1 00:00:10,677 --> 00:00:12,095 ఈ పని నిజంగానే చేయాలనుకుంటున్నావా? 2 00:00:16,225 --> 00:00:19,228 నా కార్డు పెట్టాను, అప్పుడు అది "మీరెవరో తెలుసుకోండి" అని అంది. 3 00:00:19,228 --> 00:00:22,523 అప్పుడు నా చిన్న అవతారం ప్రత్యక్షమైంది, కోల్టన్ అంత్యక్రియల సమయంలో 4 00:00:22,523 --> 00:00:24,650 నేను ఏ బట్టలను అయితే వేసుకున్నానో, వాటినే నా అవతారం కూడా వేసుకొనుంది. 5 00:00:27,110 --> 00:00:29,571 నిజంగా జరిగినట్టుగానే, నేను జియార్జియో రెస్టారెంట్ పైన ఉన్నాను. 6 00:00:29,571 --> 00:00:32,156 {\an8}కానీ బోర్డు చూస్తే, "జియార్జియోస్" అని కాకుండా, 7 00:00:32,156 --> 00:00:36,745 {\an8}"అబద్ధాలకోరు" అని ఉంది. నేను ఆ బోర్డును పగలగొట్టేస్తాను, అప్పుడు అదంతా పేలిపోతుంది. 8 00:00:36,745 --> 00:00:39,706 {\an8}ఆ తర్వాత, నేనొక్కదాన్నే అక్కడ ఉంటా. 9 00:00:39,706 --> 00:00:40,624 కొనసాగించాలనుకుంటున్నారా? 10 00:00:40,624 --> 00:00:42,584 నేను ఇప్పుడు ఏం కావాలన్నా కావచ్చని చెప్తోంది అన్నట్టు అనిపించింది. 11 00:00:42,584 --> 00:00:45,879 నా అబద్ధాల సమస్యను నేను పరిష్కరించుకున్నా కాబట్టి, నేనేం అవ్వాలో నేను ఎంచుకోవచ్చు. 12 00:00:45,879 --> 00:00:46,964 అది చాలా గొప్ప విషయం. 13 00:00:46,964 --> 00:00:48,966 నాతో నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. నేను నీతో రావచ్చా? 14 00:00:54,763 --> 00:00:55,764 {\an8}హీరో 15 00:00:57,432 --> 00:00:59,226 ఒక ప్లేయర్ మాత్రమే ఉండాలి 16 00:00:59,226 --> 00:01:01,436 ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉండాలనుకుంటా. 17 00:01:01,937 --> 00:01:03,313 వీడియో తీస్తానులే, తర్వాత చూద్దువు కానీ. 18 00:01:03,814 --> 00:01:04,730 మీరు ఎవరు 19 00:01:07,150 --> 00:01:08,443 వావ్. 20 00:01:16,535 --> 00:01:18,287 అయ్య బాబోయ్. 21 00:01:31,884 --> 00:01:33,844 ఏం వచ్చింది? 22 00:01:36,180 --> 00:01:40,392 నేను, కోల్టన్ టెన్నిస్ వీడియో గేమ్ ఆడేవాళ్లం, ఇది కూడా కాస్త అలాగే ఉంది. 23 00:01:41,685 --> 00:01:42,936 నేను చూడవచ్చా? 24 00:01:48,859 --> 00:01:51,195 - ఏమైంది? - రావట్లేదు. అస్సలు సరిగ్గా కనిపించట్లేదు. 25 00:01:54,531 --> 00:01:55,949 పోయిందా? 26 00:01:56,742 --> 00:01:58,410 మనం చూడగానే పోతుందా? 27 00:01:58,952 --> 00:02:00,037 అంతే అనుకుంటా. 28 00:02:00,829 --> 00:02:03,123 దీన్ని ఎవరు తయారు చేశారో కానీ, వాళ్లు మహా పిచ్చోళ్లు. 29 00:02:04,791 --> 00:02:05,792 నిజమే అది. 30 00:02:24,561 --> 00:02:28,815 మార్ఫో యంత్రం వచ్చినప్పటి నుండి హాజరు శాతంలో క్షీణతని ఈ గ్రాఫ్ చూపుతోంది. 31 00:02:28,815 --> 00:02:30,692 మీకు ఈ గ్రాఫ్స్ ని ఎవరు గీసి ఇస్తున్నారు, ప్రిన్సిపల్ పాట్? 32 00:02:30,692 --> 00:02:32,986 నేనే గీశా. ఎందుకో చెప్పనా? 33 00:02:32,986 --> 00:02:36,114 మన కంప్యూటర్ గ్రాఫిక్స్ టీచర్, అద్దాలను తయారు చేయాలని మానేసింది. 34 00:02:36,114 --> 00:02:38,075 మీరు చాలా బాగా గీశారులే. 35 00:02:39,535 --> 00:02:41,578 ఒకటి చెప్పనా? మన ముందు ఒక సమస్య వచ్చి పడింది, మిత్రులారా. 36 00:02:41,578 --> 00:02:45,582 టీచర్లు ఉద్యోగాలు మానేస్తున్నారు, విద్యార్థులు ఎగ్గొడుతున్నారు. నాకు పరిష్కారం కావాలి. 37 00:02:46,166 --> 00:02:48,961 ఇక్కడున్న వాళ్లలో ఎవరికైనా మన విద్యార్థులపై శ్రద్ధ ఉందా? 38 00:02:50,170 --> 00:02:51,839 - డస్టీ హొబ్బర్డ్. - నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 39 00:02:51,839 --> 00:02:53,882 ఇక్కడ ఏం జరుగుతోందో, మనకి స్పష్టంగానే తెలిసిపోతోంది. 40 00:02:53,882 --> 00:02:56,218 తమ కలల గురించి ఆలోచించుకొనే, అలాగే తమ జీవితాలను మార్చుకోవడానికి ఏం చేయవచ్చో 41 00:02:56,218 --> 00:02:58,011 ఆలోచించుకొనే అవకాశాన్ని కూడా మార్ఫో యంత్రం జనాలకు ఇచ్చింది. 42 00:02:58,011 --> 00:03:00,055 కానీ మన స్కూలులో మనం దేన్నీ మార్చలేదు, 43 00:03:00,556 --> 00:03:03,976 మోటర్ సైకిళ్లకి అదనపు పార్కింగ్ స్థలాన్ని ఇవ్వడం తప్ప. 44 00:03:03,976 --> 00:03:05,060 అది అందరికీ. 45 00:03:05,060 --> 00:03:07,563 మనం సిలబస్ ని మార్చాల్సిన అవసరం ఉంది అనుకుంటా. 46 00:03:07,563 --> 00:03:09,815 ప్రతి సంవత్సరం చెప్పిందే చెప్పడం కాకుండా, 47 00:03:09,815 --> 00:03:13,777 మన విద్యార్థులకు ఏం కావాలో కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. 48 00:03:13,777 --> 00:03:16,530 ప్రపంచంలోకి అడుగుపెట్టాక, తమకు లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయని, 49 00:03:16,530 --> 00:03:20,158 అలాగే తాము కూడా లెక్కలేనన్ని పనులు చేయవచ్చని మనం వాళ్లకి చూపించాలి. 50 00:03:23,996 --> 00:03:26,540 ఒకటి చెప్పనా? ఈ కొత్త డస్టీ నాకు భలే నచ్చేశాడు. 51 00:03:26,540 --> 00:03:28,917 నువ్వు విడాకులు తీసుకుంటున్నావని విని, నేను చాలా ఆందోళన పడ్డాను. 52 00:03:29,543 --> 00:03:30,752 మేమేమీ విడాకులు తీసుకోవడం లేదు, 53 00:03:30,752 --> 00:03:32,838 పైగా, ఆ విషయం ఇక్కడ చర్చించడం సబబు కూడా కాదు. 54 00:03:32,838 --> 00:03:35,674 లేదు, మీరిద్దరూ మానసికంగా దెబ్బతింటున్నారని అనుకున్నా. 55 00:03:36,842 --> 00:03:38,635 నా బాధ్యతని విస్తరింపజేసినా నాకేం పర్వాలేదు. 56 00:03:38,635 --> 00:03:42,389 నాకు ఫ్రెంచ్, జర్మన్ భాషలు తెలుసు. లాటిన్ కూడా కొద్దిగా తెలుసు. 57 00:03:42,389 --> 00:03:44,266 సూపర్! నువ్వు జిమ్ క్లాసులు తీసుకో. 58 00:03:45,767 --> 00:03:47,853 అది కోచ్ ఈగల్సన్ డ్యూటీ కదా? 59 00:03:47,853 --> 00:03:51,023 మోసం చేసిన విషయం బయటపడ్డాక, నన్ను సివిక్స్ క్లాసులు తీసుకోమన్నారు. 60 00:03:51,023 --> 00:03:54,568 విషయం ఏంటంటే, విద్యార్థులే నాకు బోధిస్తున్నారు. 61 00:03:54,568 --> 00:03:57,237 మిస్టర్ హొబ్బర్డ్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. 62 00:03:58,447 --> 00:04:00,407 మారాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటా. 63 00:04:03,827 --> 00:04:06,288 డీర్ఫీల్డ్ హై స్కూల్ 64 00:04:06,872 --> 00:04:09,708 బ్రాయన్ సర్కస్. ఆ క్విజ్ ఏడ్చినట్టు ఉంది. 65 00:04:09,708 --> 00:04:12,920 "ఆటోమొబైల్"ని కనిపెట్టింది ఆటో వాన్ బిస్మార్క్ కాదు కదా. 66 00:04:13,545 --> 00:04:15,464 - మిస్టర్ హొబ్బర్డ్, హాయ్. - మిస్ విక్స్టెడ్. 67 00:04:15,464 --> 00:04:18,550 హా, నేను మీ ప్రసంగం చాలా బాగుందని 68 00:04:18,550 --> 00:04:20,594 మీకు మరొక్కసారి చెప్పాలని వచ్చాను. 69 00:04:21,803 --> 00:04:23,263 - ప్రసంగమా? - హా. అవును. 70 00:04:23,931 --> 00:04:27,601 అది ప్రసంగంలా ఇవ్వాలనుకోలేదు. నా మనస్సులో ఉన్నది చెప్పేశానంతే. 71 00:04:27,601 --> 00:04:29,353 నన్ను బాగా ఆకట్టుకుంది అది. 72 00:04:29,853 --> 00:04:31,313 నా మార్ఫో విజన్ ని చూసినప్పటి నుండి, 73 00:04:31,313 --> 00:04:34,274 నేను అన్నింటినీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కాకుండా, 74 00:04:34,274 --> 00:04:36,610 పరిస్థితుల ప్రకారం నడుచుకుందాం అనుకుంటున్నా. 75 00:04:36,610 --> 00:04:38,028 కాబట్టి నేను... 76 00:04:38,028 --> 00:04:39,988 విద్యార్థులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందనే 77 00:04:39,988 --> 00:04:41,949 మీ ఆలోచన నాకు నచ్చింది. 78 00:04:41,949 --> 00:04:43,325 అది మంచి విషయం, మిస్ విక్స్టెడ్. 79 00:04:43,325 --> 00:04:45,786 - ఆలిస్ అని పిలిస్తే చాలు. - ఆలిస్. అలాగే. ఆలిస్. 80 00:04:45,786 --> 00:04:46,995 ఆలిస్ విక్స్టెడ్. 81 00:04:46,995 --> 00:04:48,747 మీరు ట్రీనాకి మ్యూజిక్ టీచర్ కదా. 82 00:04:48,747 --> 00:04:51,708 అవును. క్లాసులో ట్రీనా టాప్. 83 00:04:51,708 --> 00:04:55,879 మీ ఇంట్లో పరిస్థితి విని, నాకు చాలా బాధగా అనిపించింది. 84 00:04:57,005 --> 00:04:58,423 - పర్వాలేదులెండి. - నేను మీ వెనుక వచ్చింది 85 00:04:58,423 --> 00:05:00,050 - అందుకు కాదులెండి నిజానికి... - హా. 86 00:05:00,050 --> 00:05:02,302 ...సిలబస్ లో మరిన్ని అంశాలు చేర్చడానికి మీతో చర్చించవచ్చో లేదో తెలుసుకుందామని 87 00:05:02,302 --> 00:05:04,054 ఇలా వచ్చాను. 88 00:05:04,054 --> 00:05:06,515 - తప్పకుండా. అలాగే చేద్దాం. - మంచిది. 89 00:05:06,515 --> 00:05:09,101 రేపు నా మూడవ పీరియడ్ అయ్యాక నేను కాస్త ఖాళీగా ఉంటాను. 90 00:05:09,101 --> 00:05:11,436 - జియార్జియోస్ లో ఏడు గంటలకి కలుద్దామా? - ఇవాళేనా? 91 00:05:11,436 --> 00:05:12,521 అవును. 92 00:05:13,605 --> 00:05:16,984 హా. సరే. ఒక్క నిమిషం. ఇవాళ ఏ రోజు? 93 00:05:16,984 --> 00:05:18,861 - ఇవాళ... - ఏ రోజు ఇవాళ? 94 00:05:18,861 --> 00:05:20,988 - అదే, ఈ రాత్రి ఏ రోజని అడుగుతున్నా. - ఇవాళ సోమవారం. 95 00:05:20,988 --> 00:05:22,489 - సోమవారం. అవును. - హా. 96 00:05:22,489 --> 00:05:24,741 వారంలోని మొదటి రోజు. 97 00:05:24,741 --> 00:05:25,701 ఆలోచించి చెప్తాను ఆగండి. 98 00:05:25,701 --> 00:05:29,329 హేయ్, డస్ట్! నేనూ, నా రూమ్ మేట్, నట్ బ్యాగ్ ఇవాళ రాత్రి పీకల దాకా తాగనున్నాం. 99 00:05:29,329 --> 00:05:31,790 జెల్లో షాట్స్, ఇంకా ఎనర్జీ డ్రింక్స్. వస్తావా? 100 00:05:31,790 --> 00:05:33,041 నట్ బ్యాగ్ తో అన్నావు కదా? 101 00:05:33,041 --> 00:05:34,001 అవును. 102 00:05:35,210 --> 00:05:37,337 నీ ఆహ్వానాన్ని కాదనాలని అస్సలు లేదు, 103 00:05:37,337 --> 00:05:39,840 కానీ ఆలిస్ కి, నాకు లోతుగా చర్చలు జరిపే పని ఉంది. 104 00:05:39,840 --> 00:05:40,757 సరే. 105 00:05:40,757 --> 00:05:43,427 నీకు అదృష్టం లేదు, బాసూ. మాకు బోలెడు తిండి మిగులుతుందిలే. 106 00:05:44,887 --> 00:05:46,513 అది అదృష్టంలా లేదు. 107 00:05:58,650 --> 00:06:01,987 - డస్టీ? డస్టీ? నీకు ఏమీ కాలేదు కదా? - ఏమీ కాలేదు. 108 00:06:01,987 --> 00:06:03,530 - అబ్బా. హా. - నీ అరుపు వినిపించింది. 109 00:06:04,615 --> 00:06:08,410 నీకు ఒక మగాడి అరుపు వినిపించి ఉండవచ్చు, కానీ నాకు ఏమీ కాలేదు. 110 00:06:08,410 --> 00:06:09,494 సరే. 111 00:06:10,245 --> 00:06:12,497 ఒక్క నిమిషం, నా యోగా మ్యాట్ మీద ఎందుకు ఇస్త్రీ చేస్తున్నావు? 112 00:06:12,497 --> 00:06:17,002 వేరే ఇస్త్రీ టేబుల్ నాకు కనిపించలేదు, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నిన్ను కూడా అడగలేదు, 113 00:06:17,002 --> 00:06:19,630 ఎందుకంటే, మనం వేరుగా ఉంటున్నాం కదా. 114 00:06:21,965 --> 00:06:25,093 ఎవరో స్టయిల్ గా ఉండే బిజినెస్ ప్యాంట్ ఐరన్ చేసుకుంటున్నారే. 115 00:06:25,093 --> 00:06:26,261 రాత్రి పెద్ద ప్లానే ఉన్నట్టుందిగా! 116 00:06:26,261 --> 00:06:30,390 ఏంటి? బోరింగ్ గా అనిపించే టీచర్ల సమావేశాన్ని కూడా పెద్ద ప్లాన్ అని అంటారా? 117 00:06:31,225 --> 00:06:34,269 నీ సంగతేంటి? వ్యక్తిగతంగా నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? 118 00:06:34,853 --> 00:06:38,565 నా... హా, చాలా ఉన్నాయి. 119 00:06:39,191 --> 00:06:40,442 చాలా అంటే చాలా ఉన్నాయి. 120 00:06:41,109 --> 00:06:43,237 హా. కానీ, 121 00:06:43,237 --> 00:06:46,031 మన స్వీయాన్వేషణలో భాగంగా, మనం ఒకరికొకరితో అన్ని విషయాలూ 122 00:06:46,031 --> 00:06:48,242 - చెప్పుకోవాల్సిన పని లేదు, కాబట్టి... - అవును. 123 00:06:48,242 --> 00:06:50,744 చెప్పుకోవాల్సిన పని లేదని నువ్వు అన్నదానితో పూర్తిగా ఏకీభవిస్తున్నా. 124 00:06:50,744 --> 00:06:53,956 మంచిది. కాబట్టి నా గురించి ఆలోచించకు. 125 00:06:55,165 --> 00:06:57,626 నేను సూపర్ పని చేయబోతున్నాను. 126 00:06:59,086 --> 00:07:02,089 {\an8}క్రూజింగ్ క్రూజ్ ఇన్ తెరిచి ఉంది 127 00:07:09,012 --> 00:07:10,472 - హేయ్, మార్తా! - కాస్. 128 00:07:10,973 --> 00:07:13,600 అయ్య బాబోయ్. నిన్ను చూడటం బాగుంది. 129 00:07:15,269 --> 00:07:16,311 ఇక్కడికి వచ్చావే? 130 00:07:16,311 --> 00:07:20,190 జీవితంలో ఒక్కసారి స్వతంత్రంగా గడిపే అవకాశం వచ్చింది, కనుక "ఒంటరిగా చేయాల్సిన అత్యుత్తమమైన పని," అని గూగుల్ చేశా, 131 00:07:20,190 --> 00:07:23,277 అప్పుడు వచ్చిన ఫలితాలలో "ఒక విలాసవంతమైన హోటల్ లో ఉండటం" అనేది మొదటిది అన్నమాట. 132 00:07:23,277 --> 00:07:27,739 చాలా మంచిది, కాస్. కానీ, నువ్వు ఎంచుకొన్న సమయమే సరిగ్గా లేదు. 133 00:07:27,739 --> 00:07:28,991 డీర్ఫీల్డ్ పవర్ & ఎనర్జీ వాళ్లు 134 00:07:28,991 --> 00:07:30,951 ఉద్యోగుల వార్షిక సంబరాలు చేసుకుంటున్నారు, 135 00:07:30,951 --> 00:07:32,411 హోటల్ అంతా వాళ్లే ఉన్నారు. 136 00:07:33,078 --> 00:07:37,875 ఇప్పుడు ఇక్కడ ఒకే గది ఖాళీగా ఉంది, అది కూడా మళ్లీ సిబ్బంది క్వార్టర్సులోనే ఉంది. 137 00:07:37,875 --> 00:07:41,044 నాకు వైన్ ఉంటే చాలు, ఎక్కడైనా పర్వాలేదు. 138 00:07:41,044 --> 00:07:43,463 సరే. ఇంకో విషయం. మీ అమ్మ ఈ రాత్రి ప్రసంగం ఇవ్వబోతోందని 139 00:07:43,463 --> 00:07:45,174 ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. 140 00:07:46,425 --> 00:07:48,844 ఆ పిచ్చి మనిషితో వేగేంత శక్తి ఇప్పుడు నాకు లేదు. 141 00:07:51,346 --> 00:07:52,806 తను నా వెనకే ఉంది కదా? 142 00:07:54,266 --> 00:07:56,685 లేదు. ఎందుకు? నా ముఖం అదోలా ఏమైనా నేను పెట్టానా? 143 00:07:56,685 --> 00:07:58,020 - మీ ముఖం చూసి నేనేమీ... - లేదు, నేనేమీ... 144 00:07:58,020 --> 00:07:59,521 - నేను... - లేదు, నా ఉద్దేశం... 145 00:07:59,521 --> 00:08:01,857 నీ వెనుక నుండి దొంగచాటుగా వచ్చేంత దుస్థితి నాకేం పట్టలేదు, కాస్. 146 00:08:02,357 --> 00:08:03,317 ఎంతైనా, 147 00:08:03,317 --> 00:08:04,902 నీతో కత్తితో పొడిపించుకోవాలని నాకు లేదుగా. 148 00:08:04,902 --> 00:08:07,779 హలో, అమ్మా. నా విజన్ గురించి నీకు తెలిసినట్టుంది. 149 00:08:07,779 --> 00:08:10,616 ఈపాటికి అది అందరికీ తెలిసే ఉంటుంది, కాస్. 150 00:08:10,616 --> 00:08:12,659 అదీగాక, నీలాంటి వేరు కాపురం ఉండే అమ్మాయి, 151 00:08:12,659 --> 00:08:15,704 సొంత ఆదాయం ఏమీ లేకపోయినా కూడా 152 00:08:15,704 --> 00:08:18,874 మరీ అధిక ధరలు ఉండే హోటల్ గదిలో ఉండటానికి వచ్చి డబ్బును వృథా చేసుకుంటూ ఉందంటేనే 153 00:08:18,874 --> 00:08:21,043 నాకు అదోలా ఉంది. 154 00:08:21,043 --> 00:08:23,962 ఏవైనా సమస్యలు ఉండుంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. 155 00:08:23,962 --> 00:08:26,924 డస్టీని నా కొడుకులాగే చూసుకొనే దాన్ని. 156 00:08:26,924 --> 00:08:30,594 అవునా? ఎందుకంటే మాకు పెళ్ళయినప్పుడు నువ్వు ఇచ్చిన ప్రసంగంలో "ముదిరిన బెండకాయ" అని 157 00:08:30,594 --> 00:08:31,678 నువ్వు ఆయన్ని అనడం గుర్తుంది. 158 00:08:31,678 --> 00:08:34,264 అమ్మా, నీ దగ్గరకి నేనెందుకు రాలేదంటే, నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా. 159 00:08:34,264 --> 00:08:37,142 అంటే, నిన్ను చూడాలని కానీ, నీ అభిప్రాయాలను కానీ వినాలని నాకు లేదు. 160 00:08:37,142 --> 00:08:39,102 అబ్బో, కోపం మాత్రం తగ్గలేదు. 161 00:08:39,102 --> 00:08:42,648 డస్టీకి ఆ గుణమే నచ్చి ఉండదు. 162 00:08:42,648 --> 00:08:45,400 నీ గది చూపించనా, కాస్? 163 00:08:45,400 --> 00:08:47,653 ఇజ్జీ నువ్వు కూడా నీ గదికి వెళ్లులే, 164 00:08:47,653 --> 00:08:50,864 ప్రసంగానికి సంసిద్ధం అవ్వడానికి ఒక గది కావాలని అడిగావు కదా. 165 00:08:50,864 --> 00:08:52,533 ప్రసంగం అంతా సిద్ధంగా ఉంది, మార్తా. 166 00:08:52,533 --> 00:08:55,369 గుడ్ ఈవినింగ్, డీర్ఫీల్డ్ పవర్ & ఎనర్జీ. 167 00:08:55,369 --> 00:08:58,872 ఈ చల్లటి రాత్రి వేళ, ఇక్కడ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంది. 168 00:09:18,058 --> 00:09:19,059 జేకబ్? 169 00:09:21,144 --> 00:09:22,229 ఏం చేస్తున్నావు? 170 00:09:23,355 --> 00:09:24,898 నేను కోల్టన్ లాకరులో ఉన్నవన్నీ తీసేయబోతున్నా. 171 00:09:25,816 --> 00:09:27,901 అవునా? పక్కానా? 172 00:09:27,901 --> 00:09:32,030 హా. తీసేయడం, తీసేయకపోవడం నా ఇష్టమని ప్రిన్సిపల్ పాట్ చెప్పారు, ఇలా వెళ్తున్నప్పుడల్లా నాకు చికాగ్గా ఉంటోంది. 173 00:09:32,030 --> 00:09:33,740 అతను లేడనే విషయాన్ని జనాలు గ్రహించాలి, 174 00:09:33,740 --> 00:09:36,076 నా విజన్ చెప్పేది కూడా అదే. 175 00:09:36,076 --> 00:09:37,536 నీ విజన్ చెప్పేది అదే అని నీకెందుకు అనిపిస్తోంది? 176 00:09:37,536 --> 00:09:40,414 ఎందుకంటే, అది రెండు ఆటగాళ్లు ఆడే ఆట, కవలలు అంటే అర్థం అదే కదా. 177 00:09:40,414 --> 00:09:42,124 జీవితమంతా, ఇద్దరిలో ఒకరిగానే జీవించాల్సి ఉంటుంది. 178 00:09:42,124 --> 00:09:44,793 నువ్వు ఏం చేసినా, ఇతర వ్యక్తిలాగానో, లేదా భిన్నంగానో చేస్తావని అంటుంటారు, 179 00:09:44,793 --> 00:09:48,005 ఇప్పుడు ఆ ఇతర వ్యక్తి మన మధ్య లేరు. 180 00:09:49,089 --> 00:09:50,340 ఒక ఆటగాడు మాత్రమే, కదా? 181 00:09:52,551 --> 00:09:53,677 ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. 182 00:10:00,350 --> 00:10:02,227 ఇదుగో నా నింటెండో స్విచ్. 183 00:10:02,227 --> 00:10:03,478 వీడే దొంగిలించి ఉంటాడని అనుకున్నా. 184 00:10:05,105 --> 00:10:06,899 ఏంటిది ఇదంతా? 185 00:10:07,941 --> 00:10:08,942 నాకు తెలీదు. 186 00:10:09,735 --> 00:10:12,696 సాయం చేయనా? కావాలంటే సాయం చేస్తా. 187 00:10:12,696 --> 00:10:14,364 లేదు, దీనిలో నువ్వు చేయి పెట్టకుండా ఉండటమే మంచిది. 188 00:10:14,364 --> 00:10:16,241 ఇక్కడ ఆహారం ఉందనుకుంటా. 189 00:10:17,409 --> 00:10:18,243 యాక్. 190 00:10:19,244 --> 00:10:20,245 సరే. 191 00:10:23,123 --> 00:10:24,625 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 192 00:10:24,625 --> 00:10:26,668 - అదీ... హా. - భోజనాన్ని ఆస్వాదించండి. 193 00:10:27,336 --> 00:10:29,838 వావ్. ఇటు చూడండి! 194 00:10:29,838 --> 00:10:31,882 వచ్చాడయ్యా ధనాధన్ బాబూ! 195 00:10:31,882 --> 00:10:35,594 "ఒంటరి బాటసారి" కాబట్టి ఒకరు మాత్రమే కూర్చోగల టేబుల్ కావాలా? 196 00:10:35,594 --> 00:10:37,513 లేదు. మేము ఇద్దరమూ కలిసి వచ్చాం. 197 00:10:37,513 --> 00:10:38,722 టీచర్ల సమావేశం. 198 00:10:39,223 --> 00:10:43,101 వావ్. ఢమాకా బాసుకు, ఈ అందమైన తారకు ఇద్దరు కూర్చోగల టేబుల్ కావాలా? 199 00:10:43,101 --> 00:10:45,646 ఈ షాక్ నుండి తేరుకోనివ్వండి నన్ను కాస్త. 200 00:10:48,899 --> 00:10:51,443 బాగానే తేరుకున్నావుగా. కాస్త మాకు టేబుల్ ఏదో చూపిస్తావా? 201 00:10:51,443 --> 00:10:53,487 ఆ టేబుల్ ఎక్కడ ఉందో నాకు తెలుసు. 202 00:10:54,112 --> 00:10:55,113 గమ్! 203 00:10:55,113 --> 00:10:58,492 - ముందు మీరు వెళ్లండి. మహిళలే ముందు. - సరే. 204 00:10:58,492 --> 00:10:59,576 థ్యాంక్స్. 205 00:10:59,576 --> 00:11:02,704 డీ, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. 206 00:11:02,704 --> 00:11:05,123 నువ్వు త్వరగానే అన్నీ మర్చిపోయి ముందుకు సాగిపోతున్నావని కొందరు అనుకోవచ్చు. 207 00:11:05,123 --> 00:11:07,501 కానీ పడక సుఖం లేని జీవితం వ్యర్థమని నాకు తెలుసు. 208 00:11:07,501 --> 00:11:08,794 ఇది ఆఫీసు సమావేశం. 209 00:11:08,794 --> 00:11:12,506 ఏంటి? ఆఫీసు సమావేశం కాదు, బాసూ. ఆ లిప్ స్టిక్ చూశావు కదా? తను డేటింగ్ అనుకొనే వచ్చింది. 210 00:11:12,506 --> 00:11:15,008 నేను డేటింగ్ చేసి చాలా కాలమైంది కాబట్టి, ఇప్పుడు అది చాలా మారి ఉండవచ్చు, 211 00:11:15,008 --> 00:11:17,052 కానీ సంకేతాలను చూడగానే నేను పసిగట్టేయగలను. 212 00:11:17,052 --> 00:11:19,888 నువ్వు డేటింగ్ పోయిన వారం కూడా చేస్తూ ఉన్నావు కదా. 213 00:11:19,888 --> 00:11:22,182 దాన్ని నేను అస్సలు మిస్ కావట్లేదు, గురూ. 214 00:11:22,182 --> 00:11:26,603 వచ్చేశాం. మెల్లగా పైకి ఎక్కండి, మిస్... 215 00:11:26,603 --> 00:11:27,688 ఆలిస్. 216 00:11:27,688 --> 00:11:29,731 - ఆలిస్, అంటే అద్భుత ప్రపంచంలో ఆలిస్ లాగా అన్నమాట. - హా. 217 00:11:29,731 --> 00:11:32,776 - బాగుంది. నాకు భలే నచ్చింది. - హా. థ్యాంక్యూ. 218 00:11:32,776 --> 00:11:37,155 ఇతను జాండర్. గమ్ అని కూడా పిలుస్తుంటారు. 219 00:11:37,155 --> 00:11:39,116 ఈ సాయంత్రం మీ నావని ఇతనే నడుపుతాడు. 220 00:11:39,116 --> 00:11:42,119 మాకు నడిపేవాడు అక్కర్లేదులే. ఇప్పటిదాకా జరిగిన అద్భుతాలనే చూడలేకపోతున్నా. 221 00:11:43,078 --> 00:11:44,079 సరే. 222 00:11:44,955 --> 00:11:46,790 ఏదేమైనా టిప్స్ ఇవ్వడం ఆనవాయితీ అని మర్చిపోవద్దు. 223 00:11:46,790 --> 00:11:50,252 - అబ్బా, ఇక బయలుదేరులే, గమ్. - అలాగే. 224 00:11:50,252 --> 00:11:55,174 మన ఆలిస్ కి ఏది కావాలో, ఏది వద్దో స్పష్టత ఉంది. మరి, ఈ సాయంత్రం ఏ డ్రింక్స్ తాగాలనుకుంటున్నారు? 225 00:11:55,757 --> 00:12:00,053 నేను ఫ్లోలో వెళ్లిపోదాం అనుకుంటున్నా. మీరు ఏ డ్రింక్ అంటే అదే, డస్టీ. 226 00:12:00,053 --> 00:12:03,473 డ్రింక్స్ కదా? డ్రింక్స్. అవును కదా. 227 00:12:04,349 --> 00:12:07,019 మామూలుగా అందరూ ఏం తెచ్చుకుంటారు? 228 00:12:07,019 --> 00:12:10,939 అంటే... జ్యూస్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. 229 00:12:10,939 --> 00:12:15,027 సోడాలు ఉంటాయి, ఫ్లాట్... సోడా కూడా ఉంటుంది. 230 00:12:16,069 --> 00:12:18,030 లేదా మీకు... మీకు మద్యం ఏమైనా తీసుకోవాలనుకుంటే, 231 00:12:18,030 --> 00:12:19,990 అది కూడా తెప్పించుకుందాం. 232 00:12:19,990 --> 00:12:22,201 నా మిత్రుడిని మీరు మన్నించాలి. 233 00:12:22,201 --> 00:12:26,455 ఇతను చివరిసారిగా డేటింగుకు వెళ్లి 23 ఏళ్లయింది. 234 00:12:26,455 --> 00:12:28,582 కంగారుపడవద్దు. నేను చూసుకుంటా. 235 00:12:31,877 --> 00:12:33,337 ఇది డేటింగ్ అని అతనికి నేను చెప్పలేదు. 236 00:12:33,337 --> 00:12:35,839 లేదులే. ఇది కేవలం... 237 00:12:36,673 --> 00:12:38,383 ఇద్దరు సహోద్యోగుల మధ్య సమావేశమే, కదా? 238 00:12:38,383 --> 00:12:39,468 అవును. 239 00:12:42,679 --> 00:12:44,932 అందుకే భార్యకు దూరంగా ఉన్న విషయం గురించి 240 00:12:44,932 --> 00:12:48,519 నేను నిజాయితీగా చెప్పేసేయాలి, 241 00:12:48,519 --> 00:12:51,313 ఎందుకంటే, మేము దూరంగా సెక్స్ వారాల... సిక్స్ వారాల పాటే ఉంటున్నాం. 242 00:12:52,105 --> 00:12:55,484 ఆరు వారాల్లో ఏమైనా జరగవచ్చు. 243 00:12:56,485 --> 00:13:00,614 జియార్జియోస్ సోమవారం స్పెషల్. 244 00:13:00,614 --> 00:13:03,659 "షాంపేన్, ఆయిస్టర్స్." పిచ్చెక్కించండి! 245 00:13:23,637 --> 00:13:25,848 హేయ్, నేను కూడా నీతో పాటు కూర్చోవచ్చా? 246 00:13:25,848 --> 00:13:26,932 తప్పకుండా. 247 00:13:28,100 --> 00:13:32,062 ఇది దూరం నుండి చూస్తేనే బాగుంది. 248 00:13:32,980 --> 00:13:35,816 నువ్వు ఇక్కడ గదిని బుక్ చేసుకున్నప్పుడు, ఈ పార్టీ ఉందని నీకు కూడా తెలుసా? 249 00:13:35,816 --> 00:13:39,820 తుఫాను వల్ల నా ఇల్లు నీట మునిగింది, కాబట్టి కొన్ని రాత్రుళ్ల నుండి నేను ఇక్కడే ఉన్నా. 250 00:13:39,820 --> 00:13:42,739 హలో, డీర్ఫీల్డ్ పవర్ & ఎనర్జీ. 251 00:13:44,241 --> 00:13:48,120 {\an8}ఈ చల్లటి రాత్రి వేళ, ఇక్కడ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంది. 252 00:13:48,120 --> 00:13:49,788 నీ యెంకమ్మ! 253 00:13:49,788 --> 00:13:52,374 సరే మరి, ఒక నిమిషం విశ్రమించే సమయంలో... 254 00:13:53,876 --> 00:13:56,170 నవీకరించబడిన మన ప్లాట్ ఫామ్స్ కి ఒక మంచి లుక్ ని ఇవ్వడానికి 255 00:13:56,170 --> 00:13:58,964 ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అతిథిని ఆహ్వానించాం. 256 00:13:58,964 --> 00:14:00,382 {\an8}డీర్ఫీల్డ్ పవర్ & ఎనర్జీ పార్టీలో నాకు మతిపోయింది 257 00:14:00,382 --> 00:14:02,009 {\an8}మన లైంగిక వేధింపుల శిక్షణా వీడియోలో రసిక మూడవ బాస్ గా 258 00:14:02,009 --> 00:14:04,136 {\an8}అతను మీకు బాగా సుపరిచితుడే. 259 00:14:04,136 --> 00:14:07,306 {\an8}దయచేసి కేరీ హొబ్బర్డ్ కి స్వాగతం పలకండి! 260 00:14:13,020 --> 00:14:15,397 అతను మా మామయ్య. 261 00:14:15,397 --> 00:14:16,982 అతను అదరగొట్టేస్తున్నాడు. 262 00:14:16,982 --> 00:14:20,736 అతను ఇక్కడ ప్రవర్తిస్తున్న విధానం చాలా దారుణంగా ఉంది కదా? 263 00:14:20,736 --> 00:14:23,488 తనకు నచ్చింది చేస్తున్నాడు, దానికి చాలా ధైర్యం కావాలి. 264 00:14:23,488 --> 00:14:26,325 ఆయన డస్టీ అమ్మని మిస్ అవుతున్నాడు అనుకుంటా. 265 00:14:26,325 --> 00:14:28,994 ఇద్దరు వ్యక్తులు విడిపోయి కూడా ప్రేమలో ఉన్నామని ఎలా చెప్పుకుంటారో, 266 00:14:28,994 --> 00:14:30,954 నాకు అస్సలు అర్థం కాదు. 267 00:14:30,954 --> 00:14:33,040 దానికి కారణం, నీకు ప్రేమంటే ఏంటో తెలీకపోవడమే ఏమో. 268 00:14:40,047 --> 00:14:41,757 ఈ ఊరంతా నన్ను ప్రేమిస్తోంది, కాస్. 269 00:14:43,425 --> 00:14:44,676 ఉంటా మరి, 270 00:14:44,676 --> 00:14:47,429 ఇలాంటి పనికిమాలిన సంభాషణలకు నా స్వరాన్ని అరగ్గొట్టుకోలేను. 271 00:14:47,429 --> 00:14:48,514 బాబోయ్. 272 00:14:51,391 --> 00:14:52,392 ఇద్దరూ కొట్టుకుంటారేమో అనిపించింది. 273 00:14:53,018 --> 00:14:55,103 సారీ, ఎక్కడకెళ్లినా తను వచ్చేస్తుంది. 274 00:14:55,103 --> 00:14:57,272 రామేశ్వరానికి వెళ్లినా, శనేశ్వరం వదలనట్టు అన్నమాట. 275 00:14:57,981 --> 00:15:00,484 కానీ నేను అలా అదుపు తప్పి ఉండాల్సింది కాదు. 276 00:15:01,068 --> 00:15:02,277 లేదు, అది నాకు బాగా నచ్చింది. 277 00:15:05,447 --> 00:15:07,157 జాన్సన్స్ జనరల్ స్టోర్ 278 00:15:08,951 --> 00:15:12,329 నిన్ను ఏదో చెడగొట్టాలని లేదు, కానీ మిస్టర్ జాన్సన్ ఆసుపత్రి నుండి డిశ్చార్డ్ అయ్యేదాకా 279 00:15:12,329 --> 00:15:13,914 నువ్వు ఇక్కడ పని చేయనవసరం లేదనిపిస్తోంది. 280 00:15:13,914 --> 00:15:15,791 మిస్టర్ జాన్సన్ నాతో చాలా మంచిగా ఉండేవాడు. 281 00:15:15,791 --> 00:15:17,793 ఇంకో విషయం, అది చెడగొట్టకపోవడం కాకపోతే ఇంకేంటి? 282 00:15:17,793 --> 00:15:20,045 నేను అన్నది "చెడగొట్టాలని లేదు" అని కదా. 283 00:15:20,045 --> 00:15:22,548 - కాబట్టి అది చెడగొట్టినట్టు కాదు. అర్థమైంది. - హా. 284 00:15:24,466 --> 00:15:27,761 నేను ఈ డెలివరీకి సంతకం చేయాలి. హనీ సీసాలు ఎన్ని ఉన్నాయో లెక్కించవా, హనీ? 285 00:15:27,761 --> 00:15:29,137 నీకోసం ఏదైనా చేస్తా, హనీ. 286 00:15:49,032 --> 00:15:50,200 ఏం చేస్తున్నావు? 287 00:15:50,742 --> 00:15:52,035 ఏమీ లేదు. 288 00:15:54,580 --> 00:15:57,457 ఇది మాట్లాడే కప్ప అయిన టెర్రీ బొమ్మ. 289 00:15:57,457 --> 00:16:00,419 దీన్ని కోల్టన్ కి ఇచ్చింది నేనే, కాబట్టి దీన్ని నువ్వు పారేయాలని అనుకుంటే... 290 00:16:00,419 --> 00:16:01,962 నువ్వు మామూలోడివి కాదు, కోల్టన్. 291 00:16:03,172 --> 00:16:04,047 అది నీ గొంతేనా? 292 00:16:04,047 --> 00:16:07,509 హా, మనం ఏ గొంతైనా పెట్టుకోవచ్చు. అదో పిచ్చి బొమ్మలే. 293 00:16:07,509 --> 00:16:09,428 కానీ నువ్వు దాన్ని ఉంచుకోకూడదు అనుకుంటే... 294 00:16:09,428 --> 00:16:10,971 ఐ లవ్ యూ, కోల్టన్. 295 00:16:16,351 --> 00:16:17,477 బొమ్మ, నేను చెప్పింది నిజమేనా? 296 00:16:17,477 --> 00:16:19,104 ఇది ఎందుకు ఉంచుకోవాలనుకుంటున్నావు? 297 00:16:19,980 --> 00:16:22,441 ఎందుకంటే, కోల్టన్ కి సంబంధించినవి నా దగ్గర ఏం లేవు. 298 00:16:25,194 --> 00:16:27,446 వావ్. నాకేమీ అక్కర్లేదు. ఇవేమీ పనికి వచ్చేవి కావు. 299 00:16:27,446 --> 00:16:28,822 కానీ దీన్ని ఉంచుకో. 300 00:16:33,368 --> 00:16:35,913 ఆ గులాబ్ జామూన్ అదిరిపోయాయి, కదా? 301 00:16:35,913 --> 00:16:39,291 ఒక్కో ప్లేట్ 15 డాలర్లు మరి. ఓరి దేవుడా! 302 00:16:39,291 --> 00:16:41,668 ఏ వంటకం ధర అయినా దాన్ని వడ్డించి, తిన్నాకే ధర చెప్పడం 303 00:16:41,668 --> 00:16:42,753 ఇక్కడ ఆనవాయితా? 304 00:16:44,213 --> 00:16:48,217 భలే జోకులేస్తాడబ్బా! మనోడిని అస్సలు వదులుకోకూడదు. 305 00:16:49,218 --> 00:16:51,637 ఇప్పుడు మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ, 306 00:16:51,637 --> 00:16:53,347 లేదా మా స్పెషల్ ఐస్ క్రీమ్ కానీ తెప్పించనా? 307 00:16:53,347 --> 00:16:54,890 తాజాగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. 308 00:16:54,890 --> 00:16:57,309 - మాకు చాల్లే. - హా. 309 00:16:57,309 --> 00:16:59,228 - సరే మరి. - థ్యాంక్యూ, జీ. 310 00:16:59,228 --> 00:17:02,481 గమ్! క్రెడిట్ కార్డ్ గీకాలి. దీనికి చిప్ ఉంది. 311 00:17:02,481 --> 00:17:05,733 - వావ్, గట్టిగా విశ్వాసంతో చెప్పడం అనేది మామూలు విషయం కాదు. - అవును. 312 00:17:06,734 --> 00:17:07,611 హా. 313 00:17:10,571 --> 00:17:13,784 మనం చర్చించిన వాటిని ఓసారి పరిశీలిద్దాం. 314 00:17:13,784 --> 00:17:17,329 హా. సరే. పిల్లలు ఎంత స్ఫూర్తి పొందుతారో చూద్దాం. 315 00:17:17,329 --> 00:17:21,165 మనం సిలబసులో ఆచరణాత్మకమైన నైపుణ్యాలను ఇంకా ఎక్కువ చేర్చితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. 316 00:17:21,165 --> 00:17:22,084 అవును. 317 00:17:22,084 --> 00:17:24,419 కాబట్టి మనం కారు టైరును మార్చడం గురించి... 318 00:17:24,419 --> 00:17:26,213 - హా. - ...పన్నుల గురించి చేర్చాలని అనుకున్నాం. 319 00:17:27,881 --> 00:17:29,842 పరుపులను, దిండ్లను కవర్లలో వేయడం. 320 00:17:29,842 --> 00:17:32,302 అవును. అవన్నీ చాలా ముఖ్యమైనవి. 321 00:17:32,302 --> 00:17:34,596 సరైన పోషకాహారం. "సరైన" అనేది అండర్ లైన్ చేశాం. 322 00:17:34,596 --> 00:17:36,557 అదేంటో నాకు తెలీదు... 323 00:17:36,557 --> 00:17:39,268 మనం వీటి కన్నా ఎక్కువే మాట్లాడుకున్నామని అనిపించింది. 324 00:17:39,268 --> 00:17:43,146 ఈ చర్చ సమర్థవంతమైన చర్చ కాదేమో అనిపిస్తోంది. 325 00:17:43,146 --> 00:17:45,190 బహుశా, మార్పు అనేది మనతో మొదలవ్వాలేమో. 326 00:17:45,816 --> 00:17:47,901 అంటే, మనం సిలబసును మనకు నచ్చినట్టుగా మార్చేసుకోవచ్చు, 327 00:17:47,901 --> 00:17:54,366 కానీ టీచర్లైన మనం, మన పరిధిని, జ్ఞానాన్ని విస్తరింపజేసుకోకపోతే... 328 00:17:55,409 --> 00:17:57,452 హా, అవును. అర్థమైంది. 329 00:17:57,953 --> 00:18:02,958 పిల్లలు ఏదైన పెద్దల నుండే నేర్చుకుంటారు. 330 00:18:04,334 --> 00:18:06,879 అది పాత సామెత అనుకుంటా. సారీ. 331 00:18:06,879 --> 00:18:13,177 అదేం లేదు, మీరు భలే గమ్మత్తుగా చెప్పారు. 332 00:18:14,011 --> 00:18:15,929 - హా. అవును. - సరే. 333 00:18:15,929 --> 00:18:19,224 - నేను చెప్పిన తీరు బాగుందని అన్నారు కదా? - అవును. 334 00:18:19,224 --> 00:18:22,394 జర ఆగే, కుందనపు బొమ్మా, లేదంటే నా పుర్రె పుచ్చకయాలా పేలిపోతుంది. 335 00:18:22,394 --> 00:18:25,230 మీరు మాట్లాడేది తెలుగేనా? 336 00:18:25,230 --> 00:18:27,858 తెలుగే అట్టట్ట వచ్చు, నా ముఖానికి వేరే భాష కూడానా? 337 00:18:28,442 --> 00:18:30,861 మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారే! 338 00:18:30,861 --> 00:18:32,446 ఏదో అలా కుదిరింది, అంతే. 339 00:18:32,446 --> 00:18:34,948 డస్ట్, హేయ్. ఎలా ఉన్నావు? నీతో మాట్లాడాలి. 340 00:18:34,948 --> 00:18:36,909 మేము ఒక విషయం గురించి లోతుగా చర్చించుకుంటున్నాం, జియార్జియో. 341 00:18:36,909 --> 00:18:37,910 అంతా ఓకేనా? 342 00:18:37,910 --> 00:18:41,330 హా. ఆయిస్టర్ల విషయంలో ఒక సమస్య ఉంది. 343 00:18:41,330 --> 00:18:42,956 అవి మేమిద్దరమూ తిన్నాం కదా. 344 00:18:44,082 --> 00:18:47,336 హా. కానీ డస్టీ తిన్న ఆయిస్టర్ విషయంలోనే సమస్య. 345 00:18:47,336 --> 00:18:50,672 అతనికి అరుగుదల సమస్యలు ఉన్నాయి, కాబట్టి, సమస్య తలెత్తక ముందే 346 00:18:50,672 --> 00:18:53,050 అతనికి పొట్ట సంబంధిత వ్యాయామాలను 347 00:18:53,050 --> 00:18:55,594 కొన్ని చూపాలనుకుంటున్నాను. 348 00:19:01,975 --> 00:19:03,852 - నీ సాయానికి ఓ దండంరా బాబూ. - హా. నేనున్నాగా. 349 00:19:04,770 --> 00:19:06,730 ఇప్పుడు చెప్పు, అంత అత్యవసరమైన విషయం ఏంటో? 350 00:19:06,730 --> 00:19:09,691 డీ, ఆయిస్టర్లు బాగానే ఉన్నాయి, నీ క్రెడిట్ కార్డుతోనే సమస్య అంతా. 351 00:19:09,691 --> 00:19:11,985 ఆలిస్ ముందు నీ పరువు పోకూడదని అలా చెప్పి తీసుకొచ్చా. 352 00:19:11,985 --> 00:19:13,612 ఇప్పుడు ఎలాగూ పరువు పోయిందిగా. 353 00:19:14,696 --> 00:19:17,491 నా క్రెడిట్ కార్డుతో సమస్య ఉందంటే, నువ్వు ఈ పూట అంతా నాకు ఏవేవో పెట్టావని అర్థం. 354 00:19:17,491 --> 00:19:21,036 నీ మంచి కోసమే అలా చేశా, గురూ. నువ్వు పులస చేపల కర్రీ వద్దు అని ఉండాల్సింది. 355 00:19:21,036 --> 00:19:23,705 అన్ని ఐటెమ్స్ తో నువ్వు సంపన్నుడివని బిల్డప్ ఇవ్వాలనుకున్నా. 356 00:19:23,705 --> 00:19:26,959 సంపన్నుడని బిల్డప్ ఇవ్వాలనుకున్నప్పుడు, అరుగుదల సమస్యలని ఎందుకు చెప్పావు? 357 00:19:43,308 --> 00:19:44,518 ఒక్క నిమిషం. 358 00:19:48,814 --> 00:19:50,649 డస్టీ? అంతా ఓకేనా? 359 00:19:51,567 --> 00:19:53,694 హేయ్, కాస్. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. 360 00:19:53,694 --> 00:19:56,280 మన క్రెడిట్ కార్డ్ విషయంలో సమస్య ఉందని నీకు తెలుసేమో అని కాల్ చేశా. 361 00:19:56,280 --> 00:19:58,365 జియార్జియోస్ లో కార్డ్ ఇస్తే, లావాదేవీ విఫలమైంది. 362 00:19:59,324 --> 00:20:01,410 జియార్జియోస్? నువ్వు టీచర్స్ సమావేశానికి వెళ్లావని అనుకున్నానే? 363 00:20:01,410 --> 00:20:02,619 అవును, టీచర్స్ సమావేశానికే వచ్చా. 364 00:20:02,619 --> 00:20:05,247 ఇంకో టీచరుతో కలిసి చర్చిస్తున్నాను. 365 00:20:05,247 --> 00:20:06,331 ఏ టీచర్? 366 00:20:06,331 --> 00:20:08,292 టీచర్లు, ఒక టీచర్ కాదు. 367 00:20:08,292 --> 00:20:10,377 ఏదేమైనా, ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ లావాదేవీలను చూశా, 368 00:20:10,377 --> 00:20:13,255 క్రూజింగ్ క్రూజ్ ఇన్ లో మనం జరపని లావాదేవీ ఒకటి జరిగింది. 369 00:20:13,255 --> 00:20:15,174 డస్టీ, నేను ఇప్పుడు క్రూజ్ ఇన్ లోనే ఉన్నాను. 370 00:20:19,761 --> 00:20:20,679 అలాగా. 371 00:20:20,679 --> 00:20:22,472 నువ్వు క్లబ్బులో ఉన్నావనుకున్నా, కాస్. 372 00:20:24,933 --> 00:20:26,476 కానీ ఏదేమైనా, అది నాకు సంబంధించిన విషయం కాదు. 373 00:20:26,476 --> 00:20:30,355 క్రెడిట్ కార్డ్ సంస్థ ఒకే కార్డును రెండు వేర్వేరు చోట్ల ఉపయోగించడం చూసి 374 00:20:30,355 --> 00:20:32,566 ఇలా చేసి ఉంటుంది అనుకుంటా, ఆ చోటుల్లో ఒకటేమో 375 00:20:32,566 --> 00:20:36,153 ఎక్కువగా ప్రేమ పక్షులు ఉపయోగించే చోటు కదా. 376 00:20:36,153 --> 00:20:38,614 అయితే కంగారుపడాల్సిన పనేం లేదు కదా? 377 00:20:40,073 --> 00:20:41,408 ఈ వైపు నుండి కంగారుపడాల్సిందేమీ లేదు. 378 00:20:41,408 --> 00:20:43,118 రాత్రంతా కులాసాగా గడుపు, కాస్. 379 00:20:50,792 --> 00:20:54,796 వావ్, ఈ రాత్రి ఇక్కడ అంతా హుషారెత్తిస్తున్నారు. 380 00:20:57,257 --> 00:21:00,052 కాబట్టి, అందరం టోస్ట్ చేద్దాం. 381 00:21:01,678 --> 00:21:03,972 నా చేతిలో ఉన్న కత్తిని చూడండి. 382 00:21:03,972 --> 00:21:07,142 ఆ విషయం నా కూతురుకు చెప్పకండి. దానితో నన్ను పొడిచేసినా పొడిచేస్తుంది. 383 00:21:12,022 --> 00:21:15,108 హేయ్, ఇలా మిమ్మల్ని వేచి ఉండేలా చేసినందుకు మన్నించండి. 384 00:21:15,108 --> 00:21:17,361 - పర్వాలేదులే. - చెప్తే నమ్మరు కానీ, 385 00:21:17,361 --> 00:21:19,696 - నాకు ఒక సమస్య వచ్చి పడింది, అదేంటంటే... - మీ క్రెడిట్ కార్డుతోనే కదా. 386 00:21:20,531 --> 00:21:21,365 అవును. 387 00:21:21,365 --> 00:21:23,534 మీకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. 388 00:21:23,534 --> 00:21:24,618 అయ్యయ్యో. 389 00:21:24,618 --> 00:21:26,828 కానీ, దాని గురించి ఆలోచించకండి. మరేం పర్వాలేదు. 390 00:21:26,828 --> 00:21:28,288 వద్దు, మీరు చెల్లించవద్దు. 391 00:21:28,288 --> 00:21:31,083 లేదు, నేనేమీ చెల్లించడం లేదు. ఆ చెత్త ఆయిస్టర్లకు 392 00:21:31,083 --> 00:21:33,168 ఒక్కో ఆయిస్టరుకు తొమ్మిది డాలర్లు బిల్ వేశాడు జియార్జియో, 393 00:21:33,168 --> 00:21:35,087 కాబట్టి బిల్ కట్టకుండానే మనం చెక్కేస్తున్నాం. 394 00:21:35,087 --> 00:21:36,171 ఏంటి? 395 00:21:36,171 --> 00:21:40,050 ఓ, సంబరాలు చేసుకుందాం ఇవాళ మీ ప్రత్యేకమైన రోజు 396 00:21:40,050 --> 00:21:41,844 - ఇదే సరైన సమయం... - మీరు వచ్చినందుకు 397 00:21:41,844 --> 00:21:43,971 ఇంకా మీ కుటుంబాన్ని తెచ్చినందుకు ఆనందంగా ఉంది 398 00:21:43,971 --> 00:21:46,265 - ఈ జియార్జియోస్ - ...పదండి. 399 00:21:46,265 --> 00:21:47,933 - ఇటాలియన్ - పదండి. 400 00:21:47,933 --> 00:21:51,061 రెస్టారెంట్, స్పోర్ట్స్ సెంటరుకు స్వాగతం 401 00:21:59,945 --> 00:22:01,488 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 402 00:22:01,488 --> 00:22:03,323 కోల్టన్ వస్తువులన్నీ ఈ డస్ట్ బిన్ లో పడేశా, 403 00:22:03,323 --> 00:22:06,326 కానీ అందులో నా స్విచ్ కూడా ఉందని తర్వాతే గుర్తొచ్చింది, ఇప్పుడు అది దొరకట్లేదు. 404 00:22:06,326 --> 00:22:10,831 జేకబ్, మాట్లాడే కప్ప, టెర్రీ విషయంలో కోపంగా ఉన్నావా? 405 00:22:10,831 --> 00:22:12,249 నాకు కోపమేమీ లేదు. 406 00:22:14,418 --> 00:22:16,044 కోల్టనుతో నీకు ఉన్న బంధం వేరు అని 407 00:22:16,044 --> 00:22:18,005 - నేను అనుకున్నా, అంతే. - అంటే? 408 00:22:18,005 --> 00:22:20,465 కప్ప బొమ్మ ద్వారా అయినా కూడా అతడిని ప్రేమిస్తున్నావని 409 00:22:20,465 --> 00:22:21,633 నువ్వు చెప్పావు, ట్రీనా. 410 00:22:21,633 --> 00:22:23,760 ఆ మాట ఇద్దరం ఎప్పుడూ అనుకోలేదు కూడా, కాబట్టి... 411 00:22:25,804 --> 00:22:27,681 ఏమో మరి. అతని గురించి మర్చిపోవాలని అనుకుంటూ ఉన్నా, 412 00:22:27,681 --> 00:22:30,142 కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో నాకు దారుణంగా అనిపిస్తోంది. 413 00:22:30,142 --> 00:22:31,768 కానీ అలా ఎందుకు అనిపిస్తోంది నీకు? 414 00:22:31,768 --> 00:22:35,647 నీ కవల సోదరుడు అంటే నాకు అసహ్యమని అబద్ధం చెప్పమంటావా? 415 00:22:35,647 --> 00:22:38,066 జేకబ్, ఒకప్పుడు కోల్టన్ ని ప్రేమించానని ఇప్పుడు నిన్ను సరిగ్గా ప్రేమించట్లేదని 416 00:22:38,066 --> 00:22:39,776 నువ్వు అనుకోవట్లేదు కదా? 417 00:22:39,776 --> 00:22:44,615 నేను ఒక్కో సమయంలో ఒక్కొక్కరిని ఒక్కో కారణం చేత ప్రేమించి ఉండవచ్చు. 418 00:22:44,615 --> 00:22:48,785 అది నిజమే, కానీ ఇప్పుడు కూడా నువ్వు ఈ బొమ్మని ఉంచుకోవాలనుకుంటున్నావు. 419 00:22:48,785 --> 00:22:51,580 అవును, ఎందుకంటే, అది నాకు ముఖ్యమైనది. 420 00:22:52,623 --> 00:22:56,251 మనిద్దరికీ దూరమైన ఒక వ్యక్తిని ఒకప్పుడు నేను ప్రేమించానని, ఇది నాకు గుర్తు చేస్తుంది. 421 00:22:56,251 --> 00:22:59,671 నీకు కూడా కోల్టనుకు సంబంధించి, ఏదోక వస్తువును ఉంచుకోవాలనుంది కదా? 422 00:23:02,090 --> 00:23:04,009 నువ్వు కూడా అతడిని మిస్ అవుతున్నావని నాకు తెలుసు. 423 00:23:14,811 --> 00:23:15,812 ఏంటది? 424 00:23:17,564 --> 00:23:19,024 దీని గురించి మర్చిపోయా అసలు. 425 00:23:20,609 --> 00:23:24,738 కోల్టనుకి బయాలజీ పరీక్షలో ఒకసారి డీ-మైనస్ వచ్చింది, 426 00:23:24,738 --> 00:23:26,698 దాని మీద నాన్న సంతకం పెట్టాలి. 427 00:23:28,742 --> 00:23:31,537 పరీక్షకి చదవడంపై పెట్టిన శ్రద్ధ కన్నా, నాన్న సంతకం ఎలా పెట్టాలి అనేదానిపైనే 428 00:23:31,537 --> 00:23:34,540 అతను ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. 429 00:23:34,540 --> 00:23:37,292 హా. కోల్టన్ అంటే అంతేగా. 430 00:23:38,627 --> 00:23:39,461 హా. 431 00:23:42,506 --> 00:23:44,174 నా స్విచ్ ని వెతకాలి అబ్బా. 432 00:23:44,174 --> 00:23:45,551 ఆగు. 433 00:23:45,551 --> 00:23:49,054 నా చేతులు చిన్నవి కాబట్టి, చెత్తలో వెతకడానికి సులభంగా ఉంటుంది. 434 00:23:49,680 --> 00:23:50,764 అబ్బో, గొప్పే మరి. 435 00:23:52,975 --> 00:23:55,686 నా కాళ్లు పట్టుకుంటావా? కానివ్వు. 436 00:23:55,686 --> 00:23:58,355 నీ యెంకమ్మ... హా. సరే. బాబోయ్. 437 00:23:59,231 --> 00:24:01,191 - సరే మరి. - ఓరి దేవుడా. నా జుట్టు. 438 00:24:18,542 --> 00:24:20,711 నేనొక్కదాన్నే మత్తులో తూగేలా చేయవద్దు. 439 00:24:22,212 --> 00:24:25,591 ఇంకా మీ అమ్మని నువ్వు పొడవకుండా ఉన్నావంటే గొప్ప విషయమనే చెప్పాలి. తనని భరించడం చాలా కష్టం. 440 00:24:27,009 --> 00:24:27,926 ఎంత ధైర్యం నీకు! 441 00:24:27,926 --> 00:24:29,678 మా అమ్మ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. 442 00:24:31,722 --> 00:24:35,058 "నేను ఇజ్జీని, డీర్ఫీల్డ్ కి మేయరుని." 443 00:24:35,058 --> 00:24:37,436 అయ్య బాబోయ్, అచ్చం ఆమెలాగానే చేశావు. 444 00:24:37,436 --> 00:24:39,938 అదే నచ్చిందంటే, డస్టీ అనుకరణ ఇంకా నచ్చుతుంది నీకు. 445 00:24:42,065 --> 00:24:43,734 "నీ యమ్మా బడవా, ఇదేందయ్యా ఇదీ!" 446 00:24:43,734 --> 00:24:46,403 అది నెల్లూరు యాసనా? అస్సలు బాగా చేయలేదు. 447 00:24:47,112 --> 00:24:49,865 సరే. ఇది చూడు. ఫాదర్ రూబెన్ ని అనుకరిస్తా. 448 00:24:49,865 --> 00:24:51,200 సరే. 449 00:24:53,118 --> 00:24:54,912 "నేను ఫాదర్ రూబెన్ ని. 450 00:24:54,912 --> 00:24:59,291 రూబెన్ నా ఇంటి పేరో, అసలు పేరో ఎవరికీ తెలీదు." 451 00:25:00,375 --> 00:25:01,960 "కానీ నేను హానాని ప్రేమిస్తున్నాను." 452 00:25:03,712 --> 00:25:05,380 చాల్లే! ఓయబ్బో! 453 00:25:05,380 --> 00:25:08,133 జియార్జియో ఇంట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని గమనించేశా. 454 00:25:08,133 --> 00:25:12,429 ఒకటి చెప్తా విను. నేను డేటింగ్ చేయను. మరీ ముఖ్యంగా, ఫాదర్లతో అసలు చేయను. 455 00:25:13,430 --> 00:25:14,681 తొక్కేం కాదు! 456 00:25:14,681 --> 00:25:16,016 నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. 457 00:25:16,016 --> 00:25:18,477 ఇప్పుడు నీతో గడిపిందే 458 00:25:18,477 --> 00:25:20,479 ఎవరితో అయినా నేను ఎక్కువ సేపు గడిపింది. 459 00:25:20,479 --> 00:25:22,564 చూడు, ఎంత సరదగా గడుపుతున్నావో. 460 00:25:24,149 --> 00:25:26,652 నన్నే చూడు, నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. 461 00:25:26,652 --> 00:25:31,114 అంటే, నేను రాత్రి ఒంటరిగా గడిపి 20 ఏళ్లయింది. 462 00:25:31,114 --> 00:25:34,034 వావ్. యంత్రమే లేకపోయి ఉండుంటే మీరు ఇలా ఒంటరిగా గడిపేవారు అంటారా? 463 00:25:37,496 --> 00:25:39,706 గడిపేదాన్నే ఏమో. 464 00:25:40,582 --> 00:25:41,667 అవును. 465 00:25:41,667 --> 00:25:44,336 సూపర్. నిజంగా సూపర్. 466 00:25:45,462 --> 00:25:48,465 ఎందుకంటే, నేనే అయితే, ఆలోచించేదాన్ని ఏమో, 467 00:25:48,465 --> 00:25:50,676 "ఇవన్నీ నాకు కావాల్సినవేనా, 468 00:25:50,676 --> 00:25:53,971 లేక యంత్రం నా బుర్రలో పెట్టిన ఆలోచనలా ఇవి? 469 00:25:53,971 --> 00:25:56,348 ఒక వీడియో గేమును నాకు అర్థమైన విధంగా అర్థం చేసుకొని, 470 00:25:56,348 --> 00:25:58,851 ఇన్ని భారీ మార్పులు చేస్తున్నానే. 471 00:25:58,851 --> 00:26:01,478 సరైన దారే ఎంచుకున్నానని నాకెలా తెలుస్తుంది?" అని. 472 00:26:05,983 --> 00:26:10,028 కానీ, యంత్రాన్ని ఎప్పుడూ ఉపయోగించని నాకు, ఇవన్నీ చెప్పడం తేలికే అనుకుంటా. 473 00:26:10,529 --> 00:26:13,282 నేను చేసేది సరైన పనో, కాదో నాకు తెలీదు. 474 00:26:13,866 --> 00:26:16,535 అది రిస్క్ తో కూడుకున్నదే. చాలా రిస్క్ ఉంటుంది. కానీ... 475 00:26:16,535 --> 00:26:18,453 కానీ నేను ప్రయత్నమైతే చేస్తున్నా కదా. 476 00:26:18,453 --> 00:26:20,497 నువ్వు నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నావు కదా, అలాగే. 477 00:26:21,498 --> 00:26:23,125 ఇక్కడే ఉండి, నాతో మాట్లాడుతూ ఉండు. 478 00:26:23,125 --> 00:26:25,043 బంక్ బెడ్ కదా, పైన పడుకోవచ్చు. 479 00:26:25,043 --> 00:26:28,255 లేదులే. 480 00:26:28,964 --> 00:26:30,716 అదీగాక నేను ఇక్కడే ఉంటే, 481 00:26:30,716 --> 00:26:32,968 నీ ఒంటరి రాత్రిని నువ్వు ఆస్వాదించలేవు. 482 00:26:32,968 --> 00:26:35,053 - అబ్బా. భలే సరదాగా ఉంటుంది. - గుడ్ నైట్, కాస్. 483 00:26:35,053 --> 00:26:36,805 "గుడ్ నైట్, కాస్." 484 00:26:37,556 --> 00:26:38,682 నేను నిన్ను అలా అనుకరించా అన్నమాట. 485 00:26:38,682 --> 00:26:41,435 చాలా బాగా చేశావు. ఒక్క సెకను పాటు అది నా ప్రతిధ్వనే ఏమో అనిపించింది. 486 00:26:42,561 --> 00:26:44,229 - గుడ్ నైట్. - గుడ్ నైట్. 487 00:26:53,030 --> 00:26:55,574 విద్యారంగంలో ఉన్న సమస్యను మనం పరిష్కరించేశాం. 488 00:26:55,574 --> 00:26:57,117 - హా. అవును. - వావ్. 489 00:26:57,117 --> 00:26:58,285 ఒకవేళ నేను హైస్కూలులో ఉన్నప్పుడు, 490 00:26:58,285 --> 00:27:02,247 మనం ప్రతిపాదిస్తున్న "చికెన్ చేసేటప్పుడు పాటించవలసిన పద్ధతి" కనుక సిలబసులో ఉంటే, 491 00:27:02,247 --> 00:27:06,168 నేను ఇప్పుడు ఆ పనే చేస్తూ ఉండేదాన్ని ఏమో, ఏమంటారు? 492 00:27:06,168 --> 00:27:08,295 చిన్నప్పుడు ఏం కావాలనుకున్నారు? 493 00:27:09,463 --> 00:27:11,173 వయోలిన్ వాయిద్యకారిణి. 494 00:27:11,757 --> 00:27:13,175 - అవునా? - అవును. 495 00:27:13,175 --> 00:27:15,260 ఆ విషయంలో నేను చాలా సీరియస్ గా ఉండేదాన్ని. 496 00:27:16,053 --> 00:27:18,597 సాంప్రదాయబద్ధ శిక్షణ తీసుకున్నా, 497 00:27:19,389 --> 00:27:21,558 గొప్ప గొప్ప సంగీత కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నా. 498 00:27:21,558 --> 00:27:24,269 మా అమ్మానాన్నలు కూడా నేను అదే కావాలని కలలు కన్నారు. 499 00:27:25,187 --> 00:27:28,565 హా. కానీ అద్భుతంగా వాయించాలని ఒత్తిడి చాలా ఉండేది. 500 00:27:28,565 --> 00:27:30,567 అన్ని ఆవశ్యకతలనూ నెరవేర్చాలి కదా మరి? 501 00:27:30,567 --> 00:27:32,653 "అన్ని ఆవశ్యకతలనూ నెరవేర్చాలి కదా మరి?" 502 00:27:32,653 --> 00:27:34,154 చాలా సోది ఉంటుంది. 503 00:27:35,405 --> 00:27:36,907 అవును. నా మార్ఫో కార్డ్ కూడా అదే చెప్పింది. 504 00:27:36,907 --> 00:27:40,244 కార్డ్ మీద "వయోలిన్ వాయిద్యకారిణి" అని వచ్చింది, దానితో వయోలిన్ విషయంలో 505 00:27:40,244 --> 00:27:42,579 నేను విఫలమయ్యాను అనే నా ఫీలింగ్ మరింత బలపడింది. 506 00:27:42,579 --> 00:27:43,664 హా. 507 00:27:44,581 --> 00:27:46,875 ఆ తర్వాత, మీరు అన్నది విన్నాను, 508 00:27:47,626 --> 00:27:48,752 వ్యక్తులకు 509 00:27:49,378 --> 00:27:51,797 కార్డులు అనేక మార్గాలు చూపుతాయి అని. 510 00:27:51,797 --> 00:27:56,426 అప్పుడే నాకు అనిపించడం మొదలైంది అన్నమాట, 511 00:27:56,426 --> 00:27:58,887 నేను వయోలిన్ వాయిద్యకారిణిని కాగలిన దాన్నే, కానీ... 512 00:28:00,097 --> 00:28:02,015 నేను ఎంచుకొన్న ఈ మార్గంలో ఆనందంగా ఉండటానికి 513 00:28:02,015 --> 00:28:04,351 నేను ఒక కొత్త పద్ధతి కనుగొనవచ్చు అని. 514 00:28:06,395 --> 00:28:10,524 అదే సమయంలో నా విజనులో నేను గాల్లో తేలుతూ ఉన్నాను. 515 00:28:10,524 --> 00:28:12,192 మీరు ఫ్లోలో వెళ్లిపోతున్నారు అన్నమాట. 516 00:28:12,192 --> 00:28:15,362 అవును. మొదట్నుంచీ నాకు అలా ఉండటమే ఇష్టం, కాబట్టి... 517 00:28:19,116 --> 00:28:20,617 మీ సంగతేంటి? మీరేం... 518 00:28:21,535 --> 00:28:23,412 చిన్నప్పుడు మీరు ఏం కావాలనుకున్నారు? 519 00:28:23,412 --> 00:28:25,372 - ఏమో. - భలేవారే, చెప్పండి. 520 00:28:27,916 --> 00:28:30,002 కొంత కాలం ఖగోళ శాస్త్రంపై ఇష్టం ఉండింది. 521 00:28:31,211 --> 00:28:32,671 ఆ పుస్తకాలన్నీ కొనుకున్నా, 522 00:28:32,671 --> 00:28:36,133 నా పడక గది సీలింగులో చీకట్లో మెరిచే నక్షత్ర మండలాలు కూడా ఉండేవి. 523 00:28:37,551 --> 00:28:41,430 ఆ తర్వాత, కాలేజీలో ఉన్నప్పుడు స్కీ ట్రిప్ కోసమని ఓసారి విస్లర్ కి వెళ్లాను, 524 00:28:41,430 --> 00:28:44,308 అక్కడ ఆకాశం చాలా బాగుండేది. 525 00:28:44,308 --> 00:28:49,062 నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా, మన ముందే ఉన్నట్టు ఉండేవి. లెక్కలేనన్ని ఉండేవి అవి. 526 00:28:49,062 --> 00:28:52,232 నిజం చెప్పాలంటే, నాకు "ఇదేంటిరా బాబోయ్" అని అనిపించింది కూడా. 527 00:28:52,232 --> 00:28:55,402 నేను కూడా విస్లర్ కి వెళ్లాను. చాలా బాగుంటుంది. 528 00:28:56,486 --> 00:28:57,571 అవును. 529 00:28:59,531 --> 00:29:01,450 అక్కడే చాలా రోజులు ఉండిపోయా. 530 00:29:03,368 --> 00:29:05,162 మనం అనుకోకుండా కలిసి ఉండేవాళ్లమేమో. 531 00:29:06,246 --> 00:29:08,248 నక్షత్రాల గురించి మీరు నాకు నేర్పి ఉండేవారేమో. 532 00:29:09,541 --> 00:29:13,253 కానీ, ప్రధానం నేను టీచరుని. 533 00:29:13,253 --> 00:29:16,173 - అవును. - అంతే కదా. 534 00:29:17,591 --> 00:29:19,635 దేవుడా. అక్కడ తోక చుక్క ఉంది చూడండి. ఏదైనా కోరుకోండి. 535 00:29:19,635 --> 00:29:22,304 హా. దాన్ని విమానం అని అంటారు. 536 00:29:23,805 --> 00:29:25,349 నాకు తెలుసు. అది నాకు తెలుసు. 537 00:29:25,349 --> 00:29:28,060 నేను... ఆగండి. నేను మీకు తెలుసో లేదో పరీక్షించానంతే. 538 00:29:28,060 --> 00:29:31,313 అదన్నమాట. ఖగోళ శాస్త్రం నాకు బాగానే తెలుసు. 539 00:29:31,939 --> 00:29:33,106 "డెల్టా ఎయిర్ లైన్స్ కామెట్." 540 00:29:38,403 --> 00:29:40,239 మా ఇల్లు వచ్చేసింది. 541 00:29:40,239 --> 00:29:42,824 అనుకోకుండా నన్ను ఇంటి దాకా భలే దిగబెట్టేశారే! 542 00:29:43,784 --> 00:29:45,827 అవును. అనుకోకుండా భలే జరిగిపోయింది. 543 00:29:50,791 --> 00:29:52,000 ఇప్పుడు మీకు వీడ్కోలెలా చెప్పాలో తెలీట్లేదు. 544 00:29:53,544 --> 00:29:54,795 ఆ విషయంలో మీరు సాయపడరు కదా? 545 00:29:56,630 --> 00:29:59,925 సరే. అయితే, దీన్ని కింద పెడతాను, 546 00:29:59,925 --> 00:30:01,927 - చేతులు చాచి... - వావ్. 547 00:30:01,927 --> 00:30:03,387 ...హత్తుకొనే ప్రయత్నం చేస్తాను. 548 00:30:04,012 --> 00:30:06,598 మనం చేతులని కదిలించాలి. 549 00:30:06,598 --> 00:30:08,559 ముందుగా అవే కదులుతాయి. 550 00:30:08,559 --> 00:30:10,018 ఆ తర్వాత కౌగిలి. 551 00:30:12,354 --> 00:30:13,564 అలా కాసేపు ఉండాలి. 552 00:30:22,322 --> 00:30:23,657 ఇంకా అలాగే ఉన్నాం. 553 00:30:24,324 --> 00:30:25,325 ఇంకా అలాగే ఉన్నాం. 554 00:30:27,119 --> 00:30:29,037 ఒక అందమైన, చిన్న కౌగిలి అన్నమాట ఇది. 555 00:30:40,507 --> 00:30:42,593 డీర్ఫీల్డ్ వాసులారా, శ్రద్ధగా వినండి. 556 00:30:42,593 --> 00:30:47,723 నేను గొప్ప షెరిఫ్ బ్యూ కోవాక్ ని. రాత్రి పూట పహారా కాసే పనిలో ఉన్నాను. 557 00:30:47,723 --> 00:30:52,186 ఎవరైనా ఆకతాయిలు కనుక సంచరిస్తుంటే, నేను పహారా కాస్తున్నానని మర్చిపోకండి. 558 00:30:52,186 --> 00:30:55,063 కాబట్టి పళ్లు తోముకొని, జుట్టు దువ్వుకొని పడుకోండి, 559 00:30:55,063 --> 00:30:57,774 ఎందుకంటే, ఈ రాత్రి చట్టం వేటాడుతోంది. 560 00:31:01,028 --> 00:31:02,154 అంతే. 561 00:31:10,370 --> 00:31:11,955 మిస్టర్ జాన్సన్, ఏమైంది? 562 00:31:12,915 --> 00:31:15,584 594: ఆస్థి నష్టం జరిగిందా? 563 00:31:17,753 --> 00:31:21,507 211 కాకుంటే బాగుండు. అది దొంగతనం. 564 00:31:26,720 --> 00:31:28,472 బాగానే ఉన్నారా, మిస్టర్ జాన్సన్? 565 00:31:32,017 --> 00:31:33,977 నాకు ఒంటరిగా ఉండాలని లేదు. 566 00:31:53,038 --> 00:31:54,957 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 567 00:33:09,031 --> 00:33:11,033 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్