 130 00:09:29,361 --> 00:09:30,863 నువ్వు ఎప్పుడంటే అప్పుడు, సూసన్. 131 00:09:33,740 --> 00:09:34,741 సూసన్? 132 00:09:42,249 --> 00:09:43,250 సర్. 133 00:09:48,589 --> 00:09:50,673 షెరిఫ్ పై, అతని కుటుంబంపై మనం దాడి చేసినప్పుడు, 134 00:09:50,674 --> 00:09:53,926 మిగతా వాళ్లందరూ సైలోలోకి వెళ్లిపోవాలని చూస్తారు. 135 00:09:53,927 --> 00:09:55,887 దాన్ని నివారించడానికే ర్యాంప్ దగ్గర కాంపౌండుని ప్రయోగిస్తున్నాం. 136 00:09:55,888 --> 00:09:58,140 కానీ మనం వాళ్లని లోపలికి వెళ్లనిచ్చేస్తే, 137 00:09:59,266 --> 00:10:00,684 వాళ్లు మళ్లీ బయటకు రారు. 138 00:10:01,476 --> 00:10:03,352 అప్పుడు తిరుగుబాటూ ముగుస్తుంది, 139 00:10:03,353 --> 00:10:06,189 వీళ్లు వేరే సైలోలోకి వెళ్లే అవకాశమూ ఉండదు. 140 00:10:06,190 --> 00:10:08,901 దానితో ఒప్పందాన్ని మించినదేదీ లేదని నొక్కి చెప్పినట్టూ ఉంటుంది. 141 00:10:18,035 --> 00:10:20,078 లక్ష్యాలను గురిపెట్టే ఉంచండి, దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. 142 00:10:28,253 --> 00:10:30,881 వాళ్లలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు, సర్. 143 00:10:32,466 --> 00:10:33,717 నేను ఈ పని చేయలేను. 144 00:10:48,899 --> 00:10:49,900 నిన్ను తొలగిస్తున్నా. 145 00:11:06,708 --> 00:11:09,211 ఆపరేషన్ కమాండ్ బాధ్యతలు మారిన విషయాన్ని రికార్డుల్లో నమోదు చేద్దాం. 146 00:11:16,301 --> 00:11:19,595 సైలో 17లోని జనాలు బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 147 00:11:19,596 --> 00:11:21,348 ఇప్పుడు వాళ్లకి ఒప్పందం వర్తించదు, 148 00:11:22,558 --> 00:11:24,893 కానీ డైరెక్టివ్ వర్తిస్తుంది. 149 00:11:25,853 --> 00:11:26,854 అలాగే, సర్. 150 00:11:29,690 --> 00:11:33,693 మొదటి రెండు గ్రూప్స్, నేను ఆదేశం ఇవ్వగానే మొదలుపెట్టాలి. 151 00:11:33,694 --> 00:11:35,529 గ్రూప్ 2, కాంపౌండుని రిలీజ్ చేయ్. 152 00:11:53,130 --> 00:11:54,214 నాకు ఎయిర్ లాక్ ని చూపించండి. 153 00:11:58,260 --> 00:12:00,637 గ్రూప్ 1, లక్ష్యాలని ఛేదించు. 154 00:12:09,813 --> 00:12:10,814 నిర్ధారించుకో. 155 00:12:26,205 --> 00:12:27,706 గ్రూప్స్ 3, 4, ఇక మీరు మొదలుపెట్టండి. 156 00:12:39,593 --> 00:12:43,055 గ్రూప్స్ 5, 6, 500 అడుగులు కిందికి దిగి, ఇష్టారీతిన కాల్పులు జరపండి. 157 00:12:57,528 --> 00:12:58,529 థర్మల్ వ్యూని చూపెట్టండి. 158 00:13:17,089 --> 00:13:18,298 ఆడియోను తీసేయండి. 159 00:13:39,111 --> 00:13:41,237 సరే, ఆ గాలి ఎటు వైపు వీస్తోంది? 160 00:13:41,238 --> 00:13:44,657 గ్రూప్ 3, ఆగ్నేయ ప్రాంతంలో రెండవసారి ప్రయోగించు. 161 00:13:44,658 --> 00:13:46,869 గ్రూప్ 5, చూస్తున్నావా? కుడి పక్క కొందరు పారిపోతున్నారు. 162 00:13:47,452 --> 00:13:48,620 దాన్ని కాస్త జూమ్ చేసి చూపగలవా? 163 00:13:50,414 --> 00:13:51,582 సరే, ఇంకా ఎంత మంది బతికి ఉన్నారు? 164 00:13:52,207 --> 00:13:54,750 2,453 మంది, సర్. 165 00:13:54,751 --> 00:13:56,128 ఆ సంఖ్యని తగ్గించండి. 166 00:15:21,129 --> 00:15:24,591 ఇప్పటివరకు నేను మాట్లాడిన పైలట్లను గమనిస్తే, వారు ఏదో తెలియని ఉద్వేగంలో ఉన్నట్లు అనిపిస్తోంది. 167 00:15:25,259 --> 00:15:26,885 నేను తక్కువగా అంచనా వేసినట్టున్నా వాళ్ల… 168 00:15:27,970 --> 00:15:28,971 ఏంటి? 169 00:15:30,264 --> 00:15:31,348 ఏమో, వాళ్ల… 170 00:15:32,182 --> 00:15:33,600 మేము ప్రొఫెషనల్స్, విక్టర్. 171 00:15:34,393 --> 00:15:35,893 మేం శిక్షణ తీసుకున్నది ఇలాంటి క్షణాల కోసమే. 172 00:15:35,894 --> 00:15:39,439 హా. కానీ నువ్వు అంతకుమించి, ట్రాయ్. 173 00:15:40,357 --> 00:15:41,858 నేను డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తుంటా. 174 00:15:41,859 --> 00:15:42,985 అందరమూ అంతేగా. 175 00:15:43,735 --> 00:15:44,987 డగ్. ర్యాండీ. 176 00:15:47,447 --> 00:15:49,115 మేడమ్ డైరెక్టర్. 177 00:15:49,116 --> 00:15:52,201 స్వాగతం, పాత మిత్రులారా. చాలా షిఫ్టుల తర్వాత కలుసుకున్నాం మనం. 178 00:15:52,202 --> 00:15:53,327 మీరు చాలా బాగున్నారు. 179 00:15:53,328 --> 00:15:57,457 అవునా? కానీ నాకు చాలా దారుణంగా ఉంది. ర్యాపిడ్ సీక్వెన్స్ ప్రక్రియ నా ఒంటికి అస్సలు పడేలా లేదు. 180 00:15:57,958 --> 00:15:59,167 క్షమించండి. 181 00:15:59,168 --> 00:16:00,627 మరో దారేం లేదు కదా. 182 00:16:01,128 --> 00:16:04,005 కూర్చోండి. క్షమించాలి, నేను తినేశాను. 183 00:16:04,006 --> 00:16:05,673 కానీ మీకు టీ ఇవ్వమంటారా? 184 00:16:05,674 --> 00:16:08,593 టీ. తప్పకుండా, చాలా సంతోషం. ఇది మీ మంచితనానికి నిదర్శనం. 185 00:16:08,594 --> 00:16:12,722 ఇప్పుడు నువ్వు అదరగొట్టేశావు, కాబట్టి నీకు ఏమైనా స్పెషల్ గా చేయాలి కదా. 186 00:16:12,723 --> 00:16:15,100 టీని నేను సర్వ్ చేస్తాలే. 187 00:16:16,268 --> 00:16:19,896 మనం చేపట్టిన ఈ సుదీర్ఘమైన, సంక్లిష్టమైన మిషన్లో 188 00:16:19,897 --> 00:16:23,567 మధ్యాహ్నం పూట టీ లేకపోతే నేను నెట్టుకురాలేనని నాకు మొదటే అర్థమైపోయింది. 189 00:16:24,401 --> 00:16:26,612 సరఫరాలు తగ్గుతూ ఉన్నప్పటికీ. 190 00:16:29,448 --> 00:16:30,449 ట్రాయ్. 191 00:16:31,491 --> 00:16:34,036 క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు చూపిన స్థిరత్వానికి, 192 00:16:34,661 --> 00:16:38,247 విలక్షణమైన నీ నాయకత్వానికి మెచ్చి, నీకు మెరిట్ సర్టిఫికెట్ ఇస్తున్నాను. 193 00:16:38,248 --> 00:16:41,293 థ్యాంక్యూ, మేడమ్, కానీ నేను నా పని చేశానంతే. 194 00:16:42,044 --> 00:16:43,628 ఎంత అణకువో ఇతనికి. 195 00:16:43,629 --> 00:16:45,087 తిరుగుబాటులు మనకి కొత్తేం కాదు, 196 00:16:45,088 --> 00:16:48,549 కానీ ఈ స్థాయిలో జనాలు బయటకు రావడమనేది ఎన్నడూ జరగలేదు. 197 00:16:48,550 --> 00:16:52,888 క్షణం కూడా ఆలస్యం కాకుండా నువ్వు తీసుకున్న దృఢమైన చర్యల వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. 198 00:16:54,515 --> 00:16:56,974 వాళ్లు వేరే సైలోలోకి వెళ్ళడం లాంటివేమైనా జరిగాయా? 199 00:16:56,975 --> 00:17:00,978 లేదు, 9,835 మంది బయటకొస్తే, అందరూ చనిపోయారు. 200 00:17:00,979 --> 00:17:02,772 సైలో లోపల ఎంత మంది బతికి ఉన్నారు? 201 00:17:02,773 --> 00:17:04,023 వంద మంది కూడా ఉండరు. 202 00:17:04,816 --> 00:17:05,900 వాళ్ళ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? 203 00:17:05,901 --> 00:17:07,318 వాళ్ల జెనరేటర్ పని చేయట్లేదు, 204 00:17:07,319 --> 00:17:10,488 కాబట్టి లోపల విద్యుత్తు ఉండదు, అంటే హీటింగ్, కూలింగ్ ఏమీ ఉండవు… 205 00:17:10,489 --> 00:17:12,656 కాకపోతే ఐటీ శాఖలో బయటి నుండి విద్యుత్తు సరఫరా అవుతోంది. 206 00:17:12,657 --> 00:17:16,203 కానీ దాన్ని నిలిపివేయాలంటే, మనం ఆ సెక్టారునే షట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. 207 00:17:17,329 --> 00:17:20,206 జెనరేటర్ పని చేయకపోతే, వాళ్ల మొక్కలు, పశుసంపద చనిపోతాయి, 208 00:17:20,207 --> 00:17:22,083 భూగర్భ నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది. 209 00:17:22,084 --> 00:17:24,293 వాళ్లు ఆకలితో అలమటించి చావకపోయినా, నీట మునిగి అయినా చనిపోతారు. 210 00:17:24,294 --> 00:17:27,171 ఐటీలో తనను తాను బంధించుకున్న ఆ కుర్రాడు 211 00:17:27,172 --> 00:17:29,340 - ఇంకా ప్రాణాలతో ఉన్నాడా? - అది పక్కాగా తెలీదు. 212 00:17:29,341 --> 00:17:31,551 అతని ద్వారా మనకి ఇక విలువైన సమాచారమేం దక్కదు, 213 00:17:31,552 --> 00:17:32,969 అందుకని కమ్యూనికేషన్స్ ని కట్ చేసేశాం. 214 00:17:32,970 --> 00:17:37,139 మంచిది. మరికొంత మంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారేమో, ఎందుకైనా మంచిది 215 00:17:37,140 --> 00:17:39,392 సాయుధ డ్రోన్ల పహారాను మరో మూడు ఏళ్ల పాటు కొనసాగిద్దాం. 216 00:17:39,393 --> 00:17:41,103 అయిదేళ్ళు అయితే మరింత మంచిది. 217 00:17:41,687 --> 00:17:42,855 అయిదేళ్లే కొనసాగిద్దాం. 218 00:17:43,897 --> 00:17:45,982 ఇప్పుడు సూసన్ గురించి మాట్లాడుకుందాం. 219 00:17:45,983 --> 00:17:50,988 నువ్వు తనని అరెస్ట్ చేయించావు, ట్రాయ్, కానీ విచారణ పూర్తయ్యే దాకా నేను తనని విడుదల చేయించాను. 220 00:17:52,573 --> 00:17:55,408 - తప్పకుండా, ఆ అధికారం మీకు ఉంది. - అలా అని ఊరుకుంటే ఎలా! 221 00:17:55,409 --> 00:17:57,703 ఆమెని ఎందుకు అరెస్ట్ చేయించావో తెలుసుకోవడానికి రమ్మన్నాను నిన్ను. 222 00:18:00,539 --> 00:18:03,749 ఆ సంఘటన జరిగినప్పుడు, డైరెక్టివ్ ద్వారా నాకు దక్కిన అధికారానికి లోబడి 223 00:18:03,750 --> 00:18:05,418 తను పని చేస్తూ ఉండింది. 224 00:18:05,419 --> 00:18:07,628 కానీ, తను ఏం చేసింది? 225 00:18:07,629 --> 00:18:08,797 నా ఆదేశాన్ని ధిక్కరించింది, 226 00:18:09,798 --> 00:18:13,385 పైగా, తన కింద ఉన్న పైలట్ల ముందు నా వ్యూహాన్ని ప్రశ్నించింది. 227 00:18:13,969 --> 00:18:17,054 తన ధిక్కారం వలన, మనకి సమయం వృథా అవ్వడమే కాకుండా, ఇతరుల్లో వ్యతిరేకత పెరిగి, 228 00:18:17,055 --> 00:18:18,723 అది తిరుగుబాటుకు కూడా దారి తీసి ఉండవచ్చు. 229 00:18:18,724 --> 00:18:20,641 - కానీ వాళ్లందరూ తమ పని చేశారు. - మంచిది. 230 00:18:20,642 --> 00:18:21,726 ఎవరూ తొణకలేదు, బెణకలేదు. 231 00:18:21,727 --> 00:18:23,936 కానీ, ఆ బయటకొచ్చిన వాళ్లు ఇంకాస్త ఉంటే గుట్టని ఎక్కేసి ఉండేవారు. 232 00:18:23,937 --> 00:18:25,313 ఇంకొన్ని నిమిషాల్లో, ఆ సైలో గ్రూపులో ఉన్న 233 00:18:25,314 --> 00:18:27,607 మిగతా ఆరు సైలోల్లోని జనాలకు వాళ్లు కనిపించి ఉండేవాళ్లు. 234 00:18:27,608 --> 00:18:29,150 ఆ పరిస్థితిలో ప్రతీ క్షణం కూడా విలువైనదే. 235 00:18:29,151 --> 00:18:31,862 దానికి ఏ చర్య అయితే తగినదని అంటావు? 236 00:18:39,661 --> 00:18:42,371 డైరెక్టివ్ లో ఏముందో చెప్పగలరా? 237 00:18:42,372 --> 00:18:43,707 మరణ శిక్ష. 238 00:18:44,875 --> 00:18:47,585 క్షమించాలి, అది సాధ్యపడదు. 239 00:18:47,586 --> 00:18:51,798 చూడు, తను సరిగ్గా నడుచుకోలేదు, నేను ఒప్పుకుంటా. 240 00:18:52,299 --> 00:18:54,967 కానీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు 241 00:18:54,968 --> 00:18:57,054 సూసన్ ప్రతిభ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 242 00:18:58,222 --> 00:19:00,515 అదీగాక, నా కూతురికి తను చాలా కావాల్సిన మనిషి. 243 00:19:00,516 --> 00:19:04,060 ప్రస్తుతానికి తనని డిమోట్ చేసి, నిద్రలోకి పంపిస్తే 244 00:19:04,061 --> 00:19:05,562 మేలని నా అభిప్రాయం. 245 00:19:06,313 --> 00:19:10,816 ట్రాయ్, ఇలాంటి అత్యవసర పరిస్థితులని సరిగ్గా హ్యాండిల్ చేయగలవనే నిన్ను స్పెషలిస్ట్ చేశాం. 246 00:19:10,817 --> 00:19:16,490 ప్రాజెక్ట్ తరఫున, నీ విశిష్ట సేవలను గుర్తిస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 247 00:19:24,665 --> 00:19:25,666 నువ్వు బాగానే ఉన్నావా? 248 00:19:27,501 --> 00:19:28,669 తను డైరెక్టర్. 249 00:19:30,337 --> 00:19:32,547 అది మామూలు బాధ్యత కాదు. మనం ఇప్పుడు క్రయో ఛాంబరుకు వెళ్లాలి. 250 00:19:32,548 --> 00:19:34,466 హా, ఒక్క మాట. 251 00:19:38,470 --> 00:19:39,471 మనం నీ ఆఫీసులో మాట్లాడుకోవచ్చా? 252 00:19:44,309 --> 00:19:46,311 ఒక మహిళ ఉంది. 253 00:19:47,312 --> 00:19:49,272 తను ఏ శాఖలో పని చేస్తోంది? 254 00:19:49,273 --> 00:19:50,523 తనెక్కడా పని చేయట్లేదు. 255 00:19:50,524 --> 00:19:51,525 నాకు… నాకేం… 256 00:19:52,985 --> 00:19:54,736 తను నా జ్ఞాపకమేమో అనుకుంటున్నా. 257 00:19:57,114 --> 00:20:00,366 నేను స్పృహలోకి వస్తున్నప్పుడు, కొన్ని క్షణాల పాటు ఆమె రూపం మెరుపులా అలా కనిపించి మాయమైంది. 258 00:20:00,367 --> 00:20:03,579 వాటిని గుర్తుపెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా, నా వల్ల కాలేదు. 259 00:20:09,293 --> 00:20:11,336 గతంలో నన్ను సీక్వెన్స్ ప్రక్రియ ద్వారా లేపినప్పుడు, 260 00:20:12,462 --> 00:20:14,755 ఈ మహిళ గురించి నీకు చెప్పినట్టు అనిపిస్తోంది. 261 00:20:14,756 --> 00:20:16,258 నువ్వు చెప్పుంటే, నీకు చెప్పుండేవాడిని కదా. 262 00:20:21,513 --> 00:20:24,433 ఎలాగో తెలీదు కానీ, తనకి, దీనికి ఏదో లింక్ ఉందనుకుంటా. 263 00:20:28,729 --> 00:20:30,105 అది ఎప్పుడు జరిగింది? 264 00:20:32,107 --> 00:20:34,483 - తెలీదు. - తను ఎవరో కూడా తెలీదా? 265 00:20:34,484 --> 00:20:36,737 తెలీదు. నీకు తెలుసేమో అనుకున్నా. 266 00:20:38,363 --> 00:20:39,865 తెలీదు, సారీ. 267 00:20:48,207 --> 00:20:50,583 చూడు, నీకు గత కాలానికి చెందిన రికార్డులకి యాక్సెస్ ఉంటుంది కదా… 268 00:20:50,584 --> 00:20:52,877 - ట్రాయ్. ట్రాయ్. - చెప్పు. 269 00:20:52,878 --> 00:20:55,671 అసలు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం కానీ, లక్ష్యం కానీ ఏంటంటే, 270 00:20:55,672 --> 00:20:57,340 గతం నుండి మనకు విముక్తి ప్రసాదించడమే. 271 00:20:57,341 --> 00:20:59,592 దాన్ని నువ్వు మర్చిపోతేనే మంచిది. 272 00:20:59,593 --> 00:21:01,553 హా, నువ్వేదంటే అది, విక్టర్. 273 00:21:03,138 --> 00:21:05,848 ఒకవేళ దానికి సంబంధించిన రికార్డు ఉన్నా, అది ఇప్పటికీ భద్రంగానే ఉన్నా, 274 00:21:05,849 --> 00:21:07,975 ఇలాంటివి అడగడం డైరెక్టివ్ ప్రకారం నిషిద్ధమని 275 00:21:07,976 --> 00:21:10,353 - సెనేటర్ స్పష్టం చేశారు. - నువ్వు రహస్యంగా ఉంచగలవనే… 276 00:21:10,354 --> 00:21:12,356 - కాబట్టి నువ్వు… - …నిన్ను అడుగుతున్నా, డాక్టర్. 277 00:21:14,525 --> 00:21:17,652 నేను ప్రాజెక్టుకి చాలా కీలకమని నిరూపించుకున్నా, కదా? 278 00:21:17,653 --> 00:21:19,320 అవును, అది నిజమే. అందులో ఏ సందేహమూ లేదు. 279 00:21:19,321 --> 00:21:21,990 కాబట్టి, నేను నిన్ను ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతున్నా, అంతే. 280 00:21:31,583 --> 00:21:32,584 ప్లీజ్. 281 00:21:46,348 --> 00:21:48,392 ఈ పని చేయడానికి 282 00:21:50,269 --> 00:21:51,603 నేను ఏదోక సాకు వెతకాల్సి ఉంటుంది. 283 00:21:57,192 --> 00:21:58,277 ఒకవేళ నాకు అది దొరికితే… 284 00:22:00,737 --> 00:22:02,948 నువ్వు తర్వాతిసారి మేల్కొనే సమయానికి నీకు సమాధానంతో సిద్ధంగా ఉంటా. 285 00:22:04,825 --> 00:22:06,118 మాటిస్తున్నా. 286 00:22:36,356 --> 00:22:37,357 మళ్లీ కలుద్దాం. 287 00:22:51,997 --> 00:22:53,749 ఎవరు ఎవరిని కలుస్తారో నేనూ చూస్తా. 288 00:23:21,318 --> 00:23:23,070 ఆమె ఎవరు? 289 00:23:30,827 --> 00:23:31,954 ట్రాయ్ 290 00:23:37,084 --> 00:23:42,381 ఆమె ఎవరు? 291 00:25:26,193 --> 00:25:27,653 హ్యూ హొవీ రాసిన "సైలో" బుక్ సిరీస్ ఆధారితమైనది 292 00:25:42,251 --> 00:25:43,710 పదండి! చలో, చలో! 293 00:25:56,974 --> 00:25:59,517 - సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయా? - సిద్ధంగా, లోడ్ అయి ఉన్నాయి. 294 00:25:59,518 --> 00:26:02,687 కనిపించిన ప్రతి రెయిడర్ ని పనిలో పెట్టి, వెంటనే వీటిని గనులకి తరలించే ఏర్పాటు చేయ్. 295 00:26:02,688 --> 00:26:03,771 అలాగే, మేడమ్. 296 00:26:03,772 --> 00:26:05,273 - ఎమర్సన్. - మేడమ్? 297 00:26:05,274 --> 00:26:07,359 వాళ్లు వీటిని తీసుకెళ్లడం జనాలు చూడాలి. 298 00:26:15,534 --> 00:26:16,785 అబ్బా. 299 00:26:24,960 --> 00:26:26,335 కూర్చోండి. 300 00:26:26,336 --> 00:26:28,796 జో, నేనేం నీకు తెలీని వాడిని కాదు. నా వల్ల ఏ ప్రమాదమూ లేదు. 301 00:26:28,797 --> 00:26:30,591 నా కొడుకుని చూడాలనుకుంటున్నా నేను. 302 00:26:31,091 --> 00:26:33,177 - అంతే. - అయితే అభ్యర్థనని సమర్పించాలి. 303 00:26:33,969 --> 00:26:37,973 నా కొడుక్కి చివరిసారిగా వీడ్కోలు చెప్పాలి. 304 00:26:39,600 --> 00:26:41,351 చాద్, నీకూ పిల్లలు ఉన్నారు. 305 00:26:43,562 --> 00:26:44,605 ప్లీజ్. 306 00:26:47,065 --> 00:26:48,066 నేను అడిగి చూస్తా. 307 00:27:02,956 --> 00:27:05,583 నేను… నేను కమీల్ కి అర్థమయ్యేలా చెప్పాలని చూశా, కానీ… 308 00:27:05,584 --> 00:27:07,461 హా, తను చాలా మొండిది. 309 00:27:08,212 --> 00:27:10,506 హా. అది నిజమే. 310 00:27:19,056 --> 00:27:20,974 మనం చేయగలిగినదంతా చేశాం, సిమ్స్. 311 00:27:21,808 --> 00:27:24,770 వాళ్లు పని విజయవంతంగా పూర్తి చేయగలరని మనం నమ్మాలి. 312 00:27:25,771 --> 00:27:27,022 ఒకవేళ వాళు విఫలమైతే? 313 00:27:33,111 --> 00:27:34,278 ఆగు. 314 00:27:34,279 --> 00:27:37,990 ఆగు, నువ్వు దీన్ని ఆపేయవచ్చు, నేను వచ్చేశా. నువ్వు కౌంట్ డౌనుని ఆపేయవచ్చు. 315 00:27:37,991 --> 00:27:41,245 నా రెయిడర్లు ఎదురుదాడి ప్రారంభించబోతున్నారు. సరేనా? 316 00:27:43,622 --> 00:27:44,914 నేను హ్యాండిల్ చేస్తున్నా! 317 00:27:44,915 --> 00:27:47,291 నీకు చాలా వెసులుబాటు ఇచ్చాను, 318 00:27:47,292 --> 00:27:49,669 కానీ ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేను. 319 00:27:49,670 --> 00:27:51,295 లేదు, లేదు, మేము… 320 00:27:51,296 --> 00:27:53,840 మేము గనుల్లోకి విషవాయువును వదులుతున్నాం, సరేనా? 321 00:27:53,841 --> 00:27:56,509 తిరుగుబాటుదారులు నిమిషాల్లోనే చనిపోతారు. కావాలంటే నువ్వూ చూడవచ్చు. 322 00:27:56,510 --> 00:27:58,303 నీ స్క్రీన్లపై నువ్వు చూడవచ్చు. 323 00:28:00,389 --> 00:28:01,639 కానీ… 324 00:28:01,640 --> 00:28:04,517 మమ్మల్ని ప్రయత్నించనివ్వు! సరేనా? 325 00:28:04,518 --> 00:28:06,061 దయచేసి మమ్మల్ని ప్రయత్నించనివ్వు! 326 00:28:17,906 --> 00:28:19,532 ఆపివేయండి - రీసెట్ చేయండి 327 00:28:19,533 --> 00:28:20,826 కౌంట్ డౌన్ రీసెట్ 328 00:28:22,369 --> 00:28:23,662 నీకు అయిదు నిమిషాలు ఇస్తున్నా. 329 00:28:27,249 --> 00:28:28,542 అది చాలదు. 330 00:28:31,795 --> 00:28:32,880 అది చాలదు. 331 00:28:34,006 --> 00:28:36,216 - అది చాలదు… - అయిదు నిమిషాలు ఇస్తున్నా. 332 00:28:51,356 --> 00:28:54,108 ప్రధాన, అలాగే అనుబంధ పంపులు సర్వసిద్ధంగా ఉన్నాయి. 333 00:28:54,109 --> 00:28:56,611 - వాల్వుల సంగతేంటి? - ప్రధాన వాల్వ్, గ్రూప్ వాల్వ్ తెరిచి ఉన్నాయి. 334 00:28:56,612 --> 00:28:57,820 సైలో వాల్వ్ సిద్ధంగా ఉంది. 335 00:28:57,821 --> 00:29:00,073 ప్రెషర్ పెంచే ప్రక్రియను మొదలుపెట్టండి. 336 00:29:02,034 --> 00:29:03,202 ఆ సమయం చాలదు. 337 00:29:05,245 --> 00:29:07,163 కానివ్వండి! పదండి, పదండి! 338 00:29:07,164 --> 00:29:08,707 అది ఇలా ఇవ్వు! ఇవ్వు! 339 00:29:14,463 --> 00:29:15,631 జాగ్రత్త! 340 00:29:20,761 --> 00:29:22,303 - షర్ల్, నీకేం కాలేదు కదా? - ఏం కాలేదు! 341 00:29:22,304 --> 00:29:24,723 కాంక్రీట్ ఫ్లోర్ కనిపిస్తోంది. నాకు రేబార్ కావాలి. 342 00:29:31,813 --> 00:29:33,232 పదండి, పదండి! 343 00:29:34,024 --> 00:29:35,358 రెయిడర్లు! 344 00:29:35,359 --> 00:29:37,318 - అబ్బా! టెడ్డీ! - హా? 345 00:29:37,319 --> 00:29:38,653 ఆ రెయిడర్లని కాస్త నిలువరించు. 346 00:29:38,654 --> 00:29:40,531 నాష్, హూవర్, నాతో రండి మీరు. 347 00:29:49,581 --> 00:29:51,625 దేవుడా. కానివ్వండి. 348 00:29:54,169 --> 00:29:55,170 అయ్యయ్యో. 349 00:30:06,223 --> 00:30:08,433 ట్యాంకులని పడేయండి! వాటిని పడేయండి! 350 00:30:20,153 --> 00:30:21,238 వదలండి! 351 00:30:22,865 --> 00:30:23,907 వదలండి! 352 00:30:25,117 --> 00:30:26,242 కదిలారో చంపేస్తాం! 353 00:30:26,243 --> 00:30:28,996 ఇది మీరు చేయగలరు. అందరూ ఆగకుండా ముందుకు పదండి! 354 00:30:37,462 --> 00:30:38,714 షర్ల్, టార్చ్ ఇవ్వు. 355 00:30:41,967 --> 00:30:43,093 పైప్ కనిపిస్తోంది. 356 00:30:44,553 --> 00:30:45,554 ఇదిగో. 357 00:30:46,597 --> 00:30:48,723 రెయిడర్లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, తమ స్థానాల్లోకి చేరుకుంటున్నారు. 358 00:30:48,724 --> 00:30:50,224 ఓకే, వాళ్లు చేరు… 359 00:30:50,225 --> 00:30:55,022 అది… అది మాత్రం చేయవద్దు, సరేనా? చేయవద్దు. బతిమాలుతున్నా, చేయవద్దు! 360 00:30:57,566 --> 00:30:58,942 ఏదోకటి చెప్పి చావు! 361 00:30:59,943 --> 00:31:01,153 ఏదోకటి చెప్పు! 362 00:31:06,033 --> 00:31:07,492 రెండు నిమిషాల 15 సెకన్ల సమయముంది. 363 00:31:15,459 --> 00:31:16,752 నాన్నా! 364 00:31:17,920 --> 00:31:19,421 ఆంథనీ! 365 00:31:36,230 --> 00:31:37,231 కానివ్వు, కానివ్వు! 366 00:31:42,736 --> 00:31:44,696 - కానివ్వు. కానివ్వు. - నాక్స్? 367 00:31:47,115 --> 00:31:49,575 షర్ల్, ఇక్కడికి రా. నీ సాయం కావాలి. 368 00:31:49,576 --> 00:31:51,869 సరే, వాళ్లు చేరుకుంటున్నారు… వాయువుని ఇంకాసేపట్లో వదిలేస్తారు. 369 00:31:51,870 --> 00:31:54,914 సరేనా? తిరుగుబాటుదారులు చిటికెలో చనిపోతారు. 370 00:31:54,915 --> 00:31:56,666 మాకు… మాకు మరో రెండు నిమిషాలు కావాలంతే. 371 00:31:56,667 --> 00:31:58,417 మరో రెండు నిమిషాలు కావాలి. 372 00:31:58,418 --> 00:32:00,045 ప్లీజ్, రెండే నిమిషాలు! 373 00:32:02,756 --> 00:32:03,966 కమీల్, 374 00:32:05,217 --> 00:32:08,929 నీ వైఫల్యం కారణంగా రక్షణాత్మక చర్యని అమలు చేయక తప్పట్లేదు. 375 00:32:12,724 --> 00:32:13,767 అబ్బా! 376 00:32:30,033 --> 00:32:31,034 హేయ్, ఆంథనీ. 377 00:32:31,660 --> 00:32:33,328 తను నిన్నేం చేయదు. 378 00:32:34,371 --> 00:32:35,455 సరేనా? 379 00:32:42,421 --> 00:32:43,922 అమ్మ ఎక్కడ? 380 00:32:46,133 --> 00:32:47,885 అమ్మ ఆఫీసు పనిలో ఉంది. 381 00:33:27,925 --> 00:33:30,176 సర్, అది చూశారా? 382 00:33:30,177 --> 00:33:32,429 - తన చేతిలో నుండి అది జారింది. - లేదు, చూడండి. 383 00:33:40,896 --> 00:33:43,315 ఓ2 384 00:33:43,899 --> 00:33:44,900 ఆక్సిజన్. 385 00:33:46,735 --> 00:33:48,695 అది ఆక్సిజన్ మాత్రమే. ప్రెషర్ పూర్తిగా పెంచండి! 386 00:33:53,367 --> 00:33:54,368 కానివ్వు. 387 00:34:02,251 --> 00:34:03,669 ఎమర్సన్. అది ఓకేనా? 388 00:34:06,421 --> 00:34:09,507 మళ్లీ చెప్పు. మళ్లీ చెప్పు. ఎమర్సన్, అంతా ఓకేనా? 389 00:34:10,842 --> 00:34:12,553 కానివ్వండి. కానివ్వండి. 390 00:34:22,728 --> 00:34:24,022 సైలో వాల్వులో ప్రెషర్ గరిష్ఠ స్థాయిలో ఉంది. 391 00:34:25,315 --> 00:34:26,859 రక్షణాత్మక చర్యను అమలు చేయండి. 392 00:34:28,025 --> 00:34:29,276 నేను మూడు లెక్క పెట్టగానే. 393 00:34:29,277 --> 00:34:32,906 - ఒకటి, రెండు, మూడు. - ప్లీజ్, ఆగండి. దయచేసి ఆగండి. ఆగండి. 394 00:34:33,866 --> 00:34:35,242 దయచేసి దాన్ని అమలు చేయవద్దు. 395 00:34:55,137 --> 00:34:56,262 ఏమైంది? 396 00:34:56,263 --> 00:34:58,390 సర్, ప్రెషర్ తగ్గడం లేదు. 397 00:34:59,266 --> 00:35:01,893 - మళ్లీ చెక్ చేయండి. - ప్రెషర్ ఒక సెకను పాటు తగ్గింది, 398 00:35:01,894 --> 00:35:03,769 మళ్లీ వెనువెంటనే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 399 00:35:03,770 --> 00:35:06,315 రక్షణాత్మక చర్య విఫలమైంది, సర్. 400 00:35:18,327 --> 00:35:19,411 అంతా ఓకే. 401 00:35:27,711 --> 00:35:28,754 ఓకే. 402 00:35:36,845 --> 00:35:37,846 దేవుడా. 403 00:35:55,489 --> 00:35:56,823 దేవుడా. 404 00:35:58,450 --> 00:36:00,994 సర్, మనం ప్రెషరుని తగ్గించాలి. 405 00:36:03,038 --> 00:36:04,039 సర్! 406 00:36:09,837 --> 00:36:11,046 ప్రెషర్ తగ్గించు. 407 00:36:18,762 --> 00:36:20,472 రక్షణాత్మక చర్య ఎందుకు విఫలమైంది? 408 00:36:21,306 --> 00:36:23,141 ప్రారంభించినప్పుడు సైలో వాల్వ్ పని చేస్తూనే ఉండింది. 409 00:36:24,142 --> 00:36:25,227 ఆ తర్వాతే ఏదో జరిగింది. 410 00:36:31,692 --> 00:36:32,901 వాళ్లు పైపును మూసేశారు. 411 00:36:36,989 --> 00:36:38,156 వాళ్లు పైపును మూసేశారు. 412 00:36:51,336 --> 00:36:57,759 సైలో 18 దగ్గరికి ఒక సాయుధ డ్రోన్ ని పంపండి. 413 00:36:59,553 --> 00:37:01,180 ఎవరైనా బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే, 414 00:37:02,931 --> 00:37:04,016 చంపేయండి. 415 00:37:12,357 --> 00:37:13,525 నాకు ఒక్కడికే ఇక్కడ పని ఉంది. 416 00:37:16,528 --> 00:37:17,613 అందరూ వెళ్లిపోండి. 417 00:37:19,198 --> 00:37:20,199 వెంటనే! 418 00:37:34,838 --> 00:37:36,840 చాలా అద్భుతంగా మోసం చేశావు. 419 00:37:40,969 --> 00:37:42,804 నిన్ను మోసం చేయగలనో లేదో అని అనుకున్నా. 420 00:37:46,600 --> 00:37:48,519 నీ బయోమెట్రిక్స్ అన్నీ స్థిరంగానే ఉన్నట్టు అనిపించాయి. 421 00:37:49,770 --> 00:37:52,147 నువ్వు మోసం చేస్తావని సూచించే హింట్ ఒక్కటి కూడా కనిపించలేదు. 422 00:37:52,940 --> 00:37:55,275 నేను అబద్ధాలు చక్కగా ఆడగలననే కదా నువ్వు నన్ను ఎంచుకుంది? 423 00:37:58,737 --> 00:38:00,364 ఎందుకు అబద్ధం ఆడావు? 424 00:38:08,163 --> 00:38:10,206 ఒక ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు. 425 00:38:10,207 --> 00:38:11,750 ఏంటి ఆ ప్రశ్న? 426 00:38:12,459 --> 00:38:13,794 ఎందుకు? 427 00:38:14,795 --> 00:38:16,964 మమ్మల్ని చంపే శక్తి నీ చేతిలో ఎందుకు ఉంది? 428 00:38:20,092 --> 00:38:21,343 అది ఎవరు అడిగిన ప్రశ్న? 429 00:38:29,226 --> 00:38:30,435 జూలియా నికల్స్. 430 00:38:39,069 --> 00:38:42,906 మానవ జాతి, తన వినాశనాన్ని తానే రాసుకుంది, దాని నుండి బయటపడలేని స్థితిలో ఉంది. 431 00:38:47,911 --> 00:38:52,540 మానవజాతి మనుగడ సాగించాలంటే, మనకున్న ఆఖరి మార్గం, అలాగే అత్యుత్తమ మార్గం కూడా సైలోనే. 432 00:38:52,541 --> 00:38:58,130 ఒకేసారి వేలాది మందిని హతమారిస్తే, మానవజాతి మనుగడ ఎలా సాధ్యమవుతుంది? 433 00:39:00,174 --> 00:39:04,595 పితామహుల నిర్ణయాధికారాలను సవాలు చేయడం… 434 00:39:07,389 --> 00:39:09,474 - ఉల్లంఘనగా… - ఉల్లంఘన? 435 00:39:10,684 --> 00:39:13,687 జనాలు స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంటే, నువ్వు వాళ్లని చంపాలనుకున్నావు. అది ఉల్లంఘననా? 436 00:40:19,378 --> 00:40:21,379 ఎవరూ లోపలికి వెళ్లకూడదు, బయటకు పోకూడదు. సరేనా? 437 00:40:21,380 --> 00:40:23,089 - సరే, మేడమ్. - తప్పుకోండి. తప్పుకోండి. 438 00:40:23,090 --> 00:40:24,674 - హేయ్. - హేయ్, బాసూ. రావద్దు ఇక్కడికి. 439 00:40:24,675 --> 00:40:26,217 మీరు ఖైదీల దగ్గరికి వెళ్లకూడదు. 440 00:40:26,218 --> 00:40:27,468 ఇప్పుడు వాళ్లు ఖైదీలు కాదు. 441 00:40:27,469 --> 00:40:29,762 - ఏమైంది? - మేము పైపును కనుగొని, దాన్ని మూసేశాం. 442 00:40:29,763 --> 00:40:31,639 - హేయ్, జరుగు. - మిమ్మల్ని ఆపడానికి రెయిడర్లని పంపిందిగా. 443 00:40:31,640 --> 00:40:33,558 కానీ మాకు సహకరించమని వాళ్లకి ఆదేశం వచ్చింది. 444 00:40:33,559 --> 00:40:35,852 ఎవరిచ్చారు ఆ ఆదేశం? ఆ అధికారం ఎవరికీ లేదు. 445 00:40:35,853 --> 00:40:37,271 ఆ ఆదేశం ఇచ్చింది నేనే. 446 00:40:50,075 --> 00:40:52,244 ఓకే. శుభ్రం చేయడానికి ఎవరూ బయటకి వెళ్లట్లేదు. మీరు వెళ్లవచ్చు. 447 00:40:55,622 --> 00:40:56,873 అమ్మా. 448 00:40:56,874 --> 00:40:57,875 ఆంథనీ. 449 00:40:58,709 --> 00:40:59,710 హేయ్. 450 00:41:00,210 --> 00:41:01,378 హేయ్. నువ్వు బాగానే ఉన్నావు కదా? 451 00:41:02,963 --> 00:41:03,964 అవునా? 452 00:41:06,800 --> 00:41:07,801 అంతా ఓకే. 453 00:41:08,760 --> 00:41:09,761 నువ్వు బాగానే ఉన్నావా? 454 00:41:11,388 --> 00:41:13,223 నీటి సరఫరా అంతా బాగానే ఉంది. 455 00:41:14,516 --> 00:41:15,559 మనం సాధించాం. 456 00:41:17,436 --> 00:41:18,729 ఇవాళ ఏంటో తెలుసా? 457 00:41:20,439 --> 00:41:21,648 విముక్తి దినం. 458 00:41:26,153 --> 00:41:28,530 మన జీవితంలో ఇదే అసలు సిసలైన విముక్తి దినం. 459 00:41:29,031 --> 00:41:31,742 నాకు ఒక ఆలోచన వస్తోంది, మనం ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉన్నామంటే, 460 00:41:32,701 --> 00:41:34,077 దానికి కారణం ఆ… 461 00:41:35,621 --> 00:41:37,039 ఆ దరిద్రుడే అని. 462 00:41:57,184 --> 00:41:58,310 రండి. 463 00:42:00,187 --> 00:42:01,437 మీకు ఏం కావాలి, సర్? 464 00:42:01,438 --> 00:42:04,232 ట్రాయ్ ని లేపమని వాళ్లకి చెప్తావా? 465 00:42:04,233 --> 00:42:05,317 అలాగే, సర్. 466 00:42:06,235 --> 00:42:07,319 థ్యాంక్స్, క్లోయి. 467 00:43:07,171 --> 00:43:10,299 లెగసీ సిస్టమ్/ఫైల్ షేర్ ఫైల్/36.06.03/గోప్యమైనది 468 00:43:17,848 --> 00:43:20,434 హర్మన్ మెల్విల్ "మోబీ డిక్ ఆర్ ది వేల్" 469 00:44:45,978 --> 00:44:47,354 హేయ్, నేను జూల్స్ ని. 470 00:44:48,689 --> 00:44:49,773 అక్కడ ఎవరైనా ఉన్నారా? 471 00:44:53,235 --> 00:44:54,528 జూల్స్? 472 00:44:55,737 --> 00:44:57,781 నీ గొంతు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. 473 00:44:58,407 --> 00:44:59,575 హేయ్, లూకస్. 474 00:45:00,409 --> 00:45:02,327 నీ గొంతు వింటుంటే నాకు కూడా ఆనందంగా ఉంది. 475 00:45:02,911 --> 00:45:04,830 ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? 476 00:45:07,332 --> 00:45:08,959 నేను కోలుకుంటున్నా. ఏం… 477 00:45:09,543 --> 00:45:12,379 చూడు, నువ్వు ఆ రక్షణాత్మక చర్యని అడ్డుకున్నావు, అదే అన్నింటికన్నా ముఖ్యమైనది. 478 00:45:12,963 --> 00:45:16,716 అది చేసింది నేను కాదు. నాక్స్, షర్లీ, వాకర్, ఇంకా… 479 00:45:16,717 --> 00:45:20,511 హా, అందరూ సాయపడ్డారు. కమీల్ కూడా. కాబట్టి, ఇక్కడ అంతా ఓకే. 480 00:45:20,512 --> 00:45:21,596 ఓకే అనే అనుకుంటున్నా. 481 00:45:21,597 --> 00:45:23,098 కనీసం ఇప్పటికి అయినా. 482 00:45:24,016 --> 00:45:26,017 హా, మీరు బయటకు వెళ్లనంత వరకు ఏమీ కాదు. 483 00:45:26,018 --> 00:45:29,438 నన్ను కాల్చిన ఆ పిచ్చిది, మళ్లీ రాలేదు. కాబట్టి… 484 00:45:30,480 --> 00:45:33,442 మీ అందరినీ నేను ఇక్కడికి తీసుకొస్తా, అలా అని మాటిస్తున్నా. 485 00:45:35,485 --> 00:45:36,903 అది నాకు తెలుసులే. 486 00:45:36,904 --> 00:45:38,571 కానీ అది… 487 00:45:38,572 --> 00:45:40,282 - …ఇవాళ అయితే కాదు. - …ఇవాళ అయితే కాదు. 488 00:45:40,866 --> 00:45:41,950 అర్థమైంది. 489 00:45:45,871 --> 00:45:47,122 జూల్స్, నేను నిన్ను మిస్ అయ్యా. 490 00:46:00,302 --> 00:46:02,345 విశ్వం గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నా, 491 00:46:02,346 --> 00:46:04,097 ఇవన్నీ చెప్పి నీకు పిచ్చెక్కించాలని చాలా ఉంది, కాబట్టి… 492 00:46:05,390 --> 00:46:08,352 నాకు కూడా నువ్వు చెప్తుంటే వింటూ, పిచ్చెక్కించుకోవాలని ఉంది. 493 00:46:12,898 --> 00:46:14,149 కాబట్టి, నేను… 494 00:46:15,150 --> 00:46:16,902 ముందు నేను చేయాల్సిన పని ఒకటుంది, సరేనా? 495 00:46:17,694 --> 00:46:21,740 నువ్వు డిగ్గర్ వాయిడ్లో ఒక ద్వారాన్ని కనుగొన్నావు కదా, నా ఆలోచనలన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి. 496 00:46:23,909 --> 00:46:25,077 నేను అక్కడికి వెళ్లాలి. 497 00:46:26,286 --> 00:46:27,788 అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియాలి. 498 00:46:39,716 --> 00:46:41,426 హేయ్. మేల్కొన్నారా? 499 00:46:42,427 --> 00:46:44,221 హలో. హేయ్. 500 00:46:44,888 --> 00:46:47,766 హా. లేచారుగా. నాకు తెలుస్తోందిలే. 501 00:46:50,811 --> 00:46:52,688 అయ్యో. అయ్యయ్యో. మెల్లగా. మెల్లగా. 502 00:46:53,355 --> 00:46:56,899 నా పేరు ఫిల్. నేను మీకు స్వాగతం పలికేవాడిని. మీరెవరో మీకు తెలుసా? 503 00:46:56,900 --> 00:46:58,526 - మీ పేరేంటో మీకు గుర్తుందా? - ట్రాయ్. 504 00:46:58,527 --> 00:47:01,446 ట్రాయ్. సూపర్, ట్రాయ్. ఏం చేస్తుంటారు మీరు? 505 00:47:02,197 --> 00:47:03,781 నేను స్పెషలిస్టుని. 506 00:47:03,782 --> 00:47:05,157 శభాష్. 507 00:47:05,158 --> 00:47:08,870 మీరు చివరిగా పని చేసి 35 ఏళ్లయింది. 508 00:47:08,871 --> 00:47:11,664 కానీ మిమ్మల్ని ర్యాపిడ్ సీక్వెన్స్ ప్రక్రియ ద్వారా మేల్కొల్పాల్సి వచ్చింది. 509 00:47:11,665 --> 00:47:13,666 మీ శరీర ఉష్ణోగ్రత ఇంకా చాలా తక్కువగా ఉంది. 510 00:47:13,667 --> 00:47:15,751 మేము ఉష్ణోగ్రతని పెంచే థర్మల్ ఫ్లష్ ప్రక్రియ మొదలుపెడతాం, సరేనా? 511 00:47:15,752 --> 00:47:17,086 - అబ్బా. - హా. అర్థం చేసుకోగలను. 512 00:47:17,087 --> 00:47:18,754 కాస్త వెనక్కి వాలతారా? నేను సాయపడతాగా. 513 00:47:18,755 --> 00:47:20,798 వెనక్కి వాలండి. పూర్తిగా వాలండి. 514 00:47:20,799 --> 00:47:23,552 ఏదైనా పళ్ళ మధ్య పెట్టుకుని కొరుకుతారా? అదుగోండి. 515 00:47:31,810 --> 00:47:32,811 విక్టర్ ఎక్కడ? 516 00:47:33,812 --> 00:47:36,857 ప్రస్తుతానికి నేనే అందుబాటులో ఉన్నా. అతను ఏదైనా సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నాడేమో. 517 00:47:37,482 --> 00:47:38,775 ఏ సమస్య? 518 00:47:40,110 --> 00:47:41,904 హా, మాకన్నీ చెప్తారని మీరు అనుకోవడంలో వింతేం లేదులే. 519 00:47:42,404 --> 00:47:45,114 అంటే, మీకు అందరికన్నా ముందు కనిపించేది మేమే కదా. 520 00:47:45,115 --> 00:47:47,992 మీ సమయం వృథా కాకుండా మీకు అన్ని వివరాలూ మేము చెప్పగలిగితేనే బాగుంటుంది కదా. 521 00:47:47,993 --> 00:47:49,577 హేయ్. మీరు పైకి వెళ్లినప్పుడు, 522 00:47:49,578 --> 00:47:53,999 మేము కేవలం క్రయో ఛాంబర్లలో పని చేసే పిచ్చోళ్లం మాత్రమే కాదని వాళ్లకి చెప్పగలరా? 523 00:47:54,791 --> 00:47:59,587 మేము డీఫ్రాస్ట్ సంగతి చూసుకుంటుంటాం, వైద్యపరంగా ఎమర్జెన్సీలు తలెత్తితే చూసుకుంటుంటాం. 524 00:47:59,588 --> 00:48:01,380 నైపుణ్యమున్న ప్రొఫెషనల్స్ మేము. 525 00:48:01,381 --> 00:48:06,469 మీరు చాలా షిఫ్టుల వాళ్లతో పని చేస్తుంటారు. కానీ చెప్తున్నా కదా, మా జే-7 షిఫ్టుకి మించింది ఏదీ లేదు. 526 00:48:06,470 --> 00:48:09,514 మంచివాళ్లం, చక్కని సమన్వయం ఉంది, టక్కున పని చేసేస్తుంటాం. 527 00:48:09,515 --> 00:48:12,517 మా షిఫ్ట్ బాస్ అప్పుడప్పుడూ తిక్కలోడిలా ప్రవర్తిస్తుంటాడు. కానీ మేమందరం పని మీదే శ్రద్ధ పెట్టి, 528 00:48:12,518 --> 00:48:14,810 సైలోకి అత్యుత్తమ సేవలని అందించేలా చూసుకోవడానికి అలా ప్రవర్తిస్తాడు. 529 00:48:14,811 --> 00:48:16,729 ఇంకా మేము అదిరిపోయే పార్టీలు చేసుకుంటుంటాం. మీరూ రావాలి. 530 00:48:16,730 --> 00:48:18,856 సైలో 17 సంగతి చూసుకున్న వ్యక్తిని కలవడానికి జనం వెర్రెత్తిపోతారు… 531 00:48:18,857 --> 00:48:22,778 ట్రాయ్. నేను జోయెల్, జే-7 షిఫ్టుకు బాస్ ని. ఇక్కడి నుండి మీకు అంతా నేను చెప్తాను. 532 00:48:23,362 --> 00:48:24,363 థ్యాంక్స్, ఫిల్. 533 00:48:27,115 --> 00:48:28,909 మేము అయిదు నెలల క్రితం షిఫ్ట్ ఎక్కాం. 534 00:48:29,743 --> 00:48:32,579 సుమారుగా మూడు నెలల క్రితం, సైలో 18లో పరిస్థితులు అదుపు తప్పాయి. 535 00:48:33,080 --> 00:48:36,290 అంటే, వాళ్ళ షెరిఫ్ జూలియా నికల్స్ ని శుభ్రం చేయడానికి బయటకి పంపించిన తర్వాత అలా జరిగింది. 536 00:48:36,291 --> 00:48:41,129 ఎలాగో తెలీదు కానీ, తను మంచి టేపును సంపాదించగలిగింది, గుట్టని దాటి సైలో 17కి వెళ్లి, మళ్లీ రిటర్న్ వెళ్లిపోయింది. 537 00:48:44,258 --> 00:48:46,384 విక్టర్ రక్షణాత్మక చర్యని అమలు చేయబోతూ ఉండగా, 538 00:48:46,385 --> 00:48:48,595 వాళ్ల ఐటీ హెడ్, తిరుగుబాటుదారులతో చేతులు కలిపింది. 539 00:48:49,471 --> 00:48:51,974 పైపును మూసేయడానికి కావాల్సిన సమయాన్ని వాళ్లకి ఇచ్చింది. 540 00:48:54,977 --> 00:48:55,978 విక్టర్ ఎక్కడ? 541 00:48:56,687 --> 00:48:58,397 ఇది… అతని జాడని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. 542 00:48:59,231 --> 00:49:03,025 మేము ఏరియల్ సర్వేలెన్స్ పెట్టాం, ఆయుధాలు ఫుల్లుగా లోడ్ అయి ఉన్నాయి, బాహ్య రక్షణాత్మక చర్యని 543 00:49:03,026 --> 00:49:05,820 అమలు చేయాల్సిన అవసరముందని మీరంటే, దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. 544 00:49:05,821 --> 00:49:08,739 - బాహ్య రక్షణాత్మక చర్య అంటే? - హా, మీరు సైలో 17పై ప్రయోగించారు కదా. 545 00:49:08,740 --> 00:49:09,741 మేము దానికి ఆ పేరే పెట్టాం. 546 00:49:11,159 --> 00:49:13,077 ఈ జూలియా నికల్స్ దద్దమ్మలా అనిపించట్లేదు. 547 00:49:13,078 --> 00:49:16,373 సైలో 17లో ఏం జరిగిందో తను చూసుంటే, తన సైలోలోని వారిని తను బయటకు పంపించదు. 548 00:49:17,374 --> 00:49:18,375 హా. 549 00:49:20,544 --> 00:49:21,545 ఆపరేషన్స్. 550 00:49:22,212 --> 00:49:23,213 అవును. 551 00:49:24,506 --> 00:49:25,507 సరే. 552 00:49:26,008 --> 00:49:28,719 ట్రాయ్, మిమ్మల్ని విక్టర్ తన నివాసానికి రమ్మంటున్నాడు. 553 00:49:29,803 --> 00:49:31,638 పరిస్థితి మారితే, నాకు తెలియజేయండి. 554 00:49:32,222 --> 00:49:33,265 తప్పకుండా. 555 00:49:37,019 --> 00:49:39,020 ఇంత మంది జనాలని ఇది మోయగలదు, కదా? 556 00:49:39,021 --> 00:49:40,397 ఇప్పుడు తెలుస్తుంది కదా అది, ఏమంటారు? 557 00:49:51,283 --> 00:49:52,576 విక్టర్ నన్ను రమ్మన్నాడు. 558 00:49:53,327 --> 00:49:55,204 - రమ్మంది నేను. - హెన్రీ. 559 00:49:56,121 --> 00:49:57,538 ఇది నీ షిఫ్టా? 560 00:49:57,539 --> 00:50:00,124 లేదు, నీలా నన్ను కూడా ర్యాపిడ్ సీక్వెన్స్ ద్వారా లేపారు. 561 00:50:00,125 --> 00:50:02,044 అంతర్గత సెక్యూరిటీ అవసరం ఏమొచ్చింది? 562 00:50:16,058 --> 00:50:17,059 దేవుడా. 563 00:50:17,935 --> 00:50:18,936 హా. 564 00:50:22,064 --> 00:50:24,775 - ఈ విషయం బయటపడకుండా చూసుకుంటున్నాం. - హా, అంతేగా. 565 00:50:29,696 --> 00:50:30,739 నువ్వు బాగానే ఉన్నావా? 566 00:50:31,865 --> 00:50:34,242 హా. అంటే, బాగానే ఉన్నా. 567 00:50:34,243 --> 00:50:35,994 కాకపోతే, నాకు… నాకు ఏం చెప్పాలో తెలీట్లేదు. 568 00:50:37,538 --> 00:50:39,164 పితామహుడు ఆత్మహత్యకి పాల్పడటం. 569 00:50:40,791 --> 00:50:42,292 అది మామూలు విషయం కాదు. 570 00:50:42,876 --> 00:50:44,252 కారణం తెలుపుతూ ఏమైనా నోట్ రాసి పెట్టాడా? 571 00:50:44,253 --> 00:50:45,254 ఇప్పటిదాకా దొరకలేదు అది. 572 00:50:46,004 --> 00:50:50,759 కానీ ఇలా చేసుకోక ముందు అతను ఆఖరిగా… నిన్ను లేపమని చెప్పాడట. 573 00:50:51,760 --> 00:50:56,348 కాబట్టి, అతన్ని ఇబ్బంది పెట్టిన విషయం ఏంటో నీకు తెలిసి ఉంటుందేమో అనుకున్నా. 574 00:51:00,185 --> 00:51:03,437 మీరిద్దరూ కలిసి చాలాసార్లు పని చేశారు కదా. 575 00:51:03,438 --> 00:51:07,192 అంటే, నువ్వు షిఫ్టులో ఉన్నప్పుడే ఇతను కూడా ఉండాలని కోరుకున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తోంది. 576 00:51:12,406 --> 00:51:13,949 నాకు తెలీదు. 577 00:51:14,783 --> 00:51:16,660 ఇతనికి నేను ముందు నుండే తెలుసని నాకు… 578 00:51:18,453 --> 00:51:22,123 నాకు అప్పుడప్పుడూ అనిపించేది, కానీ ఈయన అదంతా చెప్పలేడుగా. 579 00:51:22,124 --> 00:51:23,208 లేడు. 580 00:51:35,053 --> 00:51:36,263 ఇతను మంచివాడు. 581 00:51:37,139 --> 00:51:39,308 నాకు ఇతనంటే అభిమానం ఉంది. కానీ… 582 00:51:39,975 --> 00:51:42,686 కానీ నాకు ఇతని గురించి పూర్తిగా తెలీదనే చెప్పాలి. 583 00:52:08,003 --> 00:52:09,004 ఓకే. 584 00:52:09,546 --> 00:52:10,589 అందరూ ఓకేనే కదా? 585 00:52:12,716 --> 00:52:14,008 నీకు నీళ్లంటే ఇష్టం లేదని అనుకున్నానే. 586 00:52:14,009 --> 00:52:15,260 హా, అది నిజమే. 587 00:52:15,969 --> 00:52:17,679 సైలో 17లో ఎదురైన అనుభవంతో, నీళ్లంటేనే వణికిపోతున్నా. 588 00:52:19,014 --> 00:52:20,307 సరే మరి, 589 00:52:20,891 --> 00:52:23,936 లూకస్, తను డిగ్గరుకి ఎడమ వైపుకు వెళ్లాడని అన్నాడు కాబట్టి… 590 00:52:26,188 --> 00:52:27,189 - ఓకేనా? - ఓకే. 591 00:52:42,996 --> 00:52:45,290 సరే, రండి. 592 00:52:54,925 --> 00:52:57,385 జోయెల్, నేను విక్టర్, కమీల్ సిమ్స్ మధ్య జరిగిన సంభాషణని 593 00:52:57,386 --> 00:52:58,845 వినాలని అనుకుంటున్నా. 594 00:52:58,846 --> 00:53:00,764 - సరే, సర్. - ఇంజినీరింగ్ వాళ్లు ఎవరు షిఫ్టులో ఉన్నారు? 595 00:53:01,348 --> 00:53:02,640 కనుక్కుంటా. 596 00:53:02,641 --> 00:53:03,891 వాళ్లని సిద్ధంగా ఉండమని చెప్పు. 597 00:53:03,892 --> 00:53:05,685 సైలో 18లో రక్షణాత్మక చర్యని ఎలా అమలు చేయవచ్చో చూడాలి. 598 00:53:05,686 --> 00:53:06,687 సర్, 599 00:53:09,147 --> 00:53:10,148 ట్రాయ్. 600 00:53:11,191 --> 00:53:13,943 సైలో 18లోని ఫార్వర్డ్ వాల్ట్ దగ్గర ఏదో జరుగుతోంది. 601 00:53:13,944 --> 00:53:14,945 నిజంగానా? 602 00:53:16,029 --> 00:53:17,489 - ఫుటేజ్ చూపించండి. - అలాగే. 603 00:53:32,171 --> 00:53:34,840 మరి ఇప్పుడేం చేద్దాం? 604 00:53:37,176 --> 00:53:40,596 లూకస్ దీన్ని తాకాడట. 605 00:53:48,562 --> 00:53:49,896 జూలియా నికల్స్. 606 00:53:49,897 --> 00:53:52,649 ఇక దర్యాప్తుల్లాంటివి ఏం చేయవద్దు. 607 00:53:53,358 --> 00:53:54,359 ఎందుకని? 608 00:53:54,860 --> 00:53:56,486 మేమేం కనుగొంటామని నువ్వు భయపడుతున్నావు? 609 00:53:57,196 --> 00:53:59,030 తిరిగి డిగ్గర్ బ్యారియర్ పైకి వెళ్లిపోండి… 610 00:53:59,031 --> 00:54:01,825 ఇక దర్యాప్తుల్లాంటివి ఏం చేయవద్దు. 611 00:54:03,035 --> 00:54:04,661 ఒకవేళ నువ్వు చెప్పింది మేము వినకపోతే? 612 00:54:05,204 --> 00:54:08,122 మీ సైలోలో ఉన్న ప్రతి ప్రాణి చనిపోతుంది. 613 00:54:08,123 --> 00:54:11,417 నువ్వు చంపే ప్రయత్నం చేసి, విఫలమయ్యావు కదా. ఆ ప్రయత్నం నువ్వు ఆపవని కూడా మాకు తెలుసు. 614 00:54:11,418 --> 00:54:12,419 కాబట్టి 615 00:54:13,128 --> 00:54:14,630 మాకు పోయేదేముంది? 616 00:54:27,309 --> 00:54:31,396 ఇంకో సైలోని సంప్రదించాలన్న ఆలోచనని మీరు రానివ్వనంత వరకు, 617 00:54:32,147 --> 00:54:33,982 మీపై రక్షణాత్మక చర్యను అమలు చేయడమనేది జరగదు. 618 00:54:34,900 --> 00:54:36,360 మాకు ఒక ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నావా? 619 00:54:40,489 --> 00:54:41,782 రాజీ ప్రతిపాదన పెడుతున్నా. 620 00:54:42,407 --> 00:54:43,867 రాజీనా? 621 00:54:47,496 --> 00:54:48,497 అది న్యాయమైనదిలానే ఉంది. 622 00:54:51,625 --> 00:54:52,626 మాకు అంగీకారమే. 623 00:54:59,716 --> 00:55:01,635 సరే. వెళ్దాం పదండి. 624 00:55:49,391 --> 00:55:51,726 ఒక్క నిమిషం, కాస్త మనం… ఏంటది అసలు? అందరూ కాస్త ఆగుతారా? 625 00:55:51,727 --> 00:55:52,728 హేయ్! 626 00:55:53,228 --> 00:55:54,354 హేయ్. 627 00:55:56,356 --> 00:55:58,024 ఇప్పుడేం జరిగింది అసలు? 628 00:55:58,025 --> 00:55:59,859 వాళ్లు నిజంగా ఆగుతారని అనుకుంటున్నావా? 629 00:55:59,860 --> 00:56:01,153 లేదు. అస్సలు ఆగరు వాళ్లు. 630 00:56:03,572 --> 00:56:04,573 సరే, అయితే, 631 00:56:05,449 --> 00:56:07,408 వాళ్లు మనపై రక్షణాత్మక చర్యని అమలు చేయలేరని మనకి తెలుసు. 632 00:56:07,409 --> 00:56:09,452 అవును, కానీ వాళ్ళు ఏదోకటి తప్పక చేస్తారు. 633 00:56:09,453 --> 00:56:11,871 వాళ్లు పై నుండి దాడి చేసే ప్రయత్నం చేస్తే, అది మనకి తెలిసిపోతుంది. 634 00:56:11,872 --> 00:56:13,373 భూగర్భం నుండి డ్రిల్ చేస్తారేమో. 635 00:56:13,999 --> 00:56:16,667 సైలో బయటి గోడకి కన్నం వేసి, విషవాయువుని వదులుతారేమో. 636 00:56:16,668 --> 00:56:18,336 వాళ్లు దగ్గరకొచ్చేసే దాకా మనకి ఏమీ తెలీదు. 637 00:56:18,337 --> 00:56:22,965 వాళ్లంత కష్టపడనక్కర్లేదు. వాళ్లు విషవాయువును ఆ తలుపు గుండా వదలవచ్చు. 638 00:56:22,966 --> 00:56:24,133 వెల్డింగ్ చేసి, దాన్ని సీల్ చేసేద్దాం. 639 00:56:24,134 --> 00:56:26,511 లేదంటే, దాన్ని గమనిస్తూ ఉండమని కొందరిని పెడదాం. 640 00:56:26,512 --> 00:56:30,431 లేదు. కానీ మిగతా సైలోలన్నింటికీ ఇదే ముప్పు ఉంటుంది కదా. 641 00:56:30,432 --> 00:56:31,849 - వాళ్లని హెచ్చరించాలనుకుంటున్నావా? - లేదు. 642 00:56:31,850 --> 00:56:33,309 ఆ పని చేయవద్దని వాళ్లు చెప్పారు కదా. 643 00:56:33,310 --> 00:56:35,144 ఎలాగూ, మనం ఆ పని చేయలేములే. 644 00:56:35,145 --> 00:56:37,980 చూడండి, ముందు మనం మన మనుగడపై మాత్రమే దృష్టి పెట్టాలి. 645 00:56:37,981 --> 00:56:38,982 అంతే కదా? 646 00:56:40,651 --> 00:56:42,319 మనం సరిగ్గా ఇదే చేస్తామని వాళ్లు అనుకుంటుంటారు. 647 00:56:46,532 --> 00:56:50,953 మనల్ని మనం కాపాడుకునే పనిలో ఉంటామని వాళ్లు అనుకుంటుంటారు, కదా? 648 00:56:51,662 --> 00:56:56,458 అంటే, మనం ఎదురుదాడి చేస్తామని వాళ్ళు ఊహించరు. 649 00:56:58,710 --> 00:57:03,048 కాబట్టి, మనం ముందు వాళ్ల పని పడితే, అందరినీ కాపాడవచ్చు. 650 00:57:08,095 --> 00:57:09,930 మనం మొదటి సైలోని నాశనం చేయాలి. 651 00:57:41,044 --> 00:57:42,128 లెగసీ సిస్టమ్ / ఫైల్ షేర్ 652 00:57:42,129 --> 00:57:44,089 ఎన్ క్రిప్ట్ చేయబడిన మెసేజ్ డీక్రిప్షన్ ఎనేబుల్ చేసి ఉంది 653 00:57:46,049 --> 00:57:47,050 హలో, ట్రాయ్. 654 00:57:49,428 --> 00:57:52,514 ఈపాటికి నేను కన్నుమూసి నిద్రావస్థలో ఉంటానని నీకు తెలిసే ఉంటుంది. 655 00:57:54,016 --> 00:57:55,225 అంటే, శాశ్వతంగా అన్నమాట. 656 00:58:01,190 --> 00:58:03,066 నీకు అందుకు కారణాలన్నీ తెలియనక్కర్లేదు. 657 00:58:05,777 --> 00:58:07,196 నేను ఒకటే చెప్తాను, 658 00:58:07,988 --> 00:58:11,241 సైలో 18పై మేము రక్షణాత్మక చర్యను అమలు చేశాక అది విఫలమైనప్పుడు, 659 00:58:13,160 --> 00:58:14,328 నాకు… 660 00:58:16,413 --> 00:58:17,581 అన్నింటికన్నా ఎక్కువగా… 661 00:58:19,708 --> 00:58:21,084 చాలా ఉపశమనంగా అనిపించింది. 662 00:58:27,716 --> 00:58:28,884 మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు, 663 00:58:29,927 --> 00:58:31,678 నువ్వు ఓ మహిళ గురించి అడిగావు. 664 00:58:33,514 --> 00:58:35,265 అప్పుడు నేను నీకు ఒక మాట ఇచ్చా. 665 00:58:38,101 --> 00:58:40,312 తన పేరు, హెలెన్ డ్రూ. 666 00:59:14,012 --> 00:59:15,389 హెలెన్ డ్రూ. 667 01:00:04,313 --> 01:00:06,315 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్