1 00:00:05,090 --> 00:00:06,925 నేను యామ్యులెట్ కోసం వెళ్తున్నాను. 2 00:00:07,008 --> 00:00:09,511 ఆగు! వరూవియన్ స్క్రోల్ లో ఏం రాసుందో గుర్తుందా? 3 00:00:09,594 --> 00:00:14,558 "బహుమతిని గెల్చుకుని మనందరినీ రక్షించాలంటే, మనమందరం ఏకమవ్వాలి, లేదంటే అందరం నాశనం అవుతాం." 4 00:00:14,641 --> 00:00:16,601 మనందరం కలిసి పనిచేయాలి. అందుకు ప్రణాళిక వేసుకోవాలి. 5 00:00:16,685 --> 00:00:19,145 మనకి ప్రణాళిక వేసే సమయం లేదు. అది మాయమైపోతోంది. 6 00:00:19,229 --> 00:00:21,815 లేదు! గెలవాలంటే మన శక్తులన్నిటినీ ఏకం చేయాలి. 7 00:00:21,898 --> 00:00:23,108 ఐకమత్యమే మంత్రం! 8 00:00:23,191 --> 00:00:25,026 దాని గురించి కంగారుపడకండి. నేను చూసుకుంటాను. 9 00:00:25,110 --> 00:00:26,528 లిజ్జీ, వద్దు! 10 00:00:26,611 --> 00:00:30,490 ఏంటి? మనం గెలవాలని ప్రయత్నం చేస్తున్నాను. నేనే బెస్ట్ ప్లేయర్ ని. 11 00:00:30,574 --> 00:00:32,951 నిజంగానా, లిజ్జీ? మనందరం కలిసి పనిచేయాలి. 12 00:00:33,034 --> 00:00:35,370 దీన్ని యూనిటీ క్వెస్ట్ అనడానికి కారణం ఉంది. 13 00:00:35,453 --> 00:00:38,957 గెలవడం మాత్రమే ఇందులో ముఖ్యం కాదు. ఒకరితో ఒకరు సహకరించుకోవడం కూడా ముఖ్యం. 14 00:00:39,040 --> 00:00:41,167 నేను బాగా సహకరిస్తాను. 15 00:00:41,251 --> 00:00:42,502 దాదాపు నాలాగే. 16 00:00:43,003 --> 00:00:44,504 తెలిసి కూడా బాధపడడం ఎందుకు? 17 00:00:44,588 --> 00:00:47,173 చార్లెస్! లిజ్జీ! మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. 18 00:00:51,511 --> 00:00:53,805 నేను చెప్పింది నీకు గుర్తుందో లేదో… 19 00:00:53,889 --> 00:00:55,515 -బడ్డీ! -బడ్డీ! 20 00:00:56,725 --> 00:00:57,726 -హాయ్. -హాయ్. 21 00:01:00,186 --> 00:01:02,147 ఆగు, ఇది ఇక్కడికి ఎందుకొచ్చింది? దీనికి బానే ఉందా? 22 00:01:02,230 --> 00:01:05,190 బడ్డీ బాగానే ఉంది. కాకపోతే పార్కర్స్ కుటుంబంతో దీనికి పొత్తు కుదరలేదు. 23 00:01:05,275 --> 00:01:09,112 కొత్త ఇంట్లో అలవాటు పడడానికి ఏ కుక్కకైనా టైం పడుతుందని వాళ్ళకి చెప్పారా? 24 00:01:09,195 --> 00:01:11,656 వాళ్ళు దీన్ని వదిలేస్తారని నేను అస్సలు ఊహించలేదు. 25 00:01:11,740 --> 00:01:14,701 బడ్డీ చాలా మంచి కుక్కపిల్ల. దీనికి ఇలా అవ్వడం బాలేదు. 26 00:01:14,784 --> 00:01:16,161 లేదు, దీన్ని ఉంచుకునే అర్హత వాళ్ళకు లేదు. 27 00:01:16,244 --> 00:01:18,455 తమ కుటుంబం చాలా బాధపడుతోందని పార్కర్ వాళ్ళ అమ్మ చెప్పింది. 28 00:01:18,538 --> 00:01:21,207 కానీ బడ్డీ ఇంటికి వచ్చినప్పటి నుండీ ముభావంగా ఉంది. 29 00:01:21,291 --> 00:01:23,251 ఎప్పుడూ దాక్కుని ఉండేది, సరిగా తినేది కాదు. 30 00:01:23,335 --> 00:01:26,087 బరువు తగ్గిపోవడం మొదలైంది. దీని ఆరోగ్యం గురించి వాళ్ళు చాలా ఆందోళన చెందారు. 31 00:01:26,171 --> 00:01:27,839 కానీ బడ్డీకి తినడం ఇష్టంగా ఉండేది. 32 00:01:28,465 --> 00:01:31,885 అది తికమక పడినట్లుంది. పాపం. 33 00:01:33,094 --> 00:01:36,306 నాకు తెలీదు. మీ ఇద్దరినీ చూసి అది చాలా సంతోషించింది. 34 00:01:36,389 --> 00:01:38,767 మీరు బడ్డీతో ఆడుకుంటూ ఉండండి, నేను మార్కెట్ కి వెళ్లొస్తాను. 35 00:01:38,850 --> 00:01:41,603 -ఏవైనా స్నాక్స్ తీసుకొస్తావా? -బడ్డీ కోసమా? ఏం తెమ్మన్నా తెస్తాను. 36 00:01:41,686 --> 00:01:43,772 మాకోసం అడుగుతున్నాను. 37 00:01:43,855 --> 00:01:46,066 -నువ్వు ఏమనుకుంటున్నావో తనకి తెలుసు. -బాగా కనిపెట్టావు. 38 00:01:46,858 --> 00:01:49,653 -హాయ్, బడ్డీ. -హాయ్. 39 00:01:49,736 --> 00:01:50,946 హాయ్. 40 00:01:53,698 --> 00:01:56,409 మన దగ్గరికి ఒక్క కుక్క కూడా తిరిగి రాలేదు. 41 00:01:56,493 --> 00:02:00,330 సరైన కుటుంబంలోకి బడ్డీని పంపించనందుకు నాకు చాలా బాధగా ఉంది. 42 00:02:00,413 --> 00:02:02,415 నా ఉద్దేశం, బడ్డీకి అలాగే వాళ్ళకు కూడా. 43 00:02:03,416 --> 00:02:06,253 హేయ్, మామూలుగా మీరు ఎప్పుడూ విజయం సాధిస్తారు. 44 00:02:06,336 --> 00:02:10,799 ఈ ఒక్కసారే ఇలా జరిగింది. ఎప్పుడైనా అలా జరగొచ్చు. నాకు తెలుసు. 45 00:02:12,342 --> 00:02:16,471 "ఓడిపోవడానికి అవకాశమే లేదు" అనుకునే వాళ్ళకు ఏమీ తెలియదని అర్థం. 46 00:02:16,555 --> 00:02:20,725 ఇంకా చెప్పాలంటే, ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు విఫలమయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. 47 00:02:21,601 --> 00:02:24,437 చూశారా? మీ మూడ్ మార్చడంలో మేము విఫలమవుతున్నాం. 48 00:02:25,814 --> 00:02:29,150 విషయం మా మూడ్ మార్చడం గురించి కాదు. బడ్డీ గురించి. 49 00:02:29,234 --> 00:02:31,903 అది ఏ తప్పూ చేయలేదన్న విషయం దానికి తెలిస్తే చాలు. 50 00:02:32,571 --> 00:02:33,947 నువ్వు చాలా మంచి కుక్కపిల్లవి, బడ్డీ. 51 00:02:34,030 --> 00:02:37,701 నీకు నచ్చే ఇంటిని మేము కనిపెడతాం. నేను మాటిస్తున్నాను. 52 00:02:38,285 --> 00:02:39,202 మేము సాయం చేయొచ్చా? 53 00:02:39,995 --> 00:02:44,332 అలాగే. నిజంగా జరిగే యూనిటీ క్వెస్ట్ ఆటలో లాగా మనందరం కలిసి పనిచేయొచ్చు. 54 00:02:44,833 --> 00:02:45,834 ప్లాన్ బాగుంది. 55 00:02:49,671 --> 00:02:52,132 -బడ్డీ కూడా అలాగే అనుకుంటోంది. -అయితే మనం విఫలమవ్వలేదన్నమాట. 56 00:02:52,883 --> 00:02:53,884 నాకు తెలుసు. 57 00:02:59,556 --> 00:03:03,268 ఓకే, చార్లెస్. బడ్డీని పెంచుకోవడానికి వేయించే పాంప్లేట్ లో ఏ ఫోటో ఉంటే బాగుంటుంది? 58 00:03:03,768 --> 00:03:06,688 "నేను ముద్దుగా ఉంటాను, ఆడుకుంటాను, మీకు ముద్దులివ్వాలనుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారా?" 59 00:03:06,771 --> 00:03:10,150 లేదంటే "నేను సరదాగా ఉంటాను, ఎంతో ఉత్సాహంగా ఉంటాను. కాసేపు వాకింగ్ కి వెళదామా"? 60 00:03:10,233 --> 00:03:11,693 అవేమీ అవసరం లేదనుకుంటాను. 61 00:03:11,776 --> 00:03:15,071 బడ్డీకి అతీత శక్తులు ఉన్నాయని వేస్తే సరిపోతుంది. 62 00:03:15,155 --> 00:03:16,281 ఇది చూడు. 63 00:03:19,993 --> 00:03:22,579 -బూమ్. -దీనికి 50% అవకాశం ఉంది. 64 00:03:22,662 --> 00:03:24,414 మంచిది. మళ్ళీ చూడు. హేయ్, బడ్డీ. 65 00:03:28,501 --> 00:03:30,295 చూశావా? అతీత శక్తి. 66 00:03:30,378 --> 00:03:31,379 ఇంతకీ నీ చేతిలో ఏముంది? 67 00:03:31,463 --> 00:03:33,924 పిజ్జాపైన అట్టపెట్టెకు తగలకుండా ఉంచే ప్లాస్టిక్ ముక్క. 68 00:03:34,007 --> 00:03:37,260 చార్లెస్, బడ్డీకి అతీత శక్తులు లేవు. దానికి పిజ్జా వాసన వస్తోంది. 69 00:03:39,346 --> 00:03:40,847 నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా. 70 00:03:40,931 --> 00:03:42,557 నాకు మళ్ళీ ఆకలేస్తోంది. 71 00:03:43,266 --> 00:03:45,685 సరే అయితే, అమ్మమ్మా. హెల్ప్ చేసినందుకు థాంక్స్. 72 00:03:45,769 --> 00:03:46,811 సరే అయితే, బై. 73 00:03:48,438 --> 00:03:51,942 మా అమ్మమ్మ ఫ్రెండ్ బో దగ్గర బోలెడన్ని రక్షించి తెచ్చిన మంచి కుక్కలున్నాయి, 74 00:03:52,025 --> 00:03:53,276 పెద్ద పెరడు కూడా ఉంది. 75 00:03:53,360 --> 00:03:55,779 ఆయన బడ్డీని కలవాలనుకున్నారు, వెంటనే రమ్మన్నారు. 76 00:03:55,862 --> 00:03:57,572 -నేను లీష్ తీసుకొస్తాను. -మంచి పని. 77 00:03:57,656 --> 00:03:58,823 మంచి చోటులాగే ఉంది. 78 00:03:59,532 --> 00:04:03,995 కానీ గుర్తుపెట్టుకో, బడ్డీ, చివరి నిర్ణయం నీదే. 79 00:04:11,962 --> 00:04:14,381 ఓకే. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి... 80 00:04:15,173 --> 00:04:16,507 ఓకే, ఓకే. ప్రశాంతంగా ఉండండి. 81 00:04:19,134 --> 00:04:20,804 డోర్ బెల్ తో పనేముంది, అవునా? 82 00:04:21,805 --> 00:04:23,265 -చార్లెస్, శామీ? -అవును. 83 00:04:23,848 --> 00:04:25,058 ఆగండి. నేను జిగ్గీని పిలుస్తాను. 84 00:04:26,101 --> 00:04:28,603 జిగ్గీ! జిగ్గీ! 85 00:04:29,104 --> 00:04:30,105 జిగ్గీ ఎవరు? 86 00:04:32,399 --> 00:04:34,734 జిగ్గీ డాష్మండ్ జాతి కుక్క. మీ కొత్త కుక్కపిల్ల. 87 00:04:34,818 --> 00:04:36,319 మీకు అది ఖచ్చితంగా నచ్చుతుంది. 88 00:04:36,403 --> 00:04:38,572 కానీ మీకు ఒక కుక్కపిల్లని ఇద్దామని వచ్చాం. 89 00:04:38,655 --> 00:04:39,948 ఇది బడ్డీ. 90 00:04:40,740 --> 00:04:42,367 ఇది ఖచ్చితంగా చాలా ముద్దొస్తుంది. 91 00:04:42,450 --> 00:04:44,536 కానీ అర్థం చేసుకోవడంలో ఎక్కడో తేడా జరిగినట్లుంది. 92 00:04:44,619 --> 00:04:47,747 -మీరు కుక్కల్ని తీసుకుంటారని మా అమ్మమ్మ చెప్పింది. -నేను తీసుకుంటాను. 93 00:04:47,831 --> 00:04:51,084 దురదృష్టవశాత్తూ, దానర్థం తమ కుక్కల్ని నా తలుపు దగ్గర వదిలేసి వెళ్ళడం అని చాలామంది అనుకుంటారు. 94 00:04:51,167 --> 00:04:52,669 ఆ విధంగానే జిగ్గీని ఎవరో వదిలి వెళ్ళారు. 95 00:04:52,752 --> 00:04:55,589 నాకది ఇష్టమే కానీ, తప్పించుకోవడంలో దీన్ని మించింది లేదు, 96 00:04:55,672 --> 00:04:57,173 దీని భద్రత గురించి ఆందోళనగా ఉంది. 97 00:04:57,257 --> 00:04:59,175 నేను మీ అమ్మమ్మకి అదే చెప్పాను. 98 00:04:59,676 --> 00:05:00,969 అలా చెప్పాననే అనుకుంటున్నాను. 99 00:05:06,433 --> 00:05:08,059 ఇదే నా జిగ్గీ? 100 00:05:08,143 --> 00:05:10,645 నేను చెప్పానా? ఏదో విధంగా తప్పించుకునే మార్గం కనిపెడుతుంది. 101 00:05:15,108 --> 00:05:16,860 ఓహ్, జిగ్స్. 102 00:05:17,777 --> 00:05:19,779 నిన్ను తీసుకెళ్ళి మేమేం చేయాలి? 103 00:05:20,780 --> 00:05:22,032 జిగ్గీ. 104 00:05:23,074 --> 00:05:26,661 నేనెంత బాగా చేశానో చెప్పు. పొగిడావని పొగరుగా ఉండనులే. 105 00:05:28,663 --> 00:05:31,124 నాకు తెలీదు. కానీ ఏదో మిస్సయినట్లుగా అనిపిస్తోంది. 106 00:05:31,207 --> 00:05:32,792 -అవకాశమే లేదు. -అవును. 107 00:05:32,876 --> 00:05:34,044 నిజంగానా? 108 00:05:36,588 --> 00:05:37,923 ఇది పర్ఫెక్ట్ గా ఉంది. 109 00:05:38,632 --> 00:05:40,926 బంగారం, మా మధ్య చిన్న గొడవని తీర్చు తల్లీ. 110 00:05:46,973 --> 00:05:49,059 -ఇంకొంచెం ఆరెగానో వెయ్యాలి. -అంతే. 111 00:05:50,060 --> 00:05:51,061 బానే ఉంది. 112 00:05:51,144 --> 00:05:55,357 ఉల్లిపాయల రుచిని అది మించిపోతుంది, కానీ మీకెలా కావాలో అదే చేస్తాను. 113 00:05:55,440 --> 00:05:58,610 అయితే, శామీ వాళ్ళ అమ్మమ్మ మనకి సాయం చేసిందన్నమాట. 114 00:05:58,693 --> 00:05:59,945 అవును, చేసింది. 115 00:06:00,028 --> 00:06:03,740 కానీ, రెండోసారి బడ్డీకి వీడ్కోలు చెప్పడం ఇంకా కష్టంగా అనిపించింది తెలుసా! 116 00:06:03,823 --> 00:06:06,409 నాకు తెలుసు. అది స్పెషల్. 117 00:06:06,493 --> 00:06:10,121 అంటే, అవన్నీ స్పెషలే గాని, బడ్డీలో ఇంకా ఏదో ప్రత్యేకత ఉంది. 118 00:06:10,205 --> 00:06:11,998 దాని మొహం ఎంత ముద్దోస్తుందో! 119 00:06:12,082 --> 00:06:13,333 నువ్వనేది ఈ మొహం గురించేనా? 120 00:06:16,711 --> 00:06:18,421 చార్లెస్, ఏం జరుగుతోంది? 121 00:06:18,505 --> 00:06:20,465 అదో పెద్ద కథలే. 122 00:06:20,549 --> 00:06:22,801 కానీ అసలు విషయం ఏంటంటే, ఇది జిగ్గీ. 123 00:06:25,554 --> 00:06:28,890 "జిగ్గీ" 124 00:06:31,476 --> 00:06:33,937 అది గంట నుంచి అలానే హడావిడి చేస్తోంది. 125 00:06:34,020 --> 00:06:36,106 అంటే, మనతో దానికిది మొదటి రాత్రి కదా. 126 00:06:36,189 --> 00:06:37,941 అది కొద్దిగా కంగారు పడుతోంది అంతే. 127 00:06:39,401 --> 00:06:40,360 ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? 128 00:06:44,864 --> 00:06:45,991 అది చూసావా? 129 00:06:46,074 --> 00:06:49,035 జిగ్గీకి ఏమి తెస్తే నచ్చుతుందో బడ్డీకి సరిగ్గా తెలుసు. 130 00:06:51,371 --> 00:06:53,456 పార్కర్ ఫామిలీ తో బడ్డీకి 131 00:06:53,540 --> 00:06:56,585 సెట్ అవ్వలేదంటే, కొద్దిగా బాధగానే వుంది. 132 00:06:56,668 --> 00:07:00,881 కానీ కొంత కాలమే అయినా బడ్డీ మళ్ళీ మన దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 133 00:07:01,882 --> 00:07:03,383 నేను కూడా అదే అనుకుంటున్నాను. 134 00:07:04,259 --> 00:07:06,678 మీ అందరూ నిద్రపోవాల్సిన సమయం అయ్యింది. 135 00:07:06,761 --> 00:07:08,388 ఇప్పుడే పడుకుంటాం. 136 00:07:11,474 --> 00:07:13,435 బడ్డీ మంచి కుక్క. 137 00:07:13,518 --> 00:07:14,769 రా, జిగ్గీ. 138 00:07:17,564 --> 00:07:19,107 రేపు పొద్దున కలుద్దాం. 139 00:07:19,816 --> 00:07:21,651 నిన్ను కూడా, బుజ్జీ. 140 00:07:24,195 --> 00:07:26,823 నాకు అర్థం అయ్యింది. మాకు కూడా వెళ్ళడం ఇష్టం లేదు. 141 00:07:28,909 --> 00:07:30,285 ఒక్క నిమిషం ఆగు. 142 00:07:48,845 --> 00:07:49,971 రా. 143 00:08:05,695 --> 00:08:07,155 గుడ్ మార్నింగ్, జిగ్గీ. 144 00:08:08,740 --> 00:08:11,743 ఆగు. జిగ్గీ? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 145 00:08:11,826 --> 00:08:13,954 లిజ్జీ! జిగ్గీ దాని బోనులోంచి బయటకి వెళ్ళిపోయింది! 146 00:08:16,539 --> 00:08:17,749 ఇది సేఫ్ గానే వుంది. 147 00:08:19,000 --> 00:08:20,585 బుజ్జిగా కూడా. 148 00:08:20,669 --> 00:08:23,421 నీకు తప్పించుకోవడం బాగా వచ్చు, కదూ? 149 00:08:23,505 --> 00:08:25,507 నీ మీద ఒక కన్నేసి ఉంచాలి. 150 00:08:31,846 --> 00:08:33,056 చార్లెస్, వచ్చి చూడు. 151 00:08:34,140 --> 00:08:35,140 ఏంటిది? 152 00:08:35,225 --> 00:08:37,101 బడ్డీకి దాని మొదటి ట్రిక్ నేర్పించాను. 153 00:08:37,185 --> 00:08:39,229 రెడీనా? దొర్లు. 154 00:08:40,145 --> 00:08:41,438 దొర్లు... అయ్యో. 155 00:08:42,106 --> 00:08:43,108 భలే ట్రిక్ నేర్పించావే. 156 00:08:48,071 --> 00:08:49,155 ఏమైంది, బడ్డీ? 157 00:08:50,574 --> 00:08:51,866 హేయ్, జిగ్గీ ఎక్కడుంది? 158 00:08:51,950 --> 00:08:54,452 నాకు తెలీదు. జిగ్గీ? 159 00:08:54,536 --> 00:08:56,621 -జిగ్గీ! -జిగ్గీ! 160 00:09:03,712 --> 00:09:05,213 ఓహ్, అయ్యయ్యో. 161 00:09:07,966 --> 00:09:09,384 -జిగ్గీ! -జిగ్గీ! 162 00:09:10,010 --> 00:09:11,261 ఇదంతా నా తప్పే. 163 00:09:11,887 --> 00:09:15,307 లేదు, అదేం లేదు. డాష్మండ్ జాతి కుక్కలు సహజంగానే తొవ్వడంలో నిపుణులు. 164 00:09:15,390 --> 00:09:16,600 ఇది పెద్ద ప్రొఫెషనల్ లా ఉంది. 165 00:09:16,683 --> 00:09:19,436 అవును, కానీ నేను ఇంకా కొంచం జాగ్రత్తగా ఉండాల్సింది. 166 00:09:19,519 --> 00:09:21,855 జిగ్గీని తీసుకొచ్చి ఒక్క రోజు కూడా కాకముందే అది తప్పిపోయింది. 167 00:09:21,938 --> 00:09:25,859 అది తప్పిపోయింది, చార్లెస్. మనం ఒక జట్టు కదా, గుర్తుందా? 168 00:09:26,359 --> 00:09:28,194 అంటే దానర్థం కష్టం వచ్చినప్పుడు కూడా. 169 00:09:29,029 --> 00:09:31,823 -జిగ్గీ! -జిగ్గీ! 170 00:09:33,366 --> 00:09:35,952 అది ఎక్కడైనా ఉండొచ్చు. 171 00:09:36,036 --> 00:09:39,706 అవును. మన టీంకి హెల్ప్ అవసరం. 172 00:09:39,789 --> 00:09:40,790 అవును. 173 00:09:41,917 --> 00:09:42,918 జిగ్గీ! 174 00:09:44,085 --> 00:09:47,172 -దానికి తిండి కూడా పెట్ట్టాలి. -అర్థమయింది. మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. 175 00:09:47,255 --> 00:09:48,256 థాంక్స్, బంగారం. 176 00:09:48,340 --> 00:09:52,219 పైగా, బడ్డీకి ఖచ్చితంగా ఎంత గ్రేవీ కలిపితే నచ్చుతుందో నాకు బాగా తెలుసు. 177 00:09:52,302 --> 00:09:53,970 నా వంట నీకు ఇష్టం కదూ? 178 00:09:56,056 --> 00:09:57,682 -జిగ్గీ ఇంకా కనిపించలేదా? -ఇంకా లేదు. 179 00:09:57,766 --> 00:10:00,101 మనం శామీ, మరియాలకి కాల్ చేద్దాం, తర్వాత వెతకడం మొదలుపెడదాం. 180 00:10:00,894 --> 00:10:03,605 నేను ఫైర్ హౌస్ కి కాల్ చేస్తాను, వాళ్ళని కూడా చూడమని చెబుతాను. 181 00:10:03,688 --> 00:10:05,482 నేను మన ఇరుగుపొరుగు వారికి చెబుతాను. 182 00:10:05,565 --> 00:10:06,608 మీరిద్దరూ బెస్ట్. 183 00:10:09,486 --> 00:10:12,364 జిగ్గీకి కాలర్ ఉండడం మంచిదైంది. ఎవరికైనా దొరికితే 184 00:10:12,447 --> 00:10:14,199 మనకి తిరిగి ఇవ్వొచ్చు... 185 00:10:19,913 --> 00:10:22,123 -బో? -వినడానికి వింతగా ఉంటుందని తెలుసు. 186 00:10:22,207 --> 00:10:24,334 నా ఇంటినిండా కుక్కలే ఉన్నప్పటికీ, 187 00:10:24,834 --> 00:10:27,212 జిగ్గీ లేకపోతే చెప్పలేనంత లోటుగా ఉంది. 188 00:10:27,295 --> 00:10:29,548 అది నేను నిద్ర లేవగానే వచ్చి నా మొహమంతా నాకడాన్ని మిస్సవుతున్నాను. 189 00:10:29,631 --> 00:10:30,632 అవును. 190 00:10:31,383 --> 00:10:32,884 అయితే ఈ బుజ్జిది ఇప్పుడు ఎక్కడుంది? 191 00:10:37,556 --> 00:10:39,516 దాన్ని ఇప్పటికే పెంచుకోవడానికి తీసుకెళ్ళారు కదా? 192 00:10:41,560 --> 00:10:42,561 అదీ... 193 00:10:43,144 --> 00:10:45,272 నాకేమీ వింతగా లేదు. 194 00:10:45,355 --> 00:10:48,108 పీటర్సన్ పిల్లలు ఏదైనా గొప్పగా చేస్తారని పేరుంది. 195 00:10:50,318 --> 00:10:52,237 జిగ్గీని ఇంకా పెంపకానికి తీసుకోలేదు. 196 00:10:52,320 --> 00:10:53,363 అయితే చాలా మంచిది. 197 00:10:54,114 --> 00:10:55,907 కాదు, అది మంచిది కాదు. 198 00:10:58,159 --> 00:10:59,202 జిగ్గీ తప్పిపోయింది. 199 00:11:00,245 --> 00:11:02,289 ఫెన్స్ కింద గొయ్యి తవ్వి అది పారిపోయింది. 200 00:11:02,372 --> 00:11:03,790 ఓహ్, అయ్యో. 201 00:11:04,708 --> 00:11:06,042 జిగ్గీ. 202 00:11:07,252 --> 00:11:09,462 పర్వాలేదు, మేము దాన్ని కనుక్కుంటాం. 203 00:11:09,546 --> 00:11:11,381 కనుక్కునే దాకా మేం వదిలి పెట్టం. 204 00:11:11,464 --> 00:11:13,967 ఓకే. ఏ విషయం నాకు చెప్పండి. 205 00:11:14,593 --> 00:11:16,469 నేను... నేను కూడా దాన్ని వెతకడానికి వెళ్తున్నాను. 206 00:11:19,931 --> 00:11:21,057 -జిగ్గీ! -జిగ్గీ! 207 00:11:21,141 --> 00:11:22,434 జిగ్గీ! 208 00:11:22,517 --> 00:11:24,728 కమాన్ బుజ్జీ. ఎక్కడున్నావ్? 209 00:11:26,438 --> 00:11:29,482 మనమొక కుక్క పిల్లలని పోగొట్టుకున్నామంటే నమ్మబుద్ధి కావట్లేదు. 210 00:11:29,566 --> 00:11:31,151 ఇంతకంటే ఘోరమేమీ జరగదులే. 211 00:11:32,068 --> 00:11:35,155 అది అనుకోకుండా జరిగింది, అంతే. అందులో నీ తప్పేమీ లేదు. 212 00:11:35,238 --> 00:11:36,740 లేదు, మరియా, మేము ఇంకొంచెం బాధ్యతగా ఉండాల్సింది. 213 00:11:37,407 --> 00:11:40,327 మేము చూసుకునే ప్రతి కుక్కకీ మేమే బాధ్యత వహించాలి. 214 00:11:40,410 --> 00:11:41,995 కాని మేము ఇలా పోగొడుతుంటే, 215 00:11:43,121 --> 00:11:44,873 బహుశా వాటిని చూసుకోవడం మానేయాలేమో. 216 00:11:44,956 --> 00:11:46,875 అది నిజం కాదు, మరి గోల్డీ సంగతేంటి? 217 00:11:46,958 --> 00:11:49,669 నువ్వు నాకోసం, రూఫస్ కోసం దాన్ని కనిపెట్టి మా జీవితాల్లో సంతోషం నింపావు. 218 00:11:49,753 --> 00:11:53,256 బ్యాండిట్ తో కలిసి రోడ్ల మీద ప్రయాణిస్తూ తన జీవితం ఎంత గొప్పగా ఉందో టియో అంకుల్ అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. 219 00:11:53,340 --> 00:11:58,678 -నువ్వు నిజంగానే ఆ కుక్క జీవితం కాపాడావు. -అవును, కానీ ఈరోజు ఒక కుక్కపిల్లని పోగొట్టుకున్నాం కదా. 220 00:11:58,762 --> 00:12:01,348 మీ ఇద్దరూ కుక్కల్ని చాలా బాగా చూసుకుంటారు. 221 00:12:01,431 --> 00:12:04,434 కేవలం మేము మాత్రమే అలా అనుకోవట్లేదు. మాతో రండి. 222 00:12:04,517 --> 00:12:06,311 ఆగండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? 223 00:12:06,853 --> 00:12:07,938 మీ ఇంటికి. 224 00:12:14,361 --> 00:12:16,112 మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? 225 00:12:16,196 --> 00:12:18,573 -వీళ్ళు సహాయం చెయ్యడానికి వచ్చారు. -మీరెలా... 226 00:12:18,657 --> 00:12:20,951 మరియా, ఇంకా సేమీ జిగ్గీ గురించి చెప్పారు. 227 00:12:21,034 --> 00:12:23,870 -మేము ఎంత తొందరగా రాగలిగితే అంత తొందరగా ఇక్కడికి వచ్చాం. -మాకు సహాయం చెయ్యడం కోసమేనా? 228 00:12:23,954 --> 00:12:28,124 మీరు లేకపోతే, నేను అసలు స్కిప్పర్ ని కలిసే వాడినే కాదు, అది ఇప్పటికే నా జీవితాన్ని చాలా మార్చేసింది. 229 00:12:28,208 --> 00:12:29,876 మా స్టాఫ్ ఈ విషయాన్ని అందరికీ చెబుతున్నారు, 230 00:12:29,960 --> 00:12:32,629 స్కిప్పర్, నేను ఎంత దూరమైనా వెతకడానికి సిద్ధంగా ఉన్నాం. 231 00:12:32,712 --> 00:12:35,090 మాలీ అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. 232 00:12:36,258 --> 00:12:37,300 కానీ నేను చెప్తాను. 233 00:12:37,384 --> 00:12:39,219 నాకు అన్నీ మాలీనే. 234 00:12:39,302 --> 00:12:41,096 మేము డాగ్ పార్క్ లో పాంప్లేట్స్ ఇస్తాం. 235 00:12:41,179 --> 00:12:42,931 ప్రిన్సెస్, నేను నేరుగా ప్రాక్టీసు నుండి ఇక్కడికే వస్తున్నాం. 236 00:12:43,014 --> 00:12:46,601 ఈ టౌన్ మొత్తం వెతకడానికి ఈరోజు చేయాల్సిన వర్కవుట్ ని మా జూడో టీం పరుగు పందెంగా మార్చింది. 237 00:12:46,685 --> 00:12:49,854 నా మధ్యాహ్నం అపాయింట్మెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేశాను, మీకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం. 238 00:12:50,772 --> 00:12:52,899 ఇది ఎంతో అద్భుతంగా ఉంది. 239 00:12:53,400 --> 00:12:57,028 మీరందిరి సాయంతో జిగ్గీని చాలా తేలిగ్గా కనిపెట్టొచ్చు. 240 00:12:57,112 --> 00:12:59,322 మనందరం ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు సంప్రదించుకుంటే మంచిది. 241 00:12:59,406 --> 00:13:01,491 -బ్యాండిట్. -టియో అంకుల్, మీరు వచ్చేశారా. 242 00:13:02,951 --> 00:13:04,536 మొత్తానికి వచ్చేశాం. 243 00:13:05,453 --> 00:13:06,913 హాయ్, బ్యాండిట్. 244 00:13:08,665 --> 00:13:10,458 బ్యాండిట్, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాం. 245 00:13:11,251 --> 00:13:12,586 ఇదిగో మిడిల్టన్ మ్యాప్. 246 00:13:15,755 --> 00:13:18,383 మీరు పెంచుకోవడానికి కుక్కలు ఇచ్చిన వారందరికీ మేము విషయం చెప్పాం. 247 00:13:18,466 --> 00:13:20,051 ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 248 00:13:21,094 --> 00:13:22,596 నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. 249 00:13:22,679 --> 00:13:24,222 ఉక్కిరిబిక్కిరిగా ఉంది. 250 00:13:25,682 --> 00:13:26,683 మీరిలా వచ్చినందుకు థాంక్స్. 251 00:13:26,766 --> 00:13:30,478 ఎప్పుడైనా సరే. మీరు ఇకపై కుక్కని ఎప్పుడూ పోగొట్టుకోరని అనుకుంటున్నాను. 252 00:13:30,562 --> 00:13:32,188 కానీ ఒకవేళ పోతే, నేనున్నాను. 253 00:13:34,816 --> 00:13:36,651 జిగ్గీని మేం కనిపెడతాం, సరేనా. 254 00:13:36,735 --> 00:13:39,237 నాకు తెలుసు. ఎందుకంటే ఇది యూనిటీ క్వెస్ట్ కదా. 255 00:13:40,363 --> 00:13:42,115 ఎందుకంటే ఇది యూనిటీ క్వెస్ట్ కదా. 256 00:13:42,198 --> 00:13:44,659 ఒక మందుల షాపు అతను ఒక కుక్క ఐదో వీధి వైపు వెళ్ళడం చూశాడు. 257 00:13:44,743 --> 00:13:46,494 -ఐదో వీధి. థాంక్స్. -అర్థమయింది. 258 00:13:46,578 --> 00:13:48,455 -హాయ్, నేను రెమీని. -ఏంటో చెప్పు. 259 00:13:48,538 --> 00:13:51,291 నేను ఫైర్ హౌస్ లో ఉండే మెగ్ దగ్గరికి వెళ్లాను. ఆవిడ నన్ను గుర్తుపట్టింది. 260 00:13:51,374 --> 00:13:55,378 ఏదేమైనా, బేస్ బాల్ గ్రౌండ్స్ దగ్గర ఒక చిన్న నల్ల కుక్క వెళ్లిందని తెలిసింది. 261 00:13:55,462 --> 00:13:57,464 -నేను వెంటనే వస్తున్నాను. -థాంక్స్, రెమీ. 262 00:13:57,547 --> 00:14:00,634 వెల్కమ్. రెమీ అవుట్. బై! 263 00:14:00,717 --> 00:14:02,594 బేస్ బాల్ గ్రౌండ్స్. చెక్. 264 00:14:02,677 --> 00:14:05,138 నేను సరైన బటన్ నొక్కుతున్నానో లేదో నాకు తెలీదు. హలో? 265 00:14:05,805 --> 00:14:08,391 -చెప్పండి, ఫీబీ. -మంచిది. నేను స్కూల్ దగ్గర ఉన్నాను. 266 00:14:08,475 --> 00:14:11,019 జిగ్గీ పార్కింగ్ లాట్ వైపుగా పరిగెత్తి వెళ్ళడం నేను చూశాను. 267 00:14:11,102 --> 00:14:15,607 -నేను దగ్గరికి వెళ్లేసరికి, అది వెళ్ళిపోయింది. -అది జిగ్గీయే, సరే అయితే. థాంక్స్, ఫీబీ. 268 00:14:15,690 --> 00:14:19,236 నాకో క్రమం కనిపిస్తోంది. అది పడమర దిశగా వెళుతోంది. 269 00:14:19,319 --> 00:14:22,197 శామీ రిపోర్ట్ చేస్తున్నాడు. మరియా, నేను టార్గెట్ ని చూశాం కానీ మిస్సయ్యాం. 270 00:14:22,280 --> 00:14:24,783 మాకు దాన్ని పట్టుకోవడానికి బ్యాకప్ కావాలి. ఓవర్. 271 00:14:24,866 --> 00:14:25,951 -ఏంటి? -నేను మరియాని. 272 00:14:26,034 --> 00:14:28,370 జిగ్గీ ఎల్మ్ సర్కిల్ దిశగా బ్రాడ్ ఎవెన్యూ వెళుతోంది. 273 00:14:28,453 --> 00:14:30,747 ఎల్మ్ సర్కిల్! బో ఉండేది అక్కడే. 274 00:14:30,830 --> 00:14:33,375 అది ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అచ్చం లక్కీ చేసినట్లే చేస్తోంది. 275 00:14:33,458 --> 00:14:35,043 మళ్ళీ తన జట్టు దగ్గరికి వెళుతోంది. 276 00:14:35,126 --> 00:14:38,004 అలాగే, మరియా. ఎల్మ్ వైపు వెళ్ళే సెడార్ లేన్ లో ఉన్నాం. 277 00:14:41,049 --> 00:14:42,050 ఎక్కండి. 278 00:14:42,634 --> 00:14:44,803 ఏంటి... మేమిక్కడ ఉన్నామని మీకెలా తెలుసు? 279 00:14:52,602 --> 00:14:53,853 హేయ్, బడ్డీ. 280 00:14:56,731 --> 00:14:58,733 -అది ఎటు పోయింది? -నాకు తెలీదు. 281 00:14:58,817 --> 00:15:00,402 మళ్ళీ తప్పించుకున్నట్లుంది. 282 00:15:04,906 --> 00:15:05,991 అది ఇక్కడ ఉందా? 283 00:15:06,074 --> 00:15:08,368 ఖచ్చితంగా చెప్పలేం. అది పెరట్లోకి పరిగెత్తింది. 284 00:15:08,451 --> 00:15:11,121 అది బయటికి రావడం చూడలేదు. కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు. 285 00:15:15,208 --> 00:15:17,460 బడ్డీ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. 286 00:15:17,544 --> 00:15:18,795 ఏంటి సంగతి బుజ్జీ? 287 00:15:21,548 --> 00:15:24,551 జిగ్గీ ఆ పొదలో ఉందని చెబుతోంది. నాకు తెలుసు. 288 00:15:24,634 --> 00:15:26,261 ఓకే. నేను పట్టుకుంటాను. 289 00:15:30,098 --> 00:15:33,810 లేదు, అందరం కలిసి చేద్దాం. యూనిటీ క్వెస్ట్ స్టైల్లో చేద్దాం. 290 00:15:40,859 --> 00:15:41,860 రెడీ. 291 00:15:47,657 --> 00:15:50,660 పరవాలేదు, జిగ్గీ. కమాన్. 292 00:15:50,744 --> 00:15:53,288 నాకు తెలీదు, చార్లెస్. నాకేమీ కనిపించడం లేదు. 293 00:16:03,173 --> 00:16:04,174 అది ఇక్కడే ఉంది. 294 00:16:04,257 --> 00:16:07,427 -అవును! -జిగ్గీ! బడ్డీ సరిగ్గా చెప్పింది. 295 00:16:07,510 --> 00:16:08,929 పరవాలేదు, జిగ్గీ. కమాన్. 296 00:16:09,554 --> 00:16:10,722 నాకు తెలుసు. 297 00:16:12,015 --> 00:16:13,016 దొరికావు. 298 00:16:13,642 --> 00:16:15,977 జిగ్గీ, నువ్వు మామూలు కుక్కవి కాదు. 299 00:16:16,937 --> 00:16:20,690 నేను ఎన్నో రెస్క్యూలు చూశాను, ఇది వాటికి ఎంతమాత్రం తీసిపోదు. 300 00:16:20,774 --> 00:16:22,817 ఒక్క నిమిషం కూడా మేము మిమ్మల్ని అనుమానించలేదు. 301 00:16:22,901 --> 00:16:23,902 మేము కూడా. 302 00:16:27,364 --> 00:16:28,531 మనం సాధించాం. 303 00:16:29,282 --> 00:16:32,953 ఇక్కడున్నావా. ఓహ్, జిగ్స్. 304 00:16:33,036 --> 00:16:36,998 నేను ఎంతో కంగారు పడ్డాను. నన్ను క్షమించు. 305 00:16:38,291 --> 00:16:40,794 థాంక్యూ, గైస్. మీరిద్దరూ నిజంగా బెస్ట్. 306 00:16:41,711 --> 00:16:43,088 అదా, మాకు సాయం దొరికింది. 307 00:16:43,171 --> 00:16:44,631 బోలెడంత. 308 00:16:47,050 --> 00:16:49,177 మీరు మీ ఫెన్సింగ్ ని బాగు చేయించాలేమో. 309 00:16:49,261 --> 00:16:52,764 భూమి లోపల ఐదు అడుగులు, చుట్టూ మంచి మెష్ పెట్టిస్తాను. 310 00:16:53,598 --> 00:16:55,267 అంటే అర్థం ఏంటో నాకు తెలీదు. 311 00:16:56,476 --> 00:16:58,728 అంటే ఇదంటే నాకు చాలా ఇష్టమని అర్థం. 312 00:16:59,729 --> 00:17:01,606 -బై, జిగ్గీ. -బై, జిగ్గీ. 313 00:17:04,734 --> 00:17:06,652 సరే అయితే, గైస్. మళ్ళీ కలుస్తాను. 314 00:17:10,407 --> 00:17:12,993 అన్నిటికీ మళ్ళీ థాంక్స్. 315 00:17:13,075 --> 00:17:15,911 ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీకు కూడా అదే విషయం చెబుతారు. 316 00:17:18,582 --> 00:17:22,960 రాత్రిళ్ళు ఆడే ఆటలంటే నాకిష్టం. కానీ నిజ జీవితంలో చేసే అన్వేషణలు ఇంకా గొప్పగా ఉంటాయి. 317 00:17:23,044 --> 00:17:25,755 యామ్యులెట్స్ బదులుగా కుక్కలా? ఎప్పుడైనా సిద్ధమే. 318 00:17:26,715 --> 00:17:27,716 వెళ్దాం పద. 319 00:17:43,565 --> 00:17:45,358 ఒకదాని పని పూర్తయింది, ఇంకొకటి ఉంది. 320 00:17:45,942 --> 00:17:47,611 నేను ఇప్పటికే పాంప్లేట్స్ ప్రింట్ చేశాను. 321 00:17:47,694 --> 00:17:50,113 -రేపు మమ్మల్ని కారులో తిప్పితే... -ఖచ్చితంగా కుదరదు. 322 00:17:51,114 --> 00:17:52,657 ఓకే. 323 00:17:52,741 --> 00:17:53,867 నాన్నా, అయితే నీకు కుదురుతుందా? 324 00:17:53,950 --> 00:17:55,160 ఛాన్సే లేదు. 325 00:17:59,247 --> 00:18:00,373 మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు. 326 00:18:00,957 --> 00:18:03,376 ఎందుకంటే మేము బడ్డీ కోసం ఇప్పటికే ఇల్లు వెతికి పెట్టాం. 327 00:18:03,460 --> 00:18:05,128 మీరు వెతికారా? ఎప్పుడు? 328 00:18:05,212 --> 00:18:07,839 ఇప్పుడే. మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. ఇలా. 329 00:18:10,342 --> 00:18:14,512 -ఎలా... -అలా జరగదు. నిజంగానా? 330 00:18:14,596 --> 00:18:17,807 అలా చూసుకుంటే బడ్డీ ఇల్లు ఎలా కనిపెడతారు? మీరు చెప్పే దానికి అర్థం లేదు. 331 00:18:17,891 --> 00:18:20,310 లేదు, వాళ్ళు చెప్పేది నీకు అర్థం కావడం లేదు. 332 00:18:20,393 --> 00:18:23,021 మీ ఉద్దేశం నేను అనుకుంటున్నదేనా? 333 00:18:23,104 --> 00:18:26,107 -అది నువ్వేం అనుకుంటున్నావనే దానిపై ఆధారపడి ఉంటుంది. -నీ తమ్ముడికి చెప్పు. 334 00:18:27,025 --> 00:18:30,904 వాళ్ళు ఏమంటున్నారంటే బడ్డీ కొత్త ఇల్లు మనతో పాటే ఉంది, అది మన ఇల్లే. 335 00:18:30,987 --> 00:18:34,366 నిజంగా? మనం బడ్డీని ఉంచుకోబోతున్నామా? ఇప్పటివరకూ విన్న గొప్ప విషయం ఇదే. 336 00:18:34,449 --> 00:18:36,576 చివరికి మనం కుక్కని ఉంచుకోబోతున్నామంటే నమ్మలేకపోతున్నాను. 337 00:18:36,660 --> 00:18:39,329 ఆగు. చివరి నిర్ణయం తీసుకోవాల్సింది మనం కాదు. 338 00:18:44,918 --> 00:18:46,753 నువ్వు ఏమంటావు, బడ్డీ? 339 00:18:46,836 --> 00:18:48,630 మేము నీ కుటుంబంగా ఉండడం నీకిష్టమేనా? 340 00:18:54,511 --> 00:18:56,179 అది మనల్ని ఫూల్ చేయాలని చూసింది. 341 00:18:57,973 --> 00:18:59,891 అది మనల్ని ఏడిపిస్తోంది. 342 00:19:03,812 --> 00:19:05,855 -బడ్డీ. -నువ్వంటే మాకిష్టం, బడ్డీ. 343 00:19:06,523 --> 00:19:08,608 ఈ కుటుంబంలోకి స్వాగతం, బడ్డీ. 344 00:19:09,192 --> 00:19:10,193 హేయ్. 345 00:19:10,860 --> 00:19:12,445 -హాయ్. -హాయ్, బడ్డీ. 346 00:19:27,669 --> 00:19:29,671 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 347 00:20:45,664 --> 00:20:47,666 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ