1 00:00:06,550 --> 00:00:09,177 సరే, నెమ్మదించండి. ఇంకొన్ని నిముషాలు మాత్రమే. 2 00:00:09,261 --> 00:00:11,471 మీరంతా ఒక వారం లేదా వీలైతే అంతకంటే ఎక్కువ రోజులు 3 00:00:11,555 --> 00:00:13,974 పని చేయడానికి మీ వాలంటీర్ సర్వీసును ఎంచుకోండి. 4 00:00:14,849 --> 00:00:17,060 మీరు అన్నిటికంటే ముఖ్యంగా మీ వాలంటీర్ సర్వీసు 5 00:00:17,143 --> 00:00:19,813 వ్యక్తిగతంగా మీపై చూపబోయే సానుకూల ప్రభావాన్ని గుర్తించాలి. 6 00:00:20,355 --> 00:00:21,565 సరే, ఇక బయలుదేరి 7 00:00:21,648 --> 00:00:23,733 మీ రోజును ఉత్పాదకంగా గడపండి. 8 00:00:51,553 --> 00:00:52,596 సమయం 7:30 అయినట్టు ఉంది. 9 00:00:55,223 --> 00:00:57,142 సరిగ్గా సమయానికి వచ్చారు. 10 00:01:29,382 --> 00:01:30,926 అవును. 11 00:01:38,892 --> 00:01:40,310 ప్రియమైన డైరీ, 12 00:01:40,393 --> 00:01:44,272 నేను ఉదయమే చూసే ఇద్దరూ నిజంగానే భార్య భర్తలు అయి ఉంటే, 13 00:01:45,065 --> 00:01:47,067 వారు విడాకులు తీసుకోనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 14 00:01:48,485 --> 00:01:49,986 వాళ్లకు మా ఇల్లు 15 00:01:50,695 --> 00:01:51,988 లేదా చెట్టు నచ్చి ఉంటుంది. 16 00:01:52,697 --> 00:01:54,950 వాళ్ళు దేనిని చూస్తున్నారో నాకు తెలీదు, 17 00:01:55,033 --> 00:01:58,203 కానీ గత నెల రోజులుగా ప్రతీ రోజూ 18 00:01:58,286 --> 00:01:59,829 ఉదయం 7:30కి వస్తున్నారు. 19 00:02:01,289 --> 00:02:02,582 ఆయన మాట్లాడతాడు. 20 00:02:02,666 --> 00:02:04,668 ఆమె ఒక చిరునవ్వు నవ్వుతుంది. 21 00:02:05,293 --> 00:02:07,796 అలాగే ఆయన ఆవిడకి చలి పుట్టకుండా చూసుకుంటాడు. 22 00:02:09,381 --> 00:02:11,174 చూస్తుంటే ఆదర్శ దంపతుల్లా ఉన్నారు. 23 00:02:26,940 --> 00:02:28,858 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 24 00:02:33,780 --> 00:02:35,782 నిర్ణయం వెలువడటానికి ఇంకొక్క వారం మాత్రమే ఉంది. 25 00:02:36,199 --> 00:02:37,450 అవును, నిజమే. 26 00:02:37,534 --> 00:02:40,954 వాళ్లు నీకు ఎలా చెప్తారని ఏమైనా చెప్పారా? అంటే, ఫోనా, ఈమెయిలు లేక మెసేజ్ అని? 27 00:02:41,037 --> 00:02:43,498 వాళ్ళు ఈమెయిలు ద్వారా వెల్లడించం అని ఈమెయిల్ చేసి చెప్పారు. 28 00:02:44,541 --> 00:02:46,209 కానీ తెలిసింది ఏంటంటే వాళ్ళ 29 00:02:46,293 --> 00:02:49,796 హెల్త్ ఫుడ్ నెట్వర్క్ సోషల్ ప్లాట్ ఫార్మ్ లలో పోస్ట్ చేస్తారంట. 30 00:02:49,880 --> 00:02:51,673 భలే ఆసక్తిగా ఉంది. 31 00:02:51,756 --> 00:02:53,258 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. 32 00:02:53,341 --> 00:02:54,759 మనల్ని చూస్తుంటే. 33 00:02:54,843 --> 00:02:56,511 నువ్వు లేకపోతే నేను ఇది చేయగలిగి ఉండేవాడిని కాదు. 34 00:02:57,137 --> 00:03:00,015 చూడు. ఈ అవకాశంలో మనం గెలిచినా లేకపోయినా, 35 00:03:01,099 --> 00:03:04,144 మనం అందరం కలిసి ఎదుర్కొన్న ఈ... 36 00:03:04,227 --> 00:03:05,395 అంటే, తెలుసు కదా... 37 00:03:06,271 --> 00:03:07,814 -అనుభవం చాలా గొప్పది! -అవును. 38 00:03:07,898 --> 00:03:09,649 కానీ నాకు నువ్వు గెలుస్తావు అనిపిస్తుంది. 39 00:03:10,150 --> 00:03:12,152 అది మన ముఖ్య లక్ష్యం కాదని నేను అనను కానీ... 40 00:03:12,235 --> 00:03:14,571 -అంటే, నిజమే, సరిగ్గానే అన్నావులే. -అదే కదా. 41 00:03:15,238 --> 00:03:18,241 చూడు, మనం గెలిస్తే, చాలా చేయగలం. 42 00:03:18,325 --> 00:03:20,368 ఇంకా పెద్ద ఇంటిలోకి మారొచ్చు. 43 00:03:21,536 --> 00:03:24,080 నాకు ఈ ఇల్లు ఇష్టమని నీకు తెలుసు. నాకు మారాలని లేదు. 44 00:03:24,164 --> 00:03:25,373 ఇల్లు మారుతున్నామా? 45 00:03:25,457 --> 00:03:26,499 మనం మారకూడదు. 46 00:03:26,583 --> 00:03:27,959 లేదు, ఎక్కడికీ మారడం లేదు. 47 00:03:28,501 --> 00:03:29,586 సారా? 48 00:03:29,669 --> 00:03:31,963 ఒకవేళ నేను గెలిచి వాళ్ళు నన్ను షూటింగ్ కోసం 49 00:03:32,047 --> 00:03:34,841 -లాస్ ఏంజెలెస్ స్టూడియోకి రమ్మంటే? -కంగారు పడకు. నిన్ను వచ్చి కలుస్తాం. 50 00:03:36,092 --> 00:03:37,302 యాంబర్. 51 00:03:37,385 --> 00:03:39,638 నువ్వు... నిజానికి నాకూ నవ్వు వచ్చింది. 52 00:03:39,721 --> 00:03:41,932 -థాంక్స్. -సరే, గొప్ప జోక్. 53 00:03:42,015 --> 00:03:43,683 కానీ కనీసం కొన్ని ఇళ్లను చూద్దామా? 54 00:03:43,767 --> 00:03:45,894 మ్యాక్స్, ఈ విషయం మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు. 55 00:03:45,977 --> 00:03:49,272 సరే. అలాగే. నిజానికి నేను నాతో గట్టిగా మాట్లాడుకుంటున్నాను. 56 00:03:49,356 --> 00:03:51,524 మీరిద్దరికీ ఇంత బాగా ఎందుకు పొసుగుతుందో నాకు అర్థమైంది. 57 00:03:51,608 --> 00:03:54,069 నువ్వు, ఇవాళ, తెగ పంచులు వేస్తున్నావు. మంచిది. 58 00:03:58,448 --> 00:03:59,532 ఏమైనా తెలిసిందా? 59 00:03:59,616 --> 00:04:00,742 ఇంకా లేదు. 60 00:04:00,825 --> 00:04:02,827 నా గురించి వాళ్ళు ఏమీ చెప్పలేదా? 61 00:04:03,286 --> 00:04:04,287 అవును. 62 00:04:04,371 --> 00:04:05,580 లేదు. 63 00:04:05,664 --> 00:04:07,916 అయితే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పరిమితం అవ్వడం మంచిదేమో. 64 00:04:08,625 --> 00:04:11,211 హెల్త్ ఫుడ్ నెట్వర్క్ వారు తమ ప్రస్తుత షోలలో నన్ను 65 00:04:11,294 --> 00:04:13,421 క్రమంగా నటించమంటే తప్ప. 66 00:04:13,505 --> 00:04:15,423 అలా కూడా జరగొచ్చా? 67 00:04:15,507 --> 00:04:16,925 -లేదు. -అవును. 68 00:04:17,007 --> 00:04:18,300 -పామ్. -మ్యాక్స్. 69 00:04:19,344 --> 00:04:21,680 -నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. -ఏంటి? 70 00:04:21,763 --> 00:04:22,889 నేను, సారా ఇంకా యాంబర్ 71 00:04:22,973 --> 00:04:25,767 కలిసి కొత్త ఇంటి కోసం వెతికితే నువ్వు ఏమనుకుంటావు? 72 00:04:25,850 --> 00:04:27,686 మాకు ఏదైనా ఏరియాలో కొన్ని ఇళ్లను చూపగలవా? 73 00:04:27,769 --> 00:04:29,479 -నేను రాను. -నేను కూడా. 74 00:04:29,563 --> 00:04:31,439 ఊరుకోండి. అలా వెళ్లి కొన్నిటిని చూద్దాం అంతేగా? 75 00:04:31,523 --> 00:04:33,775 ఇల్లు మారడానికి ఇది మంచి సమయం అనుకుంటున్నాను, సారా. 76 00:04:33,858 --> 00:04:35,860 నేను కూడా ఒప్పుకుంటా, ఈ సారికి. 77 00:04:35,944 --> 00:04:38,863 -నిజంగా? "నిజంగా" అంతుందా? -కాదు, "నిజంగా" ఏమీ కాదు. 78 00:04:38,947 --> 00:04:41,658 "అలోచించి చూడండి" అంటున్నారు అంతే. 79 00:04:41,741 --> 00:04:42,742 యాంబర్, 80 00:04:42,826 --> 00:04:46,079 నీకోసం నువ్వు బాగా ఇష్టపడే పెద్ద ఇంటిలో, 81 00:04:46,162 --> 00:04:47,747 ఒక బెడ్ రూమ్, 82 00:04:47,831 --> 00:04:49,291 అలాగే నీ సొంత బాత్ రూమ్ 83 00:04:49,666 --> 00:04:51,960 ఇంకా పెద్ద షవర్ ఉంటే ఏమంటావు? 84 00:04:52,043 --> 00:04:55,130 నాకు నా టబ్ ఈ ఇంట్లో ఉంది కాబట్టే ఇష్టం. 85 00:04:55,213 --> 00:04:56,631 అది నిజమే. 86 00:05:01,636 --> 00:05:03,013 గుడ్ మార్నింగ్. 87 00:05:03,096 --> 00:05:04,347 హాయ్. 88 00:05:04,431 --> 00:05:05,557 గుడ్లా? 89 00:05:05,640 --> 00:05:06,766 అవును. 90 00:05:07,350 --> 00:05:09,144 బ్రాండీ, మ్యాక్స్ ఇంకా అమ్మకి ఇల్లు మారాలని ఉంది. 91 00:05:09,227 --> 00:05:10,729 -ఏంటి? -లేదు, అదేం కాదు. 92 00:05:10,812 --> 00:05:13,356 మేము మాములుగా మాట్లాడుకుంటున్నాం. 93 00:05:13,440 --> 00:05:16,484 మీరు ఇల్లు మారితే, పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళు వెతకాలి. 94 00:05:16,568 --> 00:05:17,777 నేను మీ పక్క ఇంట్లోనే ఉండాలి. 95 00:05:17,861 --> 00:05:19,779 అలాగే మా ఇంటి వెనుక ఉన్న చెట్టును కూడా తెచ్చుకుంటా. 96 00:05:19,863 --> 00:05:21,907 నేను కూడా పక్క ఇంట్లో ఉండాల్సి వస్తుందేమో. 97 00:05:21,990 --> 00:05:24,200 యాంబర్, వాలంటీర్ కార్యక్రమానికి నువ్వు ఏమైనా ఐడియా ఆలోచించావా? 98 00:05:24,284 --> 00:05:27,287 మా అమ్మ నన్ను ది సాల్వేషన్ ఆర్మీ స్టార్ లో వాలంటీర్ పనికి పెట్టింది. 99 00:05:27,370 --> 00:05:28,955 ఎందుకు చేస్తున్నారు? అదనపు మార్కుల కోసమా? 100 00:05:29,039 --> 00:05:31,374 అవును. అలాగే మా గురించి మాకు బాగా అనిపించడం కోసం. 101 00:05:31,458 --> 00:05:33,251 సరే, నువ్వు నాకు వాలంటీర్ చేయొచ్చు కదా. 102 00:05:33,335 --> 00:05:34,586 నా ఆఫీసుకు రా. 103 00:05:34,669 --> 00:05:37,422 నేను నీకు జీతం ఇస్తా. మనం లంచ్ తిని షాపింగ్ చేయొచ్చు. 104 00:05:37,505 --> 00:05:39,216 ఇక్కడ విషయం అది కాదు. 105 00:05:39,299 --> 00:05:41,301 అలా చేస్తే నా గురించి నాకు చాలా బాగా అనిపిస్తుంది. 106 00:05:41,384 --> 00:05:42,677 నాకు కూడా. 107 00:05:42,761 --> 00:05:44,387 మాకు జిమ్ లో వాలంటీర్లు కావాలి. 108 00:05:44,471 --> 00:05:47,265 కొత్త క్లయింట్ లకు వాళ్ళ నీటి సీసాలు, పవర్ బార్స్ ఇవ్వాలి. 109 00:05:47,349 --> 00:05:49,976 శుభ్రం చేయడం. అలాగే ఎలిప్టికల్స్, బై సైకిల్స్ ఇంకా 110 00:05:50,060 --> 00:05:53,063 స్టెయిర్ మాస్టర్స్ ఇంకా మిగతా వాటిని శుభ్రం చేయాలి, సరేనా? 111 00:05:53,146 --> 00:05:56,441 ఈ మధ్యలో మీరు టవల్స్ శుభ్రం చేసి వాటిని మడతపెడుతూ ఉండాలి. 112 00:05:56,942 --> 00:05:58,443 అందుకు అవసరమైన అర్హత నాకు లేదు. 113 00:05:59,736 --> 00:06:02,155 నా వైపు చూడొద్దు. నాకు కుక్కలను నడిపించాలని ఉంది. 114 00:06:02,239 --> 00:06:04,658 నేను ఇప్పటికే డాగీ ప్యాలస్ రెస్క్యూ వారికి ఫోన్ చేశా. 115 00:06:04,741 --> 00:06:05,992 వాళ్ళు వాలంటీర్ల సహాయం తీసుకుంటారు. 116 00:06:06,493 --> 00:06:08,286 కానీ నేను ఇంటికి కుక్కలు తీసుకురావాల్సి... 117 00:06:08,370 --> 00:06:10,664 -అంటే, తీసుకురావాల్సి వస్తుందేమో. -అవును. 118 00:06:10,747 --> 00:06:12,290 అది కష్టం కావచ్చు. 119 00:06:17,003 --> 00:06:18,588 మంచి కుక్కలు. 120 00:06:18,672 --> 00:06:19,965 ఉడత. 121 00:06:25,303 --> 00:06:28,598 హేయ్, యాంబర్. నువ్వు సెయింట్ థామస్ అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీకి వెళ్లొచ్చు కదా? 122 00:06:28,682 --> 00:06:29,891 అక్కడ వాలంటీర్ చేయొచ్చు. 123 00:06:29,975 --> 00:06:32,185 -ఏమో, అమ్మా. -అవును. అది మనకు దగ్గరలోనే ఉంది. 124 00:06:32,811 --> 00:06:36,773 నాకు ఈ ఐడియా నచ్చింది. నువ్వు వాళ్లకు బాగా నచ్చుతావు. 125 00:06:36,856 --> 00:06:38,233 నాకు తెలీదు. 126 00:06:38,316 --> 00:06:41,361 నిజమే. నువ్వు చాలా బాగా చేయగలవు, అది ఏమైనా సరే. 127 00:06:41,444 --> 00:06:44,155 థాంక్స్, బ్రాండీ. అలాగే నువ్వు కూడా సాల్వేషన్ ఆర్మీ స్టోర్ లో 128 00:06:44,239 --> 00:06:46,992 -"ఏం చేసినా" బాగా చేస్తావు. -చాలా థాంక్స్. 129 00:06:47,492 --> 00:06:49,411 -మిస్టర్ డేటన్? -ఏంటి, బ్రాండీ? 130 00:06:49,494 --> 00:06:51,580 మనకు ఎప్పటికి తెలుస్తుంది... 131 00:06:51,663 --> 00:06:52,914 అంటే, మన షో గురించి? 132 00:06:54,249 --> 00:06:56,418 వచ్చే వారం, కానీ ఒకసారి అడిగి చూస్తా. 133 00:06:57,335 --> 00:07:00,338 వాళ్ళు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో ఫలితాలు పోస్ట్ చేస్తున్నారు. 134 00:07:00,422 --> 00:07:01,756 ఇది ఒక జీబ్రా ఫోటో. 135 00:07:01,840 --> 00:07:03,717 -ఇది నా ఫోన్ లో ఎందుకు ఉందో నాకు తెలీదు. -లేదు. నిజమే. ఆ... 136 00:07:03,800 --> 00:07:05,302 -అదిగో. -ఇదా? అవును. ఇదిగో. 137 00:07:05,385 --> 00:07:06,595 లేదు, ఇంకా ఫలితాలు రాలేదు. 138 00:07:07,512 --> 00:07:08,513 అవును. 139 00:07:11,057 --> 00:07:13,101 -ఏంటి? -ఫిల్. తను... 140 00:07:13,184 --> 00:07:16,563 ఈ వారం యాంబర్ ని ఇంటికి తీసుకెళ్లలేను అన్నాడు. వొంట్లో బాలేదు అంట. 141 00:07:16,646 --> 00:07:19,232 అవును, నేను కూడా గమనించాను. రికార్డింగ్ సమయంలో కూడా నీరసంగా కనిపించాడు. 142 00:07:19,316 --> 00:07:21,610 కాస్త, బలహీనంగా, అలసినట్టు ఉన్నాడు. 143 00:07:22,110 --> 00:07:23,486 మ్యాక్స్ ని చూసినట్టు అనిపించింది. 144 00:07:23,570 --> 00:07:25,113 చాలా సరదాగా చెప్పావు. 145 00:07:25,196 --> 00:07:27,741 -ఏంటిది? "మ్యాక్స్ ని ఏడిపించే రోజా?" -నాకు నచ్చింది. నాకు బాగా... 146 00:07:27,824 --> 00:07:30,076 -రోజూ ఇంతే కదా. -రోజూ ఇలాగే చేస్తున్నారు! థాంక్స్. 147 00:07:32,662 --> 00:07:34,080 సెయింట్ థామస్ అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీ 148 00:07:34,164 --> 00:07:37,208 ప్రియమైన డైరీ, నేను ఇవాళ అధికారికంగా వాలంటీర్ ని అయ్యాను. 149 00:07:37,292 --> 00:07:40,045 నిజం చెప్పాలంటే, ఈ ఉద్యోగం నాకు ఇస్తారని అనుకోలేదు. 150 00:07:40,128 --> 00:07:41,796 నిజానికి, కాస్త భయపడ్డాను. 151 00:07:42,422 --> 00:07:44,382 ఒకటి చెప్పాలి, నా చిన్నప్పుడు... 152 00:07:44,466 --> 00:07:46,259 అంటే, ఇంతకంటే చిన్నప్పుడు, 153 00:07:46,343 --> 00:07:48,428 ముసలి వారి దగ్గరకు వెళ్ళడానికి భయపడేదాన్ని. 154 00:07:48,929 --> 00:07:50,805 అది వినడానికి ఏమీ బాలేదు. 155 00:07:50,889 --> 00:07:53,058 కానీ అప్పట్లో అలా అనిపించేది అంతే. 156 00:07:53,600 --> 00:07:55,644 ప్రస్తుతానికికైతే, నాకు ఇప్పుడు బానే ఉంది. 157 00:07:55,727 --> 00:07:58,188 నేను పరుపులు సర్దుతూ, తాజా ఐస్ నీళ్లు అందిస్తున్నాను. 158 00:07:58,271 --> 00:08:00,941 వాళ్ళ గదులకు ఉత్తరాలు, ప్యాకేజీలు, ఇంకా పువ్వులను తీసుకెళ్తున్నాను, 159 00:08:01,566 --> 00:08:04,986 వారికి పువ్వులు అందుకోవడం చాలా ఇష్టం కాబట్టి అది చూడడం నాకు బాగా నచ్చింది. 160 00:08:05,987 --> 00:08:07,364 థాంక్స్. 161 00:08:08,156 --> 00:08:09,491 చాలా థాంక్స్. 162 00:08:10,075 --> 00:08:12,911 ఇక్కడ చాలా మంది ఆసక్తికరమైన వారు ఉన్నారు. శ్రీమతి హమ్మర్ టౌన్ లాగ. 163 00:08:12,994 --> 00:08:15,664 ఆమెకు ఫ్లోరిడాలో ఉన్న తన చెల్లి ప్లాస్టిక్ పువ్వులు పంపుతుంటుంది 164 00:08:15,747 --> 00:08:17,999 ఆమేమో వాటికీ నీళ్లు పోయమని నాకు చెప్తుంటుంది. 165 00:08:18,083 --> 00:08:19,626 మీకు రోజంతా కనిపించేలా 166 00:08:19,709 --> 00:08:21,086 నేను వీటిని ఇక్కడ కిటికీ దగ్గర పెడతాను. 167 00:08:21,169 --> 00:08:24,130 అలాగే వచ్చే కొన్ని రోజులు దానికి తప్పకుండా నీళ్లు పెడతాను. 168 00:08:24,214 --> 00:08:27,926 చాలా థాంక్స్. దయచేసి వాటికి బాగా నీళ్లు పెట్టి 169 00:08:28,009 --> 00:08:31,555 కిటికీ దగ్గర ఎండ తగిలేలా పెట్టు, ప్లీజ్. 170 00:08:35,933 --> 00:08:39,770 కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్లకు ఎలాంటి డెలివెరిలు రావు. 171 00:08:39,854 --> 00:08:41,815 సెయింట్ థామస్ అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీ 172 00:08:44,859 --> 00:08:48,989 ఇలా పువ్వులు, పుస్తకాలు, చాక్లెట్లు పొందడం బాగుంటుందని నాకు తెలిసింది, 173 00:08:49,489 --> 00:08:52,075 కానీ ఈ ముసలి వారికి అన్నిటికంటే ఎక్కువగా కావాల్సింది 174 00:08:52,534 --> 00:08:54,244 వారి మాటలు వినే వారు. 175 00:08:54,744 --> 00:08:57,831 ఒకసారి వారి కథలు వింటే, అవి చాలా ఆసక్తిగా ఉంటాయి. 176 00:08:57,914 --> 00:09:00,208 ప్రాణాలతో ఉండి మాట్లాడే చరిత్ర పుస్తకం లాంటివారు. 177 00:09:01,042 --> 00:09:02,419 నేను చాలా నేర్చుకుంటున్నాను. 178 00:09:03,003 --> 00:09:04,254 ఆయనకు నారింజ జూస్ ఇవ్వు. 179 00:09:04,337 --> 00:09:06,715 అలాగే ఈ నా మిత్రునికి మెత్తగా, నమలడానికి సులభంగా ఉండేది కావాలి. 180 00:09:06,798 --> 00:09:08,633 జెల్లీ. మీ దగ్గర జెల్లీ ఉందా? అద్భుతం. 181 00:09:08,717 --> 00:09:10,051 రికార్డుల గురించి నీకు ఏమైనా తెలుసా? 182 00:09:10,135 --> 00:09:12,929 మీ దగ్గర రెకార్డ్ ప్లేయర్ లాంటిది ఏమైనా ఉందా? సరే, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. 183 00:09:13,013 --> 00:09:15,849 ఇంత పెద్దగా, మొత్తం వినైల్ తో చేయబడినవే, సరేనా? 184 00:09:15,932 --> 00:09:17,601 అలాగే చాలా బాగున్నాయి. 185 00:09:17,684 --> 00:09:21,396 అందులో ఎనిమిది పాటలు ఉన్నాయి. అంటే, అందులో ఎనిమిది పాటలు ఎక్కించారు. 186 00:09:22,314 --> 00:09:23,398 క్యాసెట్ లు. 187 00:09:23,481 --> 00:09:25,609 సీడీలు కాదు. సీడీలు కాదు. 188 00:09:25,692 --> 00:09:27,027 సిడి అంటే ఏంటి? 189 00:09:28,320 --> 00:09:30,155 అది కొత్తగా వచ్చిన టెక్నాలజీ. 190 00:09:30,238 --> 00:09:32,657 సరే, కావచ్చు, కాని నేను వాటి గురించి ముందు ఎప్పుడూ వినలేదు. 191 00:09:33,283 --> 00:09:34,409 అంటే... 192 00:09:34,492 --> 00:09:36,286 త్వరలో వింటావులే. సరేనా? 193 00:09:36,870 --> 00:09:40,832 ఇలాంటి విషయాలలో నేను అప్డేటెడ్ గా ఉండటానికి చూస్తుంటా, తెలిసిందా? 194 00:09:40,916 --> 00:09:43,919 చెప్తున్నా కదా, భవిష్యత్ సీడీలదే. నీకు అవి నచ్చుతాయి. 195 00:09:44,002 --> 00:09:45,921 సరే. ఏం ఆడదాం? 196 00:09:46,004 --> 00:09:47,380 ఎవరికైనా పేకాట ఆడాలని ఉందా? 197 00:09:47,964 --> 00:09:50,008 మీ అమ్మకి ఆ ఇల్లు మారాలని ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. 198 00:09:50,091 --> 00:09:51,843 -తనకు ఆ ఇల్లు చాలా ఇష్టం. -అవును. 199 00:09:51,927 --> 00:09:54,221 ఇల్లు మారాలని కేవలం మ్యాక్స్ కి మాత్రమే ఉందనిపిస్తుంది. 200 00:09:54,304 --> 00:09:56,348 -నాకు కూడా ఆ ఇల్లు ఇష్టం. -నాకు కూడా. 201 00:10:00,060 --> 00:10:03,563 ఓహ్, అవును నువ్వు నా కలలను నిజం చేస్తున్నావు 202 00:10:03,647 --> 00:10:05,565 ఓహ్, ఓహ్, ఓహ్ 203 00:10:05,649 --> 00:10:07,525 ఓహ్, ఓహ్ 204 00:10:08,443 --> 00:10:12,447 పీడకలతో భయపడి అరుస్తున్న రాత్రుళ్ళు 205 00:10:12,530 --> 00:10:15,200 కలలు కంటున్న నన్ను భయపెట్టడానికి వచ్చినప్పుడు 206 00:10:15,909 --> 00:10:18,286 నేను వాళ్ళను చూసి నవ్వుతాను 207 00:10:18,370 --> 00:10:19,663 ఓహ్, అవును 208 00:10:19,746 --> 00:10:23,917 వాళ్ళను వదిలించుకొని పారిపోతాను నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను 209 00:10:24,501 --> 00:10:26,795 ఎందుకంటే నువ్వు కనుగొన్నప్పటిలా నేను లేను 210 00:10:27,337 --> 00:10:30,006 ఇంకెప్పటికీ అలా ఉండలేను 211 00:10:38,306 --> 00:10:40,308 -నాన్నా? -ఏంటి, బుజ్జి? 212 00:10:41,518 --> 00:10:42,519 నువ్వు బాగానే ఉన్నావా? 213 00:10:42,602 --> 00:10:43,812 అవును. ఎందుకు? 214 00:10:45,272 --> 00:10:46,398 నీకు చెమటలు పడుతున్నాయి. 215 00:10:49,484 --> 00:10:50,569 అవును, 216 00:10:51,403 --> 00:10:54,072 నా బంగారు కొండ కారులో ఉండగా జాగ్రత్తగా నడపాలి కదా అందుకే. 217 00:10:54,739 --> 00:10:57,033 గత వారం కూడా నీకు ఇలాగే ఉంది. 218 00:10:57,659 --> 00:10:58,910 ఇప్పుడు నీకు బాగానే ఉందా? 219 00:11:00,161 --> 00:11:02,414 అవును. అవును. కొంచెం నీరసం అంతే. 220 00:11:02,497 --> 00:11:03,748 పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 221 00:11:05,375 --> 00:11:06,501 అయితే, 222 00:11:06,877 --> 00:11:08,962 షో గురించి ఫలితం మ్యాక్స్ కి ఎప్పుడు తెలుస్తుంది? 223 00:11:09,671 --> 00:11:10,672 ఎప్పుడైనా తెలియవచ్చు. 224 00:11:11,756 --> 00:11:13,508 షో గురించి నీ ఉద్దేశం ఏంటి? 225 00:11:13,592 --> 00:11:14,759 బాగానే జరిగింది. 226 00:11:14,843 --> 00:11:16,177 అంటే, 227 00:11:16,261 --> 00:11:17,596 పర్లేదు అనొచ్చు. 228 00:11:17,679 --> 00:11:21,224 పారిస్ లో నువ్వు చేసి వచ్చిన ఫ్యాన్సీ బిజినెస్ ఉద్యోగం లాంటిది కాదు. 229 00:11:21,808 --> 00:11:22,976 ఏమో తల్లి. 230 00:11:23,059 --> 00:11:25,937 ఆ మేకప్ ట్రైలర్ లో నువ్వు ఇంకా బ్రాండీ చాలా సంతోషంగా కనిపించారు. 231 00:11:26,021 --> 00:11:27,731 బ్రాండీ చాలా హ్యాపిగా ఫీల్ అయింది. 232 00:11:27,814 --> 00:11:29,649 మ్యాక్స్, ఏమో... చెప్పలేను. 233 00:11:29,733 --> 00:11:31,443 అతను నీ అంత కూల్ గా ఉండడు, నాన్నా. 234 00:11:31,943 --> 00:11:34,029 నీకు అతను నచ్చితే నేను ఏమీ అనుకోనని తెలుసు కదా? 235 00:11:34,112 --> 00:11:35,238 కానీ నాకు నచ్చడు. 236 00:11:35,864 --> 00:11:39,993 అంటే, కొన్ని సార్లు కొంచెం నచ్చుతుంటాడు. కానీ పెద్దగా ఏమీ కాదు. 237 00:11:40,744 --> 00:11:41,995 ఏం పర్లేదు, యాంబర్. 238 00:11:42,537 --> 00:11:43,622 నచ్చడంలో తప్పేమీ లేదు. 239 00:11:45,081 --> 00:11:47,709 అంటే నాకు సినీ నచ్చినా అమ్మ ఏమీ బాధపడకూడదనే కదా? 240 00:11:49,127 --> 00:11:51,296 సినీ ఇంకా నేను ఫ్రెండ్స్ మాత్రమే. 241 00:11:53,798 --> 00:11:55,508 ఆమె పై నీ అసలు ఫీలింగ్ ఏంటి? 242 00:11:56,676 --> 00:11:59,971 అంటే, ఆమె మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. నీకు సరిపడే అమ్మాయి కాదు. 243 00:12:01,014 --> 00:12:02,015 అవునా? 244 00:12:03,016 --> 00:12:04,017 నాకు ఎలాంటి అమ్మాయి సరిపోతుంది? 245 00:12:06,186 --> 00:12:07,479 అమ్మ. 246 00:12:10,732 --> 00:12:11,775 అది నిజమే. 247 00:12:14,194 --> 00:12:15,320 బహుశా, 248 00:12:15,403 --> 00:12:16,529 ఎప్పటికైనా, 249 00:12:17,197 --> 00:12:19,324 మీరు చివరి వరకు కలిసి ఉంటారేమో అని నా ఆశ. 250 00:12:20,784 --> 00:12:23,328 నీకు అమ్మా నాన్నలుగా మేము చివరివరకూ కలిసే ఉంటాం. 251 00:12:23,411 --> 00:12:25,372 మేము ముసలివారిమి అయిపోయినా కూడా. 252 00:12:25,872 --> 00:12:26,873 అది గుర్తుంచుకో. 253 00:12:29,751 --> 00:12:31,044 నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, బర్. 254 00:12:31,628 --> 00:12:34,756 వాలంటీర్ చేస్తూ, ముసలివారిని చూసుకుంటున్నావు. 255 00:12:37,050 --> 00:12:38,343 అది గొప్ప పని. 256 00:12:39,427 --> 00:12:40,804 థాంక్స్. 257 00:12:41,888 --> 00:12:42,931 నీకు థాంక్స్. 258 00:12:58,363 --> 00:12:59,489 ఉదయం ఏడున్నర. 259 00:13:01,700 --> 00:13:03,618 ఇవాళ వాళ్లకు సంగీతం పెడతాను. 260 00:13:33,023 --> 00:13:34,232 వాళ్ళు ఇంకా రాలేదే? 261 00:13:40,280 --> 00:13:41,698 రండి. 262 00:13:49,998 --> 00:13:51,625 వాళ్లకు ఏమీ కాకుండా ఉంటే మంచిది. 263 00:14:09,434 --> 00:14:10,810 ఏమండి? 264 00:14:10,894 --> 00:14:12,854 నాకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. 265 00:14:14,064 --> 00:14:16,566 అవును, ఆమెకు ఏమీ కాలేదు. జీవితంలో ఎదురైన మార్పులు తలచుకొని ఏడుస్తుంది. 266 00:14:16,650 --> 00:14:19,402 -నువ్వు నీ డెలివరీలు చెయ్. -అలాగే. 267 00:14:36,419 --> 00:14:37,837 హలో? 268 00:14:38,964 --> 00:14:40,006 రండి. 269 00:15:02,237 --> 00:15:03,321 హలో. 270 00:15:04,948 --> 00:15:06,157 మీరు బానే ఉన్నారా? 271 00:15:07,701 --> 00:15:09,911 నా స్థితిని తలచుకొని బాధపడుతున్నా. 272 00:15:12,038 --> 00:15:13,331 నేను కూడా అలా చేస్తుంటా. 273 00:15:16,042 --> 00:15:17,252 నిజంగా? 274 00:15:18,169 --> 00:15:19,504 ఓహ్, అవును. 275 00:15:19,588 --> 00:15:20,922 కాస్త ఎక్కువగానే అని కూడా అనొచ్చు. 276 00:15:24,968 --> 00:15:26,803 నేను నా భర్తను కోల్పోయా. 277 00:15:28,305 --> 00:15:29,389 ఆయన చనిపోయారా? 278 00:15:31,141 --> 00:15:32,392 అంటే... 279 00:15:32,475 --> 00:15:33,810 నన్ను క్షమించండి. 280 00:15:34,311 --> 00:15:35,353 నాకు బాధగా ఉంది. 281 00:15:36,271 --> 00:15:37,939 ఆయన నాకు దక్కడం నా భాగ్యం. 282 00:15:38,440 --> 00:15:40,525 ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. 283 00:15:44,654 --> 00:15:45,864 నా పేరు యాంబర్. 284 00:15:46,448 --> 00:15:47,741 నేను సిసీల్ ని. 285 00:15:48,825 --> 00:15:49,993 మిమ్మల్ని కలవడం సంతోషం. 286 00:15:54,247 --> 00:15:56,833 మీరు ఇంకా మీ భర్త క్యాంటెన్ బెర్రీ వీధిలో నడుస్తూ ఉండేవారు. 287 00:15:58,251 --> 00:16:00,712 అవును. అది నిజమే. 288 00:16:01,296 --> 00:16:03,465 అది మా వీధే. నేను క్యాంటెన్ బెర్రీలోనే ఉంటాను. 289 00:16:04,049 --> 00:16:05,467 నేను మిమ్మల్ని ఇంకా... 290 00:16:05,550 --> 00:16:06,927 రిచర్డ్ ని. 291 00:16:07,010 --> 00:16:08,803 ...స్కూల్ కి వెళ్లడానికి ముందు కిటికీలో నుండి చూసేదాన్ని. 292 00:16:08,887 --> 00:16:11,723 మేము ఆ వీధిలో ఉండేవారం. 293 00:16:11,806 --> 00:16:14,434 నేను ఇంకా నా రిచర్డ్. 294 00:16:15,018 --> 00:16:17,938 తర్వాత నా కూతురు తనకు మాతో ఉండాలనిపించి 295 00:16:18,021 --> 00:16:19,773 దాదాపు, 20 సంవత్సరాల క్రితం 296 00:16:19,856 --> 00:16:22,359 మమ్మల్ని విస్కాన్సిన్ కి మార్చింది. 297 00:16:22,859 --> 00:16:24,903 మమ్మల్ని తన సంరక్షణలో ఉంచుకోవడానికి. 298 00:16:25,612 --> 00:16:26,655 అది మంచి పని. 299 00:16:27,364 --> 00:16:29,407 కానీ అక్కడ రిచర్డ్ కి అస్సలు నచ్చలేదు. 300 00:16:29,491 --> 00:16:32,494 తనకు తిరిగి పార్క్ రిడ్జ్ కి వచ్చేయాలని అనిపించింది. 301 00:16:34,412 --> 00:16:36,998 అందుకని మేము టూయి అవెన్యూలో ఒక ఇల్లు తీసుకున్నాం, 302 00:16:37,082 --> 00:16:41,670 కేవలం క్యాంటెన్ బెర్రీ వీధిలో 6124 ఇంటికి దగ్గరగా ఉండాలని. 303 00:16:42,712 --> 00:16:44,130 ఏంటి? 304 00:16:44,214 --> 00:16:45,465 అది మా ఇల్లు. 305 00:16:46,091 --> 00:16:47,092 లేదు. 306 00:16:47,175 --> 00:16:48,885 అవును. నిజంగా అది మా ఇల్లే. 307 00:16:48,969 --> 00:16:51,346 మీరు రోజూ ఆ ఇంటిని చూస్తుండే వారు. 308 00:16:51,429 --> 00:16:54,891 ఎందుకంటే మా జీవితాలలోని అతిగొప్ప జ్ఞాపకాలను మేము అక్కడే నిర్మించుకున్నాం. 309 00:16:55,892 --> 00:16:57,435 నా వంటగది ఎలా ఉంది? 310 00:16:57,519 --> 00:16:59,020 ఏంటి? 311 00:17:00,230 --> 00:17:01,356 అది బాగా ఉంది. 312 00:17:01,439 --> 00:17:02,857 చాలా బాగుంది. 313 00:17:02,941 --> 00:17:03,984 మాకు అది చాలా ఇష్టం. 314 00:17:06,486 --> 00:17:08,237 మీకు ఆ ఇల్లు చూడాలని ఉందా? 315 00:17:10,448 --> 00:17:12,367 ఆ అవకాశం దొరికితే చాలా సంతోషిస్తా. 316 00:17:13,702 --> 00:17:17,831 కానీ నా కూతురి అనుమతి లేకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళలేను. 317 00:17:17,914 --> 00:17:19,498 సరే, నేను తనకు ఫోన్ చేయొచ్చా? 318 00:17:20,792 --> 00:17:22,043 ఏమండి. 319 00:17:22,127 --> 00:17:25,130 శ్రీమతి విలియమ్స్, ఇవాళ అందరినీ సరదాగా బయటకు తీసుకెళ్ళనున్నాం. 320 00:17:25,213 --> 00:17:27,674 కానీ అంతకు ముందు మీరు పడుకుంటే మంచిది. 321 00:17:27,757 --> 00:17:28,884 ఇది మీరు నిద్రపోయే సమయం. 322 00:17:28,967 --> 00:17:30,927 నేను బయటకు వెళ్లాలనుకోవడం లేదు, 323 00:17:31,011 --> 00:17:32,762 అలాగే నాకు నిద్రపోవాలని కూడా లేదు. 324 00:17:32,846 --> 00:17:34,514 నాకు అలసటగా లేదు. కానీ అడిగినందుకు థాంక్స్. 325 00:17:34,598 --> 00:17:36,433 మీరు బయటకు కాలక్షేపానికి వెళ్ళడానికి ముందు 326 00:17:36,516 --> 00:17:38,101 మిమ్మల్ని నిద్రపుచ్చుతానని మీ అమ్మాయికి మాట ఇచ్చాను. 327 00:17:39,603 --> 00:17:41,771 చూసావా పరిస్థితి ఎలా మారిందో. 328 00:17:42,856 --> 00:17:46,109 నువ్వు నీ డెలివరీ బండిని హాల్ మధ్యలో వదిలేసి వచ్చావు, అమ్మాయి. 329 00:17:46,192 --> 00:17:47,569 నన్ను క్షమించండి. 330 00:17:47,652 --> 00:17:48,862 దయచేసి దాన్ని అక్కడి నుండి తీసేయ్. 331 00:17:48,945 --> 00:17:50,196 సరే, అలాగే. 332 00:17:50,780 --> 00:17:52,741 మిమ్మల్ని కలవడం చాలా సంతోషం, శ్రీమతి విలియమ్స్. 333 00:17:52,824 --> 00:17:55,243 నన్ను సిసీల్ అని పిలిస్తే చాలు. 334 00:17:56,202 --> 00:17:57,621 నేను మళ్ళీ వస్తాను, సిసీల్. 335 00:18:03,209 --> 00:18:04,878 ఇక మనం ఆపితే మంచిదనుకుంటున్నాను. 336 00:18:04,961 --> 00:18:07,297 అవును. కనీసం 12 డజన్లు చేసాం. 337 00:18:07,380 --> 00:18:10,800 మన బేకింగ్ సేల్ లో ఒక్కొక్క దానికి 25 సెంట్లు వచ్చినా, 338 00:18:10,884 --> 00:18:12,552 వీటికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా? 339 00:18:12,636 --> 00:18:14,638 -ఎంత? -సరే. చూద్దాం. 340 00:18:14,721 --> 00:18:16,556 ఇరవై అయిదు, అలాగే ఇంకొకటి కలిపితే... 341 00:18:16,640 --> 00:18:17,933 చాలా. 342 00:18:18,892 --> 00:18:20,143 నువ్వు ఇళ్ళు ఎలా అమ్ముతున్నావు? 343 00:18:20,227 --> 00:18:21,519 నేను అన్నీ రౌండ్ ఆఫ్ చేసేస్తాను. 344 00:18:22,854 --> 00:18:25,023 ఇవి స్కూల్ వారికి నచ్చితే బాగుండు 345 00:18:25,106 --> 00:18:27,108 ఎందుకంటే నేను ఇక్కడి కంటే అక్కడే ఎక్కువ ఉంటున్నా. 346 00:18:27,192 --> 00:18:28,443 అలాంటిది ఏమీ జరగదు. 347 00:18:28,526 --> 00:18:30,987 కానీ ఒకటి గుర్తుంచుకో, నీలాంటి అమ్మల వల్లే ప్రపంచ శాంతి ఇంకా ఉంది. కాబట్టి... 348 00:18:31,071 --> 00:18:32,656 -థాంక్స్. -అదేం పర్లేదు. 349 00:18:32,739 --> 00:18:35,158 నీకు కచ్చితంగా నాతో వచ్చి కొన్ని ఇళ్ళు చూడాలని లేదా? 350 00:18:35,242 --> 00:18:36,660 అవును, అస్సలు లేదు! 351 00:18:37,953 --> 00:18:39,329 యాంబర్ చుట్టూ ఇప్పటికే చాలా మారాయి. 352 00:18:39,412 --> 00:18:41,581 సరే, కనీసం ఇంటికి కొత్తగా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా. 353 00:18:41,665 --> 00:18:42,999 అంటే, మ్యాక్స్... 354 00:18:43,083 --> 00:18:44,334 సలహాలు తీసుకోవాలా? 355 00:18:44,417 --> 00:18:46,336 ఇంటికి అతని గుర్తును వేయాలా? 356 00:18:47,212 --> 00:18:49,839 అంటే, నువ్వు అన్నది కరక్టే ఏమో. ఇది అంత చెడ్డ ఐడియా కాదు. 357 00:18:49,923 --> 00:18:53,134 ఓహ్, లేదు. ఇది చెడ్డ ఐడియా కావచ్చు. కానీ మంచి నిర్ణయం అని చెప్పగలను. 358 00:18:55,220 --> 00:18:57,097 నేను ఏదో... దొరికింది. 359 00:18:57,472 --> 00:18:59,933 మ్యాక్స్ ఇంటికి వస్తున్నాడు. సరే. 360 00:19:01,184 --> 00:19:04,104 హెల్త్ ఫుడ్ నెట్వర్క్ వాళ్ళు ఇవాళ రాత్రికి విజేతలను ప్రకటించనున్నారు. 361 00:19:05,272 --> 00:19:06,815 అవును. చాలా టెన్షన్ గా ఉంది. 362 00:19:06,898 --> 00:19:09,609 తను చాలా బాగా చేసాడు. కచ్చితంగా గెలుస్తాడు. తనకు దక్కుతుందని నాకు తెలుసు. 363 00:19:09,693 --> 00:19:11,528 చాలా బాగా చేసాడు, కదా? 364 00:19:11,611 --> 00:19:12,946 నిజమే. 365 00:19:15,490 --> 00:19:16,700 ఇంకా? 366 00:19:19,786 --> 00:19:20,912 నువ్వు కూడా బాగా చేసావు. 367 00:19:20,996 --> 00:19:22,455 -అవునా? -నువ్వు... చాలా గొప్పగా చేసావు. 368 00:19:22,539 --> 00:19:24,249 నువ్వు అలా అనాల్సిన పని లేదు. 369 00:19:24,332 --> 00:19:26,501 అంటే, హీల్స్ వేసుకొని ఇంట్లో యోగ అంటే మాటలా. 370 00:19:26,585 --> 00:19:28,628 -అలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? -కదా? 371 00:19:28,712 --> 00:19:30,589 -నేను బాగా చేశాను. -నువ్వు చాలా బాగా చేసావు. 372 00:19:30,672 --> 00:19:33,466 -మంచి ఫామ్ లో ఉన్నా. -చాలా బాగా చేసావు. 373 00:19:34,384 --> 00:19:36,011 నేను ఫేమస్ అయిపోతా. 374 00:19:36,970 --> 00:19:39,389 సెయింట్ థామస్ అసిస్టెడ్ లివింగ్ 375 00:19:39,472 --> 00:19:40,932 మీకు ఏ స్వెట్టరు వేసుకోవాలని ఉంది? 376 00:19:41,016 --> 00:19:42,517 పచ్చది. రిచర్డ్ కి బాగా ఇష్టమైంది. 377 00:19:43,101 --> 00:19:44,853 బ్రాండీ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. 378 00:19:45,896 --> 00:19:49,482 చాలా థాంక్స్. థాంక్స్, సర్. నాకు మా బామ్మ అంటే చాలా ఇష్టం. 379 00:19:49,566 --> 00:19:50,901 ఎందుకు ఆ యాసలో మాట్లాడుతున్నావు? 380 00:19:50,984 --> 00:19:52,903 ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిల్లా? 381 00:19:52,986 --> 00:19:55,614 నేను సహజంగా యాక్ట్ చేయమన్నా, "యాక్టింగ్" చేయమనలేదు. 382 00:19:56,281 --> 00:19:58,658 అలాగే సన్ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నావు? మనం లోపలే ఉన్నాం. 383 00:19:58,742 --> 00:20:00,452 అనుమానాస్పదంగా కనిపించకూడదని. 384 00:20:00,535 --> 00:20:01,661 అలాగైతే అవి పెట్టుకోకుండా రావాలి. 385 00:20:01,745 --> 00:20:04,122 ఎలాంటి డబుల్ ఏజెంట్ సన్ గ్లాసెస్ వేసుకుంటారు? 386 00:20:04,205 --> 00:20:07,626 -ఓరి, నాయనో. -అమ్మాయిలు, మనం తప్పుగా ఏం చేయడం లేదు. 387 00:20:08,335 --> 00:20:10,879 -అవునా? -మనం సరదాగా బయటకు వెళ్ళనున్నాం. 388 00:20:10,962 --> 00:20:12,964 మీరు సమస్యలో పడడం నాకు ఇష్టం లేదు, సిసీల్. 389 00:20:13,048 --> 00:20:15,175 బయట కాలక్షేపం కార్యక్రమాలు ఎంత సేపు నడుస్తాయి, సిసీల్? 390 00:20:15,258 --> 00:20:16,718 ఒక గంట. 391 00:20:16,801 --> 00:20:18,136 ఆ సమయం సరిపోతుందా? 392 00:20:18,220 --> 00:20:20,847 అవును. ఓహ్, ప్లీజ్. మనం వచ్చేయగలం. పదా. 393 00:20:21,681 --> 00:20:23,350 -పదా. -ఇలా రా. 394 00:20:24,059 --> 00:20:25,310 ఇక ఆ యాసలో మాట్లాడకు. 395 00:20:25,393 --> 00:20:26,394 సారి. 396 00:21:40,176 --> 00:21:42,178 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్