1 00:00:06,049 --> 00:00:10,178 అంతటి తుఫానులో కూడా, ఏమాత్రం చెక్కుచెదరని సంకల్పంతో, తనకు ఇష్టమైన 2 00:00:10,262 --> 00:00:12,013 కోటు జేబులో చేతులు పెట్టుకొని 3 00:00:12,097 --> 00:00:15,767 డిటెక్టివ్ బ్రానిగన్ ఆ చీకటిలో నుండి బయటకు వచ్చాడు. 4 00:00:15,850 --> 00:00:19,938 అప్పుడు డిమోంటే, "ఆయన చివరి క్లూ కనిపెట్టేశాడు, బ్రానిగన్ కి ఎవరూ సాటి రారు" అని మెల్లిగా అన్నాడు. 5 00:00:20,021 --> 00:00:24,276 డిటెక్టివ్ తన గొంతు సవరించుకుని, ఎప్పటిలాగే ప్రశాంతంగా ప్రకటించారు… 6 00:00:25,485 --> 00:00:29,072 ఎమీలియా ఏర్ హార్ట్ పైలట్ లైసెన్స్ పొందిన పదహారవ మహిళ అని మీకు తెలుసా? 7 00:00:29,155 --> 00:00:32,659 -లిజ్జీ, ఏం చేస్తున్నావ్? -స్టెఫ్ చదవమని చెప్పిన ఆత్మకథ చదువుతున్నాను. 8 00:00:32,741 --> 00:00:34,703 కానీ మేము మిస్టరీ కథ వింటూ ఉన్నాం. 9 00:00:34,786 --> 00:00:36,955 ఇప్పటికి ఆ మిస్టరీని వెయ్యి సార్లైనా వినుంటాం. 10 00:00:37,038 --> 00:00:39,541 పైగా మనం ఇంటికి చేరుకున్నాం. ఇంట్లోకి వెళ్ళడం మంచిది. 11 00:00:39,624 --> 00:00:41,418 నువ్వు అచ్చం స్టెఫ్ లాగా ప్రవర్తిస్తున్నావు. 12 00:00:41,501 --> 00:00:43,879 లిండా ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తను వింతగా ప్రవర్తిస్తుంది. 13 00:00:43,962 --> 00:00:45,547 -నేనేమీ అలా చేయను. -అవును, చేస్తావు. 14 00:00:45,630 --> 00:00:47,507 చాలు ఆపండి. మీ ఇద్దరికీ నేనేం చెప్పాను? 15 00:00:47,591 --> 00:00:50,969 లిండా ఆంటీ, స్టెఫ్, బెక్కీలు ఈ మధ్యనే మాన్హట్టన్ నుంచి 16 00:00:51,052 --> 00:00:52,679 "హ్యాండోవర్"కి షిఫ్ట్ అయ్యారు. 17 00:00:52,762 --> 00:00:53,889 దీని పేరు యాండోవర్. 18 00:00:53,972 --> 00:00:55,515 మళ్ళీ స్టెఫ్ లాగా మాట్లాడుతున్నావు. 19 00:00:58,643 --> 00:01:01,146 చూడు, కావాలనుకుంటే నాతోపాటు ఫిషింగ్ ట్రిప్ కి రావొచ్చు. 20 00:01:02,147 --> 00:01:05,817 ఇక్కడి పరిస్థితితో పోల్చితే గడ్డకట్టించే చల్లటి నీళ్ళలో నడుం లోతు దిగి నిలబడడం మేలు అనిపిస్తుంది. 21 00:01:07,110 --> 00:01:10,113 ఈ వారాంతం మనం కుటుంబంతో కలిసి గడపడంపై దృష్టి పెట్టాలి, గొడవపడడంపై కాదు. 22 00:01:10,864 --> 00:01:12,157 అర్థమయిందా? 23 00:01:12,866 --> 00:01:14,075 -అర్థమయింది. -అవును. 24 00:01:15,368 --> 00:01:17,287 స్టెఫ్ ఏమేం ప్లాన్ చేసిందో చూడాలని ఆరాటంగా ఉంది. 25 00:01:17,370 --> 00:01:20,498 న్యూయార్క్ లో పోయినసారి కలిసినప్పుడు, మేము తోపుడు బండిపై షీక్ కబాబ్స్ తినడానికి వెళ్లాం. 26 00:01:20,582 --> 00:01:22,125 అలాగే బ్రాడ్వే లాంటి షో ఒకటి చూశాం. 27 00:01:23,168 --> 00:01:25,962 అది చూశారా? ఒక కుక్క ఇటువైపుగా పరిగెత్తింది. 28 00:01:26,046 --> 00:01:28,798 మనం పల్లెటూర్లో ఉన్నాం. బహుశా లేడి అయ్యుంటుంది. 29 00:01:28,882 --> 00:01:31,259 నీకెలా తెలుసు? నువ్వు లేడిని చూడలేదుగా. 30 00:01:31,343 --> 00:01:33,845 -నువ్వు కూడా చూడలేదు. -అయితే? 31 00:01:33,929 --> 00:01:36,514 డిక్కీలో ఇంకో చేపల పోల్ ఉంది. ఊరికే చెబుతున్నాను. 32 00:01:39,100 --> 00:01:42,604 "ఫ్లాష్" 33 00:01:44,022 --> 00:01:46,149 -స్వాగతం! హేయ్! -హాయ్. 34 00:01:48,777 --> 00:01:51,154 -వావ్! హాయ్, పాల్. -హేయ్. 35 00:01:52,197 --> 00:01:53,198 దగ్గరికి రా. 36 00:01:55,116 --> 00:01:58,703 నిన్ను చూడటం చాలా ఆనందంగా వుంది. ప్రెసిడెంట్ పదవికి పోటి చేస్తున్నావా లేదా? 37 00:01:58,787 --> 00:02:01,122 -ఇంకా ఏం చేయాలని నిర్ణయించుకోలేదు. -నువ్వు అసాధ్యురాలివి. 38 00:02:02,374 --> 00:02:03,833 లిండా ఆంటీ! 39 00:02:03,917 --> 00:02:06,127 కుక్కల మాస్టర్ వచ్చాడు! 40 00:02:06,962 --> 00:02:10,090 స్నాక్స్ టేబుల్ మీద ఉన్నాయి. నిమ్మకాయ నీళ్ళు ఫ్రిజ్ లో ఉన్నాయి. 41 00:02:10,173 --> 00:02:12,926 నేను రేపొద్దున్న ఒకటి కాదు, రెండు కాదు, 42 00:02:13,009 --> 00:02:15,428 మూడు ఆపిల్ క్రంబుల్స్ బేక్ చెయ్యబోతున్నాను. 43 00:02:15,512 --> 00:02:16,680 సూపర్! 44 00:02:16,763 --> 00:02:20,392 ముఖ్యమైన విషయం ఏంటంటే, వాటిని కొట్టంలో ఉన్న కిటికీ దగ్గర ఆరబెడతాను. 45 00:02:20,475 --> 00:02:21,685 ఇక్కడ ఇలాగే చేస్తారు. 46 00:02:21,768 --> 00:02:23,395 కొద్ది రోజుల్లో కోళ్ళు కూడా పెంచుతావేమో. 47 00:02:23,478 --> 00:02:26,106 కోళ్లు అంటే గుర్తుకొచ్చింది, పాల్, 48 00:02:26,189 --> 00:02:28,817 నాతో చెస్ లో ఓడిపోకుండా ఉండడానికి నువ్వు చేపల వేటకి వెళుతున్నావా? 49 00:02:28,900 --> 00:02:31,444 నా ఉద్యోగం ఊడకుండా ఉండాలని ఫిషింగ్ కి వెళుతున్నాను. 50 00:02:31,528 --> 00:02:35,532 వార్షిక ఫైర్ హౌస్ ఫిషింగ్ ట్రిప్ ని మా కెప్టెన్ కార్టర్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. 51 00:02:35,615 --> 00:02:39,119 ఆదివారం కలుస్తాను. సరదాగా గడపండి. నన్ను ఎక్కువగా మిస్ అవకండి. 52 00:02:39,202 --> 00:02:40,704 -లిజ్జీ! -చార్లెస్! 53 00:02:41,329 --> 00:02:43,498 -హాయ్. -నువ్వు ఆందోళన పడాల్సిన పనిలేదు. 54 00:02:43,582 --> 00:02:44,583 హేయ్. 55 00:02:45,917 --> 00:02:47,419 -హాయ్, అమ్మాయిలూ. -హాయ్, పాల్ అంకుల్. 56 00:02:47,502 --> 00:02:48,503 హాయ్, పాల్ అంకుల్. 57 00:02:49,337 --> 00:02:51,590 -నాకిప్పుడు వెళ్లాలని లేదు. -పద నేను కారు వరకూ వస్తాను. 58 00:02:51,673 --> 00:02:53,300 మీరు వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాం. 59 00:02:53,383 --> 00:02:55,510 వావ్. ఈ చోటు చాలా పెద్దది. 60 00:02:55,594 --> 00:02:58,054 -నీకు అన్నీ చూపిస్తాను. -లేదు, నేనే చూపిస్తాను. 61 00:02:58,138 --> 00:02:59,848 అటువైపు గడ్డి, ఇటువైపు కొట్టం ఉంది. 62 00:02:59,931 --> 00:03:01,433 ఇంకేమైనా ఉన్నాయా? మరికాస్త గడ్డి ఉంది. 63 00:03:02,642 --> 00:03:04,728 పద, స్టెఫ్. వాళ్ళకు మొత్తం తిప్పి చూపిద్దాం. 64 00:03:04,811 --> 00:03:06,897 -నీకు పొలం చూడాలని లేదా? -ఇప్పుడు కాదు. 65 00:03:06,980 --> 00:03:09,316 నువ్వు, చార్లెస్ వెళ్లి ఆడుకోండి. పద, లిజ్జీ. 66 00:03:11,109 --> 00:03:12,110 వస్తున్నా. 67 00:03:13,820 --> 00:03:16,781 కొట్టం దగ్గరికి వెళ్దాం. నా చెయ్యి ఎక్కడ విరగ్గొట్టుకున్నానో చూపిస్తాను. 68 00:03:16,865 --> 00:03:19,034 రేపు పొద్దున వెళ్ళండి. చీకటి పడింది, బెక్కీ. 69 00:03:19,117 --> 00:03:20,118 సరే. 70 00:03:20,201 --> 00:03:22,829 నీకు అటక మీద కనిపించిన పెయింటింగ్ ని చార్లెస్ కి చూపించు. 71 00:03:22,913 --> 00:03:23,914 ఓహ్, అవును కదా! 72 00:03:23,997 --> 00:03:27,334 అదొక స్పేస్ షిప్, కానీ దాన్ని తలకిందులుగా చేసి చూస్తే, ఎల్విస్ ప్రెస్లీ ఉంటాడు! 73 00:03:27,417 --> 00:03:28,627 -బాగుంది! -వెళ్దాం పద. 74 00:03:31,504 --> 00:03:32,923 నెమ్మదిగా వెళ్ళండి! 75 00:03:33,632 --> 00:03:36,509 ఇక్కడ దెబ్బలు తగిలించుకోకుండా ఉంటే అదే పదివేలు. 76 00:03:39,721 --> 00:03:42,182 ఆ విధంగా నేను నిచ్చెన మీద నుంచి పడ్డాను. 77 00:03:44,017 --> 00:03:46,478 -నీకేమీ కానందుకు సంతోషపడుతున్నాను. -నేను కూడా. 78 00:03:47,062 --> 00:03:49,272 ఈ కొట్టం ఎంత బాగుందో కదా? 79 00:03:49,356 --> 00:03:51,608 నువ్వు, స్టెఫ్ అదృష్టవంతులు. 80 00:03:52,234 --> 00:03:53,318 స్టెఫ్ కి ఇక్కడ నచ్చదు. 81 00:03:53,902 --> 00:03:55,820 -ఏంటి కొట్టమా? -లేదు, ఈ ఊరు. 82 00:03:55,904 --> 00:03:58,365 న్యూయార్క్ నుండి వచ్చేసినప్పటి నుండీ తన మూడ్ అస్సలు బాలేదు. 83 00:03:58,448 --> 00:04:00,700 మేము సెంట్రల్ పార్కుకి వెళ్ళే వాళ్ళం, 84 00:04:00,784 --> 00:04:02,661 కానీ ఇప్పుడు తను గది వదిలి బయటికే రావట్లేదు. 85 00:04:02,744 --> 00:04:04,037 అది మంచి విషయం కాదు. 86 00:04:04,120 --> 00:04:05,830 ఇక్కడున్న వాటిని ఇష్టపడమని తనని ఒత్తిడి చేయలేను. 87 00:04:05,914 --> 00:04:09,376 కాబట్టి నేనే సొంతగా ఆడుకుంటాను. ఈ వారాంతం మనం అలాగే ఆడుకోబోతున్నాం. 88 00:04:09,459 --> 00:04:12,837 -ఎక్కడ మొదలు పెడదాం? -ఈ భూమ్మీది ఉత్తమమైన చోటులో. 89 00:04:12,921 --> 00:04:15,465 డ్రకర్స్ - క్యాండీ 90 00:04:15,549 --> 00:04:17,216 డ్రకర్స్ కార్నర్ కు స్వాగతం. 91 00:04:24,349 --> 00:04:27,394 వావ్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. 92 00:04:29,187 --> 00:04:30,564 ఇక్కడ ఏమీ లేదు. 93 00:04:31,231 --> 00:04:33,233 న్యూయార్క్ లో మెట్రోలు, మ్యూజియంలు, 94 00:04:33,316 --> 00:04:36,069 ఏది తినాలనుకుంటే అది, ఎప్పుడైనా దొరుకుతుంది. 95 00:04:36,152 --> 00:04:37,654 అద్భుతమైన సినిమా హాల్స్. 96 00:04:37,737 --> 00:04:39,823 హడ్సన్ నది పక్కన మనిద్దరం. 97 00:04:41,324 --> 00:04:43,952 నాకు తెలిసి ఆరోజు నేను ఏడు పిజ్జా ముక్కలు తిన్నట్లున్నాను. 98 00:04:45,662 --> 00:04:46,830 నీకిది గుర్తుందా? 99 00:04:49,249 --> 00:04:51,710 ఓహ్, ఓరి దేవుడా. వాటర్ టాక్సీ టూర్. 100 00:04:51,793 --> 00:04:55,297 నీకు సిటీ గురించి ఎన్నో విషయాలు తెలుసు, మనం జూనియర్ టూర్ గైడ్స్ లా నటించేవాళ్ళం. 101 00:04:55,964 --> 00:04:59,342 ఆ జపనీస్ బేకరీలో తినడానికి వర్షంలో లైన్లో ఎదురుచూశాం, గుర్తుందా? 102 00:04:59,426 --> 00:05:02,429 ఇప్పటికీ కనీసం వారానికి ఒకసారైనా ఆ గ్రీన్ టీ ఛీజ్ కేక్స్ గురించి కలగంటాను. 103 00:05:04,556 --> 00:05:06,850 ఆ గిఫ్ట్ షాప్. ఓహ్, ఓరి దేవుడా. 104 00:05:09,311 --> 00:05:10,854 మనం రేపు ఏమి చేద్దాం? 105 00:05:10,937 --> 00:05:13,189 ఈ రోడ్డు చివర జో బిట్మార్క్ పొలం ఉంది. 106 00:05:13,273 --> 00:05:15,901 మనం గొర్రెల్ని మేపొచ్చు, పీచ్ చెట్టు ఎక్కచ్చు. 107 00:05:15,984 --> 00:05:18,695 -బహుశా జో మనల్ని ట్రాక్టర్ లో ఎక్కించుకుని తిప్పుతారేమో! -మంచిది. 108 00:05:18,778 --> 00:05:21,531 దాని పక్కనే ఒక దెయ్యాల ఇల్లుంది. 109 00:05:21,615 --> 00:05:23,867 -నిజంగా దెయ్యాల ఇల్లా? -అవును. 110 00:05:24,451 --> 00:05:28,163 ఇరవై నాలుగేళ్ళకు పైగా ఖాళీగా ఉన్న ఒక పాత ఫార్మ్ హౌస్. 111 00:05:28,246 --> 00:05:30,707 అక్కడ ముసలి హాడ్లీ దెయ్యం తప్ప ఇంకేం ఉండదు. 112 00:05:30,790 --> 00:05:32,250 హాడ్లీ అంటే రైతా? 113 00:05:32,334 --> 00:05:33,668 హాడ్లీ అంటే ఆవు. 114 00:05:33,752 --> 00:05:37,380 ఓట్స్ పెట్టమని అది ఇప్పటికీ అరుస్తూ ఉంటుందని ఇక్కడి వాళ్ళు అంటారు. 115 00:05:37,464 --> 00:05:40,884 మూ. 116 00:05:42,719 --> 00:05:45,013 -ఏంటది? -నాకు తెలీదు. 117 00:05:55,190 --> 00:05:57,651 అది అమ్మ 'పై' తయారు చేసే పళ్ళెం. 118 00:06:00,403 --> 00:06:01,780 కుక్క. 119 00:06:03,573 --> 00:06:05,242 పరవాలేదు. మేము నిన్నేమీ చేయం. 120 00:06:07,994 --> 00:06:10,789 అమ్మ మూడు ఆపిల్ క్రంబుల్స్ చేసి మంచి పని చేసింది. 121 00:06:12,749 --> 00:06:15,460 దీనికి కాలర్ లేదు, మెడలో రిబ్బన్ మాత్రమే ఉంది. 122 00:06:18,255 --> 00:06:20,507 మనం స్టెఫ్, లిజ్జీలకి చెప్పడం మంచిదేమో. 123 00:06:20,590 --> 00:06:24,135 లేదంటే నువ్వు చెప్పినట్లు మన సాహసంలా మార్చుకోవచ్చు. 124 00:06:24,219 --> 00:06:27,806 -మనమే సొంతగా ఈ విషయాన్ని ఛేదించవచ్చు. -నేను రెడీ. 125 00:06:30,475 --> 00:06:33,228 కంగారుపడకు. మేము నీ ఇంటిని కనిపెడతాం. 126 00:06:38,066 --> 00:06:39,442 అది ఇంకా ఆకలిగా ఉన్నట్లుంది. 127 00:06:43,613 --> 00:06:46,157 సరే. మధ్య అరలో మిగిలిపోయిన మాంసం ఉంది. 128 00:06:46,241 --> 00:06:48,868 సరే, మంచిది. ఇంకా ఏమేం ఉన్నాయి? 129 00:06:48,952 --> 00:06:50,704 తాగడానికి నిమ్మరసం కూడా కావాలా? 130 00:06:52,122 --> 00:06:53,498 హాయ్, అమ్మా. 131 00:06:53,582 --> 00:06:56,585 అయ్యో, లిండా. కనపడకుండా పోయిన ఆపిల్ క్రంబుల్ ఎవరు తిని ఉంటారో! 132 00:06:57,377 --> 00:07:00,630 కాబట్టి వినండి. మన కుటుంబంలో కొన్ని సూత్రాలున్నాయి. 133 00:07:00,714 --> 00:07:03,049 ఒకవేళ రహస్యంగా 'పై' తినేయాలని అనుకుంటే, 134 00:07:03,133 --> 00:07:05,719 దాంతోపాటు ఐస్ క్రీం కూడా తీసుకోవాలి. 135 00:07:06,803 --> 00:07:07,929 అవును, బాగా చెప్పారు. 136 00:07:08,013 --> 00:07:09,723 మనకెందుకు రాలేదీ ఆలోచన? 137 00:07:09,806 --> 00:07:11,433 థాంక్స్. 138 00:07:16,396 --> 00:07:18,148 -'పై' కోసం. -వెళ్దాం పద, వెళ్దాం పద. 139 00:07:20,817 --> 00:07:21,985 అల్లరి పిల్లలు. 140 00:07:22,611 --> 00:07:24,738 -వాళ్ళేదో దాస్తున్నారు. -సందేహం లేదు. 141 00:07:26,489 --> 00:07:27,490 మన కోసం క్రంబుల్ తెస్తున్నా. 142 00:07:29,784 --> 00:07:31,161 నేను ఐస్ క్రీం తెస్తాను. 143 00:07:36,833 --> 00:07:39,419 లిజ్జీ, చూడు. ఇది నా ఫీల్డ్ హాకీ జట్టు. 144 00:07:39,502 --> 00:07:43,048 అవును. నువ్వు రాత్రి చూపించిన వీడియోల్లో చాలా సార్లు చూశాను. 145 00:07:43,632 --> 00:07:47,052 నువ్వు వాటిని ఎడిట్ చేసి మరింత చిన్న రీల్ చేస్తే బాగుంటుంది. 146 00:07:47,135 --> 00:07:48,845 వినడానికి బాగుంది. ఈ రాత్రికే చేద్దాం. 147 00:07:49,930 --> 00:07:53,099 లేదంటే సరదాగా ఉండే ఇంకేదైనా పని చేస్తే బాగుంటుంది. 148 00:07:53,183 --> 00:07:56,811 లేదంటే మనం ఈ గది బయటికి వెళ్లి ఏదైనా చేస్తే బాగుంటుందేమో? 149 00:07:56,895 --> 00:07:58,897 నన్ను నమ్ము. బయట ఏమీ లేదు. 150 00:08:02,651 --> 00:08:04,819 నీకెలా తెలుసు? నువ్వు మొత్తం తిరిగి చూశావా? 151 00:08:04,903 --> 00:08:07,656 చూడాల్సింది ఏముంది? నా ఫ్రెండ్స్ అందరూ న్యూయార్క్ లోనే ఉన్నారు. 152 00:08:08,448 --> 00:08:13,036 సరే… బహుశా నువ్వు మీ కొత్త స్కూల్లో ఫీల్డ్ హాకీ టీంలో చేరితే, 153 00:08:13,119 --> 00:08:14,746 నీకు ఖచ్చితంగా కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. 154 00:08:14,829 --> 00:08:17,123 ఇక్కడ ఫీల్డ్ హాకీ ఆడే వాళ్ళు ఎవరూ లేరు. 155 00:08:17,207 --> 00:08:19,292 ఇక్కడ పైపుల్లోంచి నీళ్ళు రావడమే ఆశ్చర్యంగా ఉంది. 156 00:08:19,918 --> 00:08:22,837 హేయ్, స్టెఫ్. పిజ్జా వచ్చింది, నువ్వు తీసుకుంటావా? 157 00:08:24,297 --> 00:08:25,799 పల్లెటూరి పిజ్జా. 158 00:08:28,802 --> 00:08:30,345 ఈరోజు బాగా ఎంజాయ్ చేయండి. 159 00:08:30,929 --> 00:08:32,889 మేము రెండు పిజ్జాలు ఆర్డర్ చేసినట్లున్నామే? 160 00:08:32,972 --> 00:08:35,517 అవును. నా బైక్ మీద ఉంది. నేను వెంటనే వస్తాను. 161 00:08:36,685 --> 00:08:39,729 -తను చూడడానికి బాగుంది. -ఇక్కడి వాళ్ళెవరూ సరిగా ఉండరు. 162 00:08:39,813 --> 00:08:41,063 సరే. 163 00:08:41,773 --> 00:08:45,777 హేయ్, తన షర్టు మీద పాత విమానం బొమ్మ ఉంది. నీకు ఎమీలియా ఏర్ హార్ట్ ఇష్టం కదా. 164 00:08:46,736 --> 00:08:50,574 -నేను తనని స్కూల్లో చూసినట్లున్నాను. -మంచిది. పరిచయం చేసుకో. 165 00:08:51,324 --> 00:08:52,325 నాకు తెలీదు. 166 00:08:52,909 --> 00:08:54,119 కనీసం ప్రయత్నించొచ్చు కదా? 167 00:08:56,621 --> 00:08:57,622 మర్చిపోయినందుకు సారీ. 168 00:08:58,373 --> 00:08:59,457 పరవాలేదు. 169 00:09:00,458 --> 00:09:03,086 నేను కూడా బాక్స్టర్ లోనే చదువుతున్నాను. నా పేరు స్టెఫ్. 170 00:09:03,712 --> 00:09:06,923 ఓహ్, అవును. నా పేరు పెన్నీ. సరే, మళ్ళీ కలుద్దాం. 171 00:09:08,008 --> 00:09:09,259 చాలా బాగా మాట్లాడింది. 172 00:09:21,146 --> 00:09:23,690 నాకు మిస్టరీల గురించి కొన్ని విషయాలు తెలుసు. 173 00:09:23,773 --> 00:09:26,359 మనకు కావలసిందల్లా కొన్ని ఆధారాలు. 174 00:09:27,319 --> 00:09:29,529 ఈ కుక్క ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలంటే, 175 00:09:29,613 --> 00:09:31,948 దాని గురించి మనకు తెలిసిన ప్రతి విషయాన్నీ విశ్లేషించాలి. 176 00:09:32,032 --> 00:09:34,743 మనకు తెలిసిందల్లా ఉన్నట్లుండి అది నిన్న కనిపించింది. 177 00:09:35,952 --> 00:09:39,122 అది ఆ విధంగా పారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? 178 00:09:41,207 --> 00:09:43,835 తన పేరేంటో మనకి తెలిసుంటే బాగుండేది. ఇదిగో. 179 00:09:45,462 --> 00:09:46,630 ఈ నీళ్ళు తాగు. 180 00:09:50,383 --> 00:09:51,384 అయ్యో. ప్రశాంతంగా ఉండు. 181 00:09:52,427 --> 00:09:54,095 ఆ పెద్ద శబ్దం వల్ల భయపడ్డావా? 182 00:09:57,557 --> 00:09:59,976 ఆగు. పెద్ద శబ్దం. 183 00:10:00,060 --> 00:10:03,521 అదీ విషయం! నిన్న వచ్చిన ఉరుములు, మెరుపుల వల్ల భయపడింది. 184 00:10:03,605 --> 00:10:04,940 అందుకే ఇంట్లో నుంచి పారిపోయింది. 185 00:10:05,023 --> 00:10:08,026 దీన్ని మనం ఫ్లాష్ అని పిలుద్దాం, మెరిసినప్పుడు వచ్చే వెలుగు. 186 00:10:08,109 --> 00:10:11,529 నిన్ను మీ ఇంటికి చేరుస్తాం, ఫ్లాష్. మాకు ఇంకొన్ని ఆధారాలు కావాలంతే. 187 00:10:12,447 --> 00:10:14,950 ఆగు. నేను ఇలాంటి రిబ్బన్ ఎక్కడో చూశాను. 188 00:10:17,160 --> 00:10:19,371 డ్రకర్స్! ఈ రిబ్బన్ డ్రకర్స్ లో కనిపించింది. 189 00:10:19,454 --> 00:10:21,665 బహుశా ఫ్లాష్ ఎవరి కుక్కో వాళ్ళకు తెలుస్తుందేమో. 190 00:10:21,748 --> 00:10:23,083 ఫ్లాష్ ఎవరు? 191 00:10:23,166 --> 00:10:24,960 బెక్కీకి, నాకు దొరికిన కుక్క. 192 00:10:27,462 --> 00:10:29,965 నీకు కుక్క దొరికిందా? నాకెందుకు చెప్పలేదు? 193 00:10:30,048 --> 00:10:32,759 ఎందుకంటే మాతో గడపడం నీకు ఇష్టం లేదు కదా? 194 00:10:33,760 --> 00:10:35,303 ఎక్కడో విన్నట్లుగా ఉంది. 195 00:10:35,387 --> 00:10:38,139 నువ్వు, స్టెఫ్ కలిస్తే, నీకిక నేను గుర్తుండను. 196 00:10:38,223 --> 00:10:40,725 కాబట్టి ఫ్లాష్ కుటుంబం ఎక్కడుందో నేనే కనిపెట్టాలని నిర్ణయించుకున్నాను. 197 00:10:43,019 --> 00:10:44,229 బెక్కీతో పాటు. 198 00:10:46,898 --> 00:10:48,024 నువ్వు చెప్పింది నిజమే. 199 00:10:48,108 --> 00:10:49,859 నేను స్టెఫ్ ని కలిసినందుకు చాలా సంతోషపడ్డాను, 200 00:10:49,943 --> 00:10:52,070 కానీ నిన్నలా వదిలేసి ఉండాల్సింది కాదు. 201 00:10:52,654 --> 00:10:54,906 నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే నిన్ను తప్పు పట్టను. 202 00:10:54,990 --> 00:10:55,991 నన్ను క్షమించు. 203 00:10:59,703 --> 00:11:01,204 మాకు ఇప్పుడే పెద్ద ఆధారం దొరికింది. 204 00:11:01,288 --> 00:11:04,666 -నువ్వు కూడా మాతో వస్తావా? -కాసేపు స్టెఫ్ తోకలాగా ఉండను. 205 00:11:12,883 --> 00:11:14,050 అదిగో! చూశారా? 206 00:11:16,094 --> 00:11:19,264 -అచ్చం ఫ్లాష్ వేసుకున్న దానిలాగే ఉంది. -మి… మిస్టర్ డ్రకర్! 207 00:11:21,016 --> 00:11:22,017 మీరు మళ్ళీ వచ్చారా? 208 00:11:23,018 --> 00:11:26,688 ఈపాటికి బాగా తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని అనుకున్నాను. 209 00:11:26,771 --> 00:11:28,440 కానీ మీరు అదృష్టవంతులు. 210 00:11:28,523 --> 00:11:31,651 ఇప్పుడే ఫ్రెష్ కారమెల్ క్రీమ్స్ వచ్చాయి. 211 00:11:31,735 --> 00:11:33,320 చాక్లెట్ వా? 212 00:11:33,403 --> 00:11:36,615 నిజానికి మాకో కుక్క దొరికింది. దాని యజమాని ఎక్కడున్నారో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. 213 00:11:37,240 --> 00:11:39,576 అది వేసుకున్న రిబ్బన్ మీ షాప్ లోదే. 214 00:11:39,659 --> 00:11:41,828 దాన్ని ఎవరికి అమ్మారో మీకేమైనా గుర్తుందా? 215 00:11:41,912 --> 00:11:45,248 నేను ప్రతినెలా డజన్ల కొద్దీ వాటిని అమ్ముతాను. 216 00:11:45,332 --> 00:11:48,251 దాన్ని ఎవరు కొన్నారో నాకు తెలీదు. 217 00:11:51,588 --> 00:11:53,423 ఎవరికో దాహం వేసినట్లుంది. 218 00:11:55,508 --> 00:11:57,010 ఇదిగో తాగు. 219 00:11:57,093 --> 00:12:00,180 మా కమ్యూనిటీ నోటీసు బోర్డులో కావాలంటే ప్రకటన రాసి ఉంచండి. 220 00:12:00,263 --> 00:12:03,141 -నేను ఖచ్చితంగా… ఏయ్! -ఫ్లాష్! 221 00:12:04,768 --> 00:12:06,978 -ఫ్లాష్! -ఫ్లాష్! 222 00:12:09,356 --> 00:12:11,733 తన కుటుంబాన్ని మనం ఎప్పటికీ కనుక్కోలేకపోతే? 223 00:12:15,487 --> 00:12:16,613 అదే మా స్పెషాలిటీ. 224 00:12:17,197 --> 00:12:20,617 ఫ్లాష్ ఇంటిని కనిపెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అది మనిద్దరమే. 225 00:12:22,661 --> 00:12:23,787 బెక్కీ కూడా. 226 00:12:24,788 --> 00:12:27,249 మీ ఇంటికి వచ్చి మీరు చూసుకొనే కుక్కపిల్లల్ని కలవాలని ఉంది. 227 00:12:27,332 --> 00:12:29,000 మాక్కూడా ఇష్టమే. 228 00:12:29,626 --> 00:12:31,086 స్టెఫ్ కూడా వస్తుందేమో. 229 00:12:31,670 --> 00:12:35,090 నాకు డౌటే. తను నాతో కలిసి ఏ పనీ చేయాలని అనుకోవడం లేదు. 230 00:12:37,217 --> 00:12:39,219 ఏమైంది, ఫ్లాష్? 231 00:12:39,302 --> 00:12:40,470 ఫ్లాష్ ఎవరు? 232 00:12:42,013 --> 00:12:44,140 హేయ్, స్టెఫ్. 233 00:12:44,224 --> 00:12:47,060 నేను బెక్కీ, చార్లెస్ లకి సాయం చేస్తున్నాను. 234 00:12:47,143 --> 00:12:50,230 మాకో కుక్క దొరికింది, దాని ఇల్లు ఎక్కడుందో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. 235 00:12:50,855 --> 00:12:52,899 అర్థమయింది. సరే, వెళ్దాం పద, లిజ్జీ. 236 00:12:52,983 --> 00:12:54,818 వాళ్ళు ఏదో ఒకటి చేసి కనిపెడతారులే. 237 00:12:56,945 --> 00:12:58,446 లిజ్జీ, వెళ్దాం పద. 238 00:12:59,281 --> 00:13:03,076 నిజానికి స్టెఫ్, నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. 239 00:13:03,994 --> 00:13:06,496 -ఇక్కడే ఉంటావా? -అవును. 240 00:13:08,957 --> 00:13:11,751 అయితే, డిటెక్టివ్ బ్రానిగన్ ఈ పరిస్థితిలో ఏం చేస్తారు? 241 00:13:11,835 --> 00:13:13,378 మరిన్ని ఆధారాలు సేకరిస్తారు. 242 00:13:13,461 --> 00:13:16,715 సరే. బోర్డర్ కోలీస్ జాతి కుక్కల గురించి నాకు తెలిసింది చెబుతాను. 243 00:13:16,798 --> 00:13:20,302 అవి చాలా తెలివైనవి, చాలా ఉత్సాహంగా ఉంటాయి, 244 00:13:20,385 --> 00:13:23,346 వాటిని గొర్రెల మందల్ని కాపలా కాయడానికి పెంచారు. అంతేకాక… 245 00:13:23,430 --> 00:13:27,309 గొర్రెలా? ఈ చుట్టుపక్కల గొర్రెలున్న ఒకే ఒక చోటు జో బిట్మార్క్ పొలం. 246 00:13:27,392 --> 00:13:29,978 వాళ్ళ కుక్కల్లో ఫ్లాష్ కూడా ఒకటి అయ్యుంటుంది. వెళ్దాం పదండి! 247 00:13:30,061 --> 00:13:31,104 సరే. 248 00:13:35,275 --> 00:13:36,776 నువ్వు కూడా మాతోపాటు వస్తే బాగుంటుంది. 249 00:13:37,527 --> 00:13:39,529 గొర్రెల దగ్గరికా? నేను రాను. 250 00:13:40,113 --> 00:13:41,615 స్టెఫ్, ఆగు. 251 00:13:44,367 --> 00:13:45,577 ఈ ఒక్కసారికి రా. 252 00:13:45,660 --> 00:13:47,913 నీకు ఏ మాత్రం నచ్చకపోయినా, 253 00:13:47,996 --> 00:13:51,583 మనం మిగిలిన వారాంతం మొత్తం నీ గదిలోనే గడుపుదాం. 254 00:13:53,877 --> 00:13:55,212 ప్లీజ్? 255 00:13:57,923 --> 00:13:59,174 మరీ అంత ఘోరంగా ఉండదేమో. 256 00:14:00,550 --> 00:14:02,260 జామ్స్ 257 00:14:02,344 --> 00:14:03,345 తేనె 258 00:14:04,512 --> 00:14:07,557 -ఇదిగో. నువ్వు ఫ్లాష్ ని పట్టుకో. నేను జోని వెతుకుతాను. -సరే. 259 00:14:08,934 --> 00:14:10,810 ఫ్లాష్ కి ఈ చోటు తెలుసనుకుంటా. 260 00:14:15,732 --> 00:14:17,234 బిట్మార్క్ ఫార్మ్ & కంట్రీ మార్కెట్ 261 00:14:17,317 --> 00:14:19,444 ఈ చోటు చాలా బాగుంది. 262 00:14:20,946 --> 00:14:22,322 ఏమంటావ్? 263 00:14:22,822 --> 00:14:25,492 ఇక్కడ యూనియన్ స్క్వేర్ గ్రీన్ మార్కెట్ లేదు. 264 00:14:25,575 --> 00:14:28,328 వాళ్ళ దగ్గర ఫ్రెష్ గా చేసిన బ్రెడ్, స్థానికంగా తయారైన తేనె ఇంకా… 265 00:14:28,411 --> 00:14:31,957 రేటు ఎక్కువైనా రుచికరంగా ఉండే యాపిల్ సైడర్ డోనట్స్ ఉంటాయి. 266 00:14:32,040 --> 00:14:33,541 వాటిని తినకుండా ఆపడం కష్టం, కదూ? 267 00:14:34,042 --> 00:14:35,835 -మీరు న్యూయార్క్ నుండి వచ్చారా? -లేదు. 268 00:14:35,919 --> 00:14:39,339 నేను అక్కుడున్న చాలా రెస్టారెంట్లకి సరుకు అమ్ముతాను, కాబట్టి చాలాసార్లు వెళ్తూ ఉంటాను. 269 00:14:39,422 --> 00:14:40,423 ఏయే చోటికి వెళతారు? 270 00:14:40,507 --> 00:14:45,470 గార్రిటీ ఫీల్డ్ ఇన్, బోనకార్టిస్… 271 00:14:45,554 --> 00:14:46,805 నాకు బోనకార్టిస్ ఇష్టం! 272 00:14:46,888 --> 00:14:49,224 -వాళ్ళు అమ్మే బీట్రూట్స్ నా ఫేవరేట్. -నాక్కూడా. 273 00:14:49,307 --> 00:14:51,434 వాళ్ళు అమ్మే మేపుల్ మస్టర్డ్ డ్రెస్సింగ్ ఇక్కడే చేస్తాం. 274 00:14:51,518 --> 00:14:54,312 -"ఇక్కడ" అంటే ఏంటి మీ ఉద్దేశం? -పొలం లేకుండా పొలం నుండి ఇంటికి 275 00:14:54,396 --> 00:14:55,814 ఆహారం ఎలా దొరుకుతుంది? 276 00:14:57,107 --> 00:14:59,901 -హాయ్, జో. -హాయ్, బెక్కీ. 277 00:14:59,985 --> 00:15:03,238 -ఆగండి. జో బిట్మార్క్ మీరేనా? -అడిగేది ఎవరన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. 278 00:15:03,321 --> 00:15:07,033 తను మా అక్క, స్టెఫ్. వీళ్ళు నా కజిన్స్ లిజ్జీ, చార్లెస్. 279 00:15:07,117 --> 00:15:10,328 బిట్మార్క్స్ కి స్వాగతం. నీ చెయ్యి ఎలా ఉంది తల్లీ? 280 00:15:10,412 --> 00:15:11,580 చాలా బాగుంది. 281 00:15:11,663 --> 00:15:15,166 మంచి విషయం. నా పీచ్ చెట్టు నిన్ను మిస్సయింది. 282 00:15:15,792 --> 00:15:17,711 ఇంకో మంచి వార్త కూడా ఉంది. 283 00:15:19,379 --> 00:15:21,047 మాకు ఏం దొరికిందో చూడండి. 284 00:15:21,131 --> 00:15:22,841 హాయ్, క్యూటీ. 285 00:15:24,050 --> 00:15:25,051 తన పేరేంటి? 286 00:15:27,012 --> 00:15:29,264 అది మీది కాదా? 287 00:15:30,181 --> 00:15:31,308 లేదు. సారీ. 288 00:15:33,226 --> 00:15:36,104 పాపం ఫ్లాష్. ఇది ఇంటికి వెళ్లాలనుకుంటోంది అంతే. 289 00:15:38,815 --> 00:15:41,192 సరే, మనం వెళ్లి వెతుకుదాం. 290 00:15:41,276 --> 00:15:42,319 గుడ్ లక్. 291 00:15:43,612 --> 00:15:45,530 -మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. -హేయ్, నాక్కూడా. 292 00:15:45,614 --> 00:15:47,032 హేయ్, కుదిరితే మళ్ళీ రా. 293 00:15:47,115 --> 00:15:50,493 నేను పేర్ తో బాల్సామిక్ గ్లేజ్ చేస్తున్నాను, ఎలా ఉందో చెబితే సంతోషిస్తాను. 294 00:15:50,577 --> 00:15:51,578 ఖచ్చితంగా వస్తాను. 295 00:15:59,169 --> 00:16:00,545 ఇప్పుడు మనం ఏం చేయాలి? 296 00:16:01,171 --> 00:16:02,589 నాకు తెలీదు. 297 00:16:02,672 --> 00:16:04,758 మనం ఏదో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. 298 00:16:05,592 --> 00:16:07,302 మళ్ళీ ఆధారాలన్నిటినీ పరిశీలిద్దాం. 299 00:16:08,511 --> 00:16:09,596 నాకు తెలుసు. 300 00:16:09,679 --> 00:16:12,015 కొన్నిసార్లు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిదేమో. 301 00:16:12,098 --> 00:16:14,100 మీ బుర్రలకి పదును పెట్టడానికి ఇంకేదైనా చేద్దాం. 302 00:16:14,684 --> 00:16:18,104 హేయ్, బెక్స్. మనం సిటీలో ఉన్నప్పుడు నాకు స్టడీ బ్రేక్ కావాలంటే ఏం చేసే వాళ్ళమో గుర్తుందా? 303 00:16:18,188 --> 00:16:20,815 నన్ను సెంట్రల్ పార్కుకి తీసుకెళ్ళే దానివి. మనం ఫ్రిస్బీ ఆడేవాళ్ళం. 304 00:16:20,899 --> 00:16:22,150 దూరంగా వెళ్ళు. 305 00:16:28,990 --> 00:16:30,867 -వావ్. -సూపర్. 306 00:16:30,951 --> 00:16:32,744 చాలా అద్భుతంగా చేశావు, ఫ్లాష్. 307 00:16:33,578 --> 00:16:35,580 ఇది ఖచ్చితంగా ఇంతకుముందు ఈ ఆట ఆడింది. 308 00:16:35,664 --> 00:16:38,416 ఏ ఇతర జాతి కుక్కల కన్నా బోర్డర్ కోలీస్ జాతి కుక్కలు ఎక్కువ ఫ్రిస్బీ డాగ్ 309 00:16:38,500 --> 00:16:39,876 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ గెల్చుకున్నాయి. 310 00:16:39,960 --> 00:16:41,378 ఆగండి. డ్రకర్స్ దగ్గర 311 00:16:41,461 --> 00:16:44,422 అది నీళ్ళకోసం అరిచింది కానీ కొంచెం కూడా తాగని విషయం గుర్తుందా? 312 00:16:44,506 --> 00:16:48,468 -ఎందుకంటే దానికి కావాల్సింది నీళ్ళు కాదు. -ఫ్రిస్బీ కోసం మొరిగింది! 313 00:16:48,552 --> 00:16:51,096 షెర్మాన్ క్రీక్ దగ్గర పిల్లలు అల్టిమేట్ ఫ్రిస్బీ ఆడడం చూశాను. 314 00:16:51,179 --> 00:16:53,682 బహుశా వాళ్ళకేదైనా తెలుస్తుందేమో. ఎక్కువ దూరం కాదు. వెళ్దాం పదండి. 315 00:16:59,437 --> 00:17:01,439 నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నాను. 316 00:17:05,569 --> 00:17:07,487 మనం వచ్చిన చోటు ఫ్లాష్ కి తెలుసనుకుంటా. 317 00:17:07,571 --> 00:17:08,780 అది మంచి విషయం. 318 00:17:09,613 --> 00:17:12,909 బిట్మార్క్స్ లో జరిగింది చూశాక, నేను అస్సలు ఆశ పెట్టుకోవట్లేదు. 319 00:17:12,993 --> 00:17:15,870 క్లోయి! హేయ్, చూడండి! ఎవరో క్లోయిని తీసుకొచ్చారు. 320 00:17:16,454 --> 00:17:18,915 క్లోయి! ఇక్కడికి రా. 321 00:17:18,998 --> 00:17:21,543 -ఇప్పుడు నువ్వు ఆశ పడొచ్చనుకుంటా. -హాయ్. 322 00:17:22,419 --> 00:17:23,545 అయితే, క్లోయి మీ కుక్కా? 323 00:17:24,254 --> 00:17:25,921 అయితే బాగుండేది. అది పెన్నీది. 324 00:17:26,006 --> 00:17:28,091 ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చాలా భయపడిపోయాను. 325 00:17:29,009 --> 00:17:32,262 క్లోయిని కనిపెట్టినందుకు చాలా థాంక్స్. నేను దీనికోసం చాలా కంగారుపడ్డాను. 326 00:17:33,138 --> 00:17:35,599 హేయ్. నేను ఇందాక మీకు పిజ్జా డెలివర్ చేశాను కదూ. 327 00:17:35,682 --> 00:17:38,518 -నిజానికి రెండు పిజ్జాలు. -అవును, నాకు గుర్తుంది. 328 00:17:38,602 --> 00:17:40,770 -నీ పేరు స్టెఫ్, కదూ? -అవును. 329 00:17:40,854 --> 00:17:42,564 ఏయ్, ఉదయం అలా ప్రవర్తించినందుకు సారీ. 330 00:17:42,647 --> 00:17:46,026 క్లోయి కనపడకపోయే సరికి నా మనసేమీ బాలేదు. నా షిఫ్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూశాను. 331 00:17:46,109 --> 00:17:48,403 పరవాలేదు. నేను కూడా అదే పని చేసేదాన్ని. 332 00:17:48,486 --> 00:17:50,113 హేయ్, ఇది చూడండి. 333 00:17:57,787 --> 00:17:59,164 వావ్. 334 00:17:59,247 --> 00:18:00,790 బాగా చేశావు, క్లోయి. 335 00:18:01,374 --> 00:18:02,584 మీరు కూడా ఆడతారా? 336 00:18:02,667 --> 00:18:04,294 -నేను ఆడతాను. -నేను కూడా. 337 00:18:04,377 --> 00:18:06,880 సరే. కానీ ముందే చెబుతున్నాను, ఈ ఆటని బెక్స్, నేను చాలా బాగా ఆడతాం. 338 00:18:06,963 --> 00:18:08,840 అంటే, మేము సెంట్రల్ పార్కులో ఆడేవాళ్ళం. 339 00:18:10,508 --> 00:18:12,135 సరే, రండి అయితే. 340 00:18:14,888 --> 00:18:16,806 బాగా చేశావు, డిటెక్టివ్ బ్రానిగన్. 341 00:18:27,484 --> 00:18:29,319 అయితే, ఈ వీకెండ్ నేను ఏమేం మిస్సయ్యాను? 342 00:18:29,986 --> 00:18:31,112 స్నానం కాకుండానా? 343 00:18:32,322 --> 00:18:34,074 నువ్వు లిండాలాగా చేస్తున్నావు. 344 00:18:34,157 --> 00:18:36,284 దగ్గరికి రా. ఆపు. 345 00:18:37,118 --> 00:18:40,163 ఆ విధంగా ఫ్రిస్బీ ఆడే కుక్క ఫ్లాష్ కథ ముగిసింది. 346 00:18:42,249 --> 00:18:44,584 కానీ ఈసారి నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే, 347 00:18:46,169 --> 00:18:47,754 ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేశారు? 348 00:18:48,630 --> 00:18:50,840 లేదా "ఎవరి" సాయం పొందారు? 349 00:18:51,758 --> 00:18:54,761 బహుశా అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుందేమో. 350 00:18:59,391 --> 00:19:01,935 నువ్వు బయటికి మాట్లాడుతున్నావని తెలుస్తోందా? 351 00:19:03,270 --> 00:19:04,729 థాంక్స్. 352 00:19:26,960 --> 00:19:28,962 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 353 00:20:44,955 --> 00:20:46,957 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ