1 00:00:11,720 --> 00:00:13,013 {\an8}మార్ఫో ప్రారంభించడానికి నాణేన్ని వేయండి 2 00:00:18,810 --> 00:00:19,811 బాగుంది. 3 00:00:20,312 --> 00:00:21,855 మీ జీవిత సామర్థ్యాన్ని 4 00:00:21,855 --> 00:00:22,773 సాధించడానికి 5 00:00:24,399 --> 00:00:25,400 మీరు ఎవరో 6 00:00:25,400 --> 00:00:26,777 తెలుసుకోవాల్సిన అవసరం ఉంది 7 00:00:31,490 --> 00:00:32,491 అది నేనే. 8 00:00:33,116 --> 00:00:34,076 అది... 9 00:00:36,912 --> 00:00:40,415 హలో, అందగాడా, అల్లరి పిల్లోడా. ఏం చేస్తున్నావు? 10 00:00:41,291 --> 00:00:42,709 విస్లర్ 11 00:00:44,336 --> 00:00:45,337 "విస్లర్." 12 00:00:46,255 --> 00:00:48,507 నాకు ముందే తెలుసు. 13 00:00:53,929 --> 00:00:55,639 వావ్. సరే. 14 00:00:59,226 --> 00:01:00,394 ఆ ఫీలింగ్ నాకు గుర్తుంది. 15 00:01:07,818 --> 00:01:08,819 ఏంటి? 16 00:01:11,029 --> 00:01:12,573 కొనసాగాలనుకుంటున్నారా? 17 00:01:13,740 --> 00:01:15,284 ఆ పని ఎలా చేయాలి? ఎలా చేయాలి? 18 00:01:21,748 --> 00:01:24,751 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 19 00:01:29,256 --> 00:01:30,257 ఏం జరిగింది? 20 00:01:33,302 --> 00:01:34,928 మీరే చూడండి. 21 00:01:57,910 --> 00:02:00,454 - అదెలా చేయాలో మీకెలా తెలుసు? - మాకు తెలీదు. అసలు మేము ఏమీ చేయడం లేదు కూడా. 22 00:02:00,454 --> 00:02:02,206 దాన్ని ఏదైనా చీట్ కోడుతో అన్ లాక్ చేయాలేమో అనిపించింది. 23 00:02:02,206 --> 00:02:03,582 అది ఇదే అనుకుంటా. 24 00:02:03,582 --> 00:02:05,792 కానీ థెరెమిన్ ని ఎలా వాయించాలో మీకెలా తెలిసింది? 25 00:02:05,792 --> 00:02:07,794 నాకు తెలీదు. మాకు చాలా సేపే పట్టింది. 26 00:02:07,794 --> 00:02:09,463 ఇంతకు ముందు ఎప్పుడైనా వాయించారా? 27 00:02:09,463 --> 00:02:12,007 - లేదు అనుకుంటా. - లేదు అనుకుంటావా? 28 00:02:12,007 --> 00:02:14,426 నాకు తెలీదు. జేకబ్ నాకు సాయం చేశాడు. 29 00:02:14,426 --> 00:02:17,054 కాబట్టి, మార్ఫోని అన్ లాక్ చేసింది నేనని ఎవరికీ చెప్పకు. 30 00:02:17,054 --> 00:02:19,806 ఈ యంత్రం గురించి నాకు ప్రతీది తెలుసని జనాలు ఇప్పటికే అనేసుకుంటున్నారు. 31 00:02:19,806 --> 00:02:21,975 - వాళ్లు ఇంకా ప్రశ్నలు అడిగితే నేను తట్టుకోలేను. - సరే. 32 00:02:21,975 --> 00:02:24,603 ఓ విషయం చెప్పనా? అది కనిపెట్టింది నేనేనని చెప్దామా? 33 00:02:25,187 --> 00:02:27,064 నాకు ప్రమేయం ఉంది కాబట్టి, కనిపెట్టింది నేనే అని చెప్దాం. 34 00:02:27,064 --> 00:02:29,149 థెరెమిన్ ని ఎలా వాయించాలో నాకు తెలుసు, 35 00:02:29,149 --> 00:02:32,152 కాబట్టి కనిపెట్టింది నేనే అని చెప్తే, మరింత నమ్మశక్యంగా ఉంటుంది. ఒక్క నిమిషం. 36 00:02:33,320 --> 00:02:37,199 దీన్ని నేను వాయించాను. దీన్ని నాకు ఇవ్వక ముందు కాస్ కూడా వాయించిందట. 37 00:02:37,199 --> 00:02:39,117 హానాకి కూడా దీన్ని వాయించడం ఎలాగో తెలుసట. 38 00:02:39,117 --> 00:02:42,204 మా ముగ్గురిలో ఉమ్మడిగా ఉన్న విషయం ఏంటి? 39 00:02:42,204 --> 00:02:43,914 - మీ అందరికీ నీలి చుక్కలున్నాయి, అదేనా? - ఏమీ లేవు. 40 00:02:43,914 --> 00:02:45,999 మా అందరికీ నీలి చుక్కలున్నాయి. 41 00:02:45,999 --> 00:02:47,709 జేకబ్, నువ్వు థెరెమిన్ ని వాయించాలి. 42 00:02:47,709 --> 00:02:50,337 సరే. కానీ నాకు నీలి చుక్కలు వద్దులే. 43 00:02:50,921 --> 00:02:53,632 భలేవాడివే, జేకబ్. వాటిని నేను తీసేసుకుంటాగా. 44 00:02:53,632 --> 00:02:55,926 కానివ్వు. నీకు ఈ మిస్టరీని ఛేదించాలని ఉందా లేదా? 45 00:02:55,926 --> 00:02:57,135 ఇది పని చేయట్లేదు. 46 00:02:57,886 --> 00:03:00,097 - ఇందాకే వాయించావు కదా. - ఇప్పుడు పని చేయట్లేదు. 47 00:03:00,764 --> 00:03:03,183 - వైర్ కనెక్ట్ చేసి ఉందా? - దీనికి వైర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 48 00:03:03,976 --> 00:03:05,269 ఏం చేశావు దీన్ని? 49 00:03:07,688 --> 00:03:09,147 - హేయ్. - ఏం జరుగుతోంది? 50 00:03:09,147 --> 00:03:11,692 - మిసెస్ హొబ్బర్డ్, మీరు చేశారా? - యంత్రం లోపల నీ పాత్ర కూడా ఉందా? 51 00:03:12,192 --> 00:03:15,237 - వేరెవరైనా ప్రయత్నించి చూడాలనుకుంటా. - నా దగ్గర కార్డ్ లేదు. కాబట్టి... 52 00:03:15,237 --> 00:03:17,364 నా దగ్గర ఉంది. కానీ తిరిగేటప్పుడు దాన్ని నా దగ్గర పెట్టుకోను. 53 00:03:17,865 --> 00:03:20,409 నేను కూడా తిరిగేటప్పుడు దాన్ని నా దగ్గర పెట్టుకోను. అది నా రోబ్ లో ఉండింది. 54 00:03:20,409 --> 00:03:21,618 నీ రోబ్ ని నువ్వు ఉతుక్కోవా? 55 00:03:21,618 --> 00:03:23,328 ఎవరూ రోబ్ ని ఉతుక్కోరు. దాన్ని అలాగే వదిలేస్తారు. 56 00:03:23,328 --> 00:03:25,205 అందరూ రోబ్ ని ఉతుక్కుంటారు. 57 00:03:25,205 --> 00:03:28,041 డస్టీ. నేను నీతో మాట్లాడాలి. 58 00:03:29,960 --> 00:03:32,379 - మనమెలా ఉంటామో దానికి ఎలా తెలుసు? - ఏమో. 59 00:03:34,089 --> 00:03:35,632 నీ పాత్ర కూడా స్కీయింగ్ చేసిందా? లేదు కదా? 60 00:03:35,632 --> 00:03:36,925 లేదు. 61 00:03:36,925 --> 00:03:39,928 నాది నీ దాని కన్నా కాస్త భయంకరంగా ఉంటుందిలే. 62 00:03:42,097 --> 00:03:47,895 {\an8}నేను డీర్ ఫెస్ట్ లో ఉన్నాను అన్నమాట, సరేనా? అది డీర్ ఫెస్ట్ లాగానే ఉంది. 63 00:03:49,146 --> 00:03:51,440 {\an8}నేను ఎండి గడ్డితో ఉన్న పజిల్ లాంటి ప్రదేశంలోకి వెళ్తాను. 64 00:03:52,024 --> 00:03:57,029 అక్కడ అమ్మ ఉంది. నెత్తి మీద కిరీటం పెట్టుకొని అక్కడ నిలబడి ఉంది. 65 00:03:57,029 --> 00:03:59,031 నేను తన దగ్గరికి వెళ్లాను, 66 00:03:59,031 --> 00:04:02,075 కానీ హత్తుకోకుండా, 67 00:04:02,826 --> 00:04:05,913 తనని పొడిచేస్తాను. 68 00:04:07,289 --> 00:04:08,123 అయ్య బాబోయ్. 69 00:04:08,123 --> 00:04:11,251 కత్తితో చాలాసార్లు పొడుస్తాను. 70 00:04:15,714 --> 00:04:19,176 అంటే, "మీరెవరో తెలుసుకోండి" అని యంత్రం అంటోంది కదా. 71 00:04:19,176 --> 00:04:21,845 అంటే నేనెవరిని? కత్తితో పొడిచే దాన్నా? 72 00:04:22,513 --> 00:04:26,475 కన్నతల్లిని కత్తితో పొడిచే వ్యక్తినా? హంతకురాలినా? 73 00:04:26,475 --> 00:04:31,021 లేదు. అది నీ గుణం కాదులే, అంటే ఆ పాత్ర తనని పొడుస్తూ ఆనందం పొందింది. 74 00:04:31,021 --> 00:04:32,356 తన శవం మీద నాట్యం వేస్తూ ఉన్నాను నేను. 75 00:04:35,025 --> 00:04:35,984 అయ్య బాబోయ్. 76 00:04:35,984 --> 00:04:38,612 నాకు ఏం అనిపిస్తోందో చెప్పనా? అది ఏదో విషయం చెప్తున్నట్టుగా మనం భావించాలి. 77 00:04:38,612 --> 00:04:40,155 - అవునా? - అవును. 78 00:04:40,155 --> 00:04:41,740 మీ జీవిత సామర్థ్యాన్ని నువ్వు సాధించాలంటే, 79 00:04:41,740 --> 00:04:43,992 మీ అమ్మతో నువ్వు తెగతెంపులు చేసుకోవాలేమో. 80 00:04:44,785 --> 00:04:46,078 ఇప్పుడు అది నువ్వు చేసే పనే కదా. 81 00:04:46,078 --> 00:04:48,622 కానీ నిజ జీవితంలో, ఆ పని నువ్వు హత్తుకొని చేశావు. 82 00:04:50,165 --> 00:04:53,293 మరి, నీ స్కీయింగ్ నీకేం చెప్తోంది? 83 00:04:55,879 --> 00:04:59,258 ఇంకా, దాని అర్థం ఏంటో నేను ఆలోచించలేదు. 84 00:05:02,052 --> 00:05:05,097 విస్లరుకు సంబంధించినదే కదా? పోయిన సారి మనం వేరుగా ఉన్నప్పటి దానికే సంబంధించినది కదా? 85 00:05:07,891 --> 00:05:10,561 అంటే, అలా అనే అనిపిస్తోంది. 86 00:05:10,561 --> 00:05:15,607 నాది నా కాళ్ల మీద నేను నిలబడటాన్ని సూచిస్తోంది అనుకుంటా. 87 00:05:22,322 --> 00:05:25,117 ఒక్క నిమిషం. తను నాటేనా? 88 00:05:26,702 --> 00:05:28,245 నాట్! హేయ్! 89 00:05:30,038 --> 00:05:34,459 హేయ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? 90 00:05:35,335 --> 00:05:36,545 జాగింగ్ కి వచ్చా. 91 00:05:37,796 --> 00:05:40,132 - ఈ బట్టల్లో జాగింగ్ చేస్తున్నావా? - హా, అవును. 92 00:05:40,632 --> 00:05:42,259 హా. నేను జాగింగ్ చేసేటప్పుడు 93 00:05:42,843 --> 00:05:46,972 ఒక్కోసారి ముందురోజు రాత్రి వేసుకొన్న బట్టలనే వేసుకుంటూ ఉంటా, 94 00:05:46,972 --> 00:05:49,725 అలా వేరే బట్టలు మాయకుండా చేయవచ్చు. 95 00:05:49,725 --> 00:05:51,894 అది సర్లే కానీ, మీరు ఏం చేస్తున్నారు ఇంత ఉదయాన్నే? 96 00:05:52,603 --> 00:05:55,189 అంటే, రాత్రి మేమసలు పడుకోలేదు. 97 00:05:55,189 --> 00:05:57,316 మార్ఫో యంత్రం మళ్లీ పని చేస్తోంది. 98 00:05:57,316 --> 00:05:58,650 అది నా వల్లే సాధ్యమైంది. 99 00:05:59,276 --> 00:06:01,320 - నీ వల్లేనా? సూపర్. - హా. 100 00:06:02,404 --> 00:06:05,866 గత 24 గంటల్లో కొత్త పరిణామాలు చాలా చోటు చేసుకున్నట్టున్నాయి. 101 00:06:05,866 --> 00:06:09,203 మనం కలిసి డిన్నర్ చేస్తూ, వాటన్నింటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. 102 00:06:09,203 --> 00:06:11,079 జియార్జియోస్ లో అయితే పర్లేదా? 103 00:06:11,079 --> 00:06:12,623 - మరేం పర్లేదు. - ఇంకెక్కడైనా తినమా? 104 00:06:12,623 --> 00:06:14,082 నాట్, నువ్వు యంత్రాన్ని ఒకసారి ఉపయోగించి చూడు. 105 00:06:14,082 --> 00:06:16,710 ఓరి దేవుడా. నాకు కూడా... సారీ. ఒక్క నిమిషం. 106 00:06:17,211 --> 00:06:20,130 హాయ్, బంగారం. ఇప్పుడే లేచావా? 107 00:06:20,881 --> 00:06:25,093 ఏమంటున్నావు? సవానా. లేదు, లేదు. చెప్పాలంటే, రాత్రంతా నేను ఇంట్లోనే ఉన్నాను. 108 00:06:25,093 --> 00:06:26,011 డస్టీ. 109 00:06:28,180 --> 00:06:31,391 చూడు, మనం విడిగా ఉండాలనే విషయంలో సీరియస్ గా ఉంటే, 110 00:06:31,391 --> 00:06:34,770 అదే, ఈ స్వీయాన్వేషణని... 111 00:06:36,563 --> 00:06:38,982 నిజంగా కొనసాగించాలనుకుంటే... 112 00:06:40,317 --> 00:06:41,985 అది ట్రీనాకి ఎలా చెప్పాలో మనం ఆలోచించుకోవాలి. 113 00:06:41,985 --> 00:06:43,195 అవును. 114 00:06:43,195 --> 00:06:46,406 అంతే కాకుండా, "స్వీయాన్వేషణ" అంత దారుణంగా లేని పదాన్ని 115 00:06:46,406 --> 00:06:47,991 మనం కనుగొనాలి. 116 00:06:49,535 --> 00:06:50,953 అంత కన్నా మంచివి మనం కనుగొనగలమేమో. 117 00:06:52,162 --> 00:06:53,956 కాబట్టి మేము దాన్ని "స్వీయాన్వేషణ" అని పిలుస్తున్నాం. 118 00:06:53,956 --> 00:06:56,708 అది "స్వీయ", "అన్వేషణ" పదాల కలయిక అన్నమాట. 119 00:06:56,708 --> 00:06:58,585 ఇది విన్నాక, మేము విడిపోతున్నామేమో అని నీకు అనిపించవచ్చు. 120 00:06:58,585 --> 00:07:00,254 - కానీ అది నిజం కాదు. - అవును. 121 00:07:00,254 --> 00:07:03,632 అవును. దాన్ని సంబంధ బాంధవ్యాల పునరుద్ధరణ అని అంటారు. 122 00:07:03,632 --> 00:07:05,259 స్కూలులో నీకు తెలుగు నేర్పుతారు, కదా? 123 00:07:05,259 --> 00:07:08,679 అది కొంత కాలమే అన్నమాట, ఆ సమయంలో మేము మరింత స్వేచ్ఛగా జీవిస్తాము, అంతే. 124 00:07:09,805 --> 00:07:13,225 సరే. అయితే మీరు నగరానికి వెళ్లి, కొకైన్ తీసుకుంటూ, వేరే వాళ్లతో పడక పంచుకుంటారా? 125 00:07:16,478 --> 00:07:18,146 - బాబోయ్. అ పని మాత్రం అస్సలు చేయం. - చేయనే చేయం. 126 00:07:18,146 --> 00:07:22,401 అంటే, ఒకవేళ ఈ బంధంలో కాకుండా బయట మేమెవరం అనేది తెలుసుకోవాలనిపిస్తే, 127 00:07:22,401 --> 00:07:24,278 - అప్పుడు కొకైన్ తీసుకొనే అవకాశం ఉంది. - అంతే. 128 00:07:24,278 --> 00:07:27,197 హా, నేను గంజాయి కొడతాను. 129 00:07:27,197 --> 00:07:29,283 - నువ్వు కొకైన్ తీసుకోకు. - తీసుకోనులే. 130 00:07:29,283 --> 00:07:30,409 నేను ఒక ప్రశ్న అడగవచ్చా? 131 00:07:30,409 --> 00:07:31,702 - హా, తప్పకుండా. - తప్పకుండా. 132 00:07:31,702 --> 00:07:33,704 - నిన్న రాత్రి మీరు అసలు పడుకున్నారా? - ఏంటి? 133 00:07:33,704 --> 00:07:37,165 నేను... మేము కాఫీ బాగా ఎక్కువగా తాగాలని నిర్ణయించుకున్నాం. 134 00:07:37,165 --> 00:07:38,166 ఈ విషయంలో ఏదోకటి తేల్చేయాలని. 135 00:07:38,166 --> 00:07:39,751 కానీ, మేము దీని మీదే దృష్టి పెట్టి ఉన్నామని, 136 00:07:39,751 --> 00:07:42,045 స్పష్టంగా ఆలోచిస్తున్నామని నువ్వు నమ్మి తీరాలి. 137 00:07:42,045 --> 00:07:43,046 నాన్న కళ్లు మూసుకుపోయి ఉన్నాయి. 138 00:07:43,046 --> 00:07:45,424 లేదులే. నువ్వు అన్నదాని గురించి ఆలోచిస్తున్నా, అంతే. 139 00:07:45,424 --> 00:07:47,926 మరి ఇతరులతో పడక పంచుకోవడం సంగతి ఏంటి? 140 00:07:50,512 --> 00:07:52,556 దాని గురించి మీరు మాట్లాడుకోలేదు కదా? 141 00:07:54,516 --> 00:07:56,768 నేను... 142 00:07:56,768 --> 00:07:57,728 లేదు. 143 00:07:59,396 --> 00:08:01,273 మనం ఆ పని చేయాలేమో. 144 00:08:01,273 --> 00:08:02,441 అంతే అంటావా? 145 00:08:03,901 --> 00:08:05,861 మనం ఆ పని చేయవచ్చు కూడా. 146 00:08:06,445 --> 00:08:09,489 ఈ విషయంలో మనం ట్రీనాని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనుకుంటా. 147 00:08:09,489 --> 00:08:13,577 నా చిన్నప్పుడే మా అమ్మానాన్నలు విడిపోయారు కాబట్టి, ఇది ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు. 148 00:08:13,577 --> 00:08:15,662 హా, అవును. కానీ ఇదేమీ విడాకుల వ్యవహారం కాదనుకో. 149 00:08:15,662 --> 00:08:19,333 హా. పైగా నువ్వు అప్పుడు చిన్నపిల్లవి కూడా కాదు, కానీ నాకు అంతా అయోమయంగా ఉంది. 150 00:08:19,333 --> 00:08:20,918 మీ ఇద్దరిలో ఎవరైనా వేరే చోటికి వెళ్లిపోతున్నారా లేక... 151 00:08:20,918 --> 00:08:22,920 - లేదు, లేదు. అదేం లేదు. - సరే. 152 00:08:22,920 --> 00:08:25,672 కానీ... కానీ మీ నాన్న కొంత కాలం పాటు బేస్మెంటులో పడుకుంటాడు, అంతే. 153 00:08:25,672 --> 00:08:30,511 మేమెవరమో తెలుసుకోవడానికి కాస్తంత దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనేలే. 154 00:08:30,511 --> 00:08:33,263 ఆ తర్వాత మళ్లీ ఒకటి అయిపోతాం, 155 00:08:33,263 --> 00:08:35,057 మా బంధం మరింత బలపడుతుంది కూడా. 156 00:08:36,850 --> 00:08:38,477 - నాకు అర్థమైందిలే. - అర్థమైందా? 157 00:08:38,477 --> 00:08:41,355 మీ ఇద్దరూ పసి వయస్సులోనే ప్రేమలో పడిపోయారని నేను ఎప్పుడూ అనుకునే దాన్ని. 158 00:08:41,355 --> 00:08:43,440 కాబట్టి, ఇది మీకు ఎంత మంచిదో నాకు అర్థమవుతోందిలే. 159 00:08:43,440 --> 00:08:45,192 సరే. మరీ మంచిది. 160 00:08:45,192 --> 00:08:47,027 కానీ, నా మిత్రులకి ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు, 161 00:08:47,027 --> 00:08:49,029 ఎందుకంటే, మీరు నాకు అర్థమయ్యేలా చెప్పలేదు. 162 00:08:49,029 --> 00:08:52,699 అన్నింటి కన్నా మాకు నువ్వంటేనే ఇష్టమని, ఏది ఏమైనా కానీ, నీకేం కావాలన్నా కానీ 163 00:08:53,283 --> 00:08:56,078 మేము ఎల్లప్పుడూ నీకు అండగానే ఉంటామని 164 00:08:56,578 --> 00:08:59,164 నీకు తెలియజేయాలనుకున్నాం. 165 00:08:59,164 --> 00:09:00,457 ఇవాళ రాత్రి నేను పార్టీ చేసుకోవచ్చా? 166 00:09:01,124 --> 00:09:02,709 ఏంటి? ఇంట్లో పార్టీయా? 167 00:09:02,709 --> 00:09:05,629 మన ఇంట్లోనా? కానీ మేము ఇంట్లో ఉండం కదా? 168 00:09:08,507 --> 00:09:10,217 నేను స్వీయాన్వేషణ చేసే వాళ్ల కూతురిని కదా. 169 00:09:16,265 --> 00:09:18,350 మీ నాన్న గమనించకుండా 170 00:09:18,350 --> 00:09:20,394 నేను ఎన్ని సీసాల విస్కీని తీసుకోవచ్చు అంటావు? 171 00:09:20,394 --> 00:09:24,314 మనకి ఎన్ని అవసరం అవుతాయి? అంటే, జనాలు, వాళ్లకి కావాల్సింది వాళ్లే తెచ్చుకుంటారు అంటావా, లేకపోతే... 172 00:09:24,314 --> 00:09:25,941 ఇప్పటిదాకా నువ్వు ఒక పార్టీ కూడా ఇవ్వలేదా? 173 00:09:25,941 --> 00:09:27,776 నేను అసలు ఒక్క పార్టీకి కూడా వెళ్లలేదు, 174 00:09:27,776 --> 00:09:29,611 ఎందుకంటే, ఎప్పుడూ పార్టీలకి కోల్టనే వెళ్లేవాడు, 175 00:09:29,611 --> 00:09:32,239 నేను ఇంట్లో ఉండి, బట్టలు ఉతికేవాడిని. 176 00:09:32,239 --> 00:09:33,532 ఎంత మంచివాడివో నువ్వు! 177 00:09:33,532 --> 00:09:34,741 హా. 178 00:09:37,077 --> 00:09:39,621 కాబట్టి, అదిరిపోయే పార్టీ నాకు తప్పక నచ్చుతుంది. 179 00:09:39,621 --> 00:09:41,582 కానీ నిన్న రాత్రి నేను అంతగా నిద్రపోలేదు, కాబట్టి... 180 00:09:41,582 --> 00:09:43,500 బాబోయ్. నిన్న రాత్రి నిద్రపోయింది నేను ఒక్కదాన్నేనా ఏంటి? 181 00:09:43,500 --> 00:09:46,211 మేము యంత్రాన్ని అన్ లాక్ చేసిన తర్వాత, జనాలు జాన్సన్స్ కి ఎగబడటం మొదలుపెట్టారు, 182 00:09:46,211 --> 00:09:48,172 వాళ్లెవరో తెలుసుకోవడం కోసమని. కాబట్టి... 183 00:09:48,172 --> 00:09:50,507 హా. కానీ నాకు తెలుసుకోవాలని అంత ఆరాటమేమీ లేదు. 184 00:09:51,008 --> 00:09:53,594 కానీ "తర్వాతి దశ"కి మా అమ్మానాన్నలు ఫిదా అయిపోయినట్టున్నారు, 185 00:09:53,594 --> 00:09:55,596 దాన్ని దృష్టిలో పెట్టుకొని, కొంత కాలం దూరంగా ఉంటారట. 186 00:09:55,596 --> 00:09:57,681 కాబట్టి, అది నా విషయంలో ఏమంటుందో అస్సలు ఊహించుకోవాలని కూడా లేదు. 187 00:09:57,681 --> 00:09:59,266 ఆగు, మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్నారా? 188 00:09:59,266 --> 00:10:02,019 అయ్యయో లేదు. అది చాలా తేలిక. 189 00:10:02,811 --> 00:10:06,815 వాళ్లు ఒకే ఇంట్లో వేరుగా ఉంటారు, అంతే. 190 00:10:06,815 --> 00:10:07,983 అయ్యయ్యో. 191 00:10:07,983 --> 00:10:09,067 హా. 192 00:10:09,735 --> 00:10:10,861 నువ్వు బాగానే ఉన్నావా? 193 00:10:10,861 --> 00:10:12,196 హా. నీకు మా నాన్న గురించి తెలుసు కదా. 194 00:10:12,196 --> 00:10:15,532 అమ్మ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. 195 00:10:15,532 --> 00:10:19,203 నిజానికి, వేరుగా ఉండాలని వాళ్లు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? కలిసి డిన్నర్ చేయడం. 196 00:10:19,203 --> 00:10:25,292 కాబట్టి నాకేం ఆందోళన లేదు, కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాను. 197 00:10:27,669 --> 00:10:29,129 అదన్నమాట. ఇక చాల్లే. 198 00:10:29,129 --> 00:10:31,256 సరే. మరి స్నాక్స్ సంగతేంటి? 199 00:10:31,256 --> 00:10:34,468 అంటే, చిప్స్, మిక్చర్ లాంటివా? లేదా చికెన్, మటన్ లాంటివా? 200 00:10:34,468 --> 00:10:36,053 పార్టీ కత్తిలా ఉంటుంది చూడు. 201 00:10:41,808 --> 00:10:43,810 హా, నేను ఫ్రూట్ సలాడ్ లాంటివి చేసి పెడతానులే. 202 00:10:46,688 --> 00:10:49,608 {\an8}జియార్జియోస్ కి డిన్నర్ అన్నారంటే, 203 00:10:49,608 --> 00:10:51,944 {\an8}అది రెస్టారెంట్ అయ్యుంటుందని నా అభిప్రాయం. 204 00:10:53,028 --> 00:10:55,072 ఈ డిన్నర్ లో మంచి విషయం ఏమిటంటే, 205 00:10:55,072 --> 00:10:58,617 మన స్వీయాన్వేషణ గురించి నాట్ కి చెప్పామంటే, మన బదులు తనే ఊరందరికీ చెప్పేస్తుంది. 206 00:10:59,243 --> 00:11:01,119 మనం జనాలకు చెప్పవచ్చు అంటావా? 207 00:11:01,620 --> 00:11:02,746 - చెప్పవచ్చు. - చెప్పవచ్చా? 208 00:11:02,746 --> 00:11:04,248 హా. మనం చెప్పేయవచ్చు అనే అనుకుంటా. 209 00:11:07,125 --> 00:11:09,044 సుస్వాగతం. 210 00:11:09,711 --> 00:11:11,171 అయ్య బాబోయ్. 211 00:11:11,171 --> 00:11:12,756 లోపలికి రండి. 212 00:11:12,756 --> 00:11:16,677 మీ ఇంట్లో అయితే ఎలా ఉంటారో, మన జియార్జియో ఇంట్లో కూడా అలాగే ఉండండి. 213 00:11:16,677 --> 00:11:19,638 ఫాదర్ రూబెన్ తెలుసు కదా? హానా కూడా వచ్చింది. 214 00:11:19,638 --> 00:11:21,431 - హా. హలో. - మళ్లీ కలుసుకున్నాం. 215 00:11:21,431 --> 00:11:23,725 చాలా కాలం తర్వాత కలుసుకోవడం బాగానే ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? 216 00:11:23,725 --> 00:11:26,395 యంత్రం గురించి ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాలని జియార్జియో మాకు చెప్పాడు. 217 00:11:26,395 --> 00:11:28,856 హేయ్, మీరే యంత్రంలాంటి వారు, ఫాదర్. 218 00:11:28,856 --> 00:11:31,525 ఫాదర్ డ్రెస్ మాటున ఉన్న మీ కండల దేహాన్ని నేను చూశా. 219 00:11:31,525 --> 00:11:33,110 ఇదుగో, కేసీ. 220 00:11:33,110 --> 00:11:35,654 - థ్యాంక్యూ. - కొంచెం షాంపేన్ పోశానులే. డీ బాసూ. 221 00:11:35,654 --> 00:11:38,991 సరే మరి. ఈ రాత్రి పార్టీని ప్రారంభించే ముందు, 222 00:11:38,991 --> 00:11:40,242 మీ అందరూ మొబైల్ ఫోన్లని 223 00:11:40,242 --> 00:11:43,871 ఈ సెక్యూరిటీ బ్యాగులో పెట్టమని కోరుతున్నాను. 224 00:11:43,871 --> 00:11:45,163 నేను పెట్టను. 225 00:11:45,163 --> 00:11:47,416 డస్టీ, మేము మరింత ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నాం, 226 00:11:47,416 --> 00:11:49,334 మీ అందరూ కూడా అలా చేస్తే బాగుంటుంది. 227 00:11:49,334 --> 00:11:51,128 సారీ. "మేము" అంటే నీ ఉద్దేశం... 228 00:11:51,128 --> 00:11:55,382 సాంకేతికతకు కాసేపు దూరంగా ఉందాం. ఈ ఫోన్లకు బానిసలుగా మిగిలిపోవద్దు. 229 00:11:55,382 --> 00:11:58,677 - కానివ్వు, డీ బాసూ. దీనిలో వేసేయ్. - ఒకవేళ ఎమర్జెన్సీ అయితే? సరే. 230 00:11:59,178 --> 00:12:02,139 చూశారా? ఇది చాలా బాగుంది కదా? 231 00:12:02,139 --> 00:12:05,601 ఇప్పుడు, ఈ క్షణంలో బతుకుదాం అని నేను అంటూ ఉంటాను. 232 00:12:05,601 --> 00:12:08,520 ఇతనిలో ఏదో మాయ ఉందని నేను కూడా ఎప్పుడూ అంటూనే ఉంటా కదా. 233 00:12:08,520 --> 00:12:09,897 నాటలీ, భలేదానివే. 234 00:12:09,897 --> 00:12:11,690 జియార్జియో, నేనూ ప్రేమించుకుంటున్నాం. అది చెప్పాలనే పిలిచాం. 235 00:12:14,276 --> 00:12:15,944 ఒక్క నిమిషం, అదేనా ముఖ్యమైన సమాచారం? 236 00:12:15,944 --> 00:12:18,155 అది అస్సలు యంత్రానికి సంబంధించినదే కాదు కదా. 237 00:12:18,155 --> 00:12:20,157 హానా, అది యంత్రానికి సంబంధించినదే. 238 00:12:21,366 --> 00:12:24,953 ఎందుకంటే, నాకూ, జియార్జియోకి మా సామర్థ్యం మేమే అనిపిస్తోంది. 239 00:12:24,953 --> 00:12:27,080 - నా ఫోన్ నాకు ఇచ్చేస్తారా? - లేదు. 240 00:12:27,080 --> 00:12:28,916 ఆవేశంగా తీసుకున్న నిర్ణయంలా ఉంది, నాట్. 241 00:12:30,042 --> 00:12:33,879 చాలా ఆవేశంగానే తీసుకున్నాం, కానీ అందులో నిజం ఉంది. 242 00:12:34,379 --> 00:12:38,550 ఇది "డైజెస్ట్" పత్రికకి చేరుకోక ముందే మా ప్రాణ స్నేహితులకి చెప్పాలనుకున్నాం. 243 00:12:38,550 --> 00:12:40,928 ఫాదర్, మీ ముందు నేను ఒకటి ఒప్పుకోవాలి, 244 00:12:40,928 --> 00:12:43,972 అనేక సార్లు శారీరకంగా కలిసి మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. 245 00:12:43,972 --> 00:12:45,516 అది నా ముందు ఒప్పుకోవాల్సిన పని లేదు. 246 00:12:45,516 --> 00:12:46,725 సరే, కానీ నేను ఒప్పుకోవచ్చు కదా? 247 00:12:46,725 --> 00:12:48,977 - ఎందుకంటే, నాకు అది చాలా బాగా నచ్చింది. - దేవుడా. 248 00:12:48,977 --> 00:12:51,438 హానా, నీకు సారీ చెప్తున్నా. 249 00:12:51,438 --> 00:12:54,650 నా మాజీ లవర్స్ లో నువ్వు కూడా ఒకదానివి కదా, దీని వల్ల నీకు బాధ కలగలేదనే భావిస్తున్నా. 250 00:12:54,650 --> 00:12:56,318 ఇది చెప్పడానికే నన్ను పిలిచారా? 251 00:12:56,318 --> 00:12:58,946 ఇప్పుడు, ఈ క్షణంలో బతుకుదాం. 252 00:12:59,530 --> 00:13:00,864 జియార్జియో, నాట్ కి జయహో. 253 00:13:01,657 --> 00:13:03,992 - మనోడే జయహో చెప్పేసుకున్నాడు. - నాకు తెలుసు. 254 00:13:11,667 --> 00:13:14,086 నువ్వు టిష్యూ పేపర్ల వాడకాన్ని కాస్త తగ్గించు. 255 00:13:14,086 --> 00:13:15,629 ఇప్పుడు జనాలు కోస్టర్లు వాడట్లేదు కదా. 256 00:13:15,629 --> 00:13:18,549 మరి గ్లాస్ గుర్తులు, మచ్చల గురించి మీ అమ్మానాన్నలకు ఎలా చెప్తావమ్మా? 257 00:13:18,549 --> 00:13:22,678 మీ ఇంట్లో నువ్వే పనులన్నీ చేస్తావని నాకు తెలుసు, 258 00:13:22,678 --> 00:13:25,514 కానీ ఇది నీ ఇల్లు కాదు. కాబట్టి కాస్త విశ్రమించు. 259 00:13:26,014 --> 00:13:27,307 నాపై చాలా ఒత్తిడి ఉంది, అర్థమైందా? 260 00:13:27,307 --> 00:13:30,310 నేను చూడటానికి కోల్టన్ లా ఉంటానని నాకు బాగా తెలుసు. 261 00:13:30,310 --> 00:13:32,354 కాబట్టి నేను అతనిలా ఉండాలని జనాలు ఆశించవచ్చు, 262 00:13:32,354 --> 00:13:33,689 కానీ అతనిలా ఎలా ఉండాలో నాకు తెలీదు. 263 00:13:33,689 --> 00:13:35,816 నేను పార్టీలో జోష్ పెంచే రకమైన వాడిని కాదు, ట్రీనా. 264 00:13:35,816 --> 00:13:39,111 జేకబ్, నువ్వు పార్టీలో జోష్ పెంచాలని ఎవరూ అనరు. 265 00:13:40,904 --> 00:13:41,989 సరే. 266 00:13:41,989 --> 00:13:46,285 అస్సలు ఎవరూ అనరు. నువ్వు అలా ఉండాలని ఎవరూ అనుకోరు కూడా. 267 00:13:46,285 --> 00:13:47,828 అలా అని నన్ను మార్చేశావుపో. 268 00:13:47,828 --> 00:13:50,080 నువ్వు నీలాగే ఉండు. 269 00:13:50,080 --> 00:13:54,501 టిష్యూలను కాస్త పక్కకు పెట్టేయ్, సరేనా? 270 00:13:58,172 --> 00:14:02,676 మనం వీడియో గేములో మన పాత్రని చూసినప్పుడు, అది మనల్ని పోలి ఉండటాన్ని మనం గమనించవచ్చు. 271 00:14:03,719 --> 00:14:06,722 ఆ తర్వాత అది "ఇదే మీరు," అని చెప్తుంది. 272 00:14:06,722 --> 00:14:10,267 ఆ తర్వాత ఒక చిన్న సన్నివేశాన్ని చూపుతుంది... 273 00:14:12,686 --> 00:14:14,146 దాన్ని ఎలా వర్ణించాలో తెలీట్లేదు. 274 00:14:14,730 --> 00:14:16,398 అది కాస్త భయంకరంగా అనిపిస్తోంది. 275 00:14:16,398 --> 00:14:19,526 కావచ్చు, కానీ "ఇదే మీరు" అని అది చెప్పినా కూడా, 276 00:14:19,526 --> 00:14:21,445 అక్కడ చెప్పిన దానికే మనం పరిమితం కాదు కదా. 277 00:14:21,445 --> 00:14:24,948 ఆసక్తికరంగా ఉంది. నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కాలేదు, డీ? కాస్త వివరంగా చెప్పవా? 278 00:14:26,575 --> 00:14:28,327 అంటే, సరే. 279 00:14:29,786 --> 00:14:31,705 మన జీవిత సామర్థ్యం అనేది ఒక బాణం లాంటిది అనుకోండి... 280 00:14:31,705 --> 00:14:34,625 అంటే, ఆ దిశలో వెళ్తే మంచిది అని 281 00:14:34,625 --> 00:14:36,210 మనకి కావాల్సిన దిశానిర్దేశం అది చేస్తే... 282 00:14:36,210 --> 00:14:39,963 ఆ దిశలో వెళ్లడంలో సాయం కోసం 283 00:14:40,589 --> 00:14:42,257 మనం దాన్ని ఓసారి పరిశీలించుకోవాలేమో. 284 00:14:42,758 --> 00:14:44,134 నేనైతే అవి కలలు లాంటివని అనుకుంటా. 285 00:14:44,801 --> 00:14:47,888 - ఒక్క నిమిషం. నువ్వు కూడా యంత్రాన్ని ఉపయోగించావా? - మీకు ఏం వచ్చింది, ఫాదర్? 286 00:14:47,888 --> 00:14:51,058 ఫాదర్ వీడియో గేములోలా మీరు వ్యాంపైర్లను, రాకాసులని చంపేస్తున్నారా? 287 00:14:51,058 --> 00:14:53,310 నాకు ఏం వచ్చిందో నేను చెప్పను, 288 00:14:53,310 --> 00:14:55,729 కానీ ఈ విజన్లన్నీ కలలు లాంటివని నా అభిప్రాయం. 289 00:14:55,729 --> 00:14:57,022 విజన్లు. 290 00:14:57,022 --> 00:14:59,107 వాటిని ఎవరికైనా చెప్పాలని చూస్తే... 291 00:14:59,107 --> 00:15:00,192 వాళ్లకి బోర్ కొట్టేస్తుంది. 292 00:15:01,652 --> 00:15:03,445 అవి వ్యక్తిగతమైనవి, అంతే. 293 00:15:04,029 --> 00:15:07,533 ఇలాంటివి మనం ఢంకా భజాయిస్తూ ఊరంతా చెప్పుకొనే విషయాలు కావు. 294 00:15:07,533 --> 00:15:10,911 విజన్ అనేది అంతర్గతమైనది, వ్యక్తిగతమైనది. 295 00:15:12,871 --> 00:15:15,707 మనకి నచ్చినా నచ్చకపోయినా, అది మనకి కనిపించినప్పుడు, 296 00:15:15,707 --> 00:15:17,292 దాని అర్థం ఏంటో మనకి తెలిసిపోతుంది. 297 00:15:17,292 --> 00:15:19,044 మీరు వాటిని విజన్స్ అనడం నాకు నచ్చింది. 298 00:15:19,044 --> 00:15:22,256 "డైజెస్ట్" కోసం దీని గురించి నేను రాసేటప్పుడు ఆ పదాన్ని నేను వాడుకోవచ్చా? 299 00:15:22,840 --> 00:15:23,757 వాడుకో. 300 00:15:23,757 --> 00:15:26,051 - థ్యాంక్యూ. - కానీ నేను మాత్రం ఆ పని చేయను. 301 00:15:26,051 --> 00:15:27,344 ఏ పని చేయవు? 302 00:15:27,344 --> 00:15:29,388 తర్వాతి దశకు సంబందించిన పని. నాకు ఆ అవసరం లేదు. 303 00:15:29,888 --> 00:15:33,350 నాకు నాటలీ దక్కింది, నేనెవరో నాకు బోధపడింది. 304 00:15:38,105 --> 00:15:40,065 నాకు కూడా సరిగ్గా అలాగే అనిపిస్తోంది. 305 00:15:41,650 --> 00:15:44,820 కాస్, ఇక మనం నలుగురం కలిసి ఆనందంగా డేట్ కి వెళ్లవచ్చు. 306 00:15:47,656 --> 00:15:54,621 హా. ఆ విషయం గురించి మేము కూడా ఒకటి చెప్పాలి. 307 00:15:55,622 --> 00:15:56,623 చెప్పండి. 308 00:15:58,625 --> 00:16:01,962 తర్వాతి దశలో యానిమేషన్లు బాగా లేవు, ఇక గ్రాఫిక్స్ అయితే చెప్పక్కర్లేదు. 309 00:16:01,962 --> 00:16:04,089 కదా? 15 సెకన్లు ఉంటుందేమో, అయినా కానీ అది మన నియంత్రణలో ఉండదు. 310 00:16:04,089 --> 00:16:05,465 ఎందుకంటే, అది ఆట కాదు. 311 00:16:05,465 --> 00:16:10,637 ఒక్క నిమిషం, నాకు అర్థం కాట్లేదు. ఒకవేళ నేను అందులో "అబద్ధాలకోరు" కార్డ్ పెడితే, నేను అబద్ధమాడటం చూపుతుందా? 312 00:16:10,637 --> 00:16:14,433 మరీ అక్షరాలా అలాగే చూపకపోవచ్చు. నాది ఏదో మిషన్ కోసం ఆడే ఆటలా అనిపించింది. 313 00:16:15,350 --> 00:16:16,351 ఇప్పుడు "ఆట: అని అన్నావు. 314 00:16:17,686 --> 00:16:22,107 నేను మైదానంలో నడుస్తూ ఉన్నా, అక్కడ ఒక కంచె ఉంటుంది. 315 00:16:22,107 --> 00:16:25,736 కంచెకి ఒక వైపున గొర్రెలు ఉన్నాయి. 316 00:16:25,736 --> 00:16:29,323 మరోవైపున నక్కలు ఉన్నాయి. 317 00:16:29,323 --> 00:16:33,994 నా పాత్ర కంచెని తీసేయడం ప్రారంభించింది. 318 00:16:35,329 --> 00:16:36,663 - నేను... - హేయ్, హేయ్. 319 00:16:36,663 --> 00:16:38,665 తాగి మత్తులో తూగాలని ఎవరికి ఉంది? 320 00:16:40,751 --> 00:16:42,169 తాగాలని ఎవరికీ లేదా ఏంటి? 321 00:16:42,169 --> 00:16:44,129 మేము ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. 322 00:16:44,880 --> 00:16:47,674 సరే, అలాగే. నేను కూడా కూర్చుంటాలే. 323 00:16:49,760 --> 00:16:51,470 ఆ క్యాన్స్ ని నీ చేతులకు టేప్ వేసుకున్నావా? 324 00:16:51,470 --> 00:16:53,889 హా, క్లాసిక్ ఆట అయిన ఎడ్వర్డ్ 40 చేతుల లాగా అన్నమాట. 325 00:16:53,889 --> 00:16:57,976 ఇవి 40 ఉండవని తెలిసిపోతోంది కదా. కాబట్టి ఎడ్వర్డ్ 12 చేతులని అనవచ్చు. 326 00:16:59,811 --> 00:17:00,729 అదన్నమాట. 327 00:17:01,355 --> 00:17:02,898 సారీ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? 328 00:17:02,898 --> 00:17:06,151 రీటా ఏదో చెప్తోంది. 329 00:17:06,734 --> 00:17:07,778 సూపర్. 330 00:17:08,819 --> 00:17:11,240 సరే. ఈ క్యాన్స్ ని కింద పెడితే బాగుంటుందేమో. 331 00:17:11,240 --> 00:17:12,907 - జేక్, బాసూ. - అబ్బా. 332 00:17:12,907 --> 00:17:14,910 - బాసూ! అరే! - ఏం చేస్తున్నావు? 333 00:17:15,618 --> 00:17:16,912 నేను చూసుకుంటా. నేను చూసుకుంటాలే. 334 00:17:17,788 --> 00:17:19,580 టిష్యూ పేపర్స్ అన్నీ అవ్వగొట్టేసినట్టున్నా. 335 00:17:19,580 --> 00:17:23,544 బేస్మెంటుకు వెళ్లి ఇంకొన్ని తెస్తా. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. 336 00:17:28,590 --> 00:17:33,053 ఆరు వారాలు మాత్రమే. ఆ తర్వాత నేను, డస్టీ మళ్లీ కలిసిపోతాం, 337 00:17:33,053 --> 00:17:35,639 కలిసిపోయి మా కొత్త అనుభవాలను పంచుకుంటాం. 338 00:17:35,639 --> 00:17:37,558 కానీ, ఒకవేళ మీరు కలవకపోతే? 339 00:17:37,558 --> 00:17:41,603 నేను కూడా జాతీయ స్థాయిలో హాకీ 20 ఏళ్ళు ఆడాలని, ఏడు ఛాంపియన్షిప్స్ గెలవాలని కలలు కన్నాను, 340 00:17:41,603 --> 00:17:44,565 కానీ ఇంతలోనే నా కుడి చేతికి గాయమై శాశ్వతంగా ఆటకు దూరమయ్యాను. 341 00:17:44,565 --> 00:17:46,024 ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. 342 00:17:46,024 --> 00:17:47,359 ఒకవేళ మీరు ఎవరినైనా కలిస్తే? 343 00:17:47,359 --> 00:17:51,989 ఒకవేళ ఇంతకు ముందు మీపై మనస్సుపడ్డ వారు 344 00:17:51,989 --> 00:17:54,074 హఠాత్తుగా ఇంకా మీపై మనస్సు ఉందని గ్రహిస్తే? 345 00:17:55,075 --> 00:17:59,788 ఇప్పుడు మీరు సంబంధ బాంధవ్యాల పునరుద్ధరణ పనిలో ఉన్నారు కాబట్టి... 346 00:18:00,998 --> 00:18:03,667 - బంగారం. - నాకేమీ కాలేదులే. బాగానే ఉన్నా నేను. 347 00:18:03,667 --> 00:18:05,836 కానీ నేను... ఓరి దేవుడా. 348 00:18:05,836 --> 00:18:08,922 నా దగ్గర, వివిధ రెస్టారెంట్స్, ఇంకా దగ్గర్లోని సందర్శనా స్థలాలకు సంబంధించి ఇద్దరికి చెల్లించి, 349 00:18:08,922 --> 00:18:11,341 - నలుగురి ప్రయోజనాలు పొందగల కూపన్స్ ఉన్నాయి, కాబట్టి... - నాట్. 350 00:18:11,341 --> 00:18:13,343 ఇప్పుడే వస్తాను... 351 00:18:15,637 --> 00:18:16,638 తను బాగానే ఉందా? 352 00:18:17,222 --> 00:18:20,142 బాగానే ఉంది, ఫాదర్. డస్టీ, కాస్ పని వల్ల తను కలతకు గురైంది. 353 00:18:20,851 --> 00:18:22,186 కారణం అది అంటావా, జియార్జియో? 354 00:18:22,186 --> 00:18:24,563 గత వారం దాకా అందరికీ తెలిసేలానే 355 00:18:24,563 --> 00:18:28,192 నా భార్య వెంట పడ్డావు, ఇప్పుడు కొంత కాలం వేరుగా ఉంటున్నామని నాట్ కి తెలిసింది, 356 00:18:28,192 --> 00:18:30,527 తను కలత చెందింది ఇందుకు కాదంటావా? 357 00:18:30,527 --> 00:18:32,279 నువువ్ కాస్ వెంట పడ్డావా? 358 00:18:32,279 --> 00:18:33,655 ఆ విషయం నాకు కూడా తెలుసు. 359 00:18:33,655 --> 00:18:35,532 అంటే, నీకు, జియార్జియోకి మధ్య నడిచిన సంబంధం తెలీదు అనుకో. 360 00:18:35,532 --> 00:18:37,451 మిత్రులారా, నా గురించి గొడవపడవద్దు. 361 00:18:37,451 --> 00:18:38,785 ఇప్పుడు జరిగేది అది కాదు. 362 00:18:38,785 --> 00:18:41,747 నీ మీద ఇష్టం నాకు ఎప్పుడూ తగ్గదు, కాస్. 363 00:18:41,747 --> 00:18:44,166 కానీ నీకు, డీకి మధ్య వైవాహిక బంధంలో ఉన్న సమస్యలకు, 364 00:18:44,166 --> 00:18:46,543 అది పడకగదికి సంబంధించినవైనా, ఇంకేవైనా సరే... 365 00:18:46,543 --> 00:18:47,920 ఇది పడకగది విషయం కాదు. 366 00:18:47,920 --> 00:18:51,465 ...నాటలీపై నేను మనస్సు పడటానికి ఏ సంబంధమూ లేదు. 367 00:18:51,965 --> 00:18:53,217 ఆ విషయం నేను స్పష్టంగా చెప్పాలి. 368 00:18:53,217 --> 00:18:55,969 నాటలీ. నా బంగారం. 369 00:19:00,015 --> 00:19:01,475 జియార్జియో బాత్రూమ్ చూద్దామా? 370 00:19:01,475 --> 00:19:02,893 - తప్పకుండా. - సరే. 371 00:19:05,771 --> 00:19:08,106 నువ్వు చెప్పింది నిజమే. అందరికీ చెప్పడం మహ బాగా ఉంది. 372 00:19:09,274 --> 00:19:10,275 హా. 373 00:19:12,069 --> 00:19:14,821 స్నానపు తొట్టె ఎక్కడ పెట్టారో చూడు. 374 00:19:15,822 --> 00:19:18,450 ఇక్కడ జియార్జియో తలకు సంబంధించిన బొమ్మ ఉంది, 375 00:19:18,450 --> 00:19:21,370 దాన్ని గొప్ప శిల్పి, 3డీ ప్రింటర్ తయారు చేసింది. 376 00:19:21,370 --> 00:19:23,038 ఇప్పుడు అద్దాన్ని చూడు, 377 00:19:23,038 --> 00:19:26,333 "సూపర్ స్టార్" కార్డ్ వచ్చిందని డబ్బా కొట్టుకుంటూ ఉంటాదు కదా, అది ఉంటుంది. 378 00:19:26,333 --> 00:19:29,628 ఇక డ్రాయర్లలో అయితే, లెక్కలేనన్ని క్రీమ్స్ ఉంటాయి. 379 00:19:29,628 --> 00:19:31,880 నేను ఎలా ఉంటుంది అనుకున్నానో, అలాగే ఉంది. 380 00:19:31,880 --> 00:19:35,133 హా. ఈ చెత్త డిన్నర్ పార్టీకి రావడానికి ఒప్పుకున్నందుకు ఇప్పుడు నీకు ఆనందంగా ఉంది కదా. 381 00:19:35,133 --> 00:19:37,970 నిజంగానే ఆనందంగా ఉంది. నాకు చాలా ఖుషీగా ఉంది. 382 00:19:38,679 --> 00:19:40,264 ఖుషీగానే ఉన్నట్టున్నావు! 383 00:19:40,264 --> 00:19:43,684 - ఏంటి సంగతి? - నాకు మంచి విజన్ వచ్చింది. 384 00:19:44,726 --> 00:19:47,521 సరే, ఆ విజన్ ఏంటో చెప్పు, ఊరికే ఊరిస్తూ కూర్చోకు. 385 00:19:50,524 --> 00:19:55,696 నా చిన్నప్పుడు నేను మా నాన్నతో ఆనందంగా ఉన్నప్పటి విజన్ వచ్చింది. 386 00:19:55,696 --> 00:19:58,365 అదంతా నాకు గుర్తు రావడం చాలా బాగుంది. 387 00:19:58,365 --> 00:20:03,704 అంతే కాకుండా, నాకు వచ్చిన "ఫాదర్" కార్డ్, కేవలం నాకు సంబంధించినది కాదేమో అన్న ఆలోచన కూడా బాగుంది. 388 00:20:03,704 --> 00:20:06,915 వావ్. అయితే ఇప్పుడు నువ్వు మార్ఫో అనే కొత్త మతానికి ఫాదర్ అవతారం ఎత్తావా ఏంటి? 389 00:20:06,915 --> 00:20:08,667 అలా అని నేను అనను. 390 00:20:08,667 --> 00:20:12,087 కానీ నాకు ఫాదర్ గా ఉండాలని లేదని నీకు చెప్పిన విషయం గుర్తుంది కదా? 391 00:20:12,796 --> 00:20:15,799 హా, గుర్తుంది. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, 392 00:20:15,799 --> 00:20:18,677 అది నన్ను చాలా ఒత్తిడికి గురిచేస్తుంది, నేను... 393 00:20:18,677 --> 00:20:20,929 లేదు. నిన్ను ఒత్తిడికి గురి చేయాలని నాకు అస్సలు లేదు. 394 00:20:20,929 --> 00:20:22,890 అది నాకు సంబంధించినది అనుకుంటా. 395 00:20:22,890 --> 00:20:26,435 నాకు ఫాదర్ గా ఉండాలని లేదు అనేదానికి సంబంధించినది. 396 00:20:27,019 --> 00:20:30,314 జీవితాంతం ఇతరులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉండిపోవాలని నాకు లేదు. 397 00:20:30,314 --> 00:20:35,068 నేను కూడా నా సంగతి చూసుకోవాలి కదా, 398 00:20:35,652 --> 00:20:40,949 నాకు ఆనందం ఇచ్చేటివేవో కనుగొనాలి కదా. 399 00:20:44,119 --> 00:20:47,664 "ఆనందం ఇచ్చేటివేవో కనుగొనండి" అనేది బోర్డులపై పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 400 00:20:55,130 --> 00:20:57,883 దేవుడా. నా ముఖం చూడటం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నావా? 401 00:20:57,883 --> 00:20:59,092 ఏంటి? అదేం లేదులే. 402 00:20:59,092 --> 00:21:02,846 నాకు అర్థమైందిలే. సరదాగా ఉందామని ప్రయత్నించి పార్టీ మొత్తాన్ని చెడగొట్టేశాను. 403 00:21:02,846 --> 00:21:05,599 జేకబ్, నువ్వేం చేసినా నాకు నామోషీ అనిపించదు. 404 00:21:07,184 --> 00:21:09,061 ఈ గదిని చూసి ఇలా అయ్యాను. 405 00:21:09,561 --> 00:21:13,357 మా నాన్న చేసుకున్న ఈ ఏర్పాటు చూసి కాస్త బాధగా ఉంది, అంతే. 406 00:21:14,316 --> 00:21:17,277 మా... మా అమ్మానాన్నలు ఈ పని చేస్తున్నారని అర్థమవుతోంది, 407 00:21:17,277 --> 00:21:18,529 నాకు అస్సలేమీ బాగాలేదు. 408 00:21:19,363 --> 00:21:21,448 అంటే, ఇప్పుడిప్పుడే అన్నీ మామూలుగా అవుతున్నాయి. 409 00:21:22,074 --> 00:21:24,826 దీని గురించి, ఒక అమ్మని పోగట్టుకున్న మనిషితో 410 00:21:24,826 --> 00:21:26,662 చెప్పుకుంటున్నా చూడు, అది సూపర్. 411 00:21:26,662 --> 00:21:29,706 అలా ఏమీ అనుకోవద్దు. అర్థం చేసుకోగలను. నీ కూడా నీ కుటుంబాన్ని దూరం చేసుకోవాలని లేదు. 412 00:21:31,583 --> 00:21:34,461 కానీ జీవితాంతం తను ఒకే బంధంలో ఉండాలనుకోవట్లేదని 413 00:21:34,461 --> 00:21:36,964 నాకు ఎవరో చెప్పారు. 414 00:21:37,965 --> 00:21:38,966 ఆ వ్యక్తి సూపర్ వ్యక్తిలా ఉన్నారు. 415 00:21:39,883 --> 00:21:40,884 మామూలు సూపర్ కాదు. 416 00:21:43,011 --> 00:21:47,516 కాబట్టి, మీ అమ్మానాన్నలకి తర్వాతి దశ ఎలా ఉన్నా కానీ, 417 00:21:48,016 --> 00:21:50,227 చివరికి, అది అందరికీ మంచిదే కాగాలదేమో? 418 00:21:52,229 --> 00:21:54,189 మరి నా తర్వాతి దశ సంగతేంటి? 419 00:21:57,484 --> 00:21:59,319 దాని గురించి తెలుసుకోవాలనుంటే, ఇద్దరం కలిసి తెలుసుకుందాం. 420 00:22:00,445 --> 00:22:02,865 నువ్వు తోడుగా ఉంటావని తెలుసు. బంగారం నువ్వు. 421 00:22:03,365 --> 00:22:04,575 అవును. 422 00:22:04,575 --> 00:22:09,162 బంగారాన్నే, కానీ పార్టీలలో మాత్రం పిచ్చిగా ప్రవర్తిస్తాను. 423 00:22:10,163 --> 00:22:11,373 - అవునా? హా? - అవును. 424 00:22:11,373 --> 00:22:12,708 హా. 425 00:22:12,708 --> 00:22:13,792 సరే. 426 00:22:14,459 --> 00:22:16,420 - మీ అమ్మానాన్నలు రాక ముందే... - సరే. 427 00:22:16,420 --> 00:22:18,005 ...పైన అంతా శుభ్రం చేసి వచ్చేస్తా. 428 00:22:18,005 --> 00:22:19,006 సరే, రౌడీ బాబూ. 429 00:22:23,218 --> 00:22:25,387 అది నేనన్న మాట కాదు. నువ్వే అన్నావు. 430 00:22:25,387 --> 00:22:27,639 - మిత్రులారా, వినండి! - నువ్వు అన్నట్టే. 431 00:22:27,639 --> 00:22:29,892 హానా, ఫాదర్ రూబెన్, అందరూ ఎక్కడ ఉన్నారు? 432 00:22:30,517 --> 00:22:32,186 ఏంటి సంగతి? ఏంటి సంగతి, బాబులూ? 433 00:22:32,186 --> 00:22:34,188 అక్కడ ఏం చేస్తున్నారు? నా స్టీమ్ రూమ్ చూస్తున్నారా? 434 00:22:34,688 --> 00:22:36,148 బాగుంది కదా? 435 00:22:36,148 --> 00:22:38,150 సరే. నేను ఒకటి చెప్పాలి. 436 00:22:38,150 --> 00:22:39,568 అయ్య బాబోయ్. 437 00:22:39,568 --> 00:22:44,198 నాటలీ. నిన్న రాత్రి మనిద్దరం సరస సల్లాపాలో తేలుతూ ఉన్నప్పుడు 438 00:22:44,198 --> 00:22:47,117 నాకు ఇష్టమైన హాకీ ఆటగాళ్ళ గురించి చెప్తూ ఉన్నా కదా? 439 00:22:48,118 --> 00:22:48,952 అవును. 440 00:22:48,952 --> 00:22:54,541 సరే. 99వ జెర్సీ వేసుకొన్న అత్యుత్తమ ఆటగాడైనా వేన్ గ్రెజ్కీ ఒకసారి ఓ మాట అన్నాడు, 441 00:22:55,125 --> 00:22:56,502 "మనం షాట్ కోసం ప్రయత్నించకపోతే, 442 00:22:56,502 --> 00:22:58,045 - ఆ షాట్ ని మిస్ అయినట్టే." -"ఆ షాట్ ని మిస్ అయినట్టే." 443 00:22:58,045 --> 00:23:00,797 నేను వేన్ చెప్పిన మాట కన్నా మంచి మాట చెప్తాను, సరేనా? 444 00:23:00,797 --> 00:23:04,551 ఒక్కోసారి మనం షాట్ కొట్టినా, అది మిస్ అయినట్టు మనకి అనిపించవచ్చు. 445 00:23:08,347 --> 00:23:10,849 కానీ బాల్ దేనికోకదానికి తగిలి 446 00:23:12,142 --> 00:23:14,269 మళ్లీ నెట్ లో వచ్చి పడుతుంది. 447 00:23:14,770 --> 00:23:16,522 అతను షూట్ చేసి, స్కోర్ చేస్తాడు. 448 00:23:17,105 --> 00:23:19,399 - నెట్ తనేనా? - తనే అనుకుంటా. 449 00:23:19,399 --> 00:23:21,026 - నాటలీ ప్లూరల్... - ప్లూరల్ కాదు, పర్ల్. 450 00:23:21,026 --> 00:23:22,402 పర్ల్. 451 00:23:25,489 --> 00:23:27,783 అయ్య బాబోయ్. 452 00:23:27,783 --> 00:23:30,494 నాలో సగ భాగం అయ్యి, నా తొలిభార్యగా అయ్యి 453 00:23:30,494 --> 00:23:33,330 నా జన్మ ధన్యం చేస్తావా? 454 00:23:37,000 --> 00:23:38,293 హా, తప్పకుండా. 455 00:23:38,877 --> 00:23:40,838 - తప్పకుండా. - నిజం చెప్తున్నావా? 456 00:23:40,838 --> 00:23:42,589 - హా. - హా, అల్లాడిద్దాం ఇక! యాహూ! 457 00:23:43,507 --> 00:23:44,508 - వావ్! - పిచ్చెక్కిద్దాం! యాహూ! 458 00:23:44,508 --> 00:23:45,884 - అయ్య బాబోయ్. - సూపర్, నాట్! 459 00:23:47,511 --> 00:23:48,428 బంగారం. 460 00:23:48,428 --> 00:23:51,306 ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 461 00:23:51,807 --> 00:23:54,726 నాకు... నాకు... అద్భుతమైన పాట పాడాలని ఉంది. 462 00:23:54,726 --> 00:23:57,187 - అవునా? సరే. - పాట తన్నుకొచ్చేస్తోంది, నాటలీ. 463 00:23:58,146 --> 00:23:59,106 అయ్య బాబోయ్. 464 00:23:59,106 --> 00:24:00,482 - అదీ లెక్క. - సరే మరి. 465 00:24:00,482 --> 00:24:03,068 నాటలీ, నాటలీ నీతో ఏవేవో ఊసులు ఆడుకోవాలి 466 00:24:03,068 --> 00:24:05,654 నీ ప్రేమలో నిండా మునిగి పోయి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాను 467 00:24:05,654 --> 00:24:07,364 నువ్వు కాస్ కి ప్రాణం కడ దాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా 468 00:24:07,364 --> 00:24:09,491 కాస్త మా ఫోన్స్ ఇస్తారా? మీ ప్రేమాయణాన్ని మేము చూడలేకపోతున్నాం. 469 00:24:09,491 --> 00:24:11,326 నా మనసు ఎప్పటికీ నీదే ఆ విషయంలో సందేహమే లేదు 470 00:24:11,326 --> 00:24:12,744 - చాలా వింతగా ఉంది, బాబోయ్. - నాటలీ, నాటలీ 471 00:24:12,744 --> 00:24:14,872 తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి? కోటులో. కోటు ఎక్కడ పెట్టావు? 472 00:24:14,872 --> 00:24:16,665 జాకెట్ ని వేరే గదిలో పెట్టావా? 473 00:24:16,665 --> 00:24:19,251 నాటలీ, నాటలీ నువ్వు నా ప్రేమ పావురానివి 474 00:24:19,251 --> 00:24:21,670 - మన ఫోన్స్ ఉన్న బ్యాగ్ ఇదుగోండి. - దాన్ని తెరవడం ఎలా? 475 00:24:21,670 --> 00:24:24,673 ముందు ఇక్కడి నుండి వెళ్లిపోదాం. కారెక్కాక ఆలోచిద్దాం దాని గురింది. పారిపోదాం పదండి అందరం. 476 00:24:27,259 --> 00:24:28,260 ఓరి నాయనోయ్. 477 00:24:28,260 --> 00:24:30,554 మనోడు పాట భలే పాడుతున్నాడు. 478 00:24:30,554 --> 00:24:33,265 భలే ఏమీ పాడట్లేదులే. వాడి కన్నా నేనే బాగా పాడతాను. 479 00:24:34,433 --> 00:24:36,977 హేయ్, జేకబ్. ట్రీనా ఎక్కడ ఉంది? 480 00:24:36,977 --> 00:24:38,562 తను పైన నిద్రపోతోంది. 481 00:24:39,730 --> 00:24:40,898 నేను ఇప్పుడు బయలుదేరబోతున్నాను, 482 00:24:40,898 --> 00:24:44,693 కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ట్రీనా చెప్పింది. 483 00:24:45,277 --> 00:24:49,531 చెప్పేసిందా? తను ఎలా ఉండింది? తను అదోలా ఉంటే మాకు చెప్తావు కదా? 484 00:24:49,531 --> 00:24:53,243 హా. తప్పకుండా. మీకు కూడా అంతా మంచే జరుగుతుందిలే. 485 00:24:59,082 --> 00:25:00,792 - గుడ్ నైట్. - లేదు, మనం... 486 00:25:00,792 --> 00:25:01,877 సరే. 487 00:25:04,588 --> 00:25:06,215 - స్కూల్ లో కలుద్దాం. - సరే, గుడ్ నైట్. 488 00:25:06,215 --> 00:25:07,299 గుడ్ నైట్, జేకబ్. 489 00:25:16,141 --> 00:25:17,392 సరే మరి... 490 00:25:22,523 --> 00:25:25,234 మన పడకగదిలో కాకుండా, వేర్వేరు పడక గదుల్లో పడుకోవాల్సిన 491 00:25:25,234 --> 00:25:28,362 సమయం వచ్చేసింది అనుకుంటా. 492 00:25:29,530 --> 00:25:30,531 అవును. 493 00:25:36,912 --> 00:25:38,914 పడుకొనే ముందు నా గదిలో ఏదైనా డ్రింక్ తాగుదామా? 494 00:25:41,375 --> 00:25:42,835 స్వీయాన్వేషణకి జయహో. 495 00:25:51,593 --> 00:25:55,597 మరి, నువ్వు చేయాలనుకుంటున్న మొదటి పని ఏంటి? 496 00:25:55,597 --> 00:25:58,475 విస్లర్ కి స్కీయింగ్ కోసం వెళ్తావా లేదా... 497 00:25:58,475 --> 00:25:59,935 నేను విస్లర్ కి వెళ్లను. 498 00:26:01,395 --> 00:26:04,356 సరే. నువ్వే అన్నావు కదా, నీ విజన్ లో మనం గమనించాల్సింది స్కీయింగ్ ని మాత్రమే కాదని. 499 00:26:04,356 --> 00:26:07,484 - కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. - అది కాదు. ఇప్పుడు నాకు విస్లర్ కి వెళ్లాలని లేదు. 500 00:26:11,822 --> 00:26:14,324 ఆ రోజుల్లో విస్లరులో ఉండాలనుకున్నాను. 501 00:26:14,950 --> 00:26:17,744 సెమిస్టర్ అయ్యాక... సెలవుల్లో 502 00:26:17,744 --> 00:26:19,329 నేను చాలా ఆనందంగా గడిపాను. 503 00:26:20,038 --> 00:26:21,206 నువ్వు కూడా ఆనందంగానే గడిపి ఉంటావు. 504 00:26:21,206 --> 00:26:23,333 కానీ ఆ సరదా, ఆ సాహసాల వలన 505 00:26:23,333 --> 00:26:26,420 ఇంకొంత కాలం అక్కడ ఉండాలనుకున్నా. అంతే కానీ, అక్కడే ఉండిపోవాలనుకోలేదు. కేవలం... 506 00:26:26,420 --> 00:26:30,007 - ఆరు వారాలా? - ఆరు వారాలు ఉంటే బాగానే ఉండేది. హా. 507 00:26:32,426 --> 00:26:34,636 ఏమోలే. ఏదైనా జరిగి ఉండవచ్చు. 508 00:26:34,636 --> 00:26:36,138 బహుశా ఒకేలా ఉండేదేమో, 509 00:26:36,138 --> 00:26:40,309 లేదా స్కీయింగ్ చేసేటప్పుడు మొదటి రోజే ఏదైనా చెట్టుకు గుద్దుకొని, చచ్చి ఉండేవాడినేమో. 510 00:26:40,309 --> 00:26:44,062 ఏదైనా కానీ, అదంతా అనవసరం. నేను నీ కోసమే వచ్చా, అది మాత్రం నిజం. 511 00:26:44,646 --> 00:26:46,523 ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. హా. 512 00:26:51,320 --> 00:26:53,405 ఇంకా నిజంగా చెప్పాలంటే, నువ్వెక్కడ దూరమైపోతావో అన్న భయం నాకు. 513 00:26:55,365 --> 00:26:56,575 నేను అలాంటి రకమైన వాడిని. 514 00:26:59,036 --> 00:27:02,456 నా విజన్ లో కూడా అది నాకు కనిపించింది, కానీ అది నీకు చెప్పలేదు. 515 00:27:06,502 --> 00:27:11,298 నాకు భయం కలిగించే దానికి, నేను దగ్గరగా వచ్చిన ప్రతిసారీ... 516 00:27:17,596 --> 00:27:18,931 నేను ఆగిపోతాను. 517 00:27:19,890 --> 00:27:23,810 నేను ఆగిపోతాను. ఆ పని చేయను. అది నీకూ తెలుసు కదా. నేను ఆ పని అస్సలు చేయను. 518 00:27:23,810 --> 00:27:25,437 ఎప్పుడూ సులభంగా ఉండే మార్గాన్నే ఎంచుకుంటాను. 519 00:27:26,647 --> 00:27:30,901 అంటే, నువ్వు సులభమైనా మార్గమని అనుకోవద్దు. నువ్వు కష్టమైన మార్గానివి. 520 00:27:30,901 --> 00:27:34,321 కష్టమైన మార్గం అంటే అలా కాదు. అది సరైన పదం కాదు. 521 00:27:34,321 --> 00:27:35,405 నాకు చాలా బాధగా ఉంది. 522 00:27:35,405 --> 00:27:36,782 లేదు. క్షమించు. 523 00:27:36,782 --> 00:27:40,035 నాకు బాధ కలిగింది అందుకు కాదు, ఆ సెమిస్టరులో, 524 00:27:40,911 --> 00:27:42,120 నాకు ఇటలీలో ఉండాలనిపించింది. 525 00:27:43,247 --> 00:27:45,165 - అంటే ఎప్పటికీ కాదు. కేవలం... - ఆరు వారాల పాటా? 526 00:27:45,749 --> 00:27:46,667 అవును. 527 00:27:47,376 --> 00:27:48,836 ఇంకొంత కాలమేమో. 528 00:27:49,461 --> 00:27:51,380 కాబట్టి, మనం చాలా కాలం పాటు మనల్ని మనం ఆపుకుంటూ ఉన్నామని... 529 00:27:52,589 --> 00:27:56,009 నాకు బాధగా ఉంది, ఎందుకంటే, నేను ఏమనుకుంటానో అని నువ్వు, 530 00:27:56,009 --> 00:27:59,346 నువ్వు ఏమనుకుంటావో అని నేను భయపడుతూ వచ్చాం. 531 00:28:01,932 --> 00:28:03,100 కానీ ఆ పని ఇప్పుడు చేస్తున్నాం కదా. 532 00:28:03,725 --> 00:28:06,019 కానీ ఆ ఆరు వారాలు ఇప్పుడు గడుపుతున్నాం కదా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. 533 00:28:08,480 --> 00:28:11,900 మన జీవితంలో జరిగే అతిగొప్ప విషయం ఇదే అవుతుందని ఎందుకో నాకు అనిపిస్తోంది. 534 00:28:14,528 --> 00:28:15,529 ఏంటి? 535 00:28:18,240 --> 00:28:20,158 నా విజన్ లో కూడా ఇంకో విషయం జరిగింది. 536 00:28:22,411 --> 00:28:24,037 కొంపదీసి నన్ను కూడా నువ్వు కత్తితో పొడవలేదు కదా! 537 00:28:26,290 --> 00:28:30,043 పొడిచావా? నన్ను కూడా పొడిచావా? కాస్. 538 00:28:31,211 --> 00:28:34,882 అవును. అమ్మని పొడిచాక, ఆ చోటికి నువ్వు వచ్చావు, 539 00:28:34,882 --> 00:28:37,217 ఇక నీపై భీకరంగా విరుచుకుపడతాను. 540 00:28:37,217 --> 00:28:39,219 నా శవంపై కూడా చిందులు వేశావా? 541 00:28:39,219 --> 00:28:41,180 తొక్కి పడేశాను అన్నమాట. 542 00:28:44,766 --> 00:28:48,103 కానీ, నువ్వు అన్నట్టు అవి మనకి ఏదో విషయాన్ని చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కదా? 543 00:28:49,313 --> 00:28:52,441 కొత్త దిశ వైపు అడుగులు వేయడానికి, అవి మనం చూడాల్సిన అంశాలు. 544 00:29:07,206 --> 00:29:11,585 మనం చూడాల్సిన అవసరం ఉన్నవి ఏవైనా కానీ, అవి మనం తెలుసుకోవడం మంచిదే కదా? 545 00:29:20,844 --> 00:29:22,429 ఈ పని నువ్వు నిజంగానే చేయాలనుకుంటున్నావా? 546 00:29:42,783 --> 00:29:44,785 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 547 00:30:57,566 --> 00:30:59,568 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్