1 00:00:19,228 --> 00:00:23,357 మిస్టర్ టొమినె, ఈ వైన్ ని మీరు సాధ్యమైనంత ప్రామాణికంగా గుర్తించాలని ఆశిస్తున్నాం. 2 00:00:32,115 --> 00:00:33,283 వైన్. 3 00:00:35,786 --> 00:00:37,996 నా జీవితం అంతా ఇదే. 4 00:00:40,415 --> 00:00:42,543 నా పనిలో నేనే అత్యుత్తమ నిపుణుడిని. 5 00:00:44,461 --> 00:00:46,171 కనీసం నేను అలా అనుకునేవాడిని. 6 00:00:47,923 --> 00:00:49,508 అప్పుడు నేను ఆమెని కలిశాను. 7 00:00:52,135 --> 00:00:53,720 నేను అసలు ఊహించలేదు. 8 00:01:14,783 --> 00:01:15,993 ఆగు. 9 00:02:05,083 --> 00:02:06,168 తర్బూజా? 10 00:02:24,937 --> 00:02:26,146 పియర్ పండు? 11 00:02:30,776 --> 00:02:31,902 ఆకుకూర? 12 00:02:34,655 --> 00:02:35,864 నిమ్మ. 13 00:02:36,615 --> 00:02:37,491 లిచీ. 14 00:02:38,158 --> 00:02:39,159 పీచ్ పండు. 15 00:02:39,910 --> 00:02:41,328 ఆపిల్. 16 00:02:53,507 --> 00:02:54,591 నాకు తెలియదు. 17 00:02:55,425 --> 00:02:56,635 ఆలోచించు. 18 00:02:57,678 --> 00:02:59,096 - ఇంకా కొద్దిగా రుచి చూడచ్చా? - లేదు. 19 00:03:00,389 --> 00:03:01,557 ప్లీజ్. 20 00:03:05,102 --> 00:03:06,311 కుదరదు అని చెప్పాను. 21 00:03:09,565 --> 00:03:12,317 ఆలోచించు. 22 00:03:46,518 --> 00:03:47,603 కమీల్. 23 00:03:50,272 --> 00:03:51,481 దృష్టి పెట్టు. 24 00:03:58,322 --> 00:03:59,990 రుచిని దర్శించాలని ప్రయత్నించు. 25 00:04:10,125 --> 00:04:11,627 అది నీ బుర్రలోనే ఉంది. 26 00:04:15,881 --> 00:04:17,173 అది నీకు తెలుసు. 27 00:04:23,055 --> 00:04:27,851 ఆలోచించు. 28 00:04:43,450 --> 00:04:44,660 నాచు? 29 00:04:49,665 --> 00:04:50,874 నీ మాట నాకు వినిపించడం లేదు. 30 00:04:52,292 --> 00:04:56,129 ఒక చెట్టు నుండి తీసిన నాచు, అంటున్నాను. 31 00:05:06,014 --> 00:05:07,266 బాగా చేశావు, కమీల్. 32 00:05:08,976 --> 00:05:10,269 శభాష్. 33 00:05:11,854 --> 00:05:13,480 ఈ రోజుకి ఇది ముగిసింది. 34 00:05:58,442 --> 00:06:00,444 - సిగరెట్ కావాలా? - వద్దు, థాంక్యూ. 35 00:06:15,834 --> 00:06:17,336 పారిస్ 36 00:06:17,336 --> 00:06:20,172 ఇరవై ఏళ్ల తరువాత 37 00:06:29,723 --> 00:06:32,142 నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం, కమీల్. 38 00:06:32,142 --> 00:06:34,186 హ్యాపీ బర్త్ డే, బ్యూటిఫుల్. 39 00:06:34,728 --> 00:06:36,813 హేయ్! ఏంటి సంగతి? 40 00:06:48,534 --> 00:06:50,202 - గుడ్ ఈవెనింగ్. - గుడ్ ఈవెనింగ్. 41 00:06:50,202 --> 00:06:52,746 - మీకు ఏం ఇమ్మంటారు? - ఒక గ్లాసు మంచినీళ్లు ఇవ్వండి. 42 00:06:52,746 --> 00:06:55,332 - అంతేనా? - అది చాలు. 43 00:06:55,332 --> 00:06:56,667 - ఐస్ వేయాలా? - ఐస్ వేయండి. 44 00:06:56,667 --> 00:06:57,960 సరే. 45 00:07:05,342 --> 00:07:07,177 ఇదిగో తీసుకోండి. దీనితో జాగ్రత్త. 46 00:07:17,896 --> 00:07:21,608 కమీల్? కమీల్ లీజియర్? 47 00:07:21,608 --> 00:07:23,360 అవును... సారీ, కానీ... 48 00:07:23,360 --> 00:07:25,654 సహజంగానే, మీరు నన్ను గుర్తుపట్టలేరు. 49 00:07:25,654 --> 00:07:28,240 మనం ఏడు సంవత్సరాల కిందట ఒక బుక్ ఫెయిర్ లో కలుసుకున్నాం. 50 00:07:28,991 --> 00:07:30,617 నా కోసం మీ పుస్తకం మీద సంతకం చేసి ఇచ్చారు. 51 00:07:30,617 --> 00:07:32,411 - అప్పుడు నా వయస్సు పదిహేను. - పదిహేను ఏళ్లా? 52 00:07:32,411 --> 00:07:33,495 - అవును. - సరే. 53 00:07:33,495 --> 00:07:36,248 మీకు తెలుసా, నా మంచం పక్కన టేబుల్ మీద ఒకే పుస్తకం ఉంటుంది, అది మీదే. 54 00:07:36,248 --> 00:07:40,586 నేను హై స్కూల్ చదివినంత కాలం అది నాతోనే ఉండేది. 55 00:07:41,170 --> 00:07:42,462 నేను ఆ పుస్తకంతోనే పెరిగాను. 56 00:07:42,462 --> 00:07:45,382 నా పుస్తకంతో పెరిగావు. గొప్ప విషయం. 57 00:07:45,966 --> 00:07:48,427 అవును. అయితే, మీరు ఇంకో పుస్తకం రాశారా? 58 00:07:50,012 --> 00:07:54,016 లేదు.అంటే, అవును, కానీ నా ప్రచురణకర్త, ఇప్పుడు నా ప్రచురణకర్త కాదు అనుకో, 59 00:07:54,016 --> 00:07:56,226 నేను పంపించిన రచనలన్నీ తిప్పి పంపాడు. 60 00:07:56,226 --> 00:07:58,145 కానీ ఫర్వాలేదు, నేను అర్థం చేసుకున్నాను. 61 00:07:58,645 --> 00:07:59,813 నేను ఒక చట్రంలోనే ఉండిపోయాను. 62 00:07:59,813 --> 00:08:02,441 నేను ఎప్పుడూ అవే విషయాలు రాస్తున్నాను, కానీ అంత బాగా కూడా రాయడం లేదు, కాబట్టి... 63 00:08:02,441 --> 00:08:05,444 సరే. మరి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? 64 00:08:05,944 --> 00:08:08,155 అంటే, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. 65 00:08:08,155 --> 00:08:11,158 - నేను ఇంకా అన్వేషణలోనే ఉన్నాను. - సరే, నేను అర్థం చేసుకున్నాను. 66 00:08:11,158 --> 00:08:12,242 మరి నువ్వు? 67 00:08:12,242 --> 00:08:16,622 నేను మ్యుజీషియన్ ని, ఈ మధ్యనే సొంత లేబుల్ ప్రారంభించాను. 68 00:08:16,622 --> 00:08:18,290 - బాగుంది. - అవును. 69 00:08:20,959 --> 00:08:22,336 సారీ, కానీ మీరు... 70 00:08:22,920 --> 00:08:24,838 మీరు నాకు గుర్తున్నదాని కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. 71 00:08:25,464 --> 00:08:28,050 మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. 72 00:08:29,259 --> 00:08:30,677 నాకు కూడా సంతోషంగా ఉంది. 73 00:08:34,932 --> 00:08:35,933 నా పేరు జులియన్. 74 00:08:38,018 --> 00:08:39,227 హాయ్, జులియన్. 75 00:08:42,022 --> 00:08:44,024 - ఆగు, ఆగు. - ఏంటి? 76 00:08:44,566 --> 00:08:47,277 నిదానించు! నీ సమయం వృథా చేసుకోకు, సరేనా? 77 00:08:47,277 --> 00:08:50,322 మీరు ఈ సామెత తెలుసు, "ఒక సందర్భం కోల్పోతే అది ఎప్పటికీ కోల్పోయినట్లే." 78 00:08:50,989 --> 00:08:54,660 - ఆగు. ఆ మాట నేను అన్నదే కదా? - అవును. 79 00:08:54,660 --> 00:08:56,245 నువ్వు తెలివైన వాడివి, అవును కదా? 80 00:08:58,580 --> 00:08:59,748 బహుశా. 81 00:09:10,968 --> 00:09:14,012 - నా కోసం ఉండు. నేను తిరిగి వస్తాను. ప్రామిస్. - సరే, అలాగే. 82 00:09:24,898 --> 00:09:25,899 హలో? 83 00:09:28,110 --> 00:09:29,111 హలో? 84 00:09:29,111 --> 00:09:31,238 కమీల్, నేను. 85 00:09:32,990 --> 00:09:33,991 నీ నాన్నని. 86 00:09:34,491 --> 00:09:37,119 - నా మాట వినిపిస్తోందా, కమీల్? - నాకు వినబడుతోంది. 87 00:09:38,579 --> 00:09:41,957 నేను... నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. 88 00:09:43,625 --> 00:09:45,002 ఎంత త్వరగా వీలైతే అంత మంచిది. 89 00:09:45,544 --> 00:09:46,837 సారీ, 90 00:09:47,337 --> 00:09:49,882 కానీ నువ్వు నా జీవితంలోకి మళ్లీ బలవంతంగా రావడానికి చూడకు ఇంకా... 91 00:09:49,882 --> 00:09:52,926 విను, నా ఆరోగ్యం క్షీణించింది. 92 00:09:53,927 --> 00:09:59,183 నిజానికి, నా పరిస్థితి అసలు బాగాలేదు. నేను ఎక్కువ రోజులు బతకనని డాక్టర్లు చెప్పారు. 93 00:09:59,183 --> 00:10:01,268 "ఎక్కువ రోజులు బతకను" అంటే నీ ఉద్దేశం ఏంటి? 94 00:10:02,853 --> 00:10:04,354 నేను చనిపోబోతున్నాను, కమీల్. 95 00:10:06,106 --> 00:10:09,693 నువ్వు రా. టోక్యోకి రా. అన్నీ నేను చూసుకుంటాను. 96 00:10:10,235 --> 00:10:11,445 ఆగు. 97 00:10:13,864 --> 00:10:15,616 నేను బహుశా వచ్చే వారం రాగలను. 98 00:10:15,616 --> 00:10:17,826 లేదు. ఈ రాత్రికే రావాలి. 99 00:10:17,826 --> 00:10:20,537 ఏంటి? లేదు, నేను అలా ఉన్నట్టుండి రాలేను... 100 00:10:20,537 --> 00:10:23,707 నీ కోసం ఒక విమానం టికెట్ బుక్ చేశాను. నీ ఇన్ బాక్స్ లో చూడు. 101 00:10:23,707 --> 00:10:25,375 ఇలాంటివి నా దగ్గర పని చేయవు. 102 00:10:25,375 --> 00:10:27,586 నన్ను నువ్వు తరువాత తీరికగా తిట్టుకోవచ్చు. 103 00:10:28,504 --> 00:10:30,506 నువ్వు చెప్పదల్చుకున్నవన్నీ నేను వింటాను. 104 00:10:36,261 --> 00:10:37,888 నేను దాని గురించి ఆలోచించాలి. 105 00:10:37,888 --> 00:10:39,264 అయితే ఆలోచించు. 106 00:10:41,058 --> 00:10:42,142 కానీ త్వరగా ఆలోచించు. 107 00:11:10,254 --> 00:11:11,255 మీరు బాగానే ఉన్నారా? 108 00:11:12,840 --> 00:11:14,174 అవును. బాగానే ఉన్నాను. 109 00:11:16,510 --> 00:11:19,471 - అది ఏంటి? - ఒక చిన్న ఎనర్జీ డ్రింక్. 110 00:11:19,471 --> 00:11:23,267 ఇది నేను చేసే ప్రత్యేకమైన డ్రింక్: టకీలా, జిన్, వోడ్కా, ఇంకా కాస్త రమ్. 111 00:11:23,892 --> 00:11:25,477 - సరే. అబద్ధాలు ఆడకు. - లేదు. 112 00:11:26,019 --> 00:11:29,481 ఇది బాగుంది కానీ, నేను నిజానికి ఆల్కహాల్ తాగను. అది గందరగోళం అయిపోతుంది. 113 00:11:31,775 --> 00:11:33,819 నేను తాగితే ఏమైనా అనుకుంటారా? 114 00:11:36,113 --> 00:11:37,114 లేదు. 115 00:11:49,918 --> 00:11:51,211 నీకు పిచ్చి పట్టిందా ఏంటి? 116 00:11:53,630 --> 00:11:54,923 నీకు చెప్పాను కదా... 117 00:12:18,363 --> 00:12:20,407 ఎర్రగా... ఏంటి... 118 00:12:24,661 --> 00:12:26,121 - ఇప్పుడు నయంగా ఉందా? - అవును. 119 00:12:28,582 --> 00:12:29,875 ఏం జరిగింది? 120 00:12:31,835 --> 00:12:34,087 చెప్పాలంటే, నేను బాగా స్ట్రాంగ్ గా ఉన్నదేదో తాగాను. 121 00:12:34,087 --> 00:12:35,506 ఏంటి? 122 00:12:35,506 --> 00:12:38,342 కంగారు పడకు, ఒక చిన్న కుర్రాడు అది ఇచ్చాడు. 123 00:12:38,342 --> 00:12:41,720 అతను నోట్లో ఆల్కహాల్ పోసుకుని నాకు ముద్దుపెట్టి సర్ ప్రైజ్ ఇవ్వబోయాడు, కుర్రకుంక. 124 00:12:43,222 --> 00:12:46,517 అంత కుర్రాడా? నువ్వు ఏం అంటున్నావు? 125 00:12:48,477 --> 00:12:50,521 - ఇరవై రెండేళ్ల కుర్రాడు. - ఇరవై రెండేళ్ల కుర్రాడా? 126 00:12:50,521 --> 00:12:51,813 అది గొప్ప విషయం. 127 00:12:52,397 --> 00:12:56,985 ఇదివరకటి వ్యక్తి, ఇద్దరు పిల్లలు ఉన్న నలభై ఏళ్ల వాడి కన్నా ఇతను నయం కదా. 128 00:12:58,445 --> 00:13:03,116 నీ వయస్సు మగవాళ్లతో స్నేహం చేయడమే నీకు మంచిది. 129 00:13:03,116 --> 00:13:04,785 జీవితంలో పైకి ఎదగాలనుకునే మగవాళ్లు. 130 00:13:04,785 --> 00:13:06,078 అది నాకు తెలుసు, అమ్మా. 131 00:13:13,126 --> 00:13:14,336 ఆయన ఫోన్ చేశాడు. 132 00:13:15,295 --> 00:13:16,505 అలెగ్జాండర్. 133 00:13:18,382 --> 00:13:20,175 ఆయన అనారోగ్యంగా ఉన్నాడు. వీలైనంత త్వరలో నన్ను కలవమన్నాడు. 134 00:13:23,554 --> 00:13:24,763 అనారోగ్యమా? 135 00:13:25,597 --> 00:13:27,099 నువ్వు అది నిజం అని నమ్ముతున్నావా? 136 00:13:27,850 --> 00:13:29,017 నీ ఉద్దేశం ఏంటి? 137 00:13:31,770 --> 00:13:33,564 నిన్ను చూడటానికి అది అతని పన్నాగం అయి ఉండచ్చు. 138 00:13:33,564 --> 00:13:35,274 అమ్మా, దయచేసి, ఆపు. 139 00:13:50,330 --> 00:13:51,164 పారిస్ - టోక్యో 140 00:13:51,164 --> 00:13:53,458 పాంటోయిస్-కోర్మీల్స్ ఎయిర్ పోర్ట్ కి పికప్ రాత్రి 10.45 గంటలకి. 141 00:13:53,458 --> 00:13:54,918 డ్రైవర్ పేరు జీన్ అలెగ్జాండర్ లీజియర్ 142 00:14:03,177 --> 00:14:04,595 ఏంటి సమస్య? 143 00:14:09,391 --> 00:14:10,893 మనం దాని గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం, 144 00:14:12,019 --> 00:14:14,146 - కానీ నీ తండ్రి ఎలాంటి వాడో నీకు తెలుసు... - అవును, నాకు తెలుసు. 145 00:14:15,480 --> 00:14:17,941 దాని గురించి నన్ను ఆలోచించుకోనివ్వు. దీన్ని మరింత గందరగోళం చేయకు, సరేనా? 146 00:14:17,941 --> 00:14:19,568 అతను మోసగాడు, కమీల్. 147 00:14:21,361 --> 00:14:22,654 నేను స్నానానికి వెళ్తున్నాను. 148 00:14:35,918 --> 00:14:38,378 ఆయన నా కోసం విమానం టికెట్ కొన్నాడు. ఈ రాత్రికే ప్రయాణం. 149 00:14:39,838 --> 00:14:41,298 అతను కొన్ని ఏళ్ల పాటు కనిపించకుండాపోయాడు, 150 00:14:41,298 --> 00:14:43,300 కానీ ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ తో, ఆయనని కలవాలని తొందరపడుతున్నావా? 151 00:14:43,300 --> 00:14:45,552 ఆయన వల్ల నువ్వు ఎంత కలత చెందావో మర్చిపోయావా? 152 00:14:46,053 --> 00:14:48,514 నేను ఎలా మర్చిపోతాను, అమ్మా? అది గుర్తు చేయడానికి నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావుగా. 153 00:14:48,514 --> 00:14:51,433 విను, దీన్ని వ్యక్తిగతంగా తీసుకోకు కానీ నేను వెళ్లాలి. 154 00:14:51,433 --> 00:14:53,769 ఆయన నుండి కొన్ని జవాబులు రాబట్టడానికి ఇదే నాకు చివరి ఆవకాశం. 155 00:14:59,149 --> 00:15:00,150 కమీల్. 156 00:15:00,150 --> 00:15:03,487 లేదు, నేను నా ఆలోచనని మార్చుకోను ఇంకా నిజం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. 157 00:15:28,220 --> 00:15:29,429 మేడమ్ లీజియర్. 158 00:15:33,475 --> 00:15:35,310 - మీ బ్యాగ్ తీసుకోనా? - ఫర్వాలేదు, థాంక్యూ. 159 00:16:13,765 --> 00:16:16,351 దయచేసి కూర్చోండి, మేడమ్. 160 00:16:16,935 --> 00:16:18,145 మనం టేకాఫ్ కి సిద్ధంగా ఉన్నాం. 161 00:17:15,285 --> 00:17:19,080 టోక్యో 162 00:17:32,386 --> 00:17:34,388 మీరేనా మిస్టర్ ఇసెయ్ టొమినె? 163 00:17:36,682 --> 00:17:39,810 అయితే మీరు, మిస్ సయాకా, ప్రఖ్యాత కొనోయి కుటుంబం వారు కదా. 164 00:17:41,562 --> 00:17:44,231 - డ్రింక్ తీసుకుంటారా? - మీ ఆదరణకి ధన్యవాదాలు. 165 00:17:44,231 --> 00:17:45,983 కానీ, ఇదంతా వృథా ప్రయాస అనుకుంటా, 166 00:17:45,983 --> 00:17:47,484 మీరు ఎంత మర్యాదగా నవ్వినా సరే. 167 00:17:48,694 --> 00:17:51,697 మా తల్లిదండ్రులు నన్ను నస పెట్టడం ఆపుతారన్న ఒక్క కారణం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. 168 00:17:52,364 --> 00:17:55,742 నా స్నేహితులు బయట నా కోసం ఎదురుచూస్తున్నారు, కాబట్టి మనం దీన్ని ఇంతటితో ముగిద్దాం. 169 00:17:58,245 --> 00:17:59,705 మా అమ్మ మీ గురించి చెప్పింది. 170 00:18:00,247 --> 00:18:02,958 వైన్ ని రుచి చూసి వాటిని అంచనా వేస్తారని చెప్పింది. 171 00:18:03,542 --> 00:18:05,043 కేవలం అది మాత్రమే కాదు, కానీ మీకు ఇష్టమైతే. 172 00:18:05,544 --> 00:18:08,297 అందులో పెద్ద విశేషం ఏముంది? 173 00:18:08,297 --> 00:18:10,632 ఆ వైన్ పేరు ఆ సీసా మీదనే ముద్రించి ఉంటుంది. 174 00:18:10,632 --> 00:18:14,052 మీరు కేవలం కుక్కలాగా దాన్ని వాసన చూస్తారు అంతే. 175 00:18:17,389 --> 00:18:18,599 సయాకా. 176 00:18:19,349 --> 00:18:21,018 మీరు అందంగా ఉంటారనే విషయం నిజం. 177 00:18:21,935 --> 00:18:24,479 మీవన్నీ కేవలం పైపైన మెరుగులే కానీ లోపల అంతా డొల్లే. 178 00:18:25,355 --> 00:18:28,984 ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా వాళ్ల గురించి అభిప్రాయాలు చెప్పేవాళ్ల మీద నాకు ఆసక్తి ఉండదు. 179 00:18:28,984 --> 00:18:31,612 మిమ్మల్ని కలవడం సంతోషం కలిగించిందనీ, కానీ మన ఇద్దరి మధ్య అనుబంధం కుదరదని 180 00:18:31,612 --> 00:18:33,280 మీ అమ్మగారికి చెబుతాను. 181 00:18:33,989 --> 00:18:35,199 ఇక, నేను వెళ్తున్నాను. 182 00:18:45,751 --> 00:18:46,752 హలో. 183 00:18:46,752 --> 00:18:49,880 మిస్టర్ టొమినె. మీకు ఒక చెడు వార్త. 184 00:19:11,318 --> 00:19:13,028 విందుని ఆస్వాదించండి. 185 00:19:14,154 --> 00:19:15,405 విందుని ఆస్వాదించండి. 186 00:19:33,799 --> 00:19:38,804 నువ్వు సయాకాని కలుసుకున్నావని మిసెస్ కొనోయ్ చెప్పారు. 187 00:19:38,804 --> 00:19:40,097 అవును. 188 00:19:41,348 --> 00:19:43,433 నిన్ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, 189 00:19:44,601 --> 00:19:46,311 కానీ మీ మధ్య ఒక అనుబంధం ఏర్పడలేదని ఆమె చెప్పింది. 190 00:19:50,607 --> 00:19:52,025 ఈసారి కుదరలేదు. 191 00:19:59,157 --> 00:20:00,158 అన్నట్లు, 192 00:20:01,577 --> 00:20:03,412 మా వైన్ శాస్త్రం టీచరు ఈ రోజు కన్నుమూశారు. 193 00:20:03,912 --> 00:20:07,583 మీకు తెలుసు కదా, ఆ ఫ్రెంచ్ ఆయన, మిస్టర్ లీజియర్. 194 00:20:08,667 --> 00:20:09,877 ఓహ్. 195 00:20:11,336 --> 00:20:12,546 నువ్వు మాకు చెప్పి ఉండాల్సింది. 196 00:20:13,213 --> 00:20:15,257 మేము ఈ విందుని మరొక రోజు చేసేవాళ్లం. 197 00:20:17,134 --> 00:20:19,094 నీకు బాధగా ఉందా, ఇసెయ్? 198 00:20:21,096 --> 00:20:24,766 ఆయన వృద్ధుడు అయ్యాడు ఇంకా అనారోగ్యంతో ఉన్నాడు. 199 00:20:27,269 --> 00:20:29,062 కానీ ఒకటి విచిత్రంగా అనిపిస్తోంది... 200 00:20:29,062 --> 00:20:32,399 నీకు వైన్ పట్ల ఇంత ఆకర్షణ ఎందుకు ఉందో నాకు అర్థం కావడం లేదు. 201 00:20:32,399 --> 00:20:33,650 హొనోకా. 202 00:20:35,527 --> 00:20:37,196 నీ వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు, 203 00:20:37,863 --> 00:20:39,364 కానీ ఇంకా నీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావు. 204 00:20:39,865 --> 00:20:42,576 నీ అపార్ట్మెంట్ ఇంకా కారు అన్నీ మేము ఇచ్చినవే. 205 00:20:43,452 --> 00:20:44,536 నీకు మర్యాదగా గుర్తు చేస్తున్నాను, 206 00:20:45,287 --> 00:20:48,790 నా కారు నా గ్రాడ్యుయేషన్ పూర్తయినందుకు నా తాతగారు ఇచ్చారు. 207 00:20:49,291 --> 00:20:51,668 ఆ అపార్ట్మెంట్ మన కుటుంబ ఆస్తి అయినా కూడా, 208 00:20:51,668 --> 00:20:53,629 ప్రతి నెల నేను అద్దె కడుతున్నాను. 209 00:20:53,629 --> 00:20:57,674 నువ్వు తెలివైన విద్యార్థివి ఇంకా నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. 210 00:20:58,175 --> 00:21:00,886 అయినా, లాభాలు లేని ఆ వైన్ పరిశ్రమలో పని చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? 211 00:21:00,886 --> 00:21:03,722 - నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? - నువ్వు ఏమీ ఆందోళన పడనక్కరలేదు. 212 00:21:03,722 --> 00:21:05,641 నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. 213 00:21:07,059 --> 00:21:09,686 ప్రతి గురువారం మాకు వండి పెట్టాలని ఎందుకు పట్టుదలగా ఉంటావో నాకు తెలియడం లేదు 214 00:21:09,686 --> 00:21:11,480 మిసెస్ కినూ చాలా చక్కగా వండుతుంది కదా. 215 00:21:12,231 --> 00:21:13,941 ఎందుకంటే నాన్నకి నేను చేస్తే నచ్చుతుంది కాబట్టి. 216 00:21:24,826 --> 00:21:26,203 ఇందులో ఉప్పు బాగా ఎక్కువైంది. 217 00:21:28,830 --> 00:21:30,832 నేను ఇదంతా పూర్తిగా తినలేను. 218 00:21:50,811 --> 00:21:52,563 - కమీల్. - హలో. 219 00:21:52,563 --> 00:21:54,815 నా పేరు లూకా ఇంగ్లీస్, మీ నాన్న స్నేహితుడిని. 220 00:21:56,233 --> 00:21:58,443 నేను ఒక ఘోరమైన వార్త చెప్పాలి. 221 00:21:59,736 --> 00:22:02,406 మీ ఉదయం మీ నాన్నగారు చనిపోయారు, అప్పటికి మీరు ఇంకా ప్రయాణంలో ఉన్నారు. 222 00:22:03,907 --> 00:22:05,117 సారీ. 223 00:22:11,081 --> 00:22:12,291 పద. 224 00:22:47,451 --> 00:22:49,870 నిన్ను మీ నాన్న ఇంటికి తీసుకువెళతాను, 225 00:22:49,870 --> 00:22:52,331 కానీ దానికన్నా ముందు ఏమైనా తిందామా? 226 00:22:52,331 --> 00:22:55,167 నీకు ఆకలిగా వేస్తుండచ్చు. ఫర్వాలేదా? 227 00:22:57,085 --> 00:22:58,295 అలాగే. 228 00:23:51,515 --> 00:23:54,142 - అతను ఏం అన్నాడు? - కేవలం "స్వాగతం" అన్నాడు. 229 00:23:54,643 --> 00:23:58,856 లేదు, అది "ఇరషాయ్ మసే," కానీ ఆ తరువాత ఏం అన్నాడో తెలియలేదు. 230 00:23:58,856 --> 00:24:00,649 నువ్వు ఇక్కడ పెరిగావన్న విషయం మర్చిపోయాను. 231 00:24:01,191 --> 00:24:04,486 - నువ్వు ఇదివరకు జపనీస్ మాట్లాడేదానివి. - నేను మాట్లాడటం కన్నా ఎక్కువ అర్థం చేసుకోగలను. 232 00:24:05,779 --> 00:24:07,489 షిహైనిన్ అంటే "యజమాని" అని అర్థం. 233 00:24:07,489 --> 00:24:10,033 "మీరు వచ్చారు, బాస్" అని అతను నాతో అన్నాడు. 234 00:24:11,034 --> 00:24:12,953 అవును, ఇది నా రెస్టారెంట్. 235 00:24:12,953 --> 00:24:14,872 నా రెస్టారెంట్లలో ఒకటి. 236 00:24:16,331 --> 00:24:17,457 రెస్టారెంట్లా? 237 00:24:18,458 --> 00:24:19,877 ఒక కొత్త కారు కొనే స్తోమత మీకు ఉంది. 238 00:24:20,460 --> 00:24:24,590 ఇది సెంటిమెంట్ కోసం వాడుతున్నాను. నేను నా వ్యాపారం ప్రారంభించినప్పుడు దాని మీద డెలివరీలు ఇచ్చేవాడిని. 239 00:24:25,174 --> 00:24:27,467 అయితే నేను ఎవరో నీకు కనీసం తెలియదా? 240 00:24:27,467 --> 00:24:29,469 మీ నాన్న నా గురించి ఏమీ చెప్పలేదా? 241 00:24:29,469 --> 00:24:32,514 నేను ఆయనతో చివరిసారిగా మాట్లాడి పదకొండు ఏళ్లు అయింది. 242 00:24:33,348 --> 00:24:38,854 నా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆయన ఫోన్ చేసి, "బాగా చేశావు" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 243 00:24:38,854 --> 00:24:40,147 ఎవ్వరూ సంపూర్ణంగా ఉండరు. 244 00:24:41,148 --> 00:24:43,150 సరే, నువ్వు ఆయన గురించి మాట్లాడాలి అనుకుంటున్నావా? 245 00:24:43,150 --> 00:24:44,318 లేదు. 246 00:24:44,860 --> 00:24:47,196 మియబీ, ఈమె పేరు కమీల్. అలెగ్జాండర్ కుమార్తె. 247 00:24:47,821 --> 00:24:49,990 చాలా సారీ. ఆయనని నేను చాలా అభిమానించేదానిని. 248 00:24:49,990 --> 00:24:51,283 థాంక్యూ. 249 00:24:51,283 --> 00:24:54,828 మియబీ మా ప్రధాన వెయిట్రెస్. ఆమె అద్భుతమైన ప్రతిభావంతురాలు. 250 00:24:55,329 --> 00:24:56,830 ఆమె లాస్ ఏంజెలెస్ నుంచి ఇంత దూరం వచ్చింది. 251 00:24:56,830 --> 00:24:58,665 కానీ మా వాళ్లు అదేమీ పట్టించుకోరు. 252 00:25:00,083 --> 00:25:03,712 మియబీ తీసుకువస్తున్న వైన్ చాలా ప్రత్యేకమైనది. 253 00:25:04,213 --> 00:25:08,091 మీ నాన్న దానిని స్పెయిల్ లో వెలికి తీశాడు. ఇంకెవ్వరూ దాని గురించి కనీసం వినలేదు. 254 00:25:08,091 --> 00:25:10,511 అక్కడ ఒక వ్యక్తి ఆధీనంలో మూడు ఎకరాల భూమి ఉంది. 255 00:25:10,511 --> 00:25:14,056 అతనికి తన ఉత్పత్తిని అమ్మడం నిజంగా ఇష్టం లేదు, కానీ అతను తయారు చేసే వైన్, 256 00:25:14,556 --> 00:25:15,974 ప్రపంచంలోనే సాటిలేనిది. 257 00:25:17,643 --> 00:25:19,561 అలెగ్జాండర్ నాకు అన్నీ నేర్పించాడు. 258 00:25:19,561 --> 00:25:21,063 అతను ఒక మేధావి. 259 00:25:21,688 --> 00:25:23,524 అతనికి నేను పూర్తిగా రుణపడి ఉన్నాను. 260 00:25:28,820 --> 00:25:29,863 సారీ, 261 00:25:30,822 --> 00:25:32,991 నేను ప్రేమించే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, కానీ నువ్వు... 262 00:25:34,868 --> 00:25:36,995 ఎవ్వరూ అందరితోనూ చెడ్డగా ఉండలేరు. 263 00:25:42,000 --> 00:25:45,128 అలెగ్జాండర్ గురించి వినడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. 264 00:25:45,629 --> 00:25:48,465 కానీ మనం నీ వారసత్వం గురించి మాట్లాడుకోవాలి. 265 00:25:48,465 --> 00:25:50,926 నీ ముందు ఏం ఉందో నీకు తెలుసని అనుకోను. 266 00:25:53,470 --> 00:25:56,557 ఫర్వాలేదు. ఆయన నుండి ఏమీ ఆశించకపోవడానికి నేను అలవాటుపడిపోయి ఉన్నాను, 267 00:25:56,557 --> 00:25:58,851 పైగా అది ఇప్పుడు మారే అవకాశం కూడా లేదు. 268 00:25:59,434 --> 00:26:00,769 నిజమే. 269 00:26:01,728 --> 00:26:04,064 ఆయన వీలునామాని చదివే కార్యక్రమం రేపు ఉదయం ఉంటుంది. 270 00:26:04,648 --> 00:26:06,316 అతను సమయాన్ని వృథా చేయడానికి ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదు. 271 00:26:06,942 --> 00:26:09,903 ప్రతి పని అప్పటికప్పుడే జరిగిపోవాలని ఎప్పుడూ అనుకునేవాడు. 272 00:26:09,903 --> 00:26:14,783 అలాగే అంత్యక్రియలు, ఖననం, రేపు మధ్యాహ్నం జరుగుతాయి. 273 00:26:20,706 --> 00:26:24,001 సరే. మన రుచి గ్రంథుల్ని కాస్త రిలాక్స్ చేద్దాం, సరేనా? 274 00:26:26,378 --> 00:26:28,088 ఇది రుచి చూడు. నీకు ఎలా అనిపించిందో చెప్పు. 275 00:26:29,173 --> 00:26:31,675 వద్దు, థాంక్స్. నేను తాగను. 276 00:26:32,676 --> 00:26:33,886 జెట్ ల్యాగ్ వల్లనా? 277 00:26:34,761 --> 00:26:35,804 లేదు. 278 00:26:36,305 --> 00:26:38,223 నేను అసలు మద్యం తాగను. 279 00:26:39,850 --> 00:26:40,851 అసలు తాగవా? 280 00:26:43,562 --> 00:26:46,273 నేను మద్యం తాగను. ఎప్పుడూ తాగలేదు. 281 00:26:47,441 --> 00:26:50,110 అబద్ధాలు చెప్పకు. కనీసం చుక్క కూడా? 282 00:27:21,308 --> 00:27:23,852 కమీల్, సారీ కానీ నేను నీతోపాటు ఉండలేను. 283 00:27:23,852 --> 00:27:27,898 నీ కోసం మరొక వ్యక్తి ఎదురుచూస్తూ ఉంటాడు. అతని పేరు యుసుకె. 284 00:27:28,524 --> 00:27:30,901 - థాంక్యూ, లూకా. - రేపు కలుద్దాం. 285 00:27:30,901 --> 00:27:32,027 అలాగే. 286 00:28:04,601 --> 00:28:06,395 మిమ్మల్ని కలవడం సంతోషం. 287 00:29:12,836 --> 00:29:15,714 లీజియర్ వైన్ గైడ్ 2009 288 00:30:11,812 --> 00:30:14,022 మీ గది సిద్ధమయింది. 289 00:30:42,509 --> 00:30:45,429 - హలో? - నువ్వు క్షేమంగా చేరావా? 290 00:30:45,429 --> 00:30:46,513 అవును. 291 00:30:46,513 --> 00:30:49,099 నువ్వు ఫోన్ చేయచ్చు కదా. విమాన ప్రయాణం ఎలా సాగింది? 292 00:30:50,350 --> 00:30:51,685 నేను ఒక ప్రైవేట్ జెట్ లో వచ్చాను. 293 00:30:55,147 --> 00:30:56,356 నువ్వు నిజంగానే వెళ్లి ఉంటావు. 294 00:30:57,191 --> 00:30:59,610 అతను నిన్న కొనలేడు కానీ ఏదో విధంగా ప్రయత్నిస్తుంటాడు. 295 00:30:59,610 --> 00:31:00,903 అది విషాదం. 296 00:31:02,070 --> 00:31:03,197 అమ్మా, ఆయన చనిపోయాడు. 297 00:31:09,912 --> 00:31:11,955 నేను ఆయనని చూడలేకపోయాను. సమయానికి ఇక్కడికి చేరుకోలేకపోయాను. 298 00:31:13,999 --> 00:31:15,459 సారీ, బంగారం. 299 00:31:16,460 --> 00:31:17,503 నిజంగా. 300 00:31:19,171 --> 00:31:22,007 నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్లవద్దని నీకు చెప్పాను, కానీ నేను పట్టుబట్టి ఉండాల్సింది. 301 00:31:23,050 --> 00:31:25,093 నువ్వు ఎంత సున్నిత మనస్కురాలివో అతను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. 302 00:31:25,093 --> 00:31:27,387 అతను ఎన్నో హామీలు ఇచ్చాడు కానీ ఇప్పుడు ఫలితం ఎలా ఉందో చూడు. 303 00:31:28,514 --> 00:31:30,641 అతను చనిపోయాక కూడా నిన్ను బాధపెడుతున్నాడు. 304 00:31:30,641 --> 00:31:33,685 నన్ను హింసించడం ఇంక ఆపు! నువ్వు ప్రతిసారీ నా విషయం ఇదే చేస్తున్నావు. 305 00:31:33,685 --> 00:31:37,147 బంగారం, అది ఎందుకంటే నీకు ఏది మంచిదో నాకు తెలుసు. నీకు ఏది మేలు చేస్తుందో నాకు తెలుసు. 306 00:31:37,147 --> 00:31:39,733 లేదు, నాకు ఏది మేలు చేస్తుందో నీకు తెలియదు. 307 00:31:39,733 --> 00:31:41,443 కాబట్టి ఈసారి ఇదంతా నన్ను చూసుకోనివ్వు. 308 00:31:42,361 --> 00:31:43,570 నన్ను కూడా రమ్మంటావా? 309 00:31:43,570 --> 00:31:46,448 వద్దు, నువ్వు రావడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్లాలి. లవ్ యూ. 310 00:31:46,448 --> 00:31:47,783 సరే, నీకు వీలైనప్పుడు ఫోన్ చేయి. 311 00:31:47,783 --> 00:31:49,535 సరే, గుడ్ బై. 312 00:31:58,210 --> 00:32:00,337 ఆ వీలునామా గురించి నీకు ఏమైనా తెలుసా? 313 00:32:01,672 --> 00:32:02,881 ఎక్కువగా తెలియదు. 314 00:32:04,216 --> 00:32:07,511 నాకు కొద్దిగానే తెలుసు, కానీ దాని గురించి కూడా మాట్లాడే అనుమతి నాకు లేదు. 315 00:32:08,804 --> 00:32:11,598 లీజియర్, దయచేసి, ఈ వైపు రండి. 316 00:32:13,934 --> 00:32:15,435 మీరు రావడం లేదా? 317 00:32:15,435 --> 00:32:16,562 లేదు. 318 00:32:21,066 --> 00:32:22,276 గుడ్ లక్. 319 00:32:34,746 --> 00:32:35,831 దయచేసి వెళ్లండి. 320 00:32:38,792 --> 00:32:39,918 గుడ్ మార్నింగ్. 321 00:32:40,919 --> 00:32:44,006 నా పేరు ఫ్రాంకోయిస్ టలియన్, మీ నాన్న లాయర్ ని. ఆయన వీలునామాకి అధికారిని. 322 00:32:45,174 --> 00:32:47,384 - హలో. - ఇతని పేరు ఇసెయ్ టొమినె. 323 00:32:47,384 --> 00:32:48,677 దయచేసి, కూర్చోండి. 324 00:32:49,428 --> 00:32:51,013 మిస్టర్ టొమినె ఫ్రెంచ్ మాట్లాడలేరు, 325 00:32:51,013 --> 00:32:53,473 కాబట్టి మీరు ఏమీ అనుకోకపోతే, మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుందామా? 326 00:32:55,475 --> 00:32:58,770 నేను మీ తండ్రిగారిని, మిస్టర్ లీజియర్, మీ ప్రొఫెసర్, 327 00:32:58,770 --> 00:33:02,024 ఎంబసీలో జరిగిన ఒక విందు పార్టీలో కొద్ది నెలల కిందట కలుసుకున్నాను. 328 00:33:02,024 --> 00:33:04,443 తన వీలునామా రాయడానికి ఆయన నా సహాయం అడిగారు, 329 00:33:04,443 --> 00:33:08,071 అది, నేను ఒప్పుకోవాలి, కొద్దిగా అసాధారణంగా అనిపించింది. 330 00:33:08,739 --> 00:33:13,493 మీ నాన్నగారి, మిస్టర్ లీజియర్ వారసత్వంగా ఇచ్చిన సంపద, రెండు భాగాలుగా విడగొట్టారు. 331 00:33:13,493 --> 00:33:17,289 మొదటి భాగం, టోక్యో, షెయిజో నాలుగో వీధిలో ఉన్న ఆయన ఇల్లు... 332 00:33:17,956 --> 00:33:19,416 అది మీ ఇద్దరికీ తెలుసు, అనుకుంటాను, 333 00:33:19,917 --> 00:33:22,753 దాని విలువ సుమారు యాభై ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. 334 00:33:23,253 --> 00:33:25,881 ఇంచుమించు డెబ్బయి లక్షల డాలర్లు. 335 00:33:26,465 --> 00:33:28,842 వాటిని యూరోలలో మార్చి చెప్పమంటారా? 336 00:33:30,135 --> 00:33:34,723 రెండవ భాగంలో, ఆర్థికపరంగా మాట్లాడాల్సి వస్తే, ఇదే ఆయన వారసత్వంలో ప్రధాన అంశం. 337 00:33:34,723 --> 00:33:39,394 నేను వైన్ సెల్లార్ గురించి మాట్లాడుతున్నాను. 338 00:33:39,394 --> 00:33:44,233 అందులో ఎనభై ఏడు వేల బాటిల్స్ ఉన్నాయి, అంతర్జాతీయంగా వాటి విలువ ఎంత అంటే... 339 00:33:44,233 --> 00:33:47,903 సారీ, మనం ఈ ప్రపంచంలోనే 340 00:33:47,903 --> 00:33:50,822 అతి పెద్ద ప్రైవేట్ వైన్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నామని మీకు చెప్పాలి. 341 00:33:51,448 --> 00:33:54,785 బాటిల్స్ సంఖ్య ప్రకారం నేను చెప్పడం లేదు, నిజం. 342 00:33:54,785 --> 00:33:58,455 కానీ ఆ వైన్ నాణ్యత, అరుదుగా లభించే అటువంటి వైన్. ఆ ప్రకారం అది అత్యంత అరుదైన వైన్ సేకరణ. 343 00:33:58,455 --> 00:33:59,748 పూర్తిగా అసాధారణమైన కలెక్షన్. 344 00:34:01,291 --> 00:34:03,377 నేను ఎక్కడ... ఎక్కడ ఉన్నాను... అవును. వాటి అంతర్జాతీయ విలువ. 345 00:34:03,377 --> 00:34:08,465 దాని విలువ 14 కోట్ల ఎనభై లక్షల డాలర్లు, అంటే 1600 కోట్ల యెన్లు. 346 00:34:09,299 --> 00:34:13,011 ఇప్పుడు మిస్టర్ లీజియర్ వీలునామాకి సంబంధించిన అసలు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. 347 00:34:13,512 --> 00:34:15,304 లీజియర్ సొంత మాటల్లో చెప్పాలంటే, 348 00:34:15,304 --> 00:34:19,685 అతని వైన్ కలెక్షన్ మొత్తం తన "జీవితకాలపు కష్టానికి ప్రతిఫలం." 349 00:34:19,685 --> 00:34:22,771 అతని ఆస్తి అంతా దాని పూర్తి విలువ తెలిసిన వారికి దక్కడం అనేది 350 00:34:22,771 --> 00:34:26,190 ఆయనకు చాలా కీలకమైన విషయం. 351 00:34:26,190 --> 00:34:28,610 అందుకే మేము ఒక ఏర్పాటు చేశాం... 352 00:34:29,444 --> 00:34:34,283 ఆ ఆస్తి ఎవరికి దక్కాలో నిర్ణయించడానికి, దానికి పరీక్ష అని పేరు పెడదాం. 353 00:34:35,158 --> 00:34:36,243 పరీక్షా? 354 00:34:36,243 --> 00:34:37,411 ఏం పరీక్ష? 355 00:34:37,411 --> 00:34:39,161 మీరు అలెగ్జాండర్ లీజియర్ కుమార్తె. 356 00:34:39,996 --> 00:34:43,625 మరొక పక్క, మిస్టర్ టొమినె, మీ నాన్నగారి శిష్యులలో ఒకరు, 357 00:34:43,625 --> 00:34:46,378 ఇంకా మిస్టర్ లీజియర్ ఇతనిని తన "మానసపుత్రుడు" అని పరిగణించేవారు. 358 00:34:46,378 --> 00:34:49,630 అందుకే మీ ఇద్దరూ తన ఆస్తి కోసం పోటీ పడాలని ఆయన కోరుకున్నాడు. 359 00:34:50,799 --> 00:34:55,679 మూడు దశలుగా జరిగే ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారో వారే ఆ మొత్తం ఎస్టేట్ ని పొందుతారు. 360 00:34:56,388 --> 00:34:58,682 ఆ ఇల్లు ఇంకా వైన్ కలెక్షన్. 361 00:34:59,641 --> 00:35:02,519 సారీ. ఆ రౌండ్స్ ఏంటి? 362 00:35:10,027 --> 00:35:11,570 అతడిని లోపలికి పంపండి. 363 00:36:24,643 --> 00:36:29,398 మంచిది. ఇప్పుడు మీరు... మీరు ఇద్దరూ ఈ వైన్ ని కళ్లు మూసుకుని రుచి చూడాలి. 364 00:36:29,398 --> 00:36:32,693 అది ఏ వైన్ అనేది సరిగ్గా నెల రోజుల లోపు నాకు చెప్పాలి. 365 00:36:32,693 --> 00:36:35,988 అది ఏ ద్రాక్ష, ఏ ఎస్టేట్ ది, ఎంత పాతది. 366 00:36:36,697 --> 00:36:38,699 మీకు నేను వివరించాల్సిన అవసరం లేదు. 367 00:36:41,076 --> 00:36:42,452 మీరు జోక్ చేస్తున్నారు. 368 00:36:43,036 --> 00:36:44,997 నేను అప్పుడప్పుడు జోకులు వేస్తాను, కానీ ఇప్పుడు కాదు. 369 00:36:44,997 --> 00:36:46,081 ఈ రోజు మాత్రం వేయను, లేదు. 370 00:36:46,081 --> 00:36:50,002 శుభ వార్త ఏమిటంటే, ఒక నెల రోజులలోగా మీరు దానిని మళ్లీ రుచి చూస్తారు. 371 00:36:52,796 --> 00:36:54,006 మనం ఇంక ముందుగు సాగుదామా? 372 00:37:22,451 --> 00:37:23,452 మిస్ లీజియర్? 373 00:37:24,494 --> 00:37:25,787 దయచేసి తీసుకోండి. 374 00:37:27,664 --> 00:37:30,125 ఇది చెత్త పని. నేను ఈ పని చేసే అవకాశమే లేదు. 375 00:37:31,001 --> 00:37:34,213 మీరు ఈ వారసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారని నేను అర్థం చేసుకోవచ్చా? 376 00:37:34,213 --> 00:37:36,131 ఏంటి? నేను ఆ మాట అనలేదే. 377 00:37:38,884 --> 00:37:40,469 అలా చేయడానికి మీకు అనుమతి ఉందా? నిజంగా? 378 00:37:40,469 --> 00:37:42,137 ఫ్రెంచ్ చట్టాలు ఇక్కడ అమలు కావు. 379 00:37:42,721 --> 00:37:45,098 కాబట్టి మీరు వైన్ రుచి చూడాలి. ఇప్పుడే. 380 00:37:56,443 --> 00:37:58,028 ఇది నిజంగా పిచ్చి పరీక్ష. 381 00:38:13,919 --> 00:38:15,170 అంతా సవ్యంగానే ఉందా, మిస్ లీజియర్? 382 00:38:22,135 --> 00:38:23,428 మిస్ లీజియర్? 383 00:38:32,229 --> 00:38:35,899 - ఏదైనా సమస్య ఉందా? - నేను రుచి చూస్తాను. రుచి చూస్తాను. 384 00:39:21,820 --> 00:39:24,072 కమీల్. ఓహ్, దేవుడా. నువ్వు బాగానే ఉన్నావా? 385 00:39:24,573 --> 00:39:26,992 మీకు తెలుసు. మీకు నిజంగా తెలుసు! 386 00:39:28,285 --> 00:39:29,703 నాతో ప్రమాణం చేయించుకున్నాడు! 387 00:39:30,537 --> 00:39:31,830 కమీల్, ఆగు. 388 00:39:32,998 --> 00:39:34,166 కమీల్, దయచేసి విను. 389 00:39:34,750 --> 00:39:35,876 నిదానించు. 390 00:39:36,418 --> 00:39:37,628 సారీ. 391 00:39:38,587 --> 00:39:40,339 ఆ మనిషి ఒక శాడిస్టు అని మా అమ్మ నన్ను హెచ్చరించింది. 392 00:39:40,339 --> 00:39:42,591 ఆయన నిజంగా నన్ను ఇలా అవమానించాలా? 393 00:39:43,091 --> 00:39:46,678 ఆయన కానీ లేదా ఆయన చెత్త డబ్బు కానీ, లేదా ఆయన చెత్త వైన్ కానీ నాకు అవసరం లేదు! 394 00:39:46,678 --> 00:39:50,474 అదంతా ఆ మానసపుత్రుడినే ఉంచుకోమనండి, నేను కొద్దిగా కూడా బాధపడను. 395 00:39:55,479 --> 00:39:58,982 మిస్ లీజియర్, మీ నాన్నగారి మరణం గురించి మీరు మాకు ఏ సమాచారం చెప్పగలరు? 396 00:39:58,982 --> 00:40:00,442 ఈ వైపు. 397 00:40:01,235 --> 00:40:04,905 మిస్ లీజియర్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పగలరా? 398 00:40:21,713 --> 00:40:24,675 మిస్టర్ టొమినె! మిస్టర్ ఇసెయ్ టొమినె! 399 00:40:29,513 --> 00:40:31,932 మిస్టర్ లీజియర్ వీలునామాలో అంశాల గురించి మాకు చెప్పగలరా 400 00:40:31,932 --> 00:40:33,433 ఇంకా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పగలరా? 401 00:40:33,433 --> 00:40:36,144 నేను దాన్ని బహిరంగంగా త్వరలోనే ప్రకటిస్తాను. 402 00:40:36,144 --> 00:40:38,188 దయచేసి, కేవలం ఒక్క మాటలో చెప్పండి. 403 00:40:43,193 --> 00:40:46,864 నువ్వు తాగవనే విషయం అలెగ్జాండర్ కి తెలియదు, తెలుసా. 404 00:40:46,864 --> 00:40:49,241 ఆయనకి నా గురించి ఏమీ తెలియదు. 405 00:40:51,034 --> 00:40:55,247 కాబట్టి, నేను అంత్యక్రియలకి వెళ్లి, తరువాత నేరుగా ఫ్రాన్స్ తిరిగి వెళ్లిపోతాను. 406 00:40:56,665 --> 00:40:58,792 నీ కోసం ఆయన సందేశం ఒకటి నా దగ్గర ఉంది. 407 00:40:59,376 --> 00:41:02,171 - నాకు ఆసక్తి లేదు. - అది చాలా ముఖ్యం, కమీల్. 408 00:41:02,171 --> 00:41:04,840 లేదు, లూకా, అది ముఖ్యం కాదు. నిజంగా. 409 00:41:05,424 --> 00:41:08,385 ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు, కానీ నువ్వు శాంతించాక, 410 00:41:08,385 --> 00:41:12,055 దయచేసి మీ నాన్న ఇచ్చిన మెసేజ్ ని విను. సరేనా? 411 00:41:13,974 --> 00:41:16,393 ఈ రక్తం ఆగడం కోసం ఏదైనా తీసుకోవడానికి ఎక్కడయినా ఆగుదామా? 412 00:41:16,393 --> 00:41:18,478 ఇలా చూడు, మనం ఇప్పటికే ఆలస్యం చేశాం. 413 00:41:24,401 --> 00:41:25,485 సరే. 414 00:41:25,485 --> 00:41:26,612 థాంక్యూ. 415 00:41:36,496 --> 00:41:39,458 నీకు తెలుసా, కమీల్, మీ నాన్న తన చివరి రోజుల్లో 416 00:41:39,458 --> 00:41:40,751 బాగా ఆధ్యాత్మికత వైపు మళ్లిపోయాడు. 417 00:41:41,502 --> 00:41:44,963 మేము ఆయన అంత్యక్రియల్ని బౌద్ధుల ఆచారం ప్రకారం చేయాలన్నది ఆయన విజ్ఞప్తి. 418 00:42:13,200 --> 00:42:15,285 మొదటి వరుస కుటుంబ సభ్యుల కోసం. 419 00:43:11,300 --> 00:43:13,051 గుడ్ బై, మిత్రమా. 420 00:44:38,887 --> 00:44:40,097 వెళదాం పద. 421 00:44:41,890 --> 00:44:43,141 ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? 422 00:44:43,725 --> 00:44:45,602 ఆ అస్తికల్ని చెరువులో లేదా మరెక్కడయినా కలపాలా? 423 00:44:45,602 --> 00:44:47,771 ఇప్పుడు ఒకుసు-ఆగే కి వేళయింది. 424 00:44:48,355 --> 00:44:50,023 - ఏంటి? - అస్తికల్ని సేకరించడం. 425 00:44:50,524 --> 00:44:52,192 - నీకు అది తెలియదా? - తెలియదు. 426 00:44:53,193 --> 00:44:55,654 మీ నాన్నకి చాలా సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. 427 00:44:55,654 --> 00:44:57,030 అయితే నేను ఇంటికి వెళ్లిపోవచ్చన్న మాట. 428 00:44:57,030 --> 00:44:58,282 లేదు. 429 00:44:58,282 --> 00:44:59,575 చెత్త. 430 00:45:01,326 --> 00:45:04,079 నువ్వు పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి పై వరకూ అస్తికలు తీసుకోవాలి, 431 00:45:04,079 --> 00:45:07,249 తద్వారా చనిపోయిన మనిషి ఆ అస్తికల పాత్రలో తల మీద నిలబడకుండా ఉంటాడు. 432 00:45:07,749 --> 00:45:08,917 నేను ఏం అంటున్నానో తెలుస్తోందా? 433 00:45:09,459 --> 00:45:11,879 ఆ కారణంగానే సుషీని టేబుల్ మీద 434 00:45:11,879 --> 00:45:13,672 ఒక చాప్ స్టిక్స్ నుంచి మరొక చాప్ స్టిక్స్ కి అందించరు. 435 00:45:14,173 --> 00:45:16,091 అది ఒక శవాన్ని తిన్నట్లే పరిగణిస్తారు. 436 00:45:16,091 --> 00:45:17,509 మీరు చెప్పేది నిజమేనా? 437 00:45:17,509 --> 00:45:19,636 - నేను ఇదంతా నిజంగానే చేయాలా? - అవును. 438 00:45:19,636 --> 00:45:22,181 పైగా నువ్వు కుటుంబ సభ్యురాలివి, నువ్వు ముందుగా వెళ్లాలి. 439 00:45:31,231 --> 00:45:33,150 ఆ అస్తికలు కింద పడకుండా చూడు. 440 00:47:50,996 --> 00:47:53,081 నువ్వు రేపు ఉదయం తిరిగి ప్రయాణం అవుతున్నావు. 441 00:47:54,958 --> 00:47:56,168 నిన్ను నేను ఎయిర్ పోర్టులో దిగబెడతాను. 442 00:47:58,712 --> 00:48:01,256 వెళ్లే ముందు, నువ్వు చూడవలసింది ఒకటి ఉంది. 443 00:48:32,788 --> 00:48:34,081 నువ్వు బాగానే ఉన్నావా? 444 00:48:37,793 --> 00:48:39,753 ఈ వాసన, చాలా స్ట్రాంగ్ గా ఉంది. 445 00:48:41,213 --> 00:48:42,381 నేను బాగానే ఉన్నాను. 446 00:49:20,836 --> 00:49:23,338 మనం అతని ఆలయంలో ఉన్నాం. 447 00:49:41,023 --> 00:49:43,567 మీ నాన్నతో కలిసి నేను ఇక్కడ ఎన్నో రాత్రుళ్లు గడిపాను. 448 00:49:46,361 --> 00:49:49,948 అతను ఈ వైన్ ల గురించి వివరిస్తూ ఈ చిన్న చిన్న నోట్స్ రాసేవాడు 449 00:49:50,449 --> 00:49:52,117 లేదా ముఖ్యమైన తేదీలని రాసుకునే వాడు. 450 00:49:53,785 --> 00:49:56,246 కొన్నిసార్లు ఆయనకు అవే ముఖ్యమైన పనులుగా తోచేవి. 451 00:49:56,830 --> 00:49:58,415 లెడ్ జెపెలిన్ లైవ్ 79 452 00:49:58,999 --> 00:50:02,628 ఆయన ప్రతి వైన్ గురించి నాతో గంటల తరబడి చర్చించేవాడు. 453 00:50:03,504 --> 00:50:05,380 అప్పుడు, కొద్దిసేపు అయ్యాక నేను చెప్పేవాడిని, 454 00:50:06,757 --> 00:50:09,968 "సరే, మిత్రమా, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దాం?" అని. 455 00:50:28,237 --> 00:50:29,446 నేను నిన్ను ఒంటరిగా విడిచిపెడతాను. 456 00:50:31,031 --> 00:50:32,241 నీకు కావలసిన టైమ్ తీసుకో. 457 00:50:57,099 --> 00:51:01,854 మింట్ లో చికెన్ 458 00:51:07,192 --> 00:51:11,947 "ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ" 459 00:51:23,417 --> 00:51:25,919 కమీల్ వయస్సు పద్దెనిమిది నిండాక తనతో కలిసి తాగడం కోసం 460 00:52:35,489 --> 00:52:37,157 అమ్మ 461 00:52:56,093 --> 00:52:58,887 సరే. నేను ఆ సందేశం చూస్తాను. 462 00:53:04,142 --> 00:53:05,811 హలో, కమీల్. 463 00:53:12,234 --> 00:53:14,486 నా వీలునామా చదివావు అని ఆశిస్తాను, 464 00:53:14,486 --> 00:53:16,864 ఇంకా నువ్వు ఖచ్చితంగా నా మీద కోపంగా ఉంటావని నేను ఊహించగలను. 465 00:53:18,448 --> 00:53:24,037 నేను తిక్క మనిషిని అని, శాడిస్టుని అని, దుర్మార్గుడిని అని నువ్వు అనుకోవచ్చు... 466 00:53:24,872 --> 00:53:26,248 ఆ జాబితా అలా పెరుగుతునే ఉంటుంది. 467 00:53:28,292 --> 00:53:30,294 నేను ఒక చెత్త తండ్రిని అని నాకు తెలుసు. 468 00:53:31,086 --> 00:53:34,673 నేను చాలా విషయాలలో చాలా తప్పులు చేశాను కానీ ఒక్క విషయంలో మాత్రం... 469 00:53:36,925 --> 00:53:38,552 ఒక్క విషయంలో మాత్రం నేను తప్పు చేయలేదు. 470 00:53:40,929 --> 00:53:42,222 వైన్. 471 00:53:46,059 --> 00:53:47,311 వైన్ లో నేను మంచి నిపుణుడిని. 472 00:53:49,229 --> 00:53:50,772 అక్కడ నేను అత్యుత్తమంగా రాణిస్తాను. 473 00:53:51,940 --> 00:53:53,984 నువ్వు ఎటువంటి అమ్మాయిగా ఎదిగావో నాకు తెలియదు 474 00:53:53,984 --> 00:53:55,402 కానీ నువ్వు ఇప్పటికీ నా కూతురివే. 475 00:53:57,529 --> 00:53:59,198 కమీల్, అది నీ రక్తంలోనే ఉంది. 476 00:54:00,991 --> 00:54:02,826 బహుశా నువ్వు ప్రాక్టీసు కోల్పోయి ఉండచ్చు, 477 00:54:03,535 --> 00:54:05,162 కానీ రక్తంలో అది ఇంకి ఉంటుంది. 478 00:54:05,829 --> 00:54:07,664 వాసన పసిగట్టే నీ లక్షణం అలాగే ఉంటుంది. 479 00:54:10,375 --> 00:54:11,919 నా స్నేహితుడు, ఫిలిప్ కి నేను ఫోన్ చేశాను. 480 00:54:14,171 --> 00:54:15,380 అతను ఈ రంగంలో అత్యుత్తమ నిపుణుడు. 481 00:54:16,423 --> 00:54:18,842 నువ్వు ఎంతకాలమైనా అతని ఇంట్లో ఉండచ్చు. 482 00:54:18,842 --> 00:54:20,886 నువ్వు తెలుసుకోవలసిన ఎన్నో విషయాలని అతను నీకు నేర్పిస్తాడు. 483 00:54:22,596 --> 00:54:24,014 అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. 484 00:54:28,810 --> 00:54:32,481 నీ చిన్నతనంలో సెలవులకు వచ్చినప్పుడు మనం ద్రాక్ష తోటలో గడిపిన సందర్భాలు నీకు గుర్తున్నాయా? 485 00:54:41,281 --> 00:54:44,451 మనం కలిసి ప్రాక్టీసు చేసేవాళ్లం, సెల్లార్ లో కేవలం మన ఇద్దరమే, 486 00:54:46,036 --> 00:54:47,663 అది మన రహస్య ప్రదేశం. 487 00:54:58,298 --> 00:54:59,508 నా కోసం ఉండు. 488 00:55:02,886 --> 00:55:05,597 మీ అమ్మ అందుకు ఒప్పుకునేది కాదు, కానీ నువ్వు లెక్క చేసేదానివి కాదు. 489 00:55:20,779 --> 00:55:22,573 తెల్లవారుజామునే, నువ్వు అక్కడికి వెళ్లాలని ఆరాటపడేదానివి. 490 00:55:26,118 --> 00:55:28,829 మనం కలిసి గడిపిన చివరి క్షణాలు అవి. 491 00:55:43,510 --> 00:55:44,761 కళ్లకు గంతలు కడతావా? 492 00:55:59,776 --> 00:56:00,986 కమీల్! 493 00:56:02,821 --> 00:56:04,656 ఇప్పుడు ఏకాగ్రతతో ఉండు, సరేనా? 494 00:56:08,660 --> 00:56:09,828 అలాగే, నాన్నా. 495 00:56:10,704 --> 00:56:11,747 సారీ. 496 00:56:12,497 --> 00:56:13,790 సరిగ్గా కూర్చో. 497 00:56:14,875 --> 00:56:16,168 ఇది పిచ్చితనంగా ఉంటుందని నాకు తెలుసు... 498 00:56:18,962 --> 00:56:21,423 ఎందుకంటే ఇది నువ్వు చూస్తున్నావు అంటే అప్పటికి నేను మరణించి ఉంటాను. 499 00:56:25,552 --> 00:56:27,596 కానీ ఈ పరీక్షల ద్వారా, 500 00:56:29,264 --> 00:56:31,600 మనం ఒకరి గురించి మరొకరం కొంతయినా తెలుసుకుంటామని నా ఆశ. 501 00:56:33,936 --> 00:56:38,649 ఆ తరువాత బహుశా, ఏదో ఒక రోజు, ఎవరు చెప్పగలరు... 502 00:56:43,028 --> 00:56:44,696 నువ్వు నన్ను క్షమించవచ్చు కూడా. 503 00:56:50,369 --> 00:56:52,079 దయచేసి, ఉండు. 504 00:56:55,499 --> 00:56:56,708 మన కోసం ఇది చేయి. 505 00:57:25,904 --> 00:57:27,322 తడాషి ఆగి/షు ఒకిమోటో రాసిన కమి నో షిజుకు ఆధారంగా 506 00:57:44,840 --> 00:57:46,842 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్