1 00:00:06,299 --> 00:00:08,802 హలో. నేనొక ఇంగ్లీష్ బుల్ డాగ్ ని. 2 00:00:08,885 --> 00:00:10,720 మీ దగ్గర ఇంగ్లీష్ కప్ కేక్ ఉందా? 3 00:00:10,804 --> 00:00:13,265 చార్లెస్, అది ఫ్రెంచ్ బుల్ డాగ్. 4 00:00:13,890 --> 00:00:14,891 అర్థమయింది. 5 00:00:15,684 --> 00:00:17,686 ఫ్రెంచ్ ఫ్రై? 6 00:00:19,437 --> 00:00:20,689 నువ్వు తమాషాగా మాట్లాడుతున్నావు. 7 00:00:25,068 --> 00:00:27,779 హాయ్. నేనొక ముద్దొచ్చే బుల్లి తెల్ల పప్పీని. 8 00:00:27,862 --> 00:00:30,448 నేను నీ టెన్నిస్ బాల్ తో ఆడుకోవచ్చా? ప్లీజ్? 9 00:00:31,199 --> 00:00:33,493 నువ్వు ఏ యాసలో మాట్లాడుతున్నావు? 10 00:00:33,577 --> 00:00:35,537 ముద్దొచ్చే బుల్లి తెల్ల పప్పీ యాస. 11 00:00:36,121 --> 00:00:38,623 అది వెస్ట్ హైల్యాండ్ వైట్ టెర్రియర్ కుక్కపిల్ల. 12 00:00:38,707 --> 00:00:40,417 ఆ జాతి స్కాట్లాండ్ లో మొదలైంది. 13 00:00:40,500 --> 00:00:42,711 స్కాట్లాండ్? నాకు వాళ్ళ ఆహారం గురించి ఏమీ తెలీదు. 14 00:00:45,755 --> 00:00:46,840 చూడు. 15 00:00:46,923 --> 00:00:50,552 దానికి టెన్నిస్ బాల్ దొరకలేదని ఎవరిదో స్వెట్ షర్ట్ తీసుకొచ్చింది. 16 00:00:50,635 --> 00:00:52,846 అది నీ స్వెట్ షర్టులాగా ఉందే. 17 00:00:53,513 --> 00:00:55,432 ఆగు. ఏంటి? 18 00:00:55,515 --> 00:00:57,309 ఓహ్, ఓరి దేవుడా. కమాన్. 19 00:00:57,392 --> 00:00:59,352 -అది ఎటు పోయింది? -నాకు తెలీదు. 20 00:00:59,436 --> 00:01:01,062 పొదల్లో వెతుకుదాం పద. 21 00:01:01,146 --> 00:01:03,023 -ఎక్కడున్నావ్? -ఇక్కడికి రా, పప్పీ. 22 00:01:03,106 --> 00:01:04,440 బయటికి రా. 23 00:01:05,650 --> 00:01:06,651 ఎక్కడున్నావ్? 24 00:01:10,363 --> 00:01:11,406 చార్లెస్. 25 00:01:20,040 --> 00:01:21,207 నువ్వు బానే ఉన్నావా? 26 00:01:23,084 --> 00:01:24,753 ఇది ఇక్కడే ఉంటోందని అనుకుంటున్నావా? 27 00:01:25,503 --> 00:01:27,797 కాలర్ లేదు. బహుశా ఎవరో వదిలేసినట్లున్నారు. 28 00:01:30,884 --> 00:01:32,844 పరవాలేదు. మాతో రా. 29 00:01:34,930 --> 00:01:36,765 కంగారు పడకు. మేమున్నాం. 30 00:01:37,724 --> 00:01:40,894 ఓహ్, అయ్యో. హాయ్. 31 00:01:40,977 --> 00:01:42,270 కమాన్. వెళ్దాం పద. 32 00:01:44,689 --> 00:01:48,193 "స్నోబాల్" 33 00:01:52,572 --> 00:01:54,032 థాంక్స్. 34 00:01:55,075 --> 00:01:58,036 థావ్ కరావొకే పార్టీలో మనం పాడిన డ్యూయట్ అందరికీ నచ్చిందని మాడిసన్ చెప్పింది. 35 00:01:58,119 --> 00:01:59,204 అవునా, మనం సాధించాం. 36 00:01:59,788 --> 00:02:01,248 కలిసి పాడతాం, కలిసి పనిచేస్తాం. 37 00:02:03,208 --> 00:02:06,836 మీరిద్దరూ బాగా చేశారు. మీరు చేసిన రీసెర్చ్ వర్క్ ని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. 38 00:02:07,462 --> 00:02:08,462 థాంక్యూ. 39 00:02:10,507 --> 00:02:13,468 నిపుణులు విశ్లేషించిన సమాచారాన్ని వాడడమే మనల్ని టాప్ లో నిలబెడుతుందని నాకు తెలుసు. 40 00:02:13,552 --> 00:02:14,553 నాకు ఏం గుర్తుకు తెచ్చిందంటే… 41 00:02:16,054 --> 00:02:17,973 కొత్త డిబేట్ టీం టి-షర్ట్స్ వచ్చాయి, 42 00:02:18,056 --> 00:02:20,016 వాళ్ళు మన డిజైన్ ని ఎంచుకున్నారు. 43 00:02:20,100 --> 00:02:21,268 చాలా బాగుంది. 44 00:02:21,351 --> 00:02:23,853 ఆగు. ఇవి ఎల్లో కలర్ లో ఉన్నాయేంటి? మనం రెడ్ ఎంచుకున్నాం కదా? 45 00:02:23,937 --> 00:02:25,689 అవును, కానీ నేను మార్చాలని నిర్ణయించాను 46 00:02:25,772 --> 00:02:28,900 ఎందుకంటే ఎల్లో బాగా కనిపిస్తుంది, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. 47 00:02:28,984 --> 00:02:30,527 రెడ్ కూడా అంతే కదా! 48 00:02:30,610 --> 00:02:33,446 దయచేసి అందరూ నేను చెప్పేది వింటారా? 49 00:02:33,530 --> 00:02:37,951 ఎడ్డీని కలవండి, ఇది మన కొత్త క్లాస్ పెట్. 50 00:02:38,034 --> 00:02:39,911 -క్లాస్ పెట్? -క్లాస్ పెట్? 51 00:02:39,995 --> 00:02:42,706 మీలో ప్రతి ఒక్కరూ రెండు వారాల పాటు ఎడ్డీని జాగ్రత్తగా చూసుకోవాలి. 52 00:02:42,789 --> 00:02:45,208 అంటే దీనికి తిండి పెట్టడం, ఇది ఉండే చోటుని శుభ్రం చేయడం, 53 00:02:45,292 --> 00:02:47,168 బోలెడంత ప్రేమ అందించడం చేయాలి. 54 00:02:47,252 --> 00:02:50,171 సరేనా? అయితే ముందుగా దీన్ని ఎవరు చూసుకుంటారు? 55 00:02:50,255 --> 00:02:51,298 నేను. 56 00:02:52,299 --> 00:02:53,633 ఓకే, మరియా. 57 00:02:53,717 --> 00:02:56,052 నీ ఉత్సాహాన్ని చూసి ఎడ్డీ ఖచ్చితంగా అభినందిస్తుంది. 58 00:02:57,095 --> 00:03:00,599 చివరికి మా నాన్నకున్న అలర్జీని పెంచకుండా ఉండే పెట్ ని నేను ఉంచుకోగలను. 59 00:03:00,682 --> 00:03:01,933 గొప్పగా ఉంది కదూ? 60 00:03:03,143 --> 00:03:04,394 అవును, ఖచ్చితంగా. 61 00:03:10,692 --> 00:03:12,360 ముందుగా మరియా దీన్ని చూసుకుంటుంది, 62 00:03:12,444 --> 00:03:15,155 ప్రతి రెండు వారాలకీ దీన్ని ఒకరినుండి మరొకరు మార్చుకుంటూ ఉండాలి. 63 00:03:15,238 --> 00:03:17,574 ఒక చిన్న బల్లి చాలా సర్దుకుపోవాలి. 64 00:03:17,657 --> 00:03:19,075 -ఖచ్చితంగా. -నాకు తెలీదు. 65 00:03:19,159 --> 00:03:22,037 -ఇదొక మంచి అనుభవంగా ఉండబోతోందని అనిపిస్తుంది. -ఎడ్డీకి కాదు. 66 00:03:22,537 --> 00:03:24,706 "గ్రాండ్ బడ్డీ"కి బదులుగా బల్లిని ఉంచుకునే అవకాశం ఉంటే బాగుండేది. 67 00:03:24,789 --> 00:03:26,958 నిజంగా? నువ్వు చాలా ఉత్సాహపడతావని అనుకున్నాను. 68 00:03:27,042 --> 00:03:29,628 రిటైర్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకా? 69 00:03:29,711 --> 00:03:31,796 నాకు గ్రాండ్ బడ్డీ ప్రోగ్రాం ఇష్టం. 70 00:03:31,880 --> 00:03:35,634 పైగా అన్నేళ్ల అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరనుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. 71 00:03:35,717 --> 00:03:38,386 వాళ్ళకు దక్కాల్సిన గౌరవం దక్కదు. 72 00:03:39,095 --> 00:03:40,722 నేనిక్కడే స్నోబాల్ తో ఆడుకుంటాను. 73 00:03:45,310 --> 00:03:47,479 దానికి ఇప్పటికే తన పేరు తెలుసు. బాగుంది. 74 00:03:48,104 --> 00:03:50,232 మీకు రెండు గుడ్ న్యూస్ ఉన్నాయి. 75 00:03:50,315 --> 00:03:53,693 స్నోబాల్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని, అది పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్ యాబీ చెప్పింది. 76 00:03:53,777 --> 00:03:56,738 అంతేకాదు, చిన్న కుక్కని పెంచుకోవాలనుకుంటున్న రెండు కుటుంబాలు తనకు తెలుసని చెప్పింది. 77 00:04:00,116 --> 00:04:01,326 మళ్ళీ నా స్వెట్ షర్టు తీసుకుందా? 78 00:04:01,409 --> 00:04:03,870 నీకోసం డాగ్ బెడ్ ఉంది, స్నోబాల్. 79 00:04:04,746 --> 00:04:06,164 నీ వాసన దానికి బాగా నచ్చినట్లుంది. 80 00:04:06,248 --> 00:04:07,707 అంటే నువ్వు దానికి నచ్చావు. 81 00:04:08,792 --> 00:04:11,378 ఆ విషయం నాకు తెలీదు. చాలా బాగుంది. 82 00:04:12,295 --> 00:04:13,672 నువ్వంటే నాకూ ఇష్టం, స్నోబాల్. 83 00:04:16,925 --> 00:04:19,803 పైన్ గ్రోవ్ రిటైర్మెంట్ హోమ్ 84 00:04:20,470 --> 00:04:22,973 నీ వయసు పిల్లలు గ్రాండ్ బడ్డీస్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఇప్పటికీ 85 00:04:23,056 --> 00:04:24,766 ఆసక్తిగా ఉన్నారని తెలుసుకోవడం గొప్ప విషయం. 86 00:04:24,849 --> 00:04:29,437 -అదీ, నిజానికి దీన్ని నేను ఎంచుకోలేదు. నేను… -ఇక్కుడున్న వారికి అది గొప్ప విషయం. 87 00:04:29,980 --> 00:04:32,232 స్టెల్లా, ఈరోజు మీరు బయటికి వెళ్ళలేదా? 88 00:04:32,315 --> 00:04:33,441 ఎందుకు కష్టపడడం? 89 00:04:33,984 --> 00:04:37,404 నేను బయటి వాతావరణాన్ని లోపలికి తెస్తున్నాను, నా కుర్చీ వదలాల్సిన పనిలేదు. 90 00:04:44,995 --> 00:04:47,539 ఇప్పుడు మీరు చేసిన పని తెలిసే చేసారనుకుంటాను, జెర్రీ. 91 00:04:47,622 --> 00:04:50,208 మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, లోయిడ్. 92 00:04:56,298 --> 00:04:57,299 వెళ్దాం పద. 93 00:05:00,510 --> 00:05:02,220 ఓటు నిరసన - భవిష్యత్తు ఆడవారిదే 94 00:05:02,304 --> 00:05:04,431 జంతు హక్కుల సంఘం 95 00:05:06,850 --> 00:05:07,851 హేయ్, రోజ్. 96 00:05:07,934 --> 00:05:10,645 మీ గ్రాండ్ బడ్డీ చార్లెస్ పీటర్సన్ ని కలుసుకోండి. 97 00:05:17,402 --> 00:05:19,404 సరే, నేను మీ ఇద్దరినీ వదిలి పెడుతున్నాను. 98 00:05:19,487 --> 00:05:22,157 ఊరికే గుర్తు చేస్తున్నా, మీ ఫిజికల్ థెరపీ నాలుగున్నరకి ఉంది. 99 00:05:22,240 --> 00:05:26,286 ఒక్క నిమిషం. నేను మౌంట్ వాషింగ్టన్ ఎక్కానని నీకు తెలుసు కదా. 100 00:05:26,369 --> 00:05:29,497 నాకు ఫిజికల్ థెరపీ అవసరం లేదని కూడా నీకు తెలుసు. 101 00:05:30,123 --> 00:05:33,209 -నా పరిస్థితి… -చాలా గొప్పగా ఉంది. 102 00:05:33,293 --> 00:05:34,669 -ఆ-హా. -థాంక్యూ. 103 00:05:34,753 --> 00:05:36,838 -కానీ మీరది చేస్తే మంచిది. -అవును. 104 00:05:44,512 --> 00:05:45,931 హాయ్. నేను చార్లెస్. 105 00:05:46,014 --> 00:05:48,391 మేఘాల్లోకి పయనించండి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వతారోహణలు 106 00:05:50,268 --> 00:05:51,811 అయితే మనిద్దరం కలిసి నడుద్దామా? 107 00:05:51,895 --> 00:05:53,271 వద్దు. 108 00:05:53,897 --> 00:05:55,815 ఓకే, లేదంటే ఏదైనా బోర్డ్ గేమ్ ఆడదామా? 109 00:05:55,899 --> 00:05:57,859 మూడ్ లేదు. 110 00:05:58,985 --> 00:06:00,737 మీకసలు ఏదైనా చేయాలని ఉందా? 111 00:06:02,405 --> 00:06:03,531 చూడు, చార్లీ… 112 00:06:04,991 --> 00:06:09,246 నేను ఈ బడ్డీ ప్రోగ్రాంకి అంగీకరించలేదు. నా జీవితం మొత్తం నేను స్వతంత్రంగానే ఉన్నాను. 113 00:06:09,329 --> 00:06:12,499 పరవాలేదు. నిజానికి నేను కూడా చేయాలనుకోలేదు. 114 00:06:12,582 --> 00:06:14,668 స్కూలు కోసం చేయాల్సి వచ్చింది. 115 00:06:14,751 --> 00:06:17,796 సరే, నువ్వు ఏం చేయాలో వేరే వాళ్ళతో ఎప్పుడూ చెప్పించుకోకూడదు. 116 00:06:18,588 --> 00:06:19,798 నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. 117 00:06:20,382 --> 00:06:21,424 అర్థమయింది. 118 00:06:23,718 --> 00:06:28,014 సరే, నేనిక్కడ గంటైనా గడపాలి. కాబట్టి ఏదైనా పుస్తకం చదువుకుంటా. 119 00:06:28,098 --> 00:06:31,351 ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి మా కొత్త ఫాస్టర్ కుక్కపిల్లతో ఆడుకుంటాను. 120 00:06:33,311 --> 00:06:35,105 ఎవరైనా పెంచుకునేవరకూ కుక్కపిల్లని చూసుకుంటున్నారా? 121 00:06:35,188 --> 00:06:37,524 అది చాలా మంచి విషయం. 122 00:06:38,191 --> 00:06:40,694 అవును. నాకు, మా అక్కకీ చాలా ఇష్టం. 123 00:06:41,194 --> 00:06:42,737 దీని గురించి నువ్వేమంటావ్? 124 00:06:43,863 --> 00:06:50,453 ఒకసారి నేను 400ల ఏళ్ళనాటి ఓక్ చెట్టు కొట్టేయకుండా ఉండడానికి మూడు రోజుల పాటు 125 00:06:50,537 --> 00:06:52,956 దానితో సహా సంకెళ్ళు వేసుకుని కూర్చున్నాను. 126 00:06:55,333 --> 00:06:57,586 తనకు ఇష్టమైన 400ల ఏళ్ళనాటి ఓక్ చెట్టును కాపాడిన యువతి 127 00:06:57,669 --> 00:07:00,547 -అబ్బో, చాలా గొప్ప పని చేశారు. -నేనూ అదే అనుకుంటాను. 128 00:07:09,264 --> 00:07:11,766 ఓకే, స్నోబాల్. రెడీ? వెళ్లి తాడు తీసుకురా. 129 00:07:16,897 --> 00:07:18,982 అర్థమయింది. నీకు నచ్చినవే తెస్తావన్నమాట. 130 00:07:22,152 --> 00:07:25,447 హాయ్. నీ గ్రాండ్ బడ్డీ ఎలా ఉన్నారు? 131 00:07:26,114 --> 00:07:29,910 ఆవిడ బానే ఉంది. ఈసారి నాతోపాటు మాంగాగానీ, ఇంకేదైనా బుక్ తీసుకెళ్తాను. 132 00:07:30,952 --> 00:07:32,871 మొదటి కుటుంబానికి స్నోబాల్ నచ్చిందా? 133 00:07:33,622 --> 00:07:37,125 చూడగానే వాళ్ళకి నచ్చింది, కానీ ఇది వాళ్ళతో ఉండడాన్ని ఇష్టపడలేదు. 134 00:07:37,208 --> 00:07:39,377 ముఖ్యంగా వాళ్ళు దీన్ని ఎత్తుకోవాలనుకోవడం దీనికి నచ్చలేదు. 135 00:07:41,755 --> 00:07:43,965 ఓకే, స్నోబాల్, ఇది నీకు రెండో అవకాశం. 136 00:07:44,049 --> 00:07:46,301 ఈసారి వాళ్ళతో బాగా ప్రవర్తించాలి. 137 00:07:47,844 --> 00:07:49,221 హేయ్, స్నోబాల్, ఆగు. 138 00:07:56,102 --> 00:07:59,940 ఓకే. కమాన్, స్నోబాల్. ఆడుకోవాలని ఉందా? ఆడుకోవాలని ఉందా? 139 00:08:01,274 --> 00:08:03,693 అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. 140 00:08:04,194 --> 00:08:06,529 పరవాలేదు. మాకేమీ తొందర లేదు. 141 00:08:08,823 --> 00:08:10,867 అలిసిపోయింది. 142 00:08:12,577 --> 00:08:13,787 ఇక్కడికి రా. 143 00:08:18,750 --> 00:08:21,294 దానికి ఎత్తుకోవడం ఇప్పుడు ఇష్టం లేదనుకుంటా. 144 00:08:22,295 --> 00:08:23,964 పరవాలేదు. 145 00:08:24,047 --> 00:08:27,384 మేము నిన్ను నిమురుతాం, స్నోబాల్. నీకు ఇష్టమేనా? 146 00:08:31,972 --> 00:08:33,472 అది కూడా వద్దంట. 147 00:08:47,320 --> 00:08:48,905 క్లాస్ పెట్ ఎందుకు ఉండకూడదు 148 00:08:50,699 --> 00:08:53,952 -హేయ్, మరియా, ఇప్పుడే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా. -లిజ్జీ, ఇది చూడు. 149 00:08:56,288 --> 00:08:58,748 నేను ఎడ్డీ కోసం వెచ్చని రాయి ఉంచాను, మధ్యలో ఖాళీ ఉన్న చెక్క ఉంచాను 150 00:08:58,832 --> 00:09:00,792 తినడానికి కొన్ని ఫ్రెష్ మొక్కలు పెట్టాను. 151 00:09:00,875 --> 00:09:02,544 అవును. బాగా చేశావు. 152 00:09:02,627 --> 00:09:05,088 నేను కొంత రీసెర్చ్ చేశాను, నిజాయితీగా చెబుతాను. 153 00:09:05,171 --> 00:09:07,841 క్లాస్ పెట్ ప్రోగ్రాం మంచి ఆలోచన అని నాకు అనిపించడం లేదు. 154 00:09:08,675 --> 00:09:11,052 నిజంగా? నేనది చాలా మంచి ప్రోగ్రాం అనుకున్నాను. 155 00:09:11,136 --> 00:09:14,806 అంటే, ఎడ్డీ గానీ, ఏ ఇతర జంతువు సంక్షేమం గురించి గానీ దృష్టిలో పెట్టుకుంటే 156 00:09:14,890 --> 00:09:16,474 ఇది గొప్ప ప్రోగ్రాం కాదు. 157 00:09:16,558 --> 00:09:20,729 ఎడ్డీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే, నేను దాన్ని చాలా బాగా చూసుకుంటాను. 158 00:09:21,605 --> 00:09:23,440 నేను చెప్పాలనుకున్నది అది కాదు. 159 00:09:23,523 --> 00:09:25,275 మరైతే ఏం చెబుతున్నావు? 160 00:09:26,401 --> 00:09:30,614 ఎడ్డీకి నిరంతరం సంరక్షణ కావాలి, దాన్ని ప్రతి రెండు వారాలకొకసారి మార్చకూడదు. 161 00:09:30,697 --> 00:09:34,242 క్లాస్ పెట్ ప్రోగ్రాంని ఆపేయమని రేపు మిస్టర్ గ్రిఫిన్ ని అడగాలనుకుంటున్నాను. 162 00:09:34,326 --> 00:09:37,662 నాతో ముందు మాట్లాడకుండా నువ్వు మిస్టర్ గ్రిఫిన్ దగ్గరికీ వెళ్తావంటే నమ్మలేకపోతున్నాను. 163 00:09:37,746 --> 00:09:39,080 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా 164 00:09:39,164 --> 00:09:43,460 లేదు, మనం మాట్లాడుకోవట్లేదు. నువ్వు ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని నాకు చెబుతున్నావు. 165 00:09:43,543 --> 00:09:45,295 డిబేట్ టి-షర్ట్స్ విషయంలో కూడా ఇలాగే చేశావు. 166 00:09:46,129 --> 00:09:47,964 నువ్వు ఇప్పటికీ టి-షర్ట్స్ గురించి కోపంగా ఉన్నావా? 167 00:09:48,048 --> 00:09:51,301 లేదు. నాకు కోపం ఎందుకు వచ్చిందంటే, మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలి, 168 00:09:51,384 --> 00:09:53,220 కానీ నా ఆలోచనల గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. 169 00:09:53,303 --> 00:09:55,096 అది నిజం కాదు, మరియా. 170 00:09:55,180 --> 00:09:57,307 ఎడ్డీకి ఏది మంచిదో అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 171 00:09:57,390 --> 00:09:58,725 నేనలా చెయ్యట్లేదా? 172 00:10:00,310 --> 00:10:01,770 నేను దీనికి తిండి పెట్టాలి. 173 00:10:16,952 --> 00:10:18,328 వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? 174 00:10:20,538 --> 00:10:21,623 వెళ్లక తప్పదు కదా. 175 00:10:22,874 --> 00:10:25,085 నీ గ్రాండ్ బడ్డీని కలవడానికి అంత ఉత్సాహంగా ఉందా? 176 00:10:25,168 --> 00:10:28,838 ఆవిడ కుర్చీలో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. కానీ పరవాలేదు. 177 00:10:28,922 --> 00:10:30,257 పరవాలేదా? 178 00:10:30,340 --> 00:10:33,552 అంటే, అదేమంత పెద్ద విషయం కాదు. నేనక్కడికి వెళ్ళడం ఆవిడకి ఇష్టం లేదు. 179 00:10:34,886 --> 00:10:36,888 చార్లెస్, నువ్వు తిరిగి వెళ్ళాలని ఆవిడ కోరుకోకపోతే, 180 00:10:36,972 --> 00:10:38,557 మనకి ఆ విషయం ఇప్పటికే తెలిసి ఉండేది. 181 00:10:38,640 --> 00:10:41,560 నాకు తెలీదు. మా ఇద్దరిలో కలిసే అంశం ఒక్కటి కూడా లేదు. 182 00:10:41,643 --> 00:10:43,436 ప్రతి ఒక్కరిలో కలిసే అంశం ఏదో ఒకటి ఉంటుంది, 183 00:10:43,520 --> 00:10:47,107 ఎంత పెద్ద వాళ్లైనా, ఎంత చిన్న వాళ్లైనా, ఎలా కనిపించినా లేక ఎక్కడినుండి వచ్చినా ఏదో ఒకటి కలుస్తుంది. 184 00:10:47,190 --> 00:10:50,193 కొన్నిసార్లు అదేంటో కనిపెట్టడానికి కొంత సమయం పడుతుంది. 185 00:10:50,819 --> 00:10:52,279 నీ గురించి నాకు తెలుసు, చార్లెస్. 186 00:10:52,362 --> 00:10:54,990 ఆ సంబంధాన్ని నువ్వు కనిపెట్టాలనుకుంటే కనిపెట్టగలవు. 187 00:10:55,073 --> 00:10:57,492 కానీ అలా అనుకోకపోయినా పరవాలేదు. 188 00:10:58,451 --> 00:10:59,828 కారు దగ్గరికి వస్తాను. 189 00:11:08,336 --> 00:11:09,880 హాయ్, రోజ్. 190 00:11:09,963 --> 00:11:11,423 చార్లీ. 191 00:11:13,884 --> 00:11:15,886 నాకోసం భోజనం తెచ్చావా, మంచిది. 192 00:11:15,969 --> 00:11:17,387 కబాబ్స్ తప్ప ఏం తెచ్చినా సరే. 193 00:11:17,470 --> 00:11:20,265 ఇక్కడ రోజు మార్చి రోజు ఏదో ఒక కబాబ్స్ పెడతారు. 194 00:11:20,849 --> 00:11:23,393 ఇది భోజనం కాదు. ఇది స్నోబాల్. 195 00:11:23,935 --> 00:11:25,812 మీకు పరిచయం చేయాలనుకున్న ఫాస్టర్ కుక్కపిల్ల. 196 00:11:26,396 --> 00:11:30,525 చార్లెస్, ఇంకొకరిని తీసుకురావచ్చని నేను చెప్పలేదే. 197 00:11:30,609 --> 00:11:32,986 ఆ మాటకొస్తే, నువ్వు ఇక్కడికి రావడాన్ని కూడా నేను వెంటనే ఒప్పుకోలేదు. 198 00:11:33,069 --> 00:11:35,196 సరే, మీరు దీన్ని కలవాలనుకున్నారని అనుకున్నాను. 199 00:11:35,280 --> 00:11:36,615 నన్ను క్షమించు. 200 00:11:37,324 --> 00:11:39,284 నాకు కుక్కలంటే పెద్ద ఇష్టం లేదు. 201 00:11:41,453 --> 00:11:44,497 కంగారు పడకండి. నా ఉద్దేశం, ఇది ఇక్కడ ఉన్న విషయం కూడా మీరు గమనించరు. 202 00:11:47,000 --> 00:11:49,044 చూశారా? దానంతట అదే తిరిగేస్తుంది. 203 00:11:49,127 --> 00:11:50,295 కనిపిస్తోంది. 204 00:11:54,341 --> 00:11:56,760 నిజానికి దాన్ని మేము పార్కులో కనిపెట్టాం. 205 00:11:56,843 --> 00:11:59,804 అది పొదల వెనక సొంతగా ఇంటిని నిర్మించుకుంది. 206 00:12:00,388 --> 00:12:01,932 అది నీకు గొప్ప విషయంలా అనిపిస్తుందా? 207 00:12:02,515 --> 00:12:07,270 నేను అలాస్కాలో ఉన్న డెనాలిలో పదమూడు నెలలపాటు చలిలో గడిపాను, 208 00:12:07,354 --> 00:12:11,608 అథబాస్కన్ తెగ వాళ్ళ భూమి హక్కుల్ని కాపాడడం కోసం వారితో కలిసి పోరాడాను. 209 00:12:12,359 --> 00:12:13,526 వావ్. 210 00:12:14,444 --> 00:12:16,821 "వావ్"లాగే ఉంటుంది. నీకో విషయం చెప్పనా? 211 00:12:20,492 --> 00:12:24,204 ఆ తెగవారు అభినందనగా దీన్ని చేసి ఇచ్చారు. 212 00:12:30,877 --> 00:12:32,212 ఎలా ఉంది? 213 00:12:33,922 --> 00:12:37,467 చాలా బాగుంది కదూ? దాన్ని జాగ్రత్తగా పట్టుకో, సరేనా? 214 00:12:44,641 --> 00:12:47,310 జెర్రీ వాకర్ లోంచి ఆ బాల్ తీసుకొచ్చింది. 215 00:12:50,146 --> 00:12:51,731 స్నోబాల్, తప్పు. 216 00:12:52,357 --> 00:12:54,192 లేదు, లేదు, పరవాలేదు. 217 00:12:54,276 --> 00:12:56,778 ఆయన దగ్గర ఒక అర నిండా బాల్స్ ఉన్నాయి. 218 00:13:07,372 --> 00:13:09,082 ఓరి దేవుడా. 219 00:13:11,293 --> 00:13:13,628 నేనిలా నవ్వి ఎంతో కాలమైంది. 220 00:13:17,090 --> 00:13:19,593 ఇంతకీ ఇది ఏ జాతి కుక్క? 221 00:13:19,676 --> 00:13:21,720 ఇది స్కాట్లాండ్ కి చెందిన వెస్ట్ హైలాండ్ టెర్రియర్. 222 00:13:23,388 --> 00:13:24,848 ఇప్పుడు కూడానా? 223 00:13:25,807 --> 00:13:30,562 నేను కాలితో తన్నడానికి వీలుగా, ఆ బాల్ ని 224 00:13:30,645 --> 00:13:32,522 కొంచెం దగ్గరికి తీసుకొస్తావా? 225 00:13:36,735 --> 00:13:39,070 అది మొండిది కదూ? 226 00:13:39,154 --> 00:13:40,280 ఖచ్చితంగా. 227 00:13:41,656 --> 00:13:43,742 నాకు తెలిసిన ఒక వ్యక్తిని గుర్తు చేసింది. 228 00:13:43,825 --> 00:13:45,076 ఎవరిని? 229 00:13:57,088 --> 00:13:58,465 చిన్న బ్రేక్ తీసుకుంటావా తల్లీ? 230 00:14:00,508 --> 00:14:02,677 చాలా సేపటి నుండి హోంవర్క్ చేస్తూనే ఉన్నావు. 231 00:14:03,929 --> 00:14:04,930 వద్దులే. 232 00:14:05,013 --> 00:14:07,557 ఇది హోంవర్క్ కాదు. లాభనష్టాల జాబితా తయారు చేస్తున్నాను. 233 00:14:08,141 --> 00:14:10,685 -మనం దేని లాభనష్టాల గురించి మాట్లాడుతున్నాం? -క్లాస్ పెట్స్. 234 00:14:12,229 --> 00:14:13,730 నేను నిష్పాక్షికంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, 235 00:14:13,813 --> 00:14:16,983 కానీ లాభాల గురించి ఏం రాయాలో నాకు తెలియడం లేదు, 236 00:14:17,067 --> 00:14:19,861 నా బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతూనే ఉంటానన్న ఒక్క లాభమే కనిపిస్తుంది. 237 00:14:20,654 --> 00:14:22,906 నువ్వు మరియా అభిప్రాయాలు కూడా వింటే, 238 00:14:22,989 --> 00:14:25,450 నువ్వు మరిన్ని లాభాల గురించి రాయగలవని ఖచ్చితంగా చెప్పగలను. 239 00:14:25,533 --> 00:14:26,534 కానీ తను చెప్పేది తప్పు. 240 00:14:26,618 --> 00:14:30,038 నువ్వు తనతో ఏకీభవించాలని నేను చెప్పడం లేదు, కానీ వినడం వల్ల పోయేదేమీ లేదు. 241 00:14:31,581 --> 00:14:35,585 అమ్మా, నువ్వు దీన్ని ఎందుకు ఉతికావు? ఇది స్నోబాల్ ఫేవరేట్. గుర్తుందా? 242 00:14:35,669 --> 00:14:38,505 నీకు వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ స్నోబాల్ మరొకటి అందుకుంది. 243 00:14:48,306 --> 00:14:49,474 కమాన్, స్నోబాల్. 244 00:14:55,981 --> 00:14:57,274 హేయ్, మళ్ళీ వచ్చావా! 245 00:14:58,775 --> 00:15:01,236 నువ్వు ఇక్కడికి వారానికి రెండుసార్లు వస్తే చాలు. 246 00:15:01,861 --> 00:15:04,781 అదీ, నేనిది తిరిగిద్దామని వచ్చాను. స్నోబాల్ దీన్ని తీసుకుంది. 247 00:15:06,283 --> 00:15:07,659 అది ఎక్కడికి పోయిందా అనుకున్నాను. 248 00:15:07,742 --> 00:15:10,245 ఇక్కడినుండి వెళ్ళినప్పటి నుండీ అది దాంతోనే పడుకుంది. 249 00:15:10,328 --> 00:15:11,705 నిజమా? 250 00:15:11,788 --> 00:15:13,707 అవును. దానికి మీరు నచ్చారని అర్థం. 251 00:15:14,291 --> 00:15:15,292 చాలా నచ్చారు. 252 00:15:17,460 --> 00:15:19,796 అదీ, దీన్ని నీకు ఇవ్వాలనే ఉంది బంగారం, కానీ… 253 00:15:19,880 --> 00:15:23,258 లేదు, మీరే ఉంచుకోండి. అలాగే స్నోబాల్ ని కూడా పెంచుకోండి. 254 00:15:23,341 --> 00:15:26,261 నేనా? కుక్కని పెంచుకోవాలా? 255 00:15:26,344 --> 00:15:28,179 లేదు, లేదు, లేదు. నా వల్ల కాదు. 256 00:15:28,263 --> 00:15:29,264 అవును, పెంచుకోగలరు. 257 00:15:29,347 --> 00:15:31,600 స్నోబాల్ అంత తేలిగ్గా పెంచదగిన కుక్కపిల్లని నేనింతవరకూ చూడలేదు. 258 00:15:31,683 --> 00:15:33,518 దానికోసం మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. 259 00:15:33,602 --> 00:15:35,645 అది చాలా స్వతంత్రంగా ఉంటుంది. అచ్చం మీలాగే. 260 00:15:36,354 --> 00:15:37,856 అదీ, చార్లీ, నేను… 261 00:15:37,939 --> 00:15:40,400 కాదని చెప్పినా మీరు దాన్ని ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. 262 00:15:40,483 --> 00:15:41,818 అది నాకు నచ్చిందనడంలో సందేహం లేదు. 263 00:15:41,902 --> 00:15:43,403 అది నాకు చాలా బాగా నచ్చింది. 264 00:15:44,112 --> 00:15:45,864 మరైతే దాన్ని ఎందుకు పెంచుకోరు? 265 00:15:47,908 --> 00:15:50,452 ఇక్కడ కుక్కల్ని పెంచుకోవడానికి అనుమతి లేదు. 266 00:16:10,472 --> 00:16:13,141 నువ్వు నిజంగానే క్లాస్ పెట్స్ లాభనష్టాల గురించి రాశావా? 267 00:16:13,225 --> 00:16:15,227 ఖచ్చితంగా రాశాను. నువ్వు కూడా రాసే ఉంటావు. 268 00:16:16,061 --> 00:16:17,062 ఖచ్చితంగా. 269 00:16:17,145 --> 00:16:19,981 సరే అయితే, డిబేటర్స్. డిబేట్ మొదలుపెట్టండి. 270 00:16:20,065 --> 00:16:23,568 మన కో-కెప్టెన్స్ లిజ్జీ, మరియాలిద్దరూ దీన్ని మొదలు పెడతారు. 271 00:16:23,652 --> 00:16:24,861 మీరు టాపిక్ ఎంచుకున్నారా? 272 00:16:26,029 --> 00:16:27,364 క్లాస్… 273 00:16:27,447 --> 00:16:29,157 పెట్స్? 274 00:16:29,241 --> 00:16:32,077 నిజానికి "పెంపుడు జంతువులు ఉంచుకోకూడదు" అని ఎలాంటి నియమం లేదు. 275 00:16:32,160 --> 00:16:35,372 -ఆగు… నా పెన్ ఎక్కడికి పోయింది? -సరే, అయితే రోజ్ స్నోబాల్ ని పెంచుకోవచ్చు. 276 00:16:35,997 --> 00:16:38,875 -అది మంచి ఐడియా అని అనుకోవడం లేదు. -కానీ మీరు చెప్పింది… 277 00:16:38,959 --> 00:16:40,669 నాకు తెలుసు. కానీ… 278 00:16:42,087 --> 00:16:46,007 రోజ్ కు తనంతట తానుగా కుక్కను పెంచగల సామర్థ్యం ఉందని నేను అనుకోవడం లేదు. 279 00:16:46,091 --> 00:16:48,260 అవును, కానీ స్నోబాల్ ని ఎవరూ చూసుకోవాల్సిన అవసరం లేదు. 280 00:16:48,343 --> 00:16:51,930 అందుకే అది ఆమెకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అది ఇక్కడ ఉందన్న విషయం కూడా మీరు గమనించరు. 281 00:16:52,013 --> 00:16:55,892 చార్లెస్, రోజ్ కోసం ఇలా చేయాలనుకుంటున్నందుకు అభినందిస్తున్నాను. 282 00:16:55,976 --> 00:16:57,018 థాంక్యూ. 283 00:16:57,102 --> 00:17:00,480 నన్ను నమ్ము, ఇక్కడి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకోవడమే నా బాధ్యత. 284 00:17:01,147 --> 00:17:03,275 కానీ ఇక్కడ సరిపడినంత మంది స్టాఫ్ లేరు, 285 00:17:03,358 --> 00:17:06,945 కాబట్టి ఇక్కడ కుక్క ఉంటే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. 286 00:17:16,371 --> 00:17:19,373 మన మొదటి టాపిక్ క్లాస్ పెట్స్. 287 00:17:19,457 --> 00:17:22,043 లిజ్జీ, మరియా ఒకరితో ఒకరు ముఖాముఖి తలపడబోతున్నారు. 288 00:17:22,127 --> 00:17:24,629 మరియా లాభాలు చెబుతుంది, లిజ్జీ నష్టాలు చెబుతుంది. 289 00:17:25,255 --> 00:17:27,340 -గుడ్ లక్. -అవసరం లేదు. 290 00:17:27,424 --> 00:17:30,427 లాభాల గురించి మాట్లాడాలి. మరియా? 291 00:17:30,510 --> 00:17:31,678 థాంక్యూ, మిసెస్ డన్. 292 00:17:31,761 --> 00:17:33,263 ప్రియమైన తోటి క్లబ్ సభ్యులారా, 293 00:17:33,346 --> 00:17:35,724 క్లాస్ పెట్ అనేది ప్రతి క్లాసుకీ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది, 294 00:17:35,807 --> 00:17:37,934 స్టూడెంట్స్ కీ, టీచర్ లకీ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. 295 00:17:38,018 --> 00:17:39,519 -ఏంటి… -పెట్ సంగతేంటి, మరియా? 296 00:17:39,603 --> 00:17:40,937 దానికి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది? 297 00:17:41,021 --> 00:17:42,606 దీనికి సమాధానం? దానికేమీ ప్రయోజనం ఉండదు. 298 00:17:42,689 --> 00:17:45,984 లిజ్జీ, నీ వంతు వచ్చే వరకూ నువ్వు ఎదురుచూడాలి. 299 00:17:47,027 --> 00:17:49,195 అవును, మీరు చెప్పింది నిజమే. నాకు తెలుసు. 300 00:17:49,696 --> 00:17:51,489 తనకి తెలుసు, కానీ ఆమె పట్టించుకోదు. 301 00:17:51,573 --> 00:17:54,826 తను ఎప్పటిలాగే ముందుగానే నిర్ణయం తీసేసుకుంది. 302 00:17:55,327 --> 00:17:57,495 ఎప్పటిలాగానా, మరియా? నిజంగా? 303 00:17:57,579 --> 00:17:58,580 -ఖచ్చితంగా. -ఓకే. 304 00:18:01,625 --> 00:18:05,128 ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు కొనసాగించాలని అనుకుంటే, 305 00:18:05,212 --> 00:18:08,089 మీరిద్దరూ ఒకరు చెప్పింది ఒకరు వినాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. 306 00:18:08,673 --> 00:18:11,968 మీరు కో-కెప్టెన్స్. లీడర్స్. 307 00:18:12,761 --> 00:18:14,304 దయచేసి అలాగే ప్రవర్తిస్తారా? 308 00:18:16,681 --> 00:18:20,560 మేము బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇప్పటికీ అలాగే ఉన్నామని అనుకుంటున్నాను. 309 00:18:21,394 --> 00:18:23,271 మరియా, నువ్వు కొనసాగించాలనుకుంటున్నావా? 310 00:18:24,773 --> 00:18:28,443 నేను ముందు చెప్పినట్లుగా, క్లాస్ పెట్స్ ఏర్పాటు చేయడం ద్వారా 311 00:18:28,526 --> 00:18:31,404 టీచర్లు పిల్లలకు బాధ్యతను, సహానుభూతిని నేర్పిస్తారు. 312 00:18:31,488 --> 00:18:34,407 చిన్న చిన్న జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా పిల్లులు, కుక్కల వంటి 313 00:18:34,491 --> 00:18:37,410 పెద్ద జంతువులను ఎలా చూసుకోవాలో పిల్లలకు తెలుస్తుంది. 314 00:18:38,370 --> 00:18:40,997 అలాగే ఇంట్లో పెట్స్ ని పెంచుకోవడానికి వీలులేని పిల్లలకు 315 00:18:41,081 --> 00:18:44,000 వాళ్ళకు అప్పటివరకూ దొరకని అనుభూతిని పొందే అవకాశం దొరుకుతుంది. 316 00:18:44,668 --> 00:18:47,921 కొంతమంది పిల్లలు మిగిలిన వారికంటే క్లాస్ పెట్స్ ని బాగా చూసుకోవచ్చు, 317 00:18:48,547 --> 00:18:51,299 జాలి గుణమనే అమూల్యమైన పాఠాన్ని పిల్లలందరూ నేర్చుకుంటారు. 318 00:18:54,678 --> 00:18:58,306 ఉద్దేశం మంచిదైనప్పటికీ, క్లాస్ పెట్స్ కార్యక్రమం వల్ల జంతువులకు మేలు జరగదు. 319 00:18:58,390 --> 00:19:01,643 అన్ని పరిమాణాల్లో ఉండే జంతువులకు నమ్మకం ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది, 320 00:19:01,726 --> 00:19:05,355 అలాంటప్పుడు ఇళ్ళను మార్చుతూ ఉంటే అది జరిగే అవకాశం ఉండదు. 321 00:19:11,528 --> 00:19:14,864 కానీ నేను ఊహించని కొన్ని విషయాల్ని మరియా ప్రస్తావించింది. 322 00:19:14,948 --> 00:19:19,035 మరో సజీవ ప్రాణి బాగోగులు చూసుకోవడం అనేది మనం చేయగల ముఖ్యమైన విషయాల్లో ఒకటి. 323 00:19:19,119 --> 00:19:20,120 వాటికీ… 324 00:19:21,496 --> 00:19:22,539 అలాగే మనకు కూడా. 325 00:19:23,331 --> 00:19:26,793 కానీ ఆ సజీవ ప్రాణికి బాధ కలుగుతుందన్నప్పుడు అది జరగకూడదు. 326 00:19:29,254 --> 00:19:31,673 క్షమించండి, మీరిద్దరూ పక్షాలు మార్చుకున్నారా? 327 00:19:34,092 --> 00:19:37,554 లేదు, వాస్తవానికి మేమిద్దరం ఒకే పక్షంలో ఉన్నాం. 328 00:19:44,019 --> 00:19:45,395 సరే, ఇప్పుడు నాకు బాధగా ఉంది. 329 00:19:46,104 --> 00:19:48,231 క్లాస్ పెట్ ప్రోగ్రాం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి 330 00:19:48,315 --> 00:19:51,902 కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆ జంతువు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 331 00:19:55,363 --> 00:19:57,782 మిస్టర్ గ్రిఫిన్, మనం 'క్లాస్ పెట్'ని 'క్లాస్ ప్లాంట్'తో… 332 00:19:57,866 --> 00:19:59,159 మార్చితే ఎలా ఉంటుంది? 333 00:19:59,993 --> 00:20:03,246 వాటికి కూడా ప్రేమ కావాలి, అది బాధ్యతని నేర్పిస్తుంది. 334 00:20:03,330 --> 00:20:06,750 ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారడం వల్ల మొక్క బాధపడదు. 335 00:20:07,542 --> 00:20:10,045 నిజానికి ఆ ఐడియా నాకు నచ్చింది. 336 00:20:11,838 --> 00:20:15,717 ఇదిగోండి. నాకంటే దీన్ని బాగా చూసుకోండి. సరేనా? 337 00:20:16,343 --> 00:20:17,969 కంగారు పడకండి. నేను బాగా చూసుకుంటాను. 338 00:20:19,512 --> 00:20:23,892 -ఇప్పుడు ఎడ్డీ సంగతి ఏం చేద్దాం? -దాన్ని మరియానే ఉంచుకుంటే బాగుంటుంది. 339 00:20:25,477 --> 00:20:28,271 నేను సంతోషంగా ఉంచుకుంటాను, అలాగే మా నాన్న కూడా. 340 00:20:28,772 --> 00:20:30,815 ఆయనకీ, ఎడ్డీకి మధ్య అనుబంధం పెరిగింది. 341 00:20:31,441 --> 00:20:32,525 చాలా బాగుంది. 342 00:20:33,193 --> 00:20:34,402 థాంక్యూ. 343 00:20:35,070 --> 00:20:37,447 ఇకపై మనకి ఏ విషయం మీదైనా బేధాభిప్రాయాలు ఉంటే, 344 00:20:37,530 --> 00:20:39,449 మనం సరిగ్గానే ఆలోచిస్తున్నామని మనకి ఎంతగా అనిపించినప్పటికీ… 345 00:20:39,532 --> 00:20:41,618 మనం ఒకరు చెప్పేది ఒకరు వినాలి. 346 00:20:42,244 --> 00:20:44,955 ఆ మాటకొస్తే, రెడ్ కలర్ షర్టు కూడా బాగుంది. 347 00:20:45,538 --> 00:20:46,539 నిజంగా? 348 00:20:47,540 --> 00:20:50,335 నాకు తెలీదు. ఎల్లో నాకిప్పుడు బాగా అనిపిస్తోంది. 349 00:20:54,631 --> 00:20:56,758 చార్లెస్, నువ్వు… 350 00:20:59,302 --> 00:21:00,387 ఎవరినైనా చూశావా? 351 00:21:00,971 --> 00:21:01,972 నన్ను అనుసరించండి. 352 00:21:10,772 --> 00:21:12,399 ఏంటిదంతా? 353 00:21:12,482 --> 00:21:14,609 స్నోబాల్ ఇక్కడ ఉండదగింది అనడానికి రుజువు. 354 00:21:16,194 --> 00:21:20,532 హేయ్, లోయిడ్. ఇక్కడ ఇన్నాళ్లుగా కుక్క ఉందా? 355 00:21:20,615 --> 00:21:23,577 నాకు ముందే తెలిసుంటే, నేను ఎప్పుడో బయటికి వచ్చేదాన్ని. 356 00:21:23,660 --> 00:21:26,413 దీన్ని రహస్యంగా ఉంచినందుకు సిగ్గుపడు, లోయిడ్. 357 00:21:29,124 --> 00:21:32,043 హేయ్, లోయిడ్. నీకేమైనా సాయం కావాలా? 358 00:21:32,836 --> 00:21:34,045 అంటే, ఎలాంటి సాయమైనా సరే? 359 00:21:34,129 --> 00:21:36,548 లేదు, జెర్రీ, పర్వాలేదు. అడిగినందుకు థాంక్స్. 360 00:21:37,215 --> 00:21:38,341 ఎప్పుడైనా సరే ఫ్రెండ్. 361 00:21:38,425 --> 00:21:40,093 ఇంతకీ విషయమేంటంటే… 362 00:21:40,176 --> 00:21:41,428 నువ్వు దీన్ని పడేసుకున్నావు. 363 00:21:42,012 --> 00:21:46,391 స్నోబాల్ ఇక్కడున్న అందరికీ మంచి తోడుగా ఉంటుందని నా అభిప్రాయం. 364 00:21:46,474 --> 00:21:47,726 నాకు అర్థమయింది, జెర్రీ. 365 00:21:51,730 --> 00:21:53,690 అయితే, ఏమంటారు? 366 00:21:53,773 --> 00:21:56,484 ఇక్కడ స్నోబాల్ ని చూసి ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు. 367 00:21:57,485 --> 00:21:59,070 హేయ్, లోయిడ్. 368 00:21:59,863 --> 00:22:03,491 నువ్వు ఇక్కడికి వచ్చి స్నోబాల్ కోసం బాల్ విసరొచ్చు కదా? 369 00:22:04,075 --> 00:22:07,329 నేను చేయొచ్చు, కానీ నేను ఫిజికల్ థెరపీ చేస్తున్నాను, 370 00:22:07,412 --> 00:22:09,539 నాకిది చేయడం ఇష్టమని నీకు తెలుసు కదా! 371 00:22:10,790 --> 00:22:11,791 అయితే? 372 00:22:13,710 --> 00:22:14,961 తప్పకుండా, రోజ్. 373 00:22:15,837 --> 00:22:18,965 మంచిది, చాలా సంతోషం. ఈ బుజ్జి దాన్ని చూడు. 374 00:22:36,733 --> 00:22:39,027 -నిజంగానే అంటున్నావా? -అవును. 375 00:22:39,694 --> 00:22:42,822 అవును, ఈ యులిసిస్ ఎస్. ప్లాంట్ బతుకుతుందని నాకు అనిపించడం లేదు. 376 00:22:43,323 --> 00:22:44,866 ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా బతకదు. 377 00:22:44,950 --> 00:22:48,453 నేను ఎన్నో కుక్కపిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. నేను దీన్ని బాగా చూసుకోగలనని నీకు అనిపించొచ్చు. 378 00:22:48,536 --> 00:22:50,038 బహుశా దానికి ఎండ కావాలనుకుంటా. 379 00:22:50,664 --> 00:22:52,624 -నేను దాన్ని ఎండలో పెడతాను. -థాంక్స్, చార్లెస్. 380 00:22:54,501 --> 00:22:57,087 హేయ్, చార్లీ. నేను లోపలికి వచ్చేశాను. 381 00:22:57,837 --> 00:22:59,005 పరవాలేదు. 382 00:23:00,215 --> 00:23:01,633 ఈవిడ నా గ్రాండ్ బడ్డీ, రోజ్. 383 00:23:01,716 --> 00:23:03,134 -హాయ్. -హాయ్. 384 00:23:03,218 --> 00:23:04,553 స్నోబాల్ కొత్త యజమాని. 385 00:23:04,636 --> 00:23:07,722 అంటే, యజమాని కంటే కూడా ఒక స్నేహితురాలిని. 386 00:23:14,729 --> 00:23:16,898 హేయ్, ఎలా ఉన్నావో చూడు. 387 00:23:16,982 --> 00:23:19,568 మేము మీరుంటున్న చోటికి దీన్ని తీసుకురావడానికి రెడీ అవుతున్నాం. 388 00:23:19,651 --> 00:23:23,863 లోయిడ్ నడుచుకుంటూ వెళ్లి రమ్మని సలహా ఇచ్చాడు 389 00:23:23,947 --> 00:23:25,407 మంచి ఎక్సర్సైజు అవుతుందని చెప్పాడు. 390 00:23:25,490 --> 00:23:27,492 నేను అతనితో వాదించలేదు. 391 00:23:28,243 --> 00:23:30,495 మా వల్ల ఇప్పటికే బోలెడు సమస్యలున్నాయి. 392 00:23:31,121 --> 00:23:33,248 ఓకే, స్నోబాల్. వెళ్ళడానికి సిద్ధమా? 393 00:23:37,627 --> 00:23:39,629 స్నోబాల్ "సరే" అని చెబుతోంది. 394 00:23:39,713 --> 00:23:41,256 అందుకే నాకది నచ్చింది. 395 00:23:42,048 --> 00:23:45,594 హేయ్, రోజ్. గ్రాండ్ బడ్డీస్ ప్రోగ్రాం అయిపోయిందని నాకు తెలుసు, 396 00:23:45,677 --> 00:23:48,263 కానీ కావాలంటే మిమ్మల్ని, స్నోబాల్ ని వచ్చి కలవొచ్చు కదా? 397 00:23:48,346 --> 00:23:50,849 ఓహ్, తప్పకుండా బాబూ. 398 00:23:50,932 --> 00:23:53,810 -కాకపోతే నాకోసం లంచ్ తీసుకొస్తే… -కబాబ్స్ వద్దు. అర్థమయింది. 399 00:23:53,894 --> 00:23:55,312 అది నిజమే. 400 00:23:55,395 --> 00:23:58,481 ఓకే, స్నోబాల్. నేను నీకోసం వస్తాను. 401 00:24:16,708 --> 00:24:18,710 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 402 00:25:34,703 --> 00:25:36,705 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ