1 00:01:37,055 --> 00:01:38,265 ఎవరు? 2 00:01:38,265 --> 00:01:41,727 మీరు ఈ డబ్బును భవనం బయట పారేసుకున్నట్టున్నారు. 3 00:01:45,898 --> 00:01:48,066 నేను పొరబడి ఉంటే, క్షమించండి. 4 00:01:48,066 --> 00:01:49,693 లేదు, అదేం లేదు. 5 00:01:49,693 --> 00:01:50,903 సరే. 6 00:02:17,554 --> 00:02:20,849 మిస్టర్. హా, అది నాదే. 7 00:02:20,849 --> 00:02:22,267 మీకు ఇంగ్లీష్ వచ్చా? 8 00:02:22,267 --> 00:02:23,852 పనిలో భాగంగా నాకు తప్పదు. 9 00:02:25,020 --> 00:02:27,064 చాలా డబ్బులు పడి ఉన్నాయి. మీరు పోగొట్టుకుంటే నష్టపోతారని తెచ్చా. 10 00:02:28,565 --> 00:02:29,650 సరే, థ్యాంక్యూ. 11 00:02:34,696 --> 00:02:37,449 మీకు బహుమానం ఏమైనా ఇవ్వాలంటారా? 12 00:02:37,950 --> 00:02:39,368 లేదు, ఆ అవసరం లేదు. 13 00:02:40,494 --> 00:02:41,912 కానీ నాకొక సాయం చేయగలరా? 14 00:02:43,497 --> 00:02:45,165 మీరు ఈ పిల్లాడిని ఎక్కడైనా చూశారా? 15 00:02:45,749 --> 00:02:48,210 ఆరు రోజుల నుండి కనిపించట్లేదు. ఇతని పేరు యూమా. 16 00:02:49,002 --> 00:02:50,420 ఈ పిల్లాడిని నేను చూడటం ఇదే తొలిసారి. 17 00:03:00,681 --> 00:03:03,475 మీరు నిజం చెప్పట్లేదు అనుకుంటా, హిడేయో. 18 00:03:07,938 --> 00:03:09,940 మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. 19 00:03:13,694 --> 00:03:15,863 మీరు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ యూమా తల్లిదండ్రులకు సందేశం పంపారు. 20 00:03:17,281 --> 00:03:20,742 కొబయాషీ కుటుంబానికి పంపారు మీరు. కానీ యూమా కన్న తండ్రి మిస్టర్ కొబయాషీ కాదు. 21 00:03:25,998 --> 00:03:26,999 నిజంగానే కాదు. 22 00:03:27,708 --> 00:03:29,293 అతనే తండ్రి అనుకుంటాడు, కానీ అది నిజం కాదు. 23 00:03:30,711 --> 00:03:32,838 యూమా తండ్రి, అసలైన తండ్రి పేరు, 24 00:03:32,838 --> 00:03:36,758 మసాకీ హషిమోటో, ఆయన ఎవరో కాదు... 25 00:03:38,760 --> 00:03:41,263 టోక్యో యాకూజాకి బాస్. 26 00:03:42,097 --> 00:03:43,682 కాబట్టి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, 27 00:03:44,641 --> 00:03:46,143 తర్వాత ఏం జరుగుతుంది? 28 00:03:48,061 --> 00:03:51,523 నేను మీకొక అవకాశం ఇస్తాను. మీరు నన్ను ఆ పిల్లాడి దగ్గరకు తీసుకెళ్తే చాలు. 29 00:03:51,523 --> 00:03:53,358 యూమా నా చెంతకి రాగానే, 30 00:03:53,859 --> 00:03:56,862 మీకు రెండు గంటలు సమయం ఇస్తాను, ఆ తర్వాత ఆ పిల్లాడి తండ్రికి కాల్ చేస్తాను. 31 00:03:56,862 --> 00:03:59,865 ఆ రెండు గంటల్లో, మీరు విమానాశ్రయానికి వెళ్లిపోయి, 32 00:03:59,865 --> 00:04:01,575 విదేశాలకు పారిపోవాలి. 33 00:04:02,951 --> 00:04:05,204 జపాన్ లో ఉంటే మీ ప్రాణాలు పోతాయి. 34 00:04:12,794 --> 00:04:14,213 జనాల మక్కెలు విరగ్గొట్టడం నాకు సరదా కాదు. 35 00:04:14,838 --> 00:04:15,839 నాకు అది ఇష్టమే ఉండదు. 36 00:04:17,341 --> 00:04:20,135 ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, ఇందాక చెప్పిన ఆఫర్ నీకు మళ్లీ ఇస్తా. 37 00:04:21,720 --> 00:04:24,556 దయచేసి ఆ పిల్లాడిని ఎక్కడ దాచావో చెప్పు. 38 00:04:29,728 --> 00:04:32,064 సారీ. నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. 39 00:04:43,617 --> 00:04:46,161 తొక్కలో రేమండ్ సూట్. 40 00:05:10,686 --> 00:05:12,479 ఎవరు మీరు? 41 00:05:12,479 --> 00:05:14,481 కూర్చోండి. 42 00:05:42,593 --> 00:05:43,677 యూమా. 43 00:05:52,102 --> 00:05:54,313 థ్యాంక్యూ. 44 00:05:54,313 --> 00:05:56,815 మీకు సహాయం చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం, సర్. 45 00:05:56,815 --> 00:05:58,192 మీకు గాయమైంది. 46 00:05:58,192 --> 00:06:00,485 - దాని సంగతి నేను చూసుకుంటాలెండి. - అలాగే. 47 00:06:00,485 --> 00:06:02,321 బయట వేచి చూడు. 48 00:06:09,620 --> 00:06:11,413 ఇక నువ్వు బయలుదేరితే మంచిది. 49 00:06:31,016 --> 00:06:33,101 నాకు జనాలను గాయపరచడం నచ్చదు. నిజంగానే చెప్తున్నా. 50 00:06:34,561 --> 00:06:37,940 ఇప్పటికే ప్రపంచం అష్టకష్టాలు పడుతోంది, దానికి నేను ఆజ్యం పోయాల్సిన పనే లేదు. 51 00:06:41,610 --> 00:06:43,320 తప్పిపోయిన వారి ఆచూకీని కనిపెట్టడం. 52 00:06:44,154 --> 00:06:46,114 మిస్ అవుతున్నవారి చెంతకు వారిని చేర్చడం. 53 00:06:47,950 --> 00:06:49,409 నేను చేసే పనిలో నాకు ఇష్టమైన భాగం అదే. 54 00:06:51,328 --> 00:06:53,997 అప్పుడప్పుడూ కత్తి ఉపయోగించాల్సి వచ్చినా, సూట్ పాడైనా, ఆ పని జరిగితే నాకు అదే చాలు. 55 00:06:56,458 --> 00:06:57,584 చాలా కష్టమైన పనే. 56 00:06:58,961 --> 00:06:59,962 కానీ ఆదాయం స్థిరంగా వస్తుంది. 57 00:08:31,553 --> 00:08:33,639 థామస్ కింజీ సహాయం కావాలి / మిస్టర్ సీగల్ 58 00:08:33,639 --> 00:08:37,433 జోనథన్ సీగల్ తరఫున 59 00:09:07,589 --> 00:09:09,591 లాస్ ఏంజెలస్ 60 00:09:16,974 --> 00:09:21,019 జ్వరం తగ్గిపోవాలని కోరుకుంటున్నా. వాంతులు ఆగాయా? 61 00:09:21,019 --> 00:09:23,897 క్లయింట్ ఉన్నారు... 62 00:09:23,897 --> 00:09:26,441 తర్వాత కాల్ చేస్తా. 63 00:09:28,652 --> 00:09:30,737 మీకు ఏసీ బాగానే తగులుతోందా, సర్? 64 00:09:30,737 --> 00:09:32,531 ఏసీ పెంచమంటే పెంచుతాను. 65 00:09:32,531 --> 00:09:34,908 ఇది చాలు, బాగుంది. థ్యాంక్యూ. 66 00:09:34,908 --> 00:09:35,993 మీకు అరబిక్ వచ్చా? 67 00:09:35,993 --> 00:09:38,787 వచ్చు. చాలా ఏళ్ల క్రితం డమాస్కస్ లో కొంత కాలం గడిపాను. 68 00:09:38,787 --> 00:09:41,290 అప్పుడు అది చాలా గొప్ప నగరం... ఆ తర్వాత సమస్యలన్నీ దాన్ని చుట్టుముట్టేశాయి. 69 00:09:41,290 --> 00:09:42,875 నేను కూడా డమాస్కస్ నుండే వచ్చా! 70 00:09:42,875 --> 00:09:44,626 మీ పేరేంటి, మిత్రమా? 71 00:09:44,626 --> 00:09:46,670 ముంజర్. 72 00:09:47,296 --> 00:09:48,672 ముంజర్. 73 00:10:11,528 --> 00:10:12,613 ముంజర్. 74 00:10:13,530 --> 00:10:15,949 మీ కూతురి గురించి మీరు మాట్లాడేటప్పుడు విన్నాను. 75 00:10:17,117 --> 00:10:18,535 ఇది నా డాక్టర్ ఫోన్ నంబర్. 76 00:10:19,870 --> 00:10:21,121 ఆయనకి కాల్ చేయండి, సరేనా? 77 00:10:21,121 --> 00:10:23,916 మీ కూతురికి బాగా లేదని ఆయనకి చెప్పండి, 78 00:10:23,916 --> 00:10:25,876 నేనే నంబర్ ఇచ్చానని మాత్రం తప్పకుండా చెప్పండి. ఆయన సాయపడతారు. 79 00:10:26,752 --> 00:10:29,213 దైవాశీస్సులతో మీరు చల్లగా ఉండాలి, సర్. 80 00:10:29,213 --> 00:10:30,506 తప్పకుండా. 81 00:10:31,507 --> 00:10:33,467 - మీ కోసం ఆగమంటారా? - అక్కర్లేదు. 82 00:10:33,467 --> 00:10:35,969 కానీ ఏమనుకోకుండా మీరు నా లగేజీని హోటల్ కి తీసుకువెళ్తే, నాకు అదే చాలు. 83 00:10:35,969 --> 00:10:39,890 మీ డిశ్పాచర్ అడిగితే, నన్ను కూడా అక్కడే దింపానని చెప్పండి. 84 00:10:39,890 --> 00:10:40,974 తప్పకుండా. 85 00:11:11,755 --> 00:11:14,383 - జాన్ షుగర్, నిన్ను కలవడం చాలా బాగుంది. - హేయ్, రూబీ. 86 00:11:14,383 --> 00:11:17,803 హేయ్. ఇలా రా. చాలా కాలమైంది. 87 00:11:17,803 --> 00:11:19,805 - అవును. - ఆగు, ఓసారి నిన్ను బాగా పరిశీలిస్తా. 88 00:11:22,182 --> 00:11:24,434 - బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. - చాలా దూర ప్రయాణం కదా. 89 00:11:24,434 --> 00:11:26,103 టోక్యోలో ఒక మిత్రుడిని కలిశా. 90 00:11:26,854 --> 00:11:29,022 అతని స్థానిక వర్గమంతా చెల్లాచెదురైపోయిందని చెప్పాడు, 91 00:11:29,857 --> 00:11:32,192 ఆ వర్గంలోని ఇతర సభ్యులని చూసి ఏడాదిపైనే అయిందట. 92 00:11:32,192 --> 00:11:36,697 ఇక్కడికి రావడం అతనికి ఏ అభ్యంతరమూ లేకపోతే, మన దగ్గర పని చేయవచ్చని చెప్పా. 93 00:11:36,697 --> 00:11:39,992 హా, తప్పకుండా. సరే మరి. లోపల నీ కోసం కొన్ని సిద్ధంగా ఉంచా. 94 00:11:39,992 --> 00:11:41,326 - సరే, పద మరి. - హా. 95 00:11:44,663 --> 00:11:46,832 మిరంబే, మిరంబే, మిరంబే. 96 00:11:46,832 --> 00:11:47,916 హాయ్. హాయ్. 97 00:11:52,171 --> 00:11:54,631 నిన్ను ఇంత సులభంగా పడేయవచ్చని నాకు తెలీదే. 98 00:11:54,631 --> 00:11:57,050 పడేయడం లేదు, గిడేయడం లేదే. ఇదేం చేస్తోందో నాకు బాగా తెలుసు. 99 00:11:58,302 --> 00:11:59,303 మంచి పిల్లి. 100 00:12:02,264 --> 00:12:04,183 - ఏంటవి? - హెలెన్ రాసిన లేఖలు. 101 00:12:04,183 --> 00:12:07,102 - తను చాలా మంచిదబ్బా. - హా, ఈరోజుల్లో కూడా లేఖలు రాస్తుందంటే, నమ్మలేకున్నా. 102 00:12:07,102 --> 00:12:08,478 అంటే, నిజంగానే రాస్తోంది. 103 00:12:08,478 --> 00:12:09,605 తను పాత రకంలే. 104 00:12:09,605 --> 00:12:11,648 - నిజంగానే పాత రకం. - థ్యాంక్యూ. 105 00:12:11,648 --> 00:12:12,816 ఏం పర్లేదు. 106 00:12:14,234 --> 00:12:18,447 నీ విమానం వచ్చి, నాలుగు గంటలు అయిందా? 107 00:12:19,239 --> 00:12:20,574 సుమారుగా అంతే. హా. 108 00:12:23,911 --> 00:12:25,078 మరి ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్ళావు? 109 00:12:26,705 --> 00:12:27,706 కొన్ని పనులు ఉంటే చూసుకున్నా. 110 00:12:32,127 --> 00:12:33,295 పనులా? 111 00:12:33,962 --> 00:12:35,339 అవును, పనులు. 112 00:12:35,339 --> 00:12:37,466 ఏ పనులు? 113 00:12:37,466 --> 00:12:38,675 మామూలు పనులే. 114 00:12:39,635 --> 00:12:40,928 జోనథన్ సీగల్ పనులా? 115 00:12:43,680 --> 00:12:45,474 నా పేరు థామస్ కింజీ, మిస్టర్ సీగల్ లాయరుని. 116 00:12:45,474 --> 00:12:46,558 నా పేరు షుగర్. 117 00:12:46,558 --> 00:12:48,060 స్వాగతం. ఆయన గార్డెనులో ఉన్నాడు. 118 00:12:48,060 --> 00:12:50,270 - మళీ నాపై నిఘా ఉంచావా? - లేదు, నేను... 119 00:12:50,270 --> 00:12:53,357 నాకు థామస్ కింజీ నుండి ఫోన్ వచ్చింది. 120 00:12:53,357 --> 00:12:55,359 అవును, మీ ఒప్పందం గురించి చెప్పాడు, 121 00:12:55,359 --> 00:12:59,446 అది నాకు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే, ఆయన మూడు రోజుల క్రితం నాకు కాల్ చేసినప్పుడు, 122 00:12:59,446 --> 00:13:03,408 నువ్వు ఆ పని చేయవని అతనికి చాలా స్పష్టంగా చెప్పాను. 123 00:13:05,327 --> 00:13:06,328 చెప్పావేమో. 124 00:13:06,328 --> 00:13:08,413 మీరు అందించిన రెఫరెన్సులకు కాల్ చేశాము. 125 00:13:08,997 --> 00:13:11,041 వాళ్లందరూ మీరు చాలా నిబద్ధత గలవారని చెప్పారు. 126 00:13:11,041 --> 00:13:12,459 కుటుంబ విషయాలను 127 00:13:12,459 --> 00:13:15,754 మిస్టర్ సీగల్ అస్సలు బయటకు పొక్కనిచ్చే రకం కాదు. 128 00:13:15,754 --> 00:13:18,882 ఈ విషయాల గురించి ఏ ఒక్క సమాచారం బయటకు పొక్కినా 129 00:13:18,882 --> 00:13:20,968 ఆయన చాలా బాధపడతాడు. 130 00:13:21,552 --> 00:13:23,887 - అక్కడ ఉన్నాడు. - హా. 131 00:13:26,098 --> 00:13:28,684 మీకు నచ్చినన్ని మొక్కలు నాటండి. కానీ ఇక్కడ మరింత మట్టిని తీసుకురండి. 132 00:13:28,684 --> 00:13:30,686 అంతే. థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్. 133 00:13:32,312 --> 00:13:35,524 షుగర్, జోనథన్ సీగల్. 134 00:13:35,524 --> 00:13:37,943 మిమ్మల్ని కలవడం నా భాగ్యం, సర్. మీ సినిమాలకు నేను వీరాభిమానిని. 135 00:13:37,943 --> 00:13:41,154 మీరు నిర్మించిన ప్రతీ సినిమాను నేను చూశాను. 136 00:13:41,154 --> 00:13:43,490 చాలా వరకు అయితే, అయిదు, ఆరు సార్లు చూశాను, 137 00:13:43,490 --> 00:13:45,534 "మిస్టరీ మహిళ" సినిమా తప్ప. 138 00:13:45,534 --> 00:13:47,661 దాన్ని నేను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. 139 00:13:49,454 --> 00:13:52,583 - ఇక నువ్వు బయలుదేరవచ్చు, టామ్. నీకు తర్వాత కాల్ చేస్తా. - మిస్టర్ షుగర్. 140 00:13:52,583 --> 00:13:53,667 థ్యాంక్యూ. 141 00:13:54,751 --> 00:13:55,878 - మనం లోపలికి వెళ్దామా? - సరే. 142 00:13:57,337 --> 00:14:00,340 అయితే, మీకు సినిమాలంటే ఇష్టమా? 143 00:14:00,841 --> 00:14:02,843 ఇష్టమా? ఇష్టం అనేది... 144 00:14:02,843 --> 00:14:05,220 చాలా చిన్న పదం. నాకు పిచ్చి అని చెప్పవచ్చు. 145 00:14:08,515 --> 00:14:11,059 అది నాకు సరదాగా అనిపించట్లేదు, జాన్. నాకు అస్సలు అనిపించట్లేదు. 146 00:14:12,269 --> 00:14:14,980 ఏ క్లయింట్ అయినా నిన్ను నేరుగా సంప్రదిస్తే, నన్ను అమర్యాద పరిచినట్టే కదా. 147 00:14:15,606 --> 00:14:17,274 నువ్వు నా మనిషివి. 148 00:14:17,274 --> 00:14:20,861 పైగా టోక్యో పని పూర్తి అయ్యాక నువ్వు కొంత కాలం విరామం తీసుకోవాలని 149 00:14:20,861 --> 00:14:22,988 మనిద్దరి మధ్య ఒప్పందం కూడా ఉంది. 150 00:14:24,114 --> 00:14:25,616 ఆ విరామం చాలా అవసరం. 151 00:14:25,616 --> 00:14:27,743 నీ గురించి ఎమిలీ కార్పెంటరుతో మాట్లాడాను. 152 00:14:30,037 --> 00:14:33,123 నువ్వు ఒక్కటంటే ఒక్కటే పని చేస్తావని ఎమిలీ చెప్పింది. 153 00:14:33,874 --> 00:14:34,958 విషయాలను రహస్యంగా ఉంచాలనుకునే 154 00:14:36,627 --> 00:14:38,712 నా లాంటి వాళ్లకు, తప్పిపోయిన వాళ్ల ఆచూకీని 155 00:14:39,796 --> 00:14:41,298 కనిపెడతావని చెప్పింది. 156 00:14:42,216 --> 00:14:44,676 - రూబీ, నన్ను సంప్రదించింది జోనథన్ సీగల్. - ఎవరైతే నాకేంటి! 157 00:14:46,720 --> 00:14:48,055 ఒక అమ్మాయి కనబడట్లేదు. 158 00:14:49,765 --> 00:14:50,891 అతని మనవరాలు. 159 00:14:51,892 --> 00:14:55,687 ఆమెకి ఇప్పుడు పాతికేళ్లు, కానీ ఇప్పటికీ ఆయన దృష్టిలో ఆమె పసిపిల్లే. 160 00:14:55,687 --> 00:14:58,315 ఒలీవియా రెండు వారాల నుండి ఏమైందో తెలీట్లేదు. 161 00:15:01,151 --> 00:15:05,322 నా కొడుకు బెర్నార్డ్, కొన్ని రోజుల క్రితమే నాకు విషయం చెప్పాడు. 162 00:15:05,864 --> 00:15:09,576 తను అప్పుడప్పుడూ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతుంది కదా, ఇది కూడా అలాంటిదే అనుకున్నాడు. 163 00:15:09,576 --> 00:15:11,995 నువ్వు కోరిన వాటిని, టామ్ మనుషులకు చెప్పి ఏర్పాటు చేయించాను. 164 00:15:16,208 --> 00:15:18,460 - ఆ ఫోటోలో ఉండేది తనే. - చాలా అందంగా ఉంది. 165 00:15:19,837 --> 00:15:22,464 ఈమె ఇలా ఇంతకు ముందు చేసిందా? అంటే ఇలా వెళ్లిపోవడం? 166 00:15:23,173 --> 00:15:28,178 వెళ్లింది. కానీ, దానికి కారణం ఏంటంటే, చాలా ఏళ్లు తను డ్రగ్స్ కి బానిసగా ఉండేది, 167 00:15:28,178 --> 00:15:32,015 చాలాసార్లు రోజులపాటు, కొన్నిసార్లు అయితే నెలలపాటు ఎటో వెళ్లిపోయేది. 168 00:15:32,015 --> 00:15:34,726 కానీ ఈసారి ఏదో జరిగింది. మీరు కంగారుపడుతున్నారు. ఎందుకు? 169 00:15:35,769 --> 00:15:40,023 ఒలీవియా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినప్పుడు, తను నాకు కాల్ చేసేది. 170 00:15:40,023 --> 00:15:41,984 ప్రతిసారి డబ్బు కోసం కాల్ చేసేది, 171 00:15:41,984 --> 00:15:43,277 నేను ఇచ్చేవాడిని కూడా. 172 00:15:43,277 --> 00:15:45,445 కానీ ఈసారి ఆమె కాల్ చేయలేదా? కాల్స్ కానీ... 173 00:15:45,445 --> 00:15:47,739 లేదు, ఈసారి అదేమీ లేదు. 174 00:15:48,240 --> 00:15:49,825 ఒలీవియాని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? 175 00:15:51,952 --> 00:15:54,621 సుమారుగా ఒక నెల క్రిందట చూశా. అప్పుడు తనని డిన్నర్ కి తీసుకెళ్లా. 176 00:15:54,621 --> 00:15:57,249 తను డ్రగ్స్ కి దూరంగా ఉండి రెండేళ్లు అయిన సందర్భంగా పార్టీ చేసుకున్నాం. 177 00:15:57,791 --> 00:16:00,377 ఆ విషయంలో తను చాలా గర్వపడింది. నేను కూడా. 178 00:16:01,628 --> 00:16:05,549 ఆ రాత్రి తను చాలా కొత్తగా కనిపించింది. 179 00:16:05,549 --> 00:16:07,009 కొత్తగా? అంటే ఎలా? 180 00:16:07,634 --> 00:16:13,056 తనలో నాకు ఆశలు, ఆత్మవిశ్వాసం, కుతూహలం, హాస్యచతురత అన్నీ కనిపించాయి. 181 00:16:14,892 --> 00:16:18,020 ఎట్టకేలకు తను ఒక మార్గంలోకి వచ్చిందని అప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. 182 00:16:18,020 --> 00:16:19,396 ఒక మార్గం అంటే ఏ మార్గంలోకి, సర్? 183 00:16:21,148 --> 00:16:22,608 మంచి మార్గంలోకి. 184 00:16:27,446 --> 00:16:29,031 నాకు వయస్సు అయిపోయింది, షుగర్, 185 00:16:30,073 --> 00:16:32,451 నా ఆరోగ్యం కూడా ఇప్పుడు అంత బాగా లేదు. 186 00:16:33,577 --> 00:16:34,620 గుండె సంబంధిత వ్యాధి ఉంది. 187 00:16:35,913 --> 00:16:38,165 ఇప్పుడు నాకు నా మనవరాలు తప్ప 188 00:16:39,666 --> 00:16:41,752 ఇంకేది ఎక్కువ కాదు. 189 00:16:43,921 --> 00:16:47,382 దయచేసి తన ఆచూకీని కనిపెట్టు. 190 00:16:49,718 --> 00:16:51,094 అది అతని సమస్య. 191 00:16:52,179 --> 00:16:53,847 నా సమస్య కాదు, నీది కూడా కాదు. 192 00:16:58,560 --> 00:16:59,728 త్వరలోనే కలుద్దాం. 193 00:17:00,687 --> 00:17:01,939 అది సరదాగా అనిపించట్లేదు, జాన్. 194 00:17:01,939 --> 00:17:04,525 నువ్వు ఇప్పుడే థామస్ కింజీకి కాల్ చేసి, ఉన్న విషయం చెప్పేయ్. 195 00:17:05,233 --> 00:17:06,108 రూబీ, 196 00:17:07,736 --> 00:17:08,819 నేను ఆ పని చేయలేను. 197 00:17:10,571 --> 00:17:12,991 ఆ పని నేను చేయలేను. ఆ అమ్మాయి ఉందే. 198 00:17:19,790 --> 00:17:21,083 తనని చూస్తే నాకు జెన్ గుర్తొచ్చింది. 199 00:17:25,170 --> 00:17:26,171 హా. 200 00:17:29,299 --> 00:17:30,467 ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు. 201 00:17:31,343 --> 00:17:32,886 తను... 202 00:17:40,352 --> 00:17:43,438 ఓహో. నువ్వు మామూలోడివి కాదు. 203 00:17:43,438 --> 00:17:44,648 ఏంటి? 204 00:17:44,648 --> 00:17:46,567 నేను ఏం చెప్తే కరిగిపోతానో నీకు బాగా తెలుసు, కదా? 205 00:17:46,567 --> 00:17:49,278 - నిన్ను కరిగించాలని నేను ఇది చెప్పలేదు, రూబీ. - హా. 206 00:17:49,278 --> 00:17:53,991 నేను తన ఫోటోలను చూడగానే, నాకు జెన్ గుర్తొచ్చింది. 207 00:17:55,117 --> 00:17:56,743 సరే. నీకు ఇవి అవసరం అవుతాయి. 208 00:17:56,743 --> 00:17:58,579 తుపాకీలను తీసుకెళ్లడానికి అనుమతి, 209 00:17:58,579 --> 00:18:00,914 పునరుద్ధరించబడిన కాలిఫోర్నియా డిటెక్టివ్ లైసెన్స్, 210 00:18:00,914 --> 00:18:01,999 - డ్రైవింగ్ లైసెన్స్... - ఆగు. ఆగాగు. 211 00:18:01,999 --> 00:18:05,043 తుపాకీలను తీసుకెళ్లడానికి అనుమతి నాకెందుకు? 212 00:18:13,427 --> 00:18:15,470 రూబీ, నీకు తెలుసా కదా, నాకు తుపాకులంటే చిరాకు అని. 213 00:18:15,470 --> 00:18:17,514 హా, తెలుసు. కానీ అది... 214 00:18:17,514 --> 00:18:19,016 ఇది మామూలు పాత తుపాకీ కాదు, సరేనా? 215 00:18:19,016 --> 00:18:21,727 "బిగ్ హీట్" సినిమాలో గ్లెన్ ఫోర్డ్ ఉపయోగించిన తుపాకీ. 216 00:18:21,727 --> 00:18:25,731 "బిగ్ హీట్" సినిమాలో గ్లెన్ ఫోర్డ్ ఉపయోగించిన తుపాకీ అంటే? 217 00:18:25,731 --> 00:18:27,649 అంటే ఇది ఆ తుపాకీని ఆధారంగా తీసుకొని చేసిన తుపాకీయా? 218 00:18:27,649 --> 00:18:29,902 కాదు, ఇది డూప్లికేట్ కాదు. 219 00:18:29,902 --> 00:18:31,486 గ్లెన్ ఫోర్డ్? 220 00:18:31,987 --> 00:18:33,530 హా, అతను ఉపయోగించిన తుపాకీయే ఇది. 221 00:18:33,530 --> 00:18:34,865 - ఈ తుపాకీని గ్లెన్ ఫోర్డ్ వాడాడా? - నేను... 222 00:18:34,865 --> 00:18:37,409 - హా. చెప్పు. - ఈ తుపాకీని గ్లెన్ ఫోర్డ్ వాడాడు. 223 00:18:38,493 --> 00:18:39,578 - అయ్య బాబోయ్. - హా, 224 00:18:39,578 --> 00:18:41,079 నేను దీన్ని ప్రైవేట్ కలెక్టర్ నుండి సంపాదించా. 225 00:18:41,079 --> 00:18:43,790 కేవలం నీ కోసమే, ఇది పని చేసే తుపాకీగా మార్పించా. 226 00:18:44,416 --> 00:18:46,877 - ఎందుకు? - నీ దగ్గర తుపాకీ ఉంటే, 227 00:18:46,877 --> 00:18:47,961 నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. 228 00:18:48,462 --> 00:18:51,590 అదీగాక, ఈ పని చేస్తే కానీ, నువ్వు తుపాకీ పెట్టుకోవని నాకు తెలుసు. 229 00:18:51,590 --> 00:18:53,342 ఎవరు ఎవరిని ఆడిస్తున్నారు? 230 00:18:54,510 --> 00:18:58,180 - వావ్. థ్యాంక్యూ. - అంతే. మరేం పర్వాలేదు. 231 00:18:58,180 --> 00:19:01,308 - కానీ, నాకు వద్దులే, థ్యాంక్యూ. - లేదు. లేదు. 232 00:19:02,476 --> 00:19:04,937 నీకు ఇవన్నీ ఇస్తా, కానీ నువ్వు నాకు మాటివ్వాలి. 233 00:19:05,646 --> 00:19:07,105 మాట అంటే? 234 00:19:07,105 --> 00:19:09,149 ఈ తుపాకీని నువ్వు ఈ క్షణమే 235 00:19:09,149 --> 00:19:10,609 - తీసుకువెళ్లాలి. - అలాగే. 236 00:19:10,609 --> 00:19:12,861 సరే, నువ్వు డాక్టర్ వికర్స్ కి చూపించుకోవాలి. 237 00:19:13,779 --> 00:19:15,489 రూబీ, నాకు... 238 00:19:15,489 --> 00:19:17,824 నా ఆరోగ్యం చాలా బాగా ఉంది. నేను చక్కగా ఉన్నాను. 239 00:19:17,824 --> 00:19:21,245 అబద్ధాలు చెప్పకు, జాన్. నీ గురించి నాకు తెలుసు. అది నీకూ తెలుసు. 240 00:19:21,245 --> 00:19:24,331 - డాక్టర్ వికర్స్ కి నేను చూపించుకోనక్కర్లేదు. - సరే, జాన్, నీ చేయి ఎలా ఉంది? 241 00:19:29,545 --> 00:19:30,546 చెప్పు. 242 00:19:31,880 --> 00:19:32,881 నా చేయి బాగానే ఉంది. 243 00:19:37,261 --> 00:19:38,178 సరే. 244 00:19:38,846 --> 00:19:41,139 నువ్వు సీగల్ కేసు తీసుకో. కానీ అది అయ్యాక, నువ్వు పని ఆపేయాలి. 245 00:19:41,139 --> 00:19:42,224 అలాగే. 246 00:19:43,725 --> 00:19:45,185 నేను మళ్లీ చేయమనే దాకా నువ్వు పని చేయకూడదు. 247 00:19:46,311 --> 00:19:47,980 - సరే. తీసుకో. - అలాగే. 248 00:19:49,231 --> 00:19:52,234 - నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. - లేదు, ఇవే అన్నీ. 249 00:19:52,234 --> 00:19:56,154 నీ ఎడమ చేతిలో ఉంది అది. చూపించు, చూపించు. 250 00:19:56,154 --> 00:19:57,656 థ్యాంక్యూ. 251 00:20:10,711 --> 00:20:12,421 ఈ అద్భుతాన్ని నువ్వు నడపడం నాకు ఇష్టముండదు. 252 00:20:12,421 --> 00:20:15,007 అద్భుతం కాదు, ఇది కళాఖండం. 253 00:20:22,681 --> 00:20:23,515 సరే మరి. 254 00:20:23,515 --> 00:20:24,766 - థ్యాంక్యూ. - మరేం పర్వాలేదు. 255 00:20:25,350 --> 00:20:27,477 - నువ్వు డెల్ కోరెజాన్ హోటల్ లోనే ఉంటావు కదా. - అంతేగా. 256 00:20:28,103 --> 00:20:29,646 నువ్వు అంతంత ఖర్చు పెట్టి అక్కడ ఉండే బదులు, 257 00:20:29,646 --> 00:20:32,357 - ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. - నాకు ఆ హోటల్ అంటే ఇష్టం. 258 00:20:32,357 --> 00:20:34,902 రోజుకు రెండుసార్లు గదిని ఊడ్చే పనివాళ్లు ఉంటారు. 259 00:20:34,902 --> 00:20:38,864 నాకు కావలసిన పనుల్లో సాయపడే సహాయకుడు ఉంటాడు. అక్కడ రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది. 260 00:20:38,864 --> 00:20:41,909 అదేం కాదు, అక్కడ పని చేసే వాళ్లు నీకు ఆత్మీయులుగా అనిపిస్తారు, 261 00:20:41,909 --> 00:20:43,577 - అందుకే నీకు ఆ చోటు నచ్చుతుంది. - నిజంగా? 262 00:20:43,577 --> 00:20:45,412 - హా, నీకు ఒక కుటుంబంలా అనిపించడం బాగుంది. - వావ్. 263 00:20:46,288 --> 00:20:49,583 హా. కానీ అదంతా భ్రమ, షుగర్. నీకు ఇల్లు కావాలి. 264 00:21:19,112 --> 00:21:20,113 మిస్టర్ బాస్కోంబ్? 265 00:21:20,113 --> 00:21:22,282 నేనే. మీరు గ్యారీ అని పిలవవచ్చు. 266 00:21:22,282 --> 00:21:24,618 - నా పేరు జాన్ షుగర్. - హాయ్. హా, మిస్టర్ కింజీ ఆఫీసు నుండి కాల్ వచ్చింది, 267 00:21:24,618 --> 00:21:26,370 - మిమ్మల్ని లోపలికి అనుమతించమని చెప్పారు. కాబట్టి... - సూపర్. 268 00:21:26,370 --> 00:21:30,707 ఒక్క నిమిషం. ఇక్కడ ఉండే ప్రతీ ఒక్కరికీ సొంతంగా ఒక పార్కింగ్ స్లాట్ ఉంటుందా? 269 00:21:30,707 --> 00:21:32,209 హ, ఉంటుంది. కొందరికైతే రెండు స్లాట్లు ఉన్నాయి. 270 00:21:32,918 --> 00:21:34,419 మిస్ సీగల్ కి చెందిన పార్కింగ్ స్లాట్ చూపించగలరా? 271 00:21:35,087 --> 00:21:36,421 తప్పకుండా. ఇలా రండి. 272 00:21:40,175 --> 00:21:43,011 ఈ కారు రెండు వారాల నుండి ఇక్కడే ఉంది. 273 00:21:43,011 --> 00:21:46,723 అది మీకెలా తెలుసు? ఇక్కడి కార్లన్నింటినీ అనుక్షణం కనిపెట్టుకొని ఉండటం అసాధ్యం కదా? 274 00:21:46,723 --> 00:21:50,227 లేదు, లేదు. ఇక్కడ ఉండేవారి కార్లన్నింటిలో పార్కింగ్ గేట్ తెరవడానికి కావలసింది ఉంటుంది, 275 00:21:50,227 --> 00:21:52,020 వాళ్లు బయటకు వెళ్లిన ప్రతిసారి, అది సమయాన్ని రికార్డ్ చేస్తుంది. 276 00:21:52,020 --> 00:21:55,566 ఆ సమయాలన్నీ నా ఆఫీసులో ఉండే సెక్యూరిటీ కంప్యూటరులో ఉంటాయి... 277 00:21:57,943 --> 00:22:00,279 మీ దగ్గర డూప్లికేట్ తాళాలు ఏమైనా ఉంటాయా? 278 00:22:00,279 --> 00:22:02,239 కార్లకా? కార్లకు ఉండవు, ఇళ్ళకు మాత్రమే ఉంటాయి. 279 00:22:02,239 --> 00:22:04,491 సరే. ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్దామా? 280 00:22:04,491 --> 00:22:05,784 హా, సరే. ఇలా రండి. 281 00:22:08,537 --> 00:22:11,081 సరే మరి, ఇదే ఇల్లు. 282 00:22:12,833 --> 00:22:15,210 ఈమె ఎవరో కూడా నాకు తెలీదు. ఈమె కుటుంబ వివరాలతో సహా ఏ వివరాలూ తెలీవు. 283 00:22:15,210 --> 00:22:17,296 - గ్యారీ, థ్యాంక్యూ. మీకు ధన్యవాదాలు. - పర్లేదు. 284 00:22:17,296 --> 00:22:19,298 ఇక్కడి నుండి నేనే చూసుకుంటాలే. తాళం చెవులు కూడా ఇచ్చేయండి. 285 00:22:20,215 --> 00:22:23,468 అన్ని ఇళ్ల తాళం చెవులు నా దగ్గర ఉంటాయి. నేను బిల్డింగ్ మేనేజర్ ని కదా. 286 00:22:23,468 --> 00:22:24,928 హా, అవును. కానీ ఇది అపార్టుమెంటు కదా, 287 00:22:24,928 --> 00:22:27,598 ఇక్కడి ఫ్లాట్ల తాళం చెవులన్నీ చట్టపరంగా అపార్టుమెంట్ యజమానికే చెందుతాయి, 288 00:22:27,598 --> 00:22:31,226 ఆ యజమాని, జోనథన్ సీగల్. ఆయన ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను. 289 00:22:31,226 --> 00:22:32,311 థ్యాంక్యూ. 290 00:22:32,311 --> 00:22:35,731 కానీ ఏదైనా జరిగితే? అంటే, ఏదైనా పైపు లీక్ అయితే? 291 00:22:35,731 --> 00:22:37,232 ఇది నా నంబరు, దీనికి కాల్ చేయండి. 292 00:22:38,233 --> 00:22:40,068 - మీకు కాల్ చేయాలా? - అవును, థ్యాంక్యూ. 293 00:22:40,777 --> 00:22:41,778 మరేం పర్వాలేదు. 294 00:22:52,456 --> 00:22:53,457 ఇల్లు చాలా బాగుంది. 295 00:22:56,752 --> 00:22:59,796 ఈమె సీగల్ వంశస్థురాలు కదా, బాగానే ఉంటుంది మరి. 296 00:23:06,303 --> 00:23:07,930 వివేకవంతమైన స్త్రీవాదానిదే పైచేయి జిప్పర్ క్లబ్ 297 00:23:07,930 --> 00:23:10,140 {\an8}ఏప్రిల్ 4 శనివారం వెన్నిలా హోర్ 298 00:23:32,913 --> 00:23:36,166 ఎవరు నువ్వు? నీకు ఇక్కడ ఏం పని? 299 00:23:36,166 --> 00:23:39,002 - నేను కూడా మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. - కెన్నీ! కెన్నీ! 300 00:23:40,963 --> 00:23:45,175 వావ్. అంత ఆవేశం పనికి రాదు. 301 00:23:45,175 --> 00:23:47,845 నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను కదరా. ఎవరు నువ్వు? 302 00:23:47,845 --> 00:23:49,096 నా పేరు జాన్ షుగర్. 303 00:23:49,096 --> 00:23:51,890 నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుండి లైసెన్స్ పొందిన ప్రైవేట్ డిటెక్టివ్ ని. 304 00:23:51,890 --> 00:23:55,227 - నా జేబులో గుర్తింపు కార్డ్ కూడా ఉంది. - హేయ్, ప్యాంట్ జేబులో చేతులు పెట్టకు. 305 00:23:55,227 --> 00:23:56,311 సరే. 306 00:24:01,233 --> 00:24:02,776 సారీ, మిమ్మల్ని మొదటే గుర్తించలేకపోయా. 307 00:24:03,652 --> 00:24:04,736 మీరు డేవీ సీగలే కదా. 308 00:24:04,736 --> 00:24:05,821 డేవిడ్. 309 00:24:06,780 --> 00:24:08,031 ఇప్పుడు డేవీ కాదు. 310 00:24:08,031 --> 00:24:09,741 ఈమధ్యే మీరు ఒక సీక్వెల్ షూటింగ్ పూర్తి చేశారు కదా? 311 00:24:09,741 --> 00:24:11,743 "అయోమయపు కుర్రాడు" అనే సినిమాకి, 312 00:24:11,743 --> 00:24:14,872 అందులో అబ్బాయి అలానే ఉంటాడు, కానీ అతని వయస్సు పెరిగిపోతూ ఉంటుంది. 313 00:24:14,872 --> 00:24:16,623 - అవును. - ఆ విషయంలో గుడ్ లక్. 314 00:24:17,624 --> 00:24:20,210 మీరు కాస్త అది దించుతారా? తుపాకులంటే నాకు చిరాకు. 315 00:24:21,795 --> 00:24:22,796 థ్యాంక్యూ. 316 00:24:23,881 --> 00:24:25,257 నీకు ఇక్కడ ఏం పని? 317 00:24:25,257 --> 00:24:26,633 మీ చెల్లి కనబడట్లేదు కదా, 318 00:24:26,633 --> 00:24:28,594 ఆ సంగతి చూసే పని మీ తాతగారు నాకు అప్పగించారు. 319 00:24:28,594 --> 00:24:30,470 కావాలంటే మీరు ఆయనకి కానీ, ఆయన లాయరు మిస్టర్ కింజీకి కానీ 320 00:24:30,470 --> 00:24:33,724 - ఫోన్ చేసి కనుక్కోవచ్చు. - పరవాలేదులే. నేను మిమ్మల్ని నమ్ముతున్నా. 321 00:24:33,724 --> 00:24:35,976 సరే. ఇక మనం కలవగానే మాట్లాడుకున్న మాటల దగ్గరికి వద్దాం. 322 00:24:37,811 --> 00:24:38,937 - ఏంటది? - అదే, 323 00:24:38,937 --> 00:24:40,480 నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పా, 324 00:24:40,480 --> 00:24:42,649 కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇంకా నాకు చెప్పలేదు. 325 00:24:42,649 --> 00:24:45,068 - ఇక్కడికి వెళ్లమని మా నాన్న చెప్పాడు. - నిజంగా? 326 00:24:45,068 --> 00:24:47,863 ఒలీవియా వచ్చేసిందో లేదో చూడటానికి నేను రోజూ ఇక్కడికి రావాలి. 327 00:24:47,863 --> 00:24:50,157 - మీకు తాళం చెవులు ఎక్కడివి? - నాన్న ఇచ్చాడు. 328 00:24:51,283 --> 00:24:55,537 మీ చెల్లి కోసమని జోనథన్ తీసుకొన్న ఫ్లాటుకు సంబంధించిన డూప్లికేట్ తాళం చెవులు బర్నీ దగ్గర ఉన్నాయా? 329 00:24:55,537 --> 00:24:57,831 సొంత చెల్లి కాదు. కానీ, ఉన్నాయి. 330 00:24:57,831 --> 00:25:00,083 మరి డోర్ బెల్ ఎందుకు కొట్టలేదు? పోనీ, తలుపు ఎందుకు తట్టలేదు? 331 00:25:04,087 --> 00:25:06,423 - ఏంటి? - మీరు ఒలీవియా కోసమే ఇక్కడికి వచ్చారు కదా? 332 00:25:06,423 --> 00:25:09,968 ఆమె వచ్చేసి ఉండవచ్చు కదా, కానీ ఆమె రాలేదనే ఫీలింగ్ లోనే ఉన్నారు మీరు. 333 00:25:09,968 --> 00:25:11,261 హా, తను మత్తులో ఉండవచ్చు. 334 00:25:11,845 --> 00:25:13,805 ఒలీవియా గురించి మీకు ఎంత తెలుసో ఏమో కానీ, 335 00:25:14,473 --> 00:25:16,016 ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడ్డాక, ఆ అలవాటు పోదు. 336 00:25:18,936 --> 00:25:21,980 - మీరు దారుణంగా అబద్ధాలు ఆడతారు, డేవీ. - డేవిడ్ అని పిలవండి. 337 00:25:21,980 --> 00:25:23,398 మీరు చెప్పేది అబద్ధమని పిల్లలైనా చెప్పేయగలరు. 338 00:25:25,859 --> 00:25:27,027 ఏదేమైనా ఒలీవియా ఇక్కడ లేదు. 339 00:25:27,027 --> 00:25:28,111 హా, అది నాకు కూడా అర్థమైంది. 340 00:25:29,029 --> 00:25:31,573 కాబట్టి, ఇక్కడ మీకు ఇంకేం పని లేదు కదా? 341 00:25:37,079 --> 00:25:38,080 సూట్ బాగుంది. 342 00:25:38,080 --> 00:25:39,248 గుడ్ నైట్, కెన్నీ. 343 00:25:40,249 --> 00:25:41,625 అభిమానిని ఎప్పుడు కలిసినా నాకు ఆనందమే. 344 00:25:43,460 --> 00:25:44,461 బాగా చెప్పారు. 345 00:25:44,962 --> 00:25:46,672 ఇది భలే చిత్రంగా ఉంది. 346 00:25:47,172 --> 00:25:48,215 అతని ముఖంలో భయం కనిపించింది. 347 00:25:48,215 --> 00:25:49,675 {\an8}"పరాయా" సినిమా ముచ్చట్లు 348 00:25:49,675 --> 00:25:51,176 {\an8}కానీ ఆ భయం ఎందుకు? 349 00:25:52,135 --> 00:25:53,136 ఎవరంటే భయం? 350 00:26:00,227 --> 00:26:01,395 ఈమె ఒలీవియా అమ్మ. 351 00:26:01,979 --> 00:26:03,981 హా, చూడగానే తెలిసిపోతోంది. 352 00:26:03,981 --> 00:26:05,399 ఒకటే కళ్లు ఇద్దరివీ. 353 00:26:06,900 --> 00:26:08,068 రేచల్ కేయ్. 354 00:26:08,652 --> 00:26:10,112 ఈమెది కూడా అదే ధీన గాథ. 355 00:26:40,184 --> 00:26:41,643 తెల్ల జుట్టు మహిళ ఎవరో నాకు తెలుసు. 356 00:26:41,643 --> 00:26:42,895 మెలనీ మ్యాథ్యూస్. 357 00:26:42,895 --> 00:26:45,731 ఒకప్పుడు ఒలీవియాకి సవతి తల్లి ఈమె, అలాగే గొప్ప రాక్ స్టార్ కూడా. 358 00:26:45,731 --> 00:26:46,857 స్టెప్-హాయ్ 18/01/2023 359 00:26:46,857 --> 00:26:48,150 కానీ ఇది ఈ మధ్య తీసిన ఫోటోనే. 360 00:26:53,071 --> 00:26:53,947 ఈమెకి ఏమైనా తెలిసి ఉండవచ్చేమో. 361 00:26:56,783 --> 00:26:58,076 స్టెప్-హాయ్ లాంజ్. 362 00:26:59,036 --> 00:27:02,080 మెలనీ ఇంట్లో లేదు, కాబట్టి ఆ ఫోటోలోని బారులో ఆమె ఉండవచ్చేమో. 363 00:27:04,208 --> 00:27:05,209 ఈ బార్ నాకు బాగానే తెలుసు. 364 00:27:06,793 --> 00:27:08,795 కాక్టెయిల్స్ స్టెప్ హాయ్ 365 00:27:21,266 --> 00:27:22,267 నీ పేరేంటి, మిత్రమా? 366 00:27:23,810 --> 00:27:26,271 - కార్ల్. - కార్ల్. నా పేరు జాన్. 367 00:27:26,855 --> 00:27:29,191 నిన్ను కలవడం బాగుంది, కార్ల్. ఈ కుక్క పేరేంటి? 368 00:27:29,900 --> 00:27:31,026 - దీని పేరు వైలీ. - నేను దాన్ని... 369 00:27:31,818 --> 00:27:34,238 - అలాగే. - హేయ్. హేయ్, వైలీ. 370 00:27:36,073 --> 00:27:37,991 హేయ్, కార్ల్, నువ్వు నాకొక సాయం చేయగలవా? 371 00:27:38,492 --> 00:27:39,868 నా కారును గమనిస్తూ ఉంటావా? 372 00:27:39,868 --> 00:27:42,788 నేను నీకు 200 డాలర్లు ఇస్తాను. 373 00:27:43,330 --> 00:27:44,790 నువ్వేమీ చేయాల్సిన పని లేదు. ఊరికే... 374 00:27:48,627 --> 00:27:52,548 ఎవరైనా దాన్ని దొంగలించాలని చూసినా, లేదా దానికి మరీ దగ్గరగా వచ్చినా, 375 00:27:52,548 --> 00:27:54,967 నువ్వు చేయాల్సిందల్లా... ఇదుగో ఫోన్. 376 00:27:56,051 --> 00:27:57,678 ఈ నంబరుకు కాల్ చేయ్, చాలు. 377 00:27:59,221 --> 00:28:00,556 ఇవిగో 100 డాలర్లు. 378 00:28:00,556 --> 00:28:03,267 మళ్లీ వచ్చాక, మిగతా 100 డాలర్లు ఇస్తా. ఓకేనా? 379 00:28:03,767 --> 00:28:06,270 - హా. డబుల్ ఓకే. - సరే మరి. 380 00:28:08,188 --> 00:28:10,315 - హేయ్ వైలీ. - ఇది మనుషులతో ఇట్టే కలిసిపోతుంది. 381 00:28:11,984 --> 00:28:13,235 నువ్వు మంచి మనిషివి, కార్ల్. 382 00:28:24,204 --> 00:28:26,206 మనం మామూలోళ్లం కాదు 383 00:28:27,624 --> 00:28:30,627 నేను బయటకు వచ్చాను 384 00:28:30,627 --> 00:28:33,714 అడ్డూ అదుపూ లేకుండా 385 00:28:35,382 --> 00:28:41,513 రహదారుల్లో ఒక్కదాన్నే దూసుకుపోతున్నాను 386 00:28:44,057 --> 00:28:46,518 మొదట, ఒలీవియాతో ఫోటోలో కనిపించిన ఈమె 387 00:28:46,518 --> 00:28:48,812 ఇక్కడ కనిపించడం కాకతాళీయంగా జరిగిందేమో అనుకున్నా. 388 00:28:48,812 --> 00:28:52,274 కానీ, ఈమె ఎక్కువగా ఇక్కడే ఉంటుందని నాకు ఎందుకో అనిపిస్తోంది. 389 00:28:52,816 --> 00:28:54,943 - మీకేం కావాలి? - ఆమె ఏం తాగుతోందో, అదే ఇవ్వండి. 390 00:28:55,569 --> 00:28:58,322 అది విలెట్ డిస్టిలరీ సింగిల్ బ్యారెల్ బోర్బన్ విస్కీ, సర్. 391 00:28:58,322 --> 00:29:00,782 ఒక్క షాట్ కి 100 డాలర్లు అవుతుంది. 392 00:29:00,782 --> 00:29:03,035 ఉత్త విస్కీ ఒక గ్లాసులో, నీళ్ళు ఒక గ్లాసులో ఇవ్వండి. తనకి కూడా నేనే కడతా. 393 00:29:03,035 --> 00:29:07,247 అది మీ మంచితనం, కానీ తనకి మగవాళ్లు డ్రింక్స్ కొని ఇవ్వడం నచ్చదు. 394 00:29:07,789 --> 00:29:08,874 మంచిదే. 395 00:29:10,083 --> 00:29:11,084 థ్యాంక్యూ. 396 00:29:14,922 --> 00:29:16,173 చాలా బాగుంది. 397 00:29:18,050 --> 00:29:21,929 మామూలుగా అయితే నేను స్కాచ్ తాగుతా, కానీ ఇది తాగాక, ఇదే తాగాలనుంది. 398 00:29:22,471 --> 00:29:23,722 ఎప్పుడైనా రై విస్కీ తాగారా? 399 00:29:25,015 --> 00:29:28,977 రై తాగినా కూడా చాలా బాగుంటుంది. 400 00:29:28,977 --> 00:29:31,647 లేదు, దాన్ని కౌబాయ్ సినిమాల్లో తాగడమే చూశాను. 401 00:29:31,647 --> 00:29:34,024 "బార్టెండర్, ఒక షాట్ రై ఇచ్చుకో," అని అంటుంటారు కదా. 402 00:29:34,024 --> 00:29:35,776 కానీ దాన్ని తాగాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. 403 00:29:45,869 --> 00:29:47,538 - మెలనీ. - జాన్. 404 00:29:47,538 --> 00:29:49,039 హేయ్, మెలనీ. 405 00:29:50,999 --> 00:29:52,000 మీకు బాగా తాగాలనుందా? 406 00:29:54,211 --> 00:29:55,879 ఈమెకి ఇంకో గ్లాస్ ఇవ్వండి. 407 00:29:58,090 --> 00:30:02,386 నేనెన్ని డ్రింక్స్ తాగానో, మీరు కూడా అన్నే తాగారు. కానీ నేను మైకంలో ఉన్నాను, మీరు ఏమీ తాగనట్టే ఉన్నారు. 408 00:30:02,386 --> 00:30:06,723 హా, నా ఒంటి తీరు అంతే. 409 00:30:07,224 --> 00:30:12,271 నా శరీరం మందును 50 రెట్లు ఎక్కువ వేగంతో కరిగించేసుకుంటుంది. 410 00:30:12,271 --> 00:30:15,774 అంటే. ఆ డ్రింక్ ని, ఈ డ్రింక్ ని, ఈ బారులో ఉన్న డ్రింక్స్ అన్నింటినీ తాగినా, 411 00:30:16,358 --> 00:30:19,111 - నాకు కాస్త మత్తు కూడా ఎక్కదు. - మీకు మత్తెక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. 412 00:30:19,111 --> 00:30:20,112 అది నిజమే కావచ్చు. 413 00:30:22,364 --> 00:30:23,740 అలాంటప్పుడు మరి తాగడం ఎందుకు? 414 00:30:25,367 --> 00:30:27,452 తాగితే ఏదో తెలీని సంతృప్తి కలుగుతుంది నాకు. 415 00:30:29,037 --> 00:30:30,372 హా. 416 00:30:31,623 --> 00:30:33,125 సినిమాలు చూసి అలవాటు అయింది అనుకుంటా. 417 00:30:34,585 --> 00:30:35,586 నాకు సినిమాలంటే చాలా ఇష్టం. 418 00:30:36,128 --> 00:30:37,254 నాకు సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఇష్టం. 419 00:30:37,754 --> 00:30:38,964 అవునా? 420 00:30:38,964 --> 00:30:41,300 మీకు నచ్చిన సినిమాలేంటో చెప్పగలరా? 421 00:30:41,300 --> 00:30:44,303 అంటే, ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా... 422 00:30:44,303 --> 00:30:45,971 ఎన్ని ప్రశ్నలు? 423 00:30:48,473 --> 00:30:50,517 ఒక్క నిమిషం. నేను ఒకటి తెల్చాలి. 424 00:30:50,517 --> 00:30:54,104 మీరు వెధవ కాదు, మీకు పిచ్చి లేదు, కపట బుద్ధి కూడా లేదు. 425 00:30:54,104 --> 00:30:55,731 - లేదు. ఎక్కువ... - ఇప్పుడే కలిశాం, ఎలా చెప్పగలరు? 426 00:30:55,731 --> 00:30:58,358 ఎక్కువ మంది ఈ వర్గాలకే చెందినవారు ఉంటారు. అది నాకు తెలుసు. బాగా తెలుసు. 427 00:30:58,358 --> 00:30:59,526 కానీ మీరు కాదు, 428 00:30:59,526 --> 00:31:04,907 కానీ మీలో ఏదో మిస్టరీ ఉంది. 429 00:31:05,782 --> 00:31:10,412 మీకు రహస్యాలు ఉన్నాయి, మీరు కొన్నిటిని బయటకు అస్సలు చెప్పరు. 430 00:31:10,913 --> 00:31:14,541 వాటిని మీకు నమ్మకస్థులైన కొంతమందితో మాత్రమే పంచుకుంటారు. 431 00:31:14,541 --> 00:31:19,546 అలా మీకు నమ్మకస్థులు అవ్వడం అంత సులభం కాదు. 432 00:31:19,546 --> 00:31:20,923 వావ్. 433 00:31:30,807 --> 00:31:32,351 నన్ను ఇంట్లో దింపగలరా? 434 00:31:34,061 --> 00:31:35,103 పర్వాలేదు. 435 00:31:38,607 --> 00:31:40,609 హేయ్, కార్ల్. థ్యాంక్యూ. 436 00:31:43,153 --> 00:31:45,614 నా పేరు గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్, మిస్టర్ షుగర్. 437 00:31:45,614 --> 00:31:47,741 - జాన్ అని పిలవండి చాలు. - జాన్. 438 00:31:49,660 --> 00:31:51,453 సరే. ఒక నిమిషంలో వచ్చేస్తా. 439 00:31:52,829 --> 00:31:53,914 థ్యాంక్యూ. 440 00:31:53,914 --> 00:31:55,958 వైలీ, థ్యాంక్యూ. థ్యాంక్యూ. 441 00:31:55,958 --> 00:31:58,335 - దీనికి మీరు బాగా నచ్చారు. - నాకు కూడా ఇది బాగా నచ్చేసింది. 442 00:31:59,837 --> 00:32:02,548 ఇచ్చిన మాట ప్రకారం ఇవిగోండి. థ్యాంక్యూ, సర్. 443 00:32:03,215 --> 00:32:04,508 - థ్యాంక్యూ, సర్. - హా. 444 00:32:04,508 --> 00:32:05,592 మిస్టర్ షు... జాన్. 445 00:32:05,592 --> 00:32:07,177 జాన్. జాన్. 446 00:32:07,761 --> 00:32:09,346 సరే మరి. ఇదిగోండి మీ... 447 00:32:09,346 --> 00:32:10,848 ఒకటి చెప్పనా? అది మీరే ఉంచుకోండి. 448 00:32:11,390 --> 00:32:14,726 సరే. ఈరాత్రి మీరు, వైలీ పడుకోవడానికి వీలుగా ఒక మంచి చోటు చూసుకుంటే బాగుంటుంది. 449 00:32:16,061 --> 00:32:16,895 సరేనా? 450 00:32:17,479 --> 00:32:19,231 - సరే. అలాగే. - సరే. 451 00:32:19,231 --> 00:32:20,399 మీకు కుటుంబం ఉందా, కార్ల్? 452 00:32:23,485 --> 00:32:26,113 మిల్వాకీలో అక్క ఉంది. 453 00:32:26,613 --> 00:32:29,366 - సరే. ఆమె పేరేంటి? - సోఫీ. 454 00:32:29,366 --> 00:32:30,951 - సోఫీ? - అవును. 455 00:32:30,951 --> 00:32:33,996 సోఫీ. ఆమెకి తెలుసా మీరు ఈ స్థితిలో ఉన్నారని? 456 00:32:39,626 --> 00:32:43,338 ఆమెకి... అదీ... 457 00:32:43,338 --> 00:32:46,425 కార్ల్, ఆ ఫోనుతో ఈరాత్రి సోఫీకి కాల్ చేయండి. 458 00:32:47,176 --> 00:32:49,136 కాల్ చేసి, అక్కడ ఉండవచ్చా అని అడగండి. 459 00:32:49,136 --> 00:32:53,515 సరేనా? ఏం జరిగిందో చెప్పండి. అహం అడ్డురానివ్వకండి. 460 00:32:54,224 --> 00:32:55,517 మీరు ఇలా వీధిలో ఉంటున్నారు కదా అని 461 00:32:55,517 --> 00:32:57,603 మీరేమీ అల్పులు అయిపోరు. 462 00:32:57,603 --> 00:32:59,396 మీకు జరిగింది ఎవరికైనా జరగవచ్చు. 463 00:33:00,814 --> 00:33:02,524 మీరు ఈరాత్రి సోఫీకి కాల్ చేయగలరా? ఏమంటారు? 464 00:33:04,026 --> 00:33:05,152 - చేస్తాను. - సరే. 465 00:33:05,944 --> 00:33:07,029 ఈరాత్రికే కాల్ చేయండి. 466 00:33:07,529 --> 00:33:10,741 రేపు నాకు కాల్ చేయండి. మీకు మిల్వాకీకి టికెట్ బుక్ చేస్తాను, సరేనా? 467 00:33:12,701 --> 00:33:15,537 - వైలీ కూడా ఉంది, కాబట్టి... - సర్వీస్ కుక్క అని చెప్పి ఎక్కిద్దాం. 468 00:33:16,163 --> 00:33:20,375 ఏం కాదు. దానికి కూడా ఒక టికెట్ బుక్ చేస్తా. అలా అని మాటిస్తున్నా. మీకు ఓకేనా? 469 00:33:24,046 --> 00:33:25,923 సరే. సరే మరి. 470 00:33:25,923 --> 00:33:27,925 - హేయ్. - హేయ్, ఏం పర్వాలేదు. దగ్గరికి రా. 471 00:33:28,592 --> 00:33:30,219 - ఇలా రా. - దా. నీకేమీ కాదు. 472 00:33:30,219 --> 00:33:32,095 - మనం మిల్వాకీకి వెళ్తున్నాం. - హా, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. 473 00:33:32,888 --> 00:33:34,056 రేపు మాట్లాడుకుందామా? 474 00:33:34,056 --> 00:33:35,933 - మీకు రేపు కాల్ చేస్తాను, సర్. - సరే మరి. 475 00:33:36,683 --> 00:33:38,852 హేయ్, థ్యాంక్యూ. 476 00:33:43,232 --> 00:33:44,233 ఒక్క నిమిషం. 477 00:33:45,150 --> 00:33:46,693 అతనికి మీరు బాగా నచ్చారు అనుకుంటా. 478 00:33:47,736 --> 00:33:48,737 మిమ్మల్ని షుగర్ అని పిలిచాడు. 479 00:33:50,280 --> 00:33:51,281 అది నా పేరు. 480 00:33:51,865 --> 00:33:53,158 మీ పేరు జాన్ షుగరా? 481 00:33:53,909 --> 00:33:55,744 అవును, జాన్ షుగర్. 482 00:33:56,870 --> 00:33:58,997 సరే. మీ పేరును ఎప్పటికీ మర్చిపోలేను. 483 00:34:03,669 --> 00:34:05,462 మీ పుట్టిన రోజు ఎప్పుడు, జాన్ షుగర్? 484 00:34:06,255 --> 00:34:07,422 సెప్టెంబర్ రెండు. 485 00:34:07,422 --> 00:34:09,466 కన్యా రాశి? హా, నేను ఊహించాగా. 486 00:34:09,466 --> 00:34:12,427 నాకు ఆ రాశి వాళ్లంటే ఇష్టం. మంచివాళ్లు, నమ్మకంగా ఉంటారు, కరుణామయులు. 487 00:34:12,427 --> 00:34:15,472 నాలాంటి వాళ్లని కాకుండా వేరే వాళ్లని కలిసినప్పుడు, తెలిసిపోతుంది కదా. 488 00:34:15,472 --> 00:34:17,599 - మీలో ఏదో ప్రత్యేకత ఉంది. - నిజంగానా? 489 00:34:18,475 --> 00:34:19,560 నాకు ముందే తెలుసు. 490 00:34:19,560 --> 00:34:22,603 కానీ ఒక విషయం చెప్పనా, లోలోపల మిమ్మల్ని ఒంటరితనం ఆవహించేసి ఉంది. 491 00:34:25,274 --> 00:34:30,152 ఇంట్లో మీకు భార్యాపిల్లలు లేరు. 492 00:34:30,821 --> 00:34:32,906 మీకు ఒంటరిగా ఉండటమంటేనే ఇష్టం. 493 00:34:36,534 --> 00:34:38,786 కానీ మీ జీవితం మెరుగవ్వగలదు, జాన్ షుగర్. 494 00:34:40,539 --> 00:34:41,540 నిజంగానా? 495 00:34:52,634 --> 00:34:54,261 - నా ఇల్లు. - హా. 496 00:34:54,803 --> 00:34:56,304 నేను ఎక్కడ ఉంటానో మీకు చెప్పలేదే. 497 00:34:56,304 --> 00:34:58,807 - మీరు చెప్పారు. బారులో చెప్పారు. హా. - అవునా? 498 00:35:07,482 --> 00:35:08,650 గుడ్ నైట్. 499 00:35:08,650 --> 00:35:12,988 లోపలికి వచ్చి, నన్ను రేప్ చేయడానికి కానీ, చంపడానికి కానీ ఎవరూ మాటు వేయలేదని చూసి చెప్తారా? 500 00:35:12,988 --> 00:35:14,072 సరే. 501 00:35:27,920 --> 00:35:29,213 ఎవరూ లేరు. అంతా ఓకే. 502 00:35:29,963 --> 00:35:32,674 రై విస్కీ ఒకటి కనిపించింది. వెళ్లే ముందు ఒక పెగ్గు వేసి పోండి. 503 00:35:33,675 --> 00:35:34,676 బాగా అలసిపోయాను ఇవాళ. 504 00:35:35,886 --> 00:35:39,556 భలేవారే. ఎంత తాగినా మీకు ఎక్కదు కదా. ఏమీ కాదు కదా? 505 00:35:42,184 --> 00:35:44,019 మధ్యలో పోలీసులు ఆపితే? 506 00:35:46,355 --> 00:35:49,816 మద్యం అంతా మీ రక్తంలోనే ఉంటుంది కదా? 507 00:35:51,318 --> 00:35:53,111 నాకేమీ కాదులెండి. 508 00:35:55,072 --> 00:35:57,324 ఎంతైన జాగ్రత్తగా ఉంటే మేలు కదా. 509 00:35:58,534 --> 00:36:00,327 మీరు ఈరాత్రికి ఇక్కడే ఉంటే మంచిది అనుకుంటా. 510 00:36:01,495 --> 00:36:02,538 ఈరాత్రికి కాదులెండి, మెలనీ. 511 00:36:02,538 --> 00:36:03,997 మీరు ముద్దు బాగానే పెడతారనిపిస్తోంది. 512 00:36:06,542 --> 00:36:07,876 ఇవాళ వద్దు, మెలనీ. 513 00:36:07,876 --> 00:36:09,336 ఎందుకు వద్దు? 514 00:36:09,336 --> 00:36:11,213 ఎందుకంటే, మీరు తాగి ఉన్నారు, నేను లేను. 515 00:36:11,713 --> 00:36:13,131 కానీ నేనే అడుగుతున్నా కదా. 516 00:36:15,676 --> 00:36:17,594 కన్యారాశి మగాళ్ల గురించి ఇంకో విషయం చెప్పనా? 517 00:36:18,720 --> 00:36:23,267 వాళ్లకి, వృషభ రాశి అమ్మాయిలకు పొత్తు బాగా కుదురుతుంది, ప్రత్యేకించి శృంగారం విషయంలో. 518 00:36:25,269 --> 00:36:26,520 నాది వృషభ రాశి. 519 00:36:27,855 --> 00:36:32,025 నాది వృషభ రాశి. నాది వృషభ రాశి. 520 00:36:41,743 --> 00:36:43,245 మీరు తాగి ఉన్నారు, నేను లేను. 521 00:36:45,706 --> 00:36:46,790 సరే. అలాగే కానివ్వండి. 522 00:36:48,625 --> 00:36:50,002 తప్పు నాదే. 523 00:36:50,002 --> 00:36:51,753 విస్కీ ఎంత తాగిందో నేను గమనించలేదు. 524 00:36:53,380 --> 00:36:55,507 ఇక ఇప్పటికి మెలనీ నుండి నేను ఏ సమాచారాన్నీ రాబట్టలేను. 525 00:36:59,845 --> 00:37:02,306 తనది వృషభ రాశి, తన ఇంట్లో ఈత కొలను ఉంది అన్న విషయాలు తప్ప. 526 00:37:03,682 --> 00:37:04,892 ఇంకా తను ఒంటరిగా ఉందనే విషయం కూడా. 527 00:37:06,518 --> 00:37:07,519 ఈమె నాకు నచ్చింది. 528 00:37:10,439 --> 00:37:13,358 కానీ తప్పదు, సమాధానాల కోసం కొంత సమయం వేచి చూడాల్సిందే. 529 00:37:16,028 --> 00:37:17,613 వావ్, మంచి సినిమా వస్తోంది. 530 00:37:25,871 --> 00:37:26,872 గుడ్ నైట్, మెలనీ. 531 00:37:50,229 --> 00:37:53,148 నా వెంటపడటం ఆపేయ్, కెన్నీ, సరేనా? నీకు వెంటబడటం సరిగ్గా రాదు కూడా. 532 00:37:53,148 --> 00:37:56,401 నువ్వు చంద్రమండలం మీద ఉన్నా, నేను చెప్పేయగలను. 533 00:37:56,401 --> 00:37:59,780 నేను డెల్ కోరెజాన్ హోటల్ లో ఉంటున్నా. 534 00:38:00,656 --> 00:38:02,658 డేవీకి అదొక్కటి చెప్పు చాలు. 535 00:38:03,492 --> 00:38:07,204 అది నిజమని అతను కనుగొన్నప్పుడు, నువ్వు అదరగొట్టేశావని చప్పట్లు కొడతాడు. 536 00:38:07,204 --> 00:38:08,288 తీసుకో. 537 00:38:10,916 --> 00:38:12,417 ఇక బయలుదేరు. 538 00:38:15,796 --> 00:38:19,383 ఎందుకు నా మీద నిఘా ఉంచాడు? ఏం చేశాను నేను? 539 00:38:23,387 --> 00:38:24,638 మామూలుగా నేను మంచివాడినే. 540 00:38:26,014 --> 00:38:29,268 అయినా నిజం చెప్పాలంటే, ఈ లోకంలో మంచి, చెడు అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. 541 00:38:30,561 --> 00:38:33,063 డేవీ సీగల్ దృష్టిలో నేను మంచివాడినని నాకు అనిపించట్లేదు. 542 00:38:35,691 --> 00:38:39,111 లాస్ ఏంజలెస్ అంటే జనాలు అస్సలు పడుకోరని అందరూ అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. 543 00:38:40,195 --> 00:38:41,196 అర్ధ రాత్రి అయ్యేటప్పటికి, 544 00:38:41,947 --> 00:38:45,868 పార్టీలంటూ తిరిగే కుర్రకారు, ఇంకా హాలీవుడ్ కి చెందిన తాగుబోతులు తప్ప, 545 00:38:45,868 --> 00:38:47,202 అందరూ పడక ఎక్కేస్తారు. 546 00:38:47,995 --> 00:38:49,538 కాబట్టి ఎవరూ గమనించే అవకాశం లేదు. 547 00:38:50,831 --> 00:38:52,958 మనం ఇష్టమొచ్చిన పనులు చేసుకోవచ్చు. 548 00:38:52,958 --> 00:38:54,209 మ్యాచ్ నిర్ధారించబడింది 549 00:39:08,974 --> 00:39:10,767 ఎవరైనా ఎక్కడికి వెళ్ళారు అనేది 550 00:39:10,767 --> 00:39:12,769 ఒక్కోసారి వారు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకున్నాక చెప్పేయవచ్చు, 551 00:39:44,551 --> 00:39:45,552 ఇదెవరు? 552 00:39:47,262 --> 00:39:48,639 చూస్తుంటే, ఇది పెద్ద కేసులానే అనిపిస్తోంది. 553 00:39:49,431 --> 00:39:52,017 బైకరా? రౌడీనా? ఎవరు? 554 00:39:52,017 --> 00:39:53,769 స్కాన్ చేయడానికి సిద్ధంగా ఉంది 555 00:39:53,769 --> 00:39:55,354 స్కాన్ చేస్తోంది... 556 00:39:55,354 --> 00:39:57,814 ఇంకా ఇంకా దారుణంగా జరిగి ఉండవచ్చు, ఈ దుస్థితి ఒలీవియాకి ఎదురై ఉండవచ్చు. 557 00:39:57,814 --> 00:39:58,941 స్కాన్ సేవ్ అయింది 558 00:39:58,941 --> 00:40:01,485 హా, ఈ విషయాన్ని నేను చాలా త్వరగా ఛేదించాలి. 559 00:40:02,194 --> 00:40:04,821 లేదా తర్వాతి శవం తనదే కావచ్చని ఎందుకో నాకు అనిపిస్తోంది. 560 00:40:09,326 --> 00:40:13,580 గమ్మత్తైన విషయం ఏంటంటే, చాలా కాలంగా ఇది చేస్తున్నా కాబట్టి, ఇది నాకు దాదాపుగా అలవాటైపోయిందని చెప్పవచ్చు. 561 00:40:14,957 --> 00:40:15,999 దాదాపుగా. 562 00:40:27,177 --> 00:40:28,637 ఈ హింస. 563 00:40:31,223 --> 00:40:33,433 చాలా అనుభవం ఉంది కాబట్టి, ఇలాంటివి ఉంటాయని ముందే ఐడియా వస్తోంది. 564 00:40:39,690 --> 00:40:40,858 హోటల్ డెల్ కోరెజాన్ 565 00:40:40,858 --> 00:40:42,860 అది ప్రపంచం గురించి ఏం చెప్తుందో నాకు తెలుసు, 566 00:40:44,194 --> 00:40:46,321 - కానీ అది నా గురించి ఏం చెప్తుందో ఏమో మరి. - గుడ్ ఈవినింగ్, సర్. 567 00:40:47,531 --> 00:40:50,242 మిస్టర్ షుగర్. మిమ్మల్ని మళ్లీ చూడటం చాలా బాగుంది, సర్. 568 00:40:50,242 --> 00:40:51,827 థ్యాంక్యూ, క్లింటన్. మళ్లీ ఇక్కడికి రావడం బాగుంది. 569 00:40:51,827 --> 00:40:54,788 మీ బంగళా అంతా సిద్ధంగా ఉంది, అంతా మీకు నచ్చినట్టే సర్దడం జరిగింది. 570 00:40:54,788 --> 00:40:56,874 - మీకు ఏమైనా ఆకలిగా ఉందా? - చాలా ఆకలిగా ఉంది. 571 00:40:56,874 --> 00:41:00,043 చెఫ్ కి చెప్తాను. మీ కోసం స్పెషల్ గా ఏదైనా చేస్తాడులెండి. 572 00:41:00,043 --> 00:41:02,296 నా మనస్సులో ఏముందో నీకు భలే తెలిసిపోతుంది. క్లింటన్, మర్చిపోయా. 573 00:41:02,296 --> 00:41:03,922 నా కారు డిక్కీలో ఒక సూట్ కేసు ఉంది. 574 00:41:04,464 --> 00:41:05,674 దాని సంగతి నేను చూసుకుంటా. 575 00:42:01,355 --> 00:42:02,356 థ్యాంక్యూ. 576 00:42:06,026 --> 00:42:07,027 గుడ్ ఈవినింగ్. 577 00:42:25,796 --> 00:42:26,964 కన్సుయేలో. 578 00:42:26,964 --> 00:42:29,341 గుడ్ ఈవినింగ్, మిస్టర్ షుగర్. నేను లోపలికి రావచ్చా? 579 00:42:29,341 --> 00:42:32,636 తప్పకుండా. నిన్ను చూడటం చాలా బాగుంది. 580 00:42:35,222 --> 00:42:38,642 - హోర్హే, పిల్లలు ఎలా ఉన్నారు? - బాగున్నారు, సర్, థ్యాంక్యూ. 581 00:42:38,642 --> 00:42:41,436 - మంచిది. - మర్చిపోయానండి. 582 00:42:41,436 --> 00:42:43,730 ఇది ఇందాకే మీ పేరు మీద వచ్చింది. 583 00:42:44,982 --> 00:42:47,192 - గుడ్ నైట్. - గుడ్ నైట్. 584 00:42:50,487 --> 00:42:52,030 జాన్ షుగర్ 585 00:42:59,913 --> 00:43:01,582 {\an8}కాస్మోపాలిటన్ పాలీగ్లాట్ సొసైటీ 586 00:43:01,582 --> 00:43:03,083 {\an8}పార్టీకి ఆహ్వానం. 587 00:43:04,001 --> 00:43:05,127 {\an8}పార్టీ. 588 00:43:08,130 --> 00:43:10,174 అందరినీ కలవడం బాగానే ఉంటుంది. 589 00:43:12,634 --> 00:43:17,264 "వాళ్ళని కలవడం అంత మంచి విషయం అయితే, ఎందుకు వాళ్లకి అంత దూరంగా ఉంటున్నావు," 590 00:43:17,973 --> 00:43:19,474 అని ఎవరైనా అడగవచ్చు. 591 00:43:23,478 --> 00:43:25,856 నాకు పనిలో తీరిక ఉండుంటే, దానికి నేను సమాధానం కూడా చెప్పేవాడినే. 592 00:43:26,648 --> 00:43:29,276 రేచల్ కేయ్: "పరాయా సినిమా నాకు మంచి అనుభూతిని అందించింది" 593 00:43:31,945 --> 00:43:32,779 రేచల్ కేయ్ పరాయా 594 00:43:37,201 --> 00:43:39,786 నేను అతడిని కొట్టడానికే ప్రయత్నించా, కానీ పశుబలంతో అతను నన్ను కదలనివ్వలేదు. 595 00:43:39,786 --> 00:43:40,996 చాలా బలముంది అతనికి. 596 00:43:42,039 --> 00:43:43,540 చాలా అంటే చాలా బలం. 597 00:43:43,540 --> 00:43:45,542 పరాయా 598 00:43:45,542 --> 00:43:47,544 అతను నాకు ముద్దుపెట్టాలని చూసినప్పుడు, అతడిని కొరకాలని చూశాను. 599 00:43:48,337 --> 00:43:50,172 అప్పుడే అతను నా గొంతును చేత్తో గట్టిగా నొక్కాడు, 600 00:43:50,964 --> 00:43:52,758 "నాకు కావాల్సింది దక్కించుకుంటా," అని అన్నాడు. 601 00:43:52,758 --> 00:43:53,926 తను మంచి నటి. 602 00:43:55,135 --> 00:43:57,804 నేను ఇక అలా జీవచ్చవంలా ఉండిపోయా, అతనికి కావాల్సింది అతను చేసుకున్నాడు. 603 00:43:58,847 --> 00:44:02,684 అంతగాక ఇంకేం చేయగలను నేను? వండర్ వుమన్ అయిపోలేను కదా? 604 00:44:02,684 --> 00:44:04,436 బాగానే చెప్తోంది అయినా. 605 00:44:04,436 --> 00:44:07,731 నేను ఏమీ చేయలేకపోయాను. ఏమీ చేయలేదు. 606 00:44:08,273 --> 00:44:09,483 మంచి ఆత్మస్థైర్యం గల మహిళ. 607 00:44:09,983 --> 00:44:11,610 రేచల్ కేయ్ మరణం 608 00:44:17,157 --> 00:44:19,993 కారు ప్రమాదంలో నటి రేచల్ కేయ్ మరణం 609 00:44:26,083 --> 00:44:27,376 ప్రాణాన్ని బలి తీసుకున్న కారు దుర్ఘటన 610 00:44:27,376 --> 00:44:28,377 కూతురు, ఒలీవియా. 611 00:44:30,295 --> 00:44:31,922 ఒలీవియా సీగల్ 612 00:44:32,923 --> 00:44:34,591 ఒలీవియా సీగల్ నటి 613 00:44:38,136 --> 00:44:40,264 నేనతడిని కొట్టడానికే ప్రయత్నించా, కానీ పశుబలంతో అతను నన్ను కదలనివ్వలేదు. 614 00:44:40,264 --> 00:44:41,890 చాలా బలముంది అతనికి. 615 00:44:43,100 --> 00:44:45,602 అతను నాకు ముద్దుపెట్టాలని చూసినప్పుడు, అతడిని కొరకాలని చూశాను. 616 00:44:47,521 --> 00:44:50,232 అప్పుడే అతను నా గొంతును చేత్తో గట్టిగా నొక్కాడు, 617 00:44:50,232 --> 00:44:53,819 "నాకు కావాల్సింది దక్కించుకుంటా," అని అన్నాడు. 618 00:44:53,819 --> 00:44:56,154 తన అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తోంది. 619 00:44:56,154 --> 00:45:00,033 ఇద్దరు స్థైర్యవంతమైన మహిళలు తిరగబడుతున్నారు, కనీసం తిరగబడటానికి ప్రయత్నిస్తున్నారు. 620 00:45:00,033 --> 00:45:01,785 అంతగాక ఇంకేం చేయగలను నేను? 621 00:45:01,785 --> 00:45:02,995 ఏంటిది? 622 00:45:04,454 --> 00:45:09,835 వండర్ వుమన్ అయిపోలేను కదా? నేను ఏమీ చేయలేకపోయాను. ఏమీ చేయలేదు. 623 00:45:12,546 --> 00:45:14,464 - రేచల్. - నేను ఇక అలా జీవచ్చవంలా ఉండిపోయా... 624 00:45:15,132 --> 00:45:16,216 ఈ ఫోటోలు ఎవరు తీశారు? 625 00:45:16,216 --> 00:45:19,845 ...అతనికి కావాల్సింది అతను చేసుకున్నాడు. 626 00:45:21,555 --> 00:45:24,766 - నాకు కూడా కావాలసింది అదేనా? - ఒలీవియా దగ్గర ఈ ఫోటోలు ఎందుకు ఉన్నాయి? 627 00:45:24,766 --> 00:45:26,310 మీరు అనేది అదేనా? 628 00:45:28,812 --> 00:45:30,063 ఒక్క నిమిషం. 629 00:45:31,899 --> 00:45:33,317 బహుశా నేను... 630 00:45:34,526 --> 00:45:35,611 ఒక్క నిమిషం. 631 00:45:35,611 --> 00:45:38,989 నేను నేల మీద పడుకుంటే మేలేమో. 632 00:46:49,768 --> 00:46:51,228 నేను ఈ పని చేయాల్సిందే. 633 00:47:03,991 --> 00:47:05,367 నేను... 634 00:47:15,460 --> 00:47:17,045 ఒలీవియా ఆచూకీని కనిపెట్టాల్సిందే. 635 00:47:22,551 --> 00:47:24,136 తప్పదు. 636 00:47:29,975 --> 00:47:31,268 తప్పదు. 637 00:47:37,274 --> 00:47:38,817 తప్పదు. 638 00:48:45,050 --> 00:48:47,052 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్