1 00:00:07,341 --> 00:00:10,427 ప్రయాణం అనేది జీవితంలో ఒక భాగం అంటుంటారు. 2 00:00:10,427 --> 00:00:16,391 అయ్యుండొచ్చు, కానీ అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ లో చిరాకు తెప్పించే అనుభవం ఎదురుకాకపోతే బాగుంటుంది. 3 00:00:19,311 --> 00:00:23,315 నా ఉద్దేశం, రెండు గంటలు ముందే రమ్మని చెప్పి పిలిపించినా కూడా, 4 00:00:23,941 --> 00:00:28,820 రెండు గంటలు లేట్ అయ్యే ప్రమాదం ఇంకెక్కడ ఎదురవుతుంది చెప్పండి? 5 00:00:29,321 --> 00:00:33,367 అయినా కూడా, గత ఏడాది నా ప్రయాణాలు నాకు కలిసొచ్చాయనే అనుకుంటున్నాను. 6 00:00:33,367 --> 00:00:35,869 అవి నా జీవిత దృక్పథాన్ని విశాలపరిచినట్టు ఉన్నాయి. 7 00:00:36,537 --> 00:00:37,996 కొంతమట్టుకు అనుకోండి. 8 00:00:38,622 --> 00:00:42,960 కాబట్టి, నేను ఇప్పుడు ఏ మంచి ప్రయాణికుడైనా తప్పకుండా చేయాల్సిన 9 00:00:42,960 --> 00:00:45,337 ఒక ప్రయాణం చేయబోతున్నాను. 10 00:00:47,464 --> 00:00:49,091 యూరోప్ యాత్రకు వెళ్తున్నాను. 11 00:00:50,801 --> 00:00:52,719 సరే. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 12 00:00:54,263 --> 00:00:56,557 నేను మొత్తం ఖండాన్ని చుట్టబోతున్నాను... 13 00:00:58,350 --> 00:01:01,478 అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి దక్షిణాదిన అట్టడుగున ఉన్న చోటు వరకు. 14 00:01:01,478 --> 00:01:06,775 సహజంగా జనం వెళ్లని చోట్లకు వెళ్లి, అద్భుతమైన ప్రదేశాలను కనుగొనబోతున్నాను... 15 00:01:07,401 --> 00:01:08,652 మీకు కనిపిస్తుందా? 16 00:01:08,652 --> 00:01:12,614 ...నాలో ప్రాణం పోసుకుంటున్న సాహస గుణాన్ని ప్రోత్సహించబోతున్నాను. 17 00:01:12,614 --> 00:01:14,116 నన్ను చూడండి. చేతులు వదిలేశాను. 18 00:01:15,868 --> 00:01:17,911 అవి ఇక్కడే ఉన్నాయి. అదేంటి, బో చేపా? 19 00:01:19,204 --> 00:01:21,915 కొత్త కొత్త రుచులు ఆస్వాదించబోతున్నాను... 20 00:01:22,875 --> 00:01:24,334 వావ్, ఇది భలే ఉంది. 21 00:01:25,169 --> 00:01:26,461 ద్రాక్షపళ్ళు సిద్ధం. 22 00:01:26,962 --> 00:01:29,798 ...స్థానికుడిలా జీవించడానికి ప్రయత్నిస్తా. 23 00:01:29,798 --> 00:01:31,383 మా ఊరికి స్వాగతం. 24 00:01:32,342 --> 00:01:34,887 ఇది నమ్మశక్యంగా లేదు. 25 00:01:34,887 --> 00:01:37,014 నేను నీ ప్రాణాలు కాపాడాను. అది గుర్తుంచుకో. 26 00:01:37,014 --> 00:01:40,559 నేను నా చింతలన్నిటినీ సూట్ కేసులో పెట్టి... 27 00:01:41,560 --> 00:01:42,978 వస్తున్నారు చూడండి. 28 00:01:42,978 --> 00:01:45,856 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 29 00:01:45,856 --> 00:01:49,401 నా చిన్న నాట నుండి నేను ఇలాంటి పనిని చేసిందే లేదు. 30 00:01:49,985 --> 00:01:54,198 ...అలాగే నేను ముందెన్నడూ పలకని మూడు పదాలు పలకబోతున్నాను. 31 00:01:55,073 --> 00:01:56,283 టేకాఫ్ కి సిద్ధం. 32 00:02:01,538 --> 00:02:04,499 {\an8}యూరోప్ 33 00:02:09,545 --> 00:02:13,300 వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది అంటుంటారు. 34 00:02:13,926 --> 00:02:18,096 లేదా నా విషయానికి వస్తే, ఒక్క అడుగు, అలాగే కాస్త బలవంతంతో మొదలవుతుంది. 35 00:02:18,805 --> 00:02:23,018 ఏదైతేనేం, ఆ బలవంతం నన్ను నా ఆఖరి యూరోపియన్ గమ్యానికి తీసుకొచ్చింది. 36 00:02:24,478 --> 00:02:25,479 స్పెయిన్. 37 00:02:25,479 --> 00:02:26,939 స్పెయిన్ 38 00:02:26,939 --> 00:02:30,150 నాకు స్పెయిన్ గురించి పెద్దగా తెలీదు. ఆ విషయాన్ని నేను ఒప్పుకోవాలి. 39 00:02:30,150 --> 00:02:33,195 స్పానిష్ హింసాత్మక విచారణ గురించి తెలుసు, అది అంత మంచి విషయం కాదు. 40 00:02:33,195 --> 00:02:35,155 స్పానిష్ ఆమ్లెట్ అయితే మంచిదే అనొచ్చు. 41 00:02:35,155 --> 00:02:36,156 సరే. 42 00:02:36,156 --> 00:02:40,369 దీన్ని బట్టి ఈ దేశం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పాల్సిన పనిలేదు. 43 00:02:40,369 --> 00:02:44,665 కానీ ఆఖరికి సెవిల్ కి రావడం మాత్రం నన్ను ఆనందంతో నింపింది అనగలను. 44 00:02:45,290 --> 00:02:49,211 నేనేమి ఈ సిటీకి వచ్చిన మొట్టమొదటి ధైర్యవంతుడైన అన్వేషకుడిని కాదు. 45 00:02:49,211 --> 00:02:52,172 నేను కేవలం క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుజాడల్లో నడుస్తున్నా అంతే. 46 00:02:52,172 --> 00:02:55,175 ఇక్కడ ఉన్న కేథడ్రాల్ ఒకదానిలో ఆయన సమాధి ఉందంట. 47 00:02:56,677 --> 00:03:00,514 కానీ నాకు మాత్రం, ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది. 48 00:03:01,515 --> 00:03:02,933 నా అభిమానులను కూడా వెనుకేసుకుని వచ్చా. 49 00:03:02,933 --> 00:03:07,271 మీరు వాళ్ళను చూడటం అరుదు, కానీ వాళ్ళు నాతో కలిసే ప్రయాణిస్తుంటారు. 50 00:03:08,480 --> 00:03:09,815 అందరికీ హాయ్. 51 00:03:09,815 --> 00:03:11,400 కాసేపట్లో నేను అక్కడికి వస్తా. 52 00:03:13,485 --> 00:03:14,945 హలో, మిస్టర్ లెవీ. 53 00:03:14,945 --> 00:03:17,072 - గ్రాసియస్. - బోట్ మీదకు స్వాగతం. 54 00:03:20,492 --> 00:03:23,495 ఉత్తర స్వీడన్ లో మొదలెట్టిన నా ప్రయాణంలో, 55 00:03:23,495 --> 00:03:27,541 నేను స్పెయిన్ లోని అండలూసియా ప్రాంతంలో ఉన్న సెవిల్ కి రావడానికి ముందు 56 00:03:27,541 --> 00:03:30,502 మొత్తం ఆరు దేశాలను సందర్శించాను. 57 00:03:31,295 --> 00:03:35,424 నేను ప్రధాన యూరోప్ భూభాగంలో ఉన్న ఈ దేశ దక్షిణాన చివర ఉన్న ప్రదేశానికి వెళ్లడానికి ముందు 58 00:03:35,424 --> 00:03:37,092 ఇక్కడ కొన్ని రోజులు గడుపుతాను. 59 00:03:37,718 --> 00:03:39,469 యూరోప్ లో ఉండే సందడి నాకు నచ్చింది, 60 00:03:39,469 --> 00:03:44,308 కాబట్టి ఈ ట్రిప్ ముగియడం నాకు అంత ఇష్టం లేదు. 61 00:03:44,308 --> 00:03:47,186 ఎందుకంటే నాకు ఇక్కడ నిజంగానే నచ్చింది. అవును. 62 00:03:50,230 --> 00:03:53,775 సెవిల్ ని అండలూసియా ప్రాంతపు ముత్యం అని పిలుస్తుంటారు. 63 00:03:54,401 --> 00:03:57,487 దానర్థం అండలూసియా ప్రాంతం ఆల్చిప్ప లాంటిది అనుకుంట. 64 00:03:58,030 --> 00:04:00,115 ఇంకొన్ని జోకులు వేయాలనే ఉంది, కానీ వేయను. 65 00:04:01,867 --> 00:04:03,076 సరే, హెసూస్, 66 00:04:03,076 --> 00:04:06,455 - నువ్వు సెవిల్ వాడివి అనుకుంట కదా? - అవును సెవిల్ నుండే. 67 00:04:06,455 --> 00:04:11,084 సరే. నీ డాష్ బోర్డు మీద నాకు ఒక చిన్న జెండా కనిపిస్తోంది. 68 00:04:12,085 --> 00:04:13,045 - అదా. - అవును. 69 00:04:13,045 --> 00:04:14,963 ఇది మా బెటిస్ జెండా. 70 00:04:15,797 --> 00:04:18,466 స్పెయిన్ లో రెండు పెద్ద జట్లు ఉన్నాయి. 71 00:04:19,051 --> 00:04:21,887 సెవీయ ఫుట్బాల్ క్లబ్, అలాగే బెటిస్ ఫుట్బాల్ క్లబ్. 72 00:04:22,596 --> 00:04:25,641 రేపు సిటీలో ఒక గ్రాన్ డార్బీ జరగబోతోంది. 73 00:04:25,641 --> 00:04:26,725 రేపేనా? 74 00:04:26,725 --> 00:04:28,936 అవును, ఆ ఆట కోసం జనం పిచ్చెక్కిపోతారు. 75 00:04:28,936 --> 00:04:30,479 - నిజంగా? - అవును. 76 00:04:30,479 --> 00:04:31,647 సరే. 77 00:04:31,647 --> 00:04:36,902 నేను వినోద పరిశ్రమలో పని చేసేవాడిని, కాబట్టి ప్రేక్షకులు పిచ్చెక్కిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 78 00:04:36,902 --> 00:04:38,862 కానీ సాకర్ మీద ఉన్న ఈ పిచ్చి ప్రేమ, 79 00:04:38,862 --> 00:04:42,741 నా ఉద్దేశం, యూరోప్ వాళ్ళు ఫుట్ బాల్ అని పిలిచే ఆటపై వీరికి ఇష్టం వేరే లెవెల్ లో ఉంటుంది. 80 00:04:42,741 --> 00:04:44,076 థాంక్స్, హెసూస్. 81 00:04:44,076 --> 00:04:46,578 - అలాగే మీ జట్టు గెలవాలని కోరుకుంటున్నాను. - థాంక్స్. 82 00:04:48,664 --> 00:04:53,377 సరే, నాకు కూడా ఆ "ఎల్ గ్రాన్ డార్బీ" స్వయంగా చూడాలని ఉంది. 83 00:04:54,628 --> 00:04:59,299 అది గ్రాండ్ గా ఉండే ఆట అయితే, నేను ఉండబోయే ప్రదేశం ఇంకా గ్రాండ్ గా ఉంది. 84 00:04:59,925 --> 00:05:02,386 హోటల్ అల్ఫాన్సో 13. 85 00:05:02,386 --> 00:05:04,346 ఓరి, నాయనో. 86 00:05:04,346 --> 00:05:07,599 ఇక్కడికి నన్ను ఆహ్వానించడానికి ప్రధాన మేనేజర్ ఆంటోనియో వచ్చాడు. 87 00:05:07,599 --> 00:05:11,311 ఈ లాబీ నిజంగా చూడటానికి కళ్ళు చెదిరిపోయేలా ఉంది, ఆహ్? 88 00:05:11,311 --> 00:05:13,105 థాంక్స్. మీ గైడ్ గా నేను ఉంటాను. 89 00:05:13,105 --> 00:05:14,565 - మంచిది. వెళదాం. - సరే. 90 00:05:15,607 --> 00:05:19,862 ఇక్కడికి కేవలం 241 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాకో దేశ ప్రభావం 91 00:05:19,862 --> 00:05:22,406 ఈ హోటల్ ను "కాసాబ్లాంకా" సినిమాలోని 92 00:05:22,406 --> 00:05:26,451 వంపుల ఆర్చ్ ఉండే సీన్ లో ఉన్నట్టు కట్టిన విధానం మనకు స్పష్టంగా చూపిస్తుంది. 93 00:05:26,451 --> 00:05:28,328 ఇది నిజంగా అద్భుతంగా ఉంది. 94 00:05:28,912 --> 00:05:31,915 ఈ దేశాన్ని ఒక రిపబ్లిక్ గా 1931లో ప్రకటించడానికి ముందు 95 00:05:31,915 --> 00:05:35,711 స్పెయిన్ ఆఖరి రాజు దీని నిర్మాణాన్ని ఆమోదించాడు. 96 00:05:37,171 --> 00:05:41,925 అయితే ఈ ప్రదేశాన్ని నిర్మించిన రాజు ఇక్కడ ఏనాడైనా ఉన్నాడా? 97 00:05:41,925 --> 00:05:43,385 అవును, చాలా సార్లు. 98 00:05:43,385 --> 00:05:46,096 అలాగే మేము మీకోసం రాజు గారి గదిని సిద్ధం చేసి ఉంచాం. 99 00:05:47,931 --> 00:05:51,518 రాజు కోసం చేయబడిన రూమ్ లో సామాన్యుడినైన నేను ఉండబోతున్నాను. 100 00:05:52,102 --> 00:05:55,189 ఈ లెవీని మెప్పించడానికి ఇదే రహస్యం. 101 00:05:55,856 --> 00:05:58,901 మిస్టర్ లెవీ, మీకు రాజు గారి గదిని చూపిస్తాను. 102 00:05:58,901 --> 00:06:01,236 ఓరి, నాయనో. 103 00:06:02,821 --> 00:06:03,822 ఈ మాత్రం ఉంటే చాలు. 104 00:06:04,323 --> 00:06:06,867 ఇక్కడ అల్ఫాన్సో 13 గారి ఫోటో కూడా ఉంది. 105 00:06:07,868 --> 00:06:10,245 పెయింటింగ్ కాస్త పెద్దగా ఉంది కదా. 106 00:06:10,996 --> 00:06:14,041 నాకైతే దాన్ని తీసేస్తే బాగుంటుంది అనిపిస్తోంది, 107 00:06:14,041 --> 00:06:16,502 ఎందుకంటే ఆయన అక్కడి నుండి చూసి మనల్ని తక్కువగా చూస్తున్నట్టు ఉంది. 108 00:06:17,169 --> 00:06:20,464 అంతేకాక ఆయన గర్విష్టి చూపులు చూస్తేనే చెప్పొచ్చు. 109 00:06:20,464 --> 00:06:24,301 అల్ఫాన్సో కేవలం 16 ఏళ్లకే రాజయ్యాడు. 110 00:06:24,301 --> 00:06:26,261 నిరంతరం గమనిస్తూ ఉంటాడు, కదా? 111 00:06:26,261 --> 00:06:28,013 ఒకింత ఎక్కువగానే గమనిస్తున్నాడు. 112 00:06:30,349 --> 00:06:35,771 ఈ రోజుల్లో మాత్రం ఇక్కడ అందరి కళ్ళు క్రీడా మైదానంలో ఎవరు గెలుస్తారా అని చూస్తున్నాయి. 113 00:06:36,396 --> 00:06:37,731 మీకు ఫుట్ బాల్ అంటే ఇష్టమా? 114 00:06:37,731 --> 00:06:41,276 రేపు ఇక్కడ బెస్ట్ ఆట జరగబోతోంది. 115 00:06:41,276 --> 00:06:43,445 నేను ఈ ఆట గురించి ఇంతకు ముందే విన్నాను. 116 00:06:43,445 --> 00:06:44,821 మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? 117 00:06:44,821 --> 00:06:46,573 ఖచ్చితంగా సెవీయకే. 118 00:06:47,824 --> 00:06:50,619 నేను ఈ ఆట జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. 119 00:06:50,619 --> 00:06:56,291 సెవిల్ ఇంకా బెటిస్ వారి మధ్య జరగబోయే ఈ గ్రాండ్ డార్బీ 120 00:06:56,291 --> 00:06:58,627 నిజంగా ఉత్కంఠగా ఉంటుందంట. 121 00:07:00,796 --> 00:07:03,340 నాకు సాకర్ గురించి పెద్దగా తెలీదు. 122 00:07:03,924 --> 00:07:05,092 బ్యూనోస్ దియాస్! 123 00:07:08,262 --> 00:07:11,557 కానీ ఇది యూరోప్ అంతటా అత్యంత ఆదరణ పొందిన విషయం కాబట్టి, 124 00:07:11,557 --> 00:07:13,225 ఈ ఆట సెవిల్ వారికి ఎందుకు ఇంత 125 00:07:13,225 --> 00:07:17,229 ఇష్టమో వివరించడానికి నేను ఇక్కడ ఒకరిని కలుస్తున్నాను. 126 00:07:18,605 --> 00:07:22,484 నేను ఇక్కడి స్థానిక టీమ్ ని ఫాలో అయి, వారి జట్లపై అభిమానులకు ఉన్న 127 00:07:22,985 --> 00:07:24,736 ఆ ఇష్టాన్ని అర్థం చేసుకుంటాను. 128 00:07:24,736 --> 00:07:27,489 నా ఉద్దేశం, నేనేం పోయి మొహానికి పెయింట్ వేసుకునే రకాన్ని కాదు. 129 00:07:27,489 --> 00:07:29,408 నేను అలాంటి అభిమానులలో ఒకడిని కాదు. 130 00:07:29,408 --> 00:07:31,785 కానీ, ఎంతైనా ఇది ఛాంపియన్షిప్ ఆట కాబట్టి, 131 00:07:31,785 --> 00:07:33,871 నేను కూడా నిలబడి వారికి... 132 00:07:36,373 --> 00:07:37,958 ప్రోత్సాహాన్ని ఇస్తాను. 133 00:07:41,044 --> 00:07:44,882 {\an8}ఈ 60,000 మంది కూర్చోగల బేనిటో వియమరిన్ స్టేడియం 134 00:07:44,882 --> 00:07:48,635 {\an8}రియల్ బెటిస్ బలొంపియే వారి సొంత స్టేడియం. 135 00:07:49,178 --> 00:07:51,805 ఇది థియేటర్ బ్యాక్ స్టేజికి వచ్చినట్టు ఉంది. 136 00:07:51,805 --> 00:07:57,102 సాధారణ జనం చూడని ఇక్కడి విషయాలను చూడటం కొంచెం ఆసక్తిగా ఉంది. 137 00:08:01,982 --> 00:08:05,527 ఈ స్టేడియంని బెటిస్ జట్టుకు ఉన్న సాధారణ కార్మిక వర్గ అభిమానుల కోసం 138 00:08:05,527 --> 00:08:09,448 మొదటిగా వంద ఏండ్ల క్రితం నిర్మించారు. 139 00:08:10,490 --> 00:08:11,950 ఇది భలే ఉంది, కదా? 140 00:08:13,911 --> 00:08:16,747 ఇక్కడ సాకర్ ని ఒక మతంగా భావించేవారు ఎవరైనా ఉంటే... 141 00:08:18,999 --> 00:08:21,418 ఇదే వారికి కేథడ్రాల్ లాంటిది. 142 00:08:23,545 --> 00:08:25,756 నిజం చెప్పాలంటే, చూస్తుంటే నేను కూడా ఆడగలను అనిపిస్తోంది. 143 00:08:25,756 --> 00:08:27,883 నా ఉద్దేశం, షార్ట్స్ వేసుకుని, 144 00:08:27,883 --> 00:08:30,469 అమితంగా కేరింతలు కొట్టే అభిమానుల మధ్య. 145 00:08:30,969 --> 00:08:35,307 లెవీ! లెవీ! లెవీ! 146 00:08:38,559 --> 00:08:39,686 యుజీన్! 147 00:08:39,686 --> 00:08:41,772 - హెక్టర్! - ఎలా ఉన్నావు, నా మిత్రమా? 148 00:08:43,106 --> 00:08:48,862 ఇరవై ఎనిమిదేళ్ల రియల్ బెటిస్ డిఫెండర్ హెక్టర్ బెల్లెరిన్, ఆర్సెనల్ అలాగే బార్సెలోనా 149 00:08:48,862 --> 00:08:54,076 లాంటి భారీ క్లబ్స్ కి అంతేకాక స్పానిష్ జాతీయ జట్టుకు ఆడిన వాడు. 150 00:08:55,577 --> 00:08:57,162 - మీరు ఆడగలరు అని విన్నాను. - వావ్. 151 00:08:57,162 --> 00:09:01,375 ఇప్పుడు అలాంటోడు నాతో కలిసి ఆడబోతున్నాడు. 152 00:09:01,375 --> 00:09:04,336 - ఎలా ఉన్నారు? సెవిల్ కి స్వాగతం. - అంతా చక్కగా సాగుతోంది. 153 00:09:04,336 --> 00:09:05,879 నీకు చాలా థాంక్స్. 154 00:09:05,879 --> 00:09:08,131 పైగా అసలు విషయం ఏంటంటే నేను... 155 00:09:08,131 --> 00:09:13,428 సరిగ్గా పెద్ద మ్యాచ్ జరిగే రోజున ఇక్కడికి వచ్చాను. 156 00:09:13,428 --> 00:09:15,556 ఈ ఆట ఎందుకు ఇంత తీవ్రంగా ఉంటుంది? 157 00:09:15,556 --> 00:09:18,392 ఇక్కడ ప్రతీఒక్కరు బెటిస్ లేదా సెవిల్ కి అభిమానే. 158 00:09:18,392 --> 00:09:22,187 కుటుంబాలలో కూడా, ఒక్కొక్కరు ఒక్కో జట్లకు సపోర్ట్ చేస్తారు, 159 00:09:22,187 --> 00:09:25,482 కాబట్టి ఆ ఒక్క రోజున ఒకరికి ఒకరు నచ్చరు, కానీ తర్వాత రోజు మళ్ళీ అందరూ మామూలు అయిపోతారు. 160 00:09:25,482 --> 00:09:27,150 - అది ఆటలో ఉన్న మాయ. - అది ఆటలో ఉన్న మాయ. 161 00:09:27,150 --> 00:09:28,569 మీరు ఇంతకు ముందు సాకర్ ఆడారా? 162 00:09:28,569 --> 00:09:29,820 ఓహ్, లేదు. 163 00:09:29,820 --> 00:09:32,155 ఎందుకంటే నాకేమనిపిస్తోంది అంటే, మీరు ఎలాగు ఇక్కడికి వచ్చారు కాబట్టి, 164 00:09:32,865 --> 00:09:34,992 బహుశా మీరు పెనాల్టీ కిక్ లాంటిది ఏదైనా ఆడితే బాగుంటుంది కదా? 165 00:09:34,992 --> 00:09:36,285 అంటే, అది వినడానికి బాగానే ఉంది. 166 00:09:36,285 --> 00:09:39,079 ఎంతైనా బాల్ ని తన్నడమే కదా. అదేం కష్టంగా ఉండకపోవచ్చు. ఏమంటావు? 167 00:09:39,079 --> 00:09:41,832 - అది నా బ్యాగ్ లో ఉంది. వెళ్లి తెస్తాను. - సరే. అలాగే. 168 00:09:44,710 --> 00:09:46,837 హెక్టర్ తో కలిసి బాల్ తన్నబోతున్నాను. 169 00:09:47,462 --> 00:09:52,050 ఇప్పుడు నేను ఆడబోయే విధానాన్ని చూసి, ఇతను రేపటి ఆటలో ఆడటానికి నన్ను పిలవచ్చు. 170 00:09:52,050 --> 00:09:54,553 మీ పాదం సైజు 44 అని విన్నాను. 171 00:09:54,553 --> 00:09:55,929 - వావ్. - అవును. 172 00:09:55,929 --> 00:09:57,723 అవును, ఇక్కడి ఫుట్ బాల్ గుండ్రంగా ఉంటుంది. 173 00:09:57,723 --> 00:10:00,017 స్టేట్స్ లో ఉన్నట్టు కాదు. 174 00:10:00,017 --> 00:10:01,518 - అవును. - దాన్ని ఫుట్ బాల్ అని ఎందుకంటారో ఏమో, 175 00:10:01,518 --> 00:10:03,729 ఎందుకంటే ఇక్కడ కాలితో బాల్ ని తన్నుతాం. 176 00:10:04,354 --> 00:10:06,231 కానీ అక్కడ ఆడే విధానం అలా ఉండదు. ఎందుకంటే నీకు... 177 00:10:06,231 --> 00:10:08,775 అంటే, నిజమే, నాకు తెలుసు. వాళ్ళు దాన్ని త్రో బాల్ అనాలి. 178 00:10:10,152 --> 00:10:12,988 సరే. నువ్వు గోల్ దగ్గరకు వెళ్ళు. నేను బూట్లు వేసుకుంటా. 179 00:10:13,864 --> 00:10:15,324 అంటే, ఇది నిజంగా భలే గిఫ్ట్. 180 00:10:17,242 --> 00:10:19,494 నేను పెద్ద తరహాలో ఫుట్ బాల్ లో పాల్గొంటున్నాను. 181 00:10:22,414 --> 00:10:23,332 అవును. 182 00:10:23,832 --> 00:10:26,043 ముందుగా, మీరు స్కోర్ చేస్తే ఎలా వేడుక చేస్తారు? 183 00:10:26,710 --> 00:10:28,629 ఓహ్, సరే. అంటే... 184 00:10:28,629 --> 00:10:29,838 మీకు డాన్స్ మూవ్ ఏమైనా ఉందా? 185 00:10:29,838 --> 00:10:32,299 అంటే, లేదు. 186 00:10:32,299 --> 00:10:35,469 ఒకసారి ఊహించుకోండి, వాళ్ళే మీ ప్రత్యర్థులు, అప్పుడు మీరు వాళ్ళను చూసి, 187 00:10:35,469 --> 00:10:38,055 "నేను ఏం చేసానో చూడండి" అనాలి. సరేనా? 188 00:10:38,055 --> 00:10:41,391 నేనైతే నడుం మీద చేయి ఉంచి, ఇలా చేసి చూపిస్తాను. 189 00:10:43,810 --> 00:10:47,189 ఆ కదలికకు అర్థం ఏంటో నాకు తెలీదు, కానీ చూడటానికి బాగుంది. నేను కూడా అలా చేస్తాను. 190 00:10:47,189 --> 00:10:48,941 - సిద్ధంగా ఉన్నారా? - ఉన్నాను. 191 00:10:50,025 --> 00:10:52,611 - మీరు కోట్ తీస్తున్నారు, కదా? సరే. - అంటే, తెలిసిందే కదా, 192 00:10:52,611 --> 00:10:55,322 నువ్వు అంత సులభంగా ఆపగలిగేలా ఉండకూడదు. 193 00:10:55,322 --> 00:10:58,116 మీరు స్కోర్ చేస్తే, గెలిచినట్టు. మిస్ చేస్తే, ఓడినట్టు. 194 00:11:02,913 --> 00:11:05,290 మీరు ఈ క్షణం కోసం మీ జీవితమంతా ఎదురుచూసారు. 195 00:11:05,874 --> 00:11:07,709 పైగా వేడుక చేయడానికి మూవ్ కూడా ఉంది. 196 00:11:07,709 --> 00:11:08,794 సరే. 197 00:11:20,305 --> 00:11:21,890 - చూశావా? - అవును, బాగా తన్నారు. 198 00:11:24,560 --> 00:11:26,645 - ఇదే మీ మొదటి గోలా? - అదే నా మొదటి గోల్. 199 00:11:26,645 --> 00:11:28,605 - మీకు ఎలా అనిపిస్తోంది? - చాలా బాగుంది. 200 00:11:28,605 --> 00:11:30,482 నేను నెట్ వరకైనా బాల్ ని పంపగలను అని అనుకోలేదు. 201 00:11:30,482 --> 00:11:31,900 నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. 202 00:11:33,944 --> 00:11:34,945 ఎందుకంటే... 203 00:11:36,363 --> 00:11:37,865 మీరు ఆటకు వెళ్ళినప్పుడు... 204 00:11:37,865 --> 00:11:39,408 ఓరి, దేవుడా. 205 00:11:39,408 --> 00:11:42,578 - ఓరి, దేవుడా. - ...మీ బెటిస్ షర్ట్ లేకుండా వెళ్ళకూడదు. 206 00:11:43,328 --> 00:11:44,580 వావ్. 207 00:11:44,580 --> 00:11:45,789 సెవీయ యుజీన్ లెవీ 208 00:11:45,789 --> 00:11:49,126 ఇది భలే ఉంది. ఇలా రా, నాయనా. 209 00:11:51,461 --> 00:11:52,296 థాంక్స్. 210 00:11:52,296 --> 00:11:54,506 ఇప్పుడు మీరు నిజమైన బెటిస్ అభిమాని, నా మిత్రమా. 211 00:11:54,506 --> 00:11:56,258 థాంక్స్. 212 00:11:56,258 --> 00:11:59,553 భలే, నేను అదరగొట్టాను కదా. భలే సూపర్ స్టార్ ని. 213 00:12:00,554 --> 00:12:03,724 అలాగే నువ్వు గనుక స్కోర్ చేస్తే, నేను చూస్తుంటా... 214 00:12:05,058 --> 00:12:09,146 ఒకవేళ అతను స్కోర్ చేసి, "థాంక్స్, యుజీన్" అంటే ఎలా ఉంటుంది? 215 00:12:09,146 --> 00:12:10,731 అది నిజంగా భలే ఉంటుంది. 216 00:12:12,733 --> 00:12:16,028 సెవిల్ లోని ఈ సాకర్ వైరుధ్యం ఈనాటిది కాదు, 217 00:12:16,653 --> 00:12:21,491 కానీ ఈ 2,000 ఏండ్ల నాటి సిటీ రెండుగా చీలడం ఇదేమి మొదటిసారి కాదు. 218 00:12:21,491 --> 00:12:26,246 కాబట్టి నేను ఇక్కడ ఉండగా, ఈ సిటీని మరింత అన్వేషించకపోతే తప్పు చేసినట్టే. 219 00:12:27,331 --> 00:12:28,916 - హోసే. - యుజీన్. 220 00:12:28,916 --> 00:12:31,251 - సెవీయకి స్వాగతం. - థాంక్స్. 221 00:12:31,251 --> 00:12:35,797 ఇక్కడి స్థానిక టూర్ గైడ్, హోసే, నాకు ఊరంతా చూపిస్తాను అన్నాడు. 222 00:12:35,797 --> 00:12:38,550 మీరు ఇప్పుడు సెవీయలోని అతిపురాతన బిల్డింగ్ ముందు నిలబడ్డారు. 223 00:12:38,550 --> 00:12:41,678 ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోతిక్ కాథెడ్రల్. 224 00:12:41,678 --> 00:12:44,264 ఇది నిజంగా అందంగా ఉంది. 225 00:12:45,265 --> 00:12:48,560 కానీ నాకు తెలిసింది ఏంటంటే, సెవిల్ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయంట. 226 00:12:49,478 --> 00:12:50,979 ఒకప్పుడు అది మసీదుగా ఉండేది, 227 00:12:50,979 --> 00:12:53,941 - ఆ తరువాత దాన్ని కేథడ్రాల్ గా మార్చారు. - సరే. 228 00:12:53,941 --> 00:12:59,238 ఉత్తర ఆఫ్రికన్ మూర్లు క్రీ.శ. 711లో సిటీని రోమన్ల నుండి స్వాధీనపరుచుకున్నారు. 229 00:12:59,863 --> 00:13:02,241 - ఓరి, దేవుడా. దాన్ని చూడండి. - ఆ గుర్రాలను చూసుకోండి. 230 00:13:03,075 --> 00:13:05,827 మూర్లను క్రైస్తవులు బయటకు తరిమేశారు. 231 00:13:05,827 --> 00:13:07,621 చూశారా? ఆటుపోట్లు. 232 00:13:09,248 --> 00:13:11,333 మీకు ఈ ప్రదేశం గురించి చాలా తెలుసు. 233 00:13:11,333 --> 00:13:15,003 అవును, ఎందుకంటే మా అమ్మా నాన్నలు సెవీయలోనే పుట్టి పెరిగారు. 234 00:13:15,629 --> 00:13:17,256 నేను మాంట్రియల్ లో పెరిగాను. 235 00:13:17,256 --> 00:13:21,051 భలే, ఇదేదో పెద్ద విషయమే. ఇక్కడ కూడా కెనడా వాళ్లు ఉన్నారన్నమాట. 236 00:13:21,051 --> 00:13:23,470 - అవును, నిజ... - మీరు కెనడాలో ఏం చేసేవారు? 237 00:13:23,470 --> 00:13:26,723 నేను జుట్టు అలాగే మేకప్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో పనిచేశా. 238 00:13:26,723 --> 00:13:28,684 ఎక్కడైనా వినోద రంగాన్ని తప్పించుకోలేం. 239 00:13:28,684 --> 00:13:32,187 అది ఎక్కడబడితే అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా. 240 00:13:32,187 --> 00:13:34,898 మేకప్ ఆర్టిస్ట్ హోసే చెప్పేదాన్ని బట్టి 241 00:13:34,898 --> 00:13:38,902 అతనికి ఈ సిటీ పుట్టు పూర్వోత్తరాలు బాగా తెలుసని తెలుస్తోంది. 242 00:13:38,902 --> 00:13:40,487 ఇదే సెవీయని అలాగే ట్రియాన వైపు నుండి 243 00:13:40,487 --> 00:13:44,241 వేరు చేసే ఫేమస్ ట్రియానా బ్రిడ్జ్. 244 00:13:44,241 --> 00:13:47,536 ఇది ఒక జనావాస ప్రాంతం, కానీ అక్కడి వాళ్ళు అదొక వేరే సిటీ అన్నట్టు ఫీల్ అవుతారు. 245 00:13:47,536 --> 00:13:49,454 ఇది న్యూ యార్క్ ఇంకా బ్రూక్లిన్ లాంటిది. 246 00:13:50,289 --> 00:13:55,711 ఒకప్పుడు నాకు తెలుసి, మాన్హాటన్ వారు బ్రూక్లిన్ వారిని తక్కువగా చూసేవారు. 247 00:13:55,711 --> 00:13:59,006 అంటే, నాకు ఇక్కడ కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. 248 00:13:59,798 --> 00:14:03,635 మేము ఆ బ్రిడ్జ్ దాటుతుండగా, బోలెడన్ని బోట్లను చూశాం. 249 00:14:04,303 --> 00:14:09,057 చూడటానికి స్పానిష్ ఆర్మాడా అనిపించింది, కానీ ఇవి ఫిరంగులు లేని చిన్న బోట్లు. 250 00:14:09,057 --> 00:14:11,727 అందరూ అరుస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. 251 00:14:11,727 --> 00:14:13,145 ఇక్కడ ఒక పందెం నడుస్తోంది. 252 00:14:13,145 --> 00:14:18,108 ఈసారి ఇది సెవీయ ఇంకా బెటిస్ వారి రోయింగ్ జట్ల పందెం. 253 00:14:18,108 --> 00:14:20,110 ఇక్కడ ఉన్నారు. అది చూడండి. 254 00:14:20,110 --> 00:14:23,780 ఇది చాలా బలమైన పోటీ. 255 00:14:23,780 --> 00:14:25,240 అవును. అవును, నిజమే. 256 00:14:26,992 --> 00:14:30,704 అద్భుతంగా ఉంది. వాళ్ళు ఒకరిని ఒకరు ఓడించడానికి తీవ్రంగా పోటీపడుతున్నారు. 257 00:14:33,624 --> 00:14:36,960 - నాకు ట్రియానా గురించి చెప్పండి. - అది కార్మికుల టౌన్. 258 00:14:36,960 --> 00:14:40,756 అది బుల్ ఫైటర్లు, ఫ్లెమెంకో డాన్సర్లు, ఇంకా జిప్సీలకు పేరుగాంచిన ప్రదేశం. 259 00:14:40,756 --> 00:14:43,717 అయితే ఫ్లెమెంకో డాన్స్ కార్మిక ప్రజలు నుండి వచ్చింది అన్నమాట. 260 00:14:43,717 --> 00:14:45,636 - అది అంతే కదా? - అవును. నిజం. 261 00:14:45,636 --> 00:14:48,096 అనేక సంప్రదాయాల వారి నుండి వచ్చింది. 262 00:14:48,096 --> 00:14:51,892 నేను వింటున్న దానిని బట్టి, ఇక్కడ వీరిలో బోలెడంత ఉత్సాహం ఉంది. 263 00:14:51,892 --> 00:14:54,937 అటువైపు అంతా తాము గొప్ప అనుకునేవారు ఉన్నారు. 264 00:14:54,937 --> 00:14:56,897 కానీ నేను మాత్రం ఇవతలి వైపే ఉంటాను. 265 00:15:00,567 --> 00:15:04,488 నా మాట వినండి, నేను నా భావాలను వ్యక్తపరిచే వ్యక్తిని అస్సలు కాదు, 266 00:15:04,988 --> 00:15:07,908 కానీ నాకు ఫుట్బాల్ బాగా నచ్చేసింది, 267 00:15:07,908 --> 00:15:11,703 అలాగే ఇప్పుడు సేవిల్లోని మరొక బలమైన అభిరుచి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నా. 268 00:15:11,703 --> 00:15:13,497 వెళ్లి ఫ్లెమెంకో ఆడుదాం. 269 00:15:14,540 --> 00:15:18,335 ఫ్లెమెంకో అనే డాన్స్ రోమా ప్రజల జానపద సంప్రదాయాల నుండి పుట్టిన డాన్స్. 270 00:15:19,086 --> 00:15:22,506 అది ఉద్వేగంగా, ఎమోషనల్ గా, బలమైన కదలికలతో ఉంటుంది. 271 00:15:23,006 --> 00:15:27,094 కెనడాలో మేము ఇలాంటిది చూడలేదు అని నేను హోసేకి ముందే చెప్పాలేమో. 272 00:15:27,094 --> 00:15:30,514 మేము బీబర్ గురించి తప్ప వేరే వాటి గురించి ఉద్రేకానికి గురయ్యేవాళ్ళం కాదు. 273 00:15:30,514 --> 00:15:33,600 మీ మొదటి ఫ్లెమెంకో డాన్స్ చూడటానికి రెడీగా ఉన్నారా? 274 00:15:33,600 --> 00:15:35,310 - అవును. నాకు ఆసక్తిగా ఉంది. - అవునా? 275 00:15:35,310 --> 00:15:39,147 అలాగే మీకు కూడా డాన్స్ వేయాలని ఉంటే, మీరు "ఓలే! వామోస్!" అనొచ్చు. 276 00:15:39,147 --> 00:15:40,983 నేను ఒక్కడినే ఓలే అనకపోతే చాలు. 277 00:15:40,983 --> 00:15:42,943 - అలా గనుక జరిగితే... - వీళ్ళు కూడా అంటారు. 278 00:15:42,943 --> 00:15:45,112 అలా జరిగితే అస్సలు బాగోదు. కదా? 279 00:15:45,112 --> 00:15:47,155 ఒక్క వ్యక్తే ఓలే అనడం. 280 00:15:58,208 --> 00:16:02,087 ఆమె ఆ స్టేజి మీద కాలితో గట్టిగా నేలను తన్నినప్పుడు, నేను ఉలిక్కిపడ్డా. 281 00:16:03,547 --> 00:16:04,631 నాకు భయం వేసింది. 282 00:16:11,638 --> 00:16:12,973 వామోస్! 283 00:16:12,973 --> 00:16:14,766 ఇది ఇంత తీవ్రమైన డాన్స్ అని నాకు తెలీదు. 284 00:16:15,475 --> 00:16:18,937 వాళ్ళు ఆడియన్స్ లో ఉన్న వారి మనలోని అభిరుచిని, ఆసక్తిని బయటకు 285 00:16:18,937 --> 00:16:22,566 తీసుకురాగల మానసిక స్థితిలోకి మనల్ని తీసుకెళ్తున్నారు. 286 00:16:22,566 --> 00:16:24,026 అది చాలా గొప్ప ట్యాలెంట్. 287 00:16:25,819 --> 00:16:27,029 ఓలే! 288 00:16:28,280 --> 00:16:31,783 అంటే, అది నా అంచనా. ఒకవేళ వాళ్ళు చాలా చెత్తగా డాన్స్ వేసి ఉండొచ్చు. 289 00:16:31,783 --> 00:16:34,328 వాళ్ళు చాలా చెత్త ప్రదర్శన ఇచ్చినా అది నాకు తెలిసే అవకాశం లేదు. 290 00:16:34,328 --> 00:16:35,662 నేను ఇది చూడటం ఇదే మొదటిసారి. 291 00:16:35,662 --> 00:16:36,747 బ్రావో. 292 00:16:42,419 --> 00:16:45,714 అలాగే నేను ముందెప్పుడూ చూడని విషయం అంటే గుర్తుకొచ్చింది... 293 00:16:48,717 --> 00:16:50,552 ఇవాళ ఆ పెద్ద మ్యాచ్ జరగబోతోంది. 294 00:16:50,552 --> 00:16:52,888 బెటిస్ వెర్సస్ సెవీయ. 295 00:16:56,099 --> 00:16:58,852 నేను హెక్టర్ కి సపోర్ట్ చేస్తా. నేను బెటిస్ కి సపోర్ట్ చేస్తా. 296 00:16:58,852 --> 00:17:00,521 ఎక్కడ చూసినా గ్రీన్ బట్టలే. 297 00:17:01,772 --> 00:17:05,733 గత సీజన్ లో దాదాపు 20 కోట్ల మంది యూరోపియన్లు ఫుట్బాల్ ఆటకు వెళ్లారు, 298 00:17:06,318 --> 00:17:10,071 ఈ ఖండంలో ఆ ఆటకు ఎలాంటి ఆదరణ ఉందో అదే మనకు చెప్తుంది. 299 00:17:10,071 --> 00:17:11,490 ఇక అభిమానులు రావడం మొదలైంది, 300 00:17:11,490 --> 00:17:14,492 ఇక్కడి వాతావరణంలో ఉన్న టెన్షన్ తో నిండిన ఉత్సాహం మనకు తెలుస్తుంది. 301 00:17:15,243 --> 00:17:18,079 అది టెన్షన్ తో నిండిన ఉత్సాహం అయ్యుండాలని నా ఆశ. 302 00:17:19,122 --> 00:17:20,915 అమ్మో, ఈ టౌన్ పిచ్చెక్కిపోతోంది. 303 00:17:20,915 --> 00:17:25,337 పోలీసులు గుర్రాల మీద ఉన్నారు. వాళ్ళు దేనికో రెడీ అవుతున్నారు. 304 00:17:28,757 --> 00:17:31,009 ఫుట్బాల్ వ్యాఖ్యాత సెమ్రా... 305 00:17:31,009 --> 00:17:32,094 వామోస్! 306 00:17:32,094 --> 00:17:34,304 ...నన్ను బెటిస్ స్టేడియంకి ఆహ్వానించింది... 307 00:17:34,304 --> 00:17:36,306 - హలో. హోలా! - సెమ్రా! 308 00:17:36,306 --> 00:17:39,893 ...ఈమె నన్ను ఈ "ఎల్ గ్రాన్ డార్బీలో" ఉండే ఉత్సాహంలో ముంచెత్తాలని చూస్తోంది. 309 00:17:39,893 --> 00:17:42,855 - నేను మీకు స్పానిష్ శైలిలో హలో చెప్పాను. - ఇది బాగుంది. 310 00:17:42,855 --> 00:17:45,524 మీతో కలిసి ఆటను చూడటానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. 311 00:17:45,524 --> 00:17:49,486 ఇది సెవిల్ లో నిజంగానే ఏడాది మొత్తంలో అతి ప్రాముఖ్యమైన రోజు. 312 00:17:49,486 --> 00:17:51,947 - మీరు ఇక్కడికి సరైన రోజున వచ్చారు. - అవును నిజమే. 313 00:17:54,283 --> 00:17:55,742 ఇక్కడ ఏం జరుగుతోంది? 314 00:17:55,742 --> 00:17:59,454 బెటిస్ అభిమానులు వాళ్ళ టికెట్లు తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు, 315 00:17:59,454 --> 00:18:01,456 ఆ తర్వాత ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 316 00:18:01,456 --> 00:18:04,543 స్టేడియంకి వాళ్ళను పోలీసులు నడిపిస్తారు. 317 00:18:06,211 --> 00:18:08,297 సిద్ధంగా ఉండండి. వాళ్ళు వస్తున్నారు. 318 00:18:08,297 --> 00:18:10,632 వాళ్ళు వస్తున్నారు. వస్తున్నారు. వెనక్కి పదండి. 319 00:18:14,011 --> 00:18:16,930 మీకు ఏమనిపిస్తోంది? ఇది భలే ఉంది, కదా? 320 00:18:19,266 --> 00:18:20,642 నా మతిపోతోంది. 321 00:18:21,894 --> 00:18:27,232 ఒక్క లక్ష్యంతో తీవ్రమైన ఉత్సాహంతో బోలెడంత మంది వెళ్తున్నారు. 322 00:18:27,232 --> 00:18:29,776 గెలవాలని. సెవిల్ ని ఓడించాలని. 323 00:18:33,739 --> 00:18:35,699 అలాగే ఉన్నట్టుండి ఇంకొకసారి వీరిలో ఉత్సాహం మొదలైంది. 324 00:18:35,699 --> 00:18:37,117 ఎప్పటికీ పచ్చ జట్టుతోనే 325 00:18:37,117 --> 00:18:42,789 ఈ అభిమానులంతా స్టేడియంకి బస్సు మీద వెళ్తున్న తమ ఆటగాళ్లను 326 00:18:42,789 --> 00:18:44,750 చూడటానికి పరిగెడుతున్నారు. 327 00:18:49,254 --> 00:18:50,672 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. 328 00:18:52,549 --> 00:18:55,093 డార్బీ టికెట్లు అంత సులభంగా దొరకవు, 329 00:18:55,093 --> 00:18:58,388 నాకులా ఎన్నాళ్ళుగానో బెటిస్ జట్టుకు వీరాభిమానులైన వారికి కూడా. 330 00:18:58,388 --> 00:19:03,393 కాబట్టి మేము పీన్య అని స్థానిక సపోర్టర్లు పిలిచే ఒక బార్ కి వెళ్లి ఆటను చూడబోతున్నాం. 331 00:19:03,393 --> 00:19:04,478 భలే! 332 00:19:06,063 --> 00:19:08,273 1927లో స్థాపించబడిన ఈ ప్రదేశం 333 00:19:09,107 --> 00:19:12,486 నా కొత్త షర్ట్ వేసుకోవడానికి సరైన చోటు. 334 00:19:12,486 --> 00:19:14,029 అదరగొట్టండి! 335 00:19:16,031 --> 00:19:17,324 సరే. ఇక ఆట మొదలైంది. 336 00:19:22,204 --> 00:19:26,500 ఈ చారిత్రాత్మక వైరానికి 117 ఏండ్ల చరిత్ర ఉంది. 337 00:19:30,003 --> 00:19:34,049 విషయం ఏంటంటే ఇది బెటిస్ వారు అలాగే నా కొత్త ఫ్రెండ్ హెక్టర్... 338 00:19:36,593 --> 00:19:37,594 ఎలాగైనా గెలవాలని చూస్తున్న మ్యాచ్. 339 00:19:38,262 --> 00:19:40,347 - అదిగో హెక్టర్! - మీ వాడు అక్కడ ఉన్నాడు. 340 00:19:40,347 --> 00:19:42,307 హెక్టర్! అవును! 341 00:19:42,307 --> 00:19:44,476 అదే మీ వాడు. అదే మీ వాడు! 342 00:19:49,982 --> 00:19:52,234 అవును! 343 00:19:53,819 --> 00:19:55,362 బెల్లెరిన్! 344 00:19:55,362 --> 00:19:59,116 నేను ఈ మ్యాచ్ ఇంతకంటే అద్భుతంగా మారలేదు అనుకుంటున్న సమయంలో... 345 00:20:00,117 --> 00:20:01,702 అతన్ని చూడండి! 346 00:20:03,036 --> 00:20:04,621 అతను ఏం చేశాడో చూశారా? 347 00:20:05,122 --> 00:20:06,540 అతను వేలు చూపించాడు. 348 00:20:07,040 --> 00:20:08,750 అతనికి ఆ మూవ్ నేర్పించింది నేనే. 349 00:20:08,750 --> 00:20:13,213 అతను స్కోర్ చేసిన తర్వాత నిజంగానే నా మూవ్ చేయడం గొప్ప విషయం. 350 00:20:13,714 --> 00:20:14,715 తెలుసా? 351 00:20:15,674 --> 00:20:16,675 భలే మంచోడు. 352 00:20:19,553 --> 00:20:20,971 వాళ్ళు గోల్ ఇవ్వలేదు. 353 00:20:20,971 --> 00:20:22,055 గోల్ ఇవ్వలేదా? 354 00:20:23,140 --> 00:20:25,184 అంటే, ఏమైనా సరే సంతోషమే, కదా? 355 00:20:28,228 --> 00:20:31,773 హెక్టర్ గోల్ ఆఫ్ సైడ్ అని చెప్పి గోల్ ఇవ్వలేదు. 356 00:20:31,773 --> 00:20:34,735 కానీ మా ఆసక్తికి అది ఆరంభం మాత్రమే. 357 00:20:35,319 --> 00:20:40,782 అతిత్వరలోనే నాకు తెలీకుండా నాలో ఉన్న కెనెడియన్ మొహమాటం మొత్తం పోయింది. 358 00:20:40,782 --> 00:20:41,909 ఓలే! 359 00:20:43,660 --> 00:20:44,661 భలే! 360 00:20:45,412 --> 00:20:46,622 సాధించు! 361 00:20:51,001 --> 00:20:54,046 గోల్ చేసినప్పుడు నేను నిలబడి అరిచాను. 362 00:20:56,006 --> 00:20:59,301 అక్కడ ఎవరో కూడా తెలీని వారికి నేను హై-ఫైవ్ లు ఇచ్చేసాను, 363 00:20:59,301 --> 00:21:01,512 ఒక బ్లూ జేస్ ఆటలో ఎలా ఉంటానో అలా ఉన్నాను. 364 00:21:03,013 --> 00:21:08,185 కాబట్టి బహుశా ఆ క్షణంలో, నేను ఆటలోని ఎమోషన్ తో మమేకమైపోయాను ఏమో. 365 00:21:11,146 --> 00:21:15,025 కానీ నాకు ఎదురైన చేదు అనుభవాల ద్వారా క్రీడలు చాలా క్రూరమైనవి అని నాకు తెలుసు. 366 00:21:16,026 --> 00:21:17,611 లేదు! 367 00:21:18,612 --> 00:21:20,822 ఇక్కడ కూడా అదే మళ్ళీ నిరూపితమైంది. 368 00:21:24,743 --> 00:21:26,119 సరే, ఆట టై అయింది. 369 00:21:27,037 --> 00:21:30,666 బెటిస్! బెటిస్! 370 00:21:30,666 --> 00:21:34,086 ఇది నేను ఊహించినదానికన్నా బాగా సాగిన ఆట. 371 00:21:34,086 --> 00:21:35,879 మంచి ఆట, మంచి ఆట. 372 00:21:35,879 --> 00:21:37,214 మనం గెలిచి ఉండాల్సింది. 373 00:21:37,214 --> 00:21:41,969 నేను నా సాకర్ జట్టుగా బెటిస్ ని ఫాలో అవ్వడం మొదలెట్టాలి. 374 00:21:43,053 --> 00:21:46,598 {\an8}నేను ఇంటికి వెళ్ళాక ఈ సాయంత్రాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా తలచుకుంటా. 375 00:21:47,224 --> 00:21:50,686 {\an8}నేను దక్షిణానికి వెళ్ళడానికి ముందు సెవిల్ లో గడపబోయే ఆఖరి రాత్రి ఇదే కాబట్టి 376 00:21:51,270 --> 00:21:53,522 ఆ రోజు త్వరలోనే వస్తుంది లెండి. 377 00:21:54,481 --> 00:21:56,733 ఇది చాలా బలమైన ఆశయాలు ఉన్న టౌన్. 378 00:22:00,362 --> 00:22:05,784 ఇక్కడ ఫుట్బాల్ మీద ఎంత బలమైన అభిరుచి ఉందో ఫ్లెమెంకో మీద కూడా అంతే బలమైన అభిరుచి ఉంది. 379 00:22:05,784 --> 00:22:09,162 ఒక విషయానికి పూర్తిగా అంకితం కావడమే దాని సీక్రెట్. 380 00:22:09,162 --> 00:22:11,957 ఇక్కడ నేను చూసిన కామన్ విషయం అదే అనుకుంటున్నా. 381 00:22:20,090 --> 00:22:24,219 నేను యూరోప్ చివరికొన ఉన్న తీరానికి వెళ్ళడానికి ముందు, 382 00:22:24,219 --> 00:22:27,598 నా ప్రయాణంలో నేను వెళ్లాలనుకుంటున్న ఆఖరి ప్రదేశం ఒకటి ఉంది. 383 00:22:29,641 --> 00:22:33,187 మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు ప్రయాణాలంటే 384 00:22:33,187 --> 00:22:34,980 ఏమాత్రం గిట్టని నాకు, 385 00:22:34,980 --> 00:22:39,151 ఇలా ఉత్సాహంగా వెళ్లడం కొత్త అనుభవమే. 386 00:22:39,151 --> 00:22:41,862 నేను 12వ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నా. 387 00:22:41,862 --> 00:22:45,282 కాకపోతే ఇప్పటికీ సులభంగా తప్పిపోవడం సాధ్యమే అనుకోండి. 388 00:22:46,491 --> 00:22:47,576 నిజానికి నాకు ట్రైన్లు అంటే చాలా ఇష్టం. 389 00:22:47,576 --> 00:22:49,703 నేను వాటి మీద పెద్దగా ప్రయాణించేది లేదు. 390 00:22:50,370 --> 00:22:53,123 అంటే, ఈ రోజుల్లో ఒకప్పటిలా వాటిని నిర్మించడం లేదు అనుకోండి. 391 00:22:54,249 --> 00:22:56,919 నాలో చాలా పెద్ద మార్పే చోటుచేసుకుంది, 392 00:22:56,919 --> 00:23:00,088 ఇక ఇప్పుడు నేను గమ్యానికి వెళ్లడం మాత్రమే కాక, 393 00:23:00,088 --> 00:23:01,798 ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. 394 00:23:03,175 --> 00:23:05,928 ఇక్కడికి కొన్ని గంటల దూరంలో, అండలూసియాలో ఉన్న ఖచ్చితంగా చూడాల్సిన 395 00:23:05,928 --> 00:23:10,057 అందమైన ప్రదేశాలలో ఒకటైన మాలగ పర్వత శ్రేణులు ఉన్నాయి. 396 00:23:10,849 --> 00:23:12,267 కానీ ఆ అందాన్ని నిజంగా ఆస్వాదించాలి అంటే, 397 00:23:12,267 --> 00:23:16,730 నాలో సాహసించగల సామర్ధ్యం ఎంత వరకు పెరిగిందో నేను చూడాలి. 398 00:23:17,564 --> 00:23:19,107 రాజుగారి ఇరుకైన దారి. 399 00:23:19,107 --> 00:23:21,818 అంటే, అది చాలా అందంగా ఉండే వ్యూ అంట. 400 00:23:22,486 --> 00:23:25,113 అందుకని అంత దూరం ట్రైన్ లో వెళ్లినా తప్పు లేదన్నారు. 401 00:23:25,113 --> 00:23:26,823 అక్కడికి వెళ్ళడానికి ఇది మంచి విధానమే. 402 00:23:29,201 --> 00:23:32,329 ఆ ప్రదేశాన్ని ఇక్కడ "ఎల్ కామినిటో దెల్ రే" అంటారు, 403 00:23:32,329 --> 00:23:35,832 ఇది స్పెయిన్ లో ఉన్న అత్యంత పాపులర్ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటి. 404 00:23:37,125 --> 00:23:41,839 తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతీ ఏటా 3,00,000 మంది వీక్షకులు 405 00:23:41,839 --> 00:23:45,425 ఇక్కడి 2,400 అడుగుల ఎత్తు ఉండే శిఖరాన నడుస్తూ 406 00:23:45,425 --> 00:23:48,345 దేశంలోనే అందమైన వ్యూలలో ఒకదాన్ని చూడటానికి వస్తుంటారు. 407 00:23:49,471 --> 00:23:52,641 ఈ హెల్మెట్ వేసుకోవడం సంతోషంగా ఉంది. నాకే అంత ఉత్సాహంగా లేదు. 408 00:23:53,141 --> 00:23:54,643 ఆ వ్యూ నిజంగా అదిరిపోవాలి. 409 00:23:55,477 --> 00:23:57,312 ఇప్పుడు వెనక్కి వెళ్ళలేమా? 410 00:23:58,188 --> 00:24:02,109 ఇది ఎనిమిది కిలోమీటర్ల నడక అయినా మూడు అడుగుల వెడల్పు ఉండే బ్రిడ్జి మీద 411 00:24:02,609 --> 00:24:05,070 నడవాలని చెప్పి అలా అడుగుతున్నా. 412 00:24:07,948 --> 00:24:09,449 ఓహ్, అబ్బా. సరే. 413 00:24:10,117 --> 00:24:12,995 ఆ పలకల కింద మాత్రం చూడకండి. 414 00:24:13,662 --> 00:24:14,788 సరే. 415 00:24:15,789 --> 00:24:19,710 ఈ వంతెనని ఒరిజినల్ గా ఇక్కడి రెండు హైడ్రో ఎలెక్ట్రిక్ సైట్స్ దగ్గర 416 00:24:19,710 --> 00:24:22,296 పనిచేసే వర్కర్లు వచ్చిపోవడానికి కట్టారు. 417 00:24:22,796 --> 00:24:24,131 ఓరి, దేవుడా. 418 00:24:25,257 --> 00:24:26,592 ఈ వంతెనని నవీకరించడానికి ముందు, 419 00:24:26,592 --> 00:24:30,387 దీన్ని భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన వంతెన అనేవారు. 420 00:24:30,387 --> 00:24:35,100 కాబట్టి, వాళ్ళు ఇక్కడ ఏం నవీకరణలు చేసారో తెలీదు, కానీ అవి మంచివై ఉండాలని నా కోరిక. 421 00:24:35,100 --> 00:24:38,520 ఒక్కసారి చెక్క కిర్రుమన్నా, నేను వెనక్కి పోతా. 422 00:24:39,688 --> 00:24:43,483 అక్కడ ఉన్న వ్యూ నిజంగా అద్భుతంగా ఉండి ఉంటుందిలే, 423 00:24:44,568 --> 00:24:49,823 కానీ దాన్ని ఎప్పటికి చూస్తానో ఏమో. 424 00:24:49,823 --> 00:24:52,242 వంతెన అంచున ఉన్నది చూడకుండా వెళ్లడమే ఇక్కడ కిటుకు. 425 00:24:58,832 --> 00:24:59,833 కానీ తెలిసింది ఏంటంటే, 426 00:24:59,833 --> 00:25:02,878 ముందుకు చూడటం కూడా అంతే భయంకరంగా ఉంది. 427 00:25:02,878 --> 00:25:04,463 ఓరి, దేవుడా. 428 00:25:09,343 --> 00:25:12,513 నేను దాదాపుగా చేరుకున్నాను ఆ చూసే ప్రదేశానికి, 429 00:25:12,513 --> 00:25:17,100 కానీ అక్కడికి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, ఈ కింద కనిపించేలా ఉన్న బ్రిడ్జ్ దాటడమే. 430 00:25:18,018 --> 00:25:21,396 ఆ కింద ఏముందో అని నాకు చాలా భయంగా ఉంది. 431 00:25:21,396 --> 00:25:22,481 తెలుసా? 432 00:25:22,981 --> 00:25:27,402 రెండు ఏండ్ల క్రితం, నేను చచ్చినా ఇక్కడికి వచ్చేవాడిని కాదు. 433 00:25:30,864 --> 00:25:34,326 కానీ గత ఏడాది కోస్టారికాలోని వేలాడే బ్రిడ్జ్ దాటిన నా భయాన్ని ఎదుర్కొన్న తర్వాత, 434 00:25:34,326 --> 00:25:39,289 ఇక నేను ఎత్తులంటే భయపడటం మానేసాను. 435 00:25:39,289 --> 00:25:41,959 కానీ నేను చెప్పింది అంతా మీరు నమ్మేసి ఉంటే, మీకు జీవితంలో అదృష్టం చాలా అవసరం. 436 00:25:44,211 --> 00:25:46,797 ఓరి, దేవుడా. 437 00:25:54,721 --> 00:25:56,098 ఓరి, దేవుడా. 438 00:25:57,808 --> 00:26:00,269 వావ్. ఓరి, దేవుడా. 439 00:26:06,900 --> 00:26:09,069 నిజం చెప్పాలంటే, నేను ఈ బ్రిడ్జ్ ని మొదటిసారి చూసినప్పుడు, 440 00:26:09,069 --> 00:26:11,488 "వెళ్ళను" అనే మాట నా నోటి వరకు వచ్చింది. 441 00:26:12,990 --> 00:26:14,867 ఇది నన్ను బాగా పరీక్షించింది. 442 00:26:15,492 --> 00:26:18,620 నా చేయి ఏదైనా ఫ్రీగా ఉండి ఉంటే, నాకు నేనే శభాష్ అని చెప్పుకునేవాడిని. 443 00:26:19,454 --> 00:26:22,165 కానీ ప్రస్తుతం నేను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉన్నాను. 444 00:26:26,378 --> 00:26:31,758 ఇక్కడ వ్యూని చూసే ప్రదేశం అండలూసియాలోని అత్యంత అందమైన సీనరీలలో ఒకదానిని చూపుతుంది అంట. 445 00:26:32,259 --> 00:26:34,011 ఓరి, దేవుడా. 446 00:26:34,595 --> 00:26:35,596 అదిగో అక్కడ ఉంది. 447 00:26:37,598 --> 00:26:41,935 కానీ ఆ ప్రదేశం పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని నాతో ఎవరూ చెప్పలేదు. 448 00:26:51,028 --> 00:26:52,029 ఏం పర్లేదు. 449 00:26:53,906 --> 00:26:54,907 అవును. 450 00:26:56,783 --> 00:26:57,784 మీకు ఎలా నచ్చింది? 451 00:27:00,245 --> 00:27:02,956 అంటే, నేను మాత్రం గాజు ఫ్లోర్ మీదకు వెళ్ళేది లేదు, 452 00:27:02,956 --> 00:27:06,168 కానీ ఇది ఈ టౌన్ లోనే బెస్ట్ వ్యూ, మీ ఎదురుగానే ఉంది చూడండి. 453 00:27:06,668 --> 00:27:08,378 లిస్టులో ఉన్న ఒకదాన్ని చూసేసా. 454 00:27:08,962 --> 00:27:10,464 నేను ఇక్కడికి వచ్చి పని పూర్తి చేశా. 455 00:27:11,798 --> 00:27:14,301 ఇక ముందు ఏముందో చూడాలి. 456 00:27:14,801 --> 00:27:16,720 సరే. ఇక పదండి. 457 00:27:17,346 --> 00:27:18,847 నన్ను చూడండి. చేతులు వదిలేసా. 458 00:27:19,556 --> 00:27:23,894 ఒకప్పటి నేనైతే శిఖరం అంచున నడవడం కాదు కదా, ఒక ఖండాన్ని దాటే ప్రయాణం 459 00:27:23,894 --> 00:27:27,689 చేయాలి అంటే కనీసం ఆలోచించే వాడిని కాదు. 460 00:27:28,232 --> 00:27:31,902 కానీ ఇప్పటికీ ఒకింత భయంగానే నడుచుకునే నేను, 461 00:27:31,902 --> 00:27:33,862 మొదటి నుండీ ఇలాంటోడిని కాదు. 462 00:27:34,863 --> 00:27:37,908 నా చిన్నప్పుడు, నేను ట్రైన్స్ లో ప్రయాణించేవాడిని, అది చాలా ఇష్టపడేవాడిని. 463 00:27:38,492 --> 00:27:41,954 అప్పుడు నాకు ఎనిమిది ఏండ్లు, నాకు న్యూ యార్క్ కి వెళ్లడం గుర్తుంది. 464 00:27:42,621 --> 00:27:45,707 మా ఊరు హామిల్టన్ నుండి, చాలా సంతోషపడ్డా. 465 00:27:45,707 --> 00:27:47,417 ఆ అనుభవం నా మనసులో అలాగే ఉండిపోయింది. 466 00:27:47,417 --> 00:27:49,711 నా జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు, 467 00:27:50,295 --> 00:27:52,923 నాలో ఉన్న ఆ సాహస భావాన్ని నేను పోగొట్టుకున్నా. 468 00:27:52,923 --> 00:27:54,508 కానీ యూరోప్ విషయానికి వస్తే, 469 00:27:54,508 --> 00:27:58,220 నా యవ్వన ప్రాయపు విశ్వాసానికి ప్రాణం పోస్తున్న విషయం ఏదో ఇక్కడ ఉంది. 470 00:27:58,720 --> 00:28:01,390 నేను సరైన దారినే వెళ్తుండాలని కోరుకుంటున్నా. 471 00:28:07,145 --> 00:28:10,023 ఈ ఖండం ఉత్తరాన నా ప్రయాణాన్ని మొదలెట్టిన నేను, 472 00:28:10,023 --> 00:28:14,695 నెమ్మది నెమ్మదిగా ఆ ప్రయాణంలో ఆఖరి గమ్యానికి చేరుకున్నాను. 473 00:28:15,279 --> 00:28:20,659 ఇదే యూరోప్ దక్షిణాన ఉన్న టరీఫా అనబడే ఒక తీర పట్టణం. 474 00:28:22,703 --> 00:28:24,621 నేను ఒక కొత్త మనిషిని అన్న ఫీలింగ్ వస్తోంది. 475 00:28:25,122 --> 00:28:27,207 అది గమనించింది నేను ఒక్కడినే కాదు. 476 00:28:28,250 --> 00:28:31,545 అంటే, 76 ఏళ్ల వయసులో నేను పునర్జీవనాన్ని పొందాను. 477 00:28:32,045 --> 00:28:35,841 నా భార్య, డెబ్ నిజానికి ఏమనుకుందీ అంటే, నా జీవితంలో జరిగిన అతిగొప్ప 478 00:28:35,841 --> 00:28:37,718 వాటిలో ఇది కూడా ఒకటి అంట. 479 00:28:38,468 --> 00:28:39,761 ఆమెను కలవడాన్ని పక్కన పెడితే. 480 00:28:42,598 --> 00:28:43,849 ఈ టరీఫా నగరాన్ని మొదటి శతాబ్దంలో 481 00:28:43,849 --> 00:28:46,977 స్థాపించింది కూడా ఆనాటి రోమన్లే. 482 00:28:46,977 --> 00:28:48,312 అందులో ఆశ్చర్యమే లేదు. 483 00:28:48,312 --> 00:28:51,440 ఈ టౌన్ ఒక అత్యద్భుతమైన సరిహద్దున ఉంది. 484 00:28:53,358 --> 00:28:55,736 ఇది నిజంగా చాలా అందంగా ఉంది. 485 00:28:58,822 --> 00:29:00,115 ఇక్కడ ఏమని ఉందో చూడండి. 486 00:29:00,991 --> 00:29:02,743 అది మధ్యధరా సముద్రం. 487 00:29:03,744 --> 00:29:05,245 అలాగే ఇది అట్లాంటిక్ మహా సముద్రం. 488 00:29:05,245 --> 00:29:06,788 ఇంత దూరం వచ్చాక, 489 00:29:06,788 --> 00:29:10,375 నాకు, ఆఫ్రీకా ఖండానికి మధ్య అడ్డుగా నిలిచింది 490 00:29:10,375 --> 00:29:12,294 కేవలం 13 కిలోమీటర్ల నీరే. 491 00:29:14,004 --> 00:29:15,756 {\an8}- వచ్చి కూర్చోండి. - సంతోషం. 492 00:29:15,756 --> 00:29:17,299 ఇది భలే ఉండబోతోంది. 493 00:29:18,258 --> 00:29:21,595 నాకు దగ్గరగా వెళ్లి చూడాలని ఆతృతగా ఉంది. 494 00:29:21,595 --> 00:29:22,971 ఈ రోజు చాలా బాగుంది. 495 00:29:22,971 --> 00:29:24,765 నీటిపై ప్రయాణానికి ఇది మంచి రోజు. 496 00:29:25,265 --> 00:29:28,477 గ్రీక్ పురాణాలలో, హెర్క్యూలీస్ స్తంభాలు, 497 00:29:28,477 --> 00:29:33,774 అంటే ఇప్పుడు మనం మొరాకోలో జీబ్రాల్టార్ రాయి అలాగే హాచో పర్వతం అని పిలిచే పర్వతాలను 498 00:29:33,774 --> 00:29:37,194 వారికి తెలిసిన ప్రపంచ అంచులుగా భావించేవారు. 499 00:29:37,694 --> 00:29:40,697 అదిగో, అక్కడ ఉన్నది ఆఫ్రికా. 500 00:29:41,198 --> 00:29:42,783 అది చాలా దగ్గరగానే ఉంది. 501 00:29:44,743 --> 00:29:48,205 నిజం చెప్పాలంటే, నేను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని నమ్మలేకపోతున్నా. 502 00:29:51,792 --> 00:29:57,256 ఇక నా ప్రయాణానికి ముగింపు పలకడానికి, యూరోప్ ఆఖరిగా ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చింది. 503 00:29:59,299 --> 00:30:00,300 అవి అక్కడ ఉన్నాయి చూడండి. 504 00:30:00,968 --> 00:30:01,969 మనకు నేరుగా. 505 00:30:03,971 --> 00:30:07,391 ఆసక్తిగా వచ్చిన ఒక పైలట్ తిమింగలాల గుంపు. 506 00:30:10,018 --> 00:30:11,687 చూడండి. అక్కడే. అక్కడే. 507 00:30:13,605 --> 00:30:15,482 ఓరి, నాయనో. 508 00:30:15,983 --> 00:30:17,401 వావ్. అది మన దగ్గరకే వచ్చింది. 509 00:30:25,576 --> 00:30:26,577 వినిపించిందా? 510 00:30:27,911 --> 00:30:30,163 బోట్ పక్కన అవి చాలా శబ్దాలు చేస్తున్నాయి. 511 00:30:30,664 --> 00:30:32,916 అవి నన్ను ఎక్కడో చూసి గుర్తుపట్టినట్టు ఉన్నాయి. 512 00:30:33,959 --> 00:30:35,127 అది ఎక్కడో నాకు తెలీదు. 513 00:30:35,794 --> 00:30:38,422 "అమెరికన్ పై" సినిమా యూరోప్ లో చాలా బాగా ఆడింది. 514 00:30:40,215 --> 00:30:44,720 అంటే, అది చాలా పాపులర్ సినిమా. అంటే, ఇవి ఆ సినిమా చూసి ఉంటాయి. 515 00:30:49,433 --> 00:30:50,434 ఇది భలే ఉంది. 516 00:30:53,437 --> 00:30:55,063 ఇది అస్సలు ఒంటారియోలా లేదు. 517 00:30:55,814 --> 00:30:57,107 ఆ మాత్రం చెప్పగలను. 518 00:30:58,817 --> 00:31:00,527 ఈ ట్రిప్ ని మొదలుపెట్టడానికి ముందు, 519 00:31:00,527 --> 00:31:05,282 యూరోప్ అంటే పారిస్, లండన్ ఇంకా రోమ్ లాంటి పెద్ద సిటీలు మాత్రమే అనుకునేవాడిని. 520 00:31:07,326 --> 00:31:08,327 భలే. 521 00:31:08,827 --> 00:31:10,913 అవి గుడ్ బై చెప్పడానికి వచ్చినట్టు ఉన్నాయి. 522 00:31:11,413 --> 00:31:15,167 కానీ జనం ఎక్కువగా వెళ్లని ప్రదేశాలను చూడాలని నాకు నేనే సవాలు విసురుకుని 523 00:31:15,167 --> 00:31:18,545 ఎన్నాళ్లగానో నాలో చచ్చుబడిన నా సాహస భావాన్ని వెలికి తీయాలనుకోవడం వల్ల... 524 00:31:19,922 --> 00:31:20,923 చూడండి. 525 00:31:20,923 --> 00:31:25,177 ...యూరోప్ లో గడిపిన ఈ సమయం మరింత ఎక్కువగా మరవలేని అనుభవంగా మారింది. 526 00:31:26,470 --> 00:31:30,641 ఈ అనుభవం నా ఊహకు అందని విధంగా నా మనసును నింపింది. 527 00:31:31,517 --> 00:31:34,061 సాధారణంగా అయితే నేను ఇక్కడికి వచ్చేవాడిని అనుకోను. 528 00:31:34,561 --> 00:31:37,356 అంటే, ఇలా బయటకు రావడం మంచి విషయం. 529 00:31:37,356 --> 00:31:42,819 ఒకే చోట కూర్చోవడం కంటే బయటకు వెళ్లి తిరగడం మంచి విషయం. 530 00:31:45,906 --> 00:31:49,117 మనం బ్రతుకుతున్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి 531 00:31:49,117 --> 00:31:51,495 చెడ్డ సమయం అంటూ ఏదీ లేదు, సరేనా? 532 00:31:57,334 --> 00:31:58,335 నాలో మార్పు మొదలవుతోంది. 533 00:32:05,175 --> 00:32:06,635 కాబట్టి, ఏమని చెప్పమంటారు? 534 00:32:06,635 --> 00:32:10,347 మరొక ప్రయాణం చేసే ఓపిక నాలో ఉందనుకుంటా. 535 00:32:44,423 --> 00:32:46,383 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్