1 00:00:10,637 --> 00:00:12,389 ప్రకాశించే సమయమైంది 2 00:00:23,483 --> 00:00:26,069 ఈ నీలి ప్రపంచంలో 3 00:00:26,152 --> 00:00:28,446 అంతరిక్షంలో తేలియాడుతూ 4 00:00:28,530 --> 00:00:31,491 నేను బాగానే ఉంటానని నాకు తెలుసు 5 00:00:31,575 --> 00:00:34,911 నేను బాగానే ఉంటానని నాకు తెలుసు 6 00:00:34,995 --> 00:00:37,205 నాకు సమస్య ఎదురైనప్పుడు 7 00:00:38,790 --> 00:00:42,419 ప్రియమైన డైరీ: ఇవాళ నా వీడియో డైరీ అయిన నిన్ను ప్రారంభిస్తున్నాను, 8 00:00:43,003 --> 00:00:48,091 ఎందుకంటే... ఒక మాటలో చెప్పాలంటే, నా జీవితం మొత్తం మారిపోతోంది. 9 00:00:49,342 --> 00:00:50,385 ఏం జరుగుతున్నాయో చూద్దాం. 10 00:00:51,303 --> 00:00:55,640 ఒకటి, నా బెస్ట్ ఫ్రెండ్, జస్టిన్ అలబామాకి వెళ్ళిపోతున్నాడు, 11 00:00:55,724 --> 00:00:58,184 దాంతో ఇక మిడిల్ స్కూల్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. 12 00:00:59,978 --> 00:01:03,148 రెండు, గడిచిన వేసవిలో నేను కనీసం ఒక్క ఇంచ్ కూడా ఎత్తు పెరగలేదు. 13 00:01:03,231 --> 00:01:04,858 అంటే, ఒక్క సెంటీమీటర్ కూడా పెరగలేదు. 14 00:01:05,859 --> 00:01:09,863 కానీ నా జుట్టు కొంచెం పెరిగింది, కాబట్టి అందువల్ల ఎత్తుగా కనిపించవచ్చు. 15 00:01:09,946 --> 00:01:11,197 నాకది బాగా నచ్చింది. 16 00:01:12,365 --> 00:01:15,410 అంటే, చెప్పడానికి అది మూడవ విషయం, కానీ రెండులో రెండో భాగం అనుకుందాం. 17 00:01:17,954 --> 00:01:19,205 ఇకపోతే మూడు. 18 00:01:21,041 --> 00:01:22,626 మా అమ్మకు ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడు. 19 00:01:24,878 --> 00:01:27,088 అవును. వింతగా ఉంది. 20 00:01:33,053 --> 00:01:34,137 ఇప్పుడు పర్లేదు. 21 00:01:35,180 --> 00:01:36,765 నాలుగు. 22 00:01:38,642 --> 00:01:39,726 మా నాన్న. 23 00:01:42,395 --> 00:01:44,105 ఆయన గురించి తర్వాత మాట్లాడతాలే. 24 00:01:45,273 --> 00:01:48,985 యాంబర్ బ్రౌన్ అనబడే నాకు, మార్పు అస్సలు నచ్చదు. 25 00:01:52,614 --> 00:01:55,617 డేవిడ్ బోవి 26 00:02:14,970 --> 00:02:17,722 మనం ఒకరికి ఒకరం తోడుగా లేకుండా మిడిల్ స్కూల్ ఎలా ప్రారంభించగలం? 27 00:02:18,682 --> 00:02:19,849 మనం అస్తమాను మాట్లాడుకుందాం. 28 00:02:19,933 --> 00:02:22,561 మా నాన్న పారిస్ వెళ్ళకముందు కూడా అలాగే అన్నారు. 29 00:02:22,644 --> 00:02:23,895 ఒట్టు. 30 00:02:24,896 --> 00:02:26,064 ఆయన కూడా ఒట్టు వేశారు. 31 00:02:26,565 --> 00:02:30,777 అంటే, నేనే గనుక పారిస్ లో ఉంటే బిజీగా ఉంటా. చాలా బిజీగా ఉంటా. 32 00:02:30,860 --> 00:02:36,366 ఫ్రెంచ్ టోస్ట్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ బ్రెడ్ తింటూ. 33 00:02:37,200 --> 00:02:38,201 నువ్వొక సన్నాసివి. 34 00:02:38,285 --> 00:02:39,578 వుయ్, వుయ్. 35 00:02:52,340 --> 00:02:53,383 దీనికి చాలా థాంక్స్. 36 00:02:53,967 --> 00:02:56,595 మన తింగరి మొహాలను మనం మర్చిపోకూడదు కదా. 37 00:02:56,678 --> 00:02:58,221 అందుకే కదా అద్దాలు ఉన్నది. 38 00:02:58,305 --> 00:02:59,723 నేననేది ఒకరిని ఒకరం మర్చిపోకూడదని. 39 00:02:59,806 --> 00:03:00,849 నాకు అర్థమైంది. 40 00:03:04,352 --> 00:03:05,729 అయితే... 41 00:03:07,939 --> 00:03:08,940 ది కింక్స్ 42 00:03:19,451 --> 00:03:22,329 -అయితే, ఇక వెళ్లి... -ఆ మాట అనొద్దు! 43 00:03:23,204 --> 00:03:24,414 మళ్ళీ కలుద్దాం. 44 00:03:24,497 --> 00:03:28,293 అవును. వెళ్ళొద్దాం. ఇది బెటర్. 45 00:03:30,587 --> 00:03:32,214 అవును, అది పర్లేదు. 46 00:03:32,839 --> 00:03:34,007 వెళ్ళొద్దాం. 47 00:03:51,566 --> 00:03:53,485 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 48 00:04:59,467 --> 00:05:02,345 -నేను రెడీ. యాంబర్. -సరే. 49 00:05:03,471 --> 00:05:05,473 నేను సిద్ధం. బాగా ఉన్నానా? 50 00:05:05,557 --> 00:05:06,600 కట్ కలర్ స్టైల్ 51 00:05:06,683 --> 00:05:07,893 అందంగా ఉన్నావు. 52 00:05:08,602 --> 00:05:10,812 నాన్న ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా రెడీ అయ్యేదానివి కాదు? 53 00:05:12,022 --> 00:05:14,065 నేను నాకోసం రెడీ అయ్యాను. 54 00:05:14,774 --> 00:05:16,651 ఎందుకంటే మ్యాక్స్ తో డేటింగ్ చేస్తున్నావు కాబట్టి. 55 00:05:17,235 --> 00:05:19,571 ఊరుకో. అతనికి కనీసం ఒక్క అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా? 56 00:05:19,654 --> 00:05:21,615 పామ్ అత్త అతనొక స్పోర్ట్స్ కార్ లాంటి వాడు అంది. 57 00:05:22,616 --> 00:05:24,784 -ఏంటి? -ఇదొక ఆకర్షణ అని. 58 00:05:26,786 --> 00:05:28,872 -ఓరి, దేవుడా. -ఊరికే అంటున్నాను అంతే. 59 00:05:28,955 --> 00:05:31,750 సరే, తెలివైన బుడంకాయ్. ఇక వెళదాం. పదా. 60 00:05:31,833 --> 00:05:35,545 అమ్మా, నాకు ఇప్పుడు 12 ఏళ్ళు, కాబట్టి "బుడంకాయ్" అనడం మానేస్తే బాగుంటుంది. 61 00:05:35,629 --> 00:05:36,713 సరేలే. 62 00:05:42,594 --> 00:05:45,430 హే, బుజ్జి. నీ సూప్ తెచ్చా. ఆకలిగా ఉందా? 63 00:05:45,513 --> 00:05:46,681 ఓరి, దేవుడా, ఆగు. 64 00:05:48,308 --> 00:05:50,101 చూడు. కొత్త వారు వస్తున్నారు. 65 00:05:53,063 --> 00:05:55,690 స్కూల్ మొదలుకాక ముందే ఇల్లు మారాలని అనుకుని ఉంటారు. 66 00:06:00,528 --> 00:06:01,821 వాళ్లకు కుక్క ఉంటే బాగుండు. 67 00:06:02,614 --> 00:06:05,450 -వాళ్లకు ఒక కూతురు ఉందని విన్నాను. -కుక్క అయితే బాగుండు. 68 00:06:06,159 --> 00:06:08,912 మన స్నేహితులు లేకపోవడం వల్ల చాలా వింతగా ఉంది, కదా? 69 00:06:08,995 --> 00:06:12,290 అవును. జస్టిన్ లేని లోటును ఒక్క కుక్క తప్ప ఇంకేం తీర్చలేదు. 70 00:06:13,708 --> 00:06:14,960 నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలిసింది. 71 00:06:15,043 --> 00:06:16,670 కుక్కలు పెంచుకునేవారు బెస్ట్ ప్రజలు! 72 00:06:16,753 --> 00:06:19,256 -నీకు బెస్ట్ కావాలని లేదా? -మనం కుక్కను పెంచుకోము. 73 00:06:19,339 --> 00:06:22,634 సరే, నేను కుక్క గురించి అడగడం మానేస్తా, మరి నా చెవులు కుట్టించుకోవచ్చా? 74 00:06:24,928 --> 00:06:26,429 ఆలోచించి చెప్తాను. 75 00:06:29,266 --> 00:06:30,684 హలో, డైరీ. 76 00:06:30,767 --> 00:06:34,479 తీర్పు వెలువడింది. నా ఫ్రెండ్ జస్టిన్ వాళ్ళ ఇంటిని కొత్తవాళ్లు తీసేసుకుంటున్నారు. 77 00:06:34,980 --> 00:06:37,399 ఇప్పుడు తాను ఎప్పటికీ రాడని ఖాయం అయిపోయింది. 78 00:06:38,608 --> 00:06:39,859 చూడు, వాళ్ళు వచ్చేసారు. 79 00:06:43,029 --> 00:06:44,030 డైరీ? 80 00:06:44,698 --> 00:06:46,116 అవును, నేను వీడియో డైరీ మైంటైన్ చేస్తున్నాను. 81 00:06:46,199 --> 00:06:48,034 అంటే, దాని వైపు చూస్తూ మాట్లాడతావా? 82 00:06:48,952 --> 00:06:49,953 అవును? 83 00:06:50,620 --> 00:06:51,621 నీతో నువ్వే? 84 00:06:51,705 --> 00:06:54,249 ఒకరు తమకి తాము లెటర్ రాసుకోవడం ఎలాగో ఇది కూడా అంతే. 85 00:06:54,332 --> 00:06:56,084 కాదు, అది నా థెరపిస్ట్ కి చూపించడానికి రాస్తుంటాను. 86 00:06:56,167 --> 00:06:58,879 -కానీ నువ్వు దాన్ని బయటకు చదువుతావు కదా. -ఎందుకంటే అది నాకు... 87 00:06:58,962 --> 00:07:02,424 బీప్, బీప్, బీప్, బీప్! 88 00:07:04,217 --> 00:07:06,136 ఆమె నీ వయసు అమ్మాయిలాగే ఉంది, అవును కదా? 89 00:07:09,097 --> 00:07:10,432 ఓరి, దేవుడా. 90 00:07:11,433 --> 00:07:13,018 హాయ్! హాయ్, నా పేరు సారా. 91 00:07:13,101 --> 00:07:15,270 ఇది... ఇది నా కూతురు. 92 00:07:17,063 --> 00:07:18,064 స్వాగతం! 93 00:07:18,148 --> 00:07:23,111 మంచిది. ధన్యవాదాలు. నా పేరు బ్రాండీ, పేరులో ఐ ఉంటుంది. మీకు కుక్క ఉందా? 94 00:07:23,820 --> 00:07:25,113 లేదు, లేదు. మీకు ఉందా? 95 00:07:26,031 --> 00:07:28,408 ఉంటే ఇంకేం. మా అమ్మకు గోల్డ్ ఫిష్ అంటే ఇష్టం. 96 00:07:30,827 --> 00:07:33,830 "సంతోష పడినందుకు అపరాధభావం కలగడం నాకు ఇష్టం లేదు. 97 00:07:35,457 --> 00:07:39,044 ఇది నాకు, నా సంతోషానికి సమయం. ఇది 'నా సమయం'". 98 00:07:39,628 --> 00:07:42,047 -స్పష్టంగా అర్ధమవుతుంది. -నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. 99 00:07:42,130 --> 00:07:44,716 నేను నా డైరీ నుండి చదవడం మానేస్తాను. 100 00:07:45,842 --> 00:07:46,885 పిజ్జా రెడీగా ఉంది. 101 00:07:49,638 --> 00:07:51,806 రేపు నన్ను స్కూల్ కి పామ్ అత్త తీసుకెళ్తుందా? 102 00:07:51,890 --> 00:07:53,975 అవును. అవును, రేపు ఉదయం 7:00కి ఇక్కడికి వస్తుంది. 103 00:07:58,688 --> 00:08:00,857 పక్కింటి వారి దగ్గరకు వెళ్లి నిన్ను నువ్వు పరిచయం చేసుకోవచ్చు కదా? 104 00:08:01,441 --> 00:08:02,651 అదేం... అదేం పర్లేదు. 105 00:08:05,028 --> 00:08:06,363 రేపటి గురించి ఉత్సాహంగా ఉన్నావా? 106 00:08:07,739 --> 00:08:08,573 ఏమో తెలీదు. 107 00:08:10,492 --> 00:08:12,827 అంటే, బహుశా జస్టిన్ వెళ్లిపోవడం 108 00:08:12,911 --> 00:08:16,164 నీకు కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి అవకాశం లాంటిది ఏమో? 109 00:08:17,207 --> 00:08:20,126 నువ్వు ఈ వీడియో డైరీ రికార్డు చేసుకోవడం చాలా బాగుంది. మంచి ఐడియాలా ఉంది. 110 00:08:20,210 --> 00:08:23,004 అలాగే నీకు ఆర్ట్ వేయడం బాగా వచ్చు, కానీ, నీకు స్నేహితులు కూడా కావాలి. 111 00:08:24,047 --> 00:08:25,966 అంటే, స్నేహితులు ఉంటే ఎంతకైనా మంచిది. 112 00:08:32,931 --> 00:08:34,224 నీకు మ్యాక్స్ అంటే ఎందుకు ఇష్టం? 113 00:08:39,729 --> 00:08:41,690 తను నన్ను నవ్విస్తాడు. 114 00:08:43,275 --> 00:08:44,985 అలాగే తనకి డాన్స్ వేయడం ఇష్టం. 115 00:08:45,068 --> 00:08:46,778 -అది... ఇక చాలు. -నేను... 116 00:09:01,710 --> 00:09:03,461 ఐ లవ్ మ్యాక్స్ 117 00:09:11,636 --> 00:09:13,221 అమ్మకానికి కలదు 118 00:09:21,438 --> 00:09:26,610 మనలో మాట, మా నాన్న కూడా అమ్మని బాగా నవ్వించేవాడు. 119 00:09:28,862 --> 00:09:30,155 ఊరికే చెప్తున్నాను. 120 00:10:14,241 --> 00:10:16,117 వేయగలడా? అందులోకి వేయగలడా? వేసాడు! 121 00:10:16,201 --> 00:10:17,744 -అవును. -అవును, వేసాడు. 122 00:10:20,872 --> 00:10:22,582 యాహూ! ఆహ్! 123 00:10:32,175 --> 00:10:33,593 హే, నాన్నా. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. 124 00:10:33,677 --> 00:10:34,678 అవునా? 125 00:10:34,761 --> 00:10:36,429 హలో, నా అందమైన కూతురా. 126 00:10:36,972 --> 00:10:38,682 ఇప్పుడు పారిస్ లో టైమ్ ఎంత అయింది? 127 00:10:38,765 --> 00:10:39,808 దాదాపు మధ్య రాత్రి అయింది. 128 00:10:39,891 --> 00:10:42,602 ఎదిగిన నా ఆరవ తరగతి కూతురికి 129 00:10:42,686 --> 00:10:44,729 -రేపటి గురించి శుభాకాంక్ష... -ఆగు. అర్ధరాత్రా? 130 00:10:44,813 --> 00:10:45,814 అవును. 131 00:10:46,523 --> 00:10:48,441 -ఇంకా ఎందుకు లేచి ఉన్నావు? -బయటకి రావాల్సి వచ్చింది. 132 00:10:49,192 --> 00:10:50,235 ఎక్కడికి? 133 00:10:50,318 --> 00:10:52,279 -భోజనానికి. -ఎవరితో? 134 00:10:53,405 --> 00:10:54,739 ఇక్కడ పెద్దవాడిని నేనా నువ్వా? 135 00:10:55,740 --> 00:10:56,908 మాములుగా అడుగుతున్నాను. 136 00:10:56,992 --> 00:10:58,577 నేను బిజినెస్ డిన్నర్ కి వచ్చాను. 137 00:10:58,660 --> 00:11:01,705 చిన్న వేడుక, కొంచెం ఎక్కువ సేపు గడపాల్సి వచ్చింది. 138 00:11:02,664 --> 00:11:04,374 నా ఫోన్ ఆగిపోతుంది. మన కాల్ కట్ అయితే, 139 00:11:04,457 --> 00:11:07,210 -నేను రేపు ఫోన్ చేస్తాను. -ఆ వేడుక దేనికి? 140 00:11:07,294 --> 00:11:08,712 మీ అమ్మే చెప్పే ఉండాలి. 141 00:11:08,795 --> 00:11:10,964 ఉద్యోగం గురించి. కంపెనీ విస్తరిస్తుంది, కాబట్టి, 142 00:11:11,047 --> 00:11:12,674 నేను బహుశా వెనక్కి వచ్చేయవచ్చు. 143 00:11:12,757 --> 00:11:14,134 ఆగు. ఇక్కడికా? 144 00:11:14,634 --> 00:11:18,930 అవును. "బహుశా" అని ఉండకూడదు. నేను కచ్చితంగా వెనక్కి వచ్చేస్తున్నాను. 145 00:11:19,014 --> 00:11:21,641 నా కొత్త ఆఫీసు నువ్వు, అమ్మా ఉండే ఇంటికి 20 నిమిషాల దూరంలో ఉంటుంది. 146 00:11:21,725 --> 00:11:23,143 ఏంటి? ఎప్పుడు? 147 00:11:23,226 --> 00:11:26,855 తేదీ ఖరారు కాగానే నేను ప్లాన్ చేస్తాను, ఒట్టు. 148 00:11:27,647 --> 00:11:28,815 బ్యాటరీ అయిపోతుంది, బంగారం. 149 00:11:28,899 --> 00:11:31,276 రేపు స్కూల్ లో బాగా గడుపు. ఐ లవ్ యు... 150 00:11:31,359 --> 00:11:32,360 నాన్నా? 151 00:11:33,528 --> 00:11:34,654 నాన్నా? 152 00:11:37,908 --> 00:11:39,743 నువ్వు వెనక్కి వస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. 153 00:11:47,375 --> 00:11:50,420 నాన్న ఇంటికి వచ్చేసరికి మ్యాక్స్ ఇంకా ఇక్కడే ఉంటాడో లేదో. 154 00:11:50,921 --> 00:11:54,507 అప్పుడు నేనేం చేయాలి? అమ్మ అన్నట్టే మ్యాక్స్ కి ఒక అవకాశం ఇవ్వాలా? 155 00:11:55,759 --> 00:11:59,387 మా నాన్న కూడా ఉంటారు కదా? అప్పుడు ఆయన ఏమనుకుంటారు? 156 00:12:00,138 --> 00:12:03,725 నేను ఆయన్ని తక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటారా? ఆయనే నన్ను ప్రేమించడం తగ్గుతుందా? 157 00:12:05,518 --> 00:12:08,021 ఇక్కడ మాతో నాన్న ఉండాలి. 158 00:12:11,608 --> 00:12:15,779 యాంబర్ బ్రౌన్ అనబడే నాకు, ఈ ఫొటోలో ఉన్న సమయానికి వెళ్లాలని ఉంది. 159 00:12:21,576 --> 00:12:22,577 ఏంటి? 160 00:12:33,880 --> 00:12:35,048 తెరువు. 161 00:12:40,887 --> 00:12:43,306 -హాయ్! -హలో. 162 00:12:43,390 --> 00:12:44,516 నా పేరు బ్రాండీ, పేరులో ఐ ఉంటుంది. 163 00:12:45,058 --> 00:12:49,729 నా పేరు యాంబర్, "యాం" మరియు "బర్" కలపాలి. 164 00:12:50,939 --> 00:12:51,940 తెలివిగా చెప్పావు. 165 00:12:52,023 --> 00:12:54,276 నువ్వు కూడా రేపటి నుండి పార్క్ రిడ్జ్ స్కూల్ కి వెళ్తున్నావా? 166 00:12:54,359 --> 00:12:55,652 -అవును. -నేను కూడా! 167 00:12:56,236 --> 00:12:57,904 ఓరి, దేవుడా. నువ్వు ఏం బట్టలు వేసుకుంటున్నావు? 168 00:12:58,488 --> 00:13:00,240 నేను అది ఇంకా ఆలోచించలేదు. 169 00:13:00,740 --> 00:13:02,450 నువ్వు భలే జోకులు వేస్తున్నావు! 170 00:13:03,201 --> 00:13:05,078 సరే, అలాగే. నాకేం చెప్పాల్సిన పని లేదు. 171 00:13:05,161 --> 00:13:08,290 నేను బహుశా బూట్లు, బ్లాక్ టైట్స్, 172 00:13:08,373 --> 00:13:10,750 షార్ట్స్ ఇంకా లోపల పొడవాటి స్లీవ్స్ ఉండే టాప్ వేసుకుంటా 173 00:13:10,834 --> 00:13:12,794 అలాగే, జుట్టును కాస్త లూజుగా వదిలేస్తా. 174 00:13:13,503 --> 00:13:15,589 సరే. వినడానికి బాగుంది. 175 00:13:15,672 --> 00:13:18,466 మంచిది. నువ్వు నీ జట్టును ఎలా స్టైల్ చేస్తావో చూడాలని ఉంది. 176 00:13:18,550 --> 00:13:19,801 ఇప్పుడు చూస్తున్నట్టే ఉంచుతా. 177 00:13:21,678 --> 00:13:24,264 నువ్వు చాలా ఫన్నీ. రేపు కలుద్దాం. 178 00:13:25,390 --> 00:13:26,391 సరే. 179 00:13:40,238 --> 00:13:42,115 -బేబీ... -నాతో మాట్లాడకు. పడిపోతా. 180 00:13:42,991 --> 00:13:46,369 క్షమించు. కానీ నీ నిశ్చితార్ధ ఉంగరం ఎక్కడ? 181 00:13:47,746 --> 00:13:50,290 నేను పెట్టుకోవడం లేదు. యాంబర్ కి ఇంకా ఆ విషయం చెప్పలేదు. 182 00:13:50,373 --> 00:13:52,751 నాకు తెలుసు. కానీ ఎక్కడ పెట్టావా అని అడుగుతున్నాను అంతే. 183 00:13:53,335 --> 00:13:55,670 అది... అది అక్కడ ఉంది. సురక్షితంగానే ఉంది. 184 00:13:56,338 --> 00:13:59,257 ఓహ్. అలాగే. చాలా సురక్షితం. తెరిచిన కిటికీ కింద ఉన్న షెల్ఫ్ లో అన్నమాట. 185 00:13:59,883 --> 00:14:02,052 అసలు నువ్వు విషయం ఇంకా తనకు ఎందుకు చెప్పలేదు, సారా? 186 00:14:02,135 --> 00:14:03,845 -తను ఏమీ అనుకోదు. -ఏమీ అనుకోదని నాకు తెలుసు, 187 00:14:03,929 --> 00:14:07,182 కానీ ముందు స్కూల్ కి వెళ్తే, తర్వాత చెపుదాం అనుకున్నాను. 188 00:14:07,265 --> 00:14:08,892 హే! హాయ్, బంగారం! 189 00:14:08,975 --> 00:14:09,976 గుడ్ మార్నింగ్, తల్లి! 190 00:14:11,186 --> 00:14:13,188 -నువ్వు రాత్రి మా ఇంట్లోనే ఉన్నావా? -యాంబర్? 191 00:14:13,271 --> 00:14:14,773 నన్ను క్షమించు. సరేనా, అమ్మా? 192 00:14:14,856 --> 00:14:18,360 ఇప్పుడేగా తెల్లారింది. మరీ ఇంత పొద్దున్నే వచ్చేసాడేంటని అడిగా. 193 00:14:18,443 --> 00:14:21,613 మేము ఉదయం జాగింగ్ చేస్తూ కలుసుకున్నాం, సరేనా? 194 00:14:21,696 --> 00:14:23,531 నీకు ప్రోటీన్ స్మూతీ కావాలా? 195 00:14:24,366 --> 00:14:25,742 మరీ పచ్చగా ఉంది. 196 00:14:25,825 --> 00:14:27,702 -ఇది బాగుంది. రుచిగా ఉంది. -ఇది ఆరోగ్యానికి మంచిది. 197 00:14:27,786 --> 00:14:29,537 రోజులో తినాల్సిన కూరగాయలన్నీ ఒకేసారి తాగెయొచ్చు. 198 00:14:29,621 --> 00:14:31,539 గుడ్ మార్నింగ్. 199 00:14:31,623 --> 00:14:34,376 నేను ఒక డోనట్ తింటా. ఒకటి కాకపోతే రెండు. 200 00:14:34,459 --> 00:14:36,211 -విషం. -అది నా స్వెట్టరా? 201 00:14:36,294 --> 00:14:38,547 -గుడ్ మార్నింగ్. అవును, నీదే. -అదెప్పుడు తీసుకెళ్ళావు? 202 00:14:38,630 --> 00:14:39,965 గుడ్ మార్నింగ్, పామ్. 203 00:14:40,048 --> 00:14:43,927 మ్యాక్స్. ఏమో. గత వారం అనుకుంట. యాంబర్ ని అడిగి నీ బీరువా నుండి తెప్పించా. 204 00:14:44,427 --> 00:14:46,012 నా నుండి ఇంకేం దొంగిలించావు? 205 00:14:47,180 --> 00:14:48,807 ఇదుగో. నేను నీకు టిఫిన్ తెచ్చా. 206 00:14:48,890 --> 00:14:51,268 తెచ్చినందుకు ధన్యవాదాలు, కానీ మాకు డోనట్స్ వద్దు. 207 00:14:51,351 --> 00:14:53,270 -నువ్వు స్మూతీ తాగితే మంచిది, బంగారం. -వదిలేయ్. అమ్మా. 208 00:14:53,353 --> 00:14:54,479 నువ్వు రాత్రి గడిపావా? 209 00:14:54,563 --> 00:14:56,940 -పామ్? -ఏంటి, మరీ పొద్దున్నే వచ్చేసాడని అడిగా, సారా. 210 00:14:57,023 --> 00:14:58,316 చాలా పొద్దున్నే. 211 00:14:58,400 --> 00:14:59,401 మా ఫ్రెండ్ గురించి అడుగుతున్నానులే. 212 00:14:59,484 --> 00:15:01,194 నేను రాత్రి ఇక్కడే గడపలేదు. 213 00:15:01,278 --> 00:15:02,487 నేను ఆ విషయం ఇందాకే అడిగా. 214 00:15:02,571 --> 00:15:04,489 దేనికోసం చూస్తున్నావు, బుజ్జి? 215 00:15:04,573 --> 00:15:06,199 నా బొగ్గు డ్రాయింగ్ పెన్సిల్ కనిపించడం లేదు. 216 00:15:06,283 --> 00:15:07,450 దీని మీద ఏం పడేసావు? 217 00:15:07,534 --> 00:15:09,369 ఒక మాట చెప్పనా? నేను తీసుకున్నప్పుడే దాని మీద అలా ఉంది. 218 00:15:09,452 --> 00:15:11,371 -బ్రేడ్ ముక్కలా? అదేం కాదు. -సరే, అలాగే. 219 00:15:11,454 --> 00:15:14,249 -ఇందాక కార్ లో డోనట్ తిన్నాను. -దీని మీద అంతా పంచదార పొడి పడింది. 220 00:15:14,332 --> 00:15:16,042 సరే, రెండు తిన్నాను. రెండు డోనట్స్ తిన్నాను. 221 00:15:16,126 --> 00:15:17,669 రెండా? ఇప్పుడు ఉదయం ఏడు. 222 00:15:17,752 --> 00:15:19,421 నువ్వు పది తిన్నా నేను పట్టించుకోను. 223 00:15:19,504 --> 00:15:20,839 ప్లీజ్? నాకు ఇక్కడ కడుపులో తిప్పుతోంది. 224 00:15:20,922 --> 00:15:23,341 -నేను ఈజిగా పది డోనట్స్ తినగలను. -నేను కూడా. 225 00:15:23,425 --> 00:15:25,135 -మరి 11 తినలేరా? -నా స్వెట్టర్ వేసుకొని 226 00:15:25,218 --> 00:15:27,596 తిననంత కాలం నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. 227 00:15:30,515 --> 00:15:33,143 -నేను బట్టలు ఉతికేటప్పుడు అలాగే చేస్తా. -ఇదుగో. కొత్తదానిలా చేశా. 228 00:15:33,226 --> 00:15:35,228 అమ్మా, నేను ఒక డోనట్ తినొచ్చా? 229 00:15:35,312 --> 00:15:36,897 మన ముందే ఉన్నాయి కదా. 230 00:15:36,980 --> 00:15:39,065 బుజ్జి, ఉదయమే అంత పంచదార తినడం మంచిది కాదు. 231 00:15:39,149 --> 00:15:40,150 అమ్మా, నా మాట విను. 232 00:15:40,233 --> 00:15:42,694 నా బెస్ట్ ఫ్రెండ్ జస్టిన్ వేరే ఊరు వెళ్ళిపోయాడు, 233 00:15:42,777 --> 00:15:45,196 కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్ లేకుండా నేను స్కూల్ ఏడాది మొదలుపెడుతున్నా. 234 00:15:45,280 --> 00:15:47,365 నువ్వు నా చెవులు కుట్టించలేదు. 235 00:15:47,449 --> 00:15:50,035 నా దగ్గర ఉంటానా, ఊడతానా అన్నట్టు ఉండే ఒక పాత సెల్ ఫోన్ మాత్రమే ఉంది... 236 00:15:50,118 --> 00:15:52,287 -అంటే... - ...అలాగే నాకు ఒక కుక్క కూడా లేదు. 237 00:15:52,954 --> 00:15:54,623 ఇప్పుడు నేను కనీసం డోనట్ అయినా తినొచ్చా? 238 00:15:56,499 --> 00:15:58,335 స్కూల్ లో డిబేట్ క్లాసులో చేరాలని ఎప్పుడైనా అనిపించిందా? 239 00:15:58,418 --> 00:16:00,337 -సరే, అలాగే! ఒక డోనట్ తిను! -సూపర్! 240 00:16:00,420 --> 00:16:01,713 -నువ్వు సాధించవు! -ఆగు, నేను... 241 00:16:01,796 --> 00:16:03,673 నువ్వు అంత త్వరగా ఒప్పుకోకూడదు. 242 00:16:03,757 --> 00:16:06,509 -సీరియస్ గా అంటున్నావా? -నేను ఇక్కడ ప్రోటీన్ షేక్ చేస్తున్నాను. 243 00:16:06,593 --> 00:16:07,594 లేదు, డోనట్ తినొద్దు. 244 00:16:08,220 --> 00:16:10,430 మా నాన్న పారిస్ నుండి వస్తున్నారు, కాబట్టి నువ్విక... 245 00:16:18,647 --> 00:16:19,898 నేను చెప్దామనే అనుకున్నా. 246 00:16:20,815 --> 00:16:21,858 పని విషయమై వస్తున్నాడు. 247 00:16:21,942 --> 00:16:24,361 వాళ్ళ కంపెనీ ఆయన్ని మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. 248 00:16:24,444 --> 00:16:27,364 ఆయన... నేను నీకు చెప్పేవరకు మీ నాన్న ఆగాల్సింది, బుజ్జి. 249 00:16:27,447 --> 00:16:29,032 నువ్వు ఎప్పుడు చెప్దామని అనుకున్నావు? 250 00:16:29,115 --> 00:16:31,201 -ముందు ఎవరికి చెప్పాలో నాకు తెలీలేదు. -నాకు! 251 00:16:31,284 --> 00:16:32,285 -నాకు! -నాకు! 252 00:16:32,369 --> 00:16:34,454 -నేను ఆయన కూతురు. యాంబర్ బ్రౌన్ ని. -సరే. 253 00:16:34,537 --> 00:16:35,580 సరే. 254 00:16:39,167 --> 00:16:40,752 నువ్వు దీనికోసమేనా వెతుకుతున్నావు? 255 00:16:40,835 --> 00:16:42,045 -అవును, ఇదే. -సరే. 256 00:16:42,128 --> 00:16:44,589 తెలుసా, నీ ఆర్ట్ చాలా బాగుంటుంది. 257 00:16:46,758 --> 00:16:47,926 థాంక్స్. 258 00:16:48,593 --> 00:16:51,388 హే, నువ్వు డోనట్ తినేటట్టు అయితే, ఇది వేసుకొని తినడం మంచిది. 259 00:16:51,471 --> 00:16:52,889 షర్ట్ మీద పంచదార పొడి పడకుండా ఉంటుంది. 260 00:16:52,973 --> 00:16:54,683 సరే, అయితే ఎవరికీ నా స్మూతీ వద్దా? 261 00:16:54,766 --> 00:16:55,809 -వద్దు! -వద్దు! 262 00:17:05,819 --> 00:17:09,698 నువ్వు లేకపోవడం వల్ల ఆరవ తరగతి బెస్ట్ ఫ్రెండ్ లేకుండా ప్రారంభిస్తున్నా 263 00:17:22,878 --> 00:17:24,754 నీ పక్కన లేకపోవచ్చు, నిజమే. 264 00:17:24,838 --> 00:17:26,715 కానీ మానసికంగా ఎప్పుడూ నీ పక్కనే ఉంటా. 265 00:17:29,426 --> 00:17:31,803 ఆహ్, భలే మంచి మాట అన్నావు. 266 00:17:33,972 --> 00:17:36,016 మా నాన్న పారిస్ నుండి వెనక్కి వస్తున్నారు. 267 00:17:38,351 --> 00:17:39,352 జస్టిన్ 268 00:17:39,436 --> 00:17:42,480 మీ నాన్న వెనక్కి వస్తున్నారా? అంటే ఏంటి అర్ధం? 269 00:17:42,564 --> 00:17:44,566 ఆయన మా అమ్మ కోసమే వస్తున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, 270 00:17:44,649 --> 00:17:46,568 వాళ్ళు తిరిగి కలుస్తారు అనుకుంటున్నాను. 271 00:17:46,651 --> 00:17:48,695 ఆగు. మరి మ్యాక్స్ సంగతి ఏంటి? 272 00:17:48,778 --> 00:17:50,947 అతనితో ఏం పని? ఇప్పుడు ఉంటాడు, అప్పటికి పోతాడు. 273 00:17:51,031 --> 00:17:52,824 -ఏంటి? -అతనితో సీరియస్ బంధం కాదు. 274 00:17:52,908 --> 00:17:55,118 అంటే, మా అమ్మ విషయం సీరియస్ గానే ఉంది అంది, 275 00:17:55,201 --> 00:17:57,120 పెళ్లి చేసుకునేంత సీరియస్ గా. 276 00:17:57,203 --> 00:17:59,414 -అలాంటి మాటలు అనొద్దు. -సరే, సరే. 277 00:17:59,497 --> 00:18:03,335 నెమ్మదించు. మా అమ్మ ఒక్కోసారి లేనిది కలుపుతుంది. 278 00:18:03,835 --> 00:18:06,463 లేదా తానే మ్యాక్స్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుందేమో. 279 00:18:07,297 --> 00:18:08,465 మీరు కావాలంటే అతన్ని తీసుకోండి. 280 00:18:09,674 --> 00:18:10,675 మీ నాన్న వెనక్కి వచ్చాకా, 281 00:18:10,759 --> 00:18:12,385 నువ్వు అప్పుడు కూడా మీ అమ్మతోనే ఉంటావా? 282 00:18:12,469 --> 00:18:15,096 పామ్ అత్త బహుశా నేను సగం అమ్మ దగ్గర, సగం నాన్న దగ్గర ఉంటా అంది. 283 00:18:15,180 --> 00:18:17,015 మర్డర్ మిస్టరీ సినిమా పేరులా ఉంది నువ్వు చెప్పింది. 284 00:18:17,098 --> 00:18:20,352 అవును, నిజమే. ఈ ఏడాది ఇప్పటికే నాకు భయంకరమైన సినిమాలో ఉన్నట్టు ఉంది. 285 00:18:20,435 --> 00:18:22,145 వేసవిలో నేను అస్సలు ఎత్తు పెరగలేదు. 286 00:18:22,229 --> 00:18:26,650 అంటే, గణాంకాల ప్రకారం ఎత్తు తక్కువ ఉన్నవారు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా బ్రతుకుతారు అంట. 287 00:18:27,150 --> 00:18:28,693 గణాంకాల ప్రకారం బెస్ట్ ఫ్రెండ్స్ కి 288 00:18:28,777 --> 00:18:31,196 ఏం చెప్తే బాధ తగ్గుతుందో బాగా తెలుస్తుంది అంట కూడా. 289 00:18:33,406 --> 00:18:35,116 -వెళ్ళొద్దాం. -వెళ్ళొద్దాం. 290 00:18:39,120 --> 00:18:40,330 మీ పూర్తి ప్రతిభను బయట పెట్టండి 291 00:18:53,468 --> 00:18:54,678 ఎవరు వచ్చారో చూడండి! 292 00:18:54,761 --> 00:18:58,890 నిన్ను తగులుకుని పడిపోయినంత పనైంది. ఆని. కాదు, ఆష్లి. 293 00:18:58,974 --> 00:19:01,142 కాదు. యాంబర్. యాంబర్, కదూ? 294 00:19:01,226 --> 00:19:03,770 నీ ఫ్రెండ్ జేసన్ లేకపోతే నిన్ను గుర్తుపట్టడం కూడా కష్టం. 295 00:19:03,853 --> 00:19:05,063 జస్టిన్. 296 00:19:07,524 --> 00:19:08,984 హన్నాకి నేను బాగానే తెలుసు. 297 00:19:09,067 --> 00:19:12,028 మేము ఒకే వేసవి క్యాంప్ రాత్రి బసకు ఎన్నో ఏళ్ల నుండి వెళ్తున్నాం. 298 00:19:12,946 --> 00:19:16,324 అయినా కూడా, నన్ను కలిసిన ప్రతీసారి, నేనెవరినో తెలీదు అన్నట్టు నటిస్తుంది. 299 00:19:16,408 --> 00:19:17,909 ఇది చాలా... 300 00:19:19,869 --> 00:19:21,121 హన్నాకి అలవాటైన పని. 301 00:19:21,871 --> 00:19:24,457 హన్నా, హాయ్. కాస్త నీ జుట్టును వెనక్కి వేసుకుంటావా? 302 00:19:24,541 --> 00:19:26,293 ఈర్ష్య పడకు, యాంబర్. 303 00:19:26,376 --> 00:19:30,755 ఈ వేసవిలో నేను బాగా పొడవయ్యానా లేక నువ్వు కురచ అయ్యావా? 304 00:19:32,382 --> 00:19:34,926 -నేను ఈ ఫోన్ ఎత్తాలి. -నీ ఫోన్ రింగ్ అవ్వలేదు. 305 00:19:35,010 --> 00:19:36,219 హలో? 306 00:19:36,303 --> 00:19:39,639 నీకు నా ఫ్రెండ్స్ జాకీ, షాంటే, హిల్లరీ ఇంకా సూన్-యి, 307 00:19:39,723 --> 00:19:42,225 మిక్కీ, అలిమా, జునైరా ఇంకా క్యాథీ తెలుసు కదా? 308 00:19:47,272 --> 00:19:48,315 హాయ్, యాంబర్! 309 00:19:48,398 --> 00:19:49,524 ఓహ్, హాయ్! 310 00:19:50,108 --> 00:19:51,359 ఇది నా ఫ్రెండ్. 311 00:19:51,860 --> 00:19:55,655 హాయ్. నేను యాంబర్ స్నేహితులలో ఒకరిని. బ్రాండీ. పేరులో ఐ ఉంటుంది! 312 00:19:55,739 --> 00:19:59,743 నేను హన్నాని. రెండు హెచ్ లు, రెండు ఎన్ లతో, బాగా పేరున్న అమ్మాయిని. 313 00:20:00,327 --> 00:20:01,328 భలే చెప్పావులే. 314 00:20:01,411 --> 00:20:04,247 హన్నా, రాంచో వాళ్ళ మినీ గోల్ఫ్ కి మనం వెళ్తున్నాం కదా? 315 00:20:04,331 --> 00:20:07,125 కచ్చితంగా-వెళ్తాము-స్టాన్లీ. బయలుదేరుతున్నాం. సరేనా? 316 00:20:07,208 --> 00:20:08,543 -అవును. -అవును, స్టాన్లీ. 317 00:20:08,627 --> 00:20:09,461 కచ్చితంగా. 318 00:20:09,544 --> 00:20:11,087 సరే. మంచిది. 319 00:20:13,673 --> 00:20:15,592 చూసుకో. ఇక్కడ మనుషులు ఉన్నారు. 320 00:20:15,675 --> 00:20:17,427 నన్ను క్షమించు. నేను చూసుకోలేదు. 321 00:20:18,720 --> 00:20:19,846 క్షమించాలి... 322 00:20:20,472 --> 00:20:21,806 యాంబర్. 323 00:20:21,890 --> 00:20:23,141 యాంబర్. 324 00:20:23,225 --> 00:20:25,560 -నీ జుట్టు భలే మృదువుగా ఉంది. -థాంక్స్. 325 00:20:26,519 --> 00:20:28,855 -మేము తర్వాత వెళ్లి గోల్ఫ్ ఆడదాం... -ఇప్పటికే జనం ఎక్కువయ్యారు. 326 00:20:28,939 --> 00:20:30,190 సరే. పదా. త్వరగా నడువు. 327 00:20:30,273 --> 00:20:31,274 సరే. 328 00:20:32,108 --> 00:20:33,109 లేదు, నేను ఏమంటానంటే... 329 00:20:57,676 --> 00:21:00,595 హే, బుజ్జి. స్కూల్ లో అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను. 330 00:21:00,679 --> 00:21:03,682 విషయమంతా వినాలని ఉంది. నేను 22న వెనక్కి వస్తున్నాను. 331 00:21:03,765 --> 00:21:05,559 ప్రేమతో నాన్న 332 00:21:12,774 --> 00:21:15,777 -వాడికి నువ్వు అంటే ఇష్టం! -ఓహ్, దేవుడా. నన్ను భయపెట్టేసావు. 333 00:21:15,860 --> 00:21:16,861 ధన్యవాదాలు. 334 00:21:17,988 --> 00:21:19,155 ఏం పర్లేదు? 335 00:21:19,239 --> 00:21:22,033 -బోలెడన్ని ఎమ్ లు ఉన్న యాంబర్? -ఏంటి? 336 00:21:22,117 --> 00:21:24,077 ఆ అందమైన కుర్రాడు. స్టాన్లీ. 337 00:21:24,160 --> 00:21:28,123 నీ పేరుని యామ్ బర్ అన్నాడు కదా? వాడికి నువ్వు అంటే ఇష్టం. 338 00:21:28,748 --> 00:21:30,375 ఏమో నాకు తెలీదు. నేను వాడు మాట్లాడింది పెద్దగా వినలేదు. 339 00:21:30,458 --> 00:21:32,961 అంటే, నీ జుట్టు చాలా బాగుందని అన్నాడు కదా. 340 00:21:33,044 --> 00:21:34,129 మృదువుగా ఉంది అన్నాడు. 341 00:21:34,212 --> 00:21:35,213 అంటే విన్నావు అన్నమాట! 342 00:21:36,673 --> 00:21:39,050 నీకు నా నెక్లెస్ ఒకటి కావాలా? 343 00:21:39,134 --> 00:21:41,720 అందులో ఒక క్రిస్టల్ ఉంది. వాటికి బోలెడంత శక్తి ఉంటుంది. 344 00:21:41,803 --> 00:21:44,222 వద్దు, పర్లేదు. నేను పెద్దగా ఆభరణాలు వేసుకోను. 345 00:21:44,306 --> 00:21:45,807 నాకు చెవిలీలు కూడా లేవు. 346 00:21:45,891 --> 00:21:47,142 నాకు కూడా. 347 00:21:50,478 --> 00:21:52,564 భోజనం కలిసి చేద్దామా? 348 00:21:53,899 --> 00:21:57,444 సరే. కచ్చితంగా-వెళ్తాము-స్టాన్లీ! 349 00:21:57,527 --> 00:21:59,988 -తను అలా అంది అంటే నమ్మలేకపోతున్నాను. -నేను కూడా. 350 00:22:00,071 --> 00:22:03,116 ...బాగానే ఉంటానని నాకు తెలుసు 351 00:22:03,199 --> 00:22:05,744 నేను బాగానే ఉంటానని నాకు తెలుసు 352 00:22:08,997 --> 00:22:10,957 సరే. ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. 353 00:22:11,750 --> 00:22:13,084 కొత్తగా స్నేహతులు ఎవరైనా దొరికారా? 354 00:22:15,170 --> 00:22:18,340 -యాంబర్. -అవును, అనుకుంటా. ఒకరు. 355 00:22:20,634 --> 00:22:22,636 నువ్వు నాకు చెప్పిన ఆ స్టాన్లీ అనే కుర్రాడా? 356 00:22:23,220 --> 00:22:27,098 కాదు, వాడు నా ఫ్రెండ్ కాదు. చెప్పాలంటే... 357 00:22:27,682 --> 00:22:29,267 ఇష్టమైన వాడు. 358 00:22:29,976 --> 00:22:31,853 నిజం చెప్పాలంటే, అవును. 359 00:22:34,189 --> 00:22:36,024 ఆపై, హన్నా ఎలాగూ ఉంది. 360 00:22:36,107 --> 00:22:40,111 తాను నిజానికి ఫ్రెండ్ కాదు, కానీ కావాలనుకుంటే అవుతుంది. 361 00:22:40,987 --> 00:22:43,031 కానీ ఫ్రెండ్ కాకపోవడానికి నాకు, దానికి అస్సలు పొసగదు. 362 00:22:44,241 --> 00:22:47,160 ఒక పెద్ద వార్త చెప్పనా, నాన్న 22న వెనక్కి వస్తున్నారు. 363 00:22:47,661 --> 00:22:49,287 అలాగే స్టాన్లీ కానోవర్ కి నా పేరు తెలుసు. 364 00:22:49,371 --> 00:22:51,790 అంటే, నీలాంటి అమ్మాయి దొరకడం అంటే వాడికి అదృష్టం ఉందనే అర్ధం. 365 00:22:51,873 --> 00:22:55,544 మేమిద్దరం ఒకే చోట ఉన్నా, హన్నా ఉందంటే దాని జుట్టు అడ్డం వచ్చి నన్ను చూడలేడు. 366 00:22:57,295 --> 00:22:59,756 మీ నాన్న వెనక్కి వస్తున్నాడు. 367 00:23:00,632 --> 00:23:02,551 అది ఎంత గొప్ప విషయమో కదా? 368 00:23:03,510 --> 00:23:07,889 -నువ్వు ఆయన్ని ఎంత మిస్ అయ్యావో నాకు తెలుసు. -అవును. అమ్మని కూడా. 369 00:23:10,392 --> 00:23:11,518 ఏంటి? 370 00:23:11,601 --> 00:23:15,021 ఎప్పటిలా ఉండే అమ్మని కూడా మిస్ అవుతున్నాను, తెలుసా. 371 00:23:15,105 --> 00:23:19,526 నాతో రాత్రిళ్ళు మేల్కొని పిజ్జా తింటూ, సినిమాలు చూసే పాత అమ్మని మిస్ అవుతున్నాను. 372 00:23:20,151 --> 00:23:22,946 ఇప్పుడు తను యోగ చేస్తూ, స్మూతీలు తాగడంలో బిజీగా ఉంది. 373 00:23:23,613 --> 00:23:28,285 నేను కూడా ఆమెను మిస్ అవుతున్నాను. ఇదొక చిన్న దశ అంతే. 374 00:23:29,035 --> 00:23:32,914 ఇదే మాట మూడు నెలల క్రితం కూడా అన్నావు. ఈ ప్రేమ దశ అన్ని రోజులు ఉంటుందా? 375 00:23:33,498 --> 00:23:36,668 ఉంటుంది. ఒకసారి నేను మూడేళ్ల పాటు అదే ఫీలింగ్ లో ఉండిపోయా. 376 00:23:37,377 --> 00:23:38,378 సరే, రెండు సార్లులే. 377 00:23:39,421 --> 00:23:40,797 ఏమైనా ఇప్పుడు పట్టించుకోనక్కరలేదు. 378 00:23:40,881 --> 00:23:43,592 ఒకసారి నాన్న వెనక్కి వచ్చాక, అంతా మళ్ళీ మాములు అయిపోతుంది. 379 00:23:46,303 --> 00:23:47,220 ఊరుకో. 380 00:23:48,471 --> 00:23:50,599 అమ్మా, నేను ఇంటికి వచ్చా! 381 00:23:51,433 --> 00:23:54,185 నా ఆరవ తరగతిలో మొదటి రోజును జరుపుకోవడానికి ఐస్ క్రీం తిందామా? 382 00:23:54,269 --> 00:23:55,729 తప్పకుండా! 383 00:23:55,812 --> 00:23:59,190 ఓహ్, అమ్మో. నువ్వు నన్ను భయపెట్టేసావు. నువ్వు భూతానివి కాదు కదా? 384 00:23:59,274 --> 00:24:01,192 మా అమ్మ నేను మెడ చుట్టూ ఒక బెల్ కట్టుకుని తిరగాలి అంటుంది. 385 00:24:01,902 --> 00:24:03,194 తలుపు తీసే ఉంది తెలుసా. 386 00:24:04,821 --> 00:24:06,281 నేను దీన్ని రికార్డు చేయాలి. 387 00:24:08,950 --> 00:24:11,036 -ఇది బ్రాండీ. -పేరులో ఐ ఉంటుంది. 388 00:24:11,119 --> 00:24:12,120 కానీ బెల్ లేదు. 389 00:24:15,290 --> 00:24:16,958 అయ్యో. క్షమించు. 390 00:24:17,459 --> 00:24:18,501 లేదు, అదేం పర్లేదు. 391 00:24:19,753 --> 00:24:20,754 ఇదేంటి? 392 00:24:21,755 --> 00:24:23,423 చూస్తే ఉంగరం బాక్సులా ఉంది. 393 00:24:25,550 --> 00:24:26,635 ఓరి, దేవుడా. 394 00:25:26,319 --> 00:25:28,321 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్