1 00:00:37,956 --> 00:00:41,501 "లక్కీ" 2 00:00:43,211 --> 00:00:44,212 చార్లెస్. 3 00:00:45,714 --> 00:00:47,841 ఇప్పుడే ఆ కుకీస్ చేశాను. నీకోసం కాదు. 4 00:00:47,924 --> 00:00:49,259 ముఖ్యంగా, నా అనుమతి తీసుకోకపోతే. 5 00:00:49,342 --> 00:00:51,344 సారీ, ఆకలేసింది. 6 00:00:51,428 --> 00:00:54,472 శామీ, నేను ఈరోజు రాత్రి "గ్రేట్ అవుట్ డోర్స్"లో గడపబోతున్నాం. 7 00:00:54,556 --> 00:00:57,267 నేనైతే మన పెరటిని "గ్రేట్ అవుట్ డోర్స్" అని పిలవను. 8 00:00:57,350 --> 00:01:00,353 నాకు తెలుసు, కానీ మిడిల్టన్ జూనియర్ ఎక్స్ప్లోరర్ లో మేము చేరినప్పటినుండీ, 9 00:01:00,437 --> 00:01:02,272 శామీ బయటున్న ప్రతిదాన్నీ అలాగే పిలుస్తున్నాడు. 10 00:01:02,355 --> 00:01:05,609 సరే, మరియా నేను ఈరోజు రాత్రి గ్రేట్ ఇండోర్స్ లో ఎంజాయ్ చేయబోతున్నాం. 11 00:01:05,692 --> 00:01:08,570 ఎలాంటి గేమ్ నైట్ అయినా మూవీ నైట్ అయినా 12 00:01:08,653 --> 00:01:10,655 బోలెడన్ని స్నాక్స్ కావాలి, కాబట్టి వాటిని ముట్టుకోకు. 13 00:01:13,950 --> 00:01:16,411 ఇదిగో దొరికింది. స్ప్రూస్ మ్యాన్ 250. 14 00:01:16,494 --> 00:01:17,579 బాగుంది. 15 00:01:17,662 --> 00:01:19,039 చాలా బాగుంటుంది. 16 00:01:19,122 --> 00:01:22,000 పాత రోజుల్లో, మీ అమ్మా నేను లెక్కలేనన్ని సార్లు క్యాంపింగ్ కి వెళ్లాం. 17 00:01:22,083 --> 00:01:24,044 ఈ స్ప్రూస్ మ్యాన్ కేవలం టెంట్ మాత్రమే కాదు. 18 00:01:24,127 --> 00:01:26,963 ఇది కుటుంబంలో ఒక భాగం, కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకో. 19 00:01:27,047 --> 00:01:28,548 నేను లాంతరు మర్చిపోయాను. 20 00:01:29,883 --> 00:01:32,302 ఈరోజు రాత్రి గురించి మనకంటే నాన్నకి ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లుంది. 21 00:01:32,385 --> 00:01:36,723 ఖచ్చితంగా కాదు. బెస్ట్ ఫ్రెండ్ తో క్యాంపింగ్ చేయడం కంటే సరదాగా ఉండే విషయం ఉండదని నా ఉద్దేశం. 22 00:01:36,806 --> 00:01:38,225 కావచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్ తో… 23 00:01:39,476 --> 00:01:43,688 ముఖాముఖి ట్రివియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఇంకా బాగుంటుంది. 24 00:01:43,772 --> 00:01:47,067 వాలెరీ చేసిచ్చిన హోంమేడ్ బ్లాక్ బెర్రీ జామ్ మొత్తం 25 00:01:47,150 --> 00:01:48,360 నీ లింజర్ కుకీస్ లో వాడేశావా? 26 00:01:50,570 --> 00:01:51,863 నా ఫోన్. 27 00:01:51,947 --> 00:01:53,698 ఆ జామ్ తను వాళ్ళ పెరట్లో 28 00:01:53,782 --> 00:01:55,951 సొంతగా పెంచిన పండ్లతో, బెర్రీస్ తో చేసింది కదూ? 29 00:01:57,118 --> 00:01:58,578 చూడు, ఇంకోసారి ఇలా చేయను. 30 00:01:58,662 --> 00:01:59,663 నా ఫోన్ ఇస్తావా? 31 00:01:59,746 --> 00:02:02,165 నాకు ఎన్ని కావాలంటే అన్ని కుకీస్ తింటాను. 32 00:02:03,458 --> 00:02:04,542 -థాంక్స్. -ఇదిగో తీసుకో. 33 00:02:06,169 --> 00:02:07,629 హాయ్, మరియా. ఆగు. 34 00:02:10,090 --> 00:02:11,466 ఒకదాన్ని ఇప్పుడు రుచి చూసి… 35 00:02:16,721 --> 00:02:21,017 స్ప్రూస్ మ్యాన్ 250. దీనికి సంబంధించి బోలెడన్ని పిచ్చి జ్ఞాపకాలు ఉన్నాయి. 36 00:02:22,686 --> 00:02:24,521 హేయ్, చూడు హనీ. స్ప్రూస్ మ్యాన్. 37 00:02:24,604 --> 00:02:26,273 నాకు తెలుసు. స్ప్రూస్ మ్యాన్. 38 00:02:27,440 --> 00:02:29,150 శామీకి ఖచ్చితంగా నచ్చుతుంది. 39 00:02:29,734 --> 00:02:34,489 ఒక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పాడు. రూఫస్, గోల్డీలని కూడా తీసుకొస్తాడేమో అనిపిస్తోంది. 40 00:02:34,573 --> 00:02:37,325 కుక్కలతో పాటు క్యాంపింగ్ చేస్తే ఎంత సరదాగా ఉంటుందో కదా? 41 00:02:37,409 --> 00:02:38,618 నాకు తెలీదు, బాబూ. 42 00:02:38,702 --> 00:02:41,288 అందులో ఇద్దరే పడతారు, అవేమో చాలా పెద్ద కుక్కలు. 43 00:02:41,371 --> 00:02:43,873 కమాన్. అయితే మాత్రం ఏమవుతుంది? 44 00:02:43,957 --> 00:02:47,794 మహా అయితే, ఆ టెంట్ చినిగిపోతుంది, అంతేకదా! 45 00:02:50,672 --> 00:02:52,591 సరే. బై. 46 00:02:54,843 --> 00:02:56,136 ఏం జరిగింది, లిజ్జీ? 47 00:02:57,679 --> 00:02:59,180 మరియా మా స్లీప్ ఓవర్ క్యాన్సిల్ చేసింది. 48 00:02:59,264 --> 00:03:01,308 బంగారం, ఏం జరిగింది? 49 00:03:01,391 --> 00:03:03,602 తను కారా వాళ్ళింట్లో ఉంది, ఫ్రెంచ్ హోంవర్క్ చేయడానికి సాయం చేస్తోంది. 50 00:03:03,685 --> 00:03:05,812 అది చాలా చాలా తేలిక. 51 00:03:05,896 --> 00:03:07,480 బహుశా కారాకు కాదేమో? 52 00:03:08,106 --> 00:03:10,066 మేము స్లీప్ ఓవర్ ప్లాన్ చేసుకున్న రాత్రే 53 00:03:10,150 --> 00:03:12,444 తను ఎందుకు ఆ పని చేయాలో నాకు అర్థం కావట్లేదు. 54 00:03:12,527 --> 00:03:16,281 ఇప్పుడు నేను ఏం చేయాలి? అనవసరంగా ఆ కుకీస్ తయారు చేశాను. 55 00:03:16,364 --> 00:03:20,285 ఈ రాత్రికి తండ్రీ కూతుళ్ళం ట్రివియా ఆడుకుందాం. నిన్ను ఇబ్బంది పెట్టనని మాటిస్తున్నాను. 56 00:03:23,705 --> 00:03:24,706 శామీ వచ్చినట్లున్నాడు. 57 00:03:26,708 --> 00:03:28,543 విల్డర్నెస్ వీకెండ్, ఇదిగో మేము… 58 00:03:30,295 --> 00:03:31,421 వచ్చేశామా? 59 00:03:33,256 --> 00:03:35,050 చార్లెస్, నీకు డేవిడ్ గుర్తున్నాడుగా. 60 00:03:35,133 --> 00:03:37,844 ఓహ్, అవును. మీరు ఈ మధ్యనే మిడిల్టన్ షిఫ్ట్ అయ్యారు కదూ? 61 00:03:37,928 --> 00:03:38,929 చికాగో నుండి. 62 00:03:39,012 --> 00:03:40,805 నాకు ఇదంతా నమ్మలేకుండా ఉంది. 63 00:03:40,889 --> 00:03:44,476 వాతావరణంలో పుప్పొడి ఎక్కువగా ఉండడంతో డేవిడ్ కి, నాకు గతవారం నుండి జిమ్ క్లాసులు జరగడం లేదు. 64 00:03:44,559 --> 00:03:46,978 మేమిద్దరం రాగ్ వీడ్ మొక్క గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు 65 00:03:47,062 --> 00:03:49,648 డేవిడ్ కుటుంబం తరచూ క్యాంపింగ్ చేస్తారని తెలిసింది 66 00:03:49,731 --> 00:03:52,192 జూనియర్ ఎక్స్ప్లోరర్స్ లో చేరడానికి కూడా ఆసక్తిగా ఉన్నాడని తెలిసింది. 67 00:03:52,275 --> 00:03:54,694 అందుకని నేను మన స్లీప్ ఓవర్ కు తనని కూడా ఆహ్వానించాను. 68 00:03:56,279 --> 00:03:57,822 పైగా, తన దగ్గర కొత్త టెంట్ ఉంది. 69 00:03:57,906 --> 00:03:59,241 స్ప్రూస్ మ్యాన్ 1000 70 00:03:59,324 --> 00:04:02,202 నా దగ్గర కూడా టెంట్ ఉంది, మర్చిపోయావా? స్ప్రూస్ మ్యాన్ 250. 71 00:04:02,285 --> 00:04:05,580 అవును, కానీ డేవిడ్ దగ్గరున్నది స్ప్రూస్ మ్యాన్ 1000. 72 00:04:05,664 --> 00:04:07,207 ఇందులో నలుగురు సరిపోతారు. 73 00:04:07,290 --> 00:04:09,459 నలుగురు ఉండగలిగే టెంట్. గొప్పగా ఉంది కదూ? 74 00:04:10,252 --> 00:04:11,962 నా ఉద్దేశం… ఆగు, ఏంటి? 75 00:04:17,050 --> 00:04:20,262 "హైకు అనే 17 పదాల పద్యం ఏ దేశానికి చెందింది? 76 00:04:20,345 --> 00:04:21,346 జపాన్. 77 00:04:22,806 --> 00:04:24,432 ఏదైనా ఉదాహరణ ఇవ్వగలవా? 78 00:04:27,352 --> 00:04:30,939 మరియా ఫ్రెంచ్ మాట్లాడుతుంది. తనకొక కొత్త బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. 79 00:04:31,022 --> 00:04:32,148 ఇప్పుడు నేను ఒక్క దాన్నే ఉన్నాను. 80 00:04:33,358 --> 00:04:34,359 నిన్ను ఉద్దేశించి అనడం లేదు. 81 00:04:35,235 --> 00:04:36,236 నేనేమీ ఫీలవలేదు. 82 00:04:37,279 --> 00:04:40,865 సరే అయితే, నన్ను అడుగు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ప్రశ్న అయినా అడుగు. 83 00:04:40,949 --> 00:04:44,244 డానిష్ ఆర్కిటెక్చర్ లాంటివి మాత్రం అడక్కు. అది నా వల్ల కాదు. 84 00:04:45,412 --> 00:04:47,664 నాన్నా, నా మూడ్ మార్చాలని ప్రయత్నిస్తునందుకు చాలా థాంక్స్, 85 00:04:47,747 --> 00:04:49,708 కానీ… నువ్వనుకుంటున్నట్లు ఏదీ లేదు. 86 00:04:50,375 --> 00:04:52,127 నాకు అర్థం కావట్లేదు. 87 00:04:52,210 --> 00:04:55,171 మరియా, నేను ఈ గేమ్ నైట్ కోసం కొన్ని వారాల నుండి ప్లాన్ చేస్తున్నాం, 88 00:04:55,255 --> 00:04:57,799 తను ఉన్నట్లుండి ఇలా కాల్ చేసి క్యాన్సిల్ చేస్తుందని ఊహించలేదు. 89 00:04:58,842 --> 00:05:01,928 మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నాను. 90 00:05:06,766 --> 00:05:09,853 షాడో కోసం కొత్త ఇంటిని కనిపెట్టడానికి లిజ్జీ పీటర్సన్ కి ఎవరు సాయం చేశారు? 91 00:05:10,896 --> 00:05:12,188 అలాగే స్కాట్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి? 92 00:05:12,772 --> 00:05:14,774 గుర్రపు స్వారీ చేయడం ఎవరు నేర్పించారు? 93 00:05:16,151 --> 00:05:18,737 సరైన సమాధానం మరియా. 94 00:05:19,821 --> 00:05:21,615 ఎందుకంటే తను నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. 95 00:05:22,324 --> 00:05:24,492 అంటే దానర్థం నువ్వు తనని నమ్మాలి, అవునా? 96 00:05:27,829 --> 00:05:30,874 తేలిగ్గా గుర్తించి సెట్ చేయడానికి పోల్స్ కీ, స్లీవ్స్ కీ వేర్వేరు రంగులు వేశారు. 97 00:05:30,957 --> 00:05:32,792 ఇక్కడంతా మెష్ ఎందుకు పెట్టారు? 98 00:05:36,296 --> 00:05:39,507 -అది స్క్రీన్ ఉన్న వసారా. -స్క్రీన్ ఉన్న వసారానా? 99 00:05:39,591 --> 00:05:41,635 మనకి ఒడోమాస్ లాంటిది అవసరం లేదన్నమాట. 100 00:05:42,135 --> 00:05:43,720 మా నాన్న ఇచ్చిన లాంతరు తెచ్చాను. 101 00:05:43,803 --> 00:05:46,473 మనం తర్వాత ఘోస్ట్ స్టోరీస్ చెప్పుకునేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. 102 00:05:46,556 --> 00:05:50,018 మీ నాన్న లాంతరు చాలా బాగుంది, కానీ నక్షత్రాలే మనకి ప్రకృతిచ్చిన లాంతరు. 103 00:05:50,101 --> 00:05:52,145 కానీ సప్తర్షిమండలాన్ని చూడాలంటే, 104 00:05:52,229 --> 00:05:54,397 మనం కృత్రిమ వెలుతురు లేకుండా చూడాలి. 105 00:05:54,481 --> 00:05:56,900 ప్రకృతి లాంతరు. నాకు నచ్చింది. 106 00:06:00,695 --> 00:06:01,696 ఏంటా శబ్దం? 107 00:06:01,780 --> 00:06:03,823 మళ్ళీ వర్షం పడుతుందనుకుంటా. 108 00:06:05,075 --> 00:06:07,410 లేదు. పొదల్లో ఏదో కదులుతోంది. 109 00:06:07,994 --> 00:06:10,664 సరే పిల్లలూ. తుఫాను రాబోతోంది. లోపలికి రావాల్సిన సమయం వచ్చింది. 110 00:06:10,747 --> 00:06:13,750 పరవాలేదు. మిసెస్ పీటర్సన్. ఈ కొత్త స్ప్రూస్ మ్యాన్ వాటర్ ప్రూఫ్ కూడా. 111 00:06:14,334 --> 00:06:16,461 అవసరమైనప్పుడు దాన్ని గుర్తు పెట్టుకుంటాను. లోపలికి రండి. 112 00:06:24,594 --> 00:06:26,805 -చార్లెస్, వెళ్దాం పద. -ఒక్క క్షణం! 113 00:06:39,025 --> 00:06:40,485 అవి చూడ్డానికి చాలా బాగున్నాయి. 114 00:06:40,569 --> 00:06:43,530 అవును. చార్లెస్ వాళ్ళక్క చాలా రుచికరమైన కుకీస్ చేస్తుంది. 115 00:06:43,613 --> 00:06:44,781 తీసుకోండి. 116 00:06:44,864 --> 00:06:46,533 లిజ్జీ. తన పేరు డేవిడ్. 117 00:06:47,033 --> 00:06:48,034 వీటిని నువ్వే చేశావా? 118 00:06:49,160 --> 00:06:51,496 గేమ్ నైట్ కోసం చేశాను, కానీ ఇప్పుడది జరగడం లేదు. 119 00:06:51,997 --> 00:06:53,623 గేమ్ నైట్? ఏ గేమ్? 120 00:06:54,749 --> 00:06:56,167 "ఎవరు ట్రివియనైర్ కావాలని అనుకుంటున్నారు?" 121 00:06:56,251 --> 00:06:58,336 నిజమా? నాకు ట్రివియా చాలా ఇష్టం. 122 00:06:58,420 --> 00:07:00,797 డేవిడ్ కి కూడా ఖచ్చితంగా ఇష్టమని అనిపిస్తోంది. 123 00:07:00,881 --> 00:07:02,090 సరిగ్గా చెప్పావు. 124 00:07:07,012 --> 00:07:08,346 సరే అయితే, డేవిడ్. 125 00:07:08,430 --> 00:07:11,516 "మొక్కలు, మాంసం రెండింటినీ తినే జంతువుల్ని ఏమంటారు?" 126 00:07:12,601 --> 00:07:13,768 ఫుల్. 127 00:07:16,062 --> 00:07:19,441 కంగారుపడకు, అదేంటో నాకు తెలుసు. అది ఆమ్నివోర్స్. 128 00:07:19,524 --> 00:07:20,692 మళ్ళీ సరిగ్గా చెప్పావు. 129 00:07:21,860 --> 00:07:25,155 చార్లెస్, సరైన టైంకి వచ్చావు. మా ఆటలో ఇప్పుడే లైట్నింగ్ రౌండ్ మొదలవబోతోంది. 130 00:07:25,739 --> 00:07:27,365 లేదు, నేను వెళ్లి బట్టలు మార్చుకోవాలి. 131 00:07:27,449 --> 00:07:29,451 పరవాలేదు రా. చాలా సరదాగా ఉంది. 132 00:07:30,869 --> 00:07:31,870 అలాగే. 133 00:07:31,953 --> 00:07:33,955 -సరే. -సరే అయితే. 134 00:07:35,248 --> 00:07:37,584 "ఫాగ్ కి ఏ పదార్థం కలిపితే స్మోగ్ అవుతుంది? 135 00:07:40,962 --> 00:07:42,255 ఐదు సెకన్లు. 136 00:07:43,298 --> 00:07:44,299 స్మోగ్ అవ్వాలంటే? 137 00:07:44,382 --> 00:07:47,802 మూడు. రెండు. ఒకటి. 138 00:07:47,886 --> 00:07:49,387 -స్మోక్! -స్మోక్! 139 00:07:49,471 --> 00:07:50,513 -అరె! -అరె! 140 00:07:55,936 --> 00:07:57,479 మీరు కొనసాగించండి. నేనిప్పుడే వస్తాను. 141 00:07:57,562 --> 00:07:58,563 ఓకే. 142 00:07:59,356 --> 00:08:02,025 మనం పాయింట్స్ సగం సగం విడగొడదాం, ఒక్కొక్కరికీ హాఫ్, సరేనా? 143 00:08:02,108 --> 00:08:03,109 కుక్క జాతులు 144 00:08:03,193 --> 00:08:04,778 లిజ్జీ. హాయ్. 145 00:08:04,861 --> 00:08:05,862 ఎక్కడున్నావు? 146 00:08:05,946 --> 00:08:07,489 నేను బీరువాలో ఉన్నాను. 147 00:08:07,572 --> 00:08:10,951 తనకి తెలీకుండా కాల్ చేయడం కోసం కారాకి ఎక్సర్సైజు ఇచ్చి వచ్చాను. 148 00:08:11,034 --> 00:08:13,036 అందుకే ఇందాక నేను సరిగా మాట్లాడలేకపోయాను. 149 00:08:13,662 --> 00:08:15,413 నా మాటలు తను వినకూడదని అలా చేశాను. 150 00:08:15,497 --> 00:08:16,539 ఓకే. 151 00:08:17,457 --> 00:08:19,376 మన ప్లాన్ మొత్తం చెడగొట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది, 152 00:08:19,459 --> 00:08:21,419 కానీ పాపం కారా ఫ్రెంచ్ నేర్చుకోలేక కష్టపడుతోంది. 153 00:08:21,503 --> 00:08:23,672 తనకు మంచి మార్కులు రాకపోతే వాలీబాల్ మాన్పించేస్తామని 154 00:08:23,755 --> 00:08:24,839 తన అమ్మానాన్నలు చెప్పారు. 155 00:08:25,632 --> 00:08:28,134 అవునా. అది చాలా దారుణం. 156 00:08:28,218 --> 00:08:30,428 తను ఏడుస్తూ నన్ను సాయం చేయమని అడిగింది. 157 00:08:30,512 --> 00:08:31,680 నాకు ఏం చేయాలో తెలీలేదు. 158 00:08:32,806 --> 00:08:36,560 లేదు, సరిగ్గా ఏం చేయాలో నీకు తెలుసు. నువ్వు చాలా మంచిపని చేశావు. 159 00:08:38,102 --> 00:08:40,730 కానీ నీతో కలిసి ట్రివియనైర్ ఆడాలని నాకు ఎంతో కోరికగా ఉంది. 160 00:08:41,231 --> 00:08:42,774 త్వరగా నన్నొక ప్రశ్న అడుగు. 161 00:08:42,856 --> 00:08:46,570 ఓకే... నేషనల్ ట్రివియా డే ఎప్పుడు? 162 00:08:47,362 --> 00:08:48,572 ట్రివియా గురించే ట్రివియానా? 163 00:08:49,990 --> 00:08:51,866 -అది దుర్… -మరియా! 164 00:08:52,409 --> 00:08:56,329 అది దుర్మార్గం, లిజ్జీ. జనవరి నాలుగు. 165 00:08:56,413 --> 00:08:58,081 డింగ్, డింగ్, డింగ్, కరెక్ట్. 166 00:08:58,164 --> 00:08:59,666 మరియా, నాకిది అర్థం కాలేదు. 167 00:08:59,749 --> 00:09:03,378 నేను వెళ్ళాలి. కారా ఫ్రెంచ్ మాట్లాడడానికి కష్టపడుతోంది. 168 00:09:03,461 --> 00:09:05,839 మనం వచ్చే వీకెండ్ కి మన ప్రోగ్రాం మార్చుకుందామా? 169 00:09:37,329 --> 00:09:38,538 నిద్ర లేచే టైం అయింది. 170 00:09:41,207 --> 00:09:42,334 టైం ఎంతైంది? 171 00:09:42,417 --> 00:09:45,295 మన జూనియర్ ఎక్స్ప్లోరర్స్ నైపుణ్యాలను వాడాల్సిన సమయమైంది. 172 00:09:45,879 --> 00:09:48,298 బయట ఒక కుక్క ఉంది, అది ఎక్కడుందో మనం కనిపెట్టాలి. 173 00:09:49,299 --> 00:09:53,887 ఓకే. మన మెంటల్ ఫోకస్ కి ఏది సహాయపడుతుందో చెప్పనా? 174 00:09:53,970 --> 00:09:55,472 ఇంకాసేపు నిద్ర. 175 00:09:56,848 --> 00:10:00,018 నిన్నరాత్రి నేను 75 రౌండ్లు ట్రివియనైర్ ఆడాను. 176 00:10:00,101 --> 00:10:02,187 ఇప్పుడు మనం ఏం చేయాలో నిర్ణయించే అవకాశం నాదనుకుంటున్నాను. 177 00:10:02,771 --> 00:10:05,065 మీరు ఆకలిగా ఉన్నారా? మనం ముందుగా టిఫిన్ తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? 178 00:10:05,148 --> 00:10:06,733 నాకా ఐడియా నచ్చింది. 179 00:10:07,525 --> 00:10:10,195 మీరు ఇంటికి వెళ్లి టిఫిన్ చేయాలనుకుంటే, నాకేం ఇబ్బంది లేదు. 180 00:10:10,278 --> 00:10:13,740 కానీ అసలైన జూనియర్ ఎక్స్ప్లోరర్ చేయాల్సిన పనిలాగా అనిపించడం లేదు. 181 00:10:24,167 --> 00:10:26,336 జూనియర్ ఎక్స్ప్లోరర్స్ హ్యాండ్ బుక్ ప్రకారం 182 00:10:26,419 --> 00:10:29,589 ఏదైనా మిషన్ విజయవంతం అవ్వాలంటే సరైన ప్లాన్ అవసరం. 183 00:10:29,673 --> 00:10:31,049 -మనం కుక్కని కనిపెట్టాలంటే… -చూడు! 184 00:10:31,132 --> 00:10:32,175 కుక్క కాలి ముద్రలు. 185 00:10:32,259 --> 00:10:33,343 నాకు తెలుసు. 186 00:10:34,261 --> 00:10:36,137 ఈ ముద్రలు కుక్కవే అనడానికి ఏంటి గ్యారెంటీ? 187 00:10:37,389 --> 00:10:39,724 కయోటీ అడుగులు కొంచెం సాగినట్లుగా ఉంటాయి, 188 00:10:39,808 --> 00:10:43,019 ఈ ప్రాంతంలో ఉన్న ఇతర స్థానిక జంతువులు బీవర్లు, జింకలు మాత్రమే, 189 00:10:43,103 --> 00:10:44,104 కాబట్టి ఇవి కుక్కవే కావొచ్చు! 190 00:10:44,187 --> 00:10:45,814 అవి టెంట్ వైపు వెళుతున్నాయి! 191 00:10:52,195 --> 00:10:54,197 కుక్కపిల్ల. చూడు. 192 00:10:54,281 --> 00:10:55,907 బహుశా అది చలికి వణుకుతోంది. 193 00:10:56,449 --> 00:10:57,450 పరవాలేదు. 194 00:10:58,243 --> 00:10:59,953 పరవాలేదు. మేము నిన్నేమీ చేయం. 195 00:11:00,036 --> 00:11:01,037 ఆగు. 196 00:11:01,121 --> 00:11:04,583 మనం ముందుగా దాని నమ్మకాన్ని గెల్చుకోవాలేమో? తిండి చూపించి బయటికి రప్పిస్తే? 197 00:11:05,375 --> 00:11:06,376 అవును. 198 00:11:06,459 --> 00:11:07,627 మీ దగ్గర కిబుల్ ఉందా? 199 00:11:09,296 --> 00:11:14,009 మన దగ్గర కిబుల్ ఉందా? మనం కుక్కల్ని పెంచుతాం. కిబుల్ ఉండకుండా ఎలా ఉంటుంది. 200 00:11:15,260 --> 00:11:16,720 ఓహ్, మంచిది. ఇదిగో. 201 00:11:16,803 --> 00:11:18,638 ఓకే, మనం పప్పీని భయపెట్టకూడదు, 202 00:11:18,722 --> 00:11:20,473 -కాబట్టి మనలో ఒక్కరే లోపలికి వెళ్ళాలి. -అవును. 203 00:11:21,266 --> 00:11:23,560 -చార్లెస్, నువ్వు లోపలికి వెళ్లి… -నేను చూసుకుంటాను. 204 00:11:30,066 --> 00:11:31,067 ఓకే. 205 00:11:35,780 --> 00:11:36,865 ఇది నీ కోసమే. 206 00:11:41,995 --> 00:11:43,580 మంచి కుక్కపిల్లవి. 207 00:11:51,213 --> 00:11:52,214 ఇది పనిచేస్తోంది. 208 00:12:00,055 --> 00:12:01,056 ఓకే. 209 00:12:05,602 --> 00:12:06,603 ఓకే. 210 00:12:09,439 --> 00:12:10,732 బాగా చేశావు, డేవిడ్. 211 00:12:10,815 --> 00:12:12,776 నువ్వు డాగ్ ఎక్స్పర్ట్ అని నాకు తెలీదే! 212 00:12:12,859 --> 00:12:14,861 చూశారా? ఇక్కడ కుక్క ఉందని నాకు తెలుసు. 213 00:12:14,945 --> 00:12:17,364 అది లక్కీ, నీ మనసు చెప్పింది నమ్మడం మంచిదయింది. 214 00:12:18,698 --> 00:12:19,699 లక్కీ. 215 00:12:19,783 --> 00:12:21,368 -మనం దీనికి ఆ పేరే పెడదాం. -అవును. 216 00:12:21,451 --> 00:12:23,286 మేం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, లక్కీ. 217 00:12:27,791 --> 00:12:29,834 అన్నిటికంటే ముందుగా దీనికి స్నానం చేయించాలి. 218 00:12:32,587 --> 00:12:34,506 అవును, ఇది ఖచ్చితంగా మిశ్రమ జాతి. 219 00:12:35,340 --> 00:12:38,009 మోహం టెర్రియర్ లా, బొచ్చు షిట్జూలా ఉందా? 220 00:12:40,095 --> 00:12:41,429 బొచ్చు బురదతో నిండిపోయింది. 221 00:12:43,098 --> 00:12:44,224 పర్పుల్ కలర్ బురదలా ఉంది. 222 00:12:45,392 --> 00:12:46,768 అవును, చాలా వింతగా ఉంది. 223 00:12:47,686 --> 00:12:49,896 మీలో ఒకరు లోపలికి వెళ్లి ఇంకో టవల్ తీసుకొస్తారా? 224 00:12:49,980 --> 00:12:51,773 -వంటగదిలో సింక్ కింద ఉంది. -ఓకే. 225 00:12:53,817 --> 00:12:55,151 -నువ్వెళ్ళు. -లేదు, నువ్వెళ్ళు. 226 00:12:55,235 --> 00:12:56,611 -లేదంటే ఇద్దరం వెళదాం. -ఓకే. 227 00:12:59,364 --> 00:13:01,950 -ఎందుకలా చేశావు? -ఏం చేశాను? 228 00:13:02,033 --> 00:13:03,577 ఇద్దరినీ ఎందుకు పంపించావు? 229 00:13:03,660 --> 00:13:06,329 వాళ్ళేమీ వెళ్ళిపోలేదు. ఇంట్లోనే ఉన్నారు. 230 00:13:06,413 --> 00:13:07,789 ఏం జరుగుతోంది? 231 00:13:07,872 --> 00:13:10,208 నేను కోరుకున్నదల్లా నా బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి క్యాంపింగ్ చేయాలని. 232 00:13:10,292 --> 00:13:14,087 కానీ తను తన ఫ్రెండ్ ని తెచ్చాడు, వాళ్ళిద్దరూ ప్రతి పనీ కలిసి చేస్తున్నారు. 233 00:13:14,170 --> 00:13:15,881 అందుకే నువ్వు బాధపడుతున్నావా? 234 00:13:17,382 --> 00:13:20,677 చార్లెస్, నువ్వెలా ఫీలవుతున్నావో నాకు తెలుసు, నువ్వు బయటికి చెప్పావంతే. 235 00:13:20,760 --> 00:13:23,388 శామీ నీ బెస్ట్ ఫ్రెండ్. అంటే దానర్థం నువ్వు తనని నమ్మొచ్చు… 236 00:13:23,471 --> 00:13:25,765 అతన్ని పిలవనా వద్దా అని కూడా తను నన్ను అడగలేదు. 237 00:13:31,062 --> 00:13:32,063 ఇది ఎందుకు ఏడుస్తోంది? 238 00:13:32,147 --> 00:13:34,441 నాకు తెలీదు. నేను దీని పాదాన్ని శుభ్రం చేస్తున్నాను. 239 00:13:34,524 --> 00:13:36,860 -లక్కీ, వద్దు! -వెనక్కి రా! 240 00:13:36,943 --> 00:13:38,486 -ఏం జరిగింది? -లక్కీ పారిపోయింది. 241 00:13:38,570 --> 00:13:41,323 కంగారుపడకండి. అది బయటికి వెళ్ళలేదు. ఫెన్సింగ్ చాలా ఎత్తుగా ఉంది. 242 00:13:41,406 --> 00:13:44,284 అదీ, లోపలికి రావడానికి అది ఏదో దారి కనిపెట్టింది. 243 00:13:44,367 --> 00:13:46,286 చాలా మంచి పాయింట్ చెప్పావు, డేవిడ్. 244 00:13:46,369 --> 00:13:47,579 ఖచ్చితంగా మంచి పాయింటే. 245 00:13:49,080 --> 00:13:50,081 గైస్, చూడండి! 246 00:13:56,129 --> 00:13:57,214 ఓహ్, అయ్యో. 247 00:13:57,297 --> 00:14:01,885 లక్కీ! లక్కీ! లక్కీ, ఇక్కడికి రా! లక్కీ, ఇటురా! 248 00:14:01,968 --> 00:14:03,511 మనం విడివిడిగా వెతికితే మంచిది. 249 00:14:04,429 --> 00:14:05,847 గైస్, లక్కీ పాద ముద్రలు. 250 00:14:08,600 --> 00:14:10,143 కానీ గడ్డిలో తెలియడం లేదు కదా. 251 00:14:10,727 --> 00:14:12,646 ఒక్క క్షణం. నా కంపాస్ తీస్తాను. 252 00:14:16,775 --> 00:14:18,693 అది వాయువ్యం వైపు వెళ్ళినట్లుంది. 253 00:14:18,777 --> 00:14:20,111 అది ఏ దిక్కులో వెళితే ఏంటి? 254 00:14:20,195 --> 00:14:22,906 అది అటువైపు వెళ్ళింది, అటువైపే విషపు ఐవీ మొక్కలున్నాయి. 255 00:14:22,989 --> 00:14:25,200 అదృష్టవశాత్తూ విషపు ఐవీ మొక్కల్లో విషం ఉండదు. 256 00:14:25,283 --> 00:14:26,993 అది ఊరికే అలర్జిక్ ప్రతిచర్యలను కలిగిస్తుంది. 257 00:14:27,077 --> 00:14:28,870 అధికశాతం అవి కుక్కలకు ఎలాంటి హానీ కలిగించవు. 258 00:14:28,954 --> 00:14:33,750 అర్థమయింది, డేవిడ్! నీకు క్యాంపింగ్ గురించి, ప్రకృతి గురించి, కుక్కల గురించీ అన్నీ తెలుసు. 259 00:14:37,003 --> 00:14:38,004 ఓకే. 260 00:14:39,256 --> 00:14:41,716 నేను, డేవిడ్ వెళ్లి ఇంకెక్కడైనా పాద ముద్రలు కనిపిస్తాయేమో చూస్తాం, 261 00:14:41,800 --> 00:14:43,843 లక్కీ ఇక్కడికే వస్తుందేమో మీరిద్దరూ ఇక్కడే ఉండండి, సరేనా? 262 00:14:44,719 --> 00:14:45,720 -వెళ్దాం పద, డేవిడ్. -ఓకే. 263 00:14:47,639 --> 00:14:48,682 ఏం జరిగింది? 264 00:14:54,229 --> 00:14:55,230 ఎందుకలా ప్రవర్తించావు? 265 00:14:56,231 --> 00:14:59,067 డేవిడ్ పై ఎందుకు అరుస్తున్నావు? అదేం బాలేదు. 266 00:14:59,150 --> 00:15:02,237 ఏం బాలేదా? క్యాంప్ అవుట్ ని పాడు చేసింది నువ్వు. 267 00:15:02,320 --> 00:15:03,697 ఏంటి నువ్వు మాట్లాడేది? 268 00:15:03,780 --> 00:15:05,865 ఈ వీకెండ్ మనిద్దరం కలిసి గడుపుదామనుకున్నాం. 269 00:15:05,949 --> 00:15:09,911 మనిద్దరం క్యాంప్ వేసుకుని, స్నాక్స్ తింటూ, దెయ్యాల కథలు చెప్పుకుందామనుకున్నాం. 270 00:15:09,995 --> 00:15:11,788 అలా కాకుండా అన్నీ తనకే తెలుసన్నట్లు 271 00:15:11,871 --> 00:15:15,792 డేవిడ్ మిడతలు కీచుమనడం గురించి ఆపకుండా వాగుతూ ఉంటే వినాల్సి వచ్చింది. 272 00:15:15,875 --> 00:15:18,670 కీచుమనే సంఖ్యని బట్టి ఉష్ణోగ్రత అంచనా వేయొచ్చు, చార్లెస్. 273 00:15:18,753 --> 00:15:20,297 అది గొప్ప జూనియర్ ఎక్స్ప్లోరర్ సమాచారం. 274 00:15:20,380 --> 00:15:22,591 అది మనిద్దరం కలిసి నేర్చుకోవాల్సిన విషయం! 275 00:15:22,674 --> 00:15:24,593 నువ్వు అతన్ని ఆహ్వానించాల్సిన అవసరమేంటో నాకు తెలీదు. 276 00:15:24,676 --> 00:15:26,928 ఎందుకంటే కొత్తగా ఒక చోటికి వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి! 277 00:15:28,013 --> 00:15:31,474 మిడిల్టన్ కి షిఫ్ట్ అవ్వడం నా జీవితంలో ఎంతో భయపడిన విషయాల్లో ఒకటి. 278 00:15:31,558 --> 00:15:33,810 నేను మళ్ళీ స్నేహితుల్ని సంపాదించలేనేమో అనుకున్నాను. 279 00:15:33,894 --> 00:15:38,773 కానీ నువ్వు, గోల్డీ ఇంటికి వచ్చిన రోజు, అంతా మారిపోయింది. 280 00:15:39,399 --> 00:15:41,067 నాకు అప్పటినుండి ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. 281 00:15:42,527 --> 00:15:46,072 ఓకే, చూడు. నీకు చెప్పకుండా డేవిడ్ ని ఆహ్వానించినందుకు సారీ. 282 00:15:46,156 --> 00:15:50,118 అతన్ని ఎందుకు తీసుకొచ్చానో నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను. 283 00:15:50,201 --> 00:15:53,163 -నువ్వు నాతో స్నేహం చేసినట్లే ఇది కూడా అనుకున్నాను. -నేను ఊరికే… 284 00:15:54,956 --> 00:15:56,374 నాకు తెలీదు, నువ్వు ఇకపై 285 00:15:56,458 --> 00:15:58,418 నాతో ఫ్రెండ్ గా ఉండాలని అనుకోవడం లేదేమో అనుకున్నాను. 286 00:15:59,544 --> 00:16:02,505 అలా జరగాలంటే స్ప్రూస్ మ్యాన్ 1000 కంటే ఇంకా చాలా కావాలి. 287 00:16:04,049 --> 00:16:06,009 అంటే, స్ప్రూస్ మ్యాన్ 2000… 288 00:16:09,346 --> 00:16:10,347 ఆగు, అది… 289 00:16:12,682 --> 00:16:14,809 -నేనేం తెచ్చానో చూడండి. -లక్కీ! 290 00:16:15,936 --> 00:16:17,312 హాయ్, బుజ్జీ. 291 00:16:22,484 --> 00:16:23,818 దాన్ని ఎలా కనిపెట్టారు? 292 00:16:24,152 --> 00:16:25,153 డేవిడే కనిపెట్టాడు. 293 00:16:27,322 --> 00:16:30,867 చెట్ల దగ్గరున్న ఫెన్సింగ్ పక్కన లక్కీ పాద ముద్రల్ని తను కనుక్కున్నాడు. 294 00:16:31,868 --> 00:16:33,912 దానివైపు కుంటుతూ వెళ్ళడం కనిపెట్టాడు. 295 00:16:34,704 --> 00:16:36,665 దాని కాలికి ఏమైందో తెలియట్లేదు. 296 00:16:36,748 --> 00:16:39,292 ఒక కాలిని ముట్టుకున్న రెండుసార్లూ అది ఏడ్చింది. 297 00:16:40,502 --> 00:16:42,546 ఏదీ నన్ను చూడనీ. అవును, ఈ కాలే. 298 00:16:42,629 --> 00:16:45,006 ఎర్రగా వాచిందేమో చూడాలి. 299 00:16:45,090 --> 00:16:46,758 నాకు తెలిసింది బంగారు. 300 00:16:48,885 --> 00:16:50,679 నాకేమీ కనిపించడం లేదు. 301 00:16:51,930 --> 00:16:52,931 నేను చూస్తానుండు. 302 00:16:54,474 --> 00:16:55,475 హేయ్. 303 00:17:00,230 --> 00:17:03,149 ముల్లు గుచ్చుకుంది. నేను దానికి తగిలినట్లున్నాను. 304 00:17:03,233 --> 00:17:05,026 అది కుంటడంలో ఆశ్చర్యమేముంది. 305 00:17:05,110 --> 00:17:06,319 మనం దాన్ని బయటికి తీయాలి. 306 00:17:06,402 --> 00:17:07,654 -అవును. -అవును. 307 00:17:08,780 --> 00:17:11,699 నా పాకెట్ టూల్ లో ప్లక్కర్ ఉంది, ఉపయోగపడుతుందేమో చూడు. 308 00:17:14,202 --> 00:17:15,579 ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 309 00:17:18,622 --> 00:17:22,710 ఓకే, డేవిడ్. నేను దీన్ని పట్టుకుంటాను, నువ్వు ముల్లు తీయడానికి ప్రయత్నించు. 310 00:17:22,794 --> 00:17:25,005 నేను అలాంటి పనులు సరిగా చేయలేను. 311 00:17:26,381 --> 00:17:27,507 నా వంక చూడకండి. 312 00:17:27,591 --> 00:17:28,592 నువ్వే చేయాలి. 313 00:17:29,968 --> 00:17:31,177 నువ్వే అసలైన డాగ్ ఎక్స్పర్ట్ వి. 314 00:17:34,222 --> 00:17:37,017 ఓకే, కానీ నాకు నీ సాయం కావాలి. దీన్ని పట్టుకుంటావా? 315 00:17:39,603 --> 00:17:40,854 రారా, బుజ్జీ. 316 00:17:43,398 --> 00:17:44,399 ఓకే. 317 00:17:44,482 --> 00:17:46,818 నేను దానికి ఏదైనా ఇచ్చి దృష్టి మరల్చుతాను. శామీ? 318 00:17:46,902 --> 00:17:47,903 అర్థమయింది. 319 00:17:50,947 --> 00:17:54,367 ఓకే, లక్కీ, ఇది కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చు, 320 00:17:54,451 --> 00:17:56,703 కానీ దాన్ని తీసేస్తే నీకు చాలా హాయిగా ఉంటుంది. 321 00:17:57,829 --> 00:17:59,664 -ఓకే, బుజ్జీ. -నేను మాటిస్తున్నాను. 322 00:17:59,748 --> 00:18:01,291 ఇది నిన్ను నమ్ముతోంది. 323 00:18:02,000 --> 00:18:03,585 -థాంక్స్. -అవును. 324 00:18:03,668 --> 00:18:07,005 హేయ్. చూడు, లక్కీ, స్నాక్. చూడు, ఇదిగో. 325 00:18:07,088 --> 00:18:08,089 నేను… 326 00:18:09,382 --> 00:18:10,592 నాకు దొరికింది! 327 00:18:11,843 --> 00:18:12,844 బాగా చేశావు. 328 00:18:12,928 --> 00:18:14,721 అవును. నిజంగా చాలా బాగా చేశావు. 329 00:18:15,430 --> 00:18:16,431 థాంక్స్. 330 00:18:21,645 --> 00:18:23,897 ఈ ముల్లుని చూస్తే, బ్లాక్ బెర్రీదని అనిపిస్తోంది. 331 00:18:24,940 --> 00:18:26,483 మా పాత ఇంటి పెరట్లో ఉండేది. 332 00:18:26,566 --> 00:18:29,319 అవునా, అందుకే దాని బొచ్చుకి పర్పుల్ రంగు అంటినట్లుంది. 333 00:18:29,402 --> 00:18:32,113 బహుశా లక్కీ బ్లాక్ బెర్రీ పొలంలో ఉంటుందేమో. 334 00:18:32,197 --> 00:18:36,409 లేదంటే పెరట్లో బ్లాక్ బెర్రీలు పెంచే వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటుంది, 335 00:18:36,493 --> 00:18:39,162 అమ్మ వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ ఇక్కడికి పది బ్లాక్స్ అవతల ఉంటుంది. 336 00:18:40,163 --> 00:18:43,416 మీ అమ్మ వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ కుక్క పారిపోయి 337 00:18:43,500 --> 00:18:47,045 ఇక్కడికి రావడం అనేది లక్షలో ఒక శాతం అయినా ఉంటుందా? 338 00:18:47,128 --> 00:18:51,675 ఖచ్చితంగా. కానీ నాకు ఎందుకో అదే అయ్యుంటుందని అనిపిస్తోంది. 339 00:18:51,758 --> 00:18:53,093 -నాక్కూడా. -అవును. 340 00:18:53,969 --> 00:18:55,804 -కాదు. -కాదా? 341 00:18:56,721 --> 00:18:58,473 నేను దాన్ని ఎప్పుడూ చూడలేదు. 342 00:18:59,057 --> 00:19:00,684 అది ఖచ్చితంగా అందంగా ఉంది. 343 00:19:01,268 --> 00:19:02,519 నన్ను క్షమించండి. 344 00:19:03,562 --> 00:19:05,438 పరవాలేదు. థాంక్స్, వాలెరీ. 345 00:19:05,522 --> 00:19:08,191 నేను చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే చెప్పండి… 346 00:19:08,858 --> 00:19:09,859 మేము చూసుకుంటాం. 347 00:19:11,194 --> 00:19:14,656 కానీ మీరు ఇంకొంచెం జామ్ చేసి ఇవ్వగలిగితే, మా అమ్మ చాలా సంతోషిస్తుంది. 348 00:19:15,156 --> 00:19:16,366 అప్పుడే ఖాళీ చేసేసిందా? 349 00:19:17,450 --> 00:19:18,451 అలాంటిదే. 350 00:19:21,413 --> 00:19:22,414 మేము వెళ్ళాలి. 351 00:19:22,497 --> 00:19:24,124 -థాంక్స్, వాలెరీ. -థాంక్యూ. 352 00:19:24,207 --> 00:19:25,208 బై. 353 00:19:25,292 --> 00:19:26,960 నేను ఇంటికి వెళ్ళాలి. 354 00:19:27,043 --> 00:19:30,088 ఈ వీకెండ్ నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు చేయాలనుకున్నది చేయకుండా చేశాను. 355 00:19:30,672 --> 00:19:34,676 లేదు, నువ్వలా ఫీలయ్యేలా చేసినందుకు సారీ. నువ్వు ఏ తప్పూ చేయలేదు. 356 00:19:35,677 --> 00:19:38,179 ట్రాక్ చేయడంలో నీకు నైపుణ్యం లేకపోయుంటే, ఈరోజు లక్కీని కనిపెట్టగలిగేవాళ్లమే కాదు. 357 00:19:38,263 --> 00:19:40,932 నువ్వు కూడా జూనియర్ ఎక్స్ప్లోరర్స్ లో చేరితే చాలా బాగుంటుంది. 358 00:19:41,516 --> 00:19:43,810 నిజంగా? థాంక్స్. 359 00:19:50,692 --> 00:19:51,902 ఏం జరుగుతోంది? 360 00:19:51,985 --> 00:19:54,446 దాని గురించి కంగారుపడకు. నాకూ, నా కొత్త బెస్ట్ ఫ్రెండ్ కి మధ్య విషయం. 361 00:19:55,697 --> 00:19:56,698 మంచి జోక్. 362 00:19:58,950 --> 00:20:01,328 ఆగు. చార్లెస్? 363 00:20:03,914 --> 00:20:06,207 లక్కీ, ఏమైంది? 364 00:20:06,291 --> 00:20:07,918 ఏం జరిగింది, లక్కీ? 365 00:20:12,339 --> 00:20:16,218 జాజీ. బుజ్జీ, నిన్ను మిస్సయ్యాను. 366 00:20:17,135 --> 00:20:19,846 -జాజీ? -నిన్ను బాగా మిస్సయ్యాను. 367 00:20:19,930 --> 00:20:21,139 వాలెరీ? 368 00:20:22,641 --> 00:20:24,184 ఏం జరుగుతోంది? 369 00:20:24,267 --> 00:20:28,813 మీరు వెళ్ళిపోయాక, నేను బెర్రీస్ కోయడానికి పెరట్లోకి వెళితే, ఇది కనిపించింది. 370 00:20:28,897 --> 00:20:30,899 అది లక్కీ కాలరా? 371 00:20:31,483 --> 00:20:33,985 అవును. కానీ తన అసలు పేరు జాజీ. 372 00:20:34,069 --> 00:20:37,906 ట్యాగ్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే, అది నా కొత్త పొరుగింటాయన ఓడెల్ ది అని తెలిసింది. 373 00:20:38,740 --> 00:20:41,952 ఈ బుజ్జి వెధవ నా కన్నుగప్పి వెనక ఫెన్సింగ్ లోంచి తప్పించుకుని 374 00:20:42,035 --> 00:20:44,037 వాలెరీ పెరట్లోకి దూరింది, 375 00:20:44,120 --> 00:20:46,957 కొన్ని బ్లాక్ బెర్రీలు తినడానికి ఆగింది. 376 00:20:47,040 --> 00:20:48,959 తనని తప్పు పట్టకూడదు. అవి చాలా రుచిగా ఉంటాయి. 377 00:20:49,042 --> 00:20:50,377 మాకు తెలుసు. 378 00:20:51,169 --> 00:20:55,090 ఏదేమైనా, దీన్ని ఇంత బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతగా నేను మీకు ఏం చేయగలను? 379 00:20:55,173 --> 00:20:58,176 ఏం వద్దు. మేము… మీరిద్దరూ కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 380 00:20:59,427 --> 00:21:02,847 ఆగండి. మీరు చెప్పినవన్నీ చేసి మాకంటే ముందుగా ఇంటికి ఎలా రాగలిగారు? 381 00:21:02,931 --> 00:21:05,725 నేను పెద్దదాన్ని. నా దగ్గర కారుంది. 382 00:21:06,601 --> 00:21:07,727 ఓహ్, అవును. 383 00:21:08,353 --> 00:21:09,354 చూశారా. 384 00:21:11,898 --> 00:21:13,358 నా దగ్గరో మంచి ఐడియా ఉంది. 385 00:21:13,441 --> 00:21:16,152 మనందరం ఆ పాత స్ప్రూస్ మ్యాన్ లో ఇరుక్కుని 386 00:21:16,236 --> 00:21:18,613 ఈరోజు రాత్రికి ఫ్యామిలీ క్యాంప్ ఏర్పాటు చేసుకుని, ట్రివియా నైట్ గడిపితే ఎలా ఉంటుంది? 387 00:21:18,697 --> 00:21:20,782 -మంచి ఆలోచనే అనిపిస్తోంది. -నాక్కూడా. 388 00:21:23,702 --> 00:21:26,162 ఈ రాత్రి గడపడానికి ఇంతకంటే మంచి ప్లాన్ నాకు తోచట్లేదు. 389 00:21:26,246 --> 00:21:27,247 హేయ్. 390 00:21:28,957 --> 00:21:29,958 వెళ్దాం పదండి. 391 00:21:40,760 --> 00:21:42,721 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 392 00:22:58,755 --> 00:23:00,757 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ