1 00:00:08,550 --> 00:00:10,761 వీటి మీద నీ అభిప్రాయం ఏంటి? 2 00:00:10,761 --> 00:00:12,221 అతనికి సన్ గ్లాసెస్ అవసరమా? 3 00:00:12,221 --> 00:00:15,265 అంటే, అతనికి ఏమీ అవసరం లేదు. 4 00:00:15,933 --> 00:00:18,894 -కానీ 40 కానుకలు వస్తాయని ఆశిస్తున్నాడు. -ఓరి నాయనోయ్. 5 00:00:18,894 --> 00:00:21,730 మంచి ఆచారమే పెట్టుకున్నావుగా. 6 00:00:21,730 --> 00:00:24,149 నీ పుట్టినరోజుకు ఇంకా పెంగ్విన్స్ ఇస్తున్నాడా? 7 00:00:24,149 --> 00:00:25,692 పెంగ్విన్స్ కాదు, పఫిన్స్. 8 00:00:25,692 --> 00:00:28,237 -పఫిన్స్, పఫిన్స్. -హా, అవే. 9 00:00:28,237 --> 00:00:29,947 నాకే కనుక టైమ్ మెషిన్ ఉంటే, 10 00:00:29,947 --> 00:00:33,408 ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఆ ఒక్క సంఘటనకే వెళ్తాను, 11 00:00:33,408 --> 00:00:36,537 అప్పుడు ఒకే ఒక్కసారి పఫిన్స్ భలే మొద్దొస్తాయి అని అన్నాను, ఇక అంతే. 12 00:00:36,537 --> 00:00:38,330 అవును, నువ్వు అదే చేయాలి. 13 00:00:38,330 --> 00:00:42,000 ఆ ఒక్క పని మాత్రమే చేస్తే చాలు. పఫిన్స్ అంటే గుర్తొచ్చింది, 14 00:00:42,000 --> 00:00:44,002 ఈ పఫిన్ క్రాకర్స్ తీసుకోవాలి. 15 00:00:45,379 --> 00:00:47,214 బాగుంది. చాలా బాగుంది. 16 00:00:47,214 --> 00:00:49,925 సరే, మరి దీనితో కలిపి ఎన్ని అయ్యాయి? 17 00:00:51,009 --> 00:00:52,719 ఇంట్లో ఉన్న వాటితో కలిపి మొత్తం 37 ఉన్నాయి అనుకుంటా. 18 00:00:52,719 --> 00:00:54,972 -ముప్పై ఏడు, సరే, సరే. -హా. 19 00:00:56,181 --> 00:00:59,643 మార్ఫో యంత్రం కోసం అతనికి కొన్ని పైసలు ఇవ్వరాదూ? 20 00:01:01,311 --> 00:01:03,856 డస్టీ ఆటల జోలికి వెళ్లడులే. 21 00:01:04,438 --> 00:01:05,732 అది ఆట కాదు. 22 00:01:06,567 --> 00:01:09,236 ఒక్క నిమిషం, కాస్, నువ్వు దాన్ని ఇంకా ఉపయోగించి చూడలేదా? 23 00:01:09,236 --> 00:01:12,739 ఏవైనా నాకన్నా నీకే ముందు తెలిసిపోతాయి అనుకున్నానే. 24 00:01:12,739 --> 00:01:14,449 ఇంతకీ అది ఏం చేస్తుంది? 25 00:01:14,449 --> 00:01:15,534 నాకు తెలీదు. 26 00:01:15,534 --> 00:01:17,619 ఈ భూమ్మీద మనం ఎందుకు ఉన్నాము అనే దానికి 27 00:01:17,619 --> 00:01:19,496 కారణం చెప్తుంది అనుకుంటాను. 28 00:01:21,415 --> 00:01:24,960 నాకు "కథ వ్యాఖ్యాత" అని వచ్చింది, ఒట్టేసి చెప్తున్నా, నాకు... 29 00:01:25,669 --> 00:01:28,005 ఎవరో నా శరీరంలోకి ప్రవేశించి, నా రహస్యమైన కలకు 30 00:01:28,005 --> 00:01:30,716 ప్రాణం పోసినట్టు అనిపించింది. 31 00:01:33,802 --> 00:01:36,221 హా. అందుకు రహస్యమైన కల అంటూ ఒకటి ఉండాలి కదా. 32 00:01:37,181 --> 00:01:38,765 నువ్వు పద. చలో. 33 00:01:38,765 --> 00:01:41,810 -వెళ్లి చూడు పో. కాస్, వెళ్లి... చల్. -వద్దు. 34 00:01:41,810 --> 00:01:44,021 చల్. వెళ్లు. 35 00:01:53,864 --> 00:01:55,741 జీవితంలో 36 00:01:55,741 --> 00:01:57,242 మీరు ఏం 37 00:01:57,242 --> 00:01:58,660 సాధించగలరో 38 00:01:58,660 --> 00:02:00,120 తెలుసుకోండి 39 00:02:00,704 --> 00:02:02,539 మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఎంత? 40 00:02:10,631 --> 00:02:12,633 మీ వేలిముద్రలను అందించండి! 41 00:02:27,814 --> 00:02:29,691 జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలిసిపోయింది! 42 00:02:31,401 --> 00:02:33,320 జీవితంలో మీరు సాధించగల విషయం 43 00:02:46,291 --> 00:02:47,459 -నాట్? -హేయ్. 44 00:02:48,210 --> 00:02:49,211 చెప్పు. 45 00:02:49,711 --> 00:02:51,380 ఇదేమైనా జోకా? 46 00:02:54,258 --> 00:02:56,176 నీకు జోక్ గా అనిపిస్తోందా? 47 00:02:56,969 --> 00:02:58,053 ఏం తీసుకున్నావు ఏంటి? 48 00:02:59,471 --> 00:03:00,764 ఇవన్నీ. 49 00:03:00,764 --> 00:03:02,933 అది కాదు. మార్ఫో నుండి ఏం తీసుకున్నావు? 50 00:03:03,517 --> 00:03:08,564 ఎవరి సాధించగల విషయం అయితే చాలా గొప్పది వస్తుందో వాళ్ల ఫోటోలు తీస్తున్నాను. కాబట్టి... 51 00:03:09,314 --> 00:03:12,860 అంటే, నాది ఫోటో తీసేంత గొప్పది కాదులే, కాబట్టి... 52 00:03:15,112 --> 00:03:16,113 బిల్ వేసేయండి. 53 00:03:16,572 --> 00:03:18,740 -పుట్టినరోజు పార్టీకి అన్నమాట. -అలగలగే. 54 00:03:32,337 --> 00:03:35,174 రాచరికత్వం 55 00:04:20,969 --> 00:04:22,012 -హేయ్. -హేయ్. 56 00:04:23,180 --> 00:04:25,098 ఏమైంది? ఎక్కడికి వెళ్లావు? 57 00:04:27,059 --> 00:04:29,061 నేను ఆ పని చేసేశాను. ఒత్తిడికి తలొగ్గాను. 58 00:04:29,061 --> 00:04:30,646 -వావ్. -అవును. 59 00:04:31,688 --> 00:04:33,398 ఇంతకీ షాపులోకి ఎలా వెళ్లగలిగావు? 60 00:04:34,066 --> 00:04:36,652 నేను మిస్టర్ జాన్సన్ ని నిద్ర లేపాను. 61 00:04:37,236 --> 00:04:38,820 అతను అంత కోప్పడలేదు కూడా. 62 00:04:41,240 --> 00:04:43,617 సరే మరి. ఇంతకీ ఏం వచ్చింది? 63 00:04:43,617 --> 00:04:45,369 నాకు "టీచర్/ఈల వేసేవాడు" అని వచ్చింది. 64 00:04:46,370 --> 00:04:47,704 టీచర్ ఈల వేసేవాడు అంటే ఏంటి? 65 00:04:47,704 --> 00:04:51,250 అది కాదు, "టీచర్/ఈల వేసేవాడు." 66 00:04:51,250 --> 00:04:55,170 -నీకు స్లాష్ కూడా వచ్చిందా? -అవును. చూడు. 67 00:04:55,879 --> 00:04:56,880 హా, 68 00:04:56,880 --> 00:04:59,842 జీవితంలో సాధించగలవి నాకు రెండు ఉన్నట్టున్నాయి, ఆ రెండూ కూడా సాధ్యమైనవే, 69 00:04:59,842 --> 00:05:01,844 ప్రస్తుతం, ఆ రెంటినీ నేను సాధిస్తున్నాను. 70 00:05:02,261 --> 00:05:03,887 -అది సూపర్. -అవును. 71 00:05:06,640 --> 00:05:09,601 అంటే, ఇది చూడగానే మొదట నేను చాలా కలత చెందాను. 72 00:05:09,601 --> 00:05:12,521 -కానీ కాసేపు నడిచాక... -హా. 73 00:05:12,521 --> 00:05:16,650 ...నిజానికి ఇది చాలా మంచి విషయమని అనిపించింది, అంటే... 74 00:05:16,650 --> 00:05:20,070 ఇది మంచిదే ఎందుకంటే, ఇది... ఎలా చెప్పాలబ్బా? ధృవీకరిస్తోంది. 75 00:05:20,070 --> 00:05:21,905 నువ్వు నిజంగా యంత్రాన్ని ఉపయోగించావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 76 00:05:21,905 --> 00:05:23,323 అవును. 77 00:05:23,323 --> 00:05:26,702 -అంటే, నువ్వు దాన్ని చాలా వ్యతిరేకించావు కదా. -హా, అవును. 78 00:05:26,702 --> 00:05:28,871 నేను కూడా ఉపయోగించి చూశానని నీకు చెప్పడానికి భయమేసింది. 79 00:05:28,871 --> 00:05:32,499 ఎందుకంటే నువ్వు చాలా... నువ్వు ఆ విషయాన్ని చాలా వ్యక్తిగతంగా తీసుకున్నావు. 80 00:05:33,417 --> 00:05:34,501 అయితే, నువ్వు కూడా ఉపయోగించి చూశావా? 81 00:05:35,294 --> 00:05:36,295 హా. 82 00:05:36,670 --> 00:05:37,671 నాకు... 83 00:05:44,970 --> 00:05:47,764 "విధేయత." హా, నీ కార్డు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. 84 00:05:47,764 --> 00:05:50,100 -అయ్యయ్యో, అది కాదు. -విధేయతలో నీ తర్వాతే ఎవరైనా. 85 00:05:53,604 --> 00:05:55,147 ఓరి నాయనోయ్! 86 00:05:57,149 --> 00:05:58,442 ఓరి నాయనోయ్! 87 00:06:00,485 --> 00:06:02,112 నీకు "రాచరికత్వం" వచ్చిందా? 88 00:06:02,654 --> 00:06:04,406 -అవును. -వావ్. 89 00:06:04,990 --> 00:06:06,950 -అసలు దాని అర్థం ఏంటి? -ఏమో. 90 00:06:06,950 --> 00:06:09,494 నువ్వు నిజానికి యువరాజును పెళ్లి చేసుకోబోయి నన్ను చేసుకున్నావా ఏంటి? 91 00:06:10,162 --> 00:06:11,413 సరే, ముందుగా ఒక విషయం, 92 00:06:11,413 --> 00:06:14,791 నేను యువరాజును పెళ్లి చేసుకొని ఉండాల్సింది అని నువ్వు అన్న మాట నాకు నచ్చలేదు. 93 00:06:14,791 --> 00:06:18,420 ఇంకో విషయం ఏంటంటే, నేను దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, 94 00:06:18,420 --> 00:06:21,423 ఎందుకంటే, దీనికి అర్థమంటూ ఏదీ ఉండకపోవచ్చు. అంటే... 95 00:06:21,423 --> 00:06:23,550 -అదేమీ కాదు. ఇది... -అస్సలు అది... అంటే, 96 00:06:23,550 --> 00:06:26,845 -దానికి అర్థమే ఉండకపోవచ్చు. -కానీ నాది చాలా పక్కాగా వచ్చింది. 97 00:06:26,845 --> 00:06:30,015 అవును, నీ కార్డుకు అర్థం ఉండవచ్చు, నా కార్డుకు ఏ అర్థమూ లేకపోవచ్చు. 98 00:06:30,015 --> 00:06:31,099 అవును. 99 00:06:33,894 --> 00:06:37,189 నువ్వు యంత్రాన్ని ఉపయోగించి కూడా ఉపయోగించలేదు అని చెప్పావు కదా, 100 00:06:37,189 --> 00:06:38,899 అంటే నువ్వు ఉపయోగించింది నేను అడగక ముందా, లేదా తర్వాతా? 101 00:06:40,150 --> 00:06:42,444 తర్వాత అనుకుంటా. 102 00:06:42,444 --> 00:06:43,946 -తర్వాత అనుకుంటావా? -అవును. 103 00:06:44,738 --> 00:06:46,281 ఆ రెంటికీ చాలా తేడా ఉంది. 104 00:06:46,281 --> 00:06:49,284 అవును, నీకు దానితో సమస్య ఉందని తెలీకముందే ఆ పని చేశానని ఖచ్చితంగా చెప్పగలను. 105 00:06:49,284 --> 00:06:50,994 నాకు దానితో సమస్యేమీ లేదు. 106 00:06:50,994 --> 00:06:53,830 అది చాలా మంచిది అనుకుంటా, ఈ ఊరి ప్రజలకు వినోదం ఇస్తుంది. 107 00:06:53,830 --> 00:06:55,249 మనల్నే తీసుకో. 108 00:06:55,916 --> 00:06:58,669 నాకు సాధించగల విషయాలే వచ్చాయి, వాటిని నేను ఇప్పుడు సాధిస్తున్నాను కూడా, 109 00:06:58,669 --> 00:07:01,088 కానీ నీకు ఏ మాత్రం సాధ్యం కానిది వచ్చింది, కాబట్టి... 110 00:07:06,218 --> 00:07:07,219 సరే. 111 00:07:30,826 --> 00:07:32,828 డియర్ ఇజ్జీ 112 00:07:50,304 --> 00:07:51,889 థ్యాంక్స్, ఏంజలియా. 113 00:07:53,015 --> 00:07:54,808 ఎందుకంటే, నువ్వు తమాషాకి అంటున్నావు అనుకున్నా. 114 00:07:55,559 --> 00:07:58,395 కాలువ అంటే భద్రతాపరంగా చాలా సమస్యలు వస్తాయి, మార్తా. 115 00:07:58,395 --> 00:08:00,105 దాన్ని నేను ఆమోదించను. 116 00:08:01,815 --> 00:08:03,442 ఒకటి చెప్పాలంటే, నీట మునిగి చనిపోవడం. 117 00:08:04,860 --> 00:08:06,320 నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. 118 00:08:06,320 --> 00:08:07,571 లేదు, నేను బిజీగా ఉన్నాను. 119 00:08:07,571 --> 00:08:10,407 నువ్వు మా చిన్ని ఊరులో జరిగే డీర్ ఫెస్ట్ అనే ఉత్సవం గురించి వినే ఉంటావు కదా, 120 00:08:10,407 --> 00:08:12,367 అది కూడా నేనొక్కదాన్నే ప్లాన్ చేసింది. 121 00:08:13,160 --> 00:08:14,703 తర్వాతి పురపాలక సమావేశంలో దాన్ని ప్రస్తావిస్తాను, 122 00:08:14,703 --> 00:08:17,414 కానీ నేను అది పక్కాగా జరుగుతుందని మాత్రం హామీ ఇవ్వలేను. 123 00:08:18,457 --> 00:08:19,499 ఓరి నాయనోయ్. 124 00:08:20,167 --> 00:08:23,921 నేను మార్తా నుండి విడిపోయి 30 ఏళ్లయింది, అయినా కానీ తను నాకు ఏదోక వంకతో కాల్ చేస్తూనే ఉంటుంది. 125 00:08:25,088 --> 00:08:26,632 కాస్, నువ్వు ఇంకొన్ని మగ్గులను తెచ్చి ఉంటే... 126 00:08:27,257 --> 00:08:29,927 నువ్వు ఇటీవల మధ్య వైన్ గ్లాసులు, టీ టవల్స్ వంటి వాటిని తోయడానికే 127 00:08:29,927 --> 00:08:32,179 నా తల ప్రాణం తోకకి వస్తోంది. 128 00:08:32,179 --> 00:08:34,347 ఇవి టీ షర్టులు, 129 00:08:34,347 --> 00:08:36,850 ఇంకా వాటిని నువ్వు వెనుక దాచి పెట్టకుండా 130 00:08:36,850 --> 00:08:39,852 ఈ "ఇజ్జీ సెలక్షన్స్"తో పెడితే 131 00:08:39,852 --> 00:08:41,855 -అవి కూడా అమ్ముడయిపోతాయి. -పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 132 00:08:41,855 --> 00:08:44,066 -నన్ను బంధుప్రీతి చూపిస్తున్నానని అంటారు. -అమ్మా, ఇది నీ షాపే కదా. 133 00:08:44,066 --> 00:08:46,693 ఇది నా ఆఫీసు కూడా, పైగా నాపై నిరంతర నిఘా ఉంటుంది. 134 00:08:46,693 --> 00:08:49,404 నేను మేయర్ కదా, ప్రతీది రాజకీయం చేస్తారు. 135 00:08:50,155 --> 00:08:52,324 {\an8}ఓరి దేవుడా. అసలు దీని అర్థం ఏంటి, కాస్? 136 00:08:52,324 --> 00:08:53,408 {\an8}బాతు అంత స్త్రీవాదిని 137 00:08:53,408 --> 00:08:54,952 దానికి అర్థమేమీ లేదు. అది జోక్ అంతే. 138 00:08:54,952 --> 00:08:57,287 అయితే మహారాణిగా ఇది నీ తొలి చర్యనా? 139 00:08:57,287 --> 00:09:00,165 నీ ప్రజల కోసం అర్థం పర్థం లేని టీ-షర్టులు చేయడం? 140 00:09:00,707 --> 00:09:02,501 -అసలు అది నీకెలా... -నాట్ చెప్పింది. 141 00:09:02,501 --> 00:09:04,378 ఇంకో విషయం చెప్పనా? 142 00:09:04,962 --> 00:09:07,965 ఆ యంత్రం నుండి "డాన్సర్" అని నాకు వచ్చింది, అది నేను సాధించిందే, 143 00:09:07,965 --> 00:09:10,759 కానీ దాని గురించి అందరికీ నేను డబ్బా కొట్టుకోను కదా. 144 00:09:10,759 --> 00:09:12,678 నేనేమీ డబ్బా కొట్టుకోలేదు. 145 00:09:12,678 --> 00:09:14,221 నిజంగానే చెప్తున్నా. నాట్ అప్పుడు అక్కడ ఉంది. 146 00:09:14,221 --> 00:09:16,682 లిప్ స్టిక్కును కూడా నాట్ సూచించిందా? 147 00:09:17,266 --> 00:09:20,310 బహుశా దాని గురించి "డీర్ఫీల్డ్ డైజెస్ట్"లో రాస్తుందేమో. 148 00:09:20,310 --> 00:09:23,272 "మహిళ తనకి అస్సలు సరిపడని లిప్ స్టిక్కును వేసుకుంది." 149 00:09:23,272 --> 00:09:24,731 సరె, దానికి, దీనికి అస్సలు సంబంధం లేదు. 150 00:09:24,731 --> 00:09:26,817 రాత్రి డిన్నర్ ఇస్తున్నాం కాబట్టి నేను లిప్ స్టిక్ వేసుకున్నాను. 151 00:09:26,817 --> 00:09:29,069 -అది నీకు కూడా తెలుసు. -డిన్నర్ ఎందుకు హోస్ట్ చేస్తున్నారు? 152 00:09:30,028 --> 00:09:33,031 -డస్టీ పుట్టినరోజు కోసం. -అరవకు, కాస్. 153 00:09:33,031 --> 00:09:35,784 ప్రతీ ఒక్కరి పుట్టినరోజును నేను ఎక్కడ గుర్తుపెట్టుకొనేది! 154 00:09:35,784 --> 00:09:37,995 -నేనేం కంప్యూటరుని కాదు. -కానీ ఇవాళ అతని పుట్టినరోజు కాదు. 155 00:09:37,995 --> 00:09:39,329 అతని పుట్టినరోజు గడిచి 11 రోజులు అయింది, 156 00:09:39,329 --> 00:09:41,415 నీ వల్ల మేము డిన్నర్ ని మూడుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. 157 00:09:41,415 --> 00:09:43,041 నా క్యాలెండరులో ఉంటే, నేను వచ్చే దాన్నే. 158 00:09:43,041 --> 00:09:45,294 ఇంకేమైనా పని ఉందా లేదా నువ్వు వచ్చిన పని అయిందా? 159 00:09:46,128 --> 00:09:47,129 పని అయిపోయింది. 160 00:09:54,219 --> 00:09:57,639 మహారాణి మటిల్డాకి కజిన్ అయిన, బువాకి చెందిన స్టీఫెన్ 161 00:09:57,639 --> 00:09:59,183 ఏమన్నాడంటే, 162 00:09:59,183 --> 00:10:02,144 "హెన్రీ చనిపోయే ముందు తన వారసుడిని నేను కావచ్చు అని చెప్పాడు." 163 00:10:02,144 --> 00:10:03,979 కానీ మటిల్డా అర్హురాలని అందరికీ తెలుసు. 164 00:10:05,939 --> 00:10:07,191 మన్నించు, లిడియా. 165 00:10:08,192 --> 00:10:11,236 నీ ప్రసంగం చాలా బాగుంది, చాలా టాపిక్స్ ని ప్రస్తావించావు నువ్వు. 166 00:10:11,236 --> 00:10:15,115 అంటే... అందరూ పరధ్యానంలో ఉన్నట్టున్నారు. 167 00:10:16,158 --> 00:10:18,368 నాకు అది ఎందుకో అర్థమైంది. ఈ ఊరిలో ఇప్పుడు ఏం జరుగుతోందో, 168 00:10:18,368 --> 00:10:21,288 దాని గురించి మీకు అందరికీ చాలా సందేహాలు ఉన్నప్పుడు, 169 00:10:21,288 --> 00:10:23,540 చరిత్రపై మీకు ధ్యాస ఎలా కుదురుతుంది? 170 00:10:23,540 --> 00:10:26,960 మరీ ముఖ్యంగా, అసలు ఈ మార్ఫో యంత్రం ఎక్కడి నుండి వచ్చింది? 171 00:10:26,960 --> 00:10:29,087 అందరి మదిలోనూ అదే ప్రశ్న. 172 00:10:29,087 --> 00:10:31,340 అసలు మార్ఫో అంటే అర్థం ఏంటి? 173 00:10:31,340 --> 00:10:32,591 ఒక సీతాకోకచిలుక. 174 00:10:32,591 --> 00:10:35,010 అది సీతాకోకచిలుకే, అవును. అది నాకూ తెలుసు. 175 00:10:35,010 --> 00:10:36,887 ఇంటర్నెటులో నేను కూడా వెతికి చూశాను. 176 00:10:36,887 --> 00:10:39,598 దాని కోసం వెతకాలా? దానిపై ఒక పెద్ద సీతాకోకచిలుక లోగో ఉంది కదా. 177 00:10:39,598 --> 00:10:41,558 అది ఉండటం కూడా సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది, 178 00:10:41,558 --> 00:10:43,810 దానిపై వేలిముద్రలను పెట్టినప్పుడు అది సీతాకోకచిలుక రెక్కల ఆకారం చూపుతుంది. 179 00:10:43,810 --> 00:10:45,145 అది నాకు అర్థమైంది, లిడియా. 180 00:10:45,145 --> 00:10:48,524 నా ఉద్దేశం మార్ఫో అంటే వేరే అర్థం ఉందేమో, 181 00:10:48,524 --> 00:10:50,609 అది ఒక సంస్థ పేరేమో? 182 00:10:51,193 --> 00:10:53,320 కాబట్టి, నేను కాస్త వెతికి చూశాను... 183 00:10:53,320 --> 00:10:56,281 మేమందరం కూడా వెతికాం. ఒక నీలి మార్ఫో సీతాకోకచిలుక ఫోటోలు వస్తాయి, 184 00:10:56,281 --> 00:10:57,866 కానీ సంస్థ లాంటిదేమీ దొరకలేదు. 185 00:10:57,866 --> 00:11:00,160 సంస్థ పేరు అదే ఉంటుంది అనుకుంటున్నావా? 186 00:11:00,160 --> 00:11:02,371 వాళ్లు మన వేలిముద్రలను, సోషల్ సెక్యూరిటీ నంబర్లను తీసుకుంటున్నారు, 187 00:11:02,371 --> 00:11:04,915 అదేదో సమాచార సెకరణలాంటి చెత్త స్కీములా ఉంది. 188 00:11:04,915 --> 00:11:06,792 కానీ విషయమేమిటంటే, నేనెవరికీ నా వేలిముద్రలు ఇవ్వలేదు, 189 00:11:06,792 --> 00:11:08,252 ఇంకా జాన్సన్స్ లో వైఫై లేదు కూడా. 190 00:11:08,252 --> 00:11:09,920 హా, ఒకవేళ వాళ్లు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నా కూడా, 191 00:11:09,920 --> 00:11:12,005 నేనెప్పుడూ మీటియరాలజిస్టును అవుతానని కానీ, అసలు అవ్వాలనే ఆలోచన 192 00:11:12,005 --> 00:11:13,757 నాకు ఉన్నట్టు కానీ నేనెప్పుడూ అనలేదు. 193 00:11:13,757 --> 00:11:14,842 మనం చెప్పాల్సిన పని లేదు. 194 00:11:16,385 --> 00:11:19,471 జనాలు, తాము ఏం సాధించగలరో మార్చుకోవచ్చు, అలా కాదని ఎవరూ చెప్పలేరు. 195 00:11:19,888 --> 00:11:21,682 అలా జరగదు. నేను ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించి చూశాను. 196 00:11:21,682 --> 00:11:24,476 -సరే. -"మార్ఫో" అంటే గ్రీకులో "మంచి ఆకారం" గలదని అర్థం, 197 00:11:24,476 --> 00:11:26,937 ఇంకా ప్రాచీన కాలపు గ్రీకులు, నీలి రంగు మార్ఫో మన భవిష్యత్తు గురించి సందేశాలను 198 00:11:26,937 --> 00:11:29,815 తీసుకురాగలదని, కోరికలను తీర్చి, మీ విధి గురించి చెప్పగలదని నమ్మేవాళ్లు. 199 00:11:29,815 --> 00:11:32,860 దాన్ని గ్రూప్ చాట్లో పెట్టింది నేనె. కాబట్టి అది నీకు తెలిసినట్టు ఫోజు కొట్టకు. 200 00:11:32,860 --> 00:11:34,278 అదేమీ విధి కాదు. 201 00:11:36,029 --> 00:11:37,656 విధి అంటే, 202 00:11:38,323 --> 00:11:40,325 మనమేం చేసినా అది జరిగి తీరుతుంది. 203 00:11:40,325 --> 00:11:42,536 సాధించగలది అంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. 204 00:11:43,620 --> 00:11:45,706 అది మంచి విషయమే అయ్యుండాల్సిన అవసరం లేదు. 205 00:11:48,500 --> 00:11:50,586 ఓరి నాయనోయ్. నీకు వచ్చిన కార్డులో మంచి విషయం రాసి లేదా ఏంటి? 206 00:11:53,172 --> 00:11:55,257 -లేదు, నేను కేవలం... -నీకు ఏం వచ్చింది, జేకబ్? 207 00:11:55,257 --> 00:11:57,759 -నేనేం అంటున్నానంటే... -బాబోయ్. నీకు ఏం వచ్చింది? 208 00:11:59,052 --> 00:12:00,345 నేను ఇక వెళ్తాను. 209 00:12:01,054 --> 00:12:02,139 -అంతా బాగానే ఉందా? -హా, 210 00:12:02,139 --> 00:12:04,850 హెన్రీ క్లాసుకు నేను రాకపోయినా పర్వాలేదని మీరే అన్నారు కదా, కాబట్టి... 211 00:12:05,684 --> 00:12:07,019 -సరే. -థ్యాంక్యూ. 212 00:12:08,687 --> 00:12:10,272 మీరు అతనికి బాగా మండించినట్టున్నారు. 213 00:12:10,272 --> 00:12:12,900 సరే మరి. దీని నుండి అందరూ ఓ విషయం నేర్చుకుందాం, సరేనా? 214 00:12:12,900 --> 00:12:15,402 ప్రస్తుతం జేకబ్ మీద మరీ అంత ఒత్తిడి పెట్టకుండా ఉందాం. 215 00:12:15,402 --> 00:12:17,446 అతనికి మంచి కార్డ్ రాలేదా అని మొదట అడిగింది మీరే కదా. 216 00:12:17,446 --> 00:12:19,364 -లేదు. -అతనికి మంచి కార్డ్ రాలేదని తెలిసిపోతోంది. 217 00:12:19,364 --> 00:12:21,533 మంచిదైతే చెప్పడానికి ఏమైంది? 218 00:12:47,184 --> 00:12:48,227 కాపాడండి! 219 00:12:50,521 --> 00:12:51,522 కాపాడండి! 220 00:12:53,440 --> 00:12:55,192 కాపాడండి! ఎవరైనా ఉన్నారా? 221 00:13:01,698 --> 00:13:03,867 కాపాడండి! నన్ను కాపాడండి! 222 00:13:04,493 --> 00:13:05,494 కాపాడండి! 223 00:13:06,286 --> 00:13:08,080 -ఎవరది? -అయ్య బాబోయ్. 224 00:13:08,080 --> 00:13:09,248 జేకబ్! 225 00:13:11,208 --> 00:13:13,585 హేయ్, ఎలా ఉన్నావు? 226 00:13:14,795 --> 00:13:16,171 మీరు బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నా. 227 00:13:16,171 --> 00:13:18,257 నువ్వు ఇక్కడికి వచ్చాక, ప్రాణం లేచొచ్చింది. 228 00:13:18,257 --> 00:13:21,552 నా తలకు బాగా బలంగా తగిలింది, కానీ పర్వాలేదు అనుకుంటా. 229 00:13:21,552 --> 00:13:23,428 కదలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా, 230 00:13:23,428 --> 00:13:25,389 ఎందుకంటే, ఇలాంటప్పుడు కదలకూడదు అంటారు కదా. 231 00:13:25,389 --> 00:13:27,724 నా ఫోన్ బైకులో ఇరుక్కుపోయింది. 232 00:13:27,724 --> 00:13:30,102 సరే, కదలకండి. 233 00:13:30,102 --> 00:13:31,937 -అక్కడే కదలకుండా ఉండండి... -సరే. 234 00:13:31,937 --> 00:13:33,814 ...నేను సహాయం కోసం ఎవరినైనా తీసుకువస్తాను. సరేనా? 235 00:13:33,814 --> 00:13:35,607 -సరే, అలాగే. -సరేనా? 236 00:13:35,607 --> 00:13:36,942 -సరే. -అలాగే. 237 00:13:36,942 --> 00:13:38,402 -ఏమీ కాదు. -అబ్బా, ఛ. 238 00:13:38,402 --> 00:13:41,238 -గట్టిగా ఊపిరి పీల్చుకో. -నేను బాగానే ఉన్నా. అంతా బాగానే ఉంది. 239 00:13:41,238 --> 00:13:45,075 ఇది నువ్వు చేయగలవు, జేకబ్. నన్ను కాపాడే వీరుడివి నువ్వు. 240 00:13:46,827 --> 00:13:47,911 సరే మరి. 241 00:13:48,829 --> 00:13:50,914 -నిజం చెప్పాలంటే, నాకు కంగారుగా ఉంది. -ఎందుకు? 242 00:13:50,914 --> 00:13:52,416 నాన్నకి, తను ఇప్పటికే సాధించింది వచ్చిందని 243 00:13:52,416 --> 00:13:54,251 ఆ యంత్రం చెప్పడానికి ముందు వరకు, దానిపై విరుచుకుపడ్డాడు, 244 00:13:54,251 --> 00:13:56,545 ఇప్పుడు అమ్మకి జనాల హృదయంలో రాణి అని వచ్చింది. 245 00:13:56,545 --> 00:13:58,422 అంటే, అసలు దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు? 246 00:13:58,422 --> 00:14:00,215 నిజానికి, అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. 247 00:14:00,215 --> 00:14:02,593 మీ అమ్మ కూడా ఆ కార్డ్ వచ్చినందుకు గర్వంతో ఉప్పొంగిపోతోంది. 248 00:14:02,593 --> 00:14:06,597 నేనేమీ గర్వంతో ఉప్పొంగిపోవడం లేదు. నువ్వు ఇప్పుడు చాటింగ్ చేయడం అంత ముఖ్యమా? 249 00:14:06,597 --> 00:14:09,558 ప్రిన్సిపల్ పాట్ ని, తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి అడుగుతున్నాను, నీకు అభ్యంతరం లేదు కదా? 250 00:14:10,726 --> 00:14:13,604 -ప్రిన్సిపల్ పాట్ కి యాక్సిడెంట్ జరిగిందా? -నాకు చెప్పవద్దులే. 251 00:14:13,604 --> 00:14:16,273 నీ సంగతేంటి, ట్రీ? నీ కార్డుపై ఏం రాసుంది? 252 00:14:16,940 --> 00:14:19,651 -"పోటర్." ఆగా. -పోటర్. బాగుంది. 253 00:14:19,651 --> 00:14:21,028 అంటే, హ్యారీ పోటర్ లాగానా? 254 00:14:21,028 --> 00:14:23,614 అవును, నాన్నా. అలాగే. 255 00:14:23,614 --> 00:14:24,865 అంటే కమ్మరి అనా? 256 00:14:24,865 --> 00:14:26,658 -అవును, థ్యాంక్యూ. -హా. 257 00:14:26,658 --> 00:14:31,330 నా విద్యార్థుల్లో ఒకడు ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రై చేశాడు, ప్రతీసారి ఫలితం ఒక్కటే వచ్చింది. 258 00:14:31,330 --> 00:14:32,414 అవును. 259 00:14:33,207 --> 00:14:34,625 అవును అంటావేంటి? 260 00:14:34,625 --> 00:14:36,752 నీకు కూడా అలానే జరిగిందా? ఎన్నిసార్లు ట్రై చేశావు? 261 00:14:36,752 --> 00:14:38,462 -కొన్నిసార్లే. -నాకేం వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే, 262 00:14:38,462 --> 00:14:40,088 "డాన్సర్" అని వచ్చింది. 263 00:14:40,088 --> 00:14:41,507 అదేమంత ఆశ్చర్యం తెప్పించే విషయం కాదు. 264 00:14:42,382 --> 00:14:44,718 న్యూయార్కులో నా కెరీర్ విజయవంతంగా దూసుకెళ్లింది. 265 00:14:45,552 --> 00:14:48,430 కానీ అంతలోనే... విధి ఇలా చేసింది. 266 00:14:50,432 --> 00:14:53,143 చటెనుఫ్-డు-పాప్ వైన్ ఎవరికైనా కావాలా? 267 00:14:53,143 --> 00:14:54,394 నాకు కావాలి. 268 00:14:54,978 --> 00:14:57,397 ట్రీనాకి కాకుండా ఇంకెవరికైనా చటెనుఫ్-డు-పాప్ వైన్ కావాలా? 269 00:14:57,397 --> 00:15:00,275 నేను వద్దు అని అనలేను, కాస్. అది చాలా బాగుంది. 270 00:15:00,275 --> 00:15:04,363 ఇది 2011లో చేసిన వైన్, ఆ ఏడాది ఆ ప్రాంతంలో మంచి వైన్ తయారైంది. 271 00:15:04,363 --> 00:15:06,657 కాబట్టి, మీకు స్ట్రాబెర్రీ, లెదర్ల రుచి కూడా కాస్తంత తెలుస్తుంది. 272 00:15:06,657 --> 00:15:08,617 -వావ్. -నేను కూడా కొంత తీసుకుంటా. 273 00:15:10,077 --> 00:15:12,454 మనం ఎంతైనా పార్టీ చేసుకుంటున్నాం కదా! 274 00:15:12,454 --> 00:15:14,748 కేరీ, కనీసం డెసర్ట్ తినేదాకా అయినా ఆగదామని అనుకున్నా. 275 00:15:14,748 --> 00:15:15,832 కానీ నేను ఆగలేకపోతున్నా. 276 00:15:15,832 --> 00:15:18,460 -ఎట్టకేలకు మీరు రిటైర్ అవుతున్నారు కదా? -అదేం లేదు. 277 00:15:18,460 --> 00:15:20,796 కానీ మేము కొత్త ప్రయాణం చేయబోతున్నాం. 278 00:15:20,796 --> 00:15:23,924 నిజానికి మేము విడాకులు తీసుకుంటున్నాం. 279 00:15:27,427 --> 00:15:28,428 ఏంటి? 280 00:15:29,304 --> 00:15:31,849 మార్ఫో వల్లనే మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మేము చాలా ఆనందించాం. 281 00:15:33,559 --> 00:15:34,560 ఎలా... 282 00:15:34,560 --> 00:15:36,311 మార్ఫో వల్ల అంటే ఎలాగో చెప్పగలరా? 283 00:15:36,311 --> 00:15:39,356 -అంటే, నా కార్డ్ ద్వారా... -హా. 284 00:15:39,356 --> 00:15:41,608 ...నేను కొంత సమయం ఒంటరిగా గడపాల్సి ఉందని గ్రహించాను. 285 00:15:42,192 --> 00:15:47,114 కాబట్టి, నేను ఏ బంధమూ లేని ఒక మహిళగా ఒక ఏడాదికి యూరప్ కి పర్యటనకు వెళ్తున్నాను. 286 00:15:49,074 --> 00:15:50,576 ఏం జరుగుతోంది? 287 00:15:51,076 --> 00:15:52,786 నీ కార్డులో ఏముంది? 288 00:15:52,786 --> 00:15:54,371 -"నయం చేసే వ్యక్తి." -"నయం చేసే వ్యక్తా"? 289 00:15:54,371 --> 00:15:55,539 "నయం చేసే వ్యక్తి." 290 00:15:55,539 --> 00:15:59,543 నన్ను నేను నయం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ప్రకృతి నాకు చెప్తోంది. 291 00:15:59,543 --> 00:16:03,172 అది నువ్వు రోజు చేసే డాక్టర్ వృత్తికి సంబంధించిందేమో. 292 00:16:03,172 --> 00:16:06,008 లేదు. ఇక ఆ డాక్టర్ వృత్తికి ఓ దండం. 293 00:16:06,008 --> 00:16:09,052 ఇక డాక్టరుగా చేయడం నా వల్ల కాదు. ఐర్లాండ్ లో డాక్టరుగా పని చేశాను. 294 00:16:09,052 --> 00:16:11,972 ఇక్కడికి వచ్చి అమ్మ చేసే డాక్టర్ ప్రాక్టీసును కొనసాగించాను. 295 00:16:11,972 --> 00:16:15,893 బంగారం, నేనెప్పుడూ నాకోసం సమయం వెచ్చించనే లేదు, నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా. 296 00:16:15,893 --> 00:16:17,144 అది నిజం. 297 00:16:17,144 --> 00:16:18,604 ఇది నాకు ఆ విషయం గుర్తు చేసింది. 298 00:16:18,604 --> 00:16:20,981 -సూపర్, బామ్మా. -థ్యాంక్యూ, బంగారం. 299 00:16:20,981 --> 00:16:23,901 -నాకు "మేల్ మోడల్" అని వచ్చింది. -అయ్య బాబోయ్. 300 00:16:23,901 --> 00:16:25,152 పురుషుడు అని నిర్దిష్టంగా రాసి ఉందా? 301 00:16:25,152 --> 00:16:27,738 ఈయన ఫిగర్ కత్తిలా ఉంటుందని నేను ఈయనకు చాలా ఏళ్ల నుండి చెప్తూనే ఉన్నా. 302 00:16:27,738 --> 00:16:28,822 అవును, అంటే, 303 00:16:28,822 --> 00:16:31,283 -భార్యవి కాబట్టి అలాగే అంటావు. -ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు కదా. 304 00:16:31,283 --> 00:16:35,579 ప్రాంతీయ వాణిజ్య ప్రకటనల్లో పేరు గాంచిన ఒక ఏజెన్సీతో కార్ల్ ఇప్పటికే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు కూడా. 305 00:16:35,579 --> 00:16:37,581 -ఏ ప్రకటనలు? మాల్ లో బోర్డులలో... -అవును. 306 00:16:37,581 --> 00:16:39,499 ...ఇంకా సోగ్గాడైన శాంటా క్లాజ్ లా. 307 00:16:39,499 --> 00:16:41,168 -అయ్య బాబోయ్. -సోగ్గాడైన శాంటా క్లాజ్? 308 00:16:41,168 --> 00:16:42,419 హా. ఎవరికి తెలుసు. అది కూడా ఉంది. 309 00:16:42,419 --> 00:16:44,296 ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 310 00:16:45,255 --> 00:16:47,007 ఎలోయిస్, నేనూ మొన్న సరదాగా ఈ విషయం మాట్లాడుకున్నాం. 311 00:16:47,007 --> 00:16:48,759 "మనం ఎన్నో ఏళ్ల క్రితమే విడిపోయి ఉండాల్సింది," అని అన్నాను 312 00:16:48,759 --> 00:16:51,136 -నిజంగానే సూపర్ జోక్, నాన్నా. -కానీ, మేము విడిపోనందుకు ఆనందంగా ఉంది. 313 00:16:51,136 --> 00:16:54,973 ఎందుకంటే, విడిపోవడం వలన పిల్లలు ఎంత బాధపడతారో మాకు తెలుసు. 314 00:16:54,973 --> 00:16:56,934 లేదు, నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది 315 00:16:56,934 --> 00:16:58,977 నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇక్కడ. 316 00:16:58,977 --> 00:17:02,564 ఇజ్జీ! నిన్ను బాధపెట్టాలని అనలేదు... నేను నీ గురించి, మార్తా గురించి అనలేదు. 317 00:17:02,564 --> 00:17:05,651 విడిపోవడం వల్ల అన్ని సందర్భాల్లోనూ నష్టం జరగదులే. 318 00:17:05,651 --> 00:17:07,903 కాస్ అస్సలు రవ్వంత ప్రభావానికైనా లోను కాలేదు, తను చాలా గొప్పగా ఉంది. 319 00:17:07,903 --> 00:17:09,570 ఎలోయిస్, ఫీల్ అవ్వకు. 320 00:17:09,570 --> 00:17:11,740 ఈ మాత్రానికే నేను బాధపడిపోను. 321 00:17:12,449 --> 00:17:15,368 ఇంకా, నా కూతురు ఎంత గొప్పదో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. 322 00:17:16,619 --> 00:17:18,204 డిన్నర్ కి అందరికీ థ్యాంక్యూ. 323 00:17:18,204 --> 00:17:21,208 ఇంకా, పుట్టినరోజు శుభాకాంక్షలు, డస్టీ. 324 00:17:21,208 --> 00:17:23,710 అవును, ఇది నా పుట్టినరోజు పార్టీ కదా. 325 00:17:24,795 --> 00:17:25,753 బై, అమ్మమ్మా. 326 00:17:27,089 --> 00:17:29,758 వావ్. నన్ను మన్నించు. 327 00:17:29,758 --> 00:17:31,885 మీ అమ్మకి కోపం తెప్పించాలని నేను అనుకోలేదు. 328 00:17:32,469 --> 00:17:33,554 నేను తనని ఉద్దేశించి అనలేదు. 329 00:17:33,554 --> 00:17:35,305 అన్నీ తన గురించే అని తను అనుకుంటుంది. కాబట్టి... 330 00:17:35,305 --> 00:17:37,057 అయితే, మీ ఇద్దరి మధ్యా ఇంకా ప్రేమ ఉందా? 331 00:17:37,057 --> 00:17:38,600 ఉందిగా. 332 00:17:38,600 --> 00:17:41,645 చెప్తున్నా కదా, ఇప్పుడు అది మరీ ఎక్కువైంది. 333 00:17:42,479 --> 00:17:45,315 అందుకే, ఒకరికొకరం స్వేచ్ఛను ప్రసాదించుకుంటున్నాం. 334 00:17:50,445 --> 00:17:52,990 ఇది చాలా పెద్ద విషయమని నాకు తెలుసు. 335 00:17:52,990 --> 00:17:55,075 కానీ నువ్వు మాపై నమ్మకం ఉంచాలి. 336 00:17:55,075 --> 00:17:57,828 మాకు ఏది మంచిదో, అలాగే మా బంధానికి ఏది మంచిదో, ఆ పనే మేమ్ చేస్తున్నాం. 337 00:17:57,828 --> 00:17:59,997 -నువ్వు కండలను చూపిస్తున్నావా? -లేదు. 338 00:17:59,997 --> 00:18:01,623 నేను మామూలుగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి. 339 00:18:01,623 --> 00:18:03,500 ఇన్ని కండలు నీకు ఎప్పుడు వచ్చాయి, నాన్నా? 340 00:18:04,376 --> 00:18:05,460 ఇవేమీ పెద్ద కండలు కావులే. 341 00:18:06,753 --> 00:18:08,964 నాకు సాదాసీదాగా కండలు ఉన్నాయంతే. 342 00:18:08,964 --> 00:18:10,883 "మామూలు కండలు," అని అనవచ్చు. 343 00:18:10,883 --> 00:18:12,634 నేను అలా అని ఎప్పటికీ అనను. 344 00:18:12,634 --> 00:18:15,304 ఈ విషయంలో సానుకూల అంశాన్ని నువ్వు గమనిస్తావనే ఆశిస్తున్నా. 345 00:18:15,304 --> 00:18:19,683 అంటే, ఈ యంత్రం, ఇది మనకి... 346 00:18:19,683 --> 00:18:24,146 మనలోని కొత్త కోణాన్ని స్వాగతించడంలో, ఒకరి గురించి ఒకరం కొత్త విషయాలను తెలుసుకోవడంలో సహాయపడుతోంది. 347 00:18:24,146 --> 00:18:25,272 ఉదాహరణకు, నిన్నే తీసుకో, 348 00:18:25,272 --> 00:18:28,692 నాకు ఇన్ని కండలు ఉన్నాయని నీకు ఇప్పటిదాకా తెలీదు, కదా? 349 00:18:29,318 --> 00:18:32,196 -అలాగే నువ్వు ఈల వేస్తావని కూడా నాకు తెలీదు. -ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? 350 00:18:32,196 --> 00:18:34,323 చొక్కా విపుతున్నాను. 351 00:18:35,991 --> 00:18:37,492 నువ్వు కూడా విప్పేయ్. 352 00:18:37,492 --> 00:18:39,077 నేను చొక్కా విప్పను. 353 00:18:40,829 --> 00:18:42,831 నా కోసం ఈల వెయ్. 354 00:18:42,831 --> 00:18:43,916 ఇప్పుడే. 355 00:18:43,916 --> 00:18:46,793 నీ ఛాతీ ఏంటి, రెండు వేర్వేరు భాగాల్లో ఉంది? 356 00:18:46,793 --> 00:18:50,923 నేను ఒకేసారి ఈ చేతితో వ్యాయామం చేస్తాను, అలాగే ఈ చేతితో కూడా వ్యాయామం చేస్తాను. 357 00:18:51,507 --> 00:18:53,300 నా ఛాతీ మధ్య భాగంలో కాస్తంత సన్ స్క్రీన్ లోషన్ పూసుకుంటా. 358 00:18:53,884 --> 00:18:55,302 దాన్ని చూడాలని నాకు లేదులే. 359 00:18:55,302 --> 00:18:56,428 మరి... 360 00:18:59,431 --> 00:19:03,352 నువ్వు ఈల వేసే దాకా నేను చొక్కా వేసుకోను. 361 00:19:06,897 --> 00:19:10,192 నేను అన్నేళ్లు ఐర్లండ్ లో ఉన్నాను, 362 00:19:10,192 --> 00:19:14,571 యాభై డాలర్లు పెట్టుకొని ఉంటే స్పెయిన్ కి వెళ్లి ఎంచక్కా అక్కడే ఉండవచ్చు. 363 00:19:14,571 --> 00:19:17,407 అంటే, దాన్ని అంతలా మిస్ అవుతానని నేను అస్సలు గ్రహించలేదు. 364 00:19:18,116 --> 00:19:19,117 అవును. 365 00:19:19,117 --> 00:19:21,912 కాబట్టి, నువ్వు యూరప్ లోని మంచి మంచి ప్రాంతాలేవిటో నాకు చెప్పాలి. 366 00:19:21,912 --> 00:19:23,288 అవును మరి. 367 00:19:23,288 --> 00:19:26,124 అడగక అడగక నన్నే అడగాలి. 368 00:19:26,750 --> 00:19:29,837 ఒక్క నిమిషం. నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఒక సెమిస్టర్ విదేశాల్లో చదివావు కదా? 369 00:19:30,379 --> 00:19:31,463 కేవలం ఇటలీలో మాత్రమే. 370 00:19:32,005 --> 00:19:34,716 కేవలం ఇటలీలో మాత్రమే. సరే. 371 00:19:34,716 --> 00:19:37,094 అప్పుడు నేను టస్కానీలోని మోంటెపుల్సియానోలో ఉన్నాను. 372 00:19:37,094 --> 00:19:39,137 మోంటెపుటీయా... మళ్లీ చెప్పు. 373 00:19:39,137 --> 00:19:41,014 మోంటెపుల్సియానో. 374 00:19:41,014 --> 00:19:42,808 ఓరి దేవుడా. పేరు భలే ఉంది. 375 00:19:42,808 --> 00:19:48,647 ఒక చిన్ని కెఫే ఉండేది, అక్కడ నేను చదువుకుంటూ, వైన్ తాగుకుంటూ... 376 00:19:50,399 --> 00:19:52,192 -ఏవేవోలే. -ఏం చెప్పబోయావు? 377 00:19:54,152 --> 00:19:57,698 ఏమో మరి, నేను మోంటెపుల్సియానో డ్రింక్ తాగినప్పుడల్లా, 378 00:19:57,698 --> 00:19:59,908 వాళ్లు కెఫేని శుభ్రం చేయడానికి ఉపయోగించే 379 00:19:59,908 --> 00:20:02,703 లిన్ సీడ్ అయిల్ వాసన నాకు తెలిసేది. 380 00:20:03,996 --> 00:20:05,747 నువ్వు మళ్లీ అక్కడికి వెళ్లాలి. 381 00:20:05,747 --> 00:20:08,041 అబ్బా. 382 00:20:08,584 --> 00:20:10,210 నీ సూట్ కేసు ఎంత పెద్దది? నేను పడతానా? 383 00:20:10,210 --> 00:20:12,546 నేను చాలా చిన్నదాన్ని కదా, అందులో పట్టేస్తాలే. 384 00:20:12,546 --> 00:20:16,425 అయ్యయ్యో. చిటికెలో ఆ పని చేసేస్తా. ట్రీనాని హ్యాండ్ బ్యాగులో పెట్టేస్తా. 385 00:20:16,425 --> 00:20:19,219 ఓహో. నేను కూడా హ్యాండ్ బ్యాగులో పడతాను. 386 00:20:21,054 --> 00:20:23,724 కానీ, ఈ పనిని నేను ఒంటరిగా చేయాలనుకుంటున్నా. 387 00:20:26,226 --> 00:20:27,769 ఒక్క నిమిషం. మనం ఎందుకు అంట్లు తోమాలి? 388 00:20:27,769 --> 00:20:29,688 ఆ పురుషోత్తములు ఏం చేస్తున్నారో చూద్దాం పద. 389 00:20:45,078 --> 00:20:46,079 అబ్బో. 390 00:20:46,663 --> 00:20:48,665 ఓరి నాయనోయ్. 391 00:20:48,665 --> 00:20:49,958 అదరగొట్టేయ్, బంగారం. 392 00:20:49,958 --> 00:20:52,252 ఇక్కడ పురుషుల విషయాలు నడుస్తున్నాయి. 393 00:20:52,252 --> 00:20:53,837 అంటే, తండ్రీ కొడుకుల విషయం అని చెప్పవచ్చు. 394 00:20:53,837 --> 00:20:57,633 అవునులే. తండ్రీ కోడుకులంటే ఇలానే ఉంటారు మరి. 395 00:20:57,633 --> 00:20:59,092 కాబట్టి నేను... 396 00:20:59,092 --> 00:21:01,386 నేను ఇక్కడి నుండి తప్పుకుంటాను. 397 00:21:02,554 --> 00:21:04,515 ఈ చొక్కాతో ఏం చేస్తున్నావమ్మా? 398 00:21:04,515 --> 00:21:06,433 నువ్వు ఎందుకు? ఎందుకు... 399 00:21:06,433 --> 00:21:08,644 బంగారం, చొక్కాని ఎందుకు అలా పట్టుకున్నావు? 400 00:21:10,062 --> 00:21:12,898 కాస్ వెయిటర్ గా ఉన్నప్పటి సామాగ్రి 401 00:21:25,327 --> 00:21:26,620 నాన్నా. 402 00:21:26,620 --> 00:21:27,829 ఆయన్ని "నాన్నా" అని పిలవకు. 403 00:21:27,829 --> 00:21:31,083 ఓరి దేవుడా. నువ్వు... ఆపు ఇక. నేను నీకు పడిపోయేలా ఉన్నాను. 404 00:21:31,083 --> 00:21:33,293 నువ్వు నా మాజీ భార్యవి కాబట్టి అలా అంటున్నావు. 405 00:21:33,293 --> 00:21:36,547 సరే మరి, ఎలోయిస్. నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. 406 00:21:36,547 --> 00:21:39,007 -ఇది వైన్ కి సంబంధించింది... -సరే. 407 00:21:39,007 --> 00:21:41,343 ...కానీ ఇందులో అక్కడి ప్రాంతాల సమాచారం కూడా ఉంటుంది, కాబట్టి... 408 00:21:41,343 --> 00:21:42,928 నువ్వు ఇటలీకి మాత్రమే వెళ్లావనుకున్నానే. 409 00:21:42,928 --> 00:21:44,012 -ఇది... -అవును. 410 00:21:44,012 --> 00:21:46,682 ఒకానొక సమయంలో, ఫ్రాన్సుకు వెళ్లాలనే ఆలోచన నాకు ఉండేది, కానీ... 411 00:21:47,266 --> 00:21:49,226 -నాకు ఇది తీసుకోవాలంటే బాధగా ఉంది. -పర్వాలేదులే. 412 00:21:49,226 --> 00:21:51,270 నేను దీన్ని ఎప్పుడూ చూడను కూడా లేదు. 413 00:21:53,188 --> 00:21:54,731 థ్యాంక్యూ మరి. 414 00:21:54,731 --> 00:21:57,234 మీ ఇద్దరి మీదా మాకు ప్రేమ ఉందని మీకు తెలుసనే అనుకుంటున్నా. 415 00:21:57,234 --> 00:22:00,112 -లవ్ యూ టూ, అమ్మా. -లవ్ యూ టూ. 416 00:22:00,112 --> 00:22:02,865 -అవును. మాకు మీ ఇద్దరి మీదా ప్రేమ ఉంది. -హా. ఇప్పుడే అమ్మ చెప్పిందిలే, నాన్నా. 417 00:22:02,865 --> 00:22:05,284 అమ్మా ఇప్పుడే చెప్పింది. నీ ఒళ్లంతా చెమట ఉంది. అది చూడు. 418 00:22:05,284 --> 00:22:07,452 పర్వాలేదులే. ఆయన నుండి ఇంకా మంచి వాసనే వస్తోంది. 419 00:22:08,620 --> 00:22:12,291 సరే మరి. మా నాన్న వాసనను తర్వాత చూద్దాం. ముందు మీరు ఇంటికి బయలుదేరండి. 420 00:22:12,291 --> 00:22:14,001 సరే. అన్నీ తీసుకున్నావా, బంగారం. 421 00:22:15,210 --> 00:22:16,253 -లవ్ యూ. -జాగ్రత్త. 422 00:22:16,753 --> 00:22:17,754 మంచిగా ఉండండి. 423 00:22:21,133 --> 00:22:22,467 సారీ, ఏమన్నావు? 424 00:22:25,262 --> 00:22:28,265 హేయ్. నీకు అది షాక్ గా అనిపించి ఉంటుంది. 425 00:22:28,265 --> 00:22:31,894 -అవును. -కానీ వాళ్లు ఆనందంగానే ఉన్నట్టున్నారు. 426 00:22:31,894 --> 00:22:34,229 కాబట్టి, అంతా మంచే జరుగుతుంది, ఏమంటావు? 427 00:22:36,273 --> 00:22:37,441 అంటే, 428 00:22:37,441 --> 00:22:41,445 అది మరీ లెక్కలేనితనం అని, ఇంకా నిలకడలేని తనం అని 429 00:22:42,779 --> 00:22:43,906 నేను భావిస్తున్నాను. 430 00:22:43,906 --> 00:22:46,491 ఇప్పుడు క్యాట్ వాక్, ఇంకా ఈలల తంతు ముగిసింది కాబట్టి, 431 00:22:46,491 --> 00:22:49,620 మనం జనాలను విడాకులు తీసుకోమని ప్రోత్సహించనక్కర్లేదు. 432 00:22:49,620 --> 00:22:52,164 జనాలకు విడాకులు తీసుకోవడానికి ఆదర్శమూర్తులు అక్కర్లేదు, ఏమంటావు? 433 00:22:52,164 --> 00:22:54,791 -నేను... -ఇది వెర్రితనం! కాదంటావా? 434 00:22:55,334 --> 00:22:56,668 అందరికీ ఏమవుతోంది? 435 00:22:56,668 --> 00:22:58,921 అందరూ తమ జీవితాలను ఉన్నపళంగా ఎందుకు మార్చేసుకోవాలని తహతహలాడిపోతున్నారు? 436 00:22:58,921 --> 00:23:01,715 నువ్వు నాకు థెరమిన్ ఎందుకు ఇచ్చావు? దాని గురించి మాట్లాడుకుందాం. 437 00:23:02,424 --> 00:23:03,842 దేని గురించి? థెరమిన్ గురించా? 438 00:23:03,842 --> 00:23:06,220 అవును, థెరమిన్ గురించే. 439 00:23:06,220 --> 00:23:08,680 నేనేమీ దాన్ని అడగలేదు. అది నా జాబితాలో లేనే లేదు. 440 00:23:08,680 --> 00:23:09,932 నువ్వు ఏం... 441 00:23:10,682 --> 00:23:13,602 అలాంటిది కానుకగా ఇచ్చి, నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? 442 00:23:13,602 --> 00:23:17,397 విభిన్నమైనది, ప్రత్యేకమైనది ఒక దాన్ని నువ్వు ఉపయోగిస్తే బాగుంటుందని ఇచ్చాను. 443 00:23:18,023 --> 00:23:19,399 ఎందుకంటే, నేను ప్రత్యేకమైనవాడిని కాదు. 444 00:23:19,399 --> 00:23:22,611 ఓరి దేవుడా, డస్టీ. ఏం మాట్లాడుతున్నావు? 445 00:23:22,611 --> 00:23:25,739 నువ్వు ప్రత్యేకమైనవాడివే. నువ్వు చాలా గొప్పవాడివి. 446 00:23:26,240 --> 00:23:28,951 కానీ, బంగారం, మీ నాన్న ఒక కొత్త వృత్తిలోకి అడుగుపెట్టాడు, 447 00:23:28,951 --> 00:23:30,369 మీ అమ్మ ప్రపంచ యాత్ర చేస్తోంది, 448 00:23:30,369 --> 00:23:33,330 కానీ నువ్వు ఒక చిన్న సంగీత వాయిద్యాన్ని కూడా ఉపయోగించి చూడలేవా? 449 00:23:33,330 --> 00:23:35,415 -తను యూరప్ అని ఉంది. -ఏంటి? 450 00:23:35,415 --> 00:23:37,709 కాదు, ఇప్పుడే అన్నావు కదా, "తను ప్రపంచ యాత్ర చేస్తోంది," అని. 451 00:23:37,709 --> 00:23:38,877 నిజానికి తను యూరప్ అని అంది. 452 00:23:38,877 --> 00:23:41,922 ఏదేమైనా, తను ఒక ఖండానికి వెళ్తుంది, కానీ నువ్వు ఏమీ ప్రయత్నించడం లేదు కదా, కాబట్టి... 453 00:23:41,922 --> 00:23:44,842 నేను యూరప్ కి వెళ్లాను, కాస్. ఐర్లండ్ ఏ ఖండంలో ఉందనుకుంటున్నావు? 454 00:23:44,842 --> 00:23:48,136 నువ్వు యూరప్ కి వెళ్లాలేదు, డస్టీ. 455 00:23:48,136 --> 00:23:51,014 నువ్వు యూరప్ నుండి వచ్చావు. నిజానికి, నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదు. 456 00:23:51,014 --> 00:23:52,850 క్షమించు, ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన వీర వనితా? 457 00:23:52,850 --> 00:23:56,979 రెండు దశాబ్దాల క్రితం, వైన్ యార్డులలో నువ్వు చేసిన చిన్న యాత్రను మర్చిపోయాను. 458 00:23:59,231 --> 00:24:00,357 నన్ను కూడా క్షమించు. 459 00:24:00,858 --> 00:24:06,071 బావిలోనే కప్పలా ఉండిపోవాలని నువ్వు అనుకుంటున్నందుకు మన్నించు. 460 00:24:07,155 --> 00:24:09,575 అలాగే, నువ్వు అడగని దాన్ని కానుకగా ఇచ్చినందుకు కూడా మన్నించు. 461 00:24:10,242 --> 00:24:11,952 -క్షమించేస్తున్నా. -లేదు! 462 00:24:12,786 --> 00:24:14,413 నేను మనస్ఫూర్తిగా చెప్పనప్పుడు నువ్వు క్షమించలేవు, కనుక... 463 00:24:14,413 --> 00:24:15,998 నేను మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నా. 464 00:24:18,166 --> 00:24:20,252 నేను ఆనందంగా ఉన్నానా లేదా అని అడిగావు. 465 00:24:22,421 --> 00:24:23,714 ఇంతకీ నువ్వు ఆనందంగా ఉన్నావా? 466 00:24:24,506 --> 00:24:25,674 ఇది ఆనందం... 467 00:24:25,674 --> 00:24:30,345 ఇది అనందంగా ఉండటమో, కాదో నాకు తెలీదు, కాస్. 468 00:24:30,345 --> 00:24:33,599 దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు, అక్కడి దాకా బాగానే ఉంది. 469 00:24:34,183 --> 00:24:36,101 కానీ ఇప్పుడొక చెత్త యంత్రం ఒకటి వచ్చి పడింది, 470 00:24:36,101 --> 00:24:37,519 నేను ఎప్పుడూ దాని గురించే ఆలోచించాల్సి వస్తోంది. 471 00:24:37,519 --> 00:24:39,730 నేను కూడా దాని గురించే ఆలోచించాల్సి వస్తోంది. 472 00:24:39,730 --> 00:24:43,525 కానీ, నేను ఆనందంగా ఉండగలనా, ఎలా ఉండగలను అని ఆలోచిస్తున్నాను. 473 00:24:45,986 --> 00:24:47,738 నువ్వు కూడా అలా ఆలోచిస్తే మంచిదేమో. 474 00:24:59,666 --> 00:25:01,376 ఇవాళ కొత్తగా ఒకటి జరిగింది. 475 00:25:01,376 --> 00:25:02,461 ఏంటది? 476 00:25:02,461 --> 00:25:04,463 నువ్వూ, నాన్నా గొడవ పడటం. 477 00:25:05,839 --> 00:25:08,050 అంటే, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. 478 00:25:08,550 --> 00:25:10,511 -మేము బాగానే ఉన్నాం. -నాకేమీ ఆందోళన లేదులే. 479 00:25:10,511 --> 00:25:14,223 నిజంగా ఆనందంగా ఉన్నవాళ్లే విడాకులు తీసుకుంటారని ఇందాకే తెలిసింది. 480 00:25:14,223 --> 00:25:18,018 వైనును రుచి చూడటంలో అయిదు దశలు ఉంటాయి, తెలుసా? 481 00:25:19,520 --> 00:25:21,939 వైనును అలా తాగేయకూడదు... వావ్. 482 00:25:21,939 --> 00:25:23,690 అయిదు దశలు అన్నావే, అవి ఏవి? 483 00:25:24,149 --> 00:25:26,944 సరే మరి. అది నువ్వేమీ చేయాల్సిన పని లేకుండానే నీకు దక్కేసింది. 484 00:25:27,694 --> 00:25:31,740 మొదటి దశ ఏంటంటే, నువ్వు రంగును చూడాలి. 485 00:25:33,951 --> 00:25:34,952 వావ్. 486 00:25:35,285 --> 00:25:39,456 సరే, ఇప్పుడు ఈ గ్లాసును పైకెత్తి పట్టు. దీపం వైపు దాన్ని పెట్టు. 487 00:25:40,415 --> 00:25:41,792 ఎర్రగా ఉంది. 488 00:25:42,960 --> 00:25:45,212 తర్వాత, నువ్వు గ్లాసును తిప్పాలి. సరే. 489 00:25:45,212 --> 00:25:46,922 మణికట్టుతో చాలా నెమ్మదిగా తిప్పాలి. 490 00:25:47,714 --> 00:25:50,676 సరే, అప్పుడు వైన్ లోకి గాలి కలుస్తుంది. 491 00:25:50,676 --> 00:25:53,470 ఇప్పుడు, గ్లాసుకు పక్కన ఉండే ఆ గీతలు కనబడుతున్నాయా? 492 00:25:54,179 --> 00:25:55,931 -కనబడుతున్నాయి. -వాటిని లెగ్స్ అంటారు. 493 00:25:55,931 --> 00:26:00,018 ఒక సందేహం. మనం అసలు వైనును తాగుతామా, లేకపోతే కేవలం ఇలా పట్టుకొని... 494 00:26:00,018 --> 00:26:02,062 వాసన చూసి, ఏం వాసన వస్తోందో నాకు చెప్పగలవా? 495 00:26:04,273 --> 00:26:05,399 చెర్రీ వాసన వస్తోందే? 496 00:26:05,399 --> 00:26:07,609 -అవును. సరే. ఇక తాగు. -సరే. 497 00:26:11,280 --> 00:26:13,949 తాగు. అంతే. అంతే. సూపర్. 498 00:26:15,617 --> 00:26:17,661 ఇక రుచిని ఆస్వాదించు. 499 00:26:25,586 --> 00:26:29,006 ఈ మార్ఫో యంత్రం నిజంగానే మీ జీవితాలలో అలజడి సృష్టిస్తోంది కదా? 500 00:26:31,133 --> 00:26:32,551 అవును. 501 00:26:33,719 --> 00:26:35,345 నేను ఏం గ్రహిస్తున్నానంటే, 502 00:26:35,345 --> 00:26:40,017 నువ్వు ఆరాధించే అమ్మగా ఉండటమే నాకు కావాలి. 503 00:26:40,934 --> 00:26:41,977 నువ్వు అలాగే ఉన్నావులే. 504 00:26:42,769 --> 00:26:47,357 అది కాదు, కానీ... అలా ఉండాలంటే, నేను... 505 00:26:47,357 --> 00:26:49,443 నేను చికాకులు లాంటివి పడకూడదు. 506 00:26:49,443 --> 00:26:53,488 అంటే, నేను కన్న కలలన్నీ కల్లలు అయిపోయాయి కనుక, వాటి గురించి నిరాశపడిపోతూ, 507 00:26:53,488 --> 00:26:56,783 ఆ కారణంగా అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను చిన్నచూపు చూడటం నాకు ఇష్టముండదు. 508 00:26:57,659 --> 00:27:00,329 నా బతుకు కూడా అలాగే ఏడ్చిందిలే. 509 00:27:00,329 --> 00:27:02,331 అది పూర్తిగా ఆలోచనలకే పరిమితమైన విషయంలే. 510 00:27:02,331 --> 00:27:04,041 అవును. అవునులే. 511 00:27:05,792 --> 00:27:07,211 నిన్ను నాశనం చేయాలని నాకు లేదు. 512 00:27:08,420 --> 00:27:11,048 నా జీవితం ఇప్పటికే నాశనం అయ్యే ఉందిలే. 513 00:27:11,048 --> 00:27:13,634 కాబట్టి, ఇక నీకు ఆ అవకాశం రాకపోవచ్చు. 514 00:27:26,355 --> 00:27:29,274 ఇదంతా ఆ యంత్రం గురించే అయితే, 515 00:27:29,274 --> 00:27:32,069 నువ్వు మరీ అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటా. 516 00:27:32,069 --> 00:27:34,613 నువ్వు అది ముఖ్యమని అనుకుంటేనే అది ముఖ్యమైనది అవుతుంది. 517 00:27:40,452 --> 00:27:43,163 అది ముఖ్యమైనదిగానే ఉండాలని అనుకుంటున్నా, ట్రీనా. 518 00:27:43,163 --> 00:27:44,998 ఒకవేళ అది... 519 00:27:46,124 --> 00:27:48,126 నీకు నన్ను చూస్తే నవ్వు వస్తుందని నాకు తెలుసు, కానీ... 520 00:27:48,126 --> 00:27:49,837 నాకేమీ నవ్వు రావట్లేదు. 521 00:27:51,547 --> 00:27:53,465 దానికి అర్థం ఉండేలా చేయాలనుకుంటున్నా. 522 00:27:54,675 --> 00:27:55,759 అలాంటప్పుడు... 523 00:27:57,803 --> 00:27:59,221 దానికి అర్థం ఉండేలా చేయి మరి. 524 00:28:57,779 --> 00:28:59,656 {\an8}రాచరికత్వం 525 00:29:12,419 --> 00:29:15,631 {\an8}నా ఉత్పత్తులను నాకు ఇచ్చేయ్. నువ్వు వాటిని అమ్మకూడదు. 526 00:29:15,631 --> 00:29:17,257 నేను నీకు మళ్లీ కాల్ చేస్తాను. 527 00:29:19,510 --> 00:29:21,595 -ఏమన్నావు? -విన్నావు కదా. 528 00:29:22,429 --> 00:29:26,308 ఇతరులకు ఏం కావాలో నువ్వు నిర్ణయించలేవు. 529 00:29:26,308 --> 00:29:27,559 సరేనా? 530 00:29:27,559 --> 00:29:31,355 డీర్ఫీల్డ్ లోని జనాలు, నీ తొక్కలో జింక వస్తువులు కావాలనుకుంటున్నారని భావిస్తున్నావా? 531 00:29:31,355 --> 00:29:36,193 అసలు ఇక్కడి జనాలకు ఈ ఊర్లో ఎప్పుడైనా కనీసం ఒక్క జింక అయినా కనబడిందా? 532 00:29:36,193 --> 00:29:39,488 అసలు దీని పేరు డీర్ఫీల్డ్ అని కాకుండా, ఉత్త ఫీల్డ్ అని ఉండాలి. 533 00:29:39,488 --> 00:29:44,743 ఆ జింక బొమ్మలే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి మరి. నువ్వు చేసిన వస్తువుల్లా అవి ఓ మూలన పడి లేవు. 534 00:29:44,743 --> 00:29:46,662 అవునా? అవునా? 535 00:29:46,662 --> 00:29:50,123 సరే, ఇప్పుడు నీ షాపులో ఎక్కువగా అమ్ముడుపోయే ఇతర వస్తువులను ఓసారి పరిశీలిద్దామా? 536 00:29:50,624 --> 00:29:51,917 ఇక్కడ ఉన్న దీని లాగా. అబ్బో! అబ్బొబ్బో! 537 00:29:53,460 --> 00:29:57,965 {\an8}"కుటుంబం ఉంటే ఇల్లు పొదరిల్లు అవుతుంది." నిజంగానా? ఇల్లు పొదరిల్లు అయిపోతుందంటావా? 538 00:29:57,965 --> 00:30:01,134 అయితే, వీటన్నింటినీ నేనే కొనుక్కుంటానులే. 539 00:30:01,134 --> 00:30:04,388 ఇంకా ఈ రాయిని కూడా, ఎందుకంటే మనందరికీ తెలుసు, 540 00:30:04,388 --> 00:30:06,557 "డీర్ఫీల్డ్ రాళ్లు" అదరహో కదా. 541 00:30:06,557 --> 00:30:08,892 అంటే, ఏ రాళ్లు అదరహో అనిపించవో తెలుసా? 542 00:30:09,685 --> 00:30:12,104 పెయింట్ వేసిన రాళ్ళు. పెయింట్ వేసిన రాళ్లు అదరహో అనిపించవు. 543 00:30:12,688 --> 00:30:14,898 పెయింట్ వేసిన రాళ్ళు దరిద్రంగా ఉంటాయి! 544 00:30:14,898 --> 00:30:16,608 నీకు నా రాళ్లు నచ్చలేదా? 545 00:30:18,402 --> 00:30:20,237 షీలా. నాకు నీ రాళ్లంటే ప్రాణం, అవి సూపర్ గా ఉన్నాయి. 546 00:30:20,237 --> 00:30:22,239 నేను నీ రాళ్ల గురించి కాకుండా మామూలుగా చెప్తున్నానంతే. 547 00:30:22,239 --> 00:30:26,285 కాబట్టి, నీ రాయిని కొనాలని నాకు చాలా ఆశగా ఉంది. 548 00:30:27,160 --> 00:30:29,162 యాభై డాలర్లా చిన్న రాయికి? 549 00:30:29,162 --> 00:30:32,249 ఎంతో జాగ్రత్తగా చెక్కాను కాబట్టి వీటి ధర చాలా ఎక్కువ అన్నమాట. 550 00:30:32,749 --> 00:30:33,750 సరే. 551 00:30:33,750 --> 00:30:35,961 ఓ విషయం చెప్పనా? నేను మళ్లీ వచ్చి నీ రాయిని కొంటాను. 552 00:30:35,961 --> 00:30:40,591 ఇప్పుడు, నా చేతులు ఖాళీ లేవు, ఎందుకంటే, నేను ఈ దిండులని తీసుకువెళ్తున్నాను. 553 00:30:40,591 --> 00:30:42,176 మేయర్ కి కాల్ చేసుకో. 554 00:30:51,560 --> 00:30:55,063 సరే. నీకు ఇది చేయడం ఇష్టం లేదని నాకు తెలుసు. 555 00:30:55,063 --> 00:30:59,151 కానీ ఇది జనాలకు స్ఫూర్తి కలిగిస్తుందని నాకు అనిపిస్తోంది. 556 00:31:00,694 --> 00:31:02,738 {\an8}ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. 557 00:31:02,738 --> 00:31:07,034 {\an8}నాకు తెలుసు, కానీ, ఇది షాపుకు బిజినెస్ పెంచడంలో సహాయపడుతుంది. 558 00:31:09,536 --> 00:31:12,956 {\an8}ఇప్పుడు దాన్ని కనిపించేలా పైకి పెట్టు. 559 00:31:17,336 --> 00:31:19,171 {\an8}హీరో 560 00:31:27,262 --> 00:31:29,181 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 561 00:32:49,011 --> 00:32:51,013 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్