1 00:00:07,341 --> 00:00:10,427 ప్రయాణం అనేది జీవితంలో ఒక భాగం అంటుంటారు. 2 00:00:10,427 --> 00:00:16,391 అయ్యుండొచ్చు, కానీ అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ లో చిరాకు తెప్పించే అనుభవం ఎదురుకాకపోతే బాగుంటుంది. 3 00:00:19,311 --> 00:00:23,106 నా ఉద్దేశం, రెండు గంటలు ముందే రమ్మని చెప్పి పిలిపించినా కూడా 4 00:00:23,941 --> 00:00:26,235 రెండు గంటలు లేట్ అయ్యే ప్రమాదం 5 00:00:26,235 --> 00:00:28,820 ఇంకెక్కడ ఎదురవుతుంది చెప్పండి? 6 00:00:29,321 --> 00:00:33,367 అయినా కూడా, గత ఏడాది నా ప్రయాణాలు నాకు కలిసొచ్చాయనే అనుకుంటున్నాను. 7 00:00:33,367 --> 00:00:35,869 అవి నా జీవిత దృక్పథాన్ని విశాలపరిచినట్టు ఉన్నాయి. 8 00:00:36,537 --> 00:00:37,996 కొంతమట్టుకు అనుకోండి. 9 00:00:38,622 --> 00:00:42,960 కాబట్టి, నేను ఇప్పుడు ఏ మంచి ప్రయాణికుడైనా తప్పకుండా చేయాల్సిన 10 00:00:42,960 --> 00:00:45,337 ఒక ప్రయాణం చేయబోతున్నాను. 11 00:00:47,464 --> 00:00:49,132 యూరోప్ యాత్రకు వెళ్తున్నాను. 12 00:00:50,801 --> 00:00:52,719 సరే. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 13 00:00:54,263 --> 00:00:56,557 నేను మొత్తం ఖండాన్ని చుట్టబోతున్నాను... 14 00:00:58,350 --> 00:01:01,478 అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి దక్షిణాదిన అట్టడుగున ఉన్న చోటు వరకు. 15 00:01:01,478 --> 00:01:06,775 సహజంగా జనం వెళ్లని చోట్లకు వెళ్లి, అద్భుతమైన ప్రదేశాలను కనుగొనబోతున్నాను... 16 00:01:07,401 --> 00:01:08,652 మీకు కనిపిస్తుందా? 17 00:01:08,652 --> 00:01:12,614 ...నాలో ప్రాణం పోసుకుంటున్న సాహస గుణాన్ని ప్రోత్సహించబోతున్నాను. 18 00:01:12,614 --> 00:01:14,116 నన్ను చూడండి. చేతులు వదిలేశాను. 19 00:01:15,868 --> 00:01:17,911 అవి ఇక్కడే ఉన్నాయి. అదేంటి, బో చేపా? 20 00:01:19,204 --> 00:01:21,915 కొత్త కొత్త రుచులు ఆస్వాదించబోతున్నాను... 21 00:01:21,915 --> 00:01:24,334 వావ్, ఇది భలే ఉంది. 22 00:01:24,334 --> 00:01:25,878 ద్రాక్షపళ్ళు సిద్ధం. 23 00:01:26,962 --> 00:01:29,798 ...స్థానికుడిలా జీవించడానికి ప్రయత్నిస్తా. 24 00:01:29,798 --> 00:01:31,383 మా ఊరికి స్వాగతం. 25 00:01:32,342 --> 00:01:34,469 ఇది నమ్మశక్యంగా లేదు. 26 00:01:34,970 --> 00:01:37,014 నేను నీ ప్రాణాలు కాపాడాను. అది గుర్తుంచుకో. 27 00:01:37,014 --> 00:01:40,058 నేను నా చింతలన్నిటినీ సూట్ కేసులో పెట్టి... 28 00:01:41,560 --> 00:01:42,978 వస్తున్నారు చూడండి. 29 00:01:42,978 --> 00:01:45,856 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 30 00:01:45,856 --> 00:01:49,401 నా చిన్న నాట నుండి నేను ఇలాంటి పనిని చేసిందే లేదు. 31 00:01:49,985 --> 00:01:52,404 ...అలాగే నేను ముందెన్నడూ పలకని 32 00:01:52,404 --> 00:01:54,198 మూడు పదాలు పలకబోతున్నాను. 33 00:01:55,073 --> 00:01:56,283 టేకాఫ్ కి సిద్ధం. 34 00:02:01,663 --> 00:02:03,916 {\an8}యూరోప్ 35 00:02:06,835 --> 00:02:09,213 నా యూరోపియన్ యాత్ర కొనసాగుతోంది. 36 00:02:09,213 --> 00:02:14,426 ఈసారి నేను మన ప్రపంచానికి ఫిలాసఫీని, ప్రజాస్వామ్యాన్ని, ఒలింపిక్ పోటీలను అలాగే 37 00:02:14,426 --> 00:02:17,721 ఆలివ్లను ఇచ్చిన దేశానికి వచ్చాను. 38 00:02:18,555 --> 00:02:20,182 అన్నీ ముఖ్యమైనవే. 39 00:02:20,182 --> 00:02:23,810 కానీ వీటిలో ఒక్కటే మంచి మార్టీని చేయడానికి పనికొస్తుంది. 40 00:02:26,313 --> 00:02:29,024 గ్రీస్ 41 00:02:31,026 --> 00:02:35,739 అంటే, ప్రపంచ దేశాలలో అమెరికా ఒక హడావిడి చేసే టీనేజ్ కుర్రాడి లాంటి దేశం అయితే, 42 00:02:36,532 --> 00:02:39,701 అప్పుడు గ్రీస్ ని జ్ఞానంతో నిండిన తాతయ్య లాంటి దేశం అనొచ్చు. 43 00:02:40,452 --> 00:02:44,957 కాకపోతే మధ్యాహ్న వేళలో చక్కగా నిద్రపోయే అలవాటు ఉన్న తాతయ్య. 44 00:02:46,250 --> 00:02:51,672 నేను కేవలం 5,000 మంది నివాసులు ఉంటున్న అందమైన మిలోస్ దీవికి వచ్చాను, 45 00:02:51,672 --> 00:02:56,134 ఈ చిన్ని దీవి మీద జీవితం గురించి తెలుసుకుంటూ, 46 00:02:56,134 --> 00:02:59,388 జీవిత పరమార్థాన్ని కనుగొనగలను ఏమో అని చూస్తున్నాను. 47 00:02:59,388 --> 00:03:04,142 చమత్కారమైన విషయం ఏంటంటే, ఇక్కడికి అడుగు పెట్టిన వెంటనే నేను కూడా తాత్విక వాదం మొదలెట్టా. 48 00:03:06,937 --> 00:03:11,149 నేను ఇటలీ నుండి గ్రీస్ వరకు మధ్యధరా సముద్రాన్ని దాటుకుని వచ్చాను, 49 00:03:11,149 --> 00:03:16,488 టస్కనీలోని పచ్చని కొండలకు బదులు, ఇక్కడి కరుకైన నేల మీద వాలాను. 50 00:03:17,322 --> 00:03:21,493 గ్రీస్ లో దిమ్మతిరిగే రీతిలో దాదాపు 6,000 దీవులు ఉన్నాయి. 51 00:03:21,493 --> 00:03:24,746 అలాగే ప్రపంచంలోనే ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఇది ఒకటి, 52 00:03:24,746 --> 00:03:28,542 ఏడాదికి దాదాపు 300 రోజులు ఇక్కడ ఎండగానే ఉంటుంది. 53 00:03:33,088 --> 00:03:34,673 ఇకపోతే అజియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న 54 00:03:34,673 --> 00:03:38,260 ఈ అందమైన హార్బర్ మీద సూర్యుని ప్రతాపం గట్టిగానే ఉంది. 55 00:03:40,304 --> 00:03:44,266 కాబట్టి, నేను కాస్త నీడ కోసం నా హోటల్ కి వెళ్తున్నాను. 56 00:03:46,852 --> 00:03:49,438 - హలో, మిస్టర్ లెవీ. - హాయ్. 57 00:03:49,438 --> 00:03:51,773 - మిలోస్ కి స్వాగతం. - సంతోషం, నన్ను యుజీన్ అని పిలవండి. 58 00:03:51,773 --> 00:03:53,442 - నా పేరు అంద్రెయస్. - అంద్రెయస్. 59 00:03:53,442 --> 00:03:55,319 నేను మీ డ్రైవర్ ని. మీరు ఉండబోయే ప్రదేశానికి నేను తీసుకెళ్తాను. 60 00:03:55,319 --> 00:03:56,236 - థాంక్స్. - ఏం పర్లేదు. 61 00:04:00,199 --> 00:04:02,284 అయితే మీరు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారా? 62 00:04:02,284 --> 00:04:06,246 గ్రీస్ కి రావడం ఇదే మొదటిసారి. ఇది భలే అందమైన ప్రదేశం కదా? 63 00:04:08,582 --> 00:04:11,627 నా మనసులో గ్రీస్ ని ఎలా ఊహించుకునేవాడిని అంటే, 64 00:04:11,627 --> 00:04:17,132 అందమైన నీలి ఆకాశాలు, అందుకు భిన్నంగా తెల్లని బిల్డింగులను ఊహించుకునేవాడిని. 65 00:04:18,800 --> 00:04:20,385 "మామ్మ మియా" సినిమాలో చూసినట్టు. 66 00:04:21,303 --> 00:04:24,056 నాకు ఈ దేశం యొక్క అందం గురించి చాలా మంది చెప్పారు. 67 00:04:24,056 --> 00:04:27,976 దురదృష్టవశాత్తు, ఈ కరుకైన గుట్టల నేల గురించి ఎవరూ చెప్పలేదు. 68 00:04:27,976 --> 00:04:30,521 మరీ దగ్గరకు వెళ్ళకు, అంద్రెయస్. 69 00:04:30,521 --> 00:04:33,148 - వెళ్లను. - అవును, సురక్షితమైన వైపు ఉండు. 70 00:04:33,148 --> 00:04:34,983 దగ్గరగా ఉండు అంటుంటారు కదా. 71 00:04:34,983 --> 00:04:36,276 - దగ్గరగా ఉండు. - అలాగే. 72 00:04:36,944 --> 00:04:39,279 టొరంటోలో ఇలాంటి రోడ్లు ఉండవు. 73 00:04:40,113 --> 00:04:44,076 అందరికీ సిటీ కుర్రాడిని అని చెప్పుకునే నేను, ఒకింత చిన్నగా, మరింత 74 00:04:44,076 --> 00:04:47,204 సంప్రదాయకంగా ఉండే దీవులలో ఒకటైన మిలోస్ కి రావాలని నిర్ణయించుకున్నా. 75 00:04:47,204 --> 00:04:50,707 ఇక్కడ బ్రతకడం ఎలా ఉంటుందనే విషయం చూడాలి అనుకుంటున్నాను. 76 00:04:53,043 --> 00:04:54,169 ఓహ్, భలే. ఇది బాగుంది. 77 00:04:55,337 --> 00:04:58,048 ఇక్కడి స్థానికుడిలా జీవించడం మొదలెట్టడానికి ముందు, 78 00:04:58,632 --> 00:05:03,554 నాకు నేను మిలోస్ కోవ్ అనబడే ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ ఏర్పాటు చేసుకున్నా. 79 00:05:04,888 --> 00:05:06,765 అలాగే ఇది నా షో కాబట్టి, 80 00:05:06,765 --> 00:05:10,936 ఇక్కడి నుండి నా పర్యటనను ప్రారంభించడం నాకు చాలా నచ్చింది అని చెప్పగలను. 81 00:05:13,814 --> 00:05:17,609 ఒక రాత్రికి 400 డాలర్లకు పైనే రేటు పలికి ఈ ప్రదేశం, 82 00:05:17,609 --> 00:05:22,239 ఈ దీవి మీద సాధారణంగా దొరికే మత్స్యకారుల ఇళ్లకు పూర్తి భిన్నంగా ఉంది. 83 00:05:22,781 --> 00:05:26,994 హలో, మిస్టర్ లెవీ. ఎలా ఉన్నారు? మిలోస్ కోవ్ కి స్వాగతం. 84 00:05:26,994 --> 00:05:28,036 మిలోస్ కి స్వాగతం. 85 00:05:29,830 --> 00:05:33,500 యానిస్, ఇంకా ఈయన కొడుకు, అంద్రెయస్, ఒరిజినల్ గా ఏథెన్స్ నుండి వచ్చిన వారు, 86 00:05:33,500 --> 00:05:38,505 ఈ దీవి అందాలకు ఫిదా అయిపోయి, తమ హోటల్ ని ఇక్కడే నిర్మించాలని కలలు కన్నారు. 87 00:05:41,091 --> 00:05:42,426 ఇది భలే అందంగా ఉంది. 88 00:05:42,426 --> 00:05:44,970 ఇది మాకు బాగా ఇష్టమైన కార్నర్. 89 00:05:44,970 --> 00:05:46,513 ఇది భలే ఉంది. 90 00:05:46,513 --> 00:05:51,894 మేము మా చిన్నప్పుడు సెలవులకు వచ్చి గడిపిన బీచ్ ఇదే. 91 00:05:51,894 --> 00:05:57,357 అప్పుడు మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చింది. మేము ఒక వేసవి అంతా ఇక్కడ గడిపాము. 92 00:05:58,358 --> 00:06:02,487 ఈ ప్రదేశాన్ని ఏడేళ్ల పాటు తమ కలను నిజం చేసుకోవడానికి 93 00:06:02,487 --> 00:06:06,408 ఇక్కడ శ్రమపడిన తండ్రి-కొడుకుల డ్రీమ్-ప్రాజెక్టు అనొచ్చు. 94 00:06:06,408 --> 00:06:07,868 మీరు కలిసి ఎలా పనిచేస్తుంటారు? 95 00:06:07,868 --> 00:06:10,204 బాగుందా? అంతా చక్కగా సాగుతుందా? 96 00:06:10,204 --> 00:06:13,248 అవును. నేనైతే సాధారణంగా ఎంజాయ్ చేస్తుంటాను. 97 00:06:13,248 --> 00:06:14,499 ఆహ్-హహ్. సరే. 98 00:06:14,499 --> 00:06:15,626 అంటే మనస్పర్థలు వస్తుంటాయా? 99 00:06:15,626 --> 00:06:17,419 - అవును. - సరే, విభేదాలు పుడుతుంటాయి. 100 00:06:17,419 --> 00:06:20,839 కానీ ఏది ఏమైనా, ఈయన మా నాన్న, అలాగే నేను ఆయన కొడుకుని. 101 00:06:20,839 --> 00:06:24,676 మాకైతే, ఈ హోటల్ మా కుటుంబం లాంటిది. 102 00:06:24,676 --> 00:06:29,515 అంటే, నా ఉద్దేశం ఏంటంటే, మా దగ్గరకు వచ్చే అతిథులను, అలాగే మాతో కలిసి పనిచేసే వారిని కూడా, 103 00:06:29,515 --> 00:06:31,350 మా కుటుంబంలో భాగంగాగే చూస్తాము. 104 00:06:31,350 --> 00:06:32,559 ఇది చాలా పెద్ద కుటుంబం. 105 00:06:35,062 --> 00:06:38,148 సరే, కుటుంబంతో కలిసి పనిచేయడం గురించి నాకు కూడా కొంచెం తెలుసు, 106 00:06:38,148 --> 00:06:42,444 కాబట్టి వీళ్ళు కలిసి ఇక్కడ చేసిన దాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 107 00:06:44,404 --> 00:06:45,822 ఇది మీరు ఉండబోయే విల్లా. 108 00:06:45,822 --> 00:06:47,491 దయచేసి లోనికి రండి. 109 00:06:48,116 --> 00:06:52,037 రానున్న కొన్ని రోజులు ఇది మీ ఇల్లు. 110 00:06:52,037 --> 00:06:56,291 - వావ్. యానిస్, నాకు ఇది చాలా నచ్చింది. - మీకు నచ్చిందా? 111 00:06:56,291 --> 00:06:58,627 - నాకు నచ్చింది. నాకు నచ్చింది. - ఆ మాట వినడం సంతోషంగా ఉంది. 112 00:07:03,048 --> 00:07:05,300 అంటే, మీకు ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. 113 00:07:05,300 --> 00:07:07,302 మీకు ఒక ప్రైవేట్ చెఫ్ ఉంటారు, 114 00:07:07,886 --> 00:07:09,805 స్పా థెరపీలు అందుబాటులో ఉంటాయి. 115 00:07:09,805 --> 00:07:13,058 కాబట్టి మీరు ఇక్కడి నుండి ఎక్కడికీ వెళ్లాల్సిన పని ఉండదు. 116 00:07:13,684 --> 00:07:16,353 మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. 117 00:07:16,353 --> 00:07:19,398 అయితే, ఈ దీవి మీద జీవితం ఎలా ఉంటుంది? 118 00:07:19,398 --> 00:07:21,817 ఇక్కడ అందరికీ అందరూ తెలుసు. 119 00:07:21,817 --> 00:07:24,027 కాబట్టి మీరు ఏదైనా రహస్యం దాచాలి అనుకుంటే, 120 00:07:24,027 --> 00:07:28,240 అది మిలోస్ లో జరగని పని, రహస్యాలు మిలోస్ లో దాగి ఉండవు. 121 00:07:34,997 --> 00:07:39,501 సరే, యుజీన్, ఇక మిమ్మల్ని మీ విల్లాను ఎంజాయ్ చేయడానికి వదిలేస్తాం. 122 00:07:39,501 --> 00:07:41,003 యానిస్, థాంక్స్. 123 00:07:42,087 --> 00:07:44,214 నాకు ఈ విషయాన్ని మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. 124 00:07:44,214 --> 00:07:48,844 ఎందుకంటే నా దృష్టిలో స్వర్గం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 125 00:07:56,143 --> 00:07:57,644 - అవును, హాయ్. - హలో, మిస్టర్ లెవీ. 126 00:07:57,644 --> 00:07:59,897 యాని, ఈ హోటల్ కి చెందిన ఎగ్జిక్యూటివ్ చెఫ్, 127 00:07:59,897 --> 00:08:01,899 నాకోసం ఒక వంటకం తెచ్చాడు. 128 00:08:01,899 --> 00:08:03,942 నా నుండి, అలాగే నా టీమ్ నుండి మీ కోసం ఒకటి తెచ్చాను. 129 00:08:03,942 --> 00:08:08,155 ఇది స్థానికంగా పట్టిన ఆక్టోపస్, అలాగే మేము ఇక్కడ చేసిన బ్రెడ్, బృష్కెట్ట. 130 00:08:08,155 --> 00:08:10,407 స్థానికంగా పట్టిన ఆక్టోపస్? 131 00:08:10,991 --> 00:08:13,452 ఈ క్షణం వరకు అంతా బాగానే నడిచింది. 132 00:08:13,452 --> 00:08:15,746 గ్రీస్ లో ఎక్కువగా కనిపించే వంటకం ఇదే, 133 00:08:15,746 --> 00:08:18,207 ముఖ్యంగా మీరు ఉన్న ఈ దీవిలో. 134 00:08:18,207 --> 00:08:22,044 అంటే, "అస్సలు కుదరదు" అనేది పెద్ద పదం. నేను దానిని వాడగలను కూడా. 135 00:08:22,586 --> 00:08:25,506 ఎందుకంటే, నేనైతే ఆక్టోపస్ ని తినడం అస్సలు కుదరదు. 136 00:08:25,506 --> 00:08:27,049 నా వల్ల... అస్సలు కాదు. 137 00:08:27,049 --> 00:08:29,551 అవి ఎలా ఉంటాయో నాకు తెలుసు, సరేనా? 138 00:08:29,551 --> 00:08:30,928 ఇది జరిగే పనికాదు. 139 00:08:38,268 --> 00:08:41,104 మీకు ఏదైనా ఒక ప్రదేశం నిజరూపం తెలియాలి అంటే, 140 00:08:41,104 --> 00:08:43,357 మీరు అక్కడి స్థానిక బార్ కి వెళ్ళాలి. 141 00:08:48,153 --> 00:08:51,031 కాబట్టి నేను ఒక డ్రింక్ తాగడానికి యానిస్ ని కలవడానికి వెళ్తున్నాను. 142 00:08:51,031 --> 00:08:54,701 - హలో. స్వాగతం. ఎలా ఉన్నారు? - కనిపించింది. 143 00:08:54,701 --> 00:08:56,662 అవును, ప్లీజ్, కూర్చోండి. 144 00:08:56,662 --> 00:09:00,123 ఈ దీవి మీద ఉన్న కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో ఫాట్సెస్ ఒకటి. 145 00:09:00,123 --> 00:09:05,629 ఇక్కడ తమ పని పూర్తి అయ్యక, చాలా మంది దీవి నివాసితులు ఇక్కడికి రిలాక్స్ కావడానికి వస్తారు. 146 00:09:05,629 --> 00:09:08,423 అంటే, ఇక్కడికి మేము సరదాగా గడపడానికి వస్తుంటాం. 147 00:09:08,423 --> 00:09:12,177 మేము మ్యూజిక్ వింటాం, తాగుతాం, సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. 148 00:09:12,177 --> 00:09:14,555 - మీరు ముందే మొదలెట్టినట్టు ఉన్నారు. - అవును. నా దగ్గర ఒక టిప్పిల్ ఉంది. 149 00:09:14,555 --> 00:09:15,806 మీకు కూడా ఒక ఊజో కావాలా? 150 00:09:15,806 --> 00:09:17,182 ఊజో అంటే ఇక్కడి సాంప్రదాయక... 151 00:09:17,182 --> 00:09:19,434 - ఒక ఊజో? - ...గ్రీస్ మద్యం. 152 00:09:19,434 --> 00:09:22,187 - మీరు ట్రై చేస్తారా? సరే. - కానిద్దాం. ఊజో తాగుదాం. 153 00:09:26,900 --> 00:09:28,610 ఇక్కడ భలే బలమైన గాలులు వీస్తున్నాయి. 154 00:09:28,610 --> 00:09:31,029 - అవును. - అలాగే నేను బాబ్ డిలన్ డైలాగ్ చెప్పడం లేదు. 155 00:09:31,029 --> 00:09:32,823 - ఈ దీవి మీద గాలులు ఎక్కువ. - అవును. 156 00:09:32,823 --> 00:09:36,952 నిజం చెప్పాలంటే, మా ప్రదేశంలో ఏడాదికి పది రోజులు గాలి వీస్తుంది అంతే. 157 00:09:36,952 --> 00:09:39,371 మిగిలిన ఏడాది అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. 158 00:09:40,747 --> 00:09:42,875 - హలో. మీరు ఇక్కడ ఉన్నారా. - అవును. హాయ్. 159 00:09:44,543 --> 00:09:45,711 కొంచెం ఊజో. 160 00:09:45,711 --> 00:09:47,087 - థాంక్స్. - ఊజో. 161 00:09:47,087 --> 00:09:49,047 - కలిసి. - అవును, తప్పకుండా. 162 00:09:49,047 --> 00:09:50,048 - సరే. - చీర్స్. 163 00:09:50,048 --> 00:09:51,008 - తీసుకోండి. చీర్స్. - చీర్స్. 164 00:09:51,967 --> 00:09:53,135 తాగుదాం. 165 00:09:55,470 --> 00:09:58,974 - అమ్మో! - బాగుందా? 166 00:09:59,558 --> 00:10:00,934 నిజానికి బాగానే ఉంది. 167 00:10:01,435 --> 00:10:05,272 ఇది నేను ఫ్రాన్స్ లో ట్రై చేసిన పస్టిస్ లాగే ఉంది, కానీ కొత్తగా ఉంది. 168 00:10:05,272 --> 00:10:08,525 కొత్తగా అంటే, నా ఉద్దేశం బలంగా ఉంది అని. 169 00:10:08,525 --> 00:10:13,363 ఇక్కడి జనాల సరదాగా గడిపే తత్త్వం, నాకు తెలుస్తోంది. 170 00:10:13,363 --> 00:10:16,200 ఇక్కడ మొహం మీద నవ్వు లేని వ్యక్తి ఒకరు కూడా లేరు. 171 00:10:16,200 --> 00:10:18,869 గ్రీక్ భాషలో ఉన్న మ్యాజిక్ పదం ఖేఫి. 172 00:10:18,869 --> 00:10:21,079 దానిని నేను ఇంగ్లీషులోకి అనువదించలేను. 173 00:10:21,079 --> 00:10:23,582 దానికి అర్థం జీవితంలోని సంతోషం. 174 00:10:24,166 --> 00:10:26,168 - మీ సమస్యలను మర్చిపోవాలి. - సరే. 175 00:10:26,168 --> 00:10:27,753 ఏది ఏమైనా, 176 00:10:27,753 --> 00:10:33,550 మీరు మీ ఎమోషన్స్ ని మార్చుకుని, సంతోషం వైపు అడుగులు వేయాలి. 177 00:10:33,550 --> 00:10:36,595 ఎందుకంటే, ఇక్కడ సమస్యలతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. 178 00:10:36,595 --> 00:10:38,013 కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, 179 00:10:38,013 --> 00:10:42,100 వాళ్ళు సంగీతంతో నిండిన ప్రదేశంలోకి అడుగు పెడతారు, అంతా మర్చిపోతారు. 180 00:10:42,100 --> 00:10:44,061 ఆ ప్రశాంతత అందరికీ దొరుకుతుంది. 181 00:10:56,365 --> 00:11:00,327 వీరు ఖేఫిగా చెప్పే స్థితికి చేరుకోవడానికి ఊజో ఎలా సాయం చేస్తుందో తెలుస్తోంది, 182 00:11:00,327 --> 00:11:03,330 కానీ ఒకవేళ అది పనిచేయకపోతే, ఇక్కడ ఇంకొక మార్గం ఉంది. 183 00:11:03,330 --> 00:11:05,624 ప్లేట్లు విరగగొట్టాలా? 184 00:11:05,624 --> 00:11:06,875 ఇలా! 185 00:11:08,293 --> 00:11:09,670 అవును! 186 00:11:10,420 --> 00:11:12,047 - వావ్! - రండి. 187 00:11:15,133 --> 00:11:17,511 యుజీన్. అంతే. బ్రావో. 188 00:11:17,511 --> 00:11:21,849 ఇలా ప్లేట్లు పగలగొట్టే సంప్రదాయం పురాతన గ్రీస్ లో చీకటి ఆత్మలను తరిమి, 189 00:11:21,849 --> 00:11:25,519 సంతోషాన్ని తీసుకురావడం కోసం మొదలైంది అంట. 190 00:11:32,067 --> 00:11:35,445 రెండు షాట్లు ఊజో తాగాక, విసరడానికి ఏదోకటి చేతికి దొరికితే బాగుండు అనిపించింది. 191 00:11:35,445 --> 00:11:37,823 అంటే, నేను దాదాపుగా యానిస్ ని విసిరినంత పని చేశా. 192 00:11:37,823 --> 00:11:42,703 అనే, ఖేఫి అనేది ఒక సాధారణమైన ఫిలాసఫీ. 193 00:11:42,703 --> 00:11:46,290 ఫ్రెండ్స్ తో కలిసి గడపడం, రిలాక్స్ కావడం, కష్టాలను మర్చిపోవడం, 194 00:11:46,290 --> 00:11:49,668 అలాగే సంతోషాన్ని ఇంకా ప్రేమను పంచుకోవడం గురించే. 195 00:11:49,668 --> 00:11:53,630 ఈ రాత్రి సరదాగా ఉంది. గ్రీస్ దేశ కులాసా ఏంటో చూశాను. 196 00:12:18,280 --> 00:12:22,701 గతరాత్రి తాగిన ఊజో కారణంగా, నేను చంటిపిల్లాడిలా పడుకున్నాను. 197 00:12:22,701 --> 00:12:26,914 ఇప్పుడు ఇక ఈ దీవిలో నివసించడం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి, 198 00:12:26,914 --> 00:12:28,916 టౌన్ లోకి వెళ్తున్నాను. 199 00:12:31,668 --> 00:12:35,172 ఒక కొండమీద కట్టబడిన ఊరు, ప్లాకా అనే ఊరు మిలోస్ దీవి రాజధాని, 200 00:12:35,172 --> 00:12:38,467 ఇది దాదాపు 800 మంది ఉంటున్న ఊరు. 201 00:12:40,260 --> 00:12:43,972 నేను ఇక్కడ ఎలేనిని కలుస్తున్నాను, అన్ని గ్రీక్ సంబంధిత వ్యవహారాల్లో నిపుణురాలు, 202 00:12:43,972 --> 00:12:46,600 ఆమె నాకు ఈ అందమైన చిన్ని ఊరును చూపించబోతోంది... 203 00:12:48,435 --> 00:12:49,478 కానీ ముందు నేను ఆమెను కనిపెట్టాలి. 204 00:12:50,938 --> 00:12:55,901 నిజం చెప్పాలంటే, నాకు కొంచెం భయంగా ఉంది, ఇక్కడ ప్రతీదారి చిన్ని వీధిలోకి తీసుకెళ్తుంది. 205 00:12:55,901 --> 00:12:58,654 ఆమె ఇంకాస్త స్పష్టంగా ఎక్కడికి రావాలో చెప్పి ఉంటే బాగుండేది. 206 00:12:59,321 --> 00:13:01,907 ఇదే సరైన ప్రదేశం అయ్యుండాలని కోరుకుంటున్నా. 207 00:13:02,491 --> 00:13:04,660 నాకు ఇక్కడ కాస్త భయంగా ఉంది. 208 00:13:09,373 --> 00:13:10,791 - యుజీన్. - ఎలేని. 209 00:13:10,791 --> 00:13:12,960 భలే! అద్భుతం. మీరు నన్ను కనిపెట్టారు. 210 00:13:12,960 --> 00:13:16,380 ఈ ప్రదేశం అదిరిపోతోంది. 211 00:13:16,380 --> 00:13:19,216 మీరు అక్కడ మలుపు తీసుకోగానే, ఇక్కడ గాలి వీయడం కొంచెం తగ్గింది. 212 00:13:19,883 --> 00:13:22,219 అంటే, నా అడుగు అంతే. 213 00:13:24,012 --> 00:13:28,392 ఎలేని గ్రీస్ లో ఒక గ్రీకు తండ్రి, అలాగే ఇంగ్లీషు తల్లితో పెరిగింది, 214 00:13:28,892 --> 00:13:33,605 అందుకే ఆమె అచ్చమైన ఇంగ్లీషు భాష నాకంటే బాగా మాట్లాడుతోంది అని అర్థమైంది. 215 00:13:33,605 --> 00:13:36,733 అందరూ తెలుపు, అలాగే నీలం రంగులను గ్రీస్ దేశ రంగులుగా చూస్తారు, 216 00:13:36,733 --> 00:13:38,151 అవును, గ్రీక్ జెండాలోని రంగులు. 217 00:13:38,151 --> 00:13:41,822 కానీ, విషయం ఏంటంటే, 1938లో, గ్రీకు దీవులలో కలరా వ్యాధి 218 00:13:41,822 --> 00:13:43,031 బలంగా వ్యాపించింది. 219 00:13:43,031 --> 00:13:45,868 ఆ సమయంలో ఇక్కడి నియంత, ఇయానిస్ మెటాక్సస్ అనబడే వ్యక్తి, 220 00:13:45,868 --> 00:13:49,204 అందరికీ తమ ఇళ్లకు తెల్లని సున్నం కొట్టమని ఆదేశించాడు, 221 00:13:49,204 --> 00:13:52,624 అందుకు కారణం ఏంటంటే, సున్నంలో లైమ్ ని వాడతారు. 222 00:13:52,624 --> 00:13:54,960 - కాబట్టి సున్నం క్రిములను చంపగలదు. - క్రిములను చంపుతుంది. 223 00:13:54,960 --> 00:13:58,755 వాళ్ళు బయటి వారికి ఆ కథను చెప్పేటప్పుడు మార్చేయాల్సి వచ్చింది. అవునా? 224 00:13:58,755 --> 00:14:00,007 గ్రీస్ రంగుల వెనుక ఈ కథ ఉందంటే... 225 00:14:00,007 --> 00:14:02,467 - వినే... వినేవారికి పెద్దగా నచ్చదు. - ...అంత గొప్పగా ఉండదు, అవునా? 226 00:14:02,467 --> 00:14:03,802 నిజమే, నాకు తెలుసు. 227 00:14:03,802 --> 00:14:07,347 విడ్డూరమైన విషయం ఏంటంటే, నీలం రంగును ఇంత ఎక్కువగా వాడటానికి కారణం 228 00:14:07,347 --> 00:14:09,266 అది మిగతా వాటికంటే చవక కావడమే. 229 00:14:09,266 --> 00:14:11,226 - అయితే ఆ విషయాన్ని కూడా... - కథ మార్చేశారు. 230 00:14:11,226 --> 00:14:13,687 - వాళ్ళు కథ మార్చారు. - కథనాన్ని కల్పించారు. 231 00:14:14,605 --> 00:14:17,691 ఇప్పుడు ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపించవచ్చు, 232 00:14:17,691 --> 00:14:20,944 కానీ ఈ స్థాయికి రావడానికి ఈ దేశానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. 233 00:14:21,445 --> 00:14:23,906 ఇన్ని మలుపులు ఉన్న వీధులను 234 00:14:24,781 --> 00:14:27,326 - ఈ చిన్న టౌన్ లోనే చూస్తున్నాను. - అందుకు కూడా మంచి కారణం ఉంది. 235 00:14:27,326 --> 00:14:32,164 వాళ్ళు కావాలనే వీధులను ఇన్ని మలుపులతో కట్టారు, 236 00:14:32,164 --> 00:14:34,166 ఒక చిక్కుముడిలా. 237 00:14:34,833 --> 00:14:36,376 ఈ ప్రదేశం గురించి తెలీని వారు ఇక్కడ 238 00:14:36,376 --> 00:14:38,837 దారి తప్పిపోవాలని కావాలని అలా చేసారు. 239 00:14:38,837 --> 00:14:39,880 ఎందుకో ఊహించగలరా? 240 00:14:39,880 --> 00:14:43,467 లేదు, నాకు అలా ఎందుకు చేసి ఉంటారో తట్టడం లేదు, మీరు చెప్పండి. 241 00:14:43,467 --> 00:14:47,012 మొదటి నుండే, మిలోస్ కి సముద్రపు దొంగల తాకిడి ఎక్కువగా ఉండేది. 242 00:14:47,012 --> 00:14:50,265 వాళ్ళు ఈ ఊరును ఇలా కట్టడానికి కారణమే అది. 243 00:14:50,265 --> 00:14:54,061 వాళ్ళ ఐడియా ఏంటంటే, దొంగలు ఈ మార్గాలలో తప్పిపోయినప్పుడు, దీవి నివాసులు వాళ్ళను ఎదుర్కోవడానికి 244 00:14:54,061 --> 00:14:56,939 లేదా పారిపోవడానికి వాళ్లకు కొంత టైమ్ దొరుకుతుందని. 245 00:14:57,773 --> 00:15:00,776 సరే, పైరేట్లు. ఇప్పుడు విషయం అర్థమైంది. 246 00:15:00,776 --> 00:15:03,862 అలాగే తమ క్షేమానికి ముప్పు తీసుకొచ్చే వాటి నుండి తమను 247 00:15:03,862 --> 00:15:06,198 కాపాడటానికి గ్రీస్ వారు అనేక ప్రత్యేకమైన మార్గాలను కనిపెట్టారు. 248 00:15:06,198 --> 00:15:08,534 చెడు దృష్టి లాంటి వాటి నుండి. 249 00:15:08,534 --> 00:15:13,247 ఎందుకంటే కొన్నిసార్లు ప్లేట్లు పగలగొట్టినంత మాత్రాన మనం క్షేమంగా ఉంటాం అని చెప్పలేం. 250 00:15:13,247 --> 00:15:14,915 మీరు ముందెప్పుడూ చెడు దృష్టి గురించి వినలేదా? 251 00:15:14,915 --> 00:15:17,292 అంటే, నేను చెడు దృష్టి అనడం విన్నాను... ఆ టోపీ మీద ఉంది చూడండి. 252 00:15:17,292 --> 00:15:20,379 ఆ టోపీ మీద ఉంది, అవును, అలాగే మీరు ఇక్కడి నగల మీద కూడా చూడొచ్చు. 253 00:15:20,379 --> 00:15:22,256 మీరు ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది. 254 00:15:22,256 --> 00:15:24,633 వీళ్ళ ఐడియా ఏంటంటే, ఎవరికైనా మీ మీద అసూయగా ఉంటే, 255 00:15:24,633 --> 00:15:27,970 మీ మీద ఎవరైనా ఈర్ష్య పడితే, వాళ్ళు మిమ్మల్ని చెడు దృష్టితో చూస్తారు. 256 00:15:27,970 --> 00:15:32,057 మీరు గనుక వీటిలో ఒకటి వేసుకోకపోతే, మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 257 00:15:32,057 --> 00:15:34,101 మీకు బాగా పీడించే తలనొప్పులు మొదలవుతాయి. 258 00:15:34,101 --> 00:15:36,228 మీకు బలహీనంగా, నీరసంగా ఉంటుంది. 259 00:15:36,228 --> 00:15:40,190 అందరూ మిమ్మల్ని చెడు దృష్టితో చూడరు, కాబట్టి మీరు ఎవరినైనా మెచ్చుకోవాలి అనుకుంటే, 260 00:15:40,190 --> 00:15:42,609 లేదా ఎవరికైనా బాగా కలిసొస్తుందని మీకు తెలిసి 261 00:15:42,609 --> 00:15:45,279 వారిని ఇతరుల చెడు దృష్టి నుండి కాపాడాలి అనుకుంటే... 262 00:15:45,279 --> 00:15:47,072 - సరే. - ...మీరు వాళ్ళ మీద ఉమ్మాలి. 263 00:15:47,072 --> 00:15:49,741 - నేను జోక్ చేయడం లేదు. - మనం వాళ్ళ మీద ఉమ్మాలా? 264 00:15:49,741 --> 00:15:52,035 మీరు ఉమ్మాలి. అంటే, నేను గనుక మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకుంటే, 265 00:15:52,035 --> 00:15:54,746 "యుజీన్, ఇవాళ మీరు వేసుకుంటున్న షర్ట్ నాకు చాలా నచ్చింది. 266 00:15:54,746 --> 00:15:57,165 మీరు అందంగా కనిపిస్తున్నారు" అని చెప్పి, ఆ తర్వాత నేను... 267 00:15:58,834 --> 00:16:00,544 త్రిత్వాన్ని సూచిస్తూ మూడు సార్లు ఉమ్ముతాను. 268 00:16:00,544 --> 00:16:04,798 మీరు ఈ షాప్ వారిని అభినందించాలి అనుకుంటే, మీరు, "ఇక్కడ అన్నీ భలే అందంగా ఉన్నాయి"... 269 00:16:04,798 --> 00:16:06,049 నాకు ఈమె మీద ఉమ్మాలని లేదు. 270 00:16:06,800 --> 00:16:09,261 - మీరు ఉమ్మితే ఆమె సంతోషిస్తుంది. - ఈమె మీద ఎందుకు ఉమ్మాలి అనుకుంటా? 271 00:16:09,261 --> 00:16:10,929 - ఉమ్మితే నాకు కూడా సంతోషమే. - చూశారా. 272 00:16:10,929 --> 00:16:12,306 మంచి విషయమే. 273 00:16:12,306 --> 00:16:16,101 మీ షాపు చాలా, చాలా చాలా అందంగా... 274 00:16:16,101 --> 00:16:18,187 - ఇప్పుడు మీరు ఆమె... - ...ఉంది. 275 00:16:19,646 --> 00:16:21,940 - అంతే. బ్రావో. - అద్భుతం. 276 00:16:21,940 --> 00:16:24,318 సరే. టామ్, నువ్వు కెమెరా పని అద్భుతంగా చేస్తున్నావు. 277 00:16:28,113 --> 00:16:29,698 తప్పుగా అనుకోకు. 278 00:16:29,698 --> 00:16:30,824 ఎలేని అన్నీ చాలా బాగా వివరిస్తోంది. 279 00:16:30,824 --> 00:16:33,368 పైగా ఈమెకు ఈ దీవి గురించి అంతా తెలుసు. 280 00:16:33,368 --> 00:16:34,870 ఈ టౌన్ గురించి ఈమెకు అంతా తెలుసు. 281 00:16:34,870 --> 00:16:39,291 ఈమెకు గ్రీస్ గురించి తెలిసినంతగా నాకు నా దేశం గురించి తెలుసా? 282 00:16:40,125 --> 00:16:40,959 లేదు. 283 00:16:41,668 --> 00:16:45,297 నేను ఈ దీవి మీద ఏదైనా సాధ్యమే అనే తత్వాన్ని చూస్తున్నాను. 284 00:16:45,297 --> 00:16:48,926 నేనైతే, "ప్రయత్నించి చూస్తా" అన్నట్టుగా ఉంటా అనుకోండి. 285 00:16:48,926 --> 00:16:54,014 అందుకే నేను ఈ దీవికి ప్రధాన నాడి లాంటి ఒక పనిని ప్రయత్నించి చూడటానికి వెళ్తున్నాను. 286 00:16:54,515 --> 00:16:59,603 చెఫ్ యాని నన్ను హోటల్ రెస్టారెంట్ కి తాజా చేపలు అందించే ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. 287 00:16:59,603 --> 00:17:02,940 కాకపోతే ఈయన స్కాట్లాండ్ లో నా పనితీరును చూడలేదు. 288 00:17:03,482 --> 00:17:05,108 మీరు మిలోస్ లోనే పుట్టారా? 289 00:17:05,692 --> 00:17:06,527 కాదు. 290 00:17:06,527 --> 00:17:08,904 నిజానికి, నేను ఉత్తరం నుండి... నేను గ్రీస్ ఉత్తర భాగం నుండి వచ్చాను. 291 00:17:08,904 --> 00:17:11,656 నాకున్న ఒక ఫ్రెండ్ ఈ దీవి మీద నాకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాను అన్నాడు, 292 00:17:11,656 --> 00:17:13,367 ఇక్కడికి వచ్చాక ఈ దీవితో ప్రేమలో పడిపోయా. 293 00:17:13,367 --> 00:17:14,952 ఇది అందమైన ప్రదేశం. అద్భుతంగా ఉంది. 294 00:17:14,952 --> 00:17:20,582 ఇక్కడి జనంలో ఆత్రుత కనిపించకపోవడం నాకు చాలా నచ్చింది, వీళ్లకు దేని గురించి దిగులు లేదు. 295 00:17:20,582 --> 00:17:24,877 వీళ్ళ జీవితం సాఫీగా... వారి ముందే తెరుచుకుంటుంది. 296 00:17:24,877 --> 00:17:27,631 నేనైతే ఇంత చిన్న... 297 00:17:28,298 --> 00:17:32,636 ఊర్లో ఉండగలను అని అనుకోను, 298 00:17:32,636 --> 00:17:34,805 ఆ ఊరి పక్కనే ఒక మంచి గోల్ఫ్ కోర్స్ ఉంటే తప్ప అనుకో. 299 00:17:34,805 --> 00:17:36,265 అది గనుక ఉంటే... 300 00:17:36,265 --> 00:17:38,308 అది నాకున్న ఇష్టాన్ని కొంచెం మలచవచ్చు. 301 00:17:39,935 --> 00:17:43,146 ఈ దీవి మీద గోల్ఫ్ కోర్స్ ఏదీ లేదు అని చెప్పాడు, 302 00:17:43,146 --> 00:17:46,441 కాబట్టి నేను ఇక్కడి జీవనానికి బాగా సరిపడే వేరొక హాబీని కనిపెట్టాలి. 303 00:17:47,651 --> 00:17:52,573 ఈ దీవులకు అనేక వేల సంవత్సరాల నుండి చేపల వేట ప్రాణాధారంగా ఉంది, 304 00:17:52,573 --> 00:17:57,536 ఇక్కడి పడవలలో దాదాపు 95% పడవలు చిన్నస్థాయి మత్స్యకారులవే. 305 00:17:58,745 --> 00:18:00,789 ఇవాళ మనం కెప్టెన్ అంద్రెయస్ ని కలవబోతున్నాం. 306 00:18:00,789 --> 00:18:05,836 ఇతను మిలోస్ లోనే పుట్టి పెరిగాడు, పైగా మత్స్యకారుల వంశం నుండి వచ్చిన వాడు. 307 00:18:05,836 --> 00:18:08,547 జాలర్ల కుటుంబం అనొచ్చు. 308 00:18:09,173 --> 00:18:13,385 అంద్రెయస్ తన చేపలు పట్టే బట్టలు వేసుకుంటున్నాడు, కదా? 309 00:18:13,385 --> 00:18:14,720 మనకు కూడా అవి కావాలా? 310 00:18:14,720 --> 00:18:17,472 - లేక మనకు అవి అవసరం లేదా? - మీరు కూడా వేసుకోవచ్చు. 311 00:18:17,472 --> 00:18:19,349 మీ రక్షణకు మీరు కూడా ఒకటి రక్షణకు వేసుకోవచ్చు. 312 00:18:24,855 --> 00:18:26,440 - ఇది బాగానే ఉందా? - చక్కగా ఉంది. 313 00:18:26,440 --> 00:18:27,774 - వావ్. - చక్కగా సరిపోయింది. 314 00:18:27,774 --> 00:18:29,276 ఇప్పుడు మీరు నిజమైన జాలరిలా ఉన్నారు. 315 00:18:29,276 --> 00:18:32,654 ఏమో, నాకైతే నిజమైన జోకర్ లా ఉన్నాను అనిపిస్తోంది. 316 00:18:37,367 --> 00:18:41,371 నేను మా కెప్టెన్ లాగ జాలర్ల కుటుంబంలో పుట్టకపోయినా, 317 00:18:41,955 --> 00:18:46,293 ఈ విశాల సముద్రంలో జీవితం ఎందుకు ఇంత ఆకర్షణీయంగా ఉంటుందో అర్థమవుతోంది. 318 00:18:46,293 --> 00:18:50,881 అమ్మో, సూర్యుడి వెలుగు తాకితే, నీళ్లు భలే నీలంగా మారుతున్నాయి. 319 00:18:50,881 --> 00:18:53,050 ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడి రంగులు, అన్నీ. 320 00:18:54,510 --> 00:18:57,054 నేను నా చిన్నప్పుడు చేపలు పట్టడానికి ఎప్పుడూ వెళ్ళలేదు. 321 00:18:57,054 --> 00:19:00,599 మా నాన్న ఏనాడూ చేపలు పట్టింది లేదు. ఎవరూ చేపలు పట్టలేదు. 322 00:19:00,599 --> 00:19:05,771 మీరు గనుక వలవేసి చేపలు పట్టాలి అనుకుంటే, అందుకు ఇదే సరైన ప్రదేశం. 323 00:19:18,325 --> 00:19:20,536 మనం చేరుకున్నాం అని ఇతను చెప్తున్నాడు. 324 00:19:20,536 --> 00:19:22,454 మన బోయ్ అక్కడ ఉంది. 325 00:19:22,454 --> 00:19:25,707 నిన్న రాత్రి నేను ఊజో తాగుతూ ప్లేట్లు పగలగొట్టడంలో బిజీగా ఉన్నప్పుడు 326 00:19:25,707 --> 00:19:29,419 అంద్రెయస్ ఇక్కడ తన వలలు వేసి ఉంచాడు. 327 00:19:29,419 --> 00:19:32,506 అతను అంతా వాళ్ళ నాన్న నుండే నేర్చుకున్నాడు. 328 00:19:32,506 --> 00:19:34,967 చిన్నతనం నుండే మొదలెట్టాడు, అతనికి పది ఏళ్ళు ఉన్నప్పటి నుండి అనుకుంట. 329 00:19:34,967 --> 00:19:39,263 ఈయన తండ్రి కూడా చిన్న నాట నుండే ఈయన తాతయ్య దగ్గర చేపలు పట్టడం నేర్చుకున్నారు. 330 00:19:39,263 --> 00:19:42,391 కాబట్టి, వీళ్లది పెద్ద జాలర్ల కుటుంబమే. 331 00:19:42,391 --> 00:19:46,270 అంద్రెయస్, మీకు మీ కొడుకు కూడా జాలరి కావాలని ఉందా? 332 00:19:47,229 --> 00:19:48,772 ఆయన ససమేరా కాదు అంటున్నాడు. 333 00:19:51,149 --> 00:19:55,153 అజియన్ సముద్రంలో ఇంతకు ముందు కంటే ఇప్పుడు తక్కువ చేపలు ఉన్నాయి. 334 00:19:55,153 --> 00:20:00,075 కాబట్టి ఇంతకు ముందు కంటే ఈ పని చేయడం ఇప్పుడు కష్టం అయింది. 335 00:20:00,075 --> 00:20:02,369 - ఆక్టోపస్. - అది ఆక్టోపస్. 336 00:20:02,369 --> 00:20:04,788 ఒక ఆక్టోపస్! వావ్! 337 00:20:04,788 --> 00:20:06,248 ఇవాళ మీకు బాగా కలిసొచ్చింది, కదా? 338 00:20:06,248 --> 00:20:08,125 అవును, అదే అనిపిస్తోంది. 339 00:20:08,125 --> 00:20:10,752 - ఏమంటారు? - ఇది చిన్నగా ఉంది. 340 00:20:10,752 --> 00:20:12,796 - సర్లే, వద్దు. - మీకు... వద్దా? 341 00:20:12,796 --> 00:20:14,381 వద్దు. 342 00:20:14,381 --> 00:20:16,008 - మీకు నచ్చదా? - లేదు. 343 00:20:16,008 --> 00:20:18,510 - లేదు, అదేం పర్లేదు. - అంటే, దీన్ని సముద్రంలో వదిలేస్తాం. 344 00:20:18,510 --> 00:20:19,803 - సరే. - మేము దీన్ని తీయడం లేదు. 345 00:20:19,803 --> 00:20:21,722 - దీన్ని సముద్రంలో వదులుతాం. - ఇది చిన్నది. 346 00:20:21,722 --> 00:20:24,141 - సరే. - ఇక వెళ్ళు. బై. 347 00:20:24,141 --> 00:20:25,184 బై. 348 00:20:25,184 --> 00:20:27,269 వావ్, అది నన్ను గుర్తుంచుకునేలా ఉంది. 349 00:20:27,769 --> 00:20:32,024 నేను కూడా దాన్ని గుర్తించుకుంటా. అది నాకు చెడు దృష్టి పెట్టినట్టు ఉంది. 350 00:20:32,024 --> 00:20:34,026 - మీరు ట్రై చేస్తారా? - నన్ను లాగమంటారా? 351 00:20:34,026 --> 00:20:36,320 - చూస్తాను. - బాగా నిలబడండి. 352 00:20:36,320 --> 00:20:38,447 - తర్వాత నెమ్మదిగా, నెమ్మదిగా, అది వస్తోంది. - ఆహ్-ఓహ్. 353 00:20:38,447 --> 00:20:39,948 అంతే. బాగా లాగారు. 354 00:20:39,948 --> 00:20:41,074 ఆహ్-హహ్. 355 00:20:43,327 --> 00:20:44,703 - ఆహ్-హహ్. - అది స్కారోస్ చేప. 356 00:20:44,703 --> 00:20:47,289 - ఒక స్కారోస్. - అవును, స్కారోస్ చేప. 357 00:20:47,956 --> 00:20:49,291 స్కారోస్. పెద్దదే. 358 00:20:49,291 --> 00:20:51,126 - అది పెద్ద స్కారోస్ చేప. - స్కారోస్. 359 00:20:51,126 --> 00:20:54,004 ఇది మగ స్కారోస్ చేప. ఇవాళ ఇదే మన భోజనం. సరిపోయింది. 360 00:20:54,922 --> 00:20:57,799 ఆక్టోపస్ కంటే పట్టుకోవడం కొంచెం సులభమైన 361 00:20:57,799 --> 00:21:01,428 స్కారోస్ చేప కూడా ఈ దీవుల్లో పాపులర్ వంటకం. 362 00:21:01,929 --> 00:21:04,890 నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. నిజంగా. 363 00:21:04,890 --> 00:21:06,683 చూడండి... ఇది "కాపాడండి" అంటోంది. 364 00:21:06,683 --> 00:21:09,520 "నన్ను కాపాడటానికి మీరు ఏమైనా చేయగలరా? సరే, చేయగలను ఏమో. 365 00:21:09,520 --> 00:21:11,647 - దీన్ని వెనక్కి విసిరేద్దాం. - దీన్ని వెనక్కి విసిరేద్దాం అంటున్నారా? 366 00:21:11,647 --> 00:21:13,857 మనం... లేదు. 367 00:21:13,857 --> 00:21:14,858 మీరు ట్రై చేయొచ్చు. 368 00:21:14,858 --> 00:21:16,193 - ఏం పర్లేదు. - మనం ట్రై చేయొచ్చు. 369 00:21:16,193 --> 00:21:17,277 సరే. వేస్తున్నాను. 370 00:21:17,277 --> 00:21:19,905 - అంతే. మీరు ఇప్పుడు... - వచ్చేసావు, బుజ్జిదానా. చూడు. 371 00:21:19,905 --> 00:21:21,990 - మీరు దీన్ని సముద్రంలోకి వేయండి. - నేను నీ ప్రాణాలు కాపాడాను. 372 00:21:21,990 --> 00:21:23,700 నన్ను గుర్తుంచుకో, సరేనా? 373 00:21:24,535 --> 00:21:26,286 నా సినిమాలు కొన్ని చూడటం మర్చిపోకు. 374 00:21:27,162 --> 00:21:28,247 అంతే. 375 00:21:28,247 --> 00:21:30,582 భలే, ఇక్కడ నా పని ఇక పూర్తి అయినట్టు ఉంది. 376 00:21:30,582 --> 00:21:32,918 నేను మీకు సాయం చేయడానికి నాకు వీలైంది అంతా చేశా. 377 00:21:34,253 --> 00:21:37,589 తమకు దొరికిన చేపలను తిరిగి సముద్రంలోకి వేస్తూ పోతే ఇక్కడ జనం వేల 378 00:21:37,589 --> 00:21:40,342 సంవత్సరాలుగా నివసించగలిగే వారు కాదు. 379 00:21:40,342 --> 00:21:43,679 ఈ దీవుల్లో చేపలు పట్టడం ఒక వంద, లేదా 380 00:21:43,679 --> 00:21:45,848 రెండు వందల ఏండ్ల క్రితం ఉన్నట్టు లేదు. 381 00:21:47,516 --> 00:21:52,646 అంద్రెయస్ కు తన కొడుకు ఇదే వృత్తిలోకి దిగడం ఇష్టం లేకపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. 382 00:21:53,438 --> 00:21:54,982 నేను ఈ దీవి జీవనశైలికి 383 00:21:54,982 --> 00:21:58,944 సరిపోనివాడిని అని చెప్పడం తప్పు లేదు అనిపిస్తోంది, 384 00:21:58,944 --> 00:22:04,449 కాబట్టి కలిసి ఒక బీర్ తాగడానికి నేను యానిని కలుస్తా అన్నాను, పొడి నేల మీద అయితేనే అనుకోండి. 385 00:22:05,367 --> 00:22:10,080 మండ్రేకియా అనబడే ఈ ఊరు, అత్యంత అందమైన జాలర్ల ఊర్లలో ఒకటి, 386 00:22:10,080 --> 00:22:14,334 సియర్మాట అనబడే ఇక్కడి జాలర్లు వాడే పడవల ఇళ్లతో నిండిన ఊరు, 387 00:22:14,334 --> 00:22:17,754 ఈ ఇళ్లలో వీరు తమ పడవలను ఉంచడం, మైంటైన్ చేయడం చేస్తుంటారు. 388 00:22:22,301 --> 00:22:24,303 - యామాస్. - అవును. 389 00:22:26,305 --> 00:22:29,099 మీ కుటుంబం ఈ వృత్తిలోనే ఉందా? 390 00:22:29,099 --> 00:22:30,601 ఆహార వ్యాపారంలో ఉందా? 391 00:22:30,601 --> 00:22:35,022 నాకు నాలుగేళ్లప్పుడు మా కుటుంబానికి ఒక చావడి ఉండేది. 392 00:22:35,022 --> 00:22:39,818 నేను నా మొదటి కొన్ని సంవత్సరాలు వంటగదిలోనే పెరిగాను, 393 00:22:39,818 --> 00:22:43,071 మా చావడిలో, టేబుల్స్ చుట్టూ తిరుగుతూ, కస్టమర్లతో గడిపాను. 394 00:22:43,071 --> 00:22:43,989 అవునా? 395 00:22:43,989 --> 00:22:47,576 బహుశ అదే నేను ఇప్పుడు చెఫ్ ని కావడానికి కారణం అయిందేమో. 396 00:22:47,576 --> 00:22:51,955 మీ నాన్న ఇప్పుడు మీరు చేస్తున్న పని గురించి ఏమనుకుంటున్నారు? 397 00:22:51,955 --> 00:22:54,541 నేను ఈ వ్యాపారంలో ఉన్నందుకు ఆయన సంతోషిస్తున్నారు అనుకుంటున్నా. 398 00:22:54,541 --> 00:22:56,460 మరి మీ కుటుంబం సంగతి? మీరు... 399 00:22:57,044 --> 00:23:00,839 - కుటుంబ వ్యాపారంలో ఉన్నారా? - లేదు. 400 00:23:00,839 --> 00:23:05,135 నా చిన్నప్పుడు, మా టౌన్ లో అన్నమాట, 401 00:23:05,135 --> 00:23:07,930 నటన వైపు ఎవరూ వెళ్ళింది లేదు. 402 00:23:07,930 --> 00:23:11,850 మా నాన్న, అంటే, చిన్నప్పుడే... 403 00:23:11,850 --> 00:23:14,978 ఆయన టీనేజ్ వయసులోనే బడి మానేయాల్సి వచ్చింది, 404 00:23:14,978 --> 00:23:17,814 ఆయన అప్పట్లో తన కుటుంబానికి... 405 00:23:17,814 --> 00:23:19,942 - కుటుంబానికి సాయం చేసారు. - ...సాయం చేయాల్సి వచ్చింది. 406 00:23:19,942 --> 00:23:22,528 కాబట్టి మా ఇంట్లో చదువుకు చాలా ప్రాముఖ్యత ఉండేది. 407 00:23:22,528 --> 00:23:26,907 కానీ, నేను ఏం చేసానో చెప్పనా? నాకు చదువు అస్సలు అబ్బలేదు. 408 00:23:28,242 --> 00:23:33,580 కానీ నేను అయితే ఒక... నా కుటుంబంలో నేను, పెద్ద తలనొప్పి కుర్రాడిని. 409 00:23:33,580 --> 00:23:36,208 - ఆ జాలరి చెప్పిన విషయం నీకు గుర్తుందా? - అవును. ఆయనకు తన కొడుకు జాలరి... 410 00:23:36,208 --> 00:23:37,543 - అవును. నిజమే. - ...కావడం ఇష్టం లేదు. 411 00:23:37,543 --> 00:23:43,090 అలాగే, అంటే, మా వాళ్ళకు కూడా నేను నటనలోకి వెళ్లడం ఇష్టం లేదు అనుకుంటాను. 412 00:23:44,383 --> 00:23:47,427 మీ పిల్లలు మీరు ఉన్న వృత్తిలోనే ఉండటం మీకు ఎలా అనిపిస్తోంది? 413 00:23:47,427 --> 00:23:51,974 ఈ రంగంలోకి రావడం అంత సులభమైన పని కాదు, ఎందుకంటే 414 00:23:51,974 --> 00:23:54,476 - ఒక జీవితాన్ని ఏర్పరచుకోవడానికి... - అవును. 415 00:23:54,476 --> 00:23:55,978 ...ఇది కష్టమైన వృత్తి. 416 00:23:55,978 --> 00:23:59,439 కానీ వాళ్లిద్దరూ బాగానే రాణిస్తున్నారు, తెలుసా? 417 00:23:59,439 --> 00:24:03,694 - వారిద్దరినీ తలచుకుంటే సంతోషంగా ఉంటుంది. - అందుకు మెచ్చుకోవాలి. 418 00:24:03,694 --> 00:24:04,987 అవును. 419 00:24:25,090 --> 00:24:29,469 ఈ గ్రీకు దేశ నిద్ర దేవుడు హిప్నోస్ కారణంగా అనుకుంట, 420 00:24:29,469 --> 00:24:33,932 మరొక చక్కని రాత్రి నిద్రతో బలాన్ని పుంజుకుని, నేను ఈ దీవి గురించి మరింత తెలుసుకోవడానికి రెడీగా ఉన్నా. 421 00:24:34,892 --> 00:24:37,644 నన్ను సెయింట్ డే పండుగకు ఆహ్వానించారు, 422 00:24:37,644 --> 00:24:41,982 ఇక్కడి కుటుంబాల జీవితంలో ఇమిడిపోయి ఉన్న ఒక మతపరమైన వేడుక అది. 423 00:24:41,982 --> 00:24:44,401 కానీ నేను అక్కడికి ఉత్తి చేతులతో వెళ్ళలేను. 424 00:24:44,985 --> 00:24:50,574 అంటే, మేము నిన్న రాత్రి యాని నాకు చెప్పిన ఒక దీవికి వెళ్తున్నాం. 425 00:24:50,574 --> 00:24:54,536 అక్కడ ఉన్న భారీ సంఖ్య మేకల కారణంగా అద్భుతమైన 426 00:24:54,536 --> 00:24:57,122 చీజ్ ని ఉత్పత్తి చేసే దీవి ఇది. 427 00:24:57,122 --> 00:25:01,126 నేను ఏమనుకున్నాను అంటే ఆ పండుగకు కొంత చీజ్ 428 00:25:01,126 --> 00:25:02,336 లేదా మేకను తీసుకెళదాం అనుకున్నాను. 429 00:25:03,295 --> 00:25:07,549 ఇక్కడి స్థానిక ఫెర్రీలో సొంతంగా ప్రయాణించడానికి నాకు వచ్చిన గ్రీక్ సరిపోతుంది అనిపించలేదు, 430 00:25:07,549 --> 00:25:10,886 కాబట్టి అదృష్టవశాత్తు ఎలేని నాకు తోడుగా వచ్చింది. 431 00:25:10,886 --> 00:25:11,929 ఎలేని! 432 00:25:11,929 --> 00:25:14,431 మనం మరొక సాహసం చేయడానికి వెళ్తున్నాం. 433 00:25:14,431 --> 00:25:16,475 దీవులను వీక్షించడానికి ఇది చక్కని రోజు అనిపిస్తోంది. 434 00:25:16,475 --> 00:25:17,809 - ఏమంటారు? - వెళదాం. 435 00:25:17,809 --> 00:25:20,479 - ఇదేనా ఆ ఫెర్రీ? - కాదు, మనం అంతకంటే 436 00:25:20,479 --> 00:25:22,064 కొంచెం పెద్దదానిలో వెళ్ళబోతున్నాం. 437 00:25:25,067 --> 00:25:29,988 గ్రీక్ దీవుల పర్యటన 1960లలో జెట్ సెట్టర్లు, హిప్పీలు 438 00:25:29,988 --> 00:25:35,452 అలాగే బడ్జెట్ పర్యాటకులు ఈ దీవులలో దొరికే సుఖభోగాల కోసం రావడం మొదలైనప్పుడు ఊపందుకుంది. 439 00:25:36,119 --> 00:25:38,747 ఈ ఫెర్రీలు గాలి ఎక్కువగా ఉన్నప్పుడు నడవవు. 440 00:25:39,623 --> 00:25:43,877 కానీ ఇవాళ ప్రయాణం సురక్షితం. కనీసం సురక్షితంగా ఉండాలని నా ఆశ. 441 00:25:45,963 --> 00:25:47,256 సరే. మీ టికెట్ ఇదుగోండి. 442 00:25:47,256 --> 00:25:48,966 ప్రయాణానికి నా టికెట్. 443 00:25:50,676 --> 00:25:52,678 మీకు ముందుకు వచ్చి మంచి వ్యూ చూడాలని ఉందా? 444 00:25:57,182 --> 00:25:59,518 ఇంతకీ మీ యూరోప్ ప్రయాణాలు ఎలా నడుస్తున్నాయి? 445 00:25:59,518 --> 00:26:02,020 ప్రతీ ప్రదేశం ఒక కొత్త సాహసంలాగే ఉంది. 446 00:26:02,020 --> 00:26:03,689 మీకు దోమలు ఇష్టమైతే, 447 00:26:04,231 --> 00:26:07,109 - జూన్ నెలలో స్వీడన్ బాగా నచ్చుతుంది. - అవునా? 448 00:26:07,109 --> 00:26:09,528 అంటే, స్కాట్లాండ్ లో భలే ఉత్సాహంగా గడిచింది. 449 00:26:09,528 --> 00:26:12,114 స్కాట్లాండ్ లో మా పూర్వీకుల మూలాలు ఉన్నాయి. 450 00:26:12,114 --> 00:26:13,323 అది భలే విషయం. 451 00:26:13,949 --> 00:26:15,826 సెయింట్ ట్రోపె, చాలా అందంగా ఉంది. 452 00:26:15,826 --> 00:26:17,369 ఎంతైనా అది యూరోప్ కదా? 453 00:26:17,369 --> 00:26:22,416 నాకు యూరోప్ బాగా నచ్చడానికి కారణం ఇక్కడి వేర్వేరు సంస్కృతులు, 454 00:26:22,416 --> 00:26:24,334 ఇక్కడి చరిత్ర, అలాగే గ్రీస్ కూడా... 455 00:26:24,334 --> 00:26:28,338 అనేక వేల ఏండ్ల చరిత్ర ఉంది... 7,000, 8,000 ఏండ్ల చరిత్ర ఉన్న దేశం. 456 00:26:28,338 --> 00:26:30,424 మాకైతే జనం మిలోస్ కి రావడం, 457 00:26:30,424 --> 00:26:33,969 ఉదాహరణకు, కనీసం 11,000 ఏళ్ల నుండి జరుగుతుందని తెలుసు. 458 00:26:33,969 --> 00:26:36,763 ఇక్కడికి 11,000 ఏండ్ల క్రితం మొట్టమొదటిగా 459 00:26:36,763 --> 00:26:38,098 జనం వచ్చారని తెలుసుకోవడం భలే ఉంది. 460 00:26:39,766 --> 00:26:43,896 ఇప్పుడు, నేను కూడా అదే ప్రయాణాన్ని 30 నిమిషాలలో చేశాను. 461 00:26:46,523 --> 00:26:51,820 కీమొలోస్, మిలోస్ కంటే చిన్న దీవి. ఇందులో 900 మంది ఉంటున్నారు. 462 00:26:53,197 --> 00:26:58,911 ఇక్కడికి బోటు ద్వారా మాత్రమే రాగలం, కాబట్టి బయటి ప్రపంచం ప్రభావం ఎక్కువగా లేదు. 463 00:27:04,458 --> 00:27:08,337 ఇక్కడ మేము మూడవ తరం మేకల పెంపకందారు ఆంటోనీస్ ని కలుస్తున్నాం... 464 00:27:08,337 --> 00:27:10,714 ఓరి, నాయనో. 465 00:27:11,298 --> 00:27:17,054 ...ఈయన తన పొలంలో ఉన్న దాదాపు 500 మేకల పాలతో 15 రకాల చీజ్ చేస్తుంటాడు. 466 00:27:18,305 --> 00:27:19,973 ఇవి నన్ను మించిపోయాయి అనిపిస్తోంది. 467 00:27:19,973 --> 00:27:21,975 దీనికి మీరు నచ్చినట్టు ఉన్నారు. 468 00:27:21,975 --> 00:27:23,977 ఇది నా వేలు నములుతోంది. 469 00:27:23,977 --> 00:27:26,438 నీకు ఏం రుచి తెలుస్తోంది? 470 00:27:26,438 --> 00:27:28,106 నా ప్యాంట్లు తినకు! 471 00:27:28,941 --> 00:27:30,400 వద్దు. షర్ట్ తినొద్దు. 472 00:27:30,400 --> 00:27:33,153 - అంటే, ఇవి ఏది పడితే అవి తింటున్నాయి. - ఎందుకంటే ఇది మేత పెట్టే టైమ్. 473 00:27:33,153 --> 00:27:34,738 కావొచ్చు, కానీ నా దగ్గర ఒక్క షర్ట్ మాత్రమే ఉంది. 474 00:27:35,322 --> 00:27:39,034 ఈ దీవులలో మేకల పెంపకం ఇంకా చాలా ప్రాముఖ్యమైన జీవన విధానం, 475 00:27:39,034 --> 00:27:42,412 కాబట్టి ఆంటోనీస్ నాకు వీటి గురించి కొంచెం నేర్పాలి అనుకుంటున్నాడు. 476 00:27:45,666 --> 00:27:50,295 ఆంటోనీస్ ఏమని అడుగుతున్నాడు అంటే ఈ జంతువులకు పాలు పితకడానికి 477 00:27:50,295 --> 00:27:51,964 మీరు అతనికి సాయం చేయగలరా? 478 00:27:51,964 --> 00:27:54,925 అలాగే. ఒకటి వినండి, దేనికైనా మొదటిసారి ఒకటి ఉంటుంది. 479 00:28:05,269 --> 00:28:06,770 వీటన్నిటికీ పాలు పితకాలా? 480 00:28:09,690 --> 00:28:10,899 ఓహ్, దేవుడా. 481 00:28:13,151 --> 00:28:17,197 ఆంటోనీస్ ఇక్కడ బాగా ఆదరణ పొందిన మనోర అనబడే గ్రీక్ చీజ్ అమ్ముతుంటాడు. 482 00:28:17,197 --> 00:28:21,660 దాన్ని చేయడానికి, అతనికి చాలా మేక పాలు కావాలి. 483 00:28:21,660 --> 00:28:23,495 మీరు పైన నొక్కాలి, 484 00:28:23,495 --> 00:28:25,831 ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా మీ వేలును కిందకు లాగాలి. 485 00:28:25,831 --> 00:28:28,250 చింతించకండి, దీన్ని జాగ్రత్తగానే పితుకుతున్నారు. 486 00:28:28,250 --> 00:28:29,501 నేను జోక్ చేస్తున్నా. 487 00:28:29,501 --> 00:28:31,420 సరే, అంతే! 488 00:28:36,967 --> 00:28:38,677 నాకు ఈ పని అలవాటు అవుతున్నట్టు ఉంది. 489 00:28:39,469 --> 00:28:42,472 తన పొలానికి ఎవరైనా వచ్చి పని చేయాలని తపిస్తున్నాను అని ఆంటోనీస్ అంటున్నాడు, 490 00:28:42,472 --> 00:28:43,932 కాబట్టి అతను... 491 00:28:43,932 --> 00:28:45,559 మీకు ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చింది. 492 00:28:46,185 --> 00:28:47,769 మరి ఎప్పటి నుండి పని మొదలెట్టాలి? 493 00:28:50,314 --> 00:28:51,315 నిన్నటి నుండే. 494 00:28:51,315 --> 00:28:52,524 నిన్నటి నుండా? 495 00:28:52,524 --> 00:28:54,735 ఇక్కడ నాకు ఒక కొత్త పని దొరికినట్టు ఉంది. 496 00:28:54,735 --> 00:28:58,030 మేకల పెంపకం. అమ్మో, ఒకటి చెప్పాలి, ఇది కష్టమైన పని. 497 00:28:58,030 --> 00:29:02,826 నా పర్సనల్ కిటుకు మేకల పాలు పితకడంలో ఏంటంటే, దాన్ని పట్టుకుని 498 00:29:02,826 --> 00:29:05,495 వేళ్ళను ఇలా నొక్కాలి. 499 00:29:07,247 --> 00:29:08,248 కిందకి. 500 00:29:08,874 --> 00:29:13,295 అలాగే ఆ తర్వాత మనకు చక్కగా పాలు వస్తాయి. 501 00:29:14,588 --> 00:29:15,672 అవునా? బయటకు వస్తాయి. 502 00:29:15,672 --> 00:29:17,883 పదండి. దీన్ని నేను నాతో తీసుకెళ్తాను. 503 00:29:17,883 --> 00:29:18,967 సరేనా? 504 00:29:19,676 --> 00:29:22,221 "మీరు దీన్ని కాఫీలో కలుపుకోవచ్చు," అన్నాడు. 505 00:29:22,221 --> 00:29:24,890 సరే, దీన్నే నేను చమత్కారం అంటాను. 506 00:29:25,557 --> 00:29:28,310 మేకల పాలు తీయడం నేను బాగానే అదరగొట్టాను, 507 00:29:28,310 --> 00:29:31,313 కాబట్టి నేను సెయింట్ డే పండుగకు కొంత మనోర చీజ్ 508 00:29:31,313 --> 00:29:34,608 తీసుకెళ్లడానికి ఆంటోనీస్ వారి కుటుంబ షాప్ కి వచ్చాను. 509 00:29:36,777 --> 00:29:38,278 ఇదే వీళ్ళ చీజ్ షాపు. 510 00:29:38,278 --> 00:29:39,363 ఆ ఫోటోని చూడండి. 511 00:29:39,363 --> 00:29:42,282 అది ఆంటోనీస్ కి తెలిసిన విషయాలు అన్నీ నేర్పించిన... 512 00:29:42,282 --> 00:29:44,660 - అతని తాతయ్య. - ...అతను తాతయ్య ఫోటో. 513 00:29:44,660 --> 00:29:45,744 సామ్ప్లోస్ పొలం మాంసం కొట్టు 514 00:29:45,744 --> 00:29:47,371 - అలాగే ఈయన వీళ్ళ నాన్న. - వావ్. 515 00:29:47,371 --> 00:29:48,956 మూడు తరాల వారు ఇక్కడే ఉన్నారు. 516 00:29:48,956 --> 00:29:50,707 ఆ విషయం చెప్పాల్సిన పని లేదు... 517 00:29:51,625 --> 00:29:52,751 ఎందుకంటే నాకు ఆయన మొహం... 518 00:29:53,460 --> 00:29:54,753 కనిపిస్తోంది. 519 00:29:55,546 --> 00:29:56,713 ఇతనిలో కనిపిస్తోంది. 520 00:29:56,713 --> 00:29:58,924 మీ అబ్బాయి తన పనిని బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నారా? 521 00:30:03,929 --> 00:30:05,013 ఆయన చాలా సంతోషంగా ఉంది అన్నారు, 522 00:30:05,013 --> 00:30:09,268 ఎందుకంటే ఇతనికి ఇష్టమైంది కాబట్టి వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు అంట. 523 00:30:09,268 --> 00:30:12,729 ఆంటోనీస్ ని చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉంది. 524 00:30:12,729 --> 00:30:15,899 ఒక తరం తర్వాత ఇంకొక తరానికి కుటుంబ వ్యాపారాలు చేతులు మారతాయి. 525 00:30:15,899 --> 00:30:16,900 మేక పాల క్రీమ్ 526 00:30:16,900 --> 00:30:18,819 ఇక్కడ ఇది చాలా కామన్ గా కనిపిస్తోంది. 527 00:30:18,819 --> 00:30:19,945 థాంక్స్, ఆంటోనీస్. 528 00:30:20,571 --> 00:30:22,990 అవును. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. గుడ్ లక్. 529 00:30:22,990 --> 00:30:28,328 ఉత్తర అమెరికా కంటే యూరోప్ లో ఇలా ఎక్కువగా జరుగుతోంది అనుకుంటున్నాను. 530 00:30:28,328 --> 00:30:31,081 పిల్లలు వారి తండ్రులతో కలిసి పనిచేయగలిగితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. 531 00:30:31,081 --> 00:30:32,916 అంటే, నేను నా కొడుకుతో కలిసి పని చేస్తున్నాను. 532 00:30:32,916 --> 00:30:35,377 అది చాలా సంతోషాన్ని ఇచ్చే అనుభవం. 533 00:30:35,961 --> 00:30:39,423 మేము కొనగల అత్యంత నాణ్యమైన మేక చీజ్ కొన్న తర్వాత, 534 00:30:39,423 --> 00:30:42,676 నేను ఈ దీవి మీద నా ఆఖరి రాత్రి గడపడానికి బయలుదేరుతున్నా. 535 00:30:51,685 --> 00:30:54,771 ఇది దక్షిణ మిలోస్ లో "చర్చ్ ఆఫ్ హోలీ క్రాస్" లో 536 00:30:54,771 --> 00:30:57,357 జరిగే సెయింట్ డే పండుగ. 537 00:30:58,317 --> 00:31:01,653 నన్ను సెయింట్ హెలెన్ గౌరవార్థం జరుపుకునే వేడుకకు పిలిచారు, 538 00:31:01,653 --> 00:31:05,240 గ్రీక్ ఆర్థోడాక్స్ క్యాలండర్ లో ప్రార్థనలు, క్యాండిల్స్ ఇంకా పెద్ద పార్టీ 539 00:31:05,240 --> 00:31:09,161 జరుపుకునే ఒక వార్షిక వేడుక. 540 00:31:17,503 --> 00:31:19,838 ఇంతకంటే లోకల్ విషయం ఇంకొకటి ఉండదు. 541 00:31:20,422 --> 00:31:22,257 ఇక్కడ అందరికీ అందరూ తెలుసు. 542 00:31:31,225 --> 00:31:33,227 - మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాము. - నాకోసం గిఫ్ట్? 543 00:31:33,227 --> 00:31:34,311 అవును. 544 00:31:35,103 --> 00:31:37,731 దీనిని ఈ దీవికి ప్రాణాధారం అనొచ్చు. 545 00:31:37,731 --> 00:31:38,774 ఆక్టోపస్? 546 00:31:44,238 --> 00:31:45,822 మీరు ఒక దీవి మీద ఉన్నారు. 547 00:31:49,243 --> 00:31:50,577 ఇక్కడ ఇది మీ ఆఖరి రాత్రి, 548 00:31:50,577 --> 00:31:53,413 అలాగే ఒక సంసృతిని నిజంగా అర్థం చేసుకోవాలి అంటే అది అక్కడి ఆహారం ద్వారానే సాధ్యం. 549 00:31:53,413 --> 00:31:55,332 ఇది చూడటానికి హాట్ డాగ్ లా ఉంది. 550 00:31:55,916 --> 00:31:58,210 యానిస్ చెప్పినట్టు ఖేఫి స్థితిని చేరుకోవడానికి 551 00:31:58,210 --> 00:32:01,713 ఆక్టోపస్ తినడం సాయం చేస్తుందని నాకు అనిపించడం లేదు, 552 00:32:01,713 --> 00:32:04,341 కానీ ఎంతైనా గ్రీస్ లో ఉన్నాను కాబట్టి... 553 00:32:11,849 --> 00:32:13,225 - ఆయన ఇంకా... - బాగుంది. 554 00:32:13,225 --> 00:32:14,309 అవును. 555 00:32:15,018 --> 00:32:16,270 అవును. 556 00:32:20,315 --> 00:32:22,150 - చాలా బాగుంది. - చాలా రుచిగా ఉంది. 557 00:32:29,324 --> 00:32:31,493 మీరు కలవాల్సిన ఒకరిని తీసుకొచ్చాను. 558 00:32:31,493 --> 00:32:34,329 - యుజీన్. ఫాదర్... - ఫాదర్ కి హలో చెప్పండి... 559 00:32:34,329 --> 00:32:36,206 - ఎలా ఉన్నారు? - మిమ్మల్ని కలవడం సంతోషం. 560 00:32:36,206 --> 00:32:38,375 నేను బాగున్నాను, థాంక్స్. 561 00:32:39,126 --> 00:32:42,296 ఇప్పుడు నాకు నిజంగా స్థానికులతో కలిసి గడుపుతున్నట్టు ఉంది. 562 00:32:43,422 --> 00:32:46,383 - మీకు మిలోస్ నచ్చిందా? లేదు. - నాకు మిలోస్ చాలా నచ్చింది. 563 00:32:46,383 --> 00:32:48,302 మంచి జోకులు వేయగల ఫాథర్ ఒకరు ఉంటే చాలా బాగుంటుంది. 564 00:32:50,429 --> 00:32:52,764 ఇది భలే అందమైన చిన్న చర్చి. 565 00:32:52,764 --> 00:32:54,391 మీకు లోనికి వెళ్లి చూడాలని ఉందా? 566 00:32:54,391 --> 00:32:55,309 అవును. 567 00:32:55,309 --> 00:32:56,602 సరే. కలిసి వెళదాం. 568 00:33:01,023 --> 00:33:03,650 ఆయన, "ఇది మీకు ఒక ఆధ్యాత్మిక అనుభవం" అని అన్నాడు. 569 00:33:03,650 --> 00:33:04,693 ఋషి. 570 00:33:04,693 --> 00:33:06,195 - సరే. - ఒక ఋషిలా. 571 00:33:07,154 --> 00:33:08,906 నన్ను ఫాలో అవ్వండి. ఒకసారి చూసి వద్దాం. 572 00:33:10,949 --> 00:33:15,120 ఒకసారి లోనికి వెళ్ళాక, జనం ఒక కొవ్వొత్తి తీసుకుని, దానిని వెలిగిస్తారు, 573 00:33:15,120 --> 00:33:19,291 ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ మంట నుండి వచ్చే పొగ స్వర్గానికి వెళ్లే మీ ప్రార్థన అవుతుంది. 574 00:33:19,291 --> 00:33:20,375 అవునా? 575 00:33:33,639 --> 00:33:36,266 నా కుటుంబం కోసం మూడు కొవ్వొత్తులు తీసుకుంటా. 576 00:33:38,060 --> 00:33:41,355 నా ఉద్దేశంలో, మనకు మతం మీద నమ్మకం లేకపోయినా, 577 00:33:41,355 --> 00:33:44,149 ఇలాంటి ప్రదేశంలో ఒక ఆధ్యాత్మికమైన అనుభవాన్ని పొందగలం. 578 00:33:44,149 --> 00:33:46,443 అంటే, కొవ్వొత్తుల గురించి చెప్పిన విషయం 579 00:33:46,944 --> 00:33:49,154 అందరికీ నచ్చుతుందని నా ఉద్దేశం, 580 00:33:49,154 --> 00:33:50,697 - కదా? - అవును. 581 00:34:00,624 --> 00:34:06,338 భలే, ఈ పండుగలో నేను ఈ సాయంత్రవేళను చాలా చక్కగా గడిపాను. 582 00:34:06,964 --> 00:34:12,511 అంటే, నేను ఖేఫి ఫిలాసఫీని పూర్తిగా అర్థం చేసుకుని, ఈ రాత్రి అదెలా ఉంటుందో చూశాను. 583 00:34:13,971 --> 00:34:19,518 స్నేహితులు అలాగే కుటుంబం ఒకటై రావడం. ఇదొక ప్రేమ విందు లాంటిది. 584 00:34:20,561 --> 00:34:26,275 నామట్టుకైతే మిలోస్ ని తలచుకుంటే, మన పొరుగువారి గురించి పట్టించుకోవడం, 585 00:34:26,275 --> 00:34:30,571 సాయానికి చేయి ఇవ్వడం, అనేక తరాలుగా కుటుంబంలో నడుస్తున్న వృత్తిని 586 00:34:30,571 --> 00:34:32,947 తండ్రి నుండి కొడుకుకు ఇవ్వడమే గుర్తుకొస్తుంది. 587 00:34:35,117 --> 00:34:40,289 గ్రీకు వారు తాము చేసే ప్రతీ విషయంలో తమ కుటుంబాన్ని కేంద్రంగా ఉంచి చేస్తారని అర్థమైంది, 588 00:34:40,289 --> 00:34:45,043 అలాగే ఈ దీవి మీద జీవితాన్ని సులభం చేయడంలో అది చాలా పెద్ద విషయం అని తెలిసింది. 589 00:34:45,043 --> 00:34:48,589 ఎంతైనా కుటుంబం అంటూ ఒకటి ఉందంటే అది మనల్ని సరైన మార్గంలో ఉంచి, 590 00:34:48,589 --> 00:34:51,175 మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చక్కని బాటలో వెళ్ళడానికి సాయం చేస్తుంది. 591 00:34:51,884 --> 00:34:55,094 నేను గతకాలపు విషయాలను చూస్తానేమో అనుకుంటూ గ్రీస్ కి వచ్చాను, 592 00:34:55,094 --> 00:34:57,556 కానీ నిజానికి, మిలోస్ దీవి నాకు మనకు అందుబాటులో 593 00:34:57,556 --> 00:35:02,519 ఉన్న వాటిని మనకు దగ్గరగా ఉన్నవారితో కలిసి అభినందించాలి అని బాగా గుర్తుచేసింది. 594 00:35:03,937 --> 00:35:04,938 బ్రావో! 595 00:35:08,483 --> 00:35:09,818 ఈసారి... 596 00:35:09,818 --> 00:35:12,905 ఇది నా ఆఖరి యూరోపియన్ గమ్యం. 597 00:35:12,905 --> 00:35:13,989 స్పెయిన్. 598 00:35:13,989 --> 00:35:15,365 ఫ్లెమింకో డాన్స్ వేద్దాం. 599 00:35:16,074 --> 00:35:17,743 - కింగ్ సూట్ గది. - ఇది చాలు. 600 00:35:19,620 --> 00:35:22,497 ఇది నిజంగా ప్రపంచంలో అతిపెద్ద రోజు. 601 00:35:22,497 --> 00:35:23,832 ఇది వెర్రితనం. 602 00:35:24,458 --> 00:35:25,667 అలా వెళ్లాలా? 603 00:35:25,667 --> 00:35:28,545 ఒక్కసారి కిర్రుమన్నా, నేను వెనక్కి పోతాను. 604 00:35:28,545 --> 00:35:30,005 పదండి! 605 00:35:30,672 --> 00:35:31,840 {\an8}ఇది భలే సరదాగా ఉంది. 606 00:36:02,704 --> 00:36:04,706 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్