1 00:00:07,341 --> 00:00:10,427 ప్రయాణం అనేది జీవితంలో ఒక భాగం అంటుంటారు. 2 00:00:10,427 --> 00:00:16,391 అయ్యుండొచ్చు, కానీ అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ లో చిరాకు తెప్పించే అనుభవం ఎదురుకాకపోతే బాగుంటుంది. 3 00:00:19,311 --> 00:00:23,190 నా ఉద్దేశం, రెండు గంటలు ముందే రమ్మని చెప్పి పిలిపించినా కూడా... 4 00:00:23,899 --> 00:00:26,235 రెండు గంటలు లేట్ అయ్యే ప్రమాదం 5 00:00:26,235 --> 00:00:28,820 ఇంకెక్కడ ఎదురవుతుంది చెప్పండి? 6 00:00:29,321 --> 00:00:33,367 అయినా కూడా, గత ఏడాది నా ప్రయాణాలు నాకు కలిసొచ్చాయనే అనుకుంటున్నాను. 7 00:00:33,367 --> 00:00:35,869 అవి నా జీవిత దృక్పథాన్ని విశాలపరిచినట్టు ఉన్నాయి. 8 00:00:36,537 --> 00:00:37,996 కొంతమట్టుకు అనుకోండి. 9 00:00:38,622 --> 00:00:42,960 కాబట్టి, నేను ఇప్పుడు ఏ మంచి ప్రయాణికుడైనా తప్పకుండా చేయాల్సిన 10 00:00:42,960 --> 00:00:45,337 ఒక ప్రయాణం చేయబోతున్నాను. 11 00:00:47,464 --> 00:00:49,091 యూరోప్ యాత్రకు వెళ్తున్నాను. 12 00:00:50,801 --> 00:00:52,719 సరే. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 13 00:00:54,263 --> 00:00:56,557 నేను మొత్తం ఖండాన్ని చుట్టబోతున్నాను... 14 00:00:58,350 --> 00:01:01,478 అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి దక్షిణాదిన అట్టడుగున ఉన్న చోటు వరకు. 15 00:01:01,478 --> 00:01:06,775 సహజంగా జనం వెళ్లని చోట్లకు వెళ్లి, అద్భుతమైన ప్రదేశాలను కనుగొనబోతున్నాను... 16 00:01:07,401 --> 00:01:08,652 మీకు కనిపిస్తుందా? 17 00:01:08,652 --> 00:01:12,614 ...నాలో ప్రాణం పోసుకుంటున్న సాహస గుణాన్ని ప్రోత్సహించబోతున్నాను. 18 00:01:12,614 --> 00:01:14,116 నన్ను చూడండి. చేతులు వదిలేశాను. 19 00:01:15,868 --> 00:01:17,911 అవి ఇక్కడే ఉన్నాయి. అదేంటి, బో చేపా? 20 00:01:19,204 --> 00:01:21,915 కొత్త కొత్త రుచులు ఆస్వాదించబోతున్నాను... 21 00:01:22,875 --> 00:01:24,334 వావ్, ఇది భలే ఉంది. 22 00:01:24,334 --> 00:01:25,878 ద్రాక్షపళ్ళు సిద్ధం. 23 00:01:26,962 --> 00:01:29,798 ...స్థానికుడిలా జీవించడానికి ప్రయత్నిస్తా. 24 00:01:29,798 --> 00:01:31,383 మా ఊరికి స్వాగతం. 25 00:01:32,342 --> 00:01:34,887 ఇది నమ్మశక్యంగా లేదు. 26 00:01:34,887 --> 00:01:37,014 నేను నీ ప్రాణాలు కాపాడాను. అది గుర్తుంచుకో. 27 00:01:37,014 --> 00:01:40,058 నేను నా చింతలన్నిటినీ సూట్ కేసులో పెట్టి... 28 00:01:41,560 --> 00:01:42,978 వస్తున్నారు. వస్తున్నారు చూడండి. 29 00:01:42,978 --> 00:01:45,856 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 30 00:01:45,856 --> 00:01:49,401 నా చిన్న నాట నుండి నేను ఇలాంటి పనిని చేసిందే లేదు. 31 00:01:49,401 --> 00:01:52,404 ...అలాగే నేను ముందెన్నడూ పలకని 32 00:01:52,404 --> 00:01:54,198 మూడు పదాలు పలకబోతున్నాను. 33 00:01:55,073 --> 00:01:56,283 టేకాఫ్ కి సిద్ధం. 34 00:02:01,663 --> 00:02:04,499 {\an8}యూరోప్ 35 00:02:09,545 --> 00:02:11,423 సరే. నేను ఒక విషయం ఒప్పుకోవాలి. 36 00:02:11,423 --> 00:02:16,094 ఎక్కడికి ప్రయాణం చేయాలనే విషయంలో మీకు సలహా ఇచ్చే సీన్ నాకు లేదు. 37 00:02:16,803 --> 00:02:18,972 కానీ ఒకవేళ మీరు అది అడిగితే, 38 00:02:18,972 --> 00:02:23,852 నేను ఈ దేశం ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన దేశం అని బల్లగుద్ది మరీ చెప్తాను. 39 00:02:25,604 --> 00:02:28,398 ఇటలీ 40 00:02:28,982 --> 00:02:33,237 ఇటలీ మీద నాకున్న ప్రేమ రోమ్ మరియు వెనిస్ నగరాలను చూసిన తర్వాత రగులుకుంది. 41 00:02:34,321 --> 00:02:38,116 ఈసారి, ఎప్పుడైనా సరే మరింత అన్వేషించాలనిపించే 42 00:02:38,116 --> 00:02:41,161 ఈ దేశంలో ఇంకేముందో తెలుసుకోవడానికి నేను తిరిగి వచ్చాను. 43 00:02:41,161 --> 00:02:45,249 ఇటాలియన్లు "ల డోల్చె వీట" అంటుంటారు, అంటే తియ్యని జీవితం అని. 44 00:02:46,166 --> 00:02:48,836 అంటే, ఇంతవరకు నా జీవితం సాఫీగానే సాగింది, 45 00:02:48,836 --> 00:02:52,589 కానీ జీవితంలోకి ఒకింత తియ్యదనాన్ని చేర్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? 46 00:02:52,589 --> 00:02:56,301 కానీ ఆ తీయదనాన్ని వీళ్ళు ఎలా సాధిస్తారు? వీళ్ళ రహస్యం ఏంటి? 47 00:02:57,427 --> 00:03:01,974 ఫ్లోరెన్స్ అలాగే మిగిలిన టస్కనీ ప్రాంతంలో ఆ రహస్యం బయటపడుతుందేమో అని ఆశిస్తున్నాను. 48 00:03:04,518 --> 00:03:06,645 - నా పేరు సారో. - యుజీన్. 49 00:03:06,645 --> 00:03:08,856 సరే, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. పదండి. 50 00:03:08,856 --> 00:03:10,732 గ్రాజ్జి మిల్లె. 51 00:03:10,732 --> 00:03:12,776 నేను నాకు వచ్చిన ఇటాలియన్ అంతా మాట్లాడేసా. 52 00:03:18,407 --> 00:03:21,034 జెర్మనీలో, నేను గోధుమగడ్డి జూస్ తాగి, 53 00:03:21,034 --> 00:03:23,787 అలాగే పులుసును నమిలాను. 54 00:03:23,787 --> 00:03:27,708 కాబట్టి ఇక్కడ కాస్త విలాసంలో తేలడానికి నేను రెడీగా ఉన్నా. 55 00:03:27,708 --> 00:03:31,420 మరి అందుకు అందమైన టస్కనీని మించిన ప్రదేశం ఇంకేమైనా ఉంటుందా? 56 00:03:31,420 --> 00:03:34,715 ఈ ప్రాంతపు రాజధాని, ఫ్లోరెన్స్ నుండి నా అన్వేషణను మొదలెడుతున్నా. 57 00:03:35,507 --> 00:03:37,676 రెనస్సాన్స్ సంస్కృతి ఆరంభమైన ప్రదేశం. 58 00:03:37,676 --> 00:03:40,429 ఇక్కడి నుండి చూస్తుంటే నిజంగా మతిపోతోంది, సారో. 59 00:03:40,429 --> 00:03:42,014 అవును, ఇది చక్కని వ్యూ. 60 00:03:43,557 --> 00:03:48,228 ఆర్ట్, అందమైన సంస్కృతితో నిండిన సిటీ, పైగా ఇక్కడ... 61 00:03:49,730 --> 00:03:51,190 ఓహ్, చెత్త. 62 00:03:51,190 --> 00:03:54,693 - అవును, నిజమే. - నేను ఇలా ఉంటుందని ఊహించలేదు. 63 00:03:54,693 --> 00:03:56,695 నేను మా దేశంలో కూడా చాలా చెత్త ట్రక్లు చూస్తుంటాను. 64 00:03:56,695 --> 00:04:00,657 ఇక్కడ ఇన్ని చెత్త ట్రక్స్ ఉండటానికి ఒక కారణం ఉంది... 65 00:04:01,783 --> 00:04:02,701 ఓహ్, అమ్మో. 66 00:04:02,701 --> 00:04:04,536 ...అధిక సంఖ్యలో వచ్చే టూరిస్టులు. 67 00:04:04,536 --> 00:04:08,123 ఫ్లోరెన్స్ కి ఏడాదికి 1.6 కోట్ల మంది వస్తుంటారు. 68 00:04:08,123 --> 00:04:09,875 ఫ్లోరెన్స్ ని చూడాలని చాలా మంది అనుకుంటుంటారు. 69 00:04:12,252 --> 00:04:13,086 ఆహ్-హహ్. 70 00:04:13,086 --> 00:04:14,338 నాకు ఇలా చెప్పుకోవడం గర్వంగా ఏం లేదు. 71 00:04:14,338 --> 00:04:18,132 కానీ నేను చెడ్డ ప్రయాణికుడిని మాత్రమే కాదు, చాలా చెడ్డ పర్యాటకుడిని కూడా. 72 00:04:18,132 --> 00:04:19,927 ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. 73 00:04:19,927 --> 00:04:23,096 కానీ నేను ఫ్లోరెన్స్ ని సరిగ్గా చూడాలి అంటే... 74 00:04:23,805 --> 00:04:24,848 వావ్. 75 00:04:24,848 --> 00:04:27,184 ...నాకు ఒక కీలకమైన మెళకువ ఒకటి తెలియాలి, 76 00:04:27,184 --> 00:04:30,103 అదే పర్యవేక్షించడం అనబడే ఒక పురాతన ఆర్ట్. 77 00:04:31,188 --> 00:04:34,775 హాయ్, ఇటలీకి స్వాగతం, యుజీన్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. 78 00:04:34,775 --> 00:04:36,693 - బొంజోర్నో. - బొంజోర్నో. 79 00:04:36,693 --> 00:04:38,570 నిన్ను చూడటం కూడా సంతోషం. 80 00:04:38,570 --> 00:04:40,364 ఇటలీకి స్వాగతం, అలాగే ఫ్లోరెన్స్ కి స్వాగతం. 81 00:04:40,364 --> 00:04:42,574 ఒకసారి అలా వెళదాం, మీకు ఈ ప్రదేశాన్ని చూపిస్తాను. 82 00:04:42,574 --> 00:04:43,825 సరే, అలాగే. 83 00:04:44,743 --> 00:04:49,414 ఒక గైడ్ గా, ఎమిలియానోకి ఇటాలియన్ చరిత్ర, సంస్కృతి, అలాగే ఫ్లోరెన్స్ 84 00:04:49,414 --> 00:04:51,917 అంటే చాలా ఇష్టం. 85 00:04:53,418 --> 00:04:57,256 ప్రతీ ఇటాలియన్ కి ఫ్లోరెన్స్ తో అన్యోన్యమైన సంబంధం ఉంటుంది. 86 00:04:57,256 --> 00:04:59,383 మా భాషే ఫ్లోరెన్స్ లో పుట్టింది. 87 00:04:59,383 --> 00:05:03,428 నిజం చెప్పాలంటే ఇది మాలో భాగం. అది మాటల్లో వర్ణించడం కష్టం. 88 00:05:03,428 --> 00:05:07,140 - నువ్వు ఇటాలియన్ వి అని ఈజీగా చెప్పొచ్చు. - అవును. నిజమే. మేము... 89 00:05:08,642 --> 00:05:09,977 అది... నీ వల్ల కావడం లేదు. 90 00:05:09,977 --> 00:05:11,812 నువ్వు నీ చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడగలవా? 91 00:05:11,812 --> 00:05:13,272 నేను మాట్లాడగలను అనుకోను. 92 00:05:14,022 --> 00:05:15,899 అలా చేస్తే నేను మాట్లాడలేను. 93 00:05:17,484 --> 00:05:20,779 చేతి సంజ్ఞలు మా సంస్కృతిలో భాగం. 94 00:05:20,779 --> 00:05:25,325 అధికారికంగా దాదాపు 250కి పైనే ఇటాలియన్ చేతి సంజ్ఞలు ఉన్నాయి. 95 00:05:25,325 --> 00:05:27,661 కానీ నేను మీకు ఒక బేసిక్ సంజ్ఞ నేర్పుతాను. 96 00:05:27,661 --> 00:05:30,539 మీరు గనుక ఒకవేళ... మీకు తెలియని వారు ఎవరైనా వచ్చారు అనుకోండి, 97 00:05:30,539 --> 00:05:32,291 - మీకు వాళ్ళతో మాట్లాడాలని లేదు అనుకుందాం. - సరే. 98 00:05:32,291 --> 00:05:34,334 అప్పుడు మీరు... అప్పుడు మీరు, "నీకు ఏం కావాలి? 99 00:05:34,334 --> 00:05:36,170 నీకు ఏం కావాలి?" అనొచ్చు. ఇలా చూడండి... 100 00:05:37,087 --> 00:05:38,505 - అవును. - నీకు ఏం కావాలి? 101 00:05:38,505 --> 00:05:39,756 అవును, నీకు ఏం కావాలి? 102 00:05:39,756 --> 00:05:41,842 - నీకు... ఏం కావాలి... - అవును, నీకు ఏం కావాలి? 103 00:05:41,842 --> 00:05:43,760 ఆ ఆటిట్యూడ్, చూశారా? 104 00:05:43,760 --> 00:05:48,015 హేయ్, ఏం... హేయ్, ఏంటి? 105 00:05:48,932 --> 00:05:51,602 మీతో మాట్లాడేది మీకు తెలిసినోళ్లు కాకపోతే, మీరు మరీ దురుసుగా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. 106 00:05:51,602 --> 00:05:52,519 నేనైతే నాకు తెలీని వారితో 107 00:05:52,519 --> 00:05:54,104 - అలా అస్సలు మాట్లాడను, కానీ... - లేదు. 108 00:05:54,104 --> 00:05:55,272 - చెప్పలేం. - చెప్పలేం. 109 00:05:55,272 --> 00:05:56,190 చెప్పలేం. 110 00:05:57,816 --> 00:06:02,779 ఉన్నట్టుండి నా చేతితో చేసే సంజ్ఞల విషయంలో నాకు కొంచెం భయంగా ఉన్నా, 111 00:06:03,864 --> 00:06:05,657 నేను నా టూర్ కి రెడీగా ఉన్నాను. 112 00:06:05,657 --> 00:06:08,452 మీరు ఇప్పుడు ఇటలీలోనే అత్యంత అందమైన కేథడ్రల్స్ లో 113 00:06:08,452 --> 00:06:10,954 ఒకదాని ముందు ఉన్నారు. అదే శాంటా మరియా దెల్ ఫియోరె. 114 00:06:11,455 --> 00:06:15,459 అంటే, మనం మన ట్రిప్ ని మొదలెట్టినప్పటి నుండే నేను దీన్ని గమనిస్తున్నాను. 115 00:06:15,459 --> 00:06:20,088 కానీ ఇది ఇంత పెద్దగా ఉంటుందని నేను ఊహించలేదు. 116 00:06:20,088 --> 00:06:23,425 ఒకసారి ఆలోచించండి. ఇందులో 30,000 మంది పడతారు. 117 00:06:28,180 --> 00:06:30,724 1296లో మొదలైన 118 00:06:30,724 --> 00:06:34,353 ఈ కేథడ్రల్ ని నిర్మించడానికి 140 ఏళ్ళు పట్టింది... 119 00:06:34,353 --> 00:06:38,899 - దీన్ని చూస్తుంటే మతి పోతోంది. - నిజమే. నమ్మశక్యంగా ఉండదు. 120 00:06:38,899 --> 00:06:43,278 ...దాని పైన శివార్లలో రెనస్సాన్స్ కాలపు ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూడొచ్చు. 121 00:06:46,281 --> 00:06:49,201 ఆ కాలంలో, ఆ డ్వోమోని నిర్మించడం చాలా పెద్ద సవాలైంది. 122 00:06:49,201 --> 00:06:50,285 అద్భుతంగా ఉంది. 123 00:06:50,285 --> 00:06:53,163 పదహారేళ్లు డోమ్ ని నిర్మించడానికే పట్టింది. 124 00:06:53,163 --> 00:06:54,456 వావ్. 125 00:06:55,624 --> 00:06:58,252 నలభై లక్షల ఇటుకలతో నిర్మించిన నిర్మాణం, 126 00:06:58,252 --> 00:07:01,880 ఇప్పటికీ ఇలాంటి నిర్మాణాలలో ఇదే ప్రపంచంలోనే అతిపెద్దది. 127 00:07:02,381 --> 00:07:05,133 లోపల ఎలా ఉంటుందో నా ఊహకే వదిలేసాను. 128 00:07:05,133 --> 00:07:07,719 కేథడ్రల్ లోకి వెళ్లి క్యూలో నిలబడతారా? 129 00:07:09,596 --> 00:07:11,807 వద్దు. నాకు క్యూలో నిలబడటం నచ్చదు. 130 00:07:11,807 --> 00:07:14,935 నా వల్ల కాదు. నాకు ఎక్కువ మందితో కలిసి వెళ్లే టూర్లు నచ్చవు. 131 00:07:14,935 --> 00:07:16,186 నేను సహించలేను... 132 00:07:21,942 --> 00:07:24,528 ఇక్కడ నిలబడి దాన్ని చూడటమే బాగుంది. 133 00:07:24,528 --> 00:07:26,530 నేను ఇక్కడ ఉన్నాను, డ్వోమో అక్కడ ఉంది. 134 00:07:27,364 --> 00:07:28,490 అంతే. నేను దాన్ని చూశాను. 135 00:07:29,241 --> 00:07:33,203 అదృష్టవశాత్తు, పెద్దగా ఆర్భాటం చేయని టూర్ గైడ్ నాకు దొరికాడు, 136 00:07:33,203 --> 00:07:36,748 నిజంగా చూడాల్సిన వాటిని చూపించగలవాడు... 137 00:07:36,748 --> 00:07:39,209 - అక్కడ ఉంది. - అవును, అద్భుతంగా ఉంది. 138 00:07:39,209 --> 00:07:40,335 అది అద్భుతంగా ఉంది. 139 00:07:40,919 --> 00:07:42,546 ...మైకెలేంజెలో చెక్కిన డేవిడ్ విగ్రహం. 140 00:07:43,922 --> 00:07:46,466 అది చాలా అందంగా ఉంది. 141 00:07:47,092 --> 00:07:48,886 - ఇది నిజమైన డేవిడ్ విగ్రహమా లేక... - ఇది ఒక కాపీ. 142 00:07:48,886 --> 00:07:50,554 ఇది డేవిడ్ విగ్రహం యొక్క చక్కని కాపీ. 143 00:07:50,554 --> 00:07:52,764 - ఇది ఒక కాపీ. - అవును, అవును. 144 00:07:52,764 --> 00:07:55,142 ఇక నిజమైన డేవిడ్ విగ్రహాన్ని చూడటానికి మ్యూజియం దగ్గర ఎంత 145 00:07:55,142 --> 00:07:56,810 - పెద్ద లైన్ ఉంటుందో ఊహించగలను. - అవును, నిజమే. 146 00:07:56,810 --> 00:07:58,187 అవును. మీరు టికెట్ తీసుకోవాలి, 147 00:07:58,187 --> 00:08:00,647 - అలాగే లైన్ లో నిలబడాలి, అవును... - అవును, క్యూలు బార్లు తీరి ఉంటాయి. 148 00:08:00,647 --> 00:08:03,192 అంటే, కనిపిస్తోంది కదా... ఇక్కడ దీన్ని చూడటానికి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. 149 00:08:03,192 --> 00:08:08,071 సరే, ఇది ఒక డూప్లికేట్ అయ్యుండొచ్చు, కానీ దీని వల్ల నేను బోలెడంత టైమ్ ఆదా చేసుకోగలిగాను. 150 00:08:08,071 --> 00:08:12,659 పైగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక శిల్పం రెప్లికాను చూడగలిగాను. 151 00:08:13,202 --> 00:08:18,665 బైబిల్ కథనం పుణ్యమా, డేవిడ్ ఖచ్చితంగా ఒక యూదుడు అని చెప్పొచ్చు. 152 00:08:18,665 --> 00:08:21,835 అంటే, కొన్నివిధాలుగా కాకపోవచ్చు. 153 00:08:21,835 --> 00:08:26,340 నా దృష్టిలో పడింది అతని అంగమే. 154 00:08:29,635 --> 00:08:35,807 చూస్తుంటే దానికి సున్నతి చేసినట్టు లేదు, 155 00:08:37,558 --> 00:08:40,729 కానీ డేవిడ్ యూదుడు. 156 00:08:41,772 --> 00:08:46,401 దీన్ని బట్టి మైకెలేంజెలో ఎక్కడా షార్ట్ కట్స్ తీసుకోలేదు అని చెప్పొచ్చు. 157 00:08:47,444 --> 00:08:50,280 నన్ను చూడండి. అప్పుడే ఆర్ట్ విమర్శకుడిని అయిపోయాను. 158 00:08:50,280 --> 00:08:52,824 అది కూడా ఇక్కడికి వచ్చిన గంటసేపటికే. 159 00:08:54,201 --> 00:08:56,036 కానీ ఈ చోటును పూర్తిగా ఆస్వాదించాలి అంటే, 160 00:08:56,036 --> 00:09:00,624 నాకు చెందిన ఒక రెనెస్సాన్స్ ఆర్ట్ ఒకటి ఉండాలని ఎమిలియానో బలవంతం పెట్టాడు. 161 00:09:00,624 --> 00:09:04,628 ఇది మైకెలేంజెలో, డా విన్సీ లాంటి ఆర్టిస్టుల పుట్టిల్లు, 162 00:09:04,628 --> 00:09:07,297 కాబట్టి, మీరు కూడా ఆ ఆర్ట్ రుచి చూడాలి. 163 00:09:07,297 --> 00:09:09,591 - వ్యంగ్య చిత్రాలు, తెలుసా? - వ్యంగ్య చిత్రం. 164 00:09:09,591 --> 00:09:11,176 అవును. 165 00:09:11,176 --> 00:09:14,388 ఈ సిటీకి ఎవరు వచ్చినా వాళ్ళ బొమ్మ గీయించుకునే వెళతారు. 166 00:09:15,472 --> 00:09:16,431 ప్లీజ్. 167 00:09:16,431 --> 00:09:18,934 అబ్బా, ఇది చూస్తుంటే కాస్త భయంగానే ఉంది. 168 00:09:19,768 --> 00:09:22,229 పెద్దగా... పెద్దగా ఒకసారి నవ్వండి. 169 00:09:22,229 --> 00:09:23,355 ఇటు చూడండి, మిస్టర్. 170 00:09:23,355 --> 00:09:27,150 మీకు నచ్చినా, నచ్చకపోయినా, ఇదే నా పెద్ద నవ్వు. 171 00:09:27,734 --> 00:09:28,902 మరీ వేగంగా గీసేయకండి. 172 00:09:30,779 --> 00:09:34,449 ఈ వ్యంగ్య చిత్రాలకు చాలా గొప్ప చరిత్ర ఉందని ఎమిలియానో చెప్తున్నాడు. 173 00:09:35,033 --> 00:09:38,245 చివరికి లియోనార్డో డా విన్సీ కూడా వ్యంగ్య చిత్రాలు గీసేవారు, తెలుసా? 174 00:09:38,245 --> 00:09:40,873 - డా విన్సీ వ్యంగ్య చిత్రాలు గీసేవాడా? - అవునా, సరదాకి. 175 00:09:40,873 --> 00:09:42,624 అంటే, నేను... ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? 176 00:09:44,835 --> 00:09:49,381 నాకైతే ఏనాడూ నేను మోనా లిసా కంటే తక్కువ వాడిని అన్న ఫీలింగ్ రాలేదు. 177 00:09:49,381 --> 00:09:51,175 - సరే. - ఆహ్-హహ్. 178 00:09:51,175 --> 00:09:53,010 - ఒకటి, రెండు... - ఓరి, దేవుడా. 179 00:09:53,594 --> 00:09:55,262 అవును, చూపించండి. 180 00:09:55,762 --> 00:09:56,763 చూపిం... 181 00:10:00,392 --> 00:10:01,393 హ్యాపీ. 182 00:10:02,102 --> 00:10:03,812 పర్లేదు, ఇక నుండి నేను ఇంకా గట్టిగా నవ్వాలి. 183 00:10:03,812 --> 00:10:05,272 కదా? 184 00:10:06,398 --> 00:10:10,360 నా మొహం నేనే చూసుకుంటూ సంతోషంగా ఇక్కడి నుండి బయలుదేరడానికి ముందు, 185 00:10:10,360 --> 00:10:14,406 ఎమిలియానో చివరిగా నాకు ఒకటి చూపించాలి అనుకున్నాడు. 186 00:10:14,406 --> 00:10:18,493 పొంటే వెక్కియోకి స్వాగతం, ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ బ్రిడ్జ్. 187 00:10:20,162 --> 00:10:24,917 పొంటే వెక్కియో అనబడే ఇది ఫ్లోరెన్స్ లోనే అత్యంత పాత, ఐకానిక్ బ్రిడ్జ్. 188 00:10:26,293 --> 00:10:29,421 ఓహ్, అమ్మో, అమ్మో, అమ్మో. 189 00:10:31,131 --> 00:10:33,133 ఇది నిజంగా అద్భుతంగా ఉంది. 190 00:10:34,760 --> 00:10:37,387 - చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. - అవును. 191 00:10:37,387 --> 00:10:39,348 జనం లేకపోతే ఇంకా బాగుండేది. 192 00:10:40,891 --> 00:10:42,059 తప్పుగా అనుకోవద్దు, 193 00:10:42,059 --> 00:10:46,021 ఇది ఆర్ట్ అలాగే చరిత్రతో నిండిన ఒక అందమైన సిటీ, 194 00:10:46,522 --> 00:10:51,068 కానీ కాస్త ప్రశాంతంగా అన్నీ చూడగలిగే అవకాశం ఉంటే బాగుండు అని ఉంది. 195 00:10:51,777 --> 00:10:56,073 నాకైతే ఒక గ్లాస్ వైన్ కూడా ఉంటే, ఇంకా అద్భుతంగా ఉంటుంది. 196 00:10:56,073 --> 00:10:57,533 - భలే. - అవును. 197 00:10:57,533 --> 00:10:59,034 మనకు ఇది నచ్చుతుంది. 198 00:11:00,118 --> 00:11:02,120 - ఓరి, దేవుడా. ఇక్కడ భలే అందంగా ఉంది. - అవును. 199 00:11:02,120 --> 00:11:03,038 చాలా అందంగా ఉంది. 200 00:11:03,038 --> 00:11:05,249 - థాంక్స్. గ్రాజ్జి. - సర్, తీసుకోండి. 201 00:11:05,249 --> 00:11:08,710 సలూ... ఒక మాట, మీరు ఇటలీలో చీర్స్ చెప్పడానికి... 202 00:11:08,710 --> 00:11:10,963 - సరే. - ...మీరు ఎదుటివారిని కళ్ళలోకి చూసి... 203 00:11:10,963 --> 00:11:12,464 కళ్ళలోకి నేరుగా చూసి చెప్పాలి. 204 00:11:14,466 --> 00:11:15,509 లేదు, గ్లాస్ వైపు కాదు. 205 00:11:16,009 --> 00:11:17,386 నేరుగా కళ్ళలోకి చూడాలి. 206 00:11:19,179 --> 00:11:20,347 లేదు. 207 00:11:21,974 --> 00:11:22,808 అవును. 208 00:11:23,433 --> 00:11:25,143 - సరే. - అవును, అంతే. 209 00:11:27,938 --> 00:11:31,650 - వావ్. భలే. - ఇది మంచి వైన్. 210 00:11:31,650 --> 00:11:33,026 మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇది... 211 00:11:33,026 --> 00:11:37,614 ఇది ఇటలీకి రావడానికి సరైన సీజన్, ఎందుకంటే ఇప్పుడు వైన్ సీజన్ నడుస్తోంది. 212 00:11:37,614 --> 00:11:41,326 మీకు నిజమైన పంట కోత ఎలా ఉంటుందో చూడాలని ఉందా టస్కనీలో? 213 00:11:41,326 --> 00:11:42,995 - ద్రాక్ష పళ్ళ కోత. - అవును. 214 00:11:42,995 --> 00:11:45,038 మనం అక్కడికి వెళ్ళాక ఆ పని చేయబోతున్నామా? 215 00:11:45,038 --> 00:11:46,498 అవును, అదే చేద్దాం. 216 00:11:46,498 --> 00:11:47,499 - నాకు ఇష్టమే. - సరే. 217 00:11:47,499 --> 00:11:50,794 మీకు టౌన్ బయట చాలా కొత్త అనుభవం ఎదురవుతుంది. 218 00:11:50,794 --> 00:11:51,837 అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. 219 00:11:51,837 --> 00:11:55,507 అక్కడే మనం నిజమైన నిమ్మళమైన జీవితం ఎలా ఉంటుందని చూడగలుగుతాం. 220 00:11:55,507 --> 00:12:00,220 నిమ్మళమైనది ఏదైనా సరే, నాకు ఇష్టమే. 221 00:12:00,804 --> 00:12:02,973 - టస్కనీ కోసం తాగుదాం. - టస్కనీ కోసం తాగుదాం. 222 00:12:02,973 --> 00:12:04,892 నాకు చాలా సంతోషంగా ఉంది. 223 00:12:04,892 --> 00:12:06,393 టస్కనీకి వెళ్లి అక్కడ... 224 00:12:06,393 --> 00:12:08,645 కాస్త హాయిగా గడపడం మంచి విషయం అనే అనిపిస్తోంది. 225 00:12:09,438 --> 00:12:13,859 ఇటలీలోని టూరిస్టులు మోహరించే ప్రదేశాలకు దూరంగా వెళ్లి, 226 00:12:14,359 --> 00:12:18,614 నిజమైన ఇటాలియన్ లాగ... బ్రతకొచ్చు. 227 00:12:23,994 --> 00:12:25,662 ఇది బాగుంది. 228 00:12:25,662 --> 00:12:27,122 అది... కాదు. 229 00:12:27,122 --> 00:12:29,416 సరే, ఇది గుర్తుంచుకోండి, "నీకు ఏం కావాలి?" 230 00:12:29,416 --> 00:12:32,377 - నీకు ఏం కావాలి? - అవును, అవును, అంతే. నీకు ఏం... 231 00:12:32,377 --> 00:12:33,545 - నీకు ఏం కావాలి? - అవును. 232 00:12:35,589 --> 00:12:37,007 సారో వచ్చాడు. 233 00:12:37,591 --> 00:12:38,759 నేను మిమ్మల్ని రెండు రోజులలో కలుస్తాను. 234 00:12:38,759 --> 00:12:40,219 - టస్కనీలోనా? - అవును, వైనరీ దగ్గర. 235 00:12:40,219 --> 00:12:42,221 - గ్రాజ్జి. - సరే, చావ్. 236 00:12:42,221 --> 00:12:43,972 ఇక మీ హోటల్ కి వెళదాం. 237 00:12:46,517 --> 00:12:49,019 ఇక ఫ్లోరెన్స్ కి చావ్ చెప్తున్నాను. 238 00:12:49,019 --> 00:12:54,441 ఎమిలియానో నాకు చూపించిన సిటీని చూడగా ఇటాలియన్లు తమ చరిత్ర అలాగే సంస్కృతిని చూసుకుని 239 00:12:54,441 --> 00:12:55,859 ఎంతగా గర్విస్తారో తెలుసుకున్నా. 240 00:12:55,859 --> 00:12:59,655 అతను అన్నట్టుగా, అది వారిలో ఒక భాగం. 241 00:13:00,948 --> 00:13:03,951 కానీ ఇప్పుడు నేను ఓర్చియా వ్యాలీకి దక్షిణాన ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాను, 242 00:13:03,951 --> 00:13:06,161 అది అందమైన సీనరీలు, 243 00:13:06,828 --> 00:13:09,873 మధ్యయుగపు కోటలు, పురాతన గ్రామాలు, 244 00:13:09,873 --> 00:13:12,793 అలాగే ఆశ్చర్యకరంగా జనాభా లేమితో అద్భుతంగా ఉండే ప్రదేశం. 245 00:13:13,919 --> 00:13:16,755 ఇటాలియన్ గ్రామాలను మించిందే లేదు. 246 00:13:18,048 --> 00:13:23,387 ఎమిలియానో నాకు ప్రమాణం చేసిన నిమ్మళమైన జీవితాన్ని అనుభవించడం నేను ఇప్పటికే మొదలెట్టేసాను. 247 00:13:24,054 --> 00:13:25,222 మనం కొండ పైకి వెళ్తున్నాం. 248 00:13:27,599 --> 00:13:28,600 మన వెనుక ఎవరు ఉన్నారు? 249 00:13:29,184 --> 00:13:31,436 మనల్ని దాటాలని చూసేవారు ఎవరైనా అంటావా? 250 00:13:34,648 --> 00:13:36,650 అబ్బా, ఇవాళ అతనికి కలిసొచ్చినట్టు ఉంది, ఆహ్? 251 00:13:37,234 --> 00:13:41,864 తెలిసింది ఏంటంటే, ఈ కొండ పైన ఒక చోట నా హోటల్ ఉంది అంట. 252 00:13:41,864 --> 00:13:43,490 నేను దానిని కనుక్కోవాలి అంతే. 253 00:13:44,157 --> 00:13:45,576 - మనం వచ్చేసాం. - వావ్. 254 00:13:45,576 --> 00:13:47,286 - గ్రాజ్జి. ప్రెగో. - గ్రాజ్జి మిల్లి. 255 00:13:47,953 --> 00:13:50,539 {\an8}మోంటేవెర్డి 256 00:14:04,761 --> 00:14:07,723 ఆ హోటల్ ఈ ఊర్లో ఎక్కడో ఒక చోట 257 00:14:07,723 --> 00:14:11,518 ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ, అంచనాలు వేస్తున్నాను. 258 00:14:13,395 --> 00:14:14,813 చావ్, యుజీన్. 259 00:14:14,813 --> 00:14:16,523 బొంజోర్నో. 260 00:14:17,232 --> 00:14:21,236 - స్వాగతం, నా పేరు జన్కార్ల. ఎలా ఉన్నారు? - నేను బాగున్నా. 261 00:14:21,236 --> 00:14:23,113 - మీరు వచ్చారు. - అవును. 262 00:14:23,113 --> 00:14:25,616 ఇక్కడికి రావడానికి మూడు వారాలు పట్టింది అనుకోండి కానీ చేరుకున్నాను. 263 00:14:26,617 --> 00:14:29,494 జన్కార్ల ఇక్కడ 12 ఏళ్లుగా పనిచేస్తోంది. 264 00:14:30,204 --> 00:14:33,457 సరే, ఇక్కడ నా ముందు ఉన్నది ఏంటి? ఇదేనా హోటల్? 265 00:14:34,208 --> 00:14:35,709 ఇది హోటల్ లో ఒక భాగం. 266 00:14:35,709 --> 00:14:39,755 మీరు తిరిగి ప్రాణం పోయబడిన 12వ శతాబ్దపు 267 00:14:39,755 --> 00:14:41,965 కుగ్రామాన్ని చూస్తున్నారు. 268 00:14:41,965 --> 00:14:46,136 ఈ ఊరు ఇంకా మనుగడలో ఉంది. ఇక్కడ ఇంకా 11 కుటుంబాలు ఉంటున్నాయి. 269 00:14:46,136 --> 00:14:48,680 - ఇక్కడ ఇంకా జనం ఉంటున్నారా? - అవును. 270 00:14:49,598 --> 00:14:52,518 ఇంతకీ ఇక్కడ నేను హోటల్ ని కనుగొనలేకపోవడానికి కారణం 271 00:14:52,518 --> 00:14:55,312 ఈ ఊరే ఆ హోటల్ అంట. 272 00:14:55,312 --> 00:14:59,858 ఒకానొకప్పుడు, ఆ క్రింద ఉన్న నేలను సేద్యపరిచే రైతులు ఈ ఊర్లో ఉండేవారు. 273 00:15:02,486 --> 00:15:05,656 కానీ ఇప్పుడు ఈ హోటల్ ని ఒరిజినల్ నిర్మాణాలలో 274 00:15:05,656 --> 00:15:09,076 కలిసిపోయే విధంగా మార్చి ఇక్కడ కట్టారు. 275 00:15:10,827 --> 00:15:16,708 నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి "వల్ దోర్చియ" ప్రాంతాన్ని మీకు చూపించాలి అనుకున్నాను. 276 00:15:16,708 --> 00:15:19,378 అనేక శతాబ్దాలుగా ఆర్కిటెక్చర్ అలాగే అందమైన ప్రకృతి 277 00:15:19,378 --> 00:15:23,465 సామరస్యంతో కలిసి నివసించిన ప్రదేశం ఇది. 278 00:15:25,050 --> 00:15:26,468 మీరు ఇది చూస్తున్నారా? 279 00:15:34,101 --> 00:15:35,853 ఇది అద్భుతంగా ఉంది. 280 00:15:38,438 --> 00:15:40,566 సరే, మీ గదికి స్వాగతం. 281 00:15:42,067 --> 00:15:43,485 బాగానే ఉంది. 282 00:15:44,152 --> 00:15:47,322 దీన్ని మేము మోంటే చెతోనా సూట్ అంటాం. 283 00:15:48,073 --> 00:15:50,075 మా దగ్గర ఉన్న అతిపెద్ద గదులలో ఇది ఒకటి. 284 00:15:50,075 --> 00:15:51,201 నాకు నచ్చింది. 285 00:15:52,786 --> 00:15:54,872 ఇది నిజంగా అద్భుతంగా ఉంది. 286 00:15:54,872 --> 00:15:58,417 నిరాడంబరంగా, చారిత్రాత్మకమైన ప్రదేశంలా ఉండటం నచ్చింది. 287 00:15:59,001 --> 00:16:00,669 ఆ దుంగలు నచ్చాయి. ఆ చెక్క పని నచ్చింది. 288 00:16:00,669 --> 00:16:02,880 పాత కాలపు నిర్మాణ తీరు నచ్చింది. 289 00:16:04,840 --> 00:16:05,966 మంచి వ్యూ కూడా ఉంది. 290 00:16:10,929 --> 00:16:15,309 ఒక కొండపై ఉండే మధ్యయుగపు గ్రామంలో నిర్మించబడిన ఒక బోటీక్ హోటల్. 291 00:16:16,226 --> 00:16:18,937 ఇలాంటి ప్రదేశాన్ని నేను ముందెప్పుడూ చూడలేదు. 292 00:16:19,855 --> 00:16:25,861 ఈ ప్రదేశాన్ని చూస్తే ఎలాంటి ప్రయాణికుడికైనా మనసులో ఉన్న సంకోచాలు తొలగిపోతాయి. 293 00:16:27,279 --> 00:16:30,365 నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది, సరేనా? 294 00:16:30,365 --> 00:16:34,119 ఈ ప్రదేశం, ఇక్కడి నిశ్శబ్దం చాలా నచ్చాయి. 295 00:16:35,370 --> 00:16:39,208 ఇక్కడి జీవితమే చాలా వ్యత్యాసంగా ఉంది, సరేనా? 296 00:16:39,208 --> 00:16:44,421 మన ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ రిలాక్స్ అయిపోతాయి. 297 00:16:44,421 --> 00:16:48,300 పెద్దగా శ్వాస బయటకు వదిలి హాయిగా గడపాలి అనిపిస్తుంది. 298 00:17:02,814 --> 00:17:07,277 ఇక్కడి పాత గ్రామ చర్చి దగ్గర సెంటర్ లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. 299 00:17:07,778 --> 00:17:09,530 నిన్న రాత్రి చక్కగా పడుకున్నాను. 300 00:17:09,530 --> 00:17:11,198 ఒక్క శబ్దం వినిపించలేదు. 301 00:17:11,198 --> 00:17:15,661 కిటికీలు తెరిచి ఉంచాను, చల్లని గాలి వచ్చింది, చంటి బిడ్డలా పడుకున్నాను. 302 00:17:19,455 --> 00:17:22,166 మీకోసం స్క్రాంబెల్డ్ ఎగ్స్ తెచ్చాను. 303 00:17:22,792 --> 00:17:27,130 దాని మీద అదనంగా సమ్మర్ ట్రఫుల్ వేస్తాను. 304 00:17:27,631 --> 00:17:31,176 వాళ్లకు నా గుడ్ల మీద ట్రఫుల్స్ వేయాలి అని ఉంటే, నేను ఎందుకు కాదంటాను. 305 00:17:31,176 --> 00:17:33,262 - ఎంజాయ్ చేయండి. - సరే. 306 00:17:34,263 --> 00:17:38,767 దీన్ని చూస్తుంటే త్వరలోనే "ల డోల్చె వీట" ఎలా ఉంటుందో తెలుస్తుంది అనిపిస్తోంది. 307 00:17:40,310 --> 00:17:41,436 వావ్, ఇది భలే ఉంది. 308 00:17:42,938 --> 00:17:44,231 సరే, ఇక్కడ టస్కనీలో 309 00:17:44,231 --> 00:17:48,026 ద్రాక్ష తోటల్లో ద్రాక్షపళ్ళు కోస్తున్నారు అని చెప్పారు, 310 00:17:48,026 --> 00:17:51,989 కాబట్టి వారికి ఏమైనా సాయం అవసరమైతే నేను వస్తానని వారితో చెప్పాను. 311 00:17:51,989 --> 00:17:56,743 కానీ ద్రాక్ష పళ్ళు కోయడానికి సిద్ధంగా ఉన్నాయో లేదో ఎమిలియానో చూసి చెప్పే లోపు, 312 00:17:56,743 --> 00:17:59,079 నాకు కాలక్షేపానికి ఒక ఐడియా వచ్చింది. 313 00:17:59,079 --> 00:18:02,124 అంటే, నాకు ఈ హోటల్ లోనే గడపాలని ఉన్నా కూడా, 314 00:18:02,124 --> 00:18:03,667 అది నాకు కష్టమైన పని కాదనుకోండి, 315 00:18:03,667 --> 00:18:09,339 ఈ అందమైన ప్రాంతం వైపు ఇక్కడ నన్ను ఏదో ఆకర్షిస్తోంది. 316 00:18:09,840 --> 00:18:11,508 కాబట్టి నేను కొంచెం అలా వెళ్లి చూద్దాం అనుకుంటున్నా. 317 00:18:14,761 --> 00:18:20,350 నాకు ఇటాలియన్ ఆహారం అంటే చాలా ఇష్టం అని మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది, 318 00:18:20,350 --> 00:18:24,146 కాబట్టి హోటల్ వారి స్థానికంగా నా టిఫిన్ ప్లేట్ మీద ఉంచబడిన బెస్ట్ ఐటమ్ ని 319 00:18:24,146 --> 00:18:27,649 ఉత్పత్తి చేసే వారిని నాకు పరిచయం చేసారు. 320 00:18:30,861 --> 00:18:34,448 నేను ముందెప్పుడూ ట్రఫుల్స్ వేటకు వెళ్ళింది లేదు. అసలు ఈ పని ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. 321 00:18:34,448 --> 00:18:37,034 నేను మంచి కళ్ళద్దాల కోసం వేటాడను అనుకోండి, 322 00:18:37,826 --> 00:18:40,746 కానీ అంత మాత్రాన నేను వేటగాడిని అని చెప్పుకోలేను కదా. 323 00:18:42,247 --> 00:18:43,832 పైగా దేన్నైనా ఏరుకోవడం కూడా నాకు నచ్చే పనికాదు. 324 00:18:47,294 --> 00:18:48,420 బోన్జోర్నో. 325 00:18:48,420 --> 00:18:50,047 - హలో. - బోన్జోర్నో. 326 00:18:50,047 --> 00:18:51,757 ఫెడెరీకో. 327 00:18:51,757 --> 00:18:53,717 - ఫెడెరీకో. - ఇక్కడి ఓనర్. 328 00:18:53,717 --> 00:18:57,513 - అలాగే నేను టాన్య. మిమ్మల్ని కలవడం సంతోషం. - టాన్యా. మిమ్మల్ని కలవడం సంతోషం. 329 00:18:57,513 --> 00:18:59,556 మరి ఈ బుజ్జి కొండ ఎవరు? 330 00:18:59,556 --> 00:19:03,018 - అది మా ట్రఫుల్ హంటర్. - ఓహ్, అమ్మ బాబోయ్. 331 00:19:03,018 --> 00:19:04,019 జారా. 332 00:19:04,019 --> 00:19:07,022 - జారా, ఇక ట్రఫుల్ వేటకు వెళదామా? - సరే. 333 00:19:07,022 --> 00:19:08,440 - పదా. - సరేనా? 334 00:19:08,440 --> 00:19:09,358 ఇక వెళదాం. 335 00:19:09,358 --> 00:19:13,445 టాన్యా ఇక్కడ ఫెడెరీకోతో కలిసి అద్భుతమైన లొకేషన్ లో ఉన్న 336 00:19:13,445 --> 00:19:17,324 అతని ఆలివ్ తోట అలాగే ద్రాక్ష తోటల్లో పనిచేస్తుంది. 337 00:19:17,324 --> 00:19:21,286 మనం టస్కనిలోని చాలా ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాం, 338 00:19:21,286 --> 00:19:23,789 ఎందుకంటే ఆ అడవి మధ్యలో 339 00:19:23,789 --> 00:19:29,461 ట్రఫుల్స్ పెరగడానికి సరిపోయే వాతావరణం అలాగే సరైన మట్టి ఉంటాయి. 340 00:19:30,754 --> 00:19:33,966 అయితే నేను కనిపెట్టే ట్రఫుల్స్ ని నేనే ఉంచుకోవచ్చు కదా. 341 00:19:35,133 --> 00:19:37,719 - ఏమో. - అవునా? సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. 342 00:19:38,303 --> 00:19:39,721 సరే, ఇక వెళ్తున్నాం. 343 00:19:40,222 --> 00:19:42,266 ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ట్రఫుల్స్ పెరగడానికి చక్కని చోటులా ఉంది. 344 00:19:43,183 --> 00:19:47,312 అసలు ట్రఫుల్స్ పెరిగే ప్రదేశం ఎలా ఉంటుందో నాకు తెలీదు. 345 00:19:47,312 --> 00:19:50,190 అదృష్టవశాత్తు, జారాకి తెలుసు. 346 00:19:50,190 --> 00:19:53,819 అవి ఇక్కడ పెరిగే చెట్ల వేర్ల మధ్య పెరుగుతుంటాయి అంట. 347 00:19:53,819 --> 00:19:55,445 వేటకుక్కని వదులుదామా, ఆహ్? 348 00:19:56,530 --> 00:19:57,531 అంతే. 349 00:19:58,073 --> 00:20:00,200 సరే, జారా. వెళ్ళు, జారా. 350 00:20:00,993 --> 00:20:02,244 ట్రఫుల్. 351 00:20:02,244 --> 00:20:05,914 జారా. వెళ్ళు, బుజ్జి. నువ్వు ఎలాగైనా కనిపెట్టాలి. 352 00:20:08,667 --> 00:20:12,921 జారాకి మనుషులకంటే 50 రెట్లు బలమైన వాసన చూసే సామర్ధ్యం ఉంది. 353 00:20:12,921 --> 00:20:18,135 కాబట్టి అది నేల క్రింద ఉండే ట్రఫుల్స్ ప్రత్యేకమైన వాసనను కనిపెట్టగలదు. 354 00:20:18,135 --> 00:20:21,346 అది ఏమైనా కనిపెట్టిందేమో మనకు ఎలా తెలుస్తుంది? 355 00:20:21,346 --> 00:20:24,892 అప్పుడు మనం... ఎందుకంటే అది ట్రఫుల్ ని కనిపెడితే. 356 00:20:24,892 --> 00:20:29,730 చాలా సంతోషంగా నేలను తవ్వడం మొదలెడుతుంది. 357 00:20:31,106 --> 00:20:32,107 జారా. 358 00:20:33,025 --> 00:20:34,026 జారా. 359 00:20:36,153 --> 00:20:38,322 అది అక్కడ ఏమైనా కనిపెట్టి ఉంటుందా? 360 00:20:38,947 --> 00:20:40,240 జారా! 361 00:20:41,825 --> 00:20:43,410 - థాంక్స్. - సరే. 362 00:20:44,161 --> 00:20:45,829 ఇది ట్రఫుల్ ని కనిపెట్టింది! 363 00:20:47,831 --> 00:20:48,832 లేదు. 364 00:20:50,250 --> 00:20:53,295 - తవ్వు, తవ్వు, తవ్వు. ఇక్కడ ఏముంది? - ట్రఫుల్ ఎక్కడ ఉంది, జారా? 365 00:20:53,879 --> 00:20:55,881 - వావ్! - అవునా? ఓహ్, బేబీ! 366 00:20:56,798 --> 00:20:58,592 మంచి పిల్లవి! 367 00:20:59,843 --> 00:21:05,224 ఈ ట్రఫుల్ వాసన చూడండి. మీకు భూమి వాసన తెలుస్తుంది. 368 00:21:05,224 --> 00:21:07,226 - అంటే, నాకు... అవును, నిజమే. - అవును. 369 00:21:07,226 --> 00:21:09,561 ఒక ట్రఫుల్ ని మీరు ఎంతకు అమ్ముతారు? 370 00:21:09,561 --> 00:21:16,235 - ఇది బంగారం లాంటిది. - దీని ఖరీదు 60 యురోలు ఉంటుంది. కనీసం. 371 00:21:16,235 --> 00:21:20,614 అడవిలో పడ్డ 20 నిమిషాల కష్టానికి ఇది మంచి రాబడే. 372 00:21:20,614 --> 00:21:22,324 బాగానే కలిసొచ్చింది. మేము ఒక ట్రఫుల్ ని కనిపెట్టాం. 373 00:21:22,324 --> 00:21:25,077 ఇక ఫోన్లు చేయాల్సిన పనిలేదు. మాకు ట్రఫుల్ దొరికింది. 374 00:21:25,077 --> 00:21:26,954 సరే, టాన్యాకి చెప్పకండి, 375 00:21:26,954 --> 00:21:30,374 కానీ తర్వాత కొంత రిగటోనితో పాటు దీన్ని తినాలి అని ఆలోచిస్తున్నాను. 376 00:21:31,834 --> 00:21:34,545 కానీ ప్రస్తుతానికి ఆహారం తినడానికి కాసేపు ఆగాలి... 377 00:21:36,588 --> 00:21:39,424 ఎందుకంటే నేను ఇంకా తిరిగి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. 378 00:21:40,217 --> 00:21:42,135 ఇప్పుడు నేను సార్టియానోకి వెళ్తున్నాను, 379 00:21:43,804 --> 00:21:47,766 నా హోటల్ కొండ క్రింద ఉన్న 700 ఏండ్ల నాటి ఒక టౌన్. 380 00:21:48,392 --> 00:21:52,855 ఇక్కడి తియ్యని జీవితం వెనుకున్న రహస్యం, మనతోటి వారిని కనిపెట్టడమే. 381 00:21:53,564 --> 00:21:56,859 పల్లెటూళ్ళ వైపు వెళ్లడం అంటే, ఒకింత సాహసంలాగే ఉంటుంది, 382 00:21:56,859 --> 00:22:00,487 కాబట్టి నా ఈ చిన్ని విహార యాత్ర కులాసాగా సాగాలని ఆశిస్తున్నాను. 383 00:22:11,832 --> 00:22:15,752 ఇక్కడి స్థానికులు ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమానికి ప్రాక్టీసు చేస్తున్నారు, 384 00:22:15,752 --> 00:22:17,796 సారసీన్ల జోస్టింగ్ కార్యక్రమం. 385 00:22:18,589 --> 00:22:22,342 అలాగే జన్కార్ల నన్ను ఈ కార్యక్రమం వెనుక జరిగే దృశ్యాలను చూపించడానికి తీసుకొచ్చింది. 386 00:22:24,553 --> 00:22:25,888 భలే! వావ్. 387 00:22:25,888 --> 00:22:28,140 - ఎలా ఉందంటారు? - ఈమె స్టిఫానియా. 388 00:22:28,140 --> 00:22:29,850 - ఈమెను పరిచయం చేద్దాం అనుకున్నాను. - స్టిఫానియా. 389 00:22:29,850 --> 00:22:32,311 - హలో. మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కలవడం సంతోషం. 390 00:22:32,311 --> 00:22:38,567 ఇది మా వాళ్ళు సారసీన్ల జోస్టింగ్ ప్రాక్టీసు చేస్తున్నారు. 391 00:22:41,111 --> 00:22:44,781 ఈ డ్రమ్ములు అలాగే జండాల ఆట అసలు కార్యక్రమానికి ముందు జరిగే ప్రదర్శనలు, 392 00:22:44,781 --> 00:22:47,492 అదే కాంట్రాడా అని పిలవబడే సార్టియానోలోని 393 00:22:47,492 --> 00:22:50,996 అయిదు సాంప్రదాయక జిల్లాల వారి మధ్య జరిగే 394 00:22:50,996 --> 00:22:52,497 జొస్టింగ్ పోటీ. 395 00:22:53,707 --> 00:22:57,503 అంటే, ప్రతీ కాంట్రాడాకి సొంత జండా ఒకటి ఉంటుందా? 396 00:22:57,503 --> 00:23:02,090 అవును. ప్రతీ కాంట్రాడాకి ఇద్దరు మధ్యయుగ డ్రమ్మర్లు, ఇద్దరు జెండాలు మోసేవారు ఉంటారు. 397 00:23:02,090 --> 00:23:04,134 మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు? 398 00:23:04,134 --> 00:23:06,845 - ఏడాదిలో చాలా సార్లు. అవును. - అవునా? 399 00:23:06,845 --> 00:23:07,971 ఏడాది మొత్తం జరుగుతుంటాయి. 400 00:23:07,971 --> 00:23:09,681 - సరే. అలాగే. - అవును. 401 00:23:09,681 --> 00:23:15,395 మీకు ఇష్టమైతే, మా వాళ్ళు జెండాను ఎలా విసరాలో మీకు నేర్పిస్తారు. 402 00:23:15,395 --> 00:23:17,898 భలే, జెండాలు విసరడం అంటే ఎవరికైనా నచ్చుతుంది కదా? 403 00:23:17,898 --> 00:23:18,899 సరే. 404 00:23:21,693 --> 00:23:22,986 - సరే, మీరు... - చెప్పు. 405 00:23:23,570 --> 00:23:26,073 నన్ను చూసి ఫాలో అవ్వండి. 406 00:23:26,073 --> 00:23:27,533 నేను ఇలా చేస్తాను. 407 00:23:28,033 --> 00:23:28,867 అంటే... 408 00:23:31,578 --> 00:23:32,412 అలాగే... 409 00:23:35,916 --> 00:23:38,252 ఇదే నా ఆఖరి జెండాలు విసిరే కార్యక్రమం కావొచ్చు. 410 00:23:38,252 --> 00:23:40,587 సమాధి రాయి మీద ఇలా రాయబడటం ఎవరికీ నచ్చదు కదా. 411 00:23:41,213 --> 00:23:44,466 అంటే, "బుర్రకు జెండా తగిలి పోయాడు" అని. 412 00:23:44,466 --> 00:23:47,553 - ఇలా, అలాగే... - కానివ్వు. 413 00:23:48,303 --> 00:23:51,974 గొప్ప విషయం ఏంటంటే, ఈ నైపుణ్యం మధ్యయుగ కాలాల నుండి మనుగడలో ఉంది, 414 00:23:51,974 --> 00:23:54,768 అప్పట్లో మిలటరీ పరేడ్లలో ఇలా చేసేవారు. 415 00:23:54,768 --> 00:23:55,853 ఇంకొకసారి. 416 00:23:56,436 --> 00:23:58,397 ఇప్పుడు అది నేను నేర్చుకుంటున్నాను. 417 00:23:58,397 --> 00:24:01,567 - ఇలాగా? - అవును. 418 00:24:01,567 --> 00:24:03,735 అంటే, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా. 419 00:24:03,735 --> 00:24:05,487 మూడు, అలాగే... 420 00:24:07,823 --> 00:24:10,117 భలే! 421 00:24:10,117 --> 00:24:11,910 అందరూ దయచేసి కూర్చోండి. 422 00:24:17,249 --> 00:24:19,459 కానీ ప్రాక్టీసులో రెండవ భాగానికి... 423 00:24:22,129 --> 00:24:24,715 నేను సురక్షితంగా పక్కనే నిలబడి చూడబోతున్నా. 424 00:24:28,093 --> 00:24:29,970 ఇదే మధ్యయుగపు జోస్ట్. 425 00:24:29,970 --> 00:24:34,725 ఇది దాదాపు 14వ శతాబ్దంలో ఒక టోర్నమెంట్ గా మారింది. 426 00:24:34,725 --> 00:24:36,226 - పదునాలుగవ శతాబ్దం? - అవును. 427 00:24:36,226 --> 00:24:37,144 సరే. 428 00:24:39,146 --> 00:24:41,273 డ్రమ్మర్లు అలాగే జెండాలు విసిరేవారితో కార్యక్రమ 429 00:24:41,273 --> 00:24:43,692 ప్రారంభోత్సవం మొదలవుతుంది. 430 00:24:45,944 --> 00:24:47,654 జోస్ట్ అనబడేది ఒకప్పుడు 431 00:24:47,654 --> 00:24:51,241 హింసాత్మకంగా వీరులు గుర్రాల మీద కూర్చొని తలపడే కాలాన్ని సూచిస్తుంది. 432 00:24:51,241 --> 00:24:56,747 కానీ ఇప్పుడు, ప్రత్యర్థికి బదులు టార్గెట్ మీద ఒక చిన్న రింగ్ ని పెట్టి పనికానిచ్చేస్తున్నారు. 433 00:25:08,467 --> 00:25:10,177 అది చాలా చిన్న రింగ్. 434 00:25:11,261 --> 00:25:15,807 అది చాలా చిన్న రింగ్, కానీ వాళ్ళ బల్లెం రెండు మీటర్ల 80 సెంటీమీటర్లు ఉంటుంది. 435 00:25:16,391 --> 00:25:19,937 అంటే, పొడవాటి బల్లెం, చిన్న రింగ్. 436 00:25:19,937 --> 00:25:23,982 ఇది చూడటానికి అసాధ్యమనిపించేలా ఉన్న పని, కానీ... 437 00:25:26,902 --> 00:25:29,404 - వావ్. అతను చాలా బాగా చేస్తున్నాడు. - అవును. 438 00:25:29,404 --> 00:25:30,906 బ్రావో. 439 00:25:34,284 --> 00:25:37,579 సరే, నేను గనుక ఒకప్పటిలాగే ప్రయాణాలు చేస్తుండి ఉంటే, 440 00:25:37,579 --> 00:25:40,499 నేను టస్కనీని నేడు చూస్తున్న విధంగా చూడగలిగేవాడిని కాదు. 441 00:25:40,499 --> 00:25:43,502 ఎంతైనా ఆఖరికి, నేను కాలు బయటపెట్టి 442 00:25:43,502 --> 00:25:46,505 ఇలాంటి వాటిని అనుభవించినందుకు సంతోషంగా ఉంది. 443 00:25:46,505 --> 00:25:48,131 మనసుకు చాలా ఉల్లాసంగా ఉంది. 444 00:25:50,217 --> 00:25:53,178 అలాగే, ఆహారంతో పాటు, ఇలా జనంతో గడపడం 445 00:25:53,178 --> 00:25:55,514 కూడా నాకు బాగా నచ్చుతుందని తెలుసుకున్నా. 446 00:25:55,514 --> 00:25:59,601 ఆ రెండు విషయాలు ఇటాలియన్లకు ఎంత ముఖ్యమో, నాకు కూడా అంతే ముఖ్యం. 447 00:26:00,143 --> 00:26:01,728 మనసును ఒక విధమైన ఉల్లాసంతో నింపుతుంది. 448 00:26:01,728 --> 00:26:05,482 ఒక విధమైన మంచి, కుటుంబపరమైన సాంఘిక భావన ఉట్టిపడుతోంది. 449 00:26:07,860 --> 00:26:12,531 ఇవాళ నాకు ఒక టూరిస్టును అన్న ఫీలింగ్ పెద్దగా రాలేదు. 450 00:26:12,531 --> 00:26:15,033 టస్కనీ పౌరుడిలాగే ఎంజాయ్ చేశాను. 451 00:26:15,033 --> 00:26:17,995 మనం కూడా పాల్గొన్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. 452 00:26:28,380 --> 00:26:30,174 గ్రాజ్జి. 453 00:26:30,174 --> 00:26:32,426 ప్రేగో. ఇక మీరు మీ కాప్పచ్చీనోని ఎంజాయ్ చేయండి. 454 00:26:33,135 --> 00:26:34,511 సంతోషంగా ఎంజాయ్ చేస్తా. 455 00:26:36,430 --> 00:26:38,599 రోజును ఆరంభించడానికి ఇదే సరైన విధానం. 456 00:26:39,474 --> 00:26:42,519 నేను వెళ్లిన అన్ని దేశాలలో, జీవితాన్ని ఆస్వాదించే వేగం విషయానికి వస్తే 457 00:26:43,395 --> 00:26:46,190 ఇటలీ దేశం నా రుచికి తగినట్టుగా ఉంది. 458 00:26:49,318 --> 00:26:51,612 ఇది ఇటలీలో నా ఆఖరి రోజు, 459 00:26:51,612 --> 00:26:55,282 అలాగే ఎమిలియానో ద్రాక్ష పంట కోస్తాము అన్న ఆశతో 460 00:26:55,282 --> 00:26:57,868 ద్రాక్షతోట దగ్గర తనని కలవమని అడిగాడు. 461 00:26:58,577 --> 00:27:00,287 నాకైతే అక్కడికి వెళ్లి, వాళ్లకు సాయం చేసి, 462 00:27:00,287 --> 00:27:05,167 కొన్ని ద్రాక్షపళ్ళు కోసుకుని, వాటిని బుట్టలో పెట్టడం సరదాగానే ఉంటుంది అనిపిస్తోంది, 463 00:27:05,167 --> 00:27:10,380 కానీ పంటను ఎప్పుడు కోయాలనే విషయాన్ని ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుంది. 464 00:27:12,758 --> 00:27:13,759 ఎమిలియానో! 465 00:27:13,759 --> 00:27:16,470 - హేయ్, యుజీన్! - కమ స్టాయ్. 466 00:27:16,470 --> 00:27:19,223 - మట్టేయో. నిన్ను కలవడం సంతోషం. - మట్టేయో. 467 00:27:19,223 --> 00:27:20,557 మీకు ఒకరితో ఒకరికి ఎలా పరిచయం? 468 00:27:20,557 --> 00:27:24,394 మేము ఎలిమెంటరీ స్కూల్ లో 22 ఏళ్ల క్రితం కలిసాం, 469 00:27:24,394 --> 00:27:27,105 అలాగే అప్పటి నుండి అన్నదమ్ములుగా కలిసి పెరిగాము. 470 00:27:27,105 --> 00:27:28,190 వావ్. 471 00:27:29,233 --> 00:27:32,945 ఇటలీ ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ ఉత్పత్తిదారు, 472 00:27:32,945 --> 00:27:36,156 అలాగే సాంప్రదాయకంగా ద్రాక్ష పళ్ళు సిద్ధం అయినప్పుడు, 473 00:27:36,156 --> 00:27:40,994 అందరూ కలిసి ల వండేమియాలో పాల్గొంటారు, అంటే, ద్రాక్షపళ్ళ కొత. 474 00:27:40,994 --> 00:27:44,456 ఏడాదిలో ఈ సమయంలో, మాకు సాధారణంగా మా నోన్నొ నుండి ఫోన్ వస్తుంది, 475 00:27:44,456 --> 00:27:45,374 అంటే మా తాతయ్య. 476 00:27:45,374 --> 00:27:47,668 "ఈ వారాంతం నువ్వు ఏం చేస్తున్నావు?" "నాకు తెలీదు." 477 00:27:47,668 --> 00:27:50,462 "నువ్వు నాతో రా. మనం ద్రాక్ష పళ్ళు కోస్తున్నాం." 478 00:27:50,462 --> 00:27:51,922 - సరదాగా ఉంటుంది. మీకు నచ్చుతుంది. - సరే. 479 00:27:51,922 --> 00:27:53,465 - మీకు ఇది నచ్చుతుంది. - సరే. ఇది బాగానే ఉంది. 480 00:27:53,465 --> 00:27:55,092 - ఇక వెళదామా? - సరే, పదా. 481 00:27:55,092 --> 00:27:56,051 వెళదాం. 482 00:27:58,679 --> 00:27:59,805 - బోన్జొర్నో. - హేయ్. 483 00:27:59,805 --> 00:28:01,348 - నీ పేరు ఏంటి? - ఎనేయ. 484 00:28:01,348 --> 00:28:03,433 - నేను ఇక్కడ మేనేజర్ ని. - యుజీన్. 485 00:28:03,433 --> 00:28:05,561 - మిమ్మల్ని కలవడం సంతోషం. - నిన్ను కలవడం సంతోషం. 486 00:28:06,979 --> 00:28:08,814 - మనం ఇక ద్రాక్ష తోటకి వెళ్తున్నామా? - అవును. 487 00:28:08,814 --> 00:28:12,776 పంట కోతకు ఏ ఏరియా సరిగ్గా ఉందో చూడటానికి మనం వెళ్తున్నాం. 488 00:28:12,776 --> 00:28:17,489 కొన్ని తోటల్లోని పళ్ళు మిగతవాటికంటే సిద్ధంగా ఉండటం ఎలా సాధ్యం? 489 00:28:17,489 --> 00:28:20,242 ఎందుకంటే మా దగ్గర నాలుగు రకాల ద్రాక్ష పళ్ళు కాస్తున్నాయి, 490 00:28:20,242 --> 00:28:22,828 ప్రతీ రకం వేరే టైమ్ లో కోతకు రెడీ అవుతుంది. 491 00:28:25,873 --> 00:28:27,249 ఇది మెర్లోట్ ఏరియా. 492 00:28:27,249 --> 00:28:29,168 మనం ముందు దీన్ని ట్రై చేసి చూడబోతున్నాం. 493 00:28:30,627 --> 00:28:33,213 ముందు, మనం ట్రై చేయాలి. మీకు అది తిన్నాక ఎలా అనిపించింది? 494 00:28:37,968 --> 00:28:38,969 ద్రాక్ష పండులాగే అనిపించింది. 495 00:28:41,013 --> 00:28:43,640 సరే. దీని ఫ్లేవర్ మరింత బలంగా ఉంటుంది. 496 00:28:43,640 --> 00:28:45,893 నాలిక వెనుక కూడా దాని రుచి తెలుస్తుంది. 497 00:28:45,893 --> 00:28:49,897 దానర్థం మెర్లోట్ ఏరియా కోతకు సిద్ధంగా ఉంది అని. 498 00:28:49,897 --> 00:28:51,857 అయితే, మీరు వీటిని ఎంత త్వరగా కొయ్యాలి? 499 00:28:51,857 --> 00:28:56,486 మాకు పంట కోతకు సిద్ధమైనప్పుడు, మేము వెంటనే కోత కోయడం మొదలెట్టాలి, 500 00:28:56,486 --> 00:28:59,156 ఎందుకంటే మేము ఒక్క రోజు జాప్యం చేసినా, 501 00:28:59,156 --> 00:29:00,699 పంట పాడవుతుంది. 502 00:29:00,699 --> 00:29:02,034 - ఒక్క రోజు ఆగినా కూడానా? - అవును. 503 00:29:02,034 --> 00:29:04,244 ఒక్క రోజు ఆగినా, పనికిరాదు. 504 00:29:04,244 --> 00:29:05,996 ఒకవేళ బద్దకంతో రాలేకపోతే? అంటే, ఒకవేళ రాలేకపోతే? 505 00:29:05,996 --> 00:29:07,915 - టైమ్ కి నిద్రలేవలేకపోతే? - లేదు, పాడైపోతుంది. 506 00:29:07,915 --> 00:29:08,832 వావ్. 507 00:29:08,832 --> 00:29:11,210 - నాకు ఇక ఎదురుచూడాలని లేదు. - లేదు. టైమ్ లే... 508 00:29:11,210 --> 00:29:12,961 కాదు... నువ్వు... నువ్వు టైమ్ వృధా చేస్తున్నావు. 509 00:29:13,629 --> 00:29:14,630 నువ్వు ఇక వెళ్ళాలి. 510 00:29:16,965 --> 00:29:18,258 ద్రాక్షలు సిద్ధంగా ఉన్నాయి. 511 00:29:18,258 --> 00:29:19,927 సరే. పదండి. 512 00:29:19,927 --> 00:29:24,723 ఎమిలియానో, మట్టేయో, అలాగే నాకు కోత కోయడానికి ఒక గడిని ఇచ్చేసారు. 513 00:29:25,557 --> 00:29:28,227 - కనిపించింది. ఇక్కడ ఒకటి ఉంది. - ఇది కోయడం ఈజీ. 514 00:29:28,227 --> 00:29:29,561 సరే, అది బాగానే ఉంది. 515 00:29:29,561 --> 00:29:32,314 ఇంతవరకు పని సులువుగానే సాగింది. 516 00:29:32,898 --> 00:29:34,358 ఇక్కడ ఒక చిన్న గుత్తి ఉంది. 517 00:29:34,983 --> 00:29:37,069 - ఇది పూర్తయినట్టే. - సరే. 518 00:29:38,111 --> 00:29:40,614 సరే, పూర్తి అయింది. నాకు ఇప్పుడు ఈ పని అర్థమైంది. 519 00:29:41,573 --> 00:29:42,824 మీ పని ఎలా సాగుతోంది? 520 00:29:45,077 --> 00:29:49,498 ఈ పనికి మీరు బాగా పొట్టిగా ఉండేవాళ్ళను పెట్టుకుంటే మంచిది, తెలుసా? 521 00:29:49,498 --> 00:29:50,415 అది మంచి పాయింట్. 522 00:29:50,415 --> 00:29:53,126 ఎందుకంటే, ఇది... ఈ పని... నాకు నడుం పట్టేస్తోంది. 523 00:29:54,461 --> 00:29:57,047 దీన్ని చూడండి. ఇక నేను తర్వాతి దాని దగ్గరకు వెళ్తున్నా. 524 00:30:00,509 --> 00:30:02,427 మీరు సరిగ్గా పనిచేయలేకపోతే... 525 00:30:02,427 --> 00:30:04,972 - వీళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారు. - అవును, చాలా నెమ్మది. 526 00:30:04,972 --> 00:30:09,184 ఒకవేళ ఇది... ఇది నా ద్రాక్షతోట అయితే, వీళ్ళు ఈపాటికి పోయేవారు. 527 00:30:10,435 --> 00:30:11,436 పనిలో నుండి తీసేసేవారు. 528 00:30:11,436 --> 00:30:13,105 వీళ్ళు చిన్నప్పటి నుండి ఈ పని చేస్తున్నారు. 529 00:30:13,105 --> 00:30:14,106 కదా? 530 00:30:14,106 --> 00:30:18,026 వీళ్ళు చిన్నప్పుడు ఎలా ఆడుతూ పాడుతూ పనిచేసారో ఇప్పుడు కూడా 531 00:30:18,026 --> 00:30:21,321 అదే విధంగా పని చేయడాన్ని బట్టి చెప్పేయొచ్చు. 532 00:30:23,115 --> 00:30:25,993 మీకు ఈ పని సరిగ్గా చేయడం అస్సలు రాదు. 533 00:30:25,993 --> 00:30:27,578 నేను మీ నోన్న లాగే మాట్లాడుతున్నానా? 534 00:30:29,705 --> 00:30:32,082 అంటే, జీవితంలోని విషాదం అదే. నాది నిజంగానే మీ తాత వయసు. 535 00:30:32,082 --> 00:30:35,085 అంటే, ఇది కూడా వండేమియాలో ఒక భాగం. 536 00:30:35,085 --> 00:30:37,838 మనతో పాటు ఉన్న వారితో కలిసి ఎంజాయ్ చేయడం. 537 00:30:37,838 --> 00:30:39,423 మన కుటుంబం, స్నేహితులతో. 538 00:30:39,423 --> 00:30:41,216 ఇదే ఈ పనిలో ఉన్న అందం. 539 00:30:41,216 --> 00:30:43,927 - అంటే, అది... జీవితం అంటే అలాగే ఉండాలి. - అవును. 540 00:30:49,266 --> 00:30:51,476 - అంటే, ఇది... - అవును. 541 00:30:52,436 --> 00:30:54,521 ...నిజంగా అద్భుతమైన ప్రదేశం, కదా? 542 00:31:01,361 --> 00:31:04,406 ఇలాంటి అవకాశం ఎంత మంది టూరిస్టులకు దొరుకుతుంది? 543 00:31:06,658 --> 00:31:09,745 మీకు ఇప్పుడు ద్రాక్షతో, అలాగే ఈ మట్టితో కనెక్షన్ ఏర్పడినట్టు ఉందా? 544 00:31:10,537 --> 00:31:13,957 అంతకంటే ఎక్కువగా కైరోప్రాక్టర్ తో కనెక్షన్ ఏర్పడినట్టు ఉంది. 545 00:31:15,501 --> 00:31:17,586 యుజీన్, ఫ్రెండ్స్. రండి. 546 00:31:17,586 --> 00:31:19,671 - పదండి. - మంచిది. థాంక్స్, మట్టేయో. 547 00:31:19,671 --> 00:31:20,714 ఏం పర్లేదు. 548 00:31:20,714 --> 00:31:24,259 - క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది. - అవును, చాలా బాగా చేశారు. 549 00:31:24,259 --> 00:31:25,594 ఇది మాకు పనికొస్తుంది. 550 00:31:28,722 --> 00:31:31,850 ఇప్పుడు దీన్ని మా పికప్ ట్రక్ మీదకు ఎక్కించాలి. 551 00:31:32,351 --> 00:31:34,895 మా ద్రాక్ష పళ్ళు ఇప్పుడు వైనరికి బయలుదేరాయి, 552 00:31:34,895 --> 00:31:37,731 అక్కడ మిగతా కోతతో కలపబడి, 553 00:31:37,731 --> 00:31:42,486 జూస్ తీయబడి, పులియబెట్టిన తర్వాత, ఆఖరికి బ్యారెల్స్ లో నిల్వ చేస్తారు. 554 00:31:43,153 --> 00:31:46,698 పని పూర్తి అయ్యాక నా బాటిల్ అందుకోవడానికి ఇది మంచి సాకు. 555 00:31:46,698 --> 00:31:48,992 నిజానికి నాకు సాకులు చెప్పాల్సిన పనిలేదు. 556 00:31:48,992 --> 00:31:54,498 ఇక వంటగదిలో, మేము చేసిన పనికి ప్రతిఫలం సిద్ధం అవుతోంది, భోజనం. 557 00:31:54,498 --> 00:31:58,085 ఇది చూస్తుంటే పెద్ద పార్టీలాగే ఉండబోతోంది, ఎంతైనా కష్టపడ్డాం కదా. 558 00:31:58,085 --> 00:32:04,341 అలాగే అద్భుతమైన ఇటాలియన్ భోజనం కూడా రెడీ అవుతోంది. 559 00:32:04,842 --> 00:32:05,759 సరే. 560 00:32:05,759 --> 00:32:08,470 నేను దీన్ని ఇటాలియన్ భోజనం అంటున్నా. వీళ్ళు భోజనం అంటారు అంతే. 561 00:32:09,680 --> 00:32:14,852 అలాగే భోజనానికి నేను కూడా నా వంతు ఒకటి తీసుకొచ్చాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 562 00:32:15,686 --> 00:32:16,687 వావ్. 563 00:32:19,064 --> 00:32:21,066 వావ్. 564 00:32:21,066 --> 00:32:25,654 ఇందులో ట్రఫుల్స్ ఉన్నాయి చూసారా, అది నేను నేల నుండి తీసింది, సరేనా? 565 00:32:25,654 --> 00:32:28,657 ఒక అందమైన చిన్న కుక్క సాయంతో అనుకోండి. 566 00:32:30,659 --> 00:32:34,162 అలాగే మన పాస్తా సిద్ధం చేసిన ఆ అమ్మాయి ఎవరు? 567 00:32:34,162 --> 00:32:37,499 పట్రిజ్య. ఆమె మాకోసం రోజూ... 568 00:32:37,499 --> 00:32:39,084 - రోజూనా? - ...భోజనం చేస్తుంది. అవును. 569 00:32:39,084 --> 00:32:41,587 ఎమిలియానో, నీకు ఈ పని చాలా, చాలా బాగా వచ్చు. 570 00:32:41,587 --> 00:32:44,006 - నీకు ఇది బాగా వచ్చు. - థాంక్స్. నేను నా సొంత టెక్నీక్ వాడుతుంటా. 571 00:32:44,006 --> 00:32:47,593 {\an8}నువ్వు ఇంతకు ముందు నీ చిన్నప్పుడు వెయిటర్ గా పనిచేశావా? 572 00:32:47,593 --> 00:32:50,304 {\an8}లేదు, చేయలేదు. కానీ ఇది నాకు మా అమ్మ నేర్పించింది. 573 00:32:50,304 --> 00:32:51,555 సరే. 574 00:32:53,307 --> 00:32:56,101 ఈ ట్రిప్ కి ముందు నాకు ఇటలీ అంటే ఇష్టం అని తెలుసు, 575 00:32:56,101 --> 00:32:58,687 కానీ సరిగ్గా ఎందుకా అని నాకే తెలిసేదికాదు. 576 00:32:59,396 --> 00:33:01,440 ఇప్పుడు అర్థమైంది. 577 00:33:01,940 --> 00:33:05,235 ఇది చూడండి. ఇటలీ అంటే నా దృష్టిలో ఇదే. 578 00:33:07,237 --> 00:33:11,074 ఒక విధమైన జీవనశైలి. 579 00:33:11,992 --> 00:33:13,452 అది ఒకటిగా కలిసి ఉండటం. 580 00:33:14,786 --> 00:33:16,205 అది మంచి తిండి తినడం. 581 00:33:16,788 --> 00:33:18,081 అది మంచి వైన్ తాగడం. 582 00:33:18,916 --> 00:33:21,585 కానీ అది అంతకంటే ఎంతో ఎక్కువ కూడా. 583 00:33:21,585 --> 00:33:27,716 వీటన్నిటినీ పూర్తిగా అభినందించడానికి అవసరమైన టైమ్ తీసుకోవడమే. 584 00:33:27,716 --> 00:33:32,721 నిమ్మళమైన జీవిత విధానం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అనుభవం అది. 585 00:33:33,263 --> 00:33:35,432 పట్రిజ్య, డెలిజ్జియోసో. 586 00:33:35,432 --> 00:33:37,100 - నీకోసం. - సెలూటె. 587 00:33:37,100 --> 00:33:38,268 సెలూటె. 588 00:33:38,268 --> 00:33:43,690 నా దృష్టిలో "ల డోల్చె వీట" అంటే ఇదే. ఇదే తియ్యని జీవితం. 589 00:33:43,690 --> 00:33:47,611 జీవితంలో నా ఇష్టాలకు, ఇది, 590 00:33:47,611 --> 00:33:51,240 అత్యంత దగ్గరగా ఉన్న అనుభవం. 591 00:33:52,115 --> 00:33:54,326 ఇక నీకు అర్రేడివెర్చి, ఇటలీ. 592 00:33:55,077 --> 00:33:58,080 నేను నా తరువాతి గమ్యానికి చాలా అంచనాలతో వెళ్తున్నాను. 593 00:33:59,414 --> 00:34:00,499 తరువాతి ఎపిసోడ్ లో... 594 00:34:00,499 --> 00:34:02,417 గ్రీస్ కి రావడం ఇదే మొదటిసారి... 595 00:34:02,417 --> 00:34:03,460 ఇదే మీ విల్లా. 596 00:34:03,460 --> 00:34:04,962 ఇది అందంగా ఉంది. 597 00:34:04,962 --> 00:34:06,296 ఓహ్, అవును. చాలా బాగుంది. 598 00:34:06,296 --> 00:34:08,882 నాలో వెంటనే తాత్విక వాదం ఉబుకుతోంది. 599 00:34:08,882 --> 00:34:10,801 నేను చేయడానికి కొత్త పని దొరికింది. 600 00:34:10,801 --> 00:34:12,052 బ్రావో! 601 00:34:12,052 --> 00:34:13,094 ఒక ఆక్టోపస్! 602 00:34:13,094 --> 00:34:14,263 అవును, వద్దు. 603 00:34:14,263 --> 00:34:16,849 నేను ఆక్టోపస్ తినలేను. అవి ఎలా ఉంటాయో నాకు తెలుసు. 604 00:34:18,433 --> 00:34:19,726 బ్రావో, యుజీన్! 605 00:34:50,632 --> 00:34:52,634 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్