1 00:00:10,303 --> 00:00:11,429 పదా, డొరొతీ. 2 00:00:11,513 --> 00:00:13,306 నువ్వు కాస్టింగ్ లిస్టు చదివేటప్పుడు నీ ఫోటో తీస్తా. 3 00:00:13,390 --> 00:00:16,476 నన్ను సెలెక్ట్ చేస్తారో లేదో చెప్పలేం. నేను ఆడిషన్ ఇచ్చానంటే నమ్మలేకపోతున్నాను. 4 00:00:16,977 --> 00:00:18,311 నాకు కనిపించడం లేదు. 5 00:00:18,395 --> 00:00:20,397 ఆగు. నాకు ఇప్పుడు కనిపిస్తుంది. 6 00:00:20,480 --> 00:00:21,356 నీకు పాత్ర దక్కింది! 7 00:00:22,023 --> 00:00:23,149 ఓరి, నాయనో. 8 00:00:24,150 --> 00:00:26,695 ఓహ్, లేదు, ఆగు, నాకు కనిపిస్తుంది. నేను… 9 00:00:29,072 --> 00:00:31,074 మూడవ కోపిష్టి యాపిల్ చెట్టా? 10 00:00:31,700 --> 00:00:32,659 నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 11 00:00:33,618 --> 00:00:35,620 డొరొతీ పాత్ర పోషిస్తున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది. 12 00:00:36,288 --> 00:00:39,165 -అభినందనలు, హన్నా. -నీకు కూడా, యాంబర్. 13 00:00:39,249 --> 00:00:42,752 నీకు కూడా ఒక పాత్ర ఇచ్చారు కదా. భలే సంతోషంగా ఉండి ఉంటుంది. 14 00:00:42,836 --> 00:00:43,837 అది నిజమే. 15 00:00:43,920 --> 00:00:45,547 తానొక చెట్టు. 16 00:00:45,630 --> 00:00:48,758 ఉత్తి చెట్టు మాత్రమే కాదు. మూడవ కోపిష్టి యాపిల్ చెట్టు. 17 00:00:49,759 --> 00:00:52,679 నీ పాత్ర బాగుంటుంది. గొప్ప చెట్టుగా చేస్తావు. 18 00:00:53,346 --> 00:00:55,682 -అంటే, చూస్తుంటే తెలుస్తుంది కదా. -ఏంటి? 19 00:00:56,349 --> 00:00:57,350 అదేం కాదు. 20 00:00:57,434 --> 00:01:01,313 ఇంకా ఆ చెట్టు సంగతి ఎత్తి బెదిరిస్తోంది అంటే నమ్మలేకపోతున్నాను. 21 00:01:03,231 --> 00:01:04,231 చెప్పాలంటే అది సరదాగా ఉంది. 22 00:01:05,525 --> 00:01:06,818 నువ్వు బాగానే ఉన్నావా? 23 00:01:07,444 --> 00:01:08,778 నాకు ఒంట్లో బాగున్నట్టు అనిపించడం లేదు. 24 00:01:08,862 --> 00:01:11,489 నేను ఇంటికి వెళ్తానని చెప్తాను. 25 00:01:28,548 --> 00:01:30,467 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 26 00:01:35,847 --> 00:01:38,767 ప్రియమైన డైరీ, ఈ విషయం నేను నీకు మాత్రమే చెప్తున్నాను. 27 00:01:39,809 --> 00:01:44,397 యాంబర్ బ్రౌన్ అనబడే నేను, 28 00:01:44,481 --> 00:01:46,274 డొరొతీ పాత్ర నాకు దక్కుతుందని కలలు కన్నాను. 29 00:01:47,317 --> 00:01:50,111 అలాగే ఒకవేళ అది కాకపోయినా, గ్లిండా లేదా దిష్టి బొమ్మ లాంటి 30 00:01:50,195 --> 00:01:53,365 ఇతర పాత్రలు ఇచ్చినా పర్వాలేదు అనుకున్నాను. 31 00:01:54,032 --> 00:01:56,785 కానీ మరీ మూడవ కోపిష్టి చెట్టా? 32 00:01:57,994 --> 00:01:58,995 నాకు బాధగా ఉంది. 33 00:01:59,996 --> 00:02:03,667 నేను నా కలలు కనడం మానగలనో లేదో నాకు తెలియడం లేదు, 34 00:02:04,376 --> 00:02:08,837 కానీ అవి నిజం కానప్పుడు, ఇంతగా బాధ కలుగుతుంది అంటే, కలలు కనడం మానక తప్పదు అనిపిస్తుంది. 35 00:02:12,592 --> 00:02:15,136 మా అమ్మా నాన్నాలు తిరిగి ఒకటి కావాలని కల కంటున్నాను. 36 00:02:15,220 --> 00:02:16,638 యాంబర్! 37 00:02:32,821 --> 00:02:33,822 యాంబర్? 38 00:02:33,905 --> 00:02:35,198 బుజ్జి. 39 00:02:36,783 --> 00:02:39,369 హాయ్. నేను నీ జ్వరం ఎంత ఉందో చూడాలి. ఇలా రా. 40 00:02:42,914 --> 00:02:45,750 98.6. జ్వరం లేదు. 41 00:02:46,585 --> 00:02:47,878 -అమ్మా? -ఏంటి? 42 00:02:49,421 --> 00:02:51,673 నాకు శరీరంలో అనారోగ్యం చేయలేదు. 43 00:02:53,592 --> 00:02:54,593 అవును. 44 00:02:55,302 --> 00:02:58,054 బహుశా ఆ డొరొతీ పాత్ర కారణంగా ఇలా అనిపిస్తుందేమో. 45 00:02:58,555 --> 00:02:59,931 అలాగే తన చిన్న కుక్క వల్ల కూడా. 46 00:03:01,641 --> 00:03:03,476 ఇదంతా నా కలల వల్లే. 47 00:03:04,352 --> 00:03:06,229 నేను డొరొతీ పాత్ర పోషించాలని కల కన్నాను. 48 00:03:07,647 --> 00:03:09,232 కానీ నేనొక చెట్టులా నిలబడాలి. 49 00:03:10,025 --> 00:03:11,192 ఊరుకో. చెట్లు కూడా సూపర్ గా ఉంటాయి. 50 00:03:11,902 --> 00:03:14,571 అవి బలమైనవి, అలాగే అవి… 51 00:03:14,654 --> 00:03:19,993 మనకే ఎన్నింటినో ఇస్తాయి, మనకు నీడ, కలపని అందిస్తాయి. 52 00:03:20,076 --> 00:03:21,620 అలాగే కాల్చుకోవడానికి కర్రలు కూడా. 53 00:03:21,703 --> 00:03:25,165 అవునా, అమ్మా? నువ్వు మ్యాక్స్ లాగ మాట్లాడుతున్నావు. 54 00:03:25,832 --> 00:03:27,334 అదేం అంత చెడ్డ విషయం కాదు. 55 00:03:27,417 --> 00:03:29,794 నేను ఆడిషన్ ఇచ్చానంటే నమ్మలేకపోతున్నాను. 56 00:03:30,629 --> 00:03:32,297 నాకు చాలా సిగ్గుగా ఉంది. 57 00:03:32,380 --> 00:03:34,633 -ఏంటి? -నాకు సిగ్గుగా ఉంది. 58 00:03:34,716 --> 00:03:36,843 ఆ విషయం నాన్నకు తెలిస్తే ఇంకెలా ఉంటుందో. 59 00:03:37,552 --> 00:03:38,386 యాంబర్ బ్రౌన్, 60 00:03:38,470 --> 00:03:40,847 నువ్వు ఎలాంటి పాత్ర పోషించినా, మీ నాన్న నిన్ను చూసి గర్వపడతాడు. 61 00:03:40,931 --> 00:03:41,932 లేదు. 62 00:03:42,766 --> 00:03:44,893 నేను డొరొతీ పాత్రకు ఆడిషన్ ఇచ్చా. 63 00:03:44,976 --> 00:03:45,977 ప్రధాన పాత్ర. 64 00:03:46,686 --> 00:03:49,356 నాన్న ఎనిమిదో జ్యూరీ సభ్యుడు. అది ప్రధాన పాత్ర. 65 00:03:49,940 --> 00:03:51,441 ఏంటి? ఆయన ఏంటి? 66 00:03:52,025 --> 00:03:54,069 నాన్న, గుర్తులేదా? ఎనిమిదవ క్లాసులో? 67 00:03:55,278 --> 00:03:57,948 ఆయన 12 యాంగ్రీ మెన్ లో ఎనిమిదో జ్యూరీ సభ్యుడు. 68 00:03:58,031 --> 00:04:00,450 ఆయనది ప్రధాన పాత్ర. ఒక స్టార్. 69 00:04:01,284 --> 00:04:03,328 నాకు అది పెద్దగా గుర్తు లేదు. 70 00:04:03,411 --> 00:04:06,122 కానీ నేనేమో మూడవ కోపిష్టి యాపిల్ చెట్టుని. 71 00:04:06,206 --> 00:04:08,208 ఈ విషయం నేను మర్చిపోను, 72 00:04:08,291 --> 00:04:11,044 -ఎందుకంటే నాకు చాలా గర్వంగా ఉంది. -అలా అనొద్దు. 73 00:04:11,127 --> 00:04:12,712 బంగారం, లేదు, నిజంగా అంటున్నా. 74 00:04:12,796 --> 00:04:14,256 నువ్వు రిస్క్ తీసుకోవడం నేర్చుకున్నావు. 75 00:04:14,339 --> 00:04:16,882 ధైర్యంగా ఆడిషన్ ఇచ్చావు. 76 00:04:16,966 --> 00:04:18,969 నిరాశను ఎదుర్కొన్నావు, ఇక ఇప్పుడు… 77 00:04:19,052 --> 00:04:22,264 సాధించిన దానిని బట్టి మంచిగా ఎలా ఫీల్ అవ్వాలో నేర్చుకున్నావు. 78 00:04:22,889 --> 00:04:25,392 మంచిగా ఫీల్ అవ్వడమా? నాకు మంచిగా అనిపిస్తుందని ఎవరు చెప్పారు? 79 00:04:26,184 --> 00:04:27,477 -అంటే… -ఒక చెట్టుగా నిలబడాలి. 80 00:04:27,561 --> 00:04:30,480 అంటే, మంచిగా ఫీల్ అవ్వాలని నువ్వు అనుకోవాలి. 81 00:04:30,564 --> 00:04:32,023 నాకు అనుకోవాలని లేదు. 82 00:04:34,693 --> 00:04:36,528 ఇదుగో. జస్టిన్ ఫోన్ చేస్తున్నాడు. 83 00:04:37,362 --> 00:04:41,116 నేను మనకు కొంచెం టమాటా సూప్ ఇంకా గ్రిల్ చీజ్ చేస్తా. సరేనా? 84 00:04:41,199 --> 00:04:42,867 -అలాగే. -సరే. 85 00:04:47,497 --> 00:04:49,666 -హే. -హే. 86 00:04:50,333 --> 00:04:53,920 -నీకు ఆ పాత్ర దక్కిందా? డొరొతీ? -లేదు. 87 00:04:54,004 --> 00:04:56,006 అన్ని పాత్రల లిస్ట్ లో నీ పేరు చెక్ చేసుకోమని చెప్పారు కదా? 88 00:04:56,673 --> 00:04:58,091 అంటే, అవునులే. 89 00:04:58,174 --> 00:05:01,720 డొరొతీ పాత్రకి బాగా ఆడిషన్ ఇచ్చిన ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని తెలిసింది. 90 00:05:02,220 --> 00:05:03,555 కాబట్టి పాత్ర రానిది నాకు మాత్రమే కాదు. 91 00:05:03,638 --> 00:05:06,141 మా అందరికీ పాత్రలు ఇచ్చారు. 92 00:05:06,224 --> 00:05:07,100 సరే! 93 00:05:07,183 --> 00:05:08,476 అయితే నీకు మెయిన్ పాత్ర ఇచ్చారా? 94 00:05:08,560 --> 00:05:11,146 నాది మూడవ కోపిష్టి యాపిల్ చెట్టు పాత్ర. 95 00:05:16,234 --> 00:05:18,028 నవ్వకు. 96 00:05:18,111 --> 00:05:19,070 నన్ను క్షమించు. 97 00:05:20,405 --> 00:05:21,865 ఇంతకీ డొరొతీ పాత్ర ఎవరికి ఇచ్చారు? 98 00:05:22,741 --> 00:05:23,867 గెస్ చెయ్. 99 00:05:23,950 --> 00:05:25,952 -స్టాన్లీ? -హ హ. 100 00:05:26,036 --> 00:05:26,953 హన్నా? 101 00:05:27,996 --> 00:05:30,415 సరే, హన్నాకి ఇచ్చారన్న మాట. ఇక బోర్ కొట్టించేస్తుంది. 102 00:05:30,498 --> 00:05:34,753 తన సరదా తనను తీర్చుకోనివ్వు, అలాగే నువ్వు కూడా కోపిష్టి చెట్టుగా బాగా ఎంజాయ్ చెయ్. 103 00:05:34,836 --> 00:05:38,340 లేదు, నా వల్ల కాదు. నేను షో నుండి తప్పుకుంటాను. 104 00:05:38,423 --> 00:05:41,343 -నువ్వు అలా తప్పుకోకూడదు. -నాకు చాలా సిగ్గుగా ఉంది. 105 00:05:41,426 --> 00:05:44,638 ఎందుకు? రిస్క్ చేసి ఆడిషన్ ఇచ్చినందుకా? 106 00:05:44,721 --> 00:05:47,307 నువ్వు అలా చేయగలిగినందుకు గర్వపడాలి. 107 00:05:48,183 --> 00:05:49,267 ఓహ్, ఇక ఆపు. 108 00:05:50,060 --> 00:05:52,687 కోపిష్టి చెట్టుగా నిన్ను చూడటానికి నేను అక్కడ ఉండగలిగితే బాగుండు. 109 00:05:52,771 --> 00:05:54,814 -మూడవ నంబర్ చెట్టు. -మూడవ నంబర్. 110 00:05:57,525 --> 00:06:00,320 -నేను మా నాన్న మెచ్చుకునేలా చేయాలనుకున్నాను. -అలా చేస్తావు. 111 00:06:00,403 --> 00:06:02,906 నేను లిటిల్ లీగ్ కోసం ప్రయత్నించినప్పుడు చేసినట్టే. 112 00:06:02,989 --> 00:06:06,326 మా నాన్నే కోచ్. ఆ సిగ్గుతో పోల్చితే ఇదేమి కాదు. 113 00:06:06,409 --> 00:06:09,663 ఆయన నా వైపు బాల్ రాకూడదని నన్ను అవుట్ ఫీల్డ్ లో పెట్టారు. 114 00:06:10,497 --> 00:06:12,249 నేను బాల్ ని పట్టుకున్న ఒకే ఒక్కసారి కూడా 115 00:06:12,332 --> 00:06:15,377 నా జెర్సీ పెద్దది కావడంతో దాన్ని తన్నుకుని పడిపోయినప్పుడే పట్టుకున్నాను. 116 00:06:15,460 --> 00:06:17,504 నా జర్సీని టక్ చేసుకోవడం వల్ల బ్రతికిపోయా. 117 00:06:17,587 --> 00:06:19,422 జస్టిన్, పదా వెళ్దాం! 118 00:06:19,506 --> 00:06:21,841 నేనిక వెళ్ళాలి. నువ్వు అది మానకు. వెళ్ళొద్దాం! 119 00:06:22,759 --> 00:06:23,760 వెళ్ళొద్దాం. 120 00:06:31,560 --> 00:06:33,019 -గుడ్ మార్నింగ్. -హే. 121 00:06:33,103 --> 00:06:34,688 నాకు ఆ సలాడ్ కొంచెం ఇస్తారా? 122 00:06:34,771 --> 00:06:39,859 అది నా కొత్త పుస్తకం కోసం మీ పామ్ అత్త ట్రై చేస్తున్న ఒక ఫేషియల్. 123 00:06:41,778 --> 00:06:44,030 కానీ దాన్ని తినొచ్చు. అవును, నువ్వు కావాలంటే తిను. 124 00:06:44,114 --> 00:06:47,284 అదేం పర్లేదు. నేను ఈ కీరదోస ముక్కలు తింటాను. 125 00:06:47,367 --> 00:06:49,536 అంటే, అవి నా కళ్ళకు అని పెట్టుకున్నా, కాబట్టి… 126 00:06:49,619 --> 00:06:51,997 -సరే! -నేను… అవును. 127 00:06:53,164 --> 00:06:55,041 ఇక్కడ ఉన్న ఆహారం ఏమైనా తినొచ్చా? 128 00:06:55,667 --> 00:06:57,669 అంటే, చూడు, నీకోసం నేను పాన్ కేకులు చేయగలను. 129 00:06:59,254 --> 00:07:01,256 -అవి పచ్చగా ఉండవు కదా? -అవును. 130 00:07:01,339 --> 00:07:02,591 నిజంగా? 131 00:07:03,216 --> 00:07:04,384 పాన్ కేకులు రెడీ అవుతున్నాయి. 132 00:07:04,968 --> 00:07:07,345 -సరే. థాంక్స్. -సరే. 133 00:07:08,263 --> 00:07:12,017 అమ్మా, నా చెట్టు డ్రెస్ కి అంటించే కొమ్మలు కనిపించడం లేదు, ఇవాళ మేము ప్రాక్టీసు చేయాలి. 134 00:07:12,100 --> 00:07:15,061 హాల్ లో కప్ బోర్డులో, ఒక బ్యాగులో, నీ జీన్ జాకెట్ కి పిన్నీసుతో పెట్టి ఉంచాను. 135 00:07:15,145 --> 00:07:16,438 సరే, థాంక్స్. 136 00:07:16,521 --> 00:07:18,189 అయితే, ఇది భలే ఆసక్తిగా ఉంది. 137 00:07:18,273 --> 00:07:19,774 మీ ప్రాక్టీసు ఎలా నడుస్తుంది? 138 00:07:20,567 --> 00:07:21,693 ప్రస్తుతానికి పర్లేదు. 139 00:07:22,277 --> 00:07:24,070 నేను ఇంతవరకూ చెట్టు కాస్ట్యూమ్ మొత్తం వేసుకోలేదు. 140 00:07:24,154 --> 00:07:26,156 ఒకసారి దాన్ని వేసుకుంటే, నేను కూర్చోలేను అని అన్నారు. 141 00:07:26,239 --> 00:07:28,992 -బెరడు చేసిన పదార్థం వంగదు అంట. -జీన్స్ వేసుకుంటే నాకు అలాగే ఉంటుంది. 142 00:07:30,619 --> 00:07:33,163 -ఇది పని చేస్తున్నట్టు ఉంది. -బాగుంది, కదా? 143 00:07:33,246 --> 00:07:35,248 అవును, ఇకపై సలాడ్ లు ఇలా వాడొచ్చని తెలిసింది కదా. 144 00:07:36,541 --> 00:07:39,544 సరే, నీ నాటకాన్ని చూడటానికి నేను బాగా ఎదురుచూస్తున్నాను, యాంబర్. 145 00:07:59,981 --> 00:08:03,568 యాంబర్, నీ ప్రాక్టీసు క్లాసులు ఎక్కువ సేపు ఉంటున్నాయని నీకు భోజనం సిద్ధం చేశా. 146 00:08:04,152 --> 00:08:07,113 థాంక్స్, కానీ మమ్మల్ని థియేటర్ కి భోజనంతో రావద్దని చెప్పారు. 147 00:08:07,197 --> 00:08:08,823 అక్కడ ఎలుకల సమస్య ఉంది. 148 00:08:10,158 --> 00:08:12,202 నాకు ఎలుకలు అంటే చాలా భయం. 149 00:08:12,285 --> 00:08:14,371 నాతో ఒక్క మెతుకు అన్నం కూడా తీసుకెళ్లను. 150 00:08:15,038 --> 00:08:17,666 క్షమించాలి, ఎలుకల్లారా. యాంబర్ మీకు భోజనం తేవడం లేదు. 151 00:08:18,792 --> 00:08:20,377 -అది చూసారా? -నేను సాధించా. 152 00:08:20,460 --> 00:08:22,295 మీరు అది చూసారా? తను నవ్వింది. 153 00:08:22,379 --> 00:08:24,589 నాకైతే ఇకిలించినట్టు ఉంది. ఎలా అంటే… 154 00:08:25,715 --> 00:08:27,968 నిజానికి, నా మొహాన్ని కదల్చలేను కాబట్టి అది చూపించలేనులే. 155 00:08:28,051 --> 00:08:30,262 -ఊరుకో. తాను నవ్వింది! సరేనా? -అవును, నవ్విందిలే. 156 00:08:30,345 --> 00:08:33,515 -బేబీ, తను నిజంగానే నవ్వింది. నేను చూసా. -విజయం నాదే! 157 00:08:33,597 --> 00:08:35,100 వావ్, ఇక శాంతించు. 158 00:08:40,480 --> 00:08:42,023 -హే. -హాయ్. 159 00:08:42,649 --> 00:08:44,401 -సరే, లోపలికి రా. -అలాగే. 160 00:08:46,778 --> 00:08:49,281 లాయర్ ని పిలవనందుకు చాలా థాంక్స్. 161 00:08:49,364 --> 00:08:50,949 -సార్. -మాట్లాడుకుందాం పదా. 162 00:08:51,908 --> 00:08:53,201 సరే. 163 00:08:53,285 --> 00:08:55,954 -నీకు కాఫీ కావాలా? సరే. -అవును. 164 00:08:57,998 --> 00:08:59,457 అవును, అదే పైపు. 165 00:08:59,541 --> 00:09:01,918 నేను బాగు చేయగలను. రెండే సెకన్ల పని. 166 00:09:02,002 --> 00:09:04,254 నేను… నీ దగ్గర సామాన్ల పెట్టె ఉందా? 167 00:09:04,337 --> 00:09:06,882 అంటే, అవును, నీ సామానులు ఇక్కడే ఉన్నాయి. 168 00:09:06,965 --> 00:09:09,676 కానీ, నేను ఎవరినైనా, అంటే ప్లంబర్ ని పిలవగలను, 169 00:09:09,759 --> 00:09:13,471 -లేదా మ్యాక్స్ కి చెప్పి దాన్ని బాగుచేయమని… -ఓహ్, లేదు. నేను చేయగలను. 170 00:09:13,555 --> 00:09:15,390 నీకు ఎలాంటి అభ్యంతరం లేదా? 171 00:09:16,057 --> 00:09:18,018 లేదు. పర్లేదు. 172 00:09:19,060 --> 00:09:20,729 -నేను తెస్తాను. -సరే. 173 00:09:41,166 --> 00:09:44,377 రైగ్లీ ఫీల్డ్ చికాగో కబ్స్ స్థావరం 174 00:09:52,135 --> 00:09:55,222 హే, బంగారం! నేను ఇంటికి వచ్చాను! 175 00:09:58,099 --> 00:10:00,852 నేను ఇంటికి వచ్చాను. మీ ఇంటికి. 176 00:10:03,104 --> 00:10:04,105 సారా! 177 00:10:04,189 --> 00:10:05,941 హాయ్. నేను ఫిల్ ని. 178 00:10:06,024 --> 00:10:09,611 హాయ్. మిమల్ని కలవడం సంతోషం. నేను మ్యాక్స్. 179 00:10:12,906 --> 00:10:14,032 మీరు వచ్చినట్టు సారాకి తెలుసా? 180 00:10:14,115 --> 00:10:15,951 లేదు. ఇంట్లోకి చొరబడ్డాను. 181 00:10:16,618 --> 00:10:18,453 భలే సరదాగా చెప్పారు. 182 00:10:20,580 --> 00:10:21,623 హాయ్. 183 00:10:22,666 --> 00:10:25,794 -సరే, నేను వెళ్లి సింక్ బాగు చేస్తాను. -సరే. అది… 184 00:10:29,756 --> 00:10:31,967 నువ్వు నాకు ఎందుకు ముందు ఫోన్ చేయలేదు? 185 00:10:32,050 --> 00:10:33,802 ఒక క్లయింట్ క్యాన్సిల్ చేసాడు. 186 00:10:33,885 --> 00:10:36,972 నిన్ను భోజనానికి తీసుకెళ్దాం అనుకున్నాను. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. 187 00:10:37,055 --> 00:10:40,433 కానీ నీ మాజీ భర్తతో ఇంట్లో ప్లంబింగ్ చేయిస్తున్నావని నాకు తెలియలేదు. 188 00:10:40,517 --> 00:10:43,395 లేదు. అతను యాంబర్ ఎవరి దగ్గర ఎంత సేపు ఉండాలనేది మాట్లాడటానికి వచ్చాడు. 189 00:10:45,105 --> 00:10:47,023 సరే. ఆ ప్లంబింగ్ పని నేను చూసుకుంటాను. 190 00:10:47,899 --> 00:10:50,110 నువ్వు, క్రితం సారి మూడు అడుగుల టేప్ అతికించి వచ్చేసావు. 191 00:10:50,944 --> 00:10:52,946 -నీరు కారడం ఆగింది కదా? -అవునులే. 192 00:10:53,029 --> 00:10:54,614 అయితే పైకి వెళ్లి తనకి సహాయం చేయొచ్చు కదా? 193 00:10:54,698 --> 00:10:55,782 -లేదు. -ఎందుకు? 194 00:10:55,865 --> 00:11:00,036 నేను పైకి వెళ్లను. అతను నా టేప్ చూసి ఎగతాళి చేస్తాడు. 195 00:11:00,120 --> 00:11:02,831 -కొంచెం పైకి వెళ్లి సాయం చేయొచ్చు కదా? -సరే, అలాగే. వెళ్తాలే. 196 00:11:02,914 --> 00:11:04,874 -వెళ్తాను… -వెళ్తున్నావా? 197 00:11:04,958 --> 00:11:06,543 -…పైకే వెళ్ళేది. -చాలా థాంక్స్. 198 00:11:19,723 --> 00:11:20,724 నేను ఏమైనా సహాయం చేయనా? 199 00:11:21,808 --> 00:11:23,310 అంటే, కావాలంటే ఇది నేను చేస్తాను. 200 00:11:23,393 --> 00:11:25,395 మీరు వెళ్లి సారాతో మాట్లాడవచ్చు. 201 00:11:25,478 --> 00:11:27,564 ఓహ్, లేదు, అదేం పర్లేదు. నేను బాగు చేస్తాను. 202 00:11:28,148 --> 00:11:30,567 ఇక్కడ ఇలా టేప్ అంటించింది ఎవడు? 203 00:11:31,401 --> 00:11:32,235 సారా. 204 00:11:33,111 --> 00:11:34,821 -దారుణంగా ఉంది. -అవును, అదే కదా. 205 00:11:34,905 --> 00:11:36,865 -కొంచెం నాకు అది… -హే, పని ఎలా సాగుతుంది? 206 00:11:36,948 --> 00:11:39,242 మ్యాక్స్, కొంచెం నాకు బేసిన్ రెంచ్ ఇస్తావా? 207 00:11:39,743 --> 00:11:40,744 సరే! 208 00:11:45,624 --> 00:11:47,292 అది నాకు తెలిసి… 209 00:11:47,375 --> 00:11:49,753 -వీటిలో ఒకటి అయి ఉంటుంది. -అది ఇదే. 210 00:11:49,836 --> 00:11:50,795 అవును. 211 00:11:51,296 --> 00:11:53,548 మ్యాక్స్, కొంచెం ఆ సింక్ గొట్టాన్ని పట్టుకుంటావా? 212 00:11:53,632 --> 00:11:56,259 -అది కొంచెం లూజ్ అవుతుంది. -సరే. 213 00:11:56,843 --> 00:11:58,678 -క్షమించు. -లేదు, అది… 214 00:11:58,762 --> 00:12:00,889 ఇదుగో. నేను అది… అది నేను పెట్టుకుంటా. 215 00:12:12,150 --> 00:12:13,735 నేనిది చేయలేను. 216 00:12:13,818 --> 00:12:16,488 ఏంటి? నేను ఏం చేశాను? నేను ఏమైనా చేసానా? 217 00:12:16,571 --> 00:12:19,366 లేదు, ఎవరైనా మంచి పని వారి సహాయం తీసుకుంటే మంచిది. 218 00:12:19,449 --> 00:12:21,534 నేను దాన్ని బిగిస్తాను. 219 00:12:24,454 --> 00:12:27,332 -నీకు సహాయం చేయాలని ఉందా? -నాకు తెలీదు, నేను దాన్ని పట్టుకున్నా. 220 00:12:33,421 --> 00:12:35,173 నువ్వు మాతో కాఫీకి వస్తావా 221 00:12:35,257 --> 00:12:37,425 యాంబర్ ఉండే ఏర్పాట్ల గురించి లేదా… 222 00:12:39,177 --> 00:12:41,555 లేదు. ఒక మాట చెప్పనా? నేను వెళ్తాను. 223 00:12:41,638 --> 00:12:44,057 మీరు ఇక మీ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటే మంచిది. 224 00:12:47,185 --> 00:12:48,311 బహుశా మనం ముగ్గురం కలిస్తే బాగుంటుంది, 225 00:12:48,395 --> 00:12:50,230 ఎంతైనా నువ్వు నా భార్యని పెళ్లి చేసుకోబోయేవాడివి కదా. 226 00:12:50,313 --> 00:12:51,773 -నీ మాజీ-భార్య. -ఏదొకటిలే. 227 00:12:51,856 --> 00:12:53,191 ఫిల్, నన్ను క్షమించు. 228 00:12:53,275 --> 00:12:55,819 -నేను నిన్ను వ్యక్తిగతంగా కలిసి చెపుదాం అనుకున్నా. -నీ సంతోషం కోసం చెప్తున్నా, 229 00:12:55,902 --> 00:12:58,863 నువ్వు తిరిగి అమెరికా వస్తున్నట్టు సారా నాకు కూడా అస్సలు చెప్పలేదు. కాబట్టి… 230 00:12:58,947 --> 00:13:01,491 మ్యాక్స్! అవును, నేను చెప్పా. నేనే చెప్పా. 231 00:13:01,575 --> 00:13:03,368 నీకు నిశ్చితార్థం అయినట్టు యాంబర్ కి తెలుసా? 232 00:13:03,451 --> 00:13:06,538 -నేను చెప్పా… -ముందు నీకు చెప్పమని సారాకి నేను చెప్పా. 233 00:13:06,621 --> 00:13:07,956 -మ్యాక్స్. -అలాగే చేయాలి. 234 00:13:08,039 --> 00:13:09,374 నేను ఒప్పుకుంటా. 235 00:13:12,294 --> 00:13:13,712 నేను నిద్ర లేచానా ఏంటి? 236 00:13:16,339 --> 00:13:19,593 అప్పుడు మా నాన్న నిశ్చితార్ధ ఉంగరాన్ని చూసి చాలా బాధపడ్డారు. 237 00:13:19,676 --> 00:13:20,719 తర్వాత ఏమైంది? 238 00:13:20,802 --> 00:13:23,096 -ఆ తర్వాత, పరిస్థితి ఇబ్బందిగా తయారైంది. -నిజమే. 239 00:13:23,179 --> 00:13:25,265 ఇప్పుడు అంతా కలిసి నా నాటకాన్ని చూడటానికి వస్తున్నారు. 240 00:13:25,348 --> 00:13:27,392 పామ్ అత్త, మ్యాక్స్, నాన్న ఇంకా అమ్మ. 241 00:13:27,475 --> 00:13:28,518 అలాగే మా అమ్మ కూడా. 242 00:13:28,602 --> 00:13:30,145 అవును. 243 00:13:33,398 --> 00:13:35,650 మనం ఇంకా చాలా పెయింటింగ్ వేయాలి. 244 00:13:36,318 --> 00:13:37,527 అవును. 245 00:13:38,820 --> 00:13:40,947 -మ్యాక్స్ చేసే ఫేషియల్ ట్రై చేస్తావా? -అవును! 246 00:13:43,116 --> 00:13:44,409 సరే. 247 00:13:44,492 --> 00:13:46,202 దీనిని మన ముఖానికి ఎలా పూసుకోవడం? 248 00:13:46,286 --> 00:13:47,662 మన చేతులు వాడాలా? 249 00:13:47,746 --> 00:13:48,955 వినడానికి బాగుంది. 250 00:13:57,797 --> 00:13:59,633 వావ్, పచ్చని రంగు నా కళ్ళు అందంగా కనిపించేలా చేస్తున్నాయి. 251 00:13:59,716 --> 00:14:02,427 నాకు నేను అందంగా కనిపిస్తున్నాను, అది సాధ్యం అవుతుందనుకోలేదు. 252 00:14:04,387 --> 00:14:06,556 -మీ ఇంట్లో చిప్స్ ఉన్నాయా? -అవును, ఉన్నాయి అనుకుంట. 253 00:14:11,228 --> 00:14:12,229 కార్న్ చిప్స్ 254 00:14:26,409 --> 00:14:27,410 అమ్మాయిలు! 255 00:14:27,494 --> 00:14:29,829 చెప్పు, నాన్న, ఇంకా ఇక్కడే పెయింట్ వేస్తున్నాం! 256 00:14:31,081 --> 00:14:33,833 పామ్ అత్త నీ తలగడలు కొన్ని ఇక్కడికి తెస్తుంది, యాంబర్! 257 00:14:33,917 --> 00:14:35,210 సరే. 258 00:14:38,797 --> 00:14:40,173 ఆ పెయింట్ నీ చర్మం మీద పూసుకోకు. 259 00:14:40,257 --> 00:14:42,384 ఇదేంటి? ఏమైనా సెల్ఫీ దిగడానికి ఏర్పాటు చేసుకున్నారా? 260 00:14:42,467 --> 00:14:43,760 అది చర్మానికి హాని చేయొచ్చు. 261 00:14:43,843 --> 00:14:45,345 అదేం పర్లేదు, నాన్నా. 262 00:14:46,179 --> 00:14:47,347 ఇది తినడానికి మంచిదే. 263 00:14:48,098 --> 00:14:49,641 ఓహ్, దేవుడా. అదేంటి? 264 00:14:49,724 --> 00:14:51,476 ఇదొక అవకాడో ఫెషియల్. 265 00:14:51,560 --> 00:14:52,644 ఇంకా ఒక డిప్ కూడా. 266 00:14:53,812 --> 00:14:55,605 -నేను దీన్ని తీసుకుంటా. -షాక్ అయిపోయా. 267 00:14:55,689 --> 00:14:58,650 ఇంటి ఓనర్ కొడుకు కొంచెం సేపటిలో ఏసీ కోసం కొన్ని ఫిల్టర్లు తెచ్చి ఇస్తాడు. 268 00:14:58,733 --> 00:15:00,944 ఆయన ఇది నిజంగానే పెయింట్ అనుకున్నారు. 269 00:15:01,027 --> 00:15:02,612 మనం ముఖం మీద పూసుకుంది. 270 00:15:04,322 --> 00:15:06,992 చర్మం కొంచెం బిగుతుగా అనిపించినప్పుడు దీన్ని కడిగేసుకోవాలి అని మ్యాక్స్ అన్నాడు. 271 00:15:07,075 --> 00:15:10,328 -ఇది చాలా బాగుంది. చర్మం తాజాగా అనిపిస్తుంది. -అవును. 272 00:15:24,801 --> 00:15:27,345 యాంబర్? బ్రాండీ? 273 00:15:28,722 --> 00:15:34,269 మేము జార్నర్ నుండి వచ్చాము. మీ ప్రపంచాన్ని పరిశోధించడానికి. 274 00:15:36,062 --> 00:15:38,690 మమ్మల్ని మీ నాయకుడి దగ్గరకు తీసుకెళ్ళు. 275 00:15:42,110 --> 00:15:45,071 నేను స్వరాన్ని అలా పెట్టలేను, కానీ ఇలా చేయగలను. 276 00:15:53,914 --> 00:15:56,249 ప్రారంభ రాత్రి స్కూల్ ప్రొడక్షన్ 277 00:16:03,173 --> 00:16:06,259 దీని పక్కలు చాల వేడి ఎక్కుతాయి, కాబట్టి పట్టుకోలేం. 278 00:16:06,343 --> 00:16:08,470 అందుకని, నేను దీని ఫ్రెమ్ పట్టుకుని దీన్ని తిప్పాలి. 279 00:16:09,304 --> 00:16:10,639 చాలా బాగుంది. 280 00:16:10,722 --> 00:16:13,808 చూస్తుంటే మన స్పేస్ షిప్ లో ఉండే పరికరంలా ఉంది. 281 00:16:13,892 --> 00:16:15,018 అవును! 282 00:16:26,613 --> 00:16:27,656 బ్రావో. 283 00:16:27,739 --> 00:16:31,576 బ్రావో! బ్రావో! బ్రావో! 284 00:16:48,426 --> 00:16:50,512 హాయ్. చాలా ఉత్సాహంగా ఉంది. 285 00:16:55,100 --> 00:16:56,810 -నీకు దాని గురించి… -హాయ్. 286 00:16:56,893 --> 00:16:59,229 -అవును. -అవును, తన పేరు అక్కడే ఉంది. 287 00:17:02,899 --> 00:17:04,734 ఇంటర్వెల్ తర్వాత తాను వస్తుంది అనుకుంట. 288 00:17:08,280 --> 00:17:09,738 నన్ను క్షమించు, యాంబర్. 289 00:17:18,415 --> 00:17:20,708 తను ఫిల్ కోసం చూస్తున్నట్టు ఉంది. 290 00:17:21,751 --> 00:17:24,337 మీరంతా ఇంటర్వెల్ తర్వాత వెంటనే వెళ్ళాలి, సరేనా? 291 00:17:24,420 --> 00:17:27,382 అందరూ ఇక్కడ వరుసగా నిలబడండి. వెళ్లి రెడీ అవ్వండి. పదండి. 292 00:17:28,675 --> 00:17:31,136 ఈ చెత్త చెట్టు పాత్ర ఇచ్చిన వెంటనే మానేసి ఉంటే బాగుండేది. 293 00:17:33,805 --> 00:17:35,265 సమయం వృధా తప్ప ఇంకేం కాదు. 294 00:17:36,808 --> 00:17:40,395 అందుకే నాన్న రాలేదు. ఆయనకు సిగ్గు వేసి ఉంటుంది. 295 00:17:45,692 --> 00:17:47,027 హాయ్. 296 00:17:47,110 --> 00:17:49,446 హాయ్. నీ పేరు ఏంటి? 297 00:17:52,407 --> 00:17:53,825 పౌలా. 298 00:17:53,909 --> 00:17:55,660 నిన్న కలవడం సంతోషం, పౌలా. 299 00:17:55,744 --> 00:17:59,247 నేను యాంబర్. ఇక్కడ నన్ను "మూడవ కోపిష్టి యాపిల్ చెట్టు" అంటారు కూడా. 300 00:18:02,918 --> 00:18:04,836 చెట్టులా నటించడం బాగుండి ఉంటుంది. 301 00:18:05,754 --> 00:18:07,797 అలాగే నువ్వు కూడా… 302 00:18:12,427 --> 00:18:13,428 "ఇంటర్వెల్ అమ్మాయిగా." 303 00:18:17,557 --> 00:18:18,975 నీకు భయంగా ఉందా? 304 00:18:19,601 --> 00:18:20,644 కొంచెం. 305 00:18:23,980 --> 00:18:25,982 నీకు కొంచెం ధైర్యం కావాలి అంతే. 306 00:18:28,735 --> 00:18:29,569 అవును. 307 00:18:30,528 --> 00:18:31,529 నీ బో టై బాగుంది. 308 00:18:35,367 --> 00:18:36,368 థాంక్స్. 309 00:18:36,451 --> 00:18:37,869 నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 310 00:18:38,578 --> 00:18:39,704 చాలా అందంగా ఉంది! 311 00:18:43,041 --> 00:18:44,292 ఇక నేను వెళ్తున్నాను. 312 00:18:46,336 --> 00:18:47,462 వెళ్ళు, పౌలా! 313 00:18:50,507 --> 00:18:52,759 ఇంటర్వెల్ 314 00:19:04,688 --> 00:19:06,189 అది భలే చేసావు. 315 00:19:07,816 --> 00:19:10,610 అవునా? నాకు చాలా భయం వేసింది. 316 00:19:11,236 --> 00:19:12,946 చూస్తే అస్సలు అలా అనిపించలేదు. 317 00:19:17,242 --> 00:19:19,327 సూపర్. నాకు భలే అనిపిస్తుంది. 318 00:19:19,411 --> 00:19:20,370 నాకు కూడా కలిసిరావాలని కోరుకో. 319 00:19:22,998 --> 00:19:24,374 తప్పకుండా! 320 00:19:26,459 --> 00:19:28,920 సాధించు, మూడవ నంబర్ కోపిష్టి చెట్టు. 321 00:19:59,075 --> 00:20:01,328 అది తనేనా, ఎడమవైపు నుండి రెండవ అమ్మాయి? 322 00:20:13,924 --> 00:20:15,217 వద్దు. 323 00:20:22,265 --> 00:20:24,392 ఓహ్, లేదు, అది ఎక్కడికి పోయింది? ఎక్కడ ఉంది? 324 00:20:31,733 --> 00:20:33,652 తప్పుకోండి. అడ్డు లెగండి. నేను… 325 00:20:34,444 --> 00:20:36,029 కొంచెం… తప్పుకోండి. 326 00:20:37,447 --> 00:20:38,698 ఓరి, నాయనో! 327 00:20:38,782 --> 00:20:40,533 -తనకు బానే ఉందా? -ఏం జరుగుతుంది? 328 00:20:40,617 --> 00:20:43,453 -ఎలుక! -ఏంటి? ఎక్కడ? 329 00:20:43,536 --> 00:20:44,955 పిలకా? 330 00:20:45,038 --> 00:20:46,539 -ఏంటి? -పిలకా? 331 00:20:46,623 --> 00:20:47,624 ఎలుక! 332 00:20:47,707 --> 00:20:48,917 చెక్క! 333 00:20:49,000 --> 00:20:50,252 ఓహ్, లేదు. 334 00:20:59,678 --> 00:21:01,179 -నేను బాగానే ఉన్నాను. -నేను కూడా. 335 00:21:01,263 --> 00:21:02,973 -బానే ఉన్నాను. -నేను బాగానే ఉన్నాను. 336 00:21:03,056 --> 00:21:05,600 నేను బాగానే ఉన్నాను, కానీ ఒక కొమ్మ విరిగినట్టు ఉంది. 337 00:21:05,684 --> 00:21:08,603 ఎలుక 338 00:21:10,272 --> 00:21:11,273 అవును! 339 00:21:13,567 --> 00:21:14,776 ఇక మొదలుపెట్టు, పౌలా. 340 00:21:19,864 --> 00:21:21,658 చాలా థాంక్స్, పౌలా! 341 00:22:16,713 --> 00:22:18,715 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్