1
00:00:06,583 --> 00:00:09,843
దురదృష్టం కొద్దీ,
ఇవాళ శాంగ్ గారు మనతో లేరు,
2
00:00:10,093 --> 00:00:12,473
వాడిని దుష్టత్వం బలి తీసుకుంది.
3
00:00:12,673 --> 00:00:16,163
విక్టర్ కుల్జర్ గురించి విన్నావా?
హిల్‌టెక్ ఇండస్ట్రీస్?
4
00:00:16,363 --> 00:00:18,293
తను శాంగ్‌లాంటి
ఒప్పందంపైనే సంతకం చేశాడు,
5
00:00:18,493 --> 00:00:20,713
2 వారాల తర్వాత తల వేరు చేసి చంపారు.
6
00:00:20,913 --> 00:00:23,633
ఇది నీ ఉద్యోగ ఫైల్.
ఇది రికార్డుల గదిలో చూశాను.
7
00:00:23,833 --> 00:00:25,923
- మనకు రికార్డుల గది ఉందా?
- అవును మరి.
8
00:00:26,123 --> 00:00:29,323
నేను సంప్రదించిన
ప్రతీ కంపెనీకి రికార్డుల గది ఉంది.
9
00:00:31,033 --> 00:00:33,803
- అవి ఎక్కడికి పోయాయి?
- అవన్నీ కిందకు పడ్డాయి.
10
00:00:34,003 --> 00:00:37,283
ఏం కనుక్కోవాలని అనుకుంటున్నావు,
నువ్వు పడిపోవడం ఆగినప్పుడు?
11
00:00:38,373 --> 00:00:39,523
అతను చేయమన్నాడు.
12
00:00:39,723 --> 00:00:42,483
రెండేళ్ళలో, నేనిచ్చిన
ఒక్క ఆలోచన శాంగ్ తీసుకోలేదు,
13
00:00:42,683 --> 00:00:44,273
ఇక పాటాఫ్ వచ్చాడు,
14
00:00:44,473 --> 00:00:46,333
- తను మామా శాంగ్‌ని చంపాడు.
- ఆగు, ఏంటి?
15
00:00:49,133 --> 00:00:51,003
రికార్డులు
16
00:00:59,223 --> 00:01:01,263
అవును. క్లిక్. అదీ.
17
00:01:08,193 --> 00:01:10,233
ఈసారి చిలుక వచ్చి పాడు చేసింది.
18
00:01:13,323 --> 00:01:14,283
అతనికి నచ్చింది.
19
00:01:14,613 --> 00:01:18,773
ఫ్లయిట్ నివేదిక ప్రకారం, మామా శాంగ్
ఆ రాత్రే సోల్‌కు తిరిగి వెళ్ళిపోయింది.
20
00:01:18,963 --> 00:01:22,023
ఆమెకు సూట్‌కేసు నిండా
డబ్బులిచ్చి ఇంటికి పంపుంటాడు.
21
00:01:22,223 --> 00:01:24,353
- నేనైతే అదే చేసేవాడిని.
- ఎక్కడ?
22
00:01:24,553 --> 00:01:27,273
నీ ఊహాలోకంలో
నువ్వు యజమానిగా ఉండే కంపెనీలోనా?
23
00:01:27,473 --> 00:01:30,253
హేయ్, నాకు మర్యాద ఇవ్వు.
ఇప్పుడు రూపకర్తను.
24
00:01:31,093 --> 00:01:32,993
చూడు. ఎంత ఆడినా తనివి తీరడం లేదు.
25
00:01:33,193 --> 00:01:36,243
నీ అతిపెద్ద అభిమాని
తొలి వారంలో 23 మందిని తొలగించాడు.
26
00:01:36,443 --> 00:01:39,043
మరో పదిహేను మంది
నిరసన తెలిపి రాజీనామా చేశారు.
27
00:01:39,233 --> 00:01:42,413
అయ్యో. మనం నిజానికి
ఎవరిని పోగొట్టుకున్నాం?
28
00:01:42,613 --> 00:01:45,503
అల్లం పీట్, సన్నని పెదవులు,
వాళ్లు బాగా గుర్తొస్తారు,
29
00:01:45,703 --> 00:01:48,233
కానీ మిగతా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు.
30
00:01:49,653 --> 00:01:52,383
- సోమవారం కలుద్దాం.
- మెరుగైన ఉద్యోగం దొరికితే రాను.
31
00:01:52,583 --> 00:01:56,903
ఈరోజు, నేలను తుడిచావు,
తర్వాతి వారం, ఫ్రైస్ తింటూ కూర్చుంటావు.
32
00:02:02,743 --> 00:02:04,543
- శుభరాత్రి, పాటాఫ్ గారు.
- క్రెగ్.
33
00:02:07,503 --> 00:02:08,563
వెళ్ళిపోతున్నావా?
34
00:02:08,763 --> 00:02:11,483
అందరూ వారాంతం కోసం వెళ్ళిపోతున్నారు.
35
00:02:11,683 --> 00:02:14,823
- ప్రణాళికలు ఉన్నాయా?
- ప్రత్యేకంగా ఏం లేవు. ప్యాటికి పనుంది.
36
00:02:15,023 --> 00:02:18,123
వెళ్ళి బీరు తీసుకుని
గంటా, రెండు గంటలు కాలం వృధా చేస్తా.
37
00:02:18,323 --> 00:02:19,553
బీరా?
38
00:02:28,353 --> 00:02:29,773
మీకు రావాలని ఉందా?
39
00:02:30,563 --> 00:02:32,563
తయారు కావడానికి
నాకు 10 నిమిషాలు కావాలి.
40
00:02:39,403 --> 00:02:41,113
మీ సెషన్ ముగిసింది
41
00:02:58,713 --> 00:03:01,303
{\an8}ద కన్సల్టెంట్ - ఎస్1
42
00:03:29,243 --> 00:03:33,253
- వెళ్ళిపోయావని అనుకున్నానే.
- ఛింపర్స్‌కు నేనూ వస్తా అన్నాడు.
43
00:03:33,583 --> 00:03:37,903
యజమానితో శుక్రవారం రాత్రి పానీయాలా?
ఎందులోకి దిగుతున్నావో తెలుసా?
44
00:03:38,103 --> 00:03:40,593
నా ఆటను ఆమోదిస్తాడని
కాస్త మంచిగా ఉంటున్నా.
45
00:03:43,263 --> 00:03:45,413
- నువ్వూ మాతో వస్తావా?
- రాను.
46
00:03:45,613 --> 00:03:47,543
- నాకో డేట్ ఉంది.
- లేదు, నీకు లేదు.
47
00:03:47,743 --> 00:03:50,003
ఉంది. పని తర్వాత
నన్ను తీసుకెళతానన్నాడు.
48
00:03:50,203 --> 00:03:52,183
ఏంటి? ఎవరతను?
అతను ఏం చేస్తున్నాడు?
49
00:03:53,143 --> 00:03:54,403
నువ్వు ఎవరు, మా నాన్నవా?
50
00:03:55,153 --> 00:03:56,063
తయారయ్యాను.
51
00:03:58,113 --> 00:03:59,023
క్రెగ్.
52
00:04:01,783 --> 00:04:03,243
ఒక పానీయమేగా.
53
00:04:03,993 --> 00:04:04,993
నీ డేట్ బాగా జరగాలి.
54
00:04:12,913 --> 00:04:14,463
- చీర్స్.
- చీర్స్.
55
00:04:32,023 --> 00:04:35,313
ఇక, గేమింగ్ పరిశ్రమను
ఎలా ఆనందిస్తున్నారు, పాటాఫ్ గారు?
56
00:04:37,603 --> 00:04:41,573
వాస్తవికంగా చూస్తే, ఇక్కడున్న సభ్యులలో
మనం ఎంత మందితో దెబ్బలాడవచ్చు?
57
00:04:42,193 --> 00:04:45,403
- ఏమన్నారు?
- ఒక గొడవలో.
58
00:04:46,663 --> 00:04:49,203
ఐదు మందినా? ఆరు మందినా?
59
00:04:50,663 --> 00:04:53,153
తెలియదు.
ఒకే ఒక బార్ గొడవలో పాల్గొన్నా,
60
00:04:53,353 --> 00:04:54,753
ఫలితం నాకు అనుకూలించలేదు.
61
00:04:55,463 --> 00:04:57,883
ఒక్కడితోనా లేదా గుంపుతోనా?
62
00:04:59,793 --> 00:05:03,663
కేవలం రెండు దెబ్బలు కొట్టాడంతే,
నన్ను కొట్టాడు, నేను నేలపై పడ్డాను.
63
00:05:03,863 --> 00:05:07,333
- గాయపరిచాడా?
- నిజానికి, చాలా దారుణంగా తగిలింది.
64
00:05:07,533 --> 00:05:10,763
నా దవడ మొత్తం...
దాన్ని మళ్ళీ సరిచేయించుకున్నాను.
65
00:05:13,853 --> 00:05:16,853
గొడవకు కారణమేంటో
నేను తెలుసుకోవచ్చా?
66
00:05:18,483 --> 00:05:21,383
అప్పుడు కుర్రాడిగా ఉన్నా,
ఎవరూ ఏమీ చేయలేరనుకున్నా,
67
00:05:21,583 --> 00:05:25,613
కానీ ఆ పెద్ద మనిషి దృష్టిపెట్టి
అది నిజం కాదని నాకు గుర్తుచేసే దాకా.
68
00:05:31,953 --> 00:05:37,863
నేను వారిలో నలుగురిని కొట్టవచ్చు,
ఇక విస్మయాన్ని కలిగించి,
69
00:05:38,063 --> 00:05:40,213
నువ్వు మిగతా ముగ్గురిని లొంగదీసుకోవచ్చు.
70
00:05:41,463 --> 00:05:43,363
కానీ ఇవి కేవలం మగవారి మాటలే కదా?
71
00:05:43,563 --> 00:05:46,513
మనం నిజంగానే ఒక బార్ గొడవలోకి
దిగబోవటం లేదు కదా?
72
00:05:53,763 --> 00:05:55,683
- క్షమించు, క్రెగ్.
- ఏమనుకున్నానంటే...
73
00:05:56,183 --> 00:05:57,463
మానసిక చిక్కుముడులు.
74
00:05:57,663 --> 00:05:59,983
ఎప్పుడూ తలలో
కల్పిత పరిస్థితులు ఊహిస్తుంటాను.
75
00:06:00,853 --> 00:06:02,973
మీరింకా ఎక్కువ బీర్
తాగాలేమో, మీ తలలో
76
00:06:03,173 --> 00:06:05,893
గిర్రున తిరుగుతున్న చక్రాన్ని
నెమ్మదించడానికి, అవునా?
77
00:06:06,083 --> 00:06:07,743
అవును. మనం బీర్లను ఆనందిద్దాం.
78
00:06:13,373 --> 00:06:15,603
ఒక సంబంధం గురించి
ఇంతకు ముందుకు చెప్పావు.
79
00:06:15,803 --> 00:06:18,693
అవును, ప్యాటి, నాకు కాబోయే భార్య.
80
00:06:18,893 --> 00:06:21,233
బంధాన్ని సెప్టెంబర్‌లో
అధికారికం చేయబోతున్నాం.
81
00:06:21,433 --> 00:06:24,863
పెళ్ళి జరగనుంది.
100, 150 అతిథులను పిలవబోతున్నాం.
82
00:06:25,063 --> 00:06:28,223
- మీ సంగతేంటి? మీకొక కుటుంబం ఉందా లేక...
- పెళ్ళి చర్చిలోనా?
83
00:06:29,343 --> 00:06:33,623
అవును, అదొక సమస్య, ఎందుకంటే
ప్యాటి కాథలిక్ విశ్వాసి, నేను కాదు.
84
00:06:33,823 --> 00:06:36,333
నేను మొబైల్ గేమ్‌ల విశ్వాసిని, తెలుసా?
85
00:06:36,533 --> 00:06:39,543
కానీ ఆమెకు ఇష్టమైన వేదికలలో
నేను వరుడిగా ఉండాలంటే,
86
00:06:39,743 --> 00:06:43,763
నేను కాథలిక్ మతానికి మారాలి,
అదొక పెద్ద ప్రక్రియ.
87
00:06:43,963 --> 00:06:47,153
కాబట్టి, నువ్వు...
కాథలిక్ మతం కోసం ఇలా చేస్తున్నావా?
88
00:06:47,783 --> 00:06:51,993
ప్యాటి కోసమా? అవును. కొద్ది నెలల
సుత్తిని భరించాలి, ఆపై ఫర్వాలేదు.
89
00:06:53,163 --> 00:06:54,583
ఇది ఆసక్తికరంగా ఉంది.
90
00:07:03,503 --> 00:07:05,753
ఒక మాట చెప్పనా? నేను...
91
00:07:06,803 --> 00:07:10,123
- నేను వెళ్ళాలి.
- అప్పుడే అయిపోయిందా? మన బీర్?
92
00:07:10,323 --> 00:07:13,703
ప్యాటి... తను...
తాళాలు ఆమె దగ్గర ఉన్నాయో లేదో తెలియదు,
93
00:07:13,903 --> 00:07:17,043
పైగా ఈ ప్రాంతంలో ఆమెను
ఒంటరిగా వదలటం గురించి దిగులుగా ఉంది.
94
00:07:17,243 --> 00:07:19,833
నువ్వు కాథలిక్ విశ్వాసిగా
మారాలని చెప్పే మహిళే
95
00:07:20,033 --> 00:07:22,393
నువ్వు కారు తలుపును కూడా
తెరవాలని ఆశిస్తోందా?
96
00:07:24,103 --> 00:07:26,483
ఒక బార్ గొడవలో
చిక్కుకోవడం కన్నా అదే నయం.
97
00:07:28,783 --> 00:07:31,703
మనం ఇలా సరదాగా
మాట్లాడతామని తెలుసు, క్రెగ్.
98
00:07:32,743 --> 00:07:35,813
సరే, మనం వీటిని ముగించి
తరువాతి చోటుకు వెళదాం.
99
00:07:36,013 --> 00:07:38,643
తరువాతి చోటా?
నాకు ఈ వారంతం ఎంతో పని ఉంది,
100
00:07:38,843 --> 00:07:40,693
నేను ఇంటికెళ్తే మంచిదనుకుంటాను.
101
00:07:40,893 --> 00:07:43,823
ఉదారతతో ఒక పానీయం తాగడానికి
ఇక్కడికి తీసుకొచ్చావు,
102
00:07:44,023 --> 00:07:46,673
బదులుగా నిన్నూ
మరొక చోటుకు తీసుకెళ్ళనివ్వు.
103
00:08:01,023 --> 00:08:03,923
డేట్ కుర్రోడ్
ఆలస్యం అవుతోంది. 1 గంట సమయం ఇస్తావా?
104
00:08:04,123 --> 00:08:04,943
తప్పకుండా
105
00:08:29,003 --> 00:08:32,883
రికార్డులు
106
00:08:47,233 --> 00:08:48,813
మనం దూరమేమీ వెళ్ళటం లేదు.
107
00:09:10,503 --> 00:09:11,423
పది నొక్కు.
108
00:09:15,013 --> 00:09:16,283
పై అంతస్తుకా?
109
00:09:16,483 --> 00:09:19,933
నీకు ఎత్తులంటే భయం లేదు కదా, క్రెగ్?
110
00:09:21,393 --> 00:09:22,513
లేదు, బాస్.
111
00:09:31,523 --> 00:09:32,653
స్వాగతం, జెంటిల్మెన్.
112
00:09:35,323 --> 00:09:36,573
ఇతను మీ అతిథా?
113
00:09:37,653 --> 00:09:38,663
అవును.
114
00:09:42,913 --> 00:09:44,493
చెడ్డీ మినహా అన్నీ తీసేయ్.
115
00:09:45,753 --> 00:09:46,813
ఏంటి?
116
00:09:47,013 --> 00:09:50,383
ఇది నా తప్పు, నేను వివరించి ఉండాలి.
ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంది.
117
00:09:56,763 --> 00:10:00,393
నియమాలు నీకు వర్తించవని
నువ్వు అనుకుంటే తప్ప, క్రెగ్?
118
00:10:25,333 --> 00:10:30,293
నేను ఒకరిని పలకరించాలి.
మనకు బార్‌లో పానీయాలు ఆర్డర్ చేయి.
119
00:10:48,353 --> 00:10:50,043
హేయ్, ఏ పానీయాలు ఉన్నాయి?
120
00:10:50,243 --> 00:10:51,143
ఒక రంగు ఎంచుకో.
121
00:10:54,483 --> 00:10:55,823
నాకు రెండు నీలాలు ఇవ్వు.
122
00:11:15,673 --> 00:11:16,453
ధన్యవాదాలు.
123
00:11:16,643 --> 00:11:20,173
మేము ఖాతాను తెరవాలేమో... సరే.
124
00:11:45,783 --> 00:11:47,743
నువ్వు ఇక్కడి వాడివి కాదు, కదా?
125
00:11:50,373 --> 00:11:53,613
అంత స్పష్టంగా తెలుస్తోందా?
నేను నా బాస్‌తో వచ్చాను.
126
00:11:53,813 --> 00:11:55,863
అతను ఇక్కడ సభ్యుడనుకుంటాను.
127
00:11:56,063 --> 00:11:57,173
నువ్వు ఏం చేశావు?
128
00:11:58,883 --> 00:11:59,883
నేను ఏం చేస్తానా?
129
00:12:00,343 --> 00:12:01,823
నేను కోడ్ రాస్తాను...
130
00:12:02,023 --> 00:12:05,433
కాదు, నేను వీడియో గేమ్స్
సృష్టిస్తాను, నిర్మిస్తాను.
131
00:12:07,303 --> 00:12:08,893
మిలాని.
132
00:12:10,643 --> 00:12:12,503
ఇతను నా ప్రియ మిత్రుడు, క్రెగ్.
133
00:12:12,703 --> 00:12:14,813
హేయ్, మిలాని. నా పేరు క్రెగ్.
134
00:12:17,613 --> 00:12:22,193
ఇతనికి నిశ్చితార్థం జరిగి పెళ్ళి కానుంది.
ఆమె కోసం విశ్వాసాన్ని వదులుకుంటున్నాడు.
135
00:12:23,073 --> 00:12:26,143
న్యాయంగా చెప్పాలంటే,
నాకు అసలు ఎలాంటి మతవిశ్వాసం లేదు.
136
00:12:26,343 --> 00:12:28,023
ఆమెను ఎక్కడ కలిశావు, క్రెగ్?
137
00:12:28,223 --> 00:12:29,283
పని చేసే చోటా?
138
00:12:29,623 --> 00:12:32,293
చాలా సంబంధాలు
పని చేసే చోటే మొదలవుతాయి, కదా?
139
00:12:33,413 --> 00:12:35,073
అదంత గొప్ప కథేమీ కాదు.
140
00:12:35,273 --> 00:12:38,863
నాకు శస్త్రచికిత్సలో
ఒకటి తొలగించినప్పుడు, తను నర్సుగా ఉండింది.
141
00:12:39,063 --> 00:12:40,713
ఆమె దేన్ని తొలగించింది?
142
00:12:41,593 --> 00:12:43,123
ఒక పెద్ద కొవ్వున్న పుండును.
143
00:12:43,313 --> 00:12:46,583
అది నా భుజం వెనుక ఉండింది.
గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉంటుంది.
144
00:12:46,783 --> 00:12:47,833
ఎంత ప్రణయావేశంగా ఉంది.
145
00:12:48,033 --> 00:12:51,723
మనం ప్రేమించే వ్యక్తి భాగాన్ని
ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళవచ్చు.
146
00:12:54,733 --> 00:12:57,063
అది తన వద్దే
ఉంచుకుందా అని తెలియదు, కానీ...
147
00:13:01,693 --> 00:13:04,743
నేను బాత్రూమ్‌కు వెళ్ళాలి.
మీరిద్దరూ మాట్లాడుకోండి.
148
00:13:07,823 --> 00:13:09,413
వచ్చేటప్పుడు మూడు తీసుకురా.
149
00:13:11,493 --> 00:13:12,493
తప్పకుండా.
150
00:13:26,843 --> 00:13:28,123
హేయ్, ఎలా జరిగింది?
151
00:13:28,323 --> 00:13:31,163
మాస్కోలో కృత్రిమ అంగాల
తయారీ కంపెనీ పేరేంటి?
152
00:13:31,363 --> 00:13:33,673
హిల్‌టెక్. ఆ సీఈవోతో
పాటాఫ్‌కు కాంట్రాక్టుంది.
153
00:13:33,873 --> 00:13:35,673
శాంగ్ తన ఒప్పందంపై
సంతకం చేసే మందు.
154
00:13:35,873 --> 00:13:38,593
వారి వస్తువులను అతను
ఇక్కడికి రవాణా చేసి ఉండవచ్చు.
155
00:13:38,793 --> 00:13:40,363
ఇక్కడ ఒకామె ఉంది...
156
00:13:40,863 --> 00:13:43,883
మెలని లేక మాలరీ?
ఛత్, ఆమె పేరు గుర్తుకు రావటం లేదు.
157
00:13:44,083 --> 00:13:45,803
- నేను అడుగుతాను...
- ఆగు, నెమ్మదించు.
158
00:13:46,003 --> 00:13:48,203
- ఎక్కడున్నావు?
- నాకు తెలియదు.
159
00:13:50,623 --> 00:13:53,483
ఈ చోటు చాలా నీలంగా, అందంగా ఉంది.
160
00:13:53,683 --> 00:13:55,903
ఇక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో అందంగా ఉన్నారు.
161
00:13:56,103 --> 00:13:59,073
- అంతా అందాల తారల్లా ఉన్నారు.
- నువ్వు తాగుతున్నావా?
162
00:13:59,273 --> 00:14:03,863
ఒక బీర్, కాసింత నీలం తాగా, సరేనా?
కావాలంటే కేసు పెట్టుకో. ఆమెకు అతను తెలుసు.
163
00:14:04,063 --> 00:14:06,913
ఈ మెలొడీ అనే ఆమె.
ఛత్, ఆమె పేరు ఇది కూడా కాదు.
164
00:14:07,113 --> 00:14:08,283
ఆమె ఎలా ఉంటుంది?
165
00:14:08,483 --> 00:14:11,753
దూరభాషి బొమ్మలా ఉందని చెప్పాలనుకున్నా,
కానీ అలా చెప్పకూడదేమో.
166
00:14:11,943 --> 00:14:14,973
ఆమెను ముగ్గులోకి దింపి
ఏం కనుక్కోగలనో చూస్తాను.
167
00:14:16,983 --> 00:14:20,483
- సరే, నువ్వంటే నాకు ఇష్టం.
- క్రెగ్. జాగ్రత్తగా ఉండు.
168
00:14:24,443 --> 00:14:25,443
హేయ్.
169
00:14:57,853 --> 00:14:59,563
మీ స్నేహితురాలు వెళ్ళిపోయిందా?
170
00:15:00,443 --> 00:15:01,883
మనం ఈ విషయాన్ని ఆమోదించాలేమో
171
00:15:02,083 --> 00:15:05,273
ఇక్కడ మనం అత్యంత ఆకర్షణీయమైన
మగవాళ్ళు కాదని, క్రెగ్.
172
00:15:22,503 --> 00:15:27,463
అంటే కన్సల్టెన్సీ పనిలో డబ్బు బాగా వస్తాయి
ఇలాంటి చోట్లకు తీసుకు వస్తోంటే, ఆ?
173
00:15:28,253 --> 00:15:32,703
చాలా సరళమైన సేవను అందిస్తాను, నా క్లయింట్
అవసరాల మెరుగుదల కోసం పని చేస్తాను.
174
00:15:32,903 --> 00:15:34,953
అందుకు, నాకు ఉదారంగా పరిహారం చెల్లిస్తారు.
175
00:15:35,153 --> 00:15:38,973
శాంగ్ అవసరం ఏంటి? తనకు డబ్బు ఎక్కువ
అవసరమైందా లేదా ఎక్కువ లైక్‌లా?
176
00:15:48,233 --> 00:15:51,573
క్రెగ్, దురదృష్టవశాత్తూ,
నిన్ను కాసేపు వదిలి వెళ్ళాలి.
177
00:15:52,453 --> 00:15:55,573
సాయపడతానని ఓ మిత్రుడికి మాటిచ్చాను.
ఎక్కువ సమయం పట్టదు.
178
00:15:57,333 --> 00:16:00,123
అయినా, నాకు మద్దతు ఉంటే...
179
00:16:04,423 --> 00:16:05,833
నన్ను రమ్మంటున్నారా?
180
00:16:06,963 --> 00:16:09,633
నీతో కలిసి ఉండటాన్ని
ఎంతో ఆనందిస్తున్నా, క్రెగ్.
181
00:16:13,883 --> 00:16:14,883
దాన్ని ఎందుకు ఆపాలి?
182
00:16:37,623 --> 00:16:40,103
ఆగండి, ఆగండి. నా బట్టలు.
183
00:16:40,303 --> 00:16:41,493
మనం తిరిగి వచ్చేస్తాం.
184
00:16:42,833 --> 00:16:45,173
ముందర కూర్చో.
డ్రైవర్‌ను ఇంటికి పంపాను.
185
00:16:55,013 --> 00:16:57,163
మనం చేస్తున్న ఈ సహాయం ఏమిటి?
186
00:16:57,363 --> 00:16:58,263
సరుకును అందజేయడం.
187
00:17:04,063 --> 00:17:07,153
ఏంటి... ఏంటి ఈ ఘోరం?
188
00:17:07,403 --> 00:17:09,113
ఏం జరుగుతోంది అసలు?
189
00:17:09,363 --> 00:17:10,523
ఎవరది?
190
00:17:11,523 --> 00:17:12,653
తాకవద్దు!
191
00:17:15,953 --> 00:17:18,183
- కారు ఆపండి.
- అలా ఆపలేను, క్రెగ్.
192
00:17:18,383 --> 00:17:19,683
మనం అతనికి సాయం చేయాలి.
193
00:17:19,883 --> 00:17:21,583
అది తగిన పని కాదని అనుకుంటాను.
194
00:17:27,043 --> 00:17:28,693
నాకు ఏం జరుగుతోంది?
195
00:17:28,893 --> 00:17:31,573
నువ్వు భీతి తాకిడికి
లోనవుతున్నావు, క్రెగ్.
196
00:17:31,773 --> 00:17:33,913
దయచేసి ఈ చెత్త కారును ఆపండి!
197
00:17:34,113 --> 00:17:36,633
- కారు ఆపండి.
- అది నీకు సాయపడదు.
198
00:17:37,593 --> 00:17:41,763
నువ్వు దీన్ని నియంత్రించుకోవాలి,
అది నిన్ను నియంత్రించడానికి బదులు.
199
00:17:43,723 --> 00:17:46,233
ఈ చెత్త కారును ఆపి చావు! కారు ఆపు!
200
00:18:27,523 --> 00:18:28,693
అదిగో.
201
00:18:30,853 --> 00:18:31,813
అంతా బాగుందా?
202
00:19:27,043 --> 00:19:28,493
కాస్త సంగీతం పెట్టనా?
203
00:19:28,793 --> 00:19:31,833
నేను ఇంకా అడగలేదు,
నీకు ఎలాంటి సంగీతమంటే ఇష్టం?
204
00:19:33,583 --> 00:19:35,133
వెనుక నువ్వు బాగానే ఉన్నావా?
205
00:19:35,843 --> 00:19:39,383
నాకు తెలిసి, వారి నోటిని
టేపుతో మూసేసి ఉంటారు...
206
00:19:40,263 --> 00:19:43,163
ఏంటది? దుప్పటా
లేదా బల్లపై పరిచే బట్టా?
207
00:19:43,363 --> 00:19:45,913
తనకు సరిగ్గా
ఊపిరి ఆడుతోందో లేదో మనం చూడాలి.
208
00:19:46,113 --> 00:19:47,663
అతను ఊపిరాడక
అల్లాడుతూ ఉండవచ్చు.
209
00:19:47,863 --> 00:19:51,733
కానీ దుప్పటిని తీసేస్తే, ఎక్కడికి
తీసుకెళుతున్నామో అతనికి కనిపిస్తుంది.
210
00:19:52,233 --> 00:19:53,983
అతన్ని ఎక్కడికి తీసుకెళుతున్నాం?
211
00:19:56,483 --> 00:19:57,483
ఓ పడవ దగ్గరికా?
212
00:19:57,733 --> 00:20:01,303
సర్, ఇక్కడ జరుగుతున్న
దేనితోనూ నాకు సౌకర్యంగా లేదు.
213
00:20:01,503 --> 00:20:04,723
ఇందులో నేను జోక్యం చేసుకోవాలని
మీరు ఎందుకు అనుకున్నారో ఏమో.
214
00:20:04,923 --> 00:20:08,023
న్యాయంగా చెప్పాలంటే, క్రెగ్,
తప్పు మొత్తం నాదే కాదు,
215
00:20:08,223 --> 00:20:10,753
కానీ మన ఇద్దరికీ సమాన బాధ్యత ఉందేమో.
216
00:20:12,003 --> 00:20:13,543
ఏంటి? ఏమంటున్నారు?
217
00:20:13,963 --> 00:20:15,573
నాకు సాయం చేయమని అడగగానే,
218
00:20:15,773 --> 00:20:18,903
నీకు భీతి తాకిడిల చరిత్ర ఉందని
నువ్వు ప్రకటించలేదు.
219
00:20:19,103 --> 00:20:21,513
నాకు భీతి తాకిడిల చరిత్ర లేదు.
220
00:20:27,103 --> 00:20:28,263
అతనెలా ఉండేవాడు?
221
00:20:29,933 --> 00:20:30,853
ఎవరు?
222
00:20:31,933 --> 00:20:34,893
అప్పటికి అభిమానంతోనే
ఉండేవారా? శాంగ్ గారు?
223
00:20:38,523 --> 00:20:41,973
ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది,
కానీ నీకు మాటిస్తున్నా.
224
00:20:42,173 --> 00:20:44,353
నువ్వు చెప్పే విషయాన్ని ఎవరితోనూ పంచుకోను.
225
00:20:44,553 --> 00:20:45,953
మిత్రుల మధ్య రహస్యంలా.
226
00:20:47,203 --> 00:20:49,953
అతను గది నుండి బయటకు రావడాన్ని
అనుభూతి చెందావా?
227
00:20:55,253 --> 00:20:58,543
పాటాఫ్ గారు, సర్,
మీరు దయచేసి కారు ఆపుతారా? ప్లీజ్.
228
00:20:59,793 --> 00:21:02,463
నేను అలా చేయలేను.
మనం వంతెనపై ఉన్నాం.
229
00:21:10,263 --> 00:21:12,673
నేను చెప్పేబోయే విషయాన్ని
చెప్పబోయే ముందు,
230
00:21:12,873 --> 00:21:15,563
మళ్ళీ భీతి తాకిడికి
గురి కావని నాకు మాటివ్వాలి.
231
00:21:18,353 --> 00:21:19,403
ప్రయత్నిస్తాను.
232
00:21:20,773 --> 00:21:22,983
వెనుక ఉన్న మన తోటి ప్రయాణీకుడే,
233
00:21:23,323 --> 00:21:26,703
రాజసం ఉట్టిపడే
మన నాయకుడి మరణానికి బాధ్యుడు.
234
00:21:28,203 --> 00:21:30,743
ఆ పిల్లాడా?
ఆ పిల్లాడిని అపహరించారా?
235
00:21:50,223 --> 00:21:55,733
హేమన్ ఎలేన్
236
00:22:04,113 --> 00:22:07,703
సరే. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో,
అది చేయకండి.
237
00:22:08,613 --> 00:22:11,073
ఆ తొడుగుల పెట్టెలో
నీకొక కత్తి కనిపిస్తుంది.
238
00:22:12,783 --> 00:22:15,293
- బాగా చూడు.
- నాకు అందులోకి చూడాలని లేదు.
239
00:22:15,703 --> 00:22:19,863
మనం శాంగ్ ప్రయోజనాల మెరుగుదలకి
పని చేస్తున్నామని నేను గుర్తు చేయనా.
240
00:22:20,063 --> 00:22:21,073
శాంగ్ మరణించాడు.
241
00:22:21,273 --> 00:22:23,863
అయితే ప్రతీకారం
అతన్ని ప్రయోజనాన్ని కాపాడేదే.
242
00:22:24,063 --> 00:22:26,033
- కాదా?
- ఏం చేస్తున్నాడో అతనికి తెలియలేదు.
243
00:22:26,233 --> 00:22:28,413
అందుకు మనం
ఒక పిల్లాడిని బాధ్యుడిని చేయలేం.
244
00:22:28,613 --> 00:22:31,553
అయితే బాధ్యత ఎవరిది?
మనం ఎవరిని నిందించాలి, క్రెగ్?
245
00:22:31,893 --> 00:22:35,213
తన తల్లిదండ్రులనో, బడులనో,
సతాయించేవారినో, సమాజ ఒత్తిడినో,
246
00:22:35,413 --> 00:22:37,603
పొడి చక్కెరనో, విమాన పొగలనో లేదా...
247
00:22:41,273 --> 00:22:42,193
మనల్నో నిందించాలి.
248
00:22:43,903 --> 00:22:47,073
శాంగ్ గారి మృతికి మనం బాధ్యులమా?
249
00:22:47,743 --> 00:22:50,013
అంటే, మనం మీట నొక్కలేదు,
250
00:22:50,213 --> 00:22:53,743
కానీ, ఒక రకంగా చూస్తే
మనం తుపాకీని అతని చేతిలో పెట్టాం.
251
00:22:58,083 --> 00:23:00,293
మనం ఈ వంతెనపై
ఎంత సేపటి నుండి ఉన్నాం?
252
00:23:05,923 --> 00:23:08,343
నువ్వు వేగంగా
ఊపిరి తీసుకుంటున్నావు, క్రెగ్.
253
00:23:08,633 --> 00:23:09,763
అవునా?
254
00:23:11,513 --> 00:23:14,013
నువ్వు ఈ భయాలను ఎదుర్కోవాలి.
255
00:23:15,223 --> 00:23:16,833
నేను ఈ వంతెన దాటాలి.
256
00:23:17,033 --> 00:23:20,003
గొడవలో ఆ రౌడీ మనిషిని
ఎదిరించిన క్రెగ్ ఎక్కడా?
257
00:23:20,203 --> 00:23:23,313
- వాడు నా దవడ పగలగొట్టాడు.
- కానీ వాడిని ఎదుర్కొన్నావు కదా.
258
00:23:24,153 --> 00:23:27,443
దీన్ని అలాగే ఎదుర్కో.
ఇప్పుడు, నాతో పాటు ఊపిరి తీసుకో.
259
00:23:28,903 --> 00:23:29,823
లోపలికి.
260
00:23:32,453 --> 00:23:34,493
బయటకు.
261
00:23:38,163 --> 00:23:39,163
లోపలికి.
262
00:23:42,123 --> 00:23:45,673
ఇంధనం కోసం ఆపమని
మనకు ఆదేశం వచ్చింది.
263
00:25:01,663 --> 00:25:03,703
నేను ఎలేన్. సందేశం పంపండి.
264
00:25:25,853 --> 00:25:27,353
ఇది నేను కోరుకోలేదు.
265
00:25:28,653 --> 00:25:31,023
ఏం జరిగినా, ఈ విషయం నీకు తెలియాలి.
266
00:26:07,353 --> 00:26:08,353
ఏం చెత్త ఇది?
267
00:26:12,273 --> 00:26:13,573
మనం ఎక్కడున్నాం?
268
00:26:14,653 --> 00:26:15,693
మనం ఎక్కడున్నాం?
269
00:26:16,823 --> 00:26:19,243
మనం లాంగ్ బీచ్‌లో ఉన్నాం.
270
00:26:23,993 --> 00:26:25,243
ఫ్రాంక్ ఫ్లోరెజ్.
271
00:26:25,583 --> 00:26:29,123
ఇతని గురించి తెలుసుకోవాలంటే,
ఫ్రాంక్ ఫ్లోరెజ్‌ను కనుక్కో.
272
00:26:46,643 --> 00:26:50,983
ఎన్నో ఏళ్ళుగా నా స్నేహితురాలు మిలాని
డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతోంది.
273
00:26:52,023 --> 00:26:54,803
ఆమెను మాస్కోలోని
పునరావాస కేంద్రంలో వదిలి వచ్చాను,
274
00:26:55,003 --> 00:26:56,863
కానీ ఎలాగో ఆమె ఇక్కడికి చేరుకుంది.
275
00:26:58,693 --> 00:27:00,493
ఆమెను వెనక్కు పంపి, చికిత్స...
276
00:27:01,033 --> 00:27:02,493
పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం.
277
00:27:03,573 --> 00:27:05,943
ఆమె నిరోధిస్తుందని నాకు తెలుసు.
278
00:27:06,143 --> 00:27:07,333
వ్యసనపరులు నిరోధిస్తారు.
279
00:27:08,753 --> 00:27:11,323
కానీ ఇప్పుడు,
నీ చర్యల ప్రత్యక్ష ఫలితంగా,
280
00:27:11,523 --> 00:27:15,673
మిలాని డ్రగ్స్ కోసం వెతుకుతూ,
లాంగ్ బీచ్ వీధుల్లో ఒంటరిగా ఉంది.
281
00:27:17,173 --> 00:27:18,263
నాతో అబద్ధమాడారు.
282
00:27:20,093 --> 00:27:23,953
శాంగ్ గారి పట్ల నీకున్న విధేయతను
నేను పరీక్షించాల్సి వచ్చింది.
283
00:27:24,153 --> 00:27:27,263
మనం నిజంగానే స్నేహితులుగా
ఉండగలమా అని తెలుసుకోవడానికి.
284
00:27:29,523 --> 00:27:30,603
ఇంకా?
285
00:27:37,073 --> 00:27:41,703
ఒక సంక్షోభ సమయంలో
ఇక ముందు నేను నీపై ఆధారపడను.
286
00:27:59,923 --> 00:28:00,923
భలే కనిపిస్తున్నావు.
287
00:28:03,013 --> 00:28:05,013
ఇందులో నిన్ను ఇంతకు ముందు చూడలేదు.
288
00:28:07,143 --> 00:28:08,433
అద్దెకు తీసుకున్నా.
289
00:28:10,643 --> 00:28:11,583
రాత్రి బాగుందా?
290
00:28:11,783 --> 00:28:15,233
అవును, కొన్ని బీర్లు తాగాను.
నిన్ను లేపాలని అనుకోలేదు.
291
00:28:15,813 --> 00:28:17,383
నువ్వు దాన్ని సోమవారం వేసుకో.
292
00:28:17,583 --> 00:28:21,493
- సోమవారమా?
- చర్చి. ఫాదర్ స్టోలెన్‌ను కలుస్తున్నాం.
293
00:28:23,823 --> 00:28:26,573
నిన్ను మంచి కాథలిక్ అబ్బాయిలా
తయారు చేస్తాం.
294
00:29:29,973 --> 00:29:33,433
క్రెగ్ హార్న్
295
00:29:57,753 --> 00:29:59,833
నేను ఎలేన్.
సందేశం పంపండి.
296
00:30:01,293 --> 00:30:04,213
మనం ఒక సమాజద్వేషికి పని చేస్తున్నాం.
నాకు కాల్ చేయి.
297
00:31:54,243 --> 00:31:56,183
సబ్‌టైటిల్ అనువాద కర్త
Pradeep Kumar Maheshwarla
298
00:31:56,383 --> 00:31:58,333
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల