1 00:00:16,517 --> 00:00:19,937 నాకు నిద్రే పట్టలేదు. భయంకరంగా గురకపెట్టావు నువ్వు. 2 00:00:20,020 --> 00:00:21,647 అసంభవం. నేను గురకపెట్టను. 3 00:00:22,231 --> 00:00:23,941 -అవును, నా గురకే అయ్యుంటుంది. -అవును. 4 00:00:24,024 --> 00:00:25,025 అవును. 5 00:00:25,567 --> 00:00:27,444 -ఉంటాను. -వెళ్ళొస్తాను. 6 00:00:27,528 --> 00:00:29,321 హే, ఎలా ఉన్నావు, డెరెక్? 7 00:00:29,404 --> 00:00:30,989 అద్భుతంగా. వంకలేని భార్య ఉందిగా? 8 00:00:31,573 --> 00:00:32,741 చాలా సంతోషమోయ్. 9 00:00:33,408 --> 00:00:35,285 శుభోదయం. ఏమిటి విశేషం? 10 00:00:38,247 --> 00:00:40,249 ఆలీస్ కి షాన్ పట్ల ఇష్టం ఉందని నువ్వు చెప్పిన మాట నిజమే. 11 00:00:40,916 --> 00:00:43,126 ఉండు. కదలద్దు. కదలద్దు. 12 00:00:43,210 --> 00:00:45,629 -దేవుడా. -దేవుడా! ఆహాహా! 13 00:00:45,712 --> 00:00:47,047 ఇంకా మొదట్లోనే ఉంది, లిజ్. 14 00:00:47,631 --> 00:00:49,383 దా, దా, దా. 15 00:00:49,466 --> 00:00:51,093 -అబ్బా. -దా, దా, దా. 16 00:00:53,846 --> 00:00:56,265 -చెప్పామా, లేదా? -అది ఇద్దరం కలసి అనాలి కదా? 17 00:00:56,348 --> 00:00:59,226 క్షమించు. నేనేదో… తొందరపడ్డాను తనని ఆటపట్టించాలని. 18 00:00:59,309 --> 00:01:01,103 -అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? -అడిగావూ? 19 00:01:01,186 --> 00:01:03,814 -రాత్రి బాగా తాగేశాము కదా… -తప్పతాగేశాము. 20 00:01:03,897 --> 00:01:06,275 …మామూలుగా అయితే అపరాధభావం ఉండేది. 21 00:01:06,358 --> 00:01:08,944 కానీ ఇలాగే జరగాల్సి ఉందేమో అనిపిస్తోంది. 22 00:01:09,027 --> 00:01:12,364 జిమ్మీ తలవంచటం నువ్వు చూడాలని దేవుడే తలచాడేమో అన్నట్టుంది. 23 00:01:12,447 --> 00:01:13,448 ఆహా. 24 00:01:21,164 --> 00:01:23,917 కావలసినంత ఇకిలించు. నువ్వు ఎంతసేపు ఇలా చేస్తే, 25 00:01:24,001 --> 00:01:25,544 అంత ఆలస్యం అవుతావు పాల్ ని పిక్ చేసుకోవటానికి. 26 00:01:26,420 --> 00:01:29,423 అయ్యయ్యో! అయ్యయ్యో! 27 00:01:29,506 --> 00:01:32,301 -జాగ్రత్తగా వెళ్ళు, పిచ్చిమొహమా. -నోరుమూసుకో! 28 00:01:32,384 --> 00:01:33,844 నీపై కోపంతో తను కుక్కలా అరవాలని కోరుకుంటున్నా. 29 00:01:34,761 --> 00:01:36,513 ఒకోసారి పాల్ కి ఒళ్ళుమండితే కుక్కలాగే అరుస్తాడు. 30 00:01:36,597 --> 00:01:41,727 -సరే. విను. షాన్ పై నీకు నమ్మకం ఉంది కదా? -అవును, ఉంది. 31 00:01:41,810 --> 00:01:43,145 అయితే దీని గురించి అంతగా చింతించకు. 32 00:01:43,228 --> 00:01:45,606 అవును. అదే చేస్తానులే. 33 00:01:45,689 --> 00:01:47,608 -చేయకు అంటున్నా. -థాంక్స్, లిజ్. 34 00:01:50,444 --> 00:01:52,446 మీ ఆయన డ్రైవ్ వే లో నిద్రపోతున్నాడు. 35 00:01:52,529 --> 00:01:53,864 దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు కదా? 36 00:01:58,327 --> 00:02:02,581 ఒక మంచి తాతగా, వాడి పుట్టినరోజుకి ఏం ఇస్తే బాగుంటుంది? 37 00:02:02,664 --> 00:02:05,667 -డోరిటోస్ తెచ్చావా? -ఏంటి? ఆ, డోరిటోస్ తెచ్చాను. 38 00:02:05,751 --> 00:02:07,419 -ఏంటి? -మేసన్ కి డోరిటోస్ కావాలట. 39 00:02:07,503 --> 00:02:09,213 -పుట్టినరోజుకా? -కాదు, 40 00:02:09,295 --> 00:02:10,547 వాడికి స్విచ్ కావాలట. 41 00:02:10,631 --> 00:02:12,341 స్విచ్ అంటే ఏమిటసలు? 42 00:02:12,424 --> 00:02:14,426 అదొక వీడియో గేమ్. వాడి ఫ్రెండ్స్ అందరి దగ్గరా ఉందట. 43 00:02:14,510 --> 00:02:16,011 డబ్బు ఇచ్చేస్తే పోతుందేమో కదా? 44 00:02:16,094 --> 00:02:17,596 వాడికి డబ్బంటే ఇష్టమేగా? 45 00:02:18,180 --> 00:02:19,348 ఖచ్చితంగా. బాగుంటుంది. 46 00:02:20,015 --> 00:02:22,309 -ఏది తను? -ఎవరు నాన్నా? 47 00:02:23,018 --> 00:02:26,021 నాతో పనిచేసే అమ్మాయి రోజూ నన్ను తీసుకువెళ్తోంది. తనింకా రాలేదు. 48 00:02:26,104 --> 00:02:27,523 నిన్ను తను ఎందుకు తీసుకువెళ్తోంది? 49 00:02:29,983 --> 00:02:30,984 ఆ, తనకి తోడు కావాలట. 50 00:02:31,068 --> 00:02:32,611 తోడు కోసం నిన్ను ఎన్నుకుందా? 51 00:02:32,694 --> 00:02:35,322 కార్లో నేను సరదాగా ఉంటాను. పిడిగుద్దులాట బాగా ఆడతాను. 52 00:02:35,405 --> 00:02:37,241 ఏంటి విషయం? అంతా బానే ఉందా? 53 00:02:38,283 --> 00:02:40,827 విషయం ఏమీ లేదు. నా కార్ రిపేర్ కి వెళ్లింది. అంతే. 54 00:02:43,622 --> 00:02:45,165 -తను వచ్చింది. -నాన్నా. 55 00:02:45,249 --> 00:02:47,960 -నేను తర్వాత మాట్లాడతాను. -ఉంటాను. 56 00:02:48,627 --> 00:02:52,256 అయ్యయ్యో. పాల్, క్షమించు. 57 00:02:52,339 --> 00:02:54,424 నేను గబగబా స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి. 58 00:02:54,508 --> 00:02:57,386 తర్వాత ఆకుకూరల జ్యూస్ కూడా చేసుకుంటాను. నీకూ కావాలా? క్షమించు. 59 00:02:59,555 --> 00:03:00,556 వావ్. 60 00:03:30,669 --> 00:03:32,045 దారుణంగా ఉంది. 61 00:03:32,129 --> 00:03:34,298 నువ్వు మరీను. చక్కగా ఉంది. 62 00:03:34,381 --> 00:03:36,884 హే. ఎలా ఉన్నారు ఇద్దరూ? 63 00:03:37,551 --> 00:03:40,137 షాన్ తన కొత్త లైసెన్స్ ఫోటో బాలేదని అంటున్నాడు. బాగుందని చెప్పు. 64 00:03:40,220 --> 00:03:41,555 సరే. 65 00:03:42,681 --> 00:03:44,808 షాన్, ఈ లైసెన్స్ ఫోటోలో బాగున్నావు. 66 00:03:45,684 --> 00:03:48,270 నీ బుగ్గల్లో ఎముకలు పైకి, పైకి, పైకి ఉన్నాయి. 67 00:03:48,353 --> 00:03:50,647 నువ్వు ఆర్గన్ డోనర్ అవ్వటం వల్ల మరీ అందంగా ఉన్నావు. 68 00:03:53,400 --> 00:03:55,444 ఎందుకు అన్నీ అలా దారుణంగా చేస్తుంటావు? 69 00:03:56,987 --> 00:04:00,073 నువ్వు చెప్పిన పనే దారుణమైనది. 70 00:04:00,157 --> 00:04:01,366 అబ్బా! 71 00:04:05,245 --> 00:04:06,163 నువ్వు బానే ఉన్నావా? 72 00:04:06,872 --> 00:04:09,875 ఆ, మా నాన్న. కలుద్దాం అంటూ చంపేస్తున్నాడు. 73 00:04:09,958 --> 00:04:13,921 ఒక్క క్షణం నన్ను దూరంగా తోసేయటం, మరు నిముషం ప్రేమ ఒలకపోయటం. 74 00:04:14,004 --> 00:04:17,341 షాన్, కుదిరినంత కాలం మీ నాన్న మీద కోపంగా ఉండాలి నువ్వు. 75 00:04:17,423 --> 00:04:19,259 -అవునా? -కాదు. 76 00:04:19,343 --> 00:04:20,552 అలా చేయద్దు. చిరాకుగా ఉంది. 77 00:04:20,636 --> 00:04:24,014 నేను అర్థం చేసుకోగలను. నిలకడ లేని బంధంలో ఉన్నాను నేను కూడా 78 00:04:24,097 --> 00:04:25,891 ప్రస్తుతానికి పాల్ తో. కానీ ఒక మాట చెప్పనా? 79 00:04:25,974 --> 00:04:28,977 ఇక్కడే ఇలాగే కోపంగా కూర్చోవటం వల్ల మనకేం ఉపయోగం లేదు. కదా? 80 00:04:29,061 --> 00:04:30,187 నాకిది బానే ఉంది. 81 00:04:30,270 --> 00:04:31,188 అవును. బాగుంటుంది. 82 00:04:32,022 --> 00:04:35,442 కానీ బహుశా మనం అందులోకి దిగి చూడాలేమో. 83 00:04:35,526 --> 00:04:36,652 మున్ముందుకి వెళ్ళాలి. 84 00:04:36,735 --> 00:04:38,320 మా నాన్నని కలవాలంటారా అయితే? 85 00:04:38,403 --> 00:04:40,072 కలిస్తే పోలా? ధైర్యంగా ఎదుర్కోవాలి. 86 00:04:40,739 --> 00:04:41,698 నువ్వు, నేనూ. సరేనా? 87 00:04:41,782 --> 00:04:44,493 ఈ బంధాలేమిటో, వాటి కథేమిటో తేల్చేయాలి. 88 00:04:45,077 --> 00:04:46,036 దెబ్బకి… 89 00:04:47,788 --> 00:04:49,915 ఇంకా దారుణంగానే ఉన్నావు. 90 00:04:51,959 --> 00:04:53,544 -దారుణంగానే ఉంది. -అవును. 91 00:04:54,753 --> 00:04:57,256 చూడటానికి దారుణంగానే ఉంది. 92 00:04:58,841 --> 00:05:01,677 ఎందుకు మోసం చేశావని నేను నిలదీసినప్పుడు, కనీసం పశ్చాత్తాపం లేదు. 93 00:05:01,760 --> 00:05:04,638 "అయితే ఏంటి? తను బాగుంటుంది మరి" అన్నాడు. 94 00:05:04,721 --> 00:05:06,849 అది ఒక కల. నిజంగా జరిగినది కాదు. 95 00:05:06,932 --> 00:05:09,935 అవును, కానీ నాకు అలాంటి ఊహ రావటానికి కారణం ఏమిటంటావు? 96 00:05:10,018 --> 00:05:13,021 సరే, డోనా. ఈ విషయంలో నేను మార్క్ వైపు మాట్లాడక తప్పట్లేదు. 97 00:05:14,815 --> 00:05:15,816 దానికే వేడుకలు అక్కరలేదు. 98 00:05:15,899 --> 00:05:17,943 -కొంచెమైనా సంబరపడకూడదా నేను? -కూడదు. 99 00:05:18,026 --> 00:05:19,736 డోనా, ఇకపోతే కల విషయం. 100 00:05:19,820 --> 00:05:22,197 కాస్త కునుకు తీసి, కలలో మార్క్ క్షమాపణ చెప్తాడేమో చూడరాదూ? 101 00:05:22,281 --> 00:05:25,325 చెప్పడు. కలలోని మార్క్ వెధవన్నర వెధవ. 102 00:05:25,409 --> 00:05:27,744 మరి నా కలల్లో నువ్వు బంగారుతల్లివి. 103 00:05:27,828 --> 00:05:29,830 కాకపోతే నీ చేతులు పిజ్జా ముక్కల్లా కనిపించాయి. 104 00:05:29,913 --> 00:05:31,164 నేను తినేకొద్దీ మళ్లీ పుట్టుకొస్తున్నాయి. 105 00:05:31,248 --> 00:05:32,499 కలల గురించి ఇక ఆపేద్దాం, సరేనా. 106 00:05:32,583 --> 00:05:34,793 ఇక ఈ సెషన్లో కలల గురించి మాట్లాడేది లేదు. 107 00:05:34,877 --> 00:05:37,296 పెళ్లి కాకముందు నుంచే చాలా ఏళ్ళు కలిసున్నారు కదా? 108 00:05:37,379 --> 00:05:38,755 అప్పుడు ఇంతగా వాదులాడుకోలేదు. 109 00:05:38,839 --> 00:05:40,632 -అప్పట్లో తనకింత పిచ్చి లేదు. -ఆ మాటవల్ల ఉపయోగం లేదు. 110 00:05:40,716 --> 00:05:42,509 -అంటే నాకు పాయింట్. -అలా చేయద్దు. 111 00:05:42,593 --> 00:05:43,594 ఇక్కడ పాయింట్లు ఏం లేవు. 112 00:05:43,677 --> 00:05:46,430 ఉన్నాయని మీకు ఎందుకు అనిపించిందో తెలియదు కానీ, ఇక దయచేసి ఆపేయండి. 113 00:05:46,513 --> 00:05:48,599 వినండి. మీరిద్దరూ కలిసున్నరోజుల్లో, 114 00:05:48,682 --> 00:05:51,101 కావలసినప్పుడు దూరమైపోవచ్చు అని అప్రయత్నంగా అయినా మీకు తెలుసు. 115 00:05:51,185 --> 00:05:54,813 ఇప్పుడు పెళ్లి అయ్యింది కనుక, అన్ని విషయాలూ భూతద్దంలో లాగా కనిపిస్తున్నాయి. 116 00:05:54,897 --> 00:05:57,691 మీరిద్దరూ చేయాల్సిన ఒక మంచి పని ఏమిటంటే, 117 00:05:57,774 --> 00:06:00,569 మీకున్న భయాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి, కలిసి వాటిని ఎదుర్కోవాలి. 118 00:06:00,652 --> 00:06:02,112 మీరు, మీవారు అలాగే చేస్తారా? 119 00:06:03,780 --> 00:06:04,823 ఖచ్చితంగా. 120 00:06:04,907 --> 00:06:08,535 "ఖచ్చితంగా"నా? ఎవరైనా అలా అంటారా? 121 00:06:08,619 --> 00:06:10,996 -రీబా మెక్ ఎంటైర్. -అవును. 122 00:06:11,079 --> 00:06:14,166 నేను ఏం చెప్పాల్సిందో చెప్పనా? "వైవాహిక జీవితం అనేది ఒక రోత, 123 00:06:14,249 --> 00:06:17,127 అందుకే నేను విడిపోయాను, అది మన ప్రాణాలు తోడేస్తుంది 124 00:06:17,211 --> 00:06:20,589 అద్దంలో మనల్ని చూసి మనమే గుర్తుపట్టలేనంతగా" అని అనాల్సింది. 125 00:06:20,672 --> 00:06:22,007 అది నేను చెప్పి ఉండాల్సింది. 126 00:06:22,090 --> 00:06:23,967 లేదు, అలా చెప్పకూడదు. అది పిచ్చితనం. 127 00:06:24,051 --> 00:06:26,303 అబ్బా, పాల్. నన్ను కొంచెం ఉత్సాహపరచు. 128 00:06:26,386 --> 00:06:27,638 -దయచేసి. -గ్యాబీ. 129 00:06:27,721 --> 00:06:32,392 ఎప్పుడో మనుషులు చిన్న వయసులోనే చనిపోతున్న రోజుల్లో వివాహవ్యవస్థ ఏర్పడింది. 130 00:06:32,476 --> 00:06:37,648 భూస్వామ్యం, సంతానవృద్ధి ఆధారంగా ఏర్పాటు అయ్యింది. 131 00:06:38,148 --> 00:06:42,653 ప్రస్తుతం, ఆడవారిని లొంగదీయటానికి, పెనాలు, గిన్నెలు అమ్మటానికి వాడుతున్నారు దాన్ని. 132 00:06:42,736 --> 00:06:45,030 అబ్బా, ధైర్యం చెప్తూ మాట్లాడటం అస్సలు రాదు నీకు. తెలుసా? 133 00:06:45,113 --> 00:06:46,990 -తెలుసు. -అయినా పర్లేదులే. 134 00:06:47,074 --> 00:06:50,035 నువ్వు జిమ్మీకే మెంటర్ గా ఉన్నావు, నాకు లేవు అన్న బాధని కొంచెం తగ్గించింది ఇది. 135 00:06:50,118 --> 00:06:51,954 నేను జిమ్మీకి మెంటర్ ని కాను. 136 00:06:52,037 --> 00:06:53,497 అవును. తనకి మెంటర్ అవ్వటం నీకిష్టం కూడా. 137 00:06:53,580 --> 00:06:56,041 నేను ఇక్కడ చేరేసరికే నువ్వు, జిమ్మీ చాలా సన్నిహితులు. 138 00:06:56,124 --> 00:07:00,379 నీనా సిమోన్ గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్న ఇద్దరు తెల్లజాతి పురుషులు మీరు. 139 00:07:00,462 --> 00:07:02,756 -నీనా సిమోన్ అంటే నాకిష్టం. -ఏం పర్వాలేదు. 140 00:07:02,840 --> 00:07:05,384 నాకు ఎంచుకునే అవకాశం ఉన్నా, నేను నిన్ను మెంటర్ గా ఎంచుకోనులే. 141 00:07:05,467 --> 00:07:06,718 -ఎంచుకోవా? -ఎంచుకోను. 142 00:07:06,802 --> 00:07:08,762 నాలాంటివాళ్ళని ఎవరినైనా ఎంచుకుంటాను. 143 00:07:08,846 --> 00:07:10,055 అర్థమయ్యింది. 144 00:07:15,394 --> 00:07:17,396 గ్రేస్, నాకు తిరిగి కాల్ చేయగలవా? గ్రేస్? 145 00:07:17,479 --> 00:07:18,897 గ్రేస్? చెప్పు గ్రేస్ 146 00:07:25,279 --> 00:07:26,822 నేను కాలేజ్ లో ఉన్నప్పుడు, 147 00:07:26,905 --> 00:07:28,657 నా ప్రొఫెసర్లు అంతా పెద్దవయసు తెల్లజాతి తిక్కవాళ్ళే. 148 00:07:28,740 --> 00:07:29,658 నాకు వాళ్ళంటే చిరాకు. 149 00:07:31,410 --> 00:07:33,871 హే, పాల్. ఎలా ఉన్నావు? 150 00:07:33,954 --> 00:07:36,957 బాగున్నావా? మంచిది. నేను కూడా. హే, గ్యాబ్స్. నిన్ను కలవటం సంతోషం. 151 00:07:37,624 --> 00:07:41,670 నేను బయట ఉన్నప్పుడు, లోపలకి వచ్చి నీ సాయం అడగాలనుకున్నాను. 152 00:07:41,753 --> 00:07:43,255 నా పేషెంట్ గ్రేస్ నాకు స్పందించట్లేదు. 153 00:07:43,338 --> 00:07:46,466 కానీ నువ్వు నాతో పేషెంట్స్ గురించి మాట్లాడట్లేదని గుర్తొచ్చింది. 154 00:07:46,550 --> 00:07:47,676 కనుక లోపలకి రావద్దులే అనుకున్నా. 155 00:07:47,759 --> 00:07:49,011 అయినా వచ్చావుగా? 156 00:07:49,094 --> 00:07:50,304 అయినా వచ్చాను. 157 00:07:50,387 --> 00:07:53,891 విను, పాల్. నీ అభిప్రాయంలో నేను కొన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నానని తెలుసు. 158 00:07:53,974 --> 00:07:57,769 కానీ దయచేసి అది పక్కకి పెట్టి ముందుకి వెళ్దామా? 159 00:08:01,607 --> 00:08:02,649 బజర్. 160 00:08:02,733 --> 00:08:04,526 నిజం చెప్పాలంటే, ఆ బజర్ శబ్దం నాకు నచ్చదు, పాల్. 161 00:08:04,610 --> 00:08:06,737 అయితే నేను అంగీకరించేలా నువ్వు మాట్లాడాలి. 162 00:08:08,697 --> 00:08:11,074 -దయచేసి అలా చేయకుండా ఉంటావా? -నవ్వొచ్చేలా ఉందది. 163 00:08:12,326 --> 00:08:13,327 ఒకటి చెప్పనా, పాల్? 164 00:08:13,410 --> 00:08:15,787 నామీద నీకున్న అభిప్రాయం నాకు తెలుసు అనుకొనేవాడిని. 165 00:08:15,871 --> 00:08:17,039 కానీ అది తప్పనిపిస్తోంది. 166 00:08:17,122 --> 00:08:20,626 పర్వాలేదు, ఎందుకంటే నాకు నీ సలహా అవసరం లేదు. 167 00:08:20,709 --> 00:08:22,544 నీ ధ్రువీకరణ అవసరం లేదు. 168 00:08:22,628 --> 00:08:25,714 కనుక ఒక పని చేద్దాం. ఇకపై నువ్వు, నేను, 169 00:08:26,715 --> 00:08:27,716 మొత్తానికి మాటలు మానేద్దాం. 170 00:08:28,509 --> 00:08:29,343 అలాగే. 171 00:08:34,597 --> 00:08:37,392 -నాకిది వద్దు. తీసేసుకో. -ఉంటాను, పాల్. 172 00:08:37,976 --> 00:08:40,520 నువ్వు ఒకోసారి దారుణంగా ప్రవర్తిస్తావు, పాల్. 173 00:08:40,604 --> 00:08:42,063 ఒకోసారేనా? 174 00:08:43,524 --> 00:08:45,692 -బై కన్నా. -ఉంటాను. 175 00:08:46,276 --> 00:08:49,905 హే. ఈ బౌ టై బానే ఉందా, లేకపోతే ద సింప్సన్స్ లో స్మిదర్స్ లా ఉన్నానా? 176 00:08:49,988 --> 00:08:51,073 చాలా బాగుంది. 177 00:08:51,156 --> 00:08:54,660 -చూడకుండానే చెప్పేశావు. -చూడలేదా? 178 00:08:54,743 --> 00:08:57,579 నేను 30 ఏళ్ళ నుంచి ఒకే బట్టలు వేసుకున్న ఒక ఏనిమేటెడ్ పాత్రలా 179 00:08:57,663 --> 00:09:00,666 కనిపించే ప్రమాదం ఉంటే పట్టించుకోవా? 180 00:09:00,749 --> 00:09:03,293 అబ్బా, చెప్పరాదూ? చూడు, బాగుందా? 181 00:09:05,754 --> 00:09:07,297 -ఆహా. -బాగుందంటావా? 182 00:09:07,381 --> 00:09:08,882 -అవును. -థాంక్యూ! 183 00:09:10,843 --> 00:09:13,887 అవును. చాలా బాగున్నావు. 184 00:09:13,971 --> 00:09:15,222 థాంక్స్. నువ్వు నా బంగారానివి. 185 00:09:16,390 --> 00:09:18,642 -నీకంత అదృష్టమెలా పట్టిందంటావు? -అంతా నాకు తగ్గట్టే జరుగుతుంది. 186 00:09:21,395 --> 00:09:22,479 ఏంటి? 187 00:09:23,105 --> 00:09:26,108 ఏం లేదు. లవ్ యూ. 188 00:09:28,402 --> 00:09:30,112 అమ్మయ్య. అందరూ వచ్చేశారా? 189 00:09:30,195 --> 00:09:34,408 పని మధ్యలో పిలిచినందుకు సారీ. కానీ పెద్ద శుభవార్త తీసుకొచ్చాను. కనుక సారీ. సారీ చెప్పను. 190 00:09:34,491 --> 00:09:36,660 "సారీ, సారీ చెప్పను" అని ఎవ్వరూ అనట్లేదు ఇప్పుడు. 191 00:09:36,743 --> 00:09:40,497 కనుక నీ భాషలోంచి దాన్ని… అని నా కోరిక. 192 00:09:40,581 --> 00:09:42,958 కానీ నేనింకా విజయవంతంగా అది వాడగలను. ఎందుకంటే నేను 193 00:09:43,041 --> 00:09:45,878 అంతరార్థంతో మాట్లాడితే జోక్ అని అవతలివారికి అర్థమవుతుంది. 194 00:09:45,961 --> 00:09:50,841 ఓయబ్బో. ఏమిటీ సుత్తి? గబగబా చెప్పు. జనానికి పని ఉంది. 195 00:09:50,924 --> 00:09:52,509 మీకు చెప్పాలంటే నాకు బిడియంగా ఉందబ్బా! 196 00:09:52,593 --> 00:09:57,222 ఎందుకంటే నువ్వు నికో నుంచి విడిపోయావు, జిమ్మీకేమో… 197 00:09:57,806 --> 00:09:58,849 భార్య చనిపోయింది. 198 00:09:59,600 --> 00:10:03,061 అవును, కానీ మీరు నా ఆప్తమిత్రులు. కనుక చెప్పేస్తున్నాను. 199 00:10:05,731 --> 00:10:07,274 చార్లీకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. 200 00:10:12,112 --> 00:10:15,324 ఏమిటి? ఇంతేనా? మీకు ప్రేమంటే ద్వేషమా? 201 00:10:15,407 --> 00:10:16,950 లేదు, లేదు. మేము సంతోషిస్తున్నామురా. 202 00:10:17,034 --> 00:10:18,911 కాకపోతే చార్లీకి ప్రపోజ్ చేస్తానని ఇప్పటికి 203 00:10:18,994 --> 00:10:20,662 లక్షలసార్లు చెప్పావు కానీ, ఆ పని జరగలేదు. 204 00:10:20,746 --> 00:10:22,497 కాబట్టి, ఇక ఆ మాట వింటే… 205 00:10:23,582 --> 00:10:26,627 -…ఎలా చెప్పాలి? -సుత్తి, సోది, చెత్త, చెదారం లాగా. 206 00:10:26,710 --> 00:10:27,961 అవును. అదే. అంతే. 207 00:10:28,045 --> 00:10:30,005 నాకు పదింటికి సెషన్ ఉంది. కనుక నేనిక వెళ్ళాలి. 208 00:10:30,088 --> 00:10:32,007 -అది నిజంగా జరిగేది. -అయ్యో. 209 00:10:32,090 --> 00:10:33,550 -నువ్వు రాక్షసుడివి. -సారీ, సారీ చెప్పను. 210 00:10:33,634 --> 00:10:34,760 -వావ్, అదరగొట్టేశాడు. -లేదు, లేదు. 211 00:10:34,843 --> 00:10:38,013 నేను అన్నది వెనక్కి తీసుకుంటున్నాను. ఆ మాట ఎవరూ వాడరు అనుకున్నాను, వాడుతున్నారు. 212 00:10:38,096 --> 00:10:41,892 నేను ఉంగరం కొని, మీకు నిరూపిస్తాను. చూస్తూ ఉండండి. 213 00:10:41,975 --> 00:10:43,602 మీ పిల్లలకి చెప్పటానికి బాగుంటుంది ఈ కథ. 214 00:10:43,685 --> 00:10:44,728 -వెళ్తున్నా. -సరే. 215 00:10:44,811 --> 00:10:45,729 వెనక్కి తిరిగి పోతున్నా. 216 00:10:45,812 --> 00:10:48,273 -తలుపు తగులుతుంది. -పట్టించుకోను. వచ్చేశా. 217 00:10:48,357 --> 00:10:49,191 వావ్. 218 00:10:49,274 --> 00:10:51,235 సరే, గ్రాహమ్. దూరం పరిగెత్తు కుర్రాడా. 219 00:10:51,318 --> 00:10:53,529 -ఖచ్చితంగా. -అంతే, శభాష్! 220 00:10:58,116 --> 00:10:59,451 అది. 221 00:10:59,535 --> 00:11:00,911 నువ్వు నన్నెప్పుడూ స్కూల్ మాననివ్వలేదు. 222 00:11:01,495 --> 00:11:04,790 వాడు మానింది ఆర్ట్ క్లాస్ మాత్రమే. పైగా నిన్ను మిస్ అవుతున్నాడు. 223 00:11:05,499 --> 00:11:06,500 నేనూ వాడిని మిస్ అవుతున్నాను. 224 00:11:07,626 --> 00:11:10,003 బాగున్నావా? చూడటానికి బాగున్నావు. 225 00:11:10,087 --> 00:11:12,422 బాగున్నాను. మున్ముందుకి వెళ్తున్నాను. 226 00:11:12,506 --> 00:11:15,133 -ఆ. అలాగే ఉండాలి. -ఉంటాను. 227 00:11:15,634 --> 00:11:16,844 నాన్నా. తనకి ఆ బహుమతి ఇచ్చావా? 228 00:11:16,927 --> 00:11:19,096 -బూమ్! సమయం ముఖ్యం. -బహుమతా? 229 00:11:19,179 --> 00:11:21,014 నాకు బహుమతి తెచ్చారా? ఉత్సాహంతో గంతులు వేస్తున్నావే. 230 00:11:21,098 --> 00:11:22,516 ఏం తెచ్చారేంటి? ఇంకా సాక్స్ తెచ్చారా? 231 00:11:23,976 --> 00:11:25,477 మీ అమ్మ చేసింది ఇదంతా. 232 00:11:25,561 --> 00:11:27,479 ఆ మాట చెప్పకపోతే బాధపడుతుంది. 233 00:11:27,563 --> 00:11:31,441 నీ మెడల్స్ కి ఫ్రేమ్ కట్టించింది కూడా. 234 00:11:33,277 --> 00:11:38,991 ఏదైనా క్లిష్టకాలం వచ్చినప్పుడు, ఇది చూడు. ఇదే నువ్వు. ఒక హీరోవి. 235 00:11:40,784 --> 00:11:41,827 థాంక్స్, నాన్నా. 236 00:11:43,579 --> 00:11:46,623 -నిజానికి, నేనిక వెళ్ళాలి. -ఎందుకు? 237 00:11:46,707 --> 00:11:48,750 -షాన్. -ఆ, వెళ్ళాలి. లవ్ యూ. 238 00:11:49,334 --> 00:11:51,044 సరే. మళ్లీ కలుద్దాం. 239 00:11:51,128 --> 00:11:53,505 -దాహంగా ఉందా? -ఆ. ఫ్రూట్ పంచ్ తాగచ్చా? 240 00:11:53,589 --> 00:11:55,549 -బాగా ఆడావే! -థాంక్యూ. 241 00:11:59,678 --> 00:12:02,681 రోజు బాగా గడవట్లేదు. నాతో కలసి వాక్ కి వస్తావా? 242 00:12:04,808 --> 00:12:06,768 ఇంగ్లీష్ క్లాస్ ఉంది. 243 00:12:08,937 --> 00:12:10,314 అంటే వస్తాననా రాననా? 244 00:12:12,941 --> 00:12:13,817 వస్తానని 245 00:12:14,735 --> 00:12:20,449 హే, నేను క్లాస్ మానేసి వెళ్తున్నా. మిస్టర్ ఆల్టోకి సర్దిచెప్తావా? 246 00:12:20,532 --> 00:12:23,869 దా. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. 247 00:12:26,747 --> 00:12:27,706 టడా. 248 00:12:28,332 --> 00:12:31,335 -ఇంకా బాగుంది, కీత్. -అవును. 249 00:12:33,170 --> 00:12:34,087 కావాలా? 250 00:12:38,634 --> 00:12:39,801 వద్దు. 251 00:12:40,677 --> 00:12:42,971 నేను నీకు ఎలా సహాయపడగలను, రెజ్జీ? ఏంటి విషయం? 252 00:12:43,055 --> 00:12:44,097 కొన్ని వారాల క్రితం, 253 00:12:44,181 --> 00:12:47,601 అప్పుడప్పుడూ ఉదయం పూట విపరీతమైన కంగారు రావటం మొదలయ్యింది. 254 00:12:47,684 --> 00:12:49,686 ఒకోసారి గదిలోంచి బయటకు రావటమే కష్టమవుతోంది. 255 00:12:49,770 --> 00:12:52,940 నీకోసం మనం రాసుకున్న దినచర్య అంతా అనుసరిస్తున్నావా? 256 00:12:53,023 --> 00:12:53,899 వంద శాతం. 257 00:12:53,982 --> 00:12:55,901 నీ జీవితంలో ఇంకేమైనా మార్పులు జరిగాయా? 258 00:12:57,152 --> 00:12:58,278 నువ్వు అంటుంటే గుర్తొస్తోంది… 259 00:12:58,862 --> 00:13:00,948 చిపోత్లేలో కీటో బౌల్ ఉంది అంటే ఏమిటి? 260 00:13:01,031 --> 00:13:06,036 అలా అయితే మరీ మంచిది కదా? సరే. అర్థమయ్యింది, చిపోత్లే. 261 00:13:08,580 --> 00:13:10,374 -హే. -హాయ్. 262 00:13:12,084 --> 00:13:16,380 చిన్నపిల్లల కంప్యూటర్ లాగా దానిమీద ఆ స్టిక్కర్లన్నీ ఏమిటి? 263 00:13:16,463 --> 00:13:19,341 మనం ఇంకెప్పుడూ కంప్యూటర్ మీదున్న స్టిక్కర్ల గురించి మాట్లాడుకోవటానికి వీలు లేదు, సరేనా? 264 00:13:20,050 --> 00:13:23,220 -నేను నీకేం చేయగలను? -ఇప్పుడే ఒక పాత పేషెంట్ ని కలిశాను. 265 00:13:23,303 --> 00:13:27,349 సరైన కారణం లేకుండా తన మందులను మార్చేశాడు తన సైకోఫార్మకాలజిస్ట్. 266 00:13:27,432 --> 00:13:29,393 పూర్తిగా అతని మెదడులోని రసాయనాలను చిందరవందర చేసేశాడు. 267 00:13:29,476 --> 00:13:32,271 -నాకర్థం కాదు ఈ వెధవలంతా… -ఆగు, ఆగాగు. 268 00:13:32,354 --> 00:13:33,272 -ఆగు. -ఏంటి? 269 00:13:33,355 --> 00:13:35,232 ఇలా వచ్చి నాతో నీ పేషెంట్స్ గురించి ఎప్పుడూ మాట్లాడవు. 270 00:13:35,315 --> 00:13:36,608 ఎప్పుడూ వస్తూనే ఉంటాను కదా? 271 00:13:36,692 --> 00:13:37,985 ల్యాప్ టాప్ స్టిక్కర్ల గురించి విమర్శించటానికి 272 00:13:38,068 --> 00:13:39,736 నా ల్యాంప్ కి ఇన్ని బ్యాండ్లు ఎందుకు అని అడగటానికి. 273 00:13:39,820 --> 00:13:42,072 నీ ల్యాంప్ కి అన్ని బ్యాండ్లు ఎందుకున్నాయి? 274 00:13:42,155 --> 00:13:46,952 మెత్తగా తగులుతుంటే నాకు నచ్చు… ఆగు. అది కాదు. 275 00:13:49,413 --> 00:13:50,330 సరే. 276 00:13:50,414 --> 00:13:52,583 నాకు అర్థమయ్యింది ఏం జరుగుతోందో. 277 00:13:52,666 --> 00:13:55,252 -అవునా? -నువ్వు జిమ్మీతోనే మాట్లాడేవాడివి. 278 00:13:55,335 --> 00:13:56,879 ఇప్పుడు తనని దూరంగా తోసేశావు కనుక 279 00:13:56,962 --> 00:13:58,797 నాతో మాట్లాడటానికి వచ్చావు. తనని మిస్ అవుతున్నావు కూడా. 280 00:13:58,881 --> 00:14:00,924 -ఏమీ కాదు. -అవును. 281 00:14:01,008 --> 00:14:03,343 నీ వృత్తిపరమైన అభిప్రాయానికి నేను విలువిస్తాను. 282 00:14:03,427 --> 00:14:07,764 ఆ మాట నీ నోట వినాలని నేను ఎంత తపన పడ్డానో తెలుసా? 283 00:14:07,848 --> 00:14:09,433 కానీ ఇలా కాదు. 284 00:14:09,516 --> 00:14:12,853 నన్ను పలకరించేవాడిలా నీ ఇష్టమొచ్చినట్టు గదిలోకి వస్తే, 285 00:14:12,936 --> 00:14:14,938 నేను వెర్రిమొహంలా ఊరుకుంటాను అనుకున్నావా? 286 00:14:15,522 --> 00:14:17,065 ఏం మాట్లాడుతున్నావు? 287 00:14:17,149 --> 00:14:20,402 నేనేం నీకు ప్రత్యామ్నాయ నేస్తాన్ని కాదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. 288 00:14:21,069 --> 00:14:25,699 ఇంకొక్క క్షణం నీతో ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. 289 00:14:25,782 --> 00:14:27,534 దయచేసి ఇక బయల్దేరు. 290 00:14:34,750 --> 00:14:38,003 చూడు, నాకు నీ బ్యాండ్లు నచ్చుతాయి. కాకపోతే అవి నాకు అర్థం కావు. 291 00:14:40,964 --> 00:14:44,301 ఏది? లేదు, లేదు. వెళ్లిరా. 292 00:14:47,387 --> 00:14:49,640 -జిమ్మీ? -సారీ. ఇది 293 00:14:49,723 --> 00:14:52,476 సరైనది కాదని తెలుసు. కానీ నీతో మాట్లాడాలంటే ఇదొక్కటే దారి. 294 00:14:52,559 --> 00:14:54,478 నేను ఇల్లు చూపించబోతున్నాను. 295 00:14:54,561 --> 00:14:55,812 అవును. నాకే. 296 00:14:55,896 --> 00:14:57,481 కెవిన్ లాక్టేడ్ అంటే నువ్వేనా? 297 00:14:57,564 --> 00:14:59,483 నాకు దొంగపేర్లు సృష్టించటం చేతకాదు. 298 00:15:00,234 --> 00:15:02,528 చూడు, నీకు అబద్ధం చెప్పినందుకు సారీ. 299 00:15:02,611 --> 00:15:04,905 ఇంకేం చేయమంటావు? తను నా భర్త. తనంటే నాకు ప్రేమ. 300 00:15:04,988 --> 00:15:06,907 గ్రేస్, నాకు అర్థమయ్యింది. 301 00:15:06,990 --> 00:15:08,534 నాకు చాలా సిగ్గుగా అనిపించింది. 302 00:15:08,617 --> 00:15:10,869 నేను తనతో ఉంటే నువ్వు నాకు థెరపిస్ట్ గా ఉండలేను అన్నావు. 303 00:15:10,953 --> 00:15:12,329 నేను చెప్పింది నాకు తెలుసు. 304 00:15:12,412 --> 00:15:15,541 సరే, చూడు, నీకు కావాలంటే నేను నీతో ఉండగలను. 305 00:15:15,624 --> 00:15:16,625 ఇంకేం ఎంచను. 306 00:15:18,335 --> 00:15:19,753 దయచేసి ఒప్పుకో. 307 00:15:21,421 --> 00:15:23,757 -నా టైం ఇంకా అలాగే ఉందా? -ఉందిగా? 308 00:15:25,008 --> 00:15:26,051 సారీ. 309 00:15:26,552 --> 00:15:28,846 హలో? ఆ. నేనే. 310 00:15:30,472 --> 00:15:32,474 సరే. తెలియజేసినందుకు థాంక్యూ. 311 00:15:34,309 --> 00:15:36,520 నేను వెళ్ళాలి. మా అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టింది. 312 00:15:37,187 --> 00:15:39,189 కంగారుపడద్దు. నేను ఎప్పుడూ ఎగ్గొడుతూనే ఉండేదాన్ని. 313 00:15:39,273 --> 00:15:41,984 ముఖ్యంగా డానీ వ్యాన్ లో శృంగారం కోసం. ఈ డానీ కాదు. 314 00:15:42,067 --> 00:15:45,112 ఎందుకంటే హైస్కూల్లో ఉన్నప్పుడు ఈ డానీ పరిచయం లేడు. అతను వేరే డానీ. 315 00:15:45,195 --> 00:15:46,697 సరే, నేను వెళ్ళాలి. 316 00:15:50,158 --> 00:15:51,118 ఉంటాను. 317 00:15:51,994 --> 00:15:54,162 మా నాన్న నాకు అర్థం కాడు. 318 00:15:54,663 --> 00:15:58,292 నన్ను కలవాలి అనుకున్నప్పుడు, నన్ను ఇంటికి రమ్మనటానికి ఏంటి అభ్యంతరం? 319 00:15:59,293 --> 00:16:00,794 నాకు అదే బుర్రను తొలిచేస్తోంది. 320 00:16:01,545 --> 00:16:03,714 అవును, నాన్నలు అంతే. 321 00:16:04,923 --> 00:16:07,301 మా కన్నతండ్రికి అసలు నా గురించి ఏమీ తెలియదు. 322 00:16:08,302 --> 00:16:09,303 ఎవరికీ తెలియదు. 323 00:16:10,971 --> 00:16:11,972 నాకు తెలుసు. 324 00:16:17,102 --> 00:16:18,854 హే, అది ఎంత ఎత్తు ఉంటుందంటావు? 325 00:16:19,813 --> 00:16:21,690 మనం అక్కడకి వెళ్ళకూడదు అనుకుంటా. 326 00:16:23,567 --> 00:16:24,568 అవునులే. 327 00:16:46,131 --> 00:16:47,799 హే, జాగ్రత్త. 328 00:16:50,886 --> 00:16:52,971 -అయ్యో. -షాన్! 329 00:16:53,639 --> 00:16:55,557 -నువ్వు రావాలి. -వద్దులే. 330 00:16:56,141 --> 00:16:56,975 నీకే నష్టం. 331 00:17:01,813 --> 00:17:03,690 షాన్, దయచేసి ఇక కిందకి రా! 332 00:17:03,774 --> 00:17:05,567 లేదు. ఇంకా పైకి వెళ్తాను. 333 00:17:05,651 --> 00:17:08,654 ఇదేం బాలేదు! ఇక పైకి వద్దు. 334 00:17:08,737 --> 00:17:11,323 ఊరుకో. చాలా బాగుంది. ఇటు చూడు. 335 00:17:11,906 --> 00:17:12,866 షాన్! 336 00:17:12,950 --> 00:17:15,827 అబ్బా! వావ్! 337 00:17:16,537 --> 00:17:17,371 అయ్యో. 338 00:17:17,454 --> 00:17:19,122 ఇది భలే ఉంది. 339 00:17:21,415 --> 00:17:23,167 సరే. ఇక నేను ఉంటాను. 340 00:17:24,002 --> 00:17:25,546 హాయ్. హలో. 341 00:17:25,628 --> 00:17:28,674 నువ్వు క్లాసులు ఎగ్గొట్టావని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. 342 00:17:28,757 --> 00:17:31,009 కాస్త వివరణ ఇస్తారా అమ్మగారూ? 343 00:17:31,677 --> 00:17:33,762 -అమ్మగారా? -అవును. అంతే. 344 00:17:33,846 --> 00:17:38,225 ఇలా మాట్లాడాల్సివస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా. అమ్మగారూ. 345 00:17:38,308 --> 00:17:40,602 నేను మానేసింది ఇంగ్లీష్ మాత్రమే. పైగా 98 ఏవరేజ్ ఉంది నాకు. 346 00:17:40,686 --> 00:17:43,230 నాకు బాధగా అనిపించింది అని రేపు ఆయనకి చెప్తాను, నన్ను శిక్షించడు కూడా. 347 00:17:43,313 --> 00:17:45,023 నువ్వు కూడా శిక్షించకూడదు. ఎందుకంటే నెల క్రితమే, 348 00:17:45,107 --> 00:17:47,109 అమ్మమ్మ ఫోటో మీద పడ్డ నీ కొకేన్ ని నేనే శుభ్రం చేశాను. 349 00:17:47,192 --> 00:17:48,527 కనుక, ఇక వదిలేద్దామా? 350 00:17:51,029 --> 00:17:52,197 అలాగే. 351 00:17:54,157 --> 00:17:59,371 -ఎక్కడకి వెళ్ళావు? -షాన్ కి తన తండ్రిని కలసివచ్చాక మనసు బాలేదు. 352 00:17:59,454 --> 00:18:01,290 కనుక, కలసి వాక్ చేయటానికి వెళ్ళాము. 353 00:18:01,373 --> 00:18:05,127 వాక్ మాత్రమేనా? ఊరికే అలా నడుచుకుంటూ వెళ్ళారా? 354 00:18:05,210 --> 00:18:07,546 నేను చేస్తున్నది నాకు తెలుసు. చండాలంగా ఉంది. ఇక ఆపేస్తాను. 355 00:18:09,256 --> 00:18:12,259 సరదా నాన్న. నాతో మాట్లాడు. 356 00:18:12,885 --> 00:18:15,512 షాన్ విషయంలో నాకు చింతగా ఉంది. ఈరోజు భయమేసింది. 357 00:18:17,806 --> 00:18:20,058 నాకు హైకింగ్ నచ్చట్లేదు 358 00:18:20,142 --> 00:18:22,186 రాళ్ళను సేకరించటానికి ఎవ్వరూ ఆగకపోతే. 359 00:18:22,269 --> 00:18:23,520 దేవుడా. 360 00:18:23,604 --> 00:18:28,775 లిజ్, ఆఖరిసారి చెప్తున్నా. మనం రాళ్ళకోసం రాలేదు. సరేనా? 361 00:18:29,776 --> 00:18:31,570 -తనకి రాళ్ళంటే ఇష్టం. -ఏ విధంగా? 362 00:18:31,653 --> 00:18:34,531 అది వదిలేయ్. ఉంగరం కొన్నావా? 363 00:18:35,240 --> 00:18:36,241 తను నాకు మొత్తం చెప్పింది. 364 00:18:36,325 --> 00:18:39,286 -నాకు తెలుసుకోవాలనుంది. -లిజ్ ఎందుకు వచ్చింది? 365 00:18:39,369 --> 00:18:41,330 -మాట మార్చాలని చూడకు. -ఏంటి? 366 00:18:42,331 --> 00:18:44,416 -ఉంగరం కొన్నావా? -కొన్నాను. కొన్నాను. 367 00:18:44,499 --> 00:18:45,876 గ్యాబ్, ఆ మాట ఎలా ఉందో తెలుసా? 368 00:18:45,959 --> 00:18:47,836 -లేదు, ఎలా? -ఆలీస్ కి నువ్వు తెచ్చిన బాస్కెట్ బాల్ లా. 369 00:18:47,920 --> 00:18:50,005 -నేను చప్పట్లు కొట్టచ్చా? -దయచేసి నన్ను కూడా కొట్టనివ్వు. 370 00:18:50,088 --> 00:18:52,257 -ఏంటి? వద్దు… -ఉంగరం చూపించు! 371 00:18:52,341 --> 00:18:53,675 స్నేహితులుగా మీరంటే నాకిష్టం లేదు. 372 00:18:53,759 --> 00:18:56,803 విసిగిస్తున్నారు. కానీ దానివల్ల మంచి ప్రభావం ఉంది. 373 00:18:56,887 --> 00:19:00,641 చూడు, నేనేం చెప్తున్నానంటే, నీకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం కలగకపోతే, బహుశా 374 00:19:00,724 --> 00:19:02,684 -చార్లీ నీకు సరైన తోడు కాదేమో. -ఒప్పుకుంటున్నాను. 375 00:19:02,768 --> 00:19:05,687 చార్లీ నాకు సరైన తోడని మీకు తెలుసు కదా? 376 00:19:05,771 --> 00:19:08,232 సరే, ఆ లెక్కన ఇది ప్రమాదం ఎరిగిన పలాయనవాదమేమో. 377 00:19:08,815 --> 00:19:10,526 -ఓహో, అలాగా? -బహుశా. అంతే. 378 00:19:10,609 --> 00:19:14,738 సరే, ఇంక ఆపు. పెళ్లి గురించి నేను సలహా తీసుకోవటానికి 379 00:19:14,821 --> 00:19:16,740 కొత్తగా… అదే. 380 00:19:16,823 --> 00:19:19,326 నా విడాకుల విషయంలో చిన్నబుచ్చుతున్నావా? 381 00:19:20,452 --> 00:19:21,411 అంత ధైర్యం కూడా చేయకు. 382 00:19:21,495 --> 00:19:23,080 -ధైర్యం చేశాడు. -నేను వెళ్ళాలి. 383 00:19:23,163 --> 00:19:25,582 -అవును. -సారీ, గ్యాబీ. సారీ. 384 00:19:26,208 --> 00:19:27,584 నా వెనుక రావద్దు. 385 00:19:29,837 --> 00:19:31,672 నీకు మనసు బాగుపడాలంటే ఏం కావాలో నాకు తెలుసు. 386 00:19:32,297 --> 00:19:34,383 ఆఖరిసారి, నేను రాళ్ళు ఏరబోవట్లేదు. 387 00:19:34,466 --> 00:19:35,467 అబ్బా, చాల్లే! 388 00:19:42,474 --> 00:19:46,520 ఏమోయ్. హాట్ టబ్ లో స్నానం చేస్తే, హుషారు రావాలి. 389 00:19:47,104 --> 00:19:48,814 నేను హుషారుగా లేనని ఎందుకు అనిపిస్తోంది? 390 00:19:48,897 --> 00:19:50,941 ఆ ప్రశ్న. నువ్వు అడిగిన ఆ విధానం. 391 00:19:51,024 --> 00:19:53,151 ఆ పదాలు పేర్చిన విధానం. 392 00:19:53,652 --> 00:19:56,738 -అవన్నీ చెప్పకనే చెప్తున్నాయి. -బానే ఉన్నాను. 393 00:19:58,782 --> 00:20:00,409 ఈమధ్య నీళ్ళ ట్యాంకులు పట్టుకొని వేలాడావా ఎక్కడైనా? 394 00:20:00,993 --> 00:20:01,952 ఆలీస్ చెప్పేసిందా? 395 00:20:02,035 --> 00:20:04,830 లేదు, లేదు. ట్విట్టర్ లో ఆ నీళ్ళ ట్యాంక్ ని ఫాలో అవుతున్నాను. 396 00:20:04,913 --> 00:20:06,331 కొన్నాళ్ళుగా విశేషాలు లేవు. 397 00:20:06,415 --> 00:20:08,876 కనుక ఈ కబురు వినగానే ఉత్సాహం కలిగింది. 398 00:20:10,210 --> 00:20:11,670 దాని గురించి ఏమైనా మాట్లాడతావా? 399 00:20:11,753 --> 00:20:13,797 నన్ను తొందరపెట్టనని చెప్పావు కదా? 400 00:20:14,298 --> 00:20:17,384 అయినా మా నాన్నని కలవమని బలవంతం చేశావు. అది చండాలంగా గడిచింది. 401 00:20:17,467 --> 00:20:19,428 అవునా? ఏం? ఏమయ్యింది? 402 00:20:19,511 --> 00:20:21,096 అదిగో, మళ్లీ తొందరపెడుతున్నావు. 403 00:20:21,180 --> 00:20:24,266 కానీ నువ్వు ఏమైనా ప్రమాదకరమైన పనులు చేస్తే, నేను నీ డాక్టర్ ని. 404 00:20:24,349 --> 00:20:25,976 నేను నీ బాగోగులు చూసుకోవాలి. 405 00:20:26,059 --> 00:20:27,769 అయితే ఇకపై నా డాక్టర్ గా ఉండద్దు. 406 00:20:27,853 --> 00:20:29,271 నన్ను వద్దంటున్నావా, షాన్? ఏంటి? 407 00:20:29,354 --> 00:20:31,690 వంటింట్లో ఎదురైనప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది? 408 00:20:31,773 --> 00:20:35,027 అవును. నేను ఇక్కడ ఉండటం కూడా సరైనది కాదు. 409 00:20:35,944 --> 00:20:39,323 షాన్, ఈమధ్య సరైన దారిలో నడుస్తున్నాం అనిపిస్తోంది. 410 00:20:39,907 --> 00:20:43,827 నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు సంతోషం. కానీ ఉదయమే వెళ్లిపోతాను. 411 00:20:43,911 --> 00:20:45,287 ఏమిటోయ్? ఏంటి నువ్వు చేస్తున్నది? 412 00:20:45,370 --> 00:20:49,124 లేదు, నువ్వు అన్నదే. మున్ముందుకి వెళ్తున్నాను. 413 00:20:54,630 --> 00:20:55,964 తను ఏదో బాధలో ఉన్నాడని తెలుసు. 414 00:20:56,048 --> 00:20:59,051 కానీ నాతో మాట్లాడట్లేదు. అదే చిరాకుగా ఉంది. 415 00:21:00,052 --> 00:21:02,513 -కూర్చుంటావా? -నేను కోపంగా ఉన్నాను. 416 00:21:02,596 --> 00:21:04,640 కూర్చొని కూడా కోప్పడచ్చు. 417 00:21:06,183 --> 00:21:09,186 నేను ఎప్పుడూ కోపంగానే ఉంటాను, ఎప్పుడూ కూర్చొనే ఉంటాను. 418 00:21:11,021 --> 00:21:13,524 నాన్న సాయం చేయాలని చూశారు. ఇప్పుడు అంతా నాశనమయ్యింది. 419 00:21:13,607 --> 00:21:16,610 ఇప్పుడిక షాన్ వెళ్లిపోతున్నాడు. ఇది దారుణం. 420 00:21:16,693 --> 00:21:18,695 అయితే నీ కోపం మీ నాన్నమీదా? 421 00:21:18,779 --> 00:21:20,781 కాదు. కాదు, మీ మీద. 422 00:21:22,115 --> 00:21:23,200 ఇది విచిత్రం. 423 00:21:23,283 --> 00:21:26,620 మిమ్మల్ని సాయం అడగమన్నాను. మీరు మాట్లాడట్లేదని చెప్పారు. 424 00:21:26,703 --> 00:21:28,413 ఏమిటోయ్ ఇది? 425 00:21:28,497 --> 00:21:30,499 షాన్ మీ ఇంట్లో ఉండటం సరైనది కాదని నా అభిప్రాయం. 426 00:21:30,582 --> 00:21:31,583 ఎవరికి లెక్క? 427 00:21:34,795 --> 00:21:38,298 మొత్తానికి నాన్న గురించి చింతపడకుండా ముందుకి సాగటానికి సిద్ధపడ్డాను. 428 00:21:38,382 --> 00:21:40,509 కానీ అలా అనిపించటానికి కారణం మా నాన్న పక్కన మీరు ఉండటం. 429 00:21:42,052 --> 00:21:44,555 మీకంత మొండితనం ఎందుకు? 430 00:21:44,638 --> 00:21:47,641 చూశావా? కూర్చొని కోప్పడచ్చు. 431 00:21:51,603 --> 00:21:53,105 ఆ టోపీ చండాలంగా ఉంది. 432 00:21:55,607 --> 00:21:58,861 ఇప్పుడిక నన్ను బాధపెట్టటానికి అబద్ధం చెప్తున్నావు. 433 00:22:02,531 --> 00:22:07,369 అలాగే. నా మనస్తత్వాన్ని అంచనా వేయాలని అంత తాపత్రయంగా ఉంటే, అలాగే కానివ్వు. 434 00:22:07,452 --> 00:22:09,913 అలాంటి భావనతో ఇక్కడకి రావద్దు. 435 00:22:09,997 --> 00:22:13,166 సరే, నేను వ్యక్తిగత హద్దులు దాటి ఉండచ్చు. 436 00:22:13,250 --> 00:22:15,544 -లేదు. -నాకిష్టమైనవాళ్ళతో అలాగే చేస్తుంటాను. 437 00:22:16,128 --> 00:22:17,588 నేనూ మార్చుకోవాలని చూస్తున్నాను. 438 00:22:18,422 --> 00:22:21,258 కనుక, మనం మాట్లాడుకోవక్కరలేదు. కాఫీ తెచ్చినందుకు థాంక్స్. 439 00:22:29,349 --> 00:22:31,560 టెక్సస్ లోనే స్పష్టమైన గే వ్యక్తిని నేను. 440 00:22:32,436 --> 00:22:34,980 అవును, అవును. అది నిజం. 441 00:22:35,063 --> 00:22:36,690 అవును, అవును. 442 00:22:41,153 --> 00:22:45,115 -ఎక్కడకి వెళ్తున్నావు? -తెలియదు. 443 00:22:45,199 --> 00:22:46,825 కంగారు ఏం లేదు. నువ్వు కావాలంటే… 444 00:22:46,909 --> 00:22:48,660 నీకు చోటు దొరికేవరకు ఇక్కడే ఉండచ్చు. 445 00:22:49,536 --> 00:22:51,496 -ఇక మాట్లాడేది లేదు. -సరే. 446 00:22:54,124 --> 00:22:56,502 -బాగున్నాయి. ఏమిటివి? -ఇప్పుడు ఏం చెప్పాను? 447 00:22:56,585 --> 00:22:58,295 అడగటం కూడా మాట్లాడటం కిందకే వస్తుందని అనుకోలేదు. 448 00:22:58,378 --> 00:22:59,880 మాట్లాడటం మాట్లాడటం కిందకే వస్తుంది. 449 00:23:01,423 --> 00:23:04,134 జిమ్మీ. అడగకుండానే లోపలకి వచ్చేశాను. 450 00:23:05,594 --> 00:23:08,388 -హే. -నీ ఫ్రిజ్ లోంచి ఇవి తీసుకున్నాను. 451 00:23:09,348 --> 00:23:11,391 -షాన్, బీర్ తాగుతావా? -తాగుతాను. 452 00:23:11,934 --> 00:23:14,478 కాలేజ్ లో ఉన్నప్పుడు గే వ్యక్తిని అని చెప్పుకోవటానికి భయపడ్డాను. 453 00:23:14,561 --> 00:23:16,313 అమ్మో, ఇప్పుడు కాలేజ్ లో అందరూ గే వ్యక్తులే. 454 00:23:16,396 --> 00:23:19,399 -అవును. వినటానికే సరదాగా ఉంది. -అవును. 455 00:23:20,275 --> 00:23:23,028 చదువు అయ్యేవరకు నా తల్లిదండ్రులకు కూడా వెల్లడించలేదు. 456 00:23:23,111 --> 00:23:26,573 అంటున్నానని తప్పుగా అనుకోకు కానీ, వాళ్ళకి అసలు తెలియకుండా ఎలా ఉంది? 457 00:23:27,449 --> 00:23:29,618 ఎందుకంటే అప్పట్లో బేస్ బాల్ టోపీ పెట్టుకొనేవాడిని, ఇలా మాట్లాడేవాడిని. 458 00:23:29,701 --> 00:23:31,036 ఓ, అబ్బో. 459 00:23:31,119 --> 00:23:32,996 -అవును. -మామూలు బ్రయాన్ మాటతీరు చాలా బాగుందే. 460 00:23:33,080 --> 00:23:34,831 -అవునా? -అవును, నాకు చాలా నచ్చింది. 461 00:23:36,166 --> 00:23:40,128 ఏమైతేనేం? నా తల్లిదండ్రులకు భక్తి, సంప్రదాయాలు ఎక్కువ. 462 00:23:40,212 --> 00:23:43,257 అందుకే, అర్థంచేసుకోవటానికి వాళ్ళకి సమయం పడుతుందని నాకు తెలుసు. 463 00:23:43,340 --> 00:23:48,136 కానీ… ఇంకా వేచి ఉండాల్సివస్తానని నేను అనుకోలేదు. 464 00:23:49,638 --> 00:23:53,600 మరి అలాంటప్పుడు మా అందరికీ ఒళ్ళు మండేలా 465 00:23:53,684 --> 00:23:57,396 నువ్వెలా అంటుంటావు, "అంతా నాకు తగ్గట్టే జరుగుతుంది" అని? 466 00:23:57,479 --> 00:23:59,231 చాలా తేలిక. అంతా నాకు తగ్గట్టే జరుగుతుంది కనుక. 467 00:23:59,982 --> 00:24:01,316 ఎందుకంటే… 468 00:24:03,318 --> 00:24:07,531 అప్పటినుంచి ఏ ప్రమాదమూ కొనితెచ్చుకోలేదు. 469 00:24:08,365 --> 00:24:10,659 కనుక నా మనసు నొచ్చుకొనే అవకాశం ఉండదు. 470 00:24:11,785 --> 00:24:13,078 -ఇదేదో బాగుందే. -అది… 471 00:24:13,161 --> 00:24:16,331 అది… అదే ప్రమాదం ఎరిగిన పలాయనవాదమా? 472 00:24:16,415 --> 00:24:17,583 నువ్వు అన్నావు కదా? 473 00:24:17,666 --> 00:24:19,960 చెప్పాను కదా? అది నిజంగా పుస్తకాల్లో చెప్పబడింది. 474 00:24:20,752 --> 00:24:23,839 నాకు చార్లీ అంటే చాలా ఇష్టం, కానీ తను కాదనచ్చు కూడా. 475 00:24:24,339 --> 00:24:25,465 -కాదన్నాడంటే పిచ్చివాడే… -అవును. 476 00:24:25,549 --> 00:24:26,466 …కానీ కాదనే అవకాశం ఉంది. 477 00:24:27,092 --> 00:24:30,429 లేకపోతే సరేనని అనచ్చు, కానీ మా మధ్య పొసగకపోవచ్చు. 478 00:24:30,512 --> 00:24:32,472 అంటే, ఉదాహరణకి నిన్నే చూడు. సారీ. 479 00:24:32,556 --> 00:24:36,518 పర్వాలేదు. నా వైవాహిక జీవితం ఒక దారుణమైన వైఫల్యం. 480 00:24:37,186 --> 00:24:40,022 కానీ నిజం చెప్పాలంటే, మళ్లీ పెళ్లి చేసుకోవాల్సివస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు. 481 00:24:41,231 --> 00:24:42,482 -నిజంగానా? -అవును. 482 00:24:42,566 --> 00:24:44,902 -ప్రయత్నం చేయదగినదే. -సరే. 483 00:24:44,985 --> 00:24:47,404 -సరే. -థాంక్యూ. 484 00:24:49,698 --> 00:24:50,949 నాకు తెలియాలి. 485 00:24:52,367 --> 00:24:53,911 బ్రయాన్ మామూలుగా ఉన్నప్పుడు శృంగారం ఎలా ఉండేది? 486 00:24:56,038 --> 00:24:57,581 30 నిముషాలు నేను అవతలివారిని సంతోషపరచటం. 487 00:24:57,664 --> 00:24:59,917 నా వంతు వచ్చేసరికి ఏదో ఒక సాకుతో పారిపోవటం. 488 00:25:00,751 --> 00:25:02,377 సరిగ్గా అదే కావాలి. నన్ను చేసుకోరాదూ? 489 00:25:15,224 --> 00:25:16,934 నేను ఎంతోమంది మాజీ సైనికులతో పనిచేశాను నాన్నా. 490 00:25:17,017 --> 00:25:20,771 ఇవేమీ ఊరికే చేతిలో పెట్టేవి కాదు. ఇవి సాధించేంతగా ఏమి చేశావు నువ్వు? 491 00:25:23,232 --> 00:25:24,233 జవాబు చెప్పడు. 492 00:25:26,401 --> 00:25:28,529 నువ్విప్పుడు జవాబు చెప్తే తనకి ఒళ్ళు మండుతుంది. 493 00:25:30,072 --> 00:25:31,907 ఏదో ప్రమాదం జరిగినప్పుడు, కొందరు స్నేహితులను కాపాడాను. 494 00:25:31,990 --> 00:25:33,242 ఏమిటోయ్. 495 00:25:35,452 --> 00:25:39,456 అవి మా నాన్న నాకు తెచ్చి ఇచ్చారు. నాకవి వద్దు కూడా. 496 00:25:39,540 --> 00:25:42,668 ఎందుకు వద్దు? ఇవి పొందే అర్హత నీకు లేదనుకుంటున్నావా? 497 00:25:48,298 --> 00:25:49,925 నాకు పార్కిన్సన్స్ ఉందని జిమ్మీ చెప్పాడా? 498 00:25:50,008 --> 00:25:53,053 -చెప్పలేదు. అది దురదృష్టకరం. -అవును, నాకూ నచ్చదు. 499 00:25:54,471 --> 00:25:58,475 అయితే నీకు దాని గురించి తెలుసు. ఈ వెధవకి కూడా తెలుసు. 500 00:25:58,559 --> 00:26:00,727 కానీ నా కూతురికి చెప్పలేకపోతున్నాను. 501 00:26:01,311 --> 00:26:03,730 -ఎందుకలా? -నాకు భయం. 502 00:26:04,398 --> 00:26:08,151 ఇంతవరకు నాపట్ల తనకున్న భావన మారిపోతుందేమో అని భయం. 503 00:26:08,235 --> 00:26:10,445 కనుక, ఇక తనకి నేను తండ్రిగా కాక, 504 00:26:11,196 --> 00:26:14,157 జాగ్రత్తగా చూసుకోవలసిన ఒక రోగిష్టి ముసలివాడిగా తన దృష్టిలో మిగులుతాను. 505 00:26:14,950 --> 00:26:18,328 ఇదంతా సోది అని నాకు తెలుసు. అయినా ఏం చేయలేకపోతున్నాను. 506 00:26:22,499 --> 00:26:24,835 నేనేదో అక్కడ వీరోచిత చర్య చేశానని అంతా అనుకుంటూ ఉంటారు. 507 00:26:27,504 --> 00:26:28,922 కానీ నేను చాలా భిన్నమైన వ్యక్తిని. 508 00:26:29,506 --> 00:26:32,676 తలుపులు బద్దలుగొట్టటం, జనాన్ని వీధుల్లోకి లాగి పడేయటం, 509 00:26:32,759 --> 00:26:34,720 పిల్లలకి తుపాకీ గురిపెట్టటం. 510 00:26:34,803 --> 00:26:38,182 ఎందుకు? ఏ కారణమూ లేదు. అలా ఎవరైనా చేస్తారా? 511 00:26:38,265 --> 00:26:42,269 భయంతో ఉన్న 21 ఏళ్ళ కుర్రాడు చేస్తాడు. 512 00:26:42,895 --> 00:26:45,355 నువ్వు మంచి మనిషివి. జనానికి నువ్వంటే ఇష్టం. 513 00:26:46,440 --> 00:26:50,485 అక్కడ జరిగినదానితో సంబంధం లేకుండా నిన్ను ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. 514 00:26:52,654 --> 00:26:55,282 దానిగురించి ఆలోచించినప్పుడల్లా నామీద నాకే అసహ్యం వేస్తుంది. 515 00:26:57,034 --> 00:27:00,495 -మరి నేనేం చేయాలి? -పనిచేయాలి. 516 00:27:01,538 --> 00:27:06,001 భావస్థితి యొక్క జడత్వాన్ని అధిగమించాలి. 517 00:27:06,084 --> 00:27:07,669 ఇతను నీ పక్కన ఉండటం నీ అదృష్టం. 518 00:27:08,462 --> 00:27:11,840 థాంక్యూ. చాలా ధన్యవాదాలు, పాల్. నువ్వు ఆ మాట అనటం చాలా సంతోషకరం. 519 00:27:11,924 --> 00:27:13,926 ఒకోసారి మధ్యలో జోక్యం చేసుకొని అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు. 520 00:27:14,009 --> 00:27:15,093 సారీ. 521 00:27:16,845 --> 00:27:18,013 షాన్… 522 00:27:20,349 --> 00:27:22,851 నీకు చెప్పేది ఏమిటంటే, నేను చేయగలిగింది ఏమైనా ఉంటే, నేను… 523 00:27:24,144 --> 00:27:25,312 నేను నీకోసం ఉంటాను. 524 00:27:33,487 --> 00:27:36,406 ఏమోయ్, ఇలాంటి విషయాల్లో నీకంటే అతను చాలా మెరుగు. 525 00:27:36,990 --> 00:27:38,242 అవును. నిజమే. 526 00:27:45,832 --> 00:27:48,418 ఏంటి? ఉన్నట్టుండి టోపీల విషయంలో నిపుణురాలివి అయిపోయావా? 527 00:27:52,506 --> 00:27:56,093 హే, మెగ్. వచ్చిందా? సంతోషం. 528 00:27:56,593 --> 00:27:58,887 అంతా ఒకేదానిమీద ఖర్చుపెట్టద్దని చెప్పు. 529 00:28:00,973 --> 00:28:02,182 నేను కాల్ చేసింది అందుకు కాదు. 530 00:28:03,183 --> 00:28:06,270 ఇప్పుడు మాట్లాడటానికి సరైన సమయమేనా? 531 00:28:07,896 --> 00:28:08,897 మంచిది. 532 00:28:11,149 --> 00:28:12,067 బంగారం… 533 00:28:14,862 --> 00:28:17,030 నీకు చెప్పాల్సిన విషయం ఒకటుంది. 534 00:29:00,574 --> 00:29:02,576 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్