1 00:00:13,096 --> 00:00:16,517 ఈ బేబీ చాలా క్యూట్ గా ఉంది, బ్రయాన్. సట్టన్ అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? 2 00:00:16,600 --> 00:00:17,893 అతనొక గొప్ప బ్రాడ్వే నటుడు. 3 00:00:17,976 --> 00:00:19,686 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకెప్పటికీ అర్థం కాదు, 4 00:00:19,770 --> 00:00:22,814 - కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, కాబట్టి నేనూ హ్యాపీనే. - నేను అంత సంతోషంగా లేను. 5 00:00:22,898 --> 00:00:24,733 సరే, ఎవరూ అతని వైపు చూడకండి. 6 00:00:24,816 --> 00:00:26,693 - ఎందుకు అని మనల్ని అడిగేలా చేస్తున్నాడు. - అవును. 7 00:00:29,112 --> 00:00:31,782 ఎందుకు? ఎందుకంటే చార్లీ మూడు నెలల పాటు దూరంగా వెళ్తున్నాడు, 8 00:00:31,865 --> 00:00:33,283 కాబట్టి నేను సింగిల్ గా ఈ బిడ్డని చూసుకోవాలి. 9 00:00:33,367 --> 00:00:34,785 నన్ను హీరో అని మీరు పిలవనక్కర్లేదు. 10 00:00:34,868 --> 00:00:36,078 ఎవరూ పిలవడం లేదులే. 11 00:00:36,662 --> 00:00:38,205 ఈ పాపాయి ముఖం చూడు. 12 00:00:38,288 --> 00:00:39,289 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 13 00:00:39,373 --> 00:00:43,418 నువ్వు స్కూలుకి వెళ్లనక్కర్లేదు ఇంకా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోనక్కర్లేదు. ఏమీ చేయాల్సిన పని లేదు. 14 00:00:43,502 --> 00:00:45,629 జిమ్మీ పసికందుగా ఉన్నప్పటి కంటే ఈ పాపాయి చాలా చిన్నగా ఉంది. 15 00:00:45,712 --> 00:00:49,633 వాడికి పదేళ్లు వచ్చేవరకూ తల చాలా పెద్దగా ఉండేది, వాడు హఠాత్తుగా తల తిప్పాడంటే 16 00:00:49,716 --> 00:00:51,009 ఆ డైరెక్షన్ లో కింద పడిపోయేవాడు. 17 00:00:51,677 --> 00:00:52,886 ఎవరైనా మీ చిన్నప్పటి సంగతులు పంచుకోండి. 18 00:00:53,470 --> 00:00:55,055 ఈ వయసులో ముచ్చట్లని వీలైనంతగా ఎంజాయ్ చేయి, బ్రయాన్. 19 00:00:55,138 --> 00:00:56,139 పిల్లలు త్వరగా ఎదిగిపోతారు. 20 00:00:56,223 --> 00:00:59,017 ఈ పిల్ల రేపు గ్రాడ్యుయేట్ అయిపోతుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 21 00:01:00,978 --> 00:01:03,313 తను గ్రాడ్యుయేషన్ డేకి వస్తాడని ఇంకా నమ్మిస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను. 22 00:01:03,397 --> 00:01:05,649 చూడు, మా నాన్న కూడా అలాంటి వాడే. 23 00:01:05,732 --> 00:01:07,943 ప్రేమ ఉండేది కాదు కానీ అందరినీ ఆకట్టుకునేవాడు. 24 00:01:08,569 --> 00:01:11,029 కాబట్టి, ఆయన పైకి అంత క్రూరంగా ఏమీ ఉండేవారు కాదు, 25 00:01:11,113 --> 00:01:13,240 కానీ మనల్ని ఎప్పుడూ దేనికీ పనికిరాని వాళ్లలా ఫీల్ అయ్యేలా చేసేవారు. 26 00:01:13,907 --> 00:01:14,992 నీ బాధని నేను అర్థం చేసుకోగలను. 27 00:01:16,285 --> 00:01:17,286 నాకు తెలుసు. 28 00:01:17,995 --> 00:01:20,581 - కానీ నువ్వు నన్ను నొక్కేస్తున్నావు. - అవును. 29 00:01:20,664 --> 00:01:22,416 దీన్ని సోఫీ కోసం దాచుకోవచ్చు కదా? 30 00:01:24,376 --> 00:01:25,586 మేము ఇప్పుడు విడిపోయాము. 31 00:01:26,461 --> 00:01:27,462 అయ్యో, లేదు. 32 00:01:29,089 --> 00:01:30,090 ఇంక నన్ను వదులుతావా? 33 00:01:32,050 --> 00:01:33,594 - అప్పుడే కాదు. - సరే. 34 00:01:35,179 --> 00:01:37,514 సరే. అయితే, ముందుగా ఎవరు మొదలుపెడతారు? 35 00:01:38,098 --> 00:01:39,766 నేను మొదలుపెడతాను. షాన్ ఒక చెత్తవెధవ. 36 00:01:40,434 --> 00:01:41,894 అతను ఇక్కడ ఉండటం 37 00:01:41,977 --> 00:01:44,646 ఇంకో మంచి సపోర్ట్ గ్రూప్ ని ఇంటర్వ్యూ చేయకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. 38 00:01:45,272 --> 00:01:48,525 ఒక రెస్టారెంట్ లో నేను ఉద్యోగంలో చేరాను, కాబట్టి నేను ఆ ట్రక్ ని మూసేయాల్సి వచ్చింది. 39 00:01:48,609 --> 00:01:50,861 ఇంకా నాతో పని లేదన్నట్లుగా వదిలేశావు. 40 00:01:50,944 --> 00:01:52,196 అయ్యో పాపం. 41 00:01:52,279 --> 00:01:54,615 సరే. టేక్ ఇట్ ఈజీ, సరేనా? ఇది 'జెర్రీ స్ప్రింగర్ షో' కాదని గుర్తుంచుకో. 42 00:01:55,449 --> 00:01:57,159 - అదేంటి? - ఓహ్, దేవుడా. 43 00:01:57,242 --> 00:01:58,243 వావ్, నేను మీకంటే పెద్దదాన్ని అన్న విషయం మర్చిపోయాను. 44 00:01:58,327 --> 00:02:02,247 అది ప్రధానంగా ఏమిటంటే, మానసిక రోగుల ఊరేగింపు లాంటిది 45 00:02:02,331 --> 00:02:04,416 స్కూలులో ఉండగా హోమ్ సిక్ అయ్యే వాళ్లు ఆ షోని చూస్తుంటారు. 46 00:02:04,499 --> 00:02:06,460 అది వికృతంగా ఇంకా హింసాత్మకంగా ఉంటుంది. 47 00:02:06,543 --> 00:02:07,920 నేను ఆ షోని చాలా మిస్ అవుతుంటాను. 48 00:02:08,002 --> 00:02:09,253 ఇప్పుడు, హోర్హే… 49 00:02:09,338 --> 00:02:13,759 షాన్ పంక్ మాదిరిగా ప్రవర్తించడం నీకు కోపం కలిగిస్తోందని నాకు అర్థమైంది. 50 00:02:14,551 --> 00:02:17,095 కానీ నీ ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? 51 00:02:17,179 --> 00:02:18,430 దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. 52 00:02:18,514 --> 00:02:21,642 సరే. చూడండి, మన సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఇది కాదు. 53 00:02:21,725 --> 00:02:22,726 కానివ్వు, బాబు. 54 00:02:23,644 --> 00:02:24,645 నాతో మాట్లాడు చాలు. 55 00:02:25,187 --> 00:02:27,773 - నిన్ను వదల్ను. - హోర్హే, ఇలా గొడవ చేయకు. 56 00:02:30,567 --> 00:02:31,568 బమ్! 57 00:02:41,245 --> 00:02:42,746 ఎప్పుడూ పళ్లే విరుగుతాయి ఎందుకు? 58 00:02:42,829 --> 00:02:44,164 నాకేం నొప్పిగా లేదు. 59 00:02:45,290 --> 00:02:46,542 ఇది నకిలీ పన్ను అనుకుంటా. 60 00:02:46,625 --> 00:02:48,418 మీరు ఆ 'లయబిలిటీ ఫామ్స్' మీద సంతకాలు చేశారు కదా? 61 00:02:50,420 --> 00:02:54,216 ఎదిగిన మన పిల్లలంతా ఒకే ఇంట్లో ఉన్నారు. 62 00:02:54,299 --> 00:02:56,718 నేను కృతజ్ఞతాభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. 63 00:02:56,802 --> 00:02:58,011 హా, మనం సంపన్నులం 64 00:02:59,054 --> 00:03:02,140 ప్రేమ ఇంకా కుటుంబం మన బలం. 65 00:03:02,224 --> 00:03:03,642 డెరెక్ అంత ఎమోషనల్ ఎందుకు అయ్యాడు? 66 00:03:03,725 --> 00:03:06,645 సర్జరీ అయినప్పటి నుంచి తను అలాగే ప్రవర్తిస్తున్నాడు. 67 00:03:06,728 --> 00:03:08,522 - సరే. - నేను ఏం చెప్పగలను? సరే. 68 00:03:08,605 --> 00:03:10,148 జీవితం చాలా చిన్నది. 69 00:03:10,232 --> 00:03:12,568 నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. మనమంతా అదే చేయాలి. 70 00:03:12,651 --> 00:03:14,570 మాథ్యూ, నువ్వు ఏం ఆస్వాదిస్తున్నావు? 71 00:03:14,653 --> 00:03:17,698 వాస్తవానికి, నా షూస్ వ్యాపారం చాలా బాగా జరుగుతోంది. 72 00:03:17,781 --> 00:03:19,616 నేను సొంతంగా వేరే ఇల్లు తీసుకునేంత డబ్బు ఆదా చేశాను 73 00:03:19,700 --> 00:03:22,160 నా ఫ్రెండ్స్ ఫిన్ ఇంకా లియో నాతో పాటు ఉంటారు. 74 00:03:22,244 --> 00:03:23,370 ఇంకా జాక్ కూడా. 75 00:03:23,453 --> 00:03:24,788 ఇంకో నలుగురు ఫ్రెండ్స్ కూడా. 76 00:03:24,872 --> 00:03:26,248 ఆ ఇంట్లో ఎన్ని బెడ్ రూమ్స్ ఉన్నాయేంటి? 77 00:03:26,331 --> 00:03:29,042 - రెండు. - ఇక ఆ చేతి పనులకు స్వస్తి చెప్పు, బ్రో. 78 00:03:29,126 --> 00:03:30,836 హా, దానికి మేము ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. 79 00:03:30,919 --> 00:03:33,130 ఆ చేతి పనుల కోసం ఒక క్యాలెండరా? బాగుంది. 80 00:03:33,213 --> 00:03:34,214 అది మంచి కమ్యూనికేషన్. 81 00:03:34,298 --> 00:03:37,342 చూడండి, సమాజాలు ఇలాగే నిర్మాణం అవుతాయి. 82 00:03:37,426 --> 00:03:38,552 - ఆలీస్. - హాయ్. 83 00:03:38,635 --> 00:03:40,512 నువ్వు త్వరలోనే ఒక పెద్ద సందర్భాన్ని ఆస్వాదించబోతున్నావు. 84 00:03:40,596 --> 00:03:42,681 గ్రాడ్యుయేషన్. నీకెలా అనిపిస్తోంది? 85 00:03:42,764 --> 00:03:43,765 దానికి నేను సిద్ధంగా ఉన్నాను. 86 00:03:44,725 --> 00:03:47,895 మీకు తెలుసో లేదో, కానీ నా హై స్కూలు అనుభవం అంత గొప్పగా ఏమీ లేదు. 87 00:03:47,978 --> 00:03:48,979 ఏంటి తమాషాగా ఉందా? 88 00:03:49,062 --> 00:03:50,439 నువ్వు అందంగా ఉంటావు, తెలివైన దానివి, 89 00:03:50,522 --> 00:03:51,899 అందరూ నిన్ను ఇష్టపడతారు… 90 00:03:52,983 --> 00:03:53,984 మీ అమ్మ వల్ల కదా. 91 00:03:54,067 --> 00:03:55,485 పాపం తల్లిలేని పిల్ల. 92 00:03:55,569 --> 00:03:56,570 డెరెక్, వద్దు. 93 00:03:56,653 --> 00:03:58,530 అవును, తనకి… తల్లి లేదు. 94 00:03:58,614 --> 00:04:01,909 గ్రాడ్యుయేషన్ లో చేరడం నాకు కూడా ఉత్సాహంగానే ఉంది కానీ నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మతో కలిసి కూర్చోను అంటున్నాడు. 95 00:04:01,992 --> 00:04:04,328 ఆమె ఎక్కడెక్కడో తాకుతూ ఉంటుంది. 96 00:04:04,411 --> 00:04:06,705 అలా ఒక్కసారే జరిగింది, నువ్వు ఆమె వేపర్ దొంగిలించావేమో అనుకుంది. 97 00:04:06,788 --> 00:04:08,624 ఆమె నా జిప్ కిందకి లాగింది. 98 00:04:08,707 --> 00:04:10,751 - నా ఉద్దేశం, అది చాలా మామూలు విషయం… - అవును. 99 00:04:10,834 --> 00:04:12,544 …ఆమె నీ గురించి బాగా తెలుసుకోవాలని అనుకుని ఉండచ్చు. 100 00:04:12,628 --> 00:04:14,213 నా ఉద్దేశం, మీ ప్రవర్తన సరిగ్గా ఉండేలా చూసుకోండి. 101 00:04:14,296 --> 00:04:16,380 విల్ ఇంకా మాథ్యూని చూడు. 102 00:04:16,464 --> 00:04:17,798 నువ్వు కొత్త మాథ్యూలా తయారయ్యావు. 103 00:04:18,382 --> 00:04:20,385 అది నీ బ్రాండ్ కే మంచిది కాదు. 104 00:04:20,969 --> 00:04:22,513 నువ్వు మేడ మీద గదిలోకి మారిపోవచ్చు. 105 00:04:22,596 --> 00:04:23,722 విల్ గర్ల్ ఫ్రెండ్ గర్భవతి అయింది. 106 00:04:23,805 --> 00:04:25,557 - నిజంగానా? - ఏంటి? 107 00:04:25,641 --> 00:04:28,060 ఇలా చూడు, బ్రో. వాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో మనకి చెప్పాడు. 108 00:04:28,143 --> 00:04:29,186 నమ్మకంతో. 109 00:04:29,269 --> 00:04:30,270 నేను కూడా అదే చెప్పాను. 110 00:04:31,188 --> 00:04:32,189 నేను ఇంక వెళ్లాలి. 111 00:04:33,190 --> 00:04:35,859 నేను నిజంగా వెళ్లాలి, కానీ ఎటూ నేను అదే చెప్పి ఉండేదాన్ని. 112 00:04:39,446 --> 00:04:42,449 సరే, అందరికంటే ముందు నేనే ఇలా చేస్తానని మీలో ఎవరెవరు అనుకున్నారో చేతులు ఎత్తండి. 113 00:04:48,288 --> 00:04:49,957 పాల్ వెళ్లిపోతున్నాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 114 00:04:50,624 --> 00:04:52,501 పాల్. ఎలా ఉన్నావు, బాబు? 115 00:04:52,584 --> 00:04:54,253 నేను ప్రొటీన్ బార్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. 116 00:04:54,336 --> 00:04:56,046 - సరే, డూడ్. - గొప్ప విశేషం. 117 00:04:56,630 --> 00:04:57,631 నన్ను సతాయించకండి. 118 00:04:57,714 --> 00:05:01,260 - వావ్. - నాకున్నంత బాధ తనకి లేనట్లుంది. 119 00:05:01,343 --> 00:05:03,595 అవును, ఒక నసపెట్టే వృద్ధుడి వాసనని నేను మిస్ కాబోతున్నాను. 120 00:05:03,679 --> 00:05:05,973 మనం ఈ ఆఫీసుని పాల్ మ్యూజియంగా మార్చేయచ్చు. 121 00:05:06,056 --> 00:05:08,016 అంటే, స్కూలు బృందాలు సందర్శించే మ్యూజియం లాంటిది. 122 00:05:08,100 --> 00:05:10,018 డిస్నీ వాళ్లతో అతని యానిమేషన్ కూడా మనం చేయించచ్చు. 123 00:05:10,102 --> 00:05:13,564 అప్పుడు అది ఇలా అంటుంది, "జాగ్రత్త, టూల్స్. 124 00:05:13,647 --> 00:05:17,693 ఇంకా… రా డాగ్. రా డాగ్." 125 00:05:18,777 --> 00:05:20,904 హేయ్. పాల్ నీకు చెప్పలేదా? 126 00:05:21,864 --> 00:05:24,116 - ఏంటి? - సరే. 127 00:05:25,325 --> 00:05:30,539 అంటే, నా ట్రామా సెంటర్ కోసం వాడుకోవడానికి పాల్ ఈ బిల్డింగ్ ని నాకు ఇచ్చేశాడు. 128 00:05:31,373 --> 00:05:34,585 అంటే, వాస్తవానికి నేను అతనికి అద్దె చెలిస్తాను, అంటే, నెలకి ఒక డాలర్. 129 00:05:34,668 --> 00:05:36,837 ఆ అద్దె కూడా నేను కట్టకపోవచ్చు, ఎందుకంటే అతనికి వెన్మో అకౌంట్ లేదు. 130 00:05:36,920 --> 00:05:39,798 కాబట్టి, హా, అది ఒక రకంగా ఫ్రీగా వస్తోంది. 131 00:05:40,299 --> 00:05:41,508 అతనికి వెన్మో అకౌంట్ ఉంటే తప్ప. 132 00:05:41,592 --> 00:05:43,343 అతను అది పెట్టుకోడు, కాబట్టి ఖచ్చితంగా దీనికి అద్దె లేదు. 133 00:05:43,427 --> 00:05:45,095 - ఈ మొత్తం ఆఫీసుని నీకు ఇచ్చేశాడా? - అవును. 134 00:05:46,013 --> 00:05:49,141 - అది అద్భుతమైన విషయం. - నిజంగానా? 135 00:05:49,224 --> 00:05:52,436 పాల్, నేను దీని గురించి కొన్నేళ్ల కిందటే మాట్లాడుకున్నాం. నాకు వ్యాపారం చేయాలన్న ఆసక్తి లేదు. 136 00:05:52,519 --> 00:05:54,563 నా పేషంట్లని చూసుకోగలిగితే నాకు అదే చాలు. 137 00:05:54,646 --> 00:05:55,856 నేను ఆ పనిని ఎక్కడయినా చేయగలను. 138 00:05:56,607 --> 00:05:58,066 ఇప్పటికే నేను వాళ్లని ఏదో ఒక చోట చూస్తున్నాను. 139 00:05:58,650 --> 00:06:00,027 చూడు, ఇది నీ కల. 140 00:06:00,110 --> 00:06:02,654 ఈ ఆఫీసుకి అది ఒక మంచి కొత్త అధ్యాయం అవుతుంది. 141 00:06:04,198 --> 00:06:06,283 థాంక్యూ, జిమ్మీ. 142 00:06:06,366 --> 00:06:08,535 అంటే, నిజంగా, ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. 143 00:06:08,619 --> 00:06:09,703 అంటే, చాలా, చాలా సంతోషంగా ఉంది. 144 00:06:10,704 --> 00:06:12,206 మనం పాల్ యానిమేట్రానిక్ ఇప్పటికీ చేయించవచ్చు కదా? 145 00:06:12,289 --> 00:06:14,124 బాబూ, మనం తప్పనిసరిగా చేయించాలి. 146 00:06:14,208 --> 00:06:19,087 "వూఫ్. నా బొమ్మ ఎందుకు చేశారు, జిమ్మీ?" 147 00:06:20,005 --> 00:06:21,798 ఇటు వైపు. హాయ్, పాల్. 148 00:06:22,799 --> 00:06:24,218 ఇది జరుగుతోంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. 149 00:06:24,301 --> 00:06:25,594 ఇది నా సొంత మల్టీవర్స్ మాదిరిగా అనిపిస్తోంది. 150 00:06:25,677 --> 00:06:29,014 - హ్యాపీ తాతయ్యా, ఈ కోపాల తాతయ్యని కలుసుకో. - ఏ తాతయ్య ఎలాంటి వాడు? 151 00:06:29,097 --> 00:06:30,724 - మీకు తెలుసులే. - నేను రెండు రకాలుగా ఉండగలను. 152 00:06:31,308 --> 00:06:33,101 - రాండీ. - పాల్. 153 00:06:34,436 --> 00:06:35,646 - థాంక్స్. - గత కొన్నేళ్లుగా 154 00:06:35,729 --> 00:06:37,814 నువ్వు నాకు ఎంతగా సాయంగా ఉంటున్నావో నేను మా తాతయ్యకి చెప్పాను, 155 00:06:37,898 --> 00:06:40,317 అందుకే మీ ఇద్దరూ కలుసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 156 00:06:41,693 --> 00:06:43,195 - నేను వెళ్లి నాన్నని తీసుకువస్తాను. - సరే. 157 00:06:46,073 --> 00:06:47,741 - చాలా మంచి అమ్మాయి. - అందరిలోకీ బెస్ట్. 158 00:06:47,824 --> 00:06:51,245 మీరు క్యాండీ కోసం తనని పార్కులో కలుస్తుంటారని చెప్పింది. 159 00:06:51,328 --> 00:06:52,871 అలా చేయడం కన్నా ఇది వినడం ఘోరంగా ఉంది. 160 00:06:55,415 --> 00:06:58,502 వినండి, నేను… నేను ఒక విషయం చెప్పాలి, అదేమిటంటే, 161 00:06:59,002 --> 00:07:01,129 టియా చనిపోయాక మీరు తనకి అండగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 162 00:07:01,213 --> 00:07:04,967 నేను ఎక్కువ సమయం ఇక్కడ గడపగలిగితే బాగుండేది. 163 00:07:05,050 --> 00:07:07,970 అది మీకు కూడా కష్టకాలం అనుకుంటా కదా. 164 00:07:08,804 --> 00:07:12,808 దుఃఖంలో ఉన్నవారిని ఎలా ఓదార్చాలో తెలుసుకోవడం కష్టమని నాకు తెలుసు. 165 00:07:12,891 --> 00:07:15,561 అవును, అది… 166 00:07:16,270 --> 00:07:20,107 ఏం చేస్తాం, జరగాల్సింది జరిగింది కదా? 167 00:07:20,691 --> 00:07:23,402 మీకు నేను అసౌకర్యం కలిగిస్తుంటే గనుక, మీరు వేరే విషయం మాట్లాడవచ్చు. 168 00:07:23,485 --> 00:07:24,570 నాకు మార్గం చూపించినందుకు థాంక్స్. 169 00:07:25,988 --> 00:07:27,614 - మీరు గిటార్ వాయిస్తారా? - లేదు. 170 00:07:27,698 --> 00:07:29,783 సరే. మీకు సున్నా, నాకు ఒక పాయింట్. 171 00:07:30,367 --> 00:07:33,745 ఈ ఆఫీసు చాలా బాగుంది. ఊరికే కబుర్లు చెప్పి ఇంత డబ్బు గడించవచ్చు అనుకోలేదు. 172 00:07:33,829 --> 00:07:35,330 జిమ్మీ మాటలు బాగానే చెబుతాడు అనుకుంటా. 173 00:07:35,414 --> 00:07:36,874 ఆ గుణం వాడికి తన తల్లి నుండి వచ్చింది. 174 00:07:37,457 --> 00:07:39,793 ఆమె చాలా ఎమోషనల్ గా ఉండేది, ఇంకా తెగ మాట్లాడేది. 175 00:07:42,796 --> 00:07:45,257 మీ అబ్బాయి ఒక చక్కని థెరపిస్టు. 176 00:07:46,175 --> 00:07:47,259 అది వినడం సంతోషం. 177 00:07:49,386 --> 00:07:51,763 - మీ దగ్గర ప్రొటీన్ బార్స్ ఉన్నాయి. - ఒకటి కావాలా? 178 00:07:51,847 --> 00:07:53,056 - వద్దు. - హేయ్, ఇక్కడ ఎవరున్నారో చూడండి. 179 00:07:53,140 --> 00:07:55,642 వావ్, నేను ఎయిర్ పోర్ట్ కలోన్ వాసన పసిగట్టా అనుకుంటా. 180 00:07:56,351 --> 00:07:57,644 తాతయ్య రాండీ ఇక్కడే ఉన్నాడు. 181 00:07:57,728 --> 00:07:58,562 ఓహ్, గ్యాబీ. 182 00:07:58,645 --> 00:08:01,106 - ఇదిగో నా పొడవాటి హాట్ చాక్లెట్ కప్పు వచ్చేసింది. - అది నిజం. 183 00:08:01,190 --> 00:08:02,858 నేను చాక్లెట్ అని పిలుస్తానంటే ఎప్పుడూ ఒప్పుకోలేదు. 184 00:08:02,941 --> 00:08:04,860 అవును, ఎందుకంటే వయసు మళ్లినవారు నన్ను హాట్ అంటే నాకు ఇష్టం. 185 00:08:04,943 --> 00:08:06,528 అది అబద్ధం. 186 00:08:40,229 --> 00:08:41,230 హేయ్. 187 00:08:41,730 --> 00:08:42,731 హేయ్. 188 00:08:43,690 --> 00:08:45,651 ఎమోషనల్ గా మా నాన్నతో నేను కనెక్ట్ అయిన సందర్భం 189 00:08:46,902 --> 00:08:49,238 ఒక్కటి కూడా నాకు గుర్తులేదు. 190 00:08:49,821 --> 00:08:51,990 ఒక రోజు మా నాన్న బాగా తాగేసి వచ్చాడు, 191 00:08:52,991 --> 00:08:54,618 అర్ధరాత్రి వేళ నన్ను నిద్రలేపాడు, 192 00:08:55,118 --> 00:08:58,121 ఇంటి బేస్మెంట్ లో నన్ను పెట్టి తాళం వేసి ఇంటికి నిప్పు పెడతానని బెదిరించాడు. 193 00:08:58,205 --> 00:09:00,582 - సరే, చెడ్డ నాన్నల విషయంలో నీదే గెలుపు. - థాంక్యూ. 194 00:09:01,375 --> 00:09:03,335 చూడబోతే ఆలీస్ కి ఆయనంటే బాగా ఇష్టం అనుకుంటా. 195 00:09:03,418 --> 00:09:04,419 అవును, నీకు తెలుసా, 196 00:09:04,503 --> 00:09:07,005 నా చిన్నతనంలో ఆయన ఎలా అదృశ్యం అయిపోయేవాడో తన విషయంలో కూడా అదే చేయబోతున్నాడు 197 00:09:07,089 --> 00:09:08,298 కానీ ఆ విషయం పాపం ఆలీస్ కి ఇంకా తెలియదు. 198 00:09:08,382 --> 00:09:10,217 కానీ, దాని గురించి ఎప్పుడయినా ఆయనతో మాట్లాడావా? 199 00:09:11,510 --> 00:09:14,555 నీ మనసులో మాటని చెప్పే ధైర్యం చేయనప్పుడు, 200 00:09:14,638 --> 00:09:17,224 ఎదుటివారు వారు తమ ప్రవర్తనను మార్చుకోలేదని విమర్శించే హక్కు నీకు ఉండదు. 201 00:09:17,891 --> 00:09:20,936 నాకు తెలుసు, పాల్. కానీ ఆయన మారడు అని తెలిసినప్పుడు ఆ ప్రయత్నం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? 202 00:09:21,019 --> 00:09:22,020 వాళ్లు అరుదుగా మారుతుంటారు. 203 00:09:22,104 --> 00:09:24,857 కానీ నువ్వు వాళ్ల మీద కోప్పడు ఇంకా వాళ్లని నీ కోపాన్ని ఎదుర్కోనివ్వు. 204 00:09:25,440 --> 00:09:27,985 అది నా నాలుక వరకూ చాలాసార్లు వచ్చింది. 205 00:09:29,945 --> 00:09:31,864 - నేను పిరికివాడిని అంటావా? - అవును. 206 00:09:32,865 --> 00:09:33,866 చూడు, 207 00:09:34,825 --> 00:09:36,326 ఇలాంటి విషయాల గురించి నేనెలా ఆలోచిస్తానో నీకు తెలుసు. 208 00:09:36,952 --> 00:09:39,037 నువ్వు చేసేది ఏదైనా అది ఆయనని మార్చడం కోసం కాదు. 209 00:09:39,121 --> 00:09:41,874 నీ మనసులోని భారాన్ని తగ్గించుకోవడం కోసం చేయాలి. 210 00:09:42,416 --> 00:09:43,792 అది మోయలేని భారం అవుతుంది, 211 00:09:43,876 --> 00:09:47,921 ఇంకా చివరికి అదంతా నీ మనసుని విషపూరితం చేస్తుంది. 212 00:09:48,505 --> 00:09:50,591 నీకు తెలుసా, నా హై స్కూలు గ్రాడ్యుయేషన్ కి కూడా ఆయన రాలేదు. 213 00:09:51,341 --> 00:09:54,511 నన్ను కరిచిన కుక్కతో నేను ఫైట్ చేసేలా చేశాడు మా నాన్న. 214 00:09:55,095 --> 00:09:56,680 అయితే నువ్వు "వూఫ్" అనడానికి కారణం అదన్నమాట. 215 00:09:58,724 --> 00:10:01,226 మాకున్న అన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, 216 00:10:01,310 --> 00:10:02,728 ఇంకా బేబీని ఉంచుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. 217 00:10:04,021 --> 00:10:07,733 మీరు కలిసి ఉండాలని నిజంగా అనుకుంటున్నారా? 218 00:10:07,816 --> 00:10:09,526 ఇది ఎప్పటికీ విడిపోని బంధం లాంటిదేనా? 219 00:10:09,610 --> 00:10:11,111 అంటే, మా విషయాన్ని ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు, 220 00:10:11,195 --> 00:10:12,821 కానీ తన ఎక్జెమా క్రీమ్ ని నా ఇంట్లో పెడుతోంది. 221 00:10:12,905 --> 00:10:15,157 అవును. నేను పెడతాను. 222 00:10:15,240 --> 00:10:18,660 నిన్ను కాఫీకి ఇంకా టాయిలెట్ కీ మేము ఇంతవరకూ పిలవనే లేదు, పేటన్. 223 00:10:18,744 --> 00:10:20,871 అదేంటో నాకు తెలియదు. 224 00:10:20,954 --> 00:10:23,290 అంటే, ఈ ఫ్యామిలీ సభ్యురాలివి కావడానికి అది సంకేతం. 225 00:10:23,373 --> 00:10:25,459 కానీ నేను కాఫీకి, టాయిలెట్ కీ ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. 226 00:10:25,542 --> 00:10:26,710 సి అండ్ టి. ఇది నాకు నచ్చింది. 227 00:10:26,793 --> 00:10:28,086 - సమ్మర్. - ఏంటి? 228 00:10:28,170 --> 00:10:30,422 కానర్ ని మీ అమ్మతో కాసేపు గడపనిస్తావా, 229 00:10:30,506 --> 00:10:32,591 నీ గ్రాడ్యుయేషన్ కి ముందు అతను కాస్త అలవాటు పడతాడు? 230 00:10:32,674 --> 00:10:33,926 - మంచి ఐడియా. - ఏంటి? 231 00:10:34,009 --> 00:10:35,385 ఆమె ఇప్పుడు అప్రమత్తంగానే ఉంటుందేమో. 232 00:10:38,430 --> 00:10:39,598 మీరు నన్ను కాపాడతారు అనుకున్నాను. 233 00:10:41,058 --> 00:10:42,684 ఇదంతా ఎలా జరిగింది? 234 00:10:42,768 --> 00:10:44,186 మీరు సేఫ్ గానే ఉంటున్నారా? 235 00:10:44,269 --> 00:10:45,270 మేము జాగ్రత్తలు తీసుకున్నాం. 236 00:10:45,771 --> 00:10:47,189 కానీ అది పని చేయలేదు అనుకుంటా. 237 00:10:47,272 --> 00:10:48,982 ఇలా చూడు, బుజ్జీ. 238 00:10:49,066 --> 00:10:52,152 నేను టాబ్లెట్ వేసుకోవడం మానేశాను ఎందుకంటే అది నా మూడ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. 239 00:10:52,236 --> 00:10:54,112 అది నన్ను చాలా కోపిష్టిగా మారుస్తోంది. 240 00:10:54,196 --> 00:10:55,697 బిడ్డ పుడితే నీ కోపం ఇంకా పెరుగుతుంది. 241 00:10:56,198 --> 00:10:58,784 నీ చనుమొనలు పొడిబారి గరుకుగా తయారవుతాయి. 242 00:10:58,867 --> 00:10:59,910 గట్టిపడిపోతాయి. 243 00:10:59,993 --> 00:11:01,662 ఇంకా ఏడాది పాటు అసహ్యంగా అవుతాయి. 244 00:11:01,745 --> 00:11:02,996 చిన్న రాళ్ల మాదిరిగా. 245 00:11:03,080 --> 00:11:04,164 మా ఇద్దరికీనా? 246 00:11:05,123 --> 00:11:06,124 ఒకరికి మాత్రమే. 247 00:11:06,708 --> 00:11:07,709 అంటే… 248 00:11:07,793 --> 00:11:10,254 మీ బిడ్డని పెంచడానికి మీరు ఎలా ప్లాన్ చేశారు? 249 00:11:10,838 --> 00:11:13,382 అంటే, స్పోర్ట్స్ ఏజెంట్స్ బాగా సంపాదిస్తారు. 250 00:11:13,465 --> 00:11:15,300 అవును, నువ్వు మెయిల్ రూమ్ లో పని చేస్తున్నావు, 251 00:11:15,384 --> 00:11:17,052 ఇప్పటికి, నీ ఉద్యోగాన్ని ఎ.ఐ. లాక్కుపోయే వరకూ. 252 00:11:17,135 --> 00:11:18,136 నేను మామ్ టాక్ వీడియోస్ చేయగలను. 253 00:11:18,846 --> 00:11:19,930 ఇంకా బ్రాండ్ డీల్స్ చేసుకోగలను. 254 00:11:20,013 --> 00:11:21,807 చాలామంది ఆ విధంగా డబ్బు సంపాదిస్తున్నారు. 255 00:11:21,890 --> 00:11:24,643 - మామ్ టాక్ ని ఏ.ఐ. కూడా మొదలుపెట్టే వరకూ. - ఏ.ఐ. అనడం ఆపు. 256 00:11:24,726 --> 00:11:26,436 అది మనిషి మనుగడకే ప్రమాదం, బేబీ. 257 00:11:27,271 --> 00:11:30,315 అది ఎంత కష్టమో మీ ఇద్దరూ తెలుసుకోవాలన్నదే నా కోరిక. 258 00:11:30,399 --> 00:11:32,901 - నా ఉద్దేశం, బిడ్డని కనడం. - నాకు దాని గురించి ఆందోళన లేదు 259 00:11:32,985 --> 00:11:36,697 ఎందుకంటే మందులతో పని లేకుండా ఇంట్లో వాటర్ బర్త్ కోసం ప్రయత్నించాలి అనుకుంటున్నాను. 260 00:11:37,197 --> 00:11:38,323 ఆహ్… ఓహ్. 261 00:11:38,407 --> 00:11:39,575 లెక్క పెట్టు. 262 00:11:39,658 --> 00:11:40,659 ఒకటి. 263 00:11:41,702 --> 00:11:42,744 రెండు. 264 00:11:42,828 --> 00:11:44,746 ఆమె ఇంకా ఎంత సేపు అలా లెక్కపెడుతుంది? 265 00:11:44,830 --> 00:11:47,875 - వాటర్ బర్త్ కోసమయితే, బహుశా వంద లెక్కపెట్టచ్చు. - నాలుగు. ఐదు. 266 00:11:47,958 --> 00:11:49,751 సరే, పూర్తిగా మా మీద అరవకుండా ఉన్నందుకు థాంక్స్. 267 00:11:49,835 --> 00:11:51,628 నాకు తెలుసు, ఇదంతా గందరగోళంగా ఉంది. 268 00:11:52,337 --> 00:11:55,048 అవును. అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 269 00:11:55,674 --> 00:11:57,301 కానీ మేము మిమ్మల్ని ప్రేమిస్తాము, 270 00:11:57,384 --> 00:11:58,427 మనం కలిసి దీన్ని అధిగమిద్దాం. 271 00:11:58,510 --> 00:11:59,595 హా! 272 00:11:59,678 --> 00:12:01,096 - సంతోషం. - థాంక్యూ. 273 00:12:01,180 --> 00:12:02,598 - లవ్ యూ, అమ్మా. - లవ్ యూ. 274 00:12:04,391 --> 00:12:06,185 - లవ్ యూ, అమ్మా, నాన్నా. - టేక్ కేర్. లవ్ యూ. 275 00:12:06,268 --> 00:12:08,312 - క్షేమంగా డ్రైవ్ చేయి. - ఓహ్, దేవుడా. 276 00:12:14,526 --> 00:12:15,903 మనకి బిడ్డ పుడుతోంది. 277 00:12:17,196 --> 00:12:18,447 మనం యంగ్ తాత, బామ్మలం కాబోతున్నాం. 278 00:12:18,530 --> 00:12:22,367 ఓహ్, దేవుడా. చాలామంది నేనే ఆ బిడ్డకి తల్లినని పొరబడతారు. 279 00:12:24,411 --> 00:12:25,412 నా మాటని ఒప్పుకో. 280 00:12:25,954 --> 00:12:27,247 చాలామంది. 281 00:12:27,331 --> 00:12:28,540 చాలామంది. 282 00:12:29,750 --> 00:12:32,461 - సరే, అందరినీ పిలుద్దాం. - నేను బేస్ బాల్ గ్లౌవ్ తెచ్చుకుంటాను. 283 00:12:33,086 --> 00:12:35,214 జంప్ సూట్! 284 00:12:36,548 --> 00:12:38,383 నా జిమ్ అఫీషియల్గా స్వలింగ సంపర్కులతో నిండిపోయింది. 285 00:12:38,467 --> 00:12:40,552 ఆ జిమ్ లో 'బూటీ గార్లాండ్' పేరుతో ఒక కొత్త క్లాసు కూడా ప్రారంభించారు 286 00:12:40,636 --> 00:12:43,138 అందులో జూడీ గార్లాండ్ పాటలకి బస్తీలు తీయిస్తారు. 287 00:12:43,222 --> 00:12:44,473 - మరీ మూర్ఖత్వం. - ఆహ్… హా. 288 00:12:44,556 --> 00:12:46,141 ఆ క్లాసులో తాగచ్చు కూడా. 289 00:12:46,225 --> 00:12:47,267 క్యూట్. సరే, నేను చేరతాను. 290 00:12:47,351 --> 00:12:49,394 అవును, నా వ్యాయామం టీచర్ గురించి ఇంస్టాగ్రామ్ లో తెలుసుకున్నాను, 291 00:12:49,478 --> 00:12:51,313 ఇంకా అతని పోస్టుల్లో ఎక్కువగా దుస్తుల్లేకుండా బట్ తో కనిపిస్తాడు. 292 00:12:51,396 --> 00:12:53,690 - నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, కెల్లీ. - సారీ. 293 00:12:55,025 --> 00:12:56,235 నేను సారీ చెప్పాను కదా. 294 00:12:57,194 --> 00:12:59,571 - అతని అకౌంట్ వివరాలు నీకు కావాలా? - అవును. త్వరగా చూడు, కెల్లీ. 295 00:12:59,655 --> 00:13:00,906 - హేయ్. - హాయ్. 296 00:13:00,989 --> 00:13:02,824 డాడీ ఒక శుభ వార్త తెచ్చాడు. 297 00:13:02,908 --> 00:13:06,161 నా టెనెస్సీ ట్రిప్ కోసం మన ఫ్యామిలీకి హౌసింగ్ రిక్వెస్టు పెడితే మా ఆఫీసు వాళ్లు మంజూరు చేశారు. 298 00:13:06,245 --> 00:13:08,580 కాబట్టి మనమంతా కలిసి వెళ్లచ్చు. 299 00:13:08,664 --> 00:13:11,583 మూడు నెలల పాటు నేను మీ ఇద్దరికీ దూరంగా ఉండనక్కర్లేదు. 300 00:13:12,084 --> 00:13:14,545 సారీ. నేను అంత కాలం ఇంటికి దూరంగా ఉండలేను, బేబీ. 301 00:13:15,170 --> 00:13:17,005 నాకు కూడా ఉద్యోగం ఉంది, తెలుసుగా. 302 00:13:19,800 --> 00:13:22,219 - బ్రయాన్, నువ్వు బయట నుండి పని చేయలేవా? - నేను చేయగలను అనుకో. 303 00:13:22,302 --> 00:13:24,471 నేను ఆఫీసుకి వెళ్లి చాలా నెలలైంది. మా ఆఫీసుని మార్చేశారేమోనని కూడా నా అనుమానం, 304 00:13:24,555 --> 00:13:26,473 అన్ని రోజులు బయట నుంచి పని చేస్తానని అడగడం కూడా నాకు ఇబ్బంది. 305 00:13:26,557 --> 00:13:28,517 నువ్వు టెనెస్సీ ఎందుకు వెళ్లనంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 306 00:13:28,600 --> 00:13:30,227 అది ఒక అడ్వెంచర్ లా అనిపిస్తోంది. 307 00:13:30,310 --> 00:13:31,395 ఎల్విస్ ఆ ప్రాంతం వాడే. 308 00:13:31,478 --> 00:13:32,813 వాళ్ల దగ్గర బార్బిక్యూ ఉంటుంది. 309 00:13:32,896 --> 00:13:35,148 ఇంకా వేరే మంచి సంప్రదాయ పద్ధతులు ఉంటాయి. 310 00:13:35,691 --> 00:13:37,860 హేయ్, నీ బార్బిక్యూని మేము… మేము దొంగతనం చేశామా? 311 00:13:37,943 --> 00:13:39,152 - ఖచ్చితంగా మీరే చేశారు. - చచ్చాం. 312 00:13:39,236 --> 00:13:41,363 ఇలా చూడు. జీవితం చాలా చిన్నది. 313 00:13:41,446 --> 00:13:42,489 ఓహ్, దేవుడా, డెరెక్. 314 00:13:42,573 --> 00:13:44,116 ఈ జీవితం చిన్నది అనే చెత్త మాటలు ఇంక ఆపు. 315 00:13:44,199 --> 00:13:45,826 నాకు టెనెస్సీకి వెళ్లాలని లేదు. 316 00:13:45,909 --> 00:13:46,910 అక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. 317 00:13:46,994 --> 00:13:48,078 అది చాలా దూరం. 318 00:13:48,161 --> 00:13:49,496 అలాగే, మెంఫిస్ అనేది 319 00:13:49,580 --> 00:13:51,748 - మన దేశంలోనే హత్యల రాజధాని అన్న విషయం తెలుసా? - నిజంగానా? 320 00:13:51,832 --> 00:13:54,042 నాకు తెలియదు, కానీ అదే నిజమైతే, అది నేను ఇలా తెలుసుకోవాలి అనుకోవడం లేదు. 321 00:13:54,126 --> 00:13:56,044 పైగా, నా దుస్తులు ఎక్కడ కొనుక్కోవాలి? వాల్ మార్ట్ లోనా? 322 00:13:57,629 --> 00:13:59,840 నువ్వేం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? నా బట్టలు వాల్ మార్ట్ లో కొన్నవి కాదు, బ్రో. 323 00:13:59,923 --> 00:14:01,675 - ఏంటి? - వావ్. నువ్వు ఇక్కడికి వచ్చి బతికించావు. 324 00:14:01,758 --> 00:14:04,178 బ్రయాన్ మామూలుగా కన్నా ఎక్కువగా మా బుర్ర తింటున్నాడు, అది మాకు చాలా కష్టంగా ఉంది. 325 00:14:04,261 --> 00:14:06,221 అంటే, మా అంకుల్ అంత్యక్రియల మధ్యలోనే ఇక్కడికి హడావుడిగా వచ్చేశాను. 326 00:14:06,305 --> 00:14:08,098 అది ఇంకా పూర్తి కాలేదు, కానీ మీరు ఇది ఎమర్జెన్సీ అని చెప్పారు. 327 00:14:08,182 --> 00:14:11,143 - ఇది అర్జెంటు కాదు. - ఓరి బాబోయ్, చాలా సారీ. 328 00:14:11,226 --> 00:14:13,896 నేను ఊరికే అబద్ధం చెబుతున్నాను, ఎందుకంటే మీరు ఫోనులో విచిత్రంగా మాట్లాడారు. 329 00:14:13,979 --> 00:14:16,440 - ఏంటి సంగతి? - విషయం ఏమిటో నేను చెబుతాను. 330 00:14:16,523 --> 00:14:19,484 మాథ్యూకి ఫుల్ టైమ్ జాబ్ దొరికింది, ఇంకా వాడు… 331 00:14:20,360 --> 00:14:21,486 వాడు మా ఇంటి నుంచి మకాం మారుస్తున్నాడు. 332 00:14:22,237 --> 00:14:25,282 వావ్. మంచి విషయం. అతను ఉద్యోగం చేయగలడని నిజానికి నేను ఊహించలేదు. 333 00:14:26,200 --> 00:14:27,409 నేనూ అనుకోలేదు. 334 00:14:27,492 --> 00:14:30,537 అవును. రీహాబ్ ఇంకా పూర్తి కాలేదు. 335 00:14:30,621 --> 00:14:33,624 మాథ్యూ పాడు చేసినవి రిపేరు చేయడానికి నాకు ఎవరైనా కావాలి. 336 00:14:33,707 --> 00:14:36,627 అంటే, తల్లకిందులైన బాత్ రూమ్ కుళాయి లాంటివి. 337 00:14:36,710 --> 00:14:38,712 - ఇప్పటికీ నీళ్లు వస్తున్నాయిలే. - ఇప్పుడు అది బిడే అయింది. 338 00:14:38,795 --> 00:14:41,798 ఆ పనులు పర్యవేక్షించడానికి నాకు ఎవరైనా సాయం చేయాలి. 339 00:14:41,882 --> 00:14:43,091 నువ్వు అది చేయగలిగితే… 340 00:14:44,968 --> 00:14:46,094 నువ్వు ఇక్కడ అద్దె లేకుండా ఉండచ్చు. 341 00:14:46,178 --> 00:14:48,847 ఇంకా ఎవరికి తెలుసు, నేను దీన్ని అమ్మడానికి సిద్ధమయ్యే సమయానికి, 342 00:14:48,931 --> 00:14:50,766 నువ్వే దీన్ని కొనడానికి రెడీ కావచ్చు. 343 00:14:50,849 --> 00:14:53,393 నువ్వు ఎటూ ఒక పెద్ద కొత్త ఉద్యోగంలో చేరబోతున్నావు కదా. 344 00:14:53,477 --> 00:14:54,603 - ఇదిగో. ఇలా చూడు… - బాబూ. 345 00:14:54,686 --> 00:14:58,065 ఇదివరకు నువ్వు రెడీగా లేవని తెలుసు, ఇంకా అది… 346 00:14:58,565 --> 00:15:00,859 నువ్వు రెడీగా ఉన్నా… లేకపోయినా ఫర్వాలేదు. 347 00:15:02,402 --> 00:15:05,447 ఇది నా కోసం కూడా అని నువ్వు తెలుసుకోవాలన్నది నా కోరిక, సరేనా? 348 00:15:06,907 --> 00:15:10,911 నేను ఈ మధ్య నా జీవితం గురించి ఇంకా నా భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తున్నాను. 349 00:15:10,994 --> 00:15:16,667 నేను ప్రేమించే మనుషులకి సాయం చేస్తూ, వారికి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. 350 00:15:17,543 --> 00:15:18,836 ఓరి బాబోయ్, డీ-ట్రైన్. 351 00:15:18,919 --> 00:15:21,004 అతను 'యస్' అంటే ఆ క్రెడిట్ తీసుకుందామనుకున్నా. కానీ ఇప్పుడు లీనమైపోయా. 352 00:15:21,088 --> 00:15:22,214 అవును. 353 00:15:24,132 --> 00:15:25,384 - సరే, నేను ఒప్పుకుంటున్నాను. - ఇలా రా! 354 00:15:25,467 --> 00:15:27,010 - వచ్చి కౌగిలించుకో! - యాయ్! 355 00:15:27,094 --> 00:15:29,346 - యాయ్! - యాయ్! 356 00:15:29,429 --> 00:15:31,098 - ఐ లవ్ యూ, బాబూ. - ఐ లవ్ యూ. 357 00:15:31,181 --> 00:15:32,474 - థాంక్స్, డెరెక్. - సంతోషం. 358 00:15:32,558 --> 00:15:34,226 - వద్దు, బ్రయాన్. - సరే, ఇంక చాలు… సరే. 359 00:15:34,309 --> 00:15:35,561 - ఇంక చాలు, బాబు. - అది నా కోసం. 360 00:15:37,229 --> 00:15:38,814 ఇరవై ఐదుకి ఇరవై మూడు. 361 00:15:38,897 --> 00:15:40,148 అదేదో తప్పు చేసినట్లుగా దాన్ని కొట్టావు. 362 00:15:40,232 --> 00:15:43,694 దాన్ని సరైన చోటుకి పంపిస్తున్నాను అనుకోవడమే నాకు ఇష్టం. ఇక నీ వంతు. 363 00:15:45,362 --> 00:15:46,488 ఇది గొప్ప ఐడియా, బాబు. 364 00:15:47,364 --> 00:15:49,950 అవును, అంటే, మనం పరస్పరం ఎక్కువ సమయం గడపలేదని నాకు అనిపించింది. 365 00:15:51,952 --> 00:15:53,996 సరే. నాసా వాళ్లకి ఫోన్ చేయాలేమో చూస్కో. 366 00:15:54,079 --> 00:15:56,248 - నేను బాల్ ని అంతరిక్షంలోకి పంపించబోతున్నాను. - సరే. 367 00:15:58,166 --> 00:15:59,209 కానివ్వు, జింబో. 368 00:15:59,293 --> 00:16:01,545 లిటిల్ లీగ్ లో నువ్వు ఇంతకంటే వేగంగా వచ్చిన బాల్స్ ని కొట్టావు. 369 00:16:01,628 --> 00:16:02,963 నీకు నేను ఏం నేర్పించానో గుర్తు తెచ్చుకో. 370 00:16:03,463 --> 00:16:05,257 నిన్ను ఎవరు చిరాకు పెడుతున్నారో గుర్తుచేసుకో 371 00:16:05,340 --> 00:16:06,800 తరువాత ఆ బంతి బదులు వాళ్ల ముఖాన్ని ఊహించుకో. 372 00:16:12,472 --> 00:16:14,057 నీ షాట్ లో కొంత ఫైర్ ఉంది. 373 00:16:14,141 --> 00:16:16,935 అంటే 1989లో, నువ్వు బ్యాడ్జర్స్ జట్టులో ఆడినట్లు ఆడావు. 374 00:16:17,019 --> 00:16:18,562 నీకు నిజంగానే ఆ రోజు నచ్చింది కదా, హా? 375 00:16:18,645 --> 00:16:19,646 నాకు నిజంగా నచ్చింది. 376 00:16:19,730 --> 00:16:22,107 నాకు బాగా ఇష్టమైన జ్ఞాపకాలలో అది ఒకటి. 377 00:16:25,652 --> 00:16:29,031 చూడు, గ్రాడ్యుయేషన్ అనేది ఆలీస్ కి కూడా అలాంటి ఇష్టమైన జ్ఞాపకం అవుతుంది అనుకుంటా. 378 00:16:29,114 --> 00:16:31,450 ఓహ్, ఇంక ఆపు. మనం మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడుకోవద్దులే, హా? 379 00:16:31,533 --> 00:16:33,952 చూడు, మనం కొద్ది రోజులుగా కలిసి సరదాగా గడిపాం కదా? హా? 380 00:16:34,745 --> 00:16:35,996 ఆలీస్ కి ఆ కారు బాగా నచ్చింది. 381 00:16:36,079 --> 00:16:37,581 నువ్వు వచ్చాక 382 00:16:38,373 --> 00:16:39,458 ఎంత అద్భుతంగా 383 00:16:40,125 --> 00:16:43,712 ఎంత ఆత్మీయంగా ఎంత సరదాగా ఉండగలవో నాకు అర్థమైంది. 384 00:16:44,463 --> 00:16:47,674 కానీ నువ్వు ఎప్పుడూ ఒక అడుగు లోపల, ఒక అడుగు బయట పెట్టినట్లే అనిపిస్తుంది. 385 00:16:47,758 --> 00:16:49,593 ఒక పిల్లవాడిగా అది నిజంగా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. 386 00:16:50,719 --> 00:16:54,890 నువ్వు మాకు ఎంత ముఖ్యమో మేము నీకు అంత ముఖ్యం కాదని నీ ప్రవర్తన వల్ల మాకు అనిపిస్తుంది. 387 00:16:56,058 --> 00:16:58,435 "సరదాగా గడిపేశాం, ఇక అయిపోయింది" అనే ఈ తీరు, ఇది ఆలీస్ కి చాలదు. 388 00:17:01,146 --> 00:17:02,481 అది నాకు ఎప్పుడూ చాలు అనిపించలేదు. 389 00:17:03,440 --> 00:17:06,652 జిమ్మీ, ఒక తల్లిగా ఆ ప్రేమను, ఆత్మీయతను పంచడంలో 390 00:17:06,734 --> 00:17:09,404 మీ అమ్మే ఎప్పుడూ ముందుండేది. నేను మాత్రం… నాకు చేతనైనంత… 391 00:17:09,488 --> 00:17:12,074 - నీకు తెలుసు కదా, నేను చేయగలిగినంత చేశాను. - నాకు తెలుసు. నువ్వు చేశావు. తెలుసు. 392 00:17:12,156 --> 00:17:13,825 నేను అర్థం చేసుకున్నాను. నిజంగా, నాన్నా. 393 00:17:14,409 --> 00:17:17,829 ఆలీస్ ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళినా తను సర్దుకుపోతుందని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు, నాకు తెలుసు. 394 00:17:18,454 --> 00:17:20,332 కానీ మొన్న రాత్రి తను నాతో ఏం చెప్పిందో తెలుసా? 395 00:17:20,415 --> 00:17:24,419 "మనమంతా కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పింది. 396 00:17:26,588 --> 00:17:27,673 నువ్వు, నేను, 397 00:17:29,591 --> 00:17:30,759 తనకి ఉన్నది మనమిద్దరమే, బాబు. 398 00:17:34,263 --> 00:17:36,807 నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అనుకుంటున్నావు? 399 00:17:37,391 --> 00:17:39,059 నీ ఫిషింగ్ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకో. 400 00:17:40,018 --> 00:17:41,478 గ్రాడ్యుయేషన్ డే వేడుకకి హాజరవ్వు. 401 00:17:44,314 --> 00:17:45,983 నేను ఆ రకం మనిషిని కాను, జిమ్మీ. 402 00:17:47,025 --> 00:17:50,487 ఇంకా, ఇలాంటి సంభాషణని కొనసాగించడం నాకు ఎంత చిరాకో నీకు చెప్పలేను, 403 00:17:50,571 --> 00:17:52,489 కాబట్టి నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే, 404 00:17:53,073 --> 00:17:54,074 అదంతా ఇప్పుడే బయటకి వెళ్లగక్కు. 405 00:17:59,371 --> 00:18:00,372 నేను చెప్పాల్సింది చెప్పేశాను. 406 00:18:01,915 --> 00:18:02,916 మంచిది. 407 00:18:03,917 --> 00:18:05,502 అక్కడ మంచి ఐస్ క్రీమ్ దొరుకుతుంది. 408 00:18:05,586 --> 00:18:07,045 పద. నీకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను. 409 00:18:18,182 --> 00:18:19,725 మన ఇంట్లోకి బేబీ వస్తోంది! 410 00:18:19,808 --> 00:18:21,185 మీ విషయంలో, 411 00:18:21,268 --> 00:18:24,855 పెళ్లి కాని మీ అబ్బాయి, ఇంకా అతని కాబోయే ఇంస్టాగ్రామ్ బిడ్డ తల్లి విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. 412 00:18:24,938 --> 00:18:25,981 థాంక్యూ. 413 00:18:26,064 --> 00:18:27,733 ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 414 00:18:27,816 --> 00:18:30,319 మనం విల్ గదిని ఒక నర్సరీలా మార్చాలి, 415 00:18:30,402 --> 00:18:32,863 ఎందుకంటే పుట్టబోయే పాప ఎక్కువ కాలం ఇక్కడే ఉంటుంది. 416 00:18:32,946 --> 00:18:34,573 నేను పాపాయికి కొత్త డాక్టర్ ని చూడాలి, 417 00:18:34,656 --> 00:18:37,409 ఇంకా "బాత్ టబ్" అనే మాట లేకుండా ప్రసవానికి ఏర్పాట్లు చేయాలి. 418 00:18:37,492 --> 00:18:39,369 సరే, బేబీ, నువ్వు బాగా ఎగ్జయిట్ అవుతున్నావని నాకు తెలుసు, 419 00:18:39,453 --> 00:18:41,496 కానీ మనం కాస్త తొందరపడుతున్నామేమో? 420 00:18:42,456 --> 00:18:44,541 వాళ్లేం చేస్తున్నారో ఆ పిల్లలకి తెలియడం లేదు. 421 00:18:44,625 --> 00:18:47,711 ఇంకా వచ్చే ఐదేళ్ల పాటు ఆ బిడ్డని మనమే పెంచబోతున్నాము. 422 00:18:47,794 --> 00:18:48,879 - మన అదృష్టం బాగుంటే, మరో పదేళ్లు. - అవును. 423 00:18:48,962 --> 00:18:49,963 - బహుశా 20 ఏళ్లు. - ఆదే నా ఆశ. 424 00:18:51,882 --> 00:18:53,258 - ఏంటి? - చార్లీ నుంచి నాకు వరుసగా 425 00:18:53,342 --> 00:18:54,468 టెనెస్సీ గురించి మెసేజులు వస్తున్నాయి. 426 00:18:54,968 --> 00:18:59,932 ఇప్పుడు విషాద ముఖాల ఎమోజీలని పంపుతున్నాడు, ఇంకా తనే విషాదపు ఎమోజీలా ముఖం పెడుతున్నాడు. 427 00:19:00,015 --> 00:19:02,100 - చాలా స్పెషల్ గా ఉంది. - లేదు, ఇది ఫన్ కాదు. 428 00:19:02,184 --> 00:19:04,353 - ఇది కాదు. ఇది ఫన్నీగా లేదు. - తను బొమ్మలు గీస్తున్నాడు, బ్రయాన్. 429 00:19:04,436 --> 00:19:06,730 టెనెస్సీకి వెళ్లాలి అనిపించడం లేదనే హక్కు నాకు ఉంది. 430 00:19:06,813 --> 00:19:10,192 సరే, బ్రయాన్. అంటే, నువ్వు ధైర్యం తెచ్చుకుని అతనికి నిజం చెప్పేస్తే, ఈ మెసేజులు ఆపేస్తాడేమో. 431 00:19:10,275 --> 00:19:11,610 నీ అసలు ఫీలింగ్ ఏంటో చెప్పు. 432 00:19:11,693 --> 00:19:14,905 నేను గ్యాబీతో ఏకీభవిస్తాను, మనం నిజంగా ఏం అనుకుంటున్నామో అదే చెప్పాలి. 433 00:19:14,988 --> 00:19:16,240 అవును, సరిగ్గా చెప్పావు. 434 00:19:16,323 --> 00:19:17,574 ఎందుకంటే గ్యాబీ ఒక మేధావి. 435 00:19:17,658 --> 00:19:19,326 నాకు విల్ బిడ్డని పెంచాలని లేదు. 436 00:19:19,993 --> 00:19:21,620 - డమ్మీ. - భలే పని చేశావు, గ్యాబీ. 437 00:19:21,703 --> 00:19:23,080 మీరు తేల్చుకోండి. నాకు మీ ఇద్దరూ అంటే 438 00:19:23,163 --> 00:19:24,581 - భయం లేదు, సరేనా? - సరే. 439 00:19:25,082 --> 00:19:27,125 తాత కాబోతున్నందుకు నువ్వు ఎగ్జయిటెడ్ గా ఉన్నావు అనుకున్నాను. 440 00:19:27,209 --> 00:19:29,211 నేను అలాగే ఉన్నాను, కానీ, అంటే, అందరు తాతల మాదిరిగా, 441 00:19:29,294 --> 00:19:30,963 వీకెండ్స్ లోనూ ఇంకా సెలవు రోజుల్లో కలవడం, 442 00:19:31,046 --> 00:19:32,297 వాళ్లకి గుప్పెడు చక్కెర తినిపించడం, 443 00:19:32,381 --> 00:19:35,592 ఇంకా ఎ.డి.హెచ్.డి. అనేది అబద్ధమని ఆ బిడ్డ పేరెంట్స్ కి చెప్పడం ఇష్టం. 444 00:19:35,676 --> 00:19:37,177 - సరే, కానీ, అది నిజమే. - అది నిజం కాదు. 445 00:19:37,261 --> 00:19:38,262 - ఏంటి? - సరే. 446 00:19:38,345 --> 00:19:41,890 "జీవితం చాలా చిన్నది" అని నేను చెప్పే మాట వినీవినీ అందరూ విసిగిపోయారని నాకు తెలుసు, 447 00:19:42,391 --> 00:19:43,392 కానీ అది నిజం. 448 00:19:43,475 --> 00:19:45,435 నేను 90ల కాలంలో ఉండాలని కోరుకోవడం లేదు, 449 00:19:45,519 --> 00:19:48,480 ఊగే కుర్చీలో నెత్తి మీద ఇదే జట్టుతో కూర్చుని, 450 00:19:48,564 --> 00:19:50,232 నేను ఇంకా చాలా సాధించి ఉండాల్సిందని ఆలోచిస్తూ గడపలేను. 451 00:19:50,816 --> 00:19:52,901 నేను వేరే టైమ్ జోన్ లోకి ఎగిరిపోవాలని కోరుకుంటున్నాను, 452 00:19:52,985 --> 00:19:55,112 ఇంకా నేను అక్కడికి వెళ్లేసరికి, అది గతం మాదిరిగానే ఉంటోంది. 453 00:19:55,863 --> 00:19:56,989 నాకు వియత్నాం వెళ్లాలని ఉంది. 454 00:19:57,072 --> 00:20:00,033 బట్ మాదిరిగా వాసన వచ్చే ఫ్రూట్ తినాలని నా కోరిక. 455 00:20:00,117 --> 00:20:02,119 - నిజంగా బట్ రుచి చూడమని సలహా ఇవ్వనా? - దానికేం అంత సీన్ లేదులే. 456 00:20:02,202 --> 00:20:03,912 అంటే, నువ్వు ఏదో చెడ్డది రుచి చూసి ఉంటావు. 457 00:20:03,996 --> 00:20:05,914 చూడండి, నేను ఊరికే అంటున్నాను. 458 00:20:05,998 --> 00:20:07,165 ఇక నా శేష జీవితం అంతా, 459 00:20:07,249 --> 00:20:09,835 అడ్వెంచర్స్ చేస్తూ బతకాలని ఉంది. 460 00:20:09,918 --> 00:20:14,298 నా సాహసం బట్ ఫ్రూట్ ని తినడం గురించి కాదు కానీ, 461 00:20:14,381 --> 00:20:15,549 నీకు ఇష్టమైతే కానివ్వు. 462 00:20:15,632 --> 00:20:19,052 నీకు సంతోషం కలిగించేది ఏదైనా సరే, నేను నిన్ను ఎప్పటికీ ఆపను. 463 00:20:19,136 --> 00:20:20,470 నాకు ఒంటరిగా వెళ్లాలని లేదు. 464 00:20:21,388 --> 00:20:22,514 నాకు నీతో పాటు వెళ్లాలని ఉంది. 465 00:20:22,598 --> 00:20:25,225 కానీ నాకు దాని మీద అంత ఆసక్తి లేదు, బేబీ. 466 00:20:25,309 --> 00:20:26,476 నువ్వు మాథ్యూని అడగచ్చు కదా? 467 00:20:26,560 --> 00:20:28,562 వాడు వియత్నాం వెళతాడు, లేదా కానర్ వెళతాడు. 468 00:20:28,645 --> 00:20:30,981 - హేయ్. నాకు ఒక పీచ్ పండు ఇస్తారా? - ఇదిగో తీసుకో, బుజ్జీ. 469 00:20:31,064 --> 00:20:32,566 సమ్మర్ కూడా నీతో పాటు వస్తుంది. 470 00:20:33,358 --> 00:20:34,818 తనని వియత్నాం తీసుకువెళ్లను. 471 00:20:34,902 --> 00:20:36,987 నా విషయం చర్చకు వస్తుందని అనుకోలేదు. 472 00:20:37,070 --> 00:20:39,489 ఒకవేళ నీ మనసు మారితే, నేను రావడానికి రెడీ. 473 00:20:40,073 --> 00:20:41,950 బేబీ. బేబీ. 474 00:20:42,701 --> 00:20:43,702 థాంక్యూ. 475 00:20:45,245 --> 00:20:47,915 హా. చూడు, అందుకే మనం అబద్ధాలు ఆడాలి. 476 00:20:47,998 --> 00:20:48,999 నువ్వు ఎప్పుడూ విషయాలను ఎందుకు 477 00:20:49,082 --> 00:20:50,292 - ఇంత దారుణంగా అర్థం చేసుకుంటావు? - ఏంటి? 478 00:20:50,375 --> 00:20:51,585 ట… డా! 479 00:20:52,085 --> 00:20:53,545 గ్రాడ్యుయేషన్ కోసం ఓవర్ నైట్ ఓట్స్ చేశావన్నమాట. 480 00:20:53,629 --> 00:20:54,630 అవును, నేను అదే చేశాను. 481 00:20:54,713 --> 00:20:56,048 - ఇది నీ ఫేవరెట్ కదా. - ఒకప్పుడు. 482 00:20:56,131 --> 00:20:58,133 నిన్న నీటితో కొద్దిగా టెస్ట్ చేసి చూశాను. 483 00:20:58,217 --> 00:21:00,135 - అది చెత్తలా వచ్చింది. - సరే. 484 00:21:00,219 --> 00:21:04,056 కానీ ఈసారి, నేను కొబ్బిరి పాలు వాడాను, దానితో ఇది సరిగ్గా కుదిరింది. 485 00:21:04,139 --> 00:21:05,557 యాయ్! 486 00:21:09,478 --> 00:21:11,188 ఇది నీకు అసలు ఎలా ఇష్టమయింది? 487 00:21:11,271 --> 00:21:12,272 అప్పుడు నాకు అది కష్టకాలం. 488 00:21:13,774 --> 00:21:15,067 - హేయ్. - హేయ్. 489 00:21:15,150 --> 00:21:16,151 ఆ బ్యాగ్ ఏంటి? 490 00:21:16,235 --> 00:21:17,569 సారీ, బుజ్జీ. 491 00:21:17,653 --> 00:21:18,654 నాకు అర్జెంటు పని పడింది. 492 00:21:18,737 --> 00:21:21,031 డీప్ సీ ఫిషింగ్ కి నా మిత్రుడు ఆహ్వానించాడు. 493 00:21:21,114 --> 00:21:24,952 నీ గ్రాడ్యుయేషన్ వేడుకని మిస్ అవుతున్నందుకు సారీ, కానీ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. 494 00:21:25,619 --> 00:21:27,371 దాని గురించి బాధపడకు. బోరు కొట్టే భాగాన్నే మిస్ అవుతావు. 495 00:21:27,454 --> 00:21:28,747 నేను కూడా ఫిషింగ్ కి వస్తే బాగుండేది. 496 00:21:28,830 --> 00:21:31,375 వాస్తవానికి, ఉండు. నేను చేపల్ని టచ్ చేయాలా, 497 00:21:31,458 --> 00:21:33,126 - ఇంకా అవి చనిపోతాయా? - రెండు ప్రశ్నలకీ, అవును. 498 00:21:33,210 --> 00:21:34,253 - సరే, అయితే నేను రాలేను. - సరే. 499 00:21:34,336 --> 00:21:36,380 - వెళ్లి మీ నాన్న గర్వపడేలా చేయి. - సరే. 500 00:21:36,463 --> 00:21:37,506 నేను వెళ్లి డ్రెస్ మార్చుకుని, 501 00:21:37,589 --> 00:21:38,799 - క్యాప్ ఇంకా గౌన్ వేసుకొస్తా, సరేనా? - సరే. 502 00:21:38,882 --> 00:21:40,551 - నిన్ను కారు దగ్గర కలవనా? - అలాగే, తప్పకుండా. 503 00:21:41,051 --> 00:21:42,344 - బై, తాతయ్యా. - గుడ్ బై. 504 00:21:42,427 --> 00:21:44,304 - లవ్ యూ. - లవ్ యూ టూ. 505 00:21:45,305 --> 00:21:47,391 - గుడ్ లక్, బుజ్జీ. - థాంక్యూ. 506 00:21:49,017 --> 00:21:51,603 చూశావా? తను సంతోషంగానే ఉంది. 507 00:21:52,521 --> 00:21:55,524 అందరూ నీలా సున్నితంగా ఉండరు. 508 00:21:57,484 --> 00:21:59,236 ఈ విజిట్ బాగా జరిగినందుకు థాంక్స్. త్వరలో కలుద్దాం. 509 00:22:07,160 --> 00:22:10,247 నేను వెళ్లిపోతే, అందరిలోకీ నిన్నే ఎక్కువగా మిస్ అవుతాను. 510 00:22:11,039 --> 00:22:12,791 నువ్వు నా గురించి అంటున్నావా లేదా శాండ్విచ్ గురించా? 511 00:22:13,375 --> 00:22:14,543 అది నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. 512 00:22:14,626 --> 00:22:18,213 షాన్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, లేదంటే నిన్ను కూడా ముఖం మీద గుద్దుతాడు. 513 00:22:18,297 --> 00:22:20,465 వాడు కావాలనే తన పళ్లని సరిచేయించుకోవడం లేదు, 514 00:22:20,549 --> 00:22:21,925 కేవలం నన్ను ఇబ్బంది పెట్టడం కోసం. 515 00:22:22,009 --> 00:22:23,927 నేను డాఫీ డక్ తో పని చేస్తున్నట్లుంది. 516 00:22:25,179 --> 00:22:26,555 నాకు డాఫీ డక్ అంటే ఇష్టం. 517 00:22:27,139 --> 00:22:30,392 వాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు, కానీ వాడి జీవితాన్ని బాగు చేయడం నా పని కాదు కదా. 518 00:22:30,475 --> 00:22:32,311 - నువ్వు ఏం అంటావు? - ఈ సమస్యని నీకు నువ్వే 519 00:22:32,394 --> 00:22:34,396 పరిష్కరించుకోగల తెలివి నీకు ఉంది అనుకుంటున్నాను. 520 00:22:35,689 --> 00:22:38,942 సరే, మిస్టర్ మియాగీ. నేనే పరిష్కరించుకుంటాను. 521 00:22:40,194 --> 00:22:42,237 జూలీ, నేను రేపు ఉదయం బయలుదేరుతున్నాం. 522 00:22:42,321 --> 00:22:43,739 టచ్ లో ఉండు. 523 00:22:43,822 --> 00:22:46,742 ఫోన్ చేసి, ఆ మిస్టర్ మియాగీ ఎవరో నాకు చెప్పు. 524 00:22:48,577 --> 00:22:49,870 - ఆగు. - ఏంటి? 525 00:22:50,621 --> 00:22:52,915 నాకు హగ్ ఇవ్వకుండానే ఊరు వదిలి వెళ్లిపోగలను అనుకుంటున్నావా? 526 00:22:52,998 --> 00:22:54,583 కిందటి సెషన్ తరువాత హగ్ చేసుకున్నాం కదా. 527 00:22:54,666 --> 00:22:56,210 అది డాక్టర్, పేషంట్ హగ్. 528 00:22:56,293 --> 00:22:57,544 నాకు ఇప్పుడు నా ఫ్రెండ్ హగ్ కావాలి. 529 00:22:57,628 --> 00:23:00,214 - ఈ హగ్ పిచ్చి తగ్గించుకో. - మంచిది. 530 00:23:05,761 --> 00:23:06,929 సరే. 531 00:23:07,012 --> 00:23:08,013 ఇదిగో హగ్. 532 00:23:08,096 --> 00:23:09,640 దేవుడా. ఇది పిచ్చితనం. 533 00:23:09,723 --> 00:23:11,350 మంచిగా ఉంది కదా? 534 00:23:12,184 --> 00:23:13,936 ముందు నీ తొర్రి పన్ను సరి చేయించుకో. 535 00:23:17,105 --> 00:23:19,650 స్వాగతం క్రౌన్ వ్యాలీ హై స్కూల్ 536 00:23:22,694 --> 00:23:24,655 - నువ్వు బాగానే ఉన్నావా? - నెర్వస్ గా ఉంది. 537 00:23:25,239 --> 00:23:26,573 నాకు కూడా. 538 00:23:27,449 --> 00:23:28,742 నేను చేయాల్సిందల్లా కూర్చోవడమే. 539 00:23:30,369 --> 00:23:32,162 సరే, మనం లోపలికి వెళ్లడానికి ముందు… 540 00:23:32,788 --> 00:23:33,789 మీ అమ్మ… 541 00:23:33,872 --> 00:23:34,873 నాకు తెలుసు. 542 00:23:36,500 --> 00:23:37,626 - తను నిన్ను ప్రేమిస్తుంది… - తెలుసు. 543 00:23:39,336 --> 00:23:40,337 అవును. 544 00:23:44,758 --> 00:23:45,759 మనం ఏం చేయగలం? 545 00:23:49,179 --> 00:23:50,180 మనం ఏం చేయగలం? 546 00:23:55,602 --> 00:23:57,062 ఓహ్, బుజ్జీ. 547 00:24:00,816 --> 00:24:03,318 అక్కడ అందరూ అమ్మ కారణంగా మనల్నే గమనిస్తూ ఉంటారు, 548 00:24:03,402 --> 00:24:06,405 కాబట్టి ఇదే మన ఎమోషనల్ మూమెంట్ అనుకుందాం, ఏమంటావు? 549 00:24:06,488 --> 00:24:10,117 అక్కడ మనం ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ సైగలు చేసుకుంటూ, 550 00:24:10,200 --> 00:24:11,618 - హుందాగా ఉందాం. - నువ్వు చెప్పినట్లే చేద్దాం. 551 00:24:16,874 --> 00:24:18,000 ఇది ఏంటి? 552 00:24:18,083 --> 00:24:21,044 నువ్వు పాపాయిగా ఉన్నప్పటి కార్డ్ బోర్డ్ కటౌట్ ఇది, కానీ అది ఇక్కడ ఎందుకు ఉందో నాకు తెలియదు. 553 00:24:21,128 --> 00:24:22,337 ఖచ్చితంగా అబద్ధం. 554 00:24:22,421 --> 00:24:23,672 ప్లీజ్? నువ్వు చాలా క్యూట్ గా ఉండేదానివి. 555 00:24:23,755 --> 00:24:27,092 నాన్నా. ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వు గనుక దీన్ని పట్టుకుని చూపిస్తే, నిన్ను ఎప్పటికీ క్షమించను. 556 00:24:27,885 --> 00:24:29,011 సరే. 557 00:24:31,388 --> 00:24:34,016 - ఐ లవ్ యూ. - నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. వెళదాం పద. 558 00:24:34,099 --> 00:24:35,559 కైల్ లేసీ. 559 00:24:36,643 --> 00:24:38,061 ఆలీస్ లేర్డ్. 560 00:24:39,146 --> 00:24:40,939 విన్నీఫ్రెడ్ లట్కీ. 561 00:24:44,651 --> 00:24:46,320 కెనెత్ మార్టిన్. 562 00:24:49,406 --> 00:24:50,532 చాలా బాగుంది కదా, హా? 563 00:24:51,617 --> 00:24:54,494 వెట్ బార్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, 564 00:24:54,578 --> 00:24:58,415 పూల్ హౌస్ మాదిరిగా కాకుండా, ఈ ఇంట్లో కొన్ని సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. 565 00:24:58,498 --> 00:25:02,002 ఏంటి? నీ పెద్ద కొత్త ఇంటిని గొప్పగా చూపించుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావా? 566 00:25:02,085 --> 00:25:03,086 అవును. 567 00:25:03,962 --> 00:25:07,341 కానీ ఇది మన గొప్ప కొత్త ఇల్లు. 568 00:25:07,424 --> 00:25:08,675 ఇక్కడికి మకాం మార్చేయ్, బాబు. 569 00:25:09,384 --> 00:25:11,094 అద్దె లేదు. ఎలాంటి షరతులూ లేవు. 570 00:25:11,720 --> 00:25:13,555 కనీసం నువ్వు తిరిగి ఉద్యోగం సంపాదించుకునే వరకూ ఉండచ్చు. 571 00:25:14,431 --> 00:25:17,684 సరే, ఒకే ఒక్క షరతు ఏమిటంటే నేను ఖచ్చితంగా పెద్ద రూమ్ ని తీసుకుంటాను. 572 00:25:19,061 --> 00:25:22,314 కానీ నువ్వు లేకపోతే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేవాడిని కాదు. 573 00:25:23,148 --> 00:25:25,901 - కాబట్టి, ఏం అంటావు, బాబు? - నువ్వు నిజంగానే అంటున్నావా? 574 00:25:26,485 --> 00:25:27,903 నేను తమాషాలు ఆడుతున్నట్లు కనిపిస్తున్నానా? 575 00:25:29,029 --> 00:25:30,364 - నన్ను లెక్క వేసుకో. - యస్! 576 00:25:30,447 --> 00:25:31,448 వెళదాం పద. 577 00:25:33,659 --> 00:25:35,244 - షాన్… - హేయ్. 578 00:25:35,327 --> 00:25:38,247 - నువ్వు నా పట్ల అంత ఎమోషనల్ అవ్వకు. - నన్ను డెంటిస్ట్ దగ్గరకి తీసుకువెళతావా? 579 00:25:38,330 --> 00:25:40,457 నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఈ రోజంతా ఎదురుచూస్తున్నాను. 580 00:25:41,708 --> 00:25:42,876 నీ పన్ను సరి చేయించుకుందాం, పద. 581 00:25:44,253 --> 00:25:45,712 కంగ్రాట్యులేషన్స్ ఆలీస్ వీ లవ్ యూ! 582 00:25:45,796 --> 00:25:49,299 నాకు ఒక రూమ్మేట్ వచ్చేశాడు. కాబట్టి, ఇన్నాళ్లూ ఆఫీసుగా, జిమ్ గా, పక్షుల గదిగా ఉన్న ఈ రూమ్ కి ఇక గుడ్ బై. 583 00:25:49,383 --> 00:25:50,843 - ఇప్పుడు ఏంటి? - ఒక పక్షిని తెచ్చుకోబోతున్నాను, 584 00:25:50,926 --> 00:25:51,927 ఈ గది దానికి ఇవ్వబోతున్నాను. 585 00:25:52,010 --> 00:25:55,013 ఇప్పుడు నీకు పక్షి లేదు, కానీ అది వచ్చాక నీ గర్ల్ ఫ్రెండ్ నగ్నంగా ఇంట్లో తిరగలేదు. 586 00:25:55,097 --> 00:25:58,559 అయినా పరవాలేదు. మనం ప్రేమించే వ్యక్తుల కోసం అప్పుడప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. 587 00:25:59,142 --> 00:26:00,352 వావ్, షాన్. 588 00:26:00,435 --> 00:26:02,104 అది చాలా నిజం. 589 00:26:02,187 --> 00:26:03,564 నేను దాదాపు అనేయబోయాను, 590 00:26:03,647 --> 00:26:06,191 "బూయా! ముందే చెప్పాను కదా వెధవల్లారా!" అని. 591 00:26:06,275 --> 00:26:07,276 కానీ అనను. 592 00:26:08,110 --> 00:26:10,112 నిజంగా అలా అనాలనిపిస్తుంది. 593 00:26:11,071 --> 00:26:13,240 - షాన్, ఆ ఫోటోలు తీసుకునిరా. పద. - అలాగే, మేడమ్. 594 00:26:14,491 --> 00:26:16,326 అది ప్రధానంగా నిన్ను ఉద్దేశించి అన్నదే. 595 00:26:16,410 --> 00:26:17,536 ఓహ్, ఇంక ఆపు. 596 00:26:17,619 --> 00:26:20,914 నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తితో కలిసి కనీసం ఆ 'బట్ ఫ్రూట్' వాసన చూడటానికి నీకు మనసు రావడం లేదు. 597 00:26:21,498 --> 00:26:25,627 ఆ 'పీకాన్ పై' అంటే భయం వల్ల నీ భర్తతో కలిసి ఊరు మారడానికి కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. 598 00:26:25,711 --> 00:26:27,004 అది మరీ జిగటగా ఉంటుంది! 599 00:26:27,087 --> 00:26:28,630 అది తిన్నాక నా నోరు అసలు తెరుచుకోకపోతే ఏం చేయాలి? 600 00:26:32,509 --> 00:26:33,802 కంగ్రాట్యులేషన్స్! 601 00:26:33,886 --> 00:26:35,846 - కానివ్వు, మా అందరినీ ఉద్దేశించి స్పీచ్ ఇవ్వు! - స్పీచ్! 602 00:26:35,929 --> 00:26:37,055 - కానివ్వు! - సరే. 603 00:26:37,139 --> 00:26:38,599 మీరంతా వచ్చినందుకు చాలా థాంక్స్. 604 00:26:38,682 --> 00:26:39,892 మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. 605 00:26:39,975 --> 00:26:42,311 ఇది నిజంగా ఒక క్రేజీ ప్రయాణం, 606 00:26:42,394 --> 00:26:45,606 కానీ మీరంతా ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. 607 00:26:46,690 --> 00:26:49,067 ముందస్తు హెచ్చరిక, పాల్ మనందరికీ గుడ్ బై చెప్పాలని చూస్తున్నాడు, 608 00:26:49,151 --> 00:26:51,028 కాబట్టి వీలైనంత త్వరగా వెళ్ళి తనకి హగ్ ఇవ్వుండి. 609 00:26:51,612 --> 00:26:52,613 డామిట్, ఆలీస్. 610 00:26:52,696 --> 00:26:55,115 మనం సాధించాం. మనం గ్రాడ్యుయేట్స్ అయ్యాం. 611 00:26:55,199 --> 00:26:57,326 - నిన్ను చాలా ప్రేమిస్తాను. - ఐ లవ్ యూ. 612 00:26:57,409 --> 00:26:58,702 మిమ్మల్ని నేను కూడా ప్రేమిస్తాను. 613 00:26:58,785 --> 00:27:01,330 - ఇది నువ్వు మాట్లాడే సందర్భం కాదు. - మా బంధాన్ని నువ్వు ముక్కలు చేయబోయావు, కానర్. 614 00:27:01,914 --> 00:27:03,916 ఇలా రా. ఐ లవ్ యూ. 615 00:27:04,583 --> 00:27:06,084 - కనెక్టికట్ లో జీవితాన్ని ఆస్వాదించు. - సరే. 616 00:27:06,168 --> 00:27:07,169 వాళ్లు మా వాళ్లు. 617 00:27:07,836 --> 00:27:09,546 నేను నీకు బతికున్న ఒక మంచి మొక్క బాకీ ఉన్నాను. 618 00:27:09,630 --> 00:27:11,215 - నిన్ను చూసి గర్వపడుతున్నాను. - హేయ్. 619 00:27:11,882 --> 00:27:13,592 నిన్ను చూసి నేను కూడా గర్వపడుతున్నాను. 620 00:27:13,675 --> 00:27:15,052 సూ చెఫ్. 621 00:27:15,135 --> 00:27:16,178 గొప్పగా ఉంది కదా. 622 00:27:16,970 --> 00:27:19,515 నీకు వీడ్కోలు బహుమతిగా, నా చివరి ఇన్ వాయిస్ ని నువ్వు చెల్లించనక్కర్లేదు. 623 00:27:21,934 --> 00:27:24,561 వాస్తవంగా నువ్వు చెల్లించాలి. కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం, నాకు నువ్వు చెల్లించాల్సిందే. 624 00:27:27,105 --> 00:27:28,315 నీ డ్రెస్ మాకు బాగా నచ్చింది. 625 00:27:28,398 --> 00:27:29,483 ఇది బాగుంది అనుకుంటున్నాం. 626 00:27:29,566 --> 00:27:31,902 మిమ్మల్ని షాపింగ్ కి తీసుకువెళ్లలేదని మీరిద్దరూ నా మీద కోపంగా ఉన్నారా? 627 00:27:31,985 --> 00:27:33,362 - బహుశా ఉండచ్చు. - గొప్ప పని చేశావు అనుకోకు. 628 00:27:33,445 --> 00:27:36,240 "నేను కాలేజీకి వెళ్లడానికి" డ్రెస్ ని మీరే ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది? 629 00:27:37,991 --> 00:27:38,992 సరే. 630 00:27:39,076 --> 00:27:40,577 - అవునా? సరే. - వీ లవ్ యూ. 631 00:27:40,661 --> 00:27:42,246 - ఐ లవ్ యూ. - ఐ లవ్ యూ. 632 00:27:43,247 --> 00:27:44,540 ఆలీస్ విషయంలో కంగ్రాట్స్. 633 00:27:45,415 --> 00:27:46,416 థాంక్స్. 634 00:27:47,000 --> 00:27:49,336 చూడు, ఏది కష్టమో నాకు ఖచ్చితంగా తెలియడం లేదు. 635 00:27:49,419 --> 00:27:52,297 వెళ్లిపోవడం కష్టమా, లేదా ఒంటరిగా మిగిలిపోవడం కష్టమా తెలియడం లేదు. 636 00:27:54,007 --> 00:27:55,008 తను అక్కడ ఉంది. 637 00:27:59,638 --> 00:28:01,515 - నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. - థాంక్యూ. 638 00:28:03,559 --> 00:28:05,602 ఆగు, నువ్వు ఏడుస్తానంటే హగ్ చేసుకోవద్దు. 639 00:28:05,686 --> 00:28:07,813 నేను నాన్న దగ్గరకి వెళ్లినప్పుడల్లా ఆయన ఏడుస్తున్నాడు. 640 00:28:10,190 --> 00:28:13,026 అందరూ అతనంత సున్నితంగా ఉండరు. 641 00:28:13,110 --> 00:28:15,529 నేను గట్టి మనిషిని. నేను బాధని భరించగలను. 642 00:28:15,612 --> 00:28:16,613 సరే. 643 00:28:22,619 --> 00:28:24,371 నీకు కూడా గుడ్ బై చెప్పాల్సి వస్తోందంటే నేను నమ్మలేకపోతున్నాను. 644 00:28:24,454 --> 00:28:27,165 మనం ఈ ఒక్కసారిగా, అంటే, గట్టిగా ప్రేమించుకుందామా? 645 00:28:27,249 --> 00:28:28,959 - అలాగే. - ఏంటి… హేయ్! 646 00:28:30,377 --> 00:28:33,505 - సరే. మీరంతా కంగారుపడకండి. సరేనా? - దేవుడా, నా గుండె దాదాపు ఆగినంత పనైంది. 647 00:28:33,589 --> 00:28:34,923 నా గుండె కూడా. 648 00:28:35,007 --> 00:28:37,718 సరే, అతని గుండె ఆగిపోయినప్పుడు, నేను నీ దగ్గరే ఉంటాను. 649 00:28:37,801 --> 00:28:38,969 - అది తెలియడం సంతోషం. - అవును. 650 00:28:43,724 --> 00:28:44,892 హేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? 651 00:28:45,934 --> 00:28:48,770 మన వీడ్కోలు బ్రేక్ ఫాస్ట్ కోసం రేపు మనం ఎక్కడికి వెళ్తున్నాం? 652 00:28:48,854 --> 00:28:50,731 ఆ అకాయా రెస్టారెంట్ కి వెళ్తున్నామా? 653 00:28:50,814 --> 00:28:52,024 అది ఆసాయి. 654 00:28:54,526 --> 00:28:55,569 నువ్వు బాగానే ఉన్నావా, బాబూ? 655 00:28:55,652 --> 00:28:57,029 నేను కాస్త గాలి పీల్చుకుందామని బయటకి వచ్చాను. 656 00:28:57,613 --> 00:28:59,531 ఇది భావోద్వేగానికి గురయ్యే సందర్భం. 657 00:29:02,409 --> 00:29:03,785 నీకు తెలుసా, కొద్ది నెలల కిందట, 658 00:29:04,494 --> 00:29:06,455 నీ పనులన్నీ నేను చూసుకోవడం మొదలుపెట్టిన తరువాత… 659 00:29:08,749 --> 00:29:12,878 నేను ఎంత చేసినా నువ్వు థాంక్స్ చెప్పవని గ్యాబీ నన్ను ముందే వారించింది. 660 00:29:12,961 --> 00:29:14,796 కానీ తను తప్పు చెబుతోందని నేను ఆశగా ఎదురుచూశాను. 661 00:29:14,880 --> 00:29:15,881 సరే. 662 00:29:16,381 --> 00:29:18,258 నీకు థాంక్స్ కావాలా? అయితే తీసుకో. 663 00:29:18,967 --> 00:29:19,968 థాంక్స్. 664 00:29:21,220 --> 00:29:23,222 నువ్వు అందుకోసం పని చేస్తావా? థాంక్స్ కోసం? 665 00:29:23,305 --> 00:29:24,556 నువ్వు చాలా అహంభావివి, 666 00:29:24,640 --> 00:29:26,016 - అది నీకు తెలుసా? - తెలుసు. 667 00:29:26,099 --> 00:29:29,228 అందరూ నిన్ను ఆరాధించాలని ఆశిస్తావు, 668 00:29:29,311 --> 00:29:32,064 కానీ ఎవరికైనా కనీస గౌరవం దక్కుతుందా లేదా అనే విషయం అస్సలు పట్టించుకోవు. 669 00:29:32,147 --> 00:29:33,690 అది నిజం అని నువ్వు నమ్ముతున్నావా? 670 00:29:33,774 --> 00:29:35,692 నేను ఏం తప్పు చేశానో నాకు తెలియడం లేదు, పాల్. 671 00:29:35,776 --> 00:29:36,860 నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. 672 00:29:36,944 --> 00:29:38,403 - సరే. - నీ పేషంట్లకు నేను సాయం చేశాను. 673 00:29:38,487 --> 00:29:39,821 నేను పాల్ బృందంలో ఒకడిగా మెలిగాను. 674 00:29:39,905 --> 00:29:42,074 నేను పాల్ బృందం సభ్యుడిగా ఎల్లవేళలా పని చేశాను. 675 00:29:42,157 --> 00:29:43,825 అది నా వ్యక్తిత్వం. పాల్ బృందం. 676 00:29:43,909 --> 00:29:46,870 నేను చేసిన ప్రతి పనీ, అన్నీ నీ సంతోషం కోసం చేశాను. 677 00:29:46,954 --> 00:29:48,580 అవును, నేను మెగ్ తో శృంగారం చేశాను… 678 00:29:48,664 --> 00:29:49,748 డామిట్. 679 00:29:49,831 --> 00:29:51,166 నువ్వు ఏం చేశావు? 680 00:29:51,250 --> 00:29:52,251 జిమ్మీ… 681 00:29:52,334 --> 00:29:54,127 ఆ మనిషి కూతురితోనా? 682 00:29:54,211 --> 00:29:55,671 - డెరెక్! - నేను మూత్రం పోయాల్సి వచ్చింది. 683 00:29:55,754 --> 00:29:58,966 ఆ బాల్కనీకి రావాలంటే నువ్వు మూడు బాత్ రూమ్స్ దాటి రావాలి! 684 00:29:59,049 --> 00:30:00,342 మనకి తాజా గాలి పీల్చడం ఇష్టం కదా. 685 00:30:00,425 --> 00:30:01,927 లోపలికి వెళ్లిపో. 686 00:30:02,010 --> 00:30:03,595 ఊప్స్. సరే. 687 00:30:03,679 --> 00:30:05,013 నువ్వు మెగ్ తో శృంగారం చేశావు. 688 00:30:05,931 --> 00:30:08,976 - ఎప్పుడు? - కొన్నాళ్ళ కిందట. దానికేమీ అర్థం లేదు. 689 00:30:09,059 --> 00:30:10,435 - దానికి అర్థం లేదా? - లేదు, అది గొప్పగా సాగింది. 690 00:30:10,519 --> 00:30:12,521 - అది గొప్పగా ఉందా? - పాల్, అది పెద్ద ముఖ్యం కాదు. 691 00:30:12,604 --> 00:30:14,439 అది ఏదో క్షణికావేశంలో జరిగింది, కానీ తను తిరిగి డేవ్ దగ్గరే ఉంటోంది, 692 00:30:14,523 --> 00:30:16,483 కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 693 00:30:17,234 --> 00:30:21,113 నీ ప్రాక్టీసు మొత్తం గ్యాబీకి ఇచ్చేశావు. 694 00:30:21,613 --> 00:30:24,116 మనం దాని గురించి కొన్నేళ్ల కిందటే మాట్లాడుకున్నాం. 695 00:30:24,616 --> 00:30:25,909 నీకు పేపర్ వర్క్ ఇష్టం లేదని చెప్పావు ఇంకా 696 00:30:25,993 --> 00:30:29,079 పేషంట్లతో గడపడమే నీకు ఇష్టమని చెప్పావు. 697 00:30:29,162 --> 00:30:31,748 మనుషులు మారతారు. నువ్వు నన్ను కనీసం అడగలేదు, పాల్. 698 00:30:32,332 --> 00:30:33,876 - నువ్వు అది కోరుకునేవాడివా? - లేదు. 699 00:30:33,959 --> 00:30:35,794 అయితే, నీకు అవసరం లేని దాన్ని నీకు ఆఫర్ చేయలేదని 700 00:30:35,878 --> 00:30:38,672 నువ్వు నా మీద కోపంగా ఉన్నావా? 701 00:30:38,755 --> 00:30:40,382 అవును, నీ మీద కోపంగానే ఉన్నాను! 702 00:30:41,758 --> 00:30:43,468 నేను నీ మనిషిగా ఉండాల్సింది. 703 00:30:45,846 --> 00:30:46,930 నేను నీ మనిషిని. 704 00:30:47,514 --> 00:30:49,725 కానీ ఇలా, నువ్వు నాతో ప్రవర్తించే తీరు ఇదా? 705 00:30:49,808 --> 00:30:51,894 నువ్వు నన్ను ఇంతలా అవమానించకూడదు! 706 00:30:52,853 --> 00:30:55,272 - శాంతించు, బాబు. - లేదు, నాకు కోపంగా ఉంది, పాల్! 707 00:30:55,355 --> 00:30:56,899 నాకు ఇది అవమానంగా ఉంది. 708 00:30:56,982 --> 00:30:59,067 నువ్వు ఊరు వెళ్లిపోతున్న విషయం నేను మెగ్ ని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. 709 00:30:59,151 --> 00:31:01,987 నువ్వు నేరుగా నా దగ్గరకి వచ్చి నా కళ్లలోకి చూస్తూ నువ్వు ఊరు విడిచి వెళ్లిపోతున్న విషయాన్ని 710 00:31:02,070 --> 00:31:03,822 నాకు చెప్పేంత కనీస మర్యాద కూడా నువ్వు పాటించలేదు. 711 00:31:07,659 --> 00:31:08,911 మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. 712 00:31:09,411 --> 00:31:12,956 నీలో ఉన్న ఈ ద్వేషం అంతా 713 00:31:13,040 --> 00:31:16,627 బహుశా వేరొకరి కోసం ఉద్దేశించి ఉండచ్చు. 714 00:31:18,337 --> 00:31:20,088 లేదు, ఇది మన ఇద్దరినీ ఉద్దేశించి అంటున్నాను. 715 00:31:20,672 --> 00:31:21,673 నాకు ఇప్పుడు అర్థమైంది. 716 00:31:22,174 --> 00:31:24,384 నువ్వు నాకు ఎంత ముఖ్యమో నేను నీకు అంత ముఖ్యం కాదు. 717 00:31:24,468 --> 00:31:27,137 అది నాకు అర్థం కావడానికి ఇంత కాలం పట్టడం నిజంగా నా మూర్ఖత్వం. 718 00:31:28,305 --> 00:31:29,598 చూడు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. 719 00:31:29,681 --> 00:31:32,351 నేను రేపు ఉదయం 10 గంటలకి బయలుదేరతాను. 720 00:31:34,144 --> 00:31:38,732 నీలో ఆవేశం చల్లారిన తరువాత వచ్చి నాకు గుడ్ బై చెప్పు. 721 00:31:40,901 --> 00:31:43,779 నీ మనసులో ఏదో ఒక వెలితిని మిగిల్చి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. 722 00:31:45,155 --> 00:31:47,282 నా ఉద్దేశం, నేను అంత సున్నితమైన వాడిని కాదు, పాల్. 723 00:31:47,366 --> 00:31:48,617 నేను ఎలాగో బతుకుతాను. 724 00:32:12,057 --> 00:32:14,810 నేను మెంఫిస్ లో నడుస్తున్నాను 725 00:32:14,893 --> 00:32:17,688 నా పాదాలతో నడుస్తున్నాను బియల్ వీధికి పది అడుగుల దూరంలో 726 00:32:17,771 --> 00:32:21,191 కెల్లీ, నువ్వు నాతో పాటు పాడాలి అనుకుంటే, నేను పాడే స్వరం స్థాయిలో పాడు. 727 00:32:21,275 --> 00:32:22,359 ఏం జరుగుతోంది? 728 00:32:23,694 --> 00:32:26,363 సట్టన్ ఇంకా నేను, నీతో పాటు టెనెస్సీ వస్తున్నాం. 729 00:32:28,156 --> 00:32:29,992 ఇంకా రాగలిగితే, కెల్లీ కూడా వస్తుంది. 730 00:32:30,075 --> 00:32:31,201 నిజంగానా? 731 00:32:31,285 --> 00:32:32,870 అవును. నువ్వు అద్భుతంగా పని చేస్తున్నావు. 732 00:32:33,579 --> 00:32:35,289 నువ్వు మాతో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 733 00:32:35,372 --> 00:32:36,748 థాంక్యూ. 734 00:32:36,832 --> 00:32:38,959 సరే. నేను అది జరిగేలా చూస్తాను. 735 00:32:39,793 --> 00:32:43,005 మంచిది. వీలైనప్పుడల్లా తనకి కాస్త షుగర్ ఇవ్వాలన్న విషయం నాకు గుర్తు చేయి 736 00:32:43,088 --> 00:32:45,048 లేదంటే తను నన్ను నిజంగా చంపేస్తుంది. 737 00:32:45,132 --> 00:32:47,384 ఆగు, నువ్వు నిజంగా వస్తున్నావా? 738 00:32:47,467 --> 00:32:49,636 మనం ప్రేమించే వారి కోసం కొన్ని త్యాగాలు చేయాలి. 739 00:32:51,430 --> 00:32:54,141 ఆ తర్వాత దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ, జీవితాంతం ప్రతి గొడవలోనూ 740 00:32:54,224 --> 00:32:57,227 ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటాం. కదా? 741 00:33:00,022 --> 00:33:02,316 - హాయ్. - హాయ్. 742 00:33:05,444 --> 00:33:06,904 నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను. 743 00:33:06,987 --> 00:33:08,197 - ఓహ్… ఓహ్. - అవును. 744 00:33:08,280 --> 00:33:12,534 నేను భరించలేనంతగా అతి చేసే నానమ్మని అవుతాను! 745 00:33:12,618 --> 00:33:14,036 అందుకు నేను చాలా ఎగ్జయిటెడ్ గా ఉన్నాను, 746 00:33:14,119 --> 00:33:16,830 ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా నన్నేమీ ఆపలేవు. 747 00:33:16,914 --> 00:33:17,956 నాకు తెలుసు. 748 00:33:18,040 --> 00:33:20,292 కానీ నీకు కొన్ని అవసరాలు ఉన్నాయని కూడా నాకు తెలుసు. 749 00:33:20,375 --> 00:33:21,502 నీకు తెలుసా? 750 00:33:21,585 --> 00:33:22,878 అవి నాకు నచ్చవు. 751 00:33:22,961 --> 00:33:26,089 కాబట్టి… నీ కోసం ఇవి తెచ్చాను. 752 00:33:29,801 --> 00:33:30,802 ఇవి నిజమైనవే అంటావా? 753 00:33:31,637 --> 00:33:37,100 నా క్రేజీ పాపాయి ప్రసవించడానికి, అంటే, ఏడు నెలల వ్యవధి ఉంది కదా. 754 00:33:37,768 --> 00:33:41,063 కాబట్టి అది యూరప్ లో ఎందుకు జరగకూడదు? 755 00:33:41,146 --> 00:33:43,440 డబ్లిన్ లో గిన్నిస్ ఫ్యాక్టరీకి టికెట్లు అందులో ఉన్నాయి. 756 00:33:43,524 --> 00:33:46,985 వెర్బియేర్ లో నాకు ఇష్టమైన రెస్టారెంట్ లో రిజర్వేషన్ ఉంది. 757 00:33:47,069 --> 00:33:49,071 ఇంకా బిడ్డ పుట్టిన తరువాత, 758 00:33:49,154 --> 00:33:50,822 మనం అప్పటికీ కొన్ని అడ్వెంచర్ యాత్రలు చేయవచ్చు… 759 00:33:50,906 --> 00:33:51,907 అప్పుడప్పుడు. 760 00:33:54,159 --> 00:33:56,370 - వావ్. - అయితే ఇది బార్సిలోనా నుంచి మొదలవుతుంది. 761 00:33:56,453 --> 00:33:57,579 సరే, కానీ… 762 00:33:58,080 --> 00:33:59,164 నువ్వు దాన్ని సరిగ్గా పలకగలవా? 763 00:34:00,916 --> 00:34:02,459 బార్తెలోనా. 764 00:34:02,543 --> 00:34:04,670 చాలా సెక్సీగా ఉంది. 765 00:34:04,753 --> 00:34:06,421 - నువ్వు చాలా సిల్లీ. - ధన్యవాదాలు, నా ప్రియురాలా. 766 00:34:27,359 --> 00:34:28,694 హేయ్. కారు వచ్చేసింది. 767 00:34:29,820 --> 00:34:31,864 సరే. వస్తున్నాను. 768 00:34:31,947 --> 00:34:32,947 పాల్ రోడ్స్ నా కారు వచ్చేసింది. 769 00:34:33,031 --> 00:34:36,159 దండం మీద ఆరేసిన బీచ్ టవల్ రెపరెపలాడుతోంది 770 00:34:37,953 --> 00:34:42,123 తన 1988 నాటి ఫోర్డ్ కారులో తిరిగిన మీ నాన్నని నేను గుర్తు చేస్తున్నానా? 771 00:34:43,792 --> 00:34:46,837 ప్యాసింజర్ డోర్ నుండి బయటకి చూస్తున్న లాబ్రడార్ 772 00:34:49,005 --> 00:34:53,177 మీ జుట్టు నుంచి ఇసుక గాలికి ఎగిరి నా కళ్లలో పడుతోంది 773 00:34:54,636 --> 00:34:58,307 అందుకు బీచ్ ని నిందించు ఎదిగిన మనుషులు ఏడవరు 774 00:34:59,892 --> 00:35:03,979 నీకు గుర్తుందా ఆ శిథిలమైన బేస్మెంట్ సోఫా? 775 00:35:05,439 --> 00:35:08,442 నేను ప్రేమగీతాలు పాడుతుండగా ఇంకా నువ్వు నాకు చెప్పినవి 776 00:35:11,153 --> 00:35:15,115 మీ అమ్మ ఎలా పారిపోయిందీ ఇంకా తన ఉంగరాన్ని ఎలా తాకట్టు పెట్టిందీ 777 00:35:16,700 --> 00:35:20,871 నాకు గుర్తుంది నాకు ప్రతీదీ గుర్తుంది 778 00:35:23,373 --> 00:35:26,084 ముగింపు వేళలో నిర్లక్ష్యం చేయడం 779 00:35:26,168 --> 00:35:29,505 సూర్యోదయం వరకూ ఉండిపోమంటూ నన్ను ప్రాధేయపడ్డావు 780 00:35:30,005 --> 00:35:32,424 విచిత్రమైన మాటలు బయటకు వ్యక్తమయ్యాయి 781 00:35:32,508 --> 00:35:35,511 మతిస్థిమితం కోల్పోయిన ఒక పెద్దమనిషి నోటి మాటలవి 782 00:35:36,303 --> 00:35:38,514 దృశ్యాలూ ఇంకా గడిచిపోతున్న కాలం 783 00:35:38,597 --> 00:35:41,642 నువ్వు తాగే సమయంలో మాత్రమే అలాగ నవ్వుతుంటావు 784 00:35:42,434 --> 00:35:45,103 నేను అలా ఉండకూడదు అనుకుంటాను కానీ అలాగే ఉంటాను 785 00:35:45,187 --> 00:35:48,857 నీతో గడిపిన రాత్రుళ్లు ప్రతి క్షణం నాకు గుర్తుంది 786 00:36:09,169 --> 00:36:11,171 తెలుగు అనువాదకర్త: హరీష్