1 00:00:06,716 --> 00:00:09,135 ప్రియమైన డైరీ, ఇవాళ నేను ఇంకొక ఇంట్లో ఉన్నాను. 2 00:00:10,220 --> 00:00:12,222 అస్తమాను ఇల్లు మారడం ఇప్పుడు కాస్త అలవాటైంది. 3 00:00:12,889 --> 00:00:16,893 నాన్నతో ఉండడం చాలా బాగుంది. ఆయన పక్కనే ఉండటం చాలా నచ్చింది. 4 00:00:19,020 --> 00:00:23,817 చాలా వరకు సంతోషంగానే ఉంటున్నాను, కానీ అంతలోనే విడాకుల బాధ గుర్తుకొస్తుంది. 5 00:00:24,317 --> 00:00:26,695 సముద్రం అలలు ఒడ్డుకు తాకినట్టు. 6 00:00:27,237 --> 00:00:31,700 ఆ విచారం ఒక్కొక్క సారి ఒక్కొక మోతాదులో వచ్చి పోతుంటుంది. 7 00:00:32,449 --> 00:00:34,661 ఎక్కువగా, నేను నాన్న ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు 8 00:00:34,744 --> 00:00:37,747 ఆయన పారిస్ నుంచి వెనక్కి వచ్చారని సంతోషిస్తుండగా అలా అవుతుంది. 9 00:00:38,415 --> 00:00:42,586 ఆయన ఎంత తిరిగి వచ్చినా, నాతో, అమ్మతో కలిసి ఉండరు కదా. 10 00:00:44,296 --> 00:00:48,216 నేను, అమ్మా ఇంకా నాన్న ఎప్పటికైనా 11 00:00:48,300 --> 00:00:52,178 తిరిగి మా ఇంట్లో ఉంటామనే కలలు ఇంకా వస్తూనే ఉన్నాయి. 12 00:00:54,639 --> 00:00:58,184 యాంబర్ బ్రౌన్ అనబడే నాకు, 13 00:00:58,977 --> 00:01:01,187 ఈ కోరికలు, ఆశలు, 14 00:01:01,271 --> 00:01:05,525 కలిసి ఉంటామనే ఊహలు ఎప్పటికైనా పూర్తిగా పోతాయా? 15 00:01:12,198 --> 00:01:13,909 ఈ షో చూసావా, నాన్న? 16 00:01:13,992 --> 00:01:15,660 లేదు, అది దేని గురించి? 17 00:01:15,744 --> 00:01:17,579 ఈ షోలో జనానికి మేకప్ వేస్తుంటారు. 18 00:01:18,079 --> 00:01:19,164 అవునా? 19 00:01:19,247 --> 00:01:23,960 ఆహ్-హా. చూడు, ఆ మహిళకు 60 ఏళ్ళు, కానీ 40 ఏళ్ల ఆవిడలా కనిపించాలి అనుకుంటుంది. 20 00:01:24,044 --> 00:01:25,754 ఇరవై ఏళ్ళ దానిలా కనిపించాలని 21 00:01:25,837 --> 00:01:28,632 తాపత్రయపడే తన 30 ఏళ్ల కూతురంటే ఆవిడకి అసూయ. 22 00:01:28,715 --> 00:01:31,009 -వింటుంటే నీ మ్యాథ్స్ లెక్కలా ఉంది. -అవును. 23 00:01:32,636 --> 00:01:37,974 ఇద్దరు కూతుళ్ళున్న అరవై ఏళ్ల వయసున్న ఒక అమ్మ, క్యాథ్లీన్, చూడటానికి 40 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తుంది 24 00:01:38,058 --> 00:01:40,435 జూలీ, 30. షీలా, 25. 25 00:01:40,518 --> 00:01:42,103 ఇద్దరూ 20 ఏళ్ల పాపల్లా కనిపించాలి అనుకునేవారే. 26 00:01:42,979 --> 00:01:47,275 మరి ఆ ఇద్దరు కూతుళ్ళ నిజ వయసును కలిపి, ఆమె మేకోవర్ చేయించుకున్న తర్వాత కనిపించే వయసును 27 00:01:47,359 --> 00:01:49,110 తీసేస్తే, ఇంకా ఎంత వయసు తేడా ఉంటుంది? 28 00:01:49,194 --> 00:01:51,905 ఏమీ ఉండదు, ఎందుకంటే ముందు వాళ్ళు తమ వయసుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకోవాలి. 29 00:01:52,656 --> 00:01:54,449 లేదా వాళ్ళ మేకోవర్ వయసుకు తగ్గట్టుగా ఉండాలి. 30 00:01:55,659 --> 00:01:57,494 అమ్మో. ఇవాళ జోకులతో అదరగొడుతున్నావ్. 31 00:01:57,577 --> 00:01:59,621 సూపర్ చెప్పావు, బర్! 32 00:02:01,915 --> 00:02:05,544 నాకు అర్ధం కావడం లేదు, నాకు 11 ఏళ్ళు, ఎప్పుడు 12 వస్తాయా అని చూస్తున్నా. 33 00:02:05,627 --> 00:02:08,129 అలాంటిది నాకు అయిదు అన్నట్టు కనిపించాలని నేను ఎందుకు అనుకుంట? 34 00:02:08,212 --> 00:02:10,090 అందరికీ యవ్వనంగా ఉండాలనే కోరిక ఉంటుంది. 35 00:02:10,590 --> 00:02:12,842 కానీ నాకు మాత్రం నువ్వు ఇప్పటికే అయిదేళ్ల బుజ్జి కొండవే. 36 00:02:13,760 --> 00:02:17,556 నువ్వు ఇక నీ బుక్, అలాగే పెన్ను, పేపర్ తీసుకుంటే… 37 00:02:17,639 --> 00:02:21,101 -ఎరేజర్లు. అవి కూడా చాలా కావాలి. -అవును. 38 00:02:21,810 --> 00:02:24,437 నీ కొత్త ట్యూషన్ మాస్టారు త్వరలో వస్తుంది. 39 00:02:25,146 --> 00:02:26,147 కొత్త వ్యక్తా? 40 00:02:26,231 --> 00:02:28,733 అవును, మిస్టర్ చిలియోస్ కి ట్రాన్స్ఫర్ అయింది అంట, 41 00:02:28,817 --> 00:02:30,610 కాబట్టి ఇవాళ కొత్త టీచర్ వస్తుంది. 42 00:02:31,194 --> 00:02:35,448 నీకు చెప్పి ఉండాల్సింది. నువ్వు ఇక్కడికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. 43 00:02:35,532 --> 00:02:36,825 అందుకే చాలా మర్చిపోతుంటా. 44 00:02:37,742 --> 00:02:38,743 థాంక్స్, నాన్న. 45 00:02:39,244 --> 00:02:41,079 అవును, మనం ఇక శుభ్రం చేస్తే మంచిది. 46 00:02:41,580 --> 00:02:45,375 వీటన్నిటినీ… ఇక్కడ పడేద్దాం. 47 00:02:46,793 --> 00:02:49,754 ఏం పర్లేదు, నాన్న. నాకు ఇక్కడ ఉండటం చాలా ఇష్టం. 48 00:02:49,838 --> 00:02:52,382 మనిద్దరమే ఎంచక్కా పిజ్జా ఇంకా పాస్తా తింటూ ఉందాం. 49 00:02:52,465 --> 00:02:55,260 అలాగే మళ్ళీ పాస్తా, ఇంకా పిజ్జా తింటూ కూర్చోవాలి. 50 00:02:56,011 --> 00:02:57,637 నాకు పెద్దగా వంట రాదు ఏమీ అనుకోకు, 51 00:02:57,721 --> 00:03:01,766 అందుకే దానికి బదులు ఇంటిని ఇలా చాలా నీటుగా పెడుతుంటాను. 52 00:03:01,850 --> 00:03:02,851 చూడు. 53 00:03:04,603 --> 00:03:07,647 అవును. బహుశా మనం వంటల క్లాసులకు వెళ్తే మంచిది. 54 00:03:09,065 --> 00:03:11,693 -అది చాలా మంచి ఐడియా. -అవునా? 55 00:03:11,776 --> 00:03:13,570 అవును. నిజమే. 56 00:03:14,571 --> 00:03:16,031 సరే. ఎప్పుడు వెళదాం? 57 00:03:16,948 --> 00:03:18,575 చూద్దాం. బహుశా ఈ వేసవిలో వెళ్లొచ్చు. 58 00:03:18,658 --> 00:03:22,203 సరే. అయితే అమ్మని కూడా తీసుకెళదామా? 59 00:03:24,247 --> 00:03:25,957 సరే. చూద్దాం. 60 00:03:29,461 --> 00:03:30,462 రండి! 61 00:03:31,046 --> 00:03:33,798 హాయ్! క్షమించండి, కొంచెం లేట్ అయ్యాను. 62 00:03:33,882 --> 00:03:35,008 నేను… 63 00:03:36,384 --> 00:03:38,428 -సినీ? -అవును. 64 00:03:39,346 --> 00:03:40,430 ఫిల్? 65 00:03:57,239 --> 00:03:59,199 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 66 00:04:03,286 --> 00:04:06,665 సరే, చివరి లెక్క. సరే, ఒక ఫ్రాక్షన్ లెక్క… 67 00:04:07,249 --> 00:04:11,294 ఇవాళ రాత్రి మీ ఫ్రిడ్జ్ లో సగం పిజ్జా పెట్టి, 68 00:04:11,378 --> 00:04:16,632 రేపు ఉదయం అందులో మూడవ భాగం తింటే, అసలు పిజ్జాలో ఎంత భాగం 69 00:04:16,716 --> 00:04:17,716 చివరికి మిగిలి ఉంటుంది? 70 00:04:17,800 --> 00:04:21,388 ఏమీ ఉండదు. ఎందుకంటే అర్ధరాత్రి లేచి మొత్తం తినేసి ఉండేదాన్ని. 71 00:04:24,391 --> 00:04:26,434 తెలివైన సమాధానం కానీ తప్పు. 72 00:04:26,518 --> 00:04:28,478 నువ్వు నీ లెక్కని ఈ పేపర్ మీద చెయ్. 73 00:04:28,562 --> 00:04:30,313 నీకు నీళ్లు ఏమైనా కావాలా, సినీ? 74 00:04:30,397 --> 00:04:33,108 -త్రాగడానికి ఏమైనా తీసుకురానా? -అవును. నీళ్లు చాలు. థాంక్స్. 75 00:04:33,191 --> 00:04:35,569 అంటే మీకు హై స్కూల్ నుండి పరిచయం ఉందా? 76 00:04:35,652 --> 00:04:37,946 లేదు. ఇంకా ముందు నుండి. 77 00:04:38,029 --> 00:04:42,158 నేను మీ నాన్నని 12 యాంగ్రీ మెన్ నాటకం సమయంలో ఇద్దరం నటించినప్పుడు కలిసాను… 78 00:04:42,242 --> 00:04:44,953 -అవును. -…పార్క్ రిడ్జ్ మిడిల్ స్కూల్ లో. 79 00:04:45,036 --> 00:04:47,163 -మేము అప్పుడు… -ఎనిమిదవ క్లాసులో ఉన్నాం. 80 00:04:50,000 --> 00:04:52,752 -ఏంటి? -నమ్మలేకపోతున్నా. 81 00:04:52,836 --> 00:04:54,546 నిన్ను మళ్ళీ కలవడం చాలా సంతోషం, సిన్. 82 00:04:55,130 --> 00:04:56,923 నాదీ అదే ఫీలింగ్. 83 00:04:58,925 --> 00:05:00,427 -హేయ్, యాంబర్. -హేయ్, స్టాన్లీ. 84 00:05:03,847 --> 00:05:05,390 అబ్బా, దెబ్బ తగిలిందా? 85 00:05:11,271 --> 00:05:14,274 ప్రియమైన డైరీ, ఆ క్షణంలో నాకు ఏం చేయాలో తోచలేదు. 86 00:05:15,942 --> 00:05:20,030 నేను ఇప్పటికే అమ్మను ఇంకొకరితో పంచుకుంటున్నా, ఇప్పుడిప్పుడే మ్యాక్స్ అలవాటు అవుతున్నాడు. 87 00:05:20,113 --> 00:05:24,117 ఇప్పుడు నా వల్ల కాదు. నాన్నను ఇంకొకరితో పంచుకోలేను. 88 00:05:24,951 --> 00:05:26,703 నాకు ఆయన ఇప్పుడే దొరికారు. 89 00:05:29,247 --> 00:05:33,001 విచారం. మళ్ళీ విచారం కమ్ముకొస్తుంది. 90 00:05:33,084 --> 00:05:35,462 క్షమించండి. అనుకోకుండా జరిగింది! 91 00:05:35,545 --> 00:05:37,130 పర్లేదు. 92 00:05:38,715 --> 00:05:41,343 నా పేపర్లు. దిద్దిన తర్వాత లామినేట్ చేసి ఉంచాల్సింది. 93 00:05:41,426 --> 00:05:42,719 నేను తీసేసాను. 94 00:05:44,554 --> 00:05:47,557 అయితే మీరు ఇక ట్యాక్సీని పిలుచుకుంటారా? 95 00:05:48,141 --> 00:05:49,809 అదే, ఇంటికి వెళ్ళడానికి? 96 00:05:49,893 --> 00:05:51,061 మీరు బయట నిలబడి ఎదురుచూడవచ్చు. 97 00:05:51,144 --> 00:05:52,395 యాంబర్. 98 00:05:52,979 --> 00:05:54,856 నేను తిరిగి వెళ్ళడానికి అందులో 99 00:05:54,940 --> 00:05:56,942 సమయానికి ఆటోమేటిక్ గా కార్ ఏర్పాటు అవుతుంది. 100 00:05:57,025 --> 00:05:58,276 కాబట్టి, అదేం పర్లేదు. 101 00:05:58,360 --> 00:06:00,695 నీ పుస్తకం ఎత్తుతావా, బర్, ప్లీజ్? 102 00:06:01,446 --> 00:06:03,281 నీళ్లు ఒంపినందుకు క్షమించండి. 103 00:06:03,365 --> 00:06:04,366 అదేం పర్లేదు. 104 00:06:06,159 --> 00:06:08,536 అయితే, వచ్చే వారం ఇదే సమయానికి రావాలా? 105 00:06:08,620 --> 00:06:09,829 -అవును. -వద్దు. 106 00:06:11,498 --> 00:06:13,250 అంటే, బహుశా రావాల్సి ఉండొచ్చు. 107 00:06:13,333 --> 00:06:15,669 నా తర్వాతి టెస్టు ఎలా రాస్తానో చూద్దాం. సరేనా, నాన్నా? 108 00:06:15,752 --> 00:06:18,255 సరే. అలాగే చూద్దాం. 109 00:06:19,047 --> 00:06:20,632 నేను నిన్ను బయటకు తీసుకెళ్ళనా? 110 00:06:23,260 --> 00:06:24,386 నిన్ను కలవడం సంతోషం, యాంబర్. 111 00:06:24,469 --> 00:06:26,179 నీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తుంటా. 112 00:06:26,263 --> 00:06:28,723 అతి త్వరలోనే నీకు మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది. 113 00:06:30,267 --> 00:06:31,518 ఎంత త్వరగా వస్తే నాకు అంత మంచిది. 114 00:06:50,870 --> 00:06:52,038 యాంబర్ భలే ముద్దు వస్తుంది. 115 00:06:52,122 --> 00:06:53,832 అవును, థాంక్స్. అదే నా ప్రాణం. 116 00:06:56,418 --> 00:06:57,711 పిల్ల పూర్తిగా నీతోనే ఉంటుందా? 117 00:06:58,628 --> 00:07:04,092 లేదు. నా భార్య… సారా ఇంకా నాతో ఉంటుంది. నీకు సారా గుర్తుందా? 118 00:07:04,801 --> 00:07:06,636 లేదు, గుర్తు రావడం లేదు. 119 00:07:06,720 --> 00:07:09,973 ఆ ఏడాది తను మన క్లాసులో ఉంది. అప్పుడే మన ఏరియాకి వాళ్ళు ఇల్లు మారారు. 120 00:07:10,056 --> 00:07:13,935 బ్రెసెస్ పెట్టుకునేది, పెద్ద కళ్లు, ఎర్రని జుట్టు, ఎర్రని బుగ్గలు. 121 00:07:14,019 --> 00:07:15,729 ఎప్పుడూ డాక్ మార్టెన్ చెప్పులే వేసుకునేది. 122 00:07:15,812 --> 00:07:17,606 చాలా మంచి పిల్ల. 123 00:07:17,689 --> 00:07:20,066 అమ్మను నువ్వు వర్ణించేది అలాగా? మరీను, నాన్న. 124 00:07:20,150 --> 00:07:22,319 ఆమె ఒక జోకర్ లా ఉంటుంది అన్నట్టు చెప్పావు. 125 00:07:23,778 --> 00:07:25,989 ఆ ఏడాది నేను ఇల్లినాయిస్ మిస్ టీసేజ్ పతాకం గెలుచుకున్నా, 126 00:07:26,072 --> 00:07:27,782 కాబట్టి… బాగా బిజీగా ఉన్నా. 127 00:07:29,492 --> 00:07:32,370 ట్యాలెంట్ చూపించే సమయంలో నేను ఒక పెద్ద మ్యాథ్స్ లెక్కను తీసుకుని 128 00:07:32,454 --> 00:07:34,205 బంగారు అంచులున్న బ్లాక్ బోర్డుపై పరిష్కరించి చూపించా. 129 00:07:34,289 --> 00:07:36,416 -వావ్. నువ్వు భలే అమ్మాయివి. -ఓహ్, అవును. 130 00:07:38,126 --> 00:07:40,462 విశిష్టమైన టాలెంట్. 131 00:07:44,299 --> 00:07:45,717 అయితే నిన్ను మళ్ళీ కలుస్తా… 132 00:07:46,301 --> 00:07:47,302 సరే. 133 00:07:48,261 --> 00:07:54,351 అయితే మరి ఎనిమిదవ క్లాసులో బక్కగా ఉన్న ఆ కుర్రాడికి నీ నంబర్ ఇస్తావా? 134 00:07:58,355 --> 00:08:00,607 వద్దు. ఇవ్వను అనండి, ప్లీజ్. 135 00:08:01,608 --> 00:08:02,609 సరే. 136 00:08:12,786 --> 00:08:16,206 బహుశా పాత స్నేహితురాలిని చూసి ఆయన సంతోషపడి ఉంటారు అంతే. 137 00:08:16,289 --> 00:08:17,666 నేనైతే కంగారు పడను. 138 00:08:17,749 --> 00:08:21,920 సరే, నేనైతే బాగా కష్టపడి ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకుని 139 00:08:22,003 --> 00:08:24,464 ట్యూషన్ అవసరం లేకుండా చేయాలని ప్లాన్ చేశా. 140 00:08:24,548 --> 00:08:26,633 ట్యూషన్ పెట్టేదే అందుకు కదా? 141 00:08:26,716 --> 00:08:30,428 అవును, కానీ ఇకపై సీరియస్ గా చదువుతా. 142 00:08:30,512 --> 00:08:33,682 ఆమె మళ్ళీ రావడం నాకు ఇష్టం లేదు. మా నాన్నను పంచుకోవాల్సి రావచ్చు. 143 00:08:33,765 --> 00:08:36,393 నీకు మ్యాక్స్ కూడా నచ్చేవాడు కాదు, గుర్తుందా? 144 00:08:36,476 --> 00:08:38,227 అవును. 145 00:08:38,311 --> 00:08:42,148 కానీ అతను ఒక వారం బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళగానే నువ్వు తనని మిస్ అవుతున్నా అన్నావు. 146 00:08:42,231 --> 00:08:44,985 లేదు, అమ్మ అతన్ని ఎందుకు మిస్ అవుతుందో అర్థమైంది అన్నాను. 147 00:08:45,485 --> 00:08:47,195 -రెండూ ఒకటే. -కాదు. 148 00:08:47,279 --> 00:08:48,905 నేను నీకు సహాయం చేయగలిగి ఉంటే బాగుండు. 149 00:08:48,989 --> 00:08:51,616 నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం, కానీ పెద్దగా వివరించలేను. 150 00:08:51,700 --> 00:08:56,663 కానీ, సోషల్ ఇంకా సైన్స్ అయితే బాగా చెప్పగలను. ఒక చిన్న సైజు నిపుణుడిని. 151 00:08:56,746 --> 00:08:59,040 చిన్న అంటే నాకు తెలిసిన విషయం గురించి కాదు. 152 00:08:59,124 --> 00:09:01,501 వయసు కారణంగా చిన్నవాడిని అని. 153 00:09:01,585 --> 00:09:05,088 నాకు కూడా మ్యాథ్స్ చాలా ఇష్టం. వీలైతే దాన్ని పెళ్లి కూడా చేసుకుంటా. 154 00:09:05,589 --> 00:09:08,633 అప్పుడు నీ పెళ్లిలో చాలా సమస్యలు ఉంటాయి. 155 00:09:10,010 --> 00:09:12,596 అవును, కానీ వాటిని పరిష్కరించుకుంటాం. 156 00:09:12,679 --> 00:09:15,515 అప్పుడు అందమైన ఫలితాలు రావచ్చు. 157 00:09:15,599 --> 00:09:17,684 అలాగే మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. 158 00:09:21,396 --> 00:09:23,815 రోజుకు ఒక జోకు కోటా పూర్తి అయింది, 159 00:09:23,899 --> 00:09:25,483 అలాగే అదనంగా ఇంకొక జోక్ కూడా చెప్పుకున్నాం. 160 00:09:25,984 --> 00:09:29,279 ఇకపోతే, మన ముందు ఉన్న సమస్య గురించి మాట్లాడుకుందాం. 161 00:09:30,614 --> 00:09:32,157 బ్రాండీ, నాకు ట్యూషన్ అవసరం లేకుండా 162 00:09:32,240 --> 00:09:35,994 ఉండటానికి నా మ్యాథ్స్ ఇంకా హోమ్ వర్క్ లో నువ్వు నాకు నిజంగా సహాయం చేస్తావా? 163 00:09:36,077 --> 00:09:40,206 అవును. తప్పకుండా. ఒకప్పుడు ఫ్రెండ్స్ అలాగే హోమ్ వర్క్ చేసేవారు. 164 00:09:40,290 --> 00:09:41,708 అప్పట్లో ట్యూషన్స్ ఉండేవి కాదు. 165 00:09:41,791 --> 00:09:43,084 నీ తర్వాతి మ్యాథ్స్ టెస్ట్ ఎప్పుడు? 166 00:09:43,168 --> 00:09:44,419 వచ్చే వారం. 167 00:09:44,502 --> 00:09:45,587 అతి త్వరలోనే. 168 00:09:45,670 --> 00:09:46,671 నువ్వు రెడీగా ఉంటావు. 169 00:09:46,755 --> 00:09:48,548 భలే కలిశారు! 170 00:09:53,178 --> 00:09:54,429 ఇది నాకు చాలా ఇష్టం, 171 00:09:54,512 --> 00:09:56,389 అందుకే ఫ్రేము కట్టించాను. 172 00:09:56,473 --> 00:09:58,725 ఇందులో దాని చెవిలీలు కనిపించడం లేదు. 173 00:09:58,808 --> 00:10:00,685 పామ్, నాకు ఇది చాలా నచ్చింది. 174 00:10:00,769 --> 00:10:02,896 స్వీటీ, నీకు తినడానికి ఏమైనా కావాలా? స్కూల్ ఎలా గడిచింది? 175 00:10:02,979 --> 00:10:04,606 తినడానికి, వద్దు. స్కూల్, ముద్దు. 176 00:10:04,689 --> 00:10:06,650 ఒక బుల్లి అడవి మనిషితో ఉంటున్నట్టు ఉంది. 177 00:10:06,733 --> 00:10:09,402 -కదా? -హోమ్ వర్క్ చేయడానికి బ్రాండీ వస్తుంది. 178 00:10:09,486 --> 00:10:11,738 ఈ వారంలో ఇది మూడవ రోజు. బాగుంది. 179 00:10:13,365 --> 00:10:15,116 హేయ్, శ్రీమతి బ్రౌన్. హాయ్, పామ్ అత్త. 180 00:10:15,200 --> 00:10:17,410 -ఎలా ఉన్నావు? -మీరు మీ హోమ్ వర్క్ ని ఈ టేబుల్ 181 00:10:17,494 --> 00:10:21,039 లేదా వంటగది బల్ల మీద చేసుకోవచ్చు. నీ బ్యాగుని ఈ కుర్చీలో పెట్టు. 182 00:10:21,122 --> 00:10:22,123 చాలా థాంక్స్. 183 00:10:22,791 --> 00:10:24,167 నేను తినడానికి ఏమైనా ఉందా? 184 00:10:24,251 --> 00:10:25,460 అవును, ఉంది. 185 00:10:25,544 --> 00:10:27,546 నేను కొన్ని బ్లు బెర్రీ కేకులు తెచ్చా. కావాలా? 186 00:10:27,629 --> 00:10:29,172 -అవును, ఇవ్వండి. -అలాగే. 187 00:10:29,256 --> 00:10:31,508 హోమ్ వర్క్ ఇంకా డాన్స్ బ్రేకులకు బలం కావాలి కదా. 188 00:10:31,591 --> 00:10:34,344 డాన్స్ బ్రేకులు తగ్గిస్తే, ట్యూషన్ అవసరం కూడా ఉండదు ఏమో. 189 00:10:34,427 --> 00:10:36,721 -ఏం ట్యూషన్? ఏం సబ్జెక్టు? -మ్యాథ్స్. 190 00:10:36,805 --> 00:10:39,182 యాంబర్ కి కాస్త సహాయం కావాలి. 191 00:10:39,266 --> 00:10:41,184 -మ్యాథ్స్ దేనికీ పనికిరాదు. -అవునా? 192 00:10:41,268 --> 00:10:43,603 -అవును. -కాదు. పామ్, ఏంటిది? 193 00:10:43,687 --> 00:10:46,523 అంటే, నేను దాన్ని వాడను. స్కూల్ పూర్తయ్యాక ఎప్పుడూ వాడింది లేదు. 194 00:10:46,606 --> 00:10:49,067 యాంబర్ కోసం ట్యూషన్ పెట్టించారంటే ఎంతో కొంత అవసరం ఉండి ఉంటుంది కదా. 195 00:10:49,150 --> 00:10:51,194 అవును. అది నిజమే. 196 00:10:51,861 --> 00:10:54,573 నాకైతే డబ్బులు దండగ అనిపిస్తుంది. నాన్న డబ్బులు. 197 00:10:55,699 --> 00:10:57,492 నాకు కొన్ని పాలు ఇస్తారా? 198 00:10:57,576 --> 00:10:58,577 తప్పకుండా. 199 00:10:59,578 --> 00:11:03,540 ఇప్పుడు కథ వేరు. కొత్త ట్యూషన్ మాస్టారు మహిళ, మగతను కాదు. ఆవిడ సినీ ఆహ్? 200 00:11:04,457 --> 00:11:07,669 చాలా చిరాకుగా ఉంది. ఆమె ఉంటే నాన్నను పట్టుకోలేకపోతున్నాను. 201 00:11:09,462 --> 00:11:12,132 మిస్టర్ బ్రౌన్ చాన్నాళ్ల క్రితం స్కూల్ లో ఆమెతో కలిసి చదివారు అంట. 202 00:11:12,215 --> 00:11:14,259 ఎప్పుడో ఎనిమిదవ క్లాసులో. 203 00:11:14,342 --> 00:11:16,052 ఆగు. సినీ? సినీ ట్రూప్? 204 00:11:16,136 --> 00:11:18,763 యాంబర్ ఆవిడ ఒక యువరాణి లాంటిది అని ఏదో చెప్పిందే? 205 00:11:18,847 --> 00:11:20,390 అవును. సినీ. తనే. 206 00:11:20,473 --> 00:11:22,350 నాకు ఇప్పుడు ట్యూషన్ అవసరం లేదు, అమ్మా. 207 00:11:22,434 --> 00:11:24,185 ఆవిడ ఎలా ఉంటుందో చూడాలి. 208 00:11:24,269 --> 00:11:26,771 సాధారణంగా యువరాణులు మ్యాథ్స్ ట్యూషన్ మాస్టార్లు కారు కదా. 209 00:11:28,148 --> 00:11:30,358 సినీ. ఆమె ఇల్లినాయిస్ మిస్ టీనేజ్. 210 00:11:30,442 --> 00:11:33,695 అవును. యువరాణి కాదు, విజేత. 211 00:11:33,778 --> 00:11:35,989 తికమక పడ్డాను. ఇద్దరికీ కిరీటాలు ఇస్తారు. 212 00:11:36,072 --> 00:11:37,866 ఫిల్ కి ఆ అమ్మాయి మీద చాలా ఇష్టం ఉండేది. 213 00:11:37,949 --> 00:11:39,075 ఉండేదా? 214 00:11:39,826 --> 00:11:42,537 వావ్. చాలా అందంగా ఉంది. 215 00:11:43,788 --> 00:11:44,789 ఫిల్ అదృష్టం బానే ఉంది. 216 00:11:45,790 --> 00:11:47,125 చాలా కచ్చితంగా అన్నావు. 217 00:11:50,253 --> 00:11:52,047 హలో. ఎవరది? 218 00:11:52,130 --> 00:11:53,548 -ఇక ఆపుతావా? -నిజంగా? 219 00:11:53,632 --> 00:11:57,969 లేదు. క్షమించాలి. అనుకోకుండా అనేసా. లేదా ఆలోచించకుండా అని ఉంటా. 220 00:12:00,722 --> 00:12:03,266 నేను ఇంకా నీ వంటగదిని వాడుకోవచ్చా? 221 00:12:03,350 --> 00:12:06,645 హెల్త్ ఫుడ్ నెట్వర్క్ కోసం నేను ఒక చిన్న ఐడి వీడియో షూట్ చేయాలి. 222 00:12:06,728 --> 00:12:07,729 సరే, వాడుకో. 223 00:12:07,812 --> 00:12:09,564 -థాంక్స్. -నీకు అవకాశం ఇచ్చారా? 224 00:12:09,648 --> 00:12:11,024 చాలా ఆశ్చర్యపోయినట్టు ఉన్నావు. 225 00:12:11,107 --> 00:12:13,193 పర్లేదు. కొన్ని అవకాశాలు ఉన్నాయి. 226 00:12:13,276 --> 00:12:16,863 క్షమించండి. నేను అలా అనాలని అనుకోలేదు. కానీ, నిజంగా అంటున్నావా? 227 00:12:16,947 --> 00:12:18,281 పామ్. నువ్వు… 228 00:12:18,365 --> 00:12:19,366 అవును, నిజమే. 229 00:12:20,200 --> 00:12:21,576 వా… సూపర్. 230 00:12:21,660 --> 00:12:22,786 చాలా బాగుంది. 231 00:12:22,869 --> 00:12:24,287 చాలా థాంక్స్. 232 00:12:24,371 --> 00:12:26,414 ఇకపోతే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. 233 00:12:27,332 --> 00:12:28,917 -ఇది ఎవరు? -కాస్త ఆపుతావా? 234 00:12:29,000 --> 00:12:30,585 -లేదు. -ఇది ప్రైవేట్ వ్యవహారం. 235 00:12:30,669 --> 00:12:32,087 ఈమె ఒక పోటీలో గెలిచిన యువరాణి. 236 00:12:32,921 --> 00:12:34,297 ఆసక్తిగా ఉంది. 237 00:12:34,381 --> 00:12:36,383 మ్యాథమాటిక్స్ 238 00:13:03,243 --> 00:13:04,244 నీ పని దాదాపుగా పూర్తయింది. 239 00:13:04,869 --> 00:13:08,415 ఏమైనా సందేహాలు ఉంటే అడగడం మర్చిపోకు. మాక్ టెస్టులో ఉండే మంచి విషయం అదే. 240 00:13:08,498 --> 00:13:10,250 లేదు, పర్లేదు. 241 00:13:12,168 --> 00:13:14,379 ఈ గోడకి రంగు వేసింది నువ్వేనా? 242 00:13:14,462 --> 00:13:15,630 అవును. 243 00:13:15,714 --> 00:13:16,923 చాలా బాగుంది. 244 00:13:17,007 --> 00:13:20,468 అవును, థాంక్స్. కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. 245 00:13:29,144 --> 00:13:31,062 నువ్వు ఎప్పుడైనా మిస్టర్ హిగ్గల్మ్యాన్ తో మాట్లాడతావా? 246 00:13:31,146 --> 00:13:33,481 -చాలా గొప్ప వ్యక్తి. -అద్భుతమైన మనిషి. 247 00:13:34,649 --> 00:13:35,692 -మనం ఒకసారి… -నాన్నా? 248 00:13:36,401 --> 00:13:37,694 ఏంటి? 249 00:13:40,030 --> 00:13:42,574 నన్ను అమ్మ దగ్గర నువ్వు దించుతావా లేక… 250 00:13:42,657 --> 00:13:44,701 మీ అమ్మ నిన్ను 8:30కి వచ్చి తీసుకెళ్తుంది. 251 00:13:44,784 --> 00:13:46,119 ఇంకొక 10 నిమిషాల్లో మన పని అయిపోతుంది. 252 00:13:46,202 --> 00:13:49,456 నువ్వు బాగా అలసిపోయావని తెలుస్తుంది, యాంబర్. కానీ నువ్వు బాగా నేర్చుకుంటున్నావు. 253 00:13:50,332 --> 00:13:52,500 రేపటి టెస్టులో ఎలా రాస్తానో చూద్దాం. 254 00:13:54,753 --> 00:13:57,839 సరే, నిన్ను మొన్న రాత్రి కలవడం నా ఫ్రెండ్స్ కి చాలా నచ్చింది. 255 00:13:57,923 --> 00:14:01,509 అవును. పిలిచినందుకు థాంక్స్. పని నుండి కాస్త కాలక్షేపానికి అలా వెళ్లడం బాగుంది. 256 00:14:01,593 --> 00:14:06,306 నీ "ఒంటరి తండ్రి మెనూ" పిజ్జా పాస్తా కథలు వాళ్లకు చాలా నచ్చాయి. 257 00:14:07,057 --> 00:14:09,226 నీకు ఎప్పుడైనా వంటల క్లాసుకు వెళ్లాలని ఉంటే… 258 00:14:09,309 --> 00:14:13,480 అవును, థాంక్స్. నేను, యాంబర్ కూడా వెళదామని అనుకుంటున్నాం, కాబట్టి… 259 00:14:13,563 --> 00:14:15,774 నేను కూడా రావచ్చు అన్నమాట. 260 00:14:29,996 --> 00:14:31,206 హాయ్. 261 00:14:41,174 --> 00:14:42,175 అటు చూడకు. 262 00:14:52,227 --> 00:14:55,355 నాన్న ఆమెతో బయటకు వెళ్తున్నారు. అంటే, డేట్ కి. 263 00:14:57,440 --> 00:14:58,692 ఏమో. 264 00:15:00,026 --> 00:15:02,696 అలా వెళ్లి, ఇద్దరూ జంట అయితే, 265 00:15:03,446 --> 00:15:05,865 ఆయన నిన్ను ప్రేమించినంత ఆమెను కూడా ప్రేమిస్తారా? 266 00:15:09,703 --> 00:15:10,870 ప్రేమించినంతా? 267 00:15:11,496 --> 00:15:12,497 అవును. 268 00:15:17,419 --> 00:15:20,005 మీ నాన్నా, నేను ఇంకా ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూనే ఉన్నామని నా ఉద్దేశం. 269 00:15:21,840 --> 00:15:22,841 అవునా? 270 00:15:23,842 --> 00:15:27,012 అవును, నిజమే. అంటే, నా నమ్మకం అదే. 271 00:15:27,095 --> 00:15:31,224 మా మధ్య ఇంకా ప్రేమ అలాగే ఉంది. దాని రూపం మారింది అంతే. 272 00:15:41,318 --> 00:15:45,447 ఆయన ఆవిడని ప్రేమించడం మొదలుపెడితే, నా మీద ప్రేమ తగ్గుతుందా? 273 00:15:46,531 --> 00:15:48,742 లేదు, బంగారం. లేదు. 274 00:15:49,284 --> 00:15:50,994 నా మాట విను. 275 00:15:51,077 --> 00:15:56,917 మీ నాన్న నిన్ను ప్రేమించేంతగా, నీకంటే ఎక్కువగా కానీ, ఎవరినీ, ఎప్పటికీ ప్రేమించలేరు. 276 00:15:57,000 --> 00:16:00,003 అది జరగని పని. సరేనా? 277 00:16:01,922 --> 00:16:04,799 అమ్మా, నాకు బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. 278 00:16:08,178 --> 00:16:09,179 అవును. 279 00:16:13,183 --> 00:16:15,644 మన కుటుంబం కొంచెం వేరు, అందుకే బాధగా ఉంటుంది 280 00:16:15,727 --> 00:16:20,440 అలాగే… అందుకు నన్ను క్షమించు. 281 00:16:23,318 --> 00:16:24,861 నాకు కూడా బాధగా ఉంది. 282 00:16:26,780 --> 00:16:28,573 మీ నాన్నకు కూడా బాధగా ఉంది. 283 00:16:31,159 --> 00:16:32,160 నాకు తెలుసు. 284 00:16:40,335 --> 00:16:43,171 దీనికి… దీనికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. 285 00:16:47,133 --> 00:16:51,930 బంగారం, కొన్నిసార్లు, జీవితంలో మనం బాధపడాల్సి ఉంటుంది. 286 00:16:55,100 --> 00:16:56,643 కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 287 00:16:56,726 --> 00:17:00,981 సంతోషంగా ఉండే క్షణాలు ఎలా నిరంతరం ఉండిపోవో, 288 00:17:01,064 --> 00:17:02,983 బాధ కలిగించే సమయాలు కూడా ఉండవు. 289 00:17:06,902 --> 00:17:08,405 బాధ అలలు తాకినట్టు వస్తుంది. 290 00:17:09,238 --> 00:17:13,410 అవును. నిజమే, బంగారం. అలాగే ఉంటుంది. 291 00:17:20,125 --> 00:17:21,751 ఒక విషయం చెప్పాలి. 292 00:17:22,419 --> 00:17:23,587 సరే. 293 00:17:23,670 --> 00:17:28,049 హాయ్. ఆగండి, మీరిద్దరూ బాగానే ఉన్నారా? 294 00:17:28,132 --> 00:17:29,718 మ్యాథ్స్ టెస్ట్ ఎలా రాసావు? 295 00:17:29,801 --> 00:17:31,011 అది రేపు. 296 00:17:31,094 --> 00:17:32,512 సరే. అది చాలా ముఖ్యం. 297 00:17:32,596 --> 00:17:35,682 నువ్వు అదరగొడతావని నాకు తెలుసు, ఆ తర్వాత మనం వేడుక చేసుకుందాం. 298 00:17:35,765 --> 00:17:37,225 మనం రెండు విషయాలను వేడుక చేసుకోవాలి. 299 00:17:37,309 --> 00:17:40,437 ఒకటి, నీకు మ్యాథ్స్ లో మంచి మార్కులు రావడం, ఇంకా… 300 00:17:44,608 --> 00:17:45,609 ఇది. 301 00:17:46,484 --> 00:17:49,446 తర్వాతి హెల్త్ ఫుడ్ నెట్వర్క్ స్టార్ కి మనం టాప్ 20లో ఉన్నాం. 302 00:17:49,529 --> 00:17:50,614 ఏంటి? 303 00:17:50,697 --> 00:17:51,781 -అవును. -మ్యాక్స్! 304 00:17:53,366 --> 00:17:55,660 మనకు మంచి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. 305 00:17:55,744 --> 00:17:59,372 "మనం" అనడం చాలా సంతోషం. కానీ ఇది అంతా నీ కష్టం, మ్యాక్స్. నీది మాత్రమే. 306 00:17:59,456 --> 00:18:02,208 కాదు, ఇది మనది. మన కోసం చేస్తున్నా. 307 00:18:02,292 --> 00:18:03,501 ఇది చాలా మంచి విషయం. 308 00:18:04,044 --> 00:18:05,629 మన ఇంట్లో సినిమా తీసినట్టు ఉంటుంది. 309 00:18:06,338 --> 00:18:07,422 నేను బ్రాండీకి చెప్పే వరకు ఆగండి. 310 00:18:07,505 --> 00:18:09,174 తనతో మీరిద్దరూ కూడా కనిపించవచ్చు అని చెప్పు. 311 00:18:09,257 --> 00:18:12,844 ఏంటి? నీకు తెలీదు. ఇది బ్రాండీకి చిరకాల కల. 312 00:18:14,054 --> 00:18:15,680 నాకు కూడా ఉండాలని ఉంది. 313 00:18:16,473 --> 00:18:18,683 సూపర్. అలాగే. 314 00:18:20,977 --> 00:18:23,730 ప్రియమైన డైరీ, నేటి "నమ్మలేని విషయాల" విషయానికి వస్తే, 315 00:18:23,813 --> 00:18:27,692 యాంబర్ బ్రౌన్ అనబడే నేను, సీరియస్ గా మ్యాథ్స్ చదువుతున్నా. 316 00:18:27,776 --> 00:18:29,611 అలాగే, అంతకు మించి, 317 00:18:29,694 --> 00:18:34,032 యాంబర్ బ్రౌన్ అనబడే నేను, బిగ్గరగా, 318 00:18:34,115 --> 00:18:36,576 మ్యాక్స్ చేసే ఆడిషన్ వీడియోలో ఉంటాను అని అడిగాను. 319 00:18:36,660 --> 00:18:37,994 ఏంటి? 320 00:18:38,078 --> 00:18:42,123 అయితే, మూడవ నంబర్ కోపిష్టి చెట్టుకి, ఏం చేస్తే బాగుంటుంది అంటే 321 00:18:42,999 --> 00:18:45,669 "వేర్వేరు వర్గాల ప్రజల నుండి తీసుకున్న సాక్షాలు" ఏమంటావు? 322 00:18:45,752 --> 00:18:47,754 సరే. నేను వెళ్లి బ్రాండీకి చెప్పనా? 323 00:18:47,837 --> 00:18:49,381 -వెళ్ళు! -సూపర్! 324 00:18:50,757 --> 00:18:52,133 బ్రాండీ! 325 00:18:55,929 --> 00:19:01,434 యాంబర్ ఇప్పుడు ఉన్నట్టు నవ్వుతూ, గెంతుతూ, ఉత్సాహంగా ఉంటే… 326 00:19:02,185 --> 00:19:05,188 -చూడటానికి అందంగా ఉంటుంది, కదా? -అవును. 327 00:19:05,272 --> 00:19:08,149 ముఖ్యంగా కొంచెం సేపు క్రితం నా కారులో దాన్ని చూసి ఉంటే తెలిసేది. నాకు… 328 00:19:09,317 --> 00:19:10,527 నా మనసు. 329 00:19:12,112 --> 00:19:14,948 మ్యాక్స్. మ్యాక్స్, చాలా థాంక్స్. 330 00:19:15,615 --> 00:19:16,616 చాలా థాంక్స్. 331 00:19:19,077 --> 00:19:20,287 అదేం పర్లేదు. 332 00:19:21,204 --> 00:19:25,834 అయితే… ఇప్పుడు నేను నీకు ముద్దు వస్తున్నాను కాబట్టి… 333 00:19:27,335 --> 00:19:30,297 నేను ఒరిజినల్ వీడియోని నీ వంటగదిలో తీసి పంపించాను. 334 00:19:30,380 --> 00:19:33,633 -ఆహా. -వచ్చే వారం కూడా అది అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చా? 335 00:19:34,301 --> 00:19:35,552 -వచ్చే వారమా? -అవును. 336 00:19:36,136 --> 00:19:39,264 ఈ లోపు దానికి కొంచెం మరమత్తులు చేసి ముస్తాబు చేయించవచ్చా? 337 00:19:40,140 --> 00:19:41,224 -లేదు. -వద్దా? 338 00:19:41,308 --> 00:19:45,061 కానీ నేను కొన్ని నిమ్మకాయలు, పళ్ళు, పూలు తెచ్చి అలంకరిస్తా, అప్పుడు కాస్త… 339 00:19:45,145 --> 00:19:47,230 ఓహ్, సరే. అది చాలు. 340 00:19:47,314 --> 00:19:48,315 స… 341 00:19:49,232 --> 00:19:50,233 నేను… 342 00:19:52,152 --> 00:19:53,695 హేయ్. 343 00:19:54,279 --> 00:19:56,364 హాలీవుడ్ వాళ్ళు పార్క్ రిడ్జ్, ఇల్లినాయిస్ కి… 344 00:19:56,448 --> 00:19:59,075 -అవును. -…నీ మొదటి ప్రెజెంటేషన్ కోసం వస్తున్నారు. 345 00:19:59,159 --> 00:20:01,036 నాకు చాలా భయంగా ఉంది. 346 00:20:01,119 --> 00:20:03,747 -ఎలా ప్రారంభించాలో కూడా తెలీడం లేదు. -అంతా… బాగానే ఉంటుంది. 347 00:20:58,802 --> 00:21:00,804 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్